హైదరాబాద్‌పై కన్నేశారు.. జాగ్రత్త! | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌పై కన్నేశారు.. జాగ్రత్త!

Published Mon, Apr 29 2024 6:07 AM

KTR comments on Congress Party and BJP

కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ల కుట్ర: కేటీఆర్‌ 

దాన్ని అడ్డుకునే శక్తి బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉంది 

పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే వారి కుట్రలను ఛేదిస్తాం.. 

గాలి మాటల రేవంత్‌.. మాయ మాటల మోదీతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు 

బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లను ఎత్తివేస్తుందని ఆరోపణ 

కరీంనగర్, వేములవాడలలో పార్టీ శ్రేణులతో సమావేశాలు

కరీంనగర్‌/ వేములవాడ:  హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ తెరలేపాయని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నాయని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే వారి కుట్రలను ఛేదిస్తామని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తలు, బూత్‌ లెవల్‌ కమిటీలతో కేటీఆర్‌ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఒప్పందం జరిగింది. వచ్చే జూన్‌ 2తో ఆ గడువు ముగుస్తోంది. హైదరాబాద్‌పై కన్నేశారు.. తస్మాత్‌ జాగ్రత్త. కాంగ్రె స్, బీజేపీలు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటింపజేసేందుకు కుట్రలు మొ దలుపెడతాయి. అలా చేస్తే అడ్డుకునే శక్తి గులాబీ పార్టీకి మాత్రమే ఉంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను దెబ్బతీసేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కుమ్మక్కయ్యాయి. 

పరస్పరం సహకరించుకుంటూ.. బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణ ప్ర యోజనాలే లక్ష్యంగా ఆ రెండు పారీ్టల కుట్రలను ఛేదిస్తాం. దేశంలో 400 ఎంపీ సీట్లలో గెలిస్తే.. రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లను ఎత్తివేస్తా మని బీజేపీ నాయకులు ప్రగ ల్భాలు పలుకుతున్నారు. అలాంటి వాటిని కూ డా అడ్డుకునే శక్తి కూడా గులాబీ పారీ్టకే 
ఉంది.

వారితో ఒరిగేదేమీ లేదు..
2014 నుంచి కేంద్రంలో బడేభాయ్‌ మోదీ.. వంద రోజుల నుంచి రాష్ట్రంలో చోటే భాయ్‌ రేవంత్‌.. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారు. గాలి మాటల సీఎం రేవంత్‌రెడ్డి, మాయమాటల ప్రధాని మోదీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచి్చన హామీలను మోదీ సర్కార్‌ అమలు చేయలేదు. హైదరాబాద్‌కు ప్రకటించిన ఐటీఐఆర్‌ను కూడా ఎత్తివేసింది. మోదీ పదేళ్ల పాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రైతుల ఆదాయాన్ని డబుల్‌ చేస్తామని.. వారి కష్టాలను మాత్రం డబుల్‌ చేశారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్‌ ధరను ఇప్పుడు రూ.1,200కు పెంచారు.

సామాన్యులపై పెను భారం పడుతోంది. జాతీయ రహదారుల కోసం సెస్‌ పేరిట రూ.30లక్షల కోట్లు వసూలు చేసి.. ఇందులో సగం రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్‌ రుణ ఎగవేతదారులకు అందించారు. యువతలో మతవిద్వేషాలు నింపి తప్పుదోవ పట్టిస్తున్నారు..’’అని కేటీఆర్‌ మండిపడ్డారు. ప్రజలు, యువత మరోసారి బీజేపీ మాయలో పడొద్దన్నారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి బోయిన్‌పల్లి వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement