monocrotophos
-
మొగిపురుగు.. తొలిచేస్తోంది
ప్రస్తుతం మక్క పంటను కాండం తొలుచు పురుగు ఆశిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ పురుగు ముందుగా పత్రహరితాన్ని హరించి వేస్తుందని, తర్వాత కాండానికి వ్యాపిస్తుందని పేర్కొంటున్నారు. దీంతో దిగుబడి తగ్గిపోతుందన్నారు. ప్రాథమిక దశలోనే వీటిని అరికట్టకపోతే భారీ నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. బుస్సాపూర్ గ్రామానికి చెందిన ఉత్తమ రైతు గంగారెడ్డి ఈ పురుగు వల్లవాటిల్లే నష్టాలను వివరించారు. నివారణ చర్యలను సూచించారు. లక్షణాలు కాండం తొలిచే పురుగు మొక్కజొన్న మొలకెత్తిన 30-40 రోజులకు ఆశిస్తుంది. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రహరితాన్ని తినేస్తాయి. తర్వాత ముడుచుకున్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఆకులు విచ్చుకున్న తర్వాత చిన్నచిన్న రంధ్రాలు కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వ చనిపోయి ఎండిపోతుంది. ఇది కాండం లోపల గుండ్రని లేదా ‘ఎస్’ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను, కంకిని కూడా ఆశించి దిగుబడి రాకుండా చేస్తాయి. ఈ పురుగు ఆశించిన మొక్క నిలువుగానే చనిపోతుంది. నివారణ చర్యలు పొలంలో కలుపు మొక్కలను నివారించాలి. పురుగు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలలో జొన్నను ఎర పంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. ఎకరాకు 320 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 36 యస్.ఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి 10-15 రోజుల పైరుపై పిచికారి చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే కార్బోప్యురాన్ 3జీ గుళికలను ఎకరాకు మూడు కిలోల చొప్పున ఆకుల సుడులలో వేయాలి. -
వరి చేలకు తెగుళ్లు
మాడుగుల, న్యూస్‌లైన్: ఈ ఏడాది వర్షాలు అనుకూలించక ఆలస్యంగా రబీ వరినాట్లు వేసుకున్న రైతులకు ఆదిలోనే చుక్కెదురైంది. వరిచేలు ఏపుగా ఎదుగుతున్నాయని ఆశపడిన రైతులకు ప్రస్తుతం వరిచేలు తెగుళ్ళు బారిన పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు రైతులకు ఏ పురుగుమందులు ఎలావాడాలో తెలియక నానాఅవస్థలు పడుతున్నారు.దీన్ని ఆసరాగా తీసుకుని వ్యాపారులు తమకు ఏది లాభసాటిగా ఉంటే అదే మందు వాడాలని సలహా ఇస్తున్నారు. గతంలో 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందు రూ.190 ఉండేది. కానీ ప్రస్తుతం అదే మందు రూ.270-300కు అమ్ముతున్నారు. రై తులు పురుగుల మందు షాపు యజ మానుల సలహా మేరకు మందులు వాడుతున్నారు. వర్షాలు లు అనుకూలించక పోవడంతో తెగుళ్ళు సోకుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.మండలంలో సుమారు ఆరువేల ఎకరాల్లో రబీ ఎకరాలలో వరి సాగు చేయగా పెద్ద మొత్తంలో పంటలకు తెగుళ్ళు సోకాయని తెలుస్తోంది. ప్రస్తుతం రెండు వేల ఎకరాల్లో పంట పొట్టదశకు చేరుకుంది. పతిఏటా అతివృష్టి అనావృష్టి కారణాల వలన పంటలకు తెగుళ్ళు సోకి తీవ్రంగా నష్టపోతున్నామని ప్రభుత్వం అందిస్తున్న పంట నష్టాలు కూడా తమకు ఆందటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయమై వ్యవసాయాధికారి రమేష్‌బాబు వివరణ కోరగా ప్రస్తుతం రబీ వరికి అగ్గి తెగుళ్ళు వచ్చే ప్రమాదం ఉందని, దీని నివారణకు ట్రైసైక్లోజోన్ అనే మందును ఆరు గ్రాములు లీటరు నీటిని కలిపి ఎకరాకు 120 గ్రాముల మందును పిచికారి చేయాలన్నారు. ఆకులపై పురుగులుంటే మోనోక్రోటోఫాస్ 1.5 మిల్లీలీటర్ల మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలన్నారు.