Ramesh Babu
-
శ్రీహరి రావు హత్యపై పవన్ వ్యాఖ్యలకు సింహాద్రి రమేష్ బాబు కౌంటర్
-
పంచకర్ల సిఫార్సులకు బాబ్జీ గండి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మొన్నటికి మొన్న పోలీసుశాఖ బదిలీల్లో మాట చెల్లుబాటు కాలేదని మథనపడిన పంచకర్ల రమేష్ బాబుకు రెవెన్యూ బదిలీలల్లోనూ అదే నగుబాటు ఎదురైంది. పెందుర్తి తహసీల్దారు పోస్టింగ్‌లో పంచకర్ల చెప్పిన పేరును కాకుండా తాజాగా గండి బాబ్జీ చెప్పిన వ్యక్తికి పోస్టింగ్ దక్కడం చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల క్రితం సీఐల పోస్టింగ్‌ల విషయంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంతో అలిగి గన్మెన్లను సైతం వెనక్కి పంపి.. ఆ తర్వాత మిన్నకుండిపోయిన పంచకర్ల తాజా తహసీల్దార్ల బదిలీల్లో కనీసం స్పందించకుండా మౌనం వహించారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ తన మాట చెల్లుబాటు కాకపోవడంపై ఆయన లోలోన రగిలిపోతున్నారు. అయినప్పటికీ పొత్తు ధర్మంలో భాగంగా బహిరంగంగా వ్యాఖ్యానించకుండా తమ పార్టీ అధిష్టానం వద్ద విన్నవించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే గతంలో కూడా సీఐల బదిలీల విషయంలో అధిష్టానానికి చెప్పినప్పటికీ స్పందన లేకపోవడంతో... ఈసారీ అదే పరిస్థితి ఉంటుందని ఆయన సన్నిహితులు వాపోతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పంచకర్ల అయినప్పటికీ... గండి బాబ్జీ మాటే చెల్లుబాటు అయ్యేలా టీడీపీ నేతల నుంచి వచ్చిన ఆదేశాలతోనే జిల్లా ఉన్నతాధికారులు ఆయన సిఫార్సులకే పెద్ద పీట వేస్తున్నట్టు సమాచారం. ప్రధానంగా ఎంపీ భరత్ జోక్యం చేసుకుని గండి బాబ్జీకి ప్రాముఖ్యత ఇవ్వాలంటూ జిల్లా ఉన్నతాధికారులకు ఇచ్చిన ఆదేశాలతోనే ఈ వ్యవహారమంతా నడుస్తోందని టీడీపీలో చర్చ నడుస్తోంది.పాత తేదీలతో ఆదేశాలు..!వాస్తవానికి ఉద్యోగుల బదిలీల గడువు ప్రక్రియ సెప్టెంబరు 15వ తేదీ నాటికి పూర్తి కావాలి. విజయవాడ వరదల నేపథ్యంలో 23కు వరకు బదిలీల ప్రక్రియ చేపట్టారు. గండి బాబ్జీ ప్రతిపాదనలకు పెద్ద పీట వేయాలని ఎంపీ భరత్ ఆదేశాల మేరకు బదిలీల గడువు ముగిసిన తరువాత పాత తేదీలతో (సెప్టెంబరు 22వ తేదీ) పోస్టింగ్‌లు ఇస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఆదేశాలు మాత్రం 26వ తేదీ రాత్రి బయటకు రావడం గమనార్హం. అంతేకాకుండా ఏఎస్వో సర్కిల్–1లో సీనియర్ చెకింగ్ ఇన్స్పెక్టర్గా కొద్దిరోజుల క్రితం పోస్టింగ్ ఇచ్చిన బంటు రమణను మార్చాలంటూ బియ్యం మాఫియా పట్టుబట్టడంతో ఆయనకు విశాఖ ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసిన డి.జానకిని విశాఖ ఏఎస్వో కార్యాలయంలో సీనియర్ చెకింగ్ ఇన్స్పెక్టర్గా బదిలీ చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరికీ కూడా బదిలీల గడువు ముగిసిన తర్వాత పాత తేదీలతో పోస్టింగ్‌లు ఇవ్వడంతో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.బాబ్జీకి భరత్ సపోర్టు... !వాస్తవానికి విశాఖ దక్షిణ సీటును ఆశించిన గండి బాబ్జీ.. ఆ సీటు దక్కకపోవడంతో పార్టీ మారుదామని భావించారు. అయితే ఎక్కడి నుంచి పిలుపు లేకపోవడంతో మిన్నకుండిపోయారు. అనంతరం ఆయన టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఓ సమావేశంలో మాడుగుల సీటు లభించిన బండారుకు ఇక పెందుర్తిలో పనులేమీ చేయవద్దనే అర్థంలో వ్యాఖ్యానించారు. అయితే అక్కడితో ఆగకుండా పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల మాట కూడా చెల్లుబాటు కాకుండా చక్రం తిప్పడం ప్రారంభించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన సీఐల పోస్టింగ్‌ల విషయంలోనూ గండి బాబ్జీ సిఫార్సు చేసిన వారినే నియమించారు. దీనిని నిరసిస్తూ తన గన్మెన్లను వెనక్కి పంపుతున్నట్టు నేరుగా పోలీస్‌బాస్‌కు పంచకర్ల స్పష్టం చేశారు. అయినప్పటికీ సానుకూల స్పందన రాకపోవడంతో మిన్నకుండిపోయారు. ఇక తాజాగా పెందుర్తి తహసీల్దార్ పోస్టింగ్ విషయంలోనూ గండి బాబ్జీ మాటే చెల్లుబాటు కావడంతో పంచకర్ల షాక్ తిన్నారు. వాస్తవానికి పెందుర్తి తహసీల్దార్‌గా ప్రస్తుతం ఉన్న కె.వేణుగోపాల్ స్థానంలో మరొకరిని నియమించాలని పంచకర్ల భావించారు. అయితే, ఎవరిని నియమించాలనే విషయంలో మాత్రం పంచకర్ల నుంచి ఎటువంటి ప్రతిపాదనలను జిల్లా ఉన్నతాధికారులు కోరకపోవడం గమనార్హం. మరోవైపు పద్మనాభం తహసీల్దార్‌గా ఉన్న ఆనంద్‌కుమార్‌కు పెందుర్తిలో పోస్టింగ్ ఇవ్వాలని గండి బాబ్జీ నుంచి జిల్లా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు వెళ్లాయి. గండి బాబ్జీ చెప్పిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎంపీ భరత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గండి బాబ్జీ ప్రతిపాదనలు, ఎంపీ భరత్ ఆదేశాల మేరకు పెందుర్తి తహసీల్దార్‌గా ఆనంద్‌కుమార్‌కు పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా డీటీ, సర్వేయర్లు, ఎంపీడీవో పోస్టింగ్ విషయంలోనూ పంచకర్ల మాటకు విలువ లేకుండా పోయింది. ఎంపీడీవో రమేష్ నాయుడును కొనసాగించాలని పంచకర్ల కోరినప్పటికీ కనీసం పరిగణనలోనికి తీసుకోకపోవడం ఆయనకు చిర్రెత్తుకొచ్చినట్టు తెలుస్తోంది. -
ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే అసంతృప్తి.. గన్మెన్ల సరెండర్
సాక్షి,అనకాపల్లిజిల్లా: కూటమి ప్రభుత్వంపై పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అసంతృప్తి వ్వక్తం చేశారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్మెన్లను సరెండర్ చేశారు. తాను సిఫారసు చేసిన కాపు సామాజికవర్గం సీఐకి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్‌కు కాపు సామాజికవర్గానికి చెందిన సీఐని రమేష్‌బాబు సిఫారసు చేశారు. రమేష్‌బాబు సిఫారసును పక్కన బెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లిఖార్జున్‌కి మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పిచ్చినట్లు సమాచారం. కాగా, జనసేన ఎమ్మెల్యేల సిఫార్సులను టీడీపీ నాయకులు పక్కన బెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. -
అల్లు అర్జున్ను టార్గెట్ చేసిన మరో జనసేన నేత
సాక్షి, కృష్ణా జిల్లా: జనసేన నేతలు అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తూ చెలరేగిపోతున్నారు. ఆయనపై మరో జనసేన నేత నోరు పారేసుకున్నారు. అల్లు అర్జున్ ఓ కమెడియన్ అంటూ ఆ పార్టీ గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు నోటి దురుసు ప్రదర్శించారు. ‘‘చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు అండతో ఇండస్ట్రీకి వచ్చావు. మెగా ఫ్యామిలీని విమర్శించే స్థాయి నీకు లేదు. నీ బాబు అల్లు అరవింద్ పిల్లికి బిక్షం కూడా పెట్టడు. నీ స్థాయిని మరచి మాట్లాడుతున్నావు’’ అంటూ వ్యాఖ్యానించారు.‘‘చిరంజీవి,పవన్ కళ్యాణ్, నాగబాబు కాళ్లుకడిగి నీళ్లు నెత్తిన చల్లుకుని తప్పుని సరిచేసుకో. అలా చేయని పక్షంలో డిసెంబర్ లో రిలీజ్ అయ్యే నీ సినిమాలను అడ్డుకుంటాం. గన్నవరం నియోజకవర్గంలో నీ సినిమా ఒక్క థియేటర్లోకూడా విడుదలయ్యే పరిస్థితి ఉండదు.’’ అని చలమశెట్టి హెచ్చరించారు.కాగా, ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అంటూ తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
‘నేను - కీర్తన’ ట్రైలర్ రిలీజ్
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘నేను - కీర్తన’. రిషిత - మేఘన హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు, శోభారాణి, పద్మినీ నాగులపల్లి, గిడుగు కాంతికృష్ణ, వాసిరెడ్డి స్పందన పాల్గొని, "నేను - కీర్తన" చిత్రం చిమటా రమేష్ బాబుకు హీరోగా తిరుగులేని పునాది వేయాలని అభిలషించారు.రమేష్ బాబు మాట్లాడుతూ.. ఒక మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. తన సోదరుడు నటించిన సినిమా అని అనడం లేదని, "నేను-కీర్తన" పైసా వసూల్ ఎంటర్టైనర్ అని చిత్ర సమర్పకురాలు చిమటా జ్యోతిర్మయి పేర్కొన్నారు. నిర్మాత చిమటా లక్ష్మీ కుమారి మాట్లాడుతూ... "ఎన్నో వ్యయప్రయాసలతో మల్టీ జోనర్ ఫిల్మ్ గా రూపొందించిన "నేను - కీర్తన" కచ్చితంగా నిరుపమాన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. -
Panchakarla Ramesh Babu: పంచకర్ల మైనింగ్ డాన్
పెందుర్తి: ‘‘యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన పంచకర్ల రమేష్ బాబు భారీ ఎత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డాడు. యలమంచిలి, అచ్యుతాపురం ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేసి రోజుకు రూ.6 లక్షలు సంపాదించాడు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి దోపిడీలు, దందాలకు పాల్పడ్డాడు. ఇలాంటి వ్యక్తినా మీరు గెలిపిస్తారు.. రమేష్ బాబు లాంటి అవినీతి పరుడ్ని గెలిపించి మీరు చాలా తప్పు చేశారు’’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు 2019 ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్. యలమంచిలి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రస్తుత జనసేన పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు ఐదేళ్ల పాటు యలమంచిలిని దోచుకున్నాడని 2019 ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కల్యాణ్ ఆరోపించారు. అదే పంచకర్లకు పెందుర్తిలో పవన్ కల్యాణ్ సీటు ఇచ్చారు. దీంతో ఇక్కడి నేతలు పవన్ కల్యాణ్ అప్పట్లో పంచకర్లపై చేసిన విమర్శలను గుర్తు చేసుకుంటున్నారు. అక్రమాలే అజెండా రాజకీయాల్లో వలస పక్షిగా ముద్ర వేసుకున్న పంచకర్ల రమేష్ బాబు టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు యలమంచిలిలో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. పవన్ కల్యాణ్ లెక్క ప్రకారం రోజుకు రూ.6 లక్షలు చొప్పున ఐదేళ్లలో రూ.కోట్లలో సంపాదించారని చెప్పినా.. రాంబిల్లిలోని పంచదార్ల కొండను పిండి చేసి అంతకు మించి దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి ప్రాంతాల్లో కంపెనీల ఏర్పాటు సమయంలో భూములు ఇచ్చిన రైతులకు పరిహారం విషయంలో పంచకర్ల, అతని అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. తప్పుడు పత్రాలతో బినామీలను సృష్టించి రైతులకు అందాల్సిన పరిహారాన్ని పంచకర్ల గ్యాంగ్ కాజేశారని స్వయంగా యలమంచిలి టీడీపీ నాయకులే ఆరోపించారు. అప్పట్లో స్థానిక టీడీపీ నాయకులను పక్కన పెట్టి మండలానికో షాడో పంచకర్లను తయారు చేసి ఆయా దందాలకు పాల్పడినట్లు టీడీపీ వర్గాలే చెబుతున్నాయి. ఆగడాలు అప్పటి నుంచే.. 2009లో ప్రజారాజ్యం తరఫున పెందుర్తి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత 2011 నుంచి అధికార పార్టీ ఎమ్మెల్యేగా అవతారం ఎత్తారు. ఆ క్షణం నుంచే పంచకర్ల, అతని అనుచరుల అసలు రూపం బయటకు వచ్చింది. అధికారులను తమ దారికి తెచ్చుకుని రౌడీయిజంతో పాటు భూ కబ్జాలకు పాల్పడ్డారు. పెందుర్తి కేంద్రంగా ఎన్నో దందాలకు పాల్పడ్డారు. ఆ సమయంలో పంచకర్ల అనుచరుడు ఒకరు ఏకంగా పోలీసుల భూమికే గురి పెట్టాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలో ఉన్న ఖాళీ స్థలాన్ని పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి కేటాయించారు. అప్పటి పంచకర్ల అనుచరుడు గొర్లె అప్పారావు దానిపై కన్నేశాడు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఏకంగా పోలీసులకు కేటాయించిన స్థలాన్నే ఆక్రమించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అప్రమత్తమైన అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ హుస్సేన్ అప్పారావుపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆట కట్టించారు. అప్పట్లో రమే‹Ùబాబు పేరు చెప్పుకుని సెటిల్మెంట్లు చేయడం, బెదిరింపులకు పాల్పడం వంటి ఘటనలు కో కొల్లలు. ఒక రకంగా చెప్పాలంటే పెందుర్తి నియోజకవర్గంలో రౌడీయిజానికి పంచకర్ల రమే‹Ùబాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అని రాజకీయ విశ్లేషకులు చెబుతారు.అనుచరుల రౌడీయిజం ఈ ఏడాది ఏప్రిల్ 14న జీవీఎంసీ 88వ వార్డు సతివానిపాలెంలో జరిగిన విందు కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ మొల్లి ముత్యాలనాయుడుపై పంచకర్ల రమేష్ అనుచరుడు గల్లా శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వచ్చి అడ్డుకోవడంతో ముత్యాలనాయుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. బాధిత కార్పొరేటర్ పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఇలా పెందుర్తి నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు అనుచరుల రౌడీయిజం పెచ్చు మీరుతోంది. తమకు నచ్చని వారిపై హత్యాయత్నాలు, భౌతికదాడులకు పాల్పడుతున్నారు. ప్రత్యర్థులను సోషల్ మీడియా వేదికగా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. కులాల పేరుతో వేధిస్తున్నారు. ‘మేం వస్తే మీ సంగతి తేలుస్తాం’ అంటూ బెదిరింపులకు పాల్పడుతుండడంపై ఇక్కడి ప్రజలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. ఇలాంటి నాయకుడికి ఓటుతోనే చెక్ పెట్టాలని రాజకీయ విశ్లేషకులు, పెందుర్తి ఓటర్లు అభిప్రాయపడుతున్నారు.మళ్లీ పంచకర్ల గ్యాంగ్ హడావుడి పెందుర్తి ఎమ్మెల్యేగా జనసేన నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమే‹Ùబాబు అనుచరులు ఆగడాలు మొదలు పెట్టారు. 2023 నవంబర్ 12 దీపావళి రోజు పెందుర్తి మండలం చింతగట్ల సర్పంచ్ భర్త, రాష్ట్ర అయ్యారక వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గనిశెట్టి కనకరాజుపై జనసేన నాయకులు రెచ్చిపోయారు. బీరు బాటిళ్లు..పదునైన ఆయుధాలతో కనకరాజుపై దాడికి పాల్పడ్డారు. స్థానికులు స్పందించి రక్తపు మడుగులో ఉన్న కనకరాజును ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. జనసేన నాయకులు మాడిస హరీ‹Ù, చందక గోవిందరాజు, దాసరి గణే‹Ùలను నిందితులుగా గుర్తించి పెందుర్తి పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 2న అరెస్ట్ చేశారు. -
డ్యాన్స్‌తో కుర్చీ మడత పెట్టేసిన 'మహేశ్ బాబు' అన్న కూతురు
మహేశ్‌బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన యాక్షన్ డ్రామా చిత్రం 'గుంటూరుకారం'. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం యూత్ నుంచి కుటుంబ ప్రేక్షకుల వరకు మెప్పించింది. మొదట ఈ సినిమా బాగాలేదని అన్నవారితోనే కొన్నిరోజుల తర్వాత మళ్లీ చూసి.. అరే సినిమా బాగుందే అనే కితాబు ఇచ్చారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని భారీగా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలోని కుర్చీ మడత పెట్టి అనే పాట ఒక రేంజ్లో హిట్ అయింది. ఈ పాట నుంచి మిలియన్ల కొద్ది రీల్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి మహేశ్ బాబు అన్న రమేశ్ బాబు కూతురు భారతి కూడా చేరింది. భారతి ఘట్టమనేని చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన బాబాయ్ మహేశ్ పాటకు భారతి వేసిన స్టెప్పులు ఇన్‌స్టాగ్రామ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఇప్పటికే ఇదే పాటకు మహేశ్ కూతురు సితార కూడా ఒక రీల్ చేసింది. అప్పుడు కూడా సితార వేసిన స్టెప్పులకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఇప్పుడు మళ్లీ తన అన్న కూతురు భారతి కూడా కుర్చీ మడత పెట్టేసింది. ప్రస్తుతం ఆమె ఫారిన్లో చదువుకుంటున్నట్లు సమాచారం. రమేశ్ బాబు కూడా తన తండ్రి కృష్ణతో కలిసి పలు సినిమాల్లో కనిపించారు. చివరిగా ఎన్కౌంటర్ అనే చిత్రంలో తండ్రితో కలిసి నటించిన రమేశ్‌బాబు తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ కొంత కాలం తర్వాత తన సోదరుడు అయిన మహేశ్‌తో కలిసి అర్జున్, అతిథి చిత్రాలను నిర్మించాడు. కానీ ఆయన పిల్లలు భారతి, జయ కృష్ణ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ తాజాగా భారతి చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. శ్రీలీల రేంజ్లో దుమ్మురేపిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతలా ఆమెపై పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్న ఆ సాంగ్‌ను మీరూ చూసేయండి. View this post on Instagram A post shared by Bhar Ghats (@bharathighattamaneni) -
రామోజీరావు తప్పుడు వార్తలు మానుకోవాలి: ఎమ్మెల్యే
-
Michaung Cyclone: భారీ వర్షాలతో నీట మునిగిన వరి పంట
-
కృష్ణ తనయుడు రమేశ్ బాబు సినిమాల్లో ఎంట్రీ.. హీరోగా ఆ సినిమాతోనే!
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆయనదే. సినీరంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆయనకు తగ్గట్టుగానే కుమారులు సైతం ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మహేశ్ బాబు, రమేశ్ టాలీవుడ్లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే గతేడాది అనారోగ్యంతో పెద్దకుమారుడు రమేశ్ బాబు మృతిచెందిన సంగతి తెలిసిందే. అయితే రమేశ్ బాబు సినిమాల్లోకి రావడంపై సూపర్ స్టార్ కృషి ఎంతో ఉంది. రమేశ్ బాబు హీరోగా నటించిన మొదటి చిత్రం ఏది? ఆ తర్వాత ఏయే సినిమాలు చేశారో తెలుసుకుందాం. (ఇది చదవండి: అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్‌పై రైడ్!) రమేశ్ బాబు మొదట పరిచయమైంది అల్లూరి సీతారామరాజుతోనే. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించారు. 1974లో వచ్చిన ఈ చిత్రంలో యంగ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించారు. ఆ తర్వాత దొంగలకు దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ చిత్రాల్లోనూ బాలనటుడిగా మెప్పించారు. అయితే కృష్ణ కెరీర్ అద్భుతంగా సాగుతున్న రోజుల్లోనే తన కుమారుడు రమేశ్ బాబును హీరోగా పరిచయం చేశారాయన. అయితే హీరోగా రమేశ్ బాబు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది మాత్రం 1987లో వచ్చిన సామ్రాట్ చిత్రం ద్వారానే. ఈ సినిమాకు వి.మధుసూదన రావు దర్శకత్వం వహించగా.. హనుమంతరావు , ఆదిశేషగిరి రావు నిర్మాతలుగా వ్యవహరించారు. తన కుమారుడిని సామ్రాట్ ద్వారానే వెండితెరకు సూపర్ స్టార్ పరిచయం చేశారు. ఈ సినిమాను తన సొంత బ్యానర్ పద్మాలయ స్టూడియోస్‌పైనే నిర్మించారు. అయితే ఈ మూవీ 1983లో రిలీజైన హిందీ సినిమా బేతాబ్ రీమేక్‌గా తెరకెక్కించారు. సరిగ్గా ఈ రోజు సామ్రాట్ మూవీ విడుదల కాగా.. నేటికి 36 ఏళ్లు పూర్తయింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సోనమ్ హీరోయిన్గా నటించింది. నటి శారద కీలక పాత్ర పోషించిగా.. ఈ మూవీకి అప్పట్లోనే యావరేజ్ టాక్ తెచ్చుకుంది. (ఇది చదవండి: లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!) అయితే ఈ సినిమా తర్వాత రమేశ్ బాబు దాదాపుగా 15 చిత్రాల్లో నటించారు. ఓకే ఏడాదిలో చిన్ని కృష్ణుడు, బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు చిత్రాలతో పాటు శాంతి ఎనతు శాంతి అనే తమిళ మూవీలో నటించారు. అయితే హీరోగా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేక పోయారు. నిర్మాతగా మారి హిందీలో సూర్యవంశం, తెలుగులో అర్జున్, అతిథి, దూకుడు, ఆగడు సినిమాలు నిర్మించారు. మరోవైపు తన తమ్ముడు మహేశ్ బాబు టాలీవుడ్లో సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. -
మీరు దయతలిస్తే మళ్లీ గెలుస్తా!
సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల: ‘ఓట్ల సమయంలో మందు, డబ్బులు పంచడం నాకు రాదు. అలాంటి అలవాటు నాకు లేదు. రాబోయే ఎన్నికల్లో సిరిసిల్ల ప్రజలు దయతలిస్తే మళ్లీ గెలుస్తా. అప్పుడు కూడా ఓ తమ్ముడిగా.. అన్నగా.. బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా. బీద, బిక్కిలను కడుపులో దాచుకుని పనిచేస్తా..’అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. పేదల గోసలు ఎరిగిన కేసీఆర్ లాంటి నాయకుడిని మరోసారి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బీసీ బంధు పథకాన్ని మంత్రి ప్రారంభించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 600 మందికి ఈ పథకం కింద చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలో ఆలయ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రమేశ్‌బాబుతో కలిసి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీసీ బంధు నిరంతర ప్రక్రియ ‘రాష్ట్రంలోని అర్హులైన పేదవారు అడగకపోయినా సీఎం కేసీఆర్ వారికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీ అయిన పసిబిడ్డ నుంచి పండు ముసలి వరకు అందర్నీ ఆదుకుంటున్నారు. కేసీఆర్ కిట్టు నుంచి ఆసరా పెన్షన్ల వరకు అన్ని విధాలా ఆదుకునే మనసున్న ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్. గడిచిన 9 ఏళ్లు సంక్షేమానికి స్వర్ణయుగంలా మారింది. బీసీ బంధు పథకాన్ని ప్రతి నియోజకవర్గంలో 300 మందికి అందిస్తున్నాం. ఈ పథకంలో రూ.లక్ష లబ్ధి పొందిన 14 బీసీ కులాల పేదలు మళ్లీ ఆ డబ్బులను చెల్లించాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది రుణం కాదు. కేవలం కులవృత్తులను ప్రోత్సహించేందుకు ఇస్తున్న గ్రాంట్ మాత్రమే. అర్హులందరికీ అందించే వరకు ఈ పథకం కొనసాగుతుంది. శతాబ్దాల పేదరికాన్ని పోగొట్టేందుకే సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మంది ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి అందించి వారి పెళ్లిళ్లకు సాయం చేశాం. రైతుబంధు, రైతు బీమా, నేతన్నలకు బీమా పథకాలను అమలు చేస్తున్నాం. చేసిన పనులు చెప్పుకుంటూ పోతే ఒడవదు. మళ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల వాళ్లు ఓట్లు అడగడానికి వస్తే.. మాకు ఎంతో చేసిన బీఆర్ఎస్ను కాదని మీకు ఓట్లు ఎందుకు వేయాలని నిలదీయండి. రాష్ట్రంలోని ఏ ఒక్క పేదవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వం సాయం చేస్తూ వారి బతుకులను బాగు చేస్తుంది. గృహలక్ష్మి పథకంలో అర్హులకు ఇళ్లను మంజూరు చేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది..’అని కేటీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే నెలలో మెడికల్ కాలేజీ ప్రారంభం ‘వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్ కాలేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారు. అన్ని రోగాలకు ప్రత్యేక వైద్యులతో మెరుగైన వైద్యం అందుతుంది. చిన్నరోగం నుంచి క్యాన్సర్ వరకు ఉచితంగా వైద్యసేవలు జిల్లాలో పేద ప్రజలకు అందుతాయి..’అని మంత్రి చెప్పారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, టీపీటీడీసీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళాచక్రపాణి, రామతీర్థం మాధవి పాల్గొన్నారు. -
దోస్త్ మేరా దోస్త్
-
జనసేన నేత ఆకుల ఉమేష్‌పై కేసు
చిలమత్తూరు: మద్యం సేవించడానికి కర్ణాటకలోని బాగేపల్లికి వెళ్లిన హిందూపురం జనసేన నాయకుడు ఆకుల ఉమేష్, అతని స్నేహితుల బృందం తప్పతాగి అమడగూరు మండలానికి చెందిన రమేష్‌బాబుపై దాడి చేసి గాయపరిచారు. అతని వద్ద ఉన్న బంగారాన్ని చోరీ చేశారు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు బాగేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... ఈ నెల 23న కంటి వైద్య పరీక్షల కోసం రమేష్‌బాబు అనే వ్యక్తి బెంగళూరుకు వెళ్తూ బాగేపల్లి సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై ఓ ధాబా వద్ద భోజనానికి ఆగాడు. ఆ సమయంలో తాగి ఉన్న ఆకుల ఉమేష్, అతని మిత్ర బృందం రమేష్‌బాబుపై దాడిచేసి అతని ఒంటిపై 16 తులాల బంగారు ఆభరణాలను లాక్కెళ్లారు. దీంతో బాధితుడు ఫిర్యాదు మేరకు జనసేన నాయకులపై 323, 363, 392, 511 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు బాగేపల్లి సీఐ రవికుమార్ తెలిపారు. కేసులో ఆకుల ఉమేష్ ఏ–1 నిందితుడు కాగా, లోకేష్ అనే వ్యక్తి ఏ–2, చిలమత్తూరు మండలానికి చెందిన జనసేన నాయకుడు ప్రవీణ్ ఏ–3, భాస్కర్ ఏ–4గా పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో ఉమేష్ హిందూపురం జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. ఇతనిపై హిందూపురంలో కూడా కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. -
బార్బర్ షాపులో పనిచేసి, ఎన్ని వేల కోట్ల ఖరీదైన కార్లు కొన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
ఒకపుడు తినడానికి లేదు..ఇపుడు 600 లగ్జరీ కార్లు..‘బిలియనీర్ బాబు’ స్టోరీ చూస్తే..!
బెంగళూరు రమేష్ బాబు లేదా ‘ఇండియన్ ' బిలియనీర్ బార్బర్’. 600 కార్ల కలెక్షన్‌ను గమనిస్తే ఎవరైనా ఔరా అనక తప్పదు. అందులోనూ అన్నీ ఖరీదైన కార్లే. ఎక్కువ భాగం బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్ రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ బ్రాండ్సే.బిలియనీర్ బాబుగా పాపులర్ అయిన రమేష్ బాబు ఒకప్పుడు కడు పేదవాడే. ఒక పూట తింటే రెండోపూటకు కష్టమే. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కూలిపనులకెళ్లాడు. జీవితం గడవడానికి అమ్మకు తోడుగా చాలా ఉద్యోగాలు చేశాడు. మరి బిలియనీర్‌గా ఎలా అవతరించాడు..? రమేష్ బాబు తండ్రి గోపాల్ బెంగళూరులో క్షురకుడుగా పని చేసేవారు. రమేష్ ఏడేళ్ల వయస్సులోనే తండ్రి కన్నుమూశారు. దీంతో తల్లి ముగ్గురు పిల్లలున్న కుటుంబానికి బెంగళూరులోని బ్రిడ్జ్ రోడ్‌లోని చిన్న బార్బర్ షాప్ ఒక్కటే జీవనాధారం. కేవలం 40-50 రూపాయలతో పిల్లల్ని పోషించేది. పిల్లల్ని చదివించింది. బట్టలు, పుస్తకాలు, ఫీజులు, అన్నింటికీ వినియోగించేది. మరోవైపు బార్బర్షాప్ను నిర్వహించలేక రోజుకు రూ.5 అద్దెకు ఇచ్చేయడంతో పరిస్థితి మరింత దుర్భరమైంది. ఒక్కపూట భోజనంతో సరిపెట్టుకునే వారు. 13 సంవత్సరాల వయస్సులో న్యూస్ పేపర్ డెలివరీ,మిల్క్ హోమ్ డెలివరీలాంటి ఎన్నో పనులు చేసిన కుటుంబ పోషణలో తల్లి ఆసరాగా ఉండేవాడు. రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ 10వ తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి, చివరికి తండ్రి పాత దుకాణం 'ఇన్నర్ స్పేస్' లో బార్బర్‌గా పని చేయడం ప్రారంభించాడు. పట్టుదలతో కష్టించి పనిచేశాడు. అది త్వరలోనే ట్రెండీ స్టైలింగ్ అవుట్‌లెట్‌గా మారిపోయింది. హెయిర్స్టయిలిస్ట్గా బాగా పేరు గడించాడు. ఆ తర్వాత రమేష్ బాబు 1993లో తన మామ దగ్గర కొంత డబ్బు తీసుకుని మారుతీ ఓమ్నీ వ్యాన్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఈఎంఐ చెల్లించేలేక ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషించాడు. అలా తన తల్లి పనిచేసే కుటుంబానికి చెందిన ఇంటెల్ కంపెనీ ఉద్యోగులను ఆఫీసు నుంచి ఇంటికి తీసుకొచ్చే పని తీసుకుని ట్రావెల్స్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అది లాభసాటిగా ఉండటంతోపాటు, పర్యాటక రంగానికి ప్రభుత్వంప్రోత్సాహంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని లాంచ్ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ముప్పై ఏళ్లుగా సేవలందిస్తూ, ఖరీదైన కార్లను సేకరిస్తూనే ఉన్నాడు. అలా 600కు పైగా కార్లు అతని గారేజ్‌లో ఉన్నాయి.దాదాపు అన్నీ బీఎండబ్ల్యూ, జాగ్వార్ , బెంట్లే, రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ వంటి లగ్జరీ కార్లంటేనే అతని వ్యాపారాన్ని అర్థం చేసుకోవచ్చు. వీటితోపాటు వ్యాన్లు, మినీబస్సులు కూడా ఉన్నాయి. తొలి లగ్జరీ కారు మెర్సిడెస్ ఈ కాస్ల్ సెడాన్ అతని తొలి లగ్జరీ కారు. దీని ధర రూ.38 లక్షలు. ప్రస్తుతం 3 కోట్ల ఆర్ఆర్ ఘోస్ట్, 2.6 కోట్ల ఖరీదైన మేబ్యాచ్ అతని ట్రావెల్స్‌లో ఉన్నాయి. రమేష్ బాబు కంపెనీ ఢిల్లీ, చెన్నై, బెంగళూరులో నడుస్తుంది. అదే సమయంలో, అతని వ్యాపారం కొన్ని ఇతర దేశాలలో కూడా విస్తరించింది. దాదాపు 300 పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నాడు. బిగ్‌బీ, ఆమీర్ ఖాన్ లాంటి సెలబ్రిటీ కస్టమర్లు రమేష్ అన్ని కార్లను డ్రైవ్ చేయగలడు. అతని క్లయింట్ల జాబితా అంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు కూడా వారు పట్టణంలో ఉన్నప్పుడు కార్లను అద్దెకు తీసుకుంటారట. రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. అన్నట్టు ఇప్పటికీ తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. బిలియనీర్ బాబు మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్‌లోని తన దుకాణానికి వెళ్తాడు. నిజంగా రమేష్ బాబు కథ స్ఫూర్తిదాయకం. 2 బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే రిచెస్ట్ బార్బర్‌గా ఫోర్బ్స్ గుర్తించింది. -
ఒకే ఏడాది రెండు విషాదాలు..తీవ్ర దుఃఖంలో మహేశ్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఇందిరాదేవి(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఏడాది జనవరిలోనే మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో జనవరి 8న తుదిశ్వాస విడిచారు. దీంతో ఒకే ఏడాదిలో సూపర్ స్టార్ ఇంట్లో రెండు తీవ్ర విషాదాలు చోటుచేసుకున్నాయి. అన్నయ్యను కోల్పోయిన బాధ నుంచి తేరుకోకముందే, తల్లి దూరం అవ్వడం మహేశ్‌ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. మహేశ్‌కు తల్లిపై ఎనలేని ప్రేమ ఉండేది. నమ్రతతో వివాహం జరిగే వరకు తల్లి చాటు బిడ్డగానే పెరిగాడు. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూలో మహేశ్ బాబే స్వయంగా చెప్పారు. సందర్భం వచ్చినప్పుడల్లా తల్లితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించేవాడు. ఫ్యామిలీ ఫంక్షన్స్‌కి వెళితే తల్లి చేయి పట్టుకొని పక్కనే ఉండేవాడు. ఇందిరాదేవికి కూడా చిన్న కొడుకు మహేశ్ అంటే చాలా ఇష్టం ఉండేది. మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఇందిరాదేవి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్థం బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో ఉంచనున్నారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కీలక నేత రాజీనామా
జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గ్రూపు తగాదాలు.. అన్నదమ్ముల కొట్లాటలు.. పార్టీ పెద్దల తీరుతో ద్వితీయశ్రేణి నేతల తీవ్ర అసంతృప్తులతో సతమతమవుతున్న ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. పార్టీ కీలక నాయకుడు, దర్శి టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేశారు. పార్టీ కోసం తాను ఎంత కష్టపడినా అధినేత గుర్తించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేసేశారు. ఇందుకు సంబంధించిన వీడియో జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: దర్శి టీడీపీలో ముసలం మొదలైంది. ఇప్పటికే దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో పూర్తిగా తుడిచి పెట్టుకు పోయిన ఆ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పమిడి రమేష్ పరోక్షంగా ప్రకటించడంతోపాటు, అధిష్టానం తాను కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు లేదనే వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవల ఒంగోలు నగర శివారులో జరిగిన మహానాడుతో రాష్ట్రవ్యాప్తంగా పారీ్టలో ఉత్సాహం నింపాలనే టీడీపీ అధినేత చంద్రబాబు విపరీతమైన ప్రచారాలు చేసినా ఫలితాలు ఇవ్వడం లేదన్నది ఈ సంఘటనతో రుజువైంది. జిల్లాలో ఇప్పటికే పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో గ్రూపుల గోల టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అయోమయానికి గురిచేస్తోంది. అసలే పార్టీని ప్రజలు విశ్వసించని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో పార్టీ అధినేత నుంచి ఇన్చార్జి వరకు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు, ఆందోళనలు చేయకుండా పర్సనల్ విషయాలను తెరపైకి తెచ్చి రాజకీయాలు చేయడం పట్ల ఆ పార్టీలోనే తీవ్ర అసంతృప్తి మొదలైంది. 2020 నవంబరు నుంచి దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగా పమిడి రమేష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో తిరిగి పార్టీ పటిష్టతకు కృషి చేశారు. పార్టీ కార్యక్రమాలకు సొంత డబ్బును ఖర్చు చేస్తూ వచ్చారు. ఇంత చేస్తున్నా పార్టీ అధిష్టానం తనను గుర్తించడం లేదని సన్నిహితుల వద్ద పలు మార్లు వాపోయినట్టు సమాచారం. ఇదిలా ఉండగా మహానాడు తరువాత పారీ్టలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. పార్టీ అధినేత సైతం పట్టించుకోకపోవడంతో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ఆయన వర్గీయులు బహిరంగంగానే చెబుతున్నారు. అంతేకాకుండా ఇప్పటికే నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని మూసివేసి తాళాలు వేయడంతో ఇక దర్శి నియోజకవర్గంలో టీడీపీ క్లోజ్ అనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. మరో రెండేళ్లలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ బాధ్యతలు మోసేవారు కరువడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 75 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు లేరని స్వయంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా చెప్పుకునే నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో దర్శికి కూడా ఇన్చార్జి లేకుండా పోవడం ఆపార్టీ దీన స్థితికి నిలువుటద్దంగా నిలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీలోకి మాజీ ఎమ్మెల్యేలు: దర్శి నియోజకవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, 2012లో దర్శి టీడీపీ ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. దీంతో దర్శిలో టీడీపీకి నాయకత్వం వహించే దిక్కే లేకుండా పోయింది. 2020 నవంబరులో పమిడి రమేష్ టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో గ్రూపుల గోలతో నెట్టుకుంటూ వచ్చారు. అయితే టీడీపీ అధిష్టానం తీరుతో ఆవేదన చెంది ఇన్చార్జి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆపార్టీ వర్గాల్లో చర్చ నెలకొంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, చీరాల, దర్శి, సంతనూతలపాడు, యర్రగొండపాలెం, గిద్దలూరు వంటి నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్చార్జిలు ఉన్నారా.. లేరా అన్నట్లుగా పరిస్థితి నెలకొని ఉంది. మహానాడు సూపర్ హిట్ అంటూ జబ్బలు చరుచుకుంటున్న ఆ పార్టీ.. మహానాడు నిర్వహించిన జిల్లాలోనే కనీస బలం కూడా పెంచుకోకపోవడం గమనార్హం. జిల్లాలో రోజురోజుకూ పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి టీడీపీకి దిక్కెవరు..? దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి పమిడి రమేష్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ద్వితీయ శ్రేణి నేతల్లో ఎవరో ఒకరికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం ప్రయత్నాలు చేస్తున్నా గ్రూపు రాజకీయాలకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దర్శి టీడీపీలో చెలరేగిన జ్వాలను చల్లార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకుంటున్నట్లు సమాచారం. పార్టీ పెద్దల తీరుమారకపోతే సొంతపార్టీ నేతలు, కార్యకర్తలే కాకుండా ప్రజలు సైతం ఛీత్కరించుకుంటున్న పరిస్థితి నెలకొంది. -
నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. మే 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. విడుదల తేది దగ్గరపడుతుండడంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన చిత్రబృందం.. శనివారం (మే 7) హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ తో పాటు కీర్తి సురేష్, పరశురామ్, వీరితో పాటు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, వంశీ పైడి పల్లి కూడా సందడి చేశారు. (చదవండి: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి) ఈ సందర్భంగా మహేశ్ బాబు తన అన్నయ్య రమేశ్‌బాబుని తలచుకొని ఎమోషనల్ అయ్యాడు. ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు ( కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్‌బాబు అన్నయ్య రమేశ్ బాబు అనారోగ్యంతో ఈ ఏడాది జనవరి 8న మృతి చెందారు. ఆ సమయంలో మహేశ్‌బాబు కరోనా బారిన పడడంతో చివరి చూపు కూడా నోచుకోలేదు). కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి..’ అంటూ మహేశ్‌బాబు ఎమోషనల్ అయ్యారు. -
అన్నయ్య పెద్దకర్మకు హాజరైన మహేశ్ బాబు.. కన్నీటి పర్యంతం !
Mahesh Babu Attends Rituals Of His Brother Ramesh Babu: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు మరణించిన సంగతి తెలిసిందే. 56 ఏళ్ల రమేశ్ బాబు అనారోగ్యంతో జనవరి 8న రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో ఘట్టమనేని కుటుంబ సభ్యులకు తీరని శోకం మిగిలింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఘట్టమనేని కుటుంబ సభ్యులకు మహేశ్ బాబుకు కరోనా వచ్చి రమేశ్ బాబు చివరిచూపుకు నోచుకోకపోవడం మరింత కలిచివేసింది. ఈ విషయం అభిమానులను కూడా ఎంతో బాధపెట్టింది. అయితే ప్రస్తుతం కరోనా నుంచి కోలుకున్న మహేశ్ బాబు శనివారం (జనవరి 22) సోదరుడు రమేశ్ బాబు పెద్దకర్మకు హాజరయ్యారు. (చదవండి: రమేశ్‌బాబు మృతిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్) ఈ కార్యక్రమంలో తన అన్నయ్య మరణించిన రోజు రాలేకపోయినందుకు ఎంతో బాధపడినట్లు తెలుస్తోంది. అన్నయ్యతో మహేశ్ బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. అన్నయ్య రమేశ్ బాబు అంటే మహేశ్ బాబుకి ఎనలేని ప్రేమ. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రస్తావించిన మహేశ్.. రమేశ్ బాబు చనిపోయినప్పుడు భావోద్వేగంగా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రమేశ్ బాబు పెద్దకర్మకు ఘట్టమనేని కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. (చదవండి: రమేశ్‌బాబు మృతదేహాన్ని చూసి కన్నీరు పెట్టిన కృష్ణ) -
రమేష్ బాబు అంత్యక్రియలు ఫొటోలు
-
రమేశ్ బాబు మృతి.. 'హీరో' ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్
Ramesh Babu Passed Away,Hero Movie Pre Release Event Cancelled: సూపర్‌స్టార్ కృష్ణ మనువడు, గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా నటించిన చిత్రం హీరో. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నేడు(ఆదివారం) ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది. అయితే సూపర్ స్టార్ కృష్ణ కుమారుడు గట్టమేని రమేష్ బాబు కన్నుమూసిన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న హీరో చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా గల్లా అరుణకుమారి, సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో అమర రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై గల్లా పద్మావతి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
ఇప్పటివరకు చూడని రమేశ్ బాబు అన్‌సీన్ ఫోటోలు
Ramesh Babu Movies List: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్ బాబు (56)ఏళ్ల వయసులోనే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గత రాత్రి(శనివారం) 10గంటల ప్రాంతంలో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 1965, అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరలకు మొదటి సంతానంగా జన్మించిన రమేశ్ బాబు‘అల్లూరి సీతారామరాజు’సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత కృష్ణ ఓ లీడ్ రోల్లో నటించి, నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’లో చిన్నప్పటి ఎన్టీఆర్‌గా కనిపించారు. అలా బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసిన అనంతరం ‘సామ్రాట్’(1987)సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కృష్ణగారి అబ్బాయి, కలియుగ అభిమన్యుడు, అన్నాచెల్లెలు, ఆయుధం’వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు.రమేశ్‌కు భార్య మృదుల, కుమారుడు జయకృష్ణ, కుమార్తె భారతి ఉన్నారు. -
రమేశ్‌బాబు భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు ఫొటోలు
-
కన్నకొడుకు భౌతికకాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన కృష్ణ
Super Star Krishna Cried After Seeing Ramesh Babu For Last Time, Video Viral: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతితో ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లోని మహా ప్రస్థానంలో రమేష్ బాబు అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. అయితే అంతకుముందు పద్మాలయ స్టూడియోస్‌లో రమేశ్ బాబు భౌతికకాయాన్ని కాసేపు ఉంచారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సహా పలువురు ప్రముఖులు హాజరై నివాళులు అర్పించారు. అయితే కొడుకును కడసారి చూసేందుకు అక్కడికి వచ్చిన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడి భౌతికకాయన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 56 ఏళ్ల వయసులోనే కొడుకు చనిపోవడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. -
మహాప్రస్థానంలో ముగిసిన రమేశ్ బాబు అంత్యక్రియలు
Ramesh Babu Last Rites Performed In Maha Prasthanam: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్ బాబు (56)అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. రమేశ్ బాబు కుమారుడు జయకృష్ణ చితికి నిప్పు పెట్టి తుది వీడ్కోలు పలికారు. కోవిడ్ నిబంధనలతో అతికొద్దిమందితో అంత్యక్రియలు పూర్తి చేశారు. నటుడు నరేష్, తమ్మారెడ్డి భరద్వాజ సహా కొందరు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న మహేశ్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.కాగా కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)