radhika apte
-
పని చేసే తల్లుల బ్రెస్ట్ ఫీడింగ్ పాట్లు..! నటి రాధికా ఆప్టే సైతం..
ఎంత ఏఐ టెక్నాలజీ, చాటీజీపీటి వంటి సరికొత్త టెక్నాలజీలు వచ్చినా కొన్ని విషయాల్లో సమాజం తీరు విశాలంగా ఉండటం లేదు. సమాన అవకాశాలు, లింగ సమానత్వం అంటారే గానీ వర్కింగ్ మహిళలు అమ్మగా మారాక ఇవ్వాల్సిన వెసులుబాటు అటుంచి కనీస మద్దతు లేకపోవడం బాధకరం. ఇంకా చాలామంది తల్లలు తమ చిన్నారులకు పాలిచ్చేందుకు జంకే పరిస్థితులే ఎదురవ్వుతున్నాయి. ముఖ్యంగా పనిచేసే తల్లలు ఆరునెలల మెటర్నీటి సెలవుల అనంతరం ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సిందే. అలా తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లోకి వచ్చే తల్లులు తమ బిడ్డకు పాలిచ్చేందుకు ఎలాంటి పాట్లు పడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బ్రెస్ట్ పంపింగ్ మిషన్ల సాయంతో స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. పని ప్రదేశాల్లో సహ ఉద్యోగుల మద్దుతు గానీ అందుకోసం ప్రత్యేక ప్రదేశం గానీ అందుబాటు లేక విలవిలలాడుతున్నారు అతివలు. ఇదే విషయాన్ని బాలీవుడ్ నటి రాధికా ఆప్టే సైతం వెల్లడించింది. అలాంటి పరిస్థితులను కాబయే తల్లులు ఎలా అధిగమించాలి..? దీని గురించి నిపుణుల ఏమంటున్నారు తదితరాల గురించి తెలుసుకుందామా.ప్రతిష్టాత్మకమైన BAFTA అవార్డుల కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటి రాధికా ఆప్టే అందమైన డిజైనర్ వేర్‌తో సందడి చేసింది. ఓ పక్కన తల్లిగా తన బ్రెస్ట్ పంపింగ్ షెడ్యూల్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ఈవెంట్లో పాల్గొంది. ఆ విషయాన్నే రాధికా ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. పని ప్రేదేశంలో నాలాంటి కొత్త తల్లులు బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బుందులు పడుతుంటారు. అందులోనూ సినీ పరిశ్రమలో అస్సలు మద్దతు ఉండదు. కానీ నాకు సపోర్ట్ లభించడమే గాక హ్యపీగా తన రొమ్ము పాల పంపింగ్ షెడ్యూల్‌కి ఆటంకం లేకుండా ప్రముఖ మోడల్ నటాష తనకెంతో సహాయం చేసిందని చెప్పుకొచ్చింది. ఒక నటిగా రాధికా వంటి వాళ్లకు కూడా పనిప్రదేశాల్లో ఇలాంటి సమయంలో ఇబ్బందుల తప్పవనే విషయం స్పష్టమవుతోంది. ఇక సామాన్య మహిళలైతే అంతకు మించి సమస్యలు ఫేస్ చేస్తుంటారు. ఎందరో మహిళలు ఈ విషయమై ఎన్నో సార్లు సోషల్ మీడియా వేదికగా మొరపెట్టుకున్నారు కూడా . నిపుణులు ఏమంటున్నారంటే..తల్లిపాలు సరఫరా-డిమాండ్ ప్రాతిపదికన పనిచేస్తుందని చెబుతున్నారు గైనకాలజీ నిపుణులు. కొత్త తల్లులకు పాలివ్వడం లేదా రొమ్ము పంపింగ్ షెడ్యూల్‌కి కట్టుబడి ఉండటం అనేది అత్యంత ముఖ్యమైనది. అంటే దీని అర్థం పాలను టైం ప్రకారం పంపింగ్ లేదా ఫీడ్ చేస్తే శరీరం ఎక్కువ పాలను ఉత్పత్తి చేస్తుందట, లేదంటే మానవ శరీరం తక్కువ పాలను ఉత్పత్తి చేయాలనే సంకేతాన్ని అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా శిశువుకు దీర్ఘకాలం పాలను కొనసాగించే సామార్థ్యాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తల్లిపాల వల్ల కలిగే లాభాలు..తల్లి పాలు ఇవ్వడం వల్ల రొమ్ము, అండాశయ కేన్సరలు వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందట. అదీగాక తల్లిపాలు శిశువు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడే పోషకాలు, యాంటీబాడీలు, ఎంజైమ్‌లు ఉంటాయి. తల్లిపాలను తాగే పిలలలకు చెవి ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధులు, జీర్ణ సమస్యలతో బాధపడే అవకాశాలు తక్కువగా ఉంటాయట. అలాగే తల్లి పాలిచ్చే సమయంలో శిశువుకి చర్మం నుంచి చర్మానికి సంపర్కం, భావోద్వేగ సంబంధం భద్రతను అందిస్తుందట. ఉద్యోగినులు ఆరోగ్యాన్ని, పాల సరఫరాను కాపాడుకోవాలంటే..పని ప్రదేశాల్లో సహజంగా కొత్త తల్లులు ఇలాంటి విషయంలో అసౌకర్యంగా సిగ్గుగా ఫీలవ్వుతుంటారు. ముందు అలాంటి వాటిని పక్కన పెట్టి..విరామ సమయంలో పంపింగ్ సెషన్ ప్లాన్ చేసుకునేలా ఏర్పాటు చేసుకోండి. అలాగే గోప్యత కోసం కార్యాలయంలో సరైన సౌకర్యం లేదా ప్రదేశం గురించి కార్యాలయం యజమానులతో మాట్లాడండి. అసౌకర్యం ఏర్పడకుండా ఎవ్వరినీ లోపలకి రానివ్వకుండా చేసుకోండి. ముఖ్యంగా పాలను సరిగా నిల్వ చేయండి. అలాగే హైడ్రేటెడ్‌గా ఉండేలా బాగా తినండి, తాగండి. అందుకోసం సహోద్యోగి, లేదా భాగస్వామి మద్దతు తోపాటు ఆఫీస్ హెడ్ సహాయం కూడా తీసుకోండి. ఆఫీస్ నిర్వాహకులతో సామరస్యపూర్వకంగా మాట్లాడి తల్లిపాలు ఇవ్వడానికి అనుకూలమైన ప్రదేశం ఇచ్చేలా లేదా వెసులబాలు కల్పించమని కోరండి.(చదవండి: ఫస్ట్ విమెన్ స్కూబా టీమ్) -
ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా..: రాధికా ఆప్టే
నవమాసాలు మోయడం పిల్లల్ని కనడం అంత ఈజీ కాదంటోంది నటి రాధికా ఆప్టే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాధిక మాట్లాడుతూ.. మేమప్పుడే పిల్లల్ని ప్లాన్ చేయలేదు, అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. అది తెలుసుకుని షాకయ్యాను. డెలివరీకి వారం ముందు ఒక ఫోటోషూట్ చేశాను. నేనేంటి? ఇలా కనిపిస్తున్నాను అని చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. .సడన్‌గా ఉబ్బిపోయా..ఎందుకంటే అంతకుముందెప్పుడూ అంత బరువు పెరగలేదు. సడన్‌గా ఉబ్బిపోయాను. సరిగా నిద్రుండకపోయేది, ఉన్నట్లుండి నొప్పులు వచ్చేవి. అవన్నీ అనుభవిస్తున్నకొద్దీ నా ఆలోచనా విధానం మారిపోయింది. డెలివరీ అయి రెండు వారాలు కూడా కాలేదు.. అప్పుడే నా శరీరం మళ్లీ వేరేలా కనిపిస్తోంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు చూస్తుంటే అప్పుడెందుకు నాపై నేను అంత చికాకుగా ఉన్నాననిపిస్తోంది. అప్పుడు చిరాకుగా, ఇప్పుడు అందంగా!నా శరీరంలోని మార్పులు ఇప్పుడు నాకు అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను ఎప్పటికీ జ్ఞాపకంగా దాచుకుంటాను. ఒకరికి జన్మనివ్వడం గొప్ప విషయమే! కానీ ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎవరూ బయటకు చెప్పుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కాగా రాధికా ఆప్టే డిసెంబర్ మొదటివారంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ తదితర చిత్రాల్లో ఈమె హీరోయిన్గా నటించింది.చదవండి: బిగ్‌బాస్: మూడు రోజులకే రూ.2.5 కోట్లు! ఎవరికో తెలుసా? -
బేబీ బంప్‌తో రాధిక.. ఇంకా పెళ్లి మూడ్‌లోనే శోభిత
జిమ్‌లో జుత్తుతో ఆటాడేస్తున్న మెగా కోడలు లావణ్యపెళ్లి మూడ్‌లో శోభిత.. వైజాగ్‌లో పార్టీ & సెలబ్రేషన్స్బేబీ బంప్ ఫొటోల్ని బయటపెట్టిన హీరోయిన్ రాధికా ఆప్టేపట్టుచీరలో పెళ్లి కూతురిలా కనిపిస్తున్న మాళవిక మోహనన్ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ డోస్.. చూస్తే అంతేభర్తతో క్యూట్ అండ్ స్వీట్‌గా బర్త్ డే విషెస్ చెప్పిన వరలక్ష్మిసంప్రదాయబద్ధమై లుక్‌లో తెలుగమ్మాయి పూజిత పొన్నాడ View this post on Instagram A post shared by Lavanyaa konidela tripathhi (@itsmelavanya) View this post on Instagram A post shared by Ashish Shah (@ashishisshah) View this post on Instagram A post shared by Rathika RavindeR (@rathikaravinder) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Lahari Shari (@lahari_shari) View this post on Instagram A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Nayan🇮🇳 (@nayansarika_05) View this post on Instagram A post shared by Alaya F (@alayaf) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by aaliyah (@aaliyahkashyap) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Ahaana Krishna (@ahaana_krishna) View this post on Instagram A post shared by Darling Krishna (@darling_krishnaa) View this post on Instagram A post shared by Lijomol Jose (@lijomol) View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Shama Sikander (@shamasikander) View this post on Instagram A post shared by Pujiitaa Ponnada (@pujita.ponnada) -
బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్గా చేసిన రాధికా ఆప్టే శుభవార్త చెప్పింది. వారం క్రితం తాను ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని ఇప్పుడు బయటపెట్టింది. పాపకి పాలు పడుతున్న ఫొటోని పోస్ట్ చేసి, డెలివరీ తర్వాత వర్క్ మీటింగ్ అని ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈమెకు నటీనటులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(ఇదీ చదవండి: ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలనటి)తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసిన రాధికా ఆప్టే.. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వివాహ జరగ్గా.. 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టిన రాధిక.. తెలుగులో 'లెజెండ్', 'లయన్', 'రక్త చరిత్ర' తదితర సినిమాల్లో హీరోయిన్గా నటించింది. రెగ్యులర్ హీరోయిన్ పాత్రల కంటే న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లోనూ ఈమె నటించడం విశేషం. వాటిపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.(ఇదీ చదవండి: తన వన్ సైడ్ ప్రేమకథ బయటపెట్టిన రాజమౌళి) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) -
ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు
నటి రాధికా ఆప్టే వచ్చే నెలలో (2024 డిసెంబరు) తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో తన కొత్త సినిమా ‘సిస్టర్ మిడ్నైట్’ ప్రీమియర్ షో సందర్భంగా బేబీబంప్ ఫోటోలతో దర్శనమిచ్చి ఫ్యాన్స్‌కు శుభవార్త అందించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రెగ్నెన్నీ బాధల గురించి చెప్పుకొచ్చింది.గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తను అనుభవించిన భావోద్వేగం, గందరగోళం, నిరాశ లాంటి ఫీలింగ్స్ గురించి ఏకరువు పెట్టింది. ప్రెగ్నెన్సీ అని తెలిసిన తరువాత రెండు వారాల పాటు తనకు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని చెప్పింది. అంతేకాదు ఈమూడు నెలలు 40-డిగ్రీల వేడిలో షూటింగ్ చేయాల్సి వచ్చింది. మరోవైపు భయంకరమైనకడుపు ఉబ్బరం, తీవ్రమైన మలబద్ధకం, వాంతులతో బాధ పడినట్టు పేర్కొంది. బిడ్డ కడుపులో ఉన్నపుడు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని అందరూ చెప్పారు. కానీ తనకు మాత్రం నరకం కనిపించిందని తెలిపింది. పిల్లల్ని కనాలన్న ప్లానే లేదు. పైగా గర్భధారణ అంటే ఏమిటో, గర్భవతిగా ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో, ఎలా ఉంటుందో తెలియదు. శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు. అలాంటి సమయంలో నేను గర్భం దాల్చాను. గర్భధారణ అనే దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు కాబట్టి, ఎవరూ నిజం చెప్పరు. కొంతమందికి ఇదంతా చాలా సులువుగానే అయిపోతుంది. కానీ కొంతమందికి అలాకాదు. గర్భం ధరించడం బిడ్డల్ని అంటే ఫన్కాదు. ఇది చాలా సబ్జెక్టివ్ కేసు. శరీరం అనేక మార్పులకు లోనవుతుంది అంటూ చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.కాగా రాధిక ఆప్టే 2012లో బ్రిటిష్ మ్యుజిషియన్ బెనెడిక్ట్‌ను వివాహమాడింది. పెళ్లంటే అస్సలు ఇష్టం లేదని, విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకుంటే వీసా సులభంగా వస్తుందన్న ఉద్దేశంతోనే బెనెడిక్ట్‌ను వివాహం చేసుకున్నానని, కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
పెళ్లైన 12 ఏళ్లకు గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్
బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే (39) బేబీ బంప్ ఫోటోతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. తన కొత్త సినిమా 'సిస్టర్ మిడ్నైట్' లండన్‌లో ప్రీమియర్ షో జరుగుతుండగా రాధికా ఆప్టే కూడా పాల్గొంది. కరణ్ కంధారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 19న డైరెక్టర్స్ ఫోర్ట్‌నైట్ కేన్స్‌లో ప్రదర్శించబడింది. 2024 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రం రెండు విభాగాల్లో నామినేషన్ దక్కించుకుంది. అయితే, ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 20న విడుదల కానుంది.రాధికా ఆప్టే అమ్మ కాబోతుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. అయితే, తల్లి కాబోతున్న విషయాన్ని ఇప్పటివరకు ఆమె గోప్యంగానే ఉంచింది. నవంబర్ నెలలో పండంటి బిడ్డకు ఈ బ్యూటీ జన్మనివ్వనుంది. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆమె తల్లి కానున్నడంతో ఆభిమానులు సంతోషంతో శుభాకాంక్షలు చెబుతున్నారు.థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఇటీవల కాలంలో న్యూడ్, సెమీ న్యూడ్ చిత్రాల్లో ఆమె నటించడం గమనార్హం. View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) -
ఐదేళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన 'రాధికా ఆప్టే' బోల్డ్ సినిమా.
రాధికా ఆప్టే.. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ నటిగా తన ఉనికిని చాటుకుంటున్న ఈమె 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 'స్లమ్‌డాగ్ మిలియనీర్' సినిమాతో పాపులర్ అయిన దేవ్ పటేల్‌తో ఈ చిత్రంలో మెప్పించింది. బ్రిటీష్-అమెరికన్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా 2019లో విడుదలైంది. కానీ ఇండియాలో విడుదల కాలేదు. చివరకు ఓటీటీలో కూడా భారత్ యూజర్స్‌కు అందుబాటులో లేదు.మైఖేల్ వింటర్బాటమ్ దర్శకత్వం వహించిన 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తాజాగా నెట్‌ప్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలలో విడుదలైంది. సుమారు ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో కొనసాగుతుంది.ఈ సినిమాలో రాధికా ఆప్టే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న సీన్ విడుదలకు ముందే లీక్ కావడంతో అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై నటి రాధికా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా టాపిక్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఈ సినిమాలో రాధికా ఆప్టే పూర్తిగా దుస్తులు తొలిగించిన సీన్స్ ఉండటంతో 'ది వెడ్డింగ్ గెస్ట్' చిత్రం బాగా వైరల్ అయింది.ఆ సీన్‌పై రాధికా ఆప్టే ఏమన్నారంటేబోల్డ్ సీన్స్‌లో నటించే విషయంలో తనకు ఎలాంటి భయాలు ఉండవని 'ది వెడ్డింగ్ గెస్ట్' సినిమా విడుదల సమయంలో రాధికా తెలిపింది. ఈ సినిమా కోసం ఆమె దుస్తులు లేకుండా కనిపించింది. ఆ విషయం గురించి ఓపెన్‌గానే మాట్లాడింది. చిన్నప్పటి నుంచి ఎన్నో హాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగడం. ఆపై విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం చూశానని అప్పట్లో చెప్పుకొచ్చింది. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలని ఆమె ప్రశ్నించింది. ఓ నటిగా తన శరీరం కూడా ఒక సాధనమేనని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. -
టాలీవుడ్లో పరిస్థితి మరీ దారుణం.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
రాధికా ఆప్టే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేసింది. మొదట వాహ్, లైఫ్ హో తో ఐసీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. ఆ తర్వాత టాలీవుడ్లో రాంగోపాల్ వర్మ చిత్రం రక్త చరిత్రతో ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్, లయన్ సినిమాలతో మెప్పించింది. ఇటీవల విజయ్‌సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అతికొద్దిమందిలో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే.. తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాధికా ఆప్టే టాలీవుడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. రాధికా ఆప్టే మాట్లాడుతూ..'తెలుగు పరిశ్రమలో నేను చాలా కష్టపడ్డా. కానీ తెలుగు సినిమాల్లో హీరోయిన్లను చూసే విధానం చాలా దారుణం. టాలీవుడ్ సినిమాల్లో మహిళల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. సెట్లో మూడో వ్యక్తిగా ట్రీట్ చేస్తారు. ముఖ్యంగా తెలుగులో పురుష ఆధిపత్యం ఎక్కువ. అంతేకాదు.. ఇతర నటీనటులను అడగకుండానే వారికి ఇష్టమొచ్చినట్లు ఎప్పుడు పడితే అప్పుడు షూట్‌ను రద్దు చేస్తారు. అలా నేను చాలాసార్లు ఇబ్బందులు పడ్డాను కూడా. కానీ దానికి అక్కడే ఎండ్ కార్డ్ పడింది. అక్కడ నా అవసరం అంతవరకే అని గ్రహించా.' అంటూ విమర్శలు చేసింది. దీంతో రాధికా ఆప్టే చేసిన కామెంట్స్‌పై సోషల్ మీడియా వేదికగా టాలీవుడ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #RadhikaApte about TELUGU Industry 😳😳😳😳 pic.twitter.com/YFLRroAvHX — GetsCinema (@GetsCinema) February 16, 2024 -
నెల తిరగకుండానే ఓటీటీలోకి రానున్న విజయ్ సేతుపతి థ్రిల్లర్ సినిమా
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు అంధాదూన్ ఫేమ్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించాడు. బాలీవుడ్లో డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌ను మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లర్గా మంచి గుర్తింపు ఉంది. అంధాదూన్, బద్లాపూర్ వంటి థ్రిల్లర్ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్‌కు థ్రిల్లర్ జోనర్ కథలే మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.దీంతో ఆయన మళ్లీ అదే జోనర్‌లోనే మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని తెరకెక్కించాడు. జనవరి 12న ఈ మూవీ రిలీజైంది. భారీ అంచనాలతో విడుదలైన మెర్రీ క్రిస్మస్ కలెక్షన్స్ పరంగా అంతగా రాబట్టలేకపోయింది. కానీ సినిమా అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో మెర్రి క్రిస్మస్ మూవీ ఓటీటీలోకి రానుందని ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా మంచి టాక్ తెచ్చుకున్న ఈ మూవీని విడుదలకు ముందే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్.30 రోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేసుకునేలా ఒప్పందం కూడా చేసుకుందట. దీంతో ఫిబ్రవరి 9న మెర్రీ క్రిస్మస్ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం. ఈ తేదిలో స్ట్రీమింగ్ కాకుంటే ఫిబ్రవరి 16న గ్యారెంటీగా ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అవుతుందని టాక్. మ్యాచ్ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు.తెలుగులో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. -
తాగడానికి నీళ్లు కూడా లేవు, బంధించేశారు: నటి
రాధికా ఆప్టే.. అందాల ఆరబోతకు కేరాఫ్ అడ్రస్. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటిస్తూ నటిగా తన ఉనికిని చాటుకుంటున్న ఈమె ఇటీవల విజయ్‌సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. కాగా రాధికా ఆప్టే ఇటీవల విమానాశ్రయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. బంధించారు ఉదయం 8.30 గంటలకు విమానంలో వెళ్లాల్సి ఉంది. కానీ 10.15 అవుతున్నా విమానం ఇంకా బయలుదేరలేదు. కానీ విమానం బయలుదేరుతోందంటూ సిబ్బంది ప్రయాణికులందరినీ ఏరో బ్రిడ్జ్ ఎక్కించి దానిని మూసివేశారు. ప్రయాణికుల్లో పిల్లలు, వృద్ధులు కూడా ఉన్నారు. అందరినీ గంటకు పైగా ఏరో బ్రిడ్జ్‌లోనే ఉంచారు. అందులో కనీస సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడ్డాము. సెక్యూరిటీ ఏరో బ్రిడ్జ్ డోర్ కూడా తెరవలేదు. తాగడానికి నీళ్లు కూడా లేవు అసలు అక్కడ పనిచేసే సిబ్బందికి కూడా ఏం జరుగుతుందో తెలియడం లేదు. అలా మధ్యాహ్నం 12 గంటల వరకు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తాగడానికి మంచి నీరు లేదు, వాష్‌రూమ్‌కు వెళ్లడానికి కూడా వీల్లేదు. ఇదో వింత అనుభవం అని పేర్కొంది రాధికా ఆప్టే. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) చదవండి: హారర్ హిట్ 'అరుంధతి'కి 15 ఏళ్లు.. ఆ సంగతి మీకు తెలుసా? -
దూకుడు పెంచిన కీర్తిసురేష్
నటి కీర్తిసురేష్ దూకుడు ఇప్పుడు మామూలుగా లేదు. మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఈ కేరళ బ్యూటీ ఇటీవల బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మధ్య వరుస ఫ్లాప్‌లతో సతమతం అయిన కీర్తిసురేష్‌కు తెలుగులో నాని సరసన నటించిన దసరా చిత్రం మళ్లీ విజయపథం వైపు మళ్లించింది. అదేవిధంగా తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో జతకట్టిన మామన్నన్ చిత్రం కూడా మంచి విజయాన్ని అందించింది. దీంతో మళ్లీ బిజీ అయిపోయింది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాలు చేతిలో ఉన్నాయి. వీటిలో జయంరవి సరసన నటిస్తున్న సైరన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇది కాకుండా రఘుదాదా, రెయిన్బో చిత్రాల్లో నటిస్తోంది. కాగా తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ హిందీలో నిర్మిస్తున్న చిత్రంలో కీర్తిసురేష్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా మరో హిందీ వెబ్ సీరీస్‌లో కూడా ఈ బ్యూటీ నటించడం విశేషం. ఈమె నటిస్తున్న తొలి వెబ్ సీరీస్ ఇదే అన్నది గమనార్హం. 'అక్కా' అనే పేరు నిర్ణయించిన ఈ వెబ్ సీరీస్‌లో బోల్డ్ నటి రాధికాఆప్టే కూడా నటించడం విశేషం. కాగా వెబ్‌సీరీస్‌కు సెన్సార్ సమస్య లేకపోవడంతో గ్లామర్ సన్నివేశాలు అధికంగా చోటు చేసుకోవడం చూస్తున్నాం. ఇంతకుముందు కథానాయి కలు తమన్నా, సమంత వెబ్‌సీరీస్‌లో చాలా బోల్డ్‌గా నటించి ఉచిత ప్రచారం పొందిన విషయం తెలిసిందే. దీంతో కీర్తిసురేష్, రాధికాఆప్టే కలిసి నటిస్తున్న 'అక్కా' వెబ్ సీరీస్‌లో కూడా గ్లామరస్ సన్నివేశాలు చోటు చేసుకుంటాయనే భావన వీరి అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. -
వెబ్ ఎంట్రీ
కీర్తీ సురేష్, రాధికా ఆప్టే ప్రధాన తారాగణంగా పీరియాడికల్ రివేంజ్ థ్రిల్లర్‌గా ‘అక్క’ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. ధర్మరాజ్ శెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, ఆదిత్యా చోప్రా ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ మొదలైనట్లు బాలీవుడ్ సమాచారం. ‘‘ఇందులో కీర్తీసురేష్, రాధికా ఆప్టే పాత్రలు పోటాపోటీగా ఉంటాయి. వీక్షకులను ఆకట్టుకునేలా ఈ సిరీస్ సాగుతుంది’’ అనియూనిట్ పేర్కొంది. కాగా కీర్తీ సురేష్‌కు తొలి ఓటీటీ ప్రాజెక్ట్ ‘అక్క’. వరుణ్ధావ¯Œ హీరోగా నటిస్తున్న ఓ బాలీవుడ్ సిని మాలో Mీ ర్తి ఓ హీరోయి¯Œ గా నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. -
ప్రత్యేక అతిథిగా...
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌ల వెండితెర క్రిస్మస్ వేడుకల్లో రాధికా ఆప్టే ప్రత్యేక అతిథిగా సందడి చేశారట. బాలీవుడ్ దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తాజా చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’లో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ లీడ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక అతిథి పాత్ర కోసం రాధికా ఆప్టేను ఎంపిక చేశారట. ఆమె పాత్ర చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. హిందీ, తమిళ భాషల్లో రూపొంది, తెలుగులో కూడా విడుదల కానున్న ఈ సినిమా కొత్త విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి గత ఏడాది క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు. ఇక శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ‘బదలాపూర్’, ‘అంథాధూన్’లో రాధికా ఆప్టే హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఆడవాళ్లు మాత్రమే ఇంటిపనులు ఎందుకు చేయాలి: హీరోయిన్
సెన్సేషన్ బ్యూటీగా రాధికా ఆప్టేకు పేరుంది. ధోని చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ వరకు తన సత్తా చాటుకుంటోంది. ఈమె నటనే కాదు భావాలు సంచలనంగా ఉంటాయి. తాను అనుకున్నది నిర్భయంగా వ్యక్తం చేసే నటి ఈమె. అదే విధంగా హీరోలతో సమానంగా హీరోయిన్‌కు పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. చదవండి: హీరోయిన్‌తో వీడియో కాల్ మాట్లాడాలా? జస్ట్ రూ. 14వేలు చెల్లించండి ఇలా తరచూ వార్తల్లో నిలిచే ఆమె తాజాగా సమానత్వం గురించి ఒక భేటీలో మాట్లాడింది. ఆడ, మగ వారి వారి వృత్తిలో సమానంగా సంపాదిస్తున్న రోజులివి. అయినప్పటికీ ఉద్యోగం ముగించుకుని ఇంటికి రాగానే ఇంటి బాధ్యతలు, కుటుంబ సభ్యులకు అవసరం అయిన అన్నింటినీ సమకూర్చుతుంది.. ఇదేం సమానత్వం? నా తండ్రికి ఆసుపత్రి ఉంది, అందులో తన తల్లి సేవలు అందించేవారు. అయితే ఇంటికి రాగానే కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహించేది. ఇలా ఆడవారే ఇంటి పనులు చేయాలని వారి బాల్యం నుంచే అలవాటు చేస్తున్నారు. మహిళలు అంతగా త్యాగం చేయాల్సిన అవసరం లేదు. కుటుంబంలోని వారంతా తలా ఒక పనిచేస్తే సరిపోతుంది అంటూ రాధిక ఆప్టే పేర్కొంది. చదవండి: ఏజెంట్‌కు అన్యాయం.. అక్కడ థియేటర్లు బ్లాక్ చేశారు: నిర్మాత -
నీ ముక్కు సరిగా లేదని విమర్శించారు: హీరోయిన్
నిజాన్ని నిర్భయంగా మాట్లాడే అతికొద్దిమందిలో హీరోయిన్ రాధికా ఆప్టే ఒకరు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసిన ఆమె కెరీర్ తొలినాళ్లలో తిరస్కరణకు గురైంది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న చేదు సంఘటనలను వెల్లడించింది. రాధికా ఆప్టే మాట్లాడుతూ.. 'మొదట్లో నన్ను అంతా పల్లెటూరి అమ్మాయిలాగే భావించారు. కానీ బద్లాపూర్ సినిమాతో వారి అభిప్రాయాన్ని పటాపంచలు చేశాను. కానీ ఈ సినిమాతో నేను హాట్ డోస్ కామెడీ సినిమాలు మాత్రమే చేస్తానని భావించారు. దీంతో అలాంటి కథలకు ఓకే చెప్పడం మానేశా. కేవలం మూడు, నాలుగు కిలోల ఎక్కువ బరువున్నానని నన్ను ఓ సినిమా నుంచి తీసేశారు. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో ఇలా చాలా జరుగుతాయి. నీ ముక్కు సరిగా లేదు, బ్రెస్ట్ సైజు పెద్దగా లేదు. ముందు వాటిని సరిచేసుకోవచ్చు కదా? అనేవారు. ఇలా చాలానే ఫేస్ చేశాను' అని చెప్పుకొచ్చింది. కాగా రాధికా ఆప్టే.. వాహ్, లైఫ్ హో తో ఐసీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. రక్త చరిత్రతో తెలుగులో, ధోని సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. రజనీకాంత్ సరసన కబాలి సినిమాలో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, హిందీ, బెంగాలీ, మరాఠీ, మలయాళం, ఇంగ్లీష్ చిత్రాల్లో అనేక భాషలు చేసింది నటి. ప్రస్తుతం ఆమె నటించిన మిసెస్ అండర్ కవర్ ఏప్రిల్ 14 నుంచి జీ5లో ప్రసారం కానుంది. -
హీరోలకు సమానంగా రెమ్యునరేషన్, గౌరవం ఇవ్వాలి: రాధికా ఆప్టే
సంచలన నటీమణుల్లో రాధిక ఆప్టే ఒకరు. నటుడు ప్రకాష్ రాజ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ధోని చిత్రం ద్వారా రాధిక ఆప్తే కోలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తరువాత రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన కబాలి, కార్తీ సరసన ఆల్ ఇన్ ఆల్ అళగురాజా వంటి చిత్రాలతో పాటు చిత్తిరం పేసుదడి –2, వెట్రిసెల్వన్ తదితర చిత్రాలలో నటించి తమిళ సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. అదే విధంగా కొన్ని చిత్రాలలో నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలలో నటిస్తోంది. అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకాడని రాధికా ఆప్టే తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ సినిమా రంగంలో నటిస్తున్న హీరోయిన్లకు, ఇతర మహిళలకు పారితోషికం, పేరు, ఖ్యాతి ఇవన్నీ విషయాల్లోనూ హీరోలకు సమానంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఈ రంగంలో మహిళలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పింది. ఇది అందరూ స్వాగతించాల్సిన విషయం అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అదే విధంగా ప్రస్తుతం హీరోయిన్లకు ప్రాముఖ్యత ఉన్న కథా చిత్రాలూ వస్తున్నాయని అన్నారు. ఇది సంతోషకరమైన విషయమని పేర్కొన్నారు. సినిమా రంగంలోనే కాకుండా అన్ని రంగాలలోనూ ఆడ, మగ అనే భేదం లేదు అనే పరిస్థితి నెలకొందని, మహిళలు సమానత్వం కోసం పోరాడుతున్నారని రాధిక స్పష్టం చేశారు. -
నటనకు గుడ్‌బై? దర్శకురాలిగా మారనున్న రాధికా ఆప్టే?
తమిళసినిమా: నటి రాధికా ఆప్టే గురించి పరిచయం అక్కర్లేదు. అందాల ఆరబోతలో ఈ అమ్మడిని మించిన వారు ఉండరేమో. తమిళంలో ధోని చిత్రంతో నటిగా రంగ ప్రవేశం చేసిన ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు తదితర భాషల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసుకుంది. తమిళంలో రజనీకాంత్ సరసన కబాలి చిత్రంలో నటించి పేరు తెచ్చుకున్నారు. తర్వాత బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీ అయ్యారు. అయితే తాను నటించిన కథానాయకులపైనే విమర్శలు చేస్తూ వివాదాస్పద నటి అనే ముద్ర వేసుకుంది. అలాంటి ఈ నటి దృష్టి ఇప్పుడు దర్శకత్వంపై పడింది. ఇప్పటి వరకు ఇతరుల డైరక్షన్లో నటించిన ఈ బ్యూటీ త్వరలో హీరోలని డైరెక్ట్ చేయడానికి సిద్ధం అవుతున్నారట. దీని గురించి ఒక భేటీలో రాధికా ఆప్టే మాట్లాడుతూ దర్శకురాలు కావాలనే మొదట భావించానని చెప్పింది. అయితే అనూహ్యంగా హీరోయిన్ అయ్యానని తెలిపింది. తాను దర్శకత్వం శాఖలో శిక్షణ పొందినట్లు చెప్పింది. అది నటనకు ఉపయోగపడిందని పేర్కొంది. అయితే ఇప్పుడు మెగా ఫోన్ పట్టాలని నిశ్చయించుకున్నట్లు చెప్పింది. అయితే స్క్రీన్‌ప్లే రూపొందించడంలో తగిన శిక్షణ పొందాలని, అందుకు ప్రముఖ దర్శకుల వద్ద పని చేయ్యాలనుకుంటున్నట్లు చెప్పింది. అదే సమయంలో కొన్ని కథలను సిద్ధం చేసుకుంటున్నారని చెప్పింది. అలాగని నటనకు స్వస్తి చెబుతున్నానని భావించరాదని, తన తొలి ప్రాధాన్యత నటనకేనని పేర్కొంది. అయితే ఈ అమ్మడు ఏ భాషలో దర్శకత్వం వహించేది మాత్రం చెప్పలేదు. -
ఆ హీరోయిన్స్ వల్ల అవకాశాలు కోల్పోయాను : రాధికా ఆప్టే
నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రాధిక ఆప్టే యంగ్ హీరోయిన్స్ వల్ల అవకాశాలు కోల్పోతున్నట్లు తెలిపింది. లుక్స్ కారణంగా ఎప్పుడైనా సినిమాల్లో పాత్రలను కోల్పోయారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'హీరోయిన్స్‌కి ఆఫర్స్ రావడంలో వయసు అనేది కూడా ప్రధానమైన అంశం. అందుకే కమర్షియల్ చిత్రాల్లో యంగ్ హీరోయిన్స్‌కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. అంతేకాకుండా టాలెంట్‌ని కాకుండా లుక్స్‌ని బట్టి అవకాశాలివ్వడం ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ ఉంది. నేను మాత్రం అందం అనే మాయలో తాను ఎప్పుడూ పడలేదు. యవ్వనంగా కనిపించడం కోసం తాను ఎప్పుడూ సర్జీలను నమ్ముకోలేదు. అవకాశాల కోసం ఏనాడు అడ్డదారులు తొక్కలేదు. కానీ సక్సెస్ కోసం ఇబ్బందులు పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి' అంటూ చెప్పుకొచ్చింది. -
ప్రేమికులైనా, దంపతులైనా ఆ పని మాత్రం చేయకండి
కొందరు ఉచిత సలహాలు బాగానే ఇస్తుంటారు. నటి రాధిక ఆప్టేలాంటి వాళ్లను చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఆ మధ్య కాస్టింగ్ కౌచ్ అంటూ సినీ పరిశ్రమలో కలకలం సృష్టించిన నటీమణుల్లో ఈమె ఒకరు. తమిళంలో ధోని, కబాలి తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన ఈ బాలీవుడ్ బ్యూటీ కొన్ని తెలుగు చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న రాధిక ఆప్టే ఎక్కువగా వెబ్ సిరీసుల్లోనే నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక భేటీలో మాట్లాడుతూ ‘ప్రేమికులు గానీ, దంపతులు కానీ తమ మధ్య తగవులు వస్తే ఇతరుల మాటలు వినకండి. ఎందుకంటే వాళ్లు మీ మధ్యకు వస్తే మీ మధ్య గొడవలు మరింత జటిలం అవుతాయి. ఇద్దరి మధ్య అగాథం పెరిగే ప్రమాదం ఉంది. మన సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలన్నది మనకు మాత్రమే తెలుసు’ అని ఉచిత సలహాలు ఇచ్చింది. ఇంతకీ ఈ అమ్మడు చెప్పే సూక్తులు స్వానుభవమా? లేక ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసిన అనుభవమా? ఎందుకంటే ఎదుటివాళ్లకు చెప్పడానికే నీతులు అన్న సామెత ఉండనే ఉంది కదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
హృతిక్ రోషన్ స్టెప్పులు అదుర్స్.. విక్రమ్ వేద వీడియో సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘విక్రమ్ వేద’. మాధవన్, విజయ్ సేతుపతి కలిసి నటించిన తమిళ సూపర్ హిట్ ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్ ఇది. పుస్కర్, గాయత్రి ధ్వయం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రాధికా ఆప్టే ఇతర కీలక పాత్రలో నటిస్తుంది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంగా ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్లకు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని ‘ఆల్కోహోలియా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ను ఆ చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సాంగ్‌లో హృతిక్ రోషన్ తనదైన స్టెప్పులతో ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. హృతిక్‌రోషన్ హావభావాలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. గణేశ్ హెగ్డే కొరియోగ్రాఫి అందించారు. కాగా దాదాపు రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించిన విక్రమ్‌వేద చిత్రాన్ని వైనాట్ స్టుడియోస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. -
నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్
Radhika Apte Wedding Photos With Benedict Taylor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రైనా చేయడానికి వెనుకాడదు. విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రాధిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. హిందీలో ‘‘ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం 'విక్రమ్ వేదా' చిత్రంలో నటిస్తోంది. సినిమాల వరకు ఓకే కానీ తన పర్సనల్ విషయాలకు చాలా దూరంగా ఉంటుంది రాధిక. అయితే తాజాగా ఆమె భర్తతో దర్శనమిచ్చిన రాధిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 'మీరు మీ భర్తతో కలిసి ఎక్కువగా ఫొటోలు దిగరు.. ఎందుకు ?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి రాధిక ఆప్టే 'నేను ఇక్కడ.. బెన్ (భర్త బెనెడిక్ట్) అక్కడ. ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం. నా పని నేనే చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను. నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడం నాకు ఇష్టముండదు. ఇక ఫొటోల విషయానికొస్తే నాకు ఫొటోలపై అంతగా అభిరుచి లేదు. ఇక నాకన్న బెన్ ఇంకా వేస్ట్. ఫొటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు. అందుకే మా పెళ్లి అయి పదేళ్లు కావోస్తున్న ఇప్పటివరకూ మా పెళ్లి ఫొటోలు కూడా లేవు. మేము ఫ్రెండ్స్‌ను పిలిచాం, భోజనం అరేంజ్ చేశాం, మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే. అయినా మాకు ఫొటోలు దిగేంత ఆసక్తి కలగలేదు' అని చెప్పుకొచ్చింది. కాగా కెరీర్ పరంగా ముంబైలో రాధిక ఆప్టే ఉంటే, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ విదేశాల్లో ఉంటాడు. చదవండి: 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. యాదృచ్ఛికమా! బేబీ బంప్‌తో అలియా భట్ !.. లీకైన ఫొటోలు.. -
అలాంటివి విని విసిగిపోయాను, నా వ్యక్తిత్వం అది కాదు: రాధిక ఆప్టే
Radhika Apte Shocking Comments On Heroines Cosmetic Surgerie: నటి రాధిక ఆప్టే పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏలాంటి పాత్ర చేయడానికైనా వెనకాడదు. ఇలా విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది రాదిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల ఆమె కొన్ని సార్లు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంది. ఇక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ‘‘ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్’’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం హిందీలో ఫొరెన్సిక్, విక్రమ్‌వేదా చిత్రాల్లో నటిస్తుంది. చదవండి: భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన కేజీయఫ్ బ్యూటీ?, డబ్బే ముఖ్యమన్న హీరోయిన్ ఈ నేపథ్యంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో హీరోయిన్ల కాస్మొటిక్ సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘నాకు తెలిసి ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు సర్జరీ చేయించుకున్నవారే. అవకాశాలు, పాపులారిటీని పెంచుకునేందుకు ముఖం, శరీరానికి సర్జరీలు చేసుకున్న హీరోయిన్స్ చాలామందిని చూశాను. చాలామంది సర్జరీలు చేయించుకొని వారి వయసు కనిపించకుండా పోరాటం చేస్తున్నారు. ముఖాన్ని, శరీరాన్ని మార్చుకోవడానికి నాకు తెలిసిన చాలామంది సహ నటీనటులు కాస్మోటిక్ సర్జరీలు చేయించుకున్నారు. అదంతా నా వల్ల కాదు. శరీరాకృతిని పట్టించుకోవద్దు అంటూనే సర్జరీలు చేయించుకున్న వారు ఉన్నారు. చదవండి: బెంగాలీ మోడల్స్ వరుస ఆత్మహత్యలు, తాజాగా 18ఏళ్ల మోడల్ సూసైడ్ కలకలం అలాంటి వారిని చూసి నేను విసిగిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్స్‌పై రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. అలాగే తనకు బి-టౌన్ పార్టీస్, కల్చర్ పడదని చెప్పింది. ‘కేవలం వృత్తిపరంగానే నేను సినీరంగంతో కలిసి ప్రయాణం చేస్తాను. వ్యక్తిగతంగా ఆ వాతావరణంలో ఏమాత్రం ఇమడలేను. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకోవడం, తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించే ధోరణి పరిశ్రమలో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటివి నా వ్యక్తిత్వానికి సరిపడవు. అందుకే షూటింగ్ ముగించుకున్న వెంటనే ఇష్టమైన ప్రదేశాలకు వెళ్లిపోతుంటా. సినీ ప్రపంచాన్ని మర్చిపోయి నాకు నచ్చిన పనులు చేసుకుంటూ విరామ సమయాన్ని ఆస్వాదిస్తా’ అని తెలిపింది. -
లాయర్ అవతారం ఎత్తిన హీరోయిన్లు, ఎవరెవరంటే?
నల్ల కోటు ధరించారు.. ఒత్తయిన కురులను ముడిలా బిగించారు.. న్యాయం కోసం నడుం బిగించారు. యువరానర్ అంటూ వాదన వినిపించడానికి రెడీ అయ్యారు. అందాల తారలు ఇలా పవర్‌ఫుల్‌గా కనబడితే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. లాయర్లుగా కనిపించనున్న ఆ తారలు చేస్తున్న సినిమాల్లోకి ఓ లుక్కేద్దాం. ఎప్పటికప్పుడు క్యారెక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’ వంటి బయోపిక్ కావొచ్చు, ‘గుడ్‌లక్ సఖి’ వంటి స్పోర్ట్స్ డ్రామా కావొచ్చు, ప్రస్తుతం మహేశ్‌బాబు సరసన చేస్తున్న కమర్షియల్ ఫిల్మ్ ‘సర్కారువారి పాట’ చిత్రంలోని కళావతి పాత్ర కావొచ్చు... క్యారెక్టర్ ఏదైనా అందులో పూర్తిగా ఒదిగిపోతారు. తాజాగా కీర్తి లాయర్‌గా మారారు. కోర్టులో ప్రత్యర్థి లాయర్‌ను ఆమె ఎలా ముప్పుతిప్పలు పెడతారో ‘వాషి’ చిత్రంలో చూసి తెలుసుకోవాల్సిందే. కీర్తి లాయర్‌గా నటిస్తున్న మలయాళ చిత్రం ఇది. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం కీర్తి లుక్‌ని విడుదల చేశారు. ఇక కీర్తీ సురేష్ అన్నయ్యకు ఓ లాయర్‌గా హెల్ప్ చేయాలనుకుంటున్నారు తమన్నా. కీర్తి అన్నయ్యకు తమన్నా సహాయం చేయడమేంటీ అనుకుంటున్నారా? కీర్తి ఆన్ స్క్రీన్ అన్నయ్య చిరంజీవి తరఫున లాయర్‌గా తమన్నా వాదించనున్నారట. చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. లాయర్ పాత్రలో తమన్నా నటించనున్నారని తెలిసింది. ‘బోళాశంకర్’ చిత్రం తమిళంలో అజిత్ చేసిన ‘వేదాళం’కు తెలుగు రీమేక్ అనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘వేదాళం’లో హీరోయిన్గా నటించిన శ్రుతీహాసన్ లాయర్ పాత్రలో కనిపించారు. సో.. ‘బోళా శంకర్’లో తమన్నా లాయర్‌గా కనిపిస్తారని ఊహించుకోవచ్చు. మరో బ్యూటీ రాశీ ఖన్నా కూడా లా సెక్షన్స్‌ను గుర్తుపెట్టుకునే పనిలో ఉన్నారు. ఎందుకంటే ‘పక్కా కమర్షియల్’ కోసం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో రాశీ ఖన్నా లాయర్‌గా కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 20న విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు 2009లో వచ్చిన ‘ఎవరైనా ఎపుడైనా’ చిత్రంతో టాలీవుడ్ గడప తొక్కారు హీరోయిన్ విమలా రామన్. ఆ తర్వాత ‘గాయం 2’, ‘రాజ్’, ‘చట్టం’ వంటి సినిమాల్లో నటించారు. కానీ తెలుగులో విమలా రామన్ కెరీర్ ఆశించినట్లుగా సాగలేదు. కానీ మలయాళంలో హిట్. తాజాగా ఆమె ఓ మలయాళం చిత్రంలో లాయర్‌గా నటిస్తున్నారు. తన లాయర్ లుక్‌ను విమలా షేర్ చేశారు. అటు హిందీకి వెళితే... అక్కడ కూడా ఓ లాయరమ్మ రెడీ అవుతున్నారు. తమిళ బంపర్ హిట్ మూవీ ‘విక్రమ్‌వేదా’ హిందీ రీమేక్‌లో రాధికా ఆప్టే లాయర్ పాత్ర చేయనున్నారని టాక్. తమిళంలో ఇన్స్పెక్టర్ విక్రమ్‌గా మాధవన్, గ్యాంగ్‌స్టర్ వేదగా విజయ్ సేతుపతి నటించగా, ప్రియ అనే లాయర్ పాత్రను పోషించారు శ్రద్ధా శ్రీనాథ్. తమిళంలో తీసిన పుష్కర్ గాయత్రి దర్శక ద్వయమే హిందీ రీమేక్‌ని తెరకెక్కిస్తున్నారు. రీమేక్‌లో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీఖాన్, వేద పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తారు. అలాగే ఈ చిత్రంలో సైఫ్ భార్య అంటే లాయర్‌గా హీరోయిన్ రాధికా ఆప్టే కనిపించనున్నారట. వీరితో పాటు మరికొందరు నాయికలు న్యాయం కోసం కోర్టులో వాదించేందుకు లాయర్లుగా రెడీ అవుతున్నారు. -
రాధికా ఆప్టే బర్త్‌డే స్పెషల్
-
న్యూడ్, సెమీ న్యూడ్ సీన్లు.. బోల్డ్ నటిపై గరం గరం
Boycott Radhika Apte Trend: బాయ్‌కాట్ రాధికా ఆప్టే.. హఠాత్తుగా పుట్టుకొచ్చిన ఈ హాష్‌ట్యాగ్ ప్రస్తుతం ట్విటర్‌ను ట్రెండింగ్ ద్వారా కుదిపేస్తోంది. వెల్లువలా వేల కొద్దీ ట్వీట్లు ఆమెకి వ్యతిరేకంగా పోస్ట్ అవుతున్నాయి. భారత సంప్రదాయాలను కించపరిచేలా 35 ఏళ్ల రాధిక నటిస్తోందన్నది ఆ ట్వీట్లు చేసేవాళ్ల ప్రధాన అభ్యంతరం. అంతేకాదు ఇంతలా దిగజారుతున్న వాళ్లకు అవకాశాలిచ్చి మరీ ప్రొత్సహిస్తున్న బాలీవుడ్‌పైన గరం అవుతున్నారు ట్విటర్ యూజర్లు. రాధికా ఆప్టే బాలీవుడ్లో బోల్డ్ నటిగా పేరు సంపాదించుకుంది. హిందీ చిత్రం ‘వహ్! లైఫ్ హో తో ఐసీ!’(2005) ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రాధిక.. తెలుగులో రక్త చరిత్ర రెండు పార్ట్లు, ధోనీ, లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లోనూ నటించింది. ఇక బాలీవుడ్లో న్యూడ్, సెమీ న్యూడ్ సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది రాధిక. మరోపక్క మీటూ ఉద్యమానికి మద్ధతు తెలిపే క్రమంలో ఎన్నో సంచలన స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. అయితే కేవలం డబ్బు కోసమే రాధికా ఆప్టే నటిస్తోందని, భారత సంప్రదాయాలకు వ్యతిరేకంగా ముందుకెళ్తోందని, విలువలు విడిచిపెట్టి మరీ దిగజారిందని విమర్శలకు దిగారు కొందరు. ఇక అలాంటి వాళ్లకు అవకాశాలు ఇవ్వకూడదని బాలీవుడ్‌ను మరికొందరు కోరుతుండగా.. వాళ్ల సినిమాలు చూడడం మానేస్తే సరిపోతుందని సలహాలు ఇస్తున్నారు మరికొందరు. చదవండి: కుప్పలుగా షూటింగ్‌కు జనం.. సినిమా యూనిట్‌కు ఫైన్ బాలీవుడ్లో అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పుడు కొందరు బాలీవుడ్ తారలు ‘న్యాయం కోసం’ అంటూ ముందుకు రావడం తెలిసిందే. అయితే వ్యాపారవేత్త, బాలీవుడ్ ప్రముఖ ఫైనాన్షియర్ రాజ్‌కుంద్రా ‘పోర్న్ రాకెట్’ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. దీంతో కొందరు నెటిజన్స్.. రాధికతో పాటు మరికొందరు తారలను తెర మీదకు తెచ్చి విమర్శలకు దిగారు. ఈ క్రమంలోనే రాధికకు సంబంధించి న్యూడ్, సెమీ న్యూడ్ సీన్ల ప్రస్తావన లేవనెత్తి ఈ #BoycottRadhikaApte ట్రెండ్‌ను నడిపిస్తున్నారు. When it comes to Kathua entire #Bollywood gang was with Placard Why these people silent on #RajKundra ? Habit of bollywood to defame degrad our culture #BoycottRadhikaApte pic.twitter.com/icQ3Kp1TIi#BoycottRadhikaApte — Rahul Jaiswal (@Rahul22578409) August 13, 2021 It's Time To Boycott All Actors , Who Are Against Indian Culture . #BoycottRadhikaApte — Arun Yadav (@beingarun28) August 13, 2021 -
కోర్టు మెట్లు ఎక్కనున్న రాధికా ఆప్టే?
కోర్టు మెట్లు ఎక్కనున్నారు హీరోయిన్ రాధికా ఆప్టే. ఏదైనా కేసులో ఇరుక్కున్నారా? అంటే.. కాదు. కొత్త సినిమా కోసం కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. తమిళ హిట్ ‘విక్రమ్ వేదా’ హిందీ రీమేక్‌లోనే ఆమె ఈ పాత్రలో కనిపించే అవకాశం ఉంది. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను హృతిక్ రోషన్, మాధవన్ పాత్రను సైఫ్ అలీఖాన్ చేయనున్నారు. తమిళంలో శ్రద్ధా శ్రీనాథ్ చేసిన లాయర్ పాత్రను హిందీలో రాధికా ఆప్టే చేయనున్నారట. కథ ప్రకారం మాధవన్ భార్య శ్రద్ధా శ్రీనాథ్. సో.. హిందీలో సైఫ్‌కి జోడీగా రాధిక కనిపిస్తారన్న మాట. మాతృకకు దర్శకత్వం వహించిన పుష్కర్–గాయత్రి ద్వయమే రీమేక్‌ను తెరకెక్కించనున్నారు. సెప్టెంబరులోపు చిత్రీకరణను ఆరంభించాలనుకుంటున్నారు. -
న్యూడ్ వీడియో లీక్.. 4 రోజులు బయటకు రాలేదు: నటి
కుంబ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వారిలో ముందు వరుసలో ఉంటారు నది రాధికా ఆప్టే. ఇక ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా వెనకాడరు. విభిన్న పాత్రలు సెలక్ట్ చేసుకుంటూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాదిక ఆప్టే. అయితే ఈ బోల్డ్నెస్ వల్ల కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు రాధిక ఆప్టే. గతంలో ఆమెకు సంబంధించిన ఓ న్యూడ్ క్లిప్లింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఆ సమయంలోనే ఈ వీడియోపై రియాక్ట్ అయిన రాధిక.. మరోసారి ఈ ఇష్యూపై స్పందిస్తూ ఉద్వేగానికి లోనయ్యారు. సెక్స్ వర్కర్‌గా రాధిక ఆప్టే నటించిన 'పార్చ్డ్' చిత్రం అప్పట్లో వివాదాస్పదమైంది. ఆ సమయంలోనే ఆమెకు సంబంధించి ఓ న్యూడ్ వీడియో క్లిప్పింగ్ వైరల్ కావడంతో షాకైన రాధికా ఆప్టే.. తన ఫేస్‌తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో తనది కాదని 2016లోనే క్లారిటీ ఇచ్చారు.. అయితే తాజాగా మరోసారి అదే అంశంపై మాట్లాడి వార్తల్లో నిలిచారు రాధిక ఆప్టే. ఆ న్యూడ్ వీడియో బయటికి వచ్చిన సమయంలో ఎంతోమంది ఎన్నోరకాలుగా మాట్లాడారని, ట్రోల్ చేశారని చెబుతూ రాధిక ఆవేదన చెందారు. ఊహించని విధంగా తలెత్తుకోలేని పరిస్థితి ఎదురుకావడంతో నాలుగు రోజులు నేను బయట అడుగుపెట్టలేకపోయాను. ఎంతో మానసిక వేదన అనుభవించాను. అయితే పార్చడ్ చిత్రంలో నటించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు’’ రాధిక. 2015లో ఈ చిత్రాన్ని దర్శకుడు లీనా యాదవ్ తెరకెక్కించగా.. అజయ్ దేవ్గన్ నిర్మించారు. ఇది రాజస్తాన్‌లోని ఒక గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు మహిళల సాధికారిత కథ. ఇక రాధిక తెలుగులో బాలకృష్ణతో ''లయన్, లెజెండ్'' సినిమాల్లో నటించిన రాధిక ఆప్టే.. హిందీలో ''ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్'' లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. చదవండి: వీసా కోసమే పెళ్లి చేసుకున్నా: రాధికా ఆప్టే -
వర్మ సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది..
నిత్యం వివాదాలతో వార్తల్లో నిలిచే నటి రాధికా ఆప్టే డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసింది. రక్తచరిత్ర సినిమా సమయంలో తన సమయాన్ని బాగా వాడుకున్నారని, తన పనికి తగ్గ రెమ్యూనరేషన్ కూడా ఇవ్వలేదని చెప్పింది. ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన రక్తచరిత్ర సినిమాలో రాధికా ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె డీ గ్లామరస్ రోల్లో కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె రక్తచరిత్ర షూటింగ్ సమయంలో తాను ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యాననే ఫీలింగ్ కలిగిందని తెలిపింది. 'నేను మూవీ ఒప్పుకునేటప్పుడు కేవలం తెలుగు వెర్షన్ అని చెప్పారు. అందుకు తగ్గట్లు రెమ్యూనరేషన్ ఇచ్చారు. తీరా సెట్స్‌లోకి వెళ్లాకా సినిమాను తెలుగు, తమిళంలో షూట్ చేశారు. అంటే రెండు సినిమాలకు పనిచేసినట్టే. ఇందుకు తగ్గట్లు గానే నాకు రెమ్యూనరేషన్ ఇవ్వాలి కానీ అలా జరగలేదు. ఇక ఈ సినిమాలో పెద్ద స్టార్స్ నటించడంతో షూటింగ్ కూడా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో తెలిసేది కాదు. ఈ మూవీ కోసం నేను చాలా సమయాన్ని కేటాయించాను. అయితే నా టాలెంట్‌కి, నా సమయానికి విలువ లేదనిపించింది. నిజానికి వర్మ రూపొందించిన రంగీలా, సత్య చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలతో వర్మకు ఫ్యాన్ అయ్యా. అందుకే ఆయనతో పనిచేస్తే కొత్త విషయాలు నేర్చుకోవచ్చని భావించాను. కానీ ఆ తర్వాత మాత్రం రక్త చరిత్ర సినిమాకు ఎందుకు సైన్ చేశానా అనిపించింది' అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది. ప్రస్తుతం ఆర్జీవీపై రాధికా ఆప్టే చేసిన ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి. చదవండి : అలా ఆమిర్ ఖాన్‌తో మనస్పర్థలు వచ్చాయి: ఆర్జీవీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న అరియానా గ్రాండె -
ఆ కథలో నటించాలి అనుకోలేదు!
రాధికా ఆప్టేలో రెండు కోణాలున్నాయి. ఎంత సంప్రదాయబద్ధంగా కనిపించగలుగుతారో అంత మోడ్రన్‌గానూ కనిపించగలరు. అందుకే చీర కట్టుకుని నిండుగా కనిపించే పాత్రలనూ చేస్తారు. చిట్టిపొట్టి దుస్తులు డిమాండ్ చేసే పాత్రలూ చేస్తారు. నటిగా భేష్ అనిపించుకున్న ఈ బ్యూటీ దర్శకురాలిగా మారి, ‘ది స్లీప్ వాకర్స్’ అనే షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించారు. ఈ సినిమా గురించి రాధికా ఆప్టే మాట్లాడుతూ – ‘‘నిజానికి నేను డైరెక్టర్ అవ్వాలనుకోలేదు. అయితే రాయడం అంటే ఇష్టం. అది కూడా ఎందుకంటే... ఒక నటిగా నేను వేరేవారి కథల్లో నటిస్తాను. నా ఊహల్లో కొన్ని చాలెంజింగ్ కథలు ఉంటాయి. ఆ కథలు రాయాలనుకున్నాను. ‘ది స్లీప్ వాకర్స్’ కథ మొత్తం రెడీ అయ్యాక అందులో నటించాలని నాకు అనిపించలేదు. డైరెక్షన్ చేయాలనిపించింది. అంతే... పది రోజుల్లో ప్రిపేర్ అయి, షూటింగ్ మొదలుపెట్టాం. దర్శకురాలిగా ఈ ప్రయాణం నాకు మంచి అనుభూతినిచ్చింది’’ అన్నారు. సహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం ‘పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ప్రదర్శితమైంది. ఇక నటిగా రాధికా ఆప్టే ప్రస్తుతం ‘మిసెస్ అండర్‌కవర్’ అనే సినిమా చేస్తున్నారు -
పాత రోజులు గుర్తొచ్చాయి!
షూటింగ్ కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్లినప్పుడు బ్రేక్ దొరికితే చాలు.. ఆ ప్రదేశాలను చుట్టొస్తారు తారలు. ‘మిసెస్ అండర్‌కవర్’ షూటింగ్ కోసం కోల్‌కతా వెళుతున్నప్పుడు బ్రేక్ దొరికితే కోల్‌కతాను రౌండప్ చేద్దామనుకున్నారు రాధికా ఆప్టే. కానీ అందరి ప్లానులూ తారుమారు చేయడానికే కరోనా ఉంది కదా! కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున ‘మిసెస్ అండర్‌కవర్’ యూనిట్ తాము బస చేస్తున్న హోటల్‌కి, షూటింగ్ లొకేషన్‌కి తప్ప ఎక్కడికీ వెళ్లకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారట. దాంతో కోల్‌కతాలో 35 రోజులు వరుసగా షూటింగ్ చేసినా లొకేషన్‌కి, హోటల్ రూమ్‌కి తప్ప రాధికా ఎక్కడికీ వెళ్లలేకపోయారు. ఓ పదేళ్ల తర్వాత కోల్‌కతాలో ఆమె ఎక్కువ రోజులు షూటింగ్లో పాల్గొన్న సినిమా ఇదేనట! గతంలో ‘అంతహీన్’ (2009) అనే బెంగాలీ సినిమా షూటింగ్‌ని అక్కడ చేశారు. ఇప్పుడు ఈ హిందీ సినిమా చిత్రీకరణలో పాల్గొంటుంటే, పాత రోజులన్నీ ఈ బ్యూటీకి గుర్తొచ్చాయట. ఇక ‘మిసెస్ అండర్ కవర్’ విషయానికొస్తే.. ఇందులో గృహిణి నుంచి అండర్ కవర్ ఏజెంట్‌గా మారే పాత్రను చేస్తున్నారు రాధికా ఆప్టే. ఇటీవల విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఈ స్పై ఎంటర్టైనర్కి నూతన దర్శకురాలు అనుశ్రీ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. -
కేంద్ర నిర్ణయంపై రాధికా ఆప్టే ఫైర్
ఈ మధ్యకాలంలో ఓటీటీ వినియోగం బాగా పెరిగింది. చిన్న సినిమాలు మొదలుకొని స్టార్ నటీనటులు కూడా ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. అయితే సినిమాల్లో ఉన్నట్లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై నియంత్రణ లేదు. దీంతో ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన నిబంధనావళిని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓటీటీ కంటెంట్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌పై నటి రాధికా ఆప్టే అభ్యంతరం వ్యక్తం చేసింది. 'ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే అవుతుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ట్రెండ్ నడుస్తుంది. దీన్ని వల్ల ఎన్నో కొత్త ఆలోచనలు ప్రేక్షకులకు చేరుతున్నాయి. అంతేకాకుండా ఓటీటీ వల్ల చాలా మంది ఉపాధి అవకాశాలు లభించాయి. గత కొన్నాళ్లుగా ఓటీటీ ప్రేక్షకుల సంఖ్య పెరిగింది. ఇదా చాలా అద్భుతమైన ప్లాట్పామ్. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలు భయానకంగా ఉన్నాయి. మున్ముందు ఇంకెన్ని మార్పులు వస్తాయో చూడాలి' అని అసహనం వ్యక్తం చేసింది. కాగా అందాల ఆరబోతకు వెనకాడని రాధికా ఆప్టే ఒక ఆంగ్ల చిత్రంలో నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే. ఆ మధ్య రాధికా ఆప్టే బాత్రూం సీన్లలో కనిపించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేశాయి. చదవండి : ఓటీటీలపై నిఘా పెళ్లి ఇష్టం లేదు, కానీ దానికోసమే చేసుకున్నా -
వీసా కోసమే పెళ్లి చేసుకున్నా: రాధికా ఆప్టే
కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అన్ని చోట్లా నటనతో తన ప్రత్యేకతను చాటుకున్నారు నటి రాధికా ఆప్టే. ఇక తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బోల్డ్ పాత్రలు, కుండ బద్దలుకొట్టినట్లు మాట్లాడే విధానంతో సంచలన నటిగా పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో దక్షిణాదిన హీరోయిన్లకు అస్సలు విలువ ఇవ్వరంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో సినీ ఇండస్ట్రీలో వివాదాలకు మారుపేరుగా మారిపోయారు. కాగా 2012లో మ్యుజిషియన్ బెనెడిక్ట్ టేలర్‌ను రాధికా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ నుంచి రాధికా తన భర్త బెనెడిక్ట్‌తో లండన్‌లో ఉంటున్నారు. చదవండి: సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే.. రాధికా తాజాగా పెళ్లి విషయంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాహం ఎప్పుడు చేసుకున్నారని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఆమె ఈ విషయం వెల్లడించారు. అయితే తనకు పెళ్లంటే పెద్దగా ఆసక్తి లేదని వెల్లడించారు. వివాహ వ్యవస్థపై పెద్దగా నమ్మకం లేదని, కేవలం వీసా కోసమే పెళ్లి చేసుకున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేశారు. పెళ్లి చేసుకుంటే విసా త్వరగా వస్తుందని చేసుకున్నట్లు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం తాను భర్తతో హ్యాపీగానే ఉన్నానని, తమ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినీ కెరీర్‌పైనే ఉందని వెల్లడించారు. అయితే రాధికా మాటలు విన్న అభిమానులు మాత్రం షాక్‌కు గురవుతున్నారు. చదవండి: ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్ -
సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే..
(వెబ్ స్పెషల్): ప్రతి ఒక్కరి జీవితంలో కేవలం తమకు మాత్రమే సొంతమైన, ప్రత్యేకమైన వ్యక్తి ఒకరు కచ్చితంగా ఉండే ఉంటారు. వాళ్లతో మాత్రమే తమ మనసులోని భావాలను నిర్భయంగా, నిక్కచ్చిగా.. ఎలాంటి దాపరికాలు లేకుండా వ్యక్తీకరించగలుగుతారు. బాధైనా, సంతోషమైనా ఏదైనా ముందుగా వాళ్లతో పంచుకోవడానికే ఇష్టపడతారు. కేవలం వాళ్ల మీద ఉన్న నమ్మకం కారణంగానే ఇవన్నీ చేస్తారు. ఇక ఇలా అన్ని విషయాలను అర్థం చేసుకున్న ఆ వ్యక్తే జీవిత భాగస్వామిగా లభిస్తే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. మనసుకు నచ్చిన వాళ్లు ‘‘మనవాళ్లా’’లేదా ‘‘పరాయి వాళ్లా’’ అని అస్సలు ఆలోచించరు. ‘‘ప్రణయంలోనూ.. ప్రణయంతోనే.. పరిచయమడిగే.. మనసూ.. అది నువ్వనీ.. నీకే తెలుసూ..’’ అంటూ సప్త సముద్రాల ఆవల ఉన్నా వారిని చేరుకుంటారు. ప్రేమతో జీవితాంతం కట్టిపడేసేలా బంధం బలపరచుకుంటారు. సినీ ఇండస్ట్రీలోనూ ఇలాంటి వాళ్లు చాలామందే ఉన్నారు. వారిలో విదేశీయులను పెళ్లాడిన కొంత మంది నటీమణుల గురించి తెలుసుకుందాం.. ప్రీతి జింటా క్రిమినల్ సైకాలజీ చదివిన సొట్టల బుగ్గల సుందరి ప్రీతి జింటా(45)‘దిల్ సే’ సినిమాతో 1998లో తెరంగేట్రం చేసింది. చోరీ చోరీ చుప్కే చుప్కే, క్యా కహ్నా, దిల్ చాహ్తా హై, కల్ హో నహో వంటి సినిమాలతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి.. ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. కేవలం నటనకే పరిమితం గాకుండా సోషల్ ఆక్టివిస్టుగా, టీవీ ప్రజెంటర్‌గా, కాలమిస్టుగా తనలోని భిన్న కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. అంతేగాక కొత్త నటులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ కూడా మొదలుపెట్టిందీ భామ. అదే విధంగా క్యాష్ రిచ్‌లీగ్ ఐపీఎల్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీకి సహ యజమానిగా, ఎంటర్‌ప్రెన్యూర్‌గా సత్తా చాటుతోంది. ఇక కెరీర్ పరంగా ఎత్తుపల్లాలను చవిచూసిన ప్రీతి జింటా.. తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో మాత్రం ఆచితూచి అడుగులు వేసింది. నాలుగు పదుల వయస్సులో.. తన చిరకాల స్నేహితుడు, అమెరికాకు చెందిన జీన్ గుడ్ఎనఫ్ను ప్రేమించి, పెళ్లాడింది. లాస్ ఏంజెల్స్‌లో అత్యంత సన్నిహితుల మధ్య 2016లో ఫిబ్రవరి 29న వీరి వివాహం జరిగింది. భర్తతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎప్పటికప్పుడు కపుల్ గోల్స్ సెట్ చేస్తూ ఉంటుందీ షిమ్లా భామ. అన్నట్టు.. రాజకుమారుడు, ప్రేమంటే ఇదేరా సినిమాలతో ప్రీతి తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. (చదవండి:వయస్సులో చిన్నవాళ్లను పెళ్లాడిన సెలబ్రిటీలు) రాధికా ఆప్టే బోల్డ్ నటి రాధికా ఆప్టే(35) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. థియేటర్ ఆరిస్టుగా కెరీర్ మొదలు పెట్టి హిందీ, మరాఠి, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్ సినిమాల్లోనూ నటించింది. బద్లాపూర్, హంటర్, మాంఝీ తదితర సినిమాలతో గుర్తింపు పొందిన రాధిక.. లెజెండ్, లయన్, రక్త చరిత్ర వంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఓటీటీలోనూ అడుగుపెట్టిన ఈ హాట్‌భామ, లస్ట్‌స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్ వంటి బోల్డ్ వెబ్‌సిరీస్‌లతో సంచలన నటిగా వార్తల్లోకెక్కింది. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే రాధిక.. కెరీర్ పీక్‌స్టేజ్‌లో ఉన్న సమయంలోనే బ్రిటీష్ వయొలినిస్ట్ బెండిక్ట్ టేలర్‌ను పెళ్లాడింది. 2012లో వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. భౌతికదూరంగా ఉన్నప్పటికీ తమ మనసులు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయని, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఒకరినొకరం కలిసే వీలుంటుందని చెప్పుకొచ్చింది.(చదవండి: రియల్‌గా వివాహం చేసుకున్న హీరో-హీరోయిన్లు ) శ్రియా సరన్ ‘ఇష్టం’ సినిమాతో వెండితెరపై అడుగపెట్టి నేటికీ తన అందచందాలు, నటనా కౌశలంతో అభిమానులను కట్టి పడేస్తోంది డెహ్రాడూన్ సుందరి శ్రియా సరన్(38). స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన ఆమె.. దక్షిణాదిన యువ హీరోలు మొదలు సూపర్ స్టార్ రజనీకాంత్ వరకు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. బాలీవుడ్‌తో పాటు ఒకటీ రెండూ ఇంగ్లిష్ సినిమాల్లోనూ తళుక్కుమన్న శ్రియ, రెండేళ్ల క్రితం రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది. ఆ తర్వాత కొన్నిరోజులకు ఈ జంట ఉదయ్‌పూర్‌లో ఇండస్ట్రీల ప్రముఖులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చి తమ పెళ్లి గురించి మీడియాకు వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియా.. లాక్డౌన్లో భర్తతో కలిసి అనేక వీడియోలు రూపొందించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా పలు చారిటీ షోలు కూడా చేసి కష్టాల్లో ఉన్న వారికి తన వంతు చేసి మంచి మనసు చాటుకుంది.(చదవండి: మంచి తరుణం మించిన దొరకదు ప్రియతమా!) ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలో జరిగిన అత్యంత వైభవోపేతమైన పెళ్లిళ్లలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా పరిణయం కూడా ఒకటి. అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రేమించిన పిగ్గీచాప్స్ ఇరు కుటుంబాలను ఒప్పించి హిందూ, క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో అతడిని పెళ్లాడారు. జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. ఆ తర్వాత సన్నిహితుల కోసం పలు రిసెప్షన్ పార్టీలు చేసింది. కేవలం నటిగానే గాకుండా సామాజిక కార్యకర్తగా, మాజీ ప్రపంచ సుందరిగా గుర్తింపు దక్కించుకున్న ప్రియాంక వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైనా, తనను బాగా అర్థం చేసుకోగలడనే నమ్మకంతోనే నిక్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నట్లు అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. సెలీనా జైట్లీ ఆర్మీ కుటుంబం నుంచి వచ్చిన షిమ్లా భామ సెలీనా జైట్లీ(38) 2001లో మిస్ ఇండియాగా అందాల రాణి కిరీటం దక్కించుకుంది. అంతేకాదు మిస్ యూనివర్స్ పోటీల్లోనూ నాలుగో రన్నరప్‌గా నిలిచి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ క్వీన్. మోడల్‌గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో జనాషీన్ అనే థ్రిల్లర్(హిందీ)మూవీతో సిల్వర్ స్ర్రీన్‌పై ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించి 2011లో పీటర్ హాగ్ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. ఈ జంటకు 2017లో కవలలు జన్మించారు. అయితే వారిలో ఒకరు గుండెలోపంతో మృతి చెందారు. ప్రస్తుతం వీరికి మొత్తం ముగ్గురు పిల్లలు ఉన్నారు. అన్నట్లు సెలీనా తల్లిదండ్రులది కూడా ప్రేమ వివాహమే. ఆమె తండ్రిది ఇండియా కాగా, తల్లి ఆఫ్గానిస్తాన్‌కు చెందినవారు. సుచిత్రా పిళ్లై దిల్ చాహ్తా హై గర్ల్‌గా సినీ అభిమానులకు సుపరిచితమైన సుచిత్ర(50).. ‘బేతాళ్’అనే వెబ్‌సిరీస్‌తో ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడుగుపెట్టింది. కెరీర్లో ఎత్తుపల్లాలు చవిచూసిన సుచిత్ర.. వ్యక్తిగత జీవితంలోనూ ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. మొదటి భర్తతో విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకున్న ఆమె.. 2005లో లార్స్ జేల్డ్సేన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి ముద్దులొలికే ఓ కూతురు ఉంది. శ్వేతా కేశ్వాని డాన్సర్‌గా, మోడల్‌గా రాణించిన శ్వేతా కేశ్వాని(40) హిందీ సీరియళ్ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఆమె బాలీవుడ్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2012లో, న్యూయార్క్‌కు చెందిన కెన్ ఆండినోను పెళ్లాడింది. ఈ జంటకు ఓ కూతురు ఉంది. కాగా శ్వేతాకిది రెండో వివాహం. ఇక వీళ్లతో పాటు కల్కి కొచ్లిన్, తాప్సీ వంటి నటీమణులు విదేశీయులతో ప్రేమలో ఉండగా, ఇలియానా, శృతి హాసన్ ప్రేమలో విఫలమై ప్రస్తుతం కెరీర్‌పై దృష్టి సారించారు. -
ఆకట్టుకుంటున్న ‘రాత్ అకేలి హై’ ట్రైలర్
బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, హీరోయిన్ రాధిక ఆప్టే కలిసి నటించిన చిత్రం ‘రాత్ అకేలి హై’. తాజాగా విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘రాత్ అకేలి హై’లో నవాజుద్దీన్ ఓ పవర్ఫుల్ ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ పాత్రలో కనిపించగా, రాధిక నిందితురాలిగా కనిపిస్తారు. ఓ సంపన్న రాజకీయ నాయుడి హత్య కేసు దర్యాప్తు నేపథ్యంతో ఈ సినిమా కొనసాగుతుంది. ‘రాత్ అకేలి హై’కి కాస్టింగ్ డైరెక్టర్ హనీ ట్రెహన్ దర్శకత్వం వహించారు. అతనికి ఇది మొదటి సినిమా. ఈ చిత్రంలో నవాజుద్దీన్, రాధిక ఆప్టేతో పాటు ఆదిత్య శ్రీవాస్తవ, శ్వేతా త్రిపాఠి, ఇలా అరుణ్, ఖలీద్ త్యాబ్జీ, శివాని రఘువంశి, టిగ్మాన్షు ధులియా నటించారు. ఈ చిత్రం జూలై 31న నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. (అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన) ‘అత్యంత శక్తివంతమైనవారు సాధారణంగా చీకటి రహస్యాలను దాచిపెడతారు. చాలా పలుకుబడి ఉన్న స్థానిక రాజకీయ నాయకుడి కేసును విచారించడానికి ఒక చిన్న పట్టణ పోలీసుకు అప్పగించినప్పుడు ఏం జరుగుతుంది. అతను కేసును విచారించటంలో ఎంత మేరకు సిద్ధంగా ఉన్నాడు. సత్యం కోసం వెతకడానికి చీకటిలోకి వెళ్లాలి. కుటుంబానికి చెందిన వారే అనుమానితులుగా ఉన్న ఈ రహస్య హత్యలో ఇన్స్పెక్టర్ జతిల్ యాదవ్ కేసును ఏలా చేధిస్తారనేది సినిమాలో చూడాలని చిత్ర నిర్మాతల్లో ఒకరు పేర్కొన్నారు. -
కథలు రాస్తున్నా
‘‘రాబోయే రోజుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఈ సమయాన్ని అసంతృప్తిగా గడపవద్దు. నేనలా చేయను. జీవితంలో నేను సంతోషంగా ఉండటానికి ఇదొక ముఖ్య కారణం’’ అంటున్నారు రాధికా ఆప్టే. ఈ లాక్డౌన్ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? అనే ప్రశ్నను రాధికా ఆప్టే ముందుంచితే – ‘‘ఎనిమిదేళ్లుగా విరామం లేకుండా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్నాను. ఈ లాక్డౌన్ వల్ల కాస్త రిలాక్స్ కావడానికి సమయం దొరికినట్లయింది. కొన్ని స్క్రిప్ట్స్ కూడా రాశాను. ఇంకొన్ని రాయాలనుకుంటున్నాను. కానీ సమయం గడిచే కొద్దీ ఈ లాక్‌డౌన్‌తో నాలో కొత్త ఆలోచనలు కలుగుతున్నాయి. సినిమా కెరీర్‌ను పక్కన పెట్టి ఓ రెస్టారెంట్ ఆరంభిస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన కూడా వచ్చింది (నవ్వుతూ)’’ అని పేర్కొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఇటీవల ఓ షార్ట్‌ఫిల్మ్‌ను డైరెక్ట్ చేశారట రాధిక. అది ఓ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా ఎంపికయిందట. ఈ సినిమా వివరాలను త్వరలోనే చెబుతా అన్నారు రాధికా ఆప్టే. -
‘స్లీప్‌వాకర్స్’ టీజర్!
-
నీ అలవాటు గురించి నీకు తెలుసా.. సారీ!
ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బోల్డ్ నటిగా పేరు తెచ్చుకున్నారు రాధికా ఆప్టే. ప్రస్తుతం తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. స్టార్ట్.. కెమెరా... యాక్షన్ అంటూ ‘స్లీప్ వాకర్స్’ అనే షార్ట్ ఫిలిం కోసం దర్శకురాలి అవతారం ఎత్తారు. షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిన్న సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ‘‘ఇదిగో మా టీజర్ ట్రైలర్’’అంటూ రాధిక ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేశారు. గర్భవతి అయిన భార్య, భర్తల మధ్య జరిగే సంభాషణతో టీజర్ ఆసక్తికరంగా సాగింది. నిద్రలో నడిచే నీ అలవాటు గురించి నీకు తెలుసా అని గుల్షన్.. షహానాను ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదంటూ ఆమె కొట్టిపారేస్తుంది. అయితే ప్రతిరోజూ.. రాత్రి కాగానే ఓ బాలిక వాళ్లింటికి రావడం.. ఆమెతో కలిసి షహానా బీచ్‌కు వెళ్లడం.. అక్కడి నుంచి ఆ బాలిక తనను సముద్రంలోకి తీసుకువెళ్లడం వంటి దృశ్యాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక టీజర్ చివరలో.. షహానా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టి.. ‘‘ఐ యామ్ సారీ’’ అంటూ గుల్షన్ ఆమెను చిత్రహింసలకు గురిచేసే విజువల్ ఒకింత భయానకంగా ఉంది. కాగా టీజర్‌పై స్పందించిన నెటిజన్లు.. ‘‘మిమ్మల్ని చూసి గర్విస్తున్నాం’’ అంటూ రాధికపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
హీరోయిన్ రాధికా ఆప్టే ఫోటోలు
-
అంతా బాగానే ఉంది
‘జాగ్రత్త మేడమ్. జాగ్రత్తలు పాటించండి’ అంటూ రాధికా ఆప్టే అభిమానులు ట్వీటర్ ద్వారా ఆమెకు జాగ్రత్తలు చెప్పారు. అసలు విషయం ఏంటంటే... తన తాజా సినిమా చిత్రీకరణ నిలిచిపోవడంతో లండన్‌లో ఉంటున్న భర్త బెనెడిక్ట్‌తో టైమ్ స్పెండ్ చేయడానికి వెళ్లారామె. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటో చర్చకు దారి తీసింది. ముఖానికి మాస్క్ ధరించి ఆస్పత్రిలో వేచి చూస్తున్న తన ఫొటోని పోస్ట్ చేసి, ‘‘ఆస్పత్రికి వచ్చాను.. అయితే భయపడాల్సిందేమీ లేదు. కోవిడ్ 19 గురించి కాదులెండి. అంతా బాగానే ఉంది’’ అని పేర్కొన్నారు. కరోనా గురించి కాకపోయినా ఆస్పత్రికి వెళ్లారు కాబట్టి వేరే ఏదైనా ఆరోగ్య సమస్య ఉండి ఉంటుందని ఫాలోయర్స్ ఆమెకు జాగ్రత్తలు చెప్పారు. -
రాధిక ఆప్టేకు కరోనా కష్టం..
దేశంలో కరోనా విసిరిన పంజా విస్తరిస్తూనే ఉంది. ఈ మహమ్మారి రోజురోజుకీ అధికమతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటున్నారు. ఇప్పటికే దేశంలో 887 కేసులు నమోదు కాగా.. 20 మంది మృత్యువాత పడ్డారు. దీని ప్రభావం పెరుగుతుండటంతో అందరూ ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉంటున్నారు. కాగా సెలబ్రిటీలకు కరోనా వల్ల కొత్త కష్టాలు మొదలయ్యాయి. సంచలన నటిగా పేరు తెచ్చుకున్న రాధిక ఆప్టేకు కరోనా కష్టం మొదలైంది. (కరోనా విరాళం) View this post on Instagram Hospital visit! #notforcovid19 #nothingtoworry #alliswell #safeandquarantined 😷 A post shared by Radhika (@radhikaofficial) on Mar 27, 2020 at 3:39am PDT బోల్డ్ మూవీస్, స్టేట్మెంట్లతో వార్తల్లో నిలిచే ఈ భామ ఇటీవల ముఖానికి మాస్క్ ధరించిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ షేర్ చేశారు. దీంతో రాధికకు కరోనా సోకిందేమోనని అభిమానులు భయానికి గురవుతున్నారు. దీనిపై అనేకమంది అభిమానులు ప్రశ్నలు లేవనెత్తడంతో తాజాగా లెజెండ్ భామ తన పోస్ట్‌పై స్పందించారు. అ ఫోటో కేవలం హస్పిటల్‌కు వెళ్లినప్పుడు తీసిందని స్పష్టం చేశారు. అలాగే తాను కోవిడ్ 19 పరిక్షల కోసం వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే అప్పటికే పోస్ట్ కాస్తా వైరల్ అవ్వడంతో గల్లీ భాయ్ నటుడు విజయ్ వర్మ.. రాధిక ఫోటోపై కామెంట్ చేశారు. ఓ గాడ్! జాగ్రత్త ప్రియతమా.. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటూ కామెంట్ చేశాడు.కాగా తెలుగు, తమిళ్, హాలీవుడ్, బాలీవుడ్లో నటించారు. గతంతో పలు సౌత్ సినిమాల్లోని నటించిన రాధిక దక్షిణాది హీరోలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. (అమెరికా: 4 నెలల్లో 81 వేల కరోనా మరణాలు?) -
నేను సేఫ్‌గా చేరుకున్నా: హీరోయిన్
భారత్‌లో కరోనా తీవ్రత అధికమవుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. తారల సంగతి సరేసరి... షూటింగ్స్‌కు నో చెప్పి ఇంట్లో నుంచి బయట కాలు మోపడం లేదు. ఇక దక్షిణాది కన్నా బాలీవుడ్లో, హాలీవుడ్లో పేరు ప్రఖ్యాతలు గడిస్తున్న హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా ఇండియాకు వచ్చింది. వచ్చిన పని ముగియగానే తిరుగు ప్రయాణమై లండన్‌లోని హీత్రో ఎయిర్‌పోర్టులో దిగింది.. అసలే కరోనా భయంతో ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రకరకాల పరీక్షల పేరిట ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాధికాకు విమానాశ్రయంలో ఎన్ని ఇబ్బందులు తలెత్తాయో, ఎంత అసౌకర్యానికి లోనైందోనని ఆమె అభిమానులు, బంధువులు కాస్త కలవరపాటుకు లోనయ్యారు. దీనిపై రాధికా స్పందిస్తూ తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురవలేదని, ఎవరూ కంగారు పడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. (బొద్దుగా ఉన్నానని వద్దన్నారు!) ‘స్నేహితులు, బంధువుల నుంచి నాకు ఎన్నో మెస్సేజ్‌లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. మీరు కురిపించిన ప్రేమకు కృతజ్ఞతలు. నేను లండన్‌లో క్షేమంగా దిగాను. అక్కడ నాకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఇమ్మిగ్రేషన్ అధికారులు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. విమానాశ్రయం అంతా నిర్మానుష్యంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది. నిజానికి లండన్ నుంచి భారత్‌కు వెళ్లే ఫ్లైట్‌లో అసలు జనాలే లేరని, కానీ అక్కడి నుంచి లండన్‌కు తిరిగొచ్చే విమానం మాత్రం జనాలతో కిక్కిరిసిపోయిందని తెలిపిందీ మరాఠీ భామ. కరోనా ఎఫెక్ట్‌తో తన బిజీ షెడ్యూల్‌కు విరామం ఇచ్చి సామాజిక దూరాన్ని పాటించేందుకు సిద్ధమైనట్లు తన లేటెస్ట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. (నా సక్సెస్ భిన్నం బాస్) View this post on Instagram #Golden #lastdayofwork #socialdistancingstartstomorrow A post shared by Radhika (@radhikaofficial) on Mar 17, 2020 at 8:05am PDT -
అవార్డు నిల్... ఆకర్షణ ఫుల్
‘ఎమ్మీ అవార్డులకు నామినేషన్ దక్కించుకున్నానోచ్’ అంటూ ఇటీవల రాధికా ఆప్టే ప్రకటించారు. నామినేషన్ పత్రాన్ని అందుకుని, రాధిక న్యూయార్క్ వెళ్లారు. అక్కడే 47వ ‘ఎమ్మీ’ అవార్డుల వేడుక జరిగింది. టీవీ షోలు, సీరియల్స్‌కి అవార్డుల ప్రదానం చేస్తుంటుంది ‘ఎమ్మీ’. ‘లస్ట్ స్టోరీస్’కి గాను ఉత్తమ నటన విభాగంలో రాధికా ఆప్టేని నామినేట్ చేశారు అవార్డు సంస్థ ప్రతినిధులు. ఇంకా మన దేశం నుంచి సైఫ్ అలీఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘సేక్రెడ్ గేమ్స్’, మరో సిరీస్ ‘ది రీమిక్స్’ నామినేషన్ దక్కించుకున్నాయి. ‘లస్ట్ స్టోరీస్’ దర్శకులు కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్, నటి రాధికా ఆప్టే ఈ అవార్డు వేడుకకు హాజరయ్యారు. అలాగే ‘సేక్రెడ్ గేమ్’ నుంచి, ‘ది రీమిక్స్’ నుంచి కొందరు అవార్డు వేడుకకు వెళ్లారు. మొత్తం 21 దేశాల నుంచి 11 విభాగాల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు నామినేట్ అయ్యారు. మనదేశం నుంచి నామినేట్ అయినవాటికి అవార్డులు నిల్ కానీ అవార్డు వేడుకలో రాధికా ఆప్టే అట్రాక్షన్ మాత్రం ఫుల్ అని నెటిజన్లు పేర్కొన్నారు. అయితే నవాజుద్దీన్ నటించిన ‘మెక్ మాఫియా’ అనే ఇంగ్లిష్ టీవీ సిరీస్‌కి అవార్డు దక్కింది. -
హాలీవుడ్ ఆహ్వానం
గూడఛారి అనగానే మనకు గుర్తొచ్చేది జేమ్స్ బాండ్. రెండు చేతులతో తుపాకీ పట్టుకుని అలవోకగా శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించే బాండ్ అంటే చిన్నా పెద్దా అందరికీ ఇష్టమే. అందుకే బాండ్ సినిమాలకు ప్రత్యేమైన క్రేజ్. ఇప్పుడు బాండ్ గురించి ఎందుకంటే.. జేమ్స్ బాండ్ చిత్రాల సిరీస్‌లో రానున్న తాజా చిత్రానికి రాధికా ఆప్టేకి కబురు వచ్చింది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఆడిషన్స్ ఇవ్వమని రాధికాకు వచ్చిన ఆ కబురు సారాంశం. అంతే.. వాళ్లు అడిగినట్లుగా తన లుక్, నటనను రికార్డ్ చేసి పంపించారు. ఈ సినిమాతో పాటు రాధికా ఆప్టేకు ‘స్టార్ వార్స్’ ఆఫర్ కూడా రావడం విశేషం. ‘‘ఈ పాత్రను ఈ ఆర్టిస్టే చేయాలని ఓ గీత గీయకుండా నాలాంటి ఆర్టిస్టులను కూడా దృష్టిలో పెట్టుకుని, అవకావం ఇవ్వడం సంతోషించదగ్గ విషయం. ఇది నిజంగా శుభవార్తే’’ అని ఈ సందర్భంగా రాధికా ఆప్టే అన్నారు. మరి.. రాధికా ఇచ్చిన ఆడిషన్ నచ్చితే బాండ్ సినిమాలోనూ, స్టార్ వార్స్ మూవీలోనూ మన దేశీ భామ కనిపిస్తారు. అయితే రాధికాని హాలీవుడ్ సంస్థ తిరస్కరించే అవకాశమే లేదు. ఎందుకంటే హోమ్లీ క్యారెక్టర్స్‌ని హోమ్లీగా, గ్లామర్ క్యారెక్టర్స్‌లో హాట్‌గా... ఇలా పాత్రకు తగ్గట్టు మారిపోతుంటారు రాధికా. అందుకు ఉదాహరణ ‘లెజెండ్, కబాలీ’ తదితర చిత్రాలు. వీటిలో రాధికా హోమ్లీగా కనిపించారు. ఇక హిందీ చిత్రాలు ‘బద్లాపూర్’, ‘పర్చెడ్’ వంటివాటిలో హాట్‌గా కనిపించి, ‘రాధికాయేనా ఇలా?’ అనుకునేలా చేశారు. -
నీ వాలు కన్నుల్తో... ఏ మంత్రం వేశావే...
పీఆర్ ప్రొషెషనల్‌గా వయ్యారాలు పోయినా, ఫోబియా బాధితురాలిగా ఒకింత భయపెట్టినా... రాధికా ఆప్టే శైలే వేరు. కళ్లతో స్పష్టమైన భావాలను పలికించడం రాధిక సొంతం. రక్తచరిత్ర, లెజెండ్... సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఆప్టే డైరెక్టర్ సీట్లో కూర్చోనున్నారు. ఆమె అంతరంగాలు... రంగస్థలం ఎన్ని సినిమాల్లో నటించినా స్టేజీ మీద నటించడం అంటేనే ఇష్టం. స్టేజీకి దూరంగా ఉండలేను. ఆ మధ్య గిరీశ్ కర్నాడ్ నాటకం ఒకటి మరాఠీలోకి తీసుకొస్తే అందులో నటించాను. మంచి పేరు వచ్చింది. నాటకాల్లో నటిస్తున్నప్పుడు సినిమా పనులకు దూరంగా ఉంటాను. రిహర్సల్స్కు ఎక్కువ సమయం కేటాయిస్తాను. డైరెక్టర్ ఆర్జీవీ, ప్రకాశ్ రాజ్, అమోల్ పాలేకర్... మొదలైన డైరెక్టర్లతో కలిసి పనిచేశాను. ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అంటే ఒక్కరి పేరు చెప్పలేను. ఒక్కొక్కరికీ తమదైన శైలి ఉంది. వారి పని విధానాన్ని ఆకళింపు చేసుకుంటాను. ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రయోగాలు చేయడంలో రాము స్వేచ్ఛను ఇచ్చేవారు. ఆయనతో పనిచేస్తే నిశబ్దంలో నుంచి అబ్జర్వేషన్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ప్రకాశ్ రాజ్ సీన్ గురించి చర్చించి నటన నాకే వదిలేసేవారు. ఆయన అందరూ మెచ్చే నటుడు. నటనలో లోతులు తెలిసిన వ్యక్తి. అయినప్పటికీ డైరెక్టర్‌గా నటనకు సంబంధించి తన భావాలను ఇతరులపై రుద్దరు. ‘నేను ఇలా అనుకుంటున్నా. నీ అభిప్రాయం ఏమిటి?’ అడిగే వారు అమోల్ పాలేకర్, కేతన్ మెహతాకు స్పాంటేనియస్ రియాక్షన్ అంటే ఇష్టం. ఇమేజ్ నేను నాలాగే ఉండడానికి ఇష్టపడతాను. నాకు నచ్చనిది చేయను. ఇమేజ్ను లెక్కలోకి తీసుకోను. నటుల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు ఉండవచ్చుగాక... అయినప్పటికీ దానికంటూ ఒక పరిమితి ఉంటుంది. ఆ పరిమితిని అర్థం చేసుకుంటే సమస్యే లేదు. నర్తకి హిందీ, సౌత్ చిత్రాలు అనే తేడా లేదు. రెండిటినీ ఆస్వాదిస్తాను. భిన్న భాషలలో నటించడం వల్ల అక్కడి ప్రజలను, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏదీ ఎక్కువ, ఏదీ తక్కువ కాదు. దక్షిణాదిలో అద్భుతమైన చిత్రాలు వస్తున్నాయి. ‘కబాలి’లో రజని సర్‌తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను.నాకు డ్యాన్స్ వచ్చు. ఒక నర్తకి పాత్ర చేయాలని కోరిక ఉంది. ‘టాలెంట్‌తో అన్నీ జరుగుతాయి’ అనే దాంట్లో నాకు నమ్మకంగా లేదు.‘బ్రహ్మాండంగా నటించావు’లాంటి ప్రశంసలు వచ్చిన రోజుల్లో కూడా అవకాశాలు రాకపోవచ్చు. ఏ ప్రశంసలూ లేని రోజుల్లో కూడా అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టవచ్చు. -
ఓ చిన్న ప్రయత్నం
స్టార్ట్... కెమెరా.. యాక్షన్ అని దర్శకుడు చెప్పగానే పాత్రలో లీనమైపోయి హీరోయిన్గా ఇన్ని రోజులు డైలాగ్‌లు చెప్పారు రాధికా ఆప్టే. కానీ తొలిసారి యాక్టర్స్ చేత డైలాగ్స్ చెప్పించారామె. అదేనండీ.. ఆమె ఓ 30 నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసం దర్శకురాలిగా మారారు అని చెబుతున్నాం. గుల్షన్ దేవయ్య, షహానా గోస్వామి ప్రధాన పాత్రధారులుగా ‘స్లీప్ వాకర్స్’ అనే ఓ 30 నిమిషాల సినిమాకు దర్శకత్వం వహించారు రాధికా ఆప్టే. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ– ‘‘ఏదైనా కొత్తగా రాయాలనే తాపత్రయంలో చిన్నగా ఏదో ప్రయత్నించాను. ఇది నిర్మాతలు లలిత, హనీ, అభిషేక్‌లకు నచ్చడంతో నిర్మిస్తామని చెప్పారు. అలా నేను దర్శకురాలిగా మారడం అకస్మాత్తుగా జరిగిపోయింది. ఈ అనుభవంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ‘స్లీప్ వాక ర్స్’ విడుదలైన తర్వాత వీక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించిన రాధికా భవిష్యత్‌లో ఏదైనా సినిమాను డైరెక్ట్ చేస్తారా? వెయిట్ అండ్ సీ. -
అవార్డు వస్తుందా?
‘ది వెడ్డింగ్ గెస్ట్, లిబర్టీ: ఎ కాల్ టు స్పై’ వంటి హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌లో నటించి అంతర్జాతీయ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు రాధికా ఆప్టే. ఆ ప్రయత్నానికి ఓ అద్భుత అవకాశం రాధిక తలుపు తట్టింది. అమెరికన్ ‘ఎమ్మీ’ అవార్డ్స్ ఉత్తమ నటి విభాగంలో రాధికా ఆప్టే నామినేషన్ దక్కించుకున్నారు. ‘లస్ట్ స్టోరీస్’ఫస్ట్ సిరీస్‌లో రాధిక అద్భుత నటన ఈ ఎమ్మీ అవార్డ్స్‌లో ఆమెకు నామినేషన్ దక్కేలా చేసింది. అవార్డు కూడా వస్తే రాధిక కెరీర్‌కు మరింత బూస్ట్ వచ్చినట్లవుతుంది. ఈ ఏడాది ఎమ్మీ అవార్డ్స్‌కు ఇండియా తరఫున మొత్తం నాలుగు నామినేషన్స్ నమోదయ్యాయని బాలీవుడ్ సమాచారం. బెస్ట్ డ్రామా కేటగిరీలో ‘సాక్రెడ్ గేమ్స్’, నాన్ స్క్రిప్టెడ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరిలో ‘ది రీమిక్స్’ నామినేషన్స్ దక్కించుకున్నాయట. ఇండియన్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్‌కి అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోందనడానికి ఈ నామినేషన్స్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. -
స్త్రీలోకం
►ఇండోనేషియాలో భర్త నిర్బంధంలో ఉన్న హీనా బేగమ్ అనే హైదరాబాద్ యువతికి (23) ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం విముక్తిని ప్రసాదించి ఇండియా తీసుకువస్తోంది. తన అల్లుడు తన కూతుర్ని ఇల్లు కదలకుండా చేసి హింసిస్తున్నాడని, అతడి చెర నుంచి విడిపించి ఆమెకు ప్రాణభిక్ష ప్రసాదించాలని హీనా తల్లి చేసిన విజ్ఞప్తిపై తక్షణం స్పందించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ.. ఇండోనేషియా సహకారంతో హీనాను (ఆమె రెండున్నరేళ్ల వయసున్న కొడుకుతో పాటు) భర్త నుంచి కాపాడి ఇండియా విమానం ఎక్కించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ►ఆస్ట్రేలియాలో ఉంటున్న బాలీవుడ్ నటి ఈషా షర్వాణీ (34)తో ఆదాయం పన్ను అధికారులం అంటూ మోసపూరితమైన ఫోన్ సంభాషణలు చేసిన ముగ్గురు వ్యక్తులు ఆమె అకౌంట్ నుంచి మూడు లక్షల రూపాయలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు! అరెస్టు నుంచి తప్పించుకోడానికి పెనాల్టీ కట్టాలని వారు చెప్పడంతో ఈషా తన మేనేజర్‌తో చేత ఆన్లైన్లో అంత మొత్తాన్నీ వారికి బట్వాడా చేయించారు. ఆ తర్వాత కొద్దిగంటలకే మోసం బయటపడి, పోలీసులకు చిక్కిన ఆ ముగ్గురూ భారతీయులే కావడం విశేషం. ►నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’లో కథానాయికగా నటించిన రాధికా అప్టే ‘బెస్ట్ పెర్ఫార్మెన్స్ యాక్ట్రెస్’ కేటగిరీ కింద ‘ఎమ్మీ’ అవార్డుకు నామినేట్ అయ్యారు. సెప్టెంబర్ 23న లాస్ ఏంజిల్స్‌లోని మైక్రోసాఫ్ట్ థియేటర్లో విజేతలను ప్రకటిస్తారు. టీవీ కార్యక్రమాలకు, టీవీ నటీనటులు, సాంకేతికనిపుణులకు గత 70 ఏళ్లుగా ఎమ్మీ అవార్డులు ఇస్తున్నారు ►పాకిస్తాన్లో మానవ హక్కుల కార్యకర్త గులాలై ఇస్మాయిల్ ప్రాణాపాయంలో పడ్డారు. దేశంలో మహిళలపై హింస ఎక్కువైందని, బలవంతపు పెళ్లిళ్లు, పరువు హత్యలు జరుగుతున్నాయని ఆరోపణలు చేసి ‘దేశంలో హింసను ప్రేరేపిస్తున్న ప్రభుత్వ వ్యతిరేకి’గా ముద్ర పడిన గులాలై తాజాగా పాక్ సైన్యం దురాగతాలపై నోరు విప్పడంతో ఆమెకు, ఆమె కుటుంబానికి వేధింపులు, బెదరింపులు మొదలయ్యాయి. దాంతో గులాలై దేశం విడిచి యు.ఎస్. పారిపోయారు. ►జయలలిత జీవిత చరిత్రపై వస్తోన్న ‘తలైవి’ చిత్రం కోసం జయలలితగా నటిస్తోన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు లాస్ ఏంజిల్స్‌లోని జేసన్ కాలిన్స్ స్టుడియోలో ఆ చిత్ర సాంకేతిక నిపుణులు ‘ప్రోస్థెటిక్ మెజర్మెంట్స్’ (కృత్రిమ ఆకృతి కొలతలు) తీసుకుంటున్నారు. కంగనాను అచ్చు జయలలితలా మలిచేందుకు ఈ కొలతలు ఉపయోగపడతాయి. తమిళ్, తెలుగు, హిందీ మూడు భాషల్లో చిత్ర నిర్మాణం జరుగుతోంది. దర్శకుడు ఎ.ఎల్.విజయ్. -
అంత పిచ్చి లేదు
‘అంధాధున్’, ‘ప్యాడ్‌మ్యాన్’.. రెండు చిత్రాల్లోనూ నటించారు రాధికా ఆప్టే. ఈ రెండు చిత్రాలకు ఈ ఏడాది నేషనల్ అవార్డులు వచ్చాయి. ‘ఎలా ఫీలవుతున్నారు?’ అని ఇంటర్వ్యూలో ఎవరో అడిగారు. ‘‘సంతోషమే కానీ, ఎదురు చూసేంత సంతోషం కాదు’’ అన్నారు రాధిక. దానర్థం అవార్డులను ఆమె పట్టించుకోరని. ‘‘ఆడియెన్స్‌కి నచ్చితే చాలు. అంతకు మించి నేనేం ఆశించను. అవార్డు వచ్చినా, రాకున్నా నాకు ఒకటే. ఐయామ్ నాట్ అవార్డ్ – క్రేజీ పర్సన్’’ అన్నారు రాధిక. -
ధనుష్ కాదు ప్రశాంత్!
శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో నటించిన హిందీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘అంధాధూన్’. ఈ చిత్రం తమిళంలో రీమేక్ కాబోతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. హీరోగా ధనుష్, సిద్ధార్థ్ ఇలా పలువురు పేర్లు కూడా వినిపించాయి. ఓ సందర్భంలో ‘అంధాధూన్’ చేయాలని చాలా ఆసక్తిగా ఉన్నానని కూడా తెలిపారు ధనుష్. ఇప్పుడు ‘అంధాధూన్’ తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తారని తెలిసింది. ఈ హిందీ చిత్రం తమిళ రైట్స్‌ను ప్రశాంత్ తండ్రి, నటుడు–దర్శకుడు–నిర్మాత త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు. ప్రశాంత్ నటించిన గత చిత్రం ‘జానీ’ (తమిళం) కూడా శ్రీరామ్ రాఘవన్ తెరకెక్కించిన ‘జానీ గద్దర్’ (హిందీ)కు రీమేకే కావడం విశేషం. -
నా పేరే ఎందుకు?
రిలీజ్ కాని సినిమాలకు చెందిన క్లిప్పింగ్‌లు, స్టిల్స్ అప్పుడప్పుడు నెట్లో వైరల్ కావడం ఈ టెక్నాలజీ యుగంలో సాధారణ విషయమై పోయింది. హీరోయిన్ రాధికా ఆప్టే తాజాగా నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమా రొమాంటిక్ సీన్ ఒకటి నెట్లో వైరల్‌గా మారింది. అది దేవ్ పటేల్, రాధికా ఆప్టే మధ్య సాగే శృంగార సన్నివేశం. ఈ వీడియోకి సంబంధించిన ఫొటోలు ‘రాధికా ఆప్టే ఇన్ లీక్డ్ సెక్స్ సీన్’ అని ఎక్కువగా నెట్లో తిరుగుతోంది. ఈ విషయంపై రాధికా ఆప్టే స్పందించారు. ‘‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలో బోలెడన్ని రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. అందుకో హైలీ రొమాంటిక్ సీన్ ఒకటి లీకైంది. కానీ ‘రాధికా ఆప్టే ఇన్ లీక్డ్ సెక్స్ సీన్’ అని నా పేరుతోనే ఎందుకు? ఇది ప్రచారం అవుతుందో నాకు అర్థం కావడం లేదు. అందులో దేవ్ పటేల్ కూడా ఉన్నారు కదా. హీరో పేరుతో కాకుండా హీరోయిన్ పేరుతో ఎందుకు వైరల్ చేస్తున్నారు. సొసైటీలో ఉన్న సైకో మెంటాలిటీస్ వల్ల ఇలాంటివి జరుగుతున్నాయనిపిస్తోంది’’ అన్నారు రాధిక. మూడేళ్ల క్రితం ఇలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు రాధికా ఆప్టే. అప్పుడు లీకైన వీడియోలో నటుడు రాధికా ఆప్టేతో నటుడు ఆదిల్ హుస్సేన్ ఉన్నారు. అప్పుడు కూడా రాధికా ఇలానే స్పందించారు. -
ఆ సీన్ లీక్: సైకో మెంటాలిటీయే కారణం
ప్రముఖ నటి రాధికా ఆప్తే, దేవ్ పటేల్ జంటగా నటించిన తాజా హాలీవుడ్ చిత్రం ‘ద వెడ్డింగ్ గెస్ట్’ . త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలోని హాట్ రొమాంటిక్ సీన్ ఒకటి లీకై.. ఇంటర్నెట్లో దుమారం రేపుతోంది. రాధికా ఆప్తే, దేవ్ పటేల్ శృంగారంలో పాల్గొన్న ఈ సీన్ లీక్ కావడంపై నటి రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సమాజంలో సైకో మెంటాలిటీకి ఈ సీన్ లీకే నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ఈ సీన్ మేల్ యాక్టర్ దేవ్ పటేల్ పేరిట స్ప్రెడ్ చేయకుండా.. తన ఒక్కరి పేరు మీదనే ఎందుకు వ్యాప్తి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ‘బాలీవుడ్ లైఫ్’ వెబ్‌సైట్‌తో ముచ్చటించిన రాధిక.. ‘ఈ సినిమాలో ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ శృంగారానికి సంబంధించిన సీన్‌ను మాత్రమే లీక్ చేశారు. దీనికి కారణం మన సమాజం సైకోటిక్ మెంటాలిటీనే’ అని అన్నారు. ‘లీకైన ఆ సీన్లో రాధికా ఆప్తే, దేవ్ పటేల్ ఇద్దరూ ఉన్నారు. కానీ, నా పేరు మీదనే ఆ సీన్లను స్ప్రెడ్ చేస్తున్నారు. మేల్ నటుడు దేవ్ పటేల్ పేరు మీద వాటిని స్ప్రెడ్ చేయవచ్చు కదా’ అని ఆమె ప్రశ్నించారు. సినిమాల్లో నగ్న, శృంగార సన్నివేశాల్లో నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో రాధికా ఆప్తే పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘బోల్డ్ సీన్లలో నటించే విషయంలో నాకెలాంటి భయాలు లేవు. నేను చిన్నప్పటి నుంచి ప్రపంచ సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్నో ప్రదేశాలు తిరిగాను. నా పట్ల నేను కంఫర్టబుల్‌గానే ఉన్నాను. భారత్‌లో, విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం నేను చూశాను. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి? ఒక అభినేత్రిగా నా శరీరం కూడా ఒక సాధనమే నాకు. బోల్డ్ సీన్లలో నటించే విషయంలో నాకు ఎలాంటి భయాలు లేవు’ అని ఐఏఎన్ఎస్ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్తే పేర్కొన్నారు. -
సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్
సమాజం ఓ సైకో అంటూ బాలీవుడ్ వివాదస్పద నటి రాధిక ఆప్టే ఫైర్ అయ్యారు. ఆమె నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ అనే హాలీవుడ్ సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ రాధిక ఘాటు వ్యాఖ్యలు చేశారు. ది వెడ్డింగ్ గెస్ట్ సినిమాలో చాలా అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయని, కానీ అవన్నీ వదిలేసి కేవలం ఈ ఒక్క సెక్స్ సీన్ మాత్రమే లీక్ చేసారన్నారు. సమాజపు మానసిక పరిస్థితికి అద్దం పట్టే దృశ్యం ఇదేనని మండిపడ్డారు. సొసైటీ నిజంగానే ఓ సైకోలా మారిపోయిందన్నారు. ఆ లీకైన సీన్లో తనతో పాటు దేవ్‌పటేల్ కూడా ఉన్నారని, కానీ కేవలం రాధికా ఆప్టే సెక్స్ సీన్ అనే ప్రచారం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు దేవ్ పటేల్ సన్నివేశమని ప్రమోట్ చేయరని నిలదీశారు. ఇక రాధిక ఆప్టేకు సంబంధించిన బోల్డ్ సీన్లు లీకవ్వడం ఇదే తొలిసారి కాదు. 2016, ఆగస్టులో అదిల్ హుస్సెన్‌తో సాన్నిహిత్యంగా ఉన్న సన్నివేశాలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ తరహా సన్నివేశాలపై రాధిక ఆప్టే కూడా బోల్డ్‌గానే స్పందించారు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఈ తరహా సన్నివేశాల్లో నటించడానికి తనకేం ఇబ్బందిలేదన్నారు. ‘ బోల్డ్ సీన్స్‌లో నటించడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్రపంచ సినిమాలు చూస్తూనే పెరిగాను.. అలాగే ఎంతో దూరం ప్రయాణించాను. నా శరీరంతో నేను సౌకర్యంగానే ఉన్నాను. భారత్, ఇతర దేశాల్లో న్యూడ్‌గా నటించడం నేను చూశాను. బోల్డ్ సీన్స్‌లో నా శరీరాన్ని చూసుకొని నేనేం సిగ్గుపడటం లేదు. అవమానంగా ఫీలవ్వడం లేదు. అది ఒక వస్తువులాంటిదే. దాన్ని నేను నా నటనకు ఉపయోగిస్తున్నాను.’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ది వెడ్డింగ్ చిత్రాన్ని మైఖెల్ వింటర్ బాటమ్ తెరకెక్కిస్తుండగా.. జిమ్ సర్బ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. -
బొద్దుగా ఉన్నానని వద్దన్నారు!
సినిమాలోనే కాదు సినిమా పూర్తయి బయటకు రావడం వెనుక కూడా ఓ పెద్ద కథే ఉంటుంది. స్క్రిప్ట్ స్టేజ్‌లో అనుకున్న వాళ్లు స్క్రీన్ మీదకు వచ్చే సమయానికి ఉండకపోవచ్చు. అస్సలు అనుకోని వాళ్లు కూడా అనుకోకుండా ప్రాజెక్ట్‌లో భాగమవచ్చు. ఇదంతా ఎందుకంటే బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘విక్కీ డోనర్’ సినిమాలో విచిత్రంగా అవకాశం కోల్పోయారట రాధికా ఆప్టే. ఈ విచిత్రమేంటో రాధికా ఆప్టే వివరిస్తూ – ‘‘విక్కీ డోనార్’ సినిమాలో హీరోయిన్గా ముందు నా పేరే అనుకున్నారు. ఆ సినిమా స్టార్ట్ అయ్యే కొన్ని రోజుల ముందు ఫారిన్‌కు హాలిడేకు వెళ్లాను. ఆ ట్రిప్‌లో నచ్చిన ఫుడ్‌ను కొంచెం ఇష్టాంగా తిన్నాను. దాంతో కాస్త బొద్దుగా అయ్యాను. లావయ్యానని మా టీమ్ కొంచెం అప్సెట్ అయ్యారు. తిరిగి వచ్చాక తగ్గిపోతాను అని చెప్పినా కూడా రిస్క్ చేయదలుచుకోలేదు. అలా ఆ సినిమా ఛాన్స్ మిస్ అయింది’’ అని చెప్పారు ఆప్టే. ఈ సినిమాలో హీరోయిన్గా యామీ గౌతమ్ నటించిన సంగతి తెలిసిందే. -
ఏజెంట్ నూర్
ఫ్రాన్స్‌లో గూఢచర్యం చేశారు రాధికాఆప్టే. మరి.. ఆమె సీక్రెట్ ఆపరేషన్ ఎలా సాగిందో వెండితెరపై చూడాల్సిందే. ఆస్కార్ నామినేటెడ్ డైరెక్టర్ లిడియా డీన్ పిల్చర్ దర్శకత్వంలో ‘లిబర్టే: ఏ కాల్ టు స్పై’ అనే హాలీవుడ్ మూవీ తెరకెక్కింది. రెండో ప్రపంచయుద్ధ సమయంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సారా మేఘన్ థామస్, స్టానా కాటిక్, రాధికా ఆప్టే, లైనస్ రోచె, రోసిఫ్ సదర్లాండ్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ఇండియన్ ముస్లిమ్ స్పై ఏజెంట్ నూర్ ఇనాయత్ ఖాన్ పాత్రలో రాధికా ఆప్టే నటించారు. ఇటీవల యూకేలో జరిగిన ఓ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమా టీమ్ కలుసుకున్నారు. ఈ సమయంలో ఈ సినిమాలోని తన లుక్‌ను రాధికా ఆప్టే షేర్ చేశారు. ఇక.. బాలీవుడ్లో ‘రాత్ అఖేలి హై’ అనే సినిమాలో నటిస్తున్నారామె. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరో. -
నా సక్సెస్ భిన్నం బాస్
తన సక్సెస్ కాస్త భిన్నం అంటోంది నటి రాధికాఆప్తే. అవును ఈ అమ్మడు సహ నటీమణులకే భిన్నం అంటారు. ఇక భావాలు వేరేగా ఉండడంలో ఆశ్చర్యమేముంటుంది. అయితే అందాలారబోతకు హద్దులు చెరిపేయడానికి సిద్ధం అనే ఈ సంచలన భామ నటిగానూ ఎల్లలు దాటేసిందన్నది వాస్తవం. ధోనీ చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన రాధికాఆప్తే, ఆ తరువాత కార్తీతో ఆల్ ఇన్ ఆల్ అళగురాజా, రజనీకాంత్ సరసన కబాలి వంటి చిత్రాల్లో నటించింది. ఇక తెలుగులోనూ బాలకృష్ట స్టార్ హీరోలతో నటించిన రాధికాఆప్తే దక్షిణాదిలో పెద్దగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ను పొందక పోయినా, బాలీవుడ్, హాలీవుడ్‌లలో నటించే అవకాశాలను మాత్రం దక్కించుకుంది. ఇటీవల బ్రిటీష్, అమెరికా చిత్రంగా రూపొందిన ది వెడ్డింగ్ గెస్ట్లో నటించింది. ప్రస్తుతం మరో హాలీవుడ్ చిత్రం వరల్డ్‌వార్–2లో నటిస్తోంది. కాగా ఇలా కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్‌లను దాటి హాలీవుడ్‌లోనూ నటిస్తున్నా ఇంకా తాను అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని రాధికాఆప్తేనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీని గురించి ఈ మరాఠి అమ్మడు చెబుతూ తాను నటించిన హాలీవుడ్ చిత్రం ది వెడ్డింగ్ గెస్ట్ ఇటీవలే అమెరికాలో విడుదలైందని చెప్పింది. ఆ చిత్రం తరువాత ఇప్పుడు పలు హాలీవుడ్ చిత్రాల అవకాశాలు వస్తున్నాయని తెలిపింది. వాటి స్క్రిప్ట్‌లను చదువుతున్నానని, కొత్త చిత్రంలో నటించే విషయం గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని చెప్పింది. తాను అన్ని భాషల్లోనూ ప్రముఖ హీరోలతో నటించాలని ఆశ పడుతున్నట్లు తెలిపింది. ఇతరులు దేన్ని విజయం అనుకుంటున్నారో, తాను భావించే విజయం దానికి భిన్నంగా ఉంటుందని చెప్పింది. అందుకే ఇప్పటి వరకూ తనను తాను సక్సెస్ఫుల్ హీరోయిన్గా భావించడం లేదని అంది. దాన్ని తానింకా సాధించలేదని, అందుకు సమయం వచ్చినప్పుడు తాను సక్సెస్ఫుల్ హీరోయిన్గా భావిస్తానని రాధికాఆప్తే చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడికి దక్షిణాదిలో ప్రస్తుతం ఒక్క అవకాశం కూడా లేదన్నది వాస్తవం. వాటి కోసమే తరచూ గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. -
లెక్కలు చెప్పేదాన్ని!
సౌత్‌లోనే కాకుండా నార్త్‌లోనూ మంచి నటిగా పేరు సంపాదించుకున్నారు కథానాయిక రాధికా ఆప్టే. వెబ్ సిరీస్‌లతో డిజిటల్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. రాధికా సక్సెస్ఫుల్ జర్నీ ఇప్పుడు హాలీవుడ్ వరకూ వెళ్లింది. అక్కడ ఆమె ఒక సినిమా సైన్ చేశారు. కథానాయికగా ఈ రేంజ్లో సక్సెస్ అయిన మీరు ఒకవేళ నటి కాకపోయి ఉంటే ఏం చేసేవారు? అనే ప్రశ్న రాధికా ముందు ఉంచితే – ‘‘మ్యాథమేటిక్స్ అంటే చిన్నతనం నుంచి చాలా ఇష్టం. ఈ సబ్జెక్ట్‌ని చాలా స్పెషల్‌గా చదివేదాన్ని. అలాగే వైల్డ్‌లైఫ్ అన్నా ఇష్టమే. ఒకవేళ నేను యాక్టర్ కాకపోయి ఉంటే బహుశా మ్యాథ్స్ టీచర్‌గా లెక్కలు చెబుతూ ఉండేదాన్నేమో. ఒకవేళ అది కూడా కుదరకపోతే వైల్డ్‌లైఫ్ రంగంలో ఉద్యోగం చేసేదాన్నేమో. ఎవరికి తెలుసు? ప్రస్తుతం అయితే నటిగా సినిమా పరిశ్రమలో మంచిస్పేస్లోనే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు. -
చిన్న సినిమా చైనాలో దుమ్ముదులుపుతోంది
భారతీయ చిత్ర పరిశ్రమకు చైనా ఘన స్వాగతం పలుకుతోంది. ఇప్పటికే చైనాలో భారతీయ సినిమాలు తమ సత్తాను చాటాయి. దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, హిందీ మీడియం, భజరంగీ భాయీజాన్ లాంటి చిత్రాలు వందల కోట్లను కొల్లగొట్టాయి. మూవీలో కంటెంట్ ఉంటే చాలు అక్కడ ఈజీగా వంద కోట్లను వసూలు చేయోచ్చు. ఇలా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాలా సినిమాలు చైనాకు క్యూ కట్టాయి. అయితే ఇదే వరుసలో గతేడాది వచ్చిన అంధాదున్ చిత్రం బాలీవుడ్లో చిన్న సినిమాగా రిలీజై.. రికార్డుల మోత మోగించింది. ఇక్కడ సెన్సేషన్ సృష్టించడమే కాకుండా.. చైనాలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రెండో వారాంతంలోనే రెండు వందల కోట్లను కలెక్ట్ చేసింది. ఆయుష్మాన్ ఖురానా, టబు, రాధికా ఆప్టే కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆధ్యంతం ఆసక్తిని రేకేత్తించేలా ఉంటుంది. అంధుడిగా నటిస్తూ.. జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నాని హీరోగా తెరకెక్కుతున్న ‘జెర్సీ’ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. మరి ఈ చిత్రం అక్కడ ఎలాంటి రిజల్ట్‌ని ఇస్తుందో చూడాలి. -
మస్త్ బిజీ
రెండేళ్ల క్రితం విడుదలైన హిందీ చిత్రం ‘హిందీ మీడియం’ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను సాధించింది. సాకేత్ దర్శకత్వంలో ఇర్ఫాన్‌ఖాన్, సాబా క్వామర్, దీపక్ దోబ్రియాల్, షాయన్న పటేల్ ముఖ్య పాత్రలు చేశారు. దినేష్ విజన్ నిర్మించారు. ‘హిందీ మీడియం’ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు అప్పట్లోనే స్ట్రాంగ్‌గా వార్తలు వచ్చాయి. అయితే.. ఇర్ఫాన్‌ఖాన్ అనారోగ్య పరిస్థితుల కారణంగా సెట్స్‌పైకి వెళ్లలేదు. ఇటీవల ఇర్ఫాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితులు ఆల్మోస్ట్ నార్మల్ స్టేజ్‌కి రావడంతో ‘హిందీ మీడియం’ సీక్వెల్ మళ్లీ తెరపైకి వచ్చింది. తాజా సమాచారం ఏంటంటే...ఈ సినిమాలో హీరోయిన్గా కరీనా కపూర్‌ను తీసుకోవాలని చిత్రబృందం ఆలోచిస్తోందని తెలిసింది. ఇంతకుముందు రాధిక ఆప్టే పేరు తెరపైకి వచ్చింది. రెండేళ్ల తర్వాత ‘వీరేది వెడ్డింగ్’వంటి వందకోట్ల సినిమాతో కమ్ బ్యాక్ ఇచ్చిన కరీనా ప్రస్తుతం అక్షయ్ కుమార్ ‘గుడ్‌న్యూస్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే కరణ్ జోహార్ పీరియాడికల్ మూవీ ‘తక్త్’లో నటించనున్నారు. ఇప్పుడు‘హిందీ మీడియం’ సీక్వెల్లో సెట్ అయితే.. కరీనా మళ్లీ బిజీ ట్రాక్‌లో పడ్డట్లే లెక్క. ‘‘ఇర్ఫాన్‌ఖాన్ తిరిగి వచ్చారు. స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నాం. మరో రెండు నెలల్లో మరిన్ని వివరాలు వెల్లడిస్తాం’’ అని నిర్మాత దినేష్ విజన్ పేర్కొన్నారు. ఈ సీక్వెల్‌కు ‘ఇంగ్లీష్ మీడియం’ అనే టైటిల్ అనుకుంటున్నారని బాలీవుడ్ టాక్. -
త్వరలో ఇంగ్లీష్ క్లాసులు
వేసవిలో విద్యార్థులకు సెలవులు ఇస్తారు. కానీ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ కెమెరా ముందు ‘ఇంగ్లీష్ మీడియం’ క్లాసులను స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఇర్ఫాన్‌ఖాన్, సాబా క్వామర్, దీపక్ డోబ్రియల్, షాయన్న పటేల్ ముఖ్య తారలుగా రూపొందిన ‘హిందీ మీడియం’ చిత్రం గతేడాది బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ అయింది. సాకేత్ చక్రవర్తి దర్శకుడు. ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనున్నట్లు ఆ మధ్య బాగానే ప్రచారం జరిగింది. అయితే ఇర్ఫాన్‌ఖాన్ క్యాన్సర్ చికిత్స కోసం లండన్ వెళ్లడంతో ‘హిందీ మీడియం’ సీక్వెల్ ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఆయన ముంబైకి తిరిగిరావడంతో సీక్వెల్‌పై మళ్లీ ప్రచారం ఊపందుకుంది. ఇర్ఫాన్ నటించేందుకు ఓకే చెప్పారని, సమ్మర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని టాక్. ఈ చిత్రానికి హోమి అడజానియా దర్శకత్వం వహిస్తారట. ఇందులో కథానాయిక పాత్ర కోసం రాధికా ఆప్టేను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ఈ సినిమాకు ‘ఇంగ్లీష్ మీడియం’ అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారని వినికిడి. ఇందులో ఇర్ఫాన్ కూతురిగా ‘పటఖా’ ఫేమ్ రాధిక మాదన్ కనిపిస్తారని సమాచారం. -
ప్రమోషన్స్ ఎంజాయ్ చేయలేను
సినిమా తీయడం ఎంత ముఖ్యమో దాన్ని ప్రమోట్ చేయడం కూడా అంతే ముఖ్యం. బాలీవుడ్ స్టార్స్ అయితే సినిమా ప్రమోషన్స్ కోసం నెలకుపైనే సమయాన్ని వెచ్చిస్తుంటారు. అయితే ప్రమోషన్ చేయడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయలేను అంటున్నారు బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. ఆమె నటించిన లేటెస్ట్ చిత్రం ‘బొంబేరియా’. ఈ సినిమాలో రాధికా ఆప్టే పీఆర్ (పబ్లిక్ రిలేషన్) ఏజెంట్‌గా పాత్ర చేశారు. ఈ చిత్రంలో తన పాత్ర గురించి మాట్లాడుతూ – ‘‘హీరోయిన్గా రోజూ చాలా మంది పీఆర్‌లతో జర్నీ చేస్తుంటాం. వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఈ సినిమాలో చేసిన పాత్ర తర్వాత తెలుసుకున్నాను. ఏదైనా పని చేయించుకోవడానికి వాళ్లు చాలా మంది ఈగోని సంతృప్తిపరచాల్సి ఉంటుంది. ఎంతో మందిని డీల్ చేయాల్సి ఉంటుంది. సినిమా ప్రమోషన్స్‌లో కీలక భాగమై ఉంటారు. ప్రమోషన్స్ చేసే విషయానికి వస్తే.. నేను ఎంజాయ్ చేయలేని పని ఏదైనా ఉందంటే అది సినిమా ప్రమోషన్సే. నటిగా నా సినిమాలను నేను ప్రమోట్ చేయాలి.. అది నా బాధ్యత. కానీ ఆ పనిని ఎంజాయ్ చేయలేను. సినిమా షూటింగ్ చేయడమో, చేయబోయే క్యారెక్టర్ని ఇంకా బాగా స్టడీ చేయడమో లాంటి పనులను బాగా ఇష్టపడతాను’’ అని పేర్కొన్నారు రాధికా ఆప్టే. -
‘సయీద్ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’
ఘూల్... అంటే అరబిక్‌లో ఆత్మ అని అర్థం!అబు ఘ్రైబ్.. అంటే కోవర్ట్ డిటెన్షన్ సెంటర్. బ్రిటిషర్స్ కాలంలోని కాలాపాని లాంటిది.. నాజీ కాన్సంట్రేషన్ క్యాంప్ లాంటిది. అండర్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉంటారు ఆర్మీ అధికారులు. ఈ రెండిటి కథే.. ఘూల్. నెట్‌ఫ్లిక్స్ సెకండ్ ఒరిజినల్. మూడు ఎపిసోడ్ల మినీ సిరీస్. నిదా రహీమ్ (రాధికా ఆప్టే).. నేషనల్ ప్రొటెక్షన్ స్క్వాడ్ ట్రైనీ. ఆమె తండ్రి ప్రొఫెసర్. యాక్టివిస్ట్ కూడా. ప్రభుత్వం నిషేధించిన సిలబస్‌ను పిల్లలకు బోధిస్తున్నాడని తండ్రి గురించి పోలీసులకు ఉప్పందించి అతనిని అరెస్ట్ చేయిస్తుంది. ప్రొఫెసర్‌ను కోవర్ట్ డిటెన్షన్ సెంటర్‌కు తరలిస్తారు. ఇంటరాగేషన్ ద్వారా తండ్రి తన తప్పు తెలుసుకొని పరివర్తన చెందిన వ్యక్తిగా బయటకు వస్తాడని నిదా నమ్మకం. ఆమె ఇంటరాగేషన్ స్కిల్స్ పట్ల ఆర్మీలో మంచి పేరుంటుంది. సొంత తండ్రినే పట్టించిందన్న కీర్తీ కూడి డిటెన్షన్ సెంటర్లో ఇంటరాగేషన్ ఆఫీసర్‌గా అవకాశం వస్తుంది నిదాకు. దానికి హెడ్ డకున్హా (మానవ్ కౌల్) అనే మిలటరీ ఆఫీసర్. అనుమానం.. అసహనం ఆ సెంటర్ ఒక చీకటి గుహ. అందులో పనిచేసే వాళ్లకు కనీసం పగలు, రాత్రి తేడా తెలిసేలా ఉండాలని డిమ్ లైట్లు పెడ్తారు. ఆ వాతావరణానికి త్వరగా అలవాటు పడమని నిదాకు హుకుం జారీ చేస్తాడు ఆఫీసర్ డకున్హా. అక్కడే ఉన్న మరో లేడీ ఆఫీసర్ మేజర్ దాస్ (రత్నాబాలి భట్టఛార్జి). దేశభక్తిని నరనరాన నింపుకున్న ఆమెకు నిదా నచ్చదు. ముస్లిం అని, ఆమెను నమ్మడానికి వీల్లేదని డకున్హాకు చెప్తుంది. నిత్యం నిదాను అనుమానిస్తూ, మాటలతో వేధిస్తూంటుంది. అప్పుడే అక్కడికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అలి సయీద్‌ను తీసుకొస్తారు. ‘‘అలి సయీద్ నోట నిజాలు కక్కించి నీ ఇంటరాగేషన్ స్కిల్స్ నిరూపించుకో’’ అని సవాలు విసురుతాడు డకున్హా. ఆ ప్రయత్నంలోనే అలి సయీద్ నిదాను ‘‘నిదూ’’ అని పిలుస్తాడు. షాక్ అవుతుంది ఆమె. ‘‘నువ్వెవరు?’’అని రెట్టిస్తుంది సయీద్‌ని. మొహం, నోటి నుంచి రక్తమోడుతున్న అతడు వికృతంగా నవ్వుతాడు. భీతిల్లి వెనక్కి తగ్గుతుంది నిదా. ‘‘భయపడొద్దు.. బయట ఇంటరాగేషన్‌కు, ఇక్కడ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. నేర్చుకోవాలి’’ అని చెప్పి వెళ్లిపోతాడు డకున్హా. అసహనంగా నసుగుతూ నిదాను క్యాంటీన్‌కి తీసుకెళ్తుంది మేజర్ దాస్. ‘‘ఏమైందీ భయపడ్డావా?’’ అంటూ అనునయం నటిస్తుంది ‘‘నన్ను నిదూ అని మా నాన్న మాత్రమే పిలుస్తారు. ఆ పేరు సయీద్కెలా తెలిసింది?’’ అదే షాక్‌లో అడుగుతుంది నిదా. ‘‘వేషాలు వేయకు. నీకన్నీ తెలుసు. మీరంతా ఒకటే’’ స్థిరమైన గొంతుతో బెదిరిస్తుంది మేజర్ దాస్. అవాక్కవుతుంది నిదా. తండ్రి గుర్తొస్తాడు. ‘‘నాన్న ఏమైనట్టు?’’ ఆలోచన మొదలవుతుంది. ఆ రాత్రి ఆమెకు పీడకలొకటి వస్తుంది. తండ్రి పిశాచమై తనను పీక్కు తింటున్నట్టు. దిగ్గున లేచి కూర్చుంటుంది. ఆ రాత్రంతా నిద్రపోదు. ఏదో తెలియని గిల్ట్ వెంటాడుతుంటుంది. తెల్లవారి.. తన తండ్రి గురించి డకున్హాను అడుగుతుంది నిదా. అక్కడి నుంచి పంపేశామని చెప్పి.. అలి సయీద్ ఇంటరాగేషన్ కంటిన్యూ చేయమంటాడు. ఆరోజు.. నిదాతో పాటు చౌదరి, గుప్తా ఇద్దరూ ఇంటరాగేషన్ సెల్‌లోకి వెళ్తారు. సయీద్‌ను ఇంటరాగేట్ చేయడానికి సన్నద్ధమవుతుంటే.. ఆ సెంటర్లో జరిగిన కొన్ని నేరాల గురించి మాట్లాడ్తాడు సయీద్. విస్మయానికి లోనవుతారు చౌదరి, గుప్త. నిదాకు అంతా అయోమయంగా ఉంటుంది. చౌదరీకి తెలియకుండా, గుప్తా, గుప్తాకు తెలియకుండా చౌదరి చేసినవీ చెప్పి వాళ్లిద్దరి మధ్య చిచ్చు పెడ్తాడు. సయీద్ ఇంటరాగేషన్‌ను మరిచిపోయి ఆ ఇద్దరూ గొడవపడ్తుంటారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించి విఫలమవుతుంది నిదా. గుప్తాను కత్తితో పొడిచేస్తాడు చౌదరి. ఈ గొడవకు పరిగెత్తుకొచ్చిన డకున్హా, నిదా అంతా హతాశులవుతారు. అప్పుడూ నింద నిదా మీద తోసెయ్యడానికే చూస్తుంది మేజర్ దాస్. వాళ్లందరినీ బయటకు పంపేసి సయీద్‌కు కరెంట్ షాక్ ఇస్తాడు డకున్హా. ‘‘ఘూల్ ఘూల్’’ అని సణుగుతూ నోట్లోంచి నురగలు కక్కి తలవాల్చేస్తాడు సయీద్. అతను చనిపోయాడనుకుంటాడు డకున్హా. ఇదంతా రికార్డ్ రూమ్‌లోంచి గమనిస్తున్న నిదా.. సయీద్ సణిగిన మాట ఏంటో తెలుసుకోవాలనుకుంటుంది. టెర్రరిస్ట్ ముద్రతో సెల్లో ఉన్న ఒక మౌల్వీని పిలిచి ఆ రికార్డింగ్ వినిపించి అర్థం అడుగుతుంది. బిత్తరపోతాడు మౌల్వీ. చెప్పమని గద్దిస్తుంది నిదా. ‘‘ఘూల్ అంటే అరబిక్‌లో ఆత్మ. సయీద్ మనిషి కాడు. వాడు ఆత్మ’’ అని చెప్పి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు మౌల్వీ. డకున్హా ఇంటరాగేషన్ గదిలోంచి బయటకు రాగానే నిదా వెళ్లి చూస్తుంది. అక్కడ సయీద్ శరీరం ఉండదు. మళ్లీ ఎప్పటిలాగే గొలుసులతో బంధించి ఉంటుంది. అతను వికటాట్టహాసం చేస్తుంటాడు. చంపాలని ప్రయత్నిస్తుంది కాని కుదరదు. అప్పుడు నిదాకూ నిర్ధారణవుతుంది సయీద్ మనిషి కాదు అని. ఆ విషయమే డకున్హా, మేజర్ దాస్లతో చెప్తుంది. ఎవరూ నమ్మరు. మేజర్ దాసైతే నిదానూ టెర్రరిస్ట్‌గా ముద్ర వేసేస్తుంది. ఇంకో రోజు.. ఇంటరాగేషన్ స్పెషలిస్ట్ ఫౌలాద్ సింగ్ వస్తాడు సయీద్‌ను హింసించడానికి. ఆ టైమ్‌లోనే నిదా మౌల్వీ సెల్‌లోకి వెళ్తుంది ఘూల్కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం. అపరాధభావంతో బాధపడేవాళ్ల శరీరాన్ని ఘూల్ కోరుకుంటుందని, అలా వాళ్ల శరీరంలోకి జొరబడి ప్రతీకారం తీర్చుకుంటుందని చెప్తాడు మౌల్వీ. తన తండ్రి గురించీ ఆరా తీస్తుంది. ఏమీ చెప్పడు మౌల్వీ. ఈ లోపు స్పెషల్ ఇంటరాగేషన్ సెల్ నుంచి పెద్ద కేక వినిపిస్తుంది. అటుగా పరిగెత్తుతుంది నిదా. అప్పుడే డకున్హాకు ఫోన్ వస్తుంది. ‘‘సర్.. సయీద్ రాత్రి చనిపోయాడు. వాళ్లింట్లోనే శవం దొరికింది’’ అనే సమాచారంతో. డకున్హాకు నోట మాటరాదు. మరిక్కడ ఉంది ఎవరు? స్పెషల్ ఇంటరాగేషన్ సెల్లో ఫౌలాద్ సింగ్ బాడీ కనిపిస్తుంది నిదాకు. సయీద్ అనుకుంటున్న వాడు ఏమైనట్టు? అనే డౌట్ వచ్చేలోపే ఫౌలాద్ సింగ్ శరీరంలో ఉన్న ఆత్మ గబగబా సెల్ నుంచి బయటకు వచ్చి ఇతర సెల్స్ తలుపులు తెరిచి అందులోని ఖైదీలందరినీ విడుదల చేస్తుంది. ఈ క్రమంలోనే నిదాను చూస్తుంది. ఆమె భయపడి తప్పించుకోవడానికి పరిగెత్తుతుంది. సరైన సమయంలో డకున్హా అండ్ టీమ్ వచ్చి ఆమెను రక్షిస్తారు. అప్పడు జరిగిందంతా చెప్తుంది. వెళ్లి చూసి నిజమనే నమ్ముతారు. కాని మేజర్ దాస్ నమ్మదు. ఆ ఖైదీలను విడిపించడానికి నిదా ఆడుతున్న నాటకం అని, ఆమె వచ్చాకే ఆ సెంటర్ అంతా గందరగోళంగా తయారైందని, తమలో తామే తన్నుకు చస్తున్నారని మిగిలిన వాళ్లను రెచ్చగొడ్తుంది. వాళ్లూ నమ్ముతారు. మేజర్ దాస్ ఆజ్ఞ మేరకు నిదాను సెల్లో వేస్తారు. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ మిగిలిన ఖైదీలు కనిపిస్తారు. ఆ గదిలో హత్యలు జరిగినట్టు గోడకు తుపాకీ తూటాల ఛిద్రాలు, రక్తం మరకలు కనిపిస్తాయి. అప్పుడు అర్థమవుతుంది నిదాకు. అది ఇంటరాగేట్ చేసి మనుషులను మార్చే సెంటర్ కాదు.. ఫక్తు హత్యలు చేసే సెంటర్ అని. అప్పుడు అక్కడే ఉన్న మౌల్వీని అడుగుతుంది మళ్లీ తన తండ్రి గురించి. చనిపోయి ఉంటాడని చెప్తాడు. అక్కడున్న ఖైదీల్లోనే ఎవరో ఘూల్ అన్న విషయమూ బోధపడ్తుంది నిదాకు. ‘అహ్మద్’ అనే వ్యక్తిని చూపిస్తూ నువ్వేనా అని అడుగుతుంది. ‘‘వాడు మూగవాడు.. ఆత్మ మూగవాడి శరీరంలోకి ప్రవేశించదు’’ అంటాడు మౌల్వీ. ‘‘ఒక టీ అమ్ముకునే వాడిని టెర్రరిస్ట్ అని పట్టుకొచ్చారు. వీడి నుంచి విషయాలు ఏమీ రాబట్టలేకపోయే సరికి వీడి భార్య, కొడుకును పట్టుకొచ్చి వీడి కళ్లముందే చంపేశారు. అప్పటి నుంచి వీడికి మాట పడిపోయింది’’ అని జరిగింది చెప్తాడు మౌల్వీ. దిమ్మ తిరుగుతుంది నిదాకు. చిమ్నీ చూపించి దాన్నుంచి బయటకు పొమ్మని అహ్మద్‌కు చెప్పి తనూ అహ్మద్ వెనక వెళ్తుంది. అహ్మద్ బయటపడి.. నిదాకూడా బయటపడే టైమ్‌కి ఘూల్ ఆమెను లోపలికి లాగి కాలి పిక్కను కొరుకుతుంది. అయినా తప్పించుకుని బయటకు వస్తుంది. ఇద్దరూ కలిసి డకున్హా చాంబర్‌కు వెళ్తారు. అక్కడ జరిగిన పెనుగులాటలో నిదా రూపంలో ఉంది ఆత్మ అని అర్థమవుతుంది అహ్మద్ కు. లోపల అసలు నిదా ఉంటుంది. మేజర్ దాస్.. నిదాను చంపబోతుంటే డకున్హా మేజర్ దాస్‌ను చంపేస్తాడు. మిగిలిన వాళ్లలో ఒకొక్కరిలోకే ఆత్మ చేరి ఒకొక్కరినీ చంపేస్తుంటుంది. ఈలోపు తన తండ్రిని చంపమని ఆర్డర్ ఇచ్చింది డకున్హానే అని తెలుస్తుంది నిదాకు. పశ్చాత్తాపంతో కుమిలి పోతుంది. అహ్మద్‌తో కలిసి ఆ సెంటర్ నుంచి బయటకు వస్తుంది. బాంబు వేసి ఆ సెంటర్‌ను పేల్చేసి తనూ బయట పడ్తాడు డకున్హా. సెంటర్ బయట ఆర్మీ ఉంటుంది. డకున్హాను చూసి ‘‘వీడు మనిషి కాదు.. ఘూల్ ’’ అంటూ ఆర్మీ వారిస్తున్నా వినకుండా డకున్హాను చంపేస్తుంది నిదా. ఆర్మీ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారు. అప్పుడు చెప్తుంది నిదా.. ‘‘అది కోవర్ట్ డిటెన్షన్ సెంటర్ కాదు.. హత్యలు చేసే సెంటర్. అందరూ కరప్ట్ అయ్యారు’’అంటూ. నిదా కూడా టెర్రరిస్టే అని ముద్ర వేసి ఆమెనూ కోవర్ట్ డిటెన్షన్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడ.. బ్లేడ్‌తో అర చేతిని కోసుకొని రక్త తర్పణ చేసి తన శరీరంలోకి ఘూల్ని ఆహ్వానించేందుకు సిద్ధపడ్తుంది నిదా!ఇక్కడితో ‘ఘూల్’ సీజన్ వన్ ఎండ్ అవుతుంది. హైపర్ నేషనలిజం, ఇస్లామోఫోబియా వల్ల తలెత్తిన ఘర్షణకు దృశ్యరూపం ‘‘ఘూల్’’. హిందీ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంది. దర్శకుడు పాట్రిక్ గ్రాహమ్. – సరస్వతి రమ -
స్క్రీన్ టెస్ట్
రైతులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో, సినిమా పరిశ్రమకు కూడా అంతే పెద్ద పండగ. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరూ సంక్రాంతి మూడ్‌లోనే ఉన్నారు. అందుకే సంక్రాంతి సినిమాల గురించి, సినిమా వాళ్ల సంక్రాంతి గురించి ఈ వారం క్విజ్... 1. 2012, 2013, 2014 వరుసగా సంక్రాంతికి తన సినిమాలను విడుదల చేసిన టాప్ హీరో ఎవరో కనుక్కోండి? ఎ) ప్రభాస్ బి) మహేశ్‌బాబు సి) చిరంజీవి డి) అల్లు అర్జున్ 2. తెలుగు నిర్మాతల్లో ఏ నిర్మాతను ‘సంక్రాంతి రాజు’ అన్నారో తెలుసా? ఎ) జీవీజీ రాజు బి) ‘దిల్’ రాజు సి) అర్జున్ రాజు డి) యం.యస్. రాజు 3. ఈ సంక్రాంతికి (2019) విడుదలైన సినిమాల్లో ఏ బాలీవుడ్ హీరోయిన్ తెలుగు తెరకు పరిచయమయ్యారో చెప్పుకోండి? ఎ) విద్యాబాలన్ బి) కియరా అద్వానీ సి) శ్రద్ధాకపూర్ డి) కంగనా రనౌత్ 4. ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అంటూ 2017 సంక్రాంతికి వచ్చారు నాగార్జున. ఆ చిత్రంలో బంగార్రాజు సరసన నటించిన నటి గుర్తున్నారా? ఎ) లావణ్యా త్రిపాఠి బి) రమ్యకృష్ణ సి) అనసూయ డి) అనుష్క 5. తెలుగు వారి పెద్ద పండగ ‘సంక్రాంతి’. ఆ పేరుతో విడుదలైన సినిమాలో తెలుగులో పేరున్న నలుగురు హీరోలు నటించారు. వెంకటేశ్, శ్రీకాం త్, శివబాలాజీలతో పాటు మరో తమ్ముడుగా నటించిన ఆ నటుడెవరో చెప్పండి? (ఇప్పుడు ఆ నటుడు తెలుగు సినిమాల్లో ఓ ప్రముఖ హీరో) ఎ) శర్వానంద్ బి) తరుణ్ సి) రోహిత్ డి) ఆకాశ్ 6. ‘సంక్రాంతి వచ్చిందే తుమ్మెద... సరదాలు తెచ్చిందే తుమ్మెద...’ అనే పాట ‘సోగ్గాడి పెళ్లాం’ చిత్రంలోనిది. ఈ పాటలో నటించిన హీరో ఎవరో గుర్తు తెచ్చుకోండి? ఎ) మోహన్‌బాబు బి) హరనాథ్ సి) చంద్రమోహన్ డి) శ్రీధర్ 7. మహేశ్‌బాబు, వెంకటేశ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సంక్రాంతికి విడుదలై విజయం సాధించింది. ఆ చిత్రదర్శకుడెవరో కనుక్కోండి? ఎ) శ్రీకాంత్ అడ్డాల బి) సుకుమార్ సి) కృష్ణవంశీ డి) త్రివిక్రమ్ 8. ‘శతమానం భవతి ’ చిత్రంలోని సంక్రాంతి పాటలో శర్వానంద్, అనుపమా పరమేశ్వరన్ సందడి చేశారు. ‘‘గొబ్బిళ్లో గొబ్బిళ్లు....’ అంటూ సాగే ఆ పాట రచయితెవరో కనుక్కోండి? ఎ) అనంత శ్రీరామ్ బి) సిరివెన్నెల సి) రామజోగయ్య శాస్త్రి డి) శ్రీమణి 9. ఎన్టీ రామారావును ‘మనదేశం’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయం చేశారు ఎల్వీ ప్రసాద్. వారిద్దరి కాంబినేషన్లో అనేక సినిమాలు వచ్చినప్పటికీ 1955లో వచ్చిన ఓ సినిమా సంక్రాంతికి విడుదలై సంచలనం సృష్టించింది. ఆ చిత్రం పేరేంటి? ఎ) మనదేశం బి) షావుకారు సి) సంసారం డి) మిస్సమ్మ 10. 2017 సంక్రాంతికి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ రిలీజైంది. అది ఆయన నటించిన 100వ చిత్రం. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమిగా నటించిన ప్రముఖ బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) రవీనా టాండన్ బి) టబు సి) హేమమాలిని డి) సుస్మితా సేన్ 11. ‘శంకర్ దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి హీరోగా చేసిన చిత్రం ‘ఖైదీ నంబర్ 150’. ఎన్ని సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరు ఈ సినిమా చేశారో తెలుసా ? (ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది) ఎ) 7 ఏళ్లు బి) 8 ఏళ్లు సి) 10 ఏళ్లు డి) 6 ఏళ్లు 12. 2010 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన జూనియర్ యన్టీఆర్ సినిమా పేరేంటో తెలుసా? ( చిన్న క్లూ: ఆ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు) ఎ) అదుర్స్ బి) ఆం్ర«ధావాలా సి) యమదొంగ డి) నరసింహుడు 13. ఈ ప్రముఖ దర్శకుని సినిమా ఒక్కసారి కూడా సంక్రాంతి బరిలోకి రాలేదు. ఎవరా దర్శకుడు. కొంచెం మెదడుకి పదును పెట్టండి? ఎ) పూరి జగన్నాథ్ బి) వీవీ వినాయక్ సి) ఎస్.ఎస్. రాజమౌళి డి) సుకుమార్ 14. ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకు రెండు చిత్రాలు మాత్రమే సంక్రాంతి పందెంలో నిలిచాయి. అందులో ఒకటి వీవీ వినాయక్ దర్శకత్వం వహించిన ‘యోగి’. మరో చిత్రం ఏంటో కనుక్కుందామా? ఎ) వర్షం బి) పౌర్ణమి సి) బిల్లా డి) మున్నా 15. ‘సంక్రాంతి’, ‘గోరింటాకు’, ‘దీపావళి’ మూడు పండగల పేర్లతో ఉన్న సినిమాలలో హీరోయిన్గా నటించిన నటి ఎవరో కనుక్కుందామా? ఎ) స్నేహా బి) ఆర్తి అగర్వాల్ సి) సౌందర్య డి) కల్యాణి 16. ‘ఊరంతా సంక్రాంతి’ చిత్రంలో ఇద్దరు పాపులర్ హీరోలు నటించారు. అందులో ఒకరు ఏయన్నార్. మరో హీరో ఎవరు? ఎ) కృష్ణ బి) శోభన్‌బాబు సి) కృష్ణంరాజు డి) నాగార్జున 17. కమల్‌హాసన్ నటించిన ‘మహానది’ చిత్రంలో ‘సంక్రాంతి..సంక్రాంతి...’ అనే హిట్ పాట ఉంది. ఈ సినిమా సంగీత దర్శకుడెవరో తెలుసా? ఎ) ఇళయరాజా బి) దేవా సి) ఎస్.ఎ. రాజ్‌కుమార్ డి) కేవీ మహదేవన్ 18. తన మొదటి చిత్రంతోనే సంక్రాంతి బరిలో నిలిచిన దర్శకుడెవరో తెలుసా? ఆయన దర్శకత్వం వహించిన మూడు చిత్రాలు ఇప్పటివరకు సంక్రాంతి పోటీలో నిలిచాయి. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) శ్రీను వైట్ల బి) బోయపాటి శ్రీను సి) క్రిష్ డి) శేఖర్ కమ్ముల 19. 2019 సంక్రాంతికి ఒకే ఒక డబ్బింగ్ సినిమా విడుదలైంది. ఆ చిత్రం ‘పేట’. రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయన సరసన నటించిన ఇద్దరు హీరోయిన్లలో ఒకరు త్రిష. మరో హీరోయిన్? ఎ) నయనతార బి) రాధికా ఆప్టే సి) సిమ్రాన్ డి) మీనా 20. సంక్రాంతి అనగానే తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద సినిమాలు రిలీజవుతాయి. 2017 సంక్రాంతికి చిరంజీవి నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’, బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ వచ్చాయి. ఈ రెండు చిత్రాలకు మాటల ర^è యిత ఒక్కరే. ఆయనెవరు? ఎ) వక్కంతం వంశీ బి) అబ్బూరి రవి సి) బుర్రా సాయిమాధవ్ డి) యం.రత్నం మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) (బి) 2) (డి) 3) (ఎ) 4) (బి) 5) (ఎ) 6) (ఎ) 7) (ఎ) 8) (డి) 9) (డి) 10) (సి) 11) (సి) 12) (ఎ)13) (సి) 14) (ఎ) 15) (బి) 16) (ఎ) 17) (ఎ) 18) (సి) 19) (సి) 20) (సి) నిర్వహణ: శివ మల్లాల -
రీమేక్ ? చేయాలా? వద్దా?
2018 బాలీవుడ్లో మంచి హిట్ సాధించి, టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘అంథాధూన్’. శ్రీరామ్ రాఘవన్ రూపొందించిన ఈ థ్రిల్లర్‌లో ఆయుష్మాన్ ఖురాన, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఇప్పుడీ సూపర్‌హిట్ చిత్రం సౌత్‌లో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌ను సిద్ధార్థ్‌తో చేయాలనుకున్నారు దర్శక–నిర్మాతలు. బాల్ ఆయన కోర్ట్‌లో ఉంది. వెంటనే సిద్ధార్థ్ ‘‘అంథాధూన్’ లాంటì అద్భుతమైన చిత్రం రీమేక్‌లో నన్ను ఎంతమంది చూడాలనుకుంటున్నారు? సీరియస్‌గా అడుగుతున్నాను చెప్పండి’’ అంటూ ట్వీటర్లో అడిగేశారు. చాలా మంది ఫ్యాన్స్ చేయండి అంటూ సమాధానాలిచ్చారు. ఒరిజినల్లో యాక్ట్ చేసిన ఆయుష్మాన్ ఖురాన కూడా ‘చెయ్ మచ్చా (మావా)’ అని రిప్లై చేశారు. మరి ఈ రీమేక్‌లో సిద్ధార్థ్ కనిపిస్తారో లేదో చూడాలి. -
లావుగా ఉన్నానని వద్దన్నారు!
ఒక సినిమాలో భాగమయ్యే విధానంలో నటీనటులకు విభిన్నమైన అనుభవాలు కలుగుతుంటాయి. అన్నీ మంచి అనుభవాలే అయ్యుండాల్సిన అవసరం లేదు. కొన్ని షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. ఇలా తనకు ఎదురైన ఓ షాకింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని పంచుకున్నారు రాధికా ఆప్టే. ‘‘మనం కథ విన్న అన్ని ప్రాజెక్ట్స్‌కు ఓకే చెప్పాలనేం లేదు. ఎగై్జటింగ్ రోల్ అనిపిస్తేనే నేను గ్రీన్‌సిగ్నల్ ఇస్తాను. ఒక ప్రొడ్యూసర్స్ నాకు ఓ కథ చెప్పారు. అందులో కథానాయిక పాత్ర నాకోసమే రాశాం అన్నారు. ఆ పాత్ర నాకు ఎగై్జటింగ్‌గా అనిపించింది. ఓకే అన్నాను. కానీ ఓ స్మాల్ ట్రిప్ నుంచి తిరిగొచ్చిన తర్వాత వాళ్లను అప్రోచ్ అయితే ‘నువ్వు చాలా లావుగా కనిపిస్తున్నావ్.. మా సినిమాలో తీసుకోం’ అనేశారు. షాకయ్యాను. షూటింగ్‌కు రెండు నెలలు టైమ్ ఉంది. నేను తగ్గుతాను అన్నా కూడా వాళ్లు వినిపించుకోలేదు. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం కొత్తగా అనిపించింది’’ అని పేర్కొన్నారు రాధికా ఆప్టే. ప్రస్తుతం రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్స్ (ది వెడ్డింగ్ గెస్ట్, రెండో ప్రపంచయుద్ధం ఆధారంగా రూపొందుతున్న స్పై థ్రిల్లర్)లతో పాటు వరుస బాలీవుడ్, డిజిటల్ ప్లాట్‌ఫామ్ అవకాశాలతో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు రాధికా ఆప్టే. -
మీటూకు ఆధారాలు అడక్కూడదు
సినిమా: మీటూ ఆరోపణలకు ఆధారాలు అడక్కూడదని నటి రాధికాఆప్తే అంటోంది. ఒక్క దక్షిణాదిలోనే కాదు, భారతీయ సినీ పరిశ్రమలోనే సంచలన నటిగా మారింది రాధికాఆప్తే. కాగా మహిళల వేధింపులకు వ్యతిరేకంగా ఇప్పుడు మీటూ బహుళ పాచుర్యం పొందింది. అయితే ఈ మీటూ తెరపైకి రాక ముందే సినీ పరిశ్రమలో అవకాశాల కోసం పడకగదికి పిలిచే సంస్కృతి ఉందనే విషయాన్ని బట్డబయలు చేసిన నటి రాధికాఆప్తే. అలా ఈ అమ్మడు దక్షిణాది, ఉత్తరాది సినీ వర్గాలకు చెందిన పలువురిపై సంచలన ఆరోపణలు చేసింది. అంతే కాదు తన శృంగార భరిత ఫొటోలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ వార్తల్లో ఉండే నటి రాధికాఆప్తే. అదేమంటే నా శరీరం నా ఇష్టం అంటుంది. తాజాగా ఒక భేటీలో ఈ భామ పేర్కొంటూ తాను మీటూకు నూరు శాతం మద్దతిస్తానని చెప్పింది. లైంగిక వేధింపు చర్యలను సహించేది లేదని పేర్కొంది. ఇప్పుడు మీటూ అనేది చాలా అవసరం అని చెప్పింది. అత్యాచార వేధింపులకు గురైన వారు ఇప్పుడు బహిరంగంగా చెప్పుకోగలుగుతున్నారని, ఇది స్వాగతించదగ్గ విషయం అని అంది. అలాంటి వారికి సమాజం అండగా నిలవడం ఆరోగ్యకరమైన అంశం అని అంది. అయితే మీటూ వ్యవహారంలో ఫిర్యాదు చేసే మహిళలను అందుకు ఆధారాలు అడగడం సబబు కాదని అంది. ఇలాంటి విషయాల్లో ఆధారాలు సేకరించి ఆరోపణలు చేయడం కుదరదని చెప్పింది. ఇకపోతే మహిళలు మగవారి అత్యాచార వేధింపు చర్యలకు వ్యతిరేకించకపోతే వారు తప్పులు చేసుకుంటూనే పోతారని అంది. ఒకసారి తన వెంట పడిన వ్యక్తిని అడ్డగించి బుద్ధి చెప్పానని, అయితే ఆ విషయాన్ని అంతటితోనే మరచిపోయానని చెప్పింది. కానీ చుట్టూ ఉన్న వారు ఆ సంఘటనను గుర్తు చేస్తూనే ఉన్నారని, ఇలాంటి వ్యవస్థ మారాలని రాధికాఆప్తే పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు దక్షిణాదికి పూర్తిగా దూరమై బాలీవుడ్‌నే నమ్ముకుందన్నది గమనార్హం. -
ధైర్యం కావాలి
ఈ ఏడాది ఫుల్ రైజింగ్‌లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ఇటు బాలీవుడ్ సినిమాలతో పాటు అటు హాలీవుడ్ చాన్స్‌లను దక్కించుకుంటున్నారు. మరోవైపు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తారు. అలాగే కల్కి కోచ్లిన్ మరో కథానాయిక. మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో ఓ డైనమిక్ లేడీ పాత్రలో కనిపించనున్నారు రాధిక. ‘‘ఓ ఖాళీ ప్రదేశంలో కనిపించకుండా ఉన్నారు. వారిని దాటుకుంటూనే చాలామంది వెళ్తుంటారు. ఆ కనిపించనివారికి హలో కూడా చెప్పవచ్చు. కానీ వాళ్ల గురించి తెలుసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. కమింగ్ సూన్’’ అని ఈ సినిమా కథనాన్ని వివరించే ప్రయత్నం చేశారు రాధిక. ‘‘ఈ మూవీలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. ఈ నెల 13న మరిన్ని వివరాలు చెబుతాం’’ అని రాజ్‌కుమార్ రావు పేర్కొన్నారు. -
మనిషి గుణ రాగం అంధాధున్
ఏదీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కాదు.. మన ప్రతీ చర్యకు ప్రతిచర్య ఉంటుంది... అంధాధున్ సినిమా ఫిలాసఫీ ఇదే! ఎవరి కోసం ఎవరూ ఉండరు. ఎవరి స్వార్థం వాళ్లదే. మనుషుల్లోని ఈ కోణానికే 24 క్రాఫ్ట్స్‌ను అద్ది తెరమీద ప్రెజెంట్ చేశాడు దర్శకుడు శ్రీరామ్ రాఘవన్. ‘బదలాపూర్’ (ఆయన తీసినదే) సినిమా బిగినింగ్లాగే ‘అంధాధున్’ బిగినింగ్ కూడా మిస్ కాకూడదు. ఈ బిగిని తగిన వ్యవధి వరకూ లాగాడు కాని సినిమా ప్రారంభంలో వేసిన టైటిల్స్‌లో ‘‘లైఫ్.. డిపెండ్స్ ఆన్ ఇట్స్ లివర్’’ ముక్కకే సాగదీస్తే కానీ కనెక్టివిటీ దొరకలేదు. అయినా ఉత్కంఠ తగ్గదు. అంత టైట్‌గా ఉంది స్క్రీన్‌ప్లే. కథ.. సంగీత కళాకారులకు జ్ఞానేంద్రియ లోపం శాపం కాదు.. ఏకాగ్రతను కుదిర్చే వరం! అందుకే బెథోవెన్ సంగీతబ్రహ్మ అయ్యాడు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే తన ప్రయాణాన్నీ మొదలుపెడ్తాడు ఆకాశ్ (ఆయుష్మాన్ ఖురానా). అయితే గుడ్డివాడిగా! అతను పియానో వాద్యకారుడు. అద్భుతమైన ట్యూన్‌తో టాలెంట్‌ను ప్రూవ్ చేసుకొని .. తర్వాత లండన్ వెళ్లిపోయి స్వరప్రయోగాలతో కాలక్షేపం చేయాలనేది ఆయన లక్ష్యం. ఆ ఆశను నెరవేర్చుకునే దిశలో అనూహ్య మలుపుల్లో చిక్కుకుంటాడు. వాటిని పరిష్కరించుకునే ప్రయత్నంలో కొత్త ఆపదలను ఎదర్కొంటుంటాడు. అన్నిటినీ జయించుకుంటూ అనుకున్నది సాధిస్తాడా? గుడ్డివాడిగానే మిగిలిపోయి అంధాధున్ (గుడ్డి రాగం) పాడుకుంటాడా? ఎండ్ తెలుసుకోవాలనుకుంటే సినిమా చూడాల్సిందే! ఈలోపు కొన్ని సీన్స్ గురించి తెలుసుకుందాం. కథా ప్రదేశం.. పుణె. మధ్య తరగతివాళ్లుండే ప్రభాత్ నగర్లో ఉంటుంటాడు హీరో. సంగీతం మీద కాన్సంట్రేషన్ కుదరడానికి గుడ్డితనాన్ని టూల్‌గా వాడుకుంటాడు. ఒకరోజు యాక్సిండెటల్గా.. లిటరల్లీ యాక్సిడెంటల్‌గానే కలుస్తుంది సోఫీ (రాధికా ఆప్టే). ఆమె ఓ క్లబ్ ఓనర్ కూతురు. ఆ యాక్సిడెంట్లోనే ఆకాశ్ పియానో ప్లేయర్ అని తెలుస్తుంది. తమ క్లబ్‌కి తీసుకెళ్లి తండ్రికి పరిచయం చేస్తుంది. ఆ క్లబ్లో పియానో వాయించే ఉద్యోగం ఇస్తాడు ఆమె తండ్రి. ఆ రోజు సాయంకాలం సోఫీ .. ఆకాశ్‌ను ఇంటి దగ్గర దింపేసి వెళ్తుంటే.. నల్ల కళ్లజోడు తీసి సోఫీని చూస్తాడు ఆకాశ్. ఆ విషయాన్ని ఆ ఇంటి కింద ఉన్న ఓ పిల్లాడు గ్రహిస్తాడు. సహజంగా ఆ పిల్లాడు ఆకాశ్‌ను ఏడిపిస్తుంటాడు గుడ్డివాడని. సంగీతం.. సాగనంపడం అలా సోఫీ వాళ్ల క్లబ్లో ఆకాశ్ పాత పాటలకు ఫిదా అవుతాడు రియల్టర్‌గా మారిన మాజీ హీరో ప్రమోద్ సిన్హా (ఆనంద్ ధవన్). తెల్లవారి వాళ్ల మ్యారేజ్ డే సందర్భంగా ఇంటికొచ్చి పియానో వినిపించాల్సిందిగా కోరుతాడు. తన భార్యకు ఇష్టమైన రాజేశ్ ఖన్నా పాటలు వినిపించాలని అడుగుతాడు. సరేనని తెల్లవారి ప్రమోద్ సిన్హా చెప్పిన సమయానికి వాళ్లింటికి వెళతాడు ఆకాశ్. కాని ఆయన లేడని చెప్తుంది ఆయన భార్య సిమీ సిన్హా (టబు). గుమ్మంలోనే చాలా సేపు మాట్లాడుతుంటుంటే.. ఎదురింటి ఫ్లాట్ ఆవిడ తలుపు తెరిచి చూస్తుంది. ఇబ్బందిగా ఫీలయ్యి ఆకాశ్‌ను లోపలికి రమ్ముంటుంది సిమీ. ఇంట్లోకొచ్చిన ఆకాశ్‌కు హాల్లో ఉన్న పియానో చూపిస్తుంది సిమీ. కచేరీ మొదలుపెడ్తాడు ఆకాశ్. పియానో మెట్ల మీద వేళ్లను పరిగెత్తిస్తుంటే రక్తం, లిక్కర్ కలిసిన మడుగు.. ఓ మనిషి కాళ్లూ అతని కంటబడ్తాయ్. ఆ ఇంటి యజమాని ప్రమోద్సిన్హా హత్య జరిగిందని తెలుస్తుంది. అయినా గుడ్డిగా ఏమీ ఎరగనట్టు ఆ ఇంట్లోంచి సెలవు తీసుకొని సరాసరి పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు ఆకాశ్. తీరా అక్కడికి వెళ్లే సరికి ఆ ఇన్స్పెక్టర్ సిమీ సిన్హా బాయ్‌ఫ్రెండే అని తేలుతుంది. గతుక్కుమంటాడు. ఆ ఇన్స్పెక్టరూ సిమీ వాళ్లింట్లో ఆకాశ్‌ను చూస్తాడు. అతను గుడ్డివాడు కాదేమోనని అనుమానపడ్తాడు. ఆ విషయం సిమీకి చెప్పి వాకబు చేయమంటాడు. ఈలోపు పోలీస్ ఎంక్వయిరీలో ప్రమోద్ సిన్హా హత్య వెనక సిమీ సిన్హా హస్తం ఉందనే డౌట్‌ను పోలీసుల ముందు క్రియేట్ చేస్తుంది ఎదురింటి ఆవిడ. ఈ విషయం సిమీకి తెలిసి ఆ ముసలావిడను బిల్డింగ్ మీద నుంచి తోసి చంపేస్తుంది. యాదృచ్చికంగా దీనికీ సాక్షిగా నిలుస్తాడు ఆకాశ్. ఈ సంఘటనతో ఆకాశ్ కంటి చూపు మీద సిమీకీ సందేహం వస్తుంది. నివృత్తి చేసుకోవడానికి ఆకాశ్ వాళ్లింటికి వెళ్తుంది. గుడ్డివాడు కాదని రుజువవుతుంది. స్వీట్‌తో విషప్రయోగం చేసి ఆకాశ్ చూపు నిజంగానే పోయేలా చేస్తుంది. ఈలోపు సోఫీ ఆకాశ్ వాళ్లింటికి వస్తుంది. ఆకాశ్ అంధుడు కాదు అని అందరికన్నా ముందు అనుమాన పడ్డ ఆకాశ్ ఇంటి దగ్గరి కుర్రాడు.. ఆకాశ్ వీడియో తీస్తాడు అతనికి చూపు ఉంది అని నిరూపించడానికి. సోఫీ వచ్చినప్పుడు ఆ వీడియో చూపిస్తాడు. ఆకాశ్ తనను మోసం చేశాడనే కోపం, ఉక్రోషంతో గదికి వెళ్తుంది. అక్కడ సిమీ కనపడుతుంది. అవాక్కవుతుంది సోఫీ. ఆకాశ్ పడుకొని ఉంటాడు. ఆ గది వాతావరణం, సిమీ ప్రవర్తనను బట్టి వాళ్లిద్దరి మధ్య ఏదో జరిగిందని అర్థం చేసుకొని ‘‘ఆకాశ్‌కి ఇన్ఫామ్ చేయండి .. మా నాన్న పియానో అమ్మేశాడు. క్లబ్లో అతనికిక ఉద్యోగం లేదని’’ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది సోఫీ. ఇక్కడ ఆ పాత్ర పాజ్ తీసుకుంటుంది. తర్వాత... ఆకాశ్‌కి చూపు పోయినంత మాత్రాన నోరుంది కాబట్టి తమ నేరాన్ని బయటకు చెప్పే ప్రమాదం ఉందని భయపడ్డ ఇన్స్పెక్టర్ ఆకాశ్‌ను చంపడానికి ప్రయత్నిస్తాడు. తప్పించుకుని ఓ డాక్టర్ చేతిలో పడ్తాడు ఆకాశ్. ఆ డాక్టర్.. ఆర్గాన్స్ అమ్ముకునే వ్యాపారి. అంధుడిగా ఆకాశ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు అతనిని డ్రాప్ అండ్ పికప్ చేసే ఆటోవాలా, ల్యాటరీ టిక్కెట్లు అమ్ముకునే మహిళ.. ఈ ఇద్దరి బ్రోకర్ల సహాయంతో ఆకాశ్ కిడ్నీలను అమ్మేయాలని చూస్తాడు డాక్టర్. తెలుసుకున్న ఆకాశ్.. సిమీ విషయం చెప్పి ఆమెను కిడ్నాప్ చేస్తే కోటి రూపాయలు సంపాదించొచ్చని ఆశ చూపించి ఆపదలోంచి తప్పించుకోవాలనుకుంటాడు. కిడ్నాప్‌కు ప్లాన్ చేస్తారు వాళ్లందరూ కలిసి. పోలీస్ భార్యకు ఫోన్ చేసి ప్రమోద్ సిన్హాను హత్య చేసింది మీ భర్తే అని చెప్తారు. సాక్ష్యాలూ ఉన్నాయని, కోటి రూపాయలు ఇవ్వకపోతే మీడియాకు లీక్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తారు. భర్తతో కోటి రూపాయలు పంపిస్తానని ఒప్పుకుంటుంది. ఆకాశ్‌ను కూడా తప్పిస్తే ఆ కోటి రూపాయాలు తామే కొట్టేయొచ్చని పథకం పన్ని ఆకాశ్‌నూ బంధిస్తారు ఆటోవాలా, లాటరీ టిక్కెట్ల మహిళ. కాని పోలీస్ చేతిలో మోసపోయి ఆటోవాలా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటాడు. ఇక్కడ మళ్లీ సిమీ.. ఆకాశ్‌ను మోసం చేయాలనుకుంటుంది. ఆర్గాన్స్ అమ్మే ప్రాసెస్‌లో సేకరించిన బ్లడ్ శాంపుల్స్‌లో సిమీది రేర్ బ్లడ్ గ్రూప్ అని, ఆ గ్రూప్‌తో ఉన్న ఓ దుబాయ్ షేక్ కూతురికి సిమీ లివర్ ఇస్తే కోటి ఏంటి ఆరు కోట్లు సంపాదించొచ్చనే ఆలోచనలో పడ్తాడు డాక్టర్. ఆకాశ్తోనూ చెప్పి.. లివర్ అమ్మేయగా వచ్చిన డబ్బులోంచి కోటి ఇస్తానని, ఆమె కార్నియాతో కళ్లూ తెచ్చుకోవచ్చని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. సిమీకి మత్తు మందు ఇచ్చి కారు డిక్కీలో పడేసి, ఆకాశ్‌ను తీసుకొని ముంబై ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతాడు డాక్టర్. ఆకాశ్ వద్దని వారిస్తున్నా వినడు. సిమీకి మళ్లీ మత్తు ఇవ్వడానికి దార్లో కారు ఆపి డిక్కీ దగ్గరకు వెళ్తాడు. కట్‌చేస్తే.. కారు మళ్లీ స్టార్ట్ అవుతుంది. ‘‘సిమీ లివర్ అమ్మడం పాపం. జరిగినవేవీ ఎక్కడా చెప్పను. సిమీని, నన్ను వదిలేయండి’’ అని చెప్తుంటాడు ఆకాశ్. ఆ మాటలన్నీ వింటూ మౌనంగా ఏడుస్తూ.. హఠాత్తుగా కారులోంచి ఆకాశ్‌ను దిగిపొమ్మని ఆజ్ఞాపిస్తుంది ఓ స్వరం. ఖంగు తింటాడు ఆకాశ్. డాక్టర్ ఏమయ్యాడు అని అడుగుతాడు సిమీని. ముందు నువ్వు వెళ్లిపో అంటుంది డ్రైవింగ్ సీట్లో ఉన్న సిమీ. దిగిపోతాడు. సిమీ వెళ్లిపోతుంది. కాస్త ముందుకెళ్లాక నోరుంది కదా.. నమ్మడానికి లేదు అని అనుకొని మళ్లీ వెనక్కు తిప్పుతుంది కారును.. ఆకాశ్‌ను ఢీ కొట్టడానికి. ఇంతలోకే ఆ రోడ్డు పక్కనున్న పంటపొలాల్లో ముంగీస బెడద ఎక్కువవడంతో దాన్ని చంపడానికి గురిపెడ్తాడు చేను కాపలాదారుడు.. అది తప్పించుకుని రోడ్డుకి ఆవలవైపు పరిగెడ్తుంది.. కాపలాదారుడి తుపాకి గురి తప్పి సిమీ కారుకు తగులుతుంది. టైర్ బరస్ట్ అయి, పల్టీ కొట్టి సిమీ పడిపోతుంది.. కారు పేలిపోతుంది. రెండేళ్ల తర్వాత.. యూరప్‌లోని ఓ దేశంలోని ఓ క్లబ్లో ఆకాశ్ పియానో వాయిస్తూ ఉంటాడు. ఆ రాగాలు ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది అటుగా వెళ్తున్న సోఫీకి .. ఆమె మళ్లీ అప్పియర్ అయ్యేది ఇక్కడే. బయట నల్ల కళ్లద్దాలు పెట్టుకొని ఉన్న ఆకాశ్ ఫోటో, అతని పేరు ఉన్న పోస్టర్ చూసి కించిత్ ఆశ్చర్యంతో లోపలికి వెళ్తుంది. పాట అయిపోయాక అందరూ వచ్చి అతని చేతిని స్పృశిస్తూ అభినందనలు చెప్తుంటారు. అతనూ దానికి స్పందిస్తూ వాళ్ల చేతిని తడుముతూ కృతజ్ఞతలు చెప్తుంటారు. సోఫీ కూడా వచ్చి షేక్‌హ్యాండ్ ఇస్తుంది.. ఏమీ మాట్లాడకుండా. ఆ స్పర్శను గుర్తించి ‘‘సోఫీ’’ అంటాడు ఆకాశ్. ‘‘కంగ్రాట్స్.. ఇక్కడి వాళ్లనూ ఫూల్స్‌ని చేస్తున్నావన్నమాట’’ అంటుంది. ‘‘అదో పెద్ద కథ.. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా?’’ అని అడుగుతాడు. సరేనని కాఫీ షాప్‌కు వెళ్తారు. జరిగిందంతా చెప్తాడు. నిట్టూర్చి.. ‘‘ఎంతమంది జీవితాలతోనో ఆడుకుంది సిమీ? డాక్టర్ అన్నట్టు ఆమె కార్నియా తీసుకోవాల్సింది నువ్వు’’ అంటుంది సోఫీ. ‘‘అలా తీసుకుని ఉంటే అపరాధ భావంతో సంగీతానికి దూరమయ్యేవాడిని. బై దవే.. రేపు నా కన్సర్ట్ ఉంది.. వస్తావా?’’ అడుగుతాడు. ‘‘రేపు వెళ్లిపోతున్నా. అయినా ట్రై చేస్తా’’ అంటుంది. సరేనని సెలవు తీసుకుంటుండగా.. లోపలి నుంచి వెయిట్రెస్ ముంగీస తలను చెక్కిన చేతికర్రను తెచ్చి ‘‘ఇది మీదే కదా.. ’’ అంటూ ఆకాశ్ చేతికి అందిస్తుంది. ముంగీస బొమ్మ చెవులను తడుముతూ ‘‘అవును నాదే.. థ్యాంక్స్’’ అంటూ ఆ కర్ర సహాయంతో క్లబ్ బయటకు వస్తాడు. వెళ్తూ వెళ్తూ దారిలో కాళ్లకు అడ్డంగా ఉన్న ఖాళీ కోక్ టిన్నును కర్రతో బలంగా కొడ్తాడు. అదెళ్లి ఆ చివరన పడుతుంది. అక్కడున్న వాళ్లంతా ఆ అంధుడిని ఆశ్చర్యంగా చూస్తుంటారు. ది ఎండ్.. అనుకోని ట్విస్ట్‌లు.. కథలో కనిపించే ప్రతి పాత్రకూ ఔచిత్యమైన కంటిన్యూటీ.. ప్రేక్షకుల కళ్లు తిప్పుకోనివ్వదు. ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి ఇంకో నేరం.. దాని నుంచి బయటపడడానికి ఇంకో నేరానికి పాల్పడం.. ఒక పరిస్థితిని ఎవరి స్వార్థానికి వాళ్లు ఉపయోగించుకోవడం.. అవతలి వాడి కష్టాన్ని తమకు లాభంగా మలచుకోవడం.. మనుషుల సామాన్య స్వభావం. అదే అసలు నైజం. ఇదే ఈ సినిమా పల్స్! అంధాధున్ సారాంశం. – శరాది -
అందరికీ ఆ చాన్స్ రాదు
కేవలం వెండితెరపై మాత్రమే కాదు డిజిటల్ సెక్టార్‌లోనూ ఆఫర్లను కొల్లగొడుతూ కెరీర్లో మంచి హైప్లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ‘లస్ట్‌స్టోరీస్, సాక్రెడ్ గేమ్స్, ఘోల్’ వంటి వెబ్ బేస్డ్ మరియు టీవీ షోస్‌లో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారామె. ఈ అనుభవం ఎలా ఉంది? అన్న ప్రశ్నను రాధిక ముందుంచితే...‘‘డిజిటల్ ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో నేనింకా సంతృప్తిగా లేను. ఎందుకంటే ‘లస్ట్ స్టోరీస్’ సిరీస్‌లో ఒక పార్ట్‌లో మాత్రమే ఉన్నాను. ఇక ‘సాక్రెడ్ గేమ్స్’లో చిన్న పాత్ర చేశా. ‘ఘోల్’లో మాత్రమే మెయిన్ లీడ్‌గా చేశాను. కానీ వీటన్నింటిలో నటించడం కొత్త అనుభూతిని ఇస్తోంది. ముందు ముందు ఇంకా మంచి పాత్రలు చేయాలనుకుంటున్నాను అన్నారు’’. ఈ భామ హాలీవుడ్లో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో మైఖేల్ వింటర్ బోటమ్ దర్శకత్వంలో ఓ సినిమా (‘ది వెడ్డింగ్ గెస్ట్’ పరిశీలనలో ఉన్న టైటిల్) చేస్తోన్న సంగతి తెలిసిందే. దీని గురించి మాట్లాడుతూ– ‘‘ఆసియాలోని కొందరి హీరోయిన్స్‌కు మాత్రమే నాన్–ఇండియన్ సినిమాల్లో నటించే చాన్స్ వస్తుంది. ఆ చాన్స్ నాకొచ్చినందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు రాధికా ఆప్టే. ‘రక్తచరిత్ర, లెజెండ్, లయన్’ వంటి తెలుగు సినిమాల్లో రాధికా ఆప్టే నటించిన విషయం తెలిసిందే. ఆమె నటించిన హిందీ చిత్రాలు ‘అంథా ధూన్, బజార్’ ఈనెల 5, 26 తేదీల్లో విడుదల కానున్నాయి. -
డ్రైవర్‌కీ తెలుసు.. దాచాల్సిందేముంది?
సినిమా: ఇంకా దాచాల్సిందేముంది? అంటోంది సంచలన నటి రాధికా ఆప్తే. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తారల్లో దక్షిణాదిలో ముందున్న నటి ఈ అమ్మడే. ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక నటుడు తనను పడక గదికి రమ్మని చిత్రహింసలకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కిన రాధికా ఆప్తే ఇకపై తెలుగు చిత్రాల్లో నటించేది లేదని ప్రకటించారు. ఆ మధ్య కబాలి చిత్రంలో రజనీకాంత్ సరసన నటించినా ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ రాలేదు. ఈ ఉత్తరాది భామ 2015లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన మెట్లీ అనే లఘు చిత్రంలో నగ్నంగా నటించి వివాదాలకు తావిచ్చారు. ఈ అమ్మడిని నెటిజన్లు ఏకి పారేశారు. ఆ తరువాత 2016లో పార్చ్డ్ అనే అనే చిత్రంలోనూ అదే విధంగా అర్ధ నగ్న దృశ్యాల్లో కనిపించి మరోసారి కలకలం సృష్టించారు. అయినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇక దక్షిణాదిలో అయితే రాధికాఆప్తేను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆంగ్ల చిత్రాన్ని పూర్తి చేసి ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది. కాగా, తన అర్ధనగ్న ఫొటోలను ఇంటర్నెట్లో ప్రచారం చేయడం గురించి ఇటీవల ఆమె ప్రస్తావిస్తూ ఆ సంఘటన తనను బాగా కలచివేసిందని పేర్కొంది. ఆ ఫొటోలు చాలా బాధించాయని, ఈ విషయాన్ని తొలుత తన తల్లి చెప్పిందని, ఆ తరువాత తన కారు డ్రైవర్ కూడా ఇదే మాట అన్నాడని రాధిక తెలిపారు. అయితే అందుకు తాను ఏం చేయను అని ఎదురు ప్రశ్న వేశారు. తన నగ్నదృశ్యాల ఫొటోలపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేశారని, ఇకపై తాను దాచడానికి ఏమీ లేదనీ పేర్కొన్నారు. తాను ఇక ఏమైనా చేయవచ్చునని, తన గురించి కొత్తగా ఎవరూ ప్రచారం చేసే అవకాశం ఉండదని అన్నారు. అయితే, ఏమీ లేనప్పుడు పాత విషయాలను కెలకడం ఎందుకు? మరచిపోయిన తన ఉనికిని చాటుకోవడానికా అంటున్నారు సినీ వర్గాలు. -
అంధాధున్ ట్రైలర్ రిలీజ్
-
మిస్టరీ థ్రిల్లర్ ‘అంధాధున్’
బాలీవుడ్ యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మిస్టరీ థ్రిల్లర్ మూవీ అంధాధున్. ఈ సినిమాలో ఆయుష్మాన్ అంధుడైన పియానో ప్లేయర్‌గా కనిపించనున్నాడు. సీనియర్ నటి టబు మరో ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రాధిక ఆప్టే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏజెంట్ వినోద్, బద్లాపూర్ లాంటి థ్రిల్లర్లను తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ ఈ సినిమాకు దర్శకుడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 5న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. -
'మాకు దెయ్యాలు ఎలాంటి హానీ చెయ్యలేదు'
రాధికా అప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కిన హర్రర్ థ్రిల్లర్ ‘గూల్’ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఆగస్టు 24న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో స్పెషల్ సెల్లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్గా రాధిక ఆప్టే నటనకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను పాట్రిక్ మీడియాతో పంచుకున్నారు. ప్రశ్న: గూల్ తీయాలని మీకు ఎలా అనిపించింది. తొలి ప్రాజెక్టుకే ఇలాంటి స్టోరి ఎందుకు తీసుకున్నారు ? జవాబు: నేను మంచి కాన్సెప్ట్‌తో కూడిన కథను తెరకెక్కిద్దామని అనుకున్నాను. ఇలాంటి కథలు వచ్చి చాలా కాలం అయింది. అలాంటి థ్రిల్లర్‌ను చేయాలని నేను భావించాను. ఒక రచయితగా, దర్శకుడిగా ఇలాంటి ప్రాజెక్టును తెరకెక్కించాలని మొదటి నుంచి అనుకుంటూ ఉండేవాడిని. నాకు ఈ స్టోరిని తెరకెక్కించడానికి ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు సహకరించాయి. ప్ర: ఈ వెబ్ సిరీస్‌లో పాత్రల, లోకేషన్ల ఎంపిక ఎలా జరిగింది? జ: ప్రశాంత్ సింగ్ నేతృత్వంలో అద్భుతమైన నటులు దొరికారు. ఇందులో ముఖ్యంగా కండలు గల సైనికుల పాత్రల ఎంపిక చాలా కీలకమైంది. కానీ మాకు కావాల్సిన ప్రతీది సమకూర్చారు. మహేశ్‌కు చాలాసార్లు స్క్రీన్ టెస్టు నిర్వహించిన తర్వాత అలీ సయీద్ పాత్రకు అతడే కరెక్ట్ అనే నిర్ధారణకు వచ్చాం. రాధిక, మానవ్‌లు ఇద్దరు గొప్పగా నటించారు. వారికి ఈ తరహా పాత్రల్లో నటించడానికి ఆసక్తి ఉండటం అదృష్టంగా భావిసున్నాను. ఈ సినిమా లోకేషన్(తులిప్ స్టార్ బేస్మెంట్) కూడా చాలా బాగా కుదిరింది. ప్ర: అలాంటి చీకటి ప్రదేశాల్లో షూటింగ్ చేయడానికి ఇబ్బంది కలుగలేదా ? జ: కలిగింది. వాతావరణం చాలా ప్రతికూలంగా ఉండేంది. గాలి కూడా సరిగా ఆడేది కాదు. కొన్ని సార్లు దుర్వాసన భరించలేనంతగా ఉండేది(ముఖ్యంగా భోజనం చేసే సమయంలో). ఈ చిత్రీకరణ సమయంలో ఏ దెయ్యాలు మాకు ఎటువంటి హానీ చెయ్యలేదు(నవ్వుతూ..) ప్ర: మీరు దీనిని థియేటర్లలో రిలీజ్ చేయకుండా నెట్‌ఫ్లిక్స్‌ను ఎందుకు ఎంచుకున్నారు ? జ: ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాజెక్టు చేరాలంటే నెట్‌ఫ్లిక్స్ కన్నా బెటర్ ఆఫ్షన్ కనిపించలేదు. వారు ప్రతి విషయంలో చాలా ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్‌గా నిలిచారు. ప్ర: మీరు హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఎందుకు డబ్ చేశారు ? జ: మేము గూల్ ఎంతవరకు సాధ్యమైతే అంత ఎక్కువ మందికి చేరాలని భావించాం. హిందీతోపాటు, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్‌లో డబ్ చేసిన వర్షన్లు కూడా చాలా బాగున్నాయి. ఇది ఎక్కువ మంది ఈ వెబ్ సిరీస్‌ను చూడటానికి ఉపయోగపడుతోంది. ఇండియాలో ఎవరికైతే సబ్ టైటిల్స్ చదువుతూ సినిమా చూడటం నచ్చదో వారికి కూడా డబ్ చేయడం వల్ల దీనిని చూడటానికి ఇష్టపడతారు. ప్ర: ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? జ: ఈ విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వెబ్ సిరీస్‌ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు. కొత్త రకమైన కథలు తెరకెక్కిద్దామనుకునే వారికి ఈ విజయం మంచి ఉత్సాహన్ని ఇస్తుందన్ని భావిస్తున్నాను. స్కేర్డ్ గేమ్స్‌కు ఇండియన్ అన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌లో ఇంత మంచి ఆదరణ ఉన్నందుకు సంతోషిస్తున్నాను. నేను నెగిటివ్ రివ్యూలను చదవను. -
‘ఈ గోడల మధ్య నుంచి.. మీరు తప్పించుకోలేరు’
వివాదాస్పద నటి రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హర్రర్ థ్రిల్లర్ గూల్. ఇన్సిడియస్, గెట్అవుట్, ఉడ్తా పంజాబ్ లాంటి డిఫరెంట్ మూవీస్ ను తెరకెక్కించిన అదే టీం ఈ వెబ్ సిరీస్ కోసం పనిచేస్తున్నారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం స్కేర్డ్ గేమ్స్‌కు మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో గూల్ కూడా విజయం సాధిస్తున్న నమ్మకంతో ఉన్నారు నెట్‌ఫ్లిక్స్ టీం. ఫాంటమ్ ఫిల్సిం, ఇవాన్హోయ్, బ్లమ్‌హౌస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌కు పాట్రిక్ గ్రాహం దర్శకుడు. ఈ సిరీస్‌లో స్పెషల్ సెల్లో బంధించిన ఓ ఖైదీని ప్రశ్నించే ఇంటరాగేటర్గా రాధిక ఆప్టే కనిపిస్తున్నారు. -
అందుకోసం అడ్డమైన సినిమాలు చేశా.!
సాక్షి, సినిమా: వివాదాస్పద నటీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో రాధికా ఆప్టే ఒకరని చెప్పొచ్చు. తన వ్యక్తిగత విషయాలను బహిరంగపరచి సంచలనానికి తెరలేపారు. ఇటీవల ఒక దక్షిణాది నటుడు తనను పడకగదికి పిలిచారని ఆరోపణలతో కలకలం సృష్టించింది. ఇక రాధిక తరచూ గ్లామరస్ ఫొటోలను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు చేతినిండా పని చెబుతూ వారి విమర్శలను ఎదుర్కొంటోంది. అయితే హిందీ చిత్రాల్లో విచ్చలవిడిగా తన అందాలను ఆరబోసి నటించడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. ఈ విషయంలో నా శరీరం నా ఇష్టం అని ఇప్పటివరకూ ఎదురుదాడి చేసిన రాధిక ఇప్పుడు తాను గ్లామరస్‌గా నటించిన మాట నిజమేనని అంగీకరించింది. అందుకు కారణం కూడా చెప్పింది. ఇంతకీ రాధికా ఏం చెప్పారో చూద్దాం.. ‘సినిమా రంగంలో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారికి అవకాశాలు సులభంగా లభిస్తాయి. అలా సినీ నేపథ్యం లేని వారు చాలా కష్టపడాల్సిందే. నాకు సినిమారంగంలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. అందుకే నేను చాలా కష్టపడ్డాను. చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. ఈ రంగంలో ఎలాంటి చిత్రాల్లో నటించకూడదని భావించానో, డబ్బు కోసం అలాంటి చెత్త చిత్రాల్లో నటించాల్సి వచ్చింది. జీవనాధారం కోసం అలాంటి అడ్డమైన చిత్రాలను నిరాకరించలేకపోయాను. అయితే ఇప్పుడు నేను పేరు, డబ్బు సంపాదించుకున్నాను. అవకాశాలు చాలానే వస్తున్నాయి. ప్రస్తుతం అన్నీ అంగీకరించడం లేదని, నచ్చిన కథ నచ్చితేనే ఓకే చెబుతున్నా’ అని చెప్పుకొచ్చారు. -
సల్మాన్‌తో పోటీనా..? : కరణ్ జోహర్
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ రేస్ 3 ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది. సల్మాన్ సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. రేస్ 3 జూన్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే అదే రోజున లస్ట్ స్టోరిస్ అంటూ ఓ వెబ్ సిరీస్ విడుదలవుతోంది. ఈ వెబ్ సిరీస్‌కు నలుగురు ప్రముఖ దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. అందులో కరణ్ జోహర్ ఒకరు. ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... సల్మానతో పోటీ పడదామనుకుంటున్నారా అంటూ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు... ‘సల్మాన్‌తో పోటీపడేంతా మాకు లేదు. మా వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్‌కు సల్మాన్ రేస్3కు సంబంధమే లేదు. సల్మాన్ రేంజ్ వేరు. నేను కూడా జూన్ 15న సల్మాన్ రేస్3 మూవీనే చూస్తాను’ అంటూ కరణ్ చెప్పుకొచ్చారు. లస్ట్ స్టోరిస్‌లో నలుగురు వ్యక్తులకు సంబంధించిన కథలను చూపించనున్నారు. రాధికా ఆప్టే, కియారా అద్వాణీ, మనీషా కొయిరాలా, భూమీ ఫెడ్నేకర్లు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ను కరణ్ జోహర్, జోయా అక్తర్, దిబాకర్ బెనర్జీ, అనురాగ్ కశ్యప్‌లు డైరెక్ట్ చేయనున్నారు. -
బాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్: షాకింగ్ సీక్రెట్స్
ముంబై: ప్రస్తుతం టాలీవుడ్‌ను కుదిపేస్తున్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారాన్ని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడం ద్వారా సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ బాలీవుడ్లో కొత్త వివాదానికి తెరలేపారు. ఇండస్ట్రీ మహిళను రేప్ చేసి, రోడ్డున పడేయదని, అందుకు బదులు ఆమెకు జీవనోపాధిని అందిస్తుందని ఆమె పేర్కొన్నారు. సరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలను తప్పుబట్టారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో నెలకొన్న క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై బీబీసీ ఒక సంచలన డాంక్యుమెంటరీని ప్రసారం చేయబోతోంది. రాధికా ఆప్తే, ఉషా జాధవ్ వంటి ప్రముఖులతో సహా పలువురు వర్థమాన నటీనటులు తమ అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో వెల్లడించారు. ‘బాలీవుడ్ డార్క్ సీక్రెట్’ పేరిట ఈ డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేయనుంది. ‘హాలీవుడ్ తరహాలో బాలీవుడ్లో మీటూ ఉద్యమం లేదు. కానీ హిందీ చిత్ర పరిశ్రమ కూడా లైంగిక వేధింపులు, దూషణలకు అతీతం కాదని పలువురు నటీనటుల అనుభవాన్ని రజనీ వైద్యనాథన్ మన ముందుకు తెస్తున్నారు’ అంటూ దీనిని ప్రసారం చేయనుంది. ఈ డాంక్యుమెంటరీలో రాధికా ఆప్తే మాట్లాడుతూ.. ‘కొందరు తమను తాము దేవుళ్లుగా భావిస్తారు. వాళ్లు శక్తివంతుల. మేం మాట్లాడినా ఎవరూ పట్టించుకోరులే అనే భావనలో ఉంటారు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే వారి కెరీర్ నాశనమైనట్టేనని భావిస్తారు. మహిళలు, పురుషులు కలిసికట్టుగా ముందుకొచ్చి ఇది జరగకూడదని నిర్ణయిస్తే ఇది ఆగిపోతోంది. అలాంటిది ఇక్కడ రావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు. సినిమాల్లో అవకాశం దొరకాలంటే నిర్మాతతో, దర్శకుడితో పడుకోవాలని తనకు చెప్పారని నటి ఉషా జాధవ్ తన అనుభవాలను వివరించారు. ఈ డాక్యుమెంటరీలో ఓ వర్ధమాన నటి షాకింగ్ విషయాలు వెల్లడించారు. తనను ఒక వ్యక్తి నిత్యం లైంగికంగా వేధించాడని ఆమె తెలిపారు. ‘ఇండస్ట్రీలో పని దొరకాలంటే.. ఎప్పుడు వీలైతే అప్పుడు శృంగారంలో పాల్గొనడం ఆనందంగా భావించు. నీ సెక్సువాలిటీని ఒప్పుకో’ అని అతను సూచించాడని చెప్పారు. ‘ అతను కావాలనుకున్నప్పుడల్లా నన్ను తాకేవాడు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ముద్దు పెట్టుకునేవాడు. అతని ప్రవర్తన నన్ను షాక్‌కు గురిచేసింది’ అని ఆమె తెలిపారు. గతంలోనూ పలువురు బాలీవుడ్ నటీమణులు క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. రిచా చద్దా, స్వర భాస్కర్ వంటి వారు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని వెల్లడించారు. అయితే, తమను లైంగికంగా వేధించిన వారి పేర్లను వారు వెల్లడించలేదు. -
హాలీవుడ్‌కు మరో ఇండియన్ హీరోయిన్
భారతీయ వెండితెర మీద సత్తా చాటిన చాలామంది తారలు హాలీవుడ్‌లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అయితే ఒక్క ప్రియాంక చోప్రా తప్ప హాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లు లేరనే చెప్పాలి. దీపికా పదుకొనే, ఐశ్వర్యా రాయ్ లాంటి వారు హాలీవుడ్ సినిమాల్లో నటించినా.. బాలీవుడ్ సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెట్టారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో భారతీయ నటి చేరేందుకు రెడీ అవుతోంది. సినిమాలతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే రాధికా ఆప్టే త్వరలో ఓ హాలీవుడ్ సినిమాలో నటించనుందట. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత లిడియా డీన్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న హాలీవుడ్ సినిమాలో రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించనుంది. స్టానా కాటిక్, సారా మేగాన్ లాంటి హాలీవుడ్ తారాలు నటిస్తున్న ఈ సినిమాలో రాధిక బ్రిటీష్ ఇంటలిజెన్స్ ఆఫీసర్‌గా కనిపించనుంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించనున్నారు. -
కబురు వచ్చింది
ఏం చేయాలన్నా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు రాధికా ఆప్టే. పరిసర ప్రాంతాలను క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకిలా? అంటే.. ఓ సినిమా కోసం. అందులో ఆమె గూఢచారి అవతారం ఎత్తనున్నారు. ఒక యుద్ధ రహస్యాలను సేకరించే పని చేయనున్నారు. ప్రస్తుతం అందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారామె. హాలీవుడ్లో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన లిడియా డీన్ పిల్చెర్ దర్శకత్వంలో రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ఉమెన్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయట. ఇందులో స్టానా కాటిక్, సారా మేగాన్ థామస్‌లతో పాటు రాధికా ఆప్టే నటించనున్నారు. లైనస్ రోచే, రోసిఫ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఇద్దరు అమ్మాయిలను స్పైలుగా ఫ్రాన్స్ పంపిస్తాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు అమ్మాయిలు వార్ సీక్రెట్స్‌ను ఎలా సేకరించారు? ఈ మిషన్‌లో వారు ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏంటి? అన్నదే సినిమా కథనంగా ఉంటుందట. వైర్లెస్ ఆపరేటర్‌ను యూజ్ చేయడంలో మంచి ప్రతిభ ఉండి, ఇండియన్ యాక్సెంట్ ఉన్న నూర్ ఇనయాత్ ఖాన్ పాత్రలో రాధికా ఆప్టే కనిపించనున్నారు. హిందీ, తమిళ, తెలుగులోనూ నటించిన రాధికాకు ఇప్పుడు హాలీవుడ్ నుంచి కబురొచ్చిందన్నమాట. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్ హాలీవుడ్ చిత్రాలు చేస్తున్నారు. ఇప్పుడు రాధికా ఆప్టే. ముందు ముందు ఇంకెంతమందో? -
కాలు రుద్దడంతో.. ఆ హీరో చెంప పగలగొట్టా
బాలీవుడ్ సంచలన నటి రాధికా ఆప్టే మరోమారు వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌పైనే దృష్టిసారిస్తున్న రాధికాఆప్టే సినీ తారలపై లైంగిక ఒత్తిడి ఉన్న మాట నిజమేనని ప్రకటించి వివాదాస్పద నటీమణుల లిస్టులో పడిపోయింది. ఆ తర్వాత దక్షిణాది సినీ ఇండస్ట్రీ పైనా కామెంట్స్ చేసింది. ఇలా ఏదో ఒక సందర్భంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న రాధికా.. తాజాగా మరో కామెంట్ చేసింది. బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహిస్తున్న టాక్ షో వోగ్ బీఎఫ్ఎఫ్కు రాధిక అతిథిగా వెళ్లింది. అక్కడ ఆమె మాట్లాడుతూ తాను నటించిన తొలి దక్షిణాది సినిమాలో ప్రముఖ హీరో చెంప పగలగొట్టానని తెలిపింది. ఆ సినిమా షూటింగ్లో భాగంగా సెట్‌కి వెళ్లిన తొలి రోజే తనతో హీరో అసభ్యంగా ప్రవర్తించాడని, తన పక్కనే కూర్చున్న అతడు.. తన కాలిని అసభ్యంగా రుద్దాడని చెప్పింది. కనీసం పరిచయం కుడా లేని తనతో ఆ హీరో అలా ప్రవర్తించడంతో కోపంతో చెంప చెళ్లుమనిపించానని రాధిక వివరించింది. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతో పాటు తమిళంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’ సినిమాతో రాధికా దక్షిణాది వారికి చేరువైంది. -
బీచ్‌లో చీర కట్టుకొని తిరగాలా?
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాధికా ఆప్తే తెలుగువారికీ సుపరిచితురాలే. బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతోపాటు రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’సినిమాతో ఆమె దక్షిణాదివారికి చేరువైంది. బాలీవుడ్‌లోనూ మంచి నటిగా పేరొందిన రాధికా ఆప్తే ఇటీవల అక్షయ్‌కుమార్ సరసన ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాలో అలరించింది. ఇటీవల ఈ భామ తన స్నేహితుడితో కలిసి బీచ్‌లో సేదదీరుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. బికినీ ధరించి గోవా బీచ్‌లో దిగిన ఈ ఫొటో పెట్టగానే.. ఆమెను కించపరుస్తూ పలువురు కామెంట్లు చేశారు. బాడీషేమింగ్ చేస్తూ ఎద్దేవా చేశారు. ఈ విషయమై మీడియా ప్రస్తావించగా.. ‘నన్ను ట్రోల్ (కించపరుస్తూ) చేసేవారి కామెంట్లు పెద్దగా పట్టించుకోను. ఎవరైనా ఆ విషయం చెప్తే తప్ప నాకు వాటి గురించి తెలియదు. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మూర్ఖత్వం. బీచ్‌లో నేను చీర కట్టుకొని తిరగాలని వారు భావిస్తున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు. ట్రోలర్స్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. నాకు వాళ్లు ఎవరో తెలియదు.. వాళ్ల గురించి అసలే పట్టించుకోను అని ఆమె తాపీగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో హీరోయిన్లను కించపరుస్తూ ట్రోలర్స్ చెలరేగిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్ నటీమణులు ప్రియాంకచోప్రా, తాప్సీ పన్ను, ఈషా గుప్తా, దీపికా పదుకోన్, పరిణీత చోప్రా తదితరుల ఫొటోలపై కూడా కొందరు కించపరిచేరీతిలో అసభ్య కామెంట్లు పెట్టారు. ఇలా ట్రోల్ చేసేవారికి కొందరు ఘాటు రిప్లే ఇవ్వగా.. మరికొందరు సెలబ్రిటీలు లైట్ తీసుకున్నారు. #holiDay #timeoff #goa #sea #sunset #friends @marc_t_richardson #afteraswim A post shared by Radhika (@radhikaofficial) on Feb 24, 2018 at 5:55am PST