మహేష్ కుటుంబంతో ఘట్టమనేని జయకృష్ణ, నిజం సినిమాలో బాలనటుడిగా (ఇన్‌సెట్‌లో)
డాషింగ్ హీరోగా టాలీవుడ్ ను ఏలిన సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇప్పటికే మహేష్ బాబు టాలీవుడ్‌ను ఏలేస్తున్నాడు. గతంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు కూడా పలు చిత్రాల్లో హీరోగా ఆకట్టుకున్నా.. తరువాత వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం అదే ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు, నవీన్ విజయకృష్ణ వంటి యువ నటులు హీరోలుగా నిలదొక్కుకునేందుకు శ్రమిస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట. మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన నిజం సినిమాతో బాలనటుడిగా పరిచయం అయిన జయకృష్ణ త్వరలోనే కథానాయకుడిగా తెరకు పరిచయం కానున్నాడు. ఇప్పటికే నటన, డ్యాన్స్, ఫైట్స్ వంటి వాటిలో జయకృష్ణ శిక్షణ తీసుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment