ప్రభుత్వోద్యోగులకుమళ్లీ పాత పెన్షన్ విధానం
మహారాష్ట్రలో ఎంవీఏ మేనిఫెస్టో
ముంబై: మహారాష్ట్రలో అధికారంలోకి రాగానే కులగణన ప్రారంభిస్తామని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) హామీ ఇచి్చంది. 9 నుంచి 16 ఏళ్లలోపు బాలికలకు సరై్వకల్ క్యాన్సర్ వ్యాక్సిన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో రెండు ఐచి్ఛక సెలవులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది.
‘మహారాష్ట్రనామ’ పేరిట ఎంవీఏ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం విడుదల చేశారు. మహిళా స్వయం సహాయక సంఘాల కోసం ప్రత్యేకంగా సాధికారత విభాగం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. శిశు సంక్షేమం కోసం డెడికేటెడ్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన మహిళలకు రూ.500 చొప్పున ధరతో ప్రతిఏటా ఆరు వంట గ్యాస్ సిలిండర్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎంవీఏ మేనిఫెస్టోలోని కీలక అంశాలు...
→ రూ.3 లక్షల దాకా రైతు రుణమాఫీ. రుణాలు సక్రమంగా చెల్లించేవారికి రూ.50 వేల ప్రోత్సాహకం
→ 2.5 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీ
→ బాలికలకు ఏటా రూ.లక్ష నగదు
→ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల్లోని వితంతువులు, చిన్నారులకు ఆర్థిక సాయం
→ యువత సంక్షేమానికి కమిషన్. డిగ్రీ, డిప్లొమా చేసిన నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి
→ నూతన ఇండ్రస్టియల్ పాలసీ. ఎంఎస్‌ఎంఈ శాఖ.
→ అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కార్పొరేషన్
→ నిత్యావసరాల ధరల నియంత్రణ
→ నెలకు 300 యూనిట్ల దాకా విద్యుత్‌పై 100 యూనిట్ల రుసుం మాఫీ
→ ప్రభుత్వోద్యోగులకు మళ్లీ పాత పెన్షన్ విధానం
కుల గణనపై బీజేపీ నేతలది తప్పుడు ప్రచారం: ఖర్గే
పలు సామాజికవర్గాల స్థితిగతులను సమగ్రంగా తెలుసుకోవడానికే కులగణన తప్ప సమాజాన్ని కులాలవారీగా విభజించడానికి కాదని ఖర్గే చెప్పారు. ఆ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అమలు చేయాల్సిన విధానాల రూపకల్పనకు ఆ డేటా తోడ్పడుతుందన్నారు. కులగణనపై బీజేపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మేనిఫెస్టో విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
కులాలవారీగా జనాభా లెక్కల సేకరణతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రదర్శిస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం కాదని, అర్బన్ నక్సలైట్లకు ప్రతీక అని మోదీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగంపై కనీస అవగాహన కూడా లేని మోదీని మళ్లీ ప్రాథమిక పాఠశాలలో చేర్చాలని ఎద్దేవా చేశారు. 2017 జూలై 16న ఇలాంటి రాజ్యాంగ ప్రతినే అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మోదీ అందజేశారన్నారు.
చదవండి: మహారాష్ట్ర బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక హామీలివే..
Comments
Please login to add a commentAdd a comment