breaking news
BRS
-
ఏం చేద్దాం.. ఏం చెప్దాం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 9 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులు కూడా హాజరు కావడం విశేషం. వీరి అనర్హత విషయంలో సుప్రీంకోర్టు డెడ్‌లైన్ విధించడం, సుప్రీం ఆదేశాల మేరకు పార్టీ ఫిరాయింపుపై జవాబు చెప్పాలని అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన నోటీసుల గడువు ముగుస్తుండడం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఆ పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో సీఎంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశంలో తమ నియోజకవర్గాల అభివృద్ధి తమకు పాత కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యల పరిష్కారం పైనే చర్చించామని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ వర్గాలు బయటకు చెబుతున్నప్పటికీ.. రాజకీయ వర్గాల్లో మాత్రం మరో చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో కేసు, స్పీకర్ జారీ చేసిన నోటీసుల విషయంలో వ్యూహాన్ని ఖరారు చేసేందుకు, ఎలా ముందుకు వెళ్లాలి? ఏం చెప్పాలి అనేది నిర్ణయించేందుకే ఈ భేటీ జరిగిందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. సమావేశంలో ఏఏజీ..! ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌తో పాటు అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్‌రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. కాగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మహీపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికపూడి గాం«దీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, తెల్లం వెంకటరావు, కాలె యాదయ్యలు పాల్గొన్నారు. మరో ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరుకాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ భేటీలో ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసు, స్పీకర్ ఇచ్చిన నోటీసులపై చర్చ జరిగింది. దీంతో పాటు ఈ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు, స్థానిక కాంగ్రెస్ నేతలతో ఉన్న సమస్యలు తదితర అంశాలపై చర్చ జరిగింది. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలా సమాధానం ఇవ్వాలన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం.. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్ లోనే ఉన్నామని, నియోజకవర్గ అభివృద్ధి నిమిత్తమే ముఖ్యమంత్రిని కలిసామనే రీతిలో సమాధానమివ్వాలనే నిర్ణయానికి ఎమ్మెల్యేలు వచ్చినట్టు తెలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..అన్ని విషయాల్లో తాను అండగా ఉంటానని, పార్టీని, తనను నమ్మి వచ్చిన ఎమ్మెల్యేలను కాపాడుకునే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకాడబోమని భరోసా ఇచ్చినట్టు తెలిసింది. నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులకు వీలున్నంత మేర నిధులు మంజూరు చేస్తామని, నియోజకవర్గాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని సూచించినట్టు సమాచారం. స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు పాత కాంగ్రెస్ నాయకత్వంతో సమన్వయంతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా కోర్టు కేసుల విషయంలో కూడా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం. గతంలోనే కలవాలనుకున్నాం.. సమావేశం అనంతరం ఓ ఎమ్మెల్యే ’సాక్షి’తో మాట్లాడుతూ.. అందరం కలిసి సీఎంతో సమావేశం అవుదామని గతంలోనే నిర్ణయించుకున్నామని చెప్పారు. ఆ మేరకే ఆయన్ను కలిశామని, అనేక అంశాలపై చర్చించామని, సీఎం కూడా తమకు భరోసా ఇచ్చారని తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్దామని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. -
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ..సీఎం రేవంత్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ
సాక్షి,తెలంగాణ: సీఎం రేవంత్‌రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇప్పటికే నోటీసులు పంపించారు. తాజా సీఎం రేవంత్ ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీలో సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టారు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నందిగామ: ‘గత పాలకులకు పేదవాడి ఆ త్మగౌరవం పట్టలేదు. కమీషన్లు రావనే వారికి ఇళ్లు కట్టివ్వలేదు. అదే కమీషన్లు వస్తాయనే దురాశతో రూ.లక్షల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు.’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. శనివారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/నందిగామ: ‘గత పాలకులకు పేదవాడి ఆ త్మగౌరవం పట్టలేదు. కమీషన్లు రావనే వారికి ఇళ్లు కట్టివ్వలేదు. అదే కమీషన్లు వస్తాయనే దురాశతో రూ.లక్షల కోట్ల తో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ప్రజాధనాన్ని అడ్డంగా దోచుకున్నారు.’అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అ న్నారు. శనివారం ఆయన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉమ్మడి పాలమూరులోని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల కేంద్రంలో, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు.గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి పట్టాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయా సభల్లో పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ పేదోడి ప్రభుత్వమని.. వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి సోమవారం దశల వారీగా నిర్మించిన మేరకు ఇళ్లకు నిధులు విడుదల చేస్తామన్నారు.రాష్ట్రంలో ఫౌండేషన్ కట్టనివి కొన్ని ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో దశలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేరు చేర్చేలా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్ప డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెనే కొరి వి దెయ్యంఅని.. ఇంకా బీఆర్ఎస్లో చాలా దెయ్యా లు ఉన్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.గద్వాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి పట్టాలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఆయా సభల్లో పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా రూ.22,500 కోట్ల వ్యయంతో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. రేవంత్ సర్కార్ పేదోడి ప్రభుత్వమని.. వారి అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల రాష్ట్రాన్ని అప్పగించినా.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో ఏ ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని మంత్రి గుర్తు చేశారు. ప్రతి సోమవారం దశల వారీగా నిర్మించిన మేరకు ఇళ్లకు నిధులు విడుదల చేస్తామన్నారు.రాష్ట్రంలో ఫౌండేషన్ కట్టనివి కొన్ని ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వచ్చే ఏప్రిల్‌లో రెండో దశలో మంజూరు చేసే ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో వారి పేరు చేర్చేలా సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్ప డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆమెనే కొరి వి దెయ్యంఅని.. ఇంకా బీఆర్ఎస్లో చాలా దెయ్యా లు ఉన్నాయని విమర్శించారు. ఆయా కార్యక్రమా ల్లో ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, కలెక్టర్లు పాల్గొన్నారు. అప్పారెడ్డిగూడలో జరిగిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు బీఆర్ఎస్కు దోచిపెడతారు?
కొత్తపల్లి (కరీంనగర్): గ్రానైట్ వ్యాపారులు గత 20 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీకి దోచిపెడుతూనే ఉన్నారని, ఇలా ఇంకెన్నాళ్లు దోచిపెడతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఒక్కో గ్రానైట్ కటింగ్ మిషన్ ఇండస్ట్రీ నుంచి సభ్యత్వం పేరుతో గ్రానైట్ అసోసియేషన్ రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలదాకా.. దాదాపు 350 నుంచి 500 షాపుల వరకు డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం ఉందని, ఆ సొమ్మును ఏం చేశారో చెప్పాలని అన్నారు. గ్రానైట్ వ్యాపారుల నుంచి రూ.వెయ్యికోట్లు తీసుకున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేసినా ఎవరూ ఖండించలేదని వ్యాపారులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియెజకవర్గంలోని మానకొండూర్, చింతకుంటలో గురువారం గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన సంజయ్‌కు పలువురు గ్రానైట్ వ్యాపారులు ఎదురుపడ్డారు. ప్రధాని మోదీ చైనా పర్యటనకు వెళ్లొచ్చాక ఆ దేశంతో వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గ్రానైట్ వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందని అసోసియేషన్ నేతలు చెప్పగా.. సంజయ్ స్పందిస్తూ కనీసం ప్రెస్‌మీట్ పెట్టి మోదీకి థ్యాంక్స్ అయినా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? అంటూ నిలదీశారు. 20 ఏళ్లుగా బీఆర్ఎస్కు దోచిపెడుతూనే మీలో కొందరు వ్యాపారాల కోసం రాజకీయాలను వాడుకుంటుండగా.. మరికొందరు రాజకీయ నాయకులై వ్యాపారాలను పెంచుకుంటూ ఆ సొమ్ముతో రాజకీయాలు చేస్తూ.. మాలాంటోళ్లను ఓడగొట్టాలని చూస్తార ని చురకలంటించారు. గ్రానైట్ అసోసియేషన్ కేంద్రానికి చెల్లించింది రూ. 300 కోట్లకు మించి లేదని, కానీ రూ.వెయ్యి కోట్లు ఇచి్చనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహించారు. ఎవ్వరికీ పైసలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే పరిస్థితిని కల్పిస్తానని, సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలని సంజయ్ సూచించారు. -
‘నేను అందుకే బీఆర్ఎస్ నుంచి బయటకి వచ్చా’
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు బయటకి వచ్చింది కేసీఆర్, కేటీఆర్ వల్లేనని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి విమర్శించారు. కవిత చెప్పినట్లు హరీష్‌రావు వల్ల ఎవరూ పార్లీని వీడలేదని, కేవలం కేసీఆర్, కేటీఆర్‌ల వల్లే పార్టీనే వీడారన్నారు. ఈరోజు(గురువారం, సెప్టెంబర్ 4వ తేదీ) సాక్షి టీవీతో మాట్లాడిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. ‘కేసీఆర్, కేటీఆర్ అహంకారం, అవినీతి వల్లే నేను బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చాను. కంట్రోల్ మొత్తం కేసీఆర్, కేటీఆర్ చేతిలోనే ఉంది. కవిత ఏమైనా సుద్ధపుసనా.. ఆమె అవినీతి చేయలేదా?, కాళేశ్వరం అవినీతి మొత్తం కేసీఆర్‌దే. హరీష్ కూడా కేవలం సంతకాలు చేయడానికే పరిమితం. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ఒక్కటే సీబీఐకి ఇచ్చారు. కాళేశ్వరం మొత్తం సీబీఐకి ఇవ్వాలి . కవితను బీజేపీ వైపు కూడా చూడనివ్వం. తమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్ట్ కడతానని రేవంత్ రెడ్డి ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నా. ప్రాణహిత జలాలు చేవెళ్ల వరకు తేవడం తెలివి తక్కువతనమే. ఎకరాకు రెండు లక్షలకు పైగా ఖర్చు చేసి చేవెళ్ల కు నీళ్ళిచ్చే బదులు... చేవెళ్ల రైతులకు ఎకరాకు 20 వేల రూపాయల రైతుబంధు ఇవ్వాలి’ అని అన్నారు. -
ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఎర్రవల్లి నివాసంలో బుధవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ తరహా ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, దానిని పార్టీకి అనువుగా మలుచుకోవాల్సిన తీరు.. తదితరాలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు వచ్చిన మణుగూరు ప్రాంత నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌ను కలిశారు. కాగా కవిత రాజీనామా, ప్రెస్‌మీట్‌కు సంబంధించి అంశాలపై కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన చేయలేదని సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎల్.రమణ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు ముఠా జైసింహ, ఆజం ఆలీలు ఈ భేటీలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలోని ఓటరు జాబితాను డివిజన్లు, బూత్‌ల వారీగా లోతుగా పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, డివిజన్లు, బూత్‌ల వారీగా మైనారిటీ విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు కోరారు. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మరోమారు సమావేశం జరుగుతుందని ముఖ్యనేతలు వెల్లడించారు. -
బీఆర్ఎస్ హస్తగతానికి కుట్ర: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు హరీశ్‌రావు, సంతోష్‌రావు కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు..’ అని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ‘నాన్నా.. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతోందో చూసుకోండి. నేను కూడా మీలా ముక్కుసూటి మనిషిని కాబట్టి నన్ను పార్టీ నుంచి బయటకు పంపి బలి చేశారు. రేపు మీకూ, రామన్నకు కూడా ఇలాంటి ప్రమాదమే పొంచి ఉంది..’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను సస్పెండ్ చేసిన నేపథ్యంలో బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. పార్టీ ద్వారా తనకు లభించిన ఎమ్మెల్సీ పదవితో పాటు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై సంచలనాత్మక ఆరోపణలు చేశారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. మా కుటుంబం బాగుండటం వారికిష్టం లేదు.. కేసీఆర్, కేటీఆర్‌తో నాది కుటుంబ, రక్త సంబంధం. పదవులు, పార్టీతో ముడిపడిన బంధం కాదు. కానీ పార్టీలో ఉంటూ డబ్బులు సంపాదించుకుని వ్యక్తిగత లబ్ధి పొందాలని భావించే వ్యక్తులకు మేము బాగుండటం ఇష్టం లేదు. మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వారికి అధికారం వస్తుంది కాబట్టి నన్ను బయటకు నెట్టారు. ఇది ఇంతటితో ఆగదు అని దైవ సమానులు కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నా. వారిళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? నాకు జన్మనిచ్చి, ప్రాణభిక్ష పెట్టిన నా తండ్రి చిటికెన వేలు పట్టుకుని తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన నేను సామాజిక తెలంగాణ కోరుకోవడం కొందరికి నచ్చలేదు. హరీశ్‌రావు, సంతోష్ నాపై పనికట్టుకుని సామాజిక తెలంగాణ పేరిట పార్టీ పెడుతున్నట్లు ప్రచారం చేశారు. హరీశ్, సంతోష్ ఇళ్లల్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా? నేను అక్రమ కేసుల్లో తీహార్ జైలులో ఐదు నెలల పాటు గడిపి బయటకు వచ్చిన తర్వాత 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ అనుమతితో గులాబీ కండువా కప్పుకుని అనేక ప్రజా సమస్యలు, అంశాలపై పోరాటం చేశా. వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన నా మీద జరుగుతున్న కుట్రల విషయంలో తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి చెప్పినా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించలేదు. మీ చెల్లి, మహిళా ఎమ్మెల్సీని అయిన నాపై కుట్రలు జరుగుతున్నాయంటే ‘బేటా ఏమైంది?’ అని నాకు ఫోన్ చేయరా? కేసీఆర్ నుంచి నేను స్పందన కోరుకోలేదు, కానీ మీరు స్పందించాలి కదా. రామన్నా.. నా మీద ఎవరేం చెప్పారో తెలియదు. నా ప్రాణం పోయినా కేసీఆర్, కేటీఆర్‌కు హాని జరగాలని కోరుకునే ఆడపిల్లను కాదు. ఎన్ని జన్మల పుణ్యముంటే కేసీఆర్ లాంటి తండ్రి నాకు దొరికాడు. కానీ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిని ఎందుకు క్షమిస్తున్నారన్నదే నా ఆవేదన. రేవంత్‌తో అవగాహన వల్లే వారిపై కేసులు మాఫీ హరీశ్‌రావు, సంతోష్‌ల అవినీతి వల్లే మా నాన్న కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చింది. హైదరాబాద్– ఢిల్లీ విమాన ప్రయాణంలో సీఎం రేవంత్‌ను హరీశ్ కలిసి కాళ్లు పట్టుకున్న నాటి నుంచి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు మొదలయ్యాయి. హరీశ్‌రావుకు సంబంధించిన పాల వ్యాపారం, రంగనాయక సాగర్ వద్ద భూ ఆక్రమణలు, మాజీ ఎంపీ సంతోష్‌పై మద్యం షాపుల కేసు తదితరాలన్నీ రేవంత్‌తో ఉన్న అవగాహన వల్లే తెరమరుగయ్యాయి. హరిత హారానికి నకిలీ కార్యక్రమం గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరిట సినీ నటులను మోసపూరితంగా రప్పించి అటవీ భూములను కొల్లగొట్టేందుకు సంతోష్ ప్రయత్నించాడు. శ్రవణ్‌రావుతో కలిసి మా ఫోన్లు ట్యాప్ చేయించారు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సంతోష్ అనుచరుడు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మోకిలలో రూ.750 కోట్ల బ్లూఫిన్ విల్లా ప్రాజెక్టు చేస్తున్నారు. సంతోష్‌ను మరో ఎమ్మెల్సీ నవీన్‌రావు తన గురువుగా చెప్పుకుంటున్నాడు. ఏసీబీకి వీరి అడ్రస్‌లు దొరకడం లేదా? రేవంత్ ప్రభుత్వంపై బరిగీసి కొట్లాడుతున్నందుకే మా కుటుంబంపై కుట్రలు జరుగుతున్నాయి. శ్రవణ్‌రావుతో కలిసి హరీశ్‌రావు, సంతోష్.. నా సిబ్బందితో పాటు కేటీఆర్, కేసీఆర్ ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. హరీశ్, సంతోష్ మీతో బాగున్నట్లు నటించవచ్చు. కానీ వాళ్లు మన కుటుంబం, తెలంగాణ మంచి కోరుకునే వారు కాదు. వాళ్లను పక్కన పెట్టి కార్యకర్తలను అక్కున చేర్చుకుని ప్రజల్లోకి వెళ్తేనే పార్టీ బతికి బట్ట కడుతుంది. ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్ హరీశ్ టీఆర్ఎస్ ఆరంభం నుంచి లేరు. టీడీపీ నుంచి కేసీఆర్ రాజీనామా చేసి బయటకు వస్తున్న సమయంలో రూ.కోటిన్నరతో వ్యాపారం చేసుకునేందుకు వెళ్లారు. 10 నెలల తర్వాత తిరిగి వచ్చిన హరీశ్‌ను క్షమించిన కేసీఆర్.. ఆయన ఎమ్మెల్యే కాకమునుపే మంత్రి పదవి ఇచ్చారు. హరీశ్‌రావు ట్రబుల్ షూటర్ కాదు.. బబుల్ షూటర్. ఆయనే ట్రబుల్స్ సృష్టించి వాటిని పరిష్కరించినట్లు చెప్పుకుంటారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఓడించాలని హరీశ్ చూశారు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావు 25 మంది ఎమ్మెల్యేలకు పార్టీ నిధితో పాటు అదనపు నిధులు కూడా ఇచ్చారు. కాళేశ్వరం అవినీతిలో సంపాదించిన సొమ్ముతో తన మనుషులు కొందరు ఎమ్మెల్యేలుగా ఉండాలనుకున్నారు. 2009లో కేటీఆర్‌ను ఓడించేందుకు హరీశ్ రూ.60 లక్షలు పంపారు. కేసీఆర్‌ను కూడా గజ్వేల్‌లో ఓడించాలని చూశారు. నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో ఎమ్మెల్యేలను ప్రభావితం చేసి నన్ను ఓడించారు. ఇలాంటి వారిని పక్కన పెట్టుకుని నన్ను బయటకు పంపితే పార్టీ బాగు పడుతుందా? రామన్నా ఆరడుగుల బుల్లెట్‌తో జాగ్రత్తగా ఉండండి.. ఈ రోజు నన్ను గాయపరిచిన ఆరడుగుల బుల్లెట్..రేపు కేసీఆర్, కేటీఆర్‌లో ఎవరిని గాయపరుస్తుందో? రామన్నా జాగ్రత్తగా ఉండండి. హంపిలో భేటీ అయిన కొందరు నేతలు అవమానకరంగా మాట్లాడి కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధమైన సందర్భంలో కేటీఆర్ చేతులు పట్టుకుని హరీశ్ బ్రతిమిలాడారు. అక్కడ మాట్లాడిన వారిని పార్టీ నుంచి బయటకు పంపారు. అందులో భాగంగానే ఈటల రాజేందర్ బయటకు వెళ్లారు. హరీశ్ వల్లే జగ్గారెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, రఘునందన్‌రావు, విజయశాంతి, విజయ రామారావు తదితరులు పార్టీ నుంచి బయటకు వెళ్లారు. దుబ్బాక, హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో హరీశ్ వల్లే బీఆర్ఎస్ ఓటమి పాలైంది. కొందరి ఒత్తిడి వల్లే సస్పెన్షన్ పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత? అని చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. కంప్యూటర్లో బీఆర్ఎస్ హార్డ్‌వేర్ అయితే తెలంగాణ జాగృతి సాఫ్ట్వేర్. తెలంగాణ జాగృతి ద్వారా పార్టీ అభివృద్ధిలో నా కంట్రిబ్యూషన్ ఉంది. కేసీఆర్‌పై కొందరు ఒత్తిడి తెచ్చి నన్ను సస్పెండ్ చేయించారని నమ్ముతున్నా. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తా. అయితే నా లేఖను లీక్‌ను లీక్ చేసిన వారిపై వంద రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు లేవు. కేసీఆర్ సగం ఇడ్లీ తిన్నారనే సమాచారాన్ని కూడా లీక్ చేసే వ్యవస్థ అక్కడ ఉంది. నా కుటుంబంలో జరిగిన అనేక అంశాలు బయటకు చెప్పలేను. రాజకీయ అంశాలు మాత్రమే మాట్లాడుతున్నా. నిజానికి నా లేఖ లీక్ కానంత వరకు నేను మాట్లాడలేదు. భవిష్యత్తులో అవసరమైన మరిన్ని విషయాలు బయట పెడతా. హరీశ్‌రావు, సంతోష్ మేక వన్నె పులులు. వాళ్లను పార్టీలో కొనసాగిస్తే నష్టం జరుగుతుంది. ఏ పార్టీలోనూ చేరడం లేదు.. నేను ఏ పార్టీలోనూ చేరడం లేదు. తెలంగాణ జాగృతి కార్యకర్తలు, మేధావులు, బీసీలు, సామాజిక తెలంగాణ కోసం పనిచేసే వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా. మా తల్లికి దూరంగా ఉండాల్సి రావడమే బాధాకరం. రాఖీ పండుగ ముందు మెసేజ్ పెట్టినా రామన్న బిజీగా ఉండటంతో కుదరలేదు. కేసీఆర్ ఆరోగ్యాన్ని, పార్టీని కాపాడుకుంటూ ప్రజా సమస్యలపై ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కోరుకుంటున్నా. -
కలిసికట్టుగా సాగుదాం
సాక్షి, హైదరాబాద్: పార్టీ నాయకులు, కార్యకర్తలు చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టి కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటేందుకు కృషి చేయాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారానే రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడం సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ చేస్తున్న మోసాలు, బీజేపీతో రాష్ట్రానికి పొంచి ఉన్న ముప్పును ప్రజలకు వివరించాలని సూచించారు. ఎర్రవల్లి నివాసంలో బుధవారం పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు ఊకంటి ప్రభాకర్ రావు తన అనుచరులతో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే రేగ కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసినా సింగరేణి ప్రాంతంలోని 13 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓటమి చెందడంపై లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాచలం, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ సిగ్గుచేటు తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు తీర్చిన దార్శనికుడు కేసీఆర్‌పై సీబీఐ విచారణ సిగ్గుచేటు అని కేటీఆర్ విమర్శించారు. ‘సీబీఐని మోదీ జేబు సంస్థ అని రాహుల్ విమర్శిస్తే, రేవంత్ ఈ సంస్థను ప్రశంసించడం కాంగ్రెస్ దౌర్భాగ్య స్థితికి నిదర్శనం. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కళ్లు ఎర్రబడుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కేసీఆర్‌ను బద్నాం చేస్తున్నాయి. వ్యవసాయ సొసైటీల ముందు రైతులు చెప్పుల వరుసలు పెట్టి పడిగాపులు కాయాల్సిన దుస్థితిని కాంగ్రెస్ కల్పించింది. ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర అన్నట్లుగా కాంగ్రెస్ పాలన ఉంది. సీఎం రేవంత్ తన మాటలు, చేతలతో ముఖ్యమంత్రి పీఠానికి ఉన్న గౌరవాన్ని మంటగలుపుతున్నారు. హామీల అమలునుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రోజూ కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ అంటూ సొల్లు పురాణం చెబుతున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. -
కల్వకుంట్ల కవిత మరో సంచలన ట్వీట్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్, ఆపై పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా, భవిష్యత్ కార్యచరణపై పరోక్షంగా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అందులో .. ‘నిజం మాట్లాడటానికి చెల్లించాల్సిన మూల్యం ఇది అయితే.. తెలంగాణ ప్రజలకోసం వందరెట్లు మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధం’ అని పేర్కొన్నారు. అయితే ఈ హరీష్ రావు, సంతోష్‌రావు గురించి సంచలన ఆరోపణలు చేసిన తర్వాత పార్టీలోని పరిణామాల్ని ప్రస్తావిస్తూ ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు, సంతోష్ రావులపై ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై బీఆర్ఎస్ హరీష్ రావుకు మద్దతుగా నిలిచింది. హరీష్ రావు ఆరడగుల బుల్లెట్టు అంటూ వెనకేసుకొచ్చింది.అదే సమయంలో కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో పార్టీ ఎమ్మెల్సీ కే.కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు,కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్కు నష్టం కలిగించే రీతిలో ఉన్నందున అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్న అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారంటూ’బీఆర్ఎస్ అధికారిక ప్రకటన చేసింది.ఈ క్రమంలో పార్టీ నుంచి సస్పెండ్ తర్వాత కవిత మొదటి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ తనని సస్పెండ్ చేయడంతో..కవిత కొత్త పార్టీని పెట్టనున్నారని,బీఆర్ఎస్యేతర పార్టీలో చేరబోతున్నారనే ప్రచారానికి పులిస్టాప్ పెట్టారు. తాను ఏ పార్టీలో చేరడం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయోద్దని సూచించారు. ఇలా వరుస పరిణాలతో కవిత బుధవారం ఎక్స్‌లో తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. If this is the cost of speaking up the truth then I am ready to pay the cost hundred times again for the people of Telangana. Satyameva Jayathe Jai Telangana✊— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 3, 2025 -
కవిత కామెంట్స్‌పై సీఎం రేవంత్ రియాక్షన్
సాక్షి,మహబూబ్‌నగర్: మాజీ మంత్రి హరీష్‌రావు,సంతోష్‌రావు వెనక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారంటూ మాజీ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందించారు.మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలు,బీఆర్ఎస్ గురించి మాట్లాడారు.కాలగర్భంలో బీఆర్ఎస్ కలిసిపోతుంది. జనతా పార్టీకి పట్టిన గతే బీఆర్ఎస్కు పడుతుంది. అవినీతి సొమ్ము పంపకంలో తేడాతోనే కొట్టుకుంటున్నారు. మీ పంచాయితీలోకి నన్నెందుకు లాగుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. -
కవిత సస్పెన్షన్.. కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు.. బీఆర్ఎస్ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, తక్కెళ్లపల్లి రవీందర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు నష్టం కలిగించే రీతిలో ఉన్నాయని బీఆర్ఎస్ అధిష్టానం భావించింది. కవిత వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేసీఆర్..ఆమెను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కవిత వ్యాఖ్యలపై కేసీఆర్ సీరియస్! మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ లక్ష్యంగా కవిత చేసిన వ్యాఖ్యలను పార్టీ అధినేత కేసీఆర్ తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చ, సీబీఐకి అప్పగించాలనే నిర్ణయం నేపథ్యంలో కవిత చేసిన ఆరోపణలు పార్టీకి తీవ్ర నష్టం కలిగించాయనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేసినట్లు తెలిసింది. సోమవారం అర్ధరాత్రి వరకు ఎర్రవల్లి నివాసంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరికొందరు సీనియర్ నేతలతో సుదీర్ఘంగా చర్చించిన కేసీఆర్.. పార్టీ ప్రయోజనాలు, కేడర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కవితపై సస్పెన్షన్ వేటుకు ఆదేశించినట్లు సమాచారం. ఇకపై కవిత చేసే ఆరోపణలు, విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదనే అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేసినట్లు తెలిసింది. పార్టీని ఏకతాటిపై నడిపించడంపై దృష్టి కేంద్రీకరించాలని కేటీఆర్‌ను ఆదేశించినట్లు సమాచారం. కేసీఆర్ ప్రజల సొత్తు అంటున్న నేతలు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీకి చెందిన అన్ని స్థాయిల నేతలు స్వాగతించారు. కేసీఆర్ ఎవరి సొత్తూ కాదని, కవితతో పాటు పార్టీ కేడర్‌కు ఆయన తండ్రి లాంటి వాడని పార్టీ వర్గాలు వ్యాఖ్యానించాయి. పార్టీ కోసం కన్నబిడ్డను కూడా వదులుకున్న నేత కేసీఆర్ అంటూ పలువురు నాయకులు కొనియాడారు. కేసీఆర్ ప్రతిష్టపైనే బీఆర్ఎస్ మనుగడ, 60 లక్షల మంది కేడర్ భవిష్యత్తు ఆధారపడి ఉందనే విషయాన్ని కవిత మరిచిపోయి విమర్శలు చేశారంటూ పలువురు నేతలు ప్రకటనలు విడుదల చేశారు. కేసీఆర్ ప్రతిష్టను మసకబార్చేలా ఆమెను ఎవరో మానసిక ఒత్తిడికి గురి చేసి ఉంటారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఒకరు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంలో కవిత చేసిన ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు ఊతమిచ్చేలా ఉన్నాయనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. కేసీఆర్‌కు, పార్టీకి బాధ కలిగించే అంశమైనప్పటికీ సస్పెన్షన్ తప్పనిసరి అని పార్టీ అధినేత భావించారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్లు ఎంతమంది ఉన్నారంటే?
సాక్షి,హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ కోసం ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ సమ్మరీని విడుదల చేసింది. నియోజకవర్గంలో మూడు లక్షల 92,669 ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. వీరిలో పురుషలు ఓటర్లు రెండు లక్షలు, మహిళ ఓటర్లు లక్షా 88 వేలకు పైచిలుకు ఉన్నారు. నియోజకవర్గంలో 47 పోలింగ్ స్టేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఈనెల 17వ తేదీ వరకు ఫిర్యాదులు అభ్యంతరాలను తెలియజేయాలని ఎలక్షన్ కమిషన్ నోట్ విడుదల చేసింది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. అభ్యర్థి ఎంపికపై దృష్టిసారిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న అవరోధాలను అధిగమించేందుకు సమాలోచనలు చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ అంటే రిచ్ ఏరియా అని గుర్తింపు.. అక్కడ పాగా వేయాలని అధికార కాంగ్రెస్‌తో పాటు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్, గ్రేటర్లో తమ బలం నిరూపించుకోవాలని బీజేపీలు ఉప ఎన్నికకు సై అంటున్నాయి. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ నుంచి ఎవరు సీటు దక్కించుకుంటారా అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇక బై ఎన్నికల కోసం కసరత్తు చేస్తున్న ఎన్నికల సంఘం నియోజకవర్గంలో ఓటర్లపై స్పష్టత ఇచ్చింది. ఈమేరకు సమ్మరీని విడుదల చేసింది. -
కవిత తల్లితో KCR చెప్పించిన మాట.. సస్పెండ్‌పై షాకింగ్ నిజాలు
-
BRS Party Office: కల్వకుంట్ల కవిత ఫ్లెక్సీలు దహనం
-
కవితను సస్పెండ్ చేయడానికి కారణాలు ఇవే..
-
కవిత సస్పెన్షన్‌పై టీపీసీసీ చీఫ్ రియాక్షన్
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్సీ కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.ఈ క్రమంలో కవిత సస్పెన్షన్‌పై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యవహారం.అందులో మేం తలదూర్చం.ఇది అంతా ఆస్తి పంపకాల్లో గొడవలా కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు కవిత అవసరం లేదు. ఎవరినీ మాపార్టీలో చేర్చుకోవాల్సి అవసరం లేదు’అని వ్యాఖ్యానించారు. -
వేటుపై కవిత రియాక్షన్.. సర్వత్రా ఉత్కంఠ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సస్పెన్షన్ విధించడంతో ఎమ్మెల్సీ కవితపై భవిష్యత్ కార్యచరణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ ఉత్కంఠకు తెరదించుతూ రేపు (బుధవారం) మధ్యాహ్నం 12గంటలకు కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో కవిత తన రాజకీయ భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నుంచి కవితను స్పస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత పార్టీకి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే అంశాన్ని హైలెట్ చేస్తూ బీఆర్ఎస్ నోట్‌ను విడుదల చేసింది. ఆ నోట్లో కవితపై వేటు గల కారణాల్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. తనని సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కవిత ఈ కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. ఇదే అంశంపై కవిత స్వయంగా మీడియా ఎదుట వెల్లడించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా అంశంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆ ఇద్దరి వల్లే కేసీఆర్‌కు మరక: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: పార్టీ అధినేత పక్కన ఉంటూ ఆయన పేరు చెప్పుకుని అనేక రకాలుగా లబ్ధి పొందిన వారు చేసిన చెత్త పనుల వల్లే కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాళేశ్వరం అంశంలో కేసీఆర్‌కు అవినీతి మరక అంటడంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావుతో పాటు కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డి పాత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో మేజర్ పాత్ర ఉన్నందునే ఐదేళ్ల పాటు నీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావును రెండోసారి ఏర్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ దూరంగా పెట్టారన్నారు. అమెరికా పర్యటన నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత.. సాయంత్రం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇలాగైతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? ‘కేసీఆర్‌కు అవినీతి మరక అంటడానికి, ఆయనపై ఆరోపణలు రావడానికి కారకులెవరో బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. కేసీఆర్ ప్రజల కోసం ఆలోచిస్తే.. వీళ్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై సొంత వనరులు, ఆస్తుల కోసం ఆలోచించారు. కేసీఆర్ కాలిగోటికి సరిపోని వ్యక్తి కేసీఆర్ వైపు వేలెత్తి చూపి సీబీఐ విచారణ జరుపుతా అనేందుకు కారకులు ఎవరు? హరీశ్‌రావు, సంతోష్‌రావు నా మీద వ్యక్తిగతంగా అనేక కుట్రలు చేసినా ఇన్నాళ్లూ పేరు పెట్టి విమర్శించలేదు. కానీ ఇలాంటి వారిని మోస్తూ పోతే పార్టీ ఎలా ముందుకు పోతుంది? బీఆర్ఎస్ నాయకులకు కోపం వచ్చినా చేదు నిజాన్ని జీర్ణించుకోక తప్పదు..’అని కవిత అన్నారు. నన్ను విమర్శిస్తే ఖబడ్దార్! ‘హరీశ్, సంతోష్ వెనుక సీఎం రేవంత్ ఉంటూ వాళ్లను అన్ని విషయాల్లో కాపాడుతూ కేసీఆర్‌ను బదనాం చేస్తున్నారు. బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్న అవినీతి అనకొండలను ఏమీ అనడం లేదు. అంతర్గతంగా వారి నడుమ ఉన్న అవగాహన బయటకు రావాలి. నన్ను.. బీజేపీ, కాంగ్రెస్, రేవంత్, బండి సంజయ్ నడిపిస్తున్నారని రేపటి నుంచి సోషల్ మీడియాలో విమర్శిస్తే ఖబడ్దార్. నేను ఎవరో చెప్తే ఆడే తోలు»ొమ్మను కాను. నాది కేసీఆర్ రక్తం. స్వతంత్రంగా నేను అనుకున్న విషయాలను చెప్తా. రాజకీయంగా నాకు జరిగే కష్టం, నష్టాన్ని భరించేందుకు సిద్ధం. మా నాన్నకు లేఖ రాసిన నాటి నుంచి నాకు నరకం చూపిస్తూ సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్లు రాయిస్తున్నారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ అంటే కడుపు రగులుతోంది. అభివృద్ధి విషయంలో కేసీఆర్ నిజాం బాటలోనే నడుస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్ల పాటు గుర్తు పెట్టుకుంటారు. అలాంటి ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్‌పై అభాండాలు వేస్తుంటే గుండె తరుక్కుపోతోంది. మా నాన్న పరువు పోతే నాకు బాధ. కానీ మీకు మాత్రం డబ్బులు కావాలి. ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలి. బీఆర్ఎస్ నాయకులు తిట్టుకున్నా, స్థానిక ఎన్నికల్లో నష్టం జరుగుతుందని అనుకున్నా సరే. మా నాన్న మీద సీబీఐ ఎంక్వైరీ పడిన తర్వాత పార్టీ ఉంటే ఎంత? పోతే ఎంత? ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం ఎన్నికల్లో ఒకసారి ఓడిపోతారు.. మరోసారి గెలుస్తారు. ఇలాంటి దుర్మార్గుల వల్లే ఓడిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బులు, టీవీలు, సోషల్ మీడియా ఉన్నాయని ఇష్టారీతిన మాట్లాడితే తోలు తీస్తాం. కేసీఆర్‌పై పీసీ ఘోష్ కమిషన్లు, సీబీఐ విచారణలు వేస్తే తెలంగాణ బంద్‌కు పార్టీ పిలుపునివ్వాలి కదా? కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే సీబీఐ విచారణకు ఆదేశించారు. నేను చెప్పిన పేర్లు ఉన్న వారితో రేవంత్‌కు అవగాహన లేకపోతే వారిపై విచారణ జరపాలి. కేసీఆర్ పేరు చెప్పుకోనిదే రేవంత్‌కు పూట గడవడం లేదు. వాస్తవానికి కేసీఆర్‌కు తెలంగాణ తప్ప.. తిండి, డబ్బు ధ్యాస ఉండదు. విచారణ నుంచి కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు.’అని కవిత పేర్కొన్నారు. -
హరీష్ రావుపై కేటీఆర్ పొగడ్తల వర్షం
సాక్షి,హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి హరీష్‌రావును కొనియాడుతూ ఆసక్తికర ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. డైనమిక్ లీడర్ హరీష్‌రావు ఇచ్చిన మాస్టర్ క్లాస్ అని ప్రశంసలు కురిపించారు. . నీటిపారుదల గురించి కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు.. కేసీఆర్ ప్రియశిష్యుడు హరీష్ ఇచ్చిన పాఠం ఇది అంటూ’ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. This indeed was a master class from our dynamic leader @BRSHarish Garu 👏I am sure the congress MLAs and Ministers grudgingly learned a lot about Irrigation from this able disciple of KCR Garu https://t.co/w5YGJCETtL— KTR (@KTRBRS) September 1, 2025 -
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ షాక్!
సాక్షి,హైదరాబాద్: ‘కాళేశ్వరం పాపం హరీష్‌రావు,సంతోష్‌రావుదేనంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలతో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ శ్రేణులు షాకిచ్చారు. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన అన్నీ సోషల్ మీడియా అకౌంట్లను అన్ ఫాల్ చేస్తున్నారు. బీఆర్ఎస్ సైతం హరీష్‌రావుకు మద్దతు పలుకుతూ ‘సింహం సింగిల్‌గానే’ వస్తుందని ట్వీట్ చేయడం చర్చాంశనీయంగా మారింది. హరీష్‌రావు,సంతోష్‌రావుపై కవిత ఘాటు కామెంట్లు చేశారు. ఆ కామెంట్ల తర్వాత కొద్ది సేపటికే హరీష్‌రావుపై బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. హరీష్‌రావు ఆరడుగుల బుల్లెట్టంటూ పోస్టు పెట్టింది. సింహం సింగిల్‌గానే వస్తుందంటూ ఓ వీడియోను షేర్ చేసింది. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా గ్రూప్ నుంచి ఎమ్మెల్సీ కవిత పీఆర్వో నవీన్‌ను తొలగించింది. ఇప్పటి వరకు కవితకు సంబంధించి రోజువారి పార్టీ కార్యచరణను పీఆర్వో నవీన్ బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. హరీష్‌రావుపై వ్యాఖ్యల తరువాత కవిత పీఆర్వో నవీర్‌ను గ్రూప్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తొలగించింది. బీఆర్ఎస్ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున కవిత సోషల్ మీడియా అకౌంట్లకు అన్‌ఫాలో చెబుతున్నారు. కవిత వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు పార్టీ ముఖ్య నేతలు జగదీశ్వర్‌రెడ్డి,పల్లా రాజేశ్వర్‌రెడ్డి,ప్రశాంత్‌రెడ్డి ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్నారు. వీరి భేటీలో కాళేశ్వరంపై సీబీఐ విచారణ,ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు వంటి అంశాలపై చర్చలు జరుపుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. LIVE: Addressing media https://t.co/C9qlcEwUnc— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 1, 2025 -
‘ఇది ఆరడుగుల బుల్లెట్టు’.. హరీష్‌రావుకు మద్దతుగా బీఆర్ఎస్
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మాజీ మంత్రి హరీష్‌రావు అవినీతికి పాల్పడ్డారంటూ ఆపార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో హరీష్ రావుకు బీఆర్ఎస్ మద్దతు పలికింది. హరీష్‌రావుకు అండగా నిలిచింది. సింహం సింగిల్‌గా వస్తుందంటూ తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చించిన హరీష్ రావు వీడియోను ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఇది ఆరడుగుల బుల్లెట్టు.. సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి హరీష్ రావు అని కామెంట్స్ పెట్టింది. ఇది ఆరడుగుల బుల్లెట్టు 🔥🔥సింహం సింగిల్ గానే వస్తుందన్నట్లు కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా తిప్పికొట్టిన మాజీ మంత్రి @BRSHarish pic.twitter.com/RT0NtpsgJe— BRS Party (@BRSparty) September 1, 2025 -
కేసీఆర్ ఫామ్ హౌస్ కు BRS నేతలు..
-
డిక్లరేషన్ కాదు.. డెడికేషన్ కావాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నిజంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనుకుంటే కావాల్సింది డిక్లరేషన్లు కాదని, డెడికేషన్ అని అన్నారు. శాసనసభలో ఆదివారం పంచాయతీరాజ్, పురపాలక చట్ట సవరణ బిల్లులపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీ, ప్రధానమంత్రి అరగంటపాటు మాట్లాడుకుంటే అనుకున్న తరహాలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు నిజంగా న్యాయం చేయొచ్చు. అసెంబ్లీలో ఎన్ని గంటలు చర్చించినా ఉపయోగం ఉండదు. నిజంగా బీసీలకు న్యాయం చేయాలంటే ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. ఈ విషయం ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలుసు. తెలిసి కూడా చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దీనిపై ఐదు నాలుకలు, ఐదు స్వరాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని ఒకసారి, ఆర్డినెన్స్ ద్వారా అని ఇంకోసారి, పార్టీ పరంగా అని మరోసారి, రాహుల్‌గాంధీ ప్రధాని అయిన తర్వాత అని ఓసారి, ఇప్పుడేమో బిల్లు తెచ్చి చేస్తామని అంటున్నారు. ఇదంతా బీసీలు గమనించటం లేదనుకుంటున్నారా?’అని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్ గత ప్రభుత్వంలో పెట్టారంటూ మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ చట్టాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ‘స్థానిక సంస్థల్లో బీసీలకు 37 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని బీఆర్ఎస్ ప్రభుత్వం పంపిన బిల్లే రాష్ట్రపతి వద్ద ఇంకా పెండింగులో ఉంది. దాన్ని వెనక్కి తెప్పించి ఇప్పుడు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులను పంపాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో పంపిన ఆర్డినెన్స్‌పైనే సంతకం చేయని గవర్నర్, ఇప్పుడు బిల్లుపై సంతకం చేస్తారని ఎలా భావిస్తున్నారు? జిత్నీ ఆబాదీ ఉత్నా హఖ్, జిత్నీ భాగేదారీ ఉత్నీ హిస్సేదారీ’అని చెప్పే రాహుల్‌గాంధీ బీసీల రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడటం లేదు’అని కేటీఆర్ నిలదీశారు. ఆర్థికంగా ఎదిగినప్పుడే న్యాయం.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలో బీసీల జనాభా 6 శాతం తగ్గిందని తేలినా దానిపై సమీక్షించలేదని కేటీఆర్ విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వడంతోనే సామాజిక న్యాయం జరగదు. ఆర్థికంగా కూడా ఎదగాల్సి ఉంటుంది. ఎలాంటి లొసుగులు లేకుండా చట్టాలను చేస్తే ఏ న్యాయ వ్యవస్థ కూడా అడ్డుపడదు. భావ సారూప్యత లేకపోయినా ధ్యేయ సారూప్యతతో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే విషయంలో మేము చిత్తశుద్ధి, నిజాయితీగా ప్రభుత్వాన్ని సమర్థిస్తున్నాం. మా ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచి్చన వెంటనే ప్రస్తుత ముఖ్యమంత్రి సన్నిహితుడైన గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్లి దాన్ని అడ్డుకున్నారు’అని కేటీఆర్ విమర్శించారు. న్యాయ సమీక్షకు నిలబడని జీఓలతో బీసీల జీవితాలు ఎలా మారుస్తారో ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి దగ్గరికి రాష్ట్రం నుంచి అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలని సూచించారు. రిజర్వేషన్ల సాధనకు సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని కోరారు. -
బీసీ రిజర్వేషన్లపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏఐసీసీ నేత రాహుల్ గాంధీలు డిసైడ్ చేస్తే బిల్లు పాస్ అవుతుందన్నారు. ఇక్కడ ఎంత మొత్తుకున్నా ఏం కాదని కేటీఆర్ పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం, ఆగస్టు 31వ తేదీ) జరిగిన అసెంబ్లీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. ‘ బీసీ రిజర్వేషన్లపై సీఎం నాలుగుసార్లు మాట మార్చారు. మార్చి నాటి బిల్లుకు, ఈ బిల్లుకు తేడా ఏంటో చెప్పాలి. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజన్లో ఉంది. 52సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ ఏం చేశారు. సీఎం రేవంత్ ఎందుకు ప్రధాని మోదీని కలవలేదు. ప్రధాని మోదీ వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. బీసీ రిజర్వేషన్ల కోసం ఆమరణ దీక్ష చేయాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్.. గన్‌పార్క్ వద్ద ఆందోళన
తెలంగాణలో కాళేశ్వరం కమిషన్‌పై రిపోర్టు నేపథ్యంలో సభలో వాడీవేడి చర్చ జరిగే..... -
గణపతి బప్పా మోరియా.. యూరియా కావాలయ్యా
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజున రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో నిరసన గళం వినిపించింది. శనివారం దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు సంతాపం తెలిపిన తర్వాత సభ వాయిదా పడింది. అనంతరం యూరియా కొరతపై అసెంబ్లీ బయట గులాబీ పార్టీ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఉదయం అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్కులోని తెలంగాణ అమర వీరుల స్తూపానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు. ఖాళీ యూరియా సంచులు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. ‘గణపతి బప్పా మోరియా.. కావాలయ్యా యూరియా’, ‘రేవంత్ ద్రోహం.. రైతన్నకు మోసం’ అంటూ నినాదాలు చేశారు. కమిషనర్ కార్యాలయంలో ధర్నాఅసెంబ్లీ వాయిదా అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నినాదాలు చేస్తూ కాలినడకన ఎల్బీ స్టేడియంకు ఎదురుగా ఉన్న వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. యూరియా, ఇతర ఎరువుల లభ్యతపై సమీక్ష జరిపి వెంటనే సరఫరా చేయాలని కోరుతూ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. సమస్యకు పరిష్కారం చూపేంత వరకు కదిలేది లేదని ధర్నాకు దిగారు. అయితే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు.సచివాలయంలోకి చొచ్చుకుపోయేందుకు యత్నంబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తెలంగాణ భవన్‌కు తరలించే క్రమంలో సచివాలయం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనం ఆగడంతో అందులో నుంచి దిగిన మాజీమంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌కుమార్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ తదితరులు ధర్నాకు దిగారు. బారికేడ్లు దూకి సచివాలయంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో పోలీసులు గేట్లు మూసివేశారు. అయితే పోలీసులు వారిని తిరిగి అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్‌రావు మాట్లాడారు.సభను అనుకూలంగా నడుపుకునే ప్రయత్నం: కేటీఆర్‘రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీని తమకు అనుకూలంగా నడుపుకునే ప్రయత్నం చేస్తూ రైతుల సమస్యలు, ఎరువుల కొరత తదితరాలపై మాట్లాడటం లేదు. ప్రభుత్వం కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెడితే వ్యవసాయ రంగం, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సహా అన్ని అంశాలపైనా చర్చించేందుకు సిద్ధం. కాళేశ్వరంపై కాంగ్రెస్ వేసిన ‘పీసీసీ ఘోష్ కమిషన్’ పైనా చర్చించేందుకు సిద్ధం. వ్యవసాయ రంగం కోసం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం రైతులు పండుగ రోజు, వర్షాల్లోనూ తమ చెప్పులు, ఆధార్ కార్డులను పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాల మూలంగా జరిగిన నష్టం, రైతుల ఆత్మహత్యలు, రైతాంగానికి కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలపై చర్చ జరగాలి. కానీ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉండే ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడే ప్రయత్నం చేస్తోంది..’ అని కేటీఆర్ విమర్శించారు. రైతుల చెంప చెళ్లుమనిపిస్తారా..? : హరీశ్‌రావు‘యూరియా అడిగినందుకు రైతుల చెంప చెళ్లుమనిపించడమేనా కాంగ్రెస్ సోకాల్డ్ పాలన. మూటలు మోయడం, మాటలు మార్చడమే ముఖ్యమంత్రి రేవంత్‌కు తెలిసిన విద్య. రాష్ట్రంలో యూరియా కొరత లేదంటూ ‘ఏఐ ఫోటోల’తో ప్రచారం చేశారు. లైన్లలో నిల్చున్నది రైతులే కాదని బీఆర్ఎస్ కార్యకర్తలని తొండి కూతలు కూశారు. చివరకు యూరియా కొరత నిజమేనని ఒప్పుకుని కేంద్ర ప్రభుత్వం కారణమన్నారు. కాంగ్రెస్ వల్లే యూరియా సంక్షోభం తలెత్తిందని రైతులకు అర్థమైంది. రేవంత్ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలి..’ అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
అసెంబ్లీ నేడు ఒక్కరోజే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండోరోజు ఆదివారంతోనే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పలు జిల్లాల్లో వర్ష బీభత్సం, గణేశ్ నిమజ్జనం తదితరాల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అవసరమైతే కొద్ది విరామం తర్వాత మళ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు శనివారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో ప్రభుత్వం ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్తో పాటు బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కోరినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనకు ప్రభుత్వం అంగీకరించక పోవడంతో భేటీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. కాళేశ్వరం నివేదిక సమర్పించనున్న సీఎం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ పూర్తి నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభకు సమర్పిస్తారు. దీనిపై చర్చ అనంతరం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులపై కూడా సభలో చర్చిస్తారు. స్థానిక సంస్థలతో పాటు మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేస్తూ సవరణలు ప్రతిపాదిస్తారు. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 (ఎ)కు సవరణల ద్వారా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పీపీటీకి బీఆర్ఎస్ పట్టు పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకు అవకాశం ఇవ్వాలని బీఏసీ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు కోరారు. ఈ విజ్ఞాపనను పరిశీలిస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇక కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో జరిగే చర్చలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశాలు కనిపించడం లేదు. అయితే సభలో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. యూరియా కొరత, వరద బీభత్సం, విష జ్వరాలు, గురుకులాల్లో విద్యార్థుల మరణాలు తదితర ప్రజా సమస్యలపై చర్చించాలని బీఏసీ సమావేశంలో బీఆర్ఎస్ ప్రతిపాదించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, హరీశ్‌రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్షం నాయకుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మండలి బీఏసీ సమావేశంలో భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబుతో పాటు డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్ గౌడ్, నెల్లికంటి సత్యం, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ నరసింహాచార్యులు పాల్గొన్నారు. -
Bandi Sanjay: మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్ ప్రజలను అవమానించారు
-
బై ఎలక్షన్లతో కాంగ్రెస్‌కు బైబై
మియాపూర్: రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవే బైబై ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మియాపూర్ నరేన్ గార్డెన్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపురం రాజు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్ల అప్పుచేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడవకముందే రూ.2.20 లక్షల కోట్ల అప్పుచేసి ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను మహా నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగించామని తెలిపారు. ఇప్పుడు 20 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుతో 42 ప్లైఓవర్లు, నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు, 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించిందని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క కొత్త వంతెన గానీ మోరీని గానీ నిర్మించిందా? అని ప్రశ్నించారు. హైడ్రా అరాచకంతో హైదరాబాద్ అతలాకుతలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రావల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా అరాచకాలతో నగరమంతా అతలాకుతలమైందని ఆరోపించారు. దుర్గంచెరువులో కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? అని సవాల్ చేశారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా.. పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. 20 నెలల్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోతున్నారని, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, సిం«ధూ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదు. బండిసంజయ్ బీసీ కాదు.. దేశ్‌ముఖ్. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు. -
మరోసారి BRSపై విమర్శలు గుప్పించిన కవిత
-
‘ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారు’
ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తమ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. తమకు ఇంకా కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమ ప్రాధాన్యమన్నారు. తెలంగాణ అధికారులపై కేంద్రానికి ఫిర్యాదుమరోవైపు సివిల్ సప్లై కమిషనర్ ఎస్ చౌహన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పై డిఓపిటి మంత్రి జితేందర సింగ్‌కు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ భక్తులుగా బానిసలుగా,కొందరు అధికారులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని మంత్రికి ఫిర్యాదు చేశాం. సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన పై డిఓపిటి మంత్రికి ఫిర్యాదు చేశాం. భారత రాజ్యాంగాన్ని కాపాడేది బ్యూరోక్రాట్సే. ఈ నెల 1 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది, ఆ కార్యక్రమంలో అధికారులు గత ప్రభుత్వ తీరును విమర్శించారు. సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ గత ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టే విధంగా వ్యవహరించారు. రేషన్ కార్డులు గతంలో ఇవ్వలేదు....ఇప్పుడు ఇస్తున్నారని అబద్ధాల ప్రచారం చేశారు. ఐఏఎస్, ఐపిఎస్, ప్రతిష్టల దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి తొత్తులుగా వ్యవహరించారు.. భారత రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని కేంద్ర డిఓపిటి మంత్రిని కోరాం. ఐఏఎస్ ఐపిఎస్, అధికారులు పార్టీ కండువాలు మార్చుకున్న విధంగా మాట్లాడుతున్నారు.కొందరు తెలంగాణ అధికారుల తీరు మార్చుకోవాలి’ అని సూచించారు శ్రవణ్. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి సి.పి.రాధాకృష్ణన్ ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి -
సిరిసిల్ల నుంచే పోటీ చేస్తా
సాక్షి, హైదరాబాద్/గంభీరావుపేట/సిరిసిల్ల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సిరిసిల్ల నుంచే పోటీ చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు తెలిపారు. తాను హైదరాబాద్ శివార్లలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్టు దుష్ప్రచారం జరుగుతోందని, దానిని ఎవరూ నమ్మవద్దని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కేటీఆర్ సమావేశమై మాట్లాడారు. ‘మీ ఆశీర్వాదంతోనే రాజకీయంగా ఎదిగాను. మీరు వద్దనుకునే వరకు ఇక్కడే పోటీ చేస్తాను. వచ్చే ఎన్నికల్లో నేను సిరిసిల్లలో పోటీ చేయనని, హైదరాబాద్ శివారుల్లో పోటీ చేస్తానని కొన్ని పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారాన్ని నమ్మవద్దు’అని కోరారు. మిమ్మల్ని దగ్గరుండి గెలిపించుకుంటా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను దగ్గరుండి గెలిపించుకుంటానని కేటీఆర్ తెలిపారు. ‘నా గెలుపు కోసం మీరంతా కష్టపడ్డారు. మీ గెలుపు కోసం మున్సిపల్ ఎన్నికల్లో నేను కష్టపడుతాను. ఇంటింటికీ వెళ్తాను. అభ్యర్థులకు బీఆర్ఎస్ టిక్కెట్ల నేనే ఇస్తాను. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాదే. సిరిసిల్ల వస్త్రవ్యాపారులు కొందరు రాజకీయాలు చేస్తున్నారు. వారు వ్యాపారం చేసుకోవాలే తప్ప, వాళ్లకు రాజకీయాలు ఎందుకు?’అని ప్రశ్నించారు. యూరియా కొరతతో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ‘సెస్’చైర్మన్ చిక్కాల రామారావు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్– ఎస్ఐఆర్)తో పాటు ఎన్నికల సంఘానికే సమగ్ర ప్రక్షాళన అవసరమని కేటీఆర్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంపై ఆయన ‘ఎక్స్’ లో స్పందించారు. ‘ఎన్నికల సంఘం నిర్వహించిన మీడియా సమావేశంలో సమాధానాల కన్నా ప్రశ్నలే ఎక్కువగా మిగిలాయి. దీనిపై ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇచ్చిన వివరణలో, సమస్యల పరిష్కారాల కన్నా సాకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడాల్సిన ఎన్నికల సంఘం, ఎన్డీయే ప్రభుత్వానికి అనుబంధ విభాగంలా పనిచేస్తోంది. ఓటర్ల జాబితాలో లోపాలను అంగీకరించినప్పుడు, తమ విధులను నిర్లక్ష్యం చేసినట్లు కూడా ఒప్పుకోవాల్సిన అవసరం లేదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదు సీఎం రేవంత్‌రెడ్డి పదేపదే ప్రచారం చేస్తున్న ఊహాజనిత ఫ్యూచర్ సిటీకి భవిష్యత్తు లేదని కేటీఆర్ అన్నారు. కేవలం తన కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలన్న సీఎం ఆకాంక్ష నెరవేరదని ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి విజన్ లేని నాయకుడు. ఆయన నిర్ణయాల వల్ల ప్రజాధనం వృధా అవుతోంది. ఫార్మా సిటీ కోసం భూములిచ్చిన రైతులు మోసపోయారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేసి, దాని స్థానంలో ఫ్యూచర్ సిటీ అనే అవాస్తవ, ఊహాజనిత ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. నిర్లక్ష్య నాయకుడు రాష్ట్రాన్ని పాలిస్తే ఏమవుతుందనే దానికి ఫ్యూచర్ సిటీ ప్రచారం ఒక ఉదాహరణ’అని మండిపడ్డారు. ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం వెంటనే ప్రజలకు, రైతులకు స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు.కుంటయ్య కూతురు పెళ్లి చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు కరికవేణి కుంటయ్య ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా.. ఆయన కూతురు లక్షిత (భార్గవి) పెళ్లి బాధ్యతలను కేటీఆర్ నిర్వహించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో పెళ్లి వేడుకలకు ఆదివారం హాజరయ్యారు. పెళ్లి ఖర్చులను పార్టీ పరంగా కేటీఆర్ భరించారు. కుంటయ్య చిన్న కూతురుకు కొంత డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్‌గా అందించారు.ఆ ఆహ్వానం నాకెంతో ప్రత్యేకం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నవిత వివాహానికి కూడా కేటీఆర్ ఆదివారం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ‘అన్నా.. నాకు నాన్న, అన్న లేరు. మీరు అన్నయ్యగా పెళ్లికి వచ్చి మా దంపతులను ఆశీర్వదించాలి’ నవిత వాట్సాప్‌లో పంపిన ఆహ్వానం తన మనస్సును కదిలించిందని కేటీఆర్ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘ఈ రోజు ఒక ప్రత్యేకమైన ఆహ్వానం అందింది. నాకు ఇదొక ప్రత్యేకమైన అనుభూతి. ప్రతి అమ్మాయి తన వివాహానికి నాన్న ఆశీర్వాదం, అన్నయ్య అండ కావాలని కోరుకుంటుంది. కానీ నా చెల్లి తన నాన్న, అన్నయ్యను కోల్పోయిన తర్వాత ఆ లోటును తీర్చాలని నన్ను పిలిచింది. ఆమె ఆహ్వానం నాకు కేవలం ఆహ్వానం కాదు.. అది నా మీద ఉంచిన నమ్మకం. ఒక అన్నయ్యపై ఉంచిన ఆశ. ఆ ఆడబిడ్డ ఆహ్వానం నా మనసును కదిలించింది. ఆమె కోరికను గౌరవించడం నా బాధ్యతగా, కర్తవ్యంగా భావించాను’అని పేర్కొన్నారు. -
పేకాట ఆడుతూ పట్టుబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి, ఓ కార్పొరేటర్
సాక్షి,హైదరాబాద్: కూకట్‌పల్లిలో కొనసాగుతున్న పేకాట శిబిరాలపై(Poker camps) టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు ఉన్నారు. ఆదివారం (ఆగస్ట్17) బాలానగర్ ఎస్ఓటి పోలీసులు కూకట్‌పల్లిలోని ఓ గెస్ట్ హౌస్‌లో పేకాట శిబిరంపై ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న కొండలరావుతో పాటు జీహెచ్ఎంసీ కార్పొరేటర్ సహా మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్ని కూకట్ పల్లి పోలీసులకు అప్పగించారు. వీరివద్ద నుంచి మూడు లక్షల నగదుతో పాటు, మొబైల్ ఫోన్లను పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
పోలవరం కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: సాక్షాత్తు ఎన్డీయే ప్రభుత్వం జాతీయ హోదా ఇచ్చి మరీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా ఎన్డీఎస్ఏకు కనిపించడం లేదా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ‘కూలేశ్వరం’అని కారుకూతలు కూసిన కాంగ్రెస్, బీజేపీ నేతలకు పోలవరంను.. ‘కూలవరం’అనే ధైర్యం ఉందా? అని శనివారం ఆయన ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ‘తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి, పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా? అసెంబ్లీ ఎన్నికల వేళ అత్యంత అనుమానాస్పదంగా కుంగిన మేడిగడ్డ పిల్లర్లపై కేవలం 24 గంటల్లోపే ఎన్డీఎస్ఏను దించి బీఆర్ఎస్పై బీజేపీ నేతలు బురదజల్లారు. కళ్లముందు రెండోసారి కొట్టుకుపోయినా పోలవరం కాఫర్ డ్యామ్‌పై బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారు?’అని నిలదీశారు. ‘ఏపీలో ఏకంగా పది అడుగుల వెడల్పు, ఎనిమిది అడుగుల లోతుకు కుంగిన పోలవరం కాఫర్ డ్యామ్‌కు గుట్టుచప్పుడు కాకుండా యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేస్తున్నారు. తెలంగాణలో మాత్రం 20 నెలలు కావస్తున్నా మేడిగడ్డ బరాజ్ వద్ద మరమ్మతులు లేకపోవడానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి మూర్ఖత్వమే. 2020లో పోలవరం డయాఫ్రం వాల్ రెండేండ్లకే కొట్టుకుపోయినా ఇప్పటికీ ఉలుకూ, పలుకూ లేదు. తెలంగాణలో ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది మరణించినా ఇప్పటికీ ఎన్డీఎస్ఏ అడ్రస్ లేదు. పంజాబ్‌నే తలదన్నే స్థాయిలో తెలంగాణలో వ్యవసాయ విప్లవాన్ని సృష్టించి, దేశానికే అన్నం పెట్టే స్థాయికి రాష్ట్ర రైతును తీర్చిదిద్దిన కేసీఆర్‌పై కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుమీద కాంగ్రెస్, బీజేపీలు సాగిస్తున్న మూకుమ్మడి కుట్రలను కాలరాస్తాం. తెలంగాణకు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును కంటికి రెప్పలా కాపాడుకుంటాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
చంద్రబాబు స్క్రిప్ట్‌నే రేవంత్ వినిపించారు
సూర్యాపేట టౌన్: సీఎం రేవంత్‌రెడ్డి తీరు చంద్రబాబు ప్రసంగానికి కొనసాగింపేనని, గోదావరిలో నీళ్లు లేవని చెప్పకుండా కాళేశ్వరం లేదని చెప్పడం అంటే బనకచర్లకు మద్దతు ప్రకటించడమేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం నుంచి 240 టీఎంసీలకు పైగా నీళ్లను వాడుతున్నామని చెప్పాల్సిందని, ఇది చెప్పలేదు అంటే బనకచర్లకు అనుమతిస్తున్నట్లే అని స్పష్టమవుతుందన్నారు. బనకచర్ల కట్టి తీరుతామన్న చంద్రబాబుకు అనుకూలంగానే.. కాళేశ్వరంలో మాకు నీళ్లు అవసరం లేదు అన్నట్లు ఉందని ఆరోపించారు.ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రజలను మోసం చేయడానికేనని అన్నారు. రేవంత్ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ని ఇక్కడ వినిపించారని విమర్శించారు. బనకచర్లకు అనుమతులు రావాలంటే కాళేశ్వరంను రికార్డ్‌లో నుంచి మాయం చేయాలనే కుట్ర జరుగుతుందన్నారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే ఇక్కడ రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై ఉన్న నందిమేడారం, కన్నేపల్లి గాయత్రి పంప్ హౌస్‌లను ప్రారంభించారంటే.. కాళేశ్వరం ప్రాజెక్టు అంతా బాగున్నట్లే కదా అని అన్నారు.కాళేశ్వరం ద్వారా గత ఎనిమిది పంటలకు నీళ్లు ఇచ్చినట్లుగానే ఈ ప్రభుత్వం ఆయకట్టు ప్రాంతాలకు నీటిని విడుదల చేయాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇక్కడి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దేవాదుల నుంచి నీళ్లు ఇస్తామంటూ కొత్త పాట అందుకున్నారని, దేవాదుల నీళ్లు ఇస్తామన్న ప్రాంతానికే ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చెప్పిందంతా అబద్ధం అని రుజువైందని చెప్పారు. -
ఎమ్మెల్సీ కవిత విదేశీ పర్యటనకు కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఊరట దక్కింది. కవిత విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.గతేడాది మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితను ఆమె ఇంట్లోనే మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్ట్ చేశారు. కేసులో భాగంగా ఐదు నెలల జైలు శిక్ష అనంతరం కవితకు షరతులమీద బెయిల్ మంజూరైంది. ఆ సమయంలో కవిత తన పాస్‌పోర్టును రౌస్ అవెన్యూ కోర్టులో అందించారు.తాజాగా, గ్రాడ్యుయేషన్ నిమిత్తం తన చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు అమెరికా వెళ్లాల్సి ఉంది. ఇందులో భాగంగా తాను అమెరికాకు వెళ్లేందుకు అనుమతి కావాలంటూ కవిత.. రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సైతం పాస్‌పోర్టును విడుదల చేసింది. దీంతో కవిత ఇవాళ అమెరికాకు వెళ్లనున్నారు. 15రోజుల పర్యటన అనంతరం సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఇక అమెరికా పర్యటనకు ముందు కవిత..తన తండ్రి కేసీఆర్‌ను కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు కవితతో పాటు చిన్న కుమారుడు ఆర్య సైతం వెళ్లనున్నారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం, శనివారం ఉదయం అమెరికాకు బయల్దేరనున్నారు. -
‘తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఇలా పతనం కావడం ఇదే తొలిసారి’
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతోనే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిందని ధ్వజమెత్తారు. వరుసగా నెలలు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణమే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యిందనడానికి నిదర్శమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేశారు. వరుస రెండు నెలల పాటు తెలంగాణ మైనస్ ద్రవ్యోల్పణంలోకి వెళ్లిపోవడం రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే తొలిసారి అని మండిపడ్డారు. దేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణనే కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఆర్థిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేసిందని, అదే సమయంలో ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమైందన్నారు. ఒక శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థను అవగాహన లేని పాలనతో నాశనం చేయడం చూస్తే బాధగా ఉందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలన నిరాశజనకంగా కనిపిస్తోందన్నారు కేటీఆర్. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోందన్నారు.For the first time since its formation, Telangana has slipped into deflation for 2 straight months - June & JulyWhat’s worth highlighting is that Telangana is the ONLY state in India in this situationDeflation is not a sign of prosperity. It means people are limiting… pic.twitter.com/AAk5ZGCNTl— KTR (@KTRBRS) August 14, 2025 -
రేపటి బీఆర్ఎస్ కదనభేరి వాయిదా
కరీంనగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించ తలపెట్టిన బీసీ కదనభేరి సభను వాయిదా వేస్తున్నట్లు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఈనెల 14, 15, 16, 17 తేదీల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశము న్నట్లు వాతావరణశాఖ సూచనల మేరకు 14న నిర్వహించే బీసీ కదనభేరిని వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. వాతా వరణం అనుకూలించిన తదుపరి తేదీని నిర్ణయిస్తామని, బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు గమనించాలన్నారు. -
స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు పార్టీ ముఖ్య నేతలను ఆదేశించారు. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు జరుగుతున్న సన్నద్ధతపై ఆరా తీశారు. ఢిల్లీలో న్యాయవాదులు కోరిన విధంగా పూర్తి సమాచారాన్ని వీలైనంత త్వరగా సిద్ధం చేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని కేటీఆర్‌ను ఆదేశించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌తో కేసీఆర్ సోమవారం ఎర్రవల్లి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన చర్చించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ స్థానిక ఎన్నికల సన్నద్ధతపై చర్చించడంతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించిన పరిణామాలు భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసిందని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే అవకాశముందని సమావేశంలో నేతలు అంచనా వేశారు. ఈ నెల 14న కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ నిర్వహించే ‘బీసీల కదన భేరి’ సభ ఏర్పాట్లపైనా చర్చించారు. సభలో రిజర్వేషన్ల అంశాన్ని బలంగా ప్రస్తావించి కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ ఆదేశించారు. బనకచర్లపై దిశా నిర్దేశం ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్టుపై ఇటీవల ఢిల్లీలో న్యాయ నిపుణులతో హరీశ్ జరిపిన సంప్రదింపులకు సంబంధించి చర్చ జరిగినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు వేస్తున్న ఎత్తుగడలకు పార్టీ పరంగా చెక్ పెట్టేలా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ సమావేశాలకు సన్నద్ధతపై చర్చ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనకు ముందే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ అభిప్రాయపడినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెడితే అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. దీనిపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని కేసీఆర్ వెల్లడించినట్లు సమాచారం. విలీనం ప్రచారాన్ని తిప్పికొట్టాలి ‘ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి పదేళ్లు అధికారంలో కొనసాగి, ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతర పోరాటం చేస్తోంది. కానీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతోందని కొందరు ఉద్దేశపూర్వక ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో కేడర్‌కు తప్పుడు సంకేతాలు వెళ్లక ముందే విలీనం అంటూ జరుగుతున్న ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టండి..’ అని బీఆర్ఎస్ అధినేత ఆదేశించారు. -
అటు బనకచర్ల.. ఇటు ఎమ్మెల్సీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై నిరంతరం విమర్శల వర్షం కురిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. తెలంగాణకు సంబంధించిన కీలక అంశాలపై న్యాయ పోరాటం చేయాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ ‘గోదావరి బనకచర్ల’లింకు ప్రాజెక్టుపైనా దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అదే తరహాలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపైనా కోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఢిల్లీకి చేరుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్సీలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సుప్రీంకోర్టులో స్వయంగా పిటిషన్ దాఖలు చేయనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్‌తోపాటు ఢిల్లీకి వెళ్లిన బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు పిటిషన్ దాఖలుకు అవసరమైన పత్రాలు సిద్ధం చేస్తున్నారు. బనకచర్లపై బీఆర్ఎస్ న్యాయపోరాటం ఏపీ ప్రభుత్వం చేపడుతున్న గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్.. ఈ ప్రతిపాదనకు ఆదిలోనే అడ్డు చెప్పాలని భావిస్తోంది. బనకచర్ల లింకు ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని ప్రకటించిన బీఆర్ఎస్ అందుకు అవసరమైన కార్యాచరణపైనా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. బనకచర్ల ద్వారా తెలంగాణకు జరిగే అన్యాయంపై ఇప్పటికే పార్టీ కేడర్‌కు, విద్యార్థి, యువజన విభాగం నాయకులకు బీఆర్ఎస్ అవగాహన కల్పించింది. ఇందులో భాగంగా హైదరాబాద్, మంచిర్యాలలో విద్యార్థి సదస్సులు కూడా నిర్వహించింది. ఓ వైపు క్షేత్ర స్థాయిలో బనకచర్లను అడ్డుకుంటూనే మరోవైపు న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. బనకచర్లపై సుప్రీంకు వెళ్లే యోచన! బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బనకచర్ల లింకు ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు ఆ పార్టీ సన్నద్ధమవుతోంది. నీటిపారుదల రంగానికి సంబంధించి సంపూర్ణ అవగాహన కలిగిన మాజీమంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు బాధ్యత అప్పగించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లిన హరీశ్‌రావు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి శుక్రవారం మధ్యాహ్నం తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. కాగా బనకచర్ల ప్రాజెక్టుపై త్వరలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తారని బీఆర్ఎస్ వర్గాల సమాచారం -
బీజేపీ ‘ఆకర్ష్’ వేగిరం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చేరికలపై కమలదళం స్పీడ్ పెంచింది. ఆదివారం కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఇతర ముఖ్య నేతల సమక్షంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కాషాయ గూటికి చేరనున్నారు. మరికొద్ది రోజుల్లో మరో ఇద్దరుముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశాలున్నట్టు పార్టీవర్గాల సమాచారం. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో...బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల నుంచి మాజీ ఎమ్మెల్యేలతో పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయి వరకు నేతలను చేర్చుకునే వ్యూహానికి పార్టీ నాయకత్వం పదును పెడుతోంది. పార్టీ బలహీనంగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థానికంగా బలం చాటేందుకు వారి చేరికలు ఉపయోగపడతాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. పార్టీ ఏఏ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బలహీనంగా ఉందనే దాని ప్రాతిపదికన చేరికలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మెదక్, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో ఇతర పార్టీల నుంచి పెద్దసంఖ్యలో చేర్చుకునేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఆపరేషన్‌ను బలపరిచేలా పార్టీ చీఫ్ వ్యాఖ్యలు బీజేపీలో చేరికలకు సంబంధించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ ‘ఆపరేషన్’ప్రయత్నాలను బలపరుస్తున్నాయి. తమతో బీఆర్ఎస్కు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంప్రదింపులు జరుపుతున్నారని, త్వరలోనే వీరి చేరికలు ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ కాబోతున్నదని, అందుకు బీజేపీలో బాలరాజు చేరడమే సంకేతమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అధికార కాంగ్రెస్ పార్టీలోనూ కొందరు నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు కూడా తమ పార్టీ వైపు చూస్తున్నారన్నారు. వీరంతా కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని, ఈ రెండు పార్టీల్లోని కొందరు ముఖ్యనేతలతో సహా, మాజీ ఎమ్మెల్యేలకు బీజేపీనే రాజకీయ ప్రత్యామ్నాయం కాబోతోందని చెప్పారు. వీరితోపాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు కూడా పార్టీలో చేరేందుకు సముఖంగా ఉన్నారంటున్నారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా తటస్థులుగా ఉన్న యువత, మేధావులు, విద్యావేత్తలను బీజేపీలో చేరాలని ఆహ్వానిస్తున్నామని రాంచందర్‌రావు ప్రకటించారు. మళ్లీ కీలక దశకు.. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి వివిధ స్థాయిల నాయకులు భారీ సంఖ్యలో చేరారు. శాసనసభ కంటే కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కార్యాచరణ విజయవంతమై మంచి ఫలితాలు (మొత్తం 17 సీట్లలో 8 ఎంపీ స్థానాలు గెలుచుకోవడం) వచ్చాయి. ఈ ఎన్నికలప్పుడు పార్టీలో చేరిన వారే ఆ తర్వాత జరిగిన పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి సత్తా చా టారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల కల్లా క్షేత్రస్థాయి నుంచి బలపడేందుకు ఇదే మంచి సమయం, అవకాశమనే అభిప్రా యంతో పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు చేరికల ఆపరేషన్‌కు మళ్లీ పదును పెట్టాయి. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేసినట్టుగా వచ్చిన ఆరోపణలు పెనుసంచ లనానికి కారణమయ్యాయి. గతంలో బీజేపీలో చేరేందుకు తనను ప్రలోభపరిచిందని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి చేరికకు ముందువరుసలో నిలిచారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా ఆదివారం బీజేపీలో చేరబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. బాలరాజుతోపాటు త్వరలోనే ఉమ్మడి పాలమూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ఇటీవల ఢిల్లీలో బీఎల్ సంతోశ్, ఇత ర నేతలను కలిసి చేరికకు అనుమతి కోరినట్టు తెలుస్తోంది. -
ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజాలు చెప్పాలి
-
బీజేపీలోకి గువ్వల బాలరాజు! షాకిచ్చిన BRS కార్యకర్తలు
-
14న కరీంనగర్లో బీఆర్ఎస్ ‘బీసీ సభ’
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 14న కరీంనగర్ వేదికగా ‘బీసీ సభ’నిర్వహించాలని నిర్ణయించింది. తొలుత ఈ నెల 8న కరీంనగర్లో బీసీ సభ నిర్వహిస్తామని ప్రకటించినా తక్కువ సమయంలో భారీ సభ నిర్వహించడం సాధ్యం కాదనే అభిప్రాయంతో 14వ తేదీకి వాయిదా వేసింది.ఈ సభ వేదికగా బీసీ రిజర్వేషన్ల అంశంపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ బీసీ కీలక నేతలు గురువారం భేటీ అయ్యారు. మాజీ మంత్రులు తలసాని, గంగుల, శ్రీనివాస్‌గౌడ్, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మండలిల్చోఛ్చి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సహా 50 మంది ఈ భేటీలో పాల్గొన్నారు.బీసీ రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వైఖరి, కేంద్రం స్పందిస్తున్న తీరుపై చర్చించారు. కేటీఆర్ నేతృత్వంలో బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. 42% రిజర్వేషన్లు అమలు చేసేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు చేశారు. జిల్లాలవారీగా బీసీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.బీసీ రిజర్వేషన్ల పేరిట ఢిల్లీలో డ్రామాలుబీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటు తనంతో ఆర్డినెన్స్ ఇచ్చి సంబురాలు చేసుకుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ చేసిన ధర్నాకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే సహా ముఖ్య నేతలెవరూ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో అన్ని పార్టీలను ఒప్పించి రిజర్వేషన్లు సాధించాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. -
రేవంత్‌కు కేసీఆర్ ఫోబియా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారని, ఆయనకు కేసీఆర్ ఫోబియా పట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. కేసీఆర్ పేరును ప్రస్తావించకుండా ఉండలేని మానసిక రుగ్మత రేవంత్‌రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల పేరిట ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తు న్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బీసీ డిక్లరేషన్‌లోని ఇతర హామీలను పూర్తిగా పక్కన పెట్టిందని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు గురువారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌వన్నీ డ్రామాలే..: ‘42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని ఓట్లు వేయించుకున్న రేవంత్.. ఇప్పుడు రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత రిజర్వేషన్ల పెంపు జరుగుతుందన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో తెలంగాణ సాధించిన తర్వాతే తిరిగి వస్తానని ప్రకటించి ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ లక్ష్యాన్ని చేరుకున్నారు. అదే తరహాలో ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్లు సాధించారో లేదో చెప్పాలి. ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్‌గాందీతో సీఎం రేవంత్ ఏకకాలంలో డ్రామా చేస్తున్నాడు. చంద్రబాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే డ్రామాలకు పాల్పడుతున్నాడు. చివరివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రేవంత్ చెప్తున్న మాటలు ఆయన డ్రామాలో భాగమే..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు.. ‘బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ కండువాలు వేసుకుని దేవుడి కండువాలు కప్పుకున్నామని చెప్తున్నారు. వారు ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్రంలో చిన్న పిల్లలను అడిగినా చెప్తారు. కానీ అసెంబ్లీ స్పీకర్‌కు మాత్రం ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు. స్థానిక సంస్థల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అడ్డగోలుగా నిధులు సమకూర్చుకుంటోంది. గడిచిన 20 నెలల్లో సంపాదించిన అవినీతి సొమ్మును స్థానిక ఎన్నికల్లో పంచేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ పదేళ్లు వెనక్కి పోయింది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతుబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తుంది..’అని కేటీఆర్ అన్నారు. కార్యకర్తలకు న్యాయం చేస్తాం ‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించడంతో పార్టీ కార్యకర్తలకు తగినంత న్యాయం చేయలేకపోయాం. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను కాపాడుకుని వారికి అండగా నిలుస్తాం. పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించాలి. కొందరు చెప్తున్నట్లు బీఆర్ఎస్ ఏ పార్టీలోనూ విలీనమయ్యేది లేదు. తెలంగాణ ఉన్నంత కాలం గులాబీ కండువా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలను మట్టి కరిపించి మళ్లీ కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుందాం..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ అరెస్ట్ అవుతారా?.. క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్
సాక్షి,న్యూఢిల్లీ: విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు,కాళేశ్వరం స్కాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆరోపణలొచ్చాయి. ఈ కేసుల్లో కేసీఆర్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ఊహాగానాలూ ఊపందుకున్నాయి. అయితే,ఈ ఊహాగానాలకు ఢిల్లీ కేంద్రం సీఎం రేవంత్ తెరదించారు. కేసీఆర్ అరెస్ట్‌పై సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదానికి పార్లమెంట్లో ఒత్తిడి పెంచాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం ఢిల్లీలో పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ చిట్‌చాట్ నిర్వహించారు. కేసీఆర్‌ను నేనెందుకు జైల్లో వేస్తా.. ఆయనే స్వీయ నియంత్రణగా జైల్లో ఉన్నట్లు ఫామ్ హౌస్‌లో ఉన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు.. చర్లపల్లి జైలుకు తేడా లేదు. ఫామ్ హౌస్‌లో పోలీసుల పర్యవేక్షణ ఉంటది. జైల్లో పోలీసుల పహారా ఉంటుంది. అప్పుడప్పుడు జైలుకు విజిటర్స్ వస్తుంటారు.. అలాగే ఫామ్ హౌస్‌కి విజిటర్స్ వెళ్లి వస్తున్నారు. కేసీఆర్‌ను ఓడించడమే పెద్ద శిక్ష. నేనెందుకు విద్వేష రాజకీయాలు చేస్తా.మేం దుప్పటి కప్పుకొని పడుకున్నా తెలంగాణ ప్రజలు రెండోసారి కాంగ్రెస్ గెలిపిస్తారు. బీహార్ ఎన్నికలతో పాటే జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక వస్తుందని అనుకుంటున్నా. బీఆర్ఎస్ నేతలు కూడా నైతిక విజయం అంటే నైతికత కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. బీఆర్ఎస్ నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదు . బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది మా విధానం. బీజేపీ నేతలు.. మీకు కావలసిన పద్ధతిలో చట్టం చేయండి. కిషన్ రెడ్డికి బీసీ బిల్లులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్ల కంటే ఎక్కువ రానివ్వం. 2029లో ఎన్నికలు గెలిచి చూపిస్తాం..కిషన్ రెడ్డి అడ్డుకుంటారా?’ అని అన్నారు. -
కొమురంభీం ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ VS కాంగ్రెస్
-
మంత్రి పదవి హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారు
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకొచ్చారని, అధిష్టానం పిలుపు మేరకే తాను తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, ఐదేళ్లు అధికారంలో ఉంటుందని చెప్పిన ఆయన.. తప్పు ఎక్కడ జరుగుతుందో తెలియకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని, అందుకే కొన్ని విషయాలను చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని డిజిటల్ మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లోని నివాసంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భాష మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకోవాలని, తక్కువ మాట్లాడి ఎక్కువ పనులు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న కేబినెట్ బెర్తులను భర్తీ చేసి, వీలున్నంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. తాను రేవంత్‌రెడ్డిని విమర్శించడం లేదని సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తున్నానని చెప్పారు. వాళ్లు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్ర్రస్టేషన్‌లో ఉందని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష హోదాలో కొనసాగే అర్హత లేదని, ఆయన అసెంబ్లీకి రావాలని లేదంటే ప్రతిపక్ష నేత హోదా ఇంకెవరికైనా ఇవ్వాలన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఉండదని జోస్యం చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ దివాలా తీయిస్తే ఆంధ్ర పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, సమయం వచ్చినప్పుడు వారి బండారం బయటపెడతానన్నారు. రాష్ట్ర సంపదను లూటీ చేసే విషయంలో, కాంట్రాక్టుల విషయంలో, భూములు, ఇసుక మాఫియా విషయంలో... తెలంగాణకు అన్యాయం జరిగే ఏ విషయం గురించైనా తాను బహిరంగంగానే మాట్లాడతానని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్లు దాచుకుందని, విచారణల పేరుతో కాలయాపన చేయకుండా గత పదేళ్ల కాలంలో అవినీతి సొమ్మును దోచుకున్న వారందరినీ వీలున్నంత త్వరగా జైల్లో పెట్టాలని ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కోరారు. -
రాజకీయం.. రసవత్తరం!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి ఇచ్చిన సుదీర్ఘ నివేదిక రాష్ట్ర రాజకీయాలను రసవత్తరంగా మార్చేసింది. మూడు ప్రధాన పార్టీలూ.. నివేదికను, అనంతర పరిణామాలను రాజకీయంగా తమకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలా అన్న దానిపై దృష్టి సారించాయి. ఈ రిపోర్టు ఆధారంగా బీఆర్ఎస్ను ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టాలని అధికార కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతుండగా, అందులోని లోపాలను ఎత్తిచూపుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మరో ప్రధాన రాజకీయ పక్షం బీజేపీ ఈ నివేదికపై ఎలాంటి వైఖరి తీసుకోవాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతోంది. అధికార కాంగ్రెస్ ద్విముఖ వ్యూహంకాళేశ్వరం నివేదిక విషయంలో తమ చేతికి మట్టి అంటకుండా ఉండాలనే వ్యూహంతోనే అధికార కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ పాచిక విసిరిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఈ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టడం ద్వారా ద్విముఖ వ్యూహాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీలతో మాట్లాడించి.. నివేదికకు అసెంబ్లీ ఆమోదం ఇప్పించి.. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆదేశించడం ఈ వ్యూహంలో ప్రధాన భాగం అయితే, మరో ఎత్తుగడ కూడా ఉందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను అక్కడకు రప్పించే వ్యూహం కూడా ఇందులో ఉందనే చర్చ జరుగుతోంది. ఈ నివేదిక ద్వారా అసెంబ్లీలో జరిగే చర్చలో పాల్గొని తన వాదనను వినిపించాల్సిన అనివార్యతను కేసీఆర్‌కు కల్పించామని, ఆయన వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయన చేసిన తప్పులను అక్కడే ఎండగడతామని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే కాళేశ్వరంలో అక్రమాలు జరిగాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని వారంటున్నారు. దూకుడుగానే బీఆర్ఎస్నివేదిక విషయంలో బీఆర్ఎస్ కూడా దూకుడుగానే వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జస్టిస్ ఘోష్ నివేదికను ఆ పార్టీ నేతలు చాలామంది ఖండించగా, మాజీ మంత్రి హరీశ్‌రావు ఓ అడుగు ముందుకేసి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నివేదికలోని లోపాలను ఎత్తిచూసే ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా తమ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహం రచించారు. అన్ని జిల్లాల్లోనూ స్క్రీన్లు పెట్టి పార్టీ నాయకులకు ప్రజెంటేషన్‌ను చూపించారు. ప్రజాక్షేత్రంలోకి దూకుడుగా వెళ్లాలనే ఆలోచనలో గులాబీ పార్టీ ఉన్నప్పటికీ.. భవిష్యత్ పరిణామాలపై కూడా బీఆర్ఎస్ దృష్టి పెట్టింది. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ లక్ష్యంగా కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఇప్పటికే కమిషన్ విచారణ పేరుతో పిలిపించడంతో పాటు నివేదిక ప్రజల్లో పెట్టి ఆయన ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నాలు చేయగా.. అసెంబ్లీ వేదికగా మరో విచారణ ప్రకటించి మానసికంగా పార్టీ నేతలను ఇబ్బంది పెట్టవచ్చనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. ఏదిఏమైనా ఘోష్ నివేదిక ఆధారాల్లేనిదని, బీఆర్ఎస్ను బద్నాం చేయడమే లక్ష్యంగా ఇచ్చిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని గులాబీ నేతలంటున్నారు. బీజేపీ అటా..ఇటా?జస్టిస్ ఘోష్ నివేదిక కమలం పార్టీకి గొంతులో వెలక్కాయ పడినంత పని చేసిందని రాజకీయ వర్గాలంటున్నాయి. కాళేశ్వరం నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబం ఈ ప్రాజెక్టుతో ఆయాచిత లబ్ధి పొందిందని మొదటి నుంచి ఆరోపిస్తున్న బీజేపీ.. ఇప్పుడు ఘోష్ నివేదికను సమర్థించాలో, వ్యతిరేకించాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. ఈ నివేదికను బీజేపీ సమర్థించకపోతే.. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని, అందుకే ఇన్నాళ్లు ఆరోపణలు చేసినా ఇప్పుడు మౌనంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించే అవకాశాలున్నాయి. ఒకవేళ నివేదికతో ఏకీభవిస్తే.. ఆ నివేదిక తప్పుపట్టినట్టుగా తమ పార్టీకి చెందిన ఎంపీ ఈటల రాజేందర్ కూడా తప్పు చేశారని అంగీకరించాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై కమలనాథులు మల్లగుల్లాలు పడుతున్నారు. కింకర్తవ్యంపై ప్రభుత్వం మల్లగుల్లాలుప్రస్తుత పరిస్థితుల్లో కింకర్తవ్యం ఏమిటనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడు తోంది. ఇప్పటికే ఫార్ములా ఈ–రేసు, ఫోన్‌ట్యా పింగ్ కేసుల్లో ఎటూ తేల్చకుండా నాన్చుడు ధోరణిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెళుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం విషయంలోనూ అదే జరిగితే బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయన్న కాంగ్రెస్ ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రజలు భావింవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందువల్ల అసెంబ్లీ వేదికగా ప్రకటించే విచారణను త్వరగా పూర్తి చేసి కాళేశ్వరం అక్రమాల బాధ్యులపైనైనా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో పార్టీపై నమ్మకం కలుగుతుందని అంటున్నారు. మరోవైపు అప్పట్లో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన అధికారిని కూడా కమిషన్ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ఆయన పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందనేది కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. -
న్యాయ వ్యవస్థనే అవమానిస్తారా?: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ’ప్రజాస్వామ్య వ్యవస్థలపై బీఆర్ఎస్కు చులకన భావం. చట్టసభలు, న్యాయ వ్యవస్థపై గౌరవం, నమ్మకం లేదు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలోని జ్యుడీషియల్ కమిషన్ అంటే కూడా లెక్కలేదు. ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పినా ఇప్పటికీ వాళ్లలో మార్పు రాలేదు. మేడిగడ్డను కుంగబెట్టిన దుర్మార్గులు ఇప్పడు ఏకంగా సీనియర్ జస్టిస్ పీసీ ఘోష్‌ను అవమానిస్తున్నారా? న్యాయబద్ధ కమిషన్‌కు అపార్థాలు అంటగట్టే నీచానికి దిగజారటం కూడా మీకే చెల్లింది..’ అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఖండిస్తూ మంగళవారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వారి బండారం బట్టబయలైంది ’కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట గత ప్రభుత్వం ఎన్ని అవకతవకలకు, అక్రమాలకు పాల్పడిందో కమిషన్ విచారణలో బయటపడింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు బండారం బట్టబయలైంది. అందుకే తేలు కుట్టిన దొంగల్లా.. హరీశ్‌రావు మళ్లీ కల్ల»ొల్లి కబుర్లు చెప్తున్నారు. కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. అది రేవంత్‌రెడ్డి ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాసిన రిపోర్టు కాదనే విషయాన్ని హరీశ్‌రావు మరిచిపోయినట్లున్నారు. ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు.. కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలైనప్పటి నుంచి డిజైన్లు, నిర్మాణంలో లోపాలు, మేడిగడ్డ బరాజ్ కుంగుబాటు వరకు అవకతవకలన్నింటిపై కమిషన్ సమగ్రంగా విచారణ జరిపింది. ఎవరెవరు తప్పులు చేశారో.. ఎవరెవరు అందుకు బాధ్యులనే వివరాలను నివేదికలో వెల్లడించింది. మేమేం తప్పు చేయలేదంటూ మీ పార్టీ ఆఫీసులో తప్పులు మాట్లాడి తెలంగాణ ప్రజలను ఇంకెన్ని సార్లు మోసం చేస్తారు? ఇప్పుడు పార్టీ ఆఫీసులో పెడబొబ్బలు పెడుతున్న హరీశ్‌రావు.. ఆరోజు కమిషన్ ముందు ఎందుకు ఈ వివరాలు చెప్పుకోలేదు?..’ అని ఉత్తమ్ నిలదీశారు. ప్రభుత్వం చర్యలపై భయం పట్టుకుంది.. ’హరీశ్ అబద్ధపు సాక్ష్యాలు, బుకాయింపులన్నీ.. న్యాయ వ్యవస్థ ముందు అబద్ధాలుగా తేలిపోయాయి. ఆయన చేసిన తప్పులన్నీ బయటపడ్డాయి. కేసీఆర్ పాత్ర ఏమిటో, హరీశ్‌రావు చేసిన ఘనకార్యాలేమిటో కమిషన్ విచారణలో తేలిపోయాయి. దాంతో ఇప్పుడు ప్రభుత్వం ఈ నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే భయం వాళ్లను వెంటాడుతోంది. అందుకే కమిషన్‌ను తప్పుబట్టే దుర్మార్గానికి ఒడిగట్టారు. అసెంబ్లీలో చర్చించేందుకు సిద్ధం ప్రజాస్వామ్య వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, చట్ట సభలపై మా ప్రభుత్వానికి గౌరవముంది. అందుకే అసెంబ్లీలో ఈ నివేదికపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది. కాళేశ్వరంలో దోషులుగా తేలిన బాధ్యులు.. అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని కూడా ప్రభుత్వం ఆహ్వానించింది. ఫార్మ్ హౌస్‌లో మామ డైరెక్షన్, పార్టీ ఆఫీస్‌లో అల్లుడి యాక్టింగ్ ఇకనైనా ఆపాలి. ఇప్పటికైనా అసెంబ్లీకి వచ్చి చేసిన తప్పులు ఒప్పుకుని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పుకోవాలి. మీరు వేలకోట్ల అవినీతి చేస్తే ఒప్పు,.. మేం విచారణ చేసి నిజాలు నిగ్గుతేలిస్తే అది రాజకీయ కక్ష సాధింపా?..’ అని మంత్రి ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కే లేదు.. ’కమీషన్ల కక్తుర్తితో ప్రజలను, రైతులను పదేళ్ల పాటు మోసం చేశారు, ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు హైడ్రాలజీ అనుమతులు ఇస్తే దాచిపెట్టారు. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బరాజ్‌ల నిర్మాణం వద్దని చెపితే తొక్కిపెట్టారు. బరాజ్‌లు ఎక్కడ కట్టాలో మీరే నిర్ణయించుకున్నారు. కుంగి పోయే ప్రాజెక్టు కట్టినందుకు సిగ్గుపడాల్సింది పోయి హరీశ్‌రావు కొత్త రికార్డు సృష్టించారు. జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేశారు. ఒక్క మాట కూడా నిజం చెప్పకుండా మరోసారి డూప్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు ఉమ్మడి రాష్ట్రంలోనే జీవో ఇచ్చారు. మా ప్రభుత్వం ఒక్క రూపాయి బిల్లు కూడా ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. కేబినెట్ ఆమోదం లేకుండానే మామా అల్లుళ్లు సంతకాలు చేసుకుని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. తెలంగాణ ప్రజలను దగా చేశారు. తెలంగాణ ప్రయోజనాలను పాతరపెట్టి, ఆర్థికంగా లక్ష కోట్ల దుర్మార్గానికి ఒడిగట్టిన బీఆర్ఎస్ నేతలకు నైతికంగా మాట్లాడే హక్కే లేదు..’ అని ఉత్తమ్ విమర్శించారు. -
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇందుకోసం అందరం చేయి చేయి కలిపి పనిచేద్దామని కోరారు. సోమవారం గాందీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ల సమక్షంలో ఖమ్మం జిల్లా మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో పాటు పలువురు మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా కొండబాలకు పార్టీ కండువా కప్పిన పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ పార్టీలోకి ఆహా్వనించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి భట్టి మాట్లాడుతూ ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, వారి అవసరాలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు అన్ని విషయాలపై అవగాహన కలిగిన కొండబాల లాంటి నేతలు పార్టీలోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు.మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ కొండబాల తన సొంత ఇంటికి తిరిగి వచ్చారని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వరరావుతో పాటు ఖమ్మం జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జనంలోకి వెళ్దాం.. అసెంబ్లీలో ఎండగడదాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో రెండు పియర్స్ కుంగుబాటును సాకుగా చూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టు స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా, నేడు అధికార పార్టీగా కాంగ్రెస్ వల్లెవేస్తూ వస్తున్న అబద్ధాలకు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ముసుగు వేసి బీఆర్ఎస్పై బురద చల్లే ప్రయ త్నం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అబ ద్ధాలను అసెంబ్లీతోపాటు ప్రజాక్షేత్రంలోనూ ఎండగట్టాలని పార్టీ నేతలను ఆదేశించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో కొన్ని రోజులుగా పార్టీ కీలక నేతలు కె. తారక రామారావు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో వరుస భేటీలు జరుపుతున్న కేసీఆర్.. సోమవారం కూడా వారితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. బీజేపీ ప్రేరేపిత జాతీయ డ్యామ్‌ల భద్రత ప్రాధికార సంస్థ (ఎన్డీఎస్ఏ)ను అడ్డుపెట్టుకొని తయారు చేయించిన నివేదికపై ప్రజలకు వాస్తవాలు వివరించాలని కేసీఆర్ ఆదేశించినట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీ వేదికగానే అసలు నిజాలు చెబుదాం పీసీ ఘోష్ కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తామని సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై ఈ భేటీలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. గతంలో అధికారపక్షంగా రాష్ట్రంలో సాగునీటి రంగం స్థితిగతులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ప్రజలకు వివరించినట్లుగానే కమిషన్ విచారణ నివేదికపైనా స్పందించాలని కేసీఆర్ అభిప్రాయపడ్డట్లు తెలియవచ్చింది. ఈ అంశంపై తానే అసెంబ్లీకి స్వయంగా హాజరై వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ తప్పూ చేయనందునే పీసీ ఘోష్ కమిషన్ విచారణకు తనతోపాటు హరీశ్‌రావు హాజరై వివరణ ఇచ్చిన విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారని... అదే రీతిలో అసెంబ్లీ వేదికగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చేసిన విమర్శలు, ఆరోపణలను తిప్పికొట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రభుత్వం వ్యవహరించే తీరునుబట్టి అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో కుమ్మక్కై కక్షపూరిత చర్యలకు పాల్పడితే అనుసరించాల్సిన వ్యూహంపైనా కేసీఆర్ ఈ భేటీలో చర్చించినట్లు తెలియవచ్చింది. నేడు కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఎంచుకున్న అంశాలను మాత్రమే కేబినెట్లో ప్రభుత్వం చర్చించినట్లు బీఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. సోమవారం కేబినెట్లో చర్చించిన కమిషన్ సంక్షిప్త నోట్లోని అంశాలను పార్టీ నేతలకు వివరించి ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలకు కమిషన్ నివేదికలోని డొల్లతనాన్ని, రేవంత్ సర్కారు కుట్రలను ప్రజలకు విడమర్చి చెప్పాలని హరీశ్‌రావును కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్లో కమిషన్ నివేదికపై ప్రభుత్వ కార్యదర్శుల త్రిసభ్య కమిటీ ఇచ్చిన సంక్షిప్త నివేదికలో పేర్కొన్న వివరాల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ ప్రజెంటేషన్‌ను రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలు వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని కేడర్‌ను కేటీఆర్ ఆదేశించారు. ప్రజెంటేషన్ అనంతరం ముఖ్య నేతలు ఎక్కడికక్కడ జిల్లా కేంద్రాల్లో ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వ తీరును ఖండించాలని నిర్దేశించారు. నేడు ఢిల్లీకి కేటీఆర్ కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం మంగళవారం ఢిల్లీలోని నిర్వాచన్ సదన్‌లో జరిగే సమావేశానికి హాజరు కానుంది. ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళితోపాటు వివిధ పార్టీలు సమర్పించిన పెండింగ్ ప్రతిపాదనలపై చర్చలు జరగనున్నాయి. -
త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్: త్వరలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 4వ తేదీ) తెలంగాన కేబినెట్ సమావేశం నిర్వహించారు.సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం అసెంబ్లీని నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్‌పై చర్చించనున్నారు. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చలు అనంతరం దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ నివేదికపైనే అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరంపై అవతవకలపై ఏర్పాటు చేసిన కమిషన్.. తుది నివేదికను కొన్ని రోజుల క్రితం ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో నేటి కేబినెట్ సమావేశంలో కూడా దీనిపైనే ప్రధానంగా చర్చించారు.మరోవైపు.. కాళేశ్వరంలో ఎక్కడా అవినీతి జరగలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డిజైన్‌లో లోపాలు లేవని అంటున్నారు. అది కాంగ్రెస్ కమిసన్ అని వారు విమర్శిస్తున్నారు. వ్యాప్కో సంస్థ సూచనల మేరకు ప్రాజెక్టు నిర్మాణం జరిగినట్టు తెలిపారు. కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పార్టీ నేతలు ఈరోజు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ అందించిన నివేదికపైనే ఈ భేటీలో బీఆర్ఎస్ నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.కాళేశ్వరం నివేదికపై స్పందించిన కేసీఆర్ -
Guvvala Balaraju: బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, అచ్చం పేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం (ఆగస్టు4) బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు అధినేత కేసీఆర్‌కు లేఖ రాశారు. బాలరాజుతో పాటుగా మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. గువ్వల బాలరాజ్ 2014 నుంచి 2023 వరకు రెండు సార్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే, మూడోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో నాటి నుంచి పార్టీలో ఇన్ యాక్టీవ్‌గా ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం (ఆగస్టు3) రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో గువ్వల బాలరాజ్ భేటీ అయ్యారు. ఇవాళ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాగా, బాలరాజు త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. -
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం
-
Telangana: అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
-
చుక్క నీటినీ వదులుకోం: భట్టి విక్రమార్క
ముదిగొండ: తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన సాగునీటి వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని, తమకు రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బనకచర్ల పాపం బీఆర్ఎస్దేనని, ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ కుట్రలను అడ్డుకుని తీరతామని అన్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న 10 వేల మెట్రిక్ టన్నుల గోదాముల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతంలో 5.91 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములే రైతులకు అందుబాటులో ఉండేవని, తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్తగా 10.75 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాంలు నిర్మించామని తెలిపారు. అన్నదాతల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. దాని ఫలితంగానే దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. సీఎం, ఉత్తమ్ వల్లే బనకచర్లకు బ్రేక్ ఉమ్మడి ఏపీలో సాగునీటి రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇప్పుడు కూడా రాష్ట్రంపై అవే కుట్రలు జరుగుతున్నాయని భట్టి చెప్పారు. తెలంగాణలో పంటలు ఎండిపోయేలా ఏపీ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుడుతోందని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి సమర్థంగా వాదనలు వినిపించడం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు బ్రేక్ పడిందని చెప్పారు. కృష్ణా, గోదావరిపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించిన ప్రాజెక్టుల ద్వారానే పంటలకు నీరందుతోందని, బీఆర్ఎస్ హయాంలో ఒక్కటి కూడా పనికొచ్చే ప్రాజెక్టు నిర్మించలేదని విమర్శించారు. రూ.లక్ష కోట్లు వెచ్చించిన కాళేశ్వరంతో ఒక్క ఎకరాకు కూడా నీరందడం లేదన్నారు. నాడు పోలవరం నిర్మిస్తుంటే చోద్యం చూశారని, బనకచర్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నా పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నీటిని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరందించేలా పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్తోందని భట్టి తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ‘గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు’
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టిన గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో చేసిన అభివృద్ధికి ,సేవలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు జూబ్లీహిల్స్ నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.‘బీఆర్ఎస్ పార్టీకి 50 వేల మంది కార్యకర్తల సభ్యత్వం ఉన్న నియోజకవర్గం జూబ్లీ హిల్స్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. కాంగ్రెస్ వచ్చాక అనేక సంక్షేమ పథకాలు ఆగిపోయాయి. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బస్తీల్లో ఉండే పేదల ఇండ్లు కూల్చుతున్నారు. సీఎం రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నాడు.హైదరాబాద్‌లో రేవంత్, ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లోనే ఉంటుంది. ఇలా చెప్పుకుంటే పోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇండ్లు అన్ని బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నాయి. కూట్లో రాయి తెయ్యలేని వాడు, ఎట్లో రాయి తీస్తా అని రేవంత్ మాట్లాడుతున్నాడు.జూబ్లీ హిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులకు ఒకటే చెప్తున్నా. గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు. గెలుస్తాం అని ఇంట్లోనే ఉండకుండా ప్రతి ఒక్కరు ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ గెలుపుకు కృషి చెయ్యాలి. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన మాగంటి గోపినాధ్ బీఆర్ఎస్ పార్టీ వీడలేదు. ఉపఎన్నిక గెలిచి మాగంటి గోపీనాథ్ అంకితం ఇవ్వాలి.ఎలక్షన్ కమిషన్ తీరు సరిగా లేదు. ఎలక్షన్ కమిషన్ దేశ వ్యాప్తంగా ఓట్లు తీసివేసి పనిలో ఉంది. బీహార్‌లో మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఓటునే తీసేశారు. మన ఓట్లు తీసివేయడం ఒక లెక్కనాఅందరం జాగ్రత్తగా ఉండాలి’ అని అన్నారు. -
బీఆర్ఎస్ నేతలపై ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్కు ఎంపీలు ఉంటే లోక్‌సభలో కొట్లాడేవారు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బనకచర్ల లింకు ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని ఎండగట్టాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్కు లోక్‌సభలో డజను మంది ఎంపీలు ఉంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని ఆదేశించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించాలనే అభిప్రాయాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. ఎర్రవల్లి నివాసంలో మూడు రోజులుగా ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్న కేసీఆర్ శుక్రవారం కూడా సమావేశం కొనసాగించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు శుక్రవారం జరిగిన భేటీలో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. – రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయాలి. 8న కరీంనగర్లో సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల కోసం విజ్ఞప్తి చేద్దాం’అని కేసీఆర్ సూచించారు. – సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఉప ఎన్నికల సన్నద్ధతను ఇప్పటినుంచే ప్రారంభించాలని ఆదేశించారు. – స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా గట్టిగా కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తుందనే అంశంపై స్పష్టత లేదు. అయినా ఎన్నికల సన్నద్ధతకు పార్టీ నేతలు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలి. – స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దాం. ప్రభుత్వ విధానాలు, తెలంగాణకు జరిగే అన్యాయాలు, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యేలా కార్యాచరణ ఉంటుందని ఈ భేటీల్లో కేసీఆర్ ప్రకటించారు. -
గత ప్రభుత్వ వైఫల్యంతోనే వైటీపీఎస్ పనుల్లో జాప్యం
మిర్యాలగూడ: గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యంతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో ఆలస్యం జరిగిందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్) యూనిట్–1లో విద్యుత్ ఉత్పత్తిని ఆయన ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు లక్ష్మణ్‌కుమార్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. పవర్‌స్టేషన్‌లో మొత్తం ఐదు యూనిట్లు ఉండగా.. రెండో యూనిట్లో విద్యుత్ ఉత్పత్తిని ఈ ఏడాది జనవరి 21 సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఒక్కో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 800 మెగావాట్లు. ప్లాంట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. రెండు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, మిగతా మూడు యూనిట్లను డిసెంబర్ నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి 26 నుంచి పూర్తిగా జాతికి అంకితం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రెండేళ్లపాటు పర్యావరణ అనుమతులపై క్లియరెన్స్ తీసుకురాకపోవడంతోనే ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సమయాన్ని నిర్దేశించుకోని అనుకున్న కార్యాచరణ ప్రకారం సంవత్సరం, నెల, వారానికి చేయాల్సిన పనులపై కేలెండర్ ప్రకారం ముందుకు వెళ్లామని చెప్పారు. సంవత్సర కాలంలోనే రెండు యూనిట్లు పూర్తి చేశామని తెలిపారు. విద్యుత్ ఉత్పాదనతోపాటు వైటీపీఎస్‌లో అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠశాల ఏర్పాటు, పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆస్పత్రి, అంబులెన్స్ సేవలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిబ్బందికి క్వార్టర్స్ నిర్మిస్తున్నామని, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ముందుకెళుతున్నట్టు చెప్పారు. రహదారులు దెబ్బతినకుండా సీసీ రోడ్డు పనులు మొదలుపెట్టామన్నారు. భూములు కోల్పోయిన వారికి గత ప్రభుత్వం పరిహారాన్ని గాలికి వదిలేస్తే..తాము ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి ఉద్యోగాలు, పునరావాస కల్పనకు కృషి చేస్తున్నామని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు కింద నష్టపోయిన కొందరు రైతులకు కూడా వైటీపీఎస్‌లో ఉద్యోగాలు, పరిహారం అందచేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్‌నాయక్, నెల్లికంటి సత్యం, హైడల్ డైరెక్టర్ బాలరాజు, కోల్ డైరెక్టర్ నాగయ్య, థర్మల్ డైరెక్టర్ వై.రాజశేఖరరెడ్డి, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌మిత్తల్, జెన్కో సీఎండీ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త తరానికి చేరువవుదాం! : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం పదేళ్లపాటు అధికారంలో కొనసాగి ప్రస్తుతం ప్రతిపక్ష పాత్రకు పరిమితమైన బీఆర్ఎస్ కొత్త తరానికి చేరువ అయ్యేందుకు అనుసరించాల్సిన వ్యూహానికి పదును పెడుతోంది. తెలంగాణ అస్తిత్వ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో బీఆర్ఎస్ పాత్ర, నదీ జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల్సిన ఆవశ్యకత తదితరాలను విద్యార్థులు, యువతకు నూరిపోయాలని భావిస్తోంది. టీఆర్ఎస్గా అవిర్భవించి గత 25 ఏళ్లుగా బీఆర్ఎస్ సాగిస్తున్న ప్రస్థానం, ఉద్యమ నాయకుడిగా, ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చేసిన కృషిని వివరించాలని భావిస్తోంది. ఈ నెల 26న హైదరాబాద్‌లో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే విస్తృత స్థాయి సమావేశం తరహాలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ సదస్సులు నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితోపాటు మరికొందరు నేతలతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం భేటీలో కీలక అంశాలపై చర్చించడంతోపాటు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీం తీర్పు బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేసీఆర్ చర్చించారు. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల కోసం సన్నద్దమవుతూనే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించాలని కేటీఆర్‌ను ఆదేశించారు. ఆయా నియోజకవర్గాల్లో స్థితిగతులను మధింపు చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. మరోవైపు మూడు నెలల్లోగా అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌పై ఒత్తిడి పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనా ఈ భేటీలో చర్చించారు. బనకచర్లతో జరిగే నష్టంపై.. నదీ జల్లాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడంతోపాటు ప్రత్యేకించి గోదావరి–బనకచర్ల లింకు ప్రాజెక్టుతో రాష్ట్రానికి జరిగే నష్టంపై యువత, విద్యార్థులకు వివరించాలని కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఆగస్టు 1న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో సమావేశం నిర్వహిస్తున్నారు. సూర్యాపేట, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లోనూ త్వరలో ఈ తరహా సమావేశాలు జరుగుతాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో సదస్సులు నిర్వహించే బాధ్యతను బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, గాదరి కిషోర్, ఎర్రోల్ల శ్రీనివాస్‌కు అప్పగించారు. జల వనరుల నిపుణులు వి.ప్రకాశ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ సదస్సుల్లో ప్రసంగిస్తారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారును టీడీపీ, బీజేపీ నడిపిస్తున్నాయనే విషయాన్ని విడమరిచి చెప్పాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా బీఆర్ఎస్ లక్ష్యంగా చేస్తున్న రాజకీయాలను విడమరిచి చెప్పాలని సూచించారు. దృష్టి మళ్లించేందుకే విచారణలు ఎన్నికల హామీల అమలు, పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనాల్సిన తీరుపై కేసీఆర్ లోతుగా విశ్లేషించినట్లు సమాచారం. కాళేశ్వరం, విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు తదితరాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్ విచారణకు తాను, హరీశ్ హాజరుకావడం ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలు పటాపంచలు అయినట్లు కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఏయే అంశాలు ఉండొచ్చనే కోణంలోనూ చర్చ జరిగినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్ పార్టీ తాను తీసుకున్న గోతిలో తానే పడిందని, బయటపడే మార్గం కోసం వెతుకుతూ మరింత లోతుగా కూరుకుపోతోందనే అభిప్రాయం కేసీఆర్ భేటీలో వ్యక్తమైంది. కాంగ్రెస్ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 8న కరీంనగర్లో నిర్వహించే బీసీ సభ ఏర్పాట్ల బాధ్యతను మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు అప్పగించారు. పార్టీ బీసీ నేతలు మధుసూదనాచారి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, బండా ప్రకాశ్ శుక్రవారం కరీంనగర్‌కు వెళ్లి సభ నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించాలని కేసీఆర్ ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాల వారీగా సమన్వయం, అభ్యర్థుల ఎంపిక, ప్రచారం తదితరాలకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు జిల్లాల వారీగా కీలక నేతలు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. -
3 నెలల్లో తేల్చండి
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుకు సంబంధించి స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లక్ష్యాన్ని నీరుగార్చుతుంది. అలాగని మేం ఇప్పుడు ఏ ఆదేశాలూ జారీ చేయకపోతే.. ‘ఆపరేషన్ సక్సెస్–పేషెంట్ డెడ్’ అన్నట్లుగా ఉంటుంది. స్పీకర్ తన ప్రస్తు త వైఖరిని పునరావృతం చేయడానికి దోహదపడినట్లు అవుతుంది.. – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం శాసనసభ స్పీకర్‌కే ఉందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తెలంగాణలో పార్టీ మారి అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో తీర్పు వెలువరించిన రోజు నుంచి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ సభాపతి కార్యాలయానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనర్హత పిటిషన్లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ఎవరూ విచారణను ఆలస్యం చేయడాన్ని అనుమతించకూడదని పేర్కొంది. విచారణను ఆలస్యం చేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే తీవ్రంగా పరిగణించాలని చెప్పింది. మరోవైపు అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఏడు నెలలు.. 9 సార్లు విచారణ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 15న బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌లు స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) దాఖలు చేశారు. మిగిలిన ఏడుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికెపూడి గాంధీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లు దాఖలైన తర్వాత దాదాపు ఏడు నెలల్లో తొమ్మిది సార్లు సుప్రీంకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, మోహిత్ రావు, స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, తదితరులు వాదనలు వినిపించారు. గత ఏప్రిల్ 3న విచారణ ముగించి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం.. గురువారం తీర్పు వెలువరించింది. ఎంత సమయం కావాలని ముందే అడిగాం.. ‘2025 జనవరి 15న సుప్రీంకోర్టు ముందు కేసు దాఖలైన తర్వాత 16న తొలిసారిగా మేం కొందరికి నోటీసులు జారీ చేశాం. ఫిబ్రవరి 3న జరిగిన విచారణ సందర్భంగా.. ఫిబ్రవరి 4న మరికొందరికి నోటీసులు జారీ చేశాం. జనవరి 31న తొలుత ఈ కేసు విచారణకు వచ్చినప్పుడే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు స్పీకర్‌కు ఎంత సమయం అవసరమో తెలుసుకోవాల్సిందిగా మేము సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గికి సూచించాం..’ అని ధర్మాసనం తెలిపింది. ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’లా ఉండాలి ‘10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా పని చేస్తున్నప్పటికీ, ఆయన ఎటువంటి రాజ్యాంగపరమైన రక్షణ (కానిస్టిట్యూషనల్ ఇమ్యూనిటీ)ను పొందలేరు. నిజానికి ఈ కేసును విచారించిన సింగిల్ జడ్జి అనర్హత పిటిషన్లపై విచారించేందుకు సమయాన్ని నిర్ణయించమని స్పీకర్‌కు సూచించారు. అందుకు నాలుగు వారాల గడువిచ్చారు. అంతేకానీ పిటిషన్లపై నిర్ణయం తీసుకోమని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. అయినప్పటికీ.. హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పడం ద్వారా డివిజన్ బెంచ్ తప్పిదానికి పాల్పడింది. ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు లేకపోయినా తెలంగాణ శాసనసభ కార్యదర్శి సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేయడం సరైంది కాదు. ఇకపై ఈ కేసు ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ నాట్ డెడ్’ లా ఉండాలి..’ అని సుప్రీంకోర్టు (నవ్వుతూ) వ్యాఖ్యానించింది. విచారణను పొడిగించేందుకు అనుమతి వద్దు ‘అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను పొడిగించడానికి స్పీకర్ అనుమతించకూడదు. స్పీకర్ నిర్ణయాలపై న్యాయ సమీక్షకు అధికారాలు (కిహోటో హోల్లొహన్ (10వ షెడ్యూల్ సమర్థించిన) కేసులో తీర్పు నిష్పత్తిని ప్రస్తావిస్తూ) ఇరుకైన పరిధిలో (న్యారో కంపాస్) ఉన్నాయి. అలాగే స్పీకర్ నిర్ణయాలు న్యాయ సమీక్షకు పూర్తిగా అతీతం కాదు. స్పీకర్లు అనర్హత పిటిషన్లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచే పరిస్థితిని రాజ్యాంగ ధర్మాసనం ఊహించి ఉండకపోవచ్చు. అనర్హత పిటిషన్లను స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయించాలని కీషమ్ మేఘచంద్ర సింఘ్ కేసులో తీర్పు ఉంది. శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపుల పిటిషన్లను నిరీ్ణత సమయంలోగా నిర్ణయించాలని మహారాష్ట్ర స్పీకర్‌కు జారీ అయిన ఆదేశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది..’ అని న్యాయమూర్తులు తెలిపారు. జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం ‘అనర్హత పిటిషన్లపై నిర్ణయాధికారం స్పీకర్‌కే ఇచ్చాం. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో స్పీకర్ తగిన సమయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. అయితే అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునఃపరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. మనం దీనిని ఎదుర్కొనకపోతే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది..’ అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. అనర్హతల విషయంలో స్పీకర్ నిర్ణయాధికారాన్ని పార్లమెంట్ పునః పరిశీలించాలి. రాజకీయ ఫిరాయింపులు అనేవి జాతీయ ఆందోళనకు సంబంధించిన అంశం. వీటిని ఎదుర్కొనకపోతే మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. 10 షెడ్యూల్ కింద స్పీకర్ ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తున్నప్పటికీ..ఆయన ఎటువంటి ‘‘రాజ్యాంగపరమైన రక్షణ’’ని పొందలేరు. అనర్హత పిటిషన్లను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పొడిగించుకుంటూ పోవడానికి వీల్లేదు..– సుప్రీంకోర్టు ధర్మాసనంబీఆర్ఎస్ నేతల అభ్యర్థన తోసిపుచ్చిన ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. కిహోటో హోల్లోహన్, సుభాష్ దేశాయ్ తదితరుల కేసులకు సంబంధించి రాజ్యాంగ బెంచ్ తీర్పును ప్రస్తావించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని స్పష్టం చేసింది. ‘అయితే, ఫిరాయింపులు జరిగినప్పుడు అనర్హత అంశాన్ని తేల్చే ముఖ్యమైన బాధ్యతను స్పీకర్‌కు లేదా చైర్మన్‌కు అప్పగించే యంత్రాంగం వల్ల రాజకీయ ఫిరాయింపులను సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నామా.. లేదా? అనే అంశాన్ని మాత్రం పార్లమెంట్ పరిశీలించాలి. ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలంటే, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలంటే ప్రస్తుత యంత్రాంగం సరిపోతుందా? లేదా? అనే విషయం కూడా పార్లమెంటే తేల్చాలి..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై తేల్చే అత్యంత ముఖ్యమైన బాధ్యతను పార్లమెంట్ స్పీకర్‌కు అప్పగించినప్పుడు ఆ హోదాలో ఉన్నవారు ఎంతవేగంగా చర్యలు తీసుకున్నారనేది ప్రధానమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. షెడ్యూల్ 10 ఏం చెబుతోంది..ఇది పార్టీల నుంచి ఫిరాయింపులను నిరోధించడానికి రూపొందించింది. దీన్ని ఫిరాయింపుల నిరోధక చట్టం అని కూడా అంటారు. రాజకీయ స్థిరత్వం, ప్రజాస్వామ్య ప్రక్రియ పరిరక్షణ, విలువలను కాపాడటం కోసం దీన్ని ఉద్దేశించారు. ప్రజాప్రతినిధులు పార్టీలు ఫిరాయించకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని ప్రకారం..పార్టీ ఆదేశాలు చట్టసభల సభ్యులు పాటించాలి. పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా ఓటు వేసినా లేదా పార్టీ నుంచి వైదొలిగినా చట్టసభల సభ్యులను అనర్హులుగా ప్రకటించవచ్చు. ఫిరాయింపుల అంశాల్లో కోర్టులకు అధికార పరిధి ఉండదు. స్పీకర్ లేదా చైర్మన్ నిర్ణయమే అంతిమం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరితే సభలో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడు. ఒకవేళ ఒక పార్టీ మరో పార్టీలో పూర్తిగా విలీనమైతే అనర్హత వర్తించదు. సభ్యుని అనర్హతపై ఏ కోర్టుకు అధికార పరిధి ఉండదు. -
సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్
-
ఆగస్టు 8న కరీంనగర్లో బీఆర్ఎస్ ‘బీసీ గర్జన’
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థలతోపాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న కరీంనగర్లో బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. బీసీల కు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ సభ ద్వారా బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీజేపీ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై త్వరలో బీఆర్ఎస్ బీసీ ప్రతినిధులం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు.తెలంగాణభవన్‌లో తలసాని అధ్యక్షతన మంగళవారం బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీసీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, కాంగ్రెస్, బీజేపీ విధానాలపై చర్చించారు. అనంతరం మాజీమంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ తదితరులతో కలిసి తలసాని మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండగానే, ఆర్డినెన్స్ తెస్తామనడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు.9వ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చితేనే చట్టబద్ధత లభిస్తుందని తాము అసెంబ్లీ వేదికగా చెప్పామన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రజలను మభ్యపెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఢిల్లీలో ధర్నాపేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాను మొదలు పెట్టిందని తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతోపాటు, ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులకు బీసీ సామాజికవర్గానికి ఇవ్వాలని తలసాని డిమాండ్ చేశారు. ⇒ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలవుతున్నదని మధుసూదనాచారి విమర్శించారు. బీసీలకు రక్షణ కవచంలా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని, బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ కుటిలనీతిని ఎండగడతామన్నారు. ⇒ ఒక్కో పార్లమెంట్ స్థానం పరిధిలో రెండేసి అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీ మోసగించిందని గంగుల కమలాకర్ విమర్శించారు. వచ్చే నెల ఐదో తేదీ నుంచి మూడురోజుల పాటు ఢిల్లీలో ఉంటామని చెబుతున్న సీఎం, మంత్రులు ఆ తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ఏం చేస్తారో చెప్పాలన్నారు. ⇒ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలను మోసగిస్తూ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకాల్లో మొండిచేయి చూపుతోందని శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. ⇒ ప్రచారయావ మినహా బీసీ బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బండా ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు. -
ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ చెప్పారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎంపీ సీఎం రమేశ్ ఇంటికి కేటీఆర్ లేదా నేను వెళితే తప్పు ఏంటి? మమ్మల్ని ఈడీ, సీబీఐ పేరుతో భయపెడితేనే బీజేపీలోకి వెళ్లామని..మేం ఎప్పటికీ చంద్రబాబు మనుషులమేనని సీఎం రమేశ్ మాతో చెప్పారు’ అని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. నీ జీవితకాలంలో ఎక్కువ రోజులు.. చంద్రబాబు ఇంట్లో, ఢిల్లీలోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసంలోనే ఉన్నావు. సీసీటీవీ ఫుటేజీ తీద్దాం పదా.. నువ్వు, నీ తమ్ముడు ఎన్ని రోజులు తుగ్లక్ రోడ్‌లోని నివాసంలో ఉన్నారో చూద్దాం’ అని జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు.ఆదివారం తెలంగాణభవన్‌లో విలేకరులతో మాట్లాడా రు. ‘రేవంత్‌రెడ్డి మాటలు వింటే గోబెల్స్ ఆత్మహత్య చేసుకుంటారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్ గోబెల్స్‌ను మించిపోయారు. జైపాల్‌రెడ్డికి ఉన్న మంచిపేరును తన ఖాతాలో వేసుకోవాలని రేవంత్ ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి..నాడు నోట్ల కట్టలతో దొరికినట్టు..నేడు బనకచర్ల విషయంలో దొరికిపోయారు. రేవంత్‌రెడ్డి కుర్చీలో ఐదేళ్లు ఉండాలని మేము కోరుతున్నాం. కానీ, ఆయనన్ను ఎప్పుడు పీకేస్తారో తెలియదు. ఎవరెవరు రెచి్చపోతున్నారో వాళ్ల సంగతి మేం చూసుకుంటాం’అని జగదీశ్‌రెడ్డి అన్నారు.‘పార్లమెంట్ ఎన్నికల ముందు బీజేపీతో పొత్తు అంటే కేసీఆర్ మమ్మల్ని పిలిచి అరిచారు. బీజేపీ తెలంగాణకు పనికివచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ భావజాలం వేరు..బీజేపీ భావజాలం వేరు. రాబోయే రోజుల్లో దేశ ప్రభుత్వాన్ని నడపటంలో కేసీఆర్ కీలకం అవుతారు. బీజేపీ వచ్చి బీఆర్ఎస్ పార్టీలో విలీనం అవుతామన్నా కేసీఆర్ ఒప్పుకోరు. బ్రోకర్లు మాట్లాడితే అది పట్టించుకోవద్దు’అని జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘అబద్ధం సిగ్గుపడేలా మాట్లాడు తున్న రేవంత్‌రెడ్డి ఆస్కార్ అవార్డుకు అర్హుడు. ఆయనకు స్క్రిప్ట్ రాసిస్తున్న వారు రేవంత్‌రెడ్డి పరువు తీస్తున్నారు. సహచర మంత్రులంటే భయంతోనే సీఎం వాళ్ల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు. అందుకే ఒక మంత్రి ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి డబ్బా ఫోన్ వాడుతున్నారు’అని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. -
కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక కష్టాలు పోతాయని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేటీఆర్ మాట్లాడారు. ‘తెలంగాణ ఉన్నంతకాలం బీఆర్ఎస్ ఉంటుంది. ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యాక మన కష్టాలు తీరుతాయి. పలు పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్.. బీజేపీలో కలుస్తుందని ఏదోదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఎక్కడికి పోదు.. తెలంగాణ ఉన్నంత కాలం బీఆర్ఎస్ ఉంటది. ఎవ్వరితో కలిసే కర్మ మనకు లేదు. ప్రభుత్వాన్ని నడపడానికి లంకెబిందేలు, గళ్ల పెట్టెలో పైసలు కాదు..దమ్ముండాలి. ప్రభుత్వాన్ని నడిపెటోడు మొగోడైతే.. నడిపేటోనికి దమ్ముంటే పనైతది.కరోనా సమయంలో ఆర్ధిక సంక్షోభం ఉన్నా సంక్షేమ పథకాలు నడిపిన మొగోడు కేసీఆర్’ అని అన్నారు. -
‘మా పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు’
వరంగల్ : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్ర హాఫ్ సెంచరీ దాటిందని చమత్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు(ఆదివారం. జూలై 27) వరంగల్ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన కవిత.. ‘ఆగస్టు 6 జయశంకర్ సర్ పుట్టినరోజున తెలంగాణ జాగృతి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. ఆగస్టు 6న వరంగల్ లో పెద్దఎత్తున జాగృతి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆ రోజే తెలంగాణ జాగృతి శాఖలను ప్రకటిస్తాం, బీఆర్ఎస్ పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు. జాగృతిని బలోపేతం చేయడమే మా లక్ష్యం. అన్ని చోట్ల తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకుఉ కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. -
అందుకే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తామన్నారు: బండి సంజయ్
కరీంనగర్: బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో లేరని, ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ను నడిపే స్థితిలో లేకే బీజేపీలో విలీనం చేస్తామన్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ రోజు(ఆదివారం, జూలై 27) కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. సీఎం రమేశ్‌పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.‘సిరిసిల్ల టికెట్‌ను మొదట కేటీఆర్‌కు ఇవ్వకపోతే, టికెట్ ఇప్పించాలని సీఎం రమేశ్‌ని కలిశారు. కేటీఆర్‌కు సీఎం రమేశ్ టికెట్ ఇప్పించారు.. ఆర్థికసాయం కూడా చేశారు. సీఎం రమేశ్ సవాల్‌పై కేటీఆర్ చర్చకు సిద్ధమా?’ అని ప్రశ్నించారు బండి సంజయ్. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమన్నారు. కాగా, దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలో జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ. 1,137 కోట్ల అమృత కాంట్రాక్ట్ ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. . రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని కేటీఆర్ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండి సంజయ్.. సీఎం రమేశ్ సవాల్‌కు కేటీఆర్ సిద్ధంగా ఉంటే, తాను తీసుకు వస్తానన్నారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు. -
తెలంగాణలో కుమ్మక్కు రాజకీయం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ /సాక్షి, అనకాపల్లి: ‘దేశంలో ఎక్కడా లేని రీతిలో దిక్కుమాలిన కుమ్మక్కు రాజకీ యం తెలంగాణలో జరుగుతోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బావమరిదికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు ఇచి్చంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రూ.1,660 కోట్ల రోడ్డు కాంట్రాక్టు కట్టబెట్టింది. ఇంతకంటే దిగజారుడు రాజకీయం..దౌర్భాగ్యపు దందా మరొకటి ఉండదు. ఎక్కడా లేని ఫ్యూచర్‌సిటీ రోడ్డు కోసం రూ.1,660 కోట్ల కాంట్రాక్టు విడ్డూరం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇద్దరూ కలిసి చేసిన దొంగతనం బయటపడటంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు పనికిమాలిన కథలు చెబుతున్నారని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు దోచుకునే లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును సృష్టించారు. నిబంధనలను అతిక్రమించి కాంట్రాక్టును అనుకున్న వారికి కట్టబెట్టడం సీఎం రేవంత్‌రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. రూ.10 వేల కోట్ల దోపిడీకి సహకరించినందుకు సీఎం రమేశ్‌కు దక్కిన రిటర్న్ గిఫ్ట్ రూ.1660 కోట్లు. ఈ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే పసలేని చెత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసం పుట్టి ఇక్కడి ప్రజల కోసం పోరాడే పార్టీ ఇప్పటికీ, ఎప్పటికీ ఏ పారీ్టలోనూ విలీనమయ్యే ప్రసక్తే లేదని ప్రజలకు తెలుసు. ఇరకాటంలో పడిన ప్రతీసారి కాంగ్రెస్, బీజేపీ విలీనం అంటూ తెలంగాణ ప్రజలను గందరగోళానికి గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం రమేశ్, సీఎం రేవంత్ ఇద్దరూ కలిసి వస్తే రూ.10 వేల కోట్ల హెచ్‌సీయూ భూముల కుంభకోణం, రూ.1660 కోట్ల రోడ్డు కుంభకోణంపై చర్చించేందుకు సిద్ధం’అని కేటీఆర్ ప్రకటించారు. అదంతా అవాస్తవం: సీఎం రమేశ్ అంతకుముందు బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ అనకాపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో తాను కుమ్మకై కాంట్రాక్ట్ పొందాననేది పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు. అయితే, కేటీఆర్ ప్రశ్నించిన అంశాలకు సమాధానం ఇవ్వడానికి బదులుగా.. బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలకే సీఎం రమేశ్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కేటీఆర్‌కు తన సోదరితో ఉన్న ఇంటిపోరుతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి కేటీఆర్ మాట్లాడింది గుర్తుందా అని ప్రశ్నించారు. కావాలంటే తన ఇంటికి వచ్చిన సీసీ ఫుటేజీని మీడియాకు పంపిస్తానన్నారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి బయటపడకుండా, తన సోదరి కవితను వదిలేయడానికి ఏర్పాట్లు చేస్తే బీజేపీలోకి బీఆర్ఎస్ను కలపడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెప్పిన మాటలు గుర్తులేవా అని నిలదీశారు. -
‘నేను జైల్లో ఉన్నప్పుడు మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ వచ్చి..’
హైదరాబాద్: కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కౌంటర్లకు రీ కౌంటర్లు అన్నట్లు ఇరు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే బీజేపీ-కాంగ్రెస్‌లు కలిసి కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాయన్న బీఆర్ఎస్ వర్కింగ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటరిచ్చారు. తన సోషల్ మీడియా అకౌంట్ ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్పై మండిపడ్డారు. ‘ నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్, మా బావ హరీష్ రావు ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా! అని వాళ్లకు చెప్పాను.సుమారు నాలుగైదు నెలల క్రితం జాగృతి కవిత ఈ breaking news ను ఈ రాష్ట్రంలో తనకు సన్నిహితులైన దాదాపు అన్నీ ఛానెళ్ల, పత్రికల ప్రతినిధులకు రకరకాల రూపంలో స్వయంగా లీక్ ఇచ్చింది. పాపం ఆవిడ breaking ఆవేదనను ఎవరూ అర్థం చేసుకోలేదు. సింగిల్ కాలం వార్త కూడా వేయలేదు.ఆ తర్వాత ఆమె రాసిన లేఖ లీకు అందిరికీ తెలిసిన విషయమే’ అంటూ పోస్ట్ పెట్టారు ఎంపీ చామల. “నేను జైల్లో ఉన్నప్పుడు…మా అన్న కేటీఆర్…మా బావ హరీష్ రావు… ఇద్దరూ వచ్చి మన పార్టీని BJP లో విలీనం చేద్దామనుకుంటున్నాం… ఏమంటావ్!?” అని అడిగారు. “మీరు విలీనం చేసుకుంటామంటే చేసుకోండి… నాకు సంబంధం లేదు. బయటకు వచ్చాక కూడా అదే చెబుతా!” అని వాళ్లకు చెప్పాను. సుమారు నాలుగైదు… pic.twitter.com/38Qrgs6NoE— Kiran Kumar Chamala (@kiran_chamala) July 26, 2025 -
‘అసెంబ్లీ’కి ప్రీఫైనల్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు ప్రీఫైనల్ లాంటివని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పార్టీ యంత్రాంగం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఇంటింటికీ తిరిగి వివరించాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన కేడర్‌ను గెలిపించుకుంటామని భరోసా ఇచ్చారు. వికారాబాద్, సిర్పూర్ కాగజ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు బుధవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్ ఒకే తాటిపైకి వచ్చి పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని, బాల్కొండ పోలీసు స్టేషన్లో కాంగ్రెస్ నేతలు ప్రెస్‌మీట్ పెట్టడమే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. మల్కాజిగిరిలో గూండాలు రోడ్డు మీద షో చేసినా పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో బీఆర్ఎస్ విజయం సాధిస్తే అధికారులందరూ తమ పద్ధతి మార్చుకుంటారన్నారు. స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలుగా గెలుపొందితే అధికారుల వేధింపులకు అవకాశం ఉండదని చెప్పారు. కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం ‘పదేళ్ల అధికారాన్ని తపస్సుగా భావించి తెలంగాణలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేశాం. ప్రజల కోసం పనిచేసే క్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోలేదనేది వాస్తవం. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పును పునరావృతం చేయకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలను కళ్లలో పెట్టుకుని చూసుకుంటాం. బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో 6.5 లక్షల రేషన్ కార్డులను అర్హులకు ఇచ్చాం. మీ సేవ కార్యాలయాల్లో ఇచ్చే రేషన్ కార్డులను కూడా పెద్దసభలు పెట్టి పంపిణీ చేస్తూ రేవంత్ గొప్పగా చెప్పుకుంటున్నాడు. కాంగ్రెస్ పట్ల అసంతృప్తితో ఉన్న ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టేందుకు సిద్దంగా ఉన్నారు. ముఖం బాగా లేక అద్దం పగలగొట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆనంద్, మహేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నూలి శుభప్రద్ పటేల్ పాల్గొన్నారు. -
స్థానిక పోరు.. కారు హుషారు!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఈ వారాంతంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ప్రకటించారు. ఆలోగా జిల్లాలు, నియోజకవర్గాలవారీగా సమావేశ తేదీలను నిర్ణయించే బాధ్యతను మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలకు అప్పగించారు. ఈ సమావేశాలకు పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలతోపాటు జిల్లా ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, అభ్యర్థుల ఎంపికలో అనుసరించే విధివిధానాలను కేసీఆర్ దిశానిర్దేశానికి అనుగుణంగా పార్టీ కేడర్‌కు వివరించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలతోపాటు సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించనున్నారు. 20 నెలలుగా కాంగ్రెస్ పాలనా వైఫల్యాలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య లోపం, బీసీ రిజర్వేషన్లలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాలపై కేడర్‌కు అవగాహన కల్పించనున్నారు. సమన్వయ కమిటీల ఏర్పాటుపై కేటీఆర్ దృష్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతర్గతంగా సమన్వయం కోసం పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటుపై కేటీఆర్ దృష్టి సారించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఈ కమిటీల్లో చోటు కల్పించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్చార్జి సమన్వయకర్తగా వ్యవహరించే కమిటీల్లో గ్రామాలవారీగా రాజకీయ పరిస్థితులను మదింపు చేయనున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల అధారంగా అభ్యర్థుల ఎంపిక, ఇతర పార్టీల నుంచి చేరికలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీకి దూరమైన నాయకులు, కార్యకర్తలను తిరిగి చేర్చుకోవడం వంటి అంశాలపై సమన్వయ కమిటీలు దృష్టి సారించనున్నాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించిన చర్చ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో వారికి ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. మరోవైపు అవసరమైన చోట ముఖ్య నేతలను కూడా ప్రచార బరిలోకి దించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు మాజీ మంత్రులు ప్రచార కమిటీల్లో ఉంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. స్థానిక ఎన్నికలు జరగని హైదరాబాద్, మేడ్చల్ జిల్లా పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు కూడా ఇతర జిల్లాల్లో సమన్వయం, ప్రచార బాధ్యతలు అప్పగించాలని పార్టీ భావిస్తోంది. స్థానిక ఎన్నికలపై సర్వేలు స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలు, నియోజకవర్గ ఇన్చార్జీల పనితీరు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, కాంగ్రెస్, బీజేపీలపై ఓటర్ల మనోగతం తదితరాలపై ఇటీవల బీఆర్ఎస్ తరఫున కొన్ని సర్వేలు జరిగాయి. ఈ సర్వే ఫలితాలను విశ్లేషించిన బీఆర్ఎస్.. 31 జిల్లా పరిషత్‌లకుగాను 18 నుంచి 20 జిల్లా పరిషత్‌లను గెలుచుకుంటామని అంచనా వేస్తోంది. రిజర్వేషన్ల ఖరారు తర్వాత జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపికలోనూ సర్వే ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ నెల 24న కేటీఆర్ జన్మదిన వేడుకల అనంతరం పార్టీ యంత్రాంగాన్ని స్థానిక ఎన్నికలకు సిద్ధం చేసేలా కార్యాచరణ వేగవంతం చేస్తామని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
డీలిమిటేషన్‌పై బీజేపీని నమ్మలేం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర భారతదేశంలోని ఎంపీల సంఖ్యపై ఆధారపడి ఏర్పడే కేంద్ర ప్రభుత్వం.. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే అవకాశం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు అన్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి ఒక్క రాష్ట్రం ఎంపీలే కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదని తెలిపారు. జైపూర్‌లో జరుగుతున్న ‘టాక్ జర్నలిజం’9వ ఎడిషన్ చర్చా కార్యక్రమంలో కేటీఆర్ ఆదివారం మాట్లాడారు. జనాభా నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరగనివ్వబోమని బీజేపీ ప్రభుత్వం చెబుతున్న మాటలను నమ్మలేమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే స్థానాలు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు పెంచలేదని గుర్తుచేశారు. అడగకముందే వారి రాజకీయ ప్రయోజనాల కోసం జమ్మూకశ్మీర్, అస్సాంలో మాత్రం అసెంబ్లీ సీట్లను పెంచారని మండిపడ్డారు. మంద బలం, అధికారం ఉందన్న అహంకారంతో జాతీయ భాషగా హిందీని బలవంతంగా రుద్దుతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీ లన్నీ ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని తెలిపారు. ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉంది. తనకు ఇష్టం వచ్చిన పనులు చేస్తానని బీజేపీ అనుకుంటే.. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఆ పార్టీ నే బాధ్యత వహించాల్సి ఉంటుంది’అని స్పష్టంచేశారు. బిహార్ ఓటర్ సర్వేపై అనుమానాలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా తన ఓటు హక్కును కోల్పోకూడదని కేటీఆర్ అన్నారు. బిహార్‌లో జరుగుతున్న ఓటర్ల సవరణ మొదటిసారి కానప్పటికీ దానిపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయని, కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బిహార్ పరిణామాలపై తమకు చాలా అభ్యంతరాలు ఉన్నాయని, దేశంలోని మిగతా రాష్ట్రాలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో గెలవడం కోసం ప్రజల మధ్య విభేదాలు, విద్వేషాలు సృష్టించడం చాలా సులభమని అన్నారు. బిహార్ పరిణామాలు ప్రజలను విడగొట్టే రాజకీయ కుట్రలో భాగమేనని అనుమానం వ్యక్తంచేశారు. ఎన్నికల తరువాత ఫలితాలపై మాట్లాడటం కంటే ముందే ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలని సూచించారు. బిహార్‌లో 5 లక్షల మంది ఓట్లు గల్లంతు కావటం ఆందోళన కలిగించే విషయమని అన్నారు. గత ఎన్నికల్లో కేవలం 12,500 ఓట్ల తేడాతో అక్కడ ఆర్జేడీ అధికారాన్ని కోల్పోయిందని గుర్తుచేశారు. ముందు దేశం.. ఆ తర్వాతే ప్రాంతం, మతం, కులం అని స్పష్టంచేశారు. -
సీఎం రేవంత్ అబద్దాలు మాట్లాడుతున్నారు
-
తెలంగాణ రాజకీయాలలో హీట్ పుట్టించిన కవిత, మల్లన్న వివాదం
-
మల్లన్నపై దాడి.. కొత్త పార్టీ ప్రకటనతో రాజకీయ వేడి
సాక్షి,హైదరాబాద్:తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కొత్త పార్టీని స్థాపించనున్నట్లు ప్రకటించారు. బీసీలను ఏకం చేస్తూ ఈ పార్టీ భవిష్యత్ కార్యచరణ ఉంటుందని ప్రకటించడం పొలిటికల్ హీట్‌ను మరింత పెంచింది.తీన్మార్ మల్లన్న కార్యాలయంలో కాల్పులుబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుబడుతూ మల్లన్న పలు వ్యాఖ్యలు చేశారు. మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిపల్లిలోని ఆయన ఆఫీస్‌పై దాడి చేశారు. అయితే, దాడితో అప్రమత్తమైన తీన్మార్ మల్లన్న గన్మెన్లు గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు.తెలంగాణ మరో కొత్త రాజకీయ పార్టీ జాగృతి కార్యకర్తల దాడిపై తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. నాపై హత్యాయత్నం జరిగింది. నన్ను కాపాడేందుకు గన్ మెన్ ఫైర్ చేశారు. దాడి నాపై చేసి.. కవిత డీజీపీకి ఫిర్యాదు చేయడం సిగ్గు చేటు. పక్కా ప్లాన్ ప్రకారం దాడి చేశారు. దాడికి ఉసిగొల్పిన కవిత శాసన మండలి సభ్యత్వం రద్దు చేయాలి. త్వరలో రాజకీయ పార్టీ పెడతా.. బీసీలను ఏకం చేస్తానని తెలిపారు. గతంలో తెలంగాణ నిర్మాణ పార్టీ’ 2023లో తీన్మార్ మల్లన్న ఓ కేసులో భాగంగా చర్లపల్లి జైలులో శిక్షను అనుభవించారు. చర్లపల్లి జైలు నుంచి విడుదల అనంతరం ‘తెలంగాణ నిర్మాణ పార్టీ’ పేరుతో రాజకీయపార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో (2024) మేడ్చల్ అసెంబ్లీ స్థానం నుంచి తన పార్టీ తరఫున పోటీ చేస్తానని తెలిపారు.అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు ప్రజల మనోభావాలు గౌరవించేందుకు కాదని, మహారాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశం కోసమేనని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చేది యువతేనని..రైట్ రీ కాల్ తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి తీన్మార్ మల్లన్న తాను కొత్త రాజకీయ పార్టీని పెట్టనున్నట్లు ప్రకటించడం గమనార్హం. -
‘కవిత ఏ పార్టీ అన్నది అర్ధం కావడం లేదు’
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చరిత్రాత్మక నిర్ణయమని పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. దేశ చరిత్రలో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. సామాజిక విప్లవానికి నాంది పలికిన ఈ సందర్భంలో తాను టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండటం జీవితంలో తాను చేసుకున్న అదృష్టమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.బీసీ రిజర్వేషన్ల పట్ల తమకు కితాబు ఇవ్వకపోయినా పరవాలేదు కానీ కనీసం హర్షించే స్థితిలో లేకపోవడం దౌర్బగ్యమని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ తీసుకొచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ వారి హయాంలో మద్దతు ప్రకటించిందన్నారు. బీసీల పట్ల బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్. ఆనాడు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించానని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకే కట్టుబడి ఉందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.కవిత ఏ పార్టీ అన్నది అర్ధం కావడం లేదుప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏ పార్టీలో ఉందనే విషయం అర్థం కావడం లేదని సెటైర్లు వేశారు మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్లో దెయ్యాలు ఉన్నాయా? లేదా?, దెయ్యాల పీడ వదిలిందా?, కవిత ఎందుకు స్పందించడం లేదు? అని టీపీసీసీ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. కవిత బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. బీసీ రిజర్వేషన్లపై కవిత సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. -
పవర్ షేరింగ్ ఏమీ లేదు: మల్లు భట్టి విక్రమార్క
ఢిల్లీ : బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, అదే సమయంలో జనాల్లోకి కూడా వెళ్లడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. ఈరోజ(శక్రవారం, జూలై 11వ తేదీ) ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న మల్లు.. తమ ప్రభుత్వంలో అంతా కలిసికట్టగా పనిచేస్తన్నారని, ఇక్కడ పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని మల్లు తెలిపారు. అందరం కలిసి టీమ్ వర్క్‌గా పనిచేస్తన్నామన్నారు.‘రెండు లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది విధాన నిర్ణయం. రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణ మాఫీ. సన్నం బియ్యం సక్సెస్ అయ్యింది. మహిళలకు ఉచిత బస్సుకు మంచి స్పందన ఉంది. ఫోర్త్ సిటీ పనులు జరుగుతున్నాయి. మూసి సుందరీకరణ ఈ ప్రభుత్వం హయంలో పూర్తి అవుతుంది.రీజినల్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చేది లేదు. సిగాచి ప్రమాదం పై విచారణ కు ఆదేశించాము. ఇటీవల జరిగిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో ఖర్గే,కేసి వేణుగోపాల్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉంది’ అని మల్లు తెలిపారు. -
అన్నదాత అరిగోస
పొలాల్లో వానాకాలం పంట పనుల్లో తలమునకలై ఉండాల్సిన రైతన్న ఆగమా గమవుతున్నాడు. బస్తా యూరియా కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన దుఃస్థితి మళ్లీ వచ్చింది. రైతు ఆధార్ కార్డు ఇస్తేగానీ యూరియా బస్తా ఇవ్వడం లేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతన్నలు ఎన్ని అగచాట్లు పడ్డారో మళ్లీ అవే పరిస్థితులు వచ్చాయి. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నడి బజార్లో నిలబెట్టింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఎప్పటికి అమలవుతుందో తెలియని పరిస్థితి. ఒక్కో రైతుకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని నమ్మబలికి, సగం మంది రైతులకు మాత్రమే మాఫీ వర్తింపజేశారు. మిగిలిన రైతులందరూ బ్యాంకులు, సొసైటీల్లో ఉన్న అప్పులను తిరిగి చెల్లించేందుకు అవస్థలు పడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు రుణాలు చెల్లించకపోతే సొసైటీ అధికారులు, బ్యాంకర్లు రైతన్నల ఇంటి తలుపులు, బిందెలు, ఇతర సామగ్రి జప్తు తీసుకు పోయిన దృశ్యాలు ఇందిరమ్మ రాజ్యంలో మళ్లీ అగుపిస్తున్నాయి.కొందరు రైతులు రుణాలు తిరిగి చెల్లించలేదని పేర్కొంటూ వారి ఆస్తులు జప్తు చేసేందుకు సైతం అధికారులు నోటీసులు ఇవ్వడం ఈ ప్రభుత్వంలోనే ఆవిష్కృతమయ్యింది.చేతులు దులుపుకొన్నారు!తెలంగాణలో పంటల బీమా పథకం అమలు కావడం లేదనీ, కాంగ్రెస్‌ను గెలిపిస్తే బీమాతో ఆపన్న హస్తం అందిస్తామనీ ఇచ్చిన హామీ అతీగతీ లేదు. పంటల బీమాకు రూ.1,400 కోట్ల బీమా ప్రీమియం కూడా చెల్లించలేదు. కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ప్రకృతి విపత్తులతో రైతులు పంట నష్టపోతే వారికి పరిహారం వచ్చే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసింది. కేసీఆర్ పాలనలో అకాల వర్షాలు, వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ పరంగా పరిహారం చెల్లించేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాన్ని కూడా అటకెక్కిచ్చింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లతో 55 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టుగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఒక్కో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించింది. కొందరు రైతులకు మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపు కొన్నది. అత్యధిక మంది రైతులకు పరిహారం ఇవ్వకుండా ముఖం చాటేసింది.రైతుకు పెట్టుబడి సాయం అందజేసి వెన్నుదన్నుగా నిలిచేందుకు కేసీఆర్ ‘రైతుబంధు’ పథకం ప్రవేశపెట్టారు. ప్రతి రైతుకు రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.10 వేల చొప్పున నగదు బదిలీ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకంపై అనేక ఆరోపణలు చేశారు. అనర్హులకు సాయం అందు తోందని ప్రజలను తప్పుదోవ పట్టించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఏడాదికి ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని నమ్మబలికారు. తీరా గద్దెనెక్కాక రెండు పంట సీజన్లు రైతుబంధును ఎగ్గొట్టారు. స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రయోజనం కోసం ఈ ఒక్క సీజన్లో మాత్రమే రైతులకు భరోసా కింద నిధులు జమ చేశారు. ఒక చేత్తో ఇచ్చిఇంకో చేత్తో లాక్కున్నట్టుగా రైతు భరోసా డబ్బును పంట రుణాలు, ఇతర అప్పుల కింద జమ చేసుకొని ఆ సాయం కూడా అందకుండా అడ్డుకున్నారు. అన్ని పంటలకు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చి చివరికి సన్న వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్నుపరిమితం చేశారు. బోనస్ కింద రైతులకు ప్రభుత్వం రూ. 1,200 కోట్లు బాకీ పడింది. వాటి కోసం అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ రైతులు తిరిగినా ఎప్పుడు నిధులు జమ చేస్తారో తెలియని పరిస్థితి.ఎరువుల కోసం తిప్పలుపంట సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం సాగుకు సన్నద్ధ మవ్వాల్సి ఉంటుంది. రైతులు తమ పొలాలను దున్నుకొని పంటలు వేసేందుకు ఎలా సిద్ధంగా ఉంటారో... విత్తనాలు, ఎరువులు సకాలంలో పంపిణీ చేయడానికి ప్రభుత్వం అంతకన్నా ఎక్కువే శ్రద్ధ కనబరచాల్సి ఉంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులు, విత్తనాలే కాదు, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో కూడా రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, సాగు విస్తీర్ణానికి అనుగుణంగా కేంద్రంనుంచి ఎరువులను తెప్పించకపోవడంతో యూరియా, డీఏపీ, పొటాష్ కోసం ఇప్పుడు రైతులంతా రోడ్లపైకి రావాల్సిన దుఃస్థితి ఏర్పడింది. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఇంకెవరిపైనో నెపం వేసే ప్రయత్నం చేస్తోంది. ఎరువులు ముఖ్యంగా యూరియా కోసం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో రైతులు నిత్యం తిప్పలు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో రైతులు ఎరువుల కోసం నడిరోడ్డులో బైఠాయించారు. సిర్పూర్లో రైతులు, మహిళలు యూరియా కోసం గంటల తరబడి వేచిచూశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగానూ ఎరువుల కోసం రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి.ఏది భరోసా?బీఆర్ఎస్ పాలనలో 24 గంటలు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ సరఫరా అయ్యేది. ప్రతి రైతుకు ప్రతి సీజన్లో క్రమం తప్పకుండా రైతుబంధు నేరుగా ఖాతాలో జమయ్యేది. రైతు దుర దృష్టవశాత్తు మరణిస్తే రైతు బీమా పథకం కింద ఆ కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందేది. భూమిశిస్తు రద్దు, నీటి తీరువా రద్దు, ప్రాజెక్టుల పంట కాల్వలపై ఏర్పాటు చేసిన విద్యుత్ మోటార్ల క్రమబద్ధీకరణ లాంటి రైతు అనుకూల నిర్ణయాలతో ప్రభుత్వం అన్నదాతకు భరోసానిచ్చింది. కానీ తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటూనే కాంగ్రెస్ అన్నదాతలను వంచిస్తోంది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీ మోసంగా మారుతుండటంతో వ్యవసాయం పట్ల, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదని మళ్లీ మళ్లీ నిరూపితమవుతోంది. ఇకనైనా నిర్లక్ష్యం వీడి రైతు సంక్షేమం తక్షణ కర్తవ్యంగా భావించిపంటల బీమా పథకం అమలుకు చర్యలు చేపట్టాలి. వెంటనే బీమా అమలుకు టెండర్లు పిలిచి ఇన్సూరె¯Œ ్స ఏజెన్సీని ఖరారు చేయాలి. యూరియా సహా ఇతర ఎరువులను పూర్తి స్థాయిలోందుబాటులోకి తేవాలి. ఎరువులను బ్లాక్ మార్కెట్ చేసి అమ్ము తున్న వారిపై ఉక్కుపాదం మోపాలి. రైతులకు బాకీ పడ్డ ‘రైతు భరోసా’ సాయం విడుదల చేయాలి.రాష్ట్రంలో అన్ని కోణాలలో రైతులను వంచించి, వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసి... పండుగ చేశామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేసుకుంటున్నరు. వారి మాటలకు, సంబరాలకు సంబంధం లేదని తెలుసుకోవాలంటే తమ మేనిఫెస్టోను ఒకసారి చదువుకోవాలి. ‘మాట ఇచ్చినవాడు మారిపోవచ్చు, కానీ మాట మరిచిపోవద్దు’ అని తెలంగాణరైతులు సామెతలాగా చెప్తుంటారు. రైతుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిజం చేయకపోతే, రైతుల నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్క సీజ¯Œ కు, అదీ ఎన్నికల్లో ప్రయోజనం కోసం రైతుభరోసా ఇచ్చి దానిని గొప్పగా చెప్పు కోవాలని చూస్తే... అదే రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందన్న వాస్తవాన్ని గ్రహించాలి.-కల్వకుంట్ల కవిత, వ్యాసకర్త శాసన మండలి సభ్యురాలు,‘తెలంగాణ జాగృతి’ అధ్యక్షురాలు -
‘ఆ అవకాశం కేసీఆర్‌కు ఎప్పుడో వచ్చింది.. కానీ వదిలేశారు’
హైదరాబాద్: ఏబీఎన్ రాధాకృష్ణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీస్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. రాధాకృష్ణది కొత్త పలుకు కాదు.. చెత్త పలుకని పేర్కొన్న జగదీష్‌రెడ్డి.. సెటిలర్లు ఎప్పుడూ కేసీఆర్ వెంటే ఉన్నారన్న విషయం తెలుసుకోవాన్నారు. వారు చంద్రబాబును ఎప్పుడో తిరస్కరించారని, ఓ వర్గం పనిగట్టుకుని బీఆర్ఎస్ నేతలపై విషం కక్కుతుందన్నారు. ‘మీ రాతలతో కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్పై విషం వెళ్లగక్కారు. మీ రాతలు అహంకారాన్ని తెలియజేస్తున్నాయి. మీతో పాటు, మీ గురువును జైలుకు పంపించే అవకాశం కేసీఆర్ ఏనాడో వచ్చింది. రాజకీయ కక్షల ఆలోచన వద్దని కేసీఆర్ వదిలేశారు’ అని జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. -
KTR: రేవంత్ సవాల్ ను స్వీకరించి ప్రెస్ క్లబ్ కు వెళ్తున్నా
-
రేవంత్ సభ పెడితే నాలుగు బూతులు, ఐదు అబద్ధాలు : కేటీఆర్
-
తెలంగాణ తెచ్చుకుంది కడుక్కు తాగేందుకు కాదు
సాక్షి, హైదరాబాద్: ‘సుదీర్ఘ కాలం కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది కడుక్కుని తాగేందుకు, కరిగించుకుని తినేందుకు కాదు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెనుక ఉన్న గాఢతను అర్థం చేసుకునే తెలివితేటలు ప్రస్తుత పాలకులకు లేవు. రొడ్డకొట్టుడు ఉపన్యాసాలతో, నాసిరకం పాలనతో రాష్ట్రానికి తీరని నష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే. నీళ్ల కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పుట్టిందనే విషయం అందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పాలకులకు సాగునీటి రంగంపై అవగాహన లేకపోవడంతో జరుగుతున్న నష్టంపై ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది.ఒకటి రెండు రోజుల్లో నేను స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టి అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తా’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన పార్టీ నేతలతో అన్నారు. వైద్య పరీక్షల కోసం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌ను పలువురు పార్టీ నేతలు శుక్రవారం పరామర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లతో కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు తదితర ప్రజా సమస్యలు, వర్తమాన అంశాలపై మూడు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ సాగు నీటి రంగంపై ప్రస్తుత పాలకులకు కనీస అవగాహన లేదు. వారికి తోక తెలియదు.. మూతి తెలియదు. బనకచర్ల లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టంపై నేనే స్వయంగా ఆదివారం (సూచనప్రాయంగా) మీడియాతో మాట్లాడతా. నా ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేడు సాయంత్రం డిశ్చార్జి అయిన తర్వాత నందినగర్ నివాసంలోనే ఉంటా’అని కేసీఆర్ తెలిపారు. కేటీఆర్, హరీశ్‌రావుతో భేటీ నేతలతో ఇష్టాగోష్టి తర్వాత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలు, ప్రజా సమస్యలు, పార్టీ అంతర్గత అంశాలపై చర్చించినట్లు తెలిసింది. బనకచర్లపై తన ప్రెస్‌మీట్ తర్వాత పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. శాసనమండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, బండారు లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, చిరుమర్తి లింగయ్య, శంకర్‌నాయక్, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాకేశ్, నాగేశ్, సతీశ్‌రెడ్డి తదితరులు ఇష్టాగోష్టిలో పాల్గొన్నారు. -
మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించిన కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తనయుడు కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుందని చెప్పారు. బ్లడ్ షుగర్, సోడియం లెవల్స్ సాధారణ వైద్య పరీక్షల్లో భాగంగా నిన్న సాయంత్రం ఆయన సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరారని తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ కొన్ని రోజులు ఆస్పత్రిలో ఉండనున్నారని చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరాతీస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. Sri KCR garu was admitted in the hospital last evening for routine health checkups. Just to monitor his Blood sugar and low Sodium levels, his doctors have advised a few days of admissionNo serious health concerns at all. All his vitals are normalI thank all those who have…— KTR (@KTRBRS) July 4, 2025 -
పార్టీ ఎజెండా ముఖ్యం.. అధికారమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో ఎలాంటి నిర్ణయమైనా సమష్టిగా చర్చించిన తర్వాతే తీసుకుంటామని, దాన్నిఅమలు చేసే బాధ్యత మాత్రమే రాష్ట్ర అధ్యక్షుడిపై ఉంటుందని బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు చెప్పారు. సొంతంగా, స్వార్థపూరితంగా నిర్ణయాలు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ‘పార్టీ ఎజెండా ముఖ్యం.. 2028లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యం’ అనే నినాదంతో ముందుకెళ్తామని చెప్పారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యక్రమాలపై గురువారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అప్పుల గురించి రేవంత్‌కు అప్పుడు తెలియదా? ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఏడాదిన్నర కాలంలోనే పూర్తిగా విఫలమైంది. సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సందర్భాల్లో మాట్లాడుతూ అప్పుల గురించి చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ఈ అప్పుల సంగతి ఆయనకు తెలియదా? కనీస అవగాహన లేకుండానే హామీలు ఇచ్చారా? అమలు చేయాల్సి వచ్చేసరికి ఆర్థిక పరిస్థితి గురించి చెబుతారా? రైతు రుణమాఫీ ఇంకా పూర్తికాలేదు. రైతుబంధు అందడం లేదు. మహాలక్ష్మీ, గృహలక్ష్మి అంటూ ఎన్నో హామీలు ఇచ్చి... ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నమే కనిపిస్తోంది. కాంగ్రెస్ హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు ప్రజలు గుర్తించారు. ప్రజాస్వామ్య తెలంగాణ మాటలకే పరిమితమైంది. భైంసాలో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలను జైల్లో పెట్టారు. గోరక్షకులను అరెస్టులు చేశారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.. పదేళ్ల పాలన చూసిన తర్వాత బీఆర్ఎస్ను ప్రజలు వద్దనుకున్నారు. అందుకే కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ విధానాలనే అమలు చేస్తోంది. అందుకే కేవలం ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్.. రెండింటికీ ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో ఉంది. రెండు ప్రభుత్వాలను చూసిన తెలంగాణ ప్రజలు బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ పరిస్థితికి తగినట్లు బీజేపీ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. అధికారంలోకి వచ్చేలా కష్టపడతాం. ఒక్క ఎమ్మెల్యేతో మొదలుపెట్టి.. రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. ఒకప్పుడు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉండేవారు. ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడితో బలమైన పార్టీగా ఎదిగింది. గతంలో కేవలం మూడు, నాలుగు శాతం ఓట్లున్న ఈ పార్టీ..గత పార్లమెంటు ఎన్నికల్లో 22 శాతం ఓట్లతో సగం ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామనే ధీమా ఏర్పడింది. గెలుపు గుర్రాలకే ‘స్థానిక’టిక్కెట్లు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నాం. జీహెచ్ఎంసీలో పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చాయి. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఉన్న వ్యతిరేకత మాకు కలిసివస్తుంది. త్వరలో వర్క్‌షాప్ నిర్వహిస్తాం. ఎవరెవరికి సీట్లు ఇవ్వాలనే దానిపై చర్చిస్తాం. సీనియర్ల సలహాలు, సూచనలు తీసుకుంటాం. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాం. ఇతర పార్టీల నుంచి వచ్చేవాళ్లను చేర్చుకుంటాం. కొత్త నీరు వస్తేనే కదా ప్రవాహం పెరిగేది. టాలెంట్‌కు తగిన పదవులు కూడా ఇస్తాం. పాత, కొత్త నాయకులనే తేడా అస్సలు లేదు. నిత్యం ప్రజల మధ్యనే ఉంటా.. రాష్ట్ర అధ్యక్షుడిగా క్షేత్రస్థాయి పర్యటనలకే తొలి ప్రాధాన్యత. పార్టీ పరంగా మాకు 38 జిల్లాలున్నాయి. కార్యాలయానికే పరిమితం కాకుండా నిత్యం ప్రజల మధ్యనే ఉంటా. సమస్యలపై ఉద్యమాలు చేపడతా. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతా. ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొదిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ నినాదం ఉత్తమాటే. బీసీ బిల్లు ఇక్కడ రూపొందించి అక్కడ అమలు చేయడమనేది తెలివి తక్కువ చర్య. బిల్లు ఆమోదిస్తే గెజిట్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీ బిల్లు తయారు చేసి కేంద్రాన్ని అమలు చేయమన్నది. మా ప్రధానమంత్రి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రతి ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తాం. యువతకు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తాం. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇచ్చే సమయాన్ని బట్టి ఈ నెల 5 లేదా 10వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తా. -
కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీజనల్ జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ గురువారం హైదారబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ యశోదా ఆస్పత్రి వైద్యులతో కేసీఆర్ ఆరోగ్యంపై ఆరా తీశారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. -
బీఆర్ఎస్ కోసమే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ పునరుజ్జీవం కోసమే ఆ పార్టీ నేతలు నీళ్ల రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతులకు శాపంగా మారిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి– బనకచర్ల ప్రాజెక్టుపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి మంగళవారం ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో సీఎం మాట్లాడారు. ‘వాళ్లు (బీఆర్ఎస్) 2023లో ఓడిపోయారు. 2024లో డిపాజిట్లు కోల్పోయారు. 2025 ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులు కూడా దొరకలేదు. ఇప్పుడు నదుల పునరుజ్జీవం కాదు.. పార్టీ పునరుజ్జీవం కోసం నీళ్ల సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారు. పక్క రాష్ట్రం సీఎంను, ఈ రాష్ట్రం సీఎంను భూతాలుగా చిత్రీకరించాలని కుట్రలు చేస్తున్నరు. క్షుద్రపూజలు చేసినట్టుగా ఆయన (కేసీఆర్) ఫాంహౌస్‌లో కూర్చుని ఆలోచన చేస్తున్నడు. ఈ విషయాలను ప్రజలందరికీ వివరించాలి’అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం సూచించారు. మరణ శాసనం రాసింది కేసీఆర్, హరీశ్‌రావులే.. తొమ్మిదిన్నరేళ్లు పాలనలో కేసీఆర్, హరీశ్‌రావు తీసుకున్న నిర్ణయాలు నేడు తెలంగాణకు గుదిబండగా మారాయని సీఎం విమర్శించారు. ‘కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల నికర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎలా వాడుకోవాలన్న అంశంపై 2015 సెప్టెంబర్ 18న కేంద్ర జలశక్తి శాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశానికి నాటి నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, సాగునీటి రంగ సలహాదారులు విద్యాసాగర్ రావు హాజరై ఏపీ 512 టీఎంసీలు వాడుకోవచ్చని, తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని అంగీకరిస్తూ సంతకం పెట్టి తెలంగాణ రైతాంగం పాలిట మరణశాసనం రాసి వచ్చారు. 2020లో కూడా సమావేశానికి వెళ్లి మళ్లీ సమ్మతి తెలిపారు. 2015లో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి ఉమాభారతి నేతృత్వంలో, తర్వాత జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కృష్ణా జలాల్లో మన హక్కుల కోసం కేసీఆర్ వాదించలేదు. కృష్ణా జలాలే కాదు గోదావరి జలాలనూ కేసీఆర్ ఏపీకి తాకట్టు పెట్టిండు. ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి కృష్ణా, గోదావరి జలాలపై చర్చిద్దాం’అని సీఎం బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. రాచపుండును పెట్టింది కేసీఆరే.. ‘ఏటా 3,000 టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని 2016 సెపె్టంబర్ 21న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారి నాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. గోదావరి జలాల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు, ఏపీ వాటా 518 టీఎంసీలను పూర్తిస్థాయిలో వాడుకునే విధంగా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కట్టుకున్న తర్వాతే మిగులు జలాలు, వరద జలాల లభ్యత ఎంతో లెక్క తేలుతుంది. ఆ తర్వాతే ఆ జలాల్లో దామాషా ప్రకారం రెండు రాష్ట్రాల వాటాలపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి. ఏటా 3,000 టీఎంసీల వరద సముద్రంలో కలుస్తోందని కేసీఆర్‌కు ఏ దేవుడు చెప్పిండు? లేని ఏకును, రాచపుండును పెట్టిందే కేసీఆర్. దాని ఆధారంగానే గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు డీపీఆర్ తయారు చేయించడానికి చంద్రబాబు 2016లో జీవో ఆర్టీ నం.262 జారీ చేశారు. దీనికి కొనసాగింపుగా 2019 సెపె్టంబర్ 29న జీవో ఆర్టీ నం.230 ఇచ్చారు. వ్యాప్కోస్ 4 ప్రత్యామ్నాయాలు సూచించగా, 4వ ప్రత్యామ్నాయంగా 400 టీఎంసీలు తరలించవచ్చని నివేదిక ఇచి్చంది. ఇప్పుడు ఏపీ 200 టీఎంసీలను తరలిస్తామని చూపించడం తాత్కాలికం. ప్రీఫీజిబిలిటీ రిపోర్టు ప్రకారం 300 టీఎంసీల ప్రాజెక్టును డిజైన్ చేశారు. అదనంగా 100 టీఎంసీల పంపులను ఫిట్ చేయడం లేదు. 400 టీఎంసీలను నెల్లూరు, ప్రకాశంకు ఎలా తీసుకెళ్లాలో 2016లోనే కేసీఆర్ చెప్పిండు. ఇదే అదనుగా చంద్రబాబు పనులు మొదలు పెట్టిండు. 2019లో జగన్ సీఎం కాగానే గోదావరి జలాలను ఏ విధంగా పెన్నాకు తరలించాలో ఆయనకు కేసీఆరే నేర్పిండు. కేసీఆర్ రోజా ఇంటికి వెళ్లి గోదావరి జలాలు మీకిచ్చి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నాడు. 2016–19 మధ్యలో కేసీఆర్ సంపూర్ణంగా సహకరించారు’అని సీఎం ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరం తెలుపకుండా ఏపీ సీఎం చంద్రబాబు ఎన్ఓసీ ఇవ్వాలని రేవంత్‌రెడ్డి కోరారు. సమస్యల పరిష్కారంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం వివాదం సృష్టిస్తోందని విమర్శించారు. నీటి కేటాయింపుల బాధ్యతను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. బీజేపీ పరోక్షంగా బీఆర్ఎస్ను బతికించడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీపడబోదని స్పష్టం చేశారు. సదస్సులో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తమ పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర పర్యావరణ శాఖ తిరస్కరించిందని తెలిపారు. -
‘బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం ఫిక్సింగ్‌లో భాగమే’
ఢిల్లీ : తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం బీజేపీ-బీఆర్ఎస్ల మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి. బీజేపీ-బీఆర్ఎస్లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఉన్నాయనే విషయం దీని ద్వారా నిరూపితమైందంటూ సెటైర్లు వేశారు. ఈరోజు(సోమవారం, జూన్ 30) ఢిల్లీ నుంచి మాట్లాడిన చామల.. కేసీఆర్ గెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని, అటువంటప్పుడు దోచుకోవడానికి ఏముంటుందని ప్రశ్నించారు కిరణ్‌కుమార్‌రెడ్డి‘మీరు(కేంద్రం) ఏమైనా నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తుంది. బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలుపుకోసం బీఆర్ఎస్ చేసింది అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో కూడా ఆ రెండు పార్టీలు అదే రూట్ మ్యాచ్‌తో ముందుకు వెళ్లనున్నాయి. హైదరాబాద్‌లో మెట్రోకు పునాదులు వేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. కిషన్‌రెడ్డి.. తెలంగాణ, హైదరాబాద్ సమస్యల విషయంలో నోరు విప్పరు. హైదరాబాద్ నగర ప్రజకు కిషన్‌రెడ్డి చేసిందేమిటి?, ఈ ఏడాది కేంద్రం నయా పైసా ఇవ్వలేదు. విభజన హామీలు నెరవేర్చలేదు. హైదరాబాద్ మెట్రో కోసం ఐదారుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వచ్చారు. మనం కట్టిన ట్యాక్సుల్లో మన వాటా వెనక్కి రావడం లేదు. సీఎం రేవంత్ తన ప్రయత్నం తాను చేస్తున్నారు.. కిషన్‌రెడ్డి కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచెయ్యాలి’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఆయనే.. -
హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియట్..!
హైదరాబాద్: 'హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రిలీజ్ చేశారు. ఈ రోజు(శనివారం, జూన్ 28) తెలంగాణ భవన్లో నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి.. ఛలో సెక్రటేరియల్ పోస్టర్‌ను హరీష్ రావు విడుదల చేశారు. దీనిలో భాగంగా హరీష్ రావు మాల్లాడుతూ.. ‘ ఉస్మానియా యూనివర్శిటీ, అశోక్ నగర్ నుంచి పెద్ద ఎత్తును నిరుద్యోగులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని జూలై 4వ తేదీన ఛలో సచివాలయానికి పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఛలో సచివాలయం కార్యక్రమంకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుంది.నిరుద్యోగుల ఛలో సచివాలయంకు CPM పార్టీ మద్దతు ఇచ్చినట్లు నిరుద్యోగులు చెప్పారు. బీఆర్ఎస్ హయంలో 95 శాతం ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా కేసీఆర్ చొరవ తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామన్న జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని నిరుద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ ఇది దగా క్యాలెండర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న జాబ్ క్యాలెండర్ అమలు కావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల సమయంలో ఏడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 12 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదు.ఎన్నికల సమయంలో ఇందిరమ్మ నమరాలుగా మాట ఇస్తున్న అని ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ఇచ్చారు.యూత్ డిక్లరేషన్ లో 5 అంశాల చెప్పిన ప్రియాంక గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. స్కూటీ అంటే నాకు ఇష్టమని చెప్పిన ప్రియాంక గాంధీ, మహిళ స్టూడెంట్స్ కి ఇస్తామన్న స్కూటీ ఏమైందొ సమాధానం చెప్పాలి. నిరుద్యోగ భృతి ఇస్తామన్న చెప్పిన ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్న నిరుద్యోగ భృతి అతి గతి లేదు. యూత్ డిక్లరేషన్ లో 5 హామీలు ఇచ్చిన ప్రియాంక గాంధీ, అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. యూత్ డిక్లరేషన్ నెరవేర్చనందుకు రేవంత్ రెడ్డి పైన ఎందుకు మొట్టి కాయలు వెయ్యడం లేదు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చిన గాంధీ కుటుంబం నిరుద్యోగ యువతి యువకులకు హామీలు ఇచ్చి దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగుల పక్షాన మాట్లాడిన ప్రొఫెసర్ కోదండరాం, ఆకూనురి మురళీ, రియాజ్, ఆఖరికి ప్రియాంక గాంధీకి ఉద్యోగం వచ్చింది. తెలంగాణ రక్తంలోనే ప్రశ్నించే తత్వం ఉంటుంది. నిరుద్యుగులరా మీరు పోరాడుతూనే ఉండండి. మీ న్యాయ బద్ధమైన పోరాటానికి సంపూర్ణ మద్దతు బిఆర్ఎస్ ఇస్తుంది. రేపటి తరమైన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
చర్చకు రా.. తేల్చుకుందాం!: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పదేళ్లు అధికారంలో కొనసాగి కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన కేసీఆర్.. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు అసెంబ్లీలో చర్చకు రావా లని సవాల్ విసిరారు. ‘నేను చంద్రబాబుతో కలిసిపోయి గోదావరి– బనకచర్లకు నీళ్లిస్తున్నానని దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నావు. దీనిపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్‌కు లేఖ రాయి. గోదావరి జలాల్లో తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరు? ప్రాణహిత–చేవెళ్లను తరలించి లక్ష కోట్లు దోచుకున్నది ఎవరో చర్చిద్దాం..’ అని అన్నారు. కేసీఆర్ సూచనలతో హరీశ్‌రావు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ప్రభుత్వం 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన నేపథ్యంలో మంగళవారం సచివాలయం ఎదురుగా రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో రేవంత్ మాట్లాడారు. నీ దిక్కుమాలిన సూచన వల్లే ఈ దరిద్రం ‘చంద్రబాబును కలిసి గోదావరి నుంచి 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నయ్.. రాయలసీమకు తరలించమని 2016లో చెప్పింది నువ్వు కాదా? నువ్వు చెప్పినంకనే కదా ఉమాభారతి ఆదేశాల మేరకు చంద్రబాబు హంద్రీనీవా నుంచి 400 టీఎంసీలు తరలించడానికి 2016లో జీవో ఇచ్చిండు. 2018లో వ్యాప్కోస్ సంస్థను నియమించి, 400 టీఎంసీలు హంద్రీనీవా నుంచి బనకచర్లకు తరలించడానికి ప్రాజెక్టు రిపోర్టు ఇచ్చింది నిజం కాదా? నువ్వు ఇచ్చిన దిక్కుమాలిన సూచనతోనే ఈ దరిద్రం దాపురించింది? తెలంగాణను ఎడారిగా మార్చేలా వందలాది టీఎంసీల నీటిని రాయలసీమకు తరలించమని చెప్పింది నువ్వు. నేను తప్పు చేసినట్టు ఒక్క ఆధారం చూపిస్తే దేనికైనా సిద్ధం. నేను మొత్తం వివరాలతో వస్తా? నువ్వు చెప్పిన తారీఖు నాడు అసెంబ్లీలో చర్చకు పెట్టించే బాధ్యత శ్రీధర్‌బాబు తీసుకుంటరు. నువ్వు, నేను చర్చ చేద్దాం. నువ్వు సిద్ధంగా ఉన్నవా?..’ అని సీఎం నిలదీశారు. ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు ఆగిపోయాయి? ‘బీఆర్ఎస్ పదేళ్ల వాళ్ల పాలన ఎలా ఉందో.. 18 నెలల మా పాలన ఎలా ఉందో గ్రామాల్లో, రచ్చబండల దగ్గర రైతులు చర్చ పెట్టాలి. వ్యవసాయాన్ని పండుగ చేయాలని 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉచిత కరెంటుపై తొలి సంతకం చేశారు. రుణమాఫీ అమలు చేశారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయి. కానీ కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలతో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్. ప్రాజెక్టు కూలిపోయినందుకు నిన్ను చిన్న కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం అంటున్నది నిజం కాదా? కేసీఆర్ కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు చెల్లించిండు. మరి రూ.1,000 కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది? రూ.300 కోట్లతో పూర్తి కావాల్సిన భీమా, రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు, రూ.6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ఎందుకు ఆగిపోయాయి? దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి..ఎందుకు పూర్తి చేయలేదు? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారన్న నువ్వు.. పదేళ్లలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? కృష్ణా జలాల్లో 68 శాతం కేటాయింపులు తెలంగాణలో, 32 శాతం కేటాయింపులు ఆంధ్రలో ఉండాలి. ఈ లెక్కన 555 టీఎంసీల వాటా తెలంగాణకు రావాలి. కానీ 290 టీఎంసీలు తెలంగాణకు తీసుకుని, 519 టీఎంసీలు ఆంధ్రకు ఇచ్చి తెలంగాణ రైతాంగానికి మరణశాసనం రాసిందే నువ్వు. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం.. మేం తెలంగాణకు న్యాయం కోసం పోరాడుతున్నం. గోదావరి–బనకచర్లకు అనుమతులు ఇవ్వవద్దని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కోరాం. ప్రాజెక్టులను పడావు పెట్టి మీరు ఫాంహౌస్‌లో పడుకుంటే.. మేం వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. అబద్ధాలు ప్రచారం చేస్తే ఊరుకోం. అప్పుడంటే జానారెడ్డి నీతో ఎందుకని ఊరుకున్నాడు. ఇప్పుడు అసెంబ్లీకి రా. నీ సంగతి చెపుతా..’ అని రేవంత్ అన్నారు. మీకు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చినయ్? ‘కేసీఆర్ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను క్యాన్సర్ బారిన పడేసి మాకు అప్పగించారు. కోకాపేట భూములు, ఓఆర్ఆర్ అమ్మి రైతుబంధు ఇచ్చారు. రైతుల పేరుతో అప్పులు చేసిండు.. దోపిడీ చేసిండు. తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇప్పుడేంటి? మొయినాబాద్‌లో హరీశ్‌రావుకు, జన్వాడలో కేటీఆర్‌కు, గజ్వేల్‌లో కేసీఆర్‌కు ఫామ్‌హౌస్‌లు ఎట్లా వచ్చినయ్? రాష్ట్రానికి రూ.8 లక్షల కోట్ల అప్పు మిగిల్చి, పదేళ్లలో నిజాం నవాబుల కంటే ధనవంతులయ్యారు. మేం మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశాం. మీరు పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు చెప్పు. కాళేశ్వరం పేరుతో మీరు రూ.లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో లక్షా 4 వేల కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర మాది. వ్యవసాయాన్ని పండుగ చేయాలన్న ఉక్కు సంకల్పంతో ప్రజా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం మా తొలి ప్రాధాన్యత రైతులే ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులుం. ఆ తర్వాత మా ఆడబిడ్డలు, ఉద్యమకారులు, విద్యార్థులు. ఆనాడు కేసీఆర్ రైతుబందు ఎగ్గొడితే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రూ.7,625 కోట్ల నిధులు విడుదల చేశాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాం. కేసీఆర్ ఆనాడు వరి వద్దంటే మేం వరి పండించండి అని చెప్పాం. చివరి గింజ వరకు కొనడమే కాదు.. మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నాం..’ అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, వాకిటి శ్రీహరి, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
Jubilee Hills By Election: బరిపై మజ్లిస్ గురి!
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ ‘జూబ్లీహిల్స్’ అసెంబ్లీ ఉప ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఇప్పటికే పాతబస్తీలో ఎదురులేని రాజకీయ శక్తిగా అవతరించిన ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. సెగ్మెంట్లలోని డివిజన్లలో ప్రాతినిధ్యం వహిస్తుండటంతో ఉప ఎన్నికల్లోనైనా జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్ధానాన్ని దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వాస్తవంగా తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఇక్కడి బరిలో దిగి ఢీ.. అంటే ఢీ అనే విధంగా పోటీపడి స్పల్ప ఓట్ల తేడాతో రెండో స్థానంతో నిలిచింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం బీఆర్ఎస్ దోస్తీ కోసం బరిలో దిగలేదు. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసినప్పటికీ పరాజయం తప్పలేదు. తాజాగా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చెందడటంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నా.. సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది కావడంతో పోటీలో ఉండాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ బరిలో దిగే అవకాశం ఉన్నా.. స్నేహపూర్వకంగానే పోటీ ఇచ్చి అసెంబ్లీ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు ఇది చక్కని అవకాశంగా భావిస్తోంది. ఇదీ పరిస్థితి.. 2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మజ్లిస్ గట్టి పోటీ ఇచి్చంది. అప్పటో ఆ పార్టీ తరఫున రంగంలో దిగిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ తొమ్మిదివేల పైచిలుకు ఓట్లతో తేడాతో రెండో స్థానంలో నిలిచారు. 2018లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేయకుండా అప్పటి మిత్రపక్షమైన అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి సిట్టింగ్ ఎమ్మెల్యేకు మద్దతు ప్రకటించింది. నవీన్ యాదవ్ మజ్లిస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థి పోటీ చేసి సుమారు 18 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిన మజ్లిస్.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై స్నేహపూర్వక పోటీకి దిగింది. వాస్తవంగా అధికార పక్షం దోస్తీ కోసం పార్టీ విస్తరణను సైతం స్వయంగా అడ్డుకట్ట వేసుకునే మజ్లిస్.. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి షేక్‌పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్‌ను బరిలో దింపడం వెనుక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముస్లిం మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ పారీ్టకి మళ్లకుండా చేసి అధికార బీఆర్ఎస్కు సహకరించేందుకు మజ్లిస్ పార్టీ బరిలో దిగినట్లు ప్రచారం సాగింది. అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్కు లాభం చేకూరింది. కానీ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం చేజారగా.. కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఆ తర్వాత కాంగ్రెస్‌తో మజ్లిస్ స్నేహం కుదరింది. తాజాగా సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.ముస్లిం ఓటర్లు మూడో వంతుజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. అసెంబ్లీ పరిధిలోని పలు డివిజన్లలో మజ్లిస్ ప్రాతినిధ్యం కలిగి ఉంది. ప్రతినిత్యం స్థానిక సమస్యలపై పైదల్ దౌరా (పాదయాత్ర) నిర్వహిస్తుండటంతో ప్రజల్లో కూడా గట్టి పట్టు ఉంది. దీంతో రాజకీయాలకు అతీతంగా ముస్లిం మైనారిటీలు మజ్లిస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. ఈసారి ఉప ఎన్నికల బరిలో గెలుపు గుర్రాన్ని నిలిపేందుకు కసరత్తు చేస్తోంది.ఇటీవల పోటీ చేసిన షేక్‌పేట కార్పొరేటర్ మహ్మద్ రషీద్ పెద్దగా ఓట్లు రాబట్టుకోక పోవడంతో ఈసారి మరొకరిని పోటీకి దింపాలని యోచిస్తోంది. మజ్లిస్ పార్టీ పక్షాన మహిళా సాధికారత కోసం గళం విప్పుతున్న విద్యావంతురాలు, జాతీయ కరాటే చాంపియన్ సయ్యదా ఫలక్ అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తోంది. గతంలో ఉమ్మడి పౌరసత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌తో పాటు దేవబంద్, ఢిల్లీ, షాహీన్‌బాగ్‌లలో జరిగిన నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించి పార్టీ దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మరో ఇద్దరు కార్పొరేటర్ల అభ్యర్థిత్వాలను సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
కౌశిక్ రెడ్డికి రిమాండ్.. ఆ వెంటనే బెయిల్ మంజూరు
-
బీఆర్ఎస్కు టచ్‌లో ఉన్న ఇంజనీర్లపై నిఘా..!
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో పలువురు ఇంజనీర్లు గత సర్కారులోని పెద్దలతో ఇంకా టచ్‌లోనే ఉంటున్నారని ప్రభుత్వం అనుమానిస్తోంది. సర్కారు తీసుకునే ప్రతీ నిర్ణయంపై వారికి వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టా లని ఆదేశాలిచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఏసీబీ దాడులు కూడా జరిగినట్లు నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉన్నారని భావిస్తున్న వారిని కీలక స్థానాల నుంచి తప్పించాలని ఆదేశించినట్లు, ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన వారిపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్లు అధికారవర్గాల సమాచారం. కాళేశ్వరం పరిధిలోని నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు భావిస్తున్న వాటిపై పూర్తిస్థాయిలో విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా ఆ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా విజిలెన్స్ అధికారులు నీటిపారుదల శాఖలోని ఇంజనీర్లకు ఇటీవల నోటీసులు జారీ చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు ఏసీబీ దాడుల్లో పట్టుపడుతున్న ఇంజనీర్లు వందల కోట్ల మేర అక్రమ ఆస్తులను అందుకు ఉదాహరణగా చూపుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట వేసింది. దీనితో ఆ పార్టీ ముఖ్యనేతలతో కొందరు ఇంజనీర్లకు సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అనుమానాలను ధ్రువీకరిస్తూ ఇటీవల ప్రభుత్వానికి నిఘా వర్గాలు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీని మేరకు కొందరు ఇంజనీర్లపై అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ)తో దాడులు జరిపించడంతోపాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిఫారసుల ఆధారంగా మరికొందరిపై చర్యలకు శ్రీకారం చుట్టారని చర్చ జరుగుతోంది. విజిలెన్స్ సిఫారసుల ఆధారంగా ఏకంగా 38 మంది ఇంజనీర్లు, మాజీ ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీకావడం శాఖలో ప్రకంపనలు సృష్టించింది. సర్కారుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనీ... ఏసీబీ కాళేశ్వరం ప్రాజెక్టు గజ్వేల్ ఈఎన్సీతోపాటు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్‌గా రెండు హోదాల్లో కీలకంగా కొనసాగిన బి.హరిరామ్‌ను తొలుత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత ఏప్రిల్ 26న అరెస్టు చేసింది. అలాగే, వేరే చోటికి బదిలీ చేసినా ఏడాదికాలంగా ఎస్సారెస్పీ డివిజన్–8 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా కొనసాగుతున్న నూనె శ్రీధర్‌ను సైతం ఏసీబీ ఈ నెల 11న అరెస్టు చేసింది. తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడైనప్పటికీ ప్రభుత్వం ఆయన్ను ఏసీబీ కేసులో అరెస్టు చేయడం గమనార్హం. ప్రభుత్వం మారినా బీఆర్ఎస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించడంతోనే వీరిపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్టు సమాచారం. సాగునీటి రంగంలో గత ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుండగా, కొందరు అధికారులు గత ప్రభుత్వ నిర్ణయాలను సమరి్థస్తూ రావడం ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయంలో ఉండాల్సిన ఫైళ్ల కాపీలు ప్రతిపక్ష నేతలకు వెళ్లడంతోనే ప్రభుత్వం సీరియస్ అయినట్టు సమాచారం. నివేదిక రెండు నెలలు కోల్డ్ స్టోరేజీలో.. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకతలపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావును విచారించింది. వీరిని కమిషన్ ప్రశ్నించనున్నట్లు సమాచారం రాగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొందరు ఇంజనీర్లపై ఏసీబీ దాడులు చేయించినట్టు బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో 38 మంది ఇంజనీర్లు అవకతవకలకు పాల్పడినట్టు విజిలెన్స్ విభాగం గుర్తించిందని, వీరిపై చర్యలు తీసుకోవాలంటూ గత మార్చి 18న విజిలెన్స్ కమిషన్ సిఫారసు చేసింది. రెండు నెలల పాటు కోల్డ్ స్టోరేజీలో ఉన్న ఈ సిఫారసుల లేఖను సరిగ్గా కేసీఆర్ విచారణ కమిషన్ ఎదుట హాజరు కావడానికి ముందు ప్రభుత్వం బయటపెట్టినట్టు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. కమిషన్ సమన్ల ప్రకారం ఈ నెల 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, 2న విజిలెన్స్ కమిషన్ లేఖను ప్రభుత్వం మీడియాకు లీక్ చేసినట్టు గుర్తు చేస్తున్నారు. -
రాజకీయ కక్షతోనే కౌశిక్ రెడ్డి అరెస్ట్
-
Kaushik Reddy Arrest: వరంగల్ సుబేదారి పీఎస్ వద్ద ఉద్రిక్తత
-
పంచాయతీ భవనమే ఇల్లు
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఆమె గత స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవ సర్పంచ్.. ఉన్న పెంకుటిల్లు కూలిపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే కుటుంబంతో తలదాచుకుంటోంది. ఇందిరమ్మ ఇల్లు వస్తదని అనుకుంటే నిరాశే మిగిలింది. వివరాల్లోకి వెళితే... సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని అనంతసాగర్ గ్రామానికి దండు లావణ్యమల్లేశం 2019 స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తనకున్న అర ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పెంకుటిల్లులోనే నివాసముంటున్నారు. ఏడాదిన్నర క్రితం వర్షాలకు పెంకుటిల్లు కూలిపోగా, ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో గ్రామ పంచాయతీ భవనంలోనే నివాసం ఉంటున్నారు. ఆమెకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదు. తాను బీఆర్ఎస్ మాజీ సర్పంచ్‌ను కాబట్టే ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన బిల్లులు రూ. 4లక్షల వరకు రావాలని వాపోయారు. -
తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. కౌశిక్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.వివరాల ప్రకారం.. గ్రానైట్ వ్యాపారి మనోజ్ రెడ్డి అనే వ్యక్తిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి బెదిరింపులకు గురిచేశారని ఆరోపించారు. మనోజ్ రెడ్డి కమలాపూరం మండలం వంగపల్లిలో క్వారీ నిర్వహిస్తున్నారు. తమను రూ.50 లక్షలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని ఫిర్యాదు పేర్కొన్నారు. మనోజ్ భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసులు.. శనివారం తెల్లవారుజామున కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారు.పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా బీఎన్ఎస్ సెక్షన్ 308(2), 308(4) మరియు 352 కింద ఆయనపై అభియోగాలు మోపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి.. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కక్షపూరితంగానే తనను అరెస్ట్ చేస్తున్నట్టు ఘాటు విమర్శలు చేశారు. ఇక, ఈరోజు ఉదయం కౌశిక్ రెడ్డిని పోలీసులు.. కోర్టులో హాజరు పరుచునున్నారు.🛑 కుట్రలు - అక్రమ కేసులు ఎన్ని పెట్టినా… నిజాయితీ తలవంచదు!కౌశిక్ అన్నను శంషాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానం!రేవంత్ రెడ్డి గారు,మీ కుట్రలు, అక్రమ కేసులతో కౌశిక్ అన్న ను ఆపగలం అనుకోవడం…మీ మూర్ఖత్వాన్ని, మీరు పాలిస్తున్న అక్రమ రాజకీయంని చాటుతోంది. pic.twitter.com/PB1Dgcxtft— Padi Kaushik Reddy (@KaushikReddyBRS) June 20, 2025 -
‘రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’?
సాక్షి,తెలంగాణ: రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బుధవారం (జూన్18) ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు.‘కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే ఢిల్లోలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఒరిగేదేమీ లేదు. డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు. కేటీఆర్ ఏసీబీ విచారణ అంతా టైంపాస్నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. లీకేజీ పాయింట్ తుపాకుల గూడెం బ్యారేజి వద్ద ఉండాలని కేసీఆర్ తెలిపారు. పోలవరం వద్ద లీకేజీ పాయింట్ పెడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో తుపాకుల గూడెం వద్ద లీకేజీ పాయింట్‌ను చేపట్టాలని ఎందుకు చెప్పడం లేదు? రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్. చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్‌లపై కోర్టుకు వెళ్తాం. బనక చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం.కేటీఆర్‌పై ఏసీబీది టైం పాస్ విచారణ.ఇలాంటి విచారణలు చాలా చూశాం. హరీష్ రావుకు అస్వస్థత విషయం నాకు తెలియదు. నేను ఏ కార్యక్రమం చేసినా బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. బీఆర్ఎస్కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ’ అని కవిత స్పష్టం చేశారు. -
కాళేశ్వరంపై బీఆర్ఎస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతు చేసి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఎండగట్టాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవ స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 21న పోరుబాట చేపట్టనుంది. మేడిగడ్డలోని రెండు పిల్లర్ల కుంగుబాటును చూపుతూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైందంటూ వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోంది. పోరుబాట కార్యక్రమంలో భాగంగా పార్టీ నేతలు స్థానిక రైతులతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న బరాజ్‌లు, పంపింగ్ స్టేషన్లు, రిజర్వాయర్లను సందర్శిస్తారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లండన్ పర్యటన నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. గోదావరి–బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, ఆ పార్టీల వైఖరిని ఎండగట్టేందుకు మరో నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. వచ్చే నెలలో బనకచర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ లేదా సడక్ బంద్ చేపట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. దీనిపై ఈ నెలాఖరులోగా కార్యాచరణ ప్రకటించే అవకాశమున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.నేడు లండన్‌కు కేటీఆర్ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే రెండు రోజుల సదస్సులో కేటీఆర్ పాల్గొంటారు. ఈ సదస్సులో ‘ఫ్రాంటియర్ టెక్నాలజీస్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా’ అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారు. దేశ ప్రగతి, తెలంగాణలో అమలు చేసిన వినూత్న విధానాలు, టెక్నాలజీ తదితరాలపై చర్చిస్తారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు బుధవారం రాత్రి కేటీఆర్ లండన్‌కు బయలుదేరనున్నారు. ఈ నెల 24న హైదరాబాద్‌కు తిరిగి వస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.కాగా వైద్య పరీక్షల కోసం నందినగర్ నివాసానికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ మరో రెండు రోజులపాటు ఇక్కడే బస చేయనున్నారు. ఇక్కడే పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల అమెరికాలోని డాలస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణలో క్రియాశీలంగా పనిచేసిన బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సమన్వయకర్త మహేశ్ బిగాలా మంగళవారం కేసీఆర్‌ను కలిశారు. డాలస్ సభను విజయవంతంగా నిర్వహించిన పార్టీ ఎన్ఆర్ఐ విభాగం నేతలను కేసీఆర్ అభినందించారు. -
సెల్ఫోన్లు ఇవ్వండి.. కేటీఆర్‌కు ఏసీబీ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావును ఏసీబీ అధికారులు సోమవారం 8 గంటలకు పైగా విచారించారు. రేసు నిర్వాహకులతో కుదుర్చుకున్న ఒప్పందాలు మొదలు, నిధుల మళ్లింపు, నిబంధనల అతిక్రమణ, విదేశీ కంపెనీతో జరిపిన లావాదేవీలు..తదితర అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా కేటీఆర్ సెల్‌ఫోన్‌ను సీజ్ చేసేందుకు ప్రయత్నించారు. ఫోన్ ఇవ్వమని కోరగా..తీసుకురాలేదని కేటీఆర్ సమాధానమిచ్చినట్టు తెలిసింది. దీంతో ఫార్ములా ఈ–కారు రేసు నిర్వహణకు సంబంధించి ఒప్పందాలు మొదలైన 2021 నుంచి 2024 మధ్య కాలంలో వినియోగించిన సెల్ఫోన్లు ఈ నెల 18 లోగా అప్పగించాలని కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఆదేశించారు. వరుస ప్రశ్నలు..మధ్యమధ్యలో బ్రేక్ ఏసీబీ అధికారుల నోటీసుల మేరకు కేటీఆర్ సోమవారం ఉదయం 10 గంటలకు తన న్యాయవాది రాంచందర్‌రావుతో కలిసి బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. కేవలం కేటీఆర్ వాహనాన్ని మాత్రమే పోలీసులు లోనికి అనుమతించారు. కాగా సాయంత్రం 6 గంటల వరకు అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నించారు. ఏసీబీ డైరెక్టర్ తరుణ్‌జోష్, జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ (సీఐయూ) డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్‌లతో కూడిన బృందం ప్రశ్నించినట్టు తెలిసింది. మధ్యలో టీ బ్రేక్‌లు ఇచ్చారని, మధ్యాహ్నం 45 నిమిషాలకు పైగా భోజన విరామం ఇచ్చినట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది జనవరి 9న కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా సోమవారం నాటి విచారణలో పలు కీలక అంశాలపై ప్రశ్నించారు. డాక్యుమెంట్లు ముందుంచి.. ఈ కేసులో ఏ–2 అయిన సీనియర్ ఐఏఎస్ అధికారిఅర్వింద్కుమార్, ఏ–3 హెచ్ఎండీఏ బోర్డు మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్‌రెడ్డితో పాటు గ్రీన్కో ఏస్ నెక్ట్స్ జెన్ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్ స్టేట్మెంట్లలో గుర్తించిన అంశాలు, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ప్రతినిధులను, సీఈవోను జూమ్ మీటింగ్ ద్వారా గతంలో వర్చువల్‌గా విచారించిన సమయంలో వారిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా తయారు చేసుకున్న ప్రశ్నావళి ఆధారంగా కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఇప్పటికే సేకరించిన పలు డాక్యుమెంట్లను ముందుంచి ప్రశ్నించారు. వరుస ప్రశ్నలు వేస్తూ, డాక్యుమెంట్లను చూపుతూ వివరాలు రాబట్టారు. కేటీఆర్ చెప్పేదంతా వీడియో రికార్డింగ్ చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉండగా ఏ హోదాలో ఆదేశాలు ఇచ్చారనే కోణంలో విచారణ సాగింది. మొదటి దఫా విచారణలో కేటీఆర్ ఇచ్చిన సమాచారం, కేసు దర్యాప్తులో సేకరించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆధారంగా క్రాస్ క్వశ్చనింగ్ చేశారు. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఖాతాలకు రూ.45.71 కోట్లు బదిలీ చేయడంపై, అనధికారింగా ఈ నగదు బదిలీ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాలపై మరోసారి ప్రశ్నించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ గ్రీన్కో కంపెనీ కొనుగోలుపైనా ఆరా తీసినట్టు తెలిసింది. కాగా అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు సూచించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ శ్రేణుల హడావుడి..ఉద్రిక్తత కేటీఆర్ విచారణకు బంజారాహిల్స్ వస్తుండడంతో పాటు అక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల సమావేశం జరగనున్న నేపథ్యంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ కార్యాలయానికి వంద మీటర్ల దూరంలో ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్‌ను అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులు ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. అయితే పోలీసులు వారిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ముందే అడ్డుకున్నారు. కొందరు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు పక్కనే ఉన్న నీలోఫర్ కేఫ్‌లోకి వెళ్లడంతో వారిని అక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నించారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో నీలోఫర్ కేఫ్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలను పోలీసులు కాసేపు మూసివేయించారు. -
మాజీ మంత్రి హరీష్‌రావుకు అస్వస్థత
హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం(జూన్ 16) సాయంత్రం సమయంలో తెలంగాణ భవన్లో హరీష్ రావు అస్వస్థతకు లోనయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆచ్.. ఏసీబీ విచారణకు హాజరై వచ్చిన తర్వాత నిర్విహించిన సమావేశంలో హరీష్‌రావు స్వల్పపాటి అస్వస్థతకు గురి కావడంతో ఆయన్ను అక్కడ నుంచి బేగంపేట కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. హై ఫీవర్‌తో హరీష్‌రావు ఆస్పత్రిలో చేరారు.వైరల్ ఫీవర్, డి ఐడ్రేషన్తో బాధ పడుతున్న మాజీ మంత్రి హరీష్ రావు.. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు.సాయంత్రం 7 గంటలకు బేగంపేట్ కిమ్స్ ఆసుపత్రిలో హరీష్‌రావును జాయిన్ చేయగా, ఆయన్ను కేటీఆర్, ఇతర బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. -
‘రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను’
సాక్షి,హైదరాబాద్: ఈ-కారు కేసు.. లొట్టపీసు కేసు. సీఎం రేవంత్ నీ ఉడత ఊపులకు భయపడను. దమ్ముంటే అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పెట్టు. రేవంత్ జైలుకు వెళ్లాడు కాబట్టి మమ్మల్ని జైలుకి పెట్టాలనుకుంటున్నారు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. ఫార్ములా ఈకార్ రేసు కేసులో ఇవాళ కేసీఆర్ ఏసీబీ విచారణ ముగిసింది. విచారణ అనంతరం,తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ఫార్ములా ఈ కార్ రేస్ ముమ్మాటికీ లొట్టపీసు కేసే. ఈయన లొట్టపీసు ముఖ్యమంత్రే. నాలుగు గోడల మధ్య కాదు, నాలుగు కోట్ల ప్రజల ముందు చర్చిద్దాం అని అసెంబ్లీలో చర్చ పెట్టుమని అడిగాను. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో తెలిపొద్ది అని చెప్పాను. నువ్వు ముందుకు రా? నేను తప్పు చేయలేదు అని లై డిటెక్టర్ సిద్దం కావాలని డిమాండ్ చేశాను.కానీ రాలేదు.ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదు. సీఎం రేవంత్ పంపిన పశ్నలే వీళ్లు అడుగుతున్నారు. వీళ్లకు పరిపాలన చేతకాదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ సాధించిన నేత కేసీఆర్, హరీష్ రావును కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. అడ్డంగా నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి నెల రోజులు జైల్లో ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా జైల్లో పెట్టాలని చూస్తున్నారు. చేయని తప్పుకు కేసిఆర్, హరీష్ రావును కాళేశ్వరం కేసులో జైల్లో పెట్టాలని చూస్తున్నాడు. నన్ను కూడా ఈ తుపెల్ కేసుతో జైల్లో పెట్టాలని చూస్తున్నారు. మా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా తుపెల్ కేసు అన్నారు. నాపై 14 కేసులు పెట్టారు. 14000 కేసులు పెట్టుకో. ఎవ్వడు భయపడడు.అందరూ కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తుగా ఓడించాలి. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభించి ఆరేళ్లు సంబరాలు చేసుకుందాం. కాళేశ్వరం గొప్పతనం జనానికి చెప్పాలి’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. -
కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతుగా నిలిచారు.ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. ఏసీబీ విచారణపై కవిత స్పందించారు. కేటీఆర్‌ను ఏసీబీ విచారణపై కవిత మీడియాతో మాట్లాడారు. ‘ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేతకు చెప్పుకోవడం సహజం. చెప్పుకున్నంత మాత్రానా దాన్నేదో భూతద్దంలో చూపించాల్సి అవసరం లేదు. మా పార్టీలో లోపాలు సవరించుకుంటాం. మా మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకోం. ప్రధాన సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే ఏసీబీ విచారణలు అంటూ హడావిడి. మా కార్యకర్తలను, నేతలను ఇళ్లకు రాకుండా అడ్డుకోవడం దారుణం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమేరైతు భరోసా ఇచ్చింది. అది కూడా 60 శాతం మంది రైతులకే ఇచ్చింది. మిగిలిన 40 శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా. రైతులందరికీ ఇస్తారా అనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకి ఎన్నో హామీలిచ్చి అందరినీ మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ప్రభుత్వం మోసం చేసింది.పింఛన్లు పెంచలేదు.. మహిళలకు రూ.2,500 ఇవ్వలేదు.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసింది. హామీల అమలు పై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని మా పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు లకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోంది. మొన్ననే కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్‌ను విచారించింది. ఇప్పుడు కేటీఆర్‌ను ఏసీబీ విచారిస్తోంది. మేం వేధింపులకు భయపడే వాళ్ళం కాదు.. కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ఈ ప్రభుత్వం తెలంగాణ భవన్ తాళం వేయడం దుర్మార్గం. మా కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణం. మా పార్టీ లోపాలను సవరించుకుంటాం.. మా మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటాం’ అని వాఖ్యానించారు. -
కేబినెట్ ఆమోదంతోనే..
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భారీ ప్రాజెక్టు. దీనికి సంబంధించిన నిర్ణయాలన్నీ రాష్ట్ర మంత్రివర్గ ఆమోదంతోనే తీసుకున్నాం. సాంకేతికపరమైన అంశాలపై ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు నిర్ణయాలు తీసుకున్నారు. కాళేశ్వరం కట్టాలని తొలుత రాజకీయ నిర్ణయం మేమే (ప్రభుత్వం) తీసుకున్నాం. తుమ్మిడిహట్టికి బదులుగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లు నిర్మించాలని అంతర్జాతీయ ఖ్యాతి గడించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ సూచించింది..’ అని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్.. బుధవారం బీఆర్కేఆర్ భవన్‌లోని కార్యాలయంలో నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఆయన 115వ సాక్షిగా పాల్గొన్నారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. తుమ్మిడిహట్టి వద్ద సాధ్యం కాకపోవడం వల్లే.. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్‌ల నిర్మాణంపై నిర్ణయం ఎవరిది అని కమిషన్ ప్రశ్నించగా, కేసీఆర్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. ‘ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని నాటి మహారాష్ట్ర సీఎం పృథీ్వరాజ్ చవాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చాక సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను నేను స్వయంగా కలిసి 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి సహకరించాలని కోరితే ససేమిరా అన్నారు. 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే సహకరిస్తామన్నారు. ప్రాణహిత–చేవెళ్ల కింద 160 టీఎంసీలను తరలించాల్సి ఉండగా, తుమ్మిడిహట్టి వద్ద అంత నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం సాధ్యం కాకపోవడం వల్లే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీఇంజనీరింగ్ చేపట్టాం. ప్రత్యామ్నాయాలపై వ్యాప్కోస్ ఆధ్వర్యంలో లైడార్ సర్వే చేయించగా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద మూడు బరాజ్‌లు నిర్మించాలని సిఫారసు చేసింది. బొగ్గు గనులు ఉండడంతో మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీళ్లను తరలించడం సాధ్యం కాదని తేల్చింది. అందుకే మూడు బరాజ్‌లు నిర్మించి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోయాలనే నిర్ణయం జరిగింది. మేడిగడ్డ వద్ద 230 టీఎంసీల జలాల లభ్యత ఉందని వ్యాప్కోస్ తేల్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల అనుమతులను కేంద్రం నుంచి తీసుకున్నాం. బరాజ్‌ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం ఉంది. మంత్రివర్గ ఆమోదంతోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని నిర్ణయాలు జరిగాయి..’ అని కేసీఆర్ చెప్పారు. ఆ నిర్ణయాలన్నీ ఇంజనీర్లవే... బరాజ్‌ల లొకేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? అని కమిషన్ ప్రశ్నించగా.. ఇంజనీర్లు, సాంకేతిక బృందం తీసుకుందని కేసీఆర్ బదులిచ్చారు. ‘కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 4 వేల మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. బరాజ్‌ల నుంచి పంప్‌హౌస్‌ల ద్వారా నీళ్లను ఎత్తిపోసేందుకు అవసరమైన స్థాయిల్లో నిల్వలను కొనసాగించే అంశంపై ఇంజనీర్లే నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక అంశాల్లో నిర్ణయాలన్నీ ఇంజనీర్లే తీసుకున్నారు. మంత్రివర్గ ఆమోదంతో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్) ఏర్పాటుకు అనుమతిచ్చాం. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కొరత ఉండడంతో రుణాల సమీకరణ కోసం దీనిని ఏర్పాటు చేశాం. ప్రాజెక్టుకు ఆదాయం సమకూరే వరకు రుణాల తిరిగి చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదే..’ అని మాజీ సీఎం చెప్పారు. బరాజ్‌ల నిర్వహణకు రూ.280 కోట్ల నిధులిచ్చాం..కానీ మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సీపేజీ ఏర్పడడం వెనక నిర్వహణ, పర్యక్షణ లోపాలు సైతం ఉన్నట్టు వచ్చిన ఆరోపణలపై కేసీఆర్ స్పందించారు. బరాజ్‌ల నిర్వహణ, పర్యవేక్షణ కోసం రూ.280 కోట్లను కేటాయిస్తూ 2020లో తమ ప్రభుత్వం జారీ చేసిన జీవో 45 ప్రతిని కమిషన్‌కు అందజేశారు. నిధులు మంజూరు చేసినా ఇంజనీర్లు వాడుకోలేదని కేసీఆర్ చెప్పినట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యత పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఓ క్వాలిటీ కంట్రోల్ డివిజన్నే ఏర్పాటు చేశామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలను తిప్పికొడుతూ రూపొందించిన ఓ పుస్తకాన్ని కూడా కమిషన్‌కు కేసీఆర్ అందజేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఇటీవల విలేకరుల సమావేశంలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌నే పుస్తక రూపంలోకి మార్చి కమిషన్‌కు ఇచ్చారు. సిబ్బందిని, మీడియాను బయటకు పంపించి.. క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఇప్పటివరకు హాజరైన ఇతర సాక్షులందరినీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తమ కార్యాలయ అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధుల సమక్షంలో బహిరంగంగానే ప్రశ్నించింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా బహిరంగ విచారణలో పాల్గొనలేనని, తనను ప్రశ్నించేటప్పుడు ఎవరినీ అనుమతించరాదని కేసీఆర్ చేసిన విజ్ఞప్తిపై కమిషన్ సానుకూలంగా స్పందించింది. కోర్టు హాలు నుంచి అందరినీ బయటకు పంపించి ‘ఇన్ కెమెరా’ విధానంలో (కేవలం కేసీఆర్, కమిషన్ కార్యదర్శి మాత్రమే ఉన్నప్పుడు) క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. జస్టిస్ ఘోష్ అడిగే ప్రశ్నలు, కేసీఆర్ ఇచ్చే సమాధానాలను కంప్యూటర్‌పై టైప్ చేసేందుకు కమిషన్ కార్యదర్శిని అనుమతించారు. 18 ప్రశ్నలు...50 నిమిషాలు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన విచారణ సుమారు 50 నిమిషాల పాటు సాగి 12.50 గంటలకు ముగిసింది. కేసీఆర్‌కు కమిషన్ 18 ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. కేసీఆర్‌ను కమిషన్ కార్యాలయానికి తోడ్కొని వచ్చిన వారిలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ తదితరులు ఉన్నారు. ముగిసిన క్రాస్ ఎగ్జామినేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌ల నిర్మాణంపై విచారణలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ చేపట్టిన క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. దీంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, పలువురు ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లు, మాజీ మంత్రులకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కమిషన్ గడువు వచ్చే నెలాఖరుతో ముగియనుండగా, ఆ లోగానే ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచే అవకాశం ఉంది. -
‘జడ్జీల ఫోన్లను ట్యాపింగ్ చేయమని మీకు ఎవరు చెప్పారు’?
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్‌పై ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు (Special Intelligence Branch (SIB) రెండో సారి సిట్ విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మూడు గంటలుగా కొనసాగుతున్న విచారణలో సిట్ బృందం ప్రభాకర్ రావుపై (T Prabhakar Rao) పలు ప్రశ్నలు సంధించింది. డీసీపీ విజయ్ కుమార్, ఎసీపీ వెంకటగిరి ఇద్దరు కలిసి ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. విచారణలో హార్డ్ డిస్క్‌లు ఎందుకు ధ్వంసం చెయ్యాలని ఆదేశించారు?. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రైవేటు వ్యక్తి శ్రవణ్ రావు పాత్ర ఎంత మేర ఉంది..? ప్రతిపక్ష నేతలు, జడ్జీలు, జర్నలిస్టుల ఫోన్ ట్యాప్ ఎవరు చెయ్యమన్నారని ప్రశ్నించింది. విచారణలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి టెలికాం సర్వీస్ డేటాను సైతం సిట్ ముందుంచింది. దీంతో పాటు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, ఐదుగురు నిందితుల స్టేట్మెంట్ ఆధారంగా ప్రశ్నలు సంధించింది. ఇక సిట్ విచారణ మొదటి రోజు నోరు మెదపని ప్రభాకర్.. తనపై ఉన్నతాధికారుల సర్వెలైన్ ఉందని చెప్పినట్లు సమాచారం. -
ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పల్లా రాజేశ్వర్‌కు గాయం.. యశోదకు తరలింపు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లోని బాత్ రూమ్‌లో కాలు జారిపోయి కింద పడిపోవడంతో రాజేశ్వర్ రెడ్డి కాలు విరిగినట్టు తెలుస్తోంది. దీంతో, అంబులెన్స్‌లో ఆయనను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్టు సమాచారం.అయితే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ నేతలు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ బాత్రూమ్లో కాలి జారి కింద పడిపోయారు. దీంతో, ఆయన కాలు విరిగినట్టు తెలుస్తోంది. అనంతరం, అంబులెన్స్‌లో ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలిస్తున్నట్టు సమాచారం. -
నేడు కేసీఆర్ క్రాస్ ఎగ్జామినేషన్
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనుంది. విచారణ కమిషన్ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ 2023 అక్టోబర్ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. బరాజ్‌లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్ అధికారులకు కమిషన్ ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులు విచారణ కమిషన్ ముందు సాక్ష్యం ఇచ్చారు. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్ ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలను సంధిస్తోంది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారు? వాటికి మంత్రివర్గ ఆమోదం ఉందా? కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)ను ఎందుకు ఏర్పాటు చేశారు? బరాజ్‌లలో నిరంతరం నీళ్లు నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు? వంటి అంశాలపై కమిషన్ లోతుగా ప్రశ్నిస్తోంది. విచారణ చివరి దశకు చేరడంతో ఈ నెల 6న మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నించింది. చివరగా బుధవారం కేసీఆర్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటివరకు కమిషన్ గుర్తించిన అవకతవకతలను కేసీఆర్ ముందు ఉంచుతూ ఆయన నుంచి వివరణ కోరనున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ను ప్రశ్నించడంతో సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ ముగియనుంది. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి కమిషన్ తన నివేదికను అందజేసే అవకాశం ఉంది. హరీశ్‌రావు సహా ఇంజనీర్లు, నిపుణులతో కేసీఆర్ మంతనాలు కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో కేసీఆర్ సోమ, మంగళవారాల్లో పార్టీ నేత హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలపై ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు, సాగునీటిరంగ నిపుణులకు ఫోన్ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సందేహాలను కేసీఆర్ నివృత్తి చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్ ఎర్రవల్లి నివాసం నుంచి వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్‌కు భారీగా తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ కుట్రతోనే తమ అధినేతను విచారణ పేరిట ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అధినేతకు సంఘీభావంగా తరలిరావాలని కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
కేసీఆర్ విచారణలో కీలక మార్పులు!
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రేపు (బుధవారం) కేసీఆర్‌ను నేరుగా విచారిస్తామని, అంగీకరించకపోతే ఇన్ కెమెరా విచారణ చేపడతామని కాళేశ్వరం కమీషన్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే, అంతకుందు కేసీఆర్‌ను ఓపెన్ కోర్ట్ కాకుండా ఇన్ కెమెరా విచారణ చేస్తే ఎలా ఉంటుందని కమిషన్ యోచించింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ ఇన్ కెమెరా విచారణ? చేపట్టనుందని వార్తలు వచ్చాయి. బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరు కాకుండా ఇన్ కెమెరా ముందే కమిషన్ విచారణలో పాల్గొనే అవకాశం కేసీఆర్‌కు కలిగింది. కమిషన్ అడిగే ప్రశ్నలకు ఇన్ కెమెరా సమాధానం చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న వారిని ఓపెన్ కోర్టులోనే కమిషన్ విచారించింది. కేసీఆర్‌ను మాత్రం మాజీ సీఎం హోదాలో ఇన్ కెమెరా విచారణకు హాజరయ్యే అవకాశం కల్పించింది. కాగా, రేపు కమిషన్ ముందు 115 సాక్షిగా కమిషన్ ముందు కేసీఆర్ హాజరు అవుతారా? ఇన్ కెమెరాకు హాజరవుతురా? అనేది తెలియాల్సి ఉంది. -
బీఆర్ఎస్ కక్కుర్తితో రాష్ట్రానికి శాశ్వత నష్టం
సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, కమీషన్ల కక్కుర్తితో తెలంగాణకు శాశ్వత నష్టం జరిగిందని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అవాస్తవిక ప్రచారం చేపడుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ప్రచారానికి అంశాలవారీగా కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఐదేళ్లలో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసిన నీళ్లు 162 టీఎంసీలే ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు మేడిగడ్డ గుండెకాయ అని చెప్పింది మీరే. 2019లో బ్యారేజీ నిర్మాణం పూర్తవగా 2023–24 వరకు మొత్తంగా 162 టీఎంసీలను మేడిగడ్డ నుంచి ఎత్తిపోశారు. ఇందులో మళ్లీ వరదలు రాగానే సముద్రంలోకి వదిలిన నీరు 63 టీఎంసీలు. ఐదేళ్లలో 99 టీఎంసీలతో 22 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లా ఇచ్చావో చెప్పు?’అని హరీశ్‌రావును మంత్రి ఉత్తమ్ ఆ ప్రకటనలో నిలదీశారు. 2022 జూలైలో వరదలకు సిరిపురం (అన్నారం) పంప్‌హౌస్ నీటమునిగిందని.. అదే ఏడాది కన్నెపల్లి (మేడిగడ్డ) పంప్‌హౌస్ ట్రెస్ట్వాల్ కూలి పంప్‌హౌస్‌లోని మోటార్లన్నీ దెబ్బతిన్నాయని ఆయన గుర్తుచేశారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని పేర్కొన్నారు. నిధుల మళ్లింపు కోసమే బీఆర్ఎస్ బ్యారేజీలు.. ‘ఫరక్కా బ్యారేజీ కట్టింది నీటి మళ్లింపు కోసమే. రాతి పునాది వల్లే ఆ బ్యారేజీ మనుగడ సాగిస్తోంది. ఫరక్కా బ్యారేజీని 1975లో కట్టినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను ప్రతిపాదించింది.. కట్టింది.. బీఆర్ఎస్ హయాంలోనే. మేడిగడ్డ కుంగింది కూడా బీఆర్ఎస్ హయాంలోనే. ఫరక్కా బ్యారేజీని నీటి మళ్లింపు కోసం కడితే కాళేశ్వరం బ్యారేజీలను నిధుల మళ్లింపు కోసం కట్టారు. కేసీఆర్ కుటుంబ అవినీతికి కాళేశ్వరం బ్యారేజీలే ప్రత్యక్ష సాక్ష్యం’అని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీని కడతామని మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని ఏనుగులతో ర్యాలీలు తీయలేదా? ఆ తర్వాత బ్యారేజీ కట్టకుండా ఎందుకు పక్కనపెట్టారు? తుమ్మిడిహెట్టి వద్ద కడితే పేరు కాంగ్రెస్‌కు, పైసలు రావనేది ప్రధాన కారణం. తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి దాకా నీటిని గ్రావిటీతో తరలించడానికి 100 కి.మీ. ఓపెన్ కెనాల్ నిర్మాణం జరిగింది. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ కడితే 100 కి.మీ. దాకా గ్రావిటీ ద్వారానే నీళ్లు వచ్చేవి. కానీ మేడిగడ్డ బ్యారేజీ వల్ల 100 కి.మీ. కిందకు వెళ్లి నీటిని ఎత్తిపోయడం, వరదలు రాగానే మళ్లీ నీటిని సముద్రంలోకి వదిలేయడం చేశారు. ఇది కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కాదు.. తిప్పిపోతల పథకం’అని ఉత్తమ్ మండిపడ్డారు.వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్‌రావే కాళేశ్వరం బ్యారేజీ వైఫల్యానికి ప్రధాన కారకులు కేసీఆర్, హరీశ్‌రావేనని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. 2018 దాకా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండి నాసిరకం పనులు చేపట్టి, ప్రజాధనం దురి్వనియోగం చేసినందుకు ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పలేదని... నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి పేరు రావొద్దనే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ రూ. 38 వేల కోట్లతో పూర్తై ఇప్పటికే తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల దాకా 17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు అందేదన్నారు.కానీ బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాలు, కక్కుర్తి వల్ల రాష్ట్రానికి, రైతాంగానికి శాశ్వత నష్టం జరిగిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ కమీషన్ల కక్కుర్తి వల్ల తెలంగాణ ప్రజలు నీటిపారుదల ప్రాజెక్టుల అప్పులకు ఏటా రూ. 16 వేల కోట్ల వడ్డీ కట్టాల్సివస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరంలో అన్ని మోటార్లు పనిచేసి ఉంటే విద్యుత్ భారమే ఏడాదికి రూ. 10 వేల కోట్లు అయ్యేదన్న మంత్రి ఉత్తమ్.. ఒకవేళ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఉంటే విద్యుత్ భారం కేవలం రూ.1000 కోట్లే అయ్యేదన్నారు. బీఆర్ఎస్ తప్పుడు నిర్ణయాల వల్ల తెలంగాణకు ఆర్థిక భారం శాశ్వతంగా నిలిచిపోయిందని విమర్శించారు. -
ఎప్పుడేం జరుగుతుందో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ లోపల, వెలుపల చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది. పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు విచారణ సంస్థల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో విచారణ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో కేడర్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకొని శనివారం హైదరాబాద్‌కు చేరుకోనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీటన్నింటిపై ఎలా స్పందిస్తారనే చర్చ నడుస్తోంది.కేసీఆర్ విచారణ నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఏమిటో?కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్ ఎదుట విచారణకు ఈ నెల 9న హరీశ్‌రావు, 11న కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ విషయంలో కేసీఆర్‌కు కమిషన్ నోటీసులు ఇచ్చినా పార్టీ ఇప్పటివరకు స్పందించక పోవడాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్ఎస్ చేపట్టే కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కవిత ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలపడం తెలిసిందే. ఈ నెల 11న కూడా తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.‘ఫార్ములా–ఈ’పై విచారణకు కేటీఆర్‘ఫార్ములా–ఈ’ కారు రేసు అంశంలో గతంలో విచారణకు హాజరైన కేటీఆర్‌కు ఈ నెల 5న రావాల్సిందిగా ఏసీబీ మరోసారి నోటీసు జారీ చేయగా అమెరికా పర్యటన ముగించుకొని వచ్చాక హాజరవుతానని పేర్కొనడం తెలిసిందే. శనివారం హైదరాబాద్ చేరుకోనున్న కేటీఆర్ ఈ నెల 3వ వారంలో ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్, మరో కీలక నేత హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే సమయంలోనే కేటీఆర్‌కు కూడా నోటీసులు రావడం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్గాలు విమర్శిస్తున్నాయి.‘కవిత ఎపిసోడ్’పైనా పార్టీలో ఉత్కంఠఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ కావడం కలకలం సృష్టించింది. గత నెల 23న అమెరికా నుంచి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కేసీఆర్‌కు తాను లేఖ రాసిన విషయాన్ని అంగీకరిస్తూనే ‘కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. అలాగే గత నెల 29న కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ జెండా, కండువాలు లేకుండా ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ కేడర్‌లో వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్ తాజా పరిణామాల జోలికి వెళ్లకుండా కేవలం సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు వంటి అంశాలపైనే దృష్టి సారించే అవకాశముందని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. -
నేడు హైదరాబాద్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: గత నెల 27న విదేశీ పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ‘ఫార్ములా–ఈ’రేస్‌కు సంబంధించి మే 28న విచారణకు రావాల్సిందిగా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా, తాను విదేశీ పర్యటన అనంతరం హాజరవుతానంటూ ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఈ నెల మూడో వారంలో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో కేటీఆర్ తన అమెరికా పర్యటనను కుదించుకున్నారు. ఆయన భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం బయల్దేరతారు. గోపీనాథ్ కుటుంబసభ్యులతో పాటు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ఏం పని?
సాక్షి, హైదరాబాద్: అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవిని ఇంటికి పిలిపించుకొని మాట్లాడాల్సిన అవసరం ఏంటని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ తిరుగుతున్నారంటూ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. గురువారం నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం గాం«దీభవన్‌లో జరిగింది. పార్టీ నిర్మాణం, ప్రభుత్వ పథకాల ప్రచారంపై విశ్లేషణ వంటి అంశాలపై చర్చించారు. అయితే స్థానిక అంశాలపైనే మూడు నియోజకవర్గాల నాయకులు మాట్లాడినట్టు తెలిసింది.⇒ నాగర్‌కర్నూల్ సమావేశంలో ఎంపీ మల్లు రవిని లక్ష్యంగా చేసుకొని మాజీ ఎమ్మెల్యే సంపత్, ఆయన వర్గం నాయకులు మీనాక్షి నటరాజన్‌కు ఫిర్యాదు చేశారు. పదేళ్లు కష్టపడిన మమ్మల్ని పక్కన బెట్టి ఇతరులకు ప్రియార్టీ ఇస్తారా అని సంపత్ వర్గం మల్లు రవిపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ⇒ మహబూబ్‌గర్ పార్లమెంట్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ప్రతినిధులుగా తాము చెప్పే విషయాలు అధికారులు వినడం లేదని మీనాక్షికి చెప్పినట్టు సమాచారం. వరంగల్ పార్లమెంటు సమావేశంలో స్థానిక అంశాలను ఇన్చార్జ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ మూడు నియోజకవర్గాల నాయకులకు దిశానిర్దేశం చేశారు. గాందీభవన్‌లో మూడు నియోజకవర్గాలకు విడివిడిగా జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లా డుతూ పథకాల ప్రభావం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తుందని, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని రాబోయే ఎన్నికల్లో అనుకూలంగా మలచుకోవాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. సమావేశాల్లో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మూడు నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరగనుంది. -
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు తీవ్ర అస్వస్థత.. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు(గురువారం) తీవ్ర అస్వస్థతకు గురైన మాగంటి గోపీనాథ్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నేతలు ఏఐజీ ఆస్పత్రికి చేరుకుని మాగంటి గోపీనాథ్‌ను పరామర్శించారు. బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు.. హుటాహుటీనా ఆస్పత్రికి చేరుకుని గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం గోపీనాథ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.నిలకడగానే ఆరోగ్యం: దాసోజు శ్రవణ్ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై గోపీనాథ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారన్నారు. 48 గంటలు గడిస్తే గానీ గోపీనాథ్ ఆరోగ్యంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు శ్రవణ్. -
లుకలుకలు.. కుమ్ములాటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు. ఒకటి అధికార కాంగ్రెస్, రెండోది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మూడవది జాతీయ పార్టీ బీజేపీ. ఏ చిన్న అవకాశం దొరికినా ప్రత్యర్థి పార్టీలపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతుంటాయి. ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయతి్నస్తుంటాయి. కానీ ప్రస్తుతం.. ఈ మూడు ప్రధాన రాజకీయ పక్షాలూ వేటికవే తమతమ పార్టీల్లో అసమ్మతి స్వరాలు, అసంతృప్తి జ్వాలలు, అంతర్గత కుమ్ములాటలు, విభేదాలతో సతమతమవుతున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీలో లుకలుకలు స్పష్టంగా కని్పస్తున్నాయి. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువని చెప్పే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివి సహజమే అయినా క్రమశిక్షణకు మారుపేరని భావించే బీజేపీ, ఏకఛత్రాధిపత్యం కింద నడిచే ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్లో కూడా రాజకీయ రచ్చ కొనసాగుతుండటం గమనార్హం. అయితే గ్రూపులు, గొడవలకు పుట్టినిల్లు లాంటి కాంగ్రెస్ పార్టీలో రహస్య కొట్లాటలు జరుగుతుంటే, బీజేపీ, బీఆర్ఎస్లలో మాత్రం విభేదాలు బహిరంగమవుతుండటం మరో విశేషం. కాంగ్రెస్‌లో పదవులు, ప్రాధాన్యం రభస రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. ఏడాదిన్నరలోనే ప్రభుత్వ పాలన, ప్రభుత్వ.. పార్టీ పదవులు, ప్రాధాన్యత, మంత్రివర్గ విస్తరణ, మంత్రుల వ్యవహారశైలి తదితర అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. అంతర్గత విభేదాలకు, ఫిర్యాదులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ అంశం ఏడాదిన్నర తర్వాత కూడా కొలిక్కి రావడం లేదు. ఎన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా, హైదరాబాద్‌లో చర్చలు జరిగినా తేలడం లేదు. అదిగో విస్తరణ...ఇదిగో విస్తరణ అంటూ ఎప్పటికప్పుడు దాటవేతతో విసుగు వచ్చిన ఇద్దరు ఆశావహ ఎమ్మెల్యేలు.. కేబినెట్లో బెర్తు కేటాయించకపోతే తమ దారి తాము చూసుకుంటామని సన్నిహితుల వద్ద నిరసన గళం విని్పంచినట్టుగా బయటకు రావడం పార్టీలో కలకలం రేపింది. మరోవైపు పదవుల లొల్లి కూడా ఆ పార్టీని కుదిపేస్తోంది. చాలా కాలం తర్వాత నియమించిన కమిటీల్లో కొంత సామాజిక న్యాయ కోణం కనిపించినా సీనియర్లు, జూనియర్లు అనే విభేదాలు మరింత పెరిగాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జూనియర్లకు, ప్యారాచూట్ల (బయటి పార్టీల నుంచి వచ్చిన వారికి)కు కమిటీల్లో ప్రాధాన్యతనిచ్చారనే అసంతృప్తి వ్యక్తమవుతుండటం గమనార్హం. ఇంకోవైపు మహిళా కాంగ్రెస్ నేతలు గాం«దీభవన్‌లోని టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్ ముందు తమకు ప్రాధాన్యత లభించడం లేదంటూ ధర్నాకు దిగడం కూడా చర్చనీయాంశమైంది. అయితే, టీ కప్పులో తుపాను మాదిరి ఆ వివాదం ముగిసినా, పార్టీలో ప్రాధాన్యత అంశం అంతర్గతంగా అగ్గిని రాజేస్తూనే ఉంది. మంత్రులపై ఫిర్యాదులు..పాలనపై విమర్శలు సీఎంకు, మంత్రులకు మధ్య సఖ్యత లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుండగా, కొందరు మంత్రుల పనితీరుపై ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసేంతవరకు పరిస్థితి వెళ్లిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై కూడా పార్టీలో తీవ్రంగానే చర్చ జరుగుతోంది. ఎంత చేసినా ప్రజల మన్ననలు రావడం లేదని పార్టీ నేతలు చెబుతుంటే, తాము చేసినవన్నీ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వ పెద్దలున్నారు. ఈ క్రమంలో వీలున్నంత త్వరగా మంత్రివర్గ విస్తరణ జరగాల్సిందేనని, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి పట్టు నిరూపించుకోకపోతే పార్టీ గ్రాఫ్ డౌన్ కావడం ప్రారంభమవుతుందని కాంగ్రెస్ నేతలే బహిరంగ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం. గులాబీకి ‘కుటుంబ ముళ్ల’ పోటు బీఆర్ఎస్లో ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీలో ఆమె ఇప్పుడు రె‘బెల్స్’ మోగిస్తున్నారు. తండ్రి కేసీఆర్‌ను విమర్శించకుండా వ్యూహాత్మక వ్యాఖ్యలు చేస్తూ, ప్రశ్నలు వేస్తూ గులాబీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాస్తవానికి వరంగల్‌లో పార్టీ రజతోత్సవ సభకు ముందు అంతర్గత చర్చలకే పరిమితమైన ఆమె, ఆ తర్వాత గేర్ మార్చారు. సభ నిర్వహణ గురించి కేసీఆర్‌కు స్వదస్తూరితో రాసిన లేఖ బీఆర్ఎస్లో అశాంతిని బహిర్గతం చేసింది. ఆ లేఖ లీక్ కావడం, ఆ లీకేజీ వెనుక ఎవరున్నారన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతుండడం అటు బీఆర్ఎస్నే కాదు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాలను కూడా కుదిపేశాయి. కేసీఆర్ దేవుడని, అయితే ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అమెరికా నుంచి వచ్చిన వెంటనే శంషాబాద్ విమానాశ్రయంలోనే ఆమె పేల్చిన బాంబు మంటలు ఇంకా చల్లారలేదు. ఆ తర్వాత ఆమె స్పీడ్ మరింత పెంచారు. ఇష్టాగోష్టిలో బాంబు పేల్చిన కవిత మీడియాతో ఇష్టాగోష్టి పేరుతో కవిత మరో రాజకీయ ఆటం బాంబు పేల్చారు. బీజేపీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీఆర్ఎస్లో ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని అడ్డుకుంటున్నందుకే తనను బయటకు పంపాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అధినేత కేసీఆర్‌ను సైతం ఇరకాటంలో పడేశాయి. అంతటితో ఆగని కవిత తెలంగాణ జాగృతి పేరుతో బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్తో సమాంతరంగా జాగృతిని తీసుకెళ్తానని చెప్పకనే చెపుతున్న ఆమె, పరోక్షంగా పార్టీని సవాల్ చేస్తూ ధర్నాకు దిగుతున్నారు. కేసీఆర్‌కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు ఇవ్వడానికి నిరసనగా చేపడుతున్న ధర్నాతో.. బీఆర్ఎస్ చేయలేని పనిని తాను చేస్తున్నానని పార్టీ కేడర్‌కు సంకేతాలిచ్చే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. ఈ కుటుంబ పంచాయతీ కేడర్‌ను అయోమయానికి గురి చేస్తోంది. ఇలావుండగా.. ఎప్పుడూ లేని విధంగా ఇటీవల హరీశ్‌రావు ఇంటికి కేటీఆర్ వెళ్లడం కూడా అటు బీఆర్ఎస్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారి తీస్తోంది. ఇంత జరుగుతున్నా.. కేటీఆర్ నాయకత్వాన్ని ప్రశ్నించే రీతిలో కవిత అస్త్రాలు సంధిస్తున్నా కేసీఆర్ మాత్రం మౌన ముద్రలోనే ఉండడం గమనార్హం. కమలం.. కలహాల కాపురం సాధారణంగా బీజేపీలో అంతర్గత విభేదాలు బహిర్గతం కావు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ భావజాలంతో నడిచే ఆ పార్టీలో ఎంతటి వివాదాలు, భిన్నాభిప్రాయాలైనా లోలోపలే పరిష్కరించుకుంటారు. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గ్రూపులుగా విడిపోయి వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదని, ఎంపీల్లోని ఏ ఇద్దరూ ఒక్కచోట కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదని ఆ పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో పెద్ద రచ్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఎంతగా అంటే అసలు ఏ నాయకుడిని ఎంపిక చేయాలో పార్టీ అధిష్టానానికి కూడా అంతుపట్టనంతగా ఈ పదవి కోసం నేతలు పోట్లాడుకుంటున్నట్టు బీజేపీలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత కూడా కిషన్‌రెడ్డినే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా పార్టీ అధ్యక్షుల ఎంపిక వ్యవహారంలోనూ బహిరంగ విమర్శలు వ్యక్తమయ్యాయి. రాజాసింగ్ టార్గెట్ ఎవరో? రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా, ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రచ్చ రచ్చ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి, ఆ తర్వాత మళ్లీ పార్టీలోకి వచ్చి కమలం గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే, ఈసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాజాసింగ్ స్టైల్ మార్చారు. ఎప్పటిలాగా ఎంఐఎంను కాకుండా ఈసారి సొంత పార్టీ నేతలనే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో పెద్ద చర్చకే దారి తీస్తున్నాయి. ‘మా పార్టీ నేతలకు ప్యాకేజీలు ఇస్తే ఏ పార్టీనయినా విలీనం చేసుకుంటారు..’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఆయన్ను మరోమారు సస్పెండ్ చేస్తారనేంత వరకు ఈ వ్యవహారం వెళ్లింది. అయితే ఆ అంశంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. తనను సస్పెండ్ చేస్తే ఒక్కొక్కరి జాతకాలు బయట పెడతానంటూ హెచ్చరించడం పార్టీ నేతలను ఇరకాటంలో పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయన అసలు రాష్ట్ర పార్టీలో ఎవరిని టార్గెట్ చేశారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడి ఎంపిక, పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల విషయంలో.. అధిష్టానం పట్టీపట్టనట్టుగా ఉండటం, ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్ అవుతోంది. ఈ విధంగా.. ఎన్నికలకు మూడేళ్లకు పైగా సమయం ఉన్నప్పుడే ఈ మూడు ప్రధాన పార్టీల్లో జరుగుతున్న లొల్లి, అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంత తీవ్రంగా మారుతుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
తెలుగు విద్యార్థులకు న్యాయ సహాయం
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు అండగా నిలుస్తామని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు భరోసా ఇచ్చారు. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య కోసం అమెరికాకు వచ్చిన విద్యార్థులు స్థానిక చట్టాలపై అవగాహన లేకుండా ఏవైనా తప్పులు చేస్తే వారికి బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున న్యాయ సహాయం చేస్తామని చెప్పారు. అమెరికాకు వర్థిన విద్యార్థులు ఏదైనా కారణంతో స్వదేశానికి తిరిగి వస్తే ఆ విద్యార్థితో పాటు వారి కుటుంబం కూడా ఎంతో ఆవేదనకు గురవుతుందని, ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థుల్లో మనోధైర్యం నింపేందుకు బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. అమెరికాలోని భారతీయ విద్యార్థులు కూడా స్థానిక చట్టాలతో పాటు అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని మసలుకోవాలని సూచించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్– డాలస్‌లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో కేటీఆర్ మాట్లాడారు. యూనివర్సిటీ విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. గతంలో భారతీయులు అమెరికాలో ఉద్యోగాలు, చదువు కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడేవారని కేటీఆర్ గుర్తు చేశారు. వేగంగా మారిన ప్రపంచ పరిణామాలతో అనేక సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో అమెరికాలో అవకాశాలు కూడా పెరిగాయని అన్నారు. ర్యాంకులు, గ్రేడ్ల కోసం కాకుండా జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కేవలం ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా సమాజంలో ప్రపంచంలో మంచి మార్పు తీసుకువచ్చే దిశగా ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఐటీ మరింత అభివృద్ధి మంగళవారం డాలస్‌లో అక్కడి ఐటీ కంపెనీల యాజ మాన్య ప్రతినిధులతో కూడా కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ పరిశ్రమను మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఐటీ రంగంలో తెచ్చిన విప్లవాత్మక విధానాల వల్లే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. ప్రభుత్వాలు, ఐటీ కంపెనీలు కలిసి పని చేస్తేనే ఏఐ రంగంలో దేశ యువత పోటీ పడగలుగుతుందన్నారు. అమెరికాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు భారత్‌లో ఖండాంతర సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశముందని చెప్పారు. దీంతో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా ఐటీ రంగంవిస్తరించి ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయని అన్నారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి నగరాల్లోనూ ఐటీ హబ్‌లు నిర్మించామని తెలిపారు. అమెరికాలోని యువత భారత్‌లో పెట్టుబడులు పెట్టి మాతృభూమి రుణం తీర్చుకోవాలని కోరారు. కేసీఆర్ జీవితం స్ఫూర్తిగా... సాహసోపేత నిర్ణయాల ద్వారానే కలలు సాకారం అవుతాయనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితమే సాక్ష్యమని కేటీఆర్ అన్నారు. నలభై ఏళ్ల వయసులోనే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి అవహేళనలు ఎదురైనా 14 ఏళ్లు నిరంతర పోరాటంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారని చెప్పారు. అమెరికాలో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తిరిగి భారత్‌కు వచ్చి కంపెనీలు ప్రారంభించాలని, ఆవిష్కరణల యుగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలని విద్యార్థులను కోరారు. భారత్‌లో సవాళ్లతో పాటు అవకాశాలు కూడా ఉన్నాయన్నారు. మేధో వలస భారత్‌కు పెను సవాలుగా మారిందంటూ, ప్రవాస భారతీయ విద్యార్థులు దేశ, తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
ఎవరితోనూ పొత్తు ఉండదు
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుంది అన్నట్లుగా ఎవరో మాట్లాడుతున్నారు. ఎన్నికలు ఏవైనా బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. సొంతంగానే మనుగడ సాగిస్తూ.. ఒంటరిగానే పోటీ చేసి మళ్లీ అధికారంలోకి వస్తుంది. వంద అసెంబ్లీ సీట్లతో గులాబీ జెండా ఎగురుతుంది’అని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొ న్న అనంతరం జరిగిన సమావేశంలో హరీశ్‌రావు ప్రసంగించారు. ‘బీజేపీకి తెలంగాణ మీద మాట్లాడే హక్కు లేదు.పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంతో పాటు బనకచర్ల లింకు అక్రమ ప్రాజెక్టుకు నిధులు ఇస్తున్నది. బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు శాపం కాబోతున్నా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడటం లేదు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. బనకచర్ల ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే సుప్రీం కోర్టుకు వెళ్లి నిలుపుదల చేస్తాం. కృష్ణా నదిలో నీళ్లు ఆపకుండా, గురువు చంద్రబాబుకు దాసోహం అయిన సీఎం ఇప్పుడు గోదావరి నీళ్ల విషయంలోనూ అదే చేస్తున్నారు. బనకచర్లపై అసెంబ్లీలో చర్చ పెట్టినా, ఢిల్లీలో ధర్నా చేసినా కలసి వచ్చేందుకు సిద్ధం, బీఆర్ఎస్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఏదైనా చేస్తాం’అని హరీశ్ అన్నారు. ఆ ఫుటేజీ బయట పెట్టాలి..‘సీఎంకు దగ్గరగా ఉండే ఒక ఎంపీ, కార్పొరేషన్ చైర్మన్, ఐఏఎస్ అధికారి.. మిస్ ఇంగ్లండ్ పట్ల అనుచితంగా వ్యవహరించారనే వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే దీనికి సంబంధించిన వీడియో ఫుటేజీ బయట పెట్టి, వారిపై కేసులు నమోదు చేయాలి. తెలంగాణను కేసీఆర్ ప్రపంచ పటంలో నిలబెడితే, రేవంత్ తెలంగాణకు తలవంపులు తెచ్చారు’అని హరీశ్ ధ్వజమెత్తారు. రేవంత్ పాలనలో ఆదాయం నేలచూపులు..‘రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని దిక్కుమాలిన ప్రచారం చేసే వాళ్లు దివానా గాళ్లు. ఆరు గ్యారంటీల పేరిట హామీలు ఇచ్చి, తాను తీసుకున్న గోతిలో రేవంత్ తానే పడిపోయారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ఆదాయం ఆకాశం వైపు చూస్తే, రేవంత్ పాలనలో నేల వైపు చూస్తున్నది. ఎన్నడూ జై తెలంగాణ అనని రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ద్రోహి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే ధైర్యం రేవంత్‌కు లేదు’అని హరీశ్ విమర్శించారు.దుర్మార్గుల చేతుల్లోకి తెలంగాణరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసి గందర గోళానికి గురి చేసే ప్రయత్నాలు జరుగుతున్నా యన్నారు. తెలంగాణ రాష్ట్రం దుర్మార్గుల చేతుల్లోకి వెళ్లిందని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆత్మ బలిదానాలు కలిచివేశాయని, ఓ దశలో మంత్రి పదవికి రాజీనామా చేయాలి అనుకున్నట్లు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు ప్రసంగించారు. మధుసూదనాచారి, హరీశ్‌రావు తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అలాగే జయశంకర్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. తర్వాత జాతీయ పతాకాన్ని మధుసూదనాచారి ఆవిష్కరించారు. -
కాళేశ్వరంపై విష ప్రచారం ఆపాలి
సాక్షి, హైదరాబాద్: ‘కాళేశ్వరం ప్రాజెక్టు.. కూలేశ్వరం అయ్యిందని కొంతమంది మూర్ఖులు తెలిసీతెలియక మాట్లాడుతు న్నారు. అది 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే జల అక్షయపాత్ర. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాళేశ్వరంతోనే పునరుజ్జీవనం పొందింది. త్రీ గోర్జెస్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనాకు 16 ఏళ్లు పట్టింది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తెలంగాణలో నాలుగేళ్లలోనే నిర్మించిన ఘనత కేసీఆర్‌ది. 371 పిల్లర్లు కలిగిన మూడు బరాజ్‌లలో రెండు పిల్లర్లకు నష్టం జరిగితే మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందనే విష ప్రచారాన్ని ఆపి.. కాళేశ్వరం ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.దక్షిణ తెలంగాణకు వరప్రదాయిని అయిన పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులు పూర్తయితే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని కాంగ్రెస్ పనులు చేపట్టడం లేదన్నారు. డాలస్‌లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2023 నాటికి రెండు పంటలకు కలిపి 2.29 కోట్ల ఎకరాలకు నీళ్లు అందించి పంజాబ్, హరియాణాలను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను కేసీఆర్ అగ్రస్థానంలో నిలిపారన్నారు. పదేళ్లలో తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ తప్పలేదని, మితిమీరి అప్పులు చేయలేదని చెప్పారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ చేయకూడని అప్పు, చేయకూడని తప్పులేవీ చేయలేదని కేటీఆర్ అన్నారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...అవకాశాల అక్షయపాత్ర తెలంగాణ‘తెలంగాణను పదేళ్ల పాలనలో అవకాశాల అక్షయ పాత్రగా తీర్చిదిద్దాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల స్ఫూర్తి డాలస్‌లో నూ కనిపిస్తోంది. ఎన్నారైలను చూసి తెలంగాణ తల్లి గర్వి స్తుంది. అమెరికన్ డ్రీమ్ తరహాలో కేసీఆర్ తెలంగాణ స్వ ప్నాన్ని మహాత్ముడు, అంబేడ్కర్, మార్టిన్ లూథర్‌కింగ్ స్ఫూ ర్తితో ముందుకు సాగి సాకారం చేశారు. మళ్లీ మూడేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తాం. కేసీఆర్ సీఎం అవుతారు. తెలంగాణను ప్రేమించడంలో వెనుకబడంఅధికారాన్ని బాధ్యతగా భావిస్తూ ఉద్యమ స్ఫూర్తితో ప్రభు త్వాన్ని నడిపి విడిపోతే విఫల రాష్ట్రం అవుతుందని హేళన చేసిన చోటనే విజయకేతనం ఎగరవేశాం. గేలి చేసిన నోళ్లతో నే మాకు కూడా మీలాంటి నాయకులు ఉంటే బాగుంటుంద నిపించాం. స్వరాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కూడా కేసీఆర్ నాయకత్వంలో వదులుకోలేదు. ఉద్యమంలో తెలంగాణ ఎన్నారైలు పోషించిన పాత్ర అద్వి తీయం. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా ఏనా డూ బతుకమ్మ, బతుకునిచ్చిన తెలంగాణ తల్లిని మర్చిపోలే దు. అమెరికాలో మన విద్యార్థులకు వస్తున్న ఇబ్బందులను తొలగించేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేసి అండగా నిలబడతామని కేసీఆర్ దూతగా మీకు మాట ఇస్తున్నా.ఘనంగా రజతోత్సవ సభడాలస్లోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాలకు వేలాదిమంది హాజరయ్యారు. విదేశాల్లో బహిరంగ సభ నిర్వహణ ద్వారా బీఆర్ఎస్ కొత్త సాంప్రదాయానికి తెరలేపింది. సభాప్రాంగణ సామర్థ్యం 7 వేల కెపాసిటీకాగా, ఫైర్‌కోడ్ యాక్టివేట్ కావడంతో సుమారు ఐదు వేల మంది సభా ప్రాంగణం బయటే ఉండిపోయారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో సభలు నిర్వహించే ప్రాంగణాల్లోకి నిర్ణీత సంఖ్యను దాటి జనం వస్తే ఫైర్‌కోడ్ యాక్టివేట్ అవుతుంది. కాగా అమెరికా నలుమూలల నుంచి ఈ సభకు ప్రవాస తెలంగాణవాసులు, ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. ఈ సభా వేదికగా, బీఆర్ఎస్, తెలంగాణ విజయగాథను కేటీఆర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ సాంస్కృతిక ప్రదర్శన, ధూంధాంకు నేతృత్వం వహించారు. -
‘తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఆయనే’
హైదరాబాద్: తెలంగాణలో కన్ఫ్యూజ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది ఈటెల రాజేందరేనని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ను వదిలి పెట్టిన అంటున్న ఆయన.. 24 గంటలు బీఆర్ఎస్ గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్న విషయం ఆ పార్టీ నాయకులే గుర్తించట్లేదని ఎద్దేవా చేశారు. ‘ లెఫ్ట్ వింగ్ లో ఉన్న ఈటెల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవికోసం రైట్ వింగ్ లోకి పోయాడు.. ఏ పదవి రావట్లేదని మా నాయకులపై ప్రస్టేషన్‌తో ఈటెల రాజేందర్ మాట్లాడొద్దు. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టే ఇవాళ ఆవిర్భావ సభలు జరుగుతున్నాయి..రేవంత్ రెడ్డి సన్నిహిత ఎంపీ ,కార్పొరేషన్ చైర్మన్ లు నన్ను ఇబ్బంది పెట్టారని ఇంగ్లాండ్ మిస్ మ్యాగీ అంటుంది అని హరీష్ రావు అంటుంన్నాడు..మీ దగ్గర వీడియో ఫుటేజ్ ఉంటే బయట పెట్టండి. ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మిస్ ఇంగ్లాండ్ మ్యాగీతో అలా మాట్లాడించారేమో బీఆర్ఎస్ వాళ్లు. నిన్న కౌంటర్‌గా కేసులు కూడా పెట్టారు. నిన్న కౌంటర్ గా కేసులు కూడా పెట్టారు దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా అని పదేండ్లు అనుభవించారు..అధికారుల లిస్ట్ రెడ్ బుక్‌లో నమోదు చేస్తా అనడం విడ్డూరంగా ఉంది. అధికారాన్ని ఎట్లా దుర్వినియోగం చేయాలనే విషయంలో హరీష్ రావు రోల్ మోడల్. రేవంత్ రెడ్డి ఎక్కడనైనా ఉండి సమీక్ష చేస్తడు...ములుగు అడవుల్లోనైన సమీక్ష చేస్తడు. మీరు ప్రగతి భవన్ అని ప్రగతి లేని బిల్డింగ్ కడితే మేము అధికారంలోకి రాగానే గడీలు పగలగొట్టాం’ అని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. -
రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తోంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడు ఓ కుటుంబ డ్రామా నడుస్తోందని, అధికారంలో ఉన్నప్పుడు దండుకున్న సొమ్మును పంచుకోవడంలో తలెత్తిన గొడవలే ఇందుకు కారణమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు చేసి దోచుకున్న ఆస్తుల కోసం జరుగుతున్న గొడవల్లో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ప్రజలు ఆలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. కేంద్రంలో మూడుసార్లు అధికారంలోకి వచి్చన ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో మచ్చలేని పాలన సాగిస్తోందన్నారు. మోదీ పాలనపై ఎలాంటి చర్చకైనా తాను సిద్ధమన్నారు. విద్యుత్, ఎరువులు, రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమా? అని కాంగ్రెస్‌కు సవాలు విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలన్నారు. రాహుల్ గాం«దీకి దేశ చరిత్ర తెలియదని ఎద్దేవా చేశారు. మోదీ పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. కాగా, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బీజేపీ జిల్లా, మండల పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలని సూచించారు. వర్క్‌షాప్‌కు పలువురు డుమ్మా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వర్క్‌షాప్‌కు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గైర్హాజరయ్యారు. మొత్తం 11 మంది ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల్లో కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారు. పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్, డీకే అరుణ, ఆర్.కృష్ణయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు హజరయ్యారు. ఎంపీ కె.లక్ష్మణ్ నిజామాబాద్ పర్యటనలో ఉన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు అర్వింద్, గోడెం నగేశ్ గైర్హాజరయ్యారు. -
పాలకుర్తిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్-బీఆర్ఎస్ల మధ్య ఘర్షణ
జనగామ: జిల్లాలోని పాలకుర్తిలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. కాంగ్రెస్ శ్రేణులు కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించాలనే ప్రయత్నం చేస్తుండగా బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. పాత నమూనా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్-బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అక్కడ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకోవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలో పాలకుర్తిలో పోలీసులను మోహరించి పరిస్థితిని చక్కదిద్దే యత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య కూడా తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెపట్టాయి. దాంతో పోలీసులను భారీగా మోహరించారు. -
‘ఈటెల బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నారు’
హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ ఒప్పందాన్ని ఎమ్మెల్సీ కవిత బహిర్గతం చేశారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధ్వజమెత్తారు. కేసీఆర్, కిషన్ రెడ్డిల లోపాయకారి ఒప్పందంతోనే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటూ విమర్శలు గుప్పించారు మహేష్ గౌడ్. ముందుగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలకు ఆ పార్టీ అధినాయకత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీలో ఎవరికి ఎంత ప్యాకేజ్ అందిందో బహిర్గతం చేయాలన్నారు మహేష్ గౌడ్. ఎంపీ ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటూ బీఆర్ఎస్ కోసం పని చేస్తున్నారని ఆరోపించారు.కాళేశ్వరం కమిషన్ నోటీసుల తర్వాత హరీష్ రావు, ఈటెల సమావేశమయ్యారని, ఈ భేటీలో ఈ భేటీ లో కేసీఆర్ తో ఈటెల ఫోన్ లో మాట్లాడారంటూ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.ట్రంప్‌కు భయపడే యుద్ధం ఆపేశారా?ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ పై యుద్ధానికి దిగిన భారత్.. మధ్యలో యుద్ధాన్ని ఆపడానికి కారణమేంటని ప్రశ్నించారు మహేష్ గౌడ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు భయపడే యుద్ధాన్ని మధ్యలో ఆపేశారా? అంటూ నిలదీశారు.‘యుద్ధంను మధ్య లో ఎందుకు ఆపారు.ట్రంప్ జోక్యం పై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు.పాకిస్థాన్- భారత్ యుద్ధంలో దేశం సాదించింది ఏంటి?, పోగుట్టుకుంది ఏంటో దేశ ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు. యుద్ధం అంటే ఇంధిరా గాంధీ గుర్తుకు వస్తారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇంధిరా గాంధీ హాయాంలో జరిగాయి... కానీ ఎప్పుడూ రాజకీయం చేయలేదు’ అని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. -
బీజేపీతో పొత్తుపెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు : ఎమ్మెల్సీ కవిత
సాక్షి,మంచిర్యాల: నాకంటూ సొంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పష్టం చేశారు.ఎమ్మెల్సీ కవిత శుక్రవారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ‘నాకు సొతంత అజెండా ఏమీలేదు. పార్టీని కాపాడుకోవాలనేది నా తపన. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దనేది నా వాదన. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని బీజేపీలో కలుపుతానని అన్నారు. పార్టీని బీజేపీలో కలుపుతానంటే నేను ఒప్పుకోను. లెటర్ రాయడంలో నా తప్పేమీ లేదు. లెటర్ బయటపెట్టిన వారిని పట్టుకోండి’ అని వ్యాఖ్యానించారు. -
కరీంనగర్ నుంచి వార్ మొదలైంది.. ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్
సాక్షి,హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కరీంనగర్ నుంచి వార్ మొదలైందని ప్రకటన చేశారు. అందరూ దొంగలు ఒక్కటయ్యారని రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. అంతకుముందు బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సమర్ధించారు.గురువారం పార్టీలోని కోవర్టులే తనని ఓడించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 25ఏళ్లుగా కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క లేఖ కూడా లీకు కాలేదు. కానీ ఈ సారి రాసిన లేఖ ఎలా బహిర్ఘతం అయ్యింది. ఆ లీకు వీరులెవరో చెప్పాలి. నేను జైల్లో ఉండగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది.నేను పార్టీలో ఉంటే అది సాధ్యం కాదని, తనని కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.అయితే, కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజా సింగ్.. ఆఫ్ ద రికార్డు కవిత మాట్లాడినది నిజమే అని నేను అనుకుంటున్నాను. పెద్ద ప్యాకేజీ దొరుకుతే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తోనే కలిసిపోతారు. మా వాళ్లు కుమ్మక్కయ్యారు కాబట్టే బీజేపీకి నష్టం’ అని వ్యాఖ్యానించారు. -
కవితలో ఇంత ఆవేదన ఉందనుకోలేదు.. త్వరలోనే ఆమెను కలుస్తా
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కవితలో ఇంత ఆవేదనతో ఉంది అనే విషయం ఈ రోజే తెలిసింది. కవిత వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతుంది. కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. కవిత సమస్యపై పార్టీలో తొందరలోనే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నా.చిట్ చాట్‌లో మాట్లాడిన దానికి పార్టీ ఎలా షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తాము. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పనిచేశాం. .ఒక బీజేపీతోనే మేము కలిసి పనిచేయలేదు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజం. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశాం. మా పార్టీ మొదటిది కాదు , చివరిది కాదు. పార్లమెంట్ లో కరుణానిధి, అళగిరి, కనిములి ఫ్యామిలీ రాజకీయాలు చూశాం.సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా సద్దుమణుగుతాయి. ఒక్క బీజేపీతో మాత్రమే పని చేయలేదు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్ళం ’ అని వ్యాఖ్యానించారు. -
అవును.. కవిత చెప్పింది నిజమే: ఎమ్మెల్యే రాజా సింగ్
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సమర్ధించారు.గురువారం పార్టీలోని కోవర్టులే తనని ఓడించారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 25ఏళ్లుగా కేసీఆర్‌కు లేఖలు రాస్తున్నా.. ఇప్పటి వరకు ఒక్క లేఖ కూడా లీకు కాలేదు. కానీ ఈ సారి రాసిన లేఖ ఎలా బహిర్ఘతం అయ్యింది. ఆ లీకు వీరులెవరో చెప్పాలి. నేను జైల్లో ఉండగా బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరిగింది.నేను పార్టీలో ఉంటే అది సాధ్యం కాదని, తనని కేసీఆర్‌కు దూరం చేయాలని చూస్తున్నారంటూ కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.అయితే, కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రాజా సింగ్.. ఆఫ్ ద రికార్డు కవిత మాట్లాడినది నిజమే అని నేను అనుకుంటున్నాను. పెద్ద ప్యాకేజీ దొరుకుతే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తోనే కలిసిపోతారు. మా వాళ్లు కుమ్మక్కయ్యారు కాబట్టే బీజేపీకి నష్టం’ అని వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని చూస్తున్నారు
-
ఆంధ్రజ్యోతిది జర్నలిజమా.. శాడిజమా?: కవిత
సాక్షి, హైదరాబాద్: పార్టీలో సముచిత స్థానం ఇవ్వకుంటే తాను కొత్త పార్టీ పెడతానంటూ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కాంగ్రెస్‌లో చేరేందుకు రాయబారం చేస్తున్నారని వచ్చిన కథనంపైనా ఆమె మండిపడ్డారు. హస్తం గూటికి చేరుకునేందుకు మధ్యవర్తి ద్వారా కవిత సంప్రదింపులు జరుపుతున్నారంటూ ఆ పత్రికలో రాయడంపై బుధవారం ‘ఎక్స్’వేదికగా సీరియస్ అయ్యారు. ‘కనీసం నన్ను సంప్రదించకుండా ఈ వార్త రాసిన పత్రికది జర్నలిజమా లేక శాడిజమా?’అని ప్రశ్నించారు. కేసీఆర్‌తో తాడోపేడో తేల్చుకోవాలని కవిత అనుకుంటున్నారని సదరు పత్రికలో వచ్చిన కథనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మన ప్రత్యర్థి బీఆరెస్సా.. బీజేపీనా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో తాజా పరిణామాలు ఏంటి? అని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ ఆరా తీశారు. బుధవారం ఆమె ఏడు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలతో ముఖాముఖి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులతో విడివిడిగా సమావేశమయ్యారు. ‘క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితేంటి? కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా జరుగుతోంది? ప్రభుత్వం గురించి ప్రజలేమనుకుంటున్నారు? పార్టీ పదవులు ఇచ్చేందుకు పరిగణనలోకి తీసువాల్సిన ప్రాతిపదిక ఏంటి? తెలంగాణలో అసలైన రాజకీయ ప్రత్యర్థిగా బీఆర్ఎస్ను పరిగణించాలా? బీజేపీని తీసుకోవాలా? ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? ఆదిలాబాద్ జిల్లాల్లో పార్టీ పూర్తిగా వెనుకబడటానికి కారణమేంటి? అని నేతలను ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల జవాబులను ఆమె నోట్ చేసుకున్నారని, ఈ సమాచారాన్ని క్రోడీకరించి అధిష్టానానికి నివేదిక అందజేస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వంతో సమన్వయం ఉండాలి ఒక్కో నేతకు 10 నిమిషాల సమయం ఇచ్చిన మీనాక్షి.. పలు అంశాలపై సమాచారం రాబట్టారు. సన్నబియ్యం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు ప్రభుత్వానికి ప్రజల్లో మైలేజీ తెస్తున్నాయని కొందరు ఎమ్మెల్యేలు చెప్పగా.. మరికొందరు పలువురు మంత్రుల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఆపరేషన్ సిందూర్‌ను అకస్మాత్తుగా విరమించుకోవటంతో బీజేపీ, ప్రధాని మోదీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని, బీఆర్ఎస్లో కుటుంబ కలహాలతో కేడర్ నిస్తేజంగా మారిందని కొందరు నేతలు తెలిపారు. ఈ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వస్తాయని సూచించినట్లు సమాచారం. నేతల మధ్య సమన్వయ లేమితోనే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినట్లు కొందరు తెలిపారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరినట్టు సమాచారం. సరస్వతి పుష్కరాల సందర్భంగా అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని పెద్దపల్లి ఎంపీ వంశీ, ఆయన తండ్రి వివేక్ ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఉండాలని.. అందరూ సర్దుకుపోయి పనిచేయాలని మీనాక్షి నేతలకు సూచించినట్లు సమాచారం. గురువారం మిగిలిన లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో మీనాక్షి నటరాజన్ సమావేశమవుతారని గాం«దీభవన్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ బలోపేతం గురించి అడిగారు: రేఖా నాయక్ మీనాక్షితో భేటీ తర్వాత పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు మీడియాతో మాట్లాడారు. ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్ మాట్లాడుతూ.. పార్టీని భవిష్యత్తులో ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై మీనాక్షి మాట్లాడారని చెప్పారు. ఇందుకు గల వ్యూహం గురించి, భవిష్యత్తు సవాళ్లను ఎలా అధిగమిస్తారనే విషయాల గురించి మాట్లాడారని వివరించారు. డీసీసీలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పినట్లు తెలిపారు. నేను చెప్పాల్సింది చెప్పా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు మీడియాతో ఇష్టాగోష్టి మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్‌కు తాను చెప్పదల్చుకున్న విషయాలన్నింటినీ చెప్పానన్నారు. తనకు మీడియాలో కనిపించాలన్న తాపత్రయం లేదన్న ఆయన.. అన్ని విషయాలను ఇన్చార్జికి వివరించినట్లు వెల్లడించారు. తాను కూడా మంత్రిపదవికి అర్హుడనేనని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ పేర్కొన్నారు. చాలా రోజుల క్రితమే తన మనసులో మాటను సీఎం రేవంత్‌రెడ్డికి చెప్పానని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా అడిగానని వెల్లడించారు. మీనాక్షి ఓ డాక్టర్ మీనాక్షి నటరాజన్ డాక్టర్ పని చేస్తున్నారని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. త్వరలోనే సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌లతో కలిసి ఆమె తగిన ట్రీట్మెంట్ కూడా ఇస్తారని, పారీ్టలో అన్నీ సెట్ చేస్తారని చెప్పారు. తన నియోజకవర్గ సమస్యలేవైనా ఉంటే లేఖ రూపంలో ఇవ్వాలని మీనాక్షి అడిగారని వెల్లడించారు. కార్యకర్తలపై ఫోకస్ పెట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. -
కేసీఆర్ ‘కాళేశ్వరం’ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు జూన్ 5న హాజరు కావాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ఆ మేరకు కసరత్తు ప్రారంభించారు. బుధవారం కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో ఆయనతో మాజీ మంత్రి హరీశ్‌రావు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. మరో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. జూన్ 5న కేసీఆర్, 9న హరీశ్‌రావు కమిషన్ ముందు హాజరు కానున్న నేపథ్యంలో అక్కడ వినిపించాల్సిన వాదనలు, ఇవ్వాల్సిన వివరణపై వారు చర్చించినట్లు సమాచారం. కమిషన్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన విచారణ తీరుతెన్నులను కేసీఆర్ సమీక్షించినట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అందులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు క్రోడీకరించి నివేదిక సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి కొందరు సాగునీటి రంగ నిపుణులు, సాంకేతిక నిపుణుల నుంచి కూడా వివరాలు కోరినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ నివేదికలో లోపాలపైనా చర్చ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఇచ్చిన నివేదిక అశాస్త్రీయంగా ఉందని నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ చేసిన ప్రకటనపైనా ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు తెలిసింది. ఎన్డీఎస్ఏ నివేదికలోని డొల్లతనాన్ని కమిషన్ ఎదుట ప్రస్తావించాలని నిర్ణయించినట్లు సమాచారం. కమిషన్‌కు అరకొర సమాచారం ఇవ్వకుండా పూర్తి స్థాయి ఆధారాలతో వివరణ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి గోదావరి నదుల విషయంలో పాలకులు చూపిన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాగా తాము అన్ని విషయాలు వివరించేందుకు వీలుగా తగినంత సమయం ఇవ్వాలని కూడా కమిషన్‌ను కోరాలని బీఆర్ఎస్ భావిస్తోంది. రాజకీయ దురుద్దేశంతో విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని మొదట్నుంచీ పేర్కొంటున్న నేపథ్యంలో.. తమ వాదన వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వకపోతే అనుసరించాల్సిన వైఖరిపైనా సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. నేడో రేపో పీపీ ప్రజెంటేషన్! విచారణ కమిషన్ ఎదుట హాజరవడానికి ముందే మీడియాకు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్వాపరాలు, స్థితిగతులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని హరీశ్‌రావును కేసీఆర్ ఆదేశించినట్లు తెలిసింది. ఈ మేరకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరించే పనిలో హరీశ్ ఉన్నట్లు సమాచారం. కాగా ఒకటీ రెండు రోజుల్లోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సంబంధించిన తేదీని బీఆర్ఎస్ ప్రకటించే అవకాశముంది. -
యంగ్ ఇండియా నా బ్రాండ్.. మీరే నా అంబాసిడర్లు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పాతికేళ్లు వచ్చే వరకు కష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడతారని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ప్రతి మనిషికి మొదటి పాతిక సంవత్సరాలు ముఖ్య కాలమని, అందులోనూ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అత్యంత కీలకమైనదని తెలిపారు. ఈ సమయంలో క్రమశిక్షణతో, నిబద్ధతతో ఉండాలని సూచించారు. రంగుల ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా కెరీర్‌పై దృష్టి సారిస్తేనే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని విద్యార్థులకు హితబోధ చేశారు. బుధవారం బంజారాహిల్స్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ ఆడిటోరియంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ నిర్వహించిన 2024–25 ప్రతిభా పురస్కారాల కార్యక్రమానికి సీఎం ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించిన గురుకుల విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు బహూకరించారు. గురుకులాల్లో ఇంటర్మీడియట్, పదోతరగతి చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పదోతరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులు బహూకరించారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకులాలను తయారు చేస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని తెలిపారు. ఒక్కో పాఠశాలకు రూ.200 కోట్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. యంగ్ ఇండియా తన బ్రాండ్ అని, గురుకుల విద్యార్థులే తన బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. కులవృత్తుల పేరుతో బీఆర్ఎస్ మోసం కులం పేరుతో ఎవరికీ అవకాశాలు రావని, కష్టపడి చదువుకున్న వాళ్లకు మాత్రమే అవకాశాలు వస్తాయని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చదువు వల్ల వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు కులవృత్తుల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక పేదలు, బడుగుల జీవితాలు మారుతాయని అందరూ భావించారు. కానీ పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ అన్ని వర్గాలను అణిచివేసింది. చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయని తెలిసినప్పటికీ.. మెరుగైన విద్య అందించకుండా కులవృత్తులు చేసుకోవాలని.. బర్రెలు, గొర్రెలు కాయాలంటూ వాటిని పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. కష్టపడి చదువుకున్న వాళ్లు ప్రభుత్వ కొలువుల కోసం ఏళ్లపాటు నిరీక్షించారు. కానీ, గత పాలకుడి ఇంట్లో ఒక్క మనిషికి ఉద్యోగం లేకపోతే ఆరు నెలల్లోనే ఎన్నికలు పెట్టి మరీ కొలువు ఇప్పించుకున్నారు’అని ధ్వజమెత్తారు. దళితులకు సముచిత స్థానం ఇచ్చాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే 59 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంతటి చరిత్రాత్మక నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 65 రోజుల్లోనే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేసినట్లు వెల్లడించారు. గ్రూప్–1 పరీక్షల ఫలితాలు ఇచ్చిన తర్వాత కొందరు ఉద్దేశపూర్వకంగా నియామకాలను ఆపారని విమర్శించారు. గ్రూప్–1 ఉద్యోగాలకు అర్హత సాధించిన వారిలో 89 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందినవారే ఉన్నారని తెలిపారు. ‘వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి గతంలో ఒక్క దళితుడు కూడా వైస్ చాన్స్‌లర్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఓయూకు వీసీగా దళిత మేధావిని నియమించింది. అంబేద్కర్ వర్సిటీ వీసీగా, ఉన్నత విద్యా మండలి కార్యదర్శిగా, విద్యా కమిషన్ చైర్మన్‌గా, రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్‌గా, అసెంబ్లీ స్పీకర్‌గా దళిత బిడ్డలకు అవకాశాలు వచ్చాయి. హెచ్‌సీయూలో చదివిని మేధావి భట్టి విక్రమార్క ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ఆర్థిక వ్యవస్థను క్రమపద్ధతిలో నడుపుతున్నారు’అని పేర్కొన్నారు. వాళ్లు ఎగ్గోడితే.. మేము ఖర్చు చేస్తున్నాం: భట్టి ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకువచ్చిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గుర్తుచేశారు. కానీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు నిధులు కేటాయించినప్పటికీ ఖర్చు చేయకుండా ఎగ్గొట్టిందని విమర్శించారు. అలా ఎగ్గొట్టిన నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కించి క్యారీ ఫార్వర్డ్ చేసి ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. ఎస్సీలకు రూ.13,223 కోట్లు, ఎస్టీలకు 1,296 కోట్లు క్యారీఫార్వర్డ్ చేసినట్లు వివరించారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్వయం ఉపాధి కోసం ఏడాది కాలంలోనే రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 102 సమీకృత గురుకులాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్‌రెడ్డి, ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, గడ్డం వంశీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. -
సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బరాజ్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) చేసిన వాదనలు తప్పులతడక అని తేలిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు తరహాలో మేడిగడ్డ బరాజ్‌ను పునరుద్ధరించాలన్నారు. నాణ్యత లేనిది కాళేశ్వరం ప్రాజెక్టులో కాదని, కాంగ్రెస్, బీజేపీలే చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కనీస నాణ్యత పరీక్షలు చేయకుండా, శాస్త్రీయడేటాను సేకరించకుండా ఎన్డీఎస్ఏ రూపొందించిన నివేదికను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ తిరస్కరించడమే దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఆర్ఎస్ను బదనాం చేసేందుకు, పార్టీని దెబ్బతీసేందుకు ఎన్డీఎస్ఏ ఈ నివేదిక ఇచ్చిందని మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ నివేదిక బూటకం ఎల్అండ్టీ తాజా ప్రకటనతో మేడిగడ్డ బరాజ్‌పై ఎన్డీఎస్ఏ ఇచి్చన నివేదిక బూటకమని బయట పడిందని కేటీఆర్ అన్నారు. ఊహాజనితమైన నివేదికను క్రూర రాజకీయ ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో తయారు చేశారని మండిపడ్డారు. పనికిరాని ఆ నివేదిక తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం ప్రభుత్వ అసమర్థ, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. రేవంత్ నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంట ఎండి, 500మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండా ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్అండ్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్ అన్నారు. ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోందని కేటీఆర్ అన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బీఆర్ఎస్కు చెందిన ఎన్ఆర్ఐ నేతలతో సమావేశమయ్యారు. యునైటెడ్ కింగ్డమ్ (యూకే) లోనూ పార్టీ రజతోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అలాగే అమెరికాలోని డాలస్ నగరంలో జూన్ 1వ తేదీన సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇదే క్రమంలో త్వరలో యూకేలోను సంబరాలు నిర్వహిస్తామని, ఈ సంబరాలకు స్వయంగా తాను హాజరు కావడంతో పాటు పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు వస్తారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దోపిడీ, అరాచకాలు, ప్రజలపై వేధింపులను బాగా ఎండగడుతున్నారని యూకే ఎన్ఆర్ఐ నేతలను కేటీఆర్ ప్రశంసించారు. ఇంగ్లండ్‌లో ఉన్న సోషల్ మీడియా వారియర్స్‌పై కూడా అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా తగ్గకుండా రేవంత్ ప్రభుత్వ దాషీ్టకాలను ప్రశ్నిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ ప్రగతికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని వారికి విజ్ఞప్తి చేశారు. అనిల్ కూర్మాచలంకు పరామర్శ గుండెకు సంబంధించిన అనారోగ్యంతో శస్త్ర చికిత్స చేయించుకుని లండన్‌లో కోలుకుంటున్న బీఆర్ఎస్ నాయకుడు, ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలంను కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యస్థితిపై వాకబు చేశారు. -
దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది: సీఎం రేవంత్
హైదరాబాద్: సమ సమాజ సాధనే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్సష్టం చేశారు. తమ హయాంలో మెరుగైన విద్య అందిస్తున్నామన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం దళిత, యాదవ పిల్లలను విద్యకు దూరం చేసిందని విమర్శించారు. దళితులు చెప్పులు కుట్టుకోవాలా?, యాదవులు గొర్రెలు కాసుకోవాలా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఎవరైనా బాగా చదవుకుంటేనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు సీఎం రేవంత్.హైదరాబాద్ లో సోషల్ వెల్ఫేర్ గురుకులాల విద్యార్థులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏడాది కాలంలోనే 59 వేల ఉద్యోగాలిచ్చిందని, గత ప్రభుత్వం మాత్రం ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఎందుకు నోటిఫికేషన్ల ఇవ్వలేదని సీఎం రేవంత్ నిలదీశారు. 2011 తర్వాత గ్రూప్౧ పరీక్షలు నిర్వహించలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం 563 గ్రూప్-1 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతిని సీఎం రేవంత్ గుర్తు చేశారు.‘ఇవాళ తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి. వారి స్ఫూర్తిని కొనసాగించేందుకు తెలుగు యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నాం. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారు. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కాంగ్రెస్ కొనసాగిస్తోంది. కులం వల్ల ఎవరికీ గుర్తింపు రాలేదు… మంచి చదువుతోనే అందరికీ గుర్తింపు వచ్చింది. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు ఆత్మన్యూనత భావాన్ని వీడాలి. వారిలో ఆత్మన్యూనత భావాన్ని తొలగించేందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బర్రెలు, గొర్రెలు, చేపలు వంటి స్కీములు ఇచ్చారు. కానీ మీకు చదువు చెప్పి రాజ్యాధికారంలో భాగస్వాములను చేస్తామని ఎందుకు చెప్పలేదు?, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా పదేళ్లు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది వాస్తవం కాదా?, కానీ మేం మొదటి ఏడాదిలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. మొదటి ఏడాదిలోనే ఇన్ని ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేశాం. కానీ నోటికాడి కూడును కిందపడేసినట్లు.. రాజకీయ కుట్రతో నియామక పత్రాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు పదేళ్లలో గ్రూప్ 1 పరీక్షలు కూడా నిర్వహించని పార్టీలు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారు. అందుకే ఇది సామాజిక సమస్యగా మారుతోంది. వాళ్లింట్లో ఎన్నికల్లో ఓడిపోతే ఆర్నెల్లు తిరగకుండానే ఇంకో ఉద్యోగం ఇచ్చుకున్నారు. కానీ మీకు మాత్రం ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారు. అలాంటి వారు మీకు ఎదురైతే ప్రశ్నించండి. మొదటి పాతికేళ్ల వయసు వరకు బాగా చదువుకుంటేనే మీరు మీ జీవితంలో రాణిస్తారు. తప్పుదారి పడితే కన్న తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎప్పుడూ తెచ్చుకోవద్దు. కష్టపడండి… సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో రాణించి తల్లిదండ్రులకే కాదు.. రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాలి. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో తొలిసారిగా దళితుడిని నియమించిన ఘనత ఈ ప్రభుత్వానిది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని నియమించాం. అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ప్రజా ప్రభుత్వంలో ఎంపిక చేసుకున్నాం. వీళ్ళందరికీ కేవలం కులం ప్రాతిపదికన గుర్తింపు రాలేదు. చదువుకున్నారు కాబట్టే వారికి గుర్తింపు వచ్చింది. దేశ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది. అన్ని రంగాల్లో మీరు రాణించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
అమెరికా అంతటా గులాబీ మయం..!
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్ ఎరినా వేదికగా జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ విభాగం కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల పేర్కొన్నారు. డల్లాస్ సభను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సన్నాహక సభల్లో భాగంగా అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్ఆర్ఐ సందడి నెలకొంది. ఆస్టిన్, న్యూజెర్సీ, రాలీలో నిర్వహించిన సన్నాహక సభలు విజయవంతమయ్యాయి.ఆస్టిన్ లో నిర్వహించిన సన్నాహక సభలో 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే లు, గండ్ర వెంకట రమణ రెడ్డి, పెద్ది సుధర్శన్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగల, యూఎస్ఏ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ మహేష్ తన్నేరు, అభిలాష్ రంగినేని, వంశీ కంచర్ల కుంట్ల, శ్రీధర్ రెడ్డి, వ్యాళ్ల హరీష్ రెడ్డి, వెంకట్ మంతెన, శ్రీనివాస్ పొన్నాల, శీతల్ గంపవరం, అరుణ్ బీఆర్ఎస్ , వెంకట్ గౌడ్ దుడాల, రాజ్ పడిగల, మల్లిక్ , నవీన్ కనుగంటి, సుధీర్ జలగం, గాయకురాలు స్పూర్తి జితేంద్ర తదితరులు హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని రాబోయే రోజుల్లో ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని ఆస్టిన్‌లో వక్తలు వివరించారు. ఇక న్యూజెర్సీలోని గోదావరి ప్రిన్స్టన్లో జరిగిన సన్నాహక సమావేశం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బాల్కా సుమన్, మాజీ ఎమ్మెల్యే గదరి కిషోర్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, బాల మల్లు, కార్పొరేటర్ రోజా మాధవరం, యుగంధర్, జక్కిరెడ్డి శ్రీనివాస్ , రవి ధన్నపునేని, మహేష్ పొగాకు తదితరులు పాల్గొన్నారు. జూన్ 1న డల్లాస్‌లో జరిగే గ్రాండ్ సమావేశానికి అందరినీ ఆహ్వానించారు. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం యూఎస్ఏ.. నార్త్ కరోలినాలోని రాలీలో.. యూనిటీ, సన్నాహక సమావేశం నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, టీటీజీఏ అధ్యక్షుడు భారతి వెంకన్నగారి, మాజీ అధ్యక్షులు చంద్ర ఎల్లపంతుల, కృష్ణ పెండోటి, మహిపాల్ బేరెడ్డి, హరీష్ కుందూర్, పున్నం కొల్లూరు, వీరేందర్ బొక్కా, శంకర్ రేపాల, అరుణ జ్యోతి కట్క, శ్రీధర్ అంచూరి, రఘు యాదవ్ , రాజు కటుకం , శ్రీనాథ్ అంబటి , క్రాంతి కుమార్ కట్కం, ఉమేష్ పరేపల్లి , హరి అప్పని, రాఘవ రావు తదితరులు హాజరై ప్రసంగించారు. రానున్న రెండు రోజుల్లో హ్యూస్టన్, డెలావేర్, వాషింగ్టన్, కాలిఫోర్నియా, డల్లాస్‌లో సన్నాహక సభలు నిర్వహించనన్నారు. అలాగే, మే 30 సాయంత్రం అతిథులతో భారీ ఎత్తున సభ నిర్వహించనున్నారు. కేటీఆర్ యూఎస్ పర్యటన వివరాలను మహేశ్ బిగాల తెలిపారు. అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారని వివరించారు. జూన్ 1న టెక్సాస్‌లోని ఫ్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ భారీ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన వేలాది ఎన్ఆర్ఐలు హాజరవుతారు.జూన్ 2న యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ డల్లాస్ లో భారతీయ విద్యార్థులను కేటీఆర్ కలుస్తారు. గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్పూర్తిగా నిలిచే కేటీఆర్, నూతన ఆవిష్కరణలు, ఎంట్రప్రెన్యూర్షిప్, భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి మాట్లాడనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యూఎస్ పర్యటనపై అక్కడి ఎన్ఆర్ఐలు, వ్యాపారవేత్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రవాస తెలంగాణవాసులతో పాటు ప్రవాస భారతీయులు, విద్యార్థులను తన పర్యటనలో కేటీఆర్ కలవనున్నారు.(చదవండి: యూకేలో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్య దినోత్సవ వేడుకలు) -
‘సింగరేణి జాగృతి’
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమంతోపాటు సంస్థను కాపాడటమే ధ్యేయంగా ‘సింగరేణి జాగృతి’సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మంగళవారం తన నివాసంలో ‘సింగరేణి జాగృతి’ఆవిర్భావ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగరేణి సంస్థ పరిధిలోని 11 ఏరియాల కార్మీకులు పాల్గొన్నారు. సమావేశంలో కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటైన ‘తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం’(టీబీజీకేఎస్)తో సమన్వయం చేసుకుంటూ సింగరేణి జాగృతి పని చేస్తుందని తెలిపారు.సింగరేణి కార్మీకుల విద్య, వైద్య ఇబ్బందుల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణి సంస్థనే అంతం చేసే కుట్రలు చేస్తోందని, వీటిని అడ్డుకుంటామని ప్రకటించారు. 11 ఏరియాలకు సింగరేణి జాగృతి కో ఆర్డినేటర్లను కవిత నియమించారు. సింగరేణి జాగృతికి అనుబంధంగా మహిళల విభాగం కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. కిరణ్ ఓరం (బెల్లంపల్లి), కుర్మ వికాస్ (శ్రీరాంపూర్), ఎస్.భువన్ (మందమర్రి), బొగ్గుల సాయికృష్ణ (రామగుండం 1), కె.రత్నాకర్ రెడ్డి (రామగుండం 2), దాసరి మల్లేశ్ (రామగుండం 3), నరేశ్ నేత (భూపాలపల్లి), అజ్మీరా అశోక్ కుమార్ (మణుగూరు), వన్నంరెడ్డి వీర నాగేంద్ర సాగర్ (కొత్తగూడెం), వసికర్ల కిరణ్ కుమార్ (కార్పొరేట్), కె.రామ్మోహన్ చారి (ఎస్టీపీపీ పవర్‌ప్లాంట్)లను ఏరియా కో ఆర్డినేటర్లుగా నియమించారు. సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించాలి: సింగరేణి స్కూళ్లను పునరుద్ధరించి సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యాబోధన చేయాలని కవిత డిమాండ్ చేశారు. కార్మీకులు, వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటళ్లలో ఉచిత వైద్యం అందించాలని కోరారు. అన్ని రీజియన్లలో కార్మీకుల కోసం కొత్త క్వార్టర్స్ నిర్మించాలని కోరారు. జైపూర్ పవర్ ప్లాంట్ రెండో దశ పనుల అంచనా పెంపులో భారీ కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. -
5న విచారణకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు జూన్ 5న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని అనుమా నిస్తున్న ప్రభుత్వం, వాటిపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించిన విషయం విదితమే. కాగా ఇప్పటికే పలువురు అధికారులను, కాంట్రాక్టు సంస్థలను కమిషన్ విచారించింది. తాజాగా ఈ నెల 20న కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, 6న ఈటల, 9న హరీశ్‌రావు తమ ముందు హాజరు కావాలని సూచించింది. సమగ్ర నివేదికతో సిద్ధం!కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తూ గత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కమిషన్‌ను ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేననే వాదన స్వయంగా వినిపించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీటి ప్రాజెక్టులు మొదలుకుని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం వరకు ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు, పనులు, వెచ్చించిన నిధులు, సమకూరిన ప్రయోజనం తదితర అంశాలన్నింటినీ కమిషన్ ముందు పెట్టేందుకు కేసీఆర్ సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఒక వివరణాత్మక నివేదికను కూడా కేసీఆర్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో అనుమతులు లేకుండానే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, మహారాష్ట్రతో ఒప్పందం లేకుండా ప్రాజెక్టును ప్రకటించడం, కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చిన వైనాన్ని కూడా కమిషన్ ముందు పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేసిన వారికి.. ఆధారాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదనే అంశాన్ని కూడా కేసీఆర్ లేవనెత్తే అవకాశముందని తెలుస్తోంది. మేడిగడ్డ బరాజ్ కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక భాగం కాగా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదంటూ ప్రభుత్వం చేస్తున్న వాదనలపైనా కేసీఆర్ కమిషన్‌కు వివరణ ఇస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. కమిషన్ విచారణకు హాజరుకానున్నట్టు ఈటల రాజేందర్ ఇప్పటికే ప్రకటించగా, కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా హరీశ్‌రావు విచారణకు హాజరుపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.యూకే, అమెరికా పర్యటనకు కేటీఆర్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మంగళవారం ఉదయం యూకే, అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. కేటీఆర్ ఈ నెల 30న యూకేలోని వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్‌లోని రీసెర్చ్ సెంటర్లో ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ సంస్థ కొత్త నాలెడ్జ్ పార్క్‌ను ఆవిష్కరిస్తారు. లండన్‌లో జరిగే ఇతర కీలక కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారు. అనంతరం అమెరికాకు చేరుకుని జూన్ 1న డల్లాస్‌లో జరిగే పార్టీ రజతోత్సవ సభ, 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారు. జూన్ 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉండగా, కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాలనుకుంటున్న నేపథ్యంలో జూన్ 4నే ఆయన నగరానికి వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా తాను అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని తెలుపుతూ ఆయన ఏసీబీకి లేఖ రాశారు. జూన్ రెండో వారంలో కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశముంది. -
కవిత కొత్త పార్టీ ప్రకటన అప్పుడే.. చేరబోయేది ఎవరంటే
సాక్షి,హైదరాబాద్: ‘మై డియర్ డాడీ అంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. తండ్రి కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించింది. అయితే, ఆ లేఖ బీఆర్ఎస్తో పాటు, ఆ పార్టీ కీలక నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో నాటి నుంచి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ కీలక నేతల గురించి, అంతర్గత వ్యవహారాల గురించి ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని ఒకరు? కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మరొకరు బహిరంగ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇదే తరహా సంచలన వ్యాఖ్యలు చేశారు.జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కవిత సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయనున్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న తరుణంలో కొత్త పార్టీ పేరుతో కేసీఆర్ కుటుంబం డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వారి కుటుంబంలో ఎవరికి ఎవరు నచ్చకపోయినా కవిత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు రఘునందన్ రావు. కేసీఆర్‌కు కవిత లేఖఇటీవల కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన సమయంలో రఘునందన్ రావు కవిత, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీ నా , ఆస్తుల పంచాయతీ నా? కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమని తెలుస్తోంది. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త పార్టీ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రిక, టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సీఎం ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఇటీవలే బీఆర్ఎస్ సిద్ధాంత కర్త, పునాది అని చెప్పుకునే వ్యక్తి హరీష్‌తో కొత్త పార్టీ పెట్టించాలని అన్నారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం సాగుతున్నది. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఆపడం ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఏకంగా కవిత కొత్త పార్టీ పెట్టడమే కాదు, అందులో చేరబోయే నేతల గురించి ప్రస్తావిస్తూ రఘునందన్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. -
సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత
-
కర్రు కాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలను పండబెట్టి తొక్కాలి. ఇది ఆవేశంతో చెప్పడం లేదు బాధతో చెప్తున్నా. మనతోనే ఉండి మనకు వెన్నుపోటు పొడిచి పార్టీని విడిచి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలకు కర్రు కాల్చి వాత పెట్టాలి. ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. కాంగ్రెస్ దరిద్రాన్ని ఇంకా ఎన్ని రోజులు చూడాలని ప్రజలు బాధ పడుతూ వారిని గద్దె దించేందుకు ఏదైనా మార్గం చూపమని అడుగుతున్నారన్నారు. గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్లో చేరారు. రాష్ట్రంలో ఎన్నిక ఏదైనా కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూన్ నెలాఖరులో పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభిస్తామని, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గద్వాల నియోజకవర్గంలో సామాన్యుడికి టికెట్ ఇస్తామని, జెట్ స్పీడ్‌తో పార్టీ గెలుపు ఖాయమన్నారు. అపరిచితుడిలా సీఎం వైఖరి కాంగ్రెస్ ఇచి్చన అభయహస్తం శతాబ్దపు అతి పెద్ద మోసమని, ఆ పారీ్టకి 55 ఏళ్లు అధికారం ఇచ్చినా ప్రజలకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి మాటల మనిషి కాదని, మూటల మనిషి అని ఎద్దేవా చేశారు. రుణమాఫీపై అనేకమార్లు మాట మార్చాడన్నారు. సీఎం మానసిక పరిస్థితిపై తనకు అనుమానాలు ఉన్నాయని, ఆయన వైఖరి అపరిచితుడిలా ఉందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లినా ఆ పార్టీ అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో డిప్యూటీ సీఎం భట్టికి 20 నుంచి 30 శాతం కమిషన్లు నడుస్తున్నాయని, భట్టికి మినహా రాష్ట్రంలో అందరికీ అప్పులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లలో తాము బలమైన పునాదులు వేస్తే కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు బొక్కబోర్లా పడ్డారన్నారు. టీజేఎఫ్ పోస్టర్ ఆవిష్కరణ తెలంగాణ జర్నలిస్టు ఫోరం రజతోత్సవ సంబురాల పోస్టర్‌ను ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి కేటీఆర్ విడుదల చేశారు. తెలంగాణ విముక్తి కోసం కేసీఆర్ ఆధ్వర్యంలో సాగిన ఉద్యమంలో ప్రజలను చైతన్యపరచడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు. -
కేసీఆర్ అవినీతిని ఈటల బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని ఈ సందర్భంగా కమిషన్ ముందు బయట పెట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాంగ్రెస్ పాలనలో అదే పరిస్థితి పునరావృతం అవుతోందని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతగానితనాన్ని బీజేపీపై రుద్దుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు కవిత లేఖ రాయడంపై మాట్లాడుతూ దోచుకున్న డబ్బు పంచుకోవడం కోసం లేఖలు రాసుకున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. -
పదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు: భట్టి విక్రమార్క
వైరా: గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు రాష్ట్రాన్ని లూటీ చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వాళ్లే ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నిద్రపోతూ అన్యాయం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో శనివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లలో గ్రూప్–1 పోస్టులు భర్తీచేయకపోవటంతో నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులకు భారంగా మిగిలారని, మరికొందరు ఆవేదనతో రోడ్లపై తిరిగారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు స్వయం ఉపాధి కోసం రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం ద్వారా తోడ్పాటు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ద్వారా గిరిజనులకు పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేలా రూ.12,600 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. బీఆర్ఎస్ పాలనలో గిరిజనులు అటవీ భూముల్లో పంటలు సాగుచేయకుండా ఇబ్బంది పెట్టారని, మహిళలను కూడా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలు ఉన్నాయని విమర్శించారు. కాగా, జాబ్‌మేళాలో 92 కంపెనీలు పాల్గొనగా, సుమారు 8 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 4,448 మందికి వివిధ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్, సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్... శని కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్‌రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది. ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్లో అధ్యక్షుడు కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలని వేల మంది కార్యకర్తలతో గంటలకొద్దీ చర్చించాం. ఆ క్రమంలో చాలామంది నేరుగా మైక్‌లో మాట్లాడారు. మరికొందరు కేసీఆర్‌కు ఇవ్వమంటూ లేఖలు ఇచ్చారు. మా పార్టీలో బహిరంగ చర్చను ప్రోత్సహిస్తాం. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లు బీఆర్ఎస్లోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చని, సరైన సమయంలో వారంతటే వారు బయటపడతారన్నారు. ఓటుకు నోటు కేసులో ‘బ్యాగ్‌మ్యాన్’ ‘యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చడం రాష్ట్రానికి అవమానకరం. ఈ కేసులో రేవంత్ పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా.. ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్ ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి. ఓటుకు నోటు కేసులో బ్యాగ్‌మ్యాన్ అని పేరు తెచ్చుకున్న రేవంత్ వైఖరి మారలేదని ఈడీ చార్జిïÙట్లో బయటపడింది. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారగా, ఢిల్లీ కాంగ్రెస్‌కు అవసరమైనప్పుడల్లా భారీ మొత్తంలో ఇస్తూ రేవంత్ తన పదవి కాపాడుకుంటున్నాడు. నైతికత ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలి. ప్రధాని మోదీ, అమిత్ షాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కేసుల నుంచి తప్పించాలని చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. రేవంత్‌కు రాహుల్ గాంధీ అధికారిక బాస్ కాగా, మోదీ, అమిత్ షా అనధికార బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నరగా బీఆర్ఎస్పై నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్‌లకు రూ.వేలకోట్ల చందాలు అనే రీతిలో రేవంత్ పాలన సాగుతోంది. రేవంత్ అవినీతిపై రాహుల్ మాట్లాడాలి. ఈడీ చార్జిïÙట్లో సోనియా, రాహుల్ పేర్లు ఉన్నా జపాన్ టూర్ పేరిట రేవంత్ స్పందించకుండా తప్పుకున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నడుమ అపురూప బంధం ‘నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌన మునుల్లా మారిపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.187 కోట్ల వాల్మీకి స్కామ్, ట్రిపుల్ ఆర్ టాక్స్, హెచ్‌సీయూ భూముల్లో అక్రమాలు, పౌర సరఫరాల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. రేవంత్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కోరతాం’అని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజయ్య పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ 3 ముక్కలు కావడం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే.. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని, అది మూడు, నాలుగు ముక్కలవుతుందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఇంట్లో పోరు తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారని, పార్టీ పగ్గాల కోసం కవిత, కేటీఆర్ మధ్య తీవ్ర పోటీ నెలకొందని చెప్పారు. ఈ నేపథ్యంలో హరీశ్‌రావు అదను కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్‌గౌడ్ శనివారం తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో విలేకరులతో మాట్లాడారు. కేటీఆర్ ముందు ఇంట్లో కుంపటిని సరిచేసుకోవాలి‘ఇంట్లో కుంపటి తట్టుకోలేక.. సోదరి తనకే ఏకు మేకై, మరో పవర్ సెంటర్ కావడంతో మతి భ్రమించి కేటీఆర్ ఆ ఎపిసోడ్‌ని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు. తన ఇంట్లో రగులుతున్న కుంపటిని కేటీఆర్ ముందుగా సరిచేసుకోవాలి. కవిత.. కేసీఆర్‌కే లేఖ రాసి పది సంవత్సరాల తప్పిదాలను ఎత్తి చూపే స్థాయికి వచ్చిందంటే, కేసీఆర్ కుటుంబంలో రగులుతున్న మంట ఎంత పెద్దదో అర్థమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మెజారిటీ ప్రజలు నమ్మిన నేపథ్యంలో వారి ఆకాంక్షల మేరకు విచారణ కమిషన్ వేశాం. కేసీఆర్, హరీశ్‌రావులకు నోటీసులు ఇస్తే కేటీఆర్ బెంబేలెత్తారు. అవినీతి బాగోతం బయటపడుతుందన్న భయంతో ఆయన మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం.. ఫార్ములా ఈ–కార్ రేసులో అవినీతి బట్టబయలైంది. అందులో కేటీఆర్ దొరికిపోయారు. హైదరాబాద్, దాని చుట్టపక్కల కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూములను తక్కువ ధరకే తన సన్నిహితులు, బంధువులకు అప్పజెప్పిన వైనం ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. కవిత లేఖలో ఆమె ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే.. బీజేపీకి, బీఆర్ఎస్కు పరిపూర్ణమైన లోపాయికారి ఒప్పందం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. బీఆర్ఎస్ గతంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందించిన కారణంగానే కవిత లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అమిత్‌షా దగ్గరకు వెళ్లి బేరం కుదుర్చుకుని బెయిల్ వచ్చే విధంగా చేసుకున్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య లోపాయికారి మైత్రి ఉంది కాబట్టే బెయిల్ సునాయాసమైంది. కేటీఆర్, హరీశ్‌రావులే కదా.. ఆ బేరసారాలు చేశారు. తమ అవినీతి బయటపడకుండా ఉండేందుకు మోదీ, అమిత్‌షా కాళ్లు ఎవరు పట్టుకున్నారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో బందీ చేశారు.. హరీశ్‌రావు, కేటీఆర్ కలసి కేసీఆర్‌ను ఫామ్ హౌస్‌లో బందీ చేశారని నేను దాదాపు మూడున్నర నాలుగు మాసాల క్రితం చెప్పాను. అదిప్పుడు వాస్తవం అని తెలుస్తోంది. కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని కవిత చెప్పారు. ఆ దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ మొదలుకొని.. కేటీఆర్, హరీశ్‌రావు, కవిత సహా ఆ కుటుంబం అంతా విచ్చల విడిగా అవినీతికి పాల్పడిన విషయాన్ని పదేళ్లుగా చూశాం. వారి మధ్య వైరం వచ్చిందంటే రాజకీయ పదవుల పోటీ ఒకటైతే.. పంపకాల్లో కూడా తేడా వచ్చిం దనేది నా అనుమానం. అందుకే కవిత ఇవాళ బాహాటంగా తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపిస్తోంది. కేసీఆర్‌కు పట్టిన దెయ్యం కూడా కేటీఆరేనని కవిత చెప్పకనే చెప్పారు. దీంతో ఇంట్లో జరుగుతున్న పోరు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు కేటీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది’అని మహేశ్‌గౌడ్ అన్నారు.ఘనంగా మహేశ్‌గౌడ్ జన్మదిన వేడుకలుసాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: టీపీసీచీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఢిల్లీలో పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ భవన్‌లోని శబరి బ్లాక్‌లో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, అధికార ప్రతినిధి సుధాకర్‌గౌడ్ తదితరులు మహేశ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి మిఠాయిలు తినిపించారు. అలాగే మహేశ్‌గౌడ్ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి.హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, కల్లుగీత పారిశ్రామిక సంఘం చైర్మన్ నాగరాజు గౌడ్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగంగౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. -
సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యాగ్‌మ్యాన్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చటంతో ఆయన అవినీతి బండారం బయట పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా మారిందని ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు కూడా చెప్తున్నాయని అన్నారు. ఈడీ చార్జిషిట్‌లో పేరు రావడంతో ‘తెలంగాణ బ్యాగ్ మ్యాన్’రేవంత్‌రెడ్డి ప్రజల దృష్టి మళ్లించే డ్రామాలు మొదలు పెట్టారని శుక్రవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. తన అవినీతిపై చర్చ జరగకుండా చూసేందుకు రేవంత్ రోజుకో కొత్త నాటకం వేస్తున్నారని ఆరోపించారు.ఈడీ చార్జిషిట్‌లో రేవంత్ పేరు నమోదైనందున కేంద్రం ఆయనపై చర్యలు తీసుకుంటున్నదీ లేనిదీ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో అమృత్ స్కామ్, ఆర్ఆర్ ట్యాక్స్ కుంభకోణం, పౌర సరఫరాల స్కామ్ వంటి వాటిని చూసీ చూడనట్లుగా వదిలేసిన రీతిలోనే కేంద్రం నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలోనూ వ్యవహరిస్తుందా? అని ప్రశ్నించారు. అధికారం కోసం వందల కోట్లు సీఎం పదవి చేపట్టకముందే అధికారం కోసం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ పెద్దలకు వందల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చిన వ్యవహరం ఈడీ చార్జిషిట్‌లో బయటపడిందని కేటీఆర్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్‌రెడ్డి ప్రలోభపెట్టిన విషయం ఈడీ చార్జిషిటులో బయట పడిందని తెలిపారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం ఏడాదిన్నరలోనే సీఎం పదవిని అడ్డుపెట్టుకుని వేల కోట్ల రూపాయలకు చేరిందని ఆరోపించారు. మంత్రి పొంగులేటి తరహాలోనే రేవంత్ చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటారా? అని ప్రశ్నించారు.కేవలం చార్జిషిట్‌లో రేవంత్ పేరు నమోదుతో సరిపెట్టకుండా విచారణకు పిలిచి అవినీతిని కక్కించాలని డిమాండ్ చేశారు. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ కకావికలమైందని, తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడు దిగాల్సి వస్తుందో అనే భయం రేవంత్‌ను అడుగడుగునా వెంటాడుతోందని ఎద్దేవా చేశారు. కమిషన్లు లేనిదే ఫైలు కదలడం లేదని మంత్రి కొండా సురేఖ చెప్పారని, 30 శాతం పర్సంటేజీపై ఎమ్మెల్యే అనిరుద్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ నిజ స్వరూపం బయట పడిందని అన్నారు. ప్రజల ముందు సీఎం అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో కుడితిలో పడిన ఎలుకలా కాంగ్రెస్ పార్టీ కొట్టుకుంటోందని విమర్శించారు. పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న సీఎం పాపం పండిందని, ధర్మమే గెలుస్తుందని కేటీఆర్ అన్నారు. -
కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు
సాక్షి, హైదరాబాద్/ శంషాబాద్: ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. వారివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. నేను రెండు వారాల క్రితం మా పార్టీ నాయకుడికి లేఖ రాసిన మాట వాస్తవం. ఆ లేఖ బయటకు లీక్ కావడం బాధాకరం. కేసీఆర్ కుమార్తె రాసిన లేఖనే లీకైతే ఇక పార్టీలోని సామాన్యుల పరిస్థితేంటి? దీనిపై చర్చ జరగాలి’అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖ రెండురోజుల క్రితం బహిర్గతం కావడం రాష్ట్రంలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ లేఖపై బీఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులు మౌనంగా ఉన్నా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. లేఖ లీకవక ముందు కవిత తన కుమారుడి గ్రాడ్యుయేషన్ ఉత్సవం కోసం అమెరికా వెళ్లారు. శుక్రవారం రాత్రి తిరిగి వచ్చిన ఆమె.. శంషాబా ద్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. పార్టీలో కింది నుంచి పైస్థాయి నాయకుల వరకు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలనే తాను రాసిన లేఖలో ప్రస్తావించినట్లు స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలు పార్టీలో కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఈ మధ్య తాను చెప్పిన విషయం లేఖ బహిర్గతం ద్వారా మరోసారి స్పష్టమైందని కవిత అన్నారు. గతంలో కూడా లేఖ ద్వారా తన అభిప్రాయాలను కేసీఆర్‌కు చెప్పినట్లు వెల్లడించారు. ‘నేను నా కుమారుడి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి వెళ్లిన తరువాతే నా లేఖ లీకైనట్లు హంగామా జరిగింది. పార్టీలో ఏం జరుగుతుందో ఇప్పుడు అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారు అనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే లేఖలో చెప్పాను.ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీలేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు, ఎవరిపై ప్రేమ లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే, దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ దేవుడు.. కానీ ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయి. వారి వల్లే నష్టం జరుగుతోంది. లేఖ బహిర్గతం కావడంతో కాంగ్రెస్, బీజేపీలు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు సంబరపడుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ఆగమైనట్లు ఆ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు. మా నాయకుడు కేసీఆరే.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది. పార్టీలో చిన్నచిన్న లోపాలపై చర్చించుకొని సవరించుకొని కోవర్టులను పక్కకు జరుపుకొని ముందుకెళ్తే పార్టీ పది కాలాల పాటు చల్లగా ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీలు విఫలమయ్యాయి. వారు రాష్ట్రానికి చేసిందేమీ లేదు. వాటికి కేసీఆర్ నాయకత్వమే ప్రత్యామ్నాయం’అని కవిత స్పష్టంచేశారు. కనిపించని గులాబీ జెండాలు శంషాబాద్ విమానాశ్రయంలో కవితకు స్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు ఎవరూ రాలేదు. కవితక్క జిందాబాద్.. సామాజిక తెలంగాణ కోసం పోరాడిన కవితక్క అన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ బీసీ సంఘాల నాయకులు ఆమెకు స్వాగతం పలికారు. కవిత టీం పేరుతో వచ్చినవారు ప్రదర్శించిన ప్లకార్డులలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటోలు కానీ, కేటీఆర్ లేదా హరీశ్‌రావు ఫొటోలు కానీ కనిపించకపోవడం గమనార్హం. జాగృతి ఆధ్వర్యంలో వచ్చిన కొందరు మాత్రం కవితతోపాటు కేసీఆర్ ఫొటోలు ఉన్న ప్లకార్డులు పట్టుకొని కవిత జిందాబాద్.. కేసీఆర్ జిందాబాద్ అని నినాదాలు చేశారు. అయితే, ఏ ఒక్కరూ బీఆర్ఎస్ కండువాలు ధరించకపోవటం గమనార్హం. కొందరు అభిమానులు కవితను చూసి సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. -
కేసీఆర్ చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి: కవిత
సాక్షి, హైదరాబాద్: తన తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖపై ఎమ్మెల్సీ కవిత క్లారిటీ ఇచ్చారు. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘ కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలున్నాయి. రెండు వారాల కిందట కేసీఆర్‌కు లేఖ రాశా. కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్తవమే. లేఖ రాయడంలో పర్సనల్ ఏజెండా ఏమీ లేదు. పార్టీ నేతలు అనుకున్నదే నేను లేఖలో రాశా. అంతర్గతంగా రాసిన లేఖ బయటకు రావడం కుట్ర. లేఖ లీక్ చేసింది పార్టీలోని కోవర్టులే. మా నాయకుడు కేసీఆర్.. ఎలాంటి ఆలోచన లేదు. ఆయన నాయకత్వంలో పనిచేస్తా. నా లేఖ లీక్‌తో కాంగ్రెస్, బీజేపీలు సంబరపడిపోతున్నాయి. గతంలోనూ కేసీఆర్‌కు లేఖలు రాశా. తాజాగా రాసిన లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాలి’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు.కాగా, కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖతో తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికా నుంచి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రాలేదు. కవితకు స్వాగతం పలికేందుకు ఆమె మద్దతు దారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలివచ్చారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ కవితకు స్వాగతం, సుస్వాగతం అంటూ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శించారు. వాటిల్లో ఎక్కడా పార్టీ పేరు, ముఖ్య నేతల ఫొటోలు కనిపించలేదు. టీమ్ కవితక్కా అంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. -
బీఆర్ఎస్లో‘కవిత లేఖ’ కలకలం
సాక్షి, హైదరాబాద్: ఎల్కతుర్తిలో గత నెల 27న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన స్పందన, తన తండ్రి కేసీఆర్ ప్రసంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెప్తున్న లేఖ పార్టీలో కలకలం రేపుతోంది. అమెరికాలో తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యేందుకు వెళ్లిన కవిత శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. కవిత హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాతే లేఖ అంశంపై స్పందించే అవకాశముంది. అయితే కవిత రాసింది లేఖ కాదని, తన అభిప్రాయాలతో రాసిన నోట్ మాత్రమేనని ఆమె సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రజతోత్సవ సభపై కేసీఆర్‌కు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేందుకు తయారుచేసుకున్న నోట్స్ బయటకు ఎలా లీక్ అయిందనే కోణంలోనూ చర్చ జరుగుతోంది. లేఖలో పేర్కొన్న అంశాలు ⇒ ఎల్కతుర్తి సభ పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అందరూ మీ (కేసీఆర్) ప్రసంగం చివరి వరకు ఆసక్తిగా విన్నారు. ఆపరేషన్ కగార్, రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలు, పహల్గామ్ అమరులకు నివాళి, ప్రసంగంలో రేవంత్ పేరును ప్రస్తావించకపోవడం అందరికీ నచ్చాయి. ⇒ తెలంగాణ అంటే బీఆర్ఎస్ అనే విషయాన్ని బలంగా చెప్తారని ఆశించారు. ప్రసంగంలో మరింత పంచ్ ఉండాలని నాయకులు, కార్యకర్తలు కోరుకున్నారు. పోలీసులను హెచ్చరించడంపై మంచి స్పందన వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మీరు స్పందిస్తారని అనుకున్నారు. ⇒ వక్ఫ్ బిల్లు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితే బాగుండేది. ⇒ బీజేపీపై మీరు రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలకు తావు ఇచ్చినట్లు అయింది. బీజేపీతో ఇబ్బంది పడిన తాను కూడా ఇదే అంశాన్ని కోరుకున్నా. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌పై నమ్మకం కోల్పోయిన వారు బీజేపీ మనకు ప్రత్యామ్నాయమవుతుందని అనుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకపోవడంతో బీజేపీకి మనం సాయం చేశామనే కోణాన్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ⇒ జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా మిమ్మల్ని కలవడం సాధ్యం కావడం లేదనే అభిప్రాయంతో ఉన్నారు. దయచేసి అందరికీ చేరువకండి. -
సీఎం రేవంత్‌లో అపరిచితుడు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలో ఒక అపరిచితుడు ఉన్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆయనకు ’మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్’ అనే భయంకరమైన మానసిక రుగ్మత ఉండటంతో ఒకే అంశంపై రోజుకో రీతిలో మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్లో గురువారం కేటీఆర్ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘పర్సంటేజీల పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు నోటీసులు అంటూ కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారం సుప్రీంకోర్టు సాక్షిగా తేలి పోయి నిజాలు బయటకు వచ్చాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కలసికట్టుగా చేస్తున్న దు్రష్పచారం కూడా త్వరలో తేలిపోతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ తన విచారణ పూర్తయిందని, నివేదిక సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ తిరిగి కమిషన్ గడువును ఎందుకు పొడిగించారో చెప్పాలి’అని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంశానికి సంబంధించి కేసీఆర్, హరీశ్‌రావుకు నేరుగా నోటీసులు అందినట్లు సమాచారం లేదని కేటీఆర్ తెలిపారు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరు కావడంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బరాజ్‌లను కూలగొట్టి మళ్లీ టెండర్లు పిలవడం ద్వారా 20 నుంచి 30 శాతం కమీషన్లు తీసుకోవాలన్నదే ఈ నోటీసుల వెనుక ఉన్న అసలు ఎజెండా అని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే సీఎం అందాల పోటీల్లో తలమునకలై ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. అన్నదాతల ధాన్యం వర్షంలో కొట్టుకుపోతుంటే.. రేవంత్ అందాల పోటీలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గుల్జార్ హౌస్‌లో అతిపెద్ద అగ్ని ప్రమాదం జరిగితే కనీసం చూడటానికి కూడా వెళ్లని సీఎం.. అందాల పోటీలకు మాత్రం నాలుగు సార్లు హాజరయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఒక్క రూపాయి కూడా లేదంటూనే అందాల పోటీలకు రూ.200 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. మంత్రులంతా మిస్‌వరల్డ్ పోటీదారులకు టూర్ గైడ్లుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. మిస్ వరల్డ్ పోటీదారులకు బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను చూపిస్తున్నారని, నిజాంలు, కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులు మినహా చూపించేందుకు కాంగ్రెస్ కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా లేకుండా పోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అభిప్రాయభేదాలు సహజంరాజకీయ పార్టీల్లో అభిప్రాయ భేదాలు సహజమని కేటీఆర్ అన్నారు. ‘నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లోనే కొన్ని విషయాల్లో అభిప్రాయ భేదాలు వస్తాయి. అలాంటిది లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీలో అభిప్రాయ భేదాలు ఉండడం సహజమే. వాటిని పక్కనపెట్టి అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పని చేయాలి’అని సూచించారు. గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై తన అభిప్రాయాలను తెలుపుతూ మే 2న కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారు. సభపై పాజిటీవ్, నెగిటీవ్ అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. 👉పాజిటీవ్ అంశాలు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ విజయవంతం కావడంపై మీకు నా హృదయపూర్వక అభినందనలు. సిల్వర్ జూబ్లీ తర్వాత కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చాయి, వాటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానుసిల్వర్ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్లో కొత్త ఉత్సాహం కనిపించింది మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయిందిపహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయిరేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారుతెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారుఅయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.👉నెగిటీవ్ అంశాలు :ఉర్దూలో మాట్లాడకపోవడం.వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడంబీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదుఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.పాత ఇన్ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.👉అందరూ ఆశించిన విషయం:ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.👉సూచన:కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది.