గురు ద్వార్లోకి చొరబడి ఏం చేశారంటే.. | Caught on Cam: Theft in a Gurudwara in Gurgaon. Robbers seen stealing cash from Offertory Box | Sakshi
Sakshi News home page

గురు ద్వార్లోకి చొరబడి ఏం చేశారంటే..

Published Fri, Apr 8 2016 11:21 AM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM

Caught on Cam: Theft in a Gurudwara in Gurgaon. Robbers seen stealing cash from Offertory Box

గుర్గావ్: హర్యానాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోయారు. గురు ద్వార్లోకి చొరబడి అందులో హుండీని ఎత్తుకెళ్లారు. ఇదంతా కూడా సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. దానిలో ఏముందంటే తొలుత నల్లటి కోటు తలపై మంకీ క్యాప్ను ధరించి గురు ద్వార్లోకి వచ్చిన ఓ వ్యక్తి పీఠం ముందు ఉన్న పెద్ద హుండీని కదిలించేందుకు ప్రయత్నించాడు.

అది కదలకపోవడంతో మరో దొంగను పిలిచాడు. అతడు వీపుకు నల్లటి బ్యాగు తగిలించుకొని తెల్లటి షర్ట్, నలుపు ప్యాంట్ తో ఉన్నాడు. ఆ తర్వత ఇద్దరు కలిసి దానిని ఏం చక్కా బయటకు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత అందులో రెడ్ మంకీ క్యాప్ పెట్టుకున్న వ్యక్తి తిరిగి వెనక్కు వచ్చి ఎలాంటి అనుమానం రాకుండా పీఠం ముందు టేబుల్లాంటిదాన్ని సర్దుబాటు చేసి వెళ్లాడు. పోలీసుల విచారణలో భాగంగా గురు ద్వార్ ఈ వీడియో ఫుటేజీని విడుదల చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement