ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసేందుకు పోటీలో నిలబడిన అభ్యర్థుల విచిత్ర హామీలు ఇస్తున్నారు. అయితే.. ఎన్సీపీ(ఎస్పీ) అభ్యర్థి రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఇచ్చిన హామీ ఆసక్తికరంగా మారింది. తానను ఎన్నికల్లో గెలిపిస్తే బ్యాచిలర్స్‌కు పెళ్లిళ్లు చేసి, ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. బీడ్ జిల్లాలోని పర్లీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన పర్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.
‘‘యువతకు పని కల్పిస్తాం. పెళ్లి సమయంలో యువకులకు ఉద్యోగం లేదా వ్యాపారం ఉందా? అడుగుతారు. జిల్లా మంత్రి ధనంజయ్ ముండేకే వ్యాపారం లేనప్పుడు, మీరు ఏవిధంగా ఉద్యోగాలు పొందుతారు. ధనుంజయ్ ముండే.. నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. అందువల్ల ఉద్యోగాలు లేక.. స్థానిక బ్యాచిలర్లు వివాహం చేసుకోవడం కష్టంగా మారింది. నన్ను గెలిపిస్తే.. ఉద్యోగాలు కల్పించి బ్యాచిలర్స్‌కు పెళ్లిలు చేస్తా’ అని అన్నారు.
Unique poll promise@NCPspeaks candidate #RajasahebDeshmukh says on getting elected from Beed district's #Parli assembly constituency, he will get all the bachelors married#Maharashtra #PoliticsToday #MaharashtraAssembly pic.twitter.com/TfRm7kRtO8
— Mohammed Akhef TOI (@MohammedAkhef) November 6, 2024
దేశ్‌ముఖ్ ప్రకటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎన్సీపీ (అజిత్ వర్గం) నేత ధనుంజయ్ ముండే పరిశ్రమలు తేకపోవడంతో ఉద్యోగాల్లేక పెళ్లిళ్లు జరగక యువత ఇబ్బంది పడుతున్నారని ర రాజేసాహెబ్ దేశ్‌ముఖ్ ఆరోపణలు చేశారు.
చదవండి: నేను వ్యాపార వ్యతిరేకిని కాదు: రాహుల్ గాంధీ క్లారిటీ
Comments
Please login to add a commentAdd a comment