
స్టార్ హీరోయిన్ రవీనా టండన్ ఇప్పుడు సినిమాల జోరు పెంచింది. గతేడాది 'వన్ ఫ్రైడే నైట్' అనే ఒకే ఒక్క సినిమాతో అభిమానులను పలకరించిన ఈ నటి ఈ ఏడాది 'పట్న శుక్లా' మూవీతో ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'వెల్‌కమ్ టు ద జంగిల్', 'ఘుడ్చడి' సినిమాలున్నాయి. తాజాగా ఆమె సినీ ఇండస్ట్రీలో ఎంతోకాలంగా కొనసాగుతున్న పారితోషికాల వ్యత్యాసాలపై స్పందించింది.
వాళ్లకే ఎక్కువ
'ఆ రోజుల్లో డబ్బు చాలా తక్కువ ఇచ్చేవారు. పైగా హీరో, హీరోయిన్‌కు ఇచ్చే రెమ్యునరేషన్‌లో ఎంతో తేడా ఉండేది. మగవారికి ఎప్పుడూ ఎక్కువే ఇచ్చేవారు. ఎంతలా అంటే.. వారు ఒక్క సినిమాతో సంపాదించేది.. మేము పదిహేను సినిమాలు చేస్తేకానీ వచ్చేది కాదు. అందరి గురించి నేను మాట్లాడటం లేదు.. నా విషయంలో అయితే అదే జరిగింది. నేను 15-20 సినిమాల ద్వారా సంపాదించే డబ్బు.. నా సహనటుడికి ఒక్క చిత్రంతోనే వచ్చేది. ఇప్పుడు కార్పొరేట్‌ల రాకతో పరిస్థితులు కాస్తంత మెరుగయ్యాయి' అని చెప్పుకొచ్చింది.
చదవండి: ఓటీటీకి మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
Comments
Please login to add a commentAdd a comment