సిరిసిల్ల నియోజక వర్గంలో ప్రధానముగా పద్మశాలి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు కులస్థులు ఎక్కువ. మిగతా బీసీ కులాలు కూడా నియోజకవర్గములో అభ్యర్థుల గెలుపు ఓటములు ప్రభావితం చేసే పరిస్థితి ఉంది. అంతేకాకుండా షెడ్యూల్ కాస్ట్ (17శాతం) వారు కూడా నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు.
పార్టీల వారిగా పోటీ చేసే అభ్యర్థులు!
బీఆర్ఎస్
- కేటీఆర్
బీజెపి
- కటకం మృత్యుంజయం
- లగిశెట్టి శ్రీనివాస్
- ఆవునూరి రమాకాంత్ రావు
- రెడ్డెబోయిన. గోపి
- మోర. శ్రీనివాస్
కాంగ్రెస్:
- కేకే మహేందర్ రెడ్డి
- చీటి ఉమేష్ రావు
- సంగీతం శ్రీనివాస్
- నాగుల సత్యనారాయణ గౌడ్.
కేటీఆర్ మంత్రి అయిన తర్వాత సిరిసిల్లకు జరిగిన అభివృద్ధి పనులు
- సిరిసిల్ల చేనేత కార్మికుల కొరకు బతుకమ్మ చీరలు
- ఆర్ వి ఎం క్లాత్ సిరిసిల్లలోనే ఉత్పత్తి
- నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు, ఐటిఐ కాలేజ్
- ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్
- ఆపరాల్ పార్కు నిర్మాణం జరుగుతుంది
- వర్కర్ టు ఓనర్ స్కీం షేడ్స్ నిర్మాణంలో ఉన్నవి
- అగ్రికల్చర్ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్
- కలెక్టర్ చౌరస్తా నుండి వెంకటాపూర్ వరకు 11 కిలోమీటర్ల ఫోర్ లైన్ బైపాస్ డబుల్ రోడ్డు ప్రారంభం సిద్ధంగా ఉంది.
- సివిల్ హాస్పిటల్ లో డయాలసిస్సెంటర్ మరియు సిటీ స్కాన్
- ఆక్సిజన్ ప్లాంట్, అదనంగా మరో వంద పడకల ఆసుపత్రి
- గంభరావుపేట మండలంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య ప్రారంభం
రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్
సిరిసిల్లలో మెడికల్ కాలేజ్ నిర్మాణం ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. సిరిసిల్ల నేత కార్మికుల కొరకు ఉచిత ప్రమాద బీమా మంత్రి కేటీఆర్ సొంత డబ్బులతో ప్రీమియం అధునాతన వ్యవసాయ మార్కెట్‌తో పాటు డిపిఓ భవనం నిర్మాణం పూర్తి. మగ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తి అవుతుంది. రాష్ట్రంలోనే తొలి టెక్ట్స్‌టైల్ పార్క్ సిరిసిల్లలో ఉంది. ఇక్కడ ఆధునిక మరమగ్గాలపై వస్త్రాలు ఉత్పత్తి అవుతాయి. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్, పరిశోధన సంస్థ నిర్మాణంలో ఉంది.మధ్యమానేరు బ్యాక్ వాటర్ . తో సిరిసిల్ల పట్టణానికి పర్యాటక శోభ....
సిరిసిల్ల నియోజకవర్గ సమస్యలు :
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి యారన్ డిపో లేకపోవడం.
- సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు సంబందించి వస్త్రాన్ని ఎగుమతి చేసేందుకు సరైన మార్కెట్ వసతి లేకపోవడం.
- చిన్న కుటీర మరమగ్గాల పరిశ్రమకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో మాదిరిగా ఉచిత విధ్యుత్ సరఫరా లేదు.
- బతుకమ్మ చీరల వలన సంవత్సరములో కేవలం మూడు లేదా నాలుగు నెలలు మాత్రమే పని, మిగతా నెలలు సరైన పనిలేకపోవడం.
- నియోజక వర్గములో 9వ ప్యాకేజీ పనులు నత్తనడకన సాగడం.
- ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో ఉన్నత చదువుల కోసం డిగ్ర కళాశాలలు లేకపోవడం.
- ఎల్లారెడ్డిపేట మండల కేంద్రములో 30 పడకల ఆసుపత్రి లేకపోవడం వలన ఇబ్బందులు.
- బీడీ కార్మికుల కోసం కేంద్ర కార్మిక శాఖ నిర్మిస్తామన్న ఆసుపత్రి ఇప్పటివరకు లేకపోవడం.
Comments
Please login to add a commentAdd a comment