ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం | Radhika Apte Slams Psychotic Mentality of Society For Leaked Scene From Her Movie | Sakshi
Sakshi News home page

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం: నటి

Jul 18 2019 8:54 AM | Updated on Jul 18 2019 9:54 AM

Radhika Apte Slams Psychotic Mentality of Society For Leaked Scene From Her Movie - Sakshi

ప్రముఖ నటి రాధికా ఆప్తే, దేవ్‌ పటేల్‌ జంటగా నటించిన తాజా హాలీవుడ్‌ చిత్రం ‘ద వెడ్డింగ్‌ గెస్ట్‌’ . త్వరలో విడుదల కానున్న ఈ సినిమాలోని హాట్‌ రొమాంటిక్‌ సీన్‌ ఒకటి లీకై.. ఇంటర్నెట్‌లో దుమారం రేపుతోంది. రాధికా ఆప్తే, దేవ్‌ పటేల్‌ శృంగారంలో పాల్గొన్న ఈ సీన్‌ లీక్‌ కావడంపై నటి రాధిక ఆగ్రహం వ్యక్తం చేశారు. మన సమాజంలో సైకో మెంటాలిటీకి ఈ సీన్‌ లీకే నిదర్శనమని ఆమె మండిపడ్డారు. ఈ సీన్‌ మేల్‌ యాక్టర్‌ దేవ్‌ పటేల్‌ పేరిట స్ప్రెడ్‌ చేయకుండా.. తన ఒక్కరి పేరు మీదనే ఎందుకు వ్యాప్తి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు.

‘బాలీవుడ్‌ లైఫ్‌’  వెబ్‌సైట్‌తో ముచ్చటించిన రాధిక.. ‘ఈ సినిమాలో ఎన్నో అందమైన దృశ్యాలు ఉన్నాయి. కానీ శృంగారానికి సంబంధించిన సీన్‌ను మాత్రమే లీక్‌ చేశారు. దీనికి కారణం మన సమాజం సైకోటిక్‌ మెంటాలిటీనే’ అని అన్నారు. ‘లీకైన ఆ సీన్‌లో రాధికా ఆప్తే, దేవ్‌ పటేల్‌ ఇద్దరూ ఉన్నారు. కానీ, నా పేరు మీదనే ఆ సీన్‌లను స్ప్రెడ్‌ చేస్తున్నారు. మేల్‌ నటుడు దేవ్‌ పటేల్‌ పేరు మీద వాటిని స్ప్రెడ్‌ చేయవచ్చు కదా’ అని ఆమె ప్రశ్నించారు. సినిమాల్లో నగ్న, శృంగార సన్నివేశాల్లో నటించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో రాధికా ఆప్తే పేర్కొన్న సంగతి తెలిసిందే. 

‘బోల్డ్‌ సీన్లలో నటించే విషయంలో నాకెలాంటి భయాలు లేవు. నేను చిన్నప్పటి నుంచి ప్రపంచ సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్నో ప్రదేశాలు తిరిగాను. నా పట్ల నేను కంఫర్టబుల్‌గానే ఉన్నాను. భారత్‌లో, విదేశాల్లో నటులు వేదిక మీద నగ్నంగా నటించడం నేను చూశాను. నా శరీరాన్ని చూసి నేనెందుకు సిగ్గుపడాలి? ఒక అభినేత్రిగా నా శరీరం కూడా ఒక సాధనమే నాకు. బోల్డ్‌ సీన్లలో నటించే విషయంలో నాకు ఎలాంటి భయాలు లేవు’ అని ఐఏఎన్‌ఎస్‌ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధికా ఆప్తే పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement