Game Changer Teaser: వాడు మంచోడే కానీ కోపమొస్తే 'గేమ్ ఛేంజర్' టీజర్‌ | Ram Charan Game Changer Telugu Teaser Out Now | Sakshi

Game Changer Teaser: 'గేమ్ ఛేంజర్' బ్లాక్‌బస్టర్‌ టీజర్‌ విడుదల

Nov 9 2024 6:04 PM | Updated on Nov 9 2024 6:46 PM

Ram Charan Game Changer Telugu Teaser Out Now

గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదలైంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ ల‌క్నోలో ఈ మూవీ టీజ‌ర్‌ను మొదట విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లా కేంద్రాల్లోని థియేటర్‌లలో గేమ్‌ ఛేంజర్‌ టీజర్‌ను విడుదల చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో జ‌న‌వ‌రి 10, 2025న రిలీజ్ కానుంది.  ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైద‌రాబాద్‌ వంటి మెట్రో సిటీలతో పాటు  దేశవ్యాప్తంగా 11 చోట్ల టీజ‌ర్‌ లాంచ్‌ కార్యక్రమం ఘనంగా జరిగింది.

గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించే ఐఏఎస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. పొలిటికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, ఎస్‌.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్  నిర్మిస్తున్నారు. హ‌ర్షిత్ స‌హ నిర్మాత‌. ఈ మూవీకి తమిళ స్టార్‌ డైరెక్టర్‌ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా సాయి మాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement