రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ (Game Changer Movie) వచ్చేవారమే రిలీజ్ కానుంది. సంక్రాంతి కంటే ముందుగానే జనవరి 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే రిలీజైన పాటలకు, ట్రైలర్‌కు విశేష స్పందన వచ్చింది. శనివారం (జనవరి 4న) ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు చరణ్, ఎస్‌జే సూర్య, దిల్ రాజు ఇలా అందరూ విచ్చేశారు. కానీ హీరోయిన్ కియారా మాత్రం ఎక్కడా కనిపించలేదు.
ఈవెంట్‌కు డుమ్మా.. ఎందుకంటే?
తను ఆస్పత్రిపాలైందని, అందుకే ఈవెంట్‌కు రాలేదని ప్రచారం జరుగుతోంది. దీనిపై కియారా టీమ్ క్లారిటీ ఇచ్చింది. తను బాగానే ఉందని తెలిపింది. నాన్‌స్టాప్‌గా పని చేస్తుండటం వల్ల కియారాను విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని, అందుకే తను ఈవెంట్‌కు హాజరవలేదని వివరణ ఇచ్చింది.
ఐదు పాటల కోసం..
ఇదిలా ఉంటే ఈ సమావేశంలో నిర్మాత దిల్‌రాజు ఆసక్తికర విషయం బయటపెట్టాడు. 'ఈ సినిమాలో ఐదు పాటల కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టాం. నానా హైరానా పాట కోసం న్యూజిలాండ్‌లో పదిరోజులు షూట్ చేశాం. రా మచ్చా రా పాట కోసం వైజాగ్, అమృత్‌సర్ వెళ్లాం. రిహార్సల్స్ అన్నీ కలిపితే రూ.75 కోట్ల కన్నా ఇంకా ఎక్కువే అవుతుంది' అని చెప్పుకొచ్చాడు.
వీరి కాంబినేషన్‌లో రెండో మూవీ
శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో అంజలి, ఎస్‌జే సూర్య ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ రెండు గంటల 45 నిమిషాల నిడివితో రానుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్- కియారా జంటగా నటిస్తున్న రెండో చిత్రమిది. ఇదిలా ఉంటే విజయవాడలో 256 అడుగులతో రామ్ చరణ్ కటౌట్ ఏర్పాటు చేశారు. దేశంలో అతి పెద్ద కటౌట్‌గా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్‌లో ఇది చోటు దక్కించుకుంది.
After #Prabhas #Yash Now #Ramcharan Entered SIMPLE and HUMBLE in NORTH Event [#GameChanger] 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/BgDeNDIf4k
— GetsCinema (@GetsCinema) January 4, 2025
చదవండి: గోవిందాను పెళ్లి చేసుకోవాల్సిందన్న హీరోయిన్.. నటుడి భార్య ఏమందంటే?
Comments
Please login to add a commentAdd a comment