
ఇటీవలి కాలంలో సెలబ్రిటీల ఇళ్లలో వరుస దొంగతనాలు హాట్‌టాపిక్‌గా మారాయి. కొన్ని రోజుల క్రితం సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో సెలబ్రిటీ ఇంట్లో దొంగతనం జరిగింది. ప్రముఖ గాయకుడు యేసుదాస్ కుమారుడు, సింగర్ విజయ్ యేసుదాసు ఇంట్లో భారీగా చోరీ జరిగింది.
చెన్నైలోని అభిరామపురంలోని విజయ్ నివాసంలో 60 సవర్ల బంగారు నగలు, వజ్రాభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లు చోరీకి గురయ్యాయి. ఈ విషయంపై విజయ్ భార్య దర్శన పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ ఇంట్లో పని చేస్తున్నవారే దొంగతనానికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా యేసుదాస్ కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన విజయ్ ప్రస్తుతం నేపథ్య గాయకుడిగా, నటుడిగా సత్తా చాటుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment