
ప్రేక్షకులు తాళమేశారు... తమకు తెలియకుండానే ‘ఇన్‌సిడియస్’ సిన్మాలొచ్చినప్పుడు భయపడుతూ, సిన్మా బాగుందంటూ తాళమేశారు! ‘ఇన్‌సిడియస్’ అంటే ‘తెలియకుండానే ఆవహించిన’ అని అర్థం! ఆ పేరుతో వచ్చిన మూడు సిన్మాలు హర్రర్ లవర్స్‌కు టెర్రర్ చూపించాయి. సిన్మా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు తెలియకుండానే వాళ్లలో భయం ఆవహించేసింది. ఇప్పుడీ ఫ్రాంచైజీలో చివరిది, నాలుగోది ‘ఇన్‌సిడియస్: ద లాస్ట్ కీ’ రెడీ! వచ్చే ఏడాది జనవరి 5న విడుదల కానుంది.
ట్రైలర్‌లో మ్యాగ్జిమమ్ కథేంటో చెప్పేశారు. లిన్ షయే (ఎలైజ్ రైనీర్) అనే ముసలామె చిన్నప్పుడు నివసించిన ఇంట్లో పారానార్మల్ ఫినామినా (అతీత శక్తులు/దెయ్యాలు) గురించి ఎలా ఇన్వెస్టిగేట్ చేసిందనేది కథ. ఈ క్రమంలో ఆమెకు చిన్నప్పటి ఘటనలు గుర్తొస్తాయి. ఒంటరిగా చీకట్లో చూస్తే భయపెట్టేలా ఉందీ సిన్మా ట్రైలర్! కానీ, హర్రర్ సిన్మా ప్రేమికుల్లో చిన్న బాధ. లాస్ట్ కీతో ‘ఇన్‌సిడియస్’కి తాళమేస్తారా? ఇక, ఈ భయానికి తలుపులు వేసేస్తారా? అని!!
Comments
Please login to add a commentAdd a comment