నటుడు కమలహాసన్(Kamal Haasan), శంకర్(S. Shankar) కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రం ఇండియన్.. ఏఎం. రత్నం నిర్మించిన ఈ చిత్రం 1996లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. 26 ఏళ్ల తర్వాత దానికి సీక్వెల్‌గా ఇండియన్–2 రూపొందింది. అదే దర్శకుడు, నటుడు నటించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కాగా గత ఏడాది విడుదలైన ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది.
ఇకపోతే దర్శకుడు శంకర్ తొలిసారిగా తెలుగులో రామ్‌చరణ్ కథానాయకుడుగా తెరకెక్కించిన చిత్రం గేమ్ చేంజర్. బడ్జెట్లో బ్రహ్మాండంగా రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శించబడుతోంది. దీంతో దర్శకుడు శంకర్ మరో చిత్రం ఏంటన్న విషయంపై జరుగుతున్న చర్చకు ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంటూ ఇండియన్–3 (Indian 3) చిత్రంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
ఈ చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. ఇవన్నీ పూర్తికావడానికి మరో ఆరు నెలల సమయం పడుతుందని అన్నారు. అన్ని కార్యక్రమాలను త్వరగా పూర్తిచేసి ఆరు నెలల్లో తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా తన దర్శకత్వంలో వేల్పారి అనే చారిత్రక కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు చెప్పారు. మదురై ఎంపీ ఎస్ వెంకటేశన్ రాసిన రచించిన నవల ఆధారంగా కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. దీన్ని మూడు భాగాలుగా రూపొందించనున్నట్లు చెప్పారు.
బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఇండియన్-2
గత ఏడాదిలో విడుదలైన ఇండియన్ 2 మూవీ భారతీయ సినీ చరిత్రలో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ చిత్రం 73 కోట్ల (నెట్) వరకు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో కమల్‌హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులో కూడా భారతీయుడు 2 మూవీ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఫుల్ థియేట్రికల్ రన్‌లో పదమూడు కోట్లు మాత్రమే కలెక్షన్స్ అందుకుంది. సుమారు రూ. 12 కోట్ల వరకు నష్టాలను ఎదుర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment