బాలీవుడ్ సీనియర్ జంట గోవింద (Govinda)- సునీత అహూజ పెళ్లి చేసుకుని నాలుగు దశాబ్దాలవుతోంది. 40 ఏళ్ల కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అవన్నీ అధిగమించుకుని ఇప్పటికీ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. తాజాగా సునీత (Sunita Ahuja) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.
ఇప్పుడు కూడా తీసుకెళ్లమంటా
హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon) ఇప్పటికీ ఓ మాట అంటూ ఉంటుంది. గోవిందాను నాకంటే ముందే కలిసి ఉండాల్సిందని, అప్పుడు తనే పెళ్లి చేసుకునేదని చెప్తూ ఉంటుంది. అలా అన్నప్పుడల్లా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తనను తీసుకెళ్లిపో, అప్పుడు అతడి గురించి నీకు అర్థమవుతుందని సరదాగా బదులిస్తుంటాను అని చెప్పుకొచ్చింది.
డజను సినిమాల్లో
కాగా రవీనా- గోవింద.. దుల్జే రాజా, ఆంటీ నెం.1, బడే మియా చోటే మియా, సాండ్‌విచ్.. ఇలా దాదాపు డజను సినిమాల్లో కలిసి నటించారు. ఇటీవల అనుకోకుండా బుల్లెట్ తగిలి గోవింద గాయపడగా.. అప్పుడు రవీనా ఆస్పత్రికి వెళ్లి అతడిని పరామర్శించింది. గోవింద ప్రస్తుతం బాహె హాత్ కా ఖేల్, పింకీ డార్లింగ్, లెన్ డెన్: ఇట్స్ ఆల్ ఎబౌట్ బిజినెస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.
చదవండి: చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం
Comments
Please login to add a commentAdd a comment