
సాక్షి,అనకాపల్లిజిల్లా: కూటమి ప్రభుత్వంపై పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు అసంతృప్తి వ్వక్తం చేశారు. ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తూ తన ఇద్దరు గన్‌మెన్‌లను సరెండర్ చేశారు. తాను సిఫారసు చేసిన కాపు సామాజికవర్గం సీఐకి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్‌కు కాపు సామాజికవర్గానికి చెందిన సీఐని రమేష్‌బాబు సిఫారసు చేశారు. రమేష్‌బాబు సిఫారసును పక్కన బెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన మల్లిఖార్జున్‌కి మంత్రి నారా లోకేష్ పోస్టింగ్ ఇప్పిచ్చినట్లు సమాచారం. కాగా, జనసేన ఎమ్మెల్యేల సిఫార్సులను టీడీపీ నాయకులు పక్కన బెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.