Kamal Haasan
-
మాస్ మెచ్చిన క్లాస్ సినిమా ‘స్వాతిముత్యం’
హీరో మానసికంగా ఎదగనివాడు... హీరోయిన్ అప్పటికే ఓ పిల్లాడికి తల్లైన విడో. అనుకోని పరిస్థితుల్లో వీరిద్దరికీ ముడిపడితే? ఇలాంటి కథతో సినిమా తీయడమంటే రిస్కులకే రిస్కు. కానీ ఆ ప్రయోగాన్ని క్లాస్‌తో పాటు మాస్ కూడా మెచ్చేలా చేశారో దర్శకుడు. పైపెచ్చు బాక్సాఫీస్ వద్ద ఆ ఏటి ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. అది ఓ క్రియేటివ్ జీనియస్ మాత్రమే చేయగల అరుదైన విన్యాసం. ఆ అద్భుతం చేసిన దర్శక కళాస్రష్ట కె.విశ్వనాథ్. ఒకరికి ఆరుగురు తెలుగు స్టార్ హీరోలు హిట్స్ మీద హిట్స్ ఇస్తున్న సందర్భంలో కమల్‌హాసన్ లాంటి ఓ పరభాషా హీరోతో, నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకు దక్కిన ఆ బ్లాక్‌బస్టర్ అద్భుతం ఈ ‘స్వాతిముత్యం’. 1985లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.కమల్‌హాసన్ ట్యూన్... గానంమద్రాసుతో పాటు మైసూరు, రాజమండ్రి, తొర్రేడు, తాడికొండ, పట్టిసీమ ప్రాంతాల్లో షూట్ చేసిన ఈ సినిమాకు కమల్‌హాసన్, రాధిక నటనతో పాటు ఇళయరాజా సంగీతం, రీ రికార్డింగ్ ప్రాణం పోశాయి. ఆత్రేయ, సినారె రాసిన పాటలు మరో అద్భుతం. ఈ సినిమా పాటల రచనలోనూ విశ్వనాథ్ హస్తం ఉంది. హీరో చిన్నపిల్లాడి మనస్తత్వం. స్క్రీన్‌పై ఎస్టాబ్లిష్ చేయడానికి విశ్వనాథ్ అప్పటికప్పుడు అనుకొని జానపద శైలిలో ‘పట్టుచీర తెస్తనని..’ అనే పాట రాత్రికి రాత్రి రాశారు. మరునాడు షూటింగ్ కోసం వెళ్తుండగా మార్గమధ్యంలో కమల్‌హాసనే ఆ పాటకు ట్యూన్ కట్టి పాడారు. ఆ వెర్షన్‌తోనే షూటింగ్ చేశారు. ఆ తర్వాత బాలు, శైలజలతో పాడించారు. ఇక ‘వటపత్రసాయికి...’ పాట పల్లవి లైన్లు కథాచర్చల్లో భాగంగా సినారెకు స్నేహపూర్వకంగా విశ్వనాథ్ సమకూర్చినవే. ఇదే పాట సినిమా చివరలో విషాదంగా వస్తుంది. ఆ రెండో వెర్షన్ ను సీతారామశాస్త్రితో రాయించారు. ‘సిరివెన్నెల’ కన్నా ముందే ఈ సినిమా, ఈ పాటతో సీతారామశాస్త్రి పేరు తెరమీదకు వచ్చింది.రాజ్‌కపూర్ హార్ట్ టచ్ అయిన వేళబాలీవుడ్ రారాజు రాజ్ కపూర్ మనసు దోచిందీ సినిమా. ‘శంకరాభరణం’ నుండి ఏ సినిమా తీసినా బొంబాయిలో రాజ్ కపూర్‌కు చూపించడం కె. విశ్వనాథ్‌కు అలవాటు. అలాగే ‘స్వాతిముత్యం’ కూడా చూశారాయన. సినిమా అవగానే నిశ్శబ్దంగా కూర్చుండిపోయిన రాజ్ కపూర్ వెనక్కి తిరిగి విశ్వనాథ్‌తో... మీరు నా హార్ట్ టచ్ చేశారు. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ హానెస్టీ ఇన్ దిస్ ఫిల్మ్ అంటూ తెగ మెచ్చుకున్నారు. కమల్‌హాసన్, విశ్వనాథ్‌లతోనే ‘స్వాతిముత్యం’ హిందీ రీమేక్ చేయాలనీ రాజ్ కపూర్ ముచ్చటపడ్డారు. శతదినోత్సవానికి వచ్చిన ఆయన ఆ అర్ధరాత్రి కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి, తన మనసులో మాట చెప్పారు. కానీ, తర్వాత ఎందుకనో అది కుదరలేదు. అయితే... మూడేళ్ల తర్వాత అనిల్ కపూర్, విజయశాంతి జంటగా ‘ఈశ్వర్’ పేరుతో కె. విశ్వనాథ్ దర్శకత్వంలోనే హిందీలో రీమేక్ చేశారు. అక్కడా హిట్ అయింది. తెలుగు వెర్షన్ రిలీజైన కొద్ది నెలలకే ‘స్వాతిముత్యం’ను తమిళ, మలయాళంలో డబ్ చేయగా మంచి విజయం సాధించాయి. అయితే 2003లో సుదీప్ కన్నడలో రీమేక్ చేయగా అది ఆకట్టుకోలేకపోయింది.కమల్ మనవడిగా అల్లు అర్జున్‘స్వాతిముత్యం’లో మరో విశేషం ఉంది.. ఇందులో రాధిక కొడుకుగా జానపద హీరో కాంతారావు మనవడు మాస్టర్ కార్తీక్ నటించగా... కమల్‌హాసన్ మనవడిగా అల్లు అరవింద్ కొడుకు ఇప్పటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించారు. మనవరాళ్లుగా అరవింద్ మేనకోడళ్లు విద్య, దీపు తెరపైకి వచ్చారు. అల్లు అర్జున్ చిన్నప్పటి ఆ తీపి జ్ఞాపకాల్ని ఇప్పటికీ ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక.. ఆ ఏడాది (1985) తెలుగులో ఆరుగురు స్టార్ హీరోలు పోటీలో ఉన్నారు. కృష్ణ తెలుగులో తొలి 70 ఎంఎం సినిమా ‘సింహాసనం’తో సంచలనం రేపారు. శోభన్ బాబు ‘శ్రావణసంధ్య’తో హిట్ కొట్టారు. అదే ఏడాది బాలకృష్ణ ఆరు వరుస హిట్లతో జోరుమీదున్నారు. బాక్సాఫీస్ ఖైదీ చిరంజీవి అగ్రస్థానం కోసం ‘కొండవీటి రాజా, రాక్షసుడు’ లాంటి హిట్స్‌తో పోటీపడుతున్నారు. నాగార్జున ‘విక్రమ్’తో, వెంకటేశ్ ‘కలియుగ పాండవులు’తో మాస్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వీరందరినీ అధిగమించి, ఓ పరభాషా నటుడితో, నాన్ కమర్షియల్ రిస్కీ కథతో ఆ ఏటి ఇండస్ట్రీ హిట్టయింది . స్వాతిముత్యం’. అదీ... వెండితెరపై విశ్వనాథ్ సమ్మోహనం. స్వాతిముత్యం.... ఓ నిరంతర స్ఫూర్తితెలుగులో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘స్వాతిముత్యం’ కేంద్ర ప్రభుత్వ రజత కమలం అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా బంగారు నందిని సాధించింది. విశ్వనాథ్ ఉత్తమ దర్శకుడిగా, కమల్‌హాసన్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఆస్కార్స్‌కు అఫీషియల్ ఇండియన్ ఎంట్రీగా పంపిన ఫస్ట్ సౌతిండియా ఫిల్మ్ కూడా ఇదే. ఎప్పుడైనా సరే... కమర్షియల్ సూత్రాలను ఛేదించి మరీ ఆడిన చిత్రాలే అరుదైన చరిత్ర అవుతాయి. చెరగని ఆ చరిత్ర గురించే భావితరాలకు చెప్పుకోవాల్సింది. ఆ రకంగా... కె. విశ్వనాథ్ ‘స్వాతిముత్యం’ అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఓ చిరస్మరణీయ చరిత్ర. ప్రయోగాలు చేయదలుచుకున్న సినీ సృజనశీలురకు నిరంతర స్ఫూర్తి.– దాచేపల్లి సురేష్‌కుమార్ -
నవ రసాలు + నవ రసాలు + నవ రసాలు= కమల్ హాసన్
లోక నాయకుడు కమల్ హాసన్ గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగల విలక్షణ నటుడు ఆయన. నవరసాలను అద్భుతంగా పండించగలడని మాత్రమే మనకు తెలుసు. కానీ కమల్ హాసన్ 27 రకాల రసాలను కూడా పండించగలడు. అదేంటి భావోద్వేగాలు తొమ్మిది రకాలుగా మాత్రమే ఉంటాయి కదా అంటారా? అది తప్పు అట. మనిషిలో మొత్తం 27 రకాల ఎమోషన్స్ ఉంటాయని చెబుతోంది కాలిఫోర్నియా యూనివర్సీటీ. వాటి పేర్లను కూడా పేర్కొంది. అయితే ఈ 27 రకాల ఎమోషన్స్‌ని పండించిన ఏకైక హీరో కమల్ హాసన్ మాత్రమేనని ఆయన అభిమానుల మాట. దానికి సంబంధించిన ఓ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో కమల్ హాసన్ పాత సినిమాల్లోని కొన్ని సీన్లను ఈ 27 రకాల ఎమోషన్స్‌తో ముడిపెడూతూ.. అన్ని రకాల భావోద్వేగాలు పండించగల ఏకైన నటుడు కమల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి లోకనాయకుడు కమల్ హాసన్ పండించిన 27 రకాల ఎమోషన్స్‌ని చూసేయండి. #KamalHaasan expressing all the 27 types of emotions denoted by University of California Berkeley❤️😍🔥💪pic.twitter.com/igpfyz0Llk— Nammavar (@nammavar11) November 29, 2024 -
నవరసాలు కాదు.. 27 రసాలు పండించిన ఏకైక నటుడు ఈయన (ఫొటోలు)
-
ఆల్ టైమ్ క్లాసిక్... నాలుగు దశాబ్దాల సాగర సంగమం
సాగర సంగమం... నృత్యంలోనే సుఖాన్ని, దుఃఖాన్ని, ప్రేమను, విరహాన్ని చవి చూసిన ఓ నిస్వార్థ కళాకారుని కథ ఇది. 1983 జూన్ 3న తెలుగులో ‘సాగర సంగమం’గా రూపొందించి, తమిళంలో ‘సలంగై ఒలి’గా, మలయాళంలో ‘సాగర సంగమం’గా అనువదించి, విడుదల చేశారు. మూడు భాషల్లోనూ ఒకే రోజు విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ‘శంకరాభరణం’ అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కె. విశ్వనాథ్–నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో కళా ఖండం ‘సాగర సంగమం’.‘సప్తపది’ తర్వాత నృత్య కళాకారుడి జీవితం నేపథ్యంలో కమల్‌హాసన్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు దర్శకులు కె. విశ్వనాథ్. ఈ చిత్రానికి చేగొండి హరిరామజోగయ్య, అల్లు అరవింద్, వీవీ శాస్త్రి నిర్మాతలు. సంగీత దర్శకుడిగా ఎమ్మెస్ విశ్వనాథన్ ని ఎంపిక చేసుకొని మ్యూజిక్ సిట్టింగ్స్ ఆరంభించారు. ఆ సినిమా ఆగిపోయింది. ‘సీతాకోక చిలుక’ తర్వాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావుకి ఈ ఆగిపోయిన సినిమా కథను వినిపించారు విశ్వనాథ్. అది నచ్చడంతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు ఏడిద నాగేశ్వరరావు.ముందుగా ఈ సినిమాకు వేరే పేరు అనుకున్నారు. నిజానికి ఏడిద నాగేశ్వరరావు ‘సీతాకోక చిలుక’ సినిమాకు ముందుగా ‘సాగర సంగమం’ టైటిల్ పెడదామనుకున్నారు. కానీ చివరగా ‘సీతాకోక చిలుక’ను ఖరారు చేశారు. అప్పట్లో ఈ సినిమా టైటిల్ ఏడిద నాగేశ్వరరావు దగ్గరే ఉంది. ‘సాగర ‡సంగమం’కి ముందుగా ‘మహా మనిషి’తో పాటు పలు టైటిల్స్ పరిశీలనకు వచ్చాయి. కానీ ‘సీతాకోక చిలుక’ సినిమా కోసం అనుకున్న ‘సాగర సంగమం’ను ఈ సినిమాకు పెట్టారు. కె. విశ్వనాథ్, కమల్‌హాసన్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి చిత్రం కూడా ఇదే.నిరాకరించిన కమల్హాసన్హీరో పాత్రకు కమల్‌హాసన్ ని సంప్రదించగా ఆయన నిరాకరించారు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తాయన్నది కమల్ భయం. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన ‘కడల్ మీన్గళ్’ అనే తమిళ మూవీ ఫ్లాప్ కావడంతో ఆయన ఆ సెంటిమెంట్‌ను బలంగా పట్టుకున్నారు. అయితే.. ఆ పాత్రను కమల్‌తోనే చేయించాలని ఏడిద నాగేశ్వరరావు ఐదారు నెలలు ఆయన వెంటపడి బతిమాలి మరీ ఒప్పించారట. ఇక హీరోయిన్ గా ముందు జయసుధను అనుకున్నారు.ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు క్లాసికల్ డ్యాన్స్ తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలనుకున్నారు విశ్వనాథ్. ఆ సమయంలో డ్యాన్స్ నేర్చుకుంటున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్పీ శైలజను ఆ పాత్రకు నిర్మాత నాగేశ్వరరావే సిఫార్సు చేశారట. ‘శంకరాభరణం’తో మంచి పేరు తెచ్చుకున్న మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్లి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపించారు.ఆ పాట కోసం 30 అడుగుల బావి సెట్ఈ సినిమాను మద్రాసు, విశాఖ, హైదరాబాద్, ఊటీలో చిత్రీకరించారు. ‘వేవేల గోపెమ్మలా...’ పాటను విశాఖ భీమిలి బీచ్‌లో ఉన్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయా గార్డెన్స్‌లో తీశారు. జయప్రద ఇంట్లో జరిగే సన్నివేశాలు, ‘మౌనమేలనోయి...’ పాట, సముద్రపు ఒడ్డులోని సన్నివేశాల్నీ విశాఖలోనే షూట్ చేశారు. ‘ఓం నమఃశివాయ’ పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్‌లోని ఈనాడు కార్యాలయంలో తీశారు.మద్యం మత్తులో బావి మీదున్న పైపుపై కమల్‌హాసన్ డ్యాన్స్ చేసే ‘తకిట తథిమి...’ సాంగ్‌ను మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో 30 అడుగుల బావి సెట్ వేసి తీశారు. ‘నాద వినోదము...’ పాటను ఊటీలో తీశారు. శాంతారాం తీసిన ‘ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్’ సినిమాలకు నృత్య దర్శకత్వం వహించిన గోపీకృష్ణ ఈ పాటకు డ్యాన్స్ డైరక్షన్ చేశారు. ఆయన ఈ పాట కోసమే ప్రత్యేకంగా బొంబాయి నుండి వచ్చారు.క్లైమాక్స్‌లో వచ్చే ‘వేదం అణువణువున నాదం...’ పాట చిత్రీకరణకు ముందు కమల్ కాలికి ఓ హిందీ సినిమా షూటింగులో తీవ్రమైన గాయమైంది. దాంతో నెల రోజులపాటు షూటింగ్ ఆగింది. అప్పటికీ ఆయన కోలుకోలేదు. అడుగు తీసి అడుగేసే పరిస్థితి లేదు. అయినా సినిమా రిలీజ్‌కు లేటవుతుందని కమల్ ఆ పాటకు డ్యాన్స్ చేయడానికి ముందుకొచ్చారు. షాట్ అనగానే డ్యాన్స్ చేయడం కట్ చెప్పగానే కింద పడిపోవడం. అలా ఆ పాట పూర్తి చేశారు.ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన రాజేంద్రప్రసాద్ శరత్‌బాబుతో కలిసి సరదాగా డబ్బింగ్ థియేటరుకి వచ్చిన నటుడు రాజేంద్రప్రసాద్‌ను నిర్మాత ఏడిద నాగేశ్వరరావు అడగడంతో ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్‌కు డబ్బింగ్ చెప్పారు. జయప్రద భర్తగా చేసిన మోహన్ శర్మకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పారు. ‘వేవేల గోపెమ్మలా...’ పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పారు.రెండు జాతీయ అవార్డులతో సహా...‘సాగర సంగమం’ విడుదలై నాలుగు దశాబ్దాలవుతోంది. అయితే ఇప్పటికీ ఈ సినిమా గురించి అక్కడక్కడా ప్రస్తావన వస్తుంటుంది. నాటి ఈ క్లాసిక్ది సినీ చరిత్రలో ప్రత్యేకమైన పేజీ. ఈ ‘ఆల్ టైమ్ క్లాసిక్’ చిత్రం ఉత్తమ సంగీతదర్శకత్వం (ఇళయరాజా), ఉత్తమ నేపథ్య గాయకుడు (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం)... విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు సొంతం చేసుకుంది. ఇంకా నంది అవార్డులతో పాటు పలు అవార్డులను కూడా దక్కించుకుంది. – అలిపిరి సురేష్ -
ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్‌లో కూడా ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన భారతీయుడు – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ చిత్రానికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా భారతీయుడు – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే భారతీయుడు – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పార్ట్ – 3 విడుదల సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా భారతీయుడు– 2 మాదిరిగా పార్ట్- 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రూ.100 కోట్లు ఉంటేనే..భారతీయుడు – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత భారతీయుడు– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. -
మళ్ళీ భారతీయుడి 3 పై రూమర్లు..
-
నన్ను అలా పిలవొద్దు: కమల్ హాసన్
‘ఉలగనాయగన్స్ , విశ్వ నటుడు, లోక నాయకుడు’... ఇలా కమల్హాసన్స్ ను ఆయన అభిమానులు ప్రేమగా, ఆ΄్యాయంగా పిలుచుకుంటుంటారు. అయితే ఇకపై తనను ఆ తరహా స్టార్ ట్యాగ్స్‌తో పిలవొద్దని, కమల్ హాసన్స్ అని పిలిస్తే చాలంటూ ‘ఎక్స్’లో ఓ లేఖను షేర్ చేశారు కమల్ హాసన్స్ . ‘‘నా పనిని మెచ్చి, నాకు ఎన్నో బిరుదులు ఇచ్చిన నా అభిమానులు, ప్రేక్షకులు, నా తోటి నటీనటులకు కృతజ్ఞతలు. ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులు కలిస్తే ఓ సృజనాత్మక సినిమా అవుతుంది. కళ కంటే కళాకారుడు గొప్ప కాదని నా అభిప్రాయం.అలాగే ఓ వ్యక్తిగా నా మూలాలకు నేను కట్టుబడి ఉండాలనుకుంటున్నాను. సినిమా రంగంలో నిత్య విద్యార్థిగా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దయచేసి ఇకపై నన్ను ఎవరూ బిరుదుల పేర్లతో పిలవొద్దు. ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలిస్తే చాలని నా ఫ్యాన్స్, నా తోటి నటీనటులు, నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులను కోరుకుంటున్నాను’’ అంటూ ఆ లేఖలో పేర్కొన్నారాయన. ఇక కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన ‘థగ్ లైఫ్’ చిత్రం జూన్ 3న విడుదల కానుంది. -
నన్ను అలా పిలవొద్దు.. కమల్ హాసన్ రిక్వెస్ట్
తమిళ హీరో కమల్ హాసన్ పనైపోయిందని అందరూ అనుకున్నారు. అలాంటి టైంలో 'విక్రమ్' మూవీతో అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ ఏడాది 'ఇండియన్ 2' రూపంలో దెబ్బ తగిలినప్పటికీ.. 'కల్కి'లో డిఫరెంట్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. రాజకీయాల్లో తనవంతు ప్రయత్నం చేశారు కానీ సక్సెస్ కాలేకపోయారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు మీడియా మిత్రులు, అభిమానులని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.'నా పనిని మెచ్చి 'ఉలగనాయగన్' లాంటి ఎన్నో బిరుదులు ఇచ్చినందుకు థ్యాంక్యూ. ప్రేక్షకులు, సహ నటీనటులు, ఆత్మీయులు నుంచి ఇలాంటి ప్రశంసలు నన్నెంతగానో కదిలించాయి. సినిమా విషయంలో నేను నిత్య విద్యార్థిని. ఇండస్ట్రీలో ఎన్నో విషయాలు నేర్చుకోవాలని, మరింత ఎదగాలని ఆశిస్తున్నాను. కళా కంటే కళాకారుడు గొప్ప కాదనేది నా నమ్మకం. ఎంతో ఆలోచించిన తర్వాత ఓ నిర్ణయం తీసుకున్నాను. స్టార్ ట్యాగ్స్‌ని మర్యాదపూర్వకంగా తిరస్కరిస్తున్నాను'(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 22 సినిమాలు.. అవి ఏంటంటే?)'నా అభిమానులు, మీడియా, సినీ ప్రముఖులు.. నన్ను కమల్ హాసన్ లేదా కమల్ లేదా కేహెచ్ అని పిలవండి చాలు. ఎన్నో ఏళ్లుగా ఇలాంటి బిరుదులతో మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్. మూలాలకు కట్టుబడి ఉండాలని, నటుడిగా బాధ్యత నిర్వర్తించాలని అనుకుంటున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.కమల్ హాసన్ అనే కాదు తమిళ హీరో అజిత్ కూడా గతంలో ఇలానే చేశాడు. తనని వేరే పేర్లతో పిలవొద్దని.. అజిత్ కుమార్ లేదా అజిత్ అని పిలవండి చాలు అని రిక్వెస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: మెట్లపైనుంచి జారిపడ్డ విజయ్.. ట్రోలర్స్‌కు అదిరిపోయే పంచ్)உங்கள் நான்,கமல் ஹாசன். pic.twitter.com/OpJrnYS9g2— Kamal Haasan (@ikamalhaasan) November 11, 2024 -
రజినీకాంత్ VS కమల్ హాసన్ బాక్సాఫీస్ ఫైట్
-
థగ్ లైఫ్ కూడా ఇండియన్ 2 లాగా..
-
స్టైల్ మార్చిన మణిరత్నం.. కమల్ 'థగ్ లైఫ్' రిలీజ్ ఫిక్స్
మణిరత్నం సినిమాలంటే క్లాస్, కూల్‌గా ఉంటాయి. చివరగా తీసిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలు మాత్రం పీరియాడికల్ గ్రాండియర్స్. కాకపోతే వీటికి తమిళంలో తప్పితే మిగతా ఏ భాషలోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'థగ్ లైఫ్' మూవీ చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)విడుదల తేదీ ప్రకటిస్తూ ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్‌తో పాటు శింబుని కూడా చూపించారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి తోడు యాక్షన్ కట్ వచ్చేలా చూపించారు. విజువల్స్ చూస్తుంటే మణిరత్నం ఈసారి ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైన్ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 5న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో కమల్‌తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?) -
ఆస్పత్రిలో చేరిన హీరో కమల్ హాసన్ సోదరుడు
ప్రముఖ నటుడు, దర్శకుడు చారు హాసన్‌ని ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని ఈయన కుమార్తె, ఒకప్పటి హీరోయిన్ సుహాసిని చెప్పుకొచ్చింది. దీపావళి పండగ ముందు అంటే గురువారం రాత్రి చారు హాసన్.. అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)'దీపావళికి ముందే మా నాన్న అస్వస్థతకు గురయ్యారు. మా పండగ ఎమర్జెన్సీ వార్డులో గడిచిపోయింది. ప్రస్తుతం ఆయన సర్జరీకి సిద్ధమవుతున్నారు' అని సుహాసిని తన్ ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆయన త్వరగా కోలుకోవాలని నెటిజన్స్, కమల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 15 సినిమాలు) View this post on Instagram A post shared by Suhasini Hasan (@suhasinihasan) -
'అమరన్' మూవీ ట్విటర్ రివ్యూ
వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్ ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం అమరన్. కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్, సాయి పల్లవి జోడిగా నటించిన ఈ సినిమా దీపావళి సందర్భంగా ప్రేక్షకులముందుకు వచ్చేసింది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, సోని పిక్చర్స్ సంస్థలు కలసి నిర్మించిన ఈ చిత్రానికి జీవీ. ప్రకాశ్‌కుమార్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్లతో పాటు ఇండియాలో కూడా ప్రీమియర్ షోలు వేశారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంన్నారు.ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా అంటేనే అందరిచూపు అటువైపే ఉంటుంది. అందుకే సినిమా అభిమానులు అందరూ అమరన్ సినిమావైపు పడింది. శివకార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో అదరగొట్టాడని నెట్టింట కామెంట్స్ వస్తున్నాయి. ఇందు రెబెకా జాన్ పాత్రలో సాయిపల్లవి నటన సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్‌పాయింట్ అని నెటిజన్లు తెలుపుతున్నారు. మొదటి భాగంలో శివకార్తికేయన్, సాయిపల్లవి మధ్య వచ్చే ప్రతి సీన్ సూపర్ అంటూ మెంచుకుంటున్నారు.ఈ సినిమా భారత ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. దేశ సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా దర్శకుడు ఆవిష్కరించారని కొనియాడారు. సినిమా చూస్తున్న ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తి కలిగించే చిత్రం అమరన్ అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.ఓవర్సీస్, తమిళనాడులో చాలా చోట్ల 'అమరన్' సినిమాను ఒకరోజు ముందుగానే వేశారు. సినిమా బ్లాక్ బస్టర్ అంటూ చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో బ్లడ్ బాత్, ఆల్ఫా సన్నివేశాలు కిర్రాక్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 'అమరన్'లో చాలా సన్నివేశాలు ప్రేక్షకులకు థ్రిల్ ఇస్తాయి. విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన 'తుపాకీ' సినిమాలో మెప్పించిన కొన్ని యాక్షన్ సీన్స్ లాంటివి ఇందులో కూడా ఉన్నాయంటూ హింట్ ఇస్తున్నారు. వార్ సీన్స్ కళ్లకు కట్టినట్లుగా దర్శకుడు చూపించాడని ప్రశంసలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎపిసోడ్ 15 నిమిషాల పాటు కన్నీళ్లను పెట్టిస్తుందని చాలామంది తెలుపుతున్నారు. ఆ సీన్లో సాయిపల్లవి తన యాక్టింగ్‌తో ఇరగదీసిందని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.#Sivakarthikeyan𓃵 joins the Big league of #Rajinikanth #KamalHaasan #ajith #vijay from today 🔥🔥 #Amaran career defining movie for #SK @Siva_Kartikeyan pic.twitter.com/OqFuAOeiIU— Wetalkiess (@WeTalkiess) October 31, 2024Positive Reviews all over World ✅🌟#Amaran Blockbuster 💥 pic.twitter.com/booGzL9uiJ— Troll Unwanted Haters (@wanted_Hater67) October 31, 2024Amaran - 💔😭 🔥🔥#Amaran is undoubtedly one of the finest biographical films to hit the screens recently. Sai Pallavi delivered exceptional performances, making their characters unforgettable📈Sai Pallavi❤🦋> Full movie#USA #Amaran #AmaranFDFS #Sivakarthikeyan #SaiPallavi pic.twitter.com/ihiRu7Nhd2— Hari (@hariharanr0) October 31, 2024The first half of #Amaran is packed with emotion 🤌💥💥FOLLOW ✅️SK and Sai Pallavi acting 👌 , As usual GV cooked well 🎶 No Single lag till Now , Screen Play - Terrific ⚡#Sivakarthikeyan Last 15 Minutes of Interval " BLAST " 🔥#AmaranFDFS #BloodyBeggar #LuckyBaskhar pic.twitter.com/hPz9Xs1EP5— JD X PAGE (@holic2024) October 31, 2024#Amaran | Stunning FIRST HALF 🧨💥SK and Sai Pallavi acting 👌 , As usual GV cooked well 🎶 No Single lag till Now , Screen Play - Terrific ⚡ @Siva_Kartikeyan Last 15 Minutes of Interval " BLAST " 🔥 pic.twitter.com/MU5zjup8C6— Let's X OTT GLOBAL (@LetsXOtt) October 31, 2024#Amaran True tribute to Major Mukundan. Sai Pallavi & #Sivakarthikeyan are true emotion of the movie. Worth watching 🔥🫡. One of the best movies of SK— Cine Crick Madie (@diszzCinema) October 31, 2024 -
ప్రభాస్ ను టార్గెట్ చేస్తున్న కమల్ హాసన్..
-
మిషన్ మేకోవర్
ఇప్పుడు కమల్‌హాసన్ మిషన్ ఏంటంటే... ‘మేకోవర్’ అన్నమాట. కొత్త సినిమా కోసం సరికొత్తగా మేకోవర్ అవుతున్నారు కమల్‌హాసన్. ఆయన హీరోగా ‘కేజీఎఫ్’ ఫైట్ మాస్టర్స్ అన్బు–అరివుల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ఈ సినిమాను ప్రకటించారు. అయితే ‘ఇండియన్’ సీక్వెల్స్ ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలతో పాటు ‘థగ్ లైఫ్’ చిత్రంతో కమల్‌హాసన్ బిజీగా ఉన్నారు.ఈ కారణంగా అన్బు–అరివులతో కమల్‌హాసన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ‘ఇండియన్ 2’ విడుదల కాగా, ‘ఇండియన్ 3, థగ్ లైఫ్’ చిత్రాలను కమల్ పూర్తి చేశారు. దీంతో అన్బు–అరివులతో చేయాల్సిన సినిమాను వచ్చే జనవరి నుంచి సెట్స్‌పైకి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అలాగే ఈ సినిమా కోసం కమల్‌హాసన్ స్పెషల్ మేకోవర్ అవుతున్నారు. ఆయన తాజా లుక్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరోవైపు ‘ఇండియన్ 3, థగ్ లైఫ్’ రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. -
ఓటీటీ రిలీజ్‌కు ఇండియన్ 3?
‘ఇండియన్ 3’ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుందా? అంటే అవుననే సమాధానాలే కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరవైఎనిమిదేళ్ల తర్వాత ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్స్‌గా ‘ఇండియన్ 2, ఇండియన్ 3’ సినిమాలను తెరకెక్కించారు దర్శకుడు శంకర్. రెండు సీక్వెల్స్‌లోనూ కమల్‌హాసన్ హీరోగా నటించారు. ‘ఇండియన్ 2’ విడుదలైన ఆరు నెలల తర్వాత ‘ఇండియన్ 3’ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ ఏడాది జూలై 12న ‘ఇండియన్ 2’ థియేటర్స్‌లో విడుదలైంది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి సరైన స్పందన లభించలేదు. దీంతో ‘ఇండియన్ 3’ విడుదల మరింత ఆలస్యం అవుతుందని, వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే చాన్సెస్ ఉన్నాయని కోలీవుడ్‌లో టాక్ వినిపించింది. అయితే ‘ఇండియన్ 2’ సక్సెస్ కాని నేపథ్యంలో ‘ఇండియన్ 3’ సినిమాను డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందా? అని చిత్రయూనిట్ ఆలోచిస్తోందనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చి0ది. మరి... తమిళ పరిశ్రమలో ప్రచారంలో ఉన్నట్లుగా ‘ఇండియన్ 3’ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలవుతుందా? అనేది చూడాలి. ఇక ‘ఇండియన్ 3’ సినిమాను లైకాప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... నయనతార, సిద్ధార్్థ, మాధవన్, మీరా జాస్మిన్ లీడ్ రోల్స్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘ది టెస్ట్’. శశికాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
ఒకటి..రెండు..మూడు.. ఇప్పుడిదే టాలీవుడ్ ట్రెండ్!
ఒకటో సారి... రెండో సారి... మూడోసారి... అంటూ వేలం పాట నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒకటో భాగం.. రెండో భాగం... మూడో భాగం... ఇలా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సినిమాలు మొదటి భాగం హిట్ అయితే రెండో భాగం తీస్తున్నారు. సెకండ్ పార్ట్ కూడా సూపర్ హిట్ అయ్యిందంటే మూడో భాగం రూపొందిస్తున్నారు. మరికొన్నేమో రెండో భాగం షూటింగ్ దశలో ఉండగానే ముందుంది మూడో భాగం అంటూ ప్రకటించేస్తున్నారు. మూడో భాగం సీక్వెల్స్ విశేషాల్లోకి వెళదాం... పుష్ప: ది రోర్ ‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి పాన్ ఇండియా హిట్‌ని అందించారు ఆడియన్స్. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్’. రష్మికా మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ వంటివారు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ‘పుష్ప: ది రైజ్’ సూపర్ హిట్ కావడంతో సేమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాని పక్కాగా తీసుకురావాలని అల్లు అర్జున్, సుకుమార్ అండ్ టీమ్ కష్టపడుతున్నారు. లేటుగా వచ్చినా బ్లాక్‌బస్టర్ కొట్టాలనే ఆలోచనతో పని చేస్తోంది టీమ్. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకి మూడో భాగం ఉంటుందని, ‘పుష్ప: ది రోర్’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్లో హీరో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప: ది రైజ్’ని ప్రదర్శించారు. అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘అన్నీ అనుకూలంగా ఉంటే ‘పుష్ప’ మూడో భాగం తీసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇలా మూడో భాగంపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ‘పుష్ప 2: ది రూల్’ తర్వాత ఇటు అల్లు అర్జున్ అటు సుకుమార్ ఇతర ప్రాజెక్టులు చేశాక ‘పుష్ప’ మూడో భాగం చేస్తారని, ఇందుకు చాలా టైమ్ పట్టవచ్చని టాక్. ఆర్య 3 అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ (2004) హిట్ అయింది. వారి కాంబినేషన్లో ఆ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం అందుకుంది. ఈ సినిమాకి మూడో భాగం కూడా రానుంది. ఓ సందర్భంలో సుకుమార్ మాట్లాడుతూ– ‘‘ఆర్య 3’ సినిమా ఉంటుంది... అయితే ఎప్పుడు సెట్స్‌కి వెళుతుందనేది చెప్పలేను’’ అని పేర్కొన్నారు. నాలుగింతల వినోదం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్ 2– ఫన్ అండ్ ఫ్రస్టేషన్’. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై, సూపర్ హిట్‌గా నిలిచింది. సేమ్ కాంబినేషన్లో ఈ మూవీకి సీక్వెల్‌గా రెండో భాగం ‘ఎఫ్ 3’ని తెరకెక్కించారు. 2022 మే 27న రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘ఎఫ్–3’కి కొనసాగింపుగా ‘ఎఫ్– 4’ ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రకటన ‘వెంకీఅనిల్03’ (వర్కింగ్ టైటిల్) రావడంతో అందరూ ‘ఎఫ్–4’ అనుకున్నారు. అయితే ఇది ‘ఎఫ్–4’ కాదని చిత్రయూనిట్ స్పష్టత ఇచ్చింది. క్రైమ్ డ్రామాగా రూపొందుతోన్న ‘వెంకీఅనిల్03’ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ఫిల్మ్‌నగర్ టాక్. ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’తో పోలిస్తే ‘ఎఫ్–4’ లో వినోదం నాలుగింతలు ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. మూడో కేసు ఆరంభం ‘హిట్: ది ఫస్ట్ కేస్’ (2020), ‘హిట్: ది సెకండ్ కేస్’(2022) వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. ‘హిట్’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘హిట్: ది ఫస్ట్ కేస్’లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా, ‘హిట్: ది సెకండ్ కేస్’లో అడివి శేష్ కథానాయకుడిగా నటించారు. తొలి రెండు భాగాలను వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నిర్మించిన హీరో నాని ‘హిట్: ది థర్డ్ కేస్’లో తానే లీడ్ రోల్లో నటిస్తున్నారు. యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా కనిపించబోతున్నారు నాని. 2025 మే 1న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ‘హిట్’ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్ కొలను స్పష్టం చేశారు. వేసవిలో భారతీయుడు కమల్‌హాసన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్ 3’ (‘భారతీయుడు). కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్లో తాజాగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా జూలై 12న విడుదలైంది. అయితే తొలి భాగం అందుకున్న విజయాన్ని మలి భాగం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రెండో భాగం సమయంలోనే ‘భారతీయుడు 3’ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేసిందట యూనిట్. 2025 వేసవిలో ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.కేజీఎఫ్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ (2018) సినిమా పాన్ ఇండియా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివర్లో రెండో భాగం ఉంటుందని ముందే ప్రక టించింది యూనిట్. యశ్– ప్రశాంత్ నీల్ కాంబినేషన్లోనే వచ్చిన ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ 2022లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజీలో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ కూడా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ్ర΄÷డక్షన్ పనుల్ని దాదాపు పూర్తి చేశారట ప్రశాంత్ నీల్. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’, ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ‘కేజీఎఫ్: చాప్టర్ 3’ పై కర్నాటకలోనే కాదు... పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచరస్ థ్రిల్లర్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’ (2014) సూపర్ హిట్‌గా నిలవడంతో సెకండ్ పార్ట్ ‘కార్తికేయ 2’ సినిమాపై ఫుల్ క్రేజ్ నెలకొంది. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయింది. రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్ హిట్స్ కావడంతో నిఖిల్, చందు కలయికలో రానున్న ‘కార్తికేయ 3’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కార్తికేయ 3’ ఉంటుందంటూ ఈ ఏడాది మార్చి 16న సోషల్ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు నిఖిల్. ‘‘చందు మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ మూడవ ఫ్రాంచైజీ (‘కార్తికేయ 3’) సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌పై పని చేస్తున్నారు. స్పాన్, స్కేల్ పరంగా ‘కార్తికేయ 3’ చాలా పెద్దగా ఉండబోతోంది. డా. కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్’ మూవీ తీస్తున్నారు చందు మొండేటి. అటు నిఖిల్ ‘స్వయంభూ’, ఇటు చందు ‘తండేల్’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’ రెగ్యులర్ షూటింగ్ పట్టాలెక్కే అవకాశం ఉంది. 'నవ్వులు త్రిబుల్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్’ ఈ ఏడాది మార్చి 29న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 125 కోట్ల వసూళ్లు సాధించి సిద్ధు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘టిల్లు పాత్రపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ‘టిల్లు క్యూబ్’లో టిల్లు పాత్రను సూపర్ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మత్తు కొనసాగుతుందిశ్రీ సింహా కోడూరి, నరేశ్ అగస్త్య, సత్య లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై, హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా రితేష్ రానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి, ద్వితీయ భాగాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్. అటు ఇంటర్వ్యూలో, ఇటు సక్సెస్ మీట్లో పాల్గొన్న డైరెక్టర్ రితేష్ రానా ‘మత్తు వదలరా 3’ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. పొలిమేరలో ట్విస్టులు‘సత్యం’ రాజేష్ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్‌గా నిలవడంతో ‘పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్. ‘సత్యం’ రాజేష్, బాలాదిత్య, కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొలిమేర 3’. మొదటి రెండు భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్ విశ్వనాథ్ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్ ఇష్యూని టచ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రేజీ థ్రిల్లర్‌గా రూపొందిన తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పొలిమేర 3’లో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేష్ తెలిపారు. – డేరంగుల జగన్ -
థగ్‌లైఫ్ షూటింగ్ పూర్తి.. భారీ ధరకు డిజిటల్ రైట్స్
కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం థగ్‌లైఫ్. మణిరత్రం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు శింబు, నటి త్రిష, జోజూ జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, గౌతమ్ కార్తీక్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని కమలహాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్, మణిరత్నంకు చెందిన మద్రాస్ టాకీస్, రెడ్‌జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. 36 ఏళ్ల క్రితం మణిరత్నం, కమలహాసన్ కాంబోలో రూపొందిన చిత్రం నాయకన్ (నాయకుడు). ఆ తరువాత ఇన్నాళ్లకు వీరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం థగ్ లైఫ్. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. కాగా ఇది నటుడు కమలహాసన్ నటిస్తున్న 233వ చిత్రం కావడం గమనార్హం. అదే విధంగా ఆయన ఇందులో 3 పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో దానికి సంబందించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. థగ్‌లైఫ్ చిత్రం వ్యాపారం మొదలైందని సమాచారం. ఈ చిత్ర డిజిటల్ హాక్కులను రూ.150 కోట్లకు విక్రయించినట్లు తాజాగా సమాచారం. ఇంత పెద్దమొత్తంలో డిజిటల్ వ్యాపారం ఇంతకు ముందు ఏ చిత్రానికి జరగలేదనే ప్రచారం సాగుతోంది. కాగా థగ్‌లైఫ్ చిత్రాన్ని వచ్చే ఏడాది మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. -
తగ్ లైఫ్ తో తగ్గేదేలే అంటోన్న కమల్..!
-
ఖైరతాబాద్ గణేశ్ దగ్గర కమల్ హాసన్ డ్యాన్స్.. ఏ సినిమానో తెలుసా?
హైదరాబాద్‌లో వినాయక చవితి అంటే అందరూ ఖైరతాబాద్ గణేశుడి గురించే మాట్లాడుకుంటారు. అంతలా పాపులార్ అయిపోయింది. ఈసారి కూడా లక్షలాది మంది భక్తులు ఈ మహా గణపతిని దర్శించుకున్నారు. తాజాగా హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కూడా చేశారు. ఇంతలా పాపులర్ అయిన ఖైరతాబాద్ వినాయకుడని గతంలో ఓ తెలుగు సినిమాలో కూడా చూపించారని మీలో ఎంతమందికి తెలుసు?హైదరాబాద్‌లో వినాయకుడు అంటే ఖైరతాబాద్ మాత్రమే అనేంతలా గుర్తింపు వచ్చింది. ఇందుకు తగ్గట్లే ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకని నిర్వహిస్తున్నారు. గతంలో అంటే దాదాపు 40 ఏళ్ల క్రితం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర విలక్షణ నటుడు కమల్ హాసన్ డ్యాన్స్ వేశాడు. మీరు సరిగానే విన్నారు.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ 'దేవర'.. ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్?)1983లో రిలీజైన 'సాగరసంగమం' సినిమా కమల్ హాసన్‌కి తెలుగు నాట ఎంత పేరు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఓ చోట ఖైరతాబాద్ వినాయకుడిని చూపిస్తారు. అక్కడ కమల్ క్లాసికల్ డ్యాన్స్ చేస్తాడు.అయితే 1983లో జూన్‌లో 'సాగరసంగమం' సినిమా రిలీజైంది. ఆ ఏడాది సెప్టెంబరులో వినాయక చవితి వచ్చింది. రెండు చోట్ల ఉన్నది ఒకే వినాయకుడు. అంటే ఆ ఏడాది సినిమా కోసం చాలాముందుగానే గణేశుడి ప్రతిమ తయారు చేయించారనమాట. ఏదేమైనా అప్పట్లో ఖైరతాబాద్ వినాయకుడు సినిమాల్లో ఉన్నాడనమాట.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 మూవీస్.. ఆ మూడు కాస్త స్పెషల్) -
అమెరికాకు కమల్ హాసన్: ఆ కోర్సు నేర్చుకోవడానికే..
టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. నేడు ప్రతి రంగంలోనూ ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) హవా జోరుగా సాగుతోంది. ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన కోర్సును నేర్చుకోవడానికి ప్రముఖ నటుడు 'కమల్ హాసన్' అమెరికా వెళ్లినట్లు తెలిసింది.టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకునే కుతూహలం ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు అమెరికాలో ఓ టాప్ యూనివర్సిటీలో శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ కోర్సు వ్యవధి 90 రోజులు ఉన్నప్పటికీ కమల్ 45 రోజులు ఈ కోర్సు నేర్చుకోవడానికి సమయం కేటాయించనున్నట్లు సమాచారం.ఒకవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్.. ఏఐ నేర్చుకోవడానికి అమెరికాకు వెళ్లడం చాలా గొప్ప విషయం. టెక్నాలజీ పట్ల ఆయనకు ఎంత మక్కువ ఉందో తెలుసుకోవడానికి ఇదోక ఉదాహరణ. కొత్త నైపుణ్యాలు భారతీయ సినిమాపై గణనీయమైన ప్రభావం చూపుతాయని, ఏఐ చిత్రనిర్మాణంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని చాలామంది ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: కేంద్రం అలా.. రాష్ట్రం ఇలా: పెరగనున్న పెట్రోల్ ధరలుకమల్ హాసన్ సన్నిహితుల ప్రకారం.. భవిష్యత్తులో నిర్మించే ఆయన ప్రాజెక్టులు ఏఐ సాంకేతికతతో వస్తాయని తెలుస్తోంది. తనకు కొత్త టెక్నాలజీ మీద అమితమైన ఆసక్తి ఉందని గత ఏడాది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే కమల్ సినిమాలలో ఏఐ టెక్నాలజీ ఉందనునందని స్పష్టమవుతోంది. -
బిగ్‌బాస్ హోస్ట్‌గా విజయ్ సేతుపతి
బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌కు రంగం సిద్ధమైంది. అదేంటి? ఆల్రెడీ మొదలైంది అంటారా! అవును, తెలుగులో మూడు రోజులక క్రితమే లాంచ్ అయింది. ఇప్పుడు చెప్పుకోబోయేది తమిళ బిగ్‌బాస్ గురించి! అక్కడ కూడా ఏడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ షురూ కానుంది.మొన్నటిదాకా లోకనాయకుడు.. ఇప్పుడు!అయితే ఇప్పటివరకు కమల్ హాసనే షో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. కానీ ఈసారి హోస్టు మారాడు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి రంగంలోకి దిగాడు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ టీమ్ అధికారికంగా ప్రోమో ద్వారా వెల్లడించింది. విజయ్ సేతుపతి బిగ్‌బాస్ హోస్టింగ్ చేస్తున్న విషయం తెలిసిన అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు.అనుభవజ్ఞుడేసేతుపతికి గతంలో మాస్టర్ చెఫ్ (తమిళ్) షో హోస్ట్ చేసిన అనుభవం ఉంది. కాబట్టి అతడు బిగ్‌బాస్‌ను కూడా రఫ్ఫాడించడం ఖాయంగా కనిపిస్తోంది. బిగ్‌బాస్ తమిళ్ ఎనిమిదో సీజన్ విజయ్ టీవీలో ప్రసారం కానుంది. అలాగే హాట్‌స్టార్‌లో 24 గంటల లైవ్ కూడా చూడొచ్చు. View this post on Instagram A post shared by Vijay Television (@vijaytelevision) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
తమిళ 'బిగ్‌బాస్'హోస్ట్ రేసులో ముగ్గురు స్టార్ హీరోలు
తమిళ 'బిగ్‌బాస్' రియాల్టీ షో కోసం కొత్త హోస్ట్ వచ్చేస్తున్నాడు. ఏడు సీజన్ల వరకు లోకనాయుడు కమల్ హాసన్ హోస్ట్‌గా సక్సెస్‌ఫుల్‌గా నడిపారు. కమల్ ఇమేజ్‌తో ఈ షో పట్ల కోలీవుడ్‌లో మంచి బజ్ ఉంది. అక్కడ రేటింగ్స్ కూడా బాగానే బిగ్ బాస్ రాబట్టాడు. మరో కొద్దిరోజుల్లో సీజన్ 8 ప్రారంభం కానుంది. ఇలాంటి సమయంలో కమల్ హాసన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే సీజన్ నుంచి తాను హోస్ట్‌గా పనిచేయడంలేదని ప్రకటించారు. దీంతో కొత్తగా ఆ స్థానంలోకి ఎవరు వస్తారని బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.2017లో తమిళ్లో ప్రారంభమైన బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి హోస్ట్‌గా కమల్ హాసన్ ఉన్నారు. అయితే, వచ్చే సీజన్లో తాను హోస్ట్‌గా కొనసాగడంలేదని చెప్పారు. తను ఒప్పుకున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కమల్ వెల్లడించారు. కమల్ స్థానాన్ని భర్తి చేసేందుకు కోలీవుడ్ హీరో శింబు బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2022లో కమల్ హాసన్ తాత్కాలికంగా బిగ్ బాస్ నుంచి వైదొలిగినప్పుడు శింబు బిగ్ బాస్ అల్టిమేట్ షోను హోస్ట్ చేశాడు. ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ షోను హోస్ట్ చేసేందుకు శింబు రానున్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై శింబు మేనేజర్ ఇలా తెలిపాారు. 'బిగ్ బాస్ షోకు నటుడు శింబు హోస్ట్ చేయబోతున్నాడన్న సమాచారంలో నిజం లేదని.. ఈ విషయమై తనను ఎవరూ సంప్రదించలేదని' ఆయన చెప్పారు. శింబు తర్వాత విజయ్ సేతుపతి, సూర్య పేర్లు ఆ లిస్ట్‌లో కనిపిస్తున్నాయి. సరికొత్తగా రమ్యకృష్ణ పేరును కూడా బిగ్ బాస్ యూనిట్ పరిశీలిస్తుందట. మరొ కొద్దిరోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రానుంది. -
'బిగ్‌బాస్' హోస్టింగ్ నుంచి తప్పుకొన్న కమల్.. కారణమదే
ప్రముఖ హీరో కమల్ హాసన్.. బిగ్ బాస్ షో నుంచి తప్పుకొన్నాడు. తాత్కాలిక విరామం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇందుకు గల కారణాన్ని కూడా చెప్పాడు. త్వరలో తెలుగు, తమిళంలో కొత్త సీజన్ మొదలుకానున్న నేపథ్యంలో కమల్ ట్వీట్ ఇప్పుడు అభిమానులకు షాకిచ్చింది.(ఇదీ చదవండి: 'జాతిరత్నాలు' హీరో సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా?)'ఏడేళ్ల క్రితం మొదలైన మా ప్రయాణంలో చిన్న విరామం. సినిమా కమిట్మెంట్స్ వల్ల రాబోయే బిగ్‌బాస్ సీజన్‌కి హోస్టింగ్ చేయట్లేదు. ఈ విషయాన్ని చాలా బాధతో చెబుతున్నా. ఈ షో ద్వారా ఇంటింటికీ చేరువైనందుకు నాకెంతో గర్వంగా ఉంది. మీరు నాపై ఎంతో ప్రేమ చూపించారు. అలా బిగ్ బాస్ తమిళ షోని భారతీయ టీవీ చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్‌గా నిలిపారు. హోస్ట్‌గా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నా. ఈ క్రమంలోనే భాగమైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు' అని కమల్ హాసన్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.రీసెంట్గా 'కల్కి'లో విలన్‌గా ఆకట్టుకున్న కమల్.. 'భారతీయుడు 2'తో హీరోగా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ఈయన చేతిలో ప్రస్తుతం థగ్ లైఫ్, భారతీయుడు 3 సినిమాలు ఉన్నాయి. 'కల్కి 2' ఉంది కానీ అదెప్పుడో సెట్స్‌పైకి వెళ్తుందో తెలీదు. కమల్ తప్పుకొన్నాడు సరే మరి ఈయన స్థానాన్ని భర్తీ చేసే కొత్త హోస్ట్ ఎవరా అనేది పెద్ద ప్రశ్న. ఇదిలా ఉండగా తెలుగులో మాత్రం నాగార్జునే కొత్త సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నాడు.(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ))என்றும் உங்கள் நான்.@vijaytelevision pic.twitter.com/q6v0ynDaLr— Kamal Haasan (@ikamalhaasan) August 6, 2024 -
ఓటీటీలోకి 'భారతీయుడు 2'.. అధికారిక తేదీ ప్రకటన
విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'భారతీయుడు 2'. దాదాపు 28 ఏళ్ల క్రితం వచ్చిన చిత్రానికి సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. దాదాపు నాలుగేళ్ల పాటు పలు ఇబ్బందులు ఎదుర్కొని షూటింగ్ పూర్తి చేసి.. గత నెలలో థియేటర్లలో రిలీజ్ చేశారు. టాక్ తేడా కొట్టేయడంతో ఇప్పుడు అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అధికారిక తేదీ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా?)కమల్ హాసన్-శంకర్ కాంబోలో వచ్చిన 'భారతీయుడు'.. 1996లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. లంచగొండితనం కాన్సెప్ట్ అప్పట్లో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇచ్చింది. దీనికి సీక్వెల్‌ని తాజాగా జూలై 12న థియేటర్లలో రిలీజ్ చేశారు. కట్ చేస్తే కమల్ కెరీర్లోనే ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. కథాకథనాలు మరీ తీసికట్టుగా ఉన్నాయని ఆడియెన్స్ తేల్చేశారు.ఇకపోతే భారతీయుడు 2 సినిమా డిజిటల్ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ముందు అనుకున్న ప్రకారం 6-8 వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. కానీ ఫ్లాప్ టాక్ రావడంతో ప్లాన్ మారింది. 28 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఆగస్టు 9 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓటీటీలో రిలీజ్ ఉంటుందని ప్రకటించారు.(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 25 సినిమాలు రిలీజ్)Thatha varaaru, kadhara vida poraaru 🔥#Indian2 is coming to Netflix on 9 August in Tamil, Telugu, Malayalam and Kannada!#Indian2OnNetflix pic.twitter.com/cJN0JWaprp— Netflix India South (@Netflix_INSouth) August 4, 2024