
టాలీవుడ్‌లో ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీ నిర్మాతల్లో ఒకరైన శిరీష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమా ఫెయిల్యూర్ తర్వాత హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ మాట వరసకు కూడా ఫోన్ చేయలేదంటూ మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన శిరీష్ గేమ్ ఛేంజర్ సినిమాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ వార్తల వేళ నిర్మాత దిల్ రాజు స్పందించారు. గత పది రోజులుగా ప్రతి ఇంటర్వ్యూలో గేమ్ ఛేంజర్ టాపిక్ లేకుండా జరగడం లేదన్నారు. గేమ్ ఛేంజర్ మూవీతో నేనే ఎక్కువగా ట్రావెల్ అయ్యాను.. శిరీష్‌కు ఈ సినిమాతో కనెక్షన్ చాలా తక్కువని తెలిపారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీని శిరీష్ చూసుకున్నారని వివరించారు. గేమ్ ఛేంజర్ సమయంలో శంకర్ ఇండియన్-2 చేయడం వల్ల మా సినిమా వాయిదా పడుతూ వచ్చిందని వెల్లడించారు. అయినా కూడా రామ్ చరణ్ మా సినిమాకు చాలా ఓపికగా సహకరించి పూర్తి చేశారని దిల్ రాజు తెలిపారు. నా సోదరుడు శిరీష్ మొదటిసారి ఇంటర్వ్యూలో మాట్లాడారని.. ఆయన మొత్తం డిస్ట్రిబ్యూషన్ కోణంలోనే ఆలోచిస్తారని అన్నారు. శిరీష్ ఎమోషనల్‌గా మాట్లాడారు.. కానీ అతని ఉద్దేశం అస్సలు అది కాదని.. రామ్ చరణ్‌తో మాకు ఎలాంటి వివాదం ఉండదని దిల్ రాజు స్పష్టం చేశారు.
కాగా.. ప్రస్తుతం దిల్ రాజు నిర్మించిన తమ్ముడు మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించారు. ఈ మూవీలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో లయ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుంది.