Game Changer
-
రామచ్‌రణ్‌పై విమర్శలు.. స్పందించిన ఉపాసన
మెగాహీరో రామ్‌చరణ్ కడప పెద్ద దర్గాను సందర్శించారు. అక్కడ 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే, కొద్దిరోజుల క్రితం నుంచి స్వామి మాలలో ఉన్న చరణ్ దర్గాకు వెళ్లడంతో పలువురు విమర్శించారు. కానీ, కొందరైతే అందులో తప్పేముందని చరణ్‌కు సపోర్ట్‌గా కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేసింది.రామ్‌చరణ్‌పై విమర్శులు చేయడాన్ని ఉపాసన తప్పపట్టారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో చరణ్ ఫోటోను షేర్ చేస్తూ సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా అనే గీతాన్ని జోడించారు. చరణ్ అన్ని మతాలను గౌరవిస్తారని ఆమె తెలిపారు. దేవుడిపై విశ్వాసం ఉంటే అందరినీ ఏకం చేస్తుందని ఆమె చెప్పారు. 'భక్తి ఎవరినీ చిన్నాభిన్నం చేయదు. మేము అన్ని మతాలను గౌరవిస్తాం. ఐక్యతలోనే మన బలం ఉంది. వన్ నేషన్.. వన్ స్పిరిట్' అని తెలిపారు.రామ్‌చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కడప దర్గా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో వారిద్దరూ కలిసి కొత్త సినిమా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో సెంటిమెంట్‌గా వారు అక్కడకు వచ్చారు. గతంలో మగధీర విడుదల సమయంలో కూడా చరణ్ దర్గాను సందర్శించి అక్కడి పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ సినిమా చరణ్ కెరిర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. దీంతో కడప దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చరణ్ పేర్కొన్నారు. జనవరి 10న శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కానుంది. -
గేమ్ ఛేంజర్ కు పోటీగా బాలయ్య, వెంకీ, అజిత్, విక్రమ్...
-
అందంతో టెంపరేచర్ పెంచేస్తున్న 'గేమ్ ఛేంజర్' హీరోయిన్ (ఫొటోలు)
-
కడప అమీన్‌పీర్ దర్గాను దర్శించుకున్న హీరో రామ్‌చరణ్ (ఫొటోలు)
-
ఫ్యాన్స్‌కు 'శంకర్' షాక్.. ఆ సినిమా రీషూట్ కోసం రూ. 100 కోట్లు
టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్‌లో కూడా ప్రస్తుతం సీక్వెల్స్ సీజన్ నడుస్తుందనే చెప్పాలి. తెలుగులో సలార్, కల్కి, దేవర చిత్రాలకు సీక్వెల్స్ ఉంటాయని ప్రకటించారు. అయితే వీటికి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. తమిళ చిత్రాలు విషయానికొస్తే భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన భారతీయుడు – 2 చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. అయినప్పటికీ ఈ చిత్రానికి 3వ సీక్వెల్‌ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా తాజాగా విడులైన సూర్య కథానాయకుడిగా నటించిన కంగువ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నారు. కంగువ చిత్రం కూడా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దీనికి సీక్వెల్ నిర్మాణానికి కూడా కొంత సమయాన్ని తీసుకుంటున్నట్లు నిర్మాత చెబుతున్నారు. ఇక అసలు విషయానికొస్తే శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఘనవిజయాన్ని సాధించింది. దీంతో దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అది తెర రూపం దాచడానికి 28 ఏళ్లకు పైగా పట్టింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నా భారతీయుడు – 3 చిత్రాన్ని కూడా ఏకకాలంలో రూపొందించారు. అయితే భారతీయుడు – 2 చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పార్ట్ – 3 విడుదల సందిగ్ధంలో పడింది. ఈ క్రమంలోనే దీనిని ఓటీటీలో విడుదల చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయడానికి దర్శకుడు శంకర్, నటుడు కమలహాసన్ సిద్ధంగా లేరని తెలిసింది. అదేవిధంగా భారతీయుడు– 2 మాదిరిగా పార్ట్- 3 కాకూడదని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రీషూట్ చేయమని నటుడు కమలహాసన్ దర్శకుడు శంకర్‌కు సూచించినట్లు సమాచారం. శంకర్ కూడా అందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రూ.100 కోట్లు ఉంటేనే..భారతీయుడు – 3 చిత్రం కోసం ఆయన నిర్మాణ సంస్థ లైకాకు మరో రూ.100 కోట్లు బడ్జెట్‌ను సమకూర్చమని చెప్పినట్లు సమాచారం. కాగా శంకర్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించిన గేమ్ ఛేంజర్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన తెరపైకి రానుంది. ఆ తర్వాత భారతీయుడు– 3 చిత్ర రీషూట్‌కు శంకర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా విడుదల కాలేదు. -
నా కల నెరవేరింది: తమన్
‘‘బాయ్స్’ (2003) సినిమా సమయంలో శంకర్‌గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్ని అని ఆయన గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్‌గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. అది ‘గేమ్ చేంజర్’ సినిమాతో నెరవేరింది’’ అని సంగీత దర్శకుడు తమన్ తెలిపారు. నేడు (నవంబరు 16) ఆయన పుట్టినరోజు.ఈ సందర్భంగా శుక్రవారం తమన్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. సినిమాలో భావోద్వేగం లేకపోతే నేను ఎంత మ్యూజిక్ కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా సంగీతం ఇస్తాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి. ఇంకొన్నింటికి పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి.తెలుగులో ప్రస్తుతం నేను చేస్తున్న ‘తెలుసు కదా, ఓజీ, గేమ్ చేంజర్, డాకు మహారాజ్’ వంటి సినిమాలు దేనికవే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. నేపథ్య సంగీతంలో మణిశర్మగారి తర్వాత నేనో ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. ‘పుష్ప: ది రూల్’కి 15 రోజుల్లో నేపథ్య సంగీతం పూర్తి చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైమ్‌లో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా పూర్తి చేసి ఇచ్చాను. ప్రభాస్‌గారి ‘రాజా సాబ్’లో ఆరు పాటలుంటాయి. ఇతరుల సినిమాల నుంచి ట్యూన్స్‌ని కాపీ కొట్టేంత తెలివి నాకు లేదు. అందుకే వెంటనే దొరికిపోతాను (నవ్వుతూ). ‘అఖండ 2’కి ఇప్పటికే ఒక పాట అయిపోయింది. హీరో అల్లు అర్జున్–డైరెక్టర్ త్రివిక్రమ్‌ల ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. ఓ ప్రపంచ స్థాయి మ్యూజికల్ స్కూల్ నెలకొల్పి, ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనుకుంటున్నాను’’ అని చె΄్పారు. -
'గేమ్ ఛేంజర్' కోసం బాలీవుడ్ కింగ్.. కడపకు రానున్న చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. సంక్రాంతికి కానుకగా జనవరి 10న విడుదల కానున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన టీజర్ సినీ అభిమానులను మెప్పిస్తుంది. 'RRR'తో రామ్ చరణ్‌కు బాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో అక్కడి మార్కెట్‌పై 'గేమ్ ఛేంజర్' టీమ్ కన్నేసింది. అందుకు తగ్గట్లు అక్కడ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే టీజర్‌ను లక్నో వేదికగా విడుదల చేశారు.ఆ ఈవెంట్ కోసం షారుఖ్ ఖాన్ట్రైలర్ విడుదల వేడుకను బాలీవుడ్లో చాలా గ్రాండ్‌గా జరపాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఆడియో లాంఛ్ ఈవెంట్‌ను కూడా ఘనంగానే ప్లాన్ చేస్తుంది. అయితే, ఈ కార్యక్రమంలో ఏదో ఒకదానిలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పాల్గొననున్నారని తెలుస్తోంది. డైరెక్టర్ శంకర్ తన మూవీ ప్రమోషన్స్ కోసం గతంలో చాలా సార్లు హాలీవుడ్ స్టార్స్‌ను ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయనే విషయం తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్లో గేమ్ ఛేంజర్ మార్కెట్‌ను పెంచుకునేందుకు షారుఖ్‌ను రంగంలోకి దింపుతున్నట్లు ప్రచారం ఉంది. బాలీవుడ్ మీడియాతో చిట్చాట్లు నిర్వహించడంతో పాటు విడుదలకు ఇంకా సమయం ఉండటంతో అక్కడ మరిన్ని ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.కడపకు రామ్ చరణ్రామ్ చరణ్ కడప రానున్నారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం నవంబర్ 18న జరుగనున్న 80వ దర్గా నేషనల్ ముషైరా ఘజల్ ఈవెంట్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు చరణ్ టీమ్ వెల్లడిస్తుందని సమాచారం. గేమ్ ఛేంజర్ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో అంజలీ, కియారా అద్వానీ, యస్ జే సూర్య, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
గేమ్ ఛేంజర్, చావా మధ్య భారీ క్లాష్ తప్పదా..?
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఒక్క రోజులోనే క్రేజీ రికార్డ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది. విడుదలకు మరో రెండు నెలల టైమ్ ఉండడంతో వరుస మూవీ అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు.తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అప్డేట్స్ కోసం ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. గేమ్ ఛేంజర్ రిలీజైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. అన్ని భాషల్లో కలిపి ఒక్క రోజులోనే ఏకంగా 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విటర్ ద్వారా పంచుకుంది. రామ్ చరణ్ పోస్టర్ షేర్ చేస్తూ వెల్లడించింది. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. గ్లోబల్ స్టార్ రేంజ్ ఇదేనంటూ కామెంట్స్ పెడుతున్నారు.కాగా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా కనిపించనుంది. కోలీవుడ్ స్టార్ నటుడు ఎస్జే సూర్య ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.అంతకుముందు పొంగల్ బరిలో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర విడుదల కావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా ఆ మూవీ పోటీ నుంచి తప్పుకోవడంతో గేమ్ ఛేంజర్ రేసులో నిలిచింది. మెగాస్టార్ నటిస్తోన్న విశ్వంభర చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Crazy 55 Million+ Views ♥️Off the charts, right into the audience’s hearts😍#GameChangerTeaser 💥🔗 https://t.co/ihtvtgPel9In cinemas worldwide from 10th Jan.GlobalStar @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @yoursanjali @iam_SJSuryah @MusicThaman @actorsrikanth… pic.twitter.com/dQmzVtVtFU— Sri Venkateswara Creations (@SVC_official) November 10, 2024 -
గేమ్ ఛేంజర్ టీజర్ సెన్సేషన్.. మెగా హీరోస్, ఫ్యాన్స్ కు పండగే..
-
'గేమ్ ఛేంజర్' టీజర్ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' టీజర్ HD స్టిల్స్ (ఫొటోలు)
-
Game Changer Teaser: వాడు మంచోడే కానీ కోపమొస్తే 'గేమ్ ఛేంజర్' టీజర్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్‌ను మొదట విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పలు జిల్లా కేంద్రాల్లోని థియేటర్లలో గేమ్ ఛేంజర్ టీజర్‌ను విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలతో పాటు దేశవ్యాప్తంగా 11 చోట్ల టీజర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.గేమ్ ఛేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఈ సినిమా రానుంది. ఇందులో కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత్, సునీల్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, నవీన్‌చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. -
నా మార్కెట్ పడిపోయిందని చాలామంది అన్నారు: పూజా
జీవితంలో ఎవరికైనా జయాపజయాలు సహజం. విజయాలతో విర్రవీగిన మహామహులు కూడా అపజయాలను చవి చూశారు. ఇందుకు సినీ తారలు అతీతం కాదు. నటి పూజాహెగ్డే విషయానికి వస్తే ఈ ఉత్తరాది భామ గత 12 ఏళ్ల క్రితం టాలీవుడ్,కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే, తెలుగులోనే ఎక్కువ చిత్రాల్లో నటించారు. తమిళ చిత్రాల నుంచి ఎప్పుడో ఎగ్జిట్ అయిపోయారు. ఇప్పుడు రీఎంట్రీలో కూడా తెలుగుతో పాటు తమిళ్లో మళ్లీ అవకాశాలు దక్కుతున్నాయి.గతంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించిన చిత్రాలు సూపర్‌హిట్ కావడంతో పూజాహెగ్డేకు ఒక్కసారిగా స్టార్డమ్ వచ్చేసింది. దీంతో కోలీవుడ్ స్వాగతం పలికింది. అయితే అలా తమిళంలో విజయ్ సరసన నటించిన బీస్ట్ చిత్రం కూడా పూర్తిగా నిరాశ పరిచింది. అదే సమయంలో టాలీవుడ్, బాలీవుడ్లో పూజాహెగ్డే నటించిన చిత్రాలు ప్లాప్ కావడంతో ఇక ఈ అమ్మడి పనైపోయింది అనే ప్రచారం జోరందుకుంది. కాగా ప్రస్తుతం హిట్స్ లేకపోయినా భారీ అవకాశాలు పూజాహెగ్డే తలుపు తట్టడం విశేషం. తమిళంలో సూర్యకు జంటగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించి పూర్తి చేశారు. తాజాగా నటుడు విజయ్‌తో ఆయన 69వ చిత్రంలో జత కడుతున్నారు. అలాగే తెలుగులోనూ అవకాశాలు రావడం మొదలెట్టాయి. ఈ సందర్బంగా నటి పూజాహెగ్డే ఒక భేటీలో తన కెరీర్ గురించి పేర్కొంటూ తన మార్కెట్ పడిపోయిందనే ప్రచారం గురించి తాను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. అలాగే అపజయాల గురించి బాధ పడిందిలేదు, భయపడింది లేదన్నారు. తన వరకూ తాను తన పాత్రలకు వంద శాతం న్యాయం చేస్తున్నానని, మంచి టైమ్ కోసం సహనంగా ఎదురు చూస్తున్నానని అన్నారు. ప్రస్తుతం 5 చిత్రాల్లో నటిస్తున్నట్లు ,అందులో రెండు తమిళం, ఒక హిందీ చిత్రాలు ఉన్నాయని నటి పూజాహెగ్డే పేర్కొన్నారు. -
'గేమ్ చేంజర్' టీజర్.. అక్కడ గ్రాండ్ ఈవెంట్‌కు ఏర్పాట్లు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియాగా పేరున్న సిటీ లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేసింది. ఆపై ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో సిటీల్లో టీజర్ లాంచ్ కానుంది. నవంబర్ 9న గ్రాండ్‌గా గేమ్ చేంజర్ టీజర్‌ను విడుదల చేయనున్నారు.భారీ అంచనాలున్న గేమ్ చేంజర్ టీజర్ ఈవెంట్‌కు రామ్ చరణ్, కియారా అద్వానీ, డైరెక్టర్ శంకర్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఇప్పటి వరకు సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ‘జరగండి జరగండి.. ’, ‘రా మచ్చా రా..’ సాంగ్స్‌కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ నెల 9న టీజర్ రిలీజ్ అయ్యాక ఈ చిత్రంపై అంచనాలు మరింత రేంజ్లో పెరగనున్నాయి. టీజర్ కోసం అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.‘గేమ్ చేంజర్’ చిత్రంలో రామ్ చరణ్ ఎన్నికలను సజావుగా నిర్వహించే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అవినీతి రాజకీయ నాయకుల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎలక్షన్స్‌ను నిబద్ధతతో నిర్వహించే ఆఫీసర్‌గా మెప్పించనున్నారు. జనవరి 10న రిలీజ్ కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ సహ నిర్మాత. ఈ మూవీకి తమిళ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కథను అందించారు. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. Ready, Set... Command 😎Get ready for #GameChanger ‘s charge in Lucknow ❤️🔥🧨#GameChangerTeaser launch event on 9th NOVEMBER in Lucknow, UP.#GameChanger takes charge in theatres on JAN 10th ❤️🔥Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah… pic.twitter.com/gq9LXHCs1y— Sri Venkateswara Creations (@SVC_official) November 5, 2024 -
పండగ వేళ పసందుగా...
కొత్త లుక్స్, విడుదల తేదీల ప్రకటనలతో దీపావళి సందడి తెలుగు పరిశ్రమలో బాగానే కనిపించింది. మాస్ లుక్, క్లాస్ లుక్, భయంకరమైన లుక్, కామెడీ లుక్... ఇలా పండగ వేళ పసందైన వెరైటీ లుక్స్‌లో కనిపించారు స్టార్స్. ఆ వివరాల్లోకి వెళదాం.⇒ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లోని స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, ధనుష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న పాన్ ఇండియన్ మల్టిస్టారర్ చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుసూ్కర్ రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నల పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. టీజర్‌ని ఈ నెల 15న విడుదల చేయనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ⇒ హీరో వెంకటేశ్ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్‌ని ఖరారు చేసి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. అనిల్ రావిపూడి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్ భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. దీపావళిని పురస్కరించుకుని ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయడంతో పాటు సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. యూనిక్ ట్రయాంగిలర్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. ⇒ సంక్రాంతికి ఆట ప్రారంభించనున్నారు రామ్‌చరణ్. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్నారు. అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ బ్యానర్స్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ మూవీ టీజర్‌ని ఈ నెల 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించి, రామ్‌చరణ్ లుక్‌ని రిలీజ్ చేశారు. ⇒ అర్జున్ సర్కార్‌గా చార్జ్ తీసుకున్నారు హీరో నాని. ‘హిట్: ది ఫస్ట్ కేస్’, ‘హిట్: ది సెకండ్ కేస్’ వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’. తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ‘హిట్: ది థర్డ్ కేస్’ని కూడా తెరకెక్కిస్తున్నారు. శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ప్రొడక్షన్స్పై ప్రశాంతి తిపిర్నేని ఈ మూవీ నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి నాని యాక్షన్ ఫ్యాక్డ్ పోస్టర్ రిలీజ్ చేశారు. 2025 మే 1న ఈ సినిమా విడుదల కానుంది. ⇒ నితిన్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. ఇందులో శ్రీలీల హీరోయిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ విడుదలైంది. త్వరలో టీజర్ రిలీజ్ కానుంది. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ⇒ నవీన్ చంద్ర హీరోగా లోకేశ్ అజ్లస్ దర్శకత్వంలో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ‘లెవెన్’. రేయా హరి కథానాయికగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఈ చిత్రంలోని ‘ది డెవిల్ ఈజ్ వెయిటింగ్..’ అంటూ శ్రుతీహాసన్ పాడిన పాట చాలా పాపులర్ అయింది. ‘లెవెన్’ని నవంబర్ 22న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ⇒ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ తాత–మనవళ్లుగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందంగా రాజా గౌతమ్ పోషిస్తున్న పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. ఇందులో ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది.⇒ నాగ సాధువుగా తమన్నా లీడ్ రోల్లో అశోక్ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఓదెల 2’. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై బహు భాషా చిత్రంగా రూపొందుతోంది. ఈ డివోషన్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ తిరుపతి పాత్రలో వశిష్ఠ ఎన్. సింహ నటిస్తున్నట్లు పేర్కొని, లుక్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మరో కీలక -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. ఫ్యాన్స్‌కు మెగా అప్డేట్!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అనుకోకుండా సంక్రాంతి బరిలో నిలిచింది. చిరంజీవి పొంగల్ బరి నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో రామ్ చరణ్ వచ్చేస్తున్నారు. ఇప్పటికే నవంబర్‌లో కచ్చితంగా అప్డేట్స్ ఉంటాయని ప్రకటించిన టీమ్.. ఇవాళ దీపావళి సందర్భంగా టీజర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.గేమ్ ఛేంజర్ టీజర్ నవంబర్ 9న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్‌కు మెగా అప్డేట్ ఇచ్చారు. అంతేకాకుండా రామ్ చరణ్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. లుంగీ కట్టుకుని బనియన్‌తో కూర్చున్న రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. (ఇది చదవండి: మెగా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ఆ రోజే సర్ప్రైజ్!)కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. Light it up 😎💥 #GameChangerTeaser from November 9th. Wishing everyone a very Happy Diwali 🔥#GameChanger takes charge in the theatres on JAN 10th ❤️🔥#GamechangerOnJAN10 🚁Global Star @AlwaysRamCharan @shankarshanmugh @advani_kiara @iam_SJSuryah @MusicThaman… pic.twitter.com/dbDr2HLWeQ— Sri Venkateswara Creations (@SVC_official) October 31, 2024 -
మెగా ఫ్యాన్స్‌కు బిగ్ అప్డేట్.. ఆ రోజే సర్ప్రైజ్!
మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం గేమ్ ఛేంజర్. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం అనుకోకుండా సంక్రాంతి బరిలో నిలిచింది. చిరంజీవి పొంగల్ బరి నుంచి తప్పుకోవడంతో ఆ ప్లేస్‌లో రామ్ చరణ్ వచ్చేస్తున్నారు. రిలీజ్‌కు ఇంకా 75 రోజుల సమయం ఉండడంతో మేకర్స్ నుంచి అప్డేట్స్ రావడం మొదలైంది. ఇప్పటికే నవంబర్‌లో కచ్చితంగా అప్డేట్స్ ఉంటాయని ప్రకటించిన టీమ్.. తాజాగా టీజర్ రిలీజ్‌పై హింట్ ఇచ్చింది.త్వరలోనే గేమ్ ఛేంజర్ టీజర్ రిలీజ్ అవుతుందని ప్రకటించింది. నాలుగు రోజుల్లో దీపావళి ఉండడంతో మెగా ఫ్యాన్స్‌కు ఆ రోజే బిగ్ సర్ప్రైజ్ ఇచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ టీజర్‌కు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.(ఇది చదవండి: గేమ్ ఛేంజర్ విడుదల తేదీని ప్రకటించిన దిల్ రాజు)కాగా.. ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానుంది. Unleashing the explosive power worldwide in 75 Days ❤️🔥The #GameChangerTeaser fireworks to begin soon 🧨💥#GameChanger In Cinemas near you from 10.01.2025! pic.twitter.com/b5bhC0BezZ— Game Changer (@GameChangerOffl) October 27, 2024 -
గేమ్ ఛేంజర్ కి పోటీ గా చిన్న సినిమాలు సిద్ధం..
-
గేమ్ చేంజ్ చేసిన రామ్ చరణ్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
పొంగల్ పోరు.. సీన్ మారుతోంది!
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే చాలా స్పెషల్. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని సినిమాల వసూళ్లు బాగుంటాయి. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, దర్శక – నిర్మాతలు వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. కానీ ఫైనల్‌గా బెర్త్ కొంతమందికే దొరుకుతుంది. 2025 సంక్రాంతి సమయం సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆయా చిత్రబృందాలు రెడీ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ సంక్రాంతికి ప్రకటించిన సినిమాలు థియేటర్స్‌లోకి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో వేరే సినిమాలు సంక్రాంతికి సై అంటున్నాయి. ఇలా సంక్రాంతి సినిమా సీన్ మారుతోంది. ఇక 2025 సంక్రాంతి బాక్సాఫీస్ పోరులోకి వెళదాం.సంక్రాంతికి వస్తున్నాం... కానీ! ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వర్కింగ్ టైటిల్‌ని పెట్టుకుని మరీ వెంకటేశ్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారంటే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని యూనిట్ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, అతని భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘గేమ్ చేంజర్’ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సంక్రాంతి పండక్కి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా స్పేస్ ఉంటుంది కాబట్టి తమ బేనర్లోని ఈ రెండు చిత్రాలనూ ‘దిల్’ రాజు పండగ బరిలో దింపుతారని ఊహించవచ్చు. ఆఫీసర్ వస్తారా? ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్స్‌లోకి రావాల్సింది. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల నిర్మాతల రిక్వెస్ట్, వివిధ సమీకరణాల నేపథ్యంలో ‘ఈగల్’ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుని, ఫిబ్రవరిలో విడుదలైంది. దీంతో 2025 సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని రవితేజ ప్లాన్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ, హీరో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రవితేజ భుజానికి గాయమైంది. దాంతో ఈ సినిమా చిత్రీకరణ సజావుగా సాగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా అనే విషయంపై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరి పాత్రలో రవితేజ నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ రెడీ సంక్రాంతి బరికి సిద్ధమయ్యారు రామ్‌చరణ్. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తొలుత 2024 క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు ‘దిల్’ రాజు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల ట్రేడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ సూచనల మేరకు ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్‌ను 2024 క్రిస్మస్ నుంచి 2025 సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా నిర్మాత ‘దిల్’ రాజు ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు. 2025 జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ‘గేమ్ చేంజర్’ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, నవీన్‌చంద్ర, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, ప్రియదర్శి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఇది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ల విధులు, హక్కులు, వారికి ఉండే ప్రత్యేక అధికారాలు వంటి అంశాల నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ ఉంటుందని టాక్.నార్త్ ఇండియాలో... ఈ సంక్రాంతి పండక్కి బాలకృష్ణ 109వ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. కేఎస్ రవీంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా టైటిల్, రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తారని, కథకు నార్త్ ఇండియా నేపథ్యం ఉంటుందని, విలన్‌గా బాబీ డియోల్, ఓ పోలీసాఫీసర్ పాత్రలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మజాకా ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో ‘మజాకా’ సెలబ్రేషన్స్ ఖాయం అంటున్నారు హీరో సందీప్ కిషన్. రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తీసిన నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్న చిత్రం ఇది. మహేంద్రగిరి దేవాలయం సంక్రాంతి వంటి పెద్ద పండక్కి మీడియమ్, స్మాల్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ప్రతి సంక్రాంతికి ఇలాంటి చిత్రాలు రెండు అయినా వస్తుంటాయి. ఏ చిత్రం ఆడియన్స్‌కు నచ్చితే అది పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ కోవలో వస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ హీరోగా, బ్రహ్మానందం మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఇది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది.2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సింది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. కానీ ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కావడం లేదు. ‘విశ్వంభర’ సినిమా వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని, రామ్‌చరణ్– ‘దిల్’ రాజుగార్ల కోసం చిరంజీవిగారితో మాట్లాడి ‘విశ్వంభర’ రిలీజ్‌ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నారు. ఇక ‘విశ్వంభర’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది.అలాగే 2025 సంక్రాంతి సందర్భంగా తాను హీరోగా నటించే ఓ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందన్నట్లు నాగార్జున గతంలో పేర్కొన్నారు. కానీ ఇది సాధ్యపడేలా లేదు. అయితే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ ఓటీటీ డీల్స్, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్స్ వంటి అంశాలను పరిశీలించుకుని ‘తండేల్’ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై చిత్రయూనిట్ ఓ స్పష్టతకు వస్తారట. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ బాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో స్ట్రయిట్ చిత్రాలతో పాటు ఒకటీ లేదా రెండు తమిళ హీరోల చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. ఇలా 2025 సంక్రాంతికి అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్‌లోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ క్యారెక్టర్లో మూడు వేరియేషన్స్ ఉంటాయి. – ముసిమి శివాంజనేయులు -
అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యేనా?
సంక్రాంతి.. టాలీవుడ్‌కి పెద్ద పండగ. కరోనా సమయంలో కూడా సంక్రాంతికి రిలీజైన సినిమాలు మంచి వసూళ్లను రాబట్టాయి. అందుకే మన దర్శక-నిర్మాతలు ‘సంక్రాంతికి సై’ అంటూ తమ సినిమాలను విడుదల చేస్తుంటారు. ఈ సారి కూడా నాలుగైదు పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. ఇప్పటికే కొందరు సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించారు. మరికొన్ని సినిమాలు సడన్ సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఈ ‘బాక్సాఫీస్’ ఆటలో ఈ సారి అల్లు అరవింద్ ‘గేమ్ ఛేంజర్’ అయ్యేలా కనిపిస్తున్నాడు. అల్లుడు రామ్ చరణ్‌కి పోటీగా తన సినిమాను బరిలోకి దించి ‘బాక్సాఫీస్’ ఆటను మరింత రసవత్తరంగా మార్చడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ షూటింగ్ జాప్యం, ఇతర కారణాలతో విడుదల వాయిదా పడుతూ వచ్చింది. చివరకు సంక్రాంతికి వస్తున్నాం అటూ దసరా రోజు ప్రకటన చేశారు. ఈ చిత్రం కంటే ముందే మరో మూడు పెద్ద సినిమాలు కూడా సంక్రాంతికి వస్తున్నాం అని ప్రకటించాయి. అందులో ఒకటి చిరంజీవి ‘విశ్వంభర’. రెండోది అనిల్ రావిపూడి-వెంకటేశ్ మూవీ. మూడోది నందమూరి బాలకృష్ణ-బాబీ సినిమా. (చదవండి: అఖండగా బాలయ్య మరోసారి.. అధికారిక ప్రకటన)అయితే అనూహ్యంగా చిరంజీవి వెనక్కి తగ్గి.. కొడుకు సినిమాను బరిలోకి నిలిపాడు. ఈ మూడు సినిమాల మధ్యే గట్టిపోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. తాజాగా మరో సినిమా కూడా సంక్రాంతి బరిలోకి రాబోతుంది. అదే అక్కినేని నాగచైతన్య ‘తండేల్’. ‘లవ్‌స్టోరీ’ సినిమా తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రమిది. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.(చదవండి: బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!)వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ మూడోవారంలో రిలీజ్ చేయాలని భావించారట. అప్పటిలోపు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేసే పరిస్థితి లేదని చందు చెప్పేశాడట. వీలైనంతవరకు ట్రై చేద్దామని..కుదరకపోతే రిలీజ్‌ను వాయిదా వేయక తప్పదని ముందే చెప్పారట. ఒకవేళ డిసెంబర్ మూడో వారంలోపు విడుదల చేసే అవకాశం లేనట్లేయితే.. ఎక్కువ రోజులో హోల్డ్ చేయకుండా సంక్రాంతి పండక్కే రావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి అయితే డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ అన్నదానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు ఈ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. -
గేమ్ చేంజ్
గేమ్ డేట్ చేంజ్ అయింది. ఎందుకంటే ఆడే ఆటని అందరూ చూడాలంటే సరైన తేదీ ఉండాలి కదా. అందుకే ఆటని సంక్రాంతికి మార్చారు. రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ గురించే ఇదంతా. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రోడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ఇది. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయాలనుకున్నారు.అయితే వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నప్పుడు క్రిస్మస్ కన్నా సంక్రాంతి అయితే బాగుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్సీస్లోని డిస్ట్రిబ్యూటర్స్ అందరూ భావించాం.అయితే సంక్రాంతికి చిరంజీవిగారి ‘విశ్వంభర’ కూడా ఉంది. ‘విశ్వంభర’ భారీ బడ్జెట్ చిత్రమే. అయితే ‘గేమ్ చేంజర్’ మూడేళ్లుగా నిర్మాణంలో ఉందని, సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారిని, యూవీ సంస్థని కోరడంతో ‘విశ్వంభర’ దాదాపు పూర్తి కావచ్చినప్పటికీ సానుకూలంగా స్పందించారు. మా సినిమా కోసం వాళ్ల సినిమాను వాయిదా వేసుకోవడానికి ఒప్పుకున్నందుకు చిరంజీవిగారికి, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి ధన్యవాదాలు’’ అన్నారు. -
సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్'.. దిల్ రాజు ప్రకటన
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్. సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే, దసరా సందర్భంగా మెగా ఫ్యాన్స్‌లో నిర్మాత దిల్‌రాజు జోష్ నింపారు. గేమ్ ఛేంజర్ విడుదల తేదీని అయన అధికారికంగా ప్రకటిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ఇందులో కియారా అద్వాని హీరోయిన్. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ విషయంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్‌రాజు స్పష్టతనిచ్చారు.'గేమ్ ఛేంజర్’ను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేశాం. కానీ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నప్పుడు క్రిస్మస్ కంటే సంక్రాంతి అయితే బావుంటుందని నాతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, కర్ణాటక ఓవర్ సీస్‌లోని ఇతర డిస్ట్రిబ్యూటర్స్ అందరం భావించాం. ఈ ఆలోచనను నేను చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ సంస్థకు తెలియజేశాం. మూడేళ్లుగా ‘గేమ్ చేంజర్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నామని చెప్పాం. వాళ్లు రూపొందిస్తోన్న ‘విశ్వంభర’ సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమానే. వాళ్లు సంక్రాంతి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అందువల్ల సంక్రాంతి డేట్ కావాలని చిరంజీవిగారితో పాటు యువీ క్రియేషన్స్ సంస్థను అడిగాం. వాళ్లు సానుకూలంగా స్పందించారు. దీంతో ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి విడుదలకు లైన్ క్లియర్ అయింది. విశ్వంభర సినిమా విషయంలో మరో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. విశ్వంభర సినిమా కూడా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్‌తో సహా నిర్మాణ పనులన్నీ పూర్తి అయ్యాయి. కానీ, నా కోసం, మా సినిమా కోసం వాళ్ల మరో రిలీజ్ డేట్‌కు విశ్వంభర విడుదల చేయటానికి ఒప్పుకున్నారు. అందుకు చిరంజీవిగారికి, యువీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్, విక్కీకి నా ధన్యవాదాలు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను సంక్రాంతి విడుదల చేస్తున్నాం. ఇటు అభిమానులకు, అటు సినీ ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నాం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు యూ ట్యూబ్‌లో మారుమోగిపోతున్నాయి. తర్వాత టీజర్‌తో పాటు మరో మూడు సాంగ్స్ రిలీజ్ చేస్తాం. సంక్రాంతిలోపు ‘గేమ్ చేంజర్’కు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌ను అందిస్తూ మూవీ భారీ విజయం సాధించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతికి కలుద్దాం.' అన్నారు.సంక్రాంతికి కలుద్దాం! ❤️🔥✊🏼#GameChanger Global Star @AlwaysRamCharan @shankarshanmugh @MusicThaman @advani_kiara @iam_SJSuryah @actorsrikanth @yoursanjali @Naveenc212@AntonyLRuben @DOP_Tirru @artkolla @HR_3555 @ZeeStudios_ @saregamaglobal @saregamasouth @PharsFilm… pic.twitter.com/57Ht1FRW8m— Sri Venkateswara Creations (@SVC_official) October 12, 2024 -
సంక్రాంతి బరిలో..?
‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుందనే టాక్ ప్రచారంలోకి వచ్చింది. తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేసిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ పతాకాలపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో అంజలి, ఎస్జే సూర్య, సునీల్, జయరాం, ప్రియదర్శి, నవీన్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కాగా ‘గేమ్ చేంజర్’ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ డిసెంబరులో విడుదల చేయనున్నట్లుగా ఇటీవల ‘దిల్’ రాజు పలు సందర్భాల్లో వెల్లడించారు. అయితే ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి... ‘గేమ్ చేంజర్’ వాయిదా పడిందా? ఒకవేళ పడితే వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.