ఈ ఏడాది వర్షాలు అనుకూలించక ఆలస్యంగా రబీ వరినాట్లు వేసుకున్న రైతులకు ఆదిలోనే చుక్కెదురైంది. వరిచేలు ఏపుగా ఎదుగుతున్నాయన...
మాడుగుల, న్యూస్‌లైన్: ఈ ఏడాది వర్షాలు అనుకూలించక ఆలస్యంగా రబీ వరినాట్లు వేసుకున్న రైతులకు ఆదిలోనే చుక్కెదురైంది. వరిచేలు ఏపుగా ఎదుగుతున్నాయని ఆశపడిన రైతులకు ప్రస్తుతం వరిచేలు తెగుళ్ళు బారిన పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులకు ఏ పురుగుమందులు ఎలావాడాలో తెలియక నానాఅవస్థలు పడుతున్నారు.దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారులు తమకు ఏది లాభసాటిగా ఉంటే అదే మందు వాడాలని సలహా ఇస్తున్నారు.
గతంలో 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందు రూ.190 ఉండేది. కానీ ప్రస్తుతం అదే మందు రూ.270-300కు అమ్ముతున్నారు. రై తులు పురుగుల మందు షాపు యజ మానుల సలహా మేరకు మందులు వాడుతున్నారు. వర్షాలు లు అనుకూలించక పోవడంతో తెగుళ్ళు సోకుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.మండలంలో సుమారు ఆరువేల ఎకరాల్లో రబీ ఎకరాలలో వరి సాగు చేయగా పెద్ద మొత్తంలో పంటలకు తెగుళ్ళు సోకాయని తెలుస్తోంది.
ప్రస్తుతం రెండు వేల ఎకరాల్లో పంట పొట్టదశకు చేరుకుంది. పతిఏటా అతివృష్టి అనావృష్టి కారణాల వలన పంటలకు తెగుళ్ళు సోకి తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం అందిస్తున్న పంట నష్టాలు కూడా తమకు ఆందటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
ఈ విషయమై వ్యవసాయాధికారి రమేష్‌బాబు వివరణ కోరగా ప్రస్తుతం రబీ వరికి అగ్గి తెగుళ్ళు వచ్చే ప్రమాదం ఉందని, దీని నివారణకు ట్రైసైక్లోజోన్ అనే మందును ఆరు గ్రాములు లీటరు నీటిని కలిపి ఎకరాకు 120 గ్రాముల మందును పిచికారి చేయాలన్నారు. ఆకులపై పురుగులుంటే మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు.