'గేమ్‌ ఛేంజర్' కలెక్షన్స్‌ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు | Game Changer First Day Collections Officially Out Now | Sakshi
Sakshi News home page

'గేమ్‌ ఛేంజర్' కలెక్షన్స్‌ ప్రకటన.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు

Published Sat, Jan 11 2025 11:04 AM | Last Updated on Sat, Jan 11 2025 11:26 AM

Game Changer First Day Collections Officially Out Now

'గేమ్‌ ఛేంజర్' మొదటిరోజు కలెక్షన్స్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. అయితే, బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించే ప్రముఖ సంస్థలు కూడా ఇప్పటికే గేమ్‌ ఛేంజర్ కలెక్షన్స్‌ రిలీజ్‌ చేశాయి. కానీ, వారి ఊహలకు కూడా అందని విధంగా రామ్‌ చరణ్‌ సినిమా కలెక్షన్స్‌ రాబట్టింది. ఈమేరకు దిల్‌ రాజు నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక పోస్టర్‌తో గేమ్‌ ఛేంజర్‌ లెక్కల వివరాలను ప్రకటించింది.

రామ్‌ చరణ్‌ (Ram Charan), శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో తెరకెక్కిన పొలిటికల్‌ డ్రామా చిత్రం 'గేమ్‌ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా భారీ అంచనాలతో విడుదలైంది.  ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రాల జాబితాలో గేమ్‌ ఛేంజర్‌ (Game Changer) చేరిపోయింది.  మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా పుష్ప2 రూ. 294 కోట్లతో టాప్‌ వన్‌లో ఉంది. ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ రూ. 223 కోట్లు, బాహుబలి2 రూ. 210 కోట్లు, కల్కి 2898AD రూ. 191 కోట్లుతో ఉంటే.. గేమ్‌ ఛేంజర్‌ రూ. 186 కోట్ల కలెక్షన్స్‌తో టాప్‌ ఫైవ్‌లో చేరిపోయింది. ఎన్టీఆర్ దేవరకు తొలి రోజు రూ.172 కోట్లు వచ్చిన విషయం తెలిసిందే.

బాక్సాఫీస్‌ ట్రేడ్‌ వర్గాల లెక్కలు ఇలా

'గేమ్‌ ఛేంజర్' తొలిరోజు కేవలం రూ. 51 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గ్రాస్‌ పరంగా అయితే సుమారు రూ. 80 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.42 కోట్లు రాబట్టినట్లు సమాచారం. హిందీ వర్షన్‌లో అయితే రూ. 7 కోట్లతోనే ఈ చిత్రం సరిపెట్టుకుంది. తమిళ్‌ రూ.2.1 కోట్లు, కన్నడ రూ. 10 లక్షలు, మలయాళం రూ. 5 లక్షలు వరకు గేమ్‌ ఛేంజర్‌ రాబట్టింది. Sacnilk ప్రకారం గేమ్ ఛేంజర్ దేశవ్యాప్తంగా 17,161 షోలలో 9.39 లక్షల టిక్కెట్లను బుక్‌ మై షో విక్రయించింది. కేవలం ముందస్తు బుకింగ్‌లతో ప్రపంచవ్యాప్తంగా రూ. 26.8 కోట్లు ఈ చిత్రం ఆర్జించింది.

(ఇదీ చదవండి: ‘గేమ్‌ ఛేంజర్‌’ మూవీ రివ్యూ)

గేమ్‌ ఛేంజర్‌ సినిమా మొదటిరోజే ప్రేక్షకులను నిరుత్సాహ పరచడంతో ఆ ఎఫెక్ట్‌ కలెక్షన్స్‌ మీద పడింది అనేది అందరి అభిప్రాయం. దీంతో మొదటిరోజు రూ. 100 కోట్లు కూడా దాటడం కష్టం  అని భావించారు. అయితే, తాజాగా చిత్ర యూనిట్‌ మాత్రం రూ. 186 కోట్లు ఫస్ట్‌ డే రాబట్టినట్లు పోస్టర్‌ విడుదల చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అపద్దం చేప్పడానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఎకంగా రూ. 100 కోట్లు పెంచడం ఏంటయ్యా అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కనీసం కాస్త నమ్మేలా కలెక్షన్స్‌ ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు.  ఇంకో రూ. 100 కోట్లు కలిపి పుష్ప2 రికార్డ్‌ బద్దలు అయిపోయిందని పోస్టర్‌ రిలీజ్‌ చేసి ఉంటే బాగుండేది కదా అని ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement