mla
-
వాకౌట్.. వాయిదాలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు సోమవారం బీఆర్ఎస్ నిరసన లు, వాకౌట్, అధికారపక్ష సభ్యుల విమర్శల మధ్య శాసనసభ అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజే భేటీ నిర్వహించి, 16వ తేదీకి (సోమవారానికి) వాయిదావేశారు. ఈమేరకు సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమైనా.. ప్రశ్నోత్తరా లు, సంతాప తీర్మానాలు, ప్రభుత్వ బిల్లుల ప్రతిపాదనకే పరిమితమైంది.మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇవ్వలేదని నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ప్రశ్నోత్తరాల సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాలు, టీ విరామం తర్వాత సభ తిరిగి సమావేశంకాగానే.. ‘లగచర్ల’అంశంపై చర్చకోసం బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ గందరగోళంతో స్పీకర్ సభ ను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. నిర్దేశిత సమయంలోనే ప్రశ్నోత్తరాలు సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేశారు. రోజూ గంటపాటు జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. పది ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఆరు నిమిషాల సమయం లభిస్తోందని తెలిపారు. కానీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోవడం, కొన్ని ప్రశ్నలు మిగిలిపోవడంతో సభ్యులు అసంతృప్తి చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ్యులు, మంత్రులు ప్రశ్నలు, సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సంతాప తీర్మానాలు.. బిల్లులు.. ⇒ ఉమ్మడి ఏపీ శాసనసభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు దివంగత సభ్యులకు శాసనసభ రెండు నిమిషాల పాటు సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి (మెట్పల్లి), ఊకె అబ్బయ్య (బూర్గంపాడు, ఇల్లందు), డి.రామచంద్రారెడ్డి (దొమ్మాట) మరణం పట్ల స్పీకర్ ప్రసాద్‌కుమార్ సంతాప తీర్మానం ప్రతిపాదించారు. ⇒ ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లు 2024’ను సీఎం రేవంత్ పక్షాన మంత్రి శ్రీధర్‌బాబు సభకు సమరి్పంచారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ (సవరణ) బిల్లు–2024’ను సీఎం తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్ ⇒అసెంబ్లీ సమావేశాల రెండో రోజున బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు ఇచి్చన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ⇒ ‘లగచర్ల’అంశంపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విజయుడు, మర్రి రాజశేఖర్‌రెడ్డి వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి దాడులను అరికట్టడం, బాధితులకు పరిహారం అందించే అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ⇒ మూసీ ప్రక్షాళన, హైడ్రాపై చర్చించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. -
ఎమ్మెల్యేలకు పాఠాలు
-
ఆప్ ఎన్నికల వ్యూహం.. ఎమ్మెల్యేలకు మొండిచెయ్యి
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది(2025) ఫిబ్రవరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెలువరించిన అభ్యర్థుల రెండో జాబితాలో పార్టీ వ్యూహం వెల్లడయ్యింది.సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచెయ్యిఆప్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో పాతవారికి తిరిగి టిక్కెట్లు దక్కలేదు. పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే ఆయా స్థానాల్లోని ఎమ్మెల్యేలకు పార్టీ తిరిగి టిక్కెట్లు కేటాయించలేదు. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఢిల్లీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిర్లాన్ల స్థానాలు కూడా మారాయి. ఇదే సమయంలో అంత్యంత ఆసక్తికరంగా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తమ అభ్యర్థులు, కౌన్సిలర్లపై ఎమ్మెల్యేలకు మించిన రీతిలో ఆప్ వారిపై నమ్మకం వ్యక్తం చేసింది.విమర్శలకు చెక్ పెడుతూ..పక్కా ప్రణాళికతో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక ఎమ్మెల్యేలపై ఓటర్లకు ఉన్న ఆగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో కొత్తవారికి అవకాశం ఇచ్చిన కారణంగా ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలను విమర్శించే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఎత్తుగడను ఆప్ ప్లే చేసింది. ఈసారి ఎన్నికలు అంత సులువు కాదని వ్యూహకర్తలు కూడా భావిస్తున్నారట. పార్టీ అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం తేలిందంటున్నారు.ప్రజాభిప్రాయ సేకరణఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆప్ తమ అభ్యర్థుల ఎంపికలో ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించిందని సమాచారం. అభ్యర్థులను ఖరారు చేసిన చాలా స్థానాల్లో ఆప్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు కౌన్సిలర్లకే ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. గత ఎన్నికల్లో ఆప్ టిక్కెట్‌పై మూడు స్థానాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీని వీడారు. ఆప్ ఈ స్థానాల నుంచి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించింది. మిగిలిన 20 సీట్లలో రాఖీ బిర్లాన్, మనీష్ సిసోడియాల సీట్లు కూడా మారాయి. 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల టిక్కెట్లు మార్చి కొత్త అభ్యర్థులను పార్టీ రంగంలోకి దించింది. వీరిలో 90 శాతం మంది ఆప్ కౌన్సిలర్లు కావడం విశేషం. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ప్రజాదరణ పొందిన కౌన్సిలర్లకు రాబోయే ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆప్ అవకాశం కల్పించింది.ఈ కౌన్సిలర్లకు ఆప్ టిక్కెట్లునరేలా నుంచి దినేష్ భరద్వాజ్, ఆదర్శ్ నగర్ నుంచి ముఖేష్ గోయల్, జనక్‌పురి నుంచి ప్రవీణ్ కుమార్, డియోలి నుంచి ప్రేమ్ కుమార్ చౌహాన్, చాందినీ చౌక్ నుంచి పునర్దీప్ సింగ్ సాహ్ని, త్రిలోక్‌పురి నుంచి అంజనా పర్చా (మాజీ కౌన్సిలర్)కు ఆప్ టిక్కెట్లు కేటాయించింది. ఇదేవిధంగా త2020లో ఓడిపోయిన అభ్యర్థులు మళ్లీ టిక్కెట్లు కేటాయించింది. ఈ జాబితాలో రోహిణి నుంచి ప్రదీప్ మిట్టల్, గాంధీ నగర్ నుంచి నవీన్ చౌదరి ఉన్నారు. ఆ పార్టీ ఇప్పటి వరకు 31 మంది అభ్యర్థులను ప్రకటించింది.ఇది కూడా చదవండి: కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత -
రాక్షస పాలనలో దళితులపై కక్ష
సాక్షి, అమరావతి: ‘‘ఎస్సీలలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా..?’’ అంటూ అహంకారపూరితంగా దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు! ఆ వర్గాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతూ.. దళితులకు అసలు నాయకత్వమే లేకుండా చేయాలనే దుర్నీతితో సాగుతున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం.. ప్రశ్నించడమే పాపమన్నట్లు వ్యవహరిస్తున్నారు.ఒకపక్క ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అనుక్షణం వేధింపులకు గురిచేస్తూ.. మరోవైపు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఆర్డీవో, డీఎస్పీ, మండల స్థాయి అధికారులపై కక్ష సాధింపు చర్యలకు ఉపక్రమించారు. సూపర్ సిక్స్ సహా హామీల అమలు, అక్రమాలు, వైఫల్యాలపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకు ఎస్సీ వర్గానికి చెందిన సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వారిని పోలీసు స్టేషన్లలో అర్ధ నగ్నంగా నిలబెట్టి అవమానాలకు గురి చేసిన ఘటనపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచి్చనప్పటి నుంచి ఎస్సీలను ఉక్కుపాదంతో అణచివేత చర్యలను రోజు రోజుకు ఉద్ధృతం చేస్తున్నారని ఆ సామాజిక వర్గ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపులు..» అధికారంలోకి వస్తూనే వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను లక్ష్యంగా చేసుకున్న కూటమి ప్రభుత్వం ఆయనపై వరుసగా కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు తెర తీసింది. దళితులకు నాయకత్వం లేకుండా చేయాలనే కుట్రపూరిత ధోరణితో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వరుసగా కేసులు నమోదు చేస్తూ బెయిల్ రాకుండా అడ్డుకుంటోంది. నందిగం సురేష్ పై అసలు ఎక్కడెక్కడ, ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలంటూ స్వయంగా హైకోర్టు ఆదేశించడం రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. అన్యాయంపై ప్రశ్నించడం.. దళితుల్లో స్ఫూర్తి రగల్చడమే పాపమనే విధంగా దళిత నేతల పట్ల కూటమి సర్కారు దుర్నీతితో వ్యవహరిస్తోంది. » చంద్రబాబుపై గతంలో గులకరాయి పడిన ఘటనకు సంబంధించి నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌లపై కూటమి సర్కారు ఇప్పుడు అక్రమ కేసులు బనాయించి కక్ష సాధింపు చర్యలకు దిగింది. » కూటమి సర్కారు రాజకీయ క్షక్ష సాధింపుల్లో భాగంగా నారా లోకేశ్‌పై ట్వీట్ చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పై స్థానిక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసింది. జోరుగా సాగుతున్న పేకాట కార్యకలాపాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన ఓ ప్రజాప్రతినిధి పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోందో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. జరుగుతున్న విషయాన్ని చెబితే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా విపక్షంలో ఉన్నారనే ఏకైక కారణంతో ఓ ఎమ్మెల్యేపై కేసులు బనాయించడం కూటమి సర్కారు అరాచకాలకు పరాకాష్ట. » బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గతేడాది ఓ వలంటీర్ మృతి చెందిన ఘటనకు సంబంధించి మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న కూటమి సర్కారు అధికారంలోకి రాగానే ఈ కేసులో ఎలాంటి సంబంధం లేని విశ్వరూప్ కుమారుడు డాక్టర్ శ్రీకాంత్‌ను అక్రమంగా అరెస్టు చేసింది. డాక్టర్ శ్రీకాంత్‌ను ఏ 1గా చేర్చి జైలుకు తరలించింది. ఇటీవల ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. » మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు మేరుగు నాగార్జునపై టీడీపీ నేతలు ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించారు. నాగార్జున డబ్బులు తీసుకుని మోసం చేశారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు బనాయించారు. అయితే తనపై అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించినట్లు ఆ మహిళ అఫిడవిట్లో పేర్కొంది. తాను ఎన్నడూ మేరుగు నాగార్జునను చూడలేదని, తమ ఇద్దరి మధ్య ఎలాంటి ఆరి్థక లావాదేవీలు లేవని అందులో వెల్లడించడం గమనార్హం.విద్యావంతుడికి అవమానాలు.. రాజమహేంద్రవరంలో వరదలు వచి్చనప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన విద్యావంతుడైన దళిత యువకుడు పులి సాగర్ తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీరు ఇంకా నిల్వ ఉండటం, సమస్యలు తొలగకపోవడంపై ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు. దీంతో ఆయనపై కేసులు నమోదు చేసిన కూటమి ప్రభుత్వం దారుణ అవమానాలకు గురి చేసింది. పోలీసు స్టేషన్‌కు రావాలని ఆదేశించడంతో ఈ నెల 2న ఆయన రాజమహేంద్రవరం ప్రకాష్ నగర్ స్టేషన్‌కు వెళ్లారు. బీఎస్సీ, బీఈడీ చదివిన తనను పోలీసులు తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ, బెదిరిస్తూ.. సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ వాపోయారు. దళిత యువకుడిని పోలీసులు ఘోరంగా అవమానించిన తీరును సామాజికవేత్తలు ఖండిస్తున్నారు. » చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజవర్గంలో గత ఎన్నికల సమయంలో విద్యుత్తు సబ్ స్టేషన్లో ప్రమాదానికి సంబంధించి టీడీపీ నాయకుల ప్రోద్బలంతో దళితుడైన యాదమరి ఎంపీపీ సురేష్ బాబుపై చిత్తూరు టూ టౌన్ సీఐ అక్రమ కేసు నమోదు చేశారు. ఈ ఏడాది జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే పూతలపట్టు మండలం ఎగువ పాలకూరు దళితవాడలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హరి, జయపాల్, భారతి, బాబుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. » రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం తప్పెటవారిపల్లెలో ఇటీవల దళిత వర్గానికి చెందిన ప్రభుపై టీడీపీ సానుభూతిపరులు మరుగుతున్న నూనెను ఒంటిపై పోయడంతో తీవ్ర గాయాలతో కడప రిమ్స్‌లో చేరాడు. » దళితుడనే చిన్న చూపుతో రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబును టీడీపీ నాయకులు ఆయన కార్యాలయంలోనే వేధించారు. తీవ్ర మానసిక వేధింపులతో కలత చెందిన ఆయన అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అధికార యంత్రాంగంపై వేధింపులు» ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఐపీఎస్ సంజయ్‌కు నిష్పక్షపాతంగా పని చేస్తారనే పేరుంది. ఆయన ఏ రాజకీయ పక్షానికీ కొమ్ము కాయరని ఐపీఎస్ అధికారులే స్పష్టం చేస్తున్నారు. అగి్నమాపక డీజీ, సీఐడీ చీఫ్ హోదాల్లో సంజయ్ అక్రమాలు, నిధుల దురి్వనియోగానికి పాల్పడ్డారనే నెపం మోపి ఆయన్ను కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. » ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను వేధింపులకు గురి చేస్తున్న కూటమి సర్కారు ఐపీఎస్‌లు పాల్రాజు, జాషువాకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా కక్ష సాధిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి అన్బురాజన్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. రాజకీయ దురుద్దేశాలతో రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి విజయ్‌పాల్‌ను వేధించి అరెస్టు చేసింది. » ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణకు నిజాయితీగా, చట్ట ప్రకారం వ్యవహరిస్తారని అధికార వర్గాల్లో పేరుంది. గత ప్రభుత్వంలో ఆయన స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖ ఐజీగా పని చేశారు. విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరించిన రామకృష్ణపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తనిఖీలు నిర్వహించి అక్రమాలను వెలికి తీసినందుకు ఆయనపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు దిగింది. -
నాలుగుసార్లు ఎంపీ.. ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు గ్యాంగ్‌స్టర్
బీహార్: కొందరు రాజకీయ నేతలు అక్రమ దందాలు సాగిస్తున్నారనే వార్తలను మనం అప్పుడప్పుడు వింటుంటాం. అయితే నాలుగు సార్లు ఎంపీ, ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ప్రజాప్రతినిధి ఇప్పుడు గ్యాంగ్‌స్టర్‌గా మారాడంటే ఒక పట్టాన నమ్మలేం. కానీ ఇది నిజం. యూపీకి చెందిన ఒక నేత ప్రజాప్రతినిధి అనే పదానికే మచ్చతెచ్చేలా ప్రవర్తించాడు.రాజకీయాల్లో విజయంకల్తీ మద్యం కేసులో నిందితుడైన యూపీకి చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్ రాజకీయాల్లో పలు విజయాలను అందుకున్నారు. అజంగఢ్ నుంచి నాలుగు సార్లు ఎంపీ, ఫూల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2022లో మహూల్లో చోటుచేసుకున్న విషపూరిత మద్యం కుంభకోణం కేసులో చిక్కుకున్న ఆయన రెండేళ్లకు పైగా జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు రమాకాంత్ యాదవ్ ఐఆర్-42 గ్యాంగ్‌గా జాబితాలో చేరారు.1985లో రాజకీయ ప్రవేశంఫుల్పూర్ ప్రాంతంలోని అంబారి నివాసి రమాకాంత్ యాదవ్ 1985లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆఫుల్పూర్ పొవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో అజంగఢ్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీ అయ్యారు. 2019లో బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరి 2022లో ఫూల్పూర్ పోవై అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు.బీఎస్పీ అభ్యర్థిపై దాడి1998 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందు రమాకాంత్ యాదవ్ బీఎస్పీ అభ్యర్థి అక్బర్ అహ్మద్ డంపీపై దాడి చేసినందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 2022లో మహుల్‌లో విషపూరిత మద్యం ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ కేసులో రమాకాంత్ యాదవ్ హస్తమున్నట్లు దర్యాప్తులో తేలింది. అప్పటి నుంచి ఆయన జైలులో ఉన్నారు.ఐఆర్ -42 ముఠా జాబితాలో..వారణాసి జోన్ ఏడీజీ హత్య, కల్తీ మద్యం తయారు చేయడం, లైసెన్స్ పొందిన దేశీయ మద్యం షాపులో దానిని విక్రయించడం లాంటి నేరాలకు పాల్పడి, జైలుకెళ్లిన ఎమ్మెల్యే రమాకాంత్ యాదవ్, అతనితో సంబంధం ఉన్న 15 మంది సభ్యులను ఐఆర్ -42 ముఠా జాబితాలో పోలీసులు చేర్చారు. ఇతనితో పాటు ఇతని ముఠా సభ్యులపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద పోలీసులు చర్యలు చేపడుతున్నారు.ఇది కూడా చదవండి: Bangladesh: చిన్మయ్ కృష్ణ దాస్ తరపు న్యాయవాదిపై దాడి.. పరిస్థితి విషమం -
Ambati Rambabu: లోకల్ ఎమ్మెల్యే టాక్స్.. క్యాష్ కొట్టందే పని కాదు
-
పవనూ.. ఎవరి మీద ఈ ఆవేశం? (ఫొటోలు)
-
Maharashtra: తొలిసారిగా అసెంబ్లీకి 78 మంది..
సాక్షి ముంబై: రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78 మంది తొలిసారిగా విజయం సాధించారు. దీంతో ఈ 78 మంది మొదటిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కనున్నారు . మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకుగాను ఒక విడ తలా నవంబరు 30వ తేదీ ఎన్నికలు జరగగా నవంబరు 23వ తేదీ ఫలితాలు వెలువడ్డ సంగతి. తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీకి 1152, శివసేన (షిండే)కు 57, ఎన్సీపీ (ఏపీ)కి 41 స్థానాలను దక్కించుకున్నాయి. కాగా ఈసారి గెలుపొందిన అభ్యర్థులలో 78 మంది మొదటిసారిగా విజయం సాధించి అసెంబ్లీకి వెమెట్లెక్కనున్నారు. వీరిలో బీజేపీ నుంచి 33 మంది, శివసేన (ఉంటే) నుంచి 14 మంది, ఎన్సీపీ (ఏపీ)కి చెందిన ఎనిమిది మంది. శివసేన (యూబీటి)కి చెందిన 10 మంది, కాంగ్రెస్ నుంచి ఆరు. ఎన్సీపి (ఎస్పీ)కి చెందిన నలుగురు అభ్యర్థులున్నారు. వీరితోపాటు చిన్న పార్టీలకు చెందిన మరో ఇద్దరు అభ్యర్థులతోపాటు ఒక ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడికి చెందిన నేతలు తమ వారసులను బరిలోకి బరిలోకి దింపినప్పటికీ ప్రజలు అందరికీ పట్టంకట్టలేదని స్పష్టమైంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన వారసులలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూతుడు శ్రీ జయా చవాన్ నాందేడ్ జిల్లా బోకర్ అసెంబ్లీ సియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ లేని విజయం సాధించారు. మరోవైపు మాజీ మంత్రి బాబన్ రాన్ పాచ్‌పుతే సుమారుడు విక్రమ్ శ్రీగోంధా నుంచి మాజీ ఎంపీ హరిభావు జూవలే కుమారుడు అమోల్ జావలే రావేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీవేసి విజయం సాధించారుఇదిలా ఉండగా ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడైన సుమిత్ వాంఖడ, అదుల బాబా భోస్లే కరాడ్ నుంచి విజయం సాధించారు. అదే విధంగా శిసేన(షిండే) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనీల్ బాబర్ కుమారుడు సహాస్ బాబర్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా ఎంపీ సందీపన్ భూమరే కుమారుడు విలాస్ భూమరే పైఠన్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్చే చిమణరావ్ పాటిల్ కుమారుడు అమోల్ పాటిల్ ఎరండోల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా విజయం సాధించారు.ఇక ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైఓలని అణుశక్తినగర్ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి వర్షా గైక్వాడ్ సోదరీ జ్యోతి గైక్వాడ్ కూడా ధారావీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలుపొందారు. వీరితోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి, దివంగత ఆర్ ఆర్ పాటిల్ కుమారుడు ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ తరపున తాస్ గావ్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు తూర్పు బాంద్రా అసెంబ్లీ నుంచి శివసేన(యూబీటీ) తరపున ఉద్దవ్ ఠాక్రే బంధువైన వరుణ్ దేశామ్ మొదటిసారిగా విజయం సాధించారు.ముంబై నుంచి తొమ్మిది మంది..ఈ ఎన్నికల్లో ముంబై నుంచి తొమ్మిది. అభ్యర్థులు తొలిసారిగా విజయం సాధించిన వీరిలో మాహిం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధక్షుడు రాజ్ కాక్రే కుమారుడైన అమిత్ ఠాక్రే తొలిసారిగా బరిలోకి దిగగా శివసేన(షిండే) నుంచి సదా సర్వస్కర్, శివసేన(యూబీటీ) నుంచి మహేష్ సావంత్ పోటీ చేశారు. వీరిద్దరి మధ్య భారీగా ఓట్లు చీలి మహేష్ సావంత్ విజ సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, -
ఏం సందేశం ఇస్తున్నావు అధ్యక్షా?
సాక్షి, టాస్క్‌ఫోర్స్: గూడూరు ఎమ్మెల్యే తీరు స్థానికులను విస్మయానికి, గందరగోళానికి దారితీస్తోంది. ఆయన పోలీసులతో రహస్య సమావేశాలు నిర్వహించి రౌడీయిజాన్ని పూర్తిగా నిర్మూలించాలని ఆదేశిస్తున్నారు. సభలు సమావేశాల్లోనూ రౌడీలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తుంటారు. ఆపై రౌడీ షీటర్ల పుట్టిన రోజు వేడుకలు, వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యక్రమాలకు వెళ్తూ వారిని మరింత ప్రోత్సహించే రీతిలో వ్యవహరిస్తున్నారు. పోలీసులు కూడా ఏమి చేయాలో దిక్కుతోచక రౌడీ షీటర్లతో సఖ్యతగా ఉంటున్నారు. వారికి ప్రతి పనిలోనూ సహకారం అందిస్తూ వస్తున్నారు. ఐడీ కానిస్టేబుళ్లు అయితే రౌటీ షీటర్ల అనుచరులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడం చర్చనీయాంశమైంది.పట్టించుకుంటే ఒట్టునియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎక్కడ హత్యలు జరిగినా దానికి కేంద్ర బిందువుగా గూడూరులోని రౌడీ షీటర్ల హస్తం ఉన్నట్లు విచారణలో తేలుతోంది. గూడూరుకు చెందిన ఓ రౌడీషీటర్ చిల్లకూరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై పబ్లిక్‌గా దాబా నడుపుతున్నారు. అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నా పోలీసులు ఆ ప్రాంతం వైపు కన్నెత్తి చూడని పరిస్థితి. గతంలో గూడూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిలో దాబాకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారంటూ డివిజన్ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీన్ని మనసులో పెట్టుకుని సదరు వ్యకిపై బెదింపులకు దిగి ఫిర్యాదును ఉప సంహరించుకునేలా చేశారు. అదే రౌడీ షీటర్ దాబా వద్ద తనతో పాటుగా తిరుగుతున్న ఓ యువకుడ్ని వారం రోజుల క్రితం తన అనుచరులతో కలసి హత్య చేశారు. ఆపై వాకాడు ప్రాంతంలో శవాన్ని పారేశారు. ఇదంతా చూస్తుంటే ప్రజాప్రతినిధుల నుంచి వీరికి ఎంత మద్దతు ఉందో అర్థం చేసుకోవచ్చు. గూడూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక ఏడాదిలో ఇన్ని హత్యలు, రౌడీయిజం, అక్రమాలు లాంటి దారుణాలు చోటు చేసుకున్న దాఖలాలు లేవని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
కాంగ్రెస్ గ్యారెంటీలపై సొంత ఎమ్మెల్యే నుంచే వ్యతిరేకత!
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు.. సొంత ప్రభుత్వాన్నే ఇరకాటంలో పడేశారు. ఎన్నికల హామీల్లో కొన్నింటిని రద్దు చేయాలంటూ సదరు ఎమ్మెల్యే చేసిన బహిరంగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ తీవ్రంగా పరిగణించింది. ఆ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటించారు.విజయనగర ఎమ్మెల్యే హెచఆర్ గవియప్ప.. తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఎన్నికల హామీల వల్ల జనాలకు ఇళ్ల సదుపాయం కల్పించలేకపోతున్నామని, కాబట్టి వాటిలో కొన్నింటిని రద్దుచేయాలని సీఎం సిద్ధరామయ్యను పబ్లిక్‌గా కోరారాయన.ఉచిత పథకాల వల్ల ఇళ్ల నిర్మాణ పథకం సజావుగా ముందుకు సాగడం లేదు. ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రిగారికి విజ్ఞప్తి చేసేది ఒక్కటే. రెండు నుంచి 3 గ్యారెంటీ స్కీంలను తీసేయాలని కోరుతున్నా. అవి లేకపోయినా పెద్దగా ఫర్వాలేదు. తద్వారా కొందరికైనా ఇళ్లను నిర్మించి ఇవ్వగలం. ఇక నిర్ణయం సీఎంకే వదిలేస్తున్నా. ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటా అని అన్నారు.ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳಿಗೆ ಕಾಂಗ್ರೆಸ್ ಶಾಸಕರಿಂದಲೇ ವಿರೋಧ - ಒಂದೆರಡು ಗ್ಯಾರಂಟಿ ಸ್ಕೀಂ ತೆಗೆಯುವಂತೆ ಸಿಎಂಗೆ ಮನವಿ ಮಾಡ್ತೀವಿ ಎಂದ ಶಾಸಕ ಗವಿಯಪ್ಪ#CongressGuarantee #Congress #Gaviyappa #Bellary pic.twitter.com/3fsw27C1HD— soumya Sanatani (Modi Ka Parivar) (@NaikSoumya_) November 26, 2024అయితే .. ఎమ్మెల్యే వాదనను డీకే శివకుమార్ కొట్టిపారేశారు. ఎన్నికల హామీల అమలులో వెనకడుగు వేయబోయేది లేదని స్పష్టం చేశారాయన. ఆయన ఇలా చేయాల్సింది కాదు. ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేస్తాం. ఎలాంటి పథకాన్ని ఆపే ప్రసక్తే లేదు. మేం కర్ణాటక ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం. దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన సహించేది లేదు అని శివకుమార్ పేర్కొన్నారు.గవియప్ప సొంత ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో తన నియోజకవర్గానికి నిధుల విషయంలో పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆరోపించారాయన. అయితే.. ఆ ఆరోపణలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సిరాజ్ షేక్ ఖండించారు. అంతేకాదు.. ఆరెస్సెస్‌తో ఉన్న అనుబంధమే గవియప్పతో అలా మాట్లాడిస్తోందంటూ సంచలన ఆరోపణలు చేశారు. -
మహా పోరులో తెలుగోడి ఢంకా : బాబాయ్- అబ్బాయ్‌ల గెలుపోటములు తీరిదీ!
సోలాపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరి కలలు నెరవేరగా.. అనేకమంది వైఫల్యాలను చవిచూశారు. కోటే కుటుంబానికి చెందిన మహేశ్ కోటే, ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకే కుటుంబం తరఫున ఇరువురు అందులో తెలుగువారు శాసనసభ్యులు అయ్యే కల నెరవేరుతోందని వారి అనుచరులు భావిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న మహేశ్ కోటే కల చెదిరిపోగా.. ఆయన తమ్ముడు కొడుకు దేవేంద్ర ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు. పట్టణంలో పేరు గాంచిన కోటే కుటుంబం కాంగ్రెస్‌కు, ముఖ్యంగా సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ శిందేకు విధేయులుగా గుర్తింపు పొందింది. సుశీల్ కుమార్ శిందే ఎన్నికల్లో విజయం సాధించడంలో, రాజకీయ ఆధిపత్యం అంతా దివంగత విష్ణు పంతు కోటే ఎన్నికల వ్యూహంలో ప్రధానపాత్ర పోషించేవారు. అయితే సుశీల్ కుమార్ శిందే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఇక్కడి ఎంపీ టికెట్ విష్ణు పంతు కోటేకు వస్తుందని అంతా భావించారు. అయితే విష్ణు పంతుకోటేకు మాత్రం అవకాశం రాలేదు. ఆ తర్వాత 2009లో సోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణు పంత్ కుమారుడైన మహేశ్ కోటేకు కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థత్వం లభించింది. అయితే అప్పటి మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందిన వ్యక్తి రెబల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మహేశ్ కోటే ఎన్నికల్లో పరాభవం చెందారు. తర్వాత కాంగ్రెస్‌లో ఉంటే తన ఎమ్మెల్యే కల నెరవేరదని తెలుసుకున్న మాజీ మేయర్ మహేశ్ కోటే శివసేనలో చేరారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2014లో శివసేన తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు తీరా సమయంలో శివసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన మూడో స్థానంలో నిలిచారు. గత మూడు ఎన్నికలలో పరాభవం చవిచూసిన మహేశ్ కోటే గత సంవత్సరం కిందట శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టిగా సన్నాహాలు చేసుకున్నారు. మహా వికాస్ అఘాడీకి చెందిన నేతలు అందరూ ఈ ఎన్నికల్లో మహేశ్‌కు వెన్నంటి ఉండి ప్రచారాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయనే సోలాపూర్ నార్త్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచి పరాభవం చెందారు. మరోవైపు ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలో దూకుడుగా ప్రసంగించడం ద్వారా కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఆ తర్వాత కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించి పార్టీలో క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అధిష్టానం దృష్టిలో పడి అభ్యరి్థత్వాన్ని పొందారు. తద్వారా ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించిన తెలుగువాడిగా రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు! -
Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్‌యూలో విచిత్ర పరిణామం
రాంచీ: జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించింది. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం సాధించింది. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్‌కు చెందిన జేఎంఎం (జేఎంఎం) 34 సీట్లు గెలుచుకుంది. ఇంతలో ఒక విచిత్ర పరిణామం చోటుచేసుకుంది.ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏజేఎస్‌యూ)పార్టీ నుంచి కొత్తగా ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యే నిర్మల్ మహతో ఇంతలోనే రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ చీఫ్ సుదేష్ మహతోను అసెంబ్లీకి పంపేందుకు తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నానని ప్రకటించారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఏజేఎస్‌యూ పార్టీ అధినేత సుదేష్ మహతో ఓటమి పాలయ్యారు.భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మిత్రపక్షమైన ఏజేఎస్‌యూ పార్టీ జార్ఖండ్‌లోని 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అయితే కేవలం ఒక సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. అది కూడా కేవలం 231 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో ఈ విజయం సాధించింది. ఈ ఒక్క సీటు నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే నిర్మల్ మహతో కూడా ఇప్పుడు రాజీనామాకు సిద్ధమయ్యారు. మండూ స్థానం నుంచి ఎన్నికైన ఈయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు పార్టీ చీఫ్ సుదేష్ మహతోకు లేఖ పంపానని అన్నారు.తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా ఆయనను అభ్యర్థించానన్నారు. తద్వారా సుదేష్ మహతో ఇక్కడ(మండూ) జరగబోయే ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. సుదేష్ మహతో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అభ్యర్థి అమిత్ కుమార్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఇతనితో పాటు ఏజేఎస్‌యూకి చెందిన మరో 8 మంది అభ్యర్థులు కూడా ఓడిపోయారు. ఈ పార్టీ కేవలం మండూ సీటును మాత్రమే గెలుచుకుంది.ఇది కూడా చదవండి: మహారాష్ట్ర ఫలితాల ఎఫెక్ట్.. మార్కెట్లు పుంజుకునే చాన్స్ -
జార్ఖండ్‌లో భట్టి బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల నేప థ్యంలో ఏఐసీసీ పరిశీలకు ని హోదాలో రాంచీలో మ కాం వేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జార్ఖండ్ పీసీసీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. జేపీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన భట్టి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో పార్టీ వ్యూహాలను ఎమ్మెల్యేలకు వివరించారు.ఆ తర్వాత ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో కలిసి జార్ఖండ్ గవర్నర్ సంతోశ్ గంగ్వార్‌ను కలిశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన భట్టి ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాల్లో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి దేశాన్ని ఓ వికృత పార్టీ పాలిస్తోందని, ఆ పార్టీని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందున వారి కోసం కష్టపడి పనిచేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి దిశానిర్దేశం చేశారు. రాంచీలోని హోటల్ చాణక్యలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ టికెట్లు దక్కలేదు. కాంగ్రెస్ పారీ్టలో పనిచేయడం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ పక్షాన కొత్త ఎమ్మెల్యేలను అభినందించిన భట్టి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రానికి రావాలని కోరుతూ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సాదర ఆహా్వనం పలికారు. ఈ సమావేశంలో జార్ఖండ్ పార్టీ ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
TG: ‘సీఎస్’ వస్తే ఎవరూ ఉండకూడదా? పోలీసులపై ఎమ్మెల్యే ఫైర్
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో శుక్రవారం(నవంబర్22) ఎస్పీఎఫ్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సచివాలయంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సచివాలయం ఆరవ అంతస్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతకుమారి వస్తున్న సమయంలో వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.సీఎస్ శాంతకుమారి వస్తున్నారు పక్కకు ఉండాలని వనపర్తి ఎమ్మెల్యేకు పోలీసులు సూచించారు.తాను ఎమ్మెల్యేను అని చెప్పినా మేఘారెడ్డిని పోలీసులు పక్కన నిలబెట్టారు.సీఎస్ వస్తె ఫ్లోర్ అంతా ఎవ్వరూ ఉండకూడదా? అని ఈ సందర్భంగా పోలీసులను మేఘాారెడ్డి ఆగ్రహంగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేను ఎస్పీఎఫ్ సిబ్బంది గుర్తుపట్టకపోవడవం వల్లే వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలను గుర్తు పట్టడం లేదని ఎస్పీఎఫ్‌పై పలు ఫిర్యాదులుండడం గమనార్హం. -
తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
-
ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసు: ఆప్ నేత అమానతుల్లా ఖాన్‌కు బెయిల్
ఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు అమానతుల్లా ఖాన్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్, ఇతరులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. వెంటనే అమానతుల్లాను జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఇక..ఆయనపై విచారణ జరపడానికి అవసరమైన అనుమతి లభించలేదని పేర్కొంది. సప్లిమెంటరీ చార్జిషీట్లో పేరున్న మరియం సిద్ధిఖీపై కేసును కొనసాగించడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. అమానతుల్లా ఖాన్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కోర్టు అంగీకరించగా, అవసరమైన అనుమతులు లేకుండా విచారణ కొనసాగదని కోర్టు తెలిపింది. అవసరమైన అనుమతి పొందిన తర్వాత, ఛార్జ్ షీట్‌ను పరిగణలోకి తీసుకోవచ్చని పేర్కొంది. -
ఎమ్మెల్యేలు బడ్జెట్‌పై అవగాహన పెంచుకోవాలి
సాక్షి, అమరావతి: బడ్జెట్‌పైన, బడ్జెట్ సమావేశాలపైన అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వం తెచ్చే బిల్లులు, పాలసీలపై ప్రతి ఎమ్మెల్యే అధ్యయనం చేయాలని అన్నారు. పబ్లిక్ గవర్నెన్స్‌లో ఎమ్మెల్యేలనూ భాగస్వాములను చేస్తామని చెప్పారు. వెలగపూడి అసెంబ్లీ కమిటీ హాలులో మంగళవారం ఎన్డీఏ ఎమ్మెల్యేలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గతంలో ఒకే అంశంపై ఎంత సమయమైనా చర్చించేవాళ్లమని, ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలనే ఆసక్తి క్రమంగా తగ్గుతోందని చెప్పారు.కేంద్ర బడ్జెట్లో కూడా నిధుల కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. సభలో ప్రతిపక్షం లేదని అనుకోవద్దని, వాళ్లకు బాధ్యత లేదని అన్నారు. అసెంబ్లీకి తాము పంపిన ప్రతినిధి తమ కోసం ఏం మాట్లాడుతున్నారని ప్రజలు ఎప్పుడూ గమనిస్తారని చెప్పారు. సమస్యలపై మాట్లాడకుండా బూతులు తిడితే ప్రజలు స్వాగతించరని తెలిపారు. స్పీకర్ అయ్యన్న మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు అసెంబ్లీ రూల్స్ తెలియాలని చెప్పారు. అనంతరం బడ్జెట్‌పై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇచ్చారు.ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంఆ తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. 150 రోజుల పాలనలో చాలా నిర్ణయాలు తీసుకున్నాని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యేలు హుందాగా ఉండాలని, వారి దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపైన చర్చించాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్‌రాజు, ఎన్డీఏ కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు ముడుపులు.. ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతల దందా
తూర్పుగోదావరి జిల్లా : పేరుకే ఉచిత ఇసుక విధానం. కానీ కూటమి నేతలకు కాసులు కురిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో టీడీపీ నేతలు ఇసుక దందాకు తెరలేపారు. యథేశ్చగా కూటమి నేతలు దోచుకుంటున్నారు. ఎమ్మెల్యేకు ముడుపు ఇవ్వాలంటూ టీడీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారు.బాట ఛార్జీల పేరుతో లారీకి రూ.2,500వరకు వసూలు చేస్తున్నారు. కొవ్వూరు టీడీపీ ఎంపీపీ కాకర్ల నారాయుడు వాడపల్లి ర్యాంప్‌లో తన అనుచరులతో దగ్గరుండి వసూలు చేయిస్తున్నాడు. ర్యాంపుల నుంచి ట్రాక్టర్లు, ఎండ్లబండ్లతో రహస్య ప్రదేశాలలో ఇసుక డంప్ చేసి.. మొత్తంలో ఇసుకను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు కూటమి నేతలు. అందుకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు వైరల్‌గా మారాయి. -
టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై కేంద్రమంత్రి పెమ్మసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు.ఓ కార్యక్రమంలో పాల్గొన్న పెమ్మసారి చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒకేసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఎమ్మెల్యేలు అవ్వాలనుకున్నవారు ఎవరు అవినీతికి పాల్పడిన అది తప్పే. లిక్కర్ షాపులు నిర్వహించుకోవాలంటే అందుకు పెద్దమొత్తంలో వాటాలు అడుగుతున్న ఎమ్మెల్యేల నుంచి సమస్యలు ఎదురవ్వొచ్చు. వ్యవస్థ గురించి మాట్లాడాలంటే ఇంకా పెద్ద సమస్యలు ఉన్నాయి.ఇవాళ ఎన్నికలంటే డబ్బులతో కూడుకున్న పెద్ద ప్రక్రియ. ఈ వ్యవస్థను చూస్తుంటే ఒకరకంగా అసహ్యం వేస్తుంది. నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయాలి ప్రజా సేవ చేయాలనే వారికి రాజకీయాలు దూరమయ్యాయి.ఎన్నికలు వచ్చాయంటే నాయకులు డబ్బుల కోసం పీక్కుతింటున్నారు. ప్రజలు కూడా మాకు డబ్బు రాలేదని అడుగుతున్నారు’ అని పెమ్మసాని చంద్రశేఖర్ టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై మండిపడ్డారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్‌పై విచారణ వాయిదా
హైదరాబాద్, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. గురువారం మరోసారి ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఈ కేసుపై విచారణ చేపట్టింది. తొలుత కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదనలు వినిపించారు.అసలు ఈ అప్పీల్లు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదని సీజే ధర్మాసనం తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. ఆ తర్వాత స్పీకర్ సూచన మేరకు షెడ్యూల్‌ను రిజిస్ట్రీ ముందు ఉంచాలని అన్నారు. స్పీకర్ ముందు ఉంచనని చెప్పే అధికారం కార్యదర్శికి లేదని కోర్టు తెలిపింది. అసెంబ్లీ కార్యదర్శి ప్రభుత్వం నుంచి వేతనం పొందుతున్నారు. ఆయన కోర్టు ఉత్తర్వులు పాటించాల్సిందే. అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించనని అంటే సరికాదని పేర్కొంది.అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ మెయింటనబుల్ కాదని అందుకే కొట్టివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు కోర్టుకు తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని చెప్పారు. వాదనల అనంతరం.. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. అంతకుముందు సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి తీర్పు వెలువరించారు.చదవండి: ‘ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు'.. 4 వారాలు గడువు -
ఇద్దరు టీఎంసీ ఎమ్మెల్యేలపై దాడి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై దాడి జరిగింది. వీరిపై వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. మింఖాకు చెందిన టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్పైన, సందేశ్‌ఖాలీకి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపైన దాడి జరిగింది. పోలీసులు ఈ రెండు కేసులను నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.ఎమ్మెల్యే ఉషారాణి మండల్ కాళీపూజ మండపానికి వెళ్లి, పూజలు నిర్వహించి, తిరిగి వస్తుండగా ఆమెపై దాడి జరిగింది. హరోవా ప్రాంతంలో 150 మంది ఆమెను చుట్టుముట్టారు. తనను కారులోంచి బయటకు లాగి తుపాకీతో కాల్పులు జరిపారని టీఎంసీ ఎమ్మెల్యే ఉషారాణి మండల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు అక్రమ కార్యకలాపాలకు పాల్పడి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన నేత తనపై దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు.ఇదేవిధంగా సందేశ్‌ఖాలీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. నజత్‌లో జరిగిన కాళీ పూజకు వెళ్లి, తిరిగి వస్తుండగా ఎమ్మెల్యే సుకుమార్ మహతాపై దాడి జరిగింది. దాడి అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తాను కాళీ పూజ పూర్తిచేసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా, కొందరు దుండగులు తన వాహనంపై దాడి చేశారన్నారు. అలాగే తనతో పాటు వస్తున్న పార్టీ కార్యకర్తలపైనా దాడి చేశారన్నారు. తీవ్రంగా గాయపడిన ఒక కార్యకర్తను ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. ప్రత్యర్థి వర్గం వారే ఈ దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే సుకుమార్ మహతా ఆరోపించారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ కేసుల్లో కొందరిని అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇది కూడా చదవండి: అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం -
టికెట్ నిరాకరణ.. సిట్టింగ్ ఎమ్మెల్యే అదృశ్యం
మహారాష్ట్రలో ఎన్నికల తేదీ దగ్గరపడుతోన్నకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ఓవైపు నామినేషన్ వేసిన వారు ప్రచారాలతో విజయం కోసం హోరెత్తిస్తుండటంతో.. మరోవైపు టికెట్ దక్కని వారు నిరశలో కూరుకుపోయారు.ఈ క్రమంలో ఓ అనూహ్య విషయం వెలుగులోకి వచ్చింది. టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎమ్మెల్యే ఒకరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తనను కాదని మరొకరికి టికెట్ ఇవ్వడంతో ఆయన తీవ్ర ఆవేదనకు గురై కనిపించకుండాపోయారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్ వంగకు ఈసారి పార్టీ టికెట్ ఇవ్వలేదు. పాల్ఘర్ స్థానం నుంచి ఆయనకు బదులు మాజీ ఎంపీ రాజేంద్ర గోవిట్ను బరిలోకి దింపింది. దాంతో శ్రీనివాస్ తీవ్ర వేదనకు గురైన శ్రీనివాస్ సోమవారం సాయంత్రం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు.కాగా 2022లో ఉద్ధవ్ ఠాక్రే వర్గాన్ని వీడి చీలికవర్గమైన షిండేతో వెళ్లిన నేతల్లో శ్రీనివాస్ వంగా ఒకరు. ఎమ్మెల్యే అదృశ్యంతో సీఎం షిండే వంగా భార్యతో ఫోన్ మాట్లాడారు. అతను కనిపించకుండా పోయే ముందు.. వంగా మీడియాతో మాట్లాడుతూ.. షిండే కోసం దేవుడిలాంటి వ్యక్తిని (ఉద్ధవ్ ఠాక్రే) విడిచిపెట్టానని, ప్రస్తుతం తనకు తగిన శాస్తి జరిగిందని చెప్పారు.షిండేకు విధేయుడిగా ఉన్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నట్లు తెలిపారు.ఇక ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ జాడ తెలియరావడం లేదు. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తనకు సీటు ప్రకటించకపోయే సరికి తీవ్ర నిరాశకు గురైనట్లు శ్రీనివాస్ భార్య తెలిపారు. సోమవారం బ్యాగ్ సర్దుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్యే.. మళ్లీ అందుబాటులోకి రాలేదని చెప్పారు. అయితే అదృశ్యమయ్యే ముందు తాను షిండే వర్గంలో చేరినందుకు పశ్చాత్తాపడుతున్నానని, ఉద్దవ్ ఠాక్రేను కలిసి వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నట్లు తనతో చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు.ప్రస్తుతం పోలీసులు ఆయనకోసం గాలిస్తున్నారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. -
హనీట్రాప్ కేసులో కూటమి ఎమ్మెల్యే?
విశాఖ సిటీ: హనీట్రాప్ కేసు వ్యవహారంలో కూటమి ఎమ్మెల్యే ఉన్నారా? బీజేపీ యువనేతలకు కూడా ఈ కేసుతో ప్రమేయముందా? వీరూ హనీట్రాప్ బాధితులా? లేదా యువతి ద్వారా వ్యాపారులను దోచుకుంటున్న సూత్రధారులా? ఇప్పుడివే సందేహాలు సర్వత్రా చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారులు, బిగ్షాట్స్ లక్ష్యంగా జాయ్ జమీనా అనే యువతి వలపు వల విసిరి.. వీడియోలు, ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ.లక్షలు కాజేసిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ముందు వ్యాపారులు మాత్రమే ఆమె వలలో చిక్కుకున్నట్లు భావించినప్పటికీ.. ఆ జాబితాలో రాజకీయ నాయకులు కూడా ఉన్నారన్న వార్తలు గుçప్పుమంటున్నాయి. ఈ కేసు వివరాలు బయటకు వెల్లడించకుండా పోలీసులు అత్యంత గోప్యత పాటిస్తుండడం కూడా ఈ వాదనలకు బలాన్ని చేకూరిస్తోంది. వలపు వల విసిరి.. రేప్ కేసు పెట్టి.. జాయ్ జమీనా కోసం ఎన్ఆర్ఐ యువకుడు అమెరికా నుంచి వచ్చి.. ఆమె వలలో చిక్కుకొని రూ.లక్షలు పోగొట్టుకున్నాడని.. అతడి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హనీట్రాప్ వ్యవహారం బట్టబయలైంది. అప్పటి నుంచి ఈ కేసు పోలీసులకు తలనొప్పిగా మారింది. విచారణలో ఆమె వ్యవహరించిన తీరు పట్ల పోలీసులు విస్తుపోయారు. ఎన్ని రకాలుగా ప్రశ్నించినా ఆమె నోరువిప్పనట్లు తెలిసింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి.. గతంలో ఈ తరహా కేసులు ఎక్కడైనా నమోదయ్యాయా? అని దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గతంలో ఆమె ఒక వ్యక్తిపై పీఎంపాలెం పోలీస్‌స్టేషన్‌లో రేప్ కేసు నమోదు చేసినట్లు గుర్తించారు. ఆ కేసు వివరాలను ఆరా తీయడంతో హనీట్రాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు ఆమెను భీమిలి పోలీస్‌స్టేషన్‌లో విచారించినప్పటికీ ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పనట్లు సమాచారం. దీంతో ఆమెను అరెస్టు చేసి కోర్టుకు ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారు. ఇంతలో కంచరపాలెం, ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కూడా ఆమె ఇద్దరి వ్యాపారులను ఇదే తరహాలో మోసం చేసినట్లు ఫిర్యాదు అందాయి. స్ప్రే కొట్టి.. ముగ్గులోకి దించి.. జాయ్ జమీనా ట్రాప్‌లో చిక్కుకున్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఆమె వ్యాపారులను దోచుకున్న తీరుపై కూడా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుగా రెస్టారెంట్, కాఫీషాప్, రాజకీయ నేతలు ఇలా ఆర్థికంగా బలమైన వారినే ఎంచుకుంది. వారిని ఏదో ఒక విధంగా పరిచయం చేసుకొని, ఫోన్ నెంబర్ తీసుకొని, కవ్వింపు మాటలతో ముగ్గులోకి దింపేది. ఒక రోజు వారితో కారులో బయటకు వెళ్లడం.. ఆ సమయంలో వారి ముఖంపై ఒక రసాయనాన్ని స్ప్రే చేయడం.. ఇంటికి తీసుకువెళ్లడం.. వారు వద్దన్నా డ్రింక్ లేదా కాఫీ బలవంతంగా తాగించడం.. ఆ తరువాత బాధితులు మత్తులోకి జారిపోవడం.. లేచి చూసేసరికి ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం.. రూ.లక్షలు డిమాండ్ చేయడం.. పెళ్లి చేసుకోమని కత్తితో బెదిరించడం.. డబ్బు ఇవ్వని వారిపై రేప్ కేసు పెట్టడం.. ఇదే తరహాలో అనేక మందిని ఆమె దోచుకున్నట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. ఈ జాబితాలో వ్యాపారులు, ఎన్ఆర్ఐలతో పాటు రాజకీయ నేతలు సైతం ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నా..జమీనా నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి స్టేషన్లో నమోదైన కేసులో ఆమె అరెస్టయింది. కోర్టు ద్వారా ఆమెను కస్టడీకి తీసుకొని విచారించారు. ఆమె వెనుక ఉన్న ముఠా సమాచారం కోసం పోలీసులు ఎన్ని విధాలుగా ప్రశ్నించినా.. నోరు విప్పడం లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ల్యాప్‌టాప్, మొబైల్లో ఉన్న సమాచారం సేకరించడానికి చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినట్లు తెలుస్తోంది. పోలీసుల ప్రశ్నలకు సమాచారం చెప్పాల్సిన అవసరం తనకు లేదని, నచ్చింది చేసుకోమని ఆమె సమాధానమివ్వడంతో పాటు తిరిగి వారినే బెదిరిస్తూ మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కస్టడీ సమయం ముగియడంతో ఆమెను మళ్లీ జైలుకు పంపించారు. అయితే కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక కాఫీషాప్ యజమాని ఫిర్యాదుపై నమోదైన కేసులో కూడా గత రెండు రోజుల క్రితం ఆమెను రెండోసారి కస్టడీకి తీసుకున్నారు. ఇక్కడ కూడా ఆమె నుంచి వివరాలు రాబట్టడానికి ప్రయతి్నంచారు. -
ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఏడేళ్ల జైలు
బెంగళూరు: బెళెకెరి నౌకాశ్రయంలోని ఇనుప ఖనిజం దొంగతనం, అక్రమ ఎగుమతి కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీశ్ కృష్ణ సాయిల్‌కు ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.6 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రజాప్రతినిధులపై కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం సాయిల్‌తోపాటు ఆరుగురికి జైలు శిక్ష, భారీగా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. శ్రీ మల్లికార్జున షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న సాయిల్(58) తాజా పరిణామంతో ఎమ్మెల్యే పదవికి అనర్హుడయ్యే అవకాశముంది. బళ్లారి గనిలో అక్రమంగా వెలికి తీసిన ఇనుప ఖనిజాన్ని 2010లో బెళెకెరి పోర్టులో అధికారులు నిల్వ ఉంచారు. దీనిపై కన్నేసిన సాయిల్, మరికొందరు కోట్లాది రూపాయల ఖనిజాన్ని దొంగచాటుగా చైనాకు ఎగుమతి చేశారు. తాజాగా దోషులుగా తేలిన వారిలో ప్రైవేట్ కంపెనీల నిర్వాహకులతోపాటు పోర్టుల డిప్యూటీ కన్జర్వేటర్ మహేశ్ జె బిలియె కూడా ఉన్నారు. ఈ నెల 24వ తేదీన తీర్పు వెలువడిన వెంటనే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సాయిల్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. ఎమ్మెల్యేపై కేసు
ఇండోర్: ఆదిదేవుడు శివుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై మధ్యప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే బాబు జండెల్పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే బాబు జండెల్ శివుడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ శుక్రవారం రాత్రి విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) లీగల్ సెల్ నేత, న్యాయవాది అనిల్ నాయుడు టుకోగంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ హన్స్‌రాజ్ సింగ్ చెప్పారు. శివుడిపై అమర్యాదకర వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే జండెల్పై ఇప్పటికే ఇండోర్‌లో కేసు నమోదైందన్నారు. అయితే, తాను ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ఎమ్మెల్యే జండెల్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వీడియో మారి్ఫంగ్ చేసిందని చెబుతున్నారు.