అనుక్షణం భయపడుతూనే ఉంటా.. | Actors face many demons everyday, says Radhika Apte | Sakshi
Sakshi News home page

అనుక్షణం భయపడుతూనే ఉంటా..

Published Thu, May 26 2016 6:19 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

అనుక్షణం భయపడుతూనే ఉంటా.. - Sakshi

అనుక్షణం భయపడుతూనే ఉంటా..

ముంబై: 'కబాలీ' మూవీతో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించే గొప్ప అవకాశాన్ని రాధికా ఆప్టే దక్కించుకుంది. 'బదలాపూర్' తో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు సెలబ్రిటీ స్టేటస్ ను ఎంజాయ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది. సెలబ్రిటీగా ఉండటం చాలా కష్టమంటోంది ఈ హీరోయిన్. సెలబ్రిటీలు, అందులో ముఖ్యంగా నటీనటులకు ప్రతిరోజూ ఏదో విషయంలో కొత్త భయాలు పుట్టుకొస్తాయని అభిప్రాయపడింది. అనుకోని ఆపదలు(వదంతులు) తారలకు నిత్యం ఎదురవుతునే ఉంటాయని అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పింది.

ఇంతకు ఈ భయం గోల ఏంటనుకుంటున్నారు కదూ... రాధిక ఆప్టే కీలక పాత్రలో కనిపించిన మూవీ 'ఫోబియా' (భయం) రేపు విడుదలకు సిద్ధంగా ఉంది. పవన్ కృపలానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ గురించి రాధికా మాట్లాడుతూ.. భయాలు సాధారణ వ్యక్తుల కంటే ఓ మోస్తరు గుర్తింపు ఉన్న వారికి ఎక్కువగా ఉంటాయని చెప్పుకొచ్చింది. ప్రతి సమస్యను ఎదుర్కొంటూ పోతేనే ముందుకెళ్లడం సాధ్యమవుతుందని, మరిన్ని విజయాలు సొంతం చేసుకోవచ్చని అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement