
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీలో తనను ఉద్దేశించి ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. అసెంబ్లీ మీడియాహాల్‌లో కౌశిక్‌రెడ్డి శనివారం(ఆగస్టు3) మీడియాతో మాట్లాడారు. దానం నాగేందర్ మాటలు చెప్పరాకుండా ఉన్నాయన్నారు. సభలో రూల్స్‌కి వ్యతిరేకంగా ఆయన స్థానం నుంచి కాకుండా వేరే సీటు నుంచి మాట్లాడారన్నారు.
‘దానం నాగేందర్ నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. నువ్వు మొగోడివైతే రా చూసుకుందాం. ఎక్కడో స్పాట్ చెప్పు రావడానికి నేను రెడీ. దానం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎవడు ఇక్కడ భయపడటం లేదు. కేసిఆర్ పెట్టిన బిక్షపై నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలువు.
గతంలో ఇలాగే మాట్లాడితే ఉప్పల్లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎల్బీనగర్‌లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిలు ఉరికించి కొట్టిన సంగతి మరువకు. మేము మళ్లీ కొట్టే సమయం వచ్చింది. దానం నాగేందర్ నువ్వు తాజ్ క్రిష్ణ హోటల్‌కు టీషర్ట్, పౌడర్ వేసుకుని వెళ్లి చేసే వేశాలు మాకు తెలుసు’అని కౌశిక్‌రెడ్డి దానంపై విరుచుకుపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment