debut
-
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మత్స్య కన్యలా జాన్వీ స్టన్నింగ్ లుక్..! (ఫొటోలు)
-
శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ.. ఆ స్టార్ హీరోతోనే!
తమిళ నటుడు అజిత్ ఇప్పుడు ఒకేసారి రెండు చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అందు విడాముయర్చి. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ కార్యక్రమాల్లో జాప్యం జరుగుతోంది.ఇదిలా ఉండగా.. అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని చిత్రంతో సూపర్‌హిట్ కొట్టిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు జంటగా నటి శ్రీలీల, సిమ్రాన్, మీనా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజం అయితే నటి శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తోంది.కాగా.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవల సైలెంట్‌గా ఎలాంటి హంగామా లేకుండా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. అంతేకాదు శుక్రవారంతో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటుందని అజిత్ సన్నిహితుడు తెలిపారు. హైదరాబాద్‌లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు, అజిత్ పాల్గొనే ఇంట్రో పాటను చిత్రీకరించినట్లు ఆయన తెలిపారు.కాగా అజిత్ తదపరి విడాముయర్చి చిత్రం షూటింగ్లో పాల్గొననున్నారని.. జూన్ రెండు లేదా మూడో వారంలో ఈ చిత్రం షూటింగ్ ఉంటుందని చెప్పారు. ఇదే ఈ చిత్రం చివరి షెడ్యూల్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ తరువాత గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం షూటింగ్లో పాల్గొంటారని తెలిపారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి ముందు విడాముయర్చి చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. -
హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)
-
అది చూసి అడల్ట్ స్టార్ అన్నారు: హీరో పోస్ట్ వైరల్!
బాలీవుడ్ ప్రముఖ నటుడు అభయ్ డియోల్ 'సోచా న తా' అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అయేషా టాకియా, అపూర్వ జా హీరోయిన్లుగా నటించారు. ఫుల్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా 2005లో రిలీజైంది. ఈ రోజుకు సినిమా విడుదలైన 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హీరో అభయ్ డియోల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మీరు ఓ లుక్కేయండి. అభయ్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఇప్పటికీ కూడా ఈ సినిమా నిన్ననే చేసినట్లు అనిపిస్తోంది. ఆ చిత్రంలో మేము చాలా అమాయకంగా కనిపించాం. ఎందుకంటే అది మాకు ఇంకా నేర్చుకునే సమయం. కానీ ఇప్పటికీ 19 ఏళ్ల తర్వాత కూడా సినిమాలు చేస్తున్నాను. నేను చేసిన సినిమాల ద్వారానే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నా. అంతే కానీ పీఆర్ టీమ్ ద్వారా నేను ఫేమ్ తెచ్చుకోలేదు. నేను ఎంచుకున్న సినిమాల్లో విజయాలు, వైఫల్యాలను స్వయంగా చూశా. నన్ను నేను అనుసరించడం చాలా విలువైన పాఠాలు నేర్పింది. నేను ఎప్పటికీ నాలాగే ఉంటా. ఎందుకంటే నేను ఈ రోజు వ్యక్తిని కాను. సినిమా కోసం నా సొంత స్టైలిస్ను పొందాలని కోరుకుంటా. కానీ కొందరు మాత్రం ఆ సినిమాలో నా సైడ్ బర్న్స్ (కణతలు) చూసి 1970ల్లో పోర్న్ స్టార్లా ఉన్నారంటూ కామెంట్ చేశారు' అని పోస్ట్ చేశారు. ఇది చూసిన ఆయన ఫ్యాన్స్ సోచా న తా సూపర్ హిట్ మూవీ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Abhay Deol (@abhaydeol) -
IND vs ENG: కల నేరవేరింది.. ఎట్టకేలకు అరంగేట్రం! ఎవరీ ఆకాష్ దీప్?
టీమిండియా తరపున అరంగేట్రం చేయాలన్న బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ కల ఎట్టకేలకు నేరవేరింది. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టుతో ఆకాష్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. నాలుగో టెస్టుకు స్టార్ పేసర్ బుమ్రా దూరం కావడంతో ఆకాష్ దీప్‌కు తుది జట్టులో చోటు దక్కింది. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదగా ఆకాష్ తన తొలి టెస్టు క్యాప్‌ను అందుకున్నాడు. టీమిండియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 313వ ఆటగాడిగా ఆకాష్ నిలిచాడు. కాగా ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో ఆకాష్ దీప్‌కు చోటు దక్కలేదు. అయితే దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు సెలక్టర్లు అతడికి పిలుపునిచ్చారు. అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ఆకాష్ ఇప్పుడు ఏకంగా భారత జెర్సీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ఆకాష్ ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనాధికార టెస్టు సిరీస్‌లో కూడా ఆకాష్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన దీప్ 13 వికెట్లు పడగొట్టి.. భారత్-ఏ జట్టు తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఎవరీ ఆకాష్ దీప్ అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఎవరీ ఆకాష్ దీప్..? 27 ఏళ్ల ఆకాష్ ఆకాష్ దీప్ బీహార్‌లోని ససారం అనే గ్రామంలో జన్మించాడు. ఆకాష్‌ది మధ్యతరగతి కుటంబం. అతడు తన చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. క్రికెట్ వైపు అడుగులు వేస్తున్న సమయంలో దీప్ జీవితంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. అతడి తండ్రి మరణించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతడి సోదురుడు కూడా తుదిశ్వాస విడిచాడు. ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆకాష్ మాత్రం దృడ సంకల్పంతో తన కెరీర్ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక అసన్సోల్లోని ఓ క్రికెట్ ఆకాడమీలో దీప్ చేరాడు. ఆ తర్వాత అసన్సోల్లోని ఖేప్ క్రికెట్' టెన్నిస్ బాల్ టోర్నీలో అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయడంతో దుబాయ్ వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ కూడా ఆకాష్ దుమ్మురేపాడు. ఆ తర్వాత బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ డివిజన్ మ్యాచ్‌ల్లో ఆడే ఛాన్స్ లభించింది. ఓ సారి కోల్‌కతాలోని రేంజర్స్ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు అప్పటి బెంగాల్ సీనియర్ టీమ్ డైరెక్టర్ జోయ్‌దీప్ ముఖర్జీ దృష్టిలో ఆకాష్ దీప్ పడ్డాడు. ఆకాష్ దీప్ బౌలింగ్ చేస్తున్నప్పుడు కీపర్ స్టంప్‌ల వెనుక 10 గజాల దూరంలో నిల్చోడం చూసి జోయ్‌దీప్ ముఖర్జీ ఆశ్చర్యపోయారు. వెంటనే అండర్-23 కోచ్ సౌరాశిష్‌ను పిలిపించి ఆకాష్ దీప్ గురించి తెలుసుకున్నాడు. ఈ క్రమంలో అప్పటి బెంగాల్ క్రికెట్ ఆసోషియేషన్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు దీప్‌ను ముఖర్జీ రిఫర్ చేశాడు. ఇదే అతడి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో ఆకాష్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ఆకాష్ పాల్గొనున్నాడు. ఆ తర్వాత 2019లో బెంగాల్ తరపున ఆకాష్ దీప్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది ఫస్ట్‌క్లాస్ క్రికెట్, టీ20ల్లో అరంగేట్రం చేశాడు. Say hello to #TeamIndia newest Test debutant - Akash Deep 👋 A moment to cherish for him as he receives his Test cap from Head Coach Rahul Dravid 👏 👏 Follow the match ▶️ https://t.co/FUbQ3Mhpq9 #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/P8A0L5RpPM — BCCI (@BCCI) February 23, 2024 ఓవరాల్‌గా క్రికెట్లో ఇప్పటివరకు 29 మ్యాచ్‌లు ఆడిన ఆకాష్ 103 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లో ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 మెగా వేలంలో రూ. కనీస ధరకు అతడిని ఆర్సీబీ కొనుగోలు చేసింది. -
ఒకేరోజు ఎనిమిది మంది క్రికెటర్ల ఎంట్రీ!
క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన ఘటన చోటు చేసుకుంది. వివిధ ఫార్మాట్లలో ఇవాళ (2024, ఫిబ్రవరి 2న) ఏకంగా ఎనిమిది మంది ఆటగాళ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ముందుగా విశాఖ వేదికగా జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాడు రజత్ పాటిదార్, ఇంగ్లండ్ యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ టెస్ట్ క్రికెట్ అరంగేట్రం చేశారు. వెస్టిండీస్‌తో ఇవాళ జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఇద్దరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు వన్డే అరంగేట్రం చేశారు. శ్రీలంకతో ఇవాళే మొదలైన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఏకంగా నలుగురు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. మొత్తంగా ఇవాళ ఎనిమిది మంది ఆటగాళ్లు వివిధ ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. క్రికెట్ చరిత్రలో ఇంతమంది ఒకే రోజు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన దాఖలాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇవాళ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఆటగాళ్ల వివరాలు.. రజత్ పాటిదార్ (భారత్) షోయబ్ బషీర్ (ఇంగ్లండ్) జేవియర్ బార్ట్లెట్ (ఆస్ట్రేలియా) లాన్స్ మోరిస్ (ఆస్ట్రేలియా) నూర్ అలీ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) నవీద్ జద్రాన్ (ఆఫ్ఘనిస్తాన్) జియా ఉర్ రెహ్మాన్ అక్బర్ (ఆఫ్ఘనిస్తాన్) మొహమ్మద్ సలీం (ఆఫ్ఘనిస్తాన్) ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌ల విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో ఇవాళ మొదలైన రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ టీ విరామం సమయానికి 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (125 నాటౌట్) కెరీర్లో మూడో సెంచరీతో కదంతొక్కగా.. అతనికి జతగా అరంగేట్రం ఆటగాడు రజత్ పాటిదార్ (25) క్రీజ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాళ్లు రజత్ పాటిదార్, షోయబ్ బషీర్ పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా-వెస్టిండీస్ తొలి వన్డే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయానికి చేరువలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 48.4 ఓవరల్లో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 34 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 208 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. గ్రీన్ (68), స్టీవ్ స్మిత్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్ గెలుపుకు మరో 24 పరుగులు మాత్రమే అవసరం ఉంది. అరంగేట్రం ఆటగాళ్లు జేవియర్ బార్ట్లెట్ (9-1-17-4) అద్భుత గణాంకాలతో విజృంభించగా.. లాన్స్ మోరిస్ (10-2-59-0) పర్వాలేదనిపించాడు. ఆఫ్ఘనిస్తాన్-శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆఫ్ఘనిస్తాన్ తొలి రోజు మూడో సెషన్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు (53 ఓవర్లు) చేసింది. కైస్ అహ్మద్ (16), జియా ఉర్ రెహ్మాన్ (0) క్రీజ్‌లో ఉన్నారు. అరంగేట్రం ఆటగాళ్లలో నూర జద్రాన్ (31) కాస్త పర్వాలేదనించాడు. -
మార్క్రమ్ చేసిన తప్పు.. ఆలస్యంగా వెలుగులోకి
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసినట్లే. శనివారం లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. 182 పరుగుల భారీ స్కోరు చేసి కూడా మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయింది. అభిషేక్ శర్మ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ ఎస్ఆర్హెచ్ను ముంచగా.. మిగతా బౌలర్లు కూడా అంతగా రాణించలేకపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ భారీ ఓటమిని మూటగట్టుకుంది. అయితే మ్యాచ్‌కు ముందు మార్క్రమ్ చేసిన తప్పిదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రతీ మ్యాచ్‌కు ముందు ఇచ్చే తుది జట్టు షీట్‌ను మార్క్రమ్ తప్పుగా ఇచ్చాడు. టాస్ సమయంలో చెప్పిన ఆటగాడి పేరు తుది జట్టులో లేకపోగా.. కనీసం సబ్‌స్టిట్యూట్‌గా కూడా లేకపోవడం గమనార్హం. విషయంలోకి వెళితే.. వాస్తవానికి లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ ద్వారా యంగ్ బౌలర్ సన్విర్ సింగ్ అరంగేట్రం చేయాల్సింది. మార్క్రమ్ కూడా టాస్ సమయంలో సన్విర్ సింగ్ ఐపీఎల్‌తో పాటు ఎస్ఆర్హెచ్ తరపున డెబ్యూ చేయనున్నట్లు పేర్కొన్నాడు. కానీ సన్వర్ సింగ్ పేరు ఆ తర్వాత తుది జట్టులో కనిపించలేదు. పొరపాటున అలా జరిగి ఉంటుందిలే అనుకుంటే.. అసలు ఫీల్డింగ్.. బ్యాటింగ్ ఇలా రెండు సమయాల్లోనూ అతను కనిపించలేదు. ఇక వివ్రాంత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. మాజీ క్రికెటర్.. ప్రస్తుతం ఐపీఎల్లో కామెంటేటర్‌గా పనిచేస్తున్న స్కాట్ స్టైరిస్ ఈ తప్పిదాన్ని గుర్తించాడు. మార్క్రమ్ ఇచ్చిన తప్పుడు షీట్‌ను కెమెరా ముందు పెట్టాడు. ఆ షీట్లో సన్వర్ సింగ్ పేరు క్రాస్ చేసి నటరాజన్ పేరును పెట్టారు. ''ఒక ఆటగాడికి అరంగేట్రం అని చెప్పి ఇప్పుడు అతని పేరు కనిపించకపోవడం అనేది తప్పు. మ్యాచ్ అరంగేట్రం చేస్తున్నానన్న సంతోషం కాసేపు కూడా లేకుండా చేశారు. దీనికి మార్క్రమ్ బాధ్యత వహించాలి.'' అని పేర్కొన్నాడు. మరో విశేషమేమిటంటే.. సన్వర్ సింగ్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఎస్ఆర్హెచ్ క్యాప్ అందుకున్నాడు. కానీ తుదిజట్టు సహా ఇంపాక్ట్ ప్లేయర్లలో ఎక్కడా అతని పేరు కనిపించలేదు. అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సమయంలో నటరాజన్‌ను సన్వర్ సింగ్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపించినట్లు తెలిసింది. అయితే గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్వర్ సింగ్ ఎస్ఆర్హెచ్ తరపున అరంగేట్రం చేసే అవకాశం ఉంది. These Clowns had submitted wrong teamsheet lmao 😭 pic.twitter.com/sti6OnBX2r — . (@manisayzz) May 14, 2023 చదవండి: ఔటైతే బాధపడతారు.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ -
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. పోస్టర్ రిలీజ్
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాన్నునారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు హీరోలుగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నందమూరి వారసుడు కూడా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు.నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ వెండితెరకు పరిచయం కానున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన హీరోగా డెబ్యూ ఇస్తున్నారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ను మార్చి 5న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. Production No.1 from @BTRCreations 💥 Brace Yourselves for the Title Launch on March 5th 🤩 🌟ing #NandamuriChaitanyaKrishna 🤩 A film by @VKrishnaakella 🎬 𝙀𝙫𝙚𝙧𝙮 𝙨𝙞𝙣𝙣𝙚𝙧 𝙣𝙚𝙚𝙙𝙨 𝙩𝙧𝙚𝙖𝙩𝙢𝙚𝙣𝙩 pic.twitter.com/1IvnIv8Djk — Basavatarakarama Creations (@BTRcreations) March 3, 2023 -
ఆ హీరో మేనల్లుడితో స్టార్ హీరోయిన్ కుమార్తె ఎంట్రీ..!
రవీనా టాండన్ బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరు. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకున్న నటి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది రవీనా టాండన్. తాజాగా ఆమె కూతురు రాషా తడాని సైతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. (ఇది చదవండి: అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?) అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్ దేవగణ్‌కు జంటగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్లో ఇప్పుడు అందరి దృష్టి రాషా పైనే ఉంది. రవీనా టాండన్ కూతురిగా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ నడుస్తోంది. నిర్మాత అభిషేక్ కపూర్ గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. 'గత 15 ఏళ్లుగా భారతీయ సినిమాకి అభిషేక్ అందించిన సహకారం ప్రశంసనీయం. అతను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఫర్హాన్ అక్తర్, రాజ్‌కుమార్ రావు, సారా అలీ ఖాన్ లాంటి కొత్త వ్యక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రతి సినిమాలో వారి పాత్రలను అందించాడు. ఆ సినిమాలు మనతో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ పాత్రలు ఈ నటీనటుల జీవితాల్లో అద్భుతాలుగా నిలిచాయి. భారతీయ సినిమాకు, ఆయన ప్రగతిశీల ఆలోచనకు ఇది సంకేతం.' అని అన్నారు. -
హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎంజీఆర్ మనువడు.. రిలీజ్‌కు రెడీ
తమిళసినిమా: ఎంజీఆర్ మనవడు జూనియర్ ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన చిత్రం ఇరుంబన్. నటి ఐశ్వర్య దత్తా నాయకిగా నటించిన ఇందులో నటుడు యోగిబాబు, సెండ్రాయన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని కీరా దర్శకత్వంలో తమిళ్ బాలా, ఆర్.వినోద్ కుమార్ నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ దేవా సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం స్థానిక కేకేనగర్‌లోని శాంతి మెట్రిక్యులేషన్ స్కూల్లో నిర్వహించారు. ఇందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నామ్ తమిళర్ పార్టీ నేత సీమాన్ చిత్ర ఆడియోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరంభ దశలో నటుడు విజయ్‌కు ఆయన తండ్రి దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ సపోర్ట్ చేశారని, అయితే విజయ్ సూపర్‌స్టార్‌గా ఎదగడానికి ఆయన కఠిన శ్రమే కారణమన్నారు. ఇప్పుడు డాన్స్‌లో ఇండియాలోనే విజయ్ను మించిన వారు లేరన్నారు. నటుడు ధనుష్‌కు కూడా మొదట్లో ఆయన తండ్రి అండగా ఉన్నారని, తన ప్రతిభతోనే అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎంజీఆర్ మనవడిగా సినిమా రంగంలోకి అడుగుపెడుతున్న జూనియన్ ఎంజీఆర్ కూడా కష్టపడితేనే తగిన గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఇరుంబన్ చిత్ర పాటలు, ట్రైలర్ బాగున్నాయని సీమాన్ అన్నారు. చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న సింగర్ సునీత కొడుకు.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అందంలోనూ హీరోయిన్స్‌కి ఏమాత్రం తీసిపోదు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌కి సమానమైన క్రేజ్‌ను సంపాదించుకున్న ఏకైక సింగర్ సునీత. ఇదిలా ఉండగా త్వరలోనే ఆమె కొడుకు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నట్లు కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగానే సినీ సెలబ్రిటీల విషయానికి వస్తే.. తమ పిల్లలను హీరో, హీరోయిన్స్‌గా ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఇప్పటికే కూతురు శ్రియాను సింగర్‌గా పరిచయం చేసిన సునీత కొడుకును మాత్రం హీరోగా వెండితెరపై చూడాలని కలలు కంటుందట. ఇదే విషయాన్ని సునీత కూడా కన్ఫర్మ్ చేసేసింది. ఆకాష్ బర్త్‌డే సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ తెలిపిన సునీత.. నిన్ను మంచి నటుడిగా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ పోస్ట్‌ను షేర్ చేసింది. దీంతో ఆకాష్‌కి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు ఆమె ఫ్యాన్స్. మరి ఆకాష్ ఏ సినిమాలో నటిస్తున్నారు? డైరెక్టర్ ఎవరన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచిచూడాల్సిందే. View this post on Instagram A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha) -
ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న షారుక్ ఖాన్ కుమారుడు
సాధారణంగా స్టార్ హీరోల వారసుడు అంటే హీరోగానే ఎంట్రీ ఇస్తుంటారు. కానీ దీనికి భిన్నంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారు ఆర్యన్ ఖాన్ మాత్రం రచయితగా అరంగేట్రం చేయబోతండటం విశేషం. తనకు హీరోగా నటించాలని లేదని, తెరవెనుక తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకున్నాక అప్పుడు నటన గురించి ఆలోచిస్తానని ఆర్యన్ ఇదివరకే చాలాసార్లు చెప్పాడు. తాజాగా ఆయన ఓ కామెడీ వెబ్‌సిరీస్ కోసం కథ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ని బేస్ చేసుకొని ఈ కథ ఉంటుందట. కాగా గతంలో డ్రగ్స్ కేసులో భాగంగా ఆర్యన్ జైలు జీవితాన్ని గడిపిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ సైతం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. ‘ది అర్చీస్’ అనే వెబ్‌సిరీస్‌లో ఆమె నటిస్తుంది. -
మూవీ ఎంట్రీపై మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య క్లారిటీ!
మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె నటిగా రాణించింది. ఇక పెళ్లి అనంతరం ప్రొడ్యూసర్‌గా మారిపోయింది. ఇప్పటికే ఓ వెబ్ సిరీస్, సినిమాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆమె భర్త గురించి ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కాగా పెళ్లి అనంతరం నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినిమాల్లోకి రాబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. చదవండి: విజయ్, రష్మిక డేటింగ్? హింట్ ఇచ్చిన అనన్య పాండే దీంతో మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నాడంటూ అందరు చర్చించుకున్నారు. చైతన్య హైట్, పర్సనాలిటి కూడా హీరోకు ఏమాత్రం తీసిపోకుండ ఉండటంతో అంతా అతడి ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తన మూవీ డెబ్యూ చైతన్య సన్నిహితుల నుంచి ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కాగా చైతన్యకు సినిమాలు, నటన అంటే పెద్ద ఆసక్తి లేదని, అతడి వ్యాపారం అంటనే ఇష్టమని చెప్పినట్లు తెలుస్తోంది. చదవండి: రష్మికపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు నిహారికి పెళ్లి అనంతరం ఎక్కడికి వెళ్లిన చైతన్యకు తన సినీ ఎంట్రీపై ప్రశ్నలు ఎదురవుతున్నాయట. వాటికి విసిగిపోయిన చైతన్య తనకు యాక్టింగ్ అంటే ఇష్టం లేదని, ప్రస్తుతం తాను చేస్తున్న వ్యాపారం పట్ల సంతృప్తిగా ఉన్నానని కుండలు బద్ధలు కొట్టినట్లు సన్నిహితుల నుంచి సమాచారం. కాగా నిహారిక-చైతన్యలు 2020 లాక్డౌన్లో డిసెంబర్ 9న పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. -
సమ్మోహనం... లహరి కూచిపూడి అరంగేట్రం
వాషింగ్టన్: తెలుగు నేలపై ప్రాణం పోసుకున్న కూచిపూడి నాట్యం ఖండాంతరాలు దాటి తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. అమెరికాలో స్థిరపడిన భారతీయ కుటుంబాలు తమ పిల్లలకు శాస్త్రీయ నృత్యాలను నేర్పిస్తూ సంస్కృతిని పరిరక్షిస్తున్నారు. జార్జియా రాష్ట్రం అట్లాంటాలో 17 ఏళ్ల లహరి పిసికె ప్రదర్శించిన కూచిపూడి ఆరంగేట్రం స్థానిక అమెరికన్లతో పాటు అహూతులైన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. అట్లాంటాలో పలు సాఫ్ట్ వేర్ సంస్థలు నిర్వహిస్తున్న వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవి దంపతుల కుమార్తె లహరి 8వ ఏట నుంచే అభ్యాసం ప్రారంభించి ఆదివారం నాడు తొలి అరంగేట్రం ప్రదర్శనతో అందరినీ అలరించింది. కూచిపూడిలోని అత్యంత కఠినమైన 100 రకాలు పాద ముద్రలు, శిల్ప సదృశ్య దేహ భంగిమలు, హస్త ముద్రలు, కళ్ల కదలికలతో ముఖంలో అనేక భావాలను పలికించి ప్రశంసలు పొందింది. విఘ్నేశ్వర, నటరాజ పూజలతో మొదలైన నాట్య ప్రదర్శన నాలుగు గంటల పాటు నిర్విరామంగా సాగింది. చదవండి👉🏻అదే భారత్ గొప్పతనం.. ‘సాక్షి’తో సద్గురు తల్లిదండ్రులు వేణు కుమార్ రెడ్డి పిసికె, వాసవిలతో.. లహరి వేణు స్వగ్రామం నల్లొండ జిల్లాలోని అల్వాల గ్రామం. 25 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) అనుబంధ సంస్థ అయిన అమెరికా క్రికెట్ బోర్డు వ్యవస్థాపక సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. చదవండి👉🏻మొసలిని పెళ్లాడిన మేయర్.. దాన్ని ముద్దుపెట్టుకుంటూ ఫోటోకు పోజులు -
15 ఏళ్ల కెరీర్ పూర్తి.. రోహిత్ శర్మ ఎమోషనల్
23 జూన్.. ఈ తేదీ టీమిండియాకు ఎంతో ప్రత్యేకం. ఇదే రోజున టీమిండియా ధోని సారధ్యంలో 2013లో ఇంగ్లండ్‌పై థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఐసీసీ చాంపియన్స్ ట్రోపీని గెలుచుకుంది. అయితే ఇదే రోజుకు మరొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రస్తుతం టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోజు కూడా ఇదే. 2007, జూన్ 23న బెల్ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా హిట్‌మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తాజాగా నేటితో 15 ఏళ్ల క్రికెట్ కెరీర్ పూర్తి చేసుకున్న రోహిత్ ఈ విషయాన్ని ట్విటర్లో పంచుకుంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. ''ఈ రోజుతో 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్నా. ఇన్నేళ్ల నా ప్రయాణంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధురానుభూతులు.. ఒడిదుడుకులు, చీకటి రోజులు ఉంటాయి. కానీ వాటిన్నింటిని అదిగమిస్తూ ఈస్థాయికి చేరుకున్నానంటే దానికి మీ అందరి సపోర్ట్ ఒక కారణం. అందుకే నా ప్రయాణంలో మద్దుతగా నిలిచిన క్రికెట్ లవర్స్, అభిమానులు, విమర్శలకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా.'' అంటూ ముగించాడు. 𝟭𝟱 𝘆𝗲𝗮𝗿𝘀 in my favourite jersey 👕 pic.twitter.com/ctT3ZJzbPc — Rohit Sharma (@ImRo45) June 23, 2022 క్రికెట్లో రోహిత్ శర్మ ప్రస్థానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా మిడిలార్డర్లో వచ్చిన రోహిత్ శర్మ సరైన ఫామ్ కనబరచలేక జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. సెహ్వాగ్, సచిన్‌ల రిటైర్మెంట్ తర్వాత ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన రోహిత్ శర్మకు ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వన్డేల్లో భారీ ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరుగా రోహిత్ శర్మ నిలిచాడు. వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతేకాదు వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన రికార్డు కూడా రోహిత్ పేరిటే ఉంది. 2014, నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 264 పరుగులు బాదాడు. ఆ తర్వాత 2019 అక్టోబర్ 5న సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇక కోహ్లి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా వైదొలగడంతో సారధ్య బాధ్యతలు ఎత్తుకున్న రోహిత్‌కు ఇంగ్లండ్ పర్యటన ఒక సవాల్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విదేశాల్లో ఇదే తొలి సిరీస్ అని చెప్పొచ్చు. ఇక రోహిత్ శర్మ టీమిండియా తరపున 228 వన్డేల్లో 9283 పరుగులు.. 44 టెస్టుల్లో 3076 పరుగులు, 124 టి20ల్లో 3,308 పరుగులు సాధించాడు. రోహిత్ ఖాతాలో వన్డేల్లో 29 సెంచరీలు, 8 టెస్టు సెంచరీలు, 4 టి20 సెంచరీలు ఉన్నాయి. చదవండి: 'నీ ఓపికకు సలాం'.. రంజీ ఫైనల్లో సెంచరీ బాదిన సర్ఫరాజ్ ఖాన్ నీటి అడుగున తేలియాడుతూ.. చావు అంచుల వరకు -
వెండితెరపైకి స్టార్ కిడ్స్.. హీరో, హీరోయిన్, డైరెక్టర్‌గా
Paloma Dhillon Rajveer Deol Debut In Rajshri Productions: బాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల వారసులు వెండితెరపై ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. ఇటీవలే బాలీవుడ్ బిగ్ ఫ్యామిలీస్ వారసులు అగస్త్యా నంద (అమితాబ్ బచ్చన్ మనవడు), ఖుషీ కపూర్ (బోనీ కపూర్-దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె), సుహానా ఖాన్ (షారుక్ ఖాన్ కుమార్తె) నటిస్తున్న తొలి వెబ్ ఫిల్మ్ ‘ద ఆర్చీస్’ పోస్టర్ విడుదలైంది. తాజాగా మరో స్టార్ హీరో తనయుడు, నటి కుమార్తె వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ కుమారుడు రాజ్వీర్ డియోల్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఇందులో హీరోయిన్గా ప్రముఖ నటి పూనమ్ దిల్లాన్, నిర్మాత అశోక్ థకేరియా కుమార్తె పలోమా దిల్లాన్ తెరంగేట్రం చేయనుంది. వీరిద్దరికి ఇదే డెబ్యూ మూవీ కానుంది. అంతేకాకుండా ఈ చిత్రంతో డైరెక్టర్ సూరజ్ బర్జాత్యా కుమారుడు అవినీష్ ఎస్ బర్జాత్యా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రాజశ్రీ ప్రొడక్షన్లో 59వ చిత్రంగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ముంబైలో జులైలో ప్రారంభం కానుంది. కాగా మోడ్రన్ సంబంధాలను చూపిస్తూ లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్ కథతో రానుంది ఈ మూవీ. చదవండి: బాలీవుడ్ బిగ్ స్టార్స్ వారసులంతా ఒకే ఫ్రేమ్‌లో.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టెన్షన్‌గా ఉంది.. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినట్లుంది : ఆలియా భట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. గంగూభాయ్, ఆర్ఆర్ఆర్ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఆలియా చేసే తర్వాతి ప్రాజెక్ట్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఆలియా భట్ త్వరలోనే హాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ‘హార్ట్ ఆఫ్ స్టోన్’అనే చిత్రం ద్వారా హాలీవుడ్ డెబ్యూ ఇవ్వనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆలియా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. 'హాలీవుడ్ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు బయలుదేరాను. ఇండస్ట్రీలోకి మళ్లీ కొత్తగా ఎంట్రీ ఇచ్చినట్లుంది. నెర్వస్‌గా ఫీలవుతున్నా' అంటూ తనలోని టెన్షన్‌ని బయటపెట్టింది. ఇక ఆలియా పోస్ట్‌ని చూసిన నెటిజన్లు డోంట్ వర్రీ ఆలియా. ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Alia Bhatt 🤍☀️ (@aliaabhatt) -
ఆరోజు యాక్టింగ్‌ను వదిలేస్తా : హీరో సిద్దార్థ్
లవర్ బాయ్ ఇమేజ్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరో సిద్దార్థ్. చాలాకాలం తర్వాత మహాసముద్రం సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత విజయం సాధించలేదు. తాజాగా ఎస్కేప్ లైవ్ అనే హిందీవెబ్‌సిరీస్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సిరీస్ డిస్నీ+హాట్ స్టార్ (Disney + Hotstar)లో మే 20 నుంచి ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దార్థ్ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'ఈ సిరీస్‌లో నాది రెగ్యులర్ రోల్ కాదు. ఈ పాత్రలో నన్ను ఎంపిక చేసినందుకు సంతోషంగా ఉంది. మంచి ఆఫర్లు వస్తే మళ్లీ బాలీవుడ్‌కు తిరిగొస్తా. ఢిపరెంట్ రోల్స్ వచ్చే వరకు యాక్టింగ్ చేస్తా. లేదంటే వేరే ఉద్యోగం చూసుకుంటా' అని సిద్దార్థ్ పేర్కొన్నాడు. -
ఓటీటీలోకి సిద్ధార్థ్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..
Siddharth OTT Debut Escaype Live Will Streaming On Disney Plus Hotstar: టాలీవుడ్లో లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. బొమ్మరిల్లుతో సూపర్ హిట్ కొట్టిన సిద్ధార్థ్ ఇటీవల మహాసముద్రం సినిమాతో అలరించాడు. ఈ హీరో తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్పెషల్స్ నిర్మించిన 'ఎస్కేప్ లైవ్' వెబ్ సిరీస్‌తో సందడి చేయనున్నాడు. ఈ వెబ్ సిరీస్‌కు సిద్ధార్థ్ కుమార్ తివారి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్ డిస్లీ ప్లస్ హాట్‌స్టార్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ట్విటర్ వేదికగా ప్రకటించింది. 'పోటీ చేస్తున్న అమ్మాయిలకు వజ్రాలు బెస్ట్ ఫ్రెండ్స్. మరీ ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు ?' అని ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్, డైరెక్టర్ గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ 'కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాను. తివారితో కలిసి పనిచేయడం నటుడిగా అద్భుతమైన అనుభవం. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తూ ప్రేరణ పొందాను. తివారితో స్క్రిప్ట్, పాత్రల అభివృద్ధి గురించి జరిపిన చర్చలు నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. నేను ఏం చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను. ఆయన ఆశించిన దానికి నేను ఇంకా ఏం ఇవ్వాలి అని నేను అనుకునేవాన్ని. నేను అనుకున్నదంతా చేయగలనని తివారి నన్ను నమ్మారు.' అని చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ఒక యాప్‌లో నిర్వహించే పోటీ ఆధారంగా తెరకెక్కించిన కల్పిత కథ అని సమాచారం. చదవండి: భయపెట్టేందుకు వచ్చేస్తున్న మహారాష్ట్ర జాంబీలు.. చూసేందుకు సిద్ధమా ! Diamonds are a g̶i̶r̶l̶'̶s̶ contestant's best friend! 💎💎 Who do you think will win?#HotstarSpecials #EscaypeLive all episodes streaming from May 20. Created and directed by Siddharth Kumar Tewary @sktorigins pic.twitter.com/vC2JZsuS88 — Disney+ Hotstar (@DisneyPlusHS) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోయిన్గా ఆమని మేనకోడలు.. పోస్టర్ విడుదల
Aamani Niece Hrithika Nari Nari Naduma Murari Poster Released: సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరో, హీరోయిన్లు కావడం సర్వసాధరణమే. కొంచెం టాలెంట్ ఉండి, వారసత్వం తోడేతే చిత్ర పరిశ్రమలో త్వరగా నిలుదొక్కుకోవచ్చు. ఇదే తరహాలో మరో బ్యూటీ వెండితెరకు పరిచయం కానుంది. హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆమని. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్ పెళ్లాం వంటి తదితర సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. ఆమని నట వారసురాలిగా ఆమె మేనకోడలు హృతిక వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. బాల నటిగా 3 సినిమాల్లో నటించిన హృతిక హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అభిలాష్ భండారి హీరోగా, హృతిక హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘నారి నారి నడుమ మురారి’. జీవీకే దర్శకత్వంలో చక్ర ఇన్ఫోటైన్మెంట్ పతాకంపై వెంకటరత్నం నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా జీవీకే మాట్లాడుతూ.. ‘‘లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి యానాం, అమలాపురం, వైజాగ్, లంబసింగి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్‌లో షూటింగ్ ప్లాన్ చేశాం. సింధు కే ప్రసాద్ సంగీతం, జే. ప్రభాకర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు. చదవండి: చరణ్ నటన నాకు కొత్తగా అనిపించలేదు: చిరంజీవి కానిస్టేబుల్‌గా కీర్తి సురేష్.. 24 హత్యలు.. ఆసక్తిగా 'చిన్ని' ట్రైలర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న రవితేజ కొడుకు?
టాలీవుడ్లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. కెరీర్ ఆరంభంలో చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు స్టార్ హీరోగా సత్తా చాటుతున్న రవితేజకు మహాధన్ అనే కొడుకు ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా నటించిన 'రాజా ది గ్రేట్' సినిమాలో రవితేజ చిన్నప్పటి రోల్లో మహాధన్ కనిపించాడు. ఇక అప్పటి నుంచి హీరోగా రవితేజ కొడుకు ఎంట్రీ అంటూ వార్తలు పుట్టుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇదివరకే స్పందించిన రవితేజ అతని చదువు పూర్తవగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తాడని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా కాలేజీ నేపథ్యంలో సాగే ఓ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ని మహాధన్‌తో తీయడానికి రవితేజను సంప్రదించగా ఆయన కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రాజా ది గ్రేట్ సినిమాతో రవితేజకు హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడే ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. -
బాలీవుడ్‌ను భయపెట్టనున్న అవికా గోర్..
Avika Gor Bollywood Debut With Vikram Bhatt 1920 Horrors of Heart: 'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నార్త్ బ్యూటీ అవికా గోర్. చైల్డ్ ఆర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ను ప్రారంభించిన అవికా గోర్ వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. 'ఉయ్యాల జంపాల' చిత్రంతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడ, రాజుగారి గది 3, నెట్, బ్రో సినిమాలతో ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా అడుగు పెట్టనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ డైరెక్ట్ చేసిన హార్రర్ మూవీ '1920'. 2008లో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది. ప్రస్తుతం ఈ సినిమాకు కొనసాగింపుగా తెరకెక్కుతున్న 1920 హారర్స్ ఆఫ్ ది హార్ట్ చిత్రంలో అవికా గోర్‌ను లీడ్ రోల్‌కు ఎంపికి చేసినట్లు విక్రమ్ భట్ ప్రకటించారు. ఈ సినిమాకు విక్రమ్ భట్ నిర్మాతగా వ్యవహరించగా, ఆయన కుమార్తె కృష్ణ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు మహేశ్ భట్ కథ అందిస్తున్నారు. కాగా అవికా గోర్ ఇదివరకు 'రాజుగారి గది 3'లో దెయ్యంగా భయటపెట్టిన విషయం తెలిసిందే. మరీ ఈ హిందీ చిత్రంలో ఏమేరకు భయపెడుతుందో చూడాలి. అలాగే ఈ సిరీస్‌లో 2012లో వచ్చిన '1920 ది ఈవిల్ రిటర్న్స్' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. చదవండి: అప్పుడు నన్ను నేను చాలా అసహ్యించుకున్నా: హీరోయిన్ View this post on Instagram A post shared by Vikram Bhatt (@vikrampbhatt) చదవండి: నాన్న కంటే కొంచెం చిన్నోడితో బిడ్డను కన్నానా?: అవికా గోర్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_891253233.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హీరోగా పరిచయం అవుతున్న బిగ్ బి మనవడు
బిగ్ బి అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. జోయా అక్తర్ దర్శకత్వంలో అగస్త్య హీరోగా ది ఆర్చీస్ అనే చిత్రం తెరకెక్కనుంది. సోమవారం ఈ సినిమా గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. అమెరికన్ కామిక్ సిరీస్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది. రీమా కాగ్టీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గత కొన్నాళ్లుగా అగస్త్య ఎంట్రీపై బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ అగస్త్య ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సందర్భంగా అమితాబ్ మనువడికి ఆల్‌ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు. “నీ జీవితంలో ఓ కొత్త అధ్యాయం మొదలయ్యింది. ఇంతకంటే ఆనందం మాకు వేరేముంది? నా ఆశీస్సులు, ప్రేమ సదా తోడై ఉంటాయి” అంటూ బిగ్ బి ట్వీట్ చేశారు. కాగా ఇదే సినిమాతో షారుక్ ఖాన్ కూతురు సుహానా, బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్ కూడా వెండితెరకు పరిచయం కానున్నారు. ఒకే ప్రాజెక్టుతో ముగ్గురు స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
అమెజాన్ ప్రైమ్‌లో 'ఓ మై డాగ్' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
మాస్టర్ ఆర్ణవ్‌కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్ షణ్ముగం అన్నారు. ఈయన దర్శకత్వం వహించిన 'ఓ మై డాగ్' చిత్రాన్ని నటి జ్యోతిక, సూర్య తమ 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు. ఈ సినిమా ద్వారా నటుడు అరుణ్‌విజయ్ కొడుకు ఆర్ణవ్ బాలనటుడిగా ప్రధాన పాత్రలో పరిచయం అయ్యాడు. ఇందులో అరుణ్‌విజయ్, ఆయన తండ్రి సీనియర్ నటుడు విజయ్‌కుమార్ ముఖ్యపాత్రలు పోషించగా, మహిమ నంబియార్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కుక్కపిల్ల కీలకపాత్రలో నటించడం మరో విశేషం. నివాస్ కే.ప్రసన్న సంగీతం, గోపీనాథ్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం ఈ నెల 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ టైంలో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివకుమార్ మాట్లాడుతూ చదువులో బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అయిన తన కొడుకు సూర్య నటుడిగా, నిర్మాతగా ఈస్థాయికి ఎదగడం గర్వంగా ఉందన్నారు. తన కొడుకు, మనవడితో కలిసి ఈ చిత్రంలో నటించడం మధురమైన అనుభవం అని నటుడు విజయ్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో నటనకు మాస్టర్ ఆర్ణవ్‌కు అవార్డు రావడం ఖాయమని దర్శకుడు సరోవ్ షణ్ముగం తెలిపారు. Witness the epic and un-fur-gettable tale of Arjun & Simba in 5 Days! 🐾 Watch #OhMyDogOnPrime, April 21 @PrimeVideoIN@Suriya_offl #Jyotika @SarovShanmugam @2D_ENTPVTLTD #VijayaKumar #ArnavVijay #VinayRai #MahimaNambiar @gopinath_dop @nivaskprasanna @rajsekarpandian #MichealRaj pic.twitter.com/1DjIbjbNTr — ArunVijay (@arunvijayno1) April 16, 2022 -
హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు
Aryan Khan Bollywood Debut As Director To A Web Series: బాలీవుడ్ బాద్షా కుమారుడు ఆర్యన్ ఖాన్ వెండితెరకు పరిచయం కానున్నాడు. ఆర్యన్ హీరోగా ఏదో ఒక సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడని ఇప్పటివరకు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఆర్యన్ హీరోగా ఎంట్రీ ఇవ్వకుండా కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. బాలీవుడ్‌కు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయం కానున్నాడని ఓ ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. ఆర్యన్ ఖాన్ ఒక వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేయనున్నాడట. దానికి కథను కూడా ఆర్యన్ ఖాన్ అందించాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ షారుఖ్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన టెస్ట్ షూట్‌ను ముంబైలోని ఓ స్టూడియోలో జరిపినట్లు తెలుస్తోంది. ఈ టెస్ట్ షూట్‌కు ఆర్యన్ ఖాన్ పూర్తి బాధ్యతను తీసుకున్నాడట. చిత్రీకరణ ప్రారంభించడానికి ముందే ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్ట్‌పై అవగాహన ఉండాలనేది ఆర్యన్ ఆలోచనగా చెబుతున్నారు. అందుకే ముందుగా ఏప్రిల్ 8, 9 తేదిల్లో టెస్ట్ షూట్ నిర్వహించారని సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందట. చదవండి: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు.. కీలక సాక్షి మృతి ఆర్యన్ ఖాన్‌కు తనలా హీరో కావాలనే ఆలోచిన లేదని, సినిమా నిర్మాణంలోని వివిధ అంశాలు తనకు నచ్చేవని ఇదివరకూ పలుమార్లు షారుఖ్ ఖాన్ తెలిపాడు. ఇక షారుఖ్ ఖాన్ రెండో సంతానం, కుమార్తె సుహానా ఖాన్ ఓ వెబ్ సిరీస్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే ఈ వెబ్ సిరీస్‌కు జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది అర్చీస్ కామిక్ ఆధారంగా తెరకెక్కనుంది. చదవండి: కారులో ‘సీక్రెట్ ఫ్రెండ్’తో అడ్డంగా బుక్కైన స్టార్ హీరో కూతురు