Assembly Elections
-
‘మహా’ ఎన్నికల్లో ట్యాంపరింగ్.. సుప్రీం కోర్టుకు ఇండియా కూటమి నేతలు
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వేళ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎం ఓటింగ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఇండియా కూటమి పార్టీ ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అత్యున్నత న్యాయ స్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదే అంశంపై చర్చలు జరిపేందుకు శరద్ పవార్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌లు మంగళవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరువురి నేతల భేటీలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన తీరు, త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఎన్నికల తరహాలో ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ దిశగా కార్యకర్తలకు, నేతలకు భవిష్యత్ కార్యచరణపై దిశానిర్ధేశం చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో ఇండియా కూటమి తరుఫున మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలపై శరద్ పవార్ సుప్రీం కోర్టు ఆశ్రయించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. మహా ఎన్నికల్లో ఘోర పరాజయంఈ నవంబర్ 20న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన, బీజేపీ, ఎన్సీపీలతో కూడిన మహాయుతి 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాల్లో విజయం సాధించగా, ప్రతిపక్ష మహావికాస్ అఘాడి కేవలం 46 సీట్లు మాత్రమే గెలుచుకుంది. Maharashtra: At the anti-EVM event at Markadwadi village in Solapur district, NCP-SCP chief Sharad Pawar says, "Elections happen...some win some lose...but in recently concluded election in Maharashtra, people have doubt over the election process and voters are not feeling… pic.twitter.com/QkmKK5XNQU— ANI (@ANI) December 8, 2024అయితే, ఈ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ విజయం సాధిస్తుందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. ఇదే కూటమిలో తమ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎన్సీపీ నేతలు అంచనా వేశారు. కానీ నేతల అంచనాలు తారుమారయ్యాయి. ఊహించని విధంగా ఎన్సీపీ కేవలం 10 సీట్లతో సరిపెట్టుకుంది. ఈ ఫలితాలపై దేశంలో ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా మహారాష్ట్ర ఎన్నికల్లో దుర్వినియోగం జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈవీఎం ఓటింగ్‌పై సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నారు. -
వణికించే చలిలో రాజకీయ వేడి..ఢిల్లీలో ‘ఆప్’ వర్సెస్ బీజేపీ
న్యూఢిల్లీ:వణికించే చలిలో ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేతల మధ్య మాటల తూటాలు పేలడం ఇప్పటి నుంచే మొదలైంది. ముఖ్యంగా అధికార ఆమ్ఆద్మీపార్టీ(ఆప్),ఢిల్లీ బీజేపీ అగ్ర నేతల మధ్య వాగ్యుద్ధం సార్టైంది. తాజాగా బీజేపీ ‘మార్పు కోసం’ అని ఇచ్చిన నినాదంపై ఆప్ అధినేత,ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.తమ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, ఉచిత నీరు లాంటి సంక్షేమ పథకాలను రద్దు చేయడమే బీజేపీ తెచ్చే మార్పని కౌంటర్ ఇచ్చారు. కేజ్రీవాల్ కామెంట్స్‌పై ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్దేవ స్పందించారు. ఎన్నికల వేళ తమ నినాదం జనాల్లోకి బాగా వెళ్లడాన్ని ఆప్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కేజ్రీవాల్ సహా ఆప్ అగ్రనేతలంతా పీకల్లోతు అవినీతిలోకి కూరుకుపోయారని ఆరోపించారు. కాగా, వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని ఆప్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఇదీ చదవండి: టార్గెట్ కాంగ్రెస్..మమత రాజకీయం ఇదేనా -
‘నేను రాలేదు.. కాబట్టే నువ్వు గెలిచావ్ రా’!..
ముంబై : నువ్వు పోటీ చేసిన అసెంబ్లీ నియోజకవర్గంలో నేను పోటీ చేసి ఉండి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదంటూ బాబాయ్ అజిత్ పవార్, అబ్బాయి రోహిత్ పవార్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ప్రస్తుతం, ఆ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తరుఫున అహల్య జిల్లా ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ సోదరుడి కుమారుడు రోహిత్ పవార్.. బీజేపీ అభ్యర్థిపై స్వల్ప తేడాతో విజయం సాధించారు.ఈ తరుణంలో సోమవారం(నవంబర్ 25) మహారాష్ట్ర తొలి సీఎం వైబీ చవాన్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అజిత్ పవార్, ఆయన సోదరుడి కుమారుడు రోహిత్ పవార్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచావుగా. రా.. వచ్చి నా ఆశీర్వాదం తీసుకో. ఒకవేళ నేనే ఖజరత్ జమ్ఖేడ్లో ఎన్నికల ప్రచారం చేసి ఉంటే ఏమి జరిగి ఉండేది?’’ అని రోహిత్ పవార్‌ను ఉద్దేశిస్తూ అజిత్ పవార్ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడారు. ఆ మాటతో రోహిత్ పవార్.. అజిత్ పవార్ కాళ్లకు నమస్కరించారు.స్వల్ప తేడాది విజయంఇటీవల ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ అహల్యానగర్ జిల్లాలోని ఖజరత్ జమ్ఖేడ్ నియోజకవర్గంలో తన ప్రత్యర్థి బీజేపీ నేత రామ్ షిండేపై 1,243 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. 41 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ గెలుపుగత వారం మహరాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఎన్నికలలో శరత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ)10 స్థానాల్ని కైవసం చేసుకోగా.. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. स्व. यशवंतराव चव्हाण साहेबांची समाधी प्रितीसंगम म्हणजे पवित्र स्थळ. चव्हाण साहेबांनीच एक सुसंस्कृत अशी राजकीय संस्कृती जपण्याचे संस्कार महाराष्ट्रावर केले. त्यानुसारच आज प्रितीसंगमावर आदरणीय अजितदादांची भेट झाली. त्यांची राजकीय वाटचाल स्वतंत्र दिशेने सुरु असली तरी त्यांचा राजकीय… pic.twitter.com/Oc8eQYdwfN— Rohit Pawar (@RRPSpeaks) November 25, 2024 -
అది వాళ్లకు అనవసరం.. రాజకీయాలకు స్వస్తి పలకడంపై శరద్ పవార్
ముంబై: మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ఘోర పరాజయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఊహించలేదని, ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయమని అన్నారు .మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శరద్ పవార్ మాట్లాడారు. 288 అసెంబ్లీ స్థానాల్లో అజిత్ పవార్ 41 స్థానాల్ని గెలిచారని ప్రస్తావించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఈ ఫలితాల్ని మేం ఊహించలేదు. ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయం. నాకంటే అజిత్ పవార్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయనే విషయాన్ని మేం అంగీకరిస్తున్నాం. అయితే ఎన్సీపీ వ్యవస్థాపకుడు ఎవరో మహరాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ స్థాపించిన నాటి నుంచి తొలిసారి శరద్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది.ఈ తరుణంలో పలువురు ఎన్సీపీ నేతలు.. శరద్ పవార్ రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను ఏం చేయాలో వాళ్లకు అనవసరం నేను ఏం చేయాలో నేను, నా సహచరులు నిర్ణయిస్తారు’ అని వ్యాఖ్యానించారు. -
నేను అస్సలు ఊహించలేదు.. ‘మహా’ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ
ఢిల్లీ : మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని తాను ఊహించలేదని అన్నారు కాంగ్రెస్ అగనేత రాహుల్ గాంధీ. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి కూటమి విజయం సాధించింది. మహాయుతి కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ 288 స్థానాల్లో ఏకంగా 130 స్థానాల్లో విజయం సాధించింది. ఇతర మిత్ర పక్షాలతో కలిసి మెజార్టీని సాధించారు. దీంతో రెండోసారి మహాయతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ఈ తరుణంలో మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై రాహుల్ ఎక్స్ వేదికగా స్పందించారు. మహరాష్ట ఫలితాల్ని నేను ఊహించలేదు. ఓటమిని అంగీకరిస్తున్నాం. ఓటమికి గల కారణాల్ని విశ్లేషిస్తామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా తమ పార్టీకి మద్దతిచ్చిన ఓటర్లకు, సోదరీమణులందరికీ, పార్టీ గెలుపుకోసం కృష్టి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు’అని అన్నారు. మరోవైపు జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి విజయం రాజ్యాంగంతో పాటు నీరు, అటవీ, భూమి రక్షణ విజయం’అని రాహుల్ గాంధీ ట్వీట్లో పేర్కొన్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ నేతృత్వం వహిస్తున్న జేఎంఎం 34 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ నిలించింది.झारखंड के लोगों का INDIA को विशाल जनादेश देने के लिए दिल से धन्यवाद। मुख्यमंत्री हेमंत सोरेन जी, कांग्रेस और झामुमो के सभी कार्यकर्ताओं को इस विजय के लिए हार्दिक बधाई और शुभकामनाएं।प्रदेश में गठबंधन की यह जीत संविधान के साथ जल-जंगल-ज़मीन की रक्षा की जीत है।महाराष्ट्र के नतीजे…— Rahul Gandhi (@RahulGandhi) November 23, 2024 -
థ్యాంక్యూ అమ్మ.. తల్లితో దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై : మహరాష్ట్ర ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించింది. మొత్తం 288 స్థానాల్లో అధికార బీజేపీ 229 స్థానాల్లో ముందంజలో ఉండగా.. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కేవలం 54 స్థానాలకే పరిమితమైందిఈ తరుణంలో కాబోయే మహరాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే తమ కుమారుడే మహరాష్ట్ర సీఎం అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ప్రజల కోసం తన కుమారుడు 24 గంటలూ కష్టపడుతున్నారని మీడియాతో పేర్కొన్నారు.మరోవైపు, మహరాష్ట్ర ఎన్నికల ఫలితాలపై నాగపూర్ సౌత్ వెస్ట్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఆమె తల్లి సరితా ఫడ్నవీస్ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోన్ కాల్లో ‘ఎన్నికల తతంగం పూర్తి చేసుకుని సాయంత్రం ఇంటికి వస్తా అమ్మా. మీతో అన్నీ మాట్లాడుతాను. మీరు నన్ను ఆశీర్వదించండి’ అని అన్నారనేది ఆ ఫోన్ కాల్ సారాంశం.కాగా,ప్రస్తుతం విడుదలైన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 124 స్థానాల్లో ముందంజలో ఉంది. 144 స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది. మహాయుతి కూటమిలోని ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 56, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ కేవలం 19 స్థానాలతో ఆధిక్యంలో ఉంది. శివసేన(యూబీటీ) 18, శరద్ పవార్ ఎన్సీపీ 15 స్థానాల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. #WATCH | As Mahayuti is set to form govt in Maharashtra, Deputy CM Devendra Fadnavis' mother, #SaritaFadnavis says, "Of course, he will become the CM...It is a big day as my son has become a big leader in the state. He was working hard at all 24 hours..."#ElectionResults… pic.twitter.com/MV36KVSyJe— TIMES NOW (@TimesNow) November 23, 2024 -
మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ .. ఎవరి సత్తా ఎంతంటే?
సాక్షి,ఢిల్లీ: మహరాష్ట్ర, ఝార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయ్. ఫలితాల్లో రెండు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అయితే, రెండు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇండియా కూటమి తీవ్రంగా శ్రమించింది. అయినప్పటికీ అంచనాలను తలకిందులు చేస్తూ సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపారని వెల్లడించాయి. ఇక, సర్వే సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర (పీపుల్స్‌పల్స్)బీజేపీ 182, కాంగ్రెస్ 97,ఇతరులు 9 మహరాష్ట్ర (ఏబీపీ) : బీజేపీ 150-170 కాంగ్రెస్ 110-130ఇతరులు 8-10 ఝార్ఖండ్ (పీపుల్స్ పల్స్) ఎన్డీయే-46-58జేఎంఎం కూటమి 24-37 ఇతరులు 6-10 చాణక్య (మహారాష్ట్ర)ఎన్డీఏ 152-160ఇండియా 130-138చాణక్య(ఝార్ఖండ్) ఎన్డీఏ 45-50జేఎంఎం 35-38ఏబీపీ(మహారాష్ట్ర)ఎన్డీఏ 150-170ఎంవీఏ 110-130ఇతరులు 6-8కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగ్గా. 81 అసెంబ్లీ స్థానాలున్న ఝార్ఖండ్‌లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్రలో 288 స్థానాల్లో బీజేపీ 149 స్థానాలు, శివసేన షిండే వర్గం 81 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ 59 స్థానాల్లో పోటీ చేశాయి. ఇక మహావికాస్ అఘాడీ నుంచి కాంగ్రెస్ 101 సీట్లు, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం 95 సీట్లు, ఎన్సీపీ శరద్‌పవార్ 86 సీట్లలో తలపడుతున్నారు.ఝార్ఖండ్‌లో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ 30 సీట్లలో, జేఎంఎం 42, ఆర్జేడీ 6, సీపీఐఎంఎల్ 3 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎన్డీఏ కూటమి 81 సీట్లలో తలపడుతోంది. ఈ నెల 23న ఫలితాలు విడుదల కానున్నాయి. -
Jharkhand Election 2024: ముగిసిన పోలింగ్
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో విడతలో భాగంగా 38 నియోజకవర్గాలకు ఇవాళ పోలింగ్ జరగనుంది. -
చిన్న పార్టీలే... నిర్ణేతలు!
మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార మహాయుతి, విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటముల మధ్యే కేంద్రీకృతమైంది. కానీ అంతిమ ఫలితాన్ని మాత్రం చిన్న పార్టీలు, స్వతంత్రులే తేల్చే సూచనలు కన్పిస్తుండటం విశేషం. ఈ జాబితాలో మజ్లిస్, ఎంఎన్ఎస్, వీబీఏ వంటి పార్టీలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. వీటికి, స్వతంత్రులకు కలిపి ఈసారి కనీసం 30 స్థానాలకు పైగా రావచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.అదే జరిగి, హంగ్ వచ్చే పక్షంలో అవి కింగ్మేకర్లుగా మారినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకూ నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిన్న పార్టీల హల్చల్ రెండు కూటముల్లోనూ గుబులు రేపుతోంది. దాంతో అందరి దృష్టీ 23న వెల్లడయ్యే ఫలితాలపైనే కేంద్రీకృతమైంది...!మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోరు పరాకాష్టకు చేరింది. అధికారం నిలుపుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్న బీజేపీ సారథ్యంలోని మహాయుతి, దాన్ని ఎలాగైనా గద్దె దించేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్ నాయకత్వంలోని ఎంవీఏ కూటములకు చిన్న పార్టీలు పెద్ద సమస్యగా పరిణమించాయి. జరుగుతున్నది ద్విముఖ పోరే అయినా రెండు కూటముల భాగ్యరేఖలనూ ఈ ‘తృతీయ శక్తులు’ నిర్దేశించేలా కనిపిస్తుంటే ఆసక్తికరంగా మారింది. ఈ చిన్న పార్టీల్లో ఒక్కోదానికీ ఒక్కో ప్రాంతంలో చెప్పుకోదగ్గ పట్టుంది. అగాడీకి ఎంఎన్ఎస్ గుబులు ఈ ఎన్నికల్లో ప్రబల శక్తిగా కనిపిస్తున్న రాజ్ ఠాక్రే సారథ్యంలోని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) విపక్ష ఎంవీఏ కూటమికి గుబులు పుట్టిస్తోంది. రాజధాని ముంబై, శివార్లలో ఎంఎన్ఎస్ హవా అంతా ఇంతా కాదు. ముంబైలోని 25 స్థానాల్లో ఎంఎన్ఎస్ బరిలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం మరో 36 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ గట్టి ప్రభావం చూపడం ఖాయంగా కన్పిస్తోంది. ముంబైలోని 25 స్థానాల్లో మహాయుతి కూటమి నుంచి శివసేన (షిండే) 12, బీజేపీ 10 చోట్ల పోటీ పడుతున్నాయి.ఎంఎన్ఎస్ను బీజేపీకి మిత్రపక్షంగా పరిగణిస్తారు. రాజ్ ఠాక్రేను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఆయన కుమారుడు అమిత్ పోటీ చేస్తున్న మాహింలో కూటమి ధర్మాన్ని కూడా బీజేపీ పక్కన పెట్టింది! అక్కడ షిండే సేన అభ్యర్థని కాదని మరీ అమిత్‌కే బీజేపీ నేతలు బాహాటంగా మద్దతు పలుకుతున్నారు! ఇది ఆ రెండు పార్టీల లోపాయికారీ అవగాహనకు, బీజేపీ వ్యూహ చతురతకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు.కింగ్‌మేకర్ ఆశల్లో ఒవైసీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన మజ్లిస్‌కు కూడా మహారాష్ట్రలో చెప్పుకోదగ్గ పట్టే ఉంది. ముఖ్యంగా ఔరంగాబాద్‌తో పాటు ముంబైలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పార్టీ హవా కొనసాగుతుంది. 2019లో 44 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్ ఈసారి కేవలం 16 స్థానాల్లోనే బరిలో ఉంది. కాకపోతే అవన్నీ ముస్లిం ప్రాబల్య స్థానాలే. వాటిలో చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయంపై పార్టీ నమ్మకంగా ఉంది.అంతేగాక మిగతా చోట్ల మజ్లిస్ చీల్చే ముస్లిం ఓట్లు అగాడీ కూటమి అభ్యర్థుల విజయావకాశాలకు గట్టిగా గండి కొట్టేలా కన్పిస్తున్నాయి. ‘‘హంగ్ వచ్చి ఎంవీఏ కూటమి గనక మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో ఆగిపోతే మేం గెలవబోయే సీట్లే కీలకం కావచ్చు. అప్పుడు మజ్లిస్ కింగ్‌మేకర్ అవుతుంది’’ అని ఆ పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఎంవీఏ కూటమిలో చేరేందుకు మజ్లిస్ విఫలయత్నం చేసింది.గత ఎన్నికల్లోనూ దుమ్ము రేపాయిమహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చిన్న పార్టీలు దుమ్మురేపాయి. మొత్తమ్మీద 29 సీట్లు గెలుచుకోవడమే గాక ఏకంగా మరో 63 అసెంబ్లీ స్థానాల్లో చిన్న పార్టీల అభ్యర్థులు రెండో స్థానంలో నిలవడం విశేషం. ఈసారి కూడా ఆ ఫలితాలే పునరావృతమైతే కూటములకు కష్టకాలమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే రాష్ట్రంలో చాలా అసెంబ్లీ స్థానాల్లో మొత్తం ఓటర్లు 4 లక్షలు, అంతకన్నా తక్కువే ఉంటారు. 60 శాతం పోలింగ్ జరుగుతుందనుకున్నా సగటున ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో 2.5 లక్షల ఓట్లు పోలవుతాయి. పార్టీపరమైన చీలికల దృష్ట్యా ప్రతి స్థానంలోనూ కేవలం లక్ష ఓట్లే విజేతను తేల్చే అవకాశముంది.సరిగ్గా ఈ అంశమే పలు స్థానాల్లో చిన్న పార్టీలను ప్రబల శక్తులుగా మారుస్తోంది. దీనికి తోడు గత ఎన్నికలతో పోలిస్తే మహారాష్ట్రలో ఈసారి రాజకీయ రంగస్థలం నానారకాలుగా చీలిపోయింది. దాంతో చిన్న పార్టీ, గట్టి ఇండిపెండెంట్ బరిలో ఉన్న అన్ని స్థానాల్లోనూ మిగతా అభ్యర్థులందరి భాగ్యరేఖలూ ప్రభావితమ య్యే పరిస్థితి నెలకొంది! ఈ కారణంగానే ఈసారి ఫలితాలను అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.దళిత ఓట్లను చీల్చనున్న వీబీఏ! ఎన్నికల బరిలో ఉన్న వంచిత్ బహుజన్ అఘాడీ (వీబీఏ) నిజానికి పలు చిన్న పార్టీల కూటమి. అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ సారథ్యంలోని ఈ కూటమికి దళితులు, బౌద్ధ దళితులు, ఇతర అణగారిన వర్గాలతో పాటు ముస్లింలలో కూడా మంచి ఆదరణే ఉంది. రిజర్వేషన్లే ప్రధాన నినాదంగా ఈసారి ఏకంగా 67 స్థానాల్లో వీబీఏ బరిలో దిగింది. వీటిలో అత్యధిక స్థానాలు ముంబై, విదర్భ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్ర జనాభాలో దళితులు 14 శాతం, బౌద్ధ దళితులు 7 శాతమున్నారు. గతంలోనూ పలు ఎన్నికల్లో వీబీఏ సత్తా చాటింది.విదర్భతో పాటు మరాఠ్వాడా ప్రాంతంలోనూ పార్టీకి చెప్పుకోదగ్గ ఆదరణ ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాకపోయినా 7 శాతం ఓట్లు సాధించింది. ఈసారి వీబీఏ భారీగా దళిత ఓట్లు సాధిస్తే ప్రధానంగా ఎంవీఏ కూటమికే దెబ్బ పడుతుంది. 2019లో కూడా కనీసం 10 స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అభ్యర్థుల ఓటమికి వీబీఏ సాధించిన ఓట్లే కారణమని తేలింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కూడా పలు స్థానాల్లో ఎంవీఏ అభ్యర్థుల ఓటమికి వీబీఏ కారణంగా నిలిచింది. ఇవే గాక మరికొన్ని చిన్న పార్టీలతో స్థానికంగా గట్టి పట్టున్న స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు స్థానాల్లో కూటముల అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.జరంగే ఫ్యాక్టర్? మరాఠా హక్కుల ఉద్యమ నేత మనోజ్ జరంగే పాటిల్ కూడా ఈసారి ఎన్నికల్లో గట్టి ప్రభావమే చూపేలా ఉన్నారు. ఈసారి అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించి రెండు కూటములకూ ఆయన చెమటలు పట్టించారు. మహారాష్ట్ర జనాభాలో ఏకంగా 30 శాతానికి పైగా ఉండే మరాఠాల్లో ఆయనకు గట్టి పట్టుండటమే ఇందుకు కారణం. చివరి క్షణంలో ఎన్నికల బరి నుంచి తప్పుకున్నా ఎన్నికల ఫలితాలపై మాత్రం జరంగే గట్టి ప్రభావమే చూపనున్నారు.ముఖ్యంగా మరాఠ్వాడాలో చాలా స్థానాల్లో ఆయన మద్దతిచ్చే అభ్యర్థులే గట్టెక్కే పరిస్థితి నెలకొని ఉంది! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జరంగే సహాయ నిరాకరణ మరాఠ్వాడాతో పాటు పశ్చిమ మహారాష్ట్ర, విదర్భల్లోని పలు స్థానాల్లో మహాయుతి అవకాశాలను బాగా దెబ్బతీసింది. ఆ చేదు అనుభవం ఈసారీ పునరావృతం అవుతుందేమోనని బీజేపీ పెద్దలు భయపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మహా’లో చీలికలు? మోదీ ప్రచారానికి అజిత్ పవార్ డుమ్మా!
ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరుణంలో అధికార మహాయుతి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. బీజేపీ అగ్రనేత, దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి మహరాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP)చీఫ్ అజిత్ పవార్ డుమ్మా కొట్టారు.గురువారం మహరాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, పాన్వెల్లో ప్రధాని మోదీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు.అయితే ఈ సభకు అజిత్ పవార్‌తో పాటు అభ్యర్థులు సనా మాలిక్, నవాబ్ మాలిక్ జీషన్ సిద్దిక్ గైర్హాజరయ్యారు. శివసేన ఏకనాథ్ షిండే వర్గం, రాందాస్ అథవాలే నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకులు మాత్రమే పాల్గొన్నారు.ఇటీవల హర్యానా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాథ్ ‘బాటేంగే తో కటేంగే’ (విడిపోతే, దెబ్బతింటాం) నినాదం వినిపించారు. ఆ నినాదం బీజేపీకి అనుకూల ఫలితాల్ని ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నినాదంతో మహాయుతి కూటమి మహరాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తుంది. ఆ నినాదాన్ని అజిత్ పవార్ వ్యతిరేకించారు. ఉత్తరప్రదేశ్, జార్ఘండ్‌లలో ఈ నినాదం పనిచేస్తుందేమో.. ఇక్కడ పనిచేయదని వ్యాఖ్యానించారు.ఈ తరుణంలో తాజాగా,మోదీ ఎన్నికల ప్రచారానికి అజిత్ పవార్ రాకపోవడం మహ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. అజిత్ పవార్.. మోదీ ఎన్నికల ప్రచారంలో లేకపోవడాన్ని ప్రతిపక్షాలు అస్త్రంగా చేసుకోనున్నాయి. తమ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. చదవండి : 50 కోట్లు ఇస్తే ఈవీఎం హ్యాక్ చేస్తా -
PM Narendra Modi: ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య... చిచ్చుకు కాంగ్రెస్ కుట్ర
బొకారో: దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల మధ్య చిచ్చుపెట్టి అధికారం దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ వ్యూహమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు దోచుకోవడానికి కాంగ్రెస్ రాజకుటుంబం కుట్రలు చేస్తోంది. స్వాతంత్య్రం వచి్చనప్పటి నుంచి ఆ వర్గాల ఐక్యతను కాంగ్రెస్ వ్యతిరేకిస్తూనే వస్తోంది. వాటి మధ్య ఐక్యత లేనంతకాలం కేంద్రంలో అధికారం చలాయించి దేశాన్ని లూటీ చేసింది’’ అని ఆరోపించారు. మనం సురక్షితంగా ఉండాలంటే కలసికట్టుగా ఉండాలని మరోసారి పిలుపునిచ్చారు. ఆదివారం జార్ఖండ్‌లోని బొకారో, గుమ్లా పట్టణాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ మాట్లాడారు. రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్–జేఎంఎం కూటమి ఓబీసీలను కులాలవారీగా ముక్కలు చేయజూస్తోందని మండిపడ్డారు. ఉప కులాల మధ్య మంటలు పెట్టి చలి కాచుకోవాలని చూస్తోందన్నారు. మాఫియాల భరతం పడతాం జార్ఖండ్‌లో తిష్టవేసిన అక్రమ వలసదార్లను వెళ్లగొట్టాలంటే, అవినీతిని అంతం చేయాలంటే బీజేపీ గెలవాలని మోదీ అన్నారు. ‘‘జేఎంఎం కూటమి పాలనలో పిడికెడు ఇసుక కూడా దొరక్క ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పాలకులు మాత్రం ఇసుక దోచుకున్నారు. ఖనిజ సంపద, అడవులు, కొండలు, నదులు, బొగ్గు అన్నీ లూటీ చేశారు. కోట్లు కొల్లగొట్టారు. రిక్రూట్మెంట్ మాఫియా, పేపర్ లీక్ మాఫియాను సృష్టించారు. అవినీతి నేతను వదిలే ప్రసక్తే లేదు. వారిని జైలుకు పంపుతం. మేం గెలిచాక జార్ఖండ్‌ను అభివృద్ధి చేస్తాం’’ అని మోదీ ఉద్ఘాటించారు. గిరిజనులు ఉన్నత స్థానాలకు చేరితే కాంగ్రెస్ ఓర్వలేదని ఆరోపించారు. గిరిజన బిడ్డ ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి కాకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నించిందన్నారు. ఆమెను ఇప్పటికీ అవమానిస్తూనే ఉందని ఆక్షేపించారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి జమ్మూకశ్మీర్‌లో తొలిసారి ఒక ముఖ్యమంత్రి భారత రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేశారని మోదీ అన్నారు. ‘‘ఇది అంబేడ్కర్‌కు దక్కిన ఘన నివాళి. అక్కడ ఆరి్టకల్ 370ని మళ్లీ తేవాలని కాంగ్రెస్, మిత్రపక్షాలు ప్రయతి్నస్తున్నాయి. అదే జరిగితే అక్కడ రాజ్యాంగం మరోసారి అమలవకుండా పోతుంది. మన సైనికులు ఉగ్రవాదులతో తలపడాల్సి వస్తుంది’’ అన్నారు. రాంచీలో రోడ్ షో జార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ ఆదివారం 3 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. #WATCH | Jharkhand: While addressing an election rally at Bokaro, Prime Minister Narendra Modi says, " ...I want to promise you (people), once the govt is formed, to give these corrupt people strictest punishment, we will take this fight to the court. Your money will be spent on… pic.twitter.com/I621Z0bDmB— ANI (@ANI) November 10, 2024చదవండి: 10వ తరగతిలో ఉగ్రవాదిని అవ్వాలనుకున్నా : ఎమ్మెల్యే -
మహా ఎన్నికలు: ‘నన్ను గెలిపిస్తే.. బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు జరిపిస్తా’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పోటీలో నిలబడిన అభ్యర్థుల విచిత్ర హామీలు ఇస్తున్నారు. అయితే.. ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తానను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలోని పర్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పర్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.‘‘యువతకు పని కల్పిస్తాం. పెళ్లి సమయంలో యువకులకు ఉద్యోగం లేదా వ్యాపారం ఉందా? అడుగుతారు. జిల్లా మంత్రి ధనంజయ్ ముండేకే వ్యాపారం లేనప్పుడు, మీరు ఏవిధంగా ఉద్యోగాలు పొందుతారు. ధనుంజయ్ ముండే.. నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. అందువల్ల ఉద్యోగాలు లేక.. స్థానిక బ్యాచిలర్లు వివాహం చేసుకోవడం కష్టంగా మారింది. నన్ను గెలిపిస్తే.. ఉద్యోగాలు కల్పించి బ్యాచిలర్స్‌కు పెళ్లిలు చేస్తా’ అని అన్నారు.Unique poll promise@NCPspeaks candidate #RajasahebDeshmukh says on getting elected from Beed district's #Parli assembly constituency, he will get all the bachelors married#Maharashtra #PoliticsToday #MaharashtraAssembly pic.twitter.com/TfRm7kRtO8— Mohammed Akhef TOI (@MohammedAkhef) November 6, 2024 దేశ్‌ముఖ్ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత ధనుంజయ్ ముండే పరిశ్రమలు తేకపోవడంతో ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు జరగక యువత ఇబ్బంది పడుతున్నారని ర రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆరోపణలు చేశారు.చదవండి: నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ -
జార్ఖండ్: జేఎంఎం కూటమీ మేనిఫెస్టో.. ఎన్ని హామీలంటే?
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ-ఎం కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉమ్మడి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఏడు హామీలు పొందుపర్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మేం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం ప్రాధాన్యతాపరంగా ఈ 7 హామీలను అమలు చేస్తాం. ఇవాళ మహాఘటబంధన్ నాయకులందరూ సమావేశమై.. ఈ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకువచ్చాం’ అని అన్నారు.జేఎంఎం నేతృత్వంలోని కూటమి.. జార్ఖండ్ పౌరులకు ఇచ్చిన ఏడు హామీలు ఇవే..1. 1932 నాటి ఖతియాన్ విధానాన్ని ఆధారంగా సర్నా మత నియమావళి అమలు చేయటం.2. డిసెంబర్ 2024 నుంచి మైయా సమ్మాన్ పథకం కింద రూ.2,500 అందించడం.3. మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణ కోసం వెనుకబడిన తరగతుల కమిషన్ ఏర్పాటు చేయటం.4. ఒక్కో కుటుంబానికి రూ.450 చొప్పున ఎల్పీజీ సిలిండర్లు, ఒక్కో వ్యక్తికి రేషన్ పరిమాణాన్ని 7 కిలోలకు పెంచటం.5. 10 లక్షల మంది యువకులకు ఉపాధి, రూ. 15 లక్షల వరకు కుటుంబ ఆరోగ్య భృతి కల్పించటం.6. ప్రతి బ్లాక్‌లో డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఏర్పాటు. ప్రతి జిల్లాలో 500 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయటం.7. బియ్యం ఎంఎస్పీ రూ.2,400 నుంచి రూ.3,200కి పెంచడంతో పాటు ఇతర పంటల రేట్లను 50 శాతానికి పెంపుఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
జార్ఖండ్‌లో కూటమి పార్టీలు ఆరిపోయిన టపాసులు: కేంద్ర మంత్రి
రాంచీ: జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. జేఎంఎం నేతృత్వంలోని పార్టీలు ఆరిపోయిన టపాసులని, బీజేపీ.. రాష్ట్రాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకెళ్లే శక్తివంతమైన రాకెట్ అని అభివర్ణించారు. ఆయన రాష్ట్ర రాజధాని రాంచీలోని హతియాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.‘‘రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో స్పష్టంగా తెలుస్తోంది. దీపావళి పండుగ ఇప్పుడే ముగిసిపోయింది. జేఎంఎం, కాంగ్రెస్ , ఆర్జేడీ పార్టీలు ఇప్పుడు దీపావళి క్రాకర్స్‌తో కలిసిపోయాయి. కానీ, బీజేపీ మాత్రమే జార్ఖండ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే శక్తిమంతమైన రాకెట్. జేఎంఎం ఆదివాసీల రక్తాన్ని పీల్చుకుంది. వారి ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోంది. జార్ఖండ్‌కు చొరబాటుదారులు ఎందుకు వస్తున్నారని నేను హేమంత్ సోరెన్‌ను అడుగుతున్నా. రాష్ట్రంలోని గిరిజన జనాభా 28 శాతానికి ఎందుకు తగ్గిపోయింది?. బీజేపీకి రెండు పర్యాయాలు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చెందిన రాష్ట్రాల వరుసలో జార్ఖండ్ నిలబెడతాం. మేం జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని మార్చడమే కాకుండా వ్యవస్థను కూడా మారుస్తాం’’అని అన్నారు.మరోవైపు.. సోమవారం జార్ఖండ్‌లోని గర్వాలో ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ.. జేఎంఎం కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతుగా ఉన్నందుకు జేఎంఎం నేతృత్వంలోని కూటమిని ‘చొరబాటుదారుల కూటమి’గా అభివర్ణించారు. ‘‘జార్ఖండ్‌లో బుజ్జగింపు రాజకీయాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడంలో బిజీగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో గిరిజనుల సంఖ్య తగ్గిపోతుంది. ఇది గిరిజన సమాజానికి, దేశానికి పెనుముప్పు. ఈ సంకీర్ణ కూటమి.. చొరబాటుదారుల కూటమి’’ అని మోదీ అన్నారు. ఇక.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెల్లడికానున్నాయి. -
మహారాష్ట్ర డీజీపీ రష్మీ శుక్లా పై ఈసీ వేటు
-
2027లో ఎన్నికలు రాబోతున్నాయి: ఎంపీ విజయసాయిరెడ్డి
-
ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తులు
నాందేడ్: ఇప్పటికే తెలంగాణా,కర్ణాటక రాష్ట్రాలలో సంచలన విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలోనూ భాగ స్వామ్య పక్షాలతో కలిసి విజయం సాధించి దక్షిణాదిలో బీజేపీ దూకుడుకు ముకుతాడు వేసేందుకు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది.భాగస్వామ్య పక్షాలతో సీట్ల సర్దుబాటు అంశంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా సమన్వయం చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది.ఈ మేరకు ఏఐసీసీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సచిన్ పైలెట్లు బుధవారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో పార్టీ సమన్వయ సమావేశం నిర్వహించి నాయకులు, పార్టీ శ్రేణులకు ఎన్నికల రూట్ మ్యాప్‌పై దిశానిర్దేశం చేశారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకునేలా కృషిచేయాలంటూ వారికి సూచించారు. -
‘దీదీ’కి అగ్ని పరీక్ష .. పశ్చిమ బెంగాల్లో హీటు పుట్టిస్తున్న అసెంబ్లీ ఉప ఎన్నికలు
కోల్‌కతా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి ఘటనలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగలనుంది. నవంబర్ 13న ఆరు అసెంబ్లీ సిట్టింగ్ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థుల ఓటమి ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు ఆర్జీ కార్ ఘటనే కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పశ్చిమ బెంగాల్లో సీతాయ్, మదియాహత్, నైహతి, మేదినీపూర్, హరోవా, తల్దాంగ్రా సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నిక జరగనుంది. ఈ నియోజక వర్గాల ప్రజలు ఆర్జీ కార్ ఘటనలో జూనియర్ వైద్యురాలికి మద్దతుగా నిలిచారు. ఇదే కేసులో ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ అంశం దీదీ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.పశ్చిమ బెంగాల్లో అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఆర్జీ కార్ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. ఆరు సిట్టింగ్ స్థానాల్లో ఒకటి బీజేపీ, మిగిలిన ఐదు స్థానాలు టీఎంసీవి. ఇప్పుడు ఈ మొత్తం స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ రాజకీయ పరిణామాలపై టీఎంసీ నేత కుమాల్ ఘోష్ మాట్లాడుతూ..‘ఆర్జీ కర్ ఘటనను దుర్వినియోగం చేయడం, ఓటర్లను తప్పుదారి పట్టించేలా గందరగోళానికి గురిచేసేలా ప్రతిపక్షాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తాయి’ అని అన్నారు.‘సీపీఐఎం పాలన ఎలా ఉందో పశ్చిమ బెంగాల్ ప్రజలు చూశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో బీజేపీ పాలన ఎలా ఉందో గమనిస్తున్నారు. ఆర్జీ కర్ ఘటన కేసు నిందితుణ్ని కోల్‌కతా పోలీసులు 24 గంటల్లో పట్టుకున్నాం. ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనం. మేం అన్నీ స్థానాల్లో గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.కాగా, ఇటీవల పశ్చిమ బెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఆరుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆరు సిట్టింగ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది. -
‘మహా’ ఎన్నికల వేళ.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత రవి రాజా.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేరారు. అంతకు ముందు రాజీనామా ప్రకటన చేసి 44 ఏళ్ల హస్తం పార్టీతో అనుబంధం తెంచేసుకున్నారాయన. ఐదుసార్లు ముంబై నగర కార్పొరేటర్‌గా గెలిచిన రవి రాజా.. గురువారం ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్‌తో భేటీ అయ్యారు. ఆ టైంలో ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించారంతా. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. చాలా మంది ప్రముఖ కాంగ్రెస్ నేతలు సీనియర్ నేత రవి రాజాను అనుసరించి బీజేపీలోకి వస్తారని జోష్యం చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తిరిగి మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారు’ అని అన్నారు‘‘ముంబైలోని సమస్యలపై రవి రాజా పూర్తి పట్టు ఉంది. ఆయన మా పాత స్నేహితుడు కూడా. రాజా, ఆయన మద్దతుదారులు బీజేపీలో చేరాలని తీసుకున్న నిర్ణయం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ గెలుపు అవకాశాలను బలోపేతం చేస్తుంది’’అని ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్ అన్నారు. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.చదవండి: ‘అలా చేయటం.. నన్ను ఎంతో బాధపెట్టింది’ -
‘అలా చేయటం.. నన్ను ఎంతో బాధపెట్టింది’
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తనను అనుకరించటం చాలా బాధపెట్టిందని ఎన్సీపీ చీఫ్, డిప్యూటీ సీఎం అజిత్ పవర్ అన్నారు. శరద్ పవార్ అనుకరణపై బుధవారం అజిత్ పవార్ స్పందించారు. శరద్ పవార్ అలా చేయడం సరికాదని అన్నారు. తన తల్లి పేరు ప్రస్తావనతో భావోద్వేగానికి గురయ్యానని, అది సహజంగానే జరిగిందని చెప్పారు.‘‘నేనెప్పుడూ శరద్ పవార్‌ని దేవుడిగా భావించే వ్యక్తిని. కానీ ఆయన రుమాలుతో కళ్లు తుడుచుకుంటూ నా ప్రసంగాన్ని అనుకరించారు. శరద్ పవార్ అనుభవజ్ఞులైన నేత. ఆయన నన్ను అనుకరించిన విధానం చాలా మందికి నచ్చలేదు. అదే పని.. బారామతి అభ్యర్థి యోగేంద్ర పవార్ లేదా ఇతరులు ఎవరైనా చేసి ఉంటే ఫర్వాలేదు. మా అమ్మ పేరు ప్రస్తావనతో నేను కాస్త భావోద్వేగానికి గురయ్యా. నేను కన్నీళ్లు పెట్టుకున్నా. అది చాలా సహజమైంది. కొన్నిసార్లు ఇలా జరుగుతుంది కూడా. నేను నా రుమాలు తీయలేదు. కానీ ఆయన అలా చేశారు. ఇంత కాలం ఆయన రాజ్ ఠాక్రేను మాత్రమే అనుకరిస్తారని అనుకున్నా. కానీ నిన్న(మంగళవారం) శరద్ పవార్ నన్ను కూడా అనుకరించారు. ఆయన అలా చేయటం నిజంగా చాలా బాధ పెట్టింది’ అని అన్నారు.చదవండి: ‘పదవి కోసం కుటుంబం విచ్ఛిన్నం చేస్తావా?’ -
ముగిసిన నామినేషన్ల గడువు.. 15 స్థానాలపై రాని స్పష్టత!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు ఇవాళ(మంగళవారం) ముగిసింది. కానీ దాదాపు 15 సీట్లను అధికార, ప్రతిపక్ష కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించని పరిస్థితి నెలకొంది . బీజేపీ, శివసేన( ఏక్నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అధికార కూటమి ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్‌న్సీపీ( ఎస్పీ వర్గం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. బీజేపీ 152 మంది అభ్యర్థులు, ఎన్సీపీ( అజిత్ పవార్ వర్గం) 52 మంది అభ్యర్థులు, శివసేన( ఏక్నాథ్ షిండే వర్గం) శివసేన 80 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఇందులో అధికార కూటమి చిన్న మిత్రపక్షాలకు ఇచ్చిన సీట్లు కూడా ఉన్నాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ 103 మంది అభ్యర్థులు, శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్సీపీ( ఎస్పీ) కలిపి 87 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది.మధ్యాహ్నం నాటికి ఎన్సీపీ( ఎస్పీ)కి సంబంధించినంత వరకు చివరి 87వ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపింది. అయితే అది అప్పటికీ 11 సీట్లపై అనిశ్చిత్తి నెలకొంది. ఈ సీట్లు కొన్ని చిన్న మిత్రపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీకి వస్తాయని అంచనా వేయగా.. ఎవరికి ఏది, ఎన్ని అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఎన్‌న్సీపీ (అజిత్ పవార్ వర్గం) నవాబ్ మాలిక్ మంఖుడ్ స్థానం నుంచి రెండు నామినేషన్లను దాఖలు చేశారు. ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. -
మోదీ.. విమానాల ఫ్యాక్టరీని గుజరాత్ తరలించారు: శరద్ పవార్
ముంబై: గుజరాత్‌లోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఎయిర్‌బస్ ఫ్యాక్టరీ మహారాష్ట్రలో ఏర్పాటు చేయవల్సి ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌కు తరలించుకుపోయారని కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోపణలు చేశారు. ఆయన మంగళవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బారామతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. ‘‘రతన్ టాటా మహారాష్ట్రలో టాటా ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ రావాలని భావించారు. సంప్రదింపులు జరిపిన అనంతరం.. నాగ్‌పూర్ ఎంఐడీసీ ప్రాంతంలో 500 ఎకరాల స్థలాన్ని కూడా గుర్తించటం జరిగింది. ఇది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో జరిగింది. ఇందులో నేను కూడా భాగమయ్యాను. తర్వాత మా ప్రభుత్వం మారిపోయింది. ..అనంతరం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక.. రతన్ టాటాకు ఫోన్ చేసి ఒప్పించి గుజరాత్లో ఫ్యాక్టరీని స్థాపించాలని చెప్పారు. ఆ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో వేల మందికి ఉద్యోగాలు లభించేవి. మహారాష్ట్ర కోసం ఉద్దేశించిన (సెమీకండక్టర్) ఫ్యాక్టరీని గుజరాత్లో ఏర్పాటు చేయాలని ఫాక్స్‌కాన్‌ను మోదీ కోరడంతో మహారాష్ట్రలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రధానమంత్రి ఏ ఒక్క రాష్ట్రానికి చెందినవారు కాదు.. దేశం మొత్తం గురించి ఆలోచించాలి’’ అని అన్నారు. అయితే ప్రస్తుతానికి శరద్ పవార్ ఆరోపణలపై బీజేపీ స్పందించలేదు.చదవండి: ఢిల్లీ.. 72 గంటలు డేంజర్ -
మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల నాలుగో జాబితా విడుదల
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ఉత్సాహంగా కార్యరంగంలోకి దూకాయి. తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే తమ అభ్యర్థుల నాలుగో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో కాంగ్రెస్ 14 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే 99 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. దీనికితోడు తాజాగా విడుదల చేసిన జాబితాలో గతంలో ప్రకటించిన ఇద్దరు అభ్యర్థులను పార్టీ మార్చింది. దీనికి ముందు కాంగ్రెస్ మూడు జాబితాలను విడుదల చేసింది. కాంగ్రెస్ తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులు, రెండో జాబితాలో 23 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మూడో జాబితాలో 16 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అయితే పార్టీ మూడో జాబితాలో ప్రకటించిన ఒక అభ్యర్థిని నాలుగో జాబితాకు మార్చింది.అంధేరీ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి సచిన్ సావంత్ స్థానంలో అశోక్ జాదవ్ పేరును పార్టీ ప్రతిపాదించింది. నిజానికి కాంగ్రెస్ తన మూడవ జాబితాలో సచిన్ సావంత్ పేరును ప్రకటించగా, అతను ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిరాకరించారు. అశోక్ జాదవ్ గతంలో అంధేరి వెస్ట్ నుండి అమిత్ సాతంపై ఎన్నికలలో పోటీ చేశారు. పార్టీ తన రెండో జాబితాలో ఔరంగాబాద్ తూర్పు నుంచి మధుకర్ కిషన్రావ్ దేశ్‌ముఖ్‌కు టికెట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు అతని స్థానంలో లాహు హెచ్ షెవాలేను రంగంలోకి దించింది.కాంగ్రెస్ తన నాలుగో జాబితాలో అమల్నేర్ నుంచి డాక్టర్ అనిల్ నాథు షిండే, ఉమ్రేడ్ నుంచి సంజయ్ నారాయణ్ మెష్రామ్, అల్పరి నుంచి రాందాస్ మస్రం, చంద్రాపూర్ నుంచి ప్రవీణ్ నానాజీ పడ్వేకర్, బల్లార్పూర్ నుంచి సంతోష్ సింగ్ చంద్ర సింగ్ రావత్, వరోరా నుంచి ప్రవీణ్ సురేశ్ కకడే, నాందేడ్ నార్త్ నుంచి అబ్దుల్ సత్తార్ అబ్దుల్‌లను అభ్యర్థులుగా ప్రకటించింది.వీరితో పాటు ఔరంగాబాద్ ఈస్ట్ నుంచి లాహు హెచ్ షెవాలే, నలసోపరా నుంచి సందీప్ పాండే, అంధేరీ వెస్ట్ నుంచి అశోక్ జాదవ్, శివాజీనగర్ నుంచి దత్తాత్రేయ బహిరత్, పుణె కాంట్ నుంచి రమేశ్ ఆనంద్ రావ్ భాగ్వే, షోలాపూర్ సౌత్ నుంచి దిలీప్ బ్రహ్మదేవ్ మానే, పండర్పూర్ నుంచి భగీరథ్ భాల్కే అభ్యర్థులుగా నిలబెట్టింది. ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్ ముందడుగు -
మహారాష్ట్ర ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా
ముంబై:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం తర్వాత 23 అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ ప్రకటించింది. ముంబైలోని మూడు స్థానాల్లో కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. గణేష్ కుమార్ యాదవ్ సియోన్-కోలివాడ స్థానంలో పోటీకి దింపింది.Congress releases another list of 23 candidates for the upcoming #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/Cs0cthvcfD— ANI (@ANI) October 26, 2024చార్కోప్ నియోజకవర్గం నుంచి యశ్వంత్ సింగ్ , కండివాలి తూర్పు స్థానం నుంచి కలు బధెలియా బరిలోకి దిగారు. అయితే.. కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య వివాదంగా మారిన నాగ్‌పూర్ సౌత్ సీటు కాంగ్రెస్‌కు దక్కింది. నాగ్‌పూర్ సౌత్ నియోజకవర్గం నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను ప్రకటించింది. రెండో జాబితాతో విడుదలతో కాంగ్రెస్ ఇప్పటివరకు మొత్తం 71 మంది అభ్యర్థులను ప్రకటించినట్లైంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరగనుండగా, మొత్తం 288 నియోజకవర్గాలకు నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, కాంగ్రెస్ 44. 2014లో బీజేపీ 122, శివసేన 63, కాంగ్రెస్ 42 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. -
జార్ఖండ్ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎమ్ఎస్ ధోనీ
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎస్ ధోనీ ఫోటోను ఉపయోగించేందుకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.రవికుమార్ వెల్లడించారు. ‘‘తన ఫోటోను ఉపయోగించుకోవడానికి ఎన్నికల కమిషన్‌కు మహేంద్ర సింగ్ ధోనీ అంగీకారం తెలిపారు. ఇతర వివరాల కోసం మేము ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. మహేంద్ర సింగ్ ధోని ఓటర్ల సమీకరణకు కృషి చేస్తారు’’ అని జార్ఖండ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కె.కుమార్ అన్నారు. స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమం కింద ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. ముఖ్యంగా ఓటర్లకు.. ఎక్కువ సంఖ్యలో ఓటు వేయాలనే ఉత్సాహాన్ని పెంచేందుకు ధోనీ విజ్ఞప్తిని, ప్రజాదరణను వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. జార్ఖండ్ అసెంబ్లీలోని 81 స్థానాలకు నవంబర్ 13, నవంబర్ 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.