Hollywood movie
-
OTT: ‘ల్యాండ్ ఆఫ్ బ్యాడ్’ మూవీ రివ్యూ
సైనికుడి ప్రయాణం ప్రతి మలుపూ ప్రమాదభరితం అన్న లైన్ తో ముడిపడున్న సినిమా ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. అప్పట్లో ప్రపంచ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన యోధుడు గ్లాడియేటర్. ఆ గ్లాడియేటర్ పాత్రధారి రస్సెల్ క్రోవ్ నటించిన సినిమా ఈ ల్యాండ్ ఆఫ్ బ్యాడ్. ఈ సినిమాని దర్శకులు విలియమ్ యూబ్యాంక్ రూపొందించారు. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ సినిమా ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా లభ్యమవుతుంది.ఇక సినిమా కథ విషయానికొస్తే యూఎస్ డెల్టా ఫోర్స్ ఓ పెద్ద ఆపరేషన్ చేపడుతుంది. సౌత్ ఫిలిప్పీన్స్ లో తీవ్రవాదులచే బందీగా వున్న సిఐఎ సిబ్బందిని రక్షించడం ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం. ఈ ఆపరేషన్ కు స్టాఫ్ సార్జెంట్ నియా బ్రాన్సన్ సారధ్యంలో ఓ టీం వెళుతుంది. ఆఖరి నిమిషంలో ఈ టీం కు కొత్తగా యంగ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసరైన కెన్నీ జాయిన్ అవుతాడు. ఈ కెన్నీయే మన సినిమాకు కథానాయకుడు. కెన్నీ పాత్రలో వర్ధమాన నటుడు లియామ్ హెమ్స్ వర్త్ నటించారు.ఇక పోతే ఈ టీం కు రీపర్ గ్రిమ్ డ్రోన్ సపోర్ట్ గా వ్యవహరిస్తాడు. ఈ రీపర్ కథలో మరో ముఖ్య పాత్రధారి. రీపర్ పాత్రలో ప్రముఖ నటుడు రస్సెల్ క్రోవ్ నటించి మెప్పించాడు. నాడు గ్లాడియేటర్ గా నేడు రీపర్ గా రస్సెల్ క్రోవ్ నటన నభూతో నభవిష్యతి. యూఎస్ డెల్టా ఫోర్స్ టీం ఫిలిప్పీన్స్ ఆపరేషన్ కోసం బయలుదేరడంతో ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ కథ మొదలవుతుంది. టీం లో కెన్నీ కొత్తవాడవడం ఆ పై ఇది మొదటి ఆపరేషన్ అవడంతో టీం లోని మిగతావారు అతనిని ఆట పట్టిస్తుంటారు.జాగ్రత్తగా వ్యవహరించమని సలహాలిస్తుంటారు. ఈ ఆపరేషన్ లో భాగంగా టీంలోని మిగతా సభ్యులందరూ ఓ సమయంలో గాయపడతారు. ఆపరేషన్ కొత్త అయినా, ఎవరూ తోడు లేకున్నా కెన్నీ తనకున్న ధైర్యంతో రీపర్ సాయంతో ఆపరేషన్ ఎలా ముగించాడన్నదే ఈ సినిమా కథ. సాధారణంగా టెర్రరిస్ట్ ఎలిమినేషన్ ఆపరేషన్ అంటే గన్ ఫైట్ తప్ప ఇంకేమీ వుండదని అనుకుంటాం. కానీ సున్నితమైన సెంటిమెంటల్ లైన్ తో చక్కటి గ్రప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమా చూసే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. వర్త్ టూ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. - ఇంటూరు హరికృష్ణ -
Mufasa: The Lion King Trailer: లయన్ కింగ్ ఒక్కటే ఉండాలి!
హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘ది లయన్ కింగ్ (2019)’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ అనే చిత్రం రూపొందిన సంగతి తెలిసిందే. బారీ జెంకిన్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. వాల్ట్ డిస్నీ పిక్చర్స్ పతాకంపై అడెలె రోమన్ స్కీ, మార్క్ సెరియాక్ ఈ సినిమాను నిర్మించారు. ఈ ఏడాది డిసెంబరు 20న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ తెలుగు ట్రైలర్‌ను కూడా మేకర్స్ విడుదల చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.కాగా తాజాగా ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఇంగ్లీష్ ఫైనల్ ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రయూనిట్. ‘‘ఈ కథ స్కార్ అనే ప్రిన్స్‌కి, ఓ అనాథ అయిన ముఫాసాకి చెందినది. వీరిద్దరూ అన్నదమ్ముల్లా ఓ కొత్త సామ్రాజ్యం కోసం ఓ ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేసేందుకు రెడీ అవుతున్నారు, నా పేరు ముఫాసా, లయన్ కింగ్ అనేది ఒక్కటే ఉండాలి, మనల్ని ట్రాప్ చేశారు.. ఇప్పుడు ఏం చేయాలి’’ అంటూ అర్థం వచ్చే ఇంగ్లీష్ డైలాగ్స్ ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమా ఇంగ్లీష్ ట్రైలర్లో ఉన్నాయి.ఇక ‘ముఫాసా: ది లయన్ కింగ్’ సినిమాలోని ప్రధాన పాత్రధారులు అయిన ముఫాసాకు హాలీవుడ్ నటుడు అరోన్ పియర్, టాకా (ఈ పాత్ర ఆ తర్వాత స్కార్గా మారుతుంది)కు కెల్విన్ హరిసన్ జూనియర్ వాయిస్ ఓవర్స్ ఇచ్చారు. ఇక ‘ముఫాసా: ది లయన్ కింగ్’ తెలుగు వెర్షన్ లో ముఫాసా పాత్రకు మహేశ్‌బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. -
స్టార్ హీరోతో ముద్దు సీన్స్.. తప్పుకున్న ఐశ్వర్య రాయ్!
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. కెరీర్లో రాణించాలంటే అన్ని రకాల సినిమాలు చేయాల్సిందే. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్‌లో నటిస్తేనే ఎక్కువ అవకాశాలు వస్తాయని కొంతమంది నమ్ముతారు. అది కొంతవరకు వాస్తవం కూడా. అయితే అలాంటి సీన్స్ చేస్తేనే అవకాశాలు వస్తాయనుకోవడం తప్పే. ఎలాంటి ఎక్స్‌ఫోజింగ్ చేయకుండా కేవలం తమ నటనతోనే ఆకట్టుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అయితే ఏ సినిమా ఎంచుకోవాలి, ఇండస్ట్రీలో ఎలా నిలబడాలని అనేది సదరు హీరోయిన్ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొంతమంది పెద్ద సినిమాలో నటించే అవకాశం వచ్చినా..తమ పాత్ర నచ్చపోతే సున్నితంగా తిరస్కరిస్తారు. మరికొంత మంది పెద్ద ప్రాజెక్ట్ కదా అని కాంప్రమైజ్ అవుతారు. కానీ బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మాత్రం ముద్దు సన్నివేశాలు ఉన్నాయని రెండు భారీ హాలీవుడ్ సినిమాలనే వదులుకుంది. స్టార్ హీరోలతో నటించే అవకాశం వచ్చినా.. సున్నితంగా ఆ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది.ఇంటిమేట్ సీన్స్ ఉన్నాయని.. 2000 సంవత్సరంలో ఐశ్వర్యరాయ్‌కి బాలీవుడ్లో ఫుల్ డిమాండ్ ఉంది. వరుస సినిమాలు హిట్ కావడంతో హాలీవుడ్లో కూడా నటించే అవకాశం వచ్చింది. బ్రైడ్ అండ్ ప్రిజుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్ లాంటి హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్ర పోషించి, తనదైన నటనతో ఆకట్టుకుంది. అదే సమయంలో ఆమె కెరీర్‌ని మలుపు తిప్పే రెండు భారీ హాలీవుడ్ సినిమా అవకాశాలు వచ్చాయట. కానీ కిస్ సీన్స్, రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని రిజెక్ట్ చేసిందట. హాలీవుడ్ హీరో బ్రాడ్ పిట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో హీరోయిన్గా నటించే అవకాశం ముందుగా ఐశ్యరకే వచ్చిందట. అయితే కథలో భాగంగా ఆమె హీరోతో ఇంటిమేట్ సీన్స్‌తో పాటు ముద్దు సన్నివేశాల్లో కూడా నటించాలని చెప్పారట. హీరోతో కిస్ సీన్ చేయడం ఇష్టం లేక ఐశ్వర్య ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట. దీంతో ఆ చాన్స్ ఏంజలినా జోలీ కొట్టేసింది.లిప్ లాక్ సీన్ ఉందని మరో చిత్రం..ఐశ్వర్య మరో హాలీవుడ్ చిత్రాన్ని కూడా ఇలానే వదులకుందంట. హాంకాక్( Hancock) చిత్రంలో విల్ స్మిత్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్న చాన్స్ ఐశ్వర్యకు వచ్చిందంట. అయితే అందులో విల్ స్మిత్‌తో లిప్‌లాక్ చేసే సీన్ ఉందంట. అలాంటి సన్నివేశాల్లో నటించడం ఇష్టంలేక ఐశ్వర్య ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. డేట్స్ కూడా ఖాలీగా లేకపోవడం మరో కారణమని ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. -
హాలీవుడ్ మూవీ ‘డోన్ట్ మూవ్’ రివ్యూ
ప్రేక్షకులు సినిమాని చూస్తారు. కాని అదే దర్శకుడు సినిమాని సృష్టిస్తాడు. ఇక్కడ దర్శకుడు తన సృష్టి తో పాటు ఆ సినిమాని మానసికంగా అనుభూతి పొందుతాడు. దానికి నిలువెత్తు నిదర్శనం ఈ అమెరికన్ థ్రిల్లర్ డోన్ట్ మూవ్. ఆడమ్ బ్రియో తో కలిసి రూపొందించిన ఈ సినిమా కాన్సెప్ట్ మిమ్మల్ని కన్నార్పనివ్వదు. డేవిడ్ వైట్ అందించిన కథకు వీరిరువురు ప్రాణం పోయగా, లీడ్ రోల్ లో ఐరిస్ పాత్రలో నటించిన కెల్సీ ఈ చిత్రానికి ఊపిరూదింది. సినిమా మొత్తం మనకు కెల్సీ కనిపించదు. ఐరిస్ మాత్రమే మన కళ్ళముందు కదలాడుతుంది. ఈ సినిమా లో పెద్ద కథాంశం లేదు కాని తీసుకున్న కాన్సెప్ట్ మాత్రం అదరహో అని చెప్పవచ్చు. ఐరిస్ హైకింగ్ లో తన కొడుకును పోగొట్టుకున్న బాధతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడి నుండే సినిమా ప్రారంభమవుతుంది. అప్పుడే అక్కడ తనని తాను రిచర్డ్ అని పరిచయం చేసుకున్న వ్యక్తి ఐరిస్ మీద ఓ ఇంజెక్షన్ తో దాడి చేస్తాడు. ఆ ఇంజెక్షన్ వల్ల 20 నిమిషాలలో శరీరంలోని ఒక్కో అవయవం పని చేయకుండా పోతుందని రిచర్డ్ చెప్పి ఐరిస్ ని బందీగా చేసుకుని తనతో పాటు కారు లో తీసుకువెళుతుంటాడు. ఇంజెక్షన్ వల్ల ఒక్క కళ్ళు తప్ప ఎటూ కదలలేని ఐరిస్ రిచర్డ్ బారి నుండి తప్పించుకోలిగిందా లేదా అన్నది మాత్రం డోన్ట్ మూవ్ సినిమాలోనే చూడాలి. ఒక్కసారి ఆలోచించండి మన శరీరంలో ఏ కాలో, చెయ్యో ఇబ్బంది కలిగితేనే తట్టుకోలేము అలాంటిది దాదాపుగా అన్ని అవయవాలు పని చేయడం మానేసి ఓ నరరూప రాక్షసుడి చేతిలో బందీ అవడం అంటే అంతకన్నా దారుణం ఏముంటుంది. పైన చెప్పినట్టు దర్శకులు ఈ సినిమాని ఎలా సృష్టించారో అర్ధమవదు కాని వారి ఆలోచనా పటిమకు మాత్రం ప్రేక్షకులుగా మనం హాట్సాఫ్ చెప్పి తీరాలి. ఈ సినిమా మనం చూస్తున్నంతసేపు కదలలేము, వదలలేము ఎందుకంటే ఈ సినిమా పేరు డోన్ట్ మూవ్ కాబట్టి. ఎ మస్ట్ వాచ్ థ్రిల్లర్.-ఇంటూరు హరికృష్ణ -
OTT Review: ఊహకందని థ్రిల్లింగ్ వెకేషన్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ట్రాఫిక్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.వెకేషన్ అంటే ఆనందంగా... సరదాగా అందరితో గడిపే కాన్సెప్ట్. కానీ అదే వెకేషన్ ఊహకందని, ఊహించలేని నైట్ మేర్ అయితే... ఈ లైన్‌ను ఆధారంగా చేసుకునే హాలీవుడ్ దర్శకుడు డీన్ టేలర్ ‘ట్రాఫిక్’ చిత్రాన్ని రూపొందించారు. సినిమా మొత్తం గ్రిప్పింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది పెద్దల సినిమా. ΄ûలా పాట్టన్, ఒమర్ ఆప్స్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు లీడ్ రోల్స్‌లో నటించారు.ఇక సినిమా కథ ప్రకారం... బ్రీ కాలిఫోర్నియాలోని ఓ దినపత్రికలో పని చేసే జర్నలిస్ట్. తాను రాసే కథనాలు సరిగ్గా పత్రికలో రావడం లేదని తపన పడుతూ ఉంటుంది. ఈ దశలో బ్రీ తన ప్రియుడు జాన్‌తో కలిసి అతని స్నేహితుడి డారెన్ గెస్ట్ హౌస్‌కి వెకేషన్‌కి వెళతారు. ఈ వెకేషన్ లొకేషన్ శాక్రిమెంటోలోని కొండ లోయల ప్రాంతంలో దూరంగా ఉంటుంది. ఈ వెకేషన్‌కి వెళ్లే సమయంలో బ్రీ, జాన్‌కు ఓ గ్యాస్ స్టేషన్లో కాలిఫోర్నియా బైకర్స్‌తో చిన్నపాటి ఘర్షణ జరుగుతుంది.ఇదే కథకు మలుపు. ఆ ఘర్షణతో బైకర్స్ వీళ్ళ కారును వెంబడిస్తారు. బ్రీ వాళ్ళు గెస్ట్ హౌస్‌కి వెళ్లిన తరువాత బైకర్స్ ఏం చేశారు? వాళ్లను బ్రీ ఎలా ఎదుర్కొంది? ఆ సంఘటన తర్వాత తన జర్నలిస్ట్ కెరీర్లో బ్రీ సాధించిన గొప్ప అంశమేంటి? అన్న విషయాలన్నీ లయన్స్ గేట్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘ట్రాఫిక్’లో చూడాల్సిందే. రోజు వారీ ట్రాఫిక్ కష్టాలతో సతమతమయ్యేవారు ఈ వీకెండ్ ‘ట్రాఫిక్’ సినిమాతో థ్రిల్లింగ్ వెకేషన్ అనుభూతి పొందుతారనేది నిజం. సో... ఎంజాయ్ ది ‘ట్రాఫిక్’. – ఇంటూరు హరికృష్ణ -
ఓటీటీలో యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం 'ప్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్' చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సుమారు ఆరు నెలల తర్వాత ఓటీటీలో విడుదల కానుంది. 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ప్యూరి రోడ్ చిత్ర ప్రాంచైజీలో భాగంగా ఐదో చిత్రంగా తెరకెక్కింది. గత చిత్రాల దర్శకుడు జార్జ్ మిల్లర్నే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటికంటే భారీగా అదే సమయంలో ఒరిజినల్ కథతో రూపొందించారు.'ఫ్యూరియోసా: ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా' ఓటీటీ విడుదల ప్రకటన రావడంతో ఫ్యాన్స్ జోష్‌లో ఉన్నారు. అక్టోబర్ 23నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు జియో సినిమా వెల్లడించింది. తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ,కన్నడ, తమిళం,బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంటుందని జియో పేర్కొంది. ఇందులో అన్యటైలర్ జాయ్ ఒక యువ మహిళా యోధుని పాత్రలో నటించారు. నటుడు క్రిస్ హేమ్స్ వర్త్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థతో కలిసి మిల్లర్ ఆయన చిరకాల భాగస్వామి, ఆస్కార్ నామినేటెడ్ నిర్మాత డౌగ్ మిథ్చల్ ఆ్రస్టేలియా బేస్డ్ కెన్నడీ మిల్లర్ మిచ్చల్ పతాకంపై నిర్మించారు. -
Gladiator 2 Trailer: నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. అది మరచిపోలేదు
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హాలీవుడ్ చిత్రం ‘గ్లాడియేటర్’. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2000లో వసూళ్ల పరంగా చరిత్ర సృష్టించింది. ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన ‘గ్లాడియేటర్ 2’కి కూడా రిడ్లీ స్కాట్యే దర్శకత్వం వహించారు. పాల్ మెస్కల్, డెంజెల్ వాషింగ్టన్, పెడ్రో పాస్కల్, కొన్నే నిల్సన్, జోసెఫ్ క్విన్ వంటివారు నటించారు. ఈ చిత్రం నవంబరు 15న ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో 4డీఎక్స్ మరియు ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కానుంది. ఇక ‘నాకు ఆ రోజు జ్ఞాపకం ఉంది.. నేను అది మరచిపోలేదు.. ఒక బానిస రాజుపై ప్రతీకారం తీర్చుకున్న క్షణం’ వంటి డైలాగ్స్ ‘గ్లాడియేటర్ 2’ ట్రైలర్లో ఉన్నాయి. -
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా?
టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లోనూ ఇటీవల ఆ జోనర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ మొత్తం నన్ల చుట్టు తిరుగుతుంది. నన్‌గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్‌కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.నన్ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించారు. అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్లను ట్రీట్ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేస్తాయి. ఒక నన్ జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. హారర్ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ లేకుండానే తెరకెక్కించాడు. ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. -
టిన్ అండ్ టీనా మూవీ రివ్యూ
టైటిల్: టిన్ & టీనాకథలోలా - అడాల్ఫొ దంపతులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తారు. కానీ వారి కలలను నీరుగారుస్తూ పెళ్లిరోజే లోలాకు గర్భస్రావం అవుతుంది. అంతేకాదు, ఇంకెప్పుడూ తను తల్లి కాలేదని వైద్యులు నిర్ధారిస్తారు. దీంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది. తననలా చూడలేకపోయిన భర్త దగ్గర్లో ఓ కాన్వెంట్ ఉందని, అందులో ఎవర్నైనా దత్తత తీసుకుందామని చెప్తాడు. మొదట లోలా అందుకు అంగీకరించదు. కానీ తర్వాత ఒప్పుకుని ఏడేళ్ల వయసున్న కవలలు టిన్ అండ్ టీనాను దత్తత తీసుకుంటారు.అప్పుడు అసలు కథ మొదలవుతుంది. పిల్లలు అందరిలా కాకుండా వింతగా ప్రవర్తిస్తుంటారు. భగవంతుడిపై ఎక్కువ విశ్వాసంతో తానేం చేసినా దేవుడిపైనే భారం వేస్తారు. అప్పుడే ఒక మిరాకిల్ జరుగుతుంది. లోలా మల్లీ ప్రెగ్నెంట్ అవుతుంది. పిల్లల వింత ప్రవర్తనతో భయపడిపోయిన ఆమె కడుపులో బిడ్డను వారి నుంచి కాపాడుకోవాలని చూస్తుంది. డెలివరీ తర్వాత కూడా క్షణక్షణం భయంగానే గడుపుతుంది. ఆమె భయానికి కారణం ఏంటి? ఆ పిల్లలు ఏం చేశారు? వారిని తిరిగి ఎందుకు కాన్వెంట్లో వదిలేశారు? అనేది తెలియాలంటే ఓటీటీలో మూవీ చూడాల్సిందే!విశ్లేషణలోలాకు దేవుడంటే నమ్మకం ఉండదు. కానీ తను పెంచుకుంటున్న కవలలకు అపారమైన భక్తి. బైబిల్లో ఉన్నవన్నీ యదాతథంగా అమలు చేయాలనుకుంటారు. ఈ క్రమంలోనే పెంపుడు కుక్కను చంపేస్తారు. స్కూలులో తమను ఆటపట్టిస్తున్న కుర్రాడిని సైతం దారుణంగా టార్చర్ పెట్టి చంపుతారు. వీటిని సహించని లోలా చివరకు వారిని అమాయకులుగా భావించడం వింతగా అనిపిస్తుంది. పిల్లల రాక్షస ప్రవర్తనకు ఇంకేమైనా కారణాలున్నాయా? అని అనిపించకమానదు. క్లైమాక్స్‌లో లోలా భర్తను కోల్పోవడం... ఎవరివల్లయితే తన కొడుక్కి హాని అనుకుందో ఆ కవలల్ని ఇంటికి తీసుకురావడం అందరికీ మింగుడుపడకపోవచ్చు.లోలాగా మెలీనా స్మిత్, టిన్ అండ్ టీనాగా కార్లోస్ జి మోరోలాన్, అనటాసియా రుస్సో నటించారు. వీరి పర్ఫామెన్స్ బాగుంది. కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు మనకే కంగారు వచ్చేస్తుంటుంది. బిడ్డను కాపాడుకోవడానికి తల్లి పడే ఆరాటం మనల్ని కదిలించివేస్తుంది. వీకెండ్లో ఓసారి చూసేయొచ్చు! టిన్ అండ్ టీనా మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. -
పరిగెట్టు... పసిగట్టు.... పని పట్టు
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘రన్ హైడ్ ఫైట్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.యుద్ధమనేది అనివార్యమైతేనే ఆయుధం గురించి ఆలోచించు అన్న నానుడిని పూర్తిగా అలక్ష్యం చేసి అనవసరంగా ఆయుధాలను సమకూర్చుకోవడంలో మునిగి΄ోయింది నేటి కొంత సమాజం. కొన్ని ప్రదేశాల్లో గల్లీల్లో ఆడుకునే పిల్లల దగ్గర కూడా గ¯Œ ్స ఉంటున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధం చేసుకోవచ్చు. అడదడఈ గన్ కల్చర్ గురించి వింటూనే ఉన్నాం. అగ్రరాజ్యమైన అమెరికాలో ఈ గన్ కల్చర్ విపరీతంగా ఉంది. ఆ దేశంలో మూతి మీద మీసం కూడా రాని విద్యార్థులు చేతిలో తుపాకీతో ఉంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి సంప్రదాయం ప్రకారం రక్షణ కవచంగా తుపాకీని ఎవరైనా లైసె¯Œ ్స ΄÷ంది తమ దగ్గర ఉంచుకోవచ్చు. కాని ఇదే గన్ కల్చర్ విపరీత ధోరణిగా మారితే ఎలా ఉంటుందన్న ఇతివృత్తంతో వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కైల్ రాంకిన్ ‘రన్ హైడ్ ఫైట్’ సినిమా తీశారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమైంది. అంతలా ఏముంది ఈ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. కథాపరంగా అమెరికాలోని ఓ విశ్వవిద్యాలయంలోకి కొందరు విద్యార్థులు చొరబడతారు. వారందరూ సాయుధులై భారీ మందుగుండు సామాగ్రితో విద్యాలయంలోని తోటి విద్యార్థులను, స్టాఫ్‌ను బందీలుగా చేసుకుని విద్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. విద్యార్థులలో ఒకరైన జో తనను, తనతో పాటు ఆ విద్యాలయంలోని కొందరిని ఎలా రక్షించిందనేదే ఈ ‘రన్ హైడ్ ఫైట్’ సినిమా. ఉత్కంఠభరితం అన్న దానికి పై మాటే ఈ సినిమా స్క్రీన్‌ప్లే. థ్రిల్లర్ జోనర్ ఇష్టపడేవారికి ఈ సినిమా కన్నులపండగ. అలాగే కొందరు తల్లిదండ్రులకు ఓ కనువిప్పు ఈ సినిమా. ఇసబెల్ మే ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని ఈ వీకెండ్ చూసెయ్యండి. – ఇంటూరు హరికృష్ణ -
OTT: హాలీవుడ్ మూవీ ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఇప్పుడు అందరూ దాదాపు తలదించుకునే ఉంటున్నారు... ఎందుకంటే సెల్‌ఫోన్ చూడ్డానికి. ఆప్తుల కన్నా, కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ అయిపోయింది సెల్‌ఫోన్. ఈ సెల్‌ఫోన్ ఓ అగ్గి అయితే, సోషల్ మీడియా దానికి తోడవుతున్న గాలి. అగ్నికి ఆజ్యమన్నట్టు ఈ సోషల్ మీడియా ముఖ్యంగా నేటి యువతను పూర్తిగా వశపరుచుకుంటోంది. సోషల్ మీడియా చెడు అన్న అంశం ఎంత నిజమో మంచి అన్నదానికి నిదర్శనమే ఈ ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ సినిమా. దర్శకులు స్టూవెన్ సి. మిల్లర్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ప్రముఖ నటుడు ఆరన్ యఖార్ట్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ‘లైన్ ఆఫ్ డ్యూటీ’ కథాంశానికొస్తే... ఫ్రాంక్ పెన్నీ ఓ నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. కానీ అతని కెరీర్లో మాయని మచ్చ ఓ షూటవుట్‌లో అనుకోకుండా ఓ చిన్నపిల్లవాడిని తన చేతులతో కాల్చి చంపడం. దాని గురించి బాధ పడుతున్న తరుణంలోనే ఓ కిడ్నాపర్ తన సహోద్యోగి కుమార్తెను కిడ్నాప్ చేసి, పోలీసులకు సవాలు విసురుతాడు. ఈ తరుణంలో అవా బ్రూక్స్ అనే యంగ్ సోషల్ మీడియా రిపోర్టర్ ఫ్రాంక్ పెన్నీకి తారసపడుతుంది. సమాజంలో జరిగే వాస్తవ దారుణాలను అవా బ్రూక్స్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటుంది. ఫ్రాంక్ పెన్నీతో కలిసి అవా బ్రూక్స్ సోషల్ మీడియా ద్వారా ఈ కిడ్నాపింగ్ ఆపరేషన్ ఎలా చేసింది? అన్నది లయన్స్ గేట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న ‘లైన్ ఆఫ్ డ్యూటీ’లోనే చూడాలి. ఆద్యంతం యాక్షన్ సన్నివేశాలతో థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సోషల్ మీడియా విలువలను నేటి యువతరానికి అర్ధమయ్యేలా చెబుతుంది. వర్త్ టు వాచ్ ది ‘లైన్ ఆఫ్ డ్యూటీ’. – ఇంటూరు హరికృష్ణ -
ఉత్కంఠ రేపుతున్న వెనమ్ - ది లాస్ట్ డాన్స్ ఫైనల్ ట్రైలర్
‘మ్యాడ్ మ్యాక్స్, ది రెవినాంట్, ఇన్సెప్షన్’ వంటి సినిమాల్లో నటించిన టామ్ హార్డీ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’. కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మార్వెల్ సంయుక్తంగా నిర్మించాయి. సోనీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇండియాలో ఇంగ్లిష్తో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో విడుదల చేయనుంది. 3డితో పాటు ఐమాక్స్ 3డి వెర్షన్లో అక్టోబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి: పద్దెనిమిదో శతాబ్దం నేపథ్యంలో మహేశ్-రాజమౌళి సినిమా)ఈ సందర్భంగా ఈ చిత్రం ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘‘ఇది నీకు నచ్చకపోవచ్చు... నచ్చదు... నాకు కచ్చితంగా నచ్చదని గ్యారెంటీ ఇస్తున్నాను’, ‘ఆ గ్రహవాసులు మనల్ని కనిపెట్టారు’, ‘దాన్ని ఎవరు పంపించారు... ఆ సృష్టిక్తర’, ‘మీరు కలిసుంటే ఈ ప్రపంచం మనుగడ సాగించలేదు’ వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ‘‘టామ్ హార్డీ నటనతో ΄ాటు వెనమ్ క్యారెక్ట్ చేసే యాక్షన్ సీన్స్ హైలెట్‌గా నిలుస్తాయి. ఇప్పటికే విడుదలైన ‘వెనమ్’ మొదటి భాగం, రెండవ భాగం ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్‌ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘వెనమ్: ది లాస్ట్ డాన్స్’ పై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
OTT: హాలీవుడ్ మూవీ ‘ప్రైమల్’ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ప్రైమల్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. దేవుడా... ఈ స్థితి ఎవరికీ రాకూడదు!థ్రిల్లర్ చిత్రాలను మనం గతంలో ఎన్నో చూశాం. అదే జోనర్లో ఎప్పటికప్పుడు వినూత్న పంథాను ఎంచుకుంటూ వర్ధమాన దర్శకులు వివిధ భాషలలో సినిమాలు తీయడానికి ప్రయత్నిస్తూనే వున్నారు. థ్రిల్లర్ అంటే సినిమా చూసే ప్రేక్షకుడిని తమ స్క్రీన్‌ప్లేతో అలరించాలి... కథను రక్తి కట్టించాలి. 2019లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ‘ప్రైమల్’ ఆ కోవలోనే ఉంటుంది. ఇది ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ నటుడు నికోలస్ కేజ్ నటించిన ఈ సినిమా ఓ అసలు సిసలైన థ్రిల్లర్ అని చెప్పాలి. నిక్ పావెల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కథ 70 శాతం నడి సముద్రంలోని ఓ ఓడలోనే జరుగుతుంది. కథాంశానికొస్తే... వాల్ష్ పాత్రలో నటించిన నికోలస్ కేజ్ ప్రమాద జంతువులను అడవిలో పట్టుకొని నగరంలో జంతు శాలలకు అమ్ముకునే ప్రమాద వృత్తిలో ఉంటాడు. ఈ దశలో అతి ప్రమాదకరమైన వైట్ జాగ్వర్ను పట్టుకుని జాగ్వర్‌తో పాటు విషపూరిత పాములు, కోతులు మరికొన్ని జంతువులను కూడా ఓ ఓడలో వేరే దేశానికి తరలిస్తుంటాడు. అనుకోకుండా అదే ఓడలో కరడుగట్టిన నేరస్తుడైన రిచర్డ్ లోఫర్‌ను కూడా అమెరికా పోలీసులు తరలించడానికి వస్తారు. ఓడ ప్రమాదకర జంతువులతో పాటు అతి ప్రమాదకరమైన నేరస్తుడుతో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. సముద్ర మార్గంలో కొంత దూరం ప్రయాణించాక నేరస్తుడు తాను తప్పించుకొని ఓడలో ఉన్న జంతువులను వాటి చెరసాలనుండి విడిపిస్తాడు. వాల్ష్ తన జంతువులతో పాటు ఓడలో వున్న మిగతా పోలీసులను, అలాగే ఓడను ఆ నేరస్తుడి బారి నుండి ఎలా రక్షించాడన్నదే మిగతా కథ. విలన్ పాత్రలో కెవిన్ తన నటనతో సినిమాకే హైలెట్‌గా నిలిచాడు. ఓ టైమ్‌లో ప్రేక్షకుడు దేవుడా... ఈ స్థితి ఎవరికీ రాకూడదు అని కచ్చితంగా అనుకుంటాడు. స్క్రీన్‌ప్లే నిడివి తక్కువ ఉండి థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులకు సరైన ఎంటర్టైనర్ అయిన ఈ ‘ప్రైమల్’ సినిమా లయన్స్ గేట్ ఓటీటీలో ఉంది. మరింకేం... వాచ్ చేయండి. – ఇంటూరు హరికృష్ణ -
I.S.S Review: అంతరిక్షంలో యుద్ధం.. ఈ ఊహే థ్రిల్లింగ్!
ఊహకు రెక్కలొస్తే కాదేదీ కథకు అనర్హం అన్న నానుడి సరిగ్గా ఈ సినిమాకి సరిపోతుంది. మరి రచయిత అంత వైవిధ్యంతో ఆలోచించాడు. సినిమా పేరు ఐఎస్ ఎస్, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. ఇది చదవగానే ఇంకేముంది అంతరిక్ష ప్రయాణంతో ముడిపడిన కథ అని అనుకుంటారు. అలా అయితే రచయిత గురించి ఊసెందుకు. అసలా రచయిత ఊహ నిజంగా జరిగితే... ఆ ఆలోచనకే ఒకింత గగుర్పాటు వస్తుంది. ఈ సినిమా రచయిత నిక్ షఫీర్. దర్శకులు గేబ్రియలా. ఇక కథ విషయానికి వద్దాం. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్ అమెరికా మరియు రష్యా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. ఐఎస్ ఎస్ సినిమా ప్రారంభం కాగానే స్పేస్ స్టేషన్ లో అమెరికా వ్యోమగాములు రష్యా వ్యోమగాములకు స్వాగతం పలుకుతుంటారు. అందరూ ఆనందంగా స్పేస్ స్టేషన్ లో కలుస్తారు. ఇంతలో ఓ అమెరికా వ్యోమగామి భూమి వైపు చూసి మిగతా వారినందరినీ అలర్ట్ చేస్తుంది. భూమి మీద భయంకరమైన విస్ఫోటనాలు జరుగుతుంటాయి. వీరికి అర్ధం కాక భూమిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంత సమయం తరువాత భూమి పై అణు యుద్ధం ప్రారంభమైందని స్పేస్ స్టేషన్ తమ ఆధీనం చేసుకోవాలని వారి వారి దేశం వాళ్ళకు వర్తమానం పంపుతారు.ఉందేది అంతరిక్షలో, అదీ రెండు దేశాలకు సంబంధించి వ్యోమగాములు ఒకే స్పేస్ స్టేషన్ లో. భూమి మీద యుద్ధం. ఇదే యుద్ధం అప్పటి నుండి స్పేస్ స్టేషన్ లో కూడా ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో కుట్రలేంటి, ఎవరి మీద ఎవరు గెలిచారు, ఆఖరికి స్పేస్ స్టేషన్ ఎవరు చేజిక్కించుకున్నారు అన్నది ఐఎస్ ఎస్ సినిమాలో చూడాల్సిందే. దర్శకుడు లాగ్ లేకుండా పాయింట్ ని మంచి స్క్రీన్ ప్లే తో థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు. ఐఎస్ ఎస్ సినిమా మంచి వీకెండ్ మూవీ. ఈ సినిమా జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫాం వేదికగా స్ట్రీం అవుతోంది.- ఇంటూరు హరికృష్ణ -
Sleep Movie Review: నిద్రతోనే భయపెట్టే సినిమా
టైటిల్: స్లీప్(కొరియన్ మూవీ)దర్శకత్వం: జాసన్ యూనిర్మాణ సంస్థ లోటే ఎంటర్టైన్మెంట్జోనర్: హారర్ థ్రిల్లర్ఓటీటీ: అమెజాన్ ప్రైమ్(తెలుగులోనూ అందుబాటులో ఉంది)నిడివి: 95 నిమిషాలుహారర్ సినిమా అంటే మనందరికీ గుర్తొచ్చేది దెయ్యమే. ఆ సబ్జెక్ట్ లేకుండా హారర్ సినిమా తీయడం చాలా అరుదు. తెలుగు చాలా హారర్ చిత్రాలు వచ్చాయి. కానీ దెయ్యం ఎక్కడా కనిపించకుండా ఆడియన్స్‌ను భయపెట్టేలా సినిమాలు చాలా తక్కువే ఉంటాయి. అలాంటి సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమే స్లీప్. 2023లో వచ్చిన కొరియన్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ ఎలా ఉండో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఈ సినిమా మొత్త ఇద్దరు దంపతుల చుట్టే తిరుగుతుంది. సౌత్ కొరియాలో హైయోన్-సూ (లీ సన్-క్యున్), సూ-జిన్ (జంగ్ యు-మి) కొత్తగా పెళ్లి చేసుకుని ఓ ఫ్లాట్‌లో నివసిస్తుంటారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ హాయిగా జీవనం సాగిస్తుంటారు. కానీ అనుకోకుండా ఓ రాత్రి జరిగిన సంఘటనతో వారి జీవితం ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ సంఘటన తర్వాత సూ జిన్‌లో భయం మొదలవుతుంది. అసలు తన భర్త ఎందుకిలా చేస్తున్నాడో భయంతో వణికిపోతుంది.ఆ తర్వాత తన భర్త హయన్ సూతో కలిసి వైద్యుని సంప్రదిస్తుంది సూ జిన్. ఆ తర్వాత ఆమె భర్తకు ఉన్న విచిత్రమైన, భయంకరమైన వింత సమస్య గురించి ఆమెకు అసలు నిజం తెలుస్తుంది. దీంతో భర్తను కాపాడుకునేందుకు ఆమె శతవిధాలా ప్రయత్నిస్తుంది. అసలు అతనికి ఏమైంది? భయంకరమైన డిజార్డరా? లేక దెయ్యం ఆవహించిందా?.. అలాగే వీరికి పుట్టిన బాబును ఎలా రక్షించుకుంది? అనేది తెలియాలంటే స్లీప్ ఓసారి చూడాల్సిందే. ఎలా ఉందంటే..స్లీప్.. హారర్ మూవీ అయినప్పటికీ డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్‌ను సినీ ప్రియులకు పరిచయం చేశాడు. దెయ్యాన్ని చూపించకుండానే ఆడియన్స్‌ను భయపడేలా చేశాడు. ఇందులో విచిత్రమైన డిజార్డర్‌ను పరిచయం చేస్తూ.. హారర్‌తో పాటు ఆడియన్స్‌లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. అతనికి ఉన్నది డిజార్డరా? లేక నిజంగానే దెయ్యం పట్టిందా? అన్న అనుమానాన్ని ఆడియన్స్‌లో రేకెత్తించాడు. అక్కడక్కడా మధ్యలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించినా.. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌ను మరింత భయపెట్టేస్తాయి. కొన్ని సీన్స్ అయితే ఒళ్లు గగుర్పొడ్చేలా ఉన్నాయి. అలాగే చివర్లో వచ్చే డ్రిల్లింగ్ మిషన్ సీన్ చిన్నపిల్లలకు చూపించకపోవడం మంచిది. మొత్తంగా ఓటీటీలో సస్పెన్ష్ థ్రిల్లర్స్ ఎంజాయ్ చేసే ఆడియన్స్ స్లీప్ చూసేయొచ్చు. -
OTT: ‘ఫ్రీలాన్స్’ హాలీవుడ్ మూవీ రివ్యూ
యాక్షన్ సినిమా అంటే పూర్తిగా యాక్షనే కాదు కామెడీతో కూడిన యాక్షన్ చిత్రాలు ఇదివరలో మనం చాలానే చూశాం. అదే కోవలో విడుదలైన చిత్రం ఫ్రీలాన్స్ ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతోంది. జాన్ సేనా వంటి సీరియస్ యాక్షన్ కథానాయకుడు నటించిన చిత్రం ఈ ఫ్రీలాన్స్. కథాపరంగా కథానాయకుడు ఒకప్పుడు ఆర్మీలో పని చేసి ఓ వ్యక్తి చేసిన తప్పిదానికి ఆర్మీ నుండి అనుకోకుండా తను సస్పెండ్ అవుతాడు.కొంతకాలం తరువాత తన స్నేహితుడి ద్వారా ప్రైవేట్ ఆర్మీలో పని చేసే అవకాశం లభిస్తుంది కథానాయకుడికి. ఆ ప్రైవేట్ ఆర్మీ మొదటి ఆపరేషన్ ఓ జర్నలిస్టుకి బాడీగార్డ్ గా వ్యవహరించడం. ఆ జర్నలిస్ట్ ఓ దేశాధిపతిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళే తరుణంలో కథానాయకుడిని బాడీగార్డ్ గా తీసుకువెళుతుంది. అక్కడ ఆదేశాధిపతి మీద దాడి జరుగుతుంది. తరువాత ఆ దాడిని కథానాయకుడు ఎలా ఎదుర్కున్నాడు, జర్నలిస్ట్ ను ఎలా రక్షించాడు అన్నది ఓటిటి తెర మీద చూడాల్సిందే. ఈ కథ కాన్సెప్ట్ సీరియస్ అయినా స్క్రీన్ ప్లే మాత్రం హాస్యభరితంగా ఉంటుంది. వీకెండ్ మూవీ వ్యూవర్స్ కు మస్ట్ వాచ్ మూవీ అని చెప్పవచ్చు.- ఇంటూరు హరికృష్ణ -
షూటింగ్లో గాయపడ్డ స్టార్ హీరోయిన్
సినిమా షూటింగ్లో స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ షూటింగ్ సమయంలో ఆమెకు స్వల్ప గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంకనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. తన గొంతు మీద చిన్న స్క్రాచ్ అయిన ఫోటోని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ..‘వృత్తి జీవితంలో ప్రమాదాలు’ అనే క్యాప్షన్ ఇచ్చింది. ‘స్టంట్’ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. (చదవండి: అనుష్కకు అరుదైన వ్యాధి.. పగలబడి నవ్వేస్తారట!)‘ది బ్లఫ్’లో ప్రియాంక చోప్రా యాక్షన్ రోల్ ప్లే చేస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని యాక్షన్స్ సీన్స్ తెరకెక్కించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. షూటింగ్లో ప్రమాదాలు జరగడం ప్రియాంకకు కొత్తేమి కాదు. గతంలోనూ పలు సినిమాల షూటింగ్ సమయంలో ఆమె ప్రమాదానికి గురయ్యారు. ఇప్పుడు పెదవి చివర చిన్న గాయంతో పాటు మెడపై గాటు పడింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ‘జాగ్రత్త’ మేడం అంటూ అమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.(చదవండి: అనారోగ్యంతో మంచానపడ్డ అభిమాని.. పిల్లల బాధ్యత భుజానెత్తుకున్న మహేశ్)సినిమాల విషయాలకొస్తే.. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ప్రియాంకా చోప్రా.. 2018లో అమెరికా సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకొని తన మకాంను హాలీవుడ్‌కి మార్చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. చివరగా సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. -
‘ది ఫాబెల్మ్యాన్స్’ డైరెక్టర్‌తో ఎమిలీ బ్లంట్ కొత్త మూవీ!
‘ది ఫాబెల్మ్యాన్స్’ (2022) చిత్రం తర్వాత హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ తదుపరి చిత్రం గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే స్పీల్బర్గ్ తర్వాతి సినిమా గురించి అతి త్వరలోనే కొత్త కబురు వినిపించనుందని హాలీవుడ్ టాక్. హాలీవుడ్ ప్రముఖ నటి ఎమిలీ బ్లంట్ లీడ్ రోల్లో స్పీల్బర్గ్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా గురించి ఎమిలీతో చర్చించారట కూడా. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. ఓ వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట స్పీల్బర్గ్. -
‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్
హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీ ‘వెనమ్’ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’. తొలి, మలి భాగాలు ‘వెనమ్ (2018)’, ‘వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్ (2021)లకు ప్రేక్షకుల నుంచి, బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’పై అంచనాలు ఉన్నాయి. ‘వెనమ్, వెనమ్: లెట్ దేర్ బీ కార్నేజ్’ (2021) లలో హీరోగా నటించిన టామ్ హార్డీయే ‘వెనమ్: ది లాస్ట్డ్యాన్స్’ చిత్రంలోనూ నటించారు. ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’కు కెల్లీ మార్సెల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎడ్డీ బ్రాక్ పాత్రలో టామ్ హార్డీ కనిపిస్తారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబరు 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇక ‘వెనమ్’ ఫ్రాంచైజీలో ‘వెనమ్: ది లాస్ట్ డ్యాన్స్’ చివరి చిత్రం అవుతుందనే టాక్ హాలీవుడ్లో వినిపిస్తోంది. -
Furiosa A Mad Max Saga: రిలీజ్‌కు రెడీ అయిన హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్
హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రం ప్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఈ నెల 24వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఇది 2015లో వచ్చిన మ్యాడ్ మ్యాక్స్ ప్యూరి రోడ్ చిత్ర ప్రాంచైజీలో తాజా చిత్రం. గత చిత్రాల దర్శకుడు జార్జ్ మిల్లర్నే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే వాటికంటే భారీగా అదే సమయంలో ఒరిజినల్ కథతో రూపొందించిన చిత్రం ప్యూరియోసా ఎ మ్యాడ్ మ్యాక్స్ సాగా. ఇందులో అన్యటైలర్ జాయ్ ఒక యువ మహిళా యోధుని పాత్రలో నటించారు. నటుడు క్రిస్ హేమ్స్ వర్త్ ప్రతి నాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్స్ సంస్థతో కలిసి మిల్లర్ ఆయన చిరకాల భాగస్వామి, ఆస్కార్ నామినేటెడ్ నిర్మాత డౌగ్ మిథ్చల్ ఆ్రస్టేలియా బేస్డ్ కెన్నడీ మిల్లర్ మిచ్చల్ పతాకంపై నిర్మించారు. కాగా ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని నటుడు క్రిస్ హేమ్స్ వర్త్ మీడియాతో పంచుకున్నారు. ఇందులో ప్రతినాయకుడి పాత్రను పోషించడం మంచి అనుభవం అని పేర్కొన్నారు. నిజానికి ఇంత మంచి పాత్రలో తాను నటిస్తానని ఊహించలేదన్నారు. ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ కథా చిత్రంలో తన పాత్ర ఆది నుంచి అంతం వరకు ఉంటుందన్నారు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి పాత్రను తాను భవిష్యత్తులో నటిస్తానో లేదో అని కూడా చెప్పలేను అన్నారు. కాగా ఈ చిత్రాన్ని వార్నర్ బ్రదర్ సంస్థ ఈ నెల 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఆంగ్లం, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. -
The Marvels Movie Review: ది మార్వెల్స్ రివ్యూ.. 2 వేల కోట్ల లేడి సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
హాలీవుడ్ అంటేనే కళ్లు చెదిరే యాక్షన్ సీన్లతో దుమ్మురేపుతారు. అందులోనూ మార్వెల్ యూనివర్స్ చిత్రాలపై ప్రేక్షకుల అంచనాలు ఏ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ప్రాంచైజ్‌లో సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ సంబరపడిపోతుంటారు. ఇప్పటికే మార్వెల్స్ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్, కెప్టన్ మార్వెల్,ది అవెంజర్స్,బ్లాక్ పాంథర్ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించాయి.ఈ క్రమంలో నవంబర్ 10 2023న విడుదలైన 'ది మార్వెల్స్' తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందేబాటులో ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ డీస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ముగ్గురు లేడి సూపర్ హీరోల కాన్సెప్టుతో వచ్చిన ఈ సినిమాను రూ.2250 కోట్లతో నిర్మించారు. 2019లో వచ్చిన కెప్టెన్ మార్వెల్ సినిమాకు సీక్వెల్‌గా 'ది మార్వెల్స్'ఈ సినిమా వచ్చింది. ఇందులో బ్రీ లార్సన్ ప్రధాన పాత్రలో లీడ్ చేస్తే.. ఇమాన్ వెల్లని, టియోనా పార్రిస్లు లేడి సూపర్ హీరోలుగా చేశారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకురాలు నియో డకోస్టా తెరకెక్కించిన చిత్రమిది. యాక్షన్, అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..మార్వెల్‌కు చెందిన ఈ ముగ్గురు సూపర్ హీరోయిన్స్ విశ్వ రక్షణ కోసం పోరాడుతుంటారు. క్రీ అనే గ్రహం అంతరించిపోతున్న సమయంలో ఆ గ్రహాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని విలన్ పాత్రలో ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్) పోరాడుతుంటాడు. ఇతర గ్రహాల్లో ఉన్న వనరులను తన గ్రహానికి తెచ్చుకునే పనిలే ఉంటాడు. అందుకోసం ఒక క్వాంటమ్ బ్యాండ్ సాయంతో ఈ పనిచేస్తుంటాడు. ఇలాంటి సమయంలో క్వాంటమ్ బ్యాండ్ నుంచి వచ్చే మాగ్నెటిక్ పవర్ వల్ల అనేక శక్తులతో కెప్టెన్ మార్వెల్ కారోల్ డార్విన్ (బ్రీ లార్సన్), కెప్టెన్ మోనికా ర్యాంబో (టియోనా పార్రిస్), కమలా ఖాన్ అలియాస్ మిస్ మార్వెల్ (ఇమాన్ వెల్లని) ఎంట్రీ ఇస్తారు. ఈ ముగ్గురిని టీం అప్ చేసే ‘నిక్ఫ్యూరి’ పాత్రలో సామ్యూల్ జాక్సన్ కనిపిస్తారు. తన శక్తులను లాక్కున్న క్రీ గ్రహం నుంచి వాటిని తిరిగి సాధించి తనపై ప్రతీకారం తీర్చుకుంటుంది మార్వెల్. కానీ కొన్ని కారణాల వల్ల క్రీ శక్తుల నుంచి విశ్వాన్ని కాపాడే బాధ్యతను తనపై వేసుకుంటుంది. ఇందులో కెప్టన్ మార్వెల్కి వెలుతురును స్వాధీనం చేసుకునే శక్తి ఉంటుంది. దాన్ని స్వయంగా చూసే శక్తి మోనికా రాంబోకి ఉంటుంది. వెలుతురునే ఒక వస్తువుగా మార్చే శక్తి మిస్ మార్వెల్కి ఉంటుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ముగ్గురు తమ పవర్స్ ఉపయోగించిన ప్రతిసారి ఒకరి స్థానంలో మరొకరు ఉంటారు.ఈ ముగ్గురు కలిసి ‘ది మార్వెల్స్’గా మారడం.. ఆపై విశ్వాన్ని నాశనం చేస్తున్న ప్రొటెక్టర్ డార్విన్ (జావే ఆష్టన్)పై ఎలాంటి యుద్ధం చేస్తారనేది ఈ కథ. ఎలా ఉందంటేమార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి సినిమా వస్తుందంటే చాలా అంచనాలు ఉంటాయి. అందుకోసం రూ. 2250 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ముగ్గురు లేడి సూపర్ హీరోల భారీ యాక్షన్ సీన్స్ మెప్పించినప్పటికీ కథలో కాస్త ఆసక్తిని తగ్గిస్తుంది. ఇప్పటికే ఇలాంటి కథలు రావడంతో అంతగా ప్రేక్షకులు కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. 2022లో వచ్చిన మిసెస్ మార్వెల్ క్లైమాక్స్ సీన్‌తో ది మార్వెల్స్ స్టార్ట్ అవుతుంది. డార్బెన్ను పవర్ ఫుల్ విలన్‌గా మొదట్లో చూపించిన దర్శకులు.. క్లైమాక్స్ వచ్చేసరికి అంతలా మెప్పించలేకపోయారు. ఎడ్లాండా అనే కొత్త గ్రహాన్ని ది మార్వెల్స్లో చూపించారు. అది బాగానే ఉన్నప్పటికీ వార సంస్కృతిని చూపించిన విధానం అంతగా మెప్పించదు. ఇందులో ప్రదానంగా కెప్టెన్ మార్వెల్ ఫ్యాన్‌గా ఇమాన్ వెల్లని తన నటనతో దుమ్మురేపింది. సినిమా స్థాయికి తగ్గట్టుగానే గ్రాఫిక్స్, విజువల్స్ ఆకట్టుకుంటాయి. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌లు హైలెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి మరో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. మార్వెల్స్ చిత్రాలను ఇష్టపడే వారందరినీ 'ది మార్వెల్స్' తప్పకుండా మెప్పిస్తుంది. హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. -
ఫాస్ట్‌లో... ఇదే లాస్ట్ అవుతుందా?
హాలీవుడ్ సూపర్ హిట్ యాక్షన్ ఫ్రాంచైజీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’కు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా ఫ్రాంచైజీ నుంచి వచ్చిన పది సినిమాలు ఘనవిజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టుకోవడం ఇందుకు ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తాజాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీ నుంచి 11వ చిత్రం రానుంది. ‘ఫాస్ట్ ఎక్స్’ (‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ పదో చిత్రం) సినిమాకు దర్శకత్వం వహించిన లూయిస్ లెటర్రియర్ పదకొండవ సినిమానూ తెరకెక్కించనున్నారు. కాగా ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు లూయిస్. ‘‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 11వ చిత్రం షూట్‌ను ఈ ఏడాదే ఆరంభిస్తాం. ప్రస్తుతం నేనో హారర్ మూవీ చేస్తున్నాను. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు 15న పూర్తవుతుంది. సెప్టెంబరు 16న ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ 11వ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తాను. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సిరీస్‌లో తొలి భాగం 2001లో విడుదలైంది. సరిగ్గా పాతికేళ్ల తర్వాత 2026లో ఈ సిరీస్‌లోని 11వ చిత్రం విడుదల చేస్తాం. తొలి చిత్రాన్ని విడుదల చేసిన తేదీనే (జూన్ 18) 11వ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని ఉంది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పరంగా కుదురుతుందో లేదో చూడాలి’’ అని చెప్పుకొచ్చారు లూయిస్. కాగా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ ఫ్రాంచైజీలో ఇదే లాస్ట్ చిత్రం అవుతుందని హాలీవుడ్ టాక్. -
Death Whisperer Review: అమ్మాయిలను వెంటాడే దెయ్యం..చివరికేమైంది?
టైటిల్: డెత్ విస్పరర్డైరెక్టర్: థావివాత్ వాంతానటీనటులు: నదెచ్ కుగిమియ, జూనియర్ కజ్భుందిట్, పీరకృత్ పచరబూన్యకైట్, దెడిస్ జెలిల్చ కపౌన్నిడివి: 2 గంటలుఓటీటీ: నెట్ఫ్లిక్స్హారర్ సినిమాలకు ప్రత్యేక అభిమానులుంటారు. కొందరు భయమనేదే లేకుండా.. కన్నార్పకుండా సినిమా చూస్తారు. మరికొందరు ఎంత భయమేసినా సరే.. నిండా దుప్పటి కప్పుకుని మరీ చూస్తుంటారు. హారర్ సినీప్రియులందరికోసం ప్రతియేడూ బోలెడన్ని సినిమాలు రిలీజవుతున్నాయి. అలా గతేడాది డెత్ విస్పరర్ అనే థాయ్ మూవీ రిలీజైంది. క్రిట్టనాన్ రచించిన టీ యోడ్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీ కథేంటి? ఎలా ఉందో చూద్దాం..కథేంటంటే..అది 1970.. థాయ్‌లాండ్ కాంచనబూరిలోని గ్రామంలో ఓ ఫ్యామిలీ సంతోషంగా జీవనం సాగిస్తుంటుంది. ఇంటి పెద్ద పొలం పని చేస్తుంటాడు. చాలా స్ట్రిక్ట్. భార్య ఇంటి పనికే పరిమితమవుతుంది. వీరికి ముగ్గురమ్మాయిలు, ముగ్గురబ్బాయిలు సంతానం. పిల్లలు బడికి వెళ్లేముందు, వచ్చాక తల్లికి ఇంటిపనిలో సాయపడుతుంటారు. ఇద్దరబ్బాయిలు తండ్రికి పొలంలో సాయం చేస్తారు. అందరికంటే పెద్దవాడైన యాక్ మిలిటరీలో పని చేస్తాడు. కానీ ఓ రోజు ఉన్నట్లుండి ఇంటికి వచ్చేస్తాడు. అప్పటికే ముగ్గురమ్మాయిలకు స్కూలుకు వెళ్లే దారిలో ఓ చెట్టు కింద దెయ్యం కనిపిస్తూ ఉంటుంది. వారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ దెయ్యం కనిపిస్తుంది.పన్ను పీకి చేతబడిఆ దెయ్యం అందరికంటే ఆరోగ్యంగా ఉన్న యామ్ను ఆవహించేందుకు సెలక్ట్ చేసుకుంటుంది. దీంతో తను అనారోగ్యానికి లోనవుతుంది. వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఓ రోజు చూయ్ అనే మంత్రగత్తె కిటికీలోంచి ఆ అమ్మాయి గదిలోకి దూరం తన పన్ను పీకి దానిపై చేతబడి చేస్తుంది. ఈ విషయం తెలిసి మిలిటరీ నుంచి వచ్చిన అన్న తనను చావబాదడానికి వెళ్తే తనే ఆత్మహత్య చేసుకుంటుంది. అక్కడినుంచి ఈ కుటుంబానికి కష్టాలు మొదలవుతాయి.క్లైమాక్స్‌లో ట్విస్ట్రాత్రిపూట దెయ్యం ఏదో వింతవింత(గుసగుసలాడినట్లు) శబ్దాలు చేయడం, అది విన్నవారు స్పృహ తప్పిపోవడం.. అర్ధరాత్రి యామ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం, ఆమెను వెతికి తీసుకురావడం.. ఇదే జరిగేది. దెయ్యం వారిని మానిప్యులేట్ చేయడానికి ట్రై చేసినా.. ప్రాణాలకు తెగించి మరీ యాక్ తన చెల్లిని బతికించేందుకు ప్రయత్నిస్తాడు. దెయ్యం ఎక్కడైతే కనిపించిందో ఆ చెట్టును కొట్టేసి అక్కడున్న మానవ మాంసాన్ని కాల్చేస్తారు. తర్వాత ఆస్పత్రికి వెళ్లే దారిలో దెయ్యాన్ని కూడా షూట్ చేస్తారు. ఇక దాని పీడ విరగడైందనుకున్న సమయంలో డైరెక్టర్ ట్విస్ట్ ఇచ్చాడు.. అదేంటో తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?డెత్ విస్పరర్స్.. ఈ మూవీలో హారర్కే పెద్ద పీట వేశారు. కామెడీ జోలికి వెళ్లలేదు. అయితే సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్లిపోతుంది. పెద్దగా ఎగ్జయిట్ అయ్యే విషయాలంటూ ఏమీ ఉండవు. నటీనటులు బాగా యాక్ట్ చేశారు. సౌండ్ ఎఫెక్ట్స్ మీద కాస్త ఫోకస్ చేయాల్సింది. క్లైమాక్స్ చివర్లో సీక్వెల్ ఉంటుందని హింటిచ్చారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. అయితే తెలుగు ఆడియో, సబ్‌టైటిల్స్ లేవు. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో సినిమా చూసేయొచ్చు. -
మార్వెల్ యూనివర్స్ నుంచి మరో సినిమా.. ట్రైలర్ అదుర్స్
మార్వెల్ యూనివర్స్ నుంచి వచ్చిన డెడ్‌పూబ్లా సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఈ సిరీస్ నుంచి మరో సినిమా రాబోతుంది. మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘డెడ్‌పూల్ & వోల్వారిన్’. ఈ సినిమాలో ర్యాన్ రేనాల్డ్స్, హ్యూగ్ జాక్మాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. షాన్ లెవీ దర్శకత్వం వహిస్తున్నాడు. మార్వెల్ స్టూడియోస్, 21 ల్యాప్స్ ఎంటర్టైనమెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.ఫుల్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ మరోసారి ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ఎమ్మా కొరిన్, మోరెనా బక్కరిన్, రాబ్ డెలానీ, లెస్లీ ఉగ్గమ్స్, కరణ్ సోని, మాథ్యూ మక్‌ఫాడియన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
రెండు ఓటీటీల్లోకి వచ్చేసిన రూ.1500 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ప్రస్తుతం సినీ ప్రియులు ఎక్కువగా ఓటీటీల వైపే చూస్తున్నారు. ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నారు. దీంతో ఓటీటీ ప్రేక్షకుల కోసం ఎప్పటికప్పుడు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. తాజాగా హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ డ్యూన్ పార్ట్- 2 ఓటీటీలోకి వచ్చేసింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం రెంటల్ విధానంలోనే మాత్రం అందుబాటులో ఉంది. ప్రస్తుతం రెంటల్ విధానంలో అమెజాన్ ప్రైమ్‌తో పాటు బుక్‌మై షో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రూ.1500 కోట్ల బడ్డెజ్తో తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.4500 కోట్ల వసూళ్లు సాధించింది. 2024లో హాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీస్‌లో ఒకటిగా రికార్డ్ క్రియేట్ చేసింది. కాగా.. లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ బ్యానర్లపై డెనీస్ విల్లెన్యువే దర్శకత్వంలో రూపొందించారు. ఫ్రాంక్ హెర్బర్ట్ రచించిన డ్యూన్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో తిమోతీ ఛాలామెట్, జెండ్యా, రెబాకా ఫెర్గూసన్, జోష్ బ్రోలిన్, ఆస్టిన్ బట్లర్ కీలక పాత్రలు నటించారు. 2021లో విడుదలైన అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా డ్యూన్‌కు సీక్వెల్‌గా పార్ట్- 2 తీసుకొచ్చారు. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.