jayakrishna
-
హైదరాబాద్‌లో అన్నదమ్ములు మృతి
మహబూబ్‌నగర్: హైదరాబాద్‌లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఆదివారం మండలానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం చెందిన చంద్రయ్య కుమారుడు జయకృష్ణ(12) శామీర్‌పేటలో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. చంద్రయ్య సొంత అన్న జెనిగె రాములు కుమారుడు జనిగె మహేష్(20) హైదరాబాద్‌లోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జయకృష్ణను హాస్టల్ నుంచి బయటకు తీసుకొచ్చి తిరిగి హాస్టల్లో వదిలేందుకు జయకృష్ణ తనకు చెందిన బైక్‌పై వెళ్తుండగా బాబాగూడ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన గల కరెంట్ స్తంభానికి ఢీకొట్టింది. జయకృష్ణ, జనిగె మహేష్ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌కు వెళ్లారు. -
కూకట్ పల్లి అగ్నిప్రమాదం లో జయకృష్ణ సజీవ దహనం
-
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో.. పోస్టర్ రిలీజ్
నందమూరి కుటుంబం నుంచి మరో హీరో ఇండస్ట్రీకి పరిచయం కాన్నునారు. ఇప్పటికే బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు హీరోలుగా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నందమూరి వారసుడు కూడా హీరోగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు.నందమూరి జయకృష్ణ కొడుకు అయిన నందమూరి చైతన్య కృష్ణ వెండితెరకు పరిచయం కానున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను నెలకొల్పిన ఆయన హీరోగా డెబ్యూ ఇస్తున్నారు. దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు టైటిల్‌ను మార్చి 5న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. Production No.1 from @BTRCreations 💥 Brace Yourselves for the Title Launch on March 5th 🤩 🌟ing #NandamuriChaitanyaKrishna 🤩 A film by @VKrishnaakella 🎬 𝙀𝙫𝙚𝙧𝙮 𝙨𝙞𝙣𝙣𝙚𝙧 𝙣𝙚𝙚𝙙𝙨 𝙩𝙧𝙚𝙖𝙩𝙢𝙚𝙣𝙩 pic.twitter.com/1IvnIv8Djk — Basavatarakarama Creations (@BTRcreations) March 3, 2023 -
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో
స్వర్గీయ మహానటుడు నందమూరి తారక రామారావు వారసులు చాలా మంది టాలీవుడ్లో రాణిస్తున్నారు. తాజాగా మరో వారసుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్ మనవడు, నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. శనివారం బసవతారకరామ బ్యానర్, తొలి చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘మా అమ్మ, నాన్నగార్ల పేర్లు కలిసొచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్‌కు పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది మా అన్నదమ్ములందరి బ్యానర్. నాన్నగారికి ఎంతో ఇష్టమైన చైతన్య ఈ బ్యానర్లోని సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీ. అన్నయ్య జయకృష్ణ, దర్శకుడు వంశీకి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్‌్టతో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు జయకృష్ణ. ‘‘మా నాన్నగారు స్థాపించిన బసవతారకరామ క్రియేషన్స్’ను బాబాయ్ బాలకృష్ణగారు లాంచ్ చేసి, ఆశీస్సులు అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు చైతన్య కృష్ణ. రెండు షేడ్స్ కల్యాణ్‌రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘బింబిసార’. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ శతజయంతి(మే 28) సందర్భంగా ‘బింబిసార’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడిగా, మోడ్రన్ కుర్రాడిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు కల్యాణ్ రామ్. ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
హీరోగా సూపర్ స్టార్ మనవడు..?
డాషింగ్ హీరోగా టాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్‌ను ఏలేస్తున్నాడు. గతంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా పలు చిత్రాల్లో హీరోగా ఆకట్టుకున్నా.. తరువాత వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం అదే ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ విజయకృష్ణ వంటి యువ నటులు హీరోలుగా నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం సినిమాతో బాలనటుడిగా పరిచయం అయిన జయకృష్ణ త్వరలోనే కథానాయకుడిగా తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో జయకృష్ణ శిక్షణ తీసుకుంటున్నాడు. -
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత మృతి
హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ నిర్మాత జయకృష్ణ కన్నుముశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. సీనియర్ నటులు కృష్ణంరాజు, జయసుధ లకు మేకప్ ఆర్టిస్టుగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన జయకృష్ణ తర్వాత నిర్మాతగా మారారు. పలు విజయవంతమైన సినిమాలకు నిర్మాణ సారధ్యం వహించారు. మన ఊరి పాండవులు (1978), మంత్రిగారి వియ్యంకుడు (1983), నీకు నాకు పెళ్లంట (1988) తదితర చిత్రాలను ఆయన నిర్మించారు. బాపు దర్శకత్వంలో చిరంజీవి హీరో గా జయకృష్ణ నిర్మించిన 'మన ఊరి పాండవులు' ఫిలిం ఫేర్ అవార్డు గెల్చుకుంది. ఇంకా సీతారాములు, కృష్ణార్జునులు, వివాహభోజనంబు తో పాటు 15 స్ట్రెయిట్ చిత్రాలు, 22 డబ్బింగ్ సినిమాలను ఆయన నిర్మించారు. గతంలో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన జయకృష్ణ నిర్మించిన చివరి సినిమా దాసు. జయకృష్ణ సుదీర్ఘ విరామం తరువాత సినీనటి తారాచౌదరి జీవిత చరిత్రపై సినిమా నిర్మించాలని ప్రయత్నించారు. జయకృష్ణ మూవీస్ పతాకంపై 'ఒక తార' అనే సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. ఆయన మృతి తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు పలువురు సంతాపం తెలిపారు. అతని కాగా జయకృష్ణ ఒక్కగానొక్క కొడుకు ముద్దుకృష్ణ 2008లో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.