Phobia
-
Mamata Banerjee: అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా?
కోల్‌కతా: దేవుడు తనను పంపాడని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మథురాపూర్‌లో శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఓటమి తప్పదనే భయంతో.. ఆ ఫోబియాలో బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఇప్పుడాయన తనను తాను దేవుడి బిడ్డగా, మనలాగా ఆయనకు తల్లిదండ్రులు లేరని, భగవంతుడు ఆయన్ను పంపాడని చెప్పుకుంటున్నారు. అల్లర్లను ప్రేరేపించడానికి, ప్రకటనల ద్వా రా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) ద్వారా జనాన్ని జైళ్లో వేయడానికి దేవుడు ఎవరినైనా పంపుతాడా అని నేనడుగుతున్నాను. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా హింసను ప్రోత్సహించడానికి, ఉపాధి హామీ పథకానికి నిధులు ఆపడానికి, పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి దేవుడు తన దూతను పంపుతాడా?’ అని మమత వ్యంగ్యంగా అన్నారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తాననే హామీపై భగవంతుడు వెనక్కు తగ్గుతాడా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఒక జాతీయ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. మా అమ్మ బతికున్నంతవరకు నేను సాధారణంగా అందరిలాగే జని్మంచానని అనుకునేవాడిని. ఆమె మరణించాక నా అనుభవాలను పరికించి చూసుకుంటే.. నన్ను దేవుడు పంపాడని నేను నిశి్చతాభిప్రాయానికి వచ్చాను’ అని పే ర్కొన్నారు. ప్రధాని పేరెత్తకుండానే మమత ఆయన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
ఫోన్ కనపడకపోతే.. ప్రాణం పోతోందా? అయితే మీకీ వ్యాధి ఉన్నట్లే!
ఒక్క నిమిషం.. ఫోన్ కనపడదు. చాలా భయం. చాలా ఆందోళన. చాలా కోపం. చాలా వణుకు. ఈ లక్షణాలన్నీ ఉంటే మీకు ‘నో మొబైల్ ఫోన్ ఫోబియా’ లేదా ‘నోమొఫోబియా’ ఉన్నట్టే. ఇది మీకు చేటు చేస్తుంది. దీన్నుంచి బయటపడమని సైకియాట్రిస్ట్‌లు సూచిస్తున్నారు.ఇంతకుముందు మనిషి రెండు చేతులు రెండు కాళ్లతో ఉండేవాడు. ఇప్పుడు అతని చేతికి అదనపు అంగం మొలుచుకుని వచ్చింది – మొబైల్ ఫోన్. అది లేకుండా గతంలో మనిషి బతికాడు. ఇప్పుడూ బతకొచ్చు. కాని మొబైల్ ఫోన్‌తో మన వ్యక్తిగత, కుటుంబ, వృత్తిగత, స్నేహ, సాంఘిక సమాచార సంబంధాలన్నీ ముడి పడి ఉన్నాయి కాబట్టి అది కలిగి ఉండక తప్పదు. అలాగని అదే జీవితంగా మారితే నష్టాలూ తప్పవు. ఐదు నిమిషాల సేపు ఫోన్ కనిపించకపోతే తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నా, సినిమాకు వెళ్లినప్పుడైనా మూడు గంటల సేపు ఫోన్ స్విచ్చాఫ్ చేయలేకపోయినా, రాత్రి ఫోన్ ఎక్కడో పడేసి మీరు మరెక్కడో నిద్రపోలేకపోయినా, ఎంత ఆత్మీయులొచ్చినా ఫోన్ వైపు చూడకుండా దానిని చేతిలో పెట్టుకోకుండా వారితో గడపలేకపోయినా మీకు ‘నోమొ ఫోబియా’ ఉన్నట్టు.కేస్‌స్టడీ.. 1ఆఫీస్ నుంచి హుషారుగా ఇల్లు చేరుకున్న సుందర్ కాసేపటికి బట్టలు మార్చుకుని ముఖం కడుక్కుని రిలాక్స్ అయ్యాడు. ఫోన్ గుర్తొచ్చింది. టీ పాయ్ మీద లేదు. టీవీ ర్యాక్ దగ్గర లేదు. కంగారుగా భార్యను పిలిచి ఆమె ఫోన్‌తో రింగ్ చేయించాడు. రింగ్ వస్తోంది కాని ఇంట్లో ఆ రింగ్ వినపడలేదు. సుందర్‌కు చెమటలు పట్టాయి. మైండ్ పని చేయలేదు. ఎక్కడ మర్చిపోయాడు. కారు తాళాలు తీసుకుని కిందకు వెళ్లి కారులో వెతికాడు. లేదు. మళ్లీ పైకి వచ్చి ఇల్లంతా వెతికాడు. దారిలో పెట్రోలు పోయించుకున్నాడు... అక్కడేమైనాపోయిందా? మరోచోట ఫ్రూట్స్ కొని ఫోన్‌పే చేశాడు. అక్కడ పడేసుకున్నాడా? ఫోన్.. మొబైల్ ఫోన్.. అదిపోతే... అదిపోతే... మైండ్ దిమ్మెక్కిపోతోంది. సరిగ్గా అప్పుడే అతని కూతురు వచ్చి రక్షించింది. ‘నాన్నా.. ప్యాంట్ జేబులో మర్చిపోయావు. వాల్యూమ్ లో అయి ఉంది’ అని. ఫోన్ కనపడకపోతే ప్రాణంపోతుంది ఇతనికి. అంటే నోమొ ఫోబియా ఉన్నట్టే.కేస్ స్టడీ.. 2ఇంటికి చాలా రోజుల తర్వాత గెస్ట్‌లు వచ్చారు. వారు ఎదురుగా కూచుని మాట్లాడుతున్నారు. ఇంటి యజమాని విజయ్ ఫోన్ చేతిలో పట్టుకుని వారితో మాట్లాడుతున్నాడు. ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చూస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నాడు. వాళ్లతో మాట్లాడుతూనే వాట్సప్ చెక్ చేస్తున్నాడు. వాళ్ల వైపు ఒక నిమిషం ఫోన్ వైపు ఒక నిమిషం చూస్తున్నాడు. వాళ్లకు విసుగొచ్చి కాసేపటికి లేచి వెళ్లిపోయారు. విజయ్‌కు నోమొ ఫోబియా ఉంది.కేస్ స్టడీ.. 3దుర్గారావు ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్లి హోటల్లో దిగాడు. దిగాక గాని తెలియలేదు అక్కడ ఫోన్ సిగ్నల్స్ అందవని. కాల్స్ ఏమీ రావడం లేదు. డేటా కూడా సరిగ్గా పని చేయడం లేదు. ఆ ఊళ్లో వేరే మంచి హోటళ్లు లేవు. సిగ్నల్ కోసం హోటల్ నుంచి గంట గంటకూ బయటకు వెళ్లాల్సి వస్తోంది. ఇక అక్కడ ఉన్నంత సేపు దుర్గారావుకు అస్థిమితమే. చిరాకే. ఏ కాల్ మిస్సవుతున్నానో అన్న బెంగే. ఏ మెసేజ్ అందడం లేదో అన్న ఆందోళనే. ఇదీ నోమొ ఫోబియానే.నష్టాలు..1. నోమొఫోబియా ఉంటే మీ అనుబంధాలు దెబ్బ తింటాయి. ఎందుకంటే అనుబంధాల కంటే ఫోన్‌తో బంధం ముఖ్యమని భావిస్తారు కాబట్టి.2. నోమొ ఫోబియా మీ లక్ష్యాలపై మీ ఫోకస్‌ను తప్పిస్తుంది. మీరు ఎక్కువసేపు ఒక పని మీద మనసు లగ్నం చేయరు. దీనివల్ల చదువుకునే విద్యార్థి, పని చేయాల్సిన ఉద్యోగి, ఇంటిని చక్కదిద్దే గృహిణి అందరూ క్వాలిటీ వర్క్‌ను నష్టపోతారు. పనులు పెండింగ్‌లో పడతాయి.3. నోమొ ఫోబియా కలిగిన వారు తమను తాము నమ్ముకోవడం కన్నా ఫోన్‌ను నమ్ముకుంటారు. చివరకు ఫోన్ లేకుండా ఇంట్లో నుంచి అడుగు బయటపెట్టడానికి కూడా ఇష్టపడరు.4. సోషల్ మీడియా సంబంధాలే అసలు సంబంధాలుగా భావించి అసలు సంబంధాలు కోల్పోతారు.5. ఫోన్ ఇతరుల చేతుల్లో పడితే వారు ఏమి ఆరా తీస్తారోనని అనుక్షణం ఫోన్‌ని కనిపెట్టుకుని ఉంటారు.ఎలా బయటపడాలి?1. ఖాళీ సమయాల్లో మెల్లమెల్లగా ఫోన్‌ను పక్కన పడేయడంప్రాక్టీస్ చేయండి.2. రోజులో ఒక గంటైనా ఏదో ఒక సమయాన ఫోన్ స్విచ్చాఫ్ చేయడం మొదలుపెట్టండి.3. సినిమాలకు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు ఫోన్ ఇంట్లో పడేయడమో, మ్యూట్ చేసి జేబులో పడేయడమో చేయండి.4. ఫోన్ నుంచి దృష్టి మరల్చే ఆటలు, పుస్తక పఠనం, ఇతర హాబీలపై దృష్టి పెట్టండి.5. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది.6. ఫోన్లో మీ కాంటాక్ట్స్, ముఖ్యమైన ఫొటోలు, ఇతర ముఖ్య సమాచారం పర్సనల్ కంప్యూటర్లోనో మెయిల్స్లోనో నిక్షిప్తం చేసుకుని ఫోన్ ఎప్పుడుపోయినా మరో సిమ్ కొనుక్కోవచ్చు అనే అవగాహన కలిగి ఉంటే నోమొఫోబియాను దాదాపుగా వదిలించుకోవచ్చు.ఇవి చదవండి: Fauzia Arshi - ఆకాశమే హద్దు! -
ఈ భయం.. ఒక ఫోబియా అని మీకు తెలుసా!
నిత్యం కాలం పరుగెడుతున్నట్లూ.. ఈ లోకం పరుగెత్తక తప్పదు. అందులో ఎన్ని చిక్కులున్నా, ఎన్ని అడ్డంకులున్నాగానీ వాటిని అధికమిస్తూ సాగక తప్పదు. ఇలాంటి తరుణంలో మనుషుల విషయానికొస్తే.., వారిలో ఒక్కొక్కరి తీరు ఒక్కోలాగా ఉంటుంది. కొందరు ఎంతో ధైర్యవంతులుగానూ, మరికొందరు పిరికితనంగానూ కనిపిస్తుంటారు. ఇది సహజమే. ఇలాంటి ధైర్యాలకూ, భయాలకు రకరకాల ఫోబియాల పేర్లతో పిలుస్తుంటాం. అలాగే నిద్దుర విషయానికొస్తే.., ప్రతిరోజూ ఆహారం ఎంత అవసరమో, నిద్ర కూడా అవసరమే! అయితే, కొందరు నిద్దుర అంటేనే చికాకు పడుతూ, అసలు నిద్దురే రావటంలేదంటారు. ఏదో ఒక పనిలో నిమగ్నమౌతుంటారు. నిద్రపోవాలంటేనే కొందరు విపరీతంగా భయపడతారు. ఇలాంటి ఈ భయాన్నే ‘సోమ్నిఫోబియా /హిప్నోఫోబియా’ అంటారు. ఇవి చదవండి: ఫెయిర్‌నెస్ క్రీమ్‌ల వల్ల ఆ సమస్యలు ! పరిశోధనలో షాకింగ్ విషయాలు -
ఒత్తిడిని చిత్తు చేస్తే విజయం మీదే!
సరిపడా నిద్రా అవసరమే... విద్యార్థులు/పోటీ పరీక్షల అభ్యర్థులు ఉన్న సమయాన్ని పాఠ్యాంశాల వారీగా పక్కాగా విభజించుకోవడంలోనే సగం విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన ఆయా సబ్జెక్టులు, టాపిక్‌ను గుర్తించి, వాటిని ప్రాధాన్య క్రమంలో చదవాలి. ఒంటరిగా కాకుండా కొంత మంది విద్యార్థులు బృందంగా చర్చించుకుంటూ సన్నద్ధం అవ్వడం మేలు. రోజుకు కనీసం 6–7 గంటలు తప్పనిసరిగా పడుకోవాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మార్కులు, ర్యాంక్‌ల కోసం పదే పదే వారితో మాట్లాడడం మంచిది కాదు. సబ్జెక్ట్ మీద పట్టు సాధించేలా విద్యార్థుల్లో చైతన్యం తీసుకుని రావాలి. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి ప్రశాంత వాతావరణం తయారు చేయాలి. – డాక్టర్ కె.వి.రావిురెడ్డి, సూపరింటెండెంట్, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, విశాఖపట్నం మొబైల్, స్ట్రీట్ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి కరోనా అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలోను పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి ఎదుర్కొనే ఘటనలు ఉండేవి. అయితే అప్పట్లో చిట్కాలు, మందులతో సమస్యకు పరిష్కారం లభించేది. కరోనా అనంతరం అకడమిక్ కార్యకలాపాల్లోను మొబైల్ ఫోన్ వినియోగం పెరిగింది. దీంతో పిల్లల్లో సెల్‌ఫోన్ వాడకం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితి వల్ల పరీక్షల సమయంలో ఏకాగ్రతకు భంగం వాటిల్లుతుంది. పరీక్షల సమయంలో మొబైల్‌కు దూరంగా ఉండడం మేలు. కొద్దిసేపు సేదతీరడం కోసం పిల్లలకు సెల్ఫోన్లు ఇస్తుంటారు. అలా చేయద్దు. వాకింగ్, రన్నింగ్, ఇతర క్రీడల వైపు మళ్లించడం వల్ల శారీరక శ్రమ కలిగి, ఆరోగ్యంగా ఉంటారు. ఇక.. స్ట్రీట్ ఫుడ్స్‌కు గుడ్‌బై చెప్పాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు కల్పించుకుని, తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని పెట్టాలి. దీని వల్ల త్వరగా నిద్రపోవడానికి వీలుంటుంది. – డాక్టర్ వెంకట కిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, గుంటూరు జీజీహెచ్ టెలీమెడిసన్ కాల్ సెంటర్ మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు వైద్య శాఖ ఏర్పాటు చేసిన టెలీమెడిసన్ కాల్ సెంటర్‌ను సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు. 14416/180089114416 నెంబర్లకు ఫోన్ చేసి కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ సుశిక్షితులైన కౌన్సెలర్లు అందుబాటులో ఉంటారు. విద్యార్థులు, ఇతర ప్రజలు మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలు ఉన్న వారు ఉచితంగా కాల్‌సెంటర్ సేవలు పొందవచ్చు. -
అటెన్షన్ ఉంటే..టెన్షన్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్ : పరీక్షల ఫోబియాతోనే ఇంటర్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం సగానికి తగ్గుతోంది. హైటెన్షన్‌కు గురయ్యే విద్యార్థులు 36 శాతం ఉంటుండగా, పరీక్షల షెడ్యూల్ వచ్చాక టెన్షన్‌కు లోనయ్యేవారు 23 శాతం మంది ఉంటున్నారు. దీనికి సంబంధించి వైద్య, విద్యాశాఖలు రెండేళ్ల అధ్యయనం చేశాయి. మొదటి పరీక్ష కాస్త కష్టంగా ఉన్నా, ఆ ప్రభావం రెండో పరీక్షపై పడుతోందని అధ్యయనంలో వెల్లడైంది. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం ఫస్టియర్ పరీక్షలు 4.09 లక్షల మంది రాస్తున్నారు. సెకండియర్ పరీక్షలు 3.82 లక్షల మంది వరకూ రాస్తున్నారు. వీరిలో సగటున 40 శాతం మంది ఫెయిల్ అవుతున్నారు. దీంతో పరీక్షలు రాసే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థుల టెన్షన్ దూరం చేసేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. ప్రిపరేషన్‌కు ఇదే అదును రెండు నెలల ముందు నుంచే పరీక్షలకు సన్నద్ధమైతే విద్యార్థుల్లో టెన్షన్ ఉండదని ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మూడంచెల విధానం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేయాలనుకుంటున్నారు. ముందుగా విద్యార్థులను మానసికంగా సన్నద్ధం చేస్తారు. ఒత్తిడికి గురయ్యే విద్యార్థులను గుర్తించి పరీక్షలపై కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వడానికి నిపుణులను రప్పించే యోచనలో ఉన్నారు. దీని తర్వాత 60 రోజుల పాటు ముఖ్యమైన పాఠ్యాంశాలపై లెక్చరర్లు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులోనూ విద్యార్థి వెనుకబడి ఉన్న సబ్జెక్టులు, పాఠ్యాంశాలను ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రిన్సిపల్స్‌కు ఇస్తారు. మూడో దశలో పరీక్షలపై భయం పోగొట్టేందుకు ఈ 60 రోజులూ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో టెన్షన్ దూరం చేయడం తేలికని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పరీక్షల టైంటేబుల్‌ను బోర్డు విడుదల చేసింది. త్వరలో మానసిక ఒత్తిడి తగ్గించేందుకు తీసుకునే చర్యలపైనా జిల్లా ఇంటర్ అధికారులు టైం టేబుల్ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సిలబస్ సకాలంలో పూర్తికాకపోవడం కూడా విద్యార్థుల్లో పరీక్షల టెన్షన్‌కు ఓ కారణమని అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల పరీక్షల్లో ఏమొస్తుందో? ఎలా రాయాలో? అన్న ఆందోళన పరీక్షల సమయంలో పెరుగుతుందని అధ్యయన నివేదికల సారాంశం. ఫెయిల్ అవుతున్న 40 శాతం విద్యార్థుల్లో కనీసం 22 శాతం మంది ఈ తరహా ఆందోళన ఎదుర్కొంటున్నారు. దీనిని పరిగణనలోనికి తీసుకొని కొన్ని జిల్లాలపై ఇంటర్ అధికారులు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించారు. ఇంటర్ ఫస్టియర్‌లో 50 శాతం కన్నా తక్కువ ఫలితాలు కనబరుస్తున్న జగిత్యాల, నిర్మల్, యాదాద్రి, జనగాం, కరీంనగర్, సూర్యాపేట, సిద్దిపేట, మేడ్చల్ వంటి జిల్లాలున్నాయి. సెకండియర్‌లో మెదక్, నాగర్‌కర్నూల్, వరంగల్, నారాయణపేట, సూర్యాపేట, హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాలున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని ముఖ్యాంశాలు... ♦ ప్రతీ సంవత్సరం పరీక్షలు రాస్తున్న ఇంటర్ విద్యార్థులు – 7 లక్షలకుపైగా ♦ ఫెయిల్ అవుతున్న వారు – 2.5 లక్షల మంది ♦ పరీక్షల ఫోబియా వెంటాడుతున్న విద్యార్థులు – 1.02 లక్షల మంది ♦ పరీక్ష షెడ్యూల్ ఇవ్వగానే భయపడే వారు – 28 వేల మంది ♦ సిలబస్‌పై టెన్షన్ పడుతున్న విద్యార్థులు – 51 వేల మంది మానసిక ధైర్యం నింపాలి ఈ 60 రోజులూ లెక్చ రర్లది కీలకపాత్ర. పరీక్షల భయం ఉన్న వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేయాలి. వెనుకబడ్డ సబ్జెక్టులపై రివిజన్ చేయించడం ఒక భాగమైతే, వీలైనంత వరకూ పరీక్ష తేలికగా ఉంటుందనే భావన ఏర్పడేలా చూడాలి. దీనివల్ల ఎగ్జామ్ ఫోబియా తగ్గుతుంది. – మాచర్ల రామకృష్ణ గౌడ్, ప్రభుత్వ లెక్చరర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తల్లిదండ్రులదీ కీలకపాత్రే పరీక్షల భయం వెంటాడే విద్యార్థి సైకాలజీని బట్టి అధ్యాపకులు వ్యవహ రించాలి. వారిని ప్రణాళిక బద్ధంగా చదివించే విధా నం అనుసరించాలి. సాధ్యమైనంత వరకూ పరీక్ష వెంటాడుతోందన్న భావనకు దూరం చేయాలి. చదివే ప్రతీ అంశం గుర్తుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కుల కోసం ఒత్తిడి చేయకుండా జాగ్రత్త పడాలి. పరీక్షల పట్ల భయం అనిపిస్తే నిపుణుల చేత కౌన్సెలింగ్ ఇప్పించాలి. – రావులపాటి సతీష్‌బాబు, మానసిక వైద్య నిపుణుడు స్టడీ అవర్స్ పెడుతున్నాం విద్యార్థుల్లో పరీక్షల భయం పోగొట్టేందుకు 60 రోజుల పాటు ప్రత్యేక కార్య క్రమాలు చేపడుతున్నాం. వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి, స్పెషల్ క్లాసులు నిర్వహించమని ఆదేశాలిచ్చాం. టెన్షన్ పడే విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వమని ప్రిన్పిపల్స్కు చెప్పాం. అవసరమైతే టెలీ కౌన్సిలింగ్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. – జయప్రదాబాయ్,ఇంటర్ పరీక్షల విభాగం అధికారిణి -
ఆడవాళ్లను చూస్తే ఊపిరాడదు: అందుకే 55 ఏళ్లు ..!
CallitxeNzamwita Gynophobia మనుషులను రకరకాల భయాలు పట్టిపీడిస్తుంటాయి. సాధారణంగా ఇలాంటి ఫోబియాలు చనిపోయే దాకా వారిని వెంటాడుతూ ఉంటాయి. ముఖ్యంగా దెయ్యాలు, కౄర జంతువులు, పాములు, బల్లులు, నిప్పు, ఎత్తైన ప్రదేశాలు, చీకటి అన్నా కూడా గజ గజ వణికిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్ద జాబితానే ఉంది. అయితే తాజాగా ఆడవాళ్ళంటేనే భయపడిన వ్యక్తి వార్తల్లో నిలిచాడు. తాజా నివేదికల ప్రకారం రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిటెక్స్ నజాంవిటా (Callitxe Nzamwita)ఇలాంటి అసాధారణమైన భయంతో బాధపడుతూ ప్రపంచాన్ని నివ్వెరపర్చాడు. మహిళలంటే ఉన్న భయంతో గత 55 సంవత్సరాలుగా స్వీయ నిర్బంధంలో ఉండిపోయాడు. అతనికి పదహారేళ్ల వయసపుడే ఈ భయం పట్టుకుంది. అప్పటినుంచి మహిళ కనిపిస్తే చాలు ఇంట్లోకి వెళ్లి తలుపు తాళం వేసుకుంటాడు. కాలిటెక్స్ నజాంవిటా స్టోరీ ఆడవాళ్లంటే దెయ్యాన్ని చూసినట్టు భయపడతాడు. అందుకే నజాంవిటా తన ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తైన కంచెను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆడవాళ్ళకే కాదు పురుషులకు కూడా దూరంగా ఉంటున్నాడట. అయితే ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే అతణ్ని అర్థం చేసుకున్న ఇరుగు పొరుగు మహిళలు కాలిటెక్స్ ఆహారం, కిరాణా సామాన్లు లాంటి అందించి జీవించడానికి సహాయం చేయడం. అతనికి అవసరమైన వాటిని ఇంట్లో వదిలి వెళితే..వారు వెళ్లిపోయాక అపుడువాటిని తీసుకుంటాడు. ఫోబియా Phobia అనేది ఫొబోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో ఫొబోస్ అంటే భయం. వాస్తవానికి దాన్నించు మనకి ఎలాంటి ప్రమాదం, హాని లేకపోయినా కూడా తీవ్రంగా భయపడిపోవడం.సాధారణంగా మహిళలను చూస్తే భయపడటాన్ని గైనోఫోబియాగా పిలుస్తారు. అందమైన అమ్మాయిలను చూస్తే భయపడటాన్నే వెనుస్ట్రాఫోబియా అంటారు. అలాగే పెళ్లి చేసుకోవాలన్నా, రిలేషన్షిప్లో ఉండాలన్నా కలిగే భయాన్నే గామోఫోబియా అంటారు. గైనోఫోబియా అంటే ఏమిటి? స్త్రీల పట్ల ఉండే అహేతుక భయమే గైనోఫోబియా గైనోఫోబియా అంటే డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ (DSM-5)లో అధికారికంగా గుర్తించనప్పటికీ, ది క్లినికల్ సెట్టింగ్‌లో "నిర్దిష్ట భయం"గా వర్గీకరించారు. గైనోఫోబియా లక్షణాలు స్త్రీల పట్ల అహేతుకమైన, తీవ్రమైన భయం. వారి గురించిన ఆలోచనే వారిలో ఆందోళనకు దారితీస్తాయి. ఈ లక్షణాలు ఇతర ఫోబియాల్లో కనిపించేవిగానే ఉంటాయి. ముఖ్యంగా తీవ్ర భయాందోళనలు, ఛాతీ పట్టేసినట్టు అయిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ముచ్చెమటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలొస్తాయి. -
ఆ భయమే మీరాను ఆత్మహత్య చేసుకునేలా చేసిందా? ఏం జరిగింది?
కూతురి ఆత్మహత్యతో విజయ్ ఆంటోని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన కూతురు మీరా ఆంటోని చెన్నైలోని తన నివాసంలో మంగళవారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. 12వ తరగతి చదువుతున్న మీరా మీరా సూసైడ్ ఘటన కోలీవుడ్‌ను షాక్‌కి గురి చేస్తోంది. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నదానిపై పలువురు చర్చిస్తున్నారు. అయితే ఆమె సూసైడ్ చేసుకోవడానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి మాత్రమే అని తెలుస్తోంది. చదువుల కారణంగా మీరా గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో కుంగిపోతోందని, కొంతకాలంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మీరా ఆత్మహత్యకు డిప్రెషన్ కారణమని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తూ విజయ్ ఆంటోనీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సినీ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ మాట్లాడుతూ.. మీరా మృతిపై కీలక విషయాలు వెల్లడించింది. ''మీరాకు చీకటి అంటే చాలా భయమని వాళ్ల నానమ్మ(విజయ్ అంటోని తల్లి) చెప్పింది. ఒంటరిగా ఎక్కడికైనా వెళ్లాలన్నా, చీకట్లో కాసేపు ఉండాలన్నా హడలిపోయేదని, అలాంటి అమ్మాయి ఇంతటి కఠిన నిర్ణయం ఎలా ధైర్యం చేసి తీసుకుందో అర్థం కావడం లేదు. పిల్లల్ని ఎంతగానో ప్రేమించే విజయ్‌కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం'' అంటూ ఆమె వెల్లడించింది. ఈ క్రమంలో భయం, డిప్రెషన్ వంటి సున్నితమైన అంశాలపై సోషల్ మీడియా వేదికగా చర్చ నడుస్తుంది. భయం ఒక్కోక్కరికి ఒక్కో విధంగా ఉండొచ్చు. కొందరు ఇంట్లో ఇంటరిగా ఉండాలంటే భయపడతారు, మరికొందరు స్నానం చేయడానికి, చీకట్లో ఉండేందుకు విపరీతంగా భయపడుతుంటారు. నీళ్ళని చూసినా, మెట్లెక్కుతూ కిందకి చూసినా, సముద్రాన్ని చూసినా భయపడిపోతుంటారు. ఇదొక సాధారణ మానసిక సమస్య. దీనికి మందుల ద్వారా, సిస్టమాటిక్ డీ సెన్సిటైజేషన్ అనే కౌన్సిలింగ్ ద్వారా నయం చెయ్యొచ్చు. ఈ ఫోబియా నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం.. దేన్నుంచి అయితే భయపడుతున్నారో ఆ పనుల్ని నిరంతరం చేస్తూ ఉండటం. ఉదాహరణకు మీకు డ్రైవింగ్ అంటే భయమనుకోండి. అదే పనిని జాగ్రత్తగా మళ్లీమళ్లీ చేయడానికి అలవాడుపడండి. కొందరికి ఫోబియా ఉంటుంది. ఉదాహరణకు.. బొద్దింక అంటే భయం ఉన్నప్పుడు ఒక గాజు గ్లాసు దాని మీద బోర్లించి ఓ నిమిషం దాన్ని చూస్తూ గడపడం. దీని వల్ల ఆ ఫోబియా నుంచి బయట పడవచ్చునంటారు మానసిక శాస్త్రవేత్తలు. ప్రతి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నట్లే ప్రతీది సమస్యలా భావించొద్దు. శారీరక సౌష్టవం కోసం ఎంత శ్రద్ద పెడుతున్నామో మానసిక ఆరోగ్యానికి కూడా అంతే శ్రద్ధ వహించాలి. ఇందుకోసం మంచి ఆహరం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ఇష్టమైన వాళ్లతో మాట్లాడటం, తమ సమస్యలను స్నేహితులతో పంచుకోవడం వంటివి చేయాలి. ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ అన్నట్లు.. మనిషికి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఒత్తిడి, ఆందోళన, నిరుత్సాహం మనిషిని మానసిక రోగులుగా మార్చతాయి. దీనికి ఒక్కటే మార్గం. పాజిటివ్ థింకింగ్. భయాన్ని తక్కువ చేసి చూడటం.. ధైర్యంగా ముందుకెళ్లడం ఇవే నివారణ మార్గాలు’’. இது எல்லாமே ஒரு Teacher கவனிச்சா Students-க்கு Help பண்ணமுடியும் ! - Archana | Psychiatrist #MentalHealthAwareness #Mentalhealth #Psychiatrist #mentalwellness #VijayAntonyDaughter #VijayAntony #ssmusic pic.twitter.com/pFc2iTJ2Li — SS Music (@SSMusicTweet) September 21, 2023 இப்பவும் இவருக்கு இந்த இழப்புன்றத ஏத்துக்கவே முடியல 😭#VijayAntony pic.twitter.com/r4tg1TByzo — Monkey Cinema (@monkey_cinema) September 21, 2023 -
బొమ్మలు వేస్తూ ఆ ఫోబియాను పోగొట్టకుంది! ఏకంగా గొప్ప ఆర్టిస్ట్‌గా..
ప్రతి మనిషికి ఏదోఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని జయించి ముందుకెళ్తుంటారు చాలామంది. మినీషా భరద్వాజ్ మాత్రం భయంతో ఇంట్లో గదికే పరిమితమైపోయింది. మినీషాకు ఉన్న ‘అఘోరా ఫోబియా’తో... కొత్త వ్యక్తుల్ని కలిసినా, తెలియని ప్రాంతాలకు వెళ్ళినా తెగ భయపడిపోయేది. గుంపుగా ఉన్న జనాలను చూసి ‘‘అమ్మో అంతా నా వైపు చూస్తున్నారు’’ అని వణికి పోయేది. చిన్నప్పటి నుంచి ఈ భయంతో పార్టీలు, ఫంక్షన్లకు ఎక్కడికీ వెళ్లనే లేదు. ఇక స్నేహితులు కూడా ఎవరు లేరు. జీవితాంతం ఇలానే ఉంటానేమో అనుకునే మినీషా..బొమ్మలు వేసే అలవాటు ద్వారా తన ఫోబియాను అధిగమించడమేగాక, ఆర్టిస్ట్‌గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బొమ్మలు వేస్తూ తన భయాన్ని ఎలా పోగొట్టుకుందో తన మాటల్లోనే..... మాది గురుగావ్. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నా బాల్యమంతా డెహ్రాడూన్‌లో గడిచింది. చిన్నప్పటి నుంచి తెల్లని పేపర్ మీద పెన్సిల్‌తో రకరకాల బొమ్మలు గీసేదాన్ని. ఏడో తరగతిలో ఉండగా ఒక మ్యాగజీన్లో ఉన్న తెల్లటి పేపర్‌పై నటి రేఖ చిత్రాన్ని గీసాను. అప్పుడు మా అమ్మానాన్నలు నా టాలెంట్‌ను చూసి ఆశ్చర్యపోయారు. పదోతరగతి వరకు పెయింటింగ్స్ వేస్తూనే ఉన్నాను. ప్రతి నోట్‌బుక్ చివరి పేజీలో నా పెయింటింగ్ ఒకటి కచ్చితంగా ఉండేది. కొన్నిసార్లు పరీక్షపేపర్లో జవాబు తెలియని ప్రశ్నకు బాధపడుతోన్న అమ్మాయి చిత్రాన్ని గీసేదాన్ని. పదో తరగతిలో అంతర జిల్లా పోటీలలో పాల్గొని డెహ్రాడూన్ మొత్తంలోనే మొదటి బహుమతి అందుకున్నాను. అలా ఎక్కువ సమయం బొమ్మలు గీస్తూ ఉంటే అఘోరా ఫోబియా కూడా గుర్తు వచ్చేది కాదు. ప్రత్యేకమైన కోర్సు చేయలేదు... నేను చార్టర్డ్ అకౌంటెంట్ కావాలని అమ్మావాళ్లు సీఏ చదివించారు. కానీ నా మనస్సంతా ఆర్ట్మీదే ఉండేది. చదువు పూర్తి అయినప్పటికీ కార్పోరేట్ ప్రపంచంలో కాలుపెట్టలేదు. 1995 లో పెళ్లి అయ్యింది. ఆయన ఉద్యోగం దుబాయ్‌లో కావడంతో అక్కడికి వెళ్లిపోయాను. అక్కడ ఓ పబ్లిషింగ్ హౌస్‌లో ఉద్యోగం చేసేదాన్ని. ఒకసారి ఖాళీ సమయం దొరకడంతో..పేపర్ మీద బొమ్మను గీసాను. బొమ్మ పూర్తయ్యే సమయానికి మా ఆయన, ఆయన స్నేహితుడు వచ్చారు. ఆ బొమ్మను చూసి.. ‘‘చాలా బావుంది. బొమ్మలు గీయడంలో మంచి ప్రతిభ ఉంది. ఎందుకు దాచుకుంటావు. బొమ్మలు గీసి సోషల్ మీడియాలో పోస్టు చెయ్యచ్చు కదా...’’ అని ప్రోత్సహించారు. అప్పటి నుంచి నాకెంతో ఇష్టమైన ఆర్ట్‌కు ప్రాణం పోస్తున్నాను. చార్కోల్ పెన్సిల్స్‌తో.. ఆయన ప్రోత్సాహంతో స్కెచ్‌లు గీయడం మొదలు పెట్టాను. ఆయన ఒక ఆర్ట్గ్రూప్ను పరిచయం చేయడంతో అక్కడకు వెళ్లి స్కెచ్‌లు గీసేదాన్ని. కమ్యూనిటీకి వెళ్లిన రెండేళ్లలోనే ‘జి ఆర్ట్ కమ్యూనిటీ’ వాళ్లు నన్ను కలిసి ఆర్ట్‌ఎగ్జిబిషన్‌లో పాల్గొనమని ఆహ్వానించారు. ఆ ఎగ్జిబిషన్‌కు అంతర్జాతీయ ఆర్టిస్ట్‌లు వస్తున్నారు. మీరు ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించండి’’అన్నారు. అది నాకు చాలా పెద్ద అవకాశం. కానీ ‘‘అందరూ రంగులతో స్కెచ్‌లు గీస్తున్నారు. నేను మాత్రం పెన్సిల్, చార్కోల్తో గీస్తాను. నేను నిలబడగలనా’’ అని నిర్వాహకులను అడిగాను. అందుకు వాళ్లు ... నువ్వుతప్ప ఎవరూ చార్ కోల్ వాడడం లేదు. అందరికంటే భిన్నంగా నీ స్కెచెస్ ఆకర్షిస్తాయి అని చెప్పి ‘డేర్ టు డ్రీమ్’ ఎగ్జిబిషన్‌కు ఎంపిక చేశారు. అలా మొదలైన నా ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. క్రమంగా వాటర్ కలర్స్ కూడా వేయడం ప్రారంభించాను. చార్కోల్ పెయింటింగ్స్‌కు అనేక అవార్డులు అందుకున్నాను. రోలెక్స్ టవర్‌పై నేను వేసిన పెయింటింగ్‌ను ఇప్పటికీప్రదర్శిస్తున్నారు. దీనికి గుర్తింపుగా ‘పీపుల్స్ ఛాయిస్ ఆవార్డు’ వచ్చింది. అబుదాబిలోని లువురే మ్యూజియంలో నా పెయింటింగ్స్ ఉన్నాయి. ఏడు వేలమంది ముందు... దుబాయ్ మాల్స్‌లో ఏడు వేలమంది ముందు చార్కోల్తో పెయింటింగ్ వేశాను. ఆ పెయింటింగ్ వెంటనే అమ్మడు పోయింది. ‘స్పెషల్ నీడ్ దుబాయ్ కేర్’ తో కలిసి చికిత్స పొందుతోన్న పిల్లలకోసం ‘లిటిల్ పికాసో’పేరిట పెయింటింగ్స్ వేసి వారికి సాయం చేశా. 2017లో గుర్గావ్ వచ్చేసి, ఇక్కడ పెయింటింగ్స్ నేర్పిస్తున్నాను. ఇండియా ఆర్ట్ కమ్యూనిటీ, ఇండియా స్పీకింగ్ ఆర్ట్ ఫౌండేషన్, వారి సాయంతో పెయింటింగ్ నేర్పిస్తున్నాను. దుబాయ్‌లో వేలమందికి నేర్పిన నేను, నా అనుభవాల ద్వారా నేర్చుకున్న ట్రిక్స్‌ను ఇక్కడి పిల్లలకు నేర్పిస్తున్నాను’’ అలా నా భయాన్ని అధిగమించడంతోపాటు నా విద్యను అందరికీ నేర్పించగలగడం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది అని చెప్పింది మినీషా. (చదవండి: లాయర్ని కాస్త విధి ట్రక్ డ్రైవర్‌గా మార్చింది! అదే ఆమెను..) -
మీకు తెలుసా! ఆ ఫోబియా వస్తే.. సంతోషంగా ఉండాటానికే భయపడతారట!
ఈ ప్రపంచంలో ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. శాస్త్రవేతలు లేదా మేధావుల కారణంగానో ఆ కొంగొత్త విషయాలు వెలుగులోకి వస్తే ఇలాంటివి కూడా ఉన్నాయా!.. అని నోరెళ్లబెడతాం. అలాంటి కొన్ని ఆసక్తికర విషయాలు గురించి తెలుసుకుందాం. మంచి ఆసక్తికర విషయాలు.. ఇంతవరకు ఆంగ్లవర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపించే వాక్యం గురించి ఆలోచించారా. అస్సలు అలాంటి వెరైటీ వాక్యం ఒకటి ఉంటుందన్న ఆలోచన వచ్చిందా. తెలుసుకోకపోయిన ఏం ఫర్వాలేదు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకోండి. ఇంతకీ ఆ వాక్యం ఏంటంటే.. ‘ది క్విక్ బ్రౌన్ ఫాక్స్ జంప్స్ వోవర్ ది లేజీ డాగ్’ అనే వాక్యాన్ని గమనిస్తే ఆంగ్ల వర్ణమాలలోని అన్ని అక్షరాలు కనిపిస్తాయట. నిశితంగా గమనిస్తే ఆ విషయం మీకే తెలుస్తుంది. అలానే ఎన్నో రకాల వింత వింత ఫోబియాలు గురించి వినుంటారు. సంతోషం అంటే భయపడే ఫోబియా గురించి విన్నారా. అస్సలు అలాంటిది ఒకటి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. ఔను మీరు వింటుంది నిజమే! . అలాంటి విచిత్రమైన ఫోబియా ఉందంట..దాన్ని చెరోఫోబియా అని పిలుస్తారట. సంతోషంగా ఉండటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే కొందరు మాత్రం సంతోషంగా ఉండేందుకు భయపడతారట. దీనికి కారణం సంతోషంగా కనిపిస్తే ఎక్కడ కీడు జరగుతుందోననే మూఢ నమ్మకంతో సంతోషంగా ఉండరట. ఇది రాను రాను సంతోషంగా ఉండాలంటేనే భయపడేంతగా మారుతుందట. అందుకే ఈ లక్షణాన్ని చెరోఫోబియా అంటారు. చాలామంది ఎందువల్ల తెలియదు కొన్ని దురలవాట్లు ఉంటాయి. దూరం చేసుకోవాలనుకున్న ఏదో బలహీనత మళ్లీ ఆ చెడ్డఅలవాటే దగ్గరికి వెళ్లేలా చేస్తుంది. ఈ అలవాట్ల నుంచి ఎలా బయటపడాల్రా బాబు అని తలపట్టుకుంటారు. అలాంటి వాళ్లు నిజంగా మారాలి అని గట్టిగా కోరుకుంటే మాత్రం ముందుగా ఆ దురలవాటు జోలికి వెళ్లకుండా ఓ 21 రోజులు ట్రై చేస్తే చాలట. ఇక వాళ్లకి తెలియకుండానే ఆ అలవాటు నుంచి బయటపడతారట. అధ్యయనంలో తేలిందని నిపుణులు చెబుతున్నారు. ఇక కొన్ని కొత్త పదాలు ఓ పట్టాన అర్థం కావు. ఆంగ్ల పదంలా ఉన్న వేరే భాష మాదిరిగా ఉంటాయి. ఎందకంటే ఆ పదం అర్థం కాక. అట్లాంటి పదమే ‘వోవర్ మారో’. ఐతే దీని అర్థం వింటే ఓస్ ఇంతేనా అనేస్తారు. దీని అర్థం ది డే ఆఫ్టర్ టుమారో అని అర్థమట అంటే ఎల్లుండి అని. (చదవండి: ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్! అతి పెద్ద స్మార్ట్ వాచ్ బ్రాండ్!) -
స్మార్ట్‌గా ఫోబియా.. నలుగురు భారతీయుల్లో ముగ్గురికి నోమో ఫోబియా
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోనే మీ ప్రపంచమా ? అది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా ? ఫోన్ కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా వెంటనే మీలో టెన్షన్ పెరిగిపోతోందా ? అయితే మీరు ఒక రకమైన ఫోబియాతో బాధపడుతున్నట్టు లెక్క. మీరు ఒక్కరే కాదు భారత్‌లో స్మార్ట్ ఫోన్ వాడుతున్నవారిలో 75 శాతం మందికి ఇదే ఫోబియా పట్టుకుందని ఒప్పొ, కౌంటర్‌పాయింట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ ఫోబియాని నోమో ఫోబియా అని పిలుస్తారు. అంటే నో మొబైల్ ఫోబియా అని అర్థం. స్మార్ట్ ఫోన్ పని చేయకపోయినా, సిగ్నల్స్ లేకపోయినా, కనిపించకపోయినా, బ్యాటరీ అయిపోయినా విపరీతమైన ఆందోళనకి గురికావడం, ఏదో కోల్పోయినట్టుగా ఉండడం, నిస్సహాయంగా మారిపోవడం, అభద్రతా భావానికి లోనవడం వంటివి దీని లక్షణాలు. భారతీయులు ప్రతీ నలుగురిలో ముగ్గురికి ఈ ఫోబియా ఉందని ఆ అధ్యయనం తేల్చింది. దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో 1,500 మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులపై ఒప్పొ ఈ అధ్యయనం నిర్వహించింది. బ్యాటరీ లైఫ్ కోసం స్మార్ట్ ఫోన్లని మార్చే వారు చాలా మంది ఉన్నారని, ఒకరకంగా ఈ సర్వే తమ ఉత్పత్తులకి కూడా కీలకంగా మారిందని ఒప్పొ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ దమయంత్ సింగ్ ఖనోరియా చెప్పారు. ► బ్యాటరీ సరిగా పనిచేయడం లేదని 60% మంది ఏకంగా తమ స్మార్ట్ ఫోన్లు మార్చుకున్నారు ► ఫోన్ దగ్గర లేకపోతే మహిళల్లో 74 శాతం మంది ఆందోళనకు లోనవుతారు. పురుషులు మరింత అధికంగా 82% మంది ఒత్తిడికి లోనవుతారు ► బ్యాటరీ ఎక్కడ అయిపోతుందోనని 92% మంది వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పవర్ సేవింగ్ మోడ్‌ని వినియోగిస్తున్నారు ► చార్జింగ్‌లో ఉండగా కూడా ఫోన్ వాడే వారు 87% మంది ఉన్నారు ► వినోద కార్యక్రమాలు చూడడానికే 42% స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందులో సోషల్ మీడియాదే అగ్రస్థానం. ► స్మార్ట్ ఫోన్ మన జీవితాలు మార్చేసిందనడంలో ఎలాంటి సందేహం లేకపోయినప్పటికీ దాని వల్ల ఏర్పడుతున్న దుష్ప్రభావాల నుంచి బయట పడడానికి అందరూ ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
హిందూ ఫోబియాని ఖండించే తీర్మానాన్ని ఆమోదించిన యూఎస్ రాష్ట్రం
హిందూ ఫోబియాను, హిందూ వ్యతిరేక మతోన్మాదాన్ని ఖండిస్తూ యూఎస్‌లోని జార్జియా రాష్ట్రం ఒక తీర్మానాన్ని తీసుకొచ్చి ఆమోదించింది. అటువంటి చట్టబద్ధమైన చర్య తీసుకున్న తొలి అమెరికన్ రాష్ట్రంగా నిలించింది. ఆ తీర్మానంలో.. హిందూఫోబియాను ఖండిస్తూ.. దాదాపు 100 దేశాలలో 1.2 బిలియన్లకు పైగా అనుచరులను కలిగి ఉన్న అతిపెద్ద పురాతన మతాలలో హిందూ మతం ఒకటి. పైగా పరస్పర గౌరవం, శాంతి విలువలతో విభిన్న సంప్రదాయాలు, విశ్వాస వ్యవస్థలను కలిగి ఉన్న మతం అని తీర్మానంలో పేర్కొంది. ఈ తీర్మానాన్ని అట్లాంటా శివారులోని ఫోర్సిత్ కౌంటీకి చెందిన ప్రతినిధులు లారెన్ మెక్‌డొనాల్డ్, టాడ్‌జోన్స్ ప్రవేశపెట్టారు. అంతేగాదు ఈ తీర్మానంలో వైద్యం, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఫైనాన్స్, అకాడెమియా, తయారీ, ఇంధనం, రిటైల్ వాణిజ్యం వంటి విభిన్న రంగాలకు అమెరికన్-హిందూ కమ్యూనిటీ ప్రధాన సహకారాన్ని అందించిందని గుర్తించింది. అలాగే యోగా, ఆయుర్వేదం, ధ్యానం, ఆహారం, సంగీతం, కళలు వంటివి అమెరికా సాంస్కృతికతను సుసంపన్నం చేశాయి. పైగా అమెరికన్ కమ్యూనిటీ వాటిని అడాప్ట్ చేసుకోవడమేగాక మిలియన్ల మంది జీవితాలను మెరుగుపరిచాయని కూడా పేర్కొంది. అలాగే దేశంలోని అనేక ప్రాంతాలలో గత కొన్ని దశాబ్దాలుగా హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలు నమోదైన ఘటనలను వివరిస్తూ..హిందూ మతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విద్యారంగానికి చెందిన కొందరు హిందూ-అమెరికన్లపై ద్వేషపూరిత నేరాలకు పాల్పడుతున్నారని ఈ తీర్మానం పేర్కొంది. వాస్తవానికి ఈ నినాదం జార్జియా రాజధానిలో మార్చి 22న తొలిసారిగా హిందూ న్యాయవాద దినోత్సవాన్ని నిర్వహించే ఉత్తర అమెరికా హిందువలు కూటమి(కోహెచ్‌ఎన్‌ఏ) నుంచి వచ్చింది. దీనికి అమెరికాలోని రిపబ్లికన్లు, డెమోక్రాట్లకు సంబంధించి సుమారు 25 మంది చట్టసభ సభ్యులు హాజరయ్యారు. అలాగే హిందూ కమ్యూనిటీలో చేరిన కొందరూ తమ ఆందోళనలు ఆర్థం చేసకుని, ఈ వివక్షకు వ్యతిరేకంగా సమాజాన్ని రక్షించే మార్గాలను రూపొందించడానికి కృషి చేస్తామని హామి ఇచ్చినట్లు కోహెచ్‌ఎన్‌ఏ పేర్కొంది. కాగా, ఈ కౌంటీ రిజల్యూషన్‌ను ఆమోదించే ప్రక్రియలో మాకు మార్గనిర్దేశం చేసిన రెప్ మెక్‌డొనాల్డ్, రెప్ జోన్స్ తోపాటు చట్టసభ సభ్యులతో కలిసి పనిచేయడం నిజమైన గౌరవం అని కోహెచ్‌ఎన్‌ఏ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ మీనన్ అన్నారు. ఇప్పటి వరకు శాసనసభ్యులందరూ ఎజెండాలోని శాసనపరమైన అంశాల ప్రకారం చాలా గంటలు పని చేస్తున్నారని విన్నాం. కానీ ఈ రోజు వారంతా హిందూ సమాజానికి ఎంత విలువ ఇస్తున్నారో చూపించడానికి న్యాయవాద దినోత్సవంలో మాతో చేరడమే గాక దాన్ని నిజం చేసి చూపించారని రాజీవ్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కోహెచ్‌ఎన్‌ఏ ప్రధాన కార్యదర్శి శోభా స్వామి మాట్లాడుతూ..హిందూ అమెరికన్లు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అసత్య ప్రచారం తోపాటుగా ఈ హిందూ ఫోబిక్ కథనాలు కూడా అమెరికా కమ్యూనిటిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇవి ఒకరకరంగా హిందువులపై విద్వేషాన్ని పెంచేలా చేయడమేగాక భారతీయ అమెరికన్ సంతతికిచెందిన ప్రజలపై వివక్ష చూపేందుకు కారణమవుతోంది. అందువల్ల అటువంటి మతోన్మాదాన్ని ఎదుర్కొనడానికి ప్రత్యేక చట్టాలు, పర్యవేక్షణ అవసరమని చెబుతూ వారి సహాయన్ని కోరినట్లు శోభా వివరించారు. (చదవండి: భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు) -
Rishi Sunak: హిందూ ఫోబియా.. అయిననూ ప్రధాని అయ్యాడు!
‘‘నేను ఇండియాకో, సౌదీకో ప్రధాని కాగలనా? మీరే చెప్పండి. అలా జరుగుతుందని ఊహకు కూడా అందడం లేదు. అస్సలు అవకాశమే లేదు కదా! బ్రిటన్‌లో 85 శాతం శ్వేతజాతీయులే. వాళ్లు తమ ప్రధానిగా తమలో ఒకరిని చూడాలనుకుంటారే తప్ప శ్వేతేతరుణ్ని కాదు. అంతెందుకు, నేనిప్పుడు ఇండియా వెళ్లి ప్రధాని పదవి చేపట్టగలనా? అక్కడి వాళ్లు నాకా అవకాశమిస్తారా?’’ –బ్రిటన్‌లో ప్రజాదరణ పొందిన ఓ రేడియో షోలో వ్యాఖ్యాత గొంతెత్తుకుని అరుస్తున్నాడు. రిషి ప్రధాని కావడంపై బ్రిటన్‌లోని సాధారణ పౌరుల్లో కూడా చాలామందిది ఇదే భావన. కానీ మర్యాద ముసుగులో బయటపడటం లేదంతే. బ్రిటన్‌లో స్థిరపడ్డ ఓ హిందూ మూలాలున్న వ్యక్తి 10–డౌనింగ్ స్ట్రీట్‌లో అడుగు పెట్టడం అక్కడివాళ్లకు అస్సలు రుచిస్తున్నట్టు లేదు. కొన్ని ప్రధాన పత్రికలు దీనిపై బాహాటంగానే పతాక శీర్షికల్లో అసంతృప్తి వెళ్లగక్కాయి. కానీ, ఎంపీలు ఎన్నుకున్నారు. రాజు ఓకే చెప్పేశాడు. బ్రిటన్‌లో ఓ హిందూ మూలాలున్న వ్యక్తి పాలన మొదలైపోయింది కూడా! పోటీ నుంచి అర్ధంతరంగా తప్పుకున్న బోరిస్ జాన్సన్ గానీ, పెన్నీ మోర్డంట్ గానీ, లోలోపల తెగ ఇబ్బంది పడుతున్న సామాన్య పౌరులు గానీ ఇప్పుడిక చేసేదేమీ లేదు. రిషిని ఇప్పటికిప్పుడు పదవి నుంచి దించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కూడా కాదు. నిజానికి రిషి ప్రధాని కావడం బ్రిటన్ చరిత్రలో ఓ కీలక మలుపు. ప్రజాస్వామ్య విలువలకు మైలురాయి. అతనే దిక్కు! బ్రిటన్ను ఆర్థికంగా నిండా ముంచినంత పనిచేసిన తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ అసంబద్ధ నిర్ణయాలను సరిచేయడం రిషి ముందున్న సవాళ్లలో అతి ప్రధానమైనది. రాణి కన్నుమూసింది. కొత్త రాజు ఇంకా కుదురుకోవాల్సి ఉంది. పౌండు విలువ నానాటికీ పతనమవుతోంది. మొత్తమ్మీద బ్రిటన్ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఆర్థిక మంత్రిగా సమర్థంగా పని చేసిన అనుభవమున్న రిషికి ఈ పరిస్థితుల్ని చక్కదిద్దడం అంత కష్టం కాకపోవచ్చు. నిజానికి బ్రిటన్‌కు ఇప్పుడతనే దిక్కు. ట్రబుల్ షూటర్ కూడా! రానున్న రోజుల్లో బ్రిటన్ ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుందా, మరింత దిగజారుతుందా అన్నది కాలమే తేలుస్తుంది. ఏది ఏమైనా బ్రిటన్ను ఓ హిందువు ఏలుతుండటం సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన ఘట్టం. అయితే ఇది జాతివివక్ష లేని బ్రిటన్‌కు తార్కాణం మాత్రం కాదు. ఇటీవల హిందూ ప్రార్థనా స్థలాలపై అక్కడి లీస్టర్‌షైర్ వంటి చోట్ల జరిగిన దాడులను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. అందుకే, ‘రిషి హిందువు అయినప్పటికీ ప్రధాని అయ్యాడు తప్పితే హిందువు కావడం వల్ల మాత్రం కాద’న్న ఓ విశ్లేషకుని వ్యాఖ్య అక్షరసత్యం. హిందూ ఫోబియా అసలు విషయానికొస్తే, హిందువులపై జరిగిన దాడులను అక్కడి పత్రికలు ఎంత ఘోరంగా చిత్రించిందీ అందరికీ తెలుసు. ఒకరకంగా వారిలో హిందూ ఫోబియా (హిందువలంటే భయం) కన్పించింది. అక్కడి చాలామంది మేధావుల్లో, విశ్లేషకుల్లో కూడా హిందువులంటే అంత మంచి అభిప్రాయమేమీ లేదు. వారి వ్యాఖ్యల్లో ఈ విషయం పదేపదే గోచరిస్తుంది. రిషి అత్యున్నత స్థానాన్ని అధిష్టించడం ఈ పెడ ధోరణిని మారుస్తుందా అంటే, ఇప్పడే చెప్పలేం. అయినా వీటిని రిషి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ప్రస్తుతానికి ఆయన దృష్టంతా బ్రిటన్ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడంపైనే ఉంటుంది. కొసమెరుపు: ఒకప్పుడు ఇదే 10–డౌనింగ్ స్ట్రీట్ నుంచి ఏళ్ల తరబడి బ్రిటన్ను ప్రధానిగా ఏలిన విన్స్టన్ చర్చిల్ హిందువులపై, భారతీయులపై అప్పట్లో అసందర్భ, అసంబద్ధ వ్యాఖ్యలు చేసి కించపరిచాడు. ఇప్పుడు ఆ హిందువుల్లోనే ఒకరు అదే 10–డౌనింగ్ స్ట్రీట్‌లోకి సగర్వంగా అడుగు పెట్టాడు. అది కూడా ఆ దేశ ప్రధాని హోదాలో! – ఎస్.రాజమహేంద్రారెడ్డి చదవండి: ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..! -
ఆ యువతి 22 ఏళ్లుగా చికెన్ మాత్రమే తింటోంది.. ఎందుకో తెలుసా!
చికెన్ అంటే అందరికీ ఇష్టం. ఆదివారం వచ్చినా, పార్టీకి వెళ్లినా చాలా మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ అదే చికెన్‌ని రోజు తినాలంటే ఎవరికైనా సాధ్యం కాదు పైగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది బ్రిటన్‌కు చెందిన 25 ఏళ్ల సమ్మర్ మొన్రో అనే యువతి మాత్రం గత 22 ఏళ్ల నుంచి రోజు చికెన్ మాత్రమే తింటోంది. తన రోజువారి డైట్లో చికెన్ నగ్గెట్స్, చికెన్ ఫ్రై, పొటాటో చిప్స్ ఇవే ఉంటాయి. అయితే దీనికి కారణం కూడా ఉందని అంటోంది సమ్మర్ మొన్రో. ఆమె మాట్లాడుతూ.. గత 22 ఏళ్ల నుంచి తను పండ్లు తినకున్నా.. కూరగాయలు తినకున్నా చాలా ఆరోగ్యంగా ఉందట. ఎలాంటి సమస్యలు తనకు రాలేదట. మూడు సంవత్సరాల వయస్సులో మెత్తని బంగాళాదుంపలను తినాల్సి వచ్చినప్పుడు ఆమెకు ఫోబియా మొదలైనట్లు చెప్పుకొచ్చింది. సమ్మర్ తన ఫోబియా నుంచి బయటపడేందుకు రెండుసార్లు థెరపీని, హిప్నోథెరపీని ప్రయత్నించింది, కానీ అదేది ఆమెకు సహాయం చేయలేదట. అందుకే తాను పండ్లు, కూరగాయలు తినడం మానేసినట్లు చెప్పింది. అసలు అవి చివరిసారిగా ఎప్పుడు తిన్నానో కూడా తనకు గుర్తులేదని తెలిపింది. అయితే తను పాటిస్తున్న డైట్ తనని ఆరోగ్యంగా ఉంచుతోందని అందుకే.. కేవలం చికెన్‌తో చేసిన వంటకాలు, పొటాటో చిప్స్, ఫ్రై పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపింది. -
వింత ఫోబియా: కూరగాయలు, ఆహారం చూస్తే చాలు వణికిపోతుంది
లండన్: మనం ఇంత కష్టపడి సంపాదించేంది ఎందుకు జానెడు పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే. కుబేరుడైనా సరే ఆకలేస్తే తినేది అన్నమే. మనిషి బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన వాటిలో ఆహారం ప్రముఖ పాత్రం పోషిస్తుంది. అలాంటిది ఆహారాన్ని చూస్తేనే భయంతో చెమట పడితే. తిండి చూస్తే.. చెమట పట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. కానీ ఇది వాస్తవం. ఓ మహిళ ఇలాంటి వింత ఫోబియాతోనే బాధపడుతుంది. సాస్ వేసి ఉన్న ఆహారాన్ని చూసిన.. వేర్వేరు పదార్థాలను కలిపి వండినా, వడ్డించినా.. తప్పుడు పద్దతిలో వడ్డించినా, కూరగాయాలు చూసినా ఆమెకు చెమటలు పడతాయట. ప్రస్తుతం ఆమె కేవలం టమాటా సూప్ తాగుతూ బతికేస్తుంది. ఆ వివరాలు.. ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన షార్లెట్ విటిల్(34) తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా కూరగాయలు తినలేదట. గత కొన్నేళ్లుగా ఆమె రైస్ కేక్, టమాట సూప్ తాగుతూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. బాల్యం నుంచి కూడా షార్లెట్ సరిగా తినేది కాదట. అది చూసి ఆమె తల్లిదండ్రులు ఆకలిగా లేదోమో అందుకే.. తినడం లేదని భావించేవారు మొదట్లో. బలవంతంగా ఏదైనా తిందామని ప్రయత్నిస్తే.. వాంతికి అయ్యేదట. (చదవండి: డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!) రాను రాను ఈ పరిస్థితి మరింత తీవ్ర కాసాగింది. సాస్ వేసిన ఆహారం చూసినా.. మిల్క్ షేక్‌లు, వేర్వేరు ఫుడ్ ఐటమ్స్‌ని కలిపి వడ్డించినా షార్లెట్‌కి నచ్చేది కాదు. ఇలాంటి ఆహారాన్ని చూస్తే ఆమె అరచేతుల్లో చెమటలు పట్టేవి. ఏళ్లు గడుస్తున్న కొద్ది షార్లెట్‌కి ఆహారం అంటే భయం పెరుగుతుంది.. తప్ప దాని మీద ఇష్టం కలగడం లేదు. ఈ క్రమంలో షార్లెట్ తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. డాక్టర్లు షార్లెట్‌ను పరిశీలించి.. ఆమె ఒక వింత ఫుడ్ ఫోబియాతో బాధపడుతుందని తెలిపారు. దీనివల్ల షార్లెట్ స్కూల్లో ఫ్రెండ్స్‌తో కలిసి తినేది కాదు. చదువుకునే రోజుల్లో తల్లిదండ్రుల వద్దే ఉండేది కాబట్టి.. ఈ ఫోబియా వల్ల షార్లెట్ పెద్దగా ఇబ్బంది పడలేదు. (చదవండి: మీకు కుక్కలంటే చచ్చేంత భయమా? ఐతే మీ కోసమే..) చదువు పూర్తయిన తర్వాత షార్లెట్‌కి ఉద్యోగం వచ్చింది. దాంతో ఆమె తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆఫీసులో ఉద్యోగులందరికి వంట చేసి పెడతారు. మొదట ఆ భోజనం చూసి షార్లెట్ చాలా భయపడేది. తర్వాత ధైర్యం చేసి తనకు ఉన్న ఫోబియా గురించి చెప్పి.. తన ఆహారాన్ని తానే వండుకోసాగింది. ఈ సందర్భంగా షార్లెట్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి కూరగాయలు చూస్తే నాకు భయం వేసేది. ఆహారం తీసుకోవాలని ప్రయత్నిస్తే వాంతికి వచ్చేది. పెరుగుతున్న కొద్ది భయం కూడా పెరగసాగింది. ఇప్పుడు ఆహారాన్ని సరిగా ఉడికించపోయినా.. సరిగా వడ్డించకపోయినా నాకు కడుపులో దేవేస్తుంది. ప్రస్తుతం నేను రైస్ కేక్, టమాటా సూప్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఫోబియా నా సోషల్ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల స్నేహితులతో కలిసి బయట తినడానికి వెళ్లలేకపోతున్నాను. కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడాలని బలంగా కోరుకుంటున్నాను.. ప్రయత్న ప్రారంభించాను.. త్వరలోనే ఈ భయాన్ని జయిస్తాను’’ అని తెలిపింది. చదవండి: సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో.. -
Cynophobia: మీకు కుక్కలంటే చచ్చేంత భయమా? ఐతే మీ కోసమే..
పెళ్లిళ్లు, ఇల్లు, వాన.. చివరికి అందమైన స్రీలను చూసినా భయపడేవారు ఉన్నారీ ప్రపంచంలో. మనం నవ్వుకుంటాము కానీ దాన్ని అనుభవించేవాళ్లకి నరకం కనిపిస్తుంది. అటువంటి భయాల్లో సైనోఫోభియా ఒకటి. అంటే కుక్కలను చూస్తే చాలు ఆ చుట్టుపక్కల కనిపించరన్నమాట. కారణాలు అనేకం ఉండోచ్చు. అంటే చిన్నతనంలో కుక్క వెంటబడటంవల్ల కలిగినదికావొచ్చు. లేదా ఎవరినైనా రక్తం వచ్చేలా కరవడం చూసి భయపడటం కావచ్చు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో కుక్కల పట్ల భయం వీరిలో పేరుకుపోతుంది. ఐతే ఈ ఫోభియా నుంచి బయటపడే మార్గాలు న్యూయార్క్‌లోని నార్త్‌వెల్ హెల్త్ సౌత్ ఓక్స్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లారీ విటగ్లియానో మాటల్లో మీకోసం.. అనేక ఇతర రుగ్మతల మాదిరిగానే ఇది కూడా ఒక ఫోబియానే. కుక్కల పట్ల భయం చాలా చిన్నవయసులోనే ప్రారంభమవుతుంది. ఈ ఫోబియా ఉన్నవారి చుట్టు పక్కల కుక్కలు కనిపిస్తే వారి గుండె వేగం పెరుగుతుంది. వణుకు, వికారం, చెమట్లు పట్టడం ఒక్కోసారి భయంతో కళ్లు తిరిగి పడిపోతారు కూడా. చికిత్స ఈ రుగ్మతతో బాధపడే వారికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ)తో చికిత్స చేయవచ్చు. ప్రారంభంలో కుక్క ఇమేజ్ చూపించడం ద్వారా ఆ తర్వాత బొమ్మ కుక్క, ఆపైన నిజం కుక్కను చూపడం ద్వారా ఈ భయాన్ని దూరం చేయవచ్చు. భయాన్ని ఈ విధంగా అధిగమించవచ్చు కుక్కలను చూసి భయపడటం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో.. వీలైనంత త్వరగా వాటితో చనువుపెంచుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే దీర్ఘకాలిక ముద్ర మీ మనసుపై పడే అవకాశం ఉంది. గుడ్ బియేవియర్ కలిగిన కుక్కతో కొంత సమయం గడపగలగాలి. అంతేకాకుండా కుక్కల గురించిన వివిధ అధ్యనాలు చదవాలి. తద్వారా అవి కరిచే ప్రమాదం ఎంత అరుదుగా ఉంటుందో తెలుసుకోండి. థెరపిస్టులను కలిసి మీ ఫోబియాను అధిగమించే మార్గాలను తెలుసుకొని వాటిని ఆచరించడం ద్వారాసైనోఫోభియాను అధిగమించవచ్చని బిహేవియరల్ సైకోథెరపి నిపుణులు డాక్టర్ విటగ్లియానో సూచించారు. చదవండి: Stonehenge: ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే!! -
సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో..
గాలి భయం, నేల భయం, నిప్పు భయం, నీరు భయం.. ఇలా మనిషికి అంతా భయంమయం. నల్లిని చూసినా, పిల్లిని చూసినా.. భయంతో, అసహ్యంతో కుంగిపోతుంటాడు. అయితే కొందరు ఆ భయాల్ని పొగొట్టుకునేందుకు రకరకాల థెరపీలను ఆశ్రయిస్తుంటారు. ఈ క్రమంలో సాలీడు పురుగులంటే భయపడేవాళ్ల కోసం ఓ యాప్‌ను రూపొందించారు స్విట్జర్లాండ్ సైంటిస్టులు. స్విట్జర్లాండ్ బాసెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు ‘డబ్బ్‌డ్ ఫోబిస్’ పేరుతో ఓ కొత్త యాప్‌ను డెవలప్ చేశారు. ఇందులో అగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీతో రూపొందించిన సాలీడు పురుగుల బొమ్మలు డిస్ప్లే అవుతాయి. వీటి ద్వారా నిజమైన సాలీడు పురుగుల వల్ల కలిగే భయాన్ని దూరం చేసుకోవచ్చని రీసెర్చర్లు చెప్తున్నారు. సాలీడు పురుగుల వల్ల మనిషికి కలిగే భయాన్ని అరాచ్నోఫోబియా(అరాక్నోఫోబియా) అంటారు. దీని నుంచి బయటపడేందుకు చాలామంది మానసిక వైద్యులు, థెరపిస్టుల చుట్టూ తిరుగుతూ డబ్బు ఖర్చు చేస్తుంటారు. అయితే డబ్బ్‌డ్ ఫోబిస్ పూర్తిగా ఫ్రీ యాప్. అగుమెంటెడ్ రియాలిటీ 3డీ స్పైడర్ బొమ్మల వల్ల.. రియల్ లైఫ్ స్పైడర్లు ఎదురైనప్పుడు కలిగే భయాన్ని ఫేస్ చేయొచ్చు. మొత్తం పది లెవల్స్‌లో ఈ యాప్ ట్రీట్మెంట్(సెల్ఫ్) చేసుకోవచ్చు. రీసెంట్గా ఈ యాప్ వల్ల అరాచ్నోఫోబియా బయటపడ్డ కొందరి అభిప్రాయాల్ని ‘యాంగ్జైటీ డిజార్డర్స్’ అనే జర్నల్‌లో పబ్లిష్ చేశారు. వీళ్లంతా సుమారు రెండువారాలపాటు ఆరున్నర గంటలపాటు శిక్షణ తీసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో థెరపీ కంటే మెరుగైన ఫలితాలను ఇచ్చాయని రీసెర్చర్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్లేస్టోర్‌లో డమ్మీ ఫోబిస్ యాప్‌లు చాలానే ఉన్నాయి. కానీ, ఏఆర్ టెక్నాలజీ ఎక్స్‌పీరియన్స్‌తో కూడిన డబ్బ్‌డ్ ఫోబిస్ యాప్ రావడానికి కొంత టైం పడుతుందని చెప్తున్నారు. చదవండి: ఔరా.. అద్దాలలో ఈ స్మార్ట్ అద్దాలు వేరయా! -
వెంటాడుతున్న కరోనా ఫోబియో..!
సాక్షి, రామభద్రపురం: సమాజాన్ని కరోనా ఫోబియా వెంటాడుతోంది. కోవిడ్ లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా భయంతో జనం వణికిపోతున్నారు. పాజిటివ్ వచ్చినా ఏం కాదని తెలిసినా చాలామంది ఏమవుతుందో అని మనోవేదనకు గురవుతున్నారు. పాజిటివ్ వచ్చిన వారిని మొన్ననే కలిశానని, నాకూ రావొచ్చంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. పాజిటివ్ వ్యక్తికి సంబంధించి ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా, కనిపించకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకోవడం ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. చాలా మంది ఆ ప్రయత్నం చేయకుండానే ఏమవుతుందోనని కుమిలిపోతున్నారు. కొందరు నెగెటివ్ ఆలోచనలతో కుంగిపోతున్నారు. తనకేమైనా జరుగుతుందేమోనని మనోవేదనకు గురవుతున్నారు. తమ కళ్ల ముందరే పలానా వ్యక్తికి పాజిటివ్ వచ్చిందని, ఆయన ఆస్పత్రుల్లో అనేక కష్టాలు పడ్డాడని, ఫలానా వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడని ఇలా ఇవేవో ఊహించుకుంటూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. కోవిడ్ బారిన పడిన వేలాది మంది ఇళ్లలోనే ఉండి చికిత్స పొంది కోలుకుంటున్నారు. వీటిని గుర్తించకుండా.. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కొన్ని వీడియోలు, ఉదంతాలను చూసి తమకు కరోనా వస్తే అలాంటి కష్టాలు పడాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. వయసు మళ్లిన వారు సైతం కోలుకుంటున్న పరిస్ధితుల్లో అనవసర ఆందోళనలకు గురికావద్దని వైద్యులు చెబుతున్నా వినిపించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దగ్గినా, తుమ్మినా అనుమానమే.. వర్షాకాలం సీజన్ కావడంతో వర్షంలో నానినా, ప్రయాణాలు చేసినా సాధారణంగా చాలామందికి జలుబు చేయడం, దగ్గు, తుమ్ములు రావడం సహజం. దీనికి తోడు వైరల్ ఫీవర్లతో పాటు మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులు ప్రబలుతుంటాయి. అయితే, ప్రస్తుతం కరోనా వైరస్ అనేది మహమ్మారి అనే భావన అందరి మనసుళ్లలో నిండిపోవడంతో దగ్గినా, తుమ్మినా కరోనా కావచ్చనుకుంటున్నారు. తమకు తాముగాను అనుమానించుకుంటున్నారు. దానికి తోడు ఇరుగు పొరుగు వారు కూడా ఎవరు దగ్గినా, తుమ్మినా అనుమానంగా చూస్తుండడం కూడా వారిని ఇబ్బంది పెడుతోంది. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులను కూడా అనుమానిస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలు మొదట్లో లక్షణాలు ఉన్నవారికే చేసేవారు. ఇప్పుడు అందరికీ చేస్తున్న నేపథ్యంలో పరీక్షలు చేయించుకోవడం ద్వారా అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. ఒకవేళ పాజిటివ్ వచ్చినా బెదిరిపోవల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండి వైద్యుల సూచనల ప్రకారం ఇంట్లోనే ఉండి మందులు వాడితే గట్టెక్కవచ్చు. అనవసరంగా ఆందోళనకు గురై మరిన్ని కష్టాల్లో కూరుకుపోవద్దని వైద్యులు అంటున్నారు. ఆందోళన చెందొద్దు: మన ప్రాంతంలో వ్యాపిస్తున్న కరోనా వైరస్ అంత శక్తి వంతమైనది కాదు. అలాగే, ఉధృతి కూడా తగ్గింది. కరోనా సోకినా ధైర్యంగా హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే ఏ ప్రమాదం ఉండదు. కరోనా సోకిన వ్యక్తికి వయసు 55 ఏళ్లు పైబడి, శరీరంలో ముందుగా ఊపిరితిత్తులకు సంబంధించి ఏవైనా వ్యాధులు ఉంటే కొద్దోగొప్పో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అలాంటి వారు కూడా ధైర్యంగా.. ఆందోళన చెందకుండా ఉంటే కోలుకోవచ్చు. వర్షాకాలం సీజన్ కావడంతో జలుబు చేయడం, దగ్గు, తుమ్ములు రావడం సహజం. ప్రతీ జ్వరాన్ని కరోనా అన్న అనుమానం ఉండకూడదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దగ్గినా తుమ్మినా కరోనా కావచ్చని అనుమానిస్తున్నారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకుని అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు. – వై.విజయమోహన్, కోవిడ్ ప్రొగ్రాం ఆఫీసర్, బొబ్బిలి నియోజకవర్గం ఇంట్లోనే మందులు వాడాను.. నేను కరోనా బారిన పడ్డాను. ఏ మాత్రం అధైర్యపడకుండా ఇంట్లోనే ఉండి వైద్యుల సూచనల ప్రకారం మందులు వాడి కోలుకున్నాను. కరోనా సోకిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భయపడితే మరిన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కరోనా సోకినా ధైర్యంగా ఉండి మందులు వాడితే ఏ ప్రమాదం ఉండదన్నందుకు నేనే నిదర్శనం. – గొర్లి అప్పలనాయుడు, రామభద్రపురం -
చెట్టు మీద దెయ్యం.. అమ్మో భయం!
అర్థరాత్రి వేళ నిద్రలో లేచి పెద్ద పెద్దగా కేకలు వేయడం..వారిలోకి ప్రేతాత్మ ప్రవేశించినట్లు వ్యవహరించడం..ఎవరో మాట్లాడినట్లు మాట్లాడటం..పళ్లు బిగపట్టడం వంటి లక్షణాలు ఇటీవల కాలంలో యువత, చిన్నారుల్లో పెరుగుతున్నాయి. ఒకప్పుడు అత్తమామల నుంచి వేధింపులకు గురయ్యే మహిళలు, భర్తతో సత్సంబంధాలు లేనివారు అలా ప్రవర్తించేవారని, ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ ప్రభావంతో యువత, చిన్నారులు లేనిపోనివి ఊహించుకుని భయపడుతుంటారని, ఈ భయం ముదిరి డిప్రెషన్లోకి వెళ్లిపోతారని, సకాలంలో మేల్కొని కౌన్సెలింగ్ తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. విజయవాడలో ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న పదిహేను మంది యువతులు అదే సంస్థకు చెందిన హాస్టల్లో ఉంటున్నారు. నెల రోజుల కిందట వీరిలో నలుగురు రాత్రివేళల్లో దెయ్యం పట్టినట్లు వ్యవహరించడంతో మిగిలిన యువతులు కూడా తీవ్ర భయాందోళనకు గురవడం ప్రారంభించారు. రాత్రి వేళల్లో వారంతా బిగ్గరగా అరవడం, పళ్లు బిగపట్టం వంటి లక్షణాలు ఉండటంతో వారిని ఓ మానసిక వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అక్కడ 15 మంది యువతులను కూర్చోపెట్టి అసలు ఏమి జరుగుతుందని వివరాలు తెలుసుకు అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వారు ప్రస్తుతం ఎలాంటి భయాలు లేకుండా ఉన్నట్లు చెబుతున్నారు. వారం రోజుల కిందట నందిగామలో డిగ్రీ చదువుతున్న ఓ యువతిని దెయ్యం పట్టిందంటూ మానసిక వైద్యుని వద్దకు తీసుకు వచ్చారు అక్కడ వైద్య పరీక్షల అనంతరం కౌన్సెలింగ్ కోసం సైకాలజిస్ట్ వద్దకు పంపించారు. అక్కడ ఏ సమయంలో ఎలా ప్రవర్తిస్తుందనే విషయాలను తెలుసుకుని సరైన రీతిలో కౌన్సెలింగ్ ఇవ్వడంతో సమస్యకు పరిష్కారం లభించింది. సాక్షి, విజయవాడ : ఇటీవల కాలంలో తమ పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుందని, రాత్రి వేళల్లో మంచంపై నుంచి లేచి నడుచుకుంటూ వెళ్లిపోవడం, పెద్దగా కేకలు వేస్తూ మాట్లాడుతున్నారంటూ మానసిక వైద్యుల వద్దకు వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు పలువురు వైద్యులు చెబుతున్నారు. వారిలో కొందరు తమ పిల్లల్లోకి మృతిచెందిన వారి ప్రేతాత్మ ప్రవేశించి అలా ప్రవర్తిస్తున్నట్లు చెబుతుండగా, ఏం జరిగిందో తెలియడం లేదని, పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తున్నారంటూ మరికొందరు చెబుతున్నారు. పిల్లల్లో కనిపించిన లక్షణాలతో దెయ్యం పట్టిందని భావించి పూజలు, తాయత్తులు కట్టించే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో ఎక్కువుగానే ఉంటున్నట్లు చెబుతున్నారు. మానసిక సమస్యే... దెయ్యం పట్టినట్లు వ్యవహరించడం.. ఏవేవో మాట్లాడటం వంటివి కూడా మానసిక సమస్యలుగానే గుర్తించాలని వైద్యులు అంటున్నారు. దెయ్యం అంటే భయపడడాన్ని వైద్య పరిభాషలో ఫాస్మోఫోబియా అంటారు. అలాంటి వారిని గుర్తించి సరైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మరికొందరు సైకోసిస్ అనే మానసిక వ్యాధి కారణంగా దెయ్యం పట్టినట్లు, ప్రేతాత్మ తమలోకి ప్రవేశించినట్లు ప్రవర్తిస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో హిస్టారికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయని వారు తెలిపారు. అలాంటి వారిని గుర్తించి మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అక్కడ చికిత్సతో పాటు, సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ ఇస్తారని చెబుతున్నారు. సీరియల్స్, సినిమాల ప్రభావమే... ప్రస్తుతం సీరియల్స్, సినిమాల్లో మృతి చెందిన ప్రేతాత్మలు మరొకరిలోకి ప్రవేశించడం, ఊహించని శక్తిని పొందడం వంటి సన్నివేశాలు ఎక్కువ గా చూపిస్తున్నట్లు వైద్యనిపుణులు చెపుతున్నారు. అంతేకాకుండా దెయ్యం పట్టడం వంటివి కూడా ఉంటున్నాయి. అలాంటి సన్నివేశాలు చిన్నారుల మనస్సుల్లో ఉండిపోయి. రాత్రివేళల్లో అలా వ్యవహరించే అవకాశం ఉందని చెబుతున్నారు. తలస్నానం చేసి బయటకు వెళ్లకూడదని, అర్ధరాత్రి వేళల్లో దెయ్యాలు తిరుగుతుంటాయని చిన్నారులకు తల్లిదండ్రులు చెప్పడం కూడా వారిపై ప్ర భావం చూపుతున్నట్లు చెబుతున్నారు. మన మనస్సులో దెయ్యం అనే ఆలోచన లేకుంటే ఎలాంటి భయాలు ఉండవని, నిత్యం సినిమాలు, సీరియల్స్‌లో చూస్తున్న ఘటనలతోనే ఇలాంటివి చోటుచేసుకుంటున్నట్లు చెబుతున్నారు. దెయ్యాలు అభూత కల్పనలే.. దెయ్యాలు, భూతాలు అనేవి అభూత కల్పనలు మాత్రమే. ఒకసారి మృతి చెందిన వారి ఆత్మలు తిరిగి రావడం అనేది జరగదు. ప్రేతాత్మలు అనేవి ఊహాలు మాత్రమే. భూతాలు, భూత వైద్యం అనేవి నమ్మదగిన విషయాలు కాదు. మనం నిత్యం చూస్తున్న ఘటనలు మనస్సులో ఉండిపోయి రాత్రివేళల్లో అలాగే ప్రవర్తించడం జరుగుతుంది. సినిమాలు, సీరియల్స్ ప్రభావం చిన్నారులపై తీవ్రంగా ఉంటుంది. సైకోసిస్, పొసిషన్ సిండ్రోమ్, హిస్టీరికల్ వంటి మానసిక సమస్యల కారణంగా కూడా అలా ప్రవర్తించే అవకాశం ఉంది. పిల్లల దెయ్యంపట్టినట్లు ప్రవర్తించిన సమయంలో మానసిక వైద్యులను సంప్రదించాలి.వైద్యులు వారిని పరీక్షించి అవసరమైతే మందులు ఇవ్వడం, సైకాలజిస్ట్స్తో కౌన్సెలింగ్ ఇప్పించడం చేస్తారు. అంతేకాని భూత వైద్యం వంటి వాటిని ఆశ్రయించడం మంచిది కాదు. – డాక్టర్ టీఎస్‌రావు, రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ -
భయాన్ని గాల్లో విసిరేశా!
‘మనకు ఉన్న భయాలు పోవాలంటే దేనికి భయపడుతున్నామో దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఆ భయాన్ని పోగొట్టుకోవడమే’ అని రకుల్‌ప్రీత్ సింగ్ అంటున్నారు. రకుల్‌కు బాసోఫోబియా ఉండేదట. అంటే.. ఎత్తు నుంచి కిందపడిపోతానేమోనని భయం. ఆ భయాన్ని పోగట్టదలుచుకున్నారు. వెంటనే స్కై డైవింగ్ చేశారు. స్కై డైవ్ చేసిన తర్వాత ఆ అనుభవాన్ని రకుల్ పంచుకుంటూ – ‘‘జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలన్నది నా పాలసీ. జీవితంలో భయానికి చోటు ఉండకూడదు. జరిగేది జరగక మానదు. మన భయాల్ని అధిగమించడాన్ని మించిన ఆనందం మరోటి ఉండదు. గాల్లోకి జంప్ చేయడానికి ఏరోప్లేన్ తలుపులు తెరిచినప్పుడు విపరీతంగా భయమేసింది. కానీ గాల్లో తేలిన ఆ 50 సెకన్లు నా జీవితంలో మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్స్. ఆ క్షణం నేనో పక్షిలా అయిపోయా. ఏదో సాధించాను అనే భావన. డైవింగ్‌లో మరో క్రేజీ విషయమేటంటే.. మీరు భయపడితే మేం రికార్డ్ చేసే వీడియో సరిగ్గా ఉండదు అని చెప్పడంతో నాలో ఉన్న నటిని బయటకు రప్పించి గాల్లో ఉన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను’’ అన్నారు. -
సోషల్ మీడియా ‘ఫోబియా’
ఇంతకాలం తమ రాతల ద్వారా ప్రజాభిప్రాయాన్ని కొన్ని పార్టీలకు, వ్యక్తులకు అనుకూలంగా మలచడంలో తలమునకలుగా ఉన్నవారు తాము కల్పిస్తున్న ‘భ్రమలు’ సోషల్ మీడియా కారణంగా తొలగిపోతాయని భయపడుతున్నారు. తెలుగునాట సోషల్ మీడియా ఓ మాఫియాగా మారిపోతోందని కొందరు తెగ బాధపడిపోతున్నారు. పనిగట్టుకొని సాగిస్తున్న సోషల్ మీడియా దుష్ప్రచారం కొందరు ప్రముఖులకు ప్రాణ సంకటంగా మారిందన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇంతకాలం ప్రధానస్రవంతి మీడియా ఏకచత్రాధిపత్యంగా రాజ్యమేలింది. ఇపుడు ఆ పరిస్థితి మారింది. ప్రధాన స్రవంతి మీడియా (మొత్తం కాదు) చేస్తున్న వక్రీకరణలు, వండివారుస్తున్న కథనాలు, నిజాలుగా చెలామణి చేస్తున్న అసత్య వార్తల వెనుకనున్న గుట్టుమట్లను సోషల్ మీడియా ఎత్తి చూపిస్తున్నది. నిజాలేమిటో గ్రహించడానికి ఈ రోజు ప్రజలకు ఓ ప్రత్యామ్నాయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. బహుశ ఆ దుగ్ధతోనే కాబోలు ప్రధాన స్రవంతి మీడియాకి చెందిన కొందరు ‘సోషల్ మీడియా’ మొత్తాన్ని ఓ భూతంగా, మాఫియాగా చిత్రీకరిస్తున్నారు. ఏపీ విషయంలో ‘సోషల్ మీడియా’ నిర్వర్తిస్తున్న పాత్రను విశ్లేషించి చూసినపుడు అది మాఫియానా? లేక ప్రజలకు మేలు చేస్తున్న మీడియానా? అన్నది అర్థమవుతుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో ప్రసంగిస్తూ ‘‘దేశంలోని రాజకీయ వేత్తల్లో నా అంత సీనియర్ ఎవరూ లేరు’’ అని ప్రకటించుకున్నారు. దేశంలోని సీనియర్ రాజకీయ వేత్తల్లో బాబు ఒకరేగానీ.. ఆయన సీనియర్ మోస్ట్ కాదు. ఈ వాస్తవాన్ని మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తాను ప్రజలకు తెలియపర్చకపోతే.. అసెంబ్లీ సాక్షిగా బాబు చెప్పిన అబద్ధమే నిజంగా చెలామణి అయిపోయేది. ముందూవెనుకా ఆలోచించకుండా బాబు తనకి సంబంధించి ఇటువంటి అనేక అసత్యాలను గతంలో ప్రచారం చేశారు. తాజాగా ఏపీ ప్రత్యేకహోదాకు సంబంధించి బాబు పలు సందర్భాలలో మాట మార్చారు. ఆయన ఏయే సందర్భాలలో ఏ విధంగా మాట మార్చిందీ వీడియో క్లిప్పింగ్ సాక్ష్యాలతో సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలుసుకోగలిగారు. అదేవిధంగా 2017 కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా.. మీడియా సాక్షిగా బాబు ‘‘రాష్ట్రానికి అన్నీ వచ్చాయి.. ఇంతకంటే ఎక్కువ ఎవరిస్తారు?’’ అంటూ చెప్పిన మాటల్ని హెడ్‌లైన్స్‌లో ప్రచురించిన వార్తా పత్రికల క్లిప్పింగులు సోషల్ మీడియా ద్వారా షేర్ కావడంతో.. అధికార పార్టీ నేతల గొంతుకల్లో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయింది. ప్రజలకిచ్చిన హామీల విషయంలోగానీ, ప్రత్యేకహోదా ప్యాకేజీల అంశాల్లోగానీ పూటకోమాట, రోజుకో విధానం అవలంభించే బాబు లాంటి రాజకీయనాయకుల ఊసరవెల్లి విన్యాసాల్ని సోషల్ మీడియా ద్వారా సామాన్య ప్రజలు చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ‘సోషల్ మీడియా’ను భూతంగా చూపుతున్న ప్రధాన స్రవంతి మీడియాలోని ఓ వర్గం రాజకీయ నాయకుల ద్వంద్వ ప్రమాణాలను ప్రశ్నించడం ఎప్పుడో మానేసింది. అధికారంలో ఉన్న వారు ఏం చెప్పినా బుద్ధిగా వినడం, రాయడం.. దానిని ప్రజలకు చేరవేయడమే వాటి బాధ్యతగా మారింది. ఇటీవల బాబు.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి మచ్చ లేదని; తాను పరమ పవిత్రంగా రాజకీయాలు చేస్తున్నందునే హాయిగా నిద్రపోగలుగుతున్నానని కొన్ని పత్రికలకు, కొన్ని చానెళ్లకు చెప్పారు. ఆయన మాటల్లోని అసంబద్ధతను రిపోర్టర్లు ప్రశ్నించలేదు. బాబు అడ్డంగా దొరికిపోయిన ఓటుకు నోటు కేసును ఆ ప్రతినిధులు ప్రస్తావించలేదు. ఎందుకు అడ్డదారుల్లో ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేయాల్సి వచ్చిందో అడగలేదు. బాబు ఏం చెప్పినా అదే శిరోధార్యంగా.. అబద్ధాలను నిజాలుగా జనం మీదకు వదిలే ‘మీడియా’ను ఏమనాలి? అధికారంలోకి వచ్చాక రైతులకు బేషరతుగా చేస్తానన్న రుణమాఫీపై బాబు మాట మార్చారు. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అనేక హామీలకు మంగళం పాడారు. గతంలో ఇలాంటి విమర్శలు వస్తే వాటిని అవలీలగా తిప్పికొట్టగలిగేవారు. కానీ, నేడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్నాయి కనుక ఇబ్బందిపడుతున్నారు. ఇక, అమరావతి నిర్మాణానికి సంబంధించి బాబు చేస్తున్న డొల్ల ప్రకటనలు.. సింగపూర్‌ను మించిన రాజధాని, టోక్యోను మించిన రాజధాని, న్యూయార్క్‌ను తలదన్నే రాజధాని అంటూ ఏ దేశం వెళితే ఆ దేశాన్ని మించిన రాజధాని కడతానంటూ చేసిన ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకాలం తమ రాతల ద్వారా ప్రజాభిప్రాయాన్ని రాజకీయంగా కొన్ని పార్టీలకు, వ్యక్తులకు అనుకూలంగా మలచడంలో తెలుగునాట తలమునకలుగా ఉన్నవారు తాము కల్పిస్తున్న ‘భ్రమలు’ సోషల్ మీడియా కారణంగా తొలగిపోతాయని ఇప్పుడు భయపడుతున్నారు. అందుకే సోషల్ మీడియా ఫోబియాతో దానిని ఓ మాఫియాగా చిత్రీకరిస్తున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగపర్చేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. అయితే, మొత్తం సోషల్ మీడియానే లేకుండా చేయాలన్న ప్రయత్నాలు మంచిదికాదు. వాస్తవాల విశ్లేషణకు నేడు సోషల్ మీడియానే సామాన్యులకు దిక్కుగా మారిందనడం అతిశయోక్తికాదు. - సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ ఫోన్: 81069 15555 -
అనుక్షణం భయపడుతూనే ఉంటా..
ముంబై: 'కబాలీ' మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే గొప్ప అవకాశాన్ని రాధికా ఆప్టే దక్కించుకుంది. 'బదలాపూర్' తో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది. సెలబ్రిటీగా ఉండటం చాలా కష్టమంటోంది ఈ హీరోయిన్. సెలబ్రిటీలు, అందులో ముఖ్యంగా నటీనటులకు ప్రతిరోజూ ఏదో విషయంలో కొత్త భయాలు పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. అనుకోని ఆపదలు(వదంతులు) తారలకు నిత్యం ఎదురవుతునే ఉంటాయని అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పింది. ఇంతకు ఈ భయం గోల ఏంటనుకుంటున్నారు కదూ... రాధిక ఆప్టే కీలక పాత్రలో కనిపించిన మూవీ 'ఫోబియా' (భయం) రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్ కృపలానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ గురించి రాధికా మాట్లాడుతూ.. భయాలు సాధారణ వ్యక్తుల కంటే ఓ మోస్తరు గుర్తింపు ఉన్న వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ప్రతి సమస్యను ఎదుర్కొంటూ పోతేనే ముందుకెళ్లడం సాధ్యమవుతుందని, మరిన్ని విజయాలు సొంతం చేసుకోవచ్చని అంటోంది. -
ఫోబియా.. ఇదేం మాయ!
వస్తువు, జంతువు, సంఘటన.. ఇలా ఏదో ఒకదాన్ని తలచుకుని అదేపనిగా భయపడడాన్నే ఫోబియా అంటారు. సాధారణంగా ప్రతి వ్యక్తీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయాన్ని తలచుకుని భయపడుతూనే ఉంటాడు. ఈ భయం మామూలు స్థితిలో ఉంటే పరవాలేదు. ‘అతి’గా పరిణమించిందనుకోండి.. అదే ఫోబియాగా మారుతుంది. వైద్య శాస్త్రం ప్రకారం ఎన్నో రకాల ఫోబియాలున్నాయి. వాటిలో వింతగా అనిపించేవీ ఉన్నాయి. మీకోసం కొన్ని..! - సాక్షి, స్కూల్ ఎడిషన్ రంగు పడింది.. రంగులను చూసి భయపడటాన్ని ‘క్రోమాటోఫోబియా’ అంటారు. గతంలో ఆయా వ్యక్తులకు జరిగిన ఏదైనా సంఘటన దీనికి కారణంగా చెప్పవచ్చు. ఆ సమయంలో అత్యంత భయాన్ని కలిగించిన రంగులు వారి మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. తమను మానసికంగా బాధించిన ఆ వర్ణాలను చూడగానే వారిలో ఎక్కడిలేని భయం పుట్టుకొస్తుంది. దీంతో ప్రత్యేకంగా ఏదో ఒక రంగునో, రంగుల కలయికనో చూడగానే విచిత్రంగా ప్రవర్తిస్తారు. ఈ ఫోబియా వివిధ రకాలుగా ప్రభావితం చేస్తుంది. కొందరు జీవితాంతం క్రోమాటోఫోబియాతోనే బాధపడతారు. మరికొందరు మాత్రం తాత్కాలికంగా, కొన్ని సందర్భాల్లోనే దీని బారిన పడతారు. రంగుల బట్టి ఫోబియాలు మారుతాయి. 1. ఎరుపు - ఫోడోఫోబియా, 2. నారింజ రంగు - క్రైసోఫోబియా, 3. పసుపు - జాంతోఫోబియా, 4. ఆకుపచ్చ - క్లోరోఫోబియా, 5. నీలి రంగు - సియానోఫోబియా, 6. పర్పుల్ - పార్ఫిరోఫోబియా, 7. తెలుపు - ల్యూకూఫోబియా, 8. నలుపు - మిలానోఫోబియా. విదూషకుడూ విలనే.. వారాంతాల్లో షాపింగ్ మాల్స్కో, సర్కస్కో వెళ్లారనుకోండి. అక్కడ మనల్ని నవ్వించేందుకు విచిత్రమైన గెటప్పుల్లో హాస్యగాళ్లు కనిపిస్తారు. వీరినే జోకర్లు, క్లౌన్లు అని పిలుస్తారు. ఈ జోకర్లను చూసి పెద్దలు బాగానే నవ్వుకుంటారు. సమస్యంతా చిన్నారులతోనే..! ముఖం నిండా రంగులు పూసుకుని నవ్వించడానికి దగ్గరకొచ్చే విదూషకులని చూడగానే బావురు మంటారు చిట్టి హీరోలు. ఇది పెద్ద విశేషమేమీ కాదు, మరి టీనేజీ దాటిన వాళ్లు, పెద్దలు సైతం జోకర్‌ను చూసి బెంబేలెత్తిపోతే.. అదే ‘కూల్రోఫోబియా’! ఇప్పటిదాకా ఎక్కువగా భయపెట్టిన క్లౌన్ల జాబితాలో ‘పెన్నీవైజ్’ తొలిస్థానంలో ఉంటుంది. 1990లో వచ్చిన ‘ఇట్’ సినిమాలో ఈ పాత్ర కనిపిస్తుంది. స్పై‘డర్’.. మన దేశంలో తక్కువ గానీ పాశ్చ్యాత్య దేశాల్లో సాలీడును చూస్తే చాలు ఆమడ దూరం పరుగెడతారు. ఎక్కడ మీద పడుతుందో అని ముడుచుకుపోతూ ఉంటారు. సాలీడంటే అంత భయం వారికి. దీన్నే ‘అరాక్నోఫోబియా’ అంటారు. ఇలా భయపడటంలోనూ కొంత హేతుకత ఉందనే చెప్పాలి. ఎందుకంటే సాలీళ్లలో చాలా వరకు విషపూరితం. వీటిలో కొన్ని ఏకంగా మనిషిని చంపెయ్యగలవు. కొన్ని విపరీతమైన బాధ, నొప్పిని కలిగిస్తాయి. విషపూరిత సాలీళ్లను మినహాయిస్తే మిగతా వాటివల్ల ప్రమాదమేమీ ఉండదు. షార్క్‌లు బాబోయ్.. షార్క్‌లను చూసి భయపడని వారెవరూ ఉండరు. మరీ ముఖ్యంగా 1975లో స్టీవెన్ స్పీల్బర్గ్ తీసిన ‘జాస్’ చిత్రం చూశాక ఈ భయం మరీ ఎక్కువైందని చెబుతారు. అద్భుతమైన విజువల్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రధానంగా తీసిన ఈ చిత్రం తొమ్మిదేళ్ల చిన్నారులను మరీ భయపెట్టిందట! బీచ్‌లకు వెళ్లాలన్నా, బోటింగ్ చెయ్యాలన్నా, చివరకు షార్క్ చిత్రాలు చూడాలన్నా ఇష్టపడేవారు కాదు. కొన్నాళ్లకు చాలా మంది షార్క్‌ల భయం నుంచి బయటపడ్డారు కానీ, కొందరు మాత్రం ఇప్పటికీ అలానే ఉండిపోతున్నారు. ఈ లక్షణాన్నే ‘గాలియోఫోబియా’ లేదా ‘సిలాచోఫోబియా’ అంటారు. ఎక్కడ గుచ్చుతారో.. సూది.. సాధారణంగా అందరినీ భయపెడుతుంది. సూదిమందు వేసుకోవడాన్ని ఎవరు మాత్రం ఇష్టపడతారు చెప్పండి. ఈ అయిష్టతే కొందరిలో బాగా ముదిరి ఫోబియాగా మారుతుంది. దీన్నే ‘ట్రైపానోఫోబియా’ అంటారు. బిలోనీఫోబియా, ఎనెటోఫోబియా, ఐష్మోఫోబియా అనీ పిలుస్తారు. 1994లో అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ముద్రించిన ‘డిఎస్ఎమ్-4’లో తొలిసారిగా ఈ ఫోబియాను చేర్చారు. దీని బాధితులు సూది, పదునైన వస్తువులను చూడగానే గజగజా వణికిపోతారట! వామ్మో.. స్నానం! ఫోబియాలందు ఇది వేరయా అన్నట్లు ఉంటుంది ‘అబ్లుటోఫోబియా’. స్నానం, వాష్ చేసేందుకు భయపడటమే ఈ ఫోబియా లక్షణం. 1960లో వచ్చిన ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ మూవీ ‘సైకో’ తర్వాతే ఈ విచిత్రమైన ఫోబియా బాధితులు ఎక్కువయ్యారని చెబుతారు. ఈ చిత్రంలోని టాయ్‌లెట్ సీన్లు అత్యంత భయాన్ని కలిగిస్తాయి. దీంతో బాత్రూంలో స్నానానికి వెళ్లగానే అదే దృశ్యాన్ని ఊహించుకొని, చాలామంది లేనిపోని భయాలకు గురయ్యారట..! అబ్లుటోఫోబియా ఎక్కువగా చిన్నారులు, మహిళల్లోనే కనిపిస్తుంది. ఈ లక్షణాలు ఉన్న వారు బలవంతంగానే స్నానానికి వెళ్తారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర భయాందోళనలకు గురై అధిక గుండెపోటు, శ్వాస అందకపోవడం, వణికిపోవడం లాంటి విపరీత పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ‘నో’వాహియామి.. రెండేళ్ల బుజ్జిగాడు నిద్రపోకుండా మారాం చేస్తుంటే అమ్మ ఏం చెబుతుంది..? ‘అదిగో! బూచాడు వస్తున్నాడు. నిన్ను ఎత్తుకుపోతాడు. మారా చేయకుండా బజ్జో..’ అని ఏదో చెప్పి నిద్రపుచ్చుతుంది. చాలా మట్టుకు ఈ మాటలు బాగానే పనిచేస్తాయి. కొందరిలో మాత్రం ఇవే జీవితాంతం గుర్తుండిపోయి వేధిస్తూ ఉంటాయి. నిద్రకు ఉపక్రమించగానే బూచాడు వస్తున్నట్టు, ఎత్తుకపోతున్నట్టు ఊహించుకుంటూ భయపడిపోతారు. ఈ కారణంగా నిద్రంటేనే ముఖం చిట్లించుకునే స్థితికి చేరుకుంటారు. దీన్నే ‘సోమ్నిఫోబియా’ అంటారు. -
ఫోబియా... నిత్యం వెంటాడే శత్రువు
భయం భయం భయం... మనల్ని ధైర్యంగా వెంటాడే శత్రువు. మనం పుట్టిన తర్వాత అది మనలో ఎప్పడు పుడుతుందో చెప్పలేం. కానీ ఒకసారి పుట్టిందంటే చనిపోయే వరకు ఎంతో కొంత వెంటాడుతూనే ఉంటుంది. తొమ్మిదిశాతం మంది ఏదో ఒక ఫోబియాతో బాధపడుతుంటారని అమెరికాలోని జాతీయ మానసిక ఆరోగ్య సంస్థ చెప్తోంది. ప్రధానంగా కనిపించే పది ఫోబియాలను చూద్దాం. ⇒ ఆక్రోఫోబియా... ఎత్తై ప్రదేశాలంటే భయపడడాన్ని ఇలాగంటారు. వీరిలో కొంతమంది విమానం ఎక్కాలన్నా భయపడతారు. దానిని ఏరో ఫోబియా అంటారు. ⇒ క్లాస్ట్రో ఫోబియా... మూసి ఉన్న ప్రదేశాలంటే భయం. గదిలో తలుపులు మూసుకోవడానికి కూడా భయపడతారు. వీరు క్లోజ్డ్ లిఫ్ట్‌లో వెళ్లడానికి భయపడతారు. ⇒ అగోరా ఫోబియా... బహిరంగ ప్రదేశాలను చూసి భయపడడం. ఇల్లు దాటి బయటకు రారు. సమావేశాలకు వెళ్లాలన్నా, ఆఖరుకు మార్కెట్కెళ్లాలన్నా భయపడుతుంటారు. అలా చెప్పకుండా ఏదో వంకలు చెబుతూ ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ⇒ నైక్టోఫోబియా... చీకటంటే భయం. చీకట్లో భయపడడం బాల్యంలో సహజమే. పెద్దయ్యేకొద్దీ ఆ భయం తగ్గిపోవడం సహజం. అలా తగ్గకపోతే దానిని ఫోబియాగా గుర్తించాలి. ⇒ ఓఫిడియో ఫోబియా... పాములంటే భయం. పామును చూస్తే అందరూ భయపడతారు. కానీ ఈ ఫోబియా ఉన్న వారికి పాము తలంపే చెమటలు పట్టిస్తుంది. ⇒ ఆరాక్నో ఫోబియా... సాలీడును చూస్తే భయపడడం. మనలో చాలామందికి సాలీడు ఒంటి మీద పడితే కొత్త బట్టలు వస్తాయని ఓ నమ్మకం. పిల్లలు సాలీడును ఒంటి మీద వేసుకుంటుంటారు కూడా. అయితే సాలెపురుగంటేనే భయపడే వాళ్లూ ఉంటారు. ⇒ పానో ఫోబియా... ఇది మెడికల్ ఫోబియా. ఇంజెక్షన్ సూదిని చూసి భయపడడం. ఎంత పెద్ద వాళ్లయినా సరే ఇంజెక్షన్ వేయించుకోవాలంటే భయపడుతుంటారు. ⇒ ఆస్ట్రా ఫోబియా... మెరుపు, వెలుతురంటే భయం. వర్షం మొదలైందంటే... ఇల్లు దాటి బయటకు వెళ్లరు. గదిలో దూరి తలుపులు వేసుకుని కళ్లు మూసుకుంటారు. ⇒ నోసో ఫోబియా... ఏదో జబ్బు ఉందనే అపోహతో కూడిన భయం. ఈ ఫోబియా ఉన్న వారిలో ఎక్కువ మంది వైద్యవిద్యార్థులే. కోర్సులో అనేక రోగాలను తెలుసుకుంటారు కాబట్టి దేహంలో ఏ చిన్న మార్పు కనిపించినా అది ఏ రోగ లక్షణాలకు సరిపోలుతుందా అని అన్వయించుకుంటూ ఉంటారు. ⇒ హైడ్రో ఫోబియా... నీటిని చూసి భయపడడం. ఈత రాకపోవడం వల్ల మునిగిపోతామనేటువంటి సాధారణ భయం ఉంటుంది. నీటి ప్రమాదాలను దగ్గరగా చూడడం వల్ల భయం ఏర్పడవచ్చు. అలాగే రేబిస్ వ్యాధికి (కుక్క కాటు) గురైనప్పుడు నీటిని చూస్తే విపరీతంగా ఆందోళన చెందుతూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ఈ ఫోబియాలు తీవ్రమైతే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కాబట్టి గుర్తించిన వెంటనే నిపుణులతో కౌన్సెలింగ్ తీసుకుని ఆ భయాలను దూరం చేసుకోవాలి. -
చంద్రబాబుకు వైఎస్జగన్ ఫోబియా