కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 12వ తరగతి చదువుతున్న మీరా మీరా సూసైడ్ ఘటన కోలీవుడ్‌ను షాక్‌కి గురి చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నదానిపై పలువురు చర్చిస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలుస్తోంది.
చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో కుంగిపోతోందని, కొంతకాలంగా ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీరా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ విజయ్ ఆంటోనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ మాట్లాడుతూ.. మీరా మృతిపై కీలక విషయాలు వెల్లడించింది. ''మీరాకు చీకటి అంటే చాలా భయమని వాళ్ల నానమ్మ(విజయ్ అంటోని తల్లి) చెప్పింది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, చీకట్లో కాసేపు ఉండాలన్నా హడలిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం ఎలా ధైర్యం చేసి తీసుకుందో అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే విజయ్‌కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం'' అంటూ ఆమె వెల్లడించింది. ఈ క్రమంలో భయం, డిప్రెషన్ వంటి సున్నితమైన అంశాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది.
భయం ఒక్కోక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. కొందరు ఇంట్లో ఇంటరిగా ఉండాలంటే భయపడతారు, మరికొందరు స్నానం చేయడానికి, చీకట్లో ఉండేందుకు విపరీతంగా భయపడుతుంటారు. నీళ్ళని చూసినా, మెట్లెక్కుతూ కిందకి చూసినా, సముద్రాన్ని చూసినా భయపడిపోతుంటారు. ఇదొక సాధారణ మానసిక సమస్య. దీనికి మందుల ద్వారా, సిస్టమాటిక్ డీ సెన్సిటైజేషన్ అనే కౌన్సిలింగ్ ద్వారా నయం చెయ్యొచ్చు. ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం.. దేన్నుంచి అయితే భయపడుతున్నారో ఆ పనుల్ని నిరంతరం చేస్తూ ఉండటం.
ఉదాహరణకు మీకు డ్రైవింగ్ అంటే భయమనుకోండి. అదే పనిని జాగ్రత్తగా మళ్లీమళ్లీ చేయడానికి అలవాడుపడండి. కొందరికి ఫోబియా ఉంటుంది. ఉదాహరణకు.. బొద్దింక అంటే భయం ఉన్నప్పుడు ఒక గాజు గ్లాసు దాని మీద బోర్లించి ఓ నిమిషం దాన్ని చూస్తూ గడపడం. దీని వల్ల ఆ ఫోబియా నుంచి బయట పడవచ్చునంటారు మానసిక శాస్త్రవేత్తలు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించొద్దు. శారీరక సౌష్టవం కోసం ఎంత శ్రద్ద పెడుతున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే శ్రద్ధ వహించాలి.
ఇందుకోసం మంచి ఆహరం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం, తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయాలి. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ అన్నట్లు.. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం మనిషిని మానసిక రోగులుగా మార్చతాయి. దీనికి ఒక్కటే మార్గం. పాజిటివ్ థింకింగ్. భయాన్ని తక్కువ చేసి చూడటం.. ధైర్యంగా ముందుకెళ్లడం ఇవే నివారణ మార్గాలు’’.
இது எல்லாமே ஒரு Teacher கவனிச்சா Students-க்கு Help பண்ணமுடியும் ! - Archana | Psychiatrist #MentalHealthAwareness #Mentalhealth #Psychiatrist #mentalwellness #VijayAntonyDaughter #VijayAntony #ssmusic pic.twitter.com/pFc2iTJ2Li
— SS Music (@SSMusicTweet) September 21, 2023
இப்பவும் இவருக்கு இந்த இழப்புன்றத ஏத்துக்கவே முடியல 😭#VijayAntony pic.twitter.com/r4tg1TByzo
— Monkey Cinema (@monkey_cinema) September 21, 2023
Comments
Please login to add a commentAdd a comment