MLC Padi Kaushik Reddy Sensational Comments On Etela Rajender, Details Inside - Sakshi
Sakshi News home page

ఈటలపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published Wed, Jun 28 2023 4:33 PM | Last Updated on Wed, Jun 28 2023 5:23 PM

Mlc Padi Kaushik Reddy Sensational Comments On Etela Rajender - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‍ఓ‍టమి భయంతోనే ఈటల రాజేందర్‌ ఆరోపణలు చేస్తున్నారని,ఫ్రస్టేషన్‌లో ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి అన్నారు. బుధవారం సాక్షి మీడియాతో మాట్లాడుతూ, ఆయన్ను చంపాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.

ఈటల కోసం 20 కోట్లు కాదు కదా.. 20 రూపాయలు ఖర్చు వేస్ట్‌.. కావాలనే ఈటల రాజేందర్‌, జమున డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘2018లో తనను చంపించేందుకు ఈటలనే కుట్ర చేశారు. ఇటీవల నాపై రెక్కీ చేసినట్టుగా అనుమానం ఉంది. నాకు, నా కుటుంబానికి ఏం జరిగినా ఈటలదే బాధ్యత’’ అని కౌశిక్‌రెడ్డి అన్నారు.

కాగా,ఈటల రాజేందర్ సతీమణి జమున తన భర్తను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈటల హత్యకు రూ. 20 కోట్లు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తన అనుచరులతో అన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతోనే కౌశిక్ రెడ్డి చెలరేగిపోతున్నారంటూ జమున వ్యాఖ్యానించారు.
చదవండి: బక్రీద్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement