Raveena Tandon
-
రవీనా టాండన్ కూతురు రాషా థడానీ బ్యూటిఫుల్ (ఫొటోలు)
-
'ఆంటీ అన్నా ఫర్వాలేదు'.. స్టార్ కూతురితో మిల్కీ బ్యూటీ!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి టాలీవుడ్ ప్రియులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన మెప్పించింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో మొదలైట్టిన తమన్నా పలు సూపర్ హిట్ చిత్రాలో నటించింది. హ్యాపీ డేస్, అల్లు అర్జున్ బద్రీనాథ్, 100% లవ్, ఊసరవెల్లి, బాహుబలి, ఎఫ్2, రచ్చ లాంటి సినిమాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. అయితే గతేడాది జైలర్, స్త్రీ-2 చిత్రాల్లో ప్రత్యేక సాంగ్స్‌లో మెరిసిన ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్లో బిజీగా ఉంది.తాజాగా బాలీవుడ్లో ఓ థియేటర్ వద్ద మెరిసింది. రవీనా టాండన్ ముద్దుల కూతురు రషా తడానీ నటించిన తొలి చిత్రం ఆజాద్ చూసేందుకు తన ప్రియుడు విజయ్ వర్మతో కలిసి థియేటర్‌కు వచ్చింది. ఈ సందర్భంగా రషా తడానీ, తమన్నా మధ్య ఆసక్తకర సంభాషణ చోటు చేసుకుంది. తనను ఆంటీ అని పిలవచ్చని రషా తడానీతో సరదాగా మాట్లాడింది తమన్నా. ఈ వీడియో కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.తమన్నా భాటియా- రషా తడానీ రిలేషన్..కాగా.. బాలీవుడ్ భామ రషా తడానీ (19), తమన్నా భాటియా (35) చాలా మంచి స్నేహితులు. గతంలో సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తమన్నాను గురించి చెప్పమని రషాను అడిగినప్పుడు తాను నాకు మరో అమ్మలాంటి వ్యక్తి అని చెప్పింది. తమన్నా, విజయ్ వర్మ తనను దత్తత తీసుకున్నారంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది. SHOCKINGLY #Tammana Says CALL ME AUNTY no issue #RashaTadani - Great Gesture From Tammu 😳😳😳😳😳pic.twitter.com/qJjC0iHLbh— GetsCinema (@GetsCinema) January 21, 2025 -
ఆ హీరోతో లిప్‌లాక్.. వాంతులు చేసుకున్న హీరోయిన్!
-
ష్... ఎగ్జామ్ ప్రిపరేషన్..!
సినీరంగంలో రాణించాలనే లక్ష్యం ఉన్నంత మాత్రాన అకాడమిక్ జర్నీని నిర్లక్ష్యం చేయనక్కర్లేదు. అయితే రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లడం అనేది పెద్ద కళ. ఆ కళలో రాషా ఆరితేరింది.ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ(Rasha Thadani) ‘ఆజాద్’(Azzad) సినిమాతో బాలీవుడ్లో ఆరంగేట్రం చేయనుంది. ‘ఆజాద్’ సెట్స్‌కు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్‌లో సినిమా సెట్స్‌లో మేకప్‌లో ఉన్న రాషా 12వ తరగతి ఎగ్జామ్స్‌కు ప్రిపేరవుతూ కనిపిస్తుంది. జాగ్రఫీ పరీక్ష కోసం శ్రద్ధగా ప్రిపేరవుతున్న రాషా వీడియోను చూసి నెటిజెనులు ప్రశంసలు కురిపించారు. ‘ఎంతైనా చదువు చదువే. సినిమాల్లోనే కాదు అకడమిక్‌గా కూడా రాషా విజయం సాధించాలి’ అని ఆశీర్వదించారు. (చదవండి: కలల మేఘంపై అనూజ..) -
వాంతులు చేసుకున్న హీరోయిన్!
ప్రస్తుతం చిత్రపరిశ్రమలో హీరోయిన్ని ఎక్కువగా గ్లామర్ పాత్రలకు పరిమితం చేస్తున్నారు. హీరోతో ఒకటి రెండు రొమాంటిక్ సీన్స్, మూడు నాలుగు పాటల్లో డ్యాన్స్.. అంతవరకే హీరోయిన్ పాత్రను తెరపై చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్ పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండేది. రొమాన్స్‌తో కాకుండా నటనతో మెప్పించేవాళ్లు. అలాంటి వాళ్లలో బాలీవుడ్ నటి రవీనా లాండన్ ఒకరు. 1991లో పత్తర్ కే ఫూల్ సినిమాతో వెండి తెరకు పరిచమైన ఈ బ్యూటీ..తనదైన నటనతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తన కెరీర్ మొత్తంలో ఇప్పటివరకు లిప్‌లాక్ సీన్ చేయలేదు. అంతేకాదు రొమాంటి సన్నివేశాలకు కూడా దూరంగా ఉండేది. కానీ అనుకోకుండా ఓ హీరో లిప్‌లాక్ ఇచ్చాడట. అతని చేసిన పనికి వాంతులు చేసుకోవడమే కాకుండా.. 100 సార్లు ముఖం కూడా కడుక్కుందట.అనుకోకుండా..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ లిప్‌లాక్ సంఘటన గురించి రవీనా చెప్పేకొచ్చింది. షూటింగ్లో భాగంగా ఓ హీరో పెదాలు..తన పెదాలను తాకాయట. దీంతో వెంటనే రవీనా వాష్‌రూమ్‌కి వెళ్లి వాంతులు చేసుకుందట. ‘నాకు బాగా గుర్తుంది. ఓ సినిమా షూటింగ్లో హీరో అనుకోకుండా నాకు లిప్‌లాక్ ఇచ్చాడు. హీరో నన్ను రఫ్‌గా హ్యాండిల్ చేయాల్సిన సీన్ అది. ఆ సీన్ షూటింగ్ సమయంలో హీరో పెదాలు నా పెదాలను టచ్ చేశాయి. అక్కడ కిస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అనుకోకుండా అలా జరిగిపోయింది. అది నేను తట్టుకోలేకపోయాను. వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్లి వాంతులు చేసుకున్నాడు. అలాగే దాదాపు 100 సార్లు నా ముఖాన్ని కడుక్కున్నాను. అనుకోకుండా జరిగినా..నేను దాన్ని తీసుకోలేకపోయాను. ఆ విషయంలో హీరో తప్పేం లేదు. నిజంగానే అనుకోకుండా అలా జరిగిపోయింది. వెంటనే హీరో నాకు సారీ కూడా చెప్పాడు’అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది.కూతురుకి మినహాయింపురవీనా టాండన్ తన కెరీర్ మొత్తంలో ఒక్క లిప్‌లాక్ సీన్ చేయలేదు. రొమాంటిక్, ముద్దు సన్నివేశాల్లో నటించకూడదని కెరీర్ ప్రారంభంలోనే కండీషన్ పెట్టుకుందట. అలాంటి పాత్రలు వస్తే.. సున్నితంగా తిరస్కరించేదట. తను పెట్టుకున్న కండీషన్ వల్ల చాలా పెద్ద సినిమాలను మిస్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో రవీనా టాండన్ చెప్పింది. అయితే తన కూతురు విషయం మాత్రం ఎలాంటి కండీషన్స్ పెట్టాలనుకోవట్లేదని రవీనా చెబుతోంది. రవీనా ముద్దుల తనయ రాషా తడానీ బాలీవుడ్ డెబ్యూకి రెడీ అవుతోంది. ఓ క్రేజీ ప్రాజెక్టుకు సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. అయితే రొమాంటిక్ సీన్ల విషయంలో ఎలాంటి కండీషన్ పెట్టట్లేదట. పాత్ర డిమాండ్ చేస్తే అలాంటి సీన్లు కూడా చేసేందుకు తనకు అభ్యంతరం లేదని రవీనా అంటోంది. రవీనా సినిమా విషయాలకొస్తే.. ఆ మధ్య కేజీఎఫ్2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ సీనియర్ హీరోయిన్..ప్రస్తుతం డైనస్టీ అనే వెబ్ షో చేస్తోంది. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
గోవిందాను పెళ్లి చేసుకోవాల్సిందన్న హీరోయిన్.. నటుడి భార్య రియాక్షన్ ఇదే!
బాలీవుడ్ సీనియర్ జంట గోవింద (Govinda)- సునీత అహూజ పెళ్లి చేసుకుని నాలుగు దశాబ్దాలవుతోంది. 40 ఏళ్ల కాలంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. అవన్నీ అధిగమించుకుని ఇప్పటికీ అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటున్నారు. తాజాగా సునీత (Sunita Ahuja) ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.ఇప్పుడు కూడా తీసుకెళ్లమంటాహీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon) ఇప్పటికీ ఓ మాట అంటూ ఉంటుంది. గోవిందాను నాకంటే ముందే కలిసి ఉండాల్సిందని, అప్పుడు తనే పెళ్లి చేసుకునేదని చెప్తూ ఉంటుంది. అలా అన్నప్పుడల్లా ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తనను తీసుకెళ్లిపో, అప్పుడు అతడి గురించి నీకు అర్థమవుతుందని సరదాగా బదులిస్తుంటాను అని చెప్పుకొచ్చింది.డజను సినిమాల్లోకాగా రవీనా- గోవింద.. దుల్జే రాజా, ఆంటీ నెం.1, బడే మియా చోటే మియా, సాండ్విచ్.. ఇలా దాదాపు డజను సినిమాల్లో కలిసి నటించారు. ఇటీవల అనుకోకుండా బుల్లెట్ తగిలి గోవింద గాయపడగా.. అప్పుడు రవీనా ఆస్పత్రికి వెళ్లి అతడిని పరామర్శించింది. గోవింద ప్రస్తుతం బాహె హాత్ కా ఖేల్, పింకీ డార్లింగ్, లెన్ డెన్: ఇట్స్ ఆల్ ఎబౌట్ బిజినెస్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.చదవండి: చిరంజీవితో ఫోటో దిగితే చాలనుకున్న 'దీప్తి'కి మెగా ప్రోత్సాహం -
కర్వా చౌత్ సెలబ్రేషన్స్ : ఈ సందడి అస్సలు మిస్ కావద్దు!
-
కార్వా చౌత్ వేడుకల్లో మెరిసిన బాలీవుడ్ సినీతారలు.. ఫోటోలు
-
భయంతోనే అలా చేయాల్సి వచ్చింది.. నన్ను క్షమించండి: రవీనా టాండన్
బాలీవుడ్ నటి రవీనా టాండన్ సోషల్‌మీడియా వేదికగా తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. తాజాగా రవీనా టాండన్ లండన్ వెళ్లారు. అక్కడ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను అభిమానులు చూశారు. దీంతో సెల్ఫీ తీసుకోవాలనే కోరికతో రవీనా వద్దకు వెళ్లారు. కానీ, అందుకు ఆమె నిరాకరించారు. ఈ క్రమంలో తన సెక్యూరిటీని పిలిచి అక్కడినుంచి వేగంగా వెళ్లిపోయారు. దీంతో నెటిజన్లు కూడా ఆమెపై మండిపడ్డారు. అయితే, ఈ సంఘటన గురించి రవీనా తన ఎక్స్ పేజీలో ఒక నోట్ రాసి పోస్ట్ చేశారు. 'అభిమానులు నా వద్దకు వచ్చినప్పుడు నేను భయాందోళనకు గురయ్యాను. అందుకు కారణం ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న నేరాలే. వారందరూ నా దగ్గరకు వచ్చినప్పుడు కాస్త భయపడ్డాను. దీంతో వారు ఎవరు..? ఎందుకొచ్చారో కూడా తెలుసుకోలేదు. ఆ సమయంలో నేను ఒంటిరిగానే ఉండటంతో వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయాను. కొన్ని నెలల క్రితం బాంద్రాలో జరిగిన సంఘటన తర్వాత నన్ను కొంత భయాందోళనకు గురి చేసింది. అందుకే నేను ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నాను. కారు ఎక్కిన కొంత సమయం తర్వతా వారికి ఫొటో ఇవ్వాలని నా మనసుకు అనిపించింది. కానీ ధైర్యం చేసి వెళ్లలేకపోయాను. వారితో అలా ప్రవర్తించి చాలా పెద్ద తప్పు చేశాను. ఇదీ చదవండి: హీరోయిన్ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్ఇప్పటికీ దాని గురించి బాధపడుతున్నా. వారికి సెల్ఫీ ఇవ్వనని చెప్పినందుకు క్షమించమని కోరుతున్నాను. నా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. భవిష్యత్తులో మిమ్మల్ని మళ్లీ కలసే అవకాశం వస్తుందని కోరుకుంటున్నా.. అప్పుడు మీతో ఫొటోలు తప్పకుండా దిగుతా. ఈ పోస్ట్ మీకు చేరుతుందని ఆశిస్తున్నా.' అంటూ రవీనా వివరణ ఇచ్చారు. దీంతో ఆమెపై సోషల్‌మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలా బహిరంగంగా క్షమాపణలు కోరడం చాలా మంచి విషయం అంటూ నెటిజన్లు చెబుతున్నారు. రవీనా ఎప్పటికీ సురక్షితంగా ఉండాలని అభిమానులు తమ మద్ధతు తెలుపుతున్నారు.ఈ ఏడాది జూన్‌లో రవీనా టాండన్, ఆమె డ్రైవర్‌పై బాంద్రాలో దాడి జరిగింది. ఆ సమయంలో మాపై దాడి చేయకండి అంటూ ఆమె చేసిన అరుపులు నెట్టింట వైరల్ అయ్యాయి. రవీనా, ఆమె డ్రైవర్ మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ పాల్పడ్డారని వారిపై ఫిర్యాదు నమోదు అయినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే, ముంబై పోలీసులు అది తప్పుడు కేసు అని క్లారిటీ ఇచ్చారు. ఆ సమయంలో రవీనా మద్యం తీసుకోలేదని చెప్పారు. ఈ సంఘటన తర్వాత ఒంటరిగా వెళ్లాలంటే ఆమె ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.Hi , this is just to put on record . That a few days ago in london , I was walking by and a few men approached me , I anyway have heard not such great things about the crime situation here, so I withdrew a bit when they asked if I was who I am, and my first instinct was to say no…— Raveena Tandon (@TandonRaveena) September 13, 2024 -
ఈ బ్యూటీకి 50 ఏళ్లంటే నమ్ముతారా! తెలుగులోనూ నటించింది (ఫొటోలు)
-
ఆ వీడియోపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసిన హీరోయిన్
బాలీవుడ్ నటి రవీనా టాండన్ , ఆమె డ్రైవర్‌పై కొందరు దాడి చేశారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక స్వతంత్ర జర్నలిస్ట్ మొహ్సిన్ షేక్ అనే వ్యక్తికి పరువు నష్టం నోటీసులు పంపారు. ఇదే విషయాన్ని రవీనా తరపు న్యాయవాది సనా రయీస్ ఖాన్ తెలియజేశారు. ఇటీవల, రవీనాను తప్పుడు ఫిర్యాదుతో ఇరికించే ప్రయత్నం జరిగిందని ఆమె తెలిపింది.కొద్దిరోజుల క్రితం రవీనా టాండన్‌కు సంబంధించిన వీడియో అంటూ షోషల్ మీడియాలో జర్నలిస్ట్ పేరుతో మొహ్సిన్ షేక్ షేర్ చేశారు. ఆ వీడియోలో తమపై దాడి చేయకండి అంటూ ఒకరు విజ్ఞప్తి చేస్తున్నట్లుగా ఉంది. అందులో ఉన్నది రవీనా టాండన్ అని ఆయన పేర్కొనడంతో ఆ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. మద్యం సేవించి డ్రైవర్‌తో పాటు ఆమె ప్రయాణిస్తుందని చెప్పాడు. ర్యాష్ డ్రైవింగ్‌కు వారు పాల్పడటం వల్ల ఆ సమయంలో ముగ్గురు గాయాపడ్డారని, దీంతో వారి బంధువులు వచ్చి రవీనా టాండన్‌పై దాడి చేశారని తెలిపాడు. ఆ సమయంలో తమపై దాడి చేయకండి అంటూ ఆమె వేడుకున్నట్లు వీడియోలో ఉందని తెలిపాడు. దీనిపై ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు.అది తప్పుడు సమాచారం అని, రవీనా టాండన్ మద్యం తాగలేదని పోలీసులు వెల్లడించారు. ఫిర్యాదుదారు తప్పుడు కేసు పెట్టారని వారు తెలిపారు. రవీనా కారును పార్క్ చేసేందుకు డ్రైవర్ రివర్స్ చేస్తున్న సమయంలో ఓ కుటుంబం నడుచుకుంటూ వెళ్తోంది. కారు వారి దగ్గరకు వెళ్లడంతో డ్రైవర్‌తో వారు గొడవ పెట్టుకున్నారు. అది కాస్త పెద్దగా మారడంతో నటి అక్కడకు చేరకున్నారు. స్థానికుల నుంచి డ్రైవర్‌ను రక్షించే ప్రయత్నంలో రవీనా కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో ఆమెపై కూడా వారు గొడవ పడ్డారు. ఆపై వారు పోలీస్ స్టేషన్‌కు వచ్చి పిర్యాదు చేశారు. కానీ దీనిని సోషల్ మీడియాలో రవీనాను కొట్టారని, మద్యం సేవించి కారు నడిపారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అంతా సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయిందని చెప్పారు.రవీనా, ఆమె డ్రైవర్ మద్యం సేవించలేదని వారిపై తప్పుడు ఆరోపణలు చేశారని ముంబై పోలీసులు తెలిపారు. పోలీసులు విడుదల చేసిన స్టేట్మెంట్ ఆధారంగా తనపై తప్పుడు ప్రచారం చేసిన స్వతంత్ర జర్నలిస్ట్‌కు రూ. 100 కోట్లకు పరువు నష్టం నోటీసులు పంపారు. న్యాయవాది సనా ఖాన్ ద్వారా అతనికి నోటీసులు చేరవేశారు. On Saturday (1st June) night, a frenzied mob attacked Bollywood actress Raveena Tandon and her driver after claiming that her car severely hit and injured a burqa-clad woman.The incident took place outside the residence of the actress in the Bandra suburb of Mumbai. #Raveena pic.twitter.com/DjnU1pgz44— SMaRT (@SMaRT4Bharat) June 3, 2024 -
ప్లీజ్.. నన్ను కొట్టొద్దు.. వేడుకున్న రవీనా టండన్
గతేడాది కేజీఎఫ్-2లో అలరించిన స్టార్ నటి రవీనా టాండన్. ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. చివరిసారిగా పట్నా శుక్లా అనే చిత్రంలో లాయర్‌గా కనిపించింది. ప్రస్తుతం రవీనా గుడ్ చాడి, వెల్కమ్ బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే తాజాగా ఈ బాలీవుడ్ నటి వివాదంలో చిక్కుకుంది. తన కారు డ్రైవర్ చేసిన పనికి రవీనాపై దాడికి యత్నించారు. దీంతో తనను కొట్టవద్దంటూ వారిని వేడుకున్నారామె. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. ముంబయిలో రవీనా టాండన్, తన డ్రైవర్లో కలిసి వెళ్తుండగా రోడ్డుపై వెళ్లున్న కొందరిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న వారిలో ఒక్కరు గాయపడ్డారు. దీంతో వారి కుటుంబసభ్యులంతా కలిసి డ్రైవర్‌పై గొడవకు దిగారు. అ తర్వాత రవీనా టాండన్ కారు దిగి గాయపడిన వారిపై వాగ్వావాదానికి దిగింది. దీంతో వారంతా ఒక్కసారిగా రవీనా టాండన్‌పైకి దూసుకొచ్చారు. దీంతో ఆమె దయచేసి నన్ను కొట్టవద్దని వారిని వేడుకుంది. వీడియోలను రికార్డ్ చేయవద్దని అక్కడున్న వారిని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట విస్తృతంగా వైరలవుతోంది.అయితే మరోవైపు గాయపడిన కుటుంబసభ్యులు రవీనా టాండన్ తమపై దాడి చేసిందని ఆరోపిస్తున్నారు. తమపై అన్యాయంగా దాడి చేసిందని అన్నారు. పోలీసులు కూడా మాకు న్యాయం చేయలేదని..రవీనా టాండన్ మా అమ్మను కొట్టారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. మా అమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయని బాధితుడు పేర్కొన్నారు. చివరికీ ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. Actress Raveena Tandon's driver accused of rash driving & crashing into 3 women in Bandra, Mumbai. Injured's family claim Raveena in an inebriated state got off the car along with her driver & further assaulted the victims on the road. Crowds turned aggressive leading to heated… pic.twitter.com/PdbgLMueFz— Nabila Jamal (@nabilajamal_) June 2, 2024What's this #RaveenaTondon aunty!? pic.twitter.com/qA1IWAB1qf— 𝙍𝙎𝙆 (@RSKTheMonsters) June 2, 2024 -
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ, సీనియర్ నటి రవీనా టాండన్ ఆధ్యాత్మిక బాటపట్టారు. తాజాగా తన కుమార్తె రషా తడానితో కలిసి పూణెలోని భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రవీనా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతకుముందే మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ శివాలయాన్ని రవీనా సందర్శించారు.సినిమాల విషయానికొస్తే రవీనా టాండన్ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న 'పట్నా శుక్లాలో నటించారు. ఈ చిత్రంలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్ కలిసి నటించారు. అర్బాజ్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ బుడకోటి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రవీనా 'వెల్కమ్ -3' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సీ, దిశా పటానీ, లారా దత్తా, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
హీరోలకు ఎక్కువే ఇస్తారు.. మేము 15 సినిమాలు చేస్తేకానీ!
స్టార్ హీరోయిన్ రవీనా టండన్ ఇప్పుడు సినిమాల జోరు పెంచింది. గతేడాది 'వన్ ఫ్రైడే నైట్' అనే ఒకే ఒక్క సినిమాతో అభిమానులను పలకరించిన ఈ నటి ఈ ఏడాది 'పట్న శుక్లా' మూవీతో ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'వెల్కమ్ టు ద జంగిల్', 'ఘుడ్చడి' సినిమాలున్నాయి. తాజాగా ఆమె సినీ ఇండస్ట్రీలో ఎంతోకాలంగా కొనసాగుతున్న పారితోషికాల వ్యత్యాసాలపై స్పందించింది. వాళ్లకే ఎక్కువ 'ఆ రోజుల్లో డబ్బు చాలా తక్కువ ఇచ్చేవారు. పైగా హీరో, హీరోయిన్‌కు ఇచ్చే రెమ్యునరేషన్లో ఎంతో తేడా ఉండేది. మగవారికి ఎప్పుడూ ఎక్కువే ఇచ్చేవారు. ఎంతలా అంటే.. వారు ఒక్క సినిమాతో సంపాదించేది.. మేము పదిహేను సినిమాలు చేస్తేకానీ వచ్చేది కాదు. అందరి గురించి నేను మాట్లాడటం లేదు.. నా విషయంలో అయితే అదే జరిగింది. నేను 15-20 సినిమాల ద్వారా సంపాదించే డబ్బు.. నా సహనటుడికి ఒక్క చిత్రంతోనే వచ్చేది. ఇప్పుడు కార్పొరేట్ల రాకతో పరిస్థితులు కాస్తంత మెరుగయ్యాయి' అని చెప్పుకొచ్చింది. చదవండి: ఓటీటీకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్! -
త్రయంబకేశ్వర్ శివాలయం లో రవీనా టాండన్, కూతురు రాషా తడాని (ఫొటోలు)
-
అలాంటి వార్తలతో నా కెరియర్ నాశనమైంది: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్, అక్షయ్ కుమార్.. ఒకరంటే ఒకరికి ఇష్టం. ‘మొహ్రా’ సినిమా సెట్స్‌లో. రవీనా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్నెస్కి ఫిదా అయ్యాడు అక్షయ్. ఉరకలేసే అతని ఉత్సాహానికి మనసిచ్చేసింది రవీనా. ఆ ప్రేమను రహస్యంగా ఉంచలేదు ఆ జంట.‘ఇద్దరూ పంజాబీలే. ఈడుజోడూ బాగుంది’ అని వాళ్లను చూసి ముచ్చట పడింది బాలీవుడ్ ఇండస్ట్రీ. అందురూ అనుకుంటున్న విధంగానే వారు పెళ్లి వార్త చెప్పారు. కానీ పెళ్లి తర్వాత రవీనా సినిమాలు చేయకూడదనే కండీషన్ పెట్టాడు అక్షయ్.. ఎందుకంటే.. తనను గృహిణిగానే ఉండాలని కోరుకున్నాడు అక్షయ్. కొన్నిరోజుల తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ తర్వాత అక్షయ్ మీద పలు వదంతులు వచ్చాయి. అతను మరో హీరోయిన్‌కు దగ్గరగా ఉంటున్నాడని ఆమెకు తెలిసింది. అక్షయ్ కోరిక మేరకు అప్పటికే రవీనా సినిమాలు ఆపేసింది. అలాంటి సమయంలో అక్షయ్‌పై రూమర్స్ రావడంతో బ్రేకప్ చేప్పేసి మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించింది. ఆత్మహత్య అంటూ తప్పుడు కథనాలు తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు డిజిటల్ యుగంలో ఎక్కువయ్యాయని రవీనా తెలిపింది. ఇటీవలి ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 90వ దశకంలో ఒక పత్రిక తన అనారోగ్యాన్ని ఆత్మహత్యాయత్నంగా తప్పుగా నివేదించిందని రవీనా టాండన్ పేర్కొంది. చిత్ర పరిశ్రమలో తన ప్రతిష్టను దిగజార్చడంతో ఒక బాధాకరమైన అనుభవాన్ని కలిగించిందని తెలిపింది. 'అక్షయ్‌తో బ్రేకప్ జరగడం వల్లే నేను ఆత్మహత్యకు ప్రయత్నించానని పరోక్షంగా తప్పుడు కథనాలు రాసింది. ఆ సమయంలో నాకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. దీంతో సుమారు 20 రోజులపాటు ఆస్పత్రిలో ఉండి చికిత్స తీసుకున్నాను. ఓ రకంగా ఆ వార్తలతో నా సినిమా కెరియర్ కూడా దెబ్బతినింది. నేను ఆత్మహత్య చేసుకునే రకం కాదు.. జీవితంలో పోరాడే రకం.' అని ఆమె చెప్పింది. ఇతరులపై గర్ల్‌ఫ్రెండ్‌ని ప్రయోగిస్తారు '1990లలో నటీనటుల మధ్య పోటీ చాలా ఎక్కువగానే ఉండేది. కానీ సెట్లో హీరోహీరోయిన్ల నటన, అఫైర్లు, వివాదాల గురించి చెప్పుకుంటూ సరదాగ అందరం మాట్లాడుకునే వాళ్లం. కానీ కొన్నిసార్లు ఇది శృతి మించి పోయే సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరైతే తమ కెరీర్ పట్ల అభద్రతా భావంతో ఉంటారో వారందరూ కూడా ఇతరుల విజయాన్ని ఓర్వలేకపోయేవాళ్లు. అలాంటి వారిలో కొందరు ఇతర నటీమణులను కిందికి లాగాలని ప్రయత్నించేవారు. అందుకోసం వాళ్ల బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ని ఇతరులపై ప్రయోగించేవాళ్లు. ఇలాంటి పరిస్థితి నేను కూడా ఎదుర్కొన్నాను. అలాంటి వారి వల్ల పలు ఇబ్బందులు కూడా పడ్డాను. అయితే నాకు తెలిసి ఉద్దేశపూర్వకంగా ఎవరి అవకాశాలను నిలువరించలేదు. ఎవరి మనసూ గాయపరచలేదు. ఎవరినీ సినిమాలోంచి తీసేయించాలని ప్రయత్నించలేదు. నాకు తెలియకుండా అలా జరిగి ఉంటే క్షమాపణ చెప్పడానికి ఇప్పటికీ నేను రెడీ’ అని చెప్పారు. నా ఎఫైర్స్ గురించి పిల్లలకు చెప్పాను 2004లో బిజినెస్మెన్ అనిల్ తడానీని పెళ్లి చేసుకుంది. వీరికి రాశా, రణ్‌బీర్ వర్దన్ సంతానం. పెళ్లికి ముందే 1995లో ఇద్దరు చిన్నారుల(పూజ, ఛాయ)ను దత్తత తీసుకుని వారికి తల్లయింది రవీనా. అయితే తన పిల్లల దగ్గర గతంలోని ప్రేమకథలతో సహా ఏదీ దాచనంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా ఎఫైర్స్ గురించి పేపర్లో కథలు కథలుగా రాస్తారు. అలాంటప్పుడు నేను తప్పించుకోలేను. అది చూసి నా పిల్లలు కంగారుపడొద్దు. అందుకే పత్రికలవారికంటే ముందే నేనే అన్ని నిజాలు పిల్లలకు చెప్పేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పకుండా దాస్తే ఆ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా ఎలాగోలా తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితులు దారుణంగా మారుతాయి. -
అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. పెళ్లి తర్వాత రకుల్ లుక్స్ వైరల్!
గౌనులో చిన్నపిల్లలా మారిపోయిన రవీనా టాండన్ అమెజాన్ ఈవెంట్లో మెరిసిన సమంత.. కళ్లతోనే మాయ చేస్తోన్న శ్రియా శరణ్.. గ్రీన్ డ్రెస్‌లో లైగర్ భామ అనన్య పాండే అలాంటి పోజులు.. బ్లాక్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్... View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Arun Prasath (@arunprasath_photography) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
అలాంటి అవుట్‌ఫిట్‌లో దేవర భామ.. వాలెంటైన్ డే వైబ్‌లో ఊర్వశి రౌతేలా!
రెడ్ డ్రెస్‌లో మత్తెక్కిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్.. వాలెంటైన్ ప్రపోజ్ డే మూడ్‌లో ఊర్వశి రౌతేలా.. యోగాసనాలతో మైమరిపిస్తోన్న శ్రద్ధాదాస్.. గ్రీన్ డ్రెస్‌లో రవీనా టాండన్ హోయలు.. హాట్ ట్రీట్ ఇస్తోన్న బాలీవుడ్ భామ నిక్కి తంబోలి.. రెడ్ డ్రెస్‌లో రీతూ చౌదరి పోజులు.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
Raveena Tandon: కూతురితో కలిసి సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్న కేజీఎఫ్ 2 నటి (ఫోటోలు)
-
సలార్ నటి స్టన్నింగ్ వర్కవుట్స్.. బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
►స్టన్నింగ్ లుక్‌లో యంగ్ బ్యూటీ దివి పోజులు ►వయసు పెరిగినా గ్లామర్‌లో తగ్గేదేలే అంటోన్న రవీనా టాండన్ ►కలర్‌పుల్ డ్రెస్‌లో మెరిసిపోతున్న తేజస్వి ప్రకాశ్ ►సలార్ రాధారమ శ్రీరెడ్డి స్టన్నింగ్ వర్కవుట్స్ ►రెడ్ డ్రెస్‌లో సన్ని లియోన్ హోయలు ►స్మైలీ లుక్స్‌తో మతి పోగోడుతున్న పాలక్ తివారి ►బీచ్‌లో ఫుల్‌గా చిల్ అవుతోన్న కంచె భామ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
టిపు టిపు బర్సా పానీ వానై కురిసింది మనీ
దేశాలకు సరిహద్దులు ఉండవచ్చుగానీ పాటలకు ఉండవు. ఒక పాట సూపర్ డూపర్ హిట్ అయితే అది ఏ దేశం పాట అయినా ‘ఇది మన పాటే’ అన్నట్లుగా జనాలు ఇష్టపడతారు. దీనికి తాజా ఉదాహరణ ఈ వీడియో. అప్పుడెప్పుడో వచ్చిన అక్షయ్ కుమార్, రవీనా టాండన్ సినిమా ‘మోహ్రా’లోని ‘టిపు టిపు బర్సా పానీ’ పాట ఎంత హిట్టో తెలిసిందే. ఇప్పటికీ ఫంక్షన్లలో, పెళ్లి ఊరేగింపులలో ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ సూపర్ హిట్ సాంగ్‌ను పాకిస్థాన్‌లోని ఒక బృందం డోలక్ వాయిస్తూ పాడుతున్న వీడియో వైరల్ అయింది. పాట పాడుతున్నంతసేపు కాసుల వర్షం కురుస్తూనే ఉంది! -
Rasha Thadani: 18 ఏళ్లకే గ్లామర్ షోతో చెమటలు పుట్టిస్తున్న స్టార్ హీరోయిన్ రవీనా టండన్ కూతురు (ఫోటోలు)
-
నా ఎఫైర్స్ గురించి పిల్లలకు చెప్పేశా.. ఎందుకంటే?: రవీనా టండన్
లవ్ బ్రేకప్.. ఇప్పుడిది చాలా కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో అయితే ఒకటీరెండు కాదు లెక్కలేనన్ని బ్రేకప్‌లు ఉన్నాయి. చాలామంది సెలబ్రిటీలు ఎన్నో బ్రేకప్‌లు చూసి వచ్చినవాళ్లే! అయితే ప్రేమ విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడేందుకు అందరూ ఇష్టపడరు. కానీ తను మాత్రం తన ఎఫైర్స్‌ను సైతం పిల్లలతో షేర్ చేసుకుంటానంటోంది హీరోయిన్ రవీనా టండన్. పెళ్లికి ముందే డేటింగ్, బ్రేకప్ 90'sలో టాప్ హీరోయిన్గా వెలుగొందిన రవీనా టండన్.. అక్షయ్ కుమార్‌ను ప్రేమించింది. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. వీరిద్దరూ మొహ్రా సినిమాలో కలిసి నటించారు. ఆన్‌స్క్రీన్‌పై జోడీ కట్టిన వీరు రియల్ లైఫ్‌లోనూ పెళ్లి పీటలెక్కనున్నట్లు ప్రకటించారు. నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కానీ అంతలోనే బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత ఇద్దరూ చెరొకరిని చూసుకుని మళ్లీ డేటింగ్ రూట్లో నడిచారు. అన్నీ చెప్పేస్తా, లేదంటే.. కట్ చేస్తే తన ప్రేమకహానీలకు ఫుల్స్టాప్ పెడుతూ 2004లో బిజినెస్మెన్ అనిల్ తడానీని పెళ్లి చేసుకుంది. వీరికి రాశా, రణ్‌బీర్ వర్దన్ సంతానం. పెళ్లికి ముందే 1995లో ఇద్దరు చిన్నారుల(పూజ, ఛాయ)ను దత్తత తీసుకుని వారికి తల్లయింది రవీనా. అయితే తన పిల్లల దగ్గర గతంలోని ప్రేమకథలతో సహా ఏదీ దాచనంటోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా ఎఫైర్స్ గురించి పేపర్లో కథలు కథలుగా రాస్తారు. అలాంటప్పుడు నేను తప్పించుకోలేను. అది చూసి నా పిల్లలు కంగారుపడొద్దు. అందుకే పత్రికలవారికంటే ముందే నేనే అన్ని నిజాలు పిల్లలకు చెప్పేస్తూ ఉంటాను. ఒకవేళ నేను చెప్పకుండా దాస్తే ఆ విషయం ఈరోజు కాకపోయినా రేపైనా ఎలాగోలా తెలిసిపోతుంది. అప్పుడు పరిస్థితులు దారుణంగా మారుతాయి. చెత్తగా రాశారు 90'sలో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. నా గురించి చెత్తగా రాశారు. బాడీ షేమింగ్ చేశారు. ఇష్టమొచ్చిన పేర్లు పెట్టేవారు. నిజానిజాలు కూడా తెలుసుకోకుండా ఏది పడితే అది రాసేవారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక కనీసం మా వర్షన్ చెప్పుకోవడానికైనా వీలవుతోంది' అని చెప్పుకొచ్చింది హీరోయిన్. రవీనా టండన్ ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. చదవండి: ఏడేళ్లుగా సినిమాలకు దూరమైన హీరోయిన్.. ఈరోజే బిగ్‌బాస్ షోలో ఎంట్రీ? -
అనుకోకుండా కిస్.. వాంతి చేసుకున్న 'కేజీఎఫ్' బ్యూటీ
ఇప్పుడు ఏ భాషలో సినిమా తీసుకున్నా ముద్దు అనేది చాలా కామన్ అయిపోయింది. ప్రేక్షకులకు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే స్క్రీన్‌పై అది చూడటానికి బాగానే ఉన్నా.. దాని వెనక కష్టాలు పెద్దగా ఎవరికీ తెలియవు. అయితే గతంలో తనకు ముద్దు వల్ల జరిగిన చేదు అనుభవాన్ని 'కేజీఎఫ్' ఫేమ్ రవీనా టాండన్ బయటపెట్టింది. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 37 సినిమాలు) ఏం జరిగింది? 1991 నుంచి ఇండస్ట్రీలో ఉన్న రవీనా టాండన్.. హిందీతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ హీరోయిన్గా చేసింది. టాలీవుడ్ వరకు వస్తే బంగారు బుల్లోడు, ఆకాశవీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల్లో నటించింది. 'కేజీఎఫ్ 2'లో రమికా సేన్ పాత్ర చేసి చాలా క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే 'నో కిస్సింగ్ రూల్' పాటించే ఈమెకు కెరీర్ ప్రారంభంలో అనుకోకుండా సహనటుడి పెదాల్ని తన పెదాలతో. దీంతో ఈమెకు వాంతి అయిందట. రవీనా కామెంట్స్ 'ఎప్పుడూ ముద్దు సీన్స్‌లో నటించలేదు. ఎందుకో వాటిలో యాక్ట్ చేస్తే నాకు అసౌకర్యంగా ఉంటుంది. అందుకే నటించను. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో జరిగిన సంఘటన ఇప్పటికీ గుర్తుంది. ఓ సీన్ చేస్తున్నప్పుడు సహనటుడి పెదాలు పొరపాటున నా పెదాలకు తగిలాయి. అది అతడు కావాలని చేయలేదు. కానీ చిరాగ్గా అనిపించింది. వెంటనే గదిలోకి వెళ్లిపోయా. ఎంతో వికారంగా అనిపించింది. వాంతి చేసుకున్నా. నోటిని వందసార్లు కడుక్కుంటే బాగుండనిపించింది' అని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. అయితే అది ఏ సినిమా, నటుడెవరు తదితర విషయాలు మాత్రం బయటపెట్టలేదు. (ఇదీ చదవండి: Skanda Movie Review: ‘స్కంద’ మూవీ రివ్యూ) -
మీరు చూసే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో బాధలు ఉంటాయ్: టాప్ హీరోయిన్
ఒకప్పుడు దేశాన్ని ఓ ఊపు ఊపిన వాన పాట ‘టిప్ టిప్ బర్సా పానీ’. 1994లో విడుదలైన 'మోహ్రా' చిత్రం కోసం అక్షయ్ కుమార్‌తో కలిసి రవీనా టాండన్ దుమ్ములేపారు. ఈ ఐకానిక్ పాట చిత్రీకరించడం గురించి ఆమె తాజాగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. (ఇదీ చదవండి: రాఘవేంద్ర రావు చెంప చెళ్లుమనేలా కౌంటర్లు ఇస్తున్న నెటిజన్లు) నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేయడంతో చాలా ఇబ్బంది పడినట్లు రవీనా చెప్పుకొచ్చింది. అక్కడ చుట్టూ ఇనుప చువ్వలతో పాటు అపరిశుభ్రంగా ఉంది. దీంతో పాట చిత్రీకరణలో తాను ఎంతో ఇబ్బంది పడినట్లు రవీనా తెలిపింది. అంతేకాకుండా చెప్పులేకుండా చీర ధరించి వర్షంలో అలాంటి మూమెంట్స్ చేయడం చాలా కష్టమనిపించినట్లు చెప్పింది. షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. అప్పుడు ఆ బాధను భరిచలేకపోయానని తెలిపింది. దీంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లి టీటీ ఇంజెక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. (ఇదీ చదవండి: భక్త కన్నప్పలో ప్రభాస్.. అదిరిపోయే అప్డేట్) ఆ పాట దెబ్బతో సుమారు మూడు రోజులకు పైగానే అనారోగ్యానికి గురికావడం జరిగిందని గుర్తుచేసుకుంది. తెరపై ప్రేక్షకులు చూసే గ్లామర్... తెరవెనుక చెప్పలేనన్ని కథలను దాచిపెడుతుంది. రిహార్సల్స్ సమయంలో గాయాలు మామూలే, అయినా తామందరం వాటిని సహిస్తామని తెలిపింది. పాట చిత్రీకరణ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడినా అదీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో ఆ బాధలన్నీ మరిచిపోయామని రవీనా టాండన్ చెప్పింది. ఇదే పాటను 2021లో విడుదలైన ‘సూర్యవంశీ’ సినిమాలో కూడా రీమేక్ చేశారు. అందులో అక్షయ్‌కుమార్ - కత్రినాకైఫ్ నటించారు. -
ఇద్దరు మిత్రులు
బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రషా తందానీ భావుకురాలు. ప్రకృతి ప్రేమికురాలు. పద్దెనిమిది సంవత్సరాల రషా మంచి ఫొటోగ్రాఫర్ కూడా. తల్లితో పాటు ప్రపంచంలోని ఎన్నోప్రాంంతాలను చూసి వచ్చింది రషా. తాజాగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ΄ోస్ట్ చేసింది. ‘హూ ఎల్స్ టు ట్రావెల్ ద వరల్డ్ విత్?’ కాప్షన్‌తో తల్లితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ‘తల్లీకూతుళ్లు క్లోజ్ఫ్రెండ్స్లా కనిపిస్తున్నారు’ అన్నారు ఒక నెటిజన్. -
శారీ లుక్‌లో గాబ్రియెల్లా.. ఫుల్‌గా చిల్ అవుతోన్న ఆషిక రంగనాథ్!
►ఫ్లైట్‌లో బాలీవుడ్ భామ రవీనాటాండన్ ఫోజులు! ►దయా లుక్‌లో యాంకర్ విష్ణుప్రియ! ►చిల్ అవుతున్న పోజులిస్తున్న ఆషిక రంగనాథ్! ►సంప్రదాయ శారీ లుక్‌లో గాబ్రియెల్లా! ►వైట్ డ్రెస్‌లో యషిక ఆనంద్ హాట్ లుక్స్! View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Gabriella (@gabriellacharlton_) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి
కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఒక యువతి తన ప్రియుడికి ప్రపోజ్ చేసింది. దానిని వారి యూట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆలయ సిబ్బంది పోలీసులను కోరారు. దీంతో ఉత్తరాఖండ్ పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అదే సమయంలో, ఈ జంటకు సినిమా కారిడార్ నుంచి మద్దతు లభించింది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఈ జంటకు తన మద్దతును అందించింది. (ఇదీ చదవండి: మహేష్ డాటర్ సితారకు ఇంత ఫేమ్ రావడానికి కారణం ఎవరో తెలుసా?) తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ జంట ఫోటోతో పాటు ఇలా తెలిపారు. భక్తుడికి పవిత్రమైన ప్రదేశం దేవాలయం కాబట్టి వారి ప్రేమకు దేవుడి ఆశీర్వాదం కోరుకున్నారని రవీనా తెలిపింది. అంతేకాకుండా ప్రేమకు దేవుడు ఎప్పుడు వ్యతిరేకంగా మారాడో చెప్పాలని ప్రశ్నించింది. బహుశా అందరి మాదిరి పాశ్చాత్య మార్గంలో గులాబీలు, కొవ్వొత్తులు, చాక్లెట్, రింగులు ఇచ్చి తమ ప్రేమను తెలపడమే మంచిదని భావిస్తున్నారా? అని పేర్కొంది. నిజంగా ఇది బాధాకరం. తమ ప్రేమ సఫలం కావడానికి దేవుడి ఆశీస్సులు కావాలని కోరుకున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో చెప్పాలని రవీనా కోరింది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్-కె' నుంచి బిగ్ అనౌన్స్మెంట్..!) ఇటీవల కేదార్నాథ్ ఆలయం సమీపంలో తన ప్రియుడితో కలిసి కనిపించిన మహిళా యూట్యూబర్ ఈ వీడియోను చిత్రీకరించింది. ఆమె మోకాళ్లపై నిల్చోని తన ప్రియుడికి ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఈ వీడియో కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, కొందరు వ్యక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పరమ శివుడి ముందే పరాచకాలా అంటూ పలువురు ఈ జంటపై మండిపడుతున్నారు. ఇక నుంచి ఆలయ ప్రాంగణంలో మొబైల్ బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో, బద్రీ-కేదార్నాథ్ ఆలయ కమిటీ కూడా ఈ వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేసింది. మరీ పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
వెండితెర బంగారం.. రవీనా టాండన్
రవీనా టాండన్ సుపరిచిత నటి. అయితే చాలామందికి ఆమెలో తెలియని కోణం సామాజిక స్పృహ. స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించిన కార్యక్రమాల్లో రవీనా టాండన్ చురుగ్గా పాల్గొంటుంది. జీ–20కి సంబంధించిన ఉమెన్స్ ఎంపర్మెంట్ వింగ్–డబ్ల్యూ20 డెలిగేట్‌గా రవీనాకు సామాజిక స్వరాన్ని మరోసారి వినిపించే అవకాశం లభించింది. డైరెక్టర్ రవీ టాండన్ కుమార్తెగా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన రవీనా టాండన్ భిన్నమైన పాత్రలు చేసి తనను తాను నిరూపించుకుంది. నటిగా జాతీయ అవార్డ్‌తోపాటు ఎన్నో అవార్డ్లు అందుకుంది.‘కాలం కంటే కాస్త ముందుగా ఆలోచించే వ్యక్తి’గా గుర్తింపు సంపాదించింది. తన కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు 21 సంవత్సరాల వయసులో ‘సింగిల్ మదర్’గా పదకొండు సంవత్సరాల పూజా, ఎనిమిది సంవత్సరాల చయ్యలను దత్తత తీసుకుంది. సింగిల్ మదర్‌గా పిల్లలను దత్తత తీసుకోవడం ఆ తరువాత ట్రెండ్‌గా మారింది. మహారాష్ట్రలోని వసై నగరంలో కొందరి దుర్మార్గం వల్ల 30 మంది అమ్మాయిలు నిరాశ్రయులయ్యారు. అందరూ ‘అయ్యో!’ అనే సానుభూతికే పరిమితమైన ఆ కాలంలో రవీనా వారికి అండగా నిలబడింది. తన ఇంట్లోనే 30 మందికి ఆశ్రయం కల్పించింది. ఆ తరువాత వసైలో సొంత ఖర్చులతో అనాథాశ్రమం కట్టించి అందులో వారికి ఆశ్రయం ఇచ్చింది. ఇక అప్పటి నుంచి సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూనే ఉంది. సినిమాల్లో తన నటన కంటే 30 మంది అమ్మాయిలకు ఆశ్రయం కల్పించిన విషయం గురించే రవీనాతో చాలామంది మాట్లాడుతుంటారు. ఆ సందర్భం నుంచి తాము ఎలా స్ఫూర్తి పొందిందీ చెబుతుంటారు. మంచి పనికి లభించే గుర్తింపు అది! స్త్రీల హక్కులు, చైతన్యం, సాధికారతకు సంబంధించి యూనిసెఫ్‌తో... క్రై, వైట్ రిబ్బన్ (సేఫ్ మదర్‌హుడ్), స్మైల్ ఫౌండేషన్... మొదలైన స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తోంది రవీనా. ‘పెటా’తో పాటు హైజీన్ ఆఫ్ యంగ్‌గర్ల్స్, మిషన్ సాహసి (ఆత్మరక్షణ)... మొదలైన కార్యక్రమాలకు అంబాసిడర్‌గా వ్యవహరించింది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంగేజ్మెంట్ వింగ్–జీ20 డెలిగేట్‌గా నియామకం అయిన రవీనా టాండన్....‘భారతీయ మహిళ ప్రతినిధిగా ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది మహిళలు విశేష కృషి చేశారు. సామాజిక, ఆర్థిక రంగాలలో మహిళల హక్కులు, అవకాశాల గురించి చర్చించడానికి ఇదొక మంచి అవకాశం’ అంటోంది. -
వారానికో బాయ్‌ఫ్రెండ్‌ను మారుస్తున్నారు, నా ఎంగేజ్మెంట్ రద్దు పెద్ద సమస్యా?
ఒకప్పుడు హీరోయిన్గా అలరించిన రవీనా టండన్ ఇప్పుడు ముఖ్య పాత్రల్లో నటిస్తోంది. చివరగా కేజీఎఫ్ 2 మూవీలో మెరిసిన రవీనా గతంలో తన కోస్టార్ అక్షయ్ కుమార్‌తో పెళ్లిదాకా వెళ్లింది. కానీ తర్వాత నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకోవడంతో అప్పట్లో ఈ విషయం హాట్‌టాపిక్‌గా మారింది. తాజాగా ఈ విషయం గురించి రవీనా మీడియాతో మాట్లాడుతూ.. 'మొహ్రా(1994) సినిమాలో అక్షయ్, నేను కలిసి నటించాం. అప్పుడు మా జంట బాగా ఫేమస్. 90's లోనే నిశ్చితార్థం కూడా చేసుకున్నాం. అయితే సరిగ్గా ఎప్పుడనేది మాత్రం గుర్తు లేదు. తర్వాత విడిపోయి చెరో దారి చూసుకున్నాం. నేనొకరితో డేటింగ్ చేశా, అతడూ మరో అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అలాంటప్పుడు మా ఇద్దరి మధ్య జెలసీ ఎందుకొస్తుంది? అప్పటికీ, ఇప్పటికీ మేము హిట్ పెయిరే.. అప్పుడప్పుడు కలుసుకుంటాం.. మాట్లాడుకుంటాం. అయినా కాలేజీలో వారానికో బాయ్‌ఫ్రెండ్‌ను మారుస్తారు. కానీ ఒక్క నిశ్చితార్థం బ్రేక్ అయినందుకు అది మైండ్‌లో అలా ఉండిపోయింది. ఎందుకో మరి తెలియదు. ఇప్పుడు బ్రేకప్‌లు, విడాకులు అయినా కూడా జనాలు ముందుకు సాగుతున్నారు. కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు' అని చెప్పుకొచ్చింది రవీనా. కాగా అక్షయ్ రవీనాకు బ్రేకప్ చెప్పాక అచ్చం తనలా ఉండే అమ్మాయితో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే రవీనా టండన్ బిజినెస్మెన్ అనిల్ తడానీని పెళ్లి చేసుకోగా వీరికి రాశా, రణ్బీర్వర్దన్ సంతానం. అక్షయ్ కుమార్ ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకోగా వీరికి ఆరవ్, నితారా ప్లిలలు ఉన్నారు. చదవండి: జనాలు నాపై కోడిగుడ్లు విసిరారు: చిరంజీవి -
డ్రెస్సుపై ఒక్క చిరుగూ లేకుండా అలాంటి సీన్లో నటించా: హీరోయిన్
రవీనా టాండన్.. 90వ దశకంలో బాలీవుడ్లో స్టార్ హీయిన్‌గా రాణించిన వారిలో ఆమె ఒకరు. అప్పట్లో తెరపై ఈ పేరు కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయేవారు. తూ ఛీజ్ బడి హై మస్త్ మస్త్ అంటూ ‘మొహ్రా’ సినిమాలో ఆమె వేసిన స్టెప్పులో ఇప్పటికీ ఎవర్ గ్రీన్. ఆమె అందానికి బాలీవుడ్ ఫియా అయింది. వరుస సినిమాలతో అదరగొట్టేసింది. కానీ ఒకనొక దశలో ఆమెపై అహంకారి అనే ముద్రపడింది. దర్శక నిర్మాత మాట వినదనే అపవాదు ఆమెపై పడింది. ఫలితంగా కొన్ని సినిమాలు ఆమె చేతి నుంచి జారిపోయాయి. తాజాగా ఈ విషయాలపై రవినా టాండన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశాల్లో నటించేందుకు అంగీకరించకపోవడంతో తనపై అహంకారి అనే ముద్ర వేశారని చెప్పారు. ‘కొన్ని విషయాల్లో నేను అసౌకర్యంగా ఉండేదాన్ని. స్విమింగ్ డ్రెస్ ధరించడం నాకు నచ్చదు. అలాగే ముద్దు సన్నివేశాలు కూడా చేయలాని ఉండేది కాదు. సినిమా ఒప్పందానికి ముందే నేను ఈ కండీషన్ పెట్టేదాన్ని. అందుకే నాపై అహంకారి అనే ముద్ర వేశారు. సినిమా అవకాశాలు రాకపోయినా కూడా.. నేను అలాంటి సీన్స్ చేయలేదు. రెండు రేప్ సీన్స్‌లో నటించినప్పటికీ.. ఎలాంటి అసభ్యతకు తావివ్వకుండా జాగ్రత్త తీసుకున్నా. డ్రెస్సుపై ఒక్క చిరుగూ కూడా లేకుండా రేప్ సీన్స్‌లో నటించిన ఏకైక నటిని నేనే. అలాంటి సీన్స్ ఉన్నాయని చాలా సినిమాలు వదులుకున్నాను. ‘డర్’ సినిమా అవకాశం ముందు నాకే వచ్చింది. కానీ కొన్ని సన్నివేశాలు అసౌకర్యంగా అనిపించాయి. స్విమ్మింగ్ కాస్ట్యూమ్స్ ధరించనని దర్శక,నిర్మాతలకు చెప్పేశా. ప్రేమ్ ఖైదీ చిత్రాన్ని కూడా అలానే వదిలేశా’అని రవినా టాండర్ చెప్పుకొచ్చారు. తెలుగులో బాలయ్య ‘బంగారు బుల్లోడు’, వినోద్‌కుమార్ ‘రథసారథి’, నాగార్జున ‘ఆకాశవీథిలో’ సినిమాలలో రవీనా నటించింది. -
పగ తీర్చుకోవడానికి ప్రణాళిక వేస్తున్న బాలీవుడ్ నటి
పగ తీర్చుకోవడానికి పక్కా ప్రణాళిక వేస్తున్నారు బాలీవుడ్ నటి రవీనా టాండన్. అమెరికన్ టెలివిజన్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ‘రివెంజ్’ హిందీ రీమేక్‌లో రవీనా టాండన్ నటించనున్నట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్త నిజం అని నిర్ధారిస్తూ.. ‘‘ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు రవీనా. ఇక ఈ ‘రివెంజ్’ వెబ్ సిరీస్ హిందీ అడాప్షన్‌కు దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. కాగా 2021లో వచ్చిన ‘ఆర్యాంక్’ వెబ్ సిరీస్ తర్వాత రవీనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ ఇదే. ఇక ‘రివెంజ్’ కథ విషయానికి వస్తే... కొందరి స్వార్థపరుల ఆత్యాశ వల్ల హత్య చేయబడిన తన తండ్రి కోసం ఓ యువతి చేసే పోరాటం నేపథ్యంలో కథ సాగుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... జనవరి 26న వెలువడిన ‘పద్మ’ అవార్డుల్లో రవీనాకు పద్మశ్రీ పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. -
ఆ హీరో మేనల్లుడితో స్టార్ హీరోయిన్ కుమార్తె ఎంట్రీ..!
రవీనా టాండన్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకున్న నటి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది రవీనా టాండన్. తాజాగా ఆమె కూతురు రాషా తడాని సైతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. (ఇది చదవండి: అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?) అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్‌కు జంటగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి రాషా పైనే ఉంది. రవీనా టాండన్ కూతురిగా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ నడుస్తోంది. నిర్మాత అభిషేక్ కపూర్ గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. 'గత 15 ఏళ్లుగా భారతీయ సినిమాకి అభిషేక్ అందించిన సహకారం ప్రశంసనీయం. అతను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఫర్హాన్ అక్తర్, రాజ్‌కుమార్ రావు, సారా అలీ ఖాన్ లాంటి కొత్త వ్యక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రతి సినిమాలో వారి పాత్రలను అందించాడు. ఆ సినిమాలు మనతో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ పాత్రలు ఈ నటీనటుల జీవితాల్లో అద్భుతాలుగా నిలిచాయి. భారతీయ సినిమాకు, ఆయన ప్రగతిశీల ఆలోచనకు ఇది సంకేతం.' అని అన్నారు. -
సోషల్ హల్చల్: జాన్వీ కపూర్ బ్యూటీ.. రెడ్ డ్రెస్‌లో కియారా లుక్స్
ప్రతి రోజు సోషల్ మీడియాలో సినీ తారలు తమ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతుంటారు. ఇవాళ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సినీ తారలపై ఓ లుక్కేద్దాం. బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ అందాలు రెడ్ డ్రెస్‌లో కవ్విస్తున్న బాలీవుడ్ భామ కియారా అద్వానీ బ్లూ డ్రెస్‌లో హెబ్బాపటేల్ హోయలు బాలీవుడ్ భామ సోనాలి కులకర్ణి హాట్ లుక్స్ ఖతార్ టూర్ ఎంజాయ్ చేస్తున్న అనన్య పాండే ఫ్యాషన్ లుక్‌లో రవీన్ టాండన్ స్టన్నింగ్ లుక్‌లో అదరగొట్టిన పూజా హెగ్డే View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Sonalee Kulkarni (@sonalee18588) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
మాపై అలాంటి ముద్ర వేస్తారు..హీరోలను అలా అనరెందుకు: నటి
బాలీవుడ్ నటి రవీనా టాండన్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ లో మోస్ట్ గ్లామరస్ హీరోయిన్స్ లో రవీనా ఒకరు. అందం, అభినయంతో రవీనా బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.90ల్లో స్టార్ హీరోయిన్గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అప్పట్లో ఆమె నటించిన ప్రతి సినిమా హిట్లే. దీంతో ఆమెకు లెక్కలేనంతమంది అభిమానులు ఉండేవారు. ఇక తెలుగులోనూ సత్తా చాటిన రవీనా టాండన్ ఇటీవలె కెజిఎఫ్-2 సినిమాలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఆమె హీరో, హీరోయిన్ల విషయంలో తేడాలు చూపిస్తుండటంపై మండిపడింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోలు ఒక్కో సినిమాకు రెండు, మూడేళ్ల గ్యాప్ తీసుకుంటారు. కానీ హీరోయిన్స్ కొద్ది రోజులు కనిపించకున్నా…సెకండ్ ఇన్నింగ్స్ అని ముద్ర వేస్తారు. మాధురీ దీక్షిత్‌ను 90ల కాలం నాటి సూపర్ స్టార్ అని మీడియాలో కథనాలు వేస్తారు. మరి అప్పటి నుంచి పని చేస్తున్న సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ల గురించి అలా అనరెందుకు? హీరో, హీరోయిన్ల విషయంలో చూపిస్తున్న ఈ అసమానతను అంతం చేయాలి అంటూ వాపోయింది రవీనా. -
రక్తంతో లేఖలు, అశ్లీల చిత్రాలు పంపేవాడు: రవీనా టాండన్
కేజీఎఫ్ మూవీలో నటించిన బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకుంది భామ. అయితే ఆమెకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవలే బయట పెట్టారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమెకు ఎదురైన భయానక పరిస్థితిని గుర్తు చేసుకున్నారు. ఓ అభిమాని రవీనాకు రక్తంతో రాసిన లేఖలు, బ్లడ్ వయల్స్, అశ్లీల చిత్రాలు కొరియర్ ద్వారా పంపేవాడని షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. తన భర్త అనిల్ తడానీ, పిల్లలతో కలిసి వెళ్తుండగా అభిమాని కారుపై పెద్ద రాయి విసిరిన సంఘటనను గుర్తు చేసుకుంది. ఆ ఘటనతో భయపడి పోలీసులకు ఫిర్యాదు చేశామని రవీనా టాండన్ చెప్పుకొచ్చింది. ఇంటి వద్ద రెక్కీ: అంతే కాకుండా రవీనాపై ప్రేమను నిరూపించుకోవడానికి ఒక అభిమాని ఏకంగా ఒకసారి ఆమె నివాసం గేటు బయట కూడా క్యాంప్ నిర్వహించాడని భయానకమైన పరిస్థితిని నటి వివరించింది. కేజీఎఫ్‌లో నటించిన రవీనా.. ప్రస్తుతం అర్బాజ్ ఖాన్ నిర్మాతగా వస్తున్న చిత్రం 'పట్నా శుక్లా'లో కనిపించనుంది. ఈ సినిమాలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్, చందన్ రాయ్ సన్యాల్, జతిన్ గోస్వామి, అనుష్క కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఫోటోగ్రఫీపై మక్కువ : మక్కువతో ఫొటోగ్రఫీని తన ప్రవృత్తిగా ఎంచుకుంది బాలీవుడ్ నటి రవీనా టాండన్. అయితే తాను తీసిన ఫొటోలు సోషల్ మీడియాతో పాటు ఎగ్జిబిషన్లు, ఆర్ట్ గ్యాలరీల్లోనూ ప్రదర్శితం కావడం విశేషం. వన్యప్రాణుల్ని, అక్కడి వాతావరణాన్ని క్యాప్చర్ చేయడానికి ఎక్కువ ఇష్టమని వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని బంధావ్‌ఘర్ నేషనల్ పార్క్‌లో తన భర్త, కూతురితో కలిసి పర్యటించిన రవీనా.. అక్కడి వన్యప్రాణుల్ని తన కెమెరాలో బంధించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆమె తీసిన కొన్ని ఫొటోలు ముంబయిలోని ‘జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ’లోనూ ప్రదర్శించారు. -
నా బరువు సరే, నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటావు?: కేజీఎఫ్ నటి
ఇటీవలే కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించింది రవీనా టండన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాన్ ఇండియా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందీ బాలీవుడ్ నటి. 'కేజీఎఫ్ 2 సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నాయంటే సౌత్ ఇండస్ట్రీ డబ్బులు సంపాదించడం మీదే దృష్టి పెట్టిందని కాదర్థం. సినిమా మీద వారికెంత ప్రేముందనేది అక్కడ స్పష్టమవుతోంది. పైగా ఆ కలెక్షన్ల వల్ల థియేటర్ యజమానులకు లాభం కూడా చేకూరుతోంది' అని చెప్పుకొచ్చింది. గతంలో ప్రసవానంతరం లావెక్కడంపై వచ్చిన విమర్శల గురించి మాట్లాడుతూ.. 'గర్భంతో ఉన్నప్పుడు లావయ్యాను. బాబుకు జన్మనివ్వగానే తిరిగి వర్కవుట్స్ మొదలుపెట్టాను. కానీ అప్పటికే లావయ్యానంటూ నన్ను, అటు ఐశ్వర్య రాయ్‌ను కూడా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న నాకింకా గుర్తుంది. మీరు బరువు పెరిగారు, కాబట్టే పెద్దగా కష్టపడకుండా రియాలిటీ షోలు చేస్తున్నారా? అని అడిగారు. అప్పుడు నేనొక్కటే చెప్పా... బ్రదర్, నేను నా బరువు తగ్గించుకోగలను, కాని నీ ముఖాన్ని ఎక్కడ పెట్టుకుంటావు?' అని కౌంటర్ ఇచ్చాను అని గుర్తు చేసుకుంది. చదవండి: ఈ వ్యాధి వల్ల తీవ్ర నొప్పి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా ద పీకాక్’ మ్యాగజైన్‌పై మహేశ్, ఫొటో షేర్ చేసిన సూపర్ స్టార్ -
వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని కడిగేదాన్ని: రవీనా టండన్
'కేజీఎఫ్ 2' సినిమా సక్సెస్‌ను ఆస్వాదిస్తోంది రవీనా టండన్. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు చేస్తూ స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న రవీనా టండన్‌కు అసలు సినిమాల్లోకి రావాలన్న ఆలోచనే లేదట. సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో పుట్టి పెరిగిన ఆమె నటిని కావాలని ఎప్పుడూ అనుకోనేలేదట. తాజాగా ఆమె తన సినీ ఎంట్రీ ఎలా జరిగిందో చెప్పుకొచ్చింది. మీరు నమ్ముతారో లేదో కానీ నేను చెప్పబోయేది నిజం. మొదట్లో నేను స్టూడియో ఫ్లోర్స్ తుడిచేదాన్ని. ఎవరైనా వాంతులు చేసుకుంటే నేను వెళ్లి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసేదాన్ని. ప్రహ్లాద్ కక్కర్ దగ్గర అసిస్టెంట్‌గా కూడా పని చేశాను. పదో తరగతి పూర్తి చేశాక అనుకుంటా.. ఇలాంటి పనులు చాలా చేశాను. చాలామంది నన్ను చూసి నువ్వు స్క్రీన్ ముందు ఉండాల్సినదానివి అనేవారు. ఆ మాటలు విని నేనా? నటిగా మారడామా? అస్సలు ఛాన్సే లేదు అని సమాధానం చెప్పేదాన్ని. నటిని అవుతానని ఎప్పుడూ ఊహించలేదు. అనుకోకుండా చివరకు నటిగా మారాను. ప్రహ్లాద్ దగ్గర పనిచేసినప్పుడు కొన్నిసార్లు ఎవరైనా మోడల్స్ రాని సమయంలో వెంటనే రవీనాను పిలవండి అనేవారు. మేకప్ వేసుకుని కొన్ని పోజులివ్వమని చెప్పేవారు. ఇలా పదేపదే ఈయనకు ఉచితంగా ఎందుకు మేకప్ వేసుకుని ఫొటోలకు పోజులివ్వాలని ఆలోచించాను, దీని ద్వారా నేనూ స్వయంగా డబ్బు సంపాదించొచ్చు కదా అనిపించింది. అలా మోడలింగ్ మొదలుపెట్టాను, ఆ వెంటనే సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ సినిమాల్లోకి రావడానికి నేను యాక్టింగ్, డ్యాన్సింగ్, డైలాగ్ డెలివరీకి సంబంధించి ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. నటిగా మారాకే ప్రతీది నేర్చుకుంటూ పోయాను అని తెలిపింది. కాగా రవీనా టండన్ 1991లో పత్తర్ కే ఫూల్ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసింది. బంగారు బుల్లోడు, ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలతో రవీనా టండన్ తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గరైంది. చదవండి: హీరో కంట్లో పడ్డాను, నో చెప్పినందుకు అంత పని చేశారు -
‘పుష్పరాజ్’ పై బాలీవుడ్ నటి ప్రశంసలు..విషయం ఏమిటంటే
సాక్షి, హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అల్లు అర్జున్‌పై తన అభిమానాన్ని చాటుకుంది. ఇటీవల పలు భాషల్లో విడుదలైన కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న కేజీఎఫ్-2 మూవీపై బన్నీ ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన రవీనా ‘‘ థ్యాంక్యూ. అల్లు అర్జున్.. నేను మీకు పెద్ద ఫ్యాన్‌ను..పుష్ప సినిమాలో నచ్చారు. మరిన్ని బ్లాక్ బస్టర్స్ రావాలి’’ అంటూ విష్ చేశారు. దీంతో ఇప్పటికే పుష్ప మూవీ ప్రభంజనాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్న బన్నీ ఫ్యాన్స్ మరింత మురిసిపోతున్నారు. కేజీఎఫ్-2 ఘన విజయంపై స్పందించిన బన్నీ కేజీఎఫ్-2 టీమ్ మొత్తానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ మూవీ హీరో యశ్, బాలీవుడ్ నటుడు, సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి తదితర నటీనటులను ప్రసంశించారు. అంతేకాదు అద్భుతం అంటూ మ్యూజిక్ డైరెక్టర్ రవితోపాటు, ఇతర టెక్నీషియన్స్ అందర్నీ అభినందిస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అలాగే అద్భుతమైన సినిమాను అందించారు అంటూ దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు కూడా కృతజ్ఞతలు తెలిపారు బన్నీ. కాగా ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతున్న తొలి కన్నడ చిత్రంగా ఘనతను చాటుకుటున్న సంగతి తెలిసిందే. Thank you @alluarjun 😊😊🙏🏻🙏🏻💛 am a huge fan ! Loved you in #pushpa and many more to come! https://t.co/1zqpc4puVD — Raveena Tandon (@TandonRaveena) April 22, 2022 -
కేజీఎఫ్ 2కు కోట్లల్లో కలెక్షన్లు, రెమ్యునరేషన్ కూడా కోట్లల్లోనే!
'వయలెన్స్.. వయలెన్స్.. వయలెన్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్.. బట్ వయలెన్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్..' కేజీఎఫ్ 2లోని పాపులార్ డైలాగ్ ఇది. రీల్ లైఫ్‌లోని డైలాగ్ రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి ఇదిగో ఇలా మారిపోయింది.. 'రికార్డ్స్, రికార్డ్స్, రికార్డ్స్.. ఐ డోంట్ లైక్ ఇట్, ఐ అవాయిడ్. బట్ రికార్డ్స్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్' అనేలా తయారైంది పరిస్థితి. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటించిన కేజీఎఫ్ 2 బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. ఒక్క హిందీలోనే ఇప్పటివరకు రూ.268 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.720 కోట్లకు పైగా రాబట్టింది. ఈ క్రమంలో కేజీఎఫ్ 2లో నటించిన తారలకు ఎంతమేర పారితోషికం ముట్టజెప్పారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీని ప్రకారం రాఖీభాయ్ యశ్ ఈ సినిమాకు రూ.25 - 30 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడట. అధీరాగా నటించిన సంజయ్ దత్ రూ.10 కోట్లు, రవీనా టండన్ రూ.2 కోట్లు, శ్రీనిధి శెట్టి రూ.3-4 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ.80-85 లక్షల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కళాఖండాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ రూ.15-20 కోట్ల దాకా అందుకున్నాడట! చదవండి: అది చూసి అవకాశం..నమ్మలేకపోయా: కేజీఎఫ్-2 ఎడిటర్ హీరోతో డేటింగ్, కామెంట్ డిలీట్ చేసిన బిగ్‌బీ మనవరాలు -
అందుకే దక్షిణాది సినిమాలు హిట్ అవుతున్నాయి: బాలీవుడ్ నటి
Raveena Tandon Compares Bollywood And South India Movies: బాలీవుడ్ ఇండస్ట్రీపై నటి రవీనా టండన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2లో ఆమె కీ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె నటనకు, పాత్రకు ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. ఇక మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో రవీనా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నారు. అయితే ప్రస్తుతం దక్షిణాది సినిమాలు ఉత్తరాదిలోనూ అత్యంత ఆదరణ పొందుతున్నాయి. అక్కడ మన సౌత్ సినిమాల రేంజ్ వంద కోట్ల బడ్జెట్‌కు చేరింది. చదవండి: OTT: దక్షిణాది భాషల్లోకి ‘ది కశ్మీర్ ఫైల్స్’, స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే అంతేకాదు మన సినిమాలను సైతం బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సౌత్, బాలీవుడ్ ఇండస్ట్రీల మధ్య తేడా గురించి తాజాగా రవీనా ప్రస్తావించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. దక్షిణాది చిత్రాలు ఇండియన్ కల్చర్‌కు దగ్గరగా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే.. బాలీవుడ్ సినిమాలు మాత్రం హాలీవుడ్‌ను ఫాలో అవుతూ మాస్ ఆడియన్స్‌కు దూరమవుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ‘90లలో పాశ్చాత్య దేశాల సంస్కృతికి దగ్గరగా ఉండేలా మెలోడియస్, మ్యూజికల్ చిత్రాలు వచ్చాయి. అవి హాలీవుడ్ సినిమాలకు దగ్గరగా ఉండేవి. దీంతో బాలీవుడ్ సినిమాల్లో ఇండియన్ కల్చర్ తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో నేను కొన్ని దక్షిణాది చిత్రాల్లో నటించాను. చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్! అక్కడ వాళ్లు మన సంస్కృతి, సంప్రదాయాలకు దగ్గరగా ఉండే సినిమాలు తీశారు. దీంతో ప్రేక్షకులు వాటిలో తమను తాము చూసుకుంటూ మన సంస్కృతికి దగ్గరయ్యారు. అలా ఆ సినిమాలని ప్రేక్షకులు సూపర్‌హిట్ చేశారు. ఈ క్రమంలో బాలీవుడ్లో అలాంటి చిత్రాలు తగ్గడంతో మాస్ ఆడియన్స్ హిందీ సినిమాలకు దూరమయ్యారు’ అని రవీనా టండన్ చెప్పుకొచ్చారు. కాగా ఏప్రీల్ 14న విడుదలైన ‘కేజీఎఫ్: చాప్టర్-2’ దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సునామీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన 5 రోజుల్లోనే ఈ మూవీ 625 కోట్ల రూపాయలను వసూలు చేసి సరికొత్త రికార్డును సృష్టించింది. ఒక్క 5వ రోజే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.73.29 కోట్లను వసూళ్లు చేయడం గమనార్హం. -
బాలీవుడ్ నటి రవీనా టండన్ కుటుంబంలో విషాదం
బాలీవుడ్ నటి రవీనా టండన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి, రచయిత, దర్శకనిర్మాత రవి టండన్(86) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్నేళ్లుగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న ఆయన ముంబైలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. అదే రోజు సాయంత్రం బరువెక్కిన గుండెతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించింది రవీనా టండన్. ఇక తండ్రి మరణవార్తను సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఎమోషనల్ అయింది నటి. 'నేను ఎంతగానో ప్రేమించే నా తండ్రి స్వర్గానికి వెళ్లిపోయారు. ఆయన నాకు, నా కుటుంబానికి మూలస్థంభంలా నిలబడేవారు' అని ట్వీట్ చేసింది pic.twitter.com/nNGIfXxjdk — Raveena Tandon (@TandonRaveena) February 11, 2022 'ప్రతిక్షణం నువ్వు నాతోనే ఉంటావ్ పప్పా.. ప్రతి అడుగూ నువ్వే వేయిస్తావు, నిన్నెప్పటికీ వదలను, లవ్ యూ పప్పా' అని ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రితో దిగిన పలు ఫొటోలను పంచుకుంది. కాగా రవి టండన్.. 'ఖేల్ ఖేల్ మేన్', 'అన్హోనీ, నజరానా', 'మజ్బూర్', 'ఖుడ్దార్', 'జిందగీ' వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎందరో స్టార్లతో కలిసి పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. View this post on Instagram A post shared by Angel Jiya (@angeljiya15) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
సోదరుడితో సంబంధం అంటగట్టారు.. నిద్ర లేని రాత్రులు గడిపా
Raveena Tandon Recalls Being Linked To Her Own Brother: బాలీవుడ్ నటి రవీనా టండన్ ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన పుకార్లను షేర్ చేసుకుంది రవీనా. తనకు తన కోస్టార్స్‌తో రిలేషన్ ఉన్నట్లు అవాస్తవాలను మీడియా రాసేది అని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఎలా రాస్తారు అని ప్రశ్నించింది. ఒకానొక సమయంలో తన సోదరుడితో రిలేషన్లో ఉన్నట్లు వచ్చిన వార్తలపై తాను ఎంతో కృంగిపోయాను అని చెప్పింది. రవీనా తన కోస్టార్స్‌ను మంచి స్నేహితులుగా చూస్తానని.. ఆ విషయాన్ని పత్రికా సంపాదకులు అంగీకరించలేకపోయేవారని తెలిపింది. అప్పట్లో జర్నలిస్టుల దయతో నటులు ఉండేవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రవీనా. ఇంకా ఆ ఇంటర్వూలో 'నేను అనేక నిద్ర లేని రాత్రులు గడపడం నాకు గుర్తుంది. నిద్ర పోవడం కోసం ఏడ్చేదాన్ని. ప్రతి నెల సినిమా మ్యాగజీన్లు విడదల అవుతున్నాయంటే భయం పట్టుకునేది. ఎప్పుడూ ఏ పుకారు నా మీద వస్తుందో అని. ఆ పుకార్లు నా పూర్తిగా నాశనం చేశాయి. నా విశ్వసనీయత, నా ప్రతిష్ఠ, నా తల్లిదండ్రుల మనసులను ముక్కలు చేశాయి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇదంతా దేని గురించి అని. వారు నా సొంత సోదరుడితో సంబంధం ఉన్నట్లు పుకార్లు పుట్టించారు. రవీనా టండన్‌ను డ్రాప్ చేయడానికి ఒక అందమైన అబ్బాయి వచ్చాడు, మేము రవీనా టండన్ బాయ్‌ఫ్రెండ్‌ను కనిపెట్టాం అని స్టార్‌డస్ట్ రాసింది. అసలు ఎలా చెప్తారు మీరు. ఎలా ధృవీకరీస్తారు. చిత్ర పరిశ్రమలో సినిమా పాత్రికేయులు, ఎడిటర్ల దయతో జీవిస్తున్నట్లుగా ఉండేది.' అని తన మనసులోని భారాన్ని దించేసుకుంది రవీనా. ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్ డ్యాన్స్ వీడియో వైరల్.. సిక్స్ ప్యాక్ ఫేక్ అని ట్రోలింగ్ -
సిగ్గులేని రాజకీయాలు ఆర్యన్ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి: నటి
ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమని కుదిపేస్తోంది షారుక్‌ఖాన్ తనయుడు ఆర్యన్‌ఖాన్ డ్రగ్స్ కేసు. ముంబై తీరంలో క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీలో ఈ స్టార్‌కిడ్‌తో పాటు మరో ఏడుగురిని ఎన్సీబీ అరెస్టు చేసింది. శుక్రవారం జరిగిన విచారణలో బెయిల్ పిటిషన్‌ని కోర్టు కొట్టివేయగా.. వారిని ఆర్థర్ రోడ్ జైలుకి తరలించారు. అయితే చాలామంది నటులలాగే సినీయర్ నటి రవీనా టండన్ సైతం ఈ స్టార్‌కిడ్‌కి మద్దతుగా ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. అందులో.. సిగ్గులేని రాజకీయాలు ఓ యువకుడి జీవితం, భవిష్యత్తుతో ఆడుకుంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారి స్వలాభం కోసం ఇలా చేయడం బాధాకరమని నటి తెలిపింది. అయితే ఆర్యన్‌ను ఈ కేసులో కావాలనే ఇరికించారని బాలీవుడ్ సెలబ్రిటీలు ఆరోపిస్తున్నారు. వేరే ఏదో కేసును పక్కదోవ పట్టించాడనికి ఇలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఆర్యన్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ, ఆర్థర్ రోడ్ జైలుకి.. Shameful politics being played out.. it’s a young mans life and future they toying with … heartbreaking . — Raveena Tandon (@TandonRaveena) October 7, 2021 -
ఛీ ఛీ.. నాలుకతో ఎంగిలి చేస్తూ, కాళ్లతో తొక్కుతూ..
రస్క్‌లు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. ఉదయం సాయంత్రం, ఛాయ్‌లో ముంచుకొని వీటిని తింటుంటారు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత రస్క్‌లు తినే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే రస్క్‌ల తయారీకి చెందిన ఓ షాకింగ్ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంతోంది. అసలేం జరిగిందంటే.. ఓ ఫ్యాక్టరీలో కొందరు రస్క్‌లు తయారు చేస్తూ వాటిని ప్యాక్ చేస్తున్నారు. అయితే వారిలో ఒక వర్కర్ ట్రేలోని రస్క్‌లపై తన పాదాలను ఉంచాడు. అంతేగాక చేతులోకి కొన్ని రస్క్‌లను తీసుకొని నాలుకతో నాకుతూ ప్యాకింగ్ చేశాడు. ఇదంతా చూస్తూ పక్కన ఉన్న వారు సంతోషంతో నవ్వుతున్నారు. చదవండి: వీడియో: కన్న కూతురిని చితకబాదుతూ తండ్రి పైశాచిక ఆనందం ఈ వీడియోను శివకుమార్ పార్థసారథి అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వర్కర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లని పట్టుకుని తన్నాలని కొందరు.. జైల్లో పెట్టాలని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు .నెటిజన్లతో పాటు బాలీవుడ్ నటి రవీనా టండన్ సీరియస్ అయ్యారు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ.."వారు పట్టుబడతారని, ఎప్పటికీ కటకటల వెనుకే మగ్గుతారని ఆశిస్తున్నా అంటూ పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు. View this post on Instagram A post shared by Shivkumar Parthasarathy (@instantshiva) -
Guess Who: చిరునవ్వుల చిన్నారిని గుర్తుపట్టారా?
పై ఫొటోలో పెళ్లి గెటప్‌లో ఉన్నది మరెవరో కాదు హిందీ స్టార్ జంట రిషి కపూర్, నీతూ సింగ్‌లు. మరి వీరి ముందు నిల్చుని కెమెరా వైపు గుడ్లప్పగించి చూస్తూ చిలకలా నవ్వుతున్న చిన్నారెవరో గుర్తుపట్టారా? ఒకప్పుడు తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన రవీనా టండన్. ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఫొటోను షేర్ చేసింది. చింటూ అంకుల్(రిషి కపూర్) పెళ్లిలో ఇలా ఫొటోకు పోజిచ్చానని చెప్పుకొచ్చింది. దీన్ని తన బయోగ్రఫీలో వాడుకుంటానని చెప్పాడని గుర్తు చేసుకుంది. ఈ ఫొటో తనకు ఎంతో అమూల్యమైనదని తెలిపింది. ఇక అందులో ఉన్నది హీరోయిన్ రవీనా టండన్ అని తెలియడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. ఎంతో ముద్దొస్తున్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో 'సజన్ కీ బహూన్ మేన్' సినిమాలో రవీనా రిషితో కలిసి నటించిన సన్నివేశాలు చాలా బాగుంటాయంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా రిషి కపూర్, నీతూ సింగ్‌లు 1980 జనవరి 22న పెళ్లి చేసుకున్నారు. జిందా దిల్, ఖేల్ ఖేల్ మెయిన్, అమర్ అక్బర్ అండ్ ఆంటోనీ, డో డూనీ చార్ వంటి పలు చిత్రాల్లో వీరు కలిసి నటించారు. వీరికి రిద్ధిమా కపూర్, రణ్‌బీర్ కపూర్ సంతానం. లుకేమియా వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్ గతేడాది ఏప్రిల్ 30న కన్నుమూశాడు. చదవండి: పెళ్లికి ముందు అజయ్ దేవ్‌గణ్ ఓ ప్లే బాయ్! View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) -
రచ్చకెక్కిన అజయ్- రవీనా లవ్‌స్టోరీ
• మొహబ్బతే ‘ఫ్యామిలీ మెన్’గా పేరుతెచ్చుకున్న చాలా మంది బాలీవుడ్ హీరోలు పెళ్లికి ముందు ‘ప్లే బాయ్’ ట్యాగ్‌ను మోసిన వాళ్లే. వాళ్లలో అజయ్ దేవ్గన్ ఒకడు. ఆశ్చర్యపోనవసరం లేదు.. అతని లవ్ లిస్ట్‌లో కాజోల్ కంటే ముందు కరిష్మా.. ఆమె కంటే ముందు రవీనా టండన్ ఉన్నారు. అజయ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక అతని ఫస్ట్ లవ్ రవీనా టండనే. ఆ ఇద్దరూ సినిమాల్లోకి రాకముందే అజయ్ సోదరి నీలం దేవగన్ రవీనాకు అత్యంత సన్నిహితురాలు. ఆ పరిచయం, చెలిమి అజయ్, రవీనా ఒకరంటే ఒకరు ఇష్టపడ్డానికి కారణమయ్యాయి. ఆ ప్రేమ ‘దిల్వాలే’ సినిమా సెట్స్ మీద మొదలైంది. ‘ఏక్ హీ రాస్తా’తో మీడియాకు కబుర్లు పంచి పెట్టింది. సినీ పరిశ్రమలోనూ అజయ్, రవీనా లవ్వే టాపిక్ అయింది. ఆ ఇద్దరూ పెళ్లి చేసేసుకుంటారనుకుంది. రవీనా కూడా అదే ఆశించింది. అజయ్ తనను పెళ్లి చేసుకుంటాడని కలలు కన్నది. కాని అజయే అంత సీరియస్‌గా లేడు ఆ రిలేషన్ పట్ల. తారల జీవితాల్లో అలాంటి సరదాలు సాధారణం.. తమ దోస్తీ గురించి రవీనానే చాలా ఎక్కువగా ఆలోచిస్తోంది అనుకున్నాడు అతను. ఆ సమయంలోనే.. అజయ్‌కి కరిష్మా కపూర్ ఫ్రెండ్ అయింది. ఇద్దరూ కలసి ‘జిగర్’లో నటించారు. ఆ సినిమా షూటింగ్‌లోనే కరిష్మా అతణ్ణి ఆకట్టుకుంది. ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. ఈ కొత్త ఫ్రెండ్షిప్లో పడి రవీనాను నిర్లక్ష్యం చేయసాగాడు. బిజీ షెడ్యూళ్ల వల్ల కలవలేకపోతున్నాడేమో అనుకుంది రవీనా. అందుకే ఏ మాత్రం వీలు చిక్కినా తనే అజయ్‌కి ఫోన్ చేసేది (అప్పుడు సెల్ ఫోన్లు లేవు.. ల్యాండ్ ఫోన్లే). చాలా సార్లు షూటింగ్‌కి వెళ్లిపోయాడు అనే సమాధానం వచ్చేది అతని సంబంధీకుల నుంచి. అదృష్టవశాత్తు ఎప్పుడో ఒకసారి అజయ్ ఫోన్ అందుకున్నా... పొడిపొడిగానే మాట్లాడి కట్ చేసేవాడు. అతని ఆ తీరుకూ మనసును సర్దుబాటు చేసుకున్న ఆమె.. ఆ టైమ్‌లో కరిష్మా, అజయ్ గురించి మీడియాలో వస్తున్న కథనాలను మాత్రం కొట్టిపారేయలేకపోయింది. అజయ్ చపలచిత్తం రవీనాను కలతకు గురిచేసింది. మోసం చేశాడని బాధ పడింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకూ ప్రయత్నించిందంటారు. కరిష్మాతో కలిసి ‘అందాజ్ అప్నా అప్నా’లో నటించినా అజయ్ వల్ల ఆమెతో స్నేహాన్ని కొనసాగించలేకపోయింది రవీనా. పైగా ఇద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధమే నడిచిందట. పార్టీలు, ఫంక్షన్లలో ఒకరికొకరు తారసపడినా మొహం తిప్పేసుకునేవాళ్లని, ఫొటోలకు పోజులిచ్చేవారు కాదని చెప్తుంది ముంబై మీడియా. కరిష్మా కోసం రవీనాకు దూరమై.. ఆ ఇద్దరి మధ్య వైరాన్ని సృష్టించిన అజయ్ కాజోల్ కోసం కరిష్మానూ కాదనుకున్నాడు. చిరాకు, చిటపటలతోనే.. కాజోల్, అజయ్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘హల్చల్’. ఆ చిత్రం సెట్స్ మీదకు వెళ్లేనాటికి ఆ ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఆసక్తి అటుంచి సహజసిద్ధమైన కుతూహలం కూడా లేదు. ఆచితూచి మాట్లాడే అజయ్ దేవ్‌గన్‌కు గలగలా మాట్లాడే కాజోల్ వసపిట్టలా అనిపించింది. నిత్యం ఉల్లాసంగా ఉండే కాజోల్కు ఉదాసీనంగా కనిపించాడు అజయ్. పరస్పర విరుద్ధ స్వభాలున్న ఈ ఇద్దరినీ కలిపింది ఒకటే.. అప్పటికే విడివిడిగా మునిగున్న పీకల్లోతు ప్రేమ నుంచి బయటకు వచ్చేద్దామా? వద్దా? అన్న సంశయం. అవును.. అజయ్ కరిష్మాతో.. కాజోల్ కార్తిక్ మెహతాతో ప్రేమలో ఉన్నారు. అయితే ఆ భాగస్వాములతో ఇద్దరూ సంతోషంగా లేరు. వీళ్లిద్దరి మధ్య కొంచెం స్నేహం పెరిగాక కాజోలే చనువు తీసుకుంది.. కార్తిక్ మెహతాతో తన రిలేషన్‌కు సంబంధించి అజయ్‌ను సలహా అడిగి. ఆమె నిర్మొహమాటత్వం, లౌక్యంలేనితనం అజయ్‌కు నచ్చాయి. ‘జీవితాంతం ఈ అమ్మాయి తోడుంటే బాగుండు’ అనుకున్నాడు. ఆ క్షణం నుంచే కాజోల్ మీద అభిమానం కురిపించడం ప్రారంభించాడు. కొన్నాళ్లకు ఆ అభిమానం మరింత చిక్కపడి కాజోల్కు ప్రేమ భావనను పంచింది. ‘ప్రేమిస్తున్నాను’ అనే మాటే చెప్పుకోకుండా ప్రేమించే మనసునే ‘పెళ్లి’ మంత్రంగా మార్చుకొని అన్యోన్యతను స్థిరం చేసుకున్నారిద్దరూ! అజయ్, కరిష్మా గౌరవంగానే విడిపోయినా.. అజయ్, రవీనా బ్రేకప్ మాత్రం మీడియాకెక్కింది. రవీనాతో ప్రేమలో పడ్డ విషయాన్ని అజయ్ ఎప్పుడూ ఒప్పుకోలేదు. ‘రవీనా పట్ల నేనెప్పుడూ ఆసక్తి చూపలేదు. ప్రేమనూ ఎక్స్‌ప్రెస్ చేయలేదు’ అని చెప్పాడు ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. కానీ రవీనా అతని మాటలను కొట్టిపారేసింది. ‘అజయ్, నేను ప్రేమించుకున్నాం. లెటర్స్ కూడా రాసుకున్నాం’ అన్నది. ‘రవీనా పుట్టు అబద్ధాల కోరు. నేను ఆమెకు లెటర్స్ రాసిన మాట నిజమే అయితే వాటిని చూపించమనండి.. పబ్లిష్ చేయమనండి.. ఎలా రాశానో చూడాలని నాకూ ఉంది’ అని సవాలు విసిరాడు అజయ్. అక్కడితో ఆగలేదు.. రవీనాకు మానసిక వైద్యం అవసరమని, ఆమె మెంటల్ హాస్పిటల్లో చేరితే మంచిదనీ కామెంట్ చేశాడు. ఈ ఘాటు విమర్శలతో వాళ్ల మధ్య ఉన్న స్నేహం కూడా ఇగిరిపోయింది. - ఎస్సార్ చదవండి: బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్‌పై దాడి? -
అందుకే అక్షయ్‌తో బ్రేకప్ తప్పలేదు: రవీనా
రవీనా టండన్, అక్షయ్ కుమార్.. ఇద్దరూ తెలుగు వారికి సుపరిచితమే.. రవీనా తెలుగు సినిమాల్లో నటించి.. అక్షయ్ తనకు నచ్చిన కొన్ని తెలుగు సినిమాలను హిందీలో పునర్నిర్మించి! పెళ్లితో ‘ఫ్యామిలీ మన్’గా పేరు తెచ్చుకున్న అక్షయ్ పెళ్లికాక ముందు ప్రేమ విషయంలో మాత్రం ఖిలాడీ అనే ముద్రను మోశాడు. అతను ప్రేమించిన వాళ్ల జాబితా రవీనా నుంచి మొదలవుతుంది.. ఆ విఫల ప్రేమ గాథే ఈ ‘మొహబ్బతే’.. రవీనా, అక్షయ్ కుమార్.. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది ‘మొహ్రా’ సినిమా సెట్స్‌లో. రవీనా బోల్డ్ అండ్ బ్యూటీఫుల్నెస్కి ఫిదా అయ్యాడు అక్షయ్. ఉరకలేసే అతని ఉత్సాహానికి మనసిచ్చేసింది రవీనా. ఆ ప్రేమను రహస్యంగా ఉంచలేదు ఆ జంట. బాలీవుడ్లో ఏ ఫంక్షన్ జరిగినా కలిసే వెళ్లేవారు. ‘ఇద్దరూ పంజాబీలే. ఈడుజోడూ బాగుంది’ అని వాళ్లను చూసి ముచ్చట పడింది బాలీవుడ్ ఇండస్ట్రీ. ‘పెళ్లి కబురు చెప్తారు’ అనీ ఎదురు చూడసాగింది. పరిశ్రమ అనుకున్న ట్టుగా రవీనా కూడా మానసికంగా పెళ్లికి సిద్ధ పడింది. కొత్త సినిమాలేవీ అంగీకరించకుండా. ఎందుకంటే అక్షయ్.. తనను గృహిణిగానే ఉండాలని కోరుకున్నాడని. ‘మన పెళ్లయ్యాక నువ్వు సినిమాలు చేయొద్దు. ఇప్పుడు చేస్తున్న సినిమా ఆఖరి రోజు షూటింగ్ అయిపోగానే పెళ్లి చేసుకుందాం’ అని రవీనాకు చెప్పి నిశ్చితార్థానికి ముహూర్తమూ ఖరారు చేయించాడు అక్షయ్‌కుమార్. నిశ్చితార్థం.. ముంబైలోని ఒక ఆలయంలో నిశ్చితార్థపు సన్నాహాలు జరిగాయి. అక్షయ్ ఢిల్లీలో ఉంటున్న తన తల్లిదండ్రులను ఆగమేఘాల మీద ముంబైకి రప్పించాడు. రవీనా కూడా వాళ్ల అమ్మానాన్నను పిలిచింది. ‘శాస్త్రోకంగా జరిగింది మా ఎంగేజ్మెంట్. అక్షయ్ వాళ్ల పెద్దవాళ్లు వచ్చీరావడంతోనే నాకు ఎరుపు రంగు దుపట్టా పెట్టారు. బహుశా వాళ్లు అక్కడ జరగబోయేది పెళ్లని అపోహపడి ఉంటారు’ అని చెప్పింది రవీనా వాళ్ల బ్రేకప్ తర్వాత ఎప్పుడో స్టార్‌డస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో. నిశ్చితార్థం అయిపోయింది... రవీనా కొత్త సినిమాలు ఒప్పుకోలేదు. అయినా పెళ్లి పనులు ముందుకు సాగలేదు. పైగా తమకు నిశ్చితార్థం అయినట్టు ఎక్కడా చెప్పకూడదని రవీనాను కట్టడి చేశాడు అక్షయ్. అప్పటికే అతనికి విపరీతమైన మహిళా అభిమానగణం ఉండడం, అక్షయ్ ఎంగేజ్మెంట్ విషయం బయటకు వస్తే ఆ అభిమానులు దూరమవుతారేమో, అది తన కెరీర్ మీద ప్రభావం చూపిస్తుందేమోననే భయంతోనే ఆ నిజాన్ని దాచిపెట్టమన్నాడు అంటుంది రవీనా. పెళ్లి ఎందుకు జరగలేదు... ఈలోపే అక్షయ్ ‘ఖిలాడియోంకా ఖిలాడీ’ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. అందులో నటిస్తున్న రేఖతో అతను దగ్గరగా మెదులుతున్నాడన్న వదంతులు మొదలయ్యాయి. అవి రవీనా దాకా వచ్చాయి. అక్షయ్‌ను అడిగింది. అలాంటిదేం లేదు అన్నాడు. రేఖ కాకపోతే ఇంకో అమ్మాయి.. ఇంకో అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి.. అలా అక్షయ్‌కు సంబంధించి ఏదో ఒక నటితో వార్తలు రవీనాకు వినిపిస్తూనే ఉన్నాయి. చిరాకేసింది ఆమెకు. అయినా పెళ్లి వంకతో ఎన్నాళ్లని తనలా ఇంట్లో ఉండాలి? అని అసహనపడింది. పరిష్కారంగా తనకు వస్తున్న సినిమా అవకాశాలను అంగీకరించడం ప్రారంభించింది. రవీనా తీరు అక్షయ్‌లో కలవరం పుట్టించింది. ఆమె దగ్గరకు వెళ్లి ‘వద్దు... సినిమాలు ఒప్పుకోవద్దు.. పెళ్లి చేసుకుందాం’ అని బతిమాలాడు. ‘ఒకసారి నీ కోసం సినిమాలు వద్దనుకున్నాను. కాని ఇప్పుడు నా చాయిస్ సినిమానే’ అని స్పష్టం చేసింది రవీనా. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వు.. అంటూ వెంటపడ్డాడు. మూడేళ్లు అవకాశం ఇచ్చింది. ఈసారి అతనితో శిల్పాశెట్టి పేరు జతకూడింది. శిల్పాశెట్టికి, రవీనాకు మంచి స్నేహం ఉంది. ఆ పేరు తన చెవిన పడగానే ఇక అక్షయ్‌తో అనుబంధం తెంచేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆచరణలో పెట్టింది. ‘అక్షయ్... తనకు పరిచయమున్న ప్రతి ఇద్దరమ్మాయిల్లో ఒకరికి ప్రేమను పంచుతాడు. ఏ రిలేషన్‌కైనా లాయల్టీ ముఖ్యమనుకుంటాన్నేను. అలాంటి పట్టింపులేమీలేని వాడు అతను. తను తప్పు చేసినప్పుడల్లా నేను క్షమించేసేయాలని అనుకునేవాడు. అలాగే చేశాను కూడా మూడేళ్లు. కాని భవిష్యత్తూ అలాగే కొనసాగనుందని తెలిసీ ఎలా ముందుకు సాగుతాం? అందుకే బ్రేకప్తప్పలేదు’ అని చెప్పింది రవీనా స్టార్‌డస్ట్ ఇంటర్వ్యూలోనే. ∙ఎస్సార్ -
సందేశే ఆతే హై: సెల్యూట్ చేయాల్సిందే!
నిజమైన హీరోలు అనగానే సైనికులే మనకు గుర్తుకువస్తారు. ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పహారా కాస్తూ మనల్ని ఎల్లవేళలా కాపాడే యోధులు వారు. బాధ్యతలు నెరవేర్చే క్రమంలో కుటుంబానికి దూరంగా ఉండాల్సి వచ్చినా ఎంతో ఇష్టంగా దేశ సేవ చేస్తారు. కర్తవ్య నిర్వహణలో తలమునకలై నిరంతరం అప్రమత్తంగా ఉంటూ భరతమాతను కాపాడుతూ ఉంటారు. అయితే సాధారణ మనుషులకు ఉన్నట్లుగానే.. వాళ్లకు కూడా భావోద్వేగాలు ఉండటం సహజమే. కాస్త విరామం దొరికితే చాలు ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాలు చూసుకుంటూ కాస్త సేద తీరుతారు. ఆప్తుల సమాచారం, ప్రియమైన వారి సందేశాలు చదువుకుంటూ తన్మయత్వంలో మునిగిపోతారు. తమ రాక కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు ఎంతగా ఎదురుచూస్తున్నారోనన్న విషయాన్ని తలచుకుంటూ ఉద్వేగానికి లోనవుతారు. దాదాపు ఇరవై ఏళ్ల క్రితం విడుదలైన బార్డర్ సినిమాలోని ‘సందేశే ఆతే హై’ పాటలో ఇలాంటి భావోద్వేగాలను చక్కగా చూపించారు. (చదవండి: సరిలేరు మీకెవ్వరు.. జవాన్లపై ప్రశంసలు) ఇక శుక్రవారం ఆర్మీ డే సందర్భంగా.. ఓ యువకుడు దేశ సరిహద్దుల్లో గిటార్ వాయిస్తూ ఈ పాటను అద్భుతంగా ఆలపించాడు. ఓ యువతి కూడా అతడితో గొంతు కలిపి పాటను మరింత మధురంగా మార్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సైతం దీనిని రీట్వీట్ చేయడం విశేషం. ఇక.. ‘‘ఇలాంటి సందేశాలు వస్తాయి.. ఇంటికి ఎప్పుడు వస్తారు అంటూ వాళ్లు మనల్ని అడుగుతూ ఉంటారు’’ వంటి పంక్తులతో సాగే ఆ పాట చాలా మంది ప్లేలిస్టులో ఆల్‌టైం ఫేవరెట్‌గా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. मेरा भारत। ❤️ pic.twitter.com/jQWiGVestr — Bhaiyyaji (@bhaiyyajispeaks) January 15, 2021 -
అలా చేస్తే నాకు పెళ్లవదన్నారు: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్లు సుస్మితా సేన్, రవీనా టాండన్ వంటి వారు పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు తల్లయ్యారు. చిన్నారులను దత్తత తీసుకుని.. అమ్మ అవ్వడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని నిరూపించారు. ఇక సుస్మితా సేన్ నేటికి కూడా పెళ్లి ఊసు ఎత్తలేదు. కానీ రవీనా టాండన్ మాత్రం వివాహం చేసుకున్నారు. తాజాగా ఓ ఆంగ్ల మ్యాగ్జైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవీనా పిల్లలని దత్తత తీసుకోవడం.. వారి పెంపకం.. ఎదుర్కొన్న పరిస్థితులు వంటి తదితర విషయాల గురించి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా 21వ ఏట.. 1995లో ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని వారికి తల్లిని అయ్యాను. అయితే నా నిర్ణయం పలు అనుమానాలను రేకెత్తించగా.. అనుభవం మాత్రం ఎన్నో సంతోషాలని ఇచ్చింది. ఇక పూజా, ఛాయలను దత్తత తీసుకున్నప్పుడు నా నిర్ణయాన్ని చాలా మంది ప్రశ్నించారు. ఇంత చిన్న వయసులో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ప్రమాదం అని.. ఫలితంగా నా కెరీర్ ముగిసిపోతుందని.. ఇక నాకు పెళ్లవ్వదని భయపెట్టారు’ అని తెలిపారు రవీనా. (చదవండి: ‘అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది’) అయితే ‘ఈ విషయాలు ఏవి నన్ను పెద్దగా ప్రభావం చేయ్యలేదు. పైగా నా జీవితంలో నేను తీసుకున్న అత్యుత్తమ నిర్ణయాల్లో ఇది ఒకటి. తొలిసారి వారిని నా చేతుల్లోకి తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు వారితో గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో మధురమైన జ్ఞాపకం. నా బిడ్డలిద్దరికి సంబంధించిన ప్రతి సందర్భాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. వారిద్దరూ దేవుడు నాకిచ్చిన వరం. ఇక పిల్లల తల్లిగా మారిన నన్ను ఎవరూ వివాహం చేసుకోరని బెదిరించారు. కానీ దేవుడు నన్ను ఎంతో ఉన్నతంగా నిలబెట్టాడు. గొప్పగా ఆశీర్వదించాడు’ అని తెలిపారు రవీనా. (చదవండి: ముగ్గురు డాన్స్.. కానీ ఒక్కరే!) ఇక ఆ తర్వాత ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానిని వివాహం చేసుకున్నారు రవీనా. ఈ దంపతులకు కుమార్తె రాషా, కుమారుడు రణబీర్వర్ధన్ జన్మించారు. ఇక ప్రస్తుతం రవీనా దత్త పుత్రికలు ఛాయ ఎయిర్ హోస్టెస్‌గా పని చేస్తుండగా.. పూజ ఈవెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక గతంలో ఓ ఇంటర్వ్యూలో రవీనా తన ఇద్దరు కుమార్తెలు తన బెస్ట్ ఫ్రెండ్స్‌ని పేర్కొన్నారు. ఇక తన వివాహ సమయంలో ఇద్దరు తన పక్కన నిల్చుని మండపానికి తీసుకువచ్చారని.. ఇది తనకు ఎంతో ప్రత్యేక సందర్భం అని గుర్తు చేసుకున్నారు రవీనా. ఇక ప్రస్తుత రవీనా కేజీఎఫ్2 చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
నకిలీ ట్విటర్ ఖాతా, బాలీవుడ్ నటి ఫిర్యాదు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి రవీనా టాండన్ నకిలీ సోషల్ మీడియా ఖాతా ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు మీద నకిలీ ట్విట్టర్ ప్రొఫైల్‌ను సృష్టించిన సైబర్ నేరగాడు, ముంబై పోలీసులను, పోలీస్ బాస్ ను అపఖ్యాతి పాలు చేశారని అరోపిస్తూ ఆమె ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీంతో సదరు ట్విటర్ ఖాతాను అధికారికంగా బ్లాక్ చేశారు. ముంబై పోలీసులను, ఉన్నతాధికారి పరంవీర్ సింగ్‌ను అపఖ్యాతిపాలు చేసేలా, మార్ఫింగ్ చిత్రాలతో రవీనా ట్విటర్ లో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపింది. దీంతో అప్రత్తమైన నటి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసుల సైబర్ సెల్ చర్యలకు దిగింది. ఈ సందర్భంగాపోలీసు అధికారి మాట్లాడుతూ నిందితుడు రవీనా పేరుతో నకిలీ ట్విటర్ ఖాతాతో ముంబై పోలీస్ చీఫ్ సింగ్ పై ఒక వీడియోను సృష్టించి, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేశాడని తెలిపారు. అలాగే ఆమె ట్విట్టర్ పోస్టుల ద్వారా మరాఠీ భాషను, మరాఠీ మాట్లాడేవారిని కించపరిచాడని పేర్కొన్నారు. సమాచార సాంకేతిక చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
కేజీఎఫ్2 నుంచి మరో పోస్టర్ విడుదల
కేజీఎఫ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యశ్ హీరోగా తెరకెక్కిన కన్నడ చిత్రం రికార్డులు సృష్టించింది. దీంతో ఈ చిత్రం రెండో భాగాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని కేజీఎఫ్ ఫ్యాన్స్ అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కనిపించనున్నారు. రవీనా టండన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు ఆమె పుట్టిన రోజు సందర్భంగా కేజీఎఫ్ టీం ఆమె పోస్టర్‌ను విడుదల చేసింది. THE gavel to brutality!!! Presenting #RamikaSen from #KGFChapter2. Thanks KGF team for the gift.#HBDRaveenaTandon @VKiragandur @TheNameIsYash @prashanth_neel@SrinidhiShetty7 @duttsanjay @Karthik1423@excelmovies @ritesh_sid @AAFilmsIndia @FarOutAkhtar@hombalefilms pic.twitter.com/EjxQ0rCrE4 — Raveena Tandon (@TandonRaveena) October 26, 2020 దీనిని ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ రవీనా టండన్ ‘ అధికారం నుంచి క్రూరత్వంలోకి’ అని పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె కేజీఎఫ్ టీం అందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఫోటోలో రవీనా ఒక మెరూన్ కలర్ శారీలో, కళ్లల్లో నీటి చెమ్మతో , బాధతో కూడిన వదనంతో ఒక చోట కూర్చొని కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ అధీర పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. క్యాన్సర్ నుంచి కోలుకున్న ఆయన నవంబర్ నుంచి షూటింగ్లో పాల్గొనున్నారు. చదవండి: అదే జరిగి ఉంటే.. ఈ రోజు పండగే -
అధీరా వస్తున్నాడు
యష్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కేజీయఫ్ 2’. కన్నడ భాషలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా చిత్రమిది. 2019లో మొదటి భాగం ‘కేజీయఫ్ ఛాప్టర్: 1’ విడుదలైంది. తాజాగా రెండో భాగం ‘ఛాప్టర్ 2’ చిత్రీకరణ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయింది. సంజయ్ దత్ మెయిన్ విలన్ అధీరాగా కనిపిస్తారు. ఆయన భారీ యాక్షన్ సన్నివేశాల్లోనూ పాల్గొంటారని సమాచారం. ఇటీవలే సంజయ్ దత్‌కి ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉందనే విషయం నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. ముంబైలో చికిత్స మొదలుపెట్టారు. మరోవైపు షూటింగ్స్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. నవంబర్‌లో ఆయన ‘కేజీయఫ్ 2’ లొకేషన్లో అడుగుపెడతారట. తన పాత్ర చిత్రీకరణ ముగిసే వరకూ ఈ షూటింగ్లో భాగమవుతారని సమాచారం. దాదాపు నెల రోజుల పాటు పాల్గొంటారని తెలిసింది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. -
రాఖీ బాయ్ ఈజ్ బ్యాక్
కేజీఎఫ్ చాప్టర్-1 సినిమాతో కన్నడ హీరో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు.. అదేనండీ మన రాకీ బాయ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 2018లో వచ్చిన కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు రూ. 250 కోట్లకు పైగా కొల్లగొట్టి భారతీయ సినీ దృష్టిని ఆకర్షించింది. ఒక కన్నడ సినిమా స్టామినా ఈ రేంజ్లో ఉంటుందా అని చాటి చెప్పింది ఈ సినిమా. ఇంతటి ఘన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. నిజానికి కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమా అక్టోబర్ 13 2020లోనే థియేటర్లకు రావాల్సి ఉండేది. కానీ కరోనా వైరస్ విజృంభణతో 75శాతం పూర్తైన షూటింగ్ మార్చిలో ఆగిపోయింది. సరిగ్గా ఏడు నెలల తర్వాత ఈరోజే సినిమా చివరి దశ షూటింగ్ ప్రారంభమైంది. హీరో యష్ కూడా షూటింగ్లో పాల్గొనడానికి గురువారం లొకేషన్లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యష్‌కు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం ట్విటర్లో షేర్ చేశారు. గుబురు గడ్డంతో సముద్రం వైపు నిలబడి తీక్షణంగా చూస్తున్నట్టుగా యష్ కనిపిస్తాడు. ప్రమాదం జరగబోయే ముందు అలలు ఎంత నిశబ్దంగా ఉంటాయో యష్ చూపులు కూడా అలాగే ఉన్నాయి. రాఖీ బాయ్.. ఈజ్ బ్యాక్ అంటూ కాప్షన్ జత చేశారు. ఇక ఈ సినిమాలో అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తుండగా.. యశ్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టండన్ సినిమాకు కీలకమైన రమ్మికా సేన్ పాత్రలో నటిస్తోంది. రవీ బస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను హొంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14 ,2021లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తుంది. -
జుట్టు సమస్యకు రవీనా టండన్ చిట్కాలివే ..
ముంబై: పలు భాషల్లో నటిస్తూ అగ్ర కథానాయికగా వెలుగొందిన బాలీవుడ్ నటి రవీనా టండన్ తాజాగా జుట్టు సమస్యతో బాధపడుతున్న వారికి ఓ చిట్కా చెప్పింది. ప్రస్తుత ప్రపంచంలో జుట్టు రాలడమనేది అతి పెద్ద సమస్య. అయితే జుట్టు రాలడానికి పోషకాహార లోపంతో పాటు టెన్షన్, ఒత్తిడి వంటి అనేక కారణాలు ఉన్నాయి. కాగా రవీనా వరుసగా బ్యూటీ సిరీస్ పేరుతో ఆరోగ్య చిట్కాలను చెప్పనున్నారు. ప్రస్తుతం జట్టు సమస్యతో బాధపడుతున్న వారికి స్వాంతన కలిగించే చిట్కా చెప్పారు. ఎన్ని కెమికల్స్ వాడినా తాత్కాలికంగా ఉపశమనం లభిస్తుందని, కొద్ది రోజుల తర్వాత జుట్టు సమస్యతో బాధపడుతుంటారని రవీనా తెలిపింది. కాగా ప్రతి రోజు కొన్ని ఉసిరికాయలను(ఆమ్లా)తినడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారించవచ్చని పేర్కొంది. జట్టు రాలడాన్ని నివారించే రవీనా ఉసురికాయ(ఆమ్లా) మిశ్రమం: మొదట ఓ కప్పు పాలలో కొన్ని ఉసురుకాయాలను వేయాలి. ఆ తర్వాత ఉసిరి మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. కాగా బయట ఉన్న ఉసురి పోరలను తీసి వేస్తే గుజ్జు వస్తుంది. ఆ గుజ్జను జుట్టుకు మర్దన చేశాక, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో జుట్టును శుభ్రపరచాలి. ఈ పద్దతిని మీరు పాటించగలిగితే త్వరలోనే షాంపో వాడకాన్ని తగ్గించవచ్చని రవీనా టండన్ తెలిపింది. (చదవండి: వచ్చే జన్మలో కూడా ఖాళీ లేదు) -
మొటిమలు పోగొట్టే రవీనా టండన్ చిట్కాలు..
ముంబై: అందం మానవ జాతికి దేవుడిచ్చిన గొప్ప వరం. కానీ వివిధ కారణాలతో మొటిమలు రావడం వల్ల మొఖం అంద విహీనంగా తయారవుతుంది. యుక్త వయస్సుల్లో హర్మోన్ల అసమౌల్యత, ఒత్తిడి, పోషకాహార లోపం తదితర కారణాలతో మొటిమలు తరుచుగా వస్తుంటాయి. అయితే మొటిమలు నివారించడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. అయితే అదిరిపోయే అందంతో లక్షలాధి అభిమానులను సంపాధించుకున్న బాలీవుడ్ నటి రవీనా టండన్, మొటిమలు తగ్గడానికి కొన్ని చిట్కాలను సూచించారు. రవీనా టాండన్ సూచించే చిట్కాలివే 1) ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయని, కొబ్బరి నీళ్లు తాగాక చివరగా కొంచెం నీళ్లను మొఖానికి రాస్తే చర్మం చల్లబడి మొటిమలు నివారణకు తోడ్పడతాయని తెలిపింది. 2) మొఖం కాంతి వంతంగా మెరవాలంటే, రోజ్ వాటర్‌తో ముల్తానీ మట్టిని మొటిమలపై రాస్తే చర్మానికి రక్షణ వ్యవస్థగా పనిచేస్తు, మొటిమలు రాకుండా అడ్డుకుంటుందని పేర్కొంది. 3) చివరగా జీరాతో నిరంతరం మొఖాన్ని శుభ్రం చేసుకోవాలని, పేస్ట్‌లాగా ఉపయోగిస్తే ఆకర్శనీయ కాంతి వంతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చదవండి: వచ్చే జన్మలో కూడా ఖాళీ లేదు -
ముగ్గురు డాన్స్.. కానీ ఒక్కరే!
ముంబై: సాధారణంగా ఎదైనా వస్తువును ఉపయోగించి డ్యాన్స్ చేయడం వంటివి డ్యాన్స్ షోల్లో చూస్తుంటాం. అది కూడా డ్యాన్సర్లకు మాత్రమే సాధ్యం అవుతుంది. కానీ ఓ ముగ్గురు వ్యక్తులు ఫుట్‌బాల్‌ను ఉపయోగించి డ్యాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలీవుడ్ నటి రవీనా టాండన్ శనివారం ట్విటర్లో షేర్ చేశారు. రెండేళ్ల క్రితం నాటి వీడియో అయినప్పటికీ తాజాగా రవీనా షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ‘అవును మాకు ప్రతిభ ఉంది! ఇది చాలా అద్భుతం! చాలా బాగా చేశారు బాయ్స్! మీరు ఎక్కడ ఉన్నా ఈ ట్వీట్ మీకు చేరుతుందని ఆశిస్తున్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. (చదవండి: వైరల్ : ఈ డస్ట్ బిన్‌కు ఏమైందబ్బా!) And yes we have talent! This is so amazing! Well done boys! Hope this reaches you all wherever you guys are!♥️😍😘 pic.twitter.com/aOnkHGWQA7 — Raveena Tandon (@TandonRaveena) July 25, 2020 ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో లైక్స్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘అద్భుతం’, ‘లుంగీతో ఫుట్‌బాల్ డ్యాన్స్ సూపర్’, ‘ఆశ్చర్యం.. ఫ్రీ స్టైల్ ఫుట్‌బాలర్స్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో గ్రూప్ డ్యాన్స్ చేస్తున్న ముగ్గురిలో ఒకరు లుంగితో, మరోకరు స్సోర్ట్స్ డ్రెస్‌లో, ఇంకొకరు ఫార్మల్‌లో దుస్తులు ధరించి కనిపించారు. ముగ్గురు ఒకే సింక్‌లో బాల్‌తో స్టెప్పులేస్తున్న ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే అందరిని ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే వీడియోలో కనిపిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఒక్కరే. అతడి పేరు ప్రదీప్ రమేష్. ఫుట్‌బాల్ జీనియస్ వరల్డ్ రికార్డు టైటిల్‌ను సాధించిన తమిళనాడుకు చెందిన ఫుట్‌బాల్ ఆటగాడు. -
వాళ్లు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు: రవీనా
తమ కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారని బాలీవుడ్ నటి రవీనా టండన్ అన్నారు. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సర్వ సాధారణమని ఆమె పేర్కొన్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో నెపోటిజమ్ వాదన ఉవ్వెత్తున లేచింది. నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ చనిపోయాడని అతని అభిమానులతోపాటు కొంతమంది ప్రముఖ నటులు సైతం గళం విప్పుతున్నారు. సుశాంత్ మరణించి 20 రోజులు దాటుతున్న బంధుప్రీతిపై చర్చలు మాత్రం చల్లారడం లేదు. (మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?) దీనిపై తాజాగా నటి రవీనా టండన్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో తను స్వయంగా ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ‘బాలీవుడ్లో నెపోటిజమ్ ఉంది. అందుకు నేను అంగీకరిస్తున్నాను. ప్రతి చోట మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఉన్నారు. వీరిలో చెడ్డవాళ్లు మిమ్మల్ని ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది. వాళ్లు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బతీసేందుకు, సినిమాల నుంచి తప్పించేందుకు ఎదురు చూస్తుంటారు. ఇవన్నీ చిన్నప్పుడు క్లాస్‌రూమ్‌లో చేసే చిల్లర రాజకీయాల్లాంటివి. కానీ ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అయితే మేము గ్లామరస్ ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి ఇది ఎక్కువ హైలెట్ అవుతోంది’. అని రవీనా అన్నారు. అంతేగాక సుశాంత్ మరణాన్ని సంచలనం చేయడం ఆపేయాలని ఆమె కోరారు. (రవీనా.. నన్ను పెళ్లి చేసుకుంటారా?) -
రవీనా.. నన్ను పెళ్లి చేసుకుంటారా?
పలు భాషల్లో నటిస్తూ అగ్రకథానాయికగా వెలుగొందిన నటి రవీనా టండన్. 2004లో సినిమా డిస్ట్రిబ్యూటర్ అనిల్ థడానీ ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె చాలా తక్కువ సినిమాల్లో నటించింది. పిల్లలు (దత్తత తీసుకుంది), కుటుంబం అంటూ కెరీర్‌కు సరైన ప్రాధాన్యతనివ్వలేదు. అయితే కొన్నాళ్ల నుంచి ఆమె తిరిగి ఫార్మాట్లోకి వచ్చింది. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇదిలా వుంటే అప్పటికీ ఇప్పటికీ ఆమెకు అభిమానులు ఏమాత్రం తగ్గలేదు. "రవీనా టండన్ తన ఫస్ట్ క్రష్" అని బాహుబలి హీరో ప్రభాస్ కూడా గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. (శానిటైజర్‌తో సీట్లను తుడిచిన స్టార్ నటి!) తాజాగా ఆమె గతంలో వేసవి కాలంలో మంచు ప్రదేశాల్లో సేద తీరుతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలకు మంత్రముగ్ధులైన అభిమానులు "మేడమ్ సార్.. మేడమ్ అంతే.." అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరో అభిమానైతే ఓ అడుగు ముందుకేసి "రవీనా మేడమ్.. వచ్చే జన్మలో నన్ను పెళ్లి చేసుకుంటారా?" అని మనసులో మాటను కక్కేశాడు. దీనికి నటి స్పందిస్తూ.. "మన్నించాలి, ఇప్పటికే ఏడుగురికి బుక్ అయిపోయింది" అంటూ వచ్చే జన్మ కూడా ఖాళీగా లేదని అర్థం వచ్చేలా సరదాగా సమాధానమిచ్చింది. ఆమె చమత్కార శైలికి ఆశ్చర్యపోయిన అభిమానులు 'ఆమె ఎప్పటికీ క్వీన్' అంటూ కితాబిస్తున్నారు. (ప్రభాస్ సీక్రెట్ క్రష్.. ఓ బాలీవుడ్ హీరోయిన్!) -
‘అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది’
దేశ వ్యాప్తంగా రెండు వారాలపాటు లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై బాలీవుడ్ హీరోయిన్ రవీనా టండన్, గేయ రచయిత జావేద్ అక్తర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. లాక్డౌన్లో పాన్ సెంటర్లు, గుట్కా, మద్యం షాపులు, తెరుచుకోవడాన్ని వారు వ్యతిరేకించారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘అద్భుతం.. పాన్, గుట్కా షాపుల తెరుచుకుంటున్నాయి. ఇక ఉమ్మివేయడం కూడా మళ్లీ ప్రారంభమవుతుంది’ అంటూ రవీనా వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. (వలస కార్మికులపై ఎందుకింత ఆలస్యం?) లాక్డౌన్లో మద్యం ప్రజలపై త్వరగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జావేద్ అక్తర్ అన్నారు. అంతేగాక దేశంలో ఇప్పటికే మద్యం కారణంగా గృహహింస కేసులు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ‘‘లాక్ డౌన్ సమయంలో మద్యం దుకాణాలను తెరవడం వినాశకరమైన ఫలితాలను ఇస్తుంది. ఇక అన్ని సర్వేల ప్రకారం ఈ కాలంలో గృహ హింస కేసులు చాలా వరకు పెరిగాయి. ఈ సమయంలో మద్యం అమ్మకాలకు అనుమతిస్తే అది మహిళలు, పిల్లలకు మరింత ప్రమాదకరంగా మారుతుంది’’. అని ట్వీట్ చేశారు. అయితే జావిద్ మద్యం సేవించడం మానేసినట్లు కనిపిస్తోందని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 1991 జూలై 30 మద్యం స్వీకరించిన చివరి రోజు అని జావేద్ బదులిచ్చారు. (18 వేల మందిని రాష్ట్రానికి తీసుకొస్తాం : సీఎం ) కాగా భారత్‌లో మే 3 వరకు ముగియనున్న లాక్‌డౌన్‌ను మే 17 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రటకించిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్లో దేశంలోని అన్ని రాష్ట్రల్లోని జిల్లాలను మూడు జోన్లుగా వర్గీకరించారు. రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా విభజించి.. మే 4 నుంచి కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందులో భాగంగా గ్రీన్ జోన్లలలో కొన్ని నిబంధనలతో మద్యం షాపులు తెరుచుకోవచ్చని కేంద్రం శుక్రవారం ఆదేశించింది. మద్యం షాపులలో ఒకేసారి అయిదుగురికి మించి ఉండకూదనే నిబంధనలు పెట్టింది. (మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా! ) -
ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం
న్యూఢిల్లీ: విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ హఠాన్మరణం పట్ల దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తనకు ఎంతో ఇష్టమైన నటుల్లో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ ఇంత త్వరగా కన్నుమూయడం బాధ కలిగించిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు. ఆయన నటన చిరస్మరణీయమని అన్నారు. ఇర్ఫాన్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఇర్ఫాన్ ఖాన్ అసాధారణ నటుడని, ఆయనకు మరణం లేదని టీమిండియా బౌలర్ మహ్మద్ షమి ట్వీట్ చేశాడు. చనిపోయే వరకు అద్భుతమైన తన నటనతో అందరినీ అలరించారని గుర్తు చేసుకున్నాడు. మన కాలపు అత్యుత్తమ నటులలో ఒకరైన ఇర్ఫాన్ ఖాన్ మరణం గురించి భయంకర వార్త విన్నందుకు బాధగా ఉందని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అన్నారు. ఈ కష్ట సమయంలో ఇర్ఫాన్ ఖాన్ కుటుంబానికి భగవంతుడు తట్టుకునే శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు. ఇర్ఫాన్ ఖాన్‌ను ఇంత తొందరగా కోల్పోతామని అనుకోలేదని, ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నామని నటి రవీనా టాండన్ పేర్కొన్నారు. ప్రతిభావంతుడైన సహ నటుడిని మరణం బాధించిందన్నారు. దేశం గొప్ప నటుడిని కోల్పోయిందని అకాలీదళ్ నాయకుడు, ఢిల్లీ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు మజీందర్ సిర్సా పేర్కొన్నారు. ‘భారత్ అద్భుతమైన ప్రతిభ కలిగిన నటుడిని, మంచి మనిషిని కోల్పోయింది. దేవుడు ఆయన ఆత్మకు శాంతి కలిగించాల’ని ఆయన ట్వీట్ చేశారు. ఇర్ఫాన్ మరణం.. మహేశ్ సంతాపం -
‘జీతేంగే హమ్’కు స్టార్ నటి సందేశం
సోషల్ మీడియాలో కరోనా వైరస్‌పై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి అభిమానులకు సూచించారు. అంతేగాక వైద్యులపై జరుగుతున్న హింసాత్మక దాడులను నిరసిస్తూ సోషల్ మీడియాలో సందేశాన్ని పంచుకున్నారు. ఇటీవల వైద్య సిబ్బందిపై జరిగిన దాడులపై అవగాహన కల్పించేందుకు ‘జీతేగా.. ఇండియా జీతేంగే హమ్’ అనే నినాదంతో నటి రవీనా టాండన్ సోషల్ మీడియాలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. (కరోనా పరీక్షలు: వైద్య సిబ్బందిపై స్థానికుల రాళ్ల దాడి) వైద్యులపై జరుగుతున్న హింసలను వ్యతిరేకిస్తూ చేపట్టిన ఈ అవగాహన చర్యల్లో భాగస్వామ్యం కావాలంటూ ఆమె శిల్పాశెట్టిని నామినేట్ చేశారు. ఈ క్రమంలో ‘‘మానవత్వాన్ని చూపటానికి మనం చేయగలిగేది ఒక్కటే.. ఈ విపత్కర పరిస్థితుల నుంచి మనల్ని కాపాడటానికి తమ ప్రాణాలను సైతం లేక్కచేయకుండ పోరాడుతున్న వారి కోసం మన గొంతు కలపడం మాత్రమే’’ అంటూ వైద్యులు, నర్సులు ఇతర ఆరోగ్య సిబ్బందిని ఉద్దేశిస్తూ చెప్పుకొచ్చారు. కాగా వారంతా కరోనాపై యుద్ధంలో ప్రథమ పౌరులుగా పోరాడుతున్నారని, అలాంటి వారిపై దాడులు జరపడం సహించరానిదన్నారు. (కరోనా: రవీనా టాండన్ పనికి అభిమానుల ఫిదా!) ఇక ఈ అద్భుత ప్రయత్నానికి తనని నామినేట్ చేసిన రవీనాకు శిల్పా ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఈ గొప్ప ప్రయత్నంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు రవీనాకు ధన్యావాదాలు. సమాజాన్ని సురక్షితంగా ఉంచడానికి ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేయండి. ఈ విపత్కర కాలంలో మన కోసం పనిచేస్తున్న యోధులకు మద్దతుగా నిలబడదాం. అలాగే మహమ్మారిపై తప్పుడు ప్రచారాలు చేయడం మనేయండి. కరోనాను ఎదుర్కొవడానికి మనమంతా ఐక్యంగా ఉండి పోరాడే సమయం వచ్చింది’’ అంటూ శిల్పా పిలుపునిచ్చారు. అంతేగాక ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తన సోదరి షమితా శెట్టి, దర్శకనిర్మాత ఫరా ఖాన్‌తో పాటు నటుడు అభిమన్యూ దస్సానిలను కూడా నామినేట్ చేశారు. ఇక ‘‘జీతేగా.. ఇండియా జీతేంగే హమ్’’ నినాదంతో రవీనా చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమంలో శిల్పాశెట్టితో పాటు నటుడు సోను సుద్ను కూడా నామినేట్ చేశారు. అంతేగాక నటి సోనాలి కులకర్ణి, నిర్మాత ఓనిర్ కూడా కార్యక్రమంలో భాగస్వామం కావాలంటూ వారిని ట్యాగ్ చేశారు. -
శానిటైజర్ వేసి సీట్లను తుడిచిన స్టార్ నటి!
-
శానిటైజర్‌తో సీట్లను తుడిచిన స్టార్ నటి!
ముంబై: కరోనా భయాల నేపథ్యంలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ చేసిన పనికి అభిమానులు ఫిదా అయ్యారు. ఆమె ఇటీవల బాంద్రాకు రైల్లో వెళ్తున్న సమయంలో.. ట్రైన్‌లోని క్యాబిన్‌ను శానిటైజర్ వేసి శుభ్రం చేశారు. ముఖానికి ఫేస్ మాస్కు ధరించి సీట్లను క్లీన్ చేస్తున్న వీడియోను ఆమె అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ముందు జాగ్రత్తలు పాటిస్తే.. విచారం వ్యక్తం చేయాల్సిన అవసరమండదని ఆమె పేర్కొన్నారు. ‘మేం కూర్చుండే చోటును.. శానిటైజర్ వేసి శుభ్రం చేశా. సౌకర్యంగా అనిపించింది. చాలా అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్త చర్యలు తీసుకోండి. మీకు మీరే అతి ప్రధానం, అది గుర్తుంచుకోండి’ అని అన్నారు. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో వచ్చే వారమంతా పనులను తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు. రోజూవారి పనులను సాకుగా చూపుతూ పరిశుభ్రతకు దూరంగా ఉండొద్దని చెప్పుకొచ్చారు. ‘మహమ్మారి కరోనా బారిన పడకుండా.. జాగ్రత్త చర్యల్లో మాస్కులు ధరించండి. వాటిని ముందునుంచి తాకకుండా.. తొలగించండి. వీలైతే చేతులకు గ్లౌవ్స్ కూడా ధరిస్తే మంచిది. ఎందుకంటే డోర్ నాబ్స్, హ్యాండిల్స్‌కు చాలా బాక్టీరియా ఉంటుంది. మీరు అజాగ్రత్తగా ఉండి ఇతరులకు ఇబ్బంది కలగించొద్దు’అని మరో పోస్టులో ఆమె పేర్కొంది. కాగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ‘కేజీఎఫ్-2’లో రవీనా నటిస్తోంది. -
చల్నేదొ గాడీ
సౌకర్యవంతమైన ఖరీదు గల కారుల్లో తిరిగే సెలబ్రిటీలు సడన్‌గా ఆటోలో ప్రత్యక్షమైతే వింతగానే ఉంటుంది. అలాంటి ఒక వింతను షేర్ చేసుకున్నారు నటి రవీనా టాండన్. తన మేనకోడలి మెహందీ ఫంక్షన్‌కి వెళ్లడానికి రెడీ అయ్యారామె. కారు సకాలంలో రాకపోవడంతో చల్నేదొ గాడీ అంటూ కూతురు రాషాతో కలసి ఆటోలో బయల్దేరారు. ‘‘ఆటోలో ప్రయాణం చాలా లవ్లీగా అనిపించింది’’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారామె. మరి.. ఆటో డ్రైవర్ గుర్తు పట్టలేదా? అని ఫాలోయర్స్ అడిగితే– ‘‘గుర్తుపట్టారు. ఆయన పేరు అర్షద్. నా అభిమాని అని చెప్పారు. ఆటో దిగే ముందు ఆయనతో కాసేపు మాట్లాడాను’’ అన్నారు రవీనా. -
‘కేజీఎఫ్-2’ కీలక పాత్రలో రావు రమేష్
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్’ సౌత్ ఇండస్ట్రీలో సంచనలం సృష్టించి బాక్సాఫిక్ వద్ద రూ.200 కోట్ల వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో యశ్ జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా సీక్వేల్‌గా కేజీఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలిభాగం బ్లాక్‌బస్టర్ హిట్ సొంతం చేసుకోవడంతో అందరి చూపు రెండవ భాగం చాప్టర్-2 పైనే ఉంది. దీంతో సెంకడ్ పార్టులో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్లు మెరవబోతున్నారు. ఇప్పటికే పవర్‌పుల్ యాక్టర్ సంజయ్‌దత్ విలన్ అధీర పాత్రలో నటిస్తుండగా.. తాజాగా ఈ సినిమా షూటింగ్లో బాలీవుడ్ యాక్టర్ రవీనా టాండన్ కూడా జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ రవీనా టాండన్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు. (రవీనా ఆగయా) Welcome on board Rao Ramesh sir. We will leave it to the audience to keep guessing on this one, till they see you on the big screen. Thank you for being apart of #KGFChapter2 pic.twitter.com/fWteQ5YnHm — Prashanth Neel (@prashanth_neel) February 10, 2020 కాగా ప్రస్తుతం కేజీఎఫ్-2లో టాలీవుడ్ వర్సటైల్ నటుడు రావు రమేష్ నటిస్తున్నట్లు దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. ‘కేజీఎఫ్-2 షూటింగ్‌కు స్వాగతం. ఆయన పాత్ర సినిమాలో ఎలా ఉండబోతుందనేది ప్రేక్షకులకు వదిలేస్తున్నాం. కేజీఎఫ్-2లో భాగస్వామ్యమైనందుకు రావు రమేష్‌కు థాంక్యూ’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆయన పాత్ర తెరపై ఎలా ఉంటుదనేది ఆసక్తి కరంగా మారింది. హొంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బాసుర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, శరణ్ శక్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. -
కోర్టు మెట్లెక్కిన ప్రముఖ హాస్య నటి
చంఢీగర్ : బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ పంజాబ్, హరియాణా హైకోర్టు తలుపు తట్టారు. క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై అమృత్సర్ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా, తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, కేసుకు సంబంధించిన విచారణపై స్టే విధించాలని భారతీ సింగ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏ మతానికి చెందిన మనోభావాలను తాను కించపరచలేదని పిటిషన్లో పేర్కొన్నారు. భారతీ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ నేడు పంజాబ్, హరియాణ హైకోర్టులో విచారణకు రానుందని ఆమె తరపు లాయర్ అభినవ్ సూద్ తెలిపారు. (చదవండి : చిక్కుల్లో ఆ ముగ్గురు) కాగా, క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్లో ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరా ఖాన్, భారతీ సింగ్ క్రైస్తవ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద అమృత్సర్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇక కేసు విచారణలో భాగంగా ఈ ముగ్గురూ తమ ముందు హాజరు కావాలని అమృత్సర్ పోలీసులు మూడు వారాల కింద నోటీసులు ఇచ్చారు. దాంతో రవీనా టాండన్, ఫరా ఖాన్ జనవరి 23న హైకోర్టును ఆశ్రయించగా.. వారిద్దరిపై మార్చి 25 వరకు ఎలాంటి బలవంతపు విచారణ చేపట్టొద్దని కోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. (చదవండి : రెండేళ్లుగా ఇలాగే ఉంది.. అయినా..) -
షారుఖ్, రవీనా టాండన్‌లతో రవిశాస్త్రి
టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే ఆలస్యం ఆడేసుకోవడానికి నెటిజన్లు.. సెటైర్లు వేద్దామని అతడి హేటర్స్.. ఫన్నీగా స్పందించాలని మాజీ క్రికెటర్లు ఎదురు చూస్తుంటారు. అయితే ఏది ఏమైనా రవిశాస్త్రికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఏర్పడిన మాట వాస్తవం. ప్రస్తుతం న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో రవిశాస్త్రి మునిగితేలుతున్నాడు. ఈ సందర్భంగా అతడు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నటి రవీనా టాండన్, వ్యాపారవేత్త గౌతమ్ సింగానియాలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటోకు కొందరు ఫన్నీగా కామెంట్ చేస్తుండగా.. మరికొంత మంది రవిశాస్త్రికి న్యూఇయర్ విషెస్ తెలుపుతున్నారు. ఇక ఇంగ్లండ్ మాజీ సారథి మైకేల్ వాన్ సైతం రవిశాస్త్రి షేర్ చేసిన ఫోటోకు లైక్ కొట్టి న్యూఇయర్ విషెస్ తెలిపాడు. ఇక అంతకుముందు టీమిండియా క్రికెటర్లకు రవిశాస్త్రి ఇంగ్లీష్ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపాడు. 2019లో అద్భుతంగా రాణించారని, అదేవిధంగా 2020లో వచ్చే సరికొత్త సవాళ్లకు సిద్దంగా ఉండాలని సూచించాడు. విరామ సమయాన్ని ఎంజాయ్ చేయండి, 2020లో కలుద్దామంటూ ట్వీట్ చేశాడు. ఇక ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి మినహా మిగతా అన్ని సిరీస్‌ల్లోనూ కోహ్లి సేన అదరగొట్టింది. ఇక రానున్న ఏడాదిలో టీమిండియాకు అతిపెద్ద సవాల్ టీ20 ప్రపంచకప్ రూపంలో ఎదురుకానుంది. అంతేకాకుండా ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్లో భాగంగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది. వెస్టిండీస్ సిరీస్ ముగిశాక టీమిండియా క్రికెటర్లకు స్వల్ప విరామం లభించింది. దీంతో ఈ గ్యాప్‌లో క్రికెటర్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జనవరి 5న శ్రీలంకతో టీమిండియా తొలి టీ20 ఆడనుంది. View this post on Instagram Happy New Year! Guys, you have had an outstanding year in 2019 and now get ready to attack the fresh challenges ahead. Enjoy the rest. See you with 2020 vision #TeamIndia 🇮🇳 🙏 A post shared by Ravi Shastri (@ravishastriofficial) on Dec 31, 2019 at 1:59am PST -
ముగ్గురు సెలబ్రిటీలపై మూడో కేసు..
చండీగఢ్ : బాలీవుడ్ సెలబ్రిటీలు మరోసారి న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ షోలో పాల్గొన్న బాలీవుడ్ నటి రవీనా టాండన్, దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌లు మత భావాలకు వ్యతిరేకమైన వ్యాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఉద్దేశపూర్వకంగా వారు వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా వీరిపై మరో కేసు నమోదైంది. మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. కంబోజ్నగర్ వాసి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు శనివారం వారిపై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295-ఎ ప్రకారం వారిపై కేసు నమోదు చేశామని ఫిరోజ్‌పూర్ ఎస్ఎస్పీ వివేక్ శీల్ సోనీ పేర్కొన్నారు. వీరిపై ఎఫ్ఐర్ నమోదు కావటం ఈ వారంలో మూడోసారి కావడం గమనార్హం. వివిధ సెక్షన్ల కింద ఈ ముగ్గురు బాలీవుడ్ సెలబ్రిటీలుపై కేసు నమోదు చేశామని.. తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృత్సర్ రూరల్ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. ఈ ఆరోపణలపై బాలీవుడ్ నటి రవీన్ టాండన్ స్పందిస్తూ.. తాను ఏ మతాన్ని అవమానించినట్లు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని ఇదివరకే తెలిపారు. తన సహచర నటులు ఫరా ఖాన్, భారతి సింగ్‌లు సైతం ఎవరిని అవమానించలేదని ఆమె పేర్కొన్నారు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. మరోవైపు తాము అన్ని మతాలను గౌరవిస్తామని.. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం తమకు లేదని హాస్యనటి భారతి సింగ్ అన్నారు. తమ వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా గాయపడితే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నామని భారతి సింగ్ తెలిపారు. -
కేసు విషయంపై స్పందించిన రవీనా టండన్
బాలీవుడ్ నటి రవీనా టండన్ తన మీద నమోదు అయిన కేసు విషయంపై శుక్రవారం స్పందించారు. క్రిస్మస్ సందర్భంగా టెలివిజన్‌లోని షోకు హాజరైన రవీనా టంబన్ క్రైస్తవ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిందని క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ బుధవారం అజ్నాలా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమృత్సర్ పోలీసులు రవీనా టండన్తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్, కమెడియన్ భారతి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై స్పందించిన రవీనా ఎవరినీ అవమానించడం తన ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ..‘నేను ఎవరినీ కించపరచాలని అనుకోలేదు. ఏ మతాన్ని తక్కువ చేసి, అవమానించినట్లుగా మాట్లాడలేదు. ఒకవేళ ఎవరైనా నావల్ల బాధపడితే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోని చూడండి’ అని టెలివిజన్ షోలో ప్రసారమైన వీడియో క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు. -
చిక్కుల్లో ఆ ముగ్గురు
అమృత్సర్: బాలీవుడ్ సెలబ్రిటీలు న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఒక మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పంజాబ్‌లో కేసు నమోదైంది. ఒక టెలివిజన్ షోలో క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారన్న ఫిర్యాదుపై బాలీవుడ్ నటి రవీనా టాండన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్, హాస్యనటి భారతి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. క్రిస్మస్ సందర్భంగా ప్రసారమైన ఒక టీవీ షోలో రవీనా టాండన్, ఫరాఖాన్, భారతి సింగ్ క్రిస్టయన్ మత భావాలకు వ్యతిరేకంగా అవమానకరమైన, ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారంటూ క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ అజ్నాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా వివిద సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్టు పోలీసు అధికారి వెల్లడించారు. సంబంధిత షో వీడియో ఫుటేజీని కూడా ఫిర్యాదుదారుడు అందించినట్టు తెలిపారు. 295 -ఏతోపాటు వివిధ సెక్షన్ల కింద ముగ్గురిపై కేసు నమోదు చేశామని, తదుపరి దర్యాప్తు జరుగుతోందని అమృతసర్ రూరల్ పోలీసు అధికారి విక్రమ్ జీత్ దుగ్గల్ తెలిపారు. -
‘దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చింది’
ముంబై: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని బాలీవుడ్ స్వాగతించింది. సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలపై బాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. మోదీ సర్కారు నిర్ణయానికి మద్దతుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. తీవ్రవాద నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాక నిర్ణయంగా ఆర్టికల్ 370 రద్దును హీరోయిన్ కంగనా రౌనత్ పేర్కొన్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే తీసుకోగలరని ప్రశంసించారు. ఆయన దార్శనికుడు మాత్రమే కాదని, చాలా ధైర్యవంతుడైన నాయకుడని కొనియాడారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల శక్తివంతుడని పొగడ్తలతో ముంచెత్తారు. జమ్మూ కశ్మీర్‌కు మంచి భవిష్యత్తు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం మొదలయిందని సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొనాలని నటి దియా మిర్జా ఆకాంక్షించారు. జమ్మూ కశ్మీర్లో అందరూ క్షేమంగా ఉండాలని నటుడు సంజయ్ సూరి కోరుకున్నారు. కేంద్రం నిర్ణయానికి మద్దతుగా రవీనా టాండన్ జాతీయ పతకాలను ట్విటర్లో షేర్ చేశారు. జైరా వసీం, విక్రాంత్ మాసే, మాన్వి గాగ్రు తదితరులు కేంద్రం నిర్ణయంపై హర్షం వెలిబుచ్చారు. ‘మన మాతృభూమికి ఈరోజే నిజమైన పరిపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించింది. ఇండియా అంతా ఒకటే అనేది నేడు సాకారమైంది. జై హింద్’ అంటూ విలక్షణ నటుడు పరేశ్ రావల్ ట్విటర్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దును విప్లవాత్మక నిర్ణయంగా నిర్మాత ఏక్తాకపూర్ వర్ణించారు. కేంద్రం నిర్ణయంతో కశ్మీర్లో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. యునైటైడ్ ఇండియా కల సాకారం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులకు ఇది ఘనమైన నివాళిగా హీరో వివేక్ ఒబరాయ్ పేర్కొన్నారు. ప్రతి దేశభక్తుడు మోదీ, అమిత్ షాలకు కృతజ్ఞతలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. (చదవండి: ఆర్టికల్ 35ఏ కూడా రద్దైందా?) -
ఇందిరా గాంధీ పాత్రలో సీనియర్ హీరోయిన్
సాండల్‌వుడ్‌లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన సినిమా కేజీఎఫ్ (కొలార్ గోల్డ్ ఫీల్డ్స్). యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ ఘన విజయం సాధించింది. దీంతో కేజీఎఫ్ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా మరింత ప్రతిష్టాత్మకంగా ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్న మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి సంబంధించిన సన్నివేశాలు ఉండనున్నాయి. అందుకే ఆ పాత్రకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టండన్‌ను తీసుకున్నారట. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
‘కేజీఎఫ్ 2’లో బాలీవుడ్ హీరోయిన్
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ సినిమా కేజీఎఫ్. కొలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామాలో యష్ హీరోగా నటించాడు. ఈ సినిమా కన్నడతో పాటు హిందీ, తెలుగు, తమిళ, మళయాల భాషల్లో ఒకేసారి రిలీజ్ అయ్యింది. అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించటంతో సీక్వల్పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా రెండవ భాగాన్ని భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే సౌత్ టాప్ స్టార్ రమ్యకృష్ణ, బాలీవుడ్ హీరో సంజయ్ దత్‌లను కేజీఎఫ్ 2 కీలక పాత్రల కోసం తీసుకున్నారు. తాజాగా ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్‌ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. రవీనా కూడా ఈ సినిమాలో నటించేందుకు సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్‌లో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
హీరోయిన్‌తో స్టెప్పులేసిన ఎంపీ
కోల్‌కతా : బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్‌తో కలిసి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సగుతా రాయ్ స్టెప్పులేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. కోల్‌కతాలో గురువారం పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమానికి రవీనా టాండన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో వేదికపై ఉన్న సగుతా రాయ్‌ను తనతో కలిసి డాన్స్ చేయాల్సిందిగా కోరారు. 1994లో విడుదలైన తన హిట్ మూవీ ‘మోహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్’ పాటకు ఎంపీతో కలిసి రవీనా కాలు కదిపారు. ఈ సందర్భంగా వేదికపై ఉన్న ఇతర నాయకులను కూడా సగుతా రాయ్‌తో కలిసి స్టెప్పులేయాలంటూ రవీనా ఆహ్వానించారు. డెబ్బై ఏళ్ల వయస్సులోనూ ఇంత జోష్‌గా ఉండే వ్యక్తిని తానెప్పుడూ చూడలేదని, సగుతా రాయ్ నిజంగా చాలా స్పోర్టివ్ పర్సన్ అని రవీనా ప్రశంసించారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని డుమ్ డుమ్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సగుతా రాయ్ మన్మోహన్ సింగ్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖగా మంత్రిగా పనిచేశారు. Watch TMC MP Prof Saugata Roy groove with Bollywood star Raveena Tandon at an event in #Kolkata! #UserGeneratedContent. @iindrojit More videos: https://t.co/FAHzdjSiWA pic.twitter.com/b7nCNTOLrj — India Today (@IndiaToday) January 17, 2019 -
రవీనా టాండన్‌పై కేసు నమోదు
ముజఫర్‌పూర్ : బాలీవుడ్ నటి రవీనా టాండన్‌పై బిహార్‌లో కేసు నమోదైంది. ఆమె కారణంగా తాను ట్రాఫిక్‌లో కొన్ని గంటల పాటు వేచి చూడాల్సి వచ్చిందని ఓ న్యాయవాది ఫిర్యాదు చేశారు. వివరాలు... గత శుక్రవారం ముజఫర్‌పూర్‌లో ఓ హోటల్ ప్రారంభోత్సవానికి రవీనా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెను చూసేందుకు జనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ నిలిచి పోయింది. దీంతో తన సమయం వృథా అయిందని, అందుకే రవీనా, హోటల్ యజమానులపై ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది పేర్కొన్నారు. కాగా నవంబరు 2న ఈ కేసు విచారణకు రానుంది. -
దేవుడు ఇవ్వలేదు!
‘మాత్ర్’ సినిమా విడుదలై ఏడాది అయింది. ఆ తర్వాత బాలీవుడ్ రవీనా టాండన్ పెద్దగా వార్తల్లో లేరు. ఆమె పనుల్లో ఆమె ఉన్నారు. అయితే మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా ట్విటర్లో ప్రత్యక్షం అయ్యారు! ‘‘సెలబ్రిటీలను విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. తిరిగి మాట అనే హక్కును మాత్రం సెలబ్రిటీలకు దేవుడు ఇవ్వలేదు. ట్వీటర్ వచ్చాకైతే చాలా తేలికైపోయాం’’ అని ఎంతో ఆవేదనగా కామెంట్ పెట్టారు రవీనా. దీనిని బట్టి రవీనా మనసును ఎవరో బాగా గాయపరిచినట్లే ఉంది. రవీనా ముక్కుసూటి మనిషి. ఇలాంటి కామెంట్లను, వెబ్సైట్ల ఆకతాయి వేషాలను అస్సలు సహించరు. ఓసారి షాదీడాట్‌కామ్, షాదీటైమ్స్‌డాట్‌కామ్ తన అనుమతి లేకుండా తన ఫొటోలు వాడుకున్నందుకు ఆ రెండు సైట్ల మీద కేసు వేశారు. ఇంకోసారి ‘సత్యా సొల్యూషన్స్’ అనేవాళ్లు ‘మా వెబ్సైట్ వల్లే రవీనా, రవీనా భర్త కలుసుకున్నారు. ఆ తర్వాత భార్యాభర్తలయ్యారు’ అని ప్రకటించుకోవడం ఆమెను అగ్గిమీద గుగ్గిలం చేసింది. ఆ సైట్ మీద కూడా రవీనా కేసు వేశారు. తన విషయమనే కాదు, సమాజంలోని అన్యాయాలను, దుశ్చర్యలను కూడా రవీనా ధైర్యంగా ఖండిస్తారు. అందుకు తాజా ఉదాహరణ.. పై ట్వీట్ పెట్టిన రోజే ఆమె మరో ట్వీట్ పెట్టి, రేప్ కేసులో నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగర్‌ను విమర్శించడం. దీనిపై కూడా ఆమెకు పర్సనల్‌గా బెదిరింపులు వచ్చాయి కానీ రవీనా ఏమాత్రం స్పందించలేదు. సెంగర్ యు.పి.ఎమ్మెల్యే. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే అతడు అత్యాచారయత్నం కేసు నుంచి తప్పించుకోగలిగాడని కూడా రవీనా ట్వీట్ చేశారు. బహుశా ఆ ట్వీట్ విషయంలోనే రవీనా మనసును ఎవరో గాయపరచి ఉండాలి. -
సెల్‌ఫోన్స్‌పై ఆంక్షలు ఉన్నట్టుగా తెలీదు
-
క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
ప్రముఖ హీరోయిన్ రవీనా టండన్‌పై ఒరిస్సాలోని భువనేశ్వర్‌లో కేసు నమోదైంది. ఓ ప్రముఖ ఆలయంలోని నిషేదిత ప్రాంతంలో మొబైల్ ఫోన్ వినియోగించటంతో పాటు, హిందుల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆమె మీద భువనేశ్వర్ డీసీపీ కేసు నమోదు చేశారు. గత ఆదివారం ఒరిస్సాలోని భువనేశ్వర్ శ్రీ లింగరాజ్ స్వామి ఆలయాన్ని రవీనా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆలయంలో ఓ యాడ్‌ను మొబైల్ ఫోన్లో షూట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆలయంలోకి సెల్‌ఫోన్స్ తీసుకెళ్లేందుకు అనుమతి లేకపోయినా.. రవీనా ఫోన్ తీసుకెళ్లటం నిషేదిత ప్రాంతంలో వీడియో తీయటం లాంటి కారణాలతో ఆమె మీద కేసు నమోదు చేశారు. ఈ విషయంపై స్పందించిన రవీనా ‘మా కారణంగా ఆలయ నిర్వహకులు ఇబ్బంది పడ్డారు. మా సిబ్బంది సెల్ ఫోన్లు వాడటం, వీడియోలు తీయటం, సెల్పీలు దిగటం వల్ల వారికి ఇబ్బంది కలిగింది. కానీ మాకు అక్కడ మొబైల్ వినియోగించటంపై ఆంక్షలు ఉన్నట్టుగా తెలీదు. అక్కడ మేం యాడ్ షూట్ లాంటిదేమీ చేయలేదు. కేవలం మొబైల్లో వీడియో తీశాం. అక్కడ ఉన్నవారు కూడా మాకు నిషేదం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు’ అని క్లారిటీ ఇచ్చారు. -
పదిహేనేళ్లకే పడ్డాడు
‘అందాజ్ అప్నా అప్పా’ 1994 మూవీ. అప్పుడు ప్రభాస్ ఏజ్ పదిహేనేళ్లు. ఆ సినిమాలోని ‘ఎల్లోజీ సనమ్ హమ్ ఆగయే’ అనే పాటను ప్రభాస్ చాలా ఏళ్లపాటు పాడుకుంటూ తిరిగాడు. ఇప్పటికీ ఆ పాట వస్తుంటే.. అటువైపు తలతిప్పి చూస్తాడు. ప్రభాస్ టీనేజ్ క్రష్ సాంగ్ అది! ఇరవై మూడేళ్లుగా అతడిని హంట్ చేస్తోంది. ఇంతకీ ప్రభాస్ క్రష్ ఎవరంటే ఆ సినిమాలోని రవీనా టాండన్! పాట ఆమిర్ ఖాన్, రవీనాల మీద ఉంటుంది. ఆ పాట తర్వాత రవీనా.. ప్రభాస్ మనసులో ఉండిపోయింది. ‘మీ ఫస్ట్ క్రష్ ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్?’ అని అడిగితే ప్రభాస్ వెంటనే ‘ఎల్లోజీ సనమ్ హమ్ ఆగయే’ అని హమ్ చేస్తాడు.. చిరునవ్వులు చిందిస్తూ! రాణా ఓసారి ముంబై వెళ్లినప్పుడు ‘మా ప్రభాస్.. మీ డైహార్డ్ ఫ్యాన్’ అని చెప్తే రవీనాతో పాటు, ఆమె భర్త అనిల్ తందానీ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ‘బాహుబలి’ కింగ్డమ్తో స్టార్డమ్ తెచ్చుకున్న ప్రభాస్‌కు ఇప్పుడు లెక్కలేనంత మంది ఫ్యాన్స్. ప్రభాస్‌కి మాత్రం ఇప్పటికీ ఒకే ఒక్క ఫ్యాన్ రవీనా. అంతే కాదు, ముంబై ఎప్పుడు వెళ్లినా ప్రభాస్ టీమ్ తప్పకుండా రవీనా ఫ్యామిలీని కలిసి వస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ షూటింగ్లో, క్లైమాక్స్ సీన్స్‌లో బిజీగా ఉన్నాడు.