
ఎవరైనా మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయనో, బ్యాగు బాగుందనో, నెక్లెస్ బాగుందనో చెప్తే థాంక్స్ అంటూ సంతోషిస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటి మాత్రం బంగారు దిద్దులు బాగున్నాయన్నందుకు ఏకంగా వాటినే తీసి బహుమతిగా ఇచ్చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్ రవీనా టండన్ (Raveena Tandon). రవీనా తన కూతురు రాషా తడానీతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో బుధవారం సాయంత్రం ప్రత్యక్షమైంది. ఆమె కనిపించగానే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తనను వెంబడిస్తూ కెమెరాలో రికార్డు చేస్తున్నారు.
బంగారు కమ్మ బహుమతిగా..
వారిలో ఒకరు రవీనాను తన చెవిదిద్దులు బాగున్నాయని పొగిడాడు. దాంతో రవీనా ఏ కమ్మ బాగుందని అడుగుతూ దాన్ని తీసేసింది. తనకు కాంప్లిమెంట్ ఇచ్చిన వ్యక్తిని ఆ బంగారు దిద్దును బహుమతిగా ఇచ్చేసింది. ఇదంతా చూసిన రాహా.. తల్లి చేసిన పనికి నోరెళ్లబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రవీనా మనసు బంగారం.. ఈ రోజుల్లో బంగారాన్ని దానం చేసే మహానుభావులు ఎవరున్నారు? వావ్, మంచి మనసున్నవాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి.. తను నిజంగా గ్రేట్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
రెండు గాజులు గిఫ్ట్‌గా..
రవీనా ఇలా తన ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఓ పెళ్లికి హాజరైన ఆమె పెళ్లికూతురికి తన గాజుల్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. అవి సాధారణ బ్యాంగిల్స్ కావు. వాటిపై రవీనా పేరుతో పాటు ఆమె భర్త అనిల్ పేరు కూడా రాసి ఉంది. అయినా అవేమీ పట్టించుకోకుండా వాటిని కొత్త జంటకు కానుకగా ఇచ్చేసింది. ఆమె సినిమాల విషయానికి వస్తే వెల్‌కమ్ టు ద జంగిల్ సినిమా చేస్తోంది. అనీస్ బజ్మీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, సంజయ్ దత్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
చదవండి: ఆ డైరెక్టర్ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్‌లో 13 ఏళ్లు టీచర్‌గా..: హిట్లర్ నటి
Comments
Please login to add a commentAdd a comment