'చీకటి రాజ్యం' మేకింగ్ వచ్చేసింది | Behind the scenes footage of Kamal Haasan's 'Thoongavanam' | Sakshi
Sakshi News home page

'చీకటి రాజ్యం' మేకింగ్ వచ్చేసింది

Published Tue, Sep 29 2015 10:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

'చీకటి రాజ్యం'  మేకింగ్ వచ్చేసింది

'చీకటి రాజ్యం' మేకింగ్ వచ్చేసింది

చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో  రాబోతున్న  హీరో కమల్ హాసన్  మూవీ   ట్రైలర్  వచ్చేసింది.  ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తోంది.  తమిళంలో  తూంగవనం, తెలుగులో  చీకటిరాజ్యం పేరుతో  ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సినిమా సిద్ధమౌతోంది. చాలా కాలం తరువాత కమల్ హాసన్ చేస్తున్నస్ట్రయిట్ తెలుగు సినిమా కావటంతో టాలీవుడ్ లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఫ్యామిలీ  బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ గా  రూపుదిద్దకుంటున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పని శరవేగంగా నడుస్తోంది. కిడ్నాపైన తన కొడుకును  హీరో ఎలా కాపాడుకున్నాడనేదే ఈ సినిమాలోని కీలక అంశం. కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ నెట్ లో సందడి చేస్తుండగా, హీరోయిన్ త్రిష ఓ మేకింగ్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

కమల్ చిరకాల మిత్రుడు రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో  ప్రకాష్ రాజ్,  త్రిష,  మధుశాలిని, సంపత్ రాజ్ నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ ఒక పాట కూడా పాడారు.  స్లీప్లెస్ నైట్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీ ఇన్సిపిరేషన్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement