Thoongavanam
-
'చీకటి రాజ్యం' మేకింగ్ వచ్చేసింది
చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న హీరో కమల్ హాసన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. తమిళంలో తూంగవనం, తెలుగులో చీకటిరాజ్యం పేరుతో ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సినిమా సిద్ధమౌతోంది. చాలా కాలం తరువాత కమల్ హాసన్ చేస్తున్నస్ట్రయిట్ తెలుగు సినిమా కావటంతో టాలీవుడ్ లో కూడా ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపుదిద్దకుంటున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పని శరవేగంగా నడుస్తోంది. కిడ్నాపైన తన కొడుకును హీరో ఎలా కాపాడుకున్నాడనేదే ఈ సినిమాలోని కీలక అంశం. కేవలం ఒక్క రాత్రిలో జరిగే కథగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ నెట్ లో సందడి చేస్తుండగా, హీరోయిన్ త్రిష ఓ మేకింగ్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కమల్ చిరకాల మిత్రుడు రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, త్రిష, మధుశాలిని, సంపత్ రాజ్ నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ ఒక పాట కూడా పాడారు. స్లీప్‌లెస్ నైట్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీ ఇన్సిపిరేషన్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. -
'చీకటి రాజ్యం' ట్రైలర్ వచ్చేసింది.
చెన్నై: తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న హీరో కమల్ హాసన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మూవీ మేకింగ్ వీడియో ఇపుడు నెట్లో హల్ చల్ చేస్తోది. తమిళంలో తూంగవనం, తెలుగులో సినిమా చీకటి రాజ్యం పేరుతో ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమౌతోంది. ఫ్యామిలీ బేస్డ్ క్రైమ్ థిల్లర్ గా రూపుదిద్దకుంటున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా నడుస్తోంది. కిడ్నాపైన తన కొడుకును హీరో ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ సినిమాలోని కీలక అంశం. కమల్ చిరకాల మిత్రుడు రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప్రకాష్ రాజ్, త్రిష, మధుశాలిని, సంపత్ రాజ్, నటిస్తున్నారు. మరోవైపు ఎం జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రంలో కమల్ హాసన్ ఒక పాట కూడా పాడారు. స్లీప్‌లెస్ నైట్ అనే ఫ్రెంచ్ థ్రిల్లర్ మూవీని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.. -
'చీకటిరాజ్యం' ట్రైలర్ విడుదల
-
చీకటిరాజ్యం ట్రైలర్ విడుదల
కమల్‌హాసన్, త్రిష జంటగా నటిస్తున్న చీకటిరాజ్యం సినిమా ట్రైలర్ విడుదలైంది. 'తూంగవనం' పేరుతో తమిళంలోను, చీకటిరాజ్యంగా తెలుగులోను వస్తున్న ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. త్రిషకు ఇది 50వ సినిమా కావడంతో పలువురు సినీ జనాలు కూడా త్రిషను ట్విట్టర్లో అభినందనలతో ముంచెత్తారు. అందులోనూ త్రిషను ఈ సినిమాలో డీగ్లామరస్ పాత్రలో చూపించడం, కమల్, త్రిషల మధ్య ఫైటింగ్‌తో కూడిన పోస్టర్ కూడా విడుదల కావడం.. ఇలాంటి విశేషాలు ఉన్న నేపథ్యంలో ట్రైలర్ కోసం కూడా అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కమల్‌కు సన్నిహితుడైన రాజేశ్ ఎం సెల్వ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఓ ముఖ్యపాత్రలో నటించాడు. సినిమా ట్రైలర్ లింకును త్రిష ట్వీట్ చేసింది. CheekatiRajyam trailer http://t.co/4iK7NIC6wP — Trisha Krishnan (@trishtrashers) September 16, 2015 -
నిద్రపోని అడవి!
తెలుగులో కమల్‌హాసన్ స్ట్రయిట్ చిత్రాలు చేసి, చాలా కాలమైంది. తమిళంలో ఆయన చేస్తున్న చిత్రాలే తెలుగులోకి అనువాదమవుతున్నాయి. ఎప్పటికప్పుడు ‘తెలుగులో స్ట్రయిట్ సినిమా చేస్తా’ అని చెప్పుకుంటూ వచ్చిన కమల్, ఈ ఏడాది ఆ కోరిక తీర్చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఆయన నటించనున్న తాజా చిత్రం ఈ నెల 24న ఆరంభం కానుంది. తమిళ వెర్షన్‌కు ‘తూంగా వనమ్’ అని టైటిల్ పెట్టారు. అంటే ‘నిద్రపోని అడవి’ అని అర్థం. మరి.. తమిళ టైటిల్‌ను యథాతథంగా అనువదించి, తెలుగులో ‘నిద్రపోని అడవి’ అని పెడతారా? లేక వేరే ఏదైనా టైటిల్ పెడతారా? అనేది వేచి చూడాలి. రాజేశ్ యం. సెల్వ దర్శకత్వంలో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్, చెన్నైలలో ఎక్కువ శాతం చిత్రీకరణ జరపాలనుకుంటున్నారు. మూడే నెలల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కమల్ భార్యగా మనీషా కొయిరాలా నటిస్తారని భోగట్టా. అలాగే త్రిష, ప్రకాశ్‌రాజ్‌లను కూడా ఎంపిక చేశారట.