Trailor
-
‘యూటర్న్’ సినిమా ట్రైలర్ విడుదల
-
భయానికి తాళమేస్తారా?
ప్రేక్షకులు తాళమేశారు... తమకు తెలియకుండానే ‘ఇన్సిడియస్’ సిన్మాలొచ్చినప్పుడు భయపడుతూ, సిన్మా బాగుందంటూ తాళమేశారు! ‘ఇన్సిడియస్’ అంటే ‘తెలియకుండానే ఆవహించిన’ అని అర్థం! ఆ పేరుతో వచ్చిన మూడు సిన్మాలు హర్రర్ లవర్స్‌కు టెర్రర్ చూపించాయి. సిన్మా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు తెలియకుండానే వాళ్లలో భయం ఆవహించేసింది. ఇప్పుడీ ఫ్రాంచైజీలో చివరిది, నాలుగోది ‘ఇన్సిడియస్: ద లాస్ట్ కీ’ రెడీ! వచ్చే ఏడాది జనవరి 5న విడుదల కానుంది. ట్రైలర్లో మ్యాగ్జిమమ్ కథేంటో చెప్పేశారు. లిన్ షయే (ఎలైజ్ రైనీర్) అనే ముసలామె చిన్నప్పుడు నివసించిన ఇంట్లో పారానార్మల్ ఫినామినా (అతీత శక్తులు/దెయ్యాలు) గురించి ఎలా ఇన్వెస్టిగేట్ చేసిందనేది కథ. ఈ క్రమంలో ఆమెకు చిన్నప్పటి ఘటనలు గుర్తొస్తాయి. ఒంటరిగా చీకట్లో చూస్తే భయపెట్టేలా ఉందీ సిన్మా ట్రైలర్! కానీ, హర్రర్ సిన్మా ప్రేమికుల్లో చిన్న బాధ. లాస్ట్ కీతో ‘ఇన్సిడియస్’కి తాళమేస్తారా? ఇక, ఈ భయానికి తలుపులు వేసేస్తారా? అని!! -
ఆయన సినిమా ట్రెయిలరే 72 గంటలు
స్టాక్‌హోమ్: దాదాపు 500 సామాజిక ప్రయోజనాత్మక చిత్రాలను, వందకుపైగా మ్యూజిక్ వీడియోలను తీసి పారలల్ చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించిన ప్రముఖ స్వీడిష్ డెరెక్టర్, నటుడు ఆండర్స్ వెంబెర్గ్ ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయని ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఏకబిగిన 30 రోజులపాటు కొనసాగే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకోసం టీజర్ క్లిప్‌ను విడుదల చేసిన ఆండర్స్ సినిమా ప్రచారం కోసం 72 గంటల 20 నిమిషాల నిడివిగల ట్రెయిలర్‌ను విడుదల చేస్తున్నారు. తన భారీ సినిమా ట్రెయిలర్ 2018లో విడుదల చేస్తానని, 2020లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేస్తానని, అది కూడా ఒకే షోను ప్రదర్శిస్తానని, ఆ తర్వాత దాన్ని నాశనం చేస్తానని ఆయనిక్కడ మీడియాకు తెలిపారు. మరో ప్రముఖ దర్శకుడు ఇంగ్మర్ బెర్గ్మన్ 1957లో తీసిన ఫాంటసీ డ్రామా చిత్రం ది సెవెన్త్ సీల్ షూటింగ్ నిర్వహించిన స్వీడన్ సదరన్ బీచ్‌లోనే ఆండర్స్ తన సినిమా ఆంబియన్స్ ట్రెయిలర్ షూటింగ్‌ను చేపట్టారు. ది సెవెన్త్ సీల్ చిత్రం థీమ్ వరుసలోనే తన చిత్రం ఓ జీవన ప్రయాణంలాగా సాగే నైరూప్య కలలతో కూడి ఉంటుందని ఆండర్స్ వివరించారు. ఓ పర్వత వీరుడు తనను చంపడానికి వచ్చిన మృత్యువుతో చెస్ ఆడుతున్న దృశ్యాలను బెర్గ్మన్ స్వీడన్ సదరన్ బీచ్‌లోనే చిత్రీకరించారు. ఆండర్స్ తీస్తున్న 72 గంటల 20 నిమిషాల సినిమా ట్రెయిలర్‌ను చూశాక ప్రేక్షకులు కచ్చితంగా కాలం స్తంభించిపోయినట్లు భావిస్తారని ఐఎండీబీ వ్యాఖ్యానించింది. -
'చీకటి రాజ్యం' మేకింగ్ వచ్చేసింది
చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న హీరో కమల్ హాసన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. తమిళంలో తూంగవనం, తెలుగులో చీకటిరాజ్యం పేరుతో ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సినిమా సిద్ధమౌతోంది. చాలా కాలం తరువాత కమల్ హాసన్ చేస్తున్నస్ట్రయిట్ తెలుగు సినిమా కావటంతో టాలీవుడ్ లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దకుంటున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పని శరవేగంగా నడుస్తోంది. కిడ్నాపైన తన కొడుకును హీరో ఎలా కాపాడుకున్నాడనేదే ఈ సినిమాలోని కీలక అంశం. కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ నెట్ లో సందడి చేస్తుండగా, హీరోయిన్ త్రిష ఓ మేకింగ్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కమల్ చిరకాల మిత్రుడు రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, త్రిష, మధుశాలిని, సంపత్ రాజ్ నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ ఒక పాట కూడా పాడారు. స్లీప్‌లెస్ నైట్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీ ఇన్సిపిరేషన్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
'చీకటి రాజ్యం' ట్రైలర్ వచ్చేసింది.
చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న హీరో కమల్ హాసన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తోది. తమిళంలో తూంగవనం, తెలుగులో సినిమా చీకటి రాజ్యం పేరుతో ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతోంది. ఫ్యామిలీ బేస్డ్ క్రైమ్ థిల్లర్ గా రూపుదిద్దకుంటున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. కిడ్నాపైన తన కొడుకును హీరో ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమాలోని కీలక అంశం. కమల్ చిరకాల మిత్రుడు రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, త్రిష, మధుశాలిని, సంపత్ రాజ్, నటిస్తున్నారు. మరోవైపు ఎం జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రంలో కమల్ హాసన్ ఒక పాట కూడా పాడారు. స్లీప్‌లెస్ నైట్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. -
చూడండి: రజనీకాంత్ 'కొచ్చడయాన్' మొదటి టీజర్ విడుదల