Padi Kaushik Reddy
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఇంకెప్పుడు?
న్యూఢిల్లీ, సాక్షి: ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంలో.. తెలంగాణ స్పీకర్‌పై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత టైం తీసుకుంటారంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కడియం, దానం నాగేందర్ , తెల్ల వెంకటరావులపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానందలు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జ్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. చర్యలకు అసెంబ్లీ స్పీకర్‌కు ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన.. తగిన సమయం రావాలని అన్నారు. దీంతో.. ‘‘ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవడానికి మీ దృష్టిలో తగిన సమయం అంటే ఎంత ?. రీజనబుల్ టైం అంటే.. మహారాష్ట్ర తరహాలో శాసనసభ గడువు ముగిసేవరకా ?..’’ అని తెలంగాణ స్పీకర్‌ను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయమై స్పీకర్‌ను సంప్రదించి చెబుతామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి సమాధానం ఇచ్చారు. దీంతో విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్పై గెలిచి.. ఈ ముగ్గురితో సహా మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే.. పార్టీ ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జనవరి 16వ తేదీన SLP దాఖలు చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటిదాకా కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని హరీష్‌రావు మరో పిటిషన్ వేశారు.మహారాష్ట్ర కేసులో..రాజ్యాంగంలోని పదో షెడ్యూల్.. ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీకి మారిన(ఫిరాయించిన) నేతలపై అనర్హత వేటు వేయడం గురించి ప్రత్యేక చట్టంతో చర్చించింది. అయితే దానికి ఓ నిర్దిష్ట కాలపరిమితి అంటూ లేకపోవడంతో.. ఇలాంటి కేసుల్లో చర్యలకు ఆలస్యం అవుతూ వస్తోంది. అయితే గతంలో మహారాష్ట్రలో ఫిరాయింపుల వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరింది. 2022 జనవరిలో పార్టీ ఫిరాయించిన మహారాష్ట్ర ఎమ్మెల్యేలపై ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోవడానికి వీల్లేదని, వాళ్ల పదవీకాలం ముగిసేదాకా ఆగాలని సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు వెలువరించింది.రాజ్యాంగపరంగా ఎలాంటి సంక్షోభాలు తలెత్తకుండా, చట్ట సభలు సజావుగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం ఆ సమయంలో వ్యాఖ్యానించింది. అంతేకాదు.. కోర్టు తీసుకున్న ఈ నిర్ణయం ఫిరాయింపుల కేసుల్లో పారదర్శకత కోసం నిర్దిష్ట మార్గదర్శకాల ఆవశ్యకతను తెలియజేసింది. -
రేవంత్‌ను నమ్మారా.. నమ్మితే నట్టేట మునిగినట్లే : పాడి
సాక్షి,తెలంగాణ భవన్ : సీఎం రేవంత్ రెడ్డి కొత్త డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. ఎవ్వరి సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి. ఈ పత్రాలు చూసి ఇళ్ళు కట్టుకుంటే ప్రజలు మోసపోతారు ..తస్మాత్ జాగ్రత్త. రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ మోసపోవద్దు ..ఇండ్లు కట్టుకున్న తర్వాత రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వరు. స్థలం లేని వారికి ఇండ్ల కేటాయింపులో స్పష్టత లేదు. రేవంత్ రెడ్డి ఓ పెద్ద జోకర్లా మారారు. తుగ్లక్‌లా పాలిస్తున్నారు. ఓ మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు.కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉంది ఆయన తీరు. టకీ టకీ అని రైతు భరోసా డబ్బులు పడతాయని రేవంత్ అన్నారు.ఒక్క రోజు డబ్బులు వేసి ఆపేశారు. అధికారులు వచ్చి నామమాత్రపు పత్రాలు ఇచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ సంతకాలు లేకుండా పత్రాలు ఇస్తే ప్రజలు ఎలా నమ్మాలి?ఈ పత్రాలు చూసి తొందరపడి ఇల్లు కట్టుకుంటే మోసపోతారు.. తస్మాత్ జాగ్రత్త.- ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి pic.twitter.com/RRNCkW8D6L— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 30, 2025ఆరునెలల దాకా ఎన్నికల కోడ్ పేరు చెప్పి రైతు భరోసాను ఆపే కుట్ర జరుగుతోంది. కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ఎవరి పాలన బాగుంది అంటే కేసీఆర్ పాలన బాగుంది అని 70 శాతం నెటిజన్లు సమాధానమిచ్చారు. దాదాపు 90 వేల మంది ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ప్రజలు కాంగ్రెస్ చెంప చెళ్లుమనిపించారు.మరో ఛానల్ నిర్వహించిన సర్వేలో కూడా 80 శాతం మంది కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు. అన్ని పథకాలు ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు. -
కమలాపూర్‌లో ఉద్రిక్తత.. కౌశిక్‌రెడ్డిపై టమాటాలతో దాడి!
సాక్షి, కరీంనగర్: కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(kaushik Reddy)పై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.కరీంనగర్లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనే విధంగా మరోసారి దాడి జరిగింది. నేడు కమలాపూర్‌లో గ్రామసభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు. సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టమాటాలు విసిరారు. దీంతో..కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల వద్ద వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు. దీంతో, ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు. అనంతరం, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు. -
కేసులకు భయపడే ప్రసక్తే లేదు: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
-
రేవంత్.. ముందు నీ భాష మార్చుకో: కౌశిక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది తాను కాదు.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఘాటు విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయించిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్తే తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు.పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట కౌశిక్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. దాదాపు గంటకుపైగా ఆయనను పోలీసులు విచారించారు.ఇక, విచారణ అనంతరం పీఎస్ బయట కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు నన్ను గంట పాటు విచారించారు. విచారణలో భాగంగా 32 ప్రశ్నలు అడిగారు. అడిగిన ప్రశ్నే అడిగారు మళ్లీ అడిగారు. నేను అన్నింటికీ సమాధానం ఇచ్చాను నా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. నాపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే నాపై కేసులు పెడుతున్నారు. 420 హామీలు, ఆరు గ్యారంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటాను. డిసెంబర్ నాలుగో తేదీన ఫిర్యాదు చేయడానికి నేను బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కి వెళ్ళాను. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకొని అక్కడిని వెళ్ళాను. నా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే నాపైనే కేసులు పెట్టారు. నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పండుగ రోజు కూడా నన్ను దొంగ లాగ అరెస్ట్ చేసి తీసుకుపోయారు. తెలంగాణలో భాష మార్చుకోవాల్సింది నేను కాదు.. రేవంత్ మార్చుకోవాలి అని హితవు పలికారు. -
పోలీస్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో మాసబ్ ట్యాంక్ సీఐ ఎదుట ఆయన విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అరగంటకుపైగా ఆయన్ని విచారణ జరిపినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 4వ తేదీన కౌశిక్ రెడ్డి తన అనుచరులతో కలిసి బంజారాహిల్స్(Banjara Hills) పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తన ఫోన్ ట్యాప్ అవుతోందంటూ ఆయన ఫిర్యాదు చేయబోయారు. అయితే ఆ సమయంలో బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్ బయటకు వెళ్తున్నారు. దీంతో.. సీఐ వాహనానికి తన వాహనాన్ని అడ్డు పెట్టి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ ఘటనపై సీఐ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)పై కేసు నమోదు అయ్యింది. అయితే ఫిర్యాదుదారుడు సీఐ కావడం, అది బంజారాహిల్స్ పీఎస్‌లోనే కావడంతో.. దర్యాప్తు అధికారిగా మాసబ్ ట్యాంక్ సీఐ పరుశురాంను ఉన్నతాధికారులు నియమించారు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కౌశిక్‌కు నోటీసులు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇవాళ విచారణకు హాజరయ్యారు. నా తప్పేమీ లేదు: కౌశిక్రెడ్డిమాసబ్ ట్యాంక్ పీఎస్ లోపలికి వెళ్లే క్రమంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘నేను చేసిన తప్పేమీ లేదు. విచారణకు పూర్థిస్తాయిలో సహకరిస్తా’’ అన్నారు. అయితే తన అడ్వొకేట్(Advocate)తో కలిసి ఆయన లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా సిబ్బంది అడ్డుకున్నారు. ఆపై ఆయన విజ్ఞప్తితో ఉన్నతాధికారులను సంప్రదించి.. అనంతరం వాళ్లను లోపలికి వెళ్లనిచ్చారు. -
కేసీఆర్ కుటుంబాన్ని రేవంత్ రెడ్డి వేధిస్తున్నారు: పాడి కౌశిక్ రెడ్డి
-
రేవంత్.. నువ్వు జైలుకెళ్లావని మాపై కక్ష సాధింపా?: కౌశిక్‌రెడ్డి
సాక్షి, కరీంనగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth Reddy) జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ జైలుకు పంపాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy). ప్రపంచం మొత్తం చూసి వచ్చిన వ్యక్తి కేటీఆర్(KTR). ఇదంతా రేవంత్‌కు ఏం తెలుసు? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఫార్ములా ఈ కారు రేసు కేసు అనే లొట్టపీసు కేసు అంటూ విమర్శించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యులను రేవంత్ వేధింపులకు చేస్తున్నాడు. గట్టిగా అడిగితే కేసులు పెడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఒక్క రూపాయి రైతుభరోసా ఇవ్వలేదని అడిగినందుకు కేసులు పెడుతున్నారా?. రుణమాఫీ గురించి అడిగితే పెడుతున్నారా?. తులం బంగారం ఏమైందన్నందుకా కేసులు?. అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నిలదీస్తే కేసులు పెడుతున్నారు.కారు రేసు అనేది ఓ లొట్టపీసు కేసు. ఈ రేసు కోసం రాష్ట్రాల మధ్య పోటీ ఉంటుంది. ఆ పోటీలో తెలంగాణకు తీసుకొస్తే.. దాన్ని కూడా రేవంత్ రద్దు చేశాడు. తెలంగాణకు రూ. 700 కోట్లు లాభం వచ్చినట్టు నెల్సన్ సర్వేనే చెప్పింది. టెస్లా కంపెనీని తీసుకురావాలనేది కేటీఆర్ లక్ష్యం. ఆ కంపెనీని తీసుకురావడానికే కేటీఆర్ కారు రేసు తీసుకొచ్చారు. దాన్ని రేవంత్ అడ్డుకున్నాడు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి.. అందర్నీ పంపించాలని అనుకుంటున్నాడు.కేటీఆర్ ప్రపంచం చూసి వచ్చిన వ్యక్తి. కేటీఆర్‌కు, రేవంత్ రెడ్డికి అదే డిఫరెన్స్. అవినీతే లేనప్పుడు ఏసీబీ ఎందుకు?. అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదు?. ప్రొసీజర్ ల్యాప్స్ కేటీఆర్ తప్పు ఎందుకు అవుతుంది?. పాలసీ డిసీషన్ మాత్రమే కేటీఆర్ తీసుకుంటారు తప్ప ప్రొసీజర్‌తో ఆయనకేం సంబంధం?. కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ నలుగురు పోతే.. 60 లక్షల మంది కేసీఆర్‌లు తయారు అవుతారు. కేసీఆర్ ఇచ్చిన బీఫామ్ మీద గెలిచి బీఆర్ఎస్ను అంటే ఊరుకోవాలా?. కేసీఆర్ బొమ్మ లేకుండా సంజయ్ కనీసం వార్డ్ మెంబర్ కూడా గెలవలేడు.ఆర్డీవో మీద నేను ఒక్క మాటైనా మాట్లాడానా?. ఒక్కడితో నేను మాట్లాడితే ఆరుగురితో కేసులు పెట్టిస్తారా?. డీకే అరుణపై నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కేసు పెట్టలేదే?. నాడు జూపల్లిపై ఇష్టారాజ్యంగా చేస్తే కేసీఆర్ కేసులు పెట్టలేదు కదా?. నీకో న్యాయం మాకో న్యాయమా?. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీతో దాడి చేయిస్తారా? ఖమ్మంలో హరీష్ రావుపై దాడి జరిగింది ఇదేం సంస్కృతి? అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
సంజయ్‌ని నేనేం రాళ్లతో కొట్టలేదు: కౌశిక్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ డీఆర్సీ మీటింగ్‌లో బట్టలు విప్పుతా అని ఎమ్మెల్యే సంజయ్ నన్ను రెచ్చగోట్టేలా మాట్లాడారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. బుధవారం(జనవరి15) కౌశిక్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘మొదట సంజయ్ నాపై దాడి చేశారు. శ్రీధర్ బాబు నన్ను వేలు చూపుతూ బెదిరించారు. కాంగ్రెస్ నేతల ఆదేశాలతో పోలీసులు రౌడీలుగా తయారయ్యారు. రైతు భరోసా కోసం ప్రశ్నించా. రైతు రుణ మాఫీ 50 శాతం అయ్యింది పూర్తి చేయండని రైతుల పక్షాన అడిగాను అందులో తప్పేముంది. సంజయ్ ఏ పార్టీ నుంచి ఏ గుర్తుతో గెలిచిండు. సంజయ్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడు. కేసీఆర్ బొమ్మతో సంజయ్ గెలిచిండు. డబ్బులకు అమ్ముడుపోయిన సంజయ్ సిగ్గు లేకుండా స్పీకర్ నాపై ఫిర్యాదు చేసాడు. స్పీకర్‌కు సంజయ్ పై ఫిర్యాదు చేస్తా. మంత్రుల సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన సంజయ్ డిస్ క్వాలిఫై చేయాలి. రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టిస్తా అని రేవంత్ రెడ్డే అన్నారు. నేను రాళ్లతో కొట్టలేదు కదా..ప్రశ్నిస్తే నా పై కేసులా’అని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. ఇదీ చదవండి: మోకాళ్లపై కూర్చొని మంత్రి పొన్నం నిరసన -
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
హైదరాబాద్, సాక్షి: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మంగళవారం ఉదయం ఆయనకు బెయిల్ లభించింది. రెండు కేసుల్లోనూ జడ్జి ఆయనకు బెయిల్ ఇచ్చారు. జిల్లా సమీక్షా సమావేశంలో తోటి ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించారని ఆయనపై కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే.ఆదివారం కరీంనగర్(Karimnagar) కలెక్టరేట్లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్(Sanjay)ల మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుని సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్‌రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. రాత్రంతా ఆయన త్రీటౌన్ పోలీస్టేషన్లో ఉన్నారు. ఈ ఉదయం వైద్య పరీక్షల అనంతరం పాడి కౌశిక్‌రెడ్డిని (Padi kaushik Reddy) రెండో అదనపు అదనపు మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. రూ.10 వేలప్పున మూడు పూత్తులు ఇవ్వాలని ఆదేశిస్తూ మెజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు.వాదనలు ఇలా..రెండో అదనపు జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ ప్రేమ లత ముందు కరీంనగర్ పోలీసులు కౌశిక్‌ను హాజరు పర్చారు. కౌశిక్‌రెడ్డిపై గతంలోనూ పలు కేసులు ఉన్నందున రిమాండ్ విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే.. కౌశిక్‌పై నమోదు అయిన సెక్షన్స్ అన్నీ బెయిలేబుల్ కాబట్టి రిమాండ్ రిజెక్ట్ చేయాలని బీఆర్ఎస్ లీగల్ టీం వాదించింది. ఈ క్రమంలో.. అర్ణేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసు(2014) తీర్పు ప్రకారం రిజెక్షన్ కోసం కోరింది. దీంతో బీఆర్ఎస్ లీగల్ టీం వాదనతో ఏకీభవించిన జడ్జి.. బెయిల్ మంజూరు చేశారు. ఇకముందు అలాంటి దూకుడు ప్రదర్శించొద్దని కౌశిక్‌ను హెచ్చరించిన మెజిస్ట్రేట్.. కోర్ట్ ప్రొసీజర్స్ ప్రకారం కరీంనగర్ లో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయొద్దనీ ఆదేశించారు.రేపు మాట్లాడతా: కౌశిక్ రెడ్డితెలంగాణా ప్రజలు, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది హైడ్రామా. ఈ హైడ్రామాలో నాకు మద్దతు తెలిపిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితతో పాటు అందరికీ నా ధన్యవాదాలు. పండుగ కాబట్టి రాజకీయాలు మాట్లాడొద్దనుకుంటున్నా. రేపు హైదరాబాద్ లో పూర్తి వివరాలు వెల్లడిస్తా. కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం ఏ రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి కూడా నిబంధనలు అడ్డువస్తున్నాయి అని మీడియాను ఉద్దేశించి అన్నారాయన. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి ఊరట
సాక్షి, కరీంనగర్ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (Padi Kaushik Reddy) అరెస్ట్ కేసులో రాత్రంతా హైడ్రామా నెలకొంది. కౌశిక్‌ను రాత్రంతా త్రీ టౌన్ పీఎస్‌లోనే పోలీసులు ఉంచారు. రాత్రి కౌశిక్ రెడ్డి నిద్రించేందుకు బెడ్ తెప్పించి ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటిగంటకు.. అరెస్ట్ చేసినట్టు బీఆర్ఎస్(BRS) లీగల్ టీమ్‌కు పోలీసులు వెల్లడించారు. నిన్న)రాత్రి (సోమవారం) త్రీ టౌన్లోనే వైద్య పరీక్షలు పూర్తి చేసిన అధికారులు.. ఈ రోజు ఉదయం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండో అదనపు మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చారు.ప్రశ్నిస్తూనే ఉంటా: కౌశిక్ రెడ్డి తన అరెస్టు ప్రజాస్వామికం, అనైతికం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటా. అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలతో కేసులు పెట్టి నన్ను అరెస్టు చేశారు. పండుగ పూట ఇబ్బందుల గురిచేయాలని చూస్తున్నారు’’ అంటూ కౌశిక్‌రెడ్డి మండిపడ్డారు.కేటీఆర్, హరీష్‌రావు హౌస్ అరెస్ట్కౌశిక్రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హుజూర్‌నగర్‌లో బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేశారు. గచ్చిబౌలిలో కేటీఆర్, కోకాపేటలో హరీష్‌రావులను హౌస్ అరెస్ట్ చేశారు.వన్ టౌన్లో మూడు, త్రీ టౌన్లో రెండు, మొత్తం ఐదు కేసుల నమోదు చేశారు. రెండు కేసుల్లో పోలీసులు అరెస్ట్ చూపించారు. మొత్తం 12 సెక్షన్ల కింద కేసులు నమోదైంది. ఆర్డీవో మహేశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పీఏ ఇచ్చిన పిటిషన్ల మేరకు నమోదు చేసిన కేసుల్లో కౌశిక్‌ను అరెస్ట్ చేశారు. నిన్నంతా కొనసాగిన బీఆర్ఎస్ నేతల అరెస్టుల పర్వం కొనసాగింది. కరీంనగర్లో నెలకొన్న హైడ్రామాతో సంక్రాంతి పండుగ పూట టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది.కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌తో పాడి కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇదీ చదవండి: సర్కారు నిధుల వేట!దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు.కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్
సాక్షి హైదరాబాద్/సాక్షిప్రతినిధి,కరీంనగర్/కరీంనగర్ క్రైం: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలతో హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో తీవ్ర హైడ్రామా చోటు చేసుకుంది. మూడు కేసులు నమోదు.. కరీంనగర్లో ఆదివారం జరిగిన ఓ సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌తో పాడి కౌశిక్‌రెడ్డి వాగ్వాదానికి దిగిన విషయం తెలిసిందే. మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరుల సమక్షంలోనే సంజయ్‌ను నువ్వు ఏ పార్టీలో ఉన్నావంటూ కౌశిక్‌రెడ్డి నిలదీశారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్వార్థపరుడివి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే సంజయ్‌పై దాడి చేశారంటూ ఆయన పీఏ, సమావేశంలో గందరగోళం సృష్టించారంటూ స్థానిక ఆర్డీవో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనితో పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చారు. ఇక్కడి జూబ్లీహిల్స్ రోడ్ నం 36 ప్రాంతంలో ఓ టీవీ చానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చి బయటికి వస్తున్న సమయంలో అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలించారు. చాలా సేపు ఆయన ఎక్కడున్నదీ బయటికి చెప్పలేదు. అర్ధరాత్రి సమయంలో పట్టణంలోని త్రీటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నేతల ఆందోళన.. హైడ్రామా.. కౌశిక్‌రెడ్డి అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనలకు దిగవచ్చనే అంచనాతో పోలీసులు ముందస్తుగానే భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ వద్దకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, మాజీ మేయర్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగరశాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, దావ వసంత, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు. కౌశిక్‌రెడ్డి అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఆందోళన చేస్తున్నవారిని అరెస్టు చేసి కొత్తపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సమాధానం చెప్పలేకే అణచివేత: కేటీఆర్ రైతు రుణమాఫీని ఎగవేసి, దళితబంధుకు పాతరేసిన కాంగ్రెస్ సర్కారును ప్రశి్నస్తే.. సమాధానం చెప్పలేక సీఎం అణచివేత చర్యలకు దిగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్టు అక్రమం, అత్యంత దుర్మార్గమని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘పూటకో అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టు చేయడం రేవంత్ సర్కారుకు అలవాటుగా మారింది. సీఎం చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన సీఎంపై చర్య తీసుకోవాల్సిందిపోయి, ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్‌రెడ్డిపై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. వెంటనే విడుదల చేయాలి: హరీశ్‌రావు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశి్నస్తున్న ప్రజా ప్రతినిధులపై అక్రమంగా కేసులు పెట్టడం, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. అణచివేతలు, నిర్బంధాలు, దాడులకు బీఆర్ఎస్ పార్టీ బెదరదన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంజయ్ దురుసుగా మాట్లాడారు: గంగుల కరీంనగర్: సమీక్షా సమావేశంలో ప్రభుత్వ తీరును ప్రశ్నించిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు బలవంతంగా బయటికి లాక్కెళ్లారని.. ఆయనే గొడవకు కారణమంటూ అక్రమ కేసులు పెట్టడం ఏమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మండిపడ్డారు. కరీంనగర్‌లోని తన నివాసంలో సోమవారం గంగుల మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారిక సమావేశానికి ఆహ్వనిస్తేనే నేను, కౌశిక్‌రెడ్డి వెళ్లాం. సమావేశం ప్రారంభంలోనే ఎమ్మెల్యే సంజయ్ తన పక్కనే కూర్చున్న కౌశిక్‌రెడ్డిని మాటలతో అసహనానికి గురిచేశారు. దీనితో ఆగ్రహించిన కౌశిక్‌రెడ్డి ముందు నీది ఏ పార్టీనో చెప్పి ప్రసంగించాలని నిలదీశారు.ఈ సమయంలో కౌశిక్రెడ్డిపైనే సంజయ్ దురుసుగా ప్రవర్తించారు’’ అని తెలిపారు. అక్కడే ఉన్న మంత్రులు దీనిని అడ్డుకోకపోగా.. క్షణాల్లో వచ్చిన పోలీసులు కౌశిక్‌రెడ్డిని బలవంతంగా లాక్కెళ్లి బయటకు నెట్టేశారని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేస్తే నేనూ చేస్తా..: ఎమ్మెల్యే సంజయ్ గతంలో కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్న కేసీఆర్, కేటీఆర్‌లు తమ పదవులకు రాజీనామా చేస్తే తాను కూడా రాజీనామా చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దాడి చేశారంటూ నమోదైన కేసుకు సంబంధించి ఆయన కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. కౌశిక్‌రెడ్డి తన హక్కులకు భంగం కలి్పంచారని, చేతిపై కొట్టారని, అవమానించారని పేర్కొన్నారు. తనపై జరిగిన దాడి కౌశిక్‌రెడ్డి ఒక్కడి పనేనా, ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? అనేది తెలియాలన్నారు.కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు కరీంనగర్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనుమతి మేరకు తాను మాట్లాడుతుండగా ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అడ్డుకున్నారని ఎమ్మెల్యే సంజయ్ సోమవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలం ఉపయోగిస్తూ తనను తోసివేశారని, దాడికి యత్నించారని పేర్కొన్నారు. కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
BRS ఎమ్మెల్యే కౌశిక్డ్డిపై స్పీకర్‌కు జగిత్యాల MLA సంజయ్ ఫిర్యాదు
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై నాలుగు కేసులు.. స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు ఫిర్యాదు వెళ్లింది. ఆయన ప్రవర్తన మీద జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. తనతో దురుసుగా ప్రవర్తించారని, కాబట్టి కౌశిక్‌పై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరారాయన. కరీంనగర్ కలెక్టరేట్లో అభివృద్ధి కార్యక్రమాల సన్నద్ధతపై ఆదివారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్‌కార్డుల జారీ సన్నద్ధతపై నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్(MLA Sanjay) మాట్లాడే సమయంలో.. ఆయన పక్కనే కూర్చున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి లేచి అభ్యంతరం తెలిపారు. ‘ఈయనకు మైకు ఇవ్వొద్దు.. నువ్వు ఏ పార్టీవయా..?’ అంటూ వేలెత్తి చూపిస్తూ మాటల దాడికి దిగారు. దీంతో డాక్టర్ సంజయ్ ‘నీకేం సంబంధం.. నాది కాంగ్రెస్ పార్టీ.. నువ్వు కూర్చో’ అన్నారు. దీంతో.. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో సంజయ్ చేతిని కౌశిక్‌రెడ్డి తోసేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి పరుష పదజాలం వాడటంతో గొడవ పెద్దదై పరస్పరం తోసుకునే స్థాయికి చేరింది. ఆ అనూహ్య పరిణామానికి వేదికపై ఉన్న మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు నిర్ఘాంతపోయారు. పక్కనే ఉన్న ప్రజాప్రతినిధులు వారించే యత్నం చేసినా కౌశిక్‌రెడ్డి వినలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఆయనను బలవంతంగా సమావేశం నుంచి బయటకు తీసుకెళ్లారు. కౌశిక్ వెంట మిగతా బీఆర్ఎస్ ప్రతినిధులు వెళ్లిపోయారు.నీటిపారుదల శాఖ మంత్రి, ఉమ్మడి కరీంనగర్(Karimnagar) జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఏడుసార్లు గెలిచిన తాను రాజకీయంగా ఇలాంటి ప్రవర్తనను ఎన్నడూ చూడలేదంటూ తోటి శాసనసభ్యుడితో కౌశిక్‌రెడ్డి ప్రవర్తించిన తీరును ఉత్తమ్ తప్పుబట్టారు. నాలుగు కేసులు నమోదుహుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై (Padi kaushik Reddy) పలు సెక్షన్ల కింద మూడు కేసులు నమోదయ్యాయి. ఎమ్మెల్యే సంజయ్‌తో దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమావేశంలో గందరగోళం, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని గ్రంథాలయ ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై ఇంకో కేసును ఫైల్ చేశారు. వీటితో పాటు గేమ్ ఛేంజర్ టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ కాంగ్రెస్ మరో ఫిర్యాదు చేసింది. ఈమేరకు వేర్వేరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై నాలుగు కేసులను పోలీసులు నమోదు చేశారు. -
కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు
సాక్షి, కరీంనగర్: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దీంతో, కరీంనగర్లో రాజకీయం మరోసారి హీటెక్కింది. కౌశిక్ రెడ్డి సవాల్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బిగ్ షాక్ తగలింది. ఆయనపై పలు సెక్షన్స్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని.. ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, సమావేశంలో గందరగోళం సృష్టించి, పక్కదారి పట్టించారని ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కరీంనగర్ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదుపై మూడో కేసు ఫైల్ చేశారు పోలీసులు.ఇదిలా ఉండగా.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యాచరణ ప్రణాళిక, సమీక్ష సమావేశం రసాభాసగా మారిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పథకాల అమలులో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కోరారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా.. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీ అని.. మైక్ ఎందుకు ఇచ్చారని మంత్రులను ప్రశ్నించారు. దీనిపై ఎమ్మెల్యే సంజయ్ కూడా స్పందించారు. ‘నీది ఏ పార్టీ అంటే నీది ఏ పార్టీ..’అంటూ ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. దూషణల పర్వం..ఈ సందర్బంగా తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని సంజయ్ సమాధానం ఇచ్చారు. ఇద్దరి మధ్యన వాగ్వాదం పెరిగి కలబడి చేతులతో తోసుకున్నారు. పరస్పరం దూషణలకు దిగారు. పోలీసులు కలగజేసుకొని పాడి కౌశిక్‌ను అడ్డుకున్నారు. దీంతో కొన్ని నిమిషాలపాటు కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ పరుగున వెళ్లి వారిద్దరినీ వారించే యత్నం చేశారు. పాడిని బలవంతంగా పోలీసులు బయటకు తరలించారు. కేసీఆర్ ఫొటో పెట్టుకొని గెలిచిన వారంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేనూ ఇలాగే నిలదీస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ బదులిస్తూ.. ముందు పార్టీ ఫిరాయింపులను గతంలో ప్రోత్సహించిన కేసీఆర్, కేటీఆర్ ముందు రాజీనామా చేయాలని, తాను జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తానని, త్వరలో పార్టీలో చేరతానని మీడియాకు తెలిపారు.నేను రాజీనామా చేస్తా.. మీరు సిద్ధమా? శాసనసభ సభ్యత్వానికి తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని.. దమ్ముంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సవాల్ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అమ్ముడుపోయారని, ఆయనకు ఎమ్మెల్యే పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని చెప్పారు. దమ్ముంటే సంజయ్ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్‌పై గెలవాలన్నారు. -
పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
వీడియో: పాడి కౌశిక్‌రెడ్డి హౌస్ అరెస్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామునే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కేటీఆర్(KTR) విచారణ జరుగుతున్న వేళ బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఈరోజు ఉదయం 5:30కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేశారు.హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు ఉదయం 5:30 కి తన కమ్యూనిటీలో జిమ్ చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చెయ్యడం జరిగింది. @BRSparty pic.twitter.com/bFtbUFGYt0— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) January 6, 2025ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఫార్ములా ఈ-కారు రేసు(Formula E-car Race) కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్(BRS Party) ఎమ్మెల్యే కేటీఆర్ ఈకేసులో నేడు సీబీఐ ఎదుట విచారణకు హాజరుకున్నారు. దీంతో, కేటీఆర్ విచారణకు వెళ్తారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కేటీఆర్ విచారణకు వెళ్తున్న సందర్భంగా బీఆర్ఎస్ నేతలు పోలీసులను అడ్డుకునే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఇందులో భాగంగా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. -
నాపై కేసును కొట్టేయండి..
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి మాసబ్ టాంక్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2024, డిసెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేస్తోందని ఫిర్యాదు చేసేందుకు కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషకు వెళ్లారు. ఆ సమయంలో బంజారాహిల్స్ సీఐ బయటకు వెళ్తుండగా కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సీఐని అడ్డగించి తమ ఫిర్యాదులో తీసుకోవాలని బలవంతం చేశారు.ఈ ఘటనపై బంజారాహిల్స్ సీఐ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్‌పై కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అతడికి బెయిల్ ఇచ్చింది. అయితే కౌశిక్ రెడ్డి బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఈ కేసు దర్యాప్తు చేస్తోన్న మాసబ్ ట్యాంక్ పోలీసులు బుధవారం (డిసెంబర్ 25) కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 27వ తేదీ విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. -
అల్లు అర్జున్ రిలీజ్ ఆలస్యమెందుకు?.. అదే జరిగితే స్టేట్ అగ్నిగుండమే: కౌశిక్ రెడ్డి
సాక్షి, కరీంనగర్: అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎవరినైనా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇదే సమయంలో జైలు సూపరింటెండెంట్‌కు బెయిల్ పేపర్స్ అందిన తర్వాత కూడా ఎందుకు రిలీజ్ చేయలేదని ప్రశ్నించారు.అల్లు అర్జున్ అరెస్ట్‌పై తాజాగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..‘అల్లు అర్జున్ అరెస్ట్‌ను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్. అల్లు అర్జున్ అయినా, నేనైనా, ఎవరైనా సరే.. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం సరికాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్రమ అరెస్ట్‌లు చేయిస్తున్నాడు. బెయిల్ పేపర్స్ నిన్ననే జైలు సూపరింటెండెంట్‌కు అందిన తర్వాత రిలీజ్ ఎందుకు చేయలేదో చెప్పాలి.సోషల్ మీడియాలో కేటీఆర్ అరెస్ట్ అంటూ వస్తున్న వార్తలు వింటున్నా. అదే జరిగితే తెలంగాణా అగ్నిగుండం అవుతుంది. ఫార్ములా ఈ-రేసు కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి. ఓ విజన్ లేక, ఏం చేయాలో తెలియక, దాన్ని తీసుకొచ్చిన కేటీఆర్ ఏదో తప్పు చేసినట్టు చిత్రీకరిస్తున్నారు. ఫార్మూలా ఈ-రేసు తీసుకొచ్చి దాని ద్వారా హైదరాబాద్‌కు టెస్లా తీసుకొద్దామన్న ఆలోచన కేటీఆర్‌కు ఉండేది. ఈ విషయం వీళ్లకు తెలుసా అని ప్రశ్నించారు. -
పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
-
బంజారాహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
కౌశిక్ రెడ్డిపై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌తో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై మంత్రి కొండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌పై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారు. పిచ్చోడిలా ప్రవర్తిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా ఆయన గొడవ పడే విధంగా వ్యవహారించాడు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేకపోయే సరికి కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు. ఇన్ని రోజులు పట్టించుకోని వారిని కూడా ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారు.కేసీఆర్‌ను కేటీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితం చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి. కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిజంగా రాజీనామా చేశారు. మంత్రి వెంకట్‌రెడ్డి గురించి గంధపు చెక్కల వ్యాపారి ఒకరు అగౌరవంగా మాట్లాడారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడుతుంది. ఇష్టం వచ్చినట్టు ఎవరినా మాట్లాడినా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఎవరైనా సరే.. చూస్తూ ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ అధికారాన్ని ఉపయోగించుకోలేదు.. మేము ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టే ఉత్సవాలు చేసుకుంటున్నాం.ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలకు చెబుతున్నా.. సలహాలు, సూచనలు చేయండి అంతే కానీ అర్ధం పర్థం లేని విమర్శలు ఎందుకు. మా నాయకుల మీద చిలువలు పలువలుగా మాట్లాడితే ఊరుకోము. మీ లాగా మేము అక్రమ అరెస్ట్ చేయదలుచుకుంటే ఒక్కరూ కూడా మిగలరు. ఫోన్ ట్యాపింగ్‌లో మీ హస్తం లేకపోతే అధికారులను దేశాలు ఎందుకు దాటిస్తున్నారు. మీరు చేసేది మంచి అయితే విదేశాల నుండి యూ ట్యూబ్‌లు ఎందుకు నడిపిస్తున్నారు.గతంలో ఉన్నట్లు ఇప్పుడు రాజకీయ సంస్కృతి లేదు. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే తప్పని చెప్పండి అంతే కానీ లేని పోనీ విమర్శలు చేయకండి. ప్రతిపక్షాలు అంటే జనాలు ఆహ్వానించాలి కానీ జనాలు కేటీఆర్‌ను దగ్గరికి రానివ్వడం లేదు. మేము మళ్ళీ అధికారం లోకి వస్తాము. సంవత్సర కాలం ఓర్చుకున్నాము ఇక ఓర్చుకోము. ఏది పడితే అది మాట్లాడితే క్షమించము. మా పాలన చూసి వాళ్ళు ఓర్చుకోలేక పోతున్నారు. అధికారులు అధికార పార్టీకి తగ్గట్టుగా పని చేస్తారు. ఇప్పటి వరకు యూ ట్యూబ్‌ల విషయంలో చేసిన తప్పులు ఇక చేయము. గతంలో తెలంగాణ తల్లి బొమ్మని దొరసాని లాగా సృష్టించారు. గతంలో కవిత ఫేస్ లాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. మేము మన తెలంగాణ ప్రజల ఆత్మని ఆవిష్కరిస్తున్నాము’ అని కామెంట్స్ చేశారు. -
మాజీ మంత్రి హరీష్‌రావు, కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్ రావు, జగదీష్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని క్రైం నెంబర్ 1127/ 2024 కింద కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ క్రమంలో బుధవారం కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లారు. దీంతో, హరీష్, జగదీష్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..‘తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘనే నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు నమోదు చేసేందుకు వెనుకడుతారు, మళ్ళీ ఉల్టా కేసు బనాయిస్తరు?. ఇదేం విడ్డూరం. ఇదెక్కడి న్యాయం? ఇదేం ప్రజాస్వామ్యం?. రేవంత్ మీ పాలన మార్పు మార్కు ఇదేనా?. రాజ్యాంగాన్ని కాపాడుదామని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతడు. నువ్వేమో తెలంగాణలో అడుగడుగునా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూనే ఉంటవు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెడతామంటే అదిరేది లేదు, బెదిరేది లేదు. ప్రజాక్షేత్రంలో నిన్ను నిలదీస్తూనే ఉంటాం. నీ వెంట పడుతూనే ఉంటాం’ అంటూ విమర్శలు చేశారు. ఇందిరమ్మ రాజ్యమా...? ఎమర్జెన్సీ పాలనా?ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై ఉల్టా కేసు బనాయించారు.ఉదయాన్నే పదుల సంఖ్యలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటి మీదకు వచ్చి అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.ఈ దుర్మార్గాన్ని… pic.twitter.com/aXvinFpkqY— Harish Rao Thanneeru (@BRSHarish) December 5, 2024 -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు 20 మంది అనుచరులపై కూడా కేసు నమోదైంది. విధులను అడ్డగించడంతో పాటు బెదిరింపులకు దిగారంటూ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఫిర్యాదు చేసేందుకు కౌశిక్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే.అయితే, తాను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోవడం పట్ల కౌశిక్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బంజారాహిల్స్ ఏసీపీ నన్ను మూడు గంటలకు ఫిర్యాదు తీసుకోవడానికి రమ్మన్నారు. నేను వెళ్లకముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ మా ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించారు’’ అంటూ మండిపడ్డారు.‘‘నా ఫోన్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారని ఫిర్యాదు ఇచ్చాను. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేస్తే హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న నేను ఫిర్యాదు చేస్తే రేవంత్ రెడ్డిపై వెంటనే కేసు పెట్టాలి. రేవంత్ రెడ్డి పాపాలకు భూకంపం వస్తుంది. బంజారాహిల్స్ ఏసీపీ, సీఐ ప్రవర్తన తీరు సరిగ్గా లేదు. పోలీసులు ఎందుకు అతి చేస్తున్నారు...పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని కాంగ్రెస్ మానకొండూరు ఎమ్మెల్యే చెప్పారు. ప్రభుత్వం అధికారుల ఫోన్లను ట్యాప్ చేస్తుంది. కరీంనగర్ సీపీ ఫోన్ ట్యాప్ చేశారు. బీఆర్ఎస్ నేతల అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కవిత, సంతోష్ రావు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని కౌశిక్‌రెడ్డి హెచ్చరించారు.