
బాలీవుడ్ భామ, సీనియర్ నటి రవీనా టాండన్ ఆధ్యాత్మిక బాటపట్టారు. తాజాగా తన కుమార్తె రషా తడానితో కలిసి పూణెలోని భీమశంకర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజల చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను రవీనా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంతకుముందే మహారాష్ట్ర నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ శివాలయాన్ని రవీనా సందర్శించారు.
సినిమాల విషయానికొస్తే రవీనా టాండన్ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న 'పట్నా శుక్లాలో నటించారు. ఈ చిత్రంలో సతీష్ కౌశిక్, మానవ్ విజ్ కలిసి నటించారు. అర్బాజ్ ఖాన్ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ బుడకోటి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం రవీనా 'వెల్‌కమ్ -3' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్షద్ వార్సీ, దిశా పటానీ, లారా దత్తా, పరేష్ రావల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment