నిద్రపోని అడవి! | Kamal Haasan's next is bilingual thriller 'Thoongavanam' | Sakshi
Sakshi News home page

నిద్రపోని అడవి!

Published Sun, May 17 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

నిద్రపోని అడవి!

నిద్రపోని అడవి!

 తెలుగులో కమల్‌హాసన్ స్ట్రయిట్ చిత్రాలు చేసి, చాలా కాలమైంది. తమిళంలో ఆయన చేస్తున్న చిత్రాలే తెలుగులోకి అనువాదమవుతున్నాయి. ఎప్పటికప్పుడు ‘తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తా’ అని చెప్పుకుంటూ వచ్చిన కమల్, ఈ ఏడాది ఆ కోరిక తీర్చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన నటించనున్న తాజా చిత్రం ఈ నెల 24న ఆరంభం కానుంది. తమిళ వెర్షన్‌కు ‘తూంగా వనమ్’ అని టైటిల్ పెట్టారు. అంటే ‘నిద్రపోని అడవి’ అని అర్థం. మరి.. తమిళ టైటిల్‌ను యథాతథంగా అనువదించి, తెలుగులో ‘నిద్రపోని అడవి’ అని పెడతారా? లేక వేరే ఏదైనా టైటిల్ పెడతారా? అనేది వేచి చూడాలి.
 
 రాజేశ్ యం. సెల్వ దర్శకత్వంలో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్, చెన్నైలలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరపాలనుకుంటున్నారు. మూడే నెలల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కమల్ భార్యగా మనీషా కొయిరాలా నటిస్తారని భోగట్టా. అలాగే త్రిష, ప్రకాశ్‌రాజ్‌లను కూడా ఎంపిక చేశారట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement