![Raveena Tandon daughter Rasha Bollywood debut with Ajay Devgn nephew - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/20/WhatsApp%20Image%202023-01-20%20at%2015.39.32%281%29.jpeg.webp?itok=MvMQRZZc)
రవీనా టాండన్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకున్న నటి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది రవీనా టాండన్. తాజాగా ఆమె కూతురు రాషా తడాని సైతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది.
(ఇది చదవండి: అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?)
అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్‌కు జంటగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టి రాషా పైనే ఉంది. రవీనా టాండన్ కూతురిగా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ నడుస్తోంది.
నిర్మాత అభిషేక్ కపూర్ గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. 'గత 15 ఏళ్లుగా భారతీయ సినిమాకి అభిషేక్ అందించిన సహకారం ప్రశంసనీయం. అతను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఫర్హాన్ అక్తర్, రాజ్‌కుమార్ రావు, సారా అలీ ఖాన్ లాంటి కొత్త వ్యక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రతి సినిమాలో వారి పాత్రలను అందించాడు. ఆ సినిమాలు మనతో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ పాత్రలు ఈ నటీనటుల జీవితాల్లో అద్భుతాలుగా నిలిచాయి. భారతీయ సినిమాకు, ఆయన ప్రగతిశీల ఆలోచనకు ఇది సంకేతం.' అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment