Nandamuri Chaitanya Krishna New Movie Title Launch On March 5th - Sakshi
Sakshi News home page

Chaitanya Krishna : నందమూరి కుటుంబం నుంచి తెరపైకి మరో హీరో.. పోస్టర్‌ రిలీజ్‌

Published Fri, Mar 3 2023 3:59 PM | Last Updated on Fri, Mar 3 2023 4:18 PM

Nandamuri Chaitanya Krishna New Movie Title Launch On March 5th - Sakshi

నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాన్నునారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్‌లు హీరోలుగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నందమూరి వారసుడు కూడా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు.నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ వెండితెరకు పరిచయం కానున్నారు.

బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన హీరోగా డెబ్యూ ఇస్తున్నారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ను మార్చి 5న విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement