Maharashtra Assembly Election 2024
-
ఆయనను నేనే అడగకుండానే సీఎంగా అంగీకరించారు!
-
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ -ఉపముఖ్యమంత్రులుగా షిండే, పవార్
-
కార్పొరేటర్ టు సీఎం..రాజకీయ వ్యూహాల్లో దిట్ట ఫడ్నవీస్
ముంబయి: మహారాష్ట్ర కొత్త సీఎంగా పదవి చేపట్టనున్న దేవేంద్ర ఫడ్నవీస్(54) రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మహారాష్ట్ర సీఎం స్థాయికి వచ్చారు. ఫడ్నవీస్ 1970 జులై 22న నాగ్‌పూర్‌లో జన్మించారు. ఫడ్నవీస్ తండ్రిపేరు గంగాధర్ ఫడ్నవీస్. జనసంఘ్‌లో, ఆ తర్వాత ఏర్పడిన బీజేపీలో గంగాధర్ ఫడ్నవీస్ పనిచేశారు. కార్పొరేటర్ టు మూడుసార్లు సీఎంవిధేయతకు ఫడ్నవీస్ మారుపేరు. వినమ్రతకు నిలువెత్తు ఉదాహరణ. ఫడ్నవీస్ దగ్గర పార్టీ ధిక్కార స్వరమనేది ఉండదు. రాజకీయాల్లో పలు రికార్డులు ఆయన సొంతం. నాగ్‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్ స్థాయి నుంచి ఎదిగి ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి గురువారం (డిసెంబర్ 5)న సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ 1989లో బీజేపీ విద్యార్థి విభాగమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చేరారు.న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేశారు. విద్యార్థి నేతగా చురుగ్గా వ్యవహరిస్తూ తన 22వ ఏట నాగ్‌పుర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్‌గా ఎన్నియ్యారు.1997లో నాగ్‌పూర్ అక్కడి మేయర్ పదవిని చేపట్టేప్పుడు ఆయన వయసు 27 ఏళ్లంటే ఆశ్చర్యం కలగక మానదు. అతిచిన్న వయసులో మేయర్ పదవి చేపట్టారు ఫడ్నవీస్. దేశంలో చిన్న వయసులో మేయర్ అయిన రెండోవ్యక్తి ఆయన.మోదీ,అమిత్‌షాలకు వీర విధేయుడు తొలిసారి 1999లో నాగ్‌పుర్ నైరుతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. తాజాగా జరిగిన 2024 ఎన్నికలతో కలిపి ఇప్పటికి నాలుగుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలకు నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్నారు.2014లో ఫడ్నవీస్ తొలిసారి సీఎం అయ్యారు. అయిదేళ్ల పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. శరద్‌పవార్ తర్వాత అతి చిన్న వయసులో (44ఏళ్లకే) మహారాష్ట్ర సీఎం అయిన రికార్డు ఫడ్నవీస్ సొంతం. 2019లో రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటికీ మిత్రపక్ష పార్టీగా ఉన్న శివసేన(ఉద్ధవ్) పార్టీ హ్యాండివ్వడంతో మూడు రోజులకే ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది.2024 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతిని తన వ్యూహాలతో ఘన విజయం సాధించేలా చేసి మూడోసారి గురువారం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఇదీ చదవండి: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ -
ఆ మాత్రం అలక సీను చేయకుంటే ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని గ్యారంటీ లేదు మరి!
-
అనుమానాలను నివృత్తి చేస్తాం..రండి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతీ దశలోనూ పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని, ఆధారాలు చూపేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ కాంగ్రెస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు/ఏజెంట్ల ప్రమేయం ఉందని వివరించింది. ఓటింగ్ సరళిపై ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదని, పోలింగ్ బూత్‌ల వారీగా అభ్యర్థులందరికీ ఆ డేటాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని నొక్కి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించి రాతపూర్వకంగా బదులిస్తామని ఈసీ స్పష్టం చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు మహాయుతి కూటమిలోని బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లు సాధించగా, మహా వికాస్ అఘాడీ పక్షాలైన కాంగ్రెస్‌కు 16, శివసేన (ఉద్ధవ్)కు 20, ఎన్సీపీ (శరద్) పార్టీకి 10 స్థానాలు దక్కడం తెలిసిందే. -
Maharashtra: వీడని ‘పీఠ’ముడి.. కానీ ఆరోజే సీఎం ప్రమాణ స్వీకారం!
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి విషయంలో అధికార మహాయుతి కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సీఎం ఎంపిక, డిప్యూటీ పదవులు, కేబినెట్ బెర్త్‌ల పంపకాలపై మిత్రపక్షాల మధ్య చర్చలు ఓ పట్టాన కొలిక్కి రావడం లేదు. ఓవైపు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొనగా.. మరోవైపు సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార తేదీలను బీజేపీ ఖరారు చేసింది.ఈ మేరకు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం (డిసెంబర్ 2) సమావేశమవుతారని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొత్తగా ఎంపికైన నేత గురువారం (డిసెంబర్ 5) ముంబైలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నాయి.అయితే మహారాష్ట్ర కొత్త సీఎంగా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో అసంతృప్తి చెందిన తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మహాయుతి కూటమి సమావేశాన్ని రద్దు చేసుకొని తన స్వగ్రామానికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది.అయితే ఈ ఊహాగాలను శివసేన కొట్టిపారేసింది. షిండే అస్వస్థతతో ఉన్నారని, ఆయన శనివారం తిరిగి ముంబై చేరుకుంటారని తెలిపింది. ‘షిండే అలగలేదు. అతను అనారోగ్యంతో ఉన్నారు. సీఎం పదవి విషయంలో మనస్తాపం చెంది ఆకస్మిక పర్యటనకు వెళ్లాడని ప్రచారం చేయడం సరికాదు. ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయరు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం పోరాడతానని చెప్పారు. చదవండి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా తెరపైకి కొత్త పేరుసమావేశాలు భౌతికంగానే కాదు.. వీడియో కాన్ఫరెన్స్, మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా కూడా జరుగుతాయి. షిండే చెప్పినట్లుగా త్వరలోనే మహారాష్ట్ర మంత్రివర్గం ఖరారు అవుతుంది. 60 మంది ఎమ్మెల్యేలు కలిసి షిండేను ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని కోరాం. దీనిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. లాడ్లీ బెహన్ యోజనను ప్రవేశపెట్టినందున అతను ప్రభుత్వంలో కొనసాగడం చాలా ముఖ్యం. ప్రభుత్వంలో అతని ఉనికి ముఖ్యం. మరోసారి, దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ మధ్య సమావేశం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై కూలంకషంగా చర్చిస్తాం’’ అని తెలిపారు. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం ముంబైలో బీజేపీ, ఎన్సీపీ, శివసేన భేటీ కావాల్సి ఉండేది. కానీ షిండే అందుబాటులో లేకపోవడంతో ఈ సమావేశం వాయిదా పడింది.కాగా నవంబర్ 23న వెలువడిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి 233 స్థానాలను కైవం చేసుకుంది. బీజేపీ రికార్డు స్థాయిలో 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. శివసేన 57 చోట్ల, ఎన్సీపీ 41 చోట్ల విజయం సాధించింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు గడుస్తున్నా తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో కూటమి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అయితే సీఎం పీఠాన్ని దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్న నేపథ్యంలో ఏక్‌నాథ్‌షిండే ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు హోం శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియోలపై పట్టుబడుతున్ట్లు తెలుస్తోంది. గతంలో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ఉన్న్పుడు హోంమంత్రిత్వ శాఖను కూడా ఆయనే నిర్వహించారు. -
‘మహా’ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం
పుణె: ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో అధికార, నగదు దుర్వినియోగ పర్వం ఆవిష్కృతమయిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ–ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ ఆరోపించారు. ఇంతటి దుర్వినియోగం గతంలో ఏ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియో గం జరిగిందంటూ కురువృద్ధుడు, 95 ఏళ్ల సామాజిక కార్యకర్త డాక్టర్ బాబా అధవ్ చేపట్టిన నిరసన కార్యక్రమ వేదికను సందర్శించి మద్దతు ప్రకటించిన సందర్భంగా శనివారం శరద్ పవార్ మాట్లాడారు. సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే నివాసమైన ఫూలేవాడలో అధవ్ ఈ నిరసన దీక్ష చేపట్టారు. ‘‘స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, నగదు పంపిణీ చూస్తుంటాం. కానీ ఈసారి శాసనసభ ఎన్నికల్లో జరిగిన దుర్వినియోగం మరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ఇవి చూసి ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. అందుకే ఇలా బాబా అధవ్ మాదిరిగా జనం నిరసనలకు దిగారు. సామాజిక సిద్ధాంతకర్త జయప్రకాశ్ నారాయణ్ గతంలో పిలుపు ఇచి్చనట్లు ప్రజలంతా నేడు ఐక్యంగా పోరాడాలి. సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాల్సిన తరుణమిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను పెకలించివేస్తున్న పెడపోకడలను అడ్డుకుందాం’’అని అన్నారు. ఈవీఎంలపై దేశమంతటా చర్చ ‘‘దేశంలో ఈవీఎంల దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో విపక్షాలు ప్రస్తావించాలనుకున్న ప్రతిసారీ ప్రభుత్వం వీళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఉభయసభలు వారంలో ఆరు రోజులు జరిగితే కనీసం ఒక్కరోజు కూడా విపక్షనేతలకు మాట్లాడే అవకాశం దక్కట్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ ఎలా దాడిచేస్తోందో ఇక్కడే తెలుస్తోంది. ఈవీఎంలలో అదనంగా ఓట్లను ఎలా జతచేస్తారో కొందరు నాకు ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. కానీ వీటిని నిరూపించే బలమైన సాక్ష్యాలు మన దగ్గర లేవు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూశాక వీటిని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓడిన నేతల్లో ఏకంగా 22 మంది రీకౌంటింగ్ అడుగుతున్నారంటే ఈవీఎంలలో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది. బాలాసాహెబ్ థోరట్లాంటి కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా చివరి రెండు గంటల్లో ఏకంగా 7 శాతం పోలింగ్ జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. థోరట్ ఒక్కరేకాదు చాలా మంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఒక సమావేశాన్ని సైతం ఏర్పాటుచేసింది. దీనిపై విపక్షాల ఇండియా కూటమి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరిగింది. సోమవారం దీనిపై కొన్ని ఉమ్మడి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు 15 శాతం ఓట్లను ముందే ఈవీఎంలలో సెట్ చేసి ఉంచుతారని కొందరు చెబితే నేను నమ్మలేదు. కానీ తాజా ఫలితాలను చూశాక ఈ ఆరోపణల్లో ఎంతోకొంత నిజం ఉందని గత ఐదు రోజులుగా నాక్కూడా అనిపిస్తోంది’’అని శరద్‌పవార్ అన్నారు. వీవీప్యాట్లను లెక్కించాలి: ఉద్ధవ్‌ఠాక్రే అధవ్‌కు మంచినీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేసిన సందర్భంగా శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘‘బూత్‌లో ఓటు పోలయిందని అందరికీ తెలుసు. కానీ ఈవీఎంలో ఏ పార్టీ తరఫున అది రిజిస్టర్ అయిందో ఎలా తెలియాలి?. అందుకే ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్ రశీదులను లెక్కించాల్సిందే. పోలింగ్ రోజు చివరి గంటలో ఏకంగా 76 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతి పోలింగ్‌కేంద్రంలో ఆఖర్లో ఏకంగా వేయి మంది ఓటేశారని అర్థం. మరి చివరిగంటలో ప్రతిపోలింగ్కేంద్రం బయట అంతమంది క్యూ వరసల్లో లేరు’’అని ఉద్ధవ్ అన్నారు. -
‘మహా’ రాజకీయం: ఏక్నాథ్ షిండే అలకపాన్పు
ముంబై: మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెరపడడం లేదు. ఎన్నికల ఫలితాలు విడుదలై వారం రోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రావడం లేదు. శుక్రవారం జరగాల్సిన మహాయుతి కీలక సమావేశం అనూహ్యంగా రద్దయ్యింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. సతారా జిల్లాలోని తన సొంత గ్రామానికి ఆయన చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం రకరకాల ఊహాగానాలకు తావిస్తోంది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన(షిండే) నాయకుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(అజిత్) నేత అజిత్ పవార్ గురువారం రాత్రి ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతోపాటు కేంద్ర మంత్రి జె.పి.నడ్డాతో సమావేశమయ్యారు. మంత్రివర్గం కూర్పు, మంత్రి పదవుల పంపకంపై వారు చర్చించినట్లు వార్తలొచ్చాయి. ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఢిల్లీ పర్యటన ముగించుకొని శుక్రవారం ఉదయం ముంబైకి చేరుకున్నారు. శుక్రవారం ముగ్గురు నేతల మధ్య కీలక సమావేశం జరగాల్సి ఉంది. నూతన ముఖ్యమంత్రి ఎంపికతోపాటు మంత్రి పదవుల పంపకాన్ని ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఏక్నాథ్ షిండే ఆకస్మికంగా తన సొంత గ్రామానికి వెళ్లిపోవడంతో చర్చలు ఆగిపోయాయి. తాజా పరిణామాల పట్ల షిండే అసంతృప్తితో ఉన్నారని, అందుకే అలకబూని మిత్రపక్షాలతో చర్చలు కొనసాగించడానికి ఇష్టపడడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ మరింత పెరిగిపోయింది. మహాయుతి సమావేశం ఆదివారం జరుగనున్నట్లు శివసేన(షిండే) వర్గాలు తెలియజేశాయి. కొత్త ముఖ్యమంత్రి వచ్చేవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని వివరించాయి. తమ పార్టీ నేత ఏక్నాథ్ షిండేలో ఎలాంటి అసంతృప్తి లేదని, ఆయన శనివారం ముంబైకి తిరిగి వస్తారని శివసేన నాయకుడు ఉదయ్ సామంత్ చెప్పారు. ఢిల్లీలో షిండే తమ పార్టీ డిమాండ్లను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. దీనిపై అమిత్ షా అతిత్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చిస్తారని వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) పారీ్టలు మహాయుతి పేరిట కూటమిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ 132, శివసేన(షిండే) 57, ఎన్సీపీ(అజిత్) 41 సీట్లు గెలుచుకున్నాయి. సీఎం కుర్చీ కోసం మూడు పార్టీల ముఖ్యనేతలు పోటీపడ్డారు. కానీ, మిత్రపక్షాలకు సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం అంగీకరించడం లేదు. దాంతో కనీసం మంత్రి పదవుల్లోనైనా ఎక్కువ వాటా సొంతం చేసుకోవాలని శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్) ఆరాటపడుతున్నాయి. మిత్రపక్షాలకు 20 మంత్రి పదవులు ఇవ్వడానికి బీజేపీ పెద్దలు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో తమకే ఎక్కువ పదవులు కావాలని ఎన్సీపీ(అజిత్) పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్షం ఇప్పటికీ సమావేశం కాలేదు. తమ నాయకుడిని ఎన్నుకోలేదు. షిండే అడుగులు ఎటువైపు? మరోసారి సీఎం పదవి తనకే ఇవ్వాలని ఏక్నాథ్ షిండే తొలుత డిమాండ్ చేశారు. బీజేపీ అగ్రనాయకత్వం బుజ్జగించడంతో మెత్తబడ్డారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి అంగీకరించినట్లు తెలిసింది. కానీ, కీలకమైన హోంశాఖను తనకే అప్పగించాలని షరతు పెట్టారు. షిండే మనసు మార్చుకుంటున్నట్లు ఆయన పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకోవడం ఆయనకు ఇష్టం లేదని అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి పోస్టుపై శివసేన(షిండే)లో రెండు రకాల వాదనలు వినిపిస్తాయి. ఈ పదవి తీసుకోవాలని ఒక వర్గం చెబుతుండగా, అవసరం లేదని మరో వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నాయకుడు ఉప ముఖ్యమంత్రి కావడం ఏమిటని శివసేన(షిండే) ఎమ్మెల్యే సంజయ్ సిర్సాత్ ప్రశ్నించడం గమనార్హం. పెద్ద పదవిలో ఉన్న వ్యక్తి చిన్న పదవిలో ఇమడలేరని ఆయన చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవిలో షిండే కూర్చొనే అవకాశం లేదని అన్నారు. కూటమి ధర్మాన్ని తన తండ్రి గౌరవిస్తారని, వ్యక్తిగత ఆకాంక్షలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోరని ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే స్పష్టంచేశారు. ఇప్పుడు ఏక్నాథ్ షిండే ఎటువైపు అడుగులు వేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీతో జట్టుకట్టినా ప్రభుత్వ ఏర్పాటుకు వారి బలం సరిపోదు. రెండు రోజుల్లో సీఎం ఎంపిక: షిండే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అమిత్ షా, జె.పి.నడ్డాతో సానుకూల చర్చలు జరిగాయని ఏక్నాథ్ షిండే చెప్పారు. ఆయన శుక్రవారం ఉదయం ఢిల్లీలో ముంబైకి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. కొత్త సీఎం ఎంపికపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ముంబైలో మహాయుతి కీలక సమావేశం జరగబోతోందని, చర్చలు కొనసాగుతాయని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు తాను అవరోధం కాబోనని, ప్రధాని మోదీ, అమిత్ షాల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టంచేశారు. మహాయుతి కూటమి పారీ్టల మధ్య చక్కటి సమన్వయం ఉందని వివరించారు. అతి త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఏక్నాథ్ షిండే ప్రకటించారు. పదవుల వెంట పడడం తమకు ఇష్టం లేదన్నారు. -
పోలింగ్ ముగిశాక 7 శాతం ఓటింగ్ ఎలా పెరిగింది?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిపోయాక ఏకంగా 7 శాతం పోలింగ్ ఎలా పెరిగిందో భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) చెప్పాలని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే డిమాండ్ చేశారు. నవంబరు 20వ తేదీన వివిధ సమయాల్లో విడుదల చేసిన పోలింగ్ శాతంలో తేడాలుండటం ఈసీ పనితీరును ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. పటోలే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నవంబరు 20న సాయంత్రం ఐదు గంటలకు 58.22 శాతం పోలింగ్ శాతం నమోదైందని ఈసీ వెల్లడించిందని, అయితే రాత్రి 11:30 గంటలకు మరో 7.83 శాతం పోలింగ్ అదనంగా నమోదైనట్లు తెలిపిందని, ఇంత భారీ వ్యత్యాసానికి కారణాలేమిటేది ఈసీ తెలుపాలని డిమాండ్ చేశారు. ఈ అసాధారణ పెరుగుదల ఎన్నికల ప్రక్రియ పారదర్శకతను ప్రశ్నార్థకం చేసిందని పటోలే అన్నారు. ‘ఇది ప్రజల ఓట్లను కొల్లగొట్టడమే. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. వీధుల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాం’ అని పటోలే పేర్కొన్నారు. రాత్రి 11:30 గంటల దాకా పోలింగ్ జరిగిన కేంద్రాల ఫోటోలను ఈసీ విడుదల చేయాలన్నారు. ఎవరు గెలిచారు, ఎవరు ఓడారనేది ఇక్కడ సమస్య కాదని, ప్రజాస్వామ్యాన్ని బతికించడమే ముఖ్యమని పేర్కొన్నారు. -
పోలింగ్‌లో అంతటి వ్యత్యాసం.. నిజంగా ఆందోళనకరం: మాజీ సీఈసీ ఖురేషి
న్యూఢిల్లీ: ఈవీఎంల పనితీరుపై దేశమంతటా నెలకొన్న అనుమానాలను, ఆందోళనలను మరింత పెంచే మరో పరిణామం చోటుచేసుకుంది. వాటి విశ్వసనీయతపై స్వయంగా భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్‌వై ఖురేషీ కీలక సందేహాలు లేవనెత్తారు. తాజాగా ముగిసిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతానికి సంబంధించి నెలకొన్న వివాదంపై గురువారం ప్రముఖ న్యూస్ చానల్ ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో నవంబర్ 20న రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగడం తెలిసిందే.‘ఆ రోజు సాయంత్రం 5 గంటలకల్లా 55 శాతం మేరకు ఓటింగ్ (ప్రొవిజనల్ ఓటర్ టర్నౌట్–పీవోటీ) న మోదైనట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ.. మర్నాడు ఈసీ ప్రకటించిన తుది గణాంకాల్లో అది కాస్తా ఏకంగా 66.05 శాతానికి పెరిగిపోయింది’ అని రాజ్‌దీప్ పేర్కొనగా.. ఇంతటి వ్యత్యాసం అత్యంత ఆందోళన కలిగించే అంశమని ఖురేషీ చెప్పారు. దీనిపై తన అనుమానాలు, అభ్యంతరాలు, ఆందోళనలను ఖురేషీ ఈ సందర్భంగా పంచుకున్నారు. ఓటింగ్ శాతం గణాంకాలు ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) నమోదవుతూనే ఉంటాయన్నారు. అలాంటప్పుడు పోలింగ్ నాటి సాయంత్రానికి, మర్నాటికి ఇంతటి వ్యత్యాసం కచి్చతంగా అత్యంత ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. ‘ఓటింగ్ శాతం ఇలా నమోదవుతుంది’ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ శాతం నమోదు ప్రక్రియ ఎలా జరుగుతుందో ఖురేషీ వివరించారు. ‘ఓటేయడానికి వచ్చే ప్రతి ఒక్కరి హాజరునూ ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి విధిగా ఫారం–17సీలో నమోదు చేస్తారు. పోలింగ్ ముగిశాక ఆనాటి పరిణామాలన్నిటినీ అందులో నమోదు చేస్తారు. అలా ఫారం–17సీని పూర్తిగా నింపి, దానిపై అభ్యర్థులకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్ల సంతకం తీసుకున్న తర్వాతే ప్రిసైడింగ్ అధికారి పోలింగ్ బూత్‌ను వీడతారు’ అని వివరించారు. ‘ప్రతి పోలింగ్ బూత్లోనూ పోలైన మొత్తం ఓట్ల సంఖ్యను 17సీ నమోదు చేస్తుంది. పైగా ఇది అదే రోజు, రియల్ టైమ్ (ఎప్పటికప్పుడు)లో నమోదయ్యే డేటా’ అని తెలిపారు. అలాంటప్పుడు పోలింగ్ జరిగిన మర్నాడు అది మారడం ఎలా సాధ్యమన్నది తనకే అర్థం కావడం లేదని ఆశ్చర్యం వెలిబుచ్చారు. ఇది ఎన్నో సందేహాలకు తావిచ్చే పరిణామమన్నారు. ‘దీనిపై ఎన్నికల సంఘం వివరణ ఇచ్చి తీరాల్సిందే.ఇప్పటికే ఆ పనిచేసి ఉండాల్సింది. ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడం లేదు’ అన్నారు. ‘కీలకమైన ఈ సందేహాలకు ఈసీ ఇప్పటికైనా బదులివ్వాలి. జాతీయ మీడియాను పిలిచి పోలింగ్ గణాంకాలకు ³Nర్తిస్థాయిలో వివరణ ఇవ్వాలి’ అన్నారు. ‘ఈవీఎంల పనితీరు తదితరాలపై ఇప్పటికే దేశమంతటా అనుమానాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని ఈసీ వెంటనే తీర్చకపోతే జనాల మెదళ్లలోకి మరింతగా చొచ్చుకుపోతాయి. అప్పుడు మొత్తం వ్యవస్థల మీదే విశ్వాసం పోతుంది’ అంటూ ఖురేషీ ఆందోళన వెలిబుచ్చారు. ఓటింగ్ శాతంలో అనూహ్య పెరుగుదల అంశం ఐదేళ్ల కింద సుప్రీంకోర్టు వరకు వెళ్లిందన్నారు. ఈసీ తుది గణాంకాల మేరకు మహారాష్ట్రలో సాయంత్రం 5 గంటల తర్వాత ఏకంగా 11 శాతం ఓటింగ్ జరిగినట్టు భావించాలని కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ అన్నారు. ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ అనుమానాలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు ఖురేషీ చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉందన్నా్డరు. ఆయన 2010–12 మధ్య కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా పనిచేశారు.ఏపీ పోలింగ్ శాతంలో 12.54 శాతం తేడా!ఆంధ్రప్రదేశ్‌లో మే 13న నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించగా.. అదే రోజున రాత్రి 8 గంటలకు 68.12 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ తర్వాత రాత్రి 11.45 గంటలకు 76.50 శాతం పోలింగ్ జరిగినట్టు ప్రకటించింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన నాలుగు రోజులకు అంటే మే 17న తుది పోలింగ్ శాతం 80.66 అని ప్రకటించింది. అంటే.. తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి తుది పోలింగ్ శాతానికి మధ్య 12.54 శాతం పెరుగుదల ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎన్నికల సంఘం తొలుత ప్రకటించిన పోలింగ్ శాతానికి, ఆ తర్వాత వెల్లడించిన పోలింగ్ శాతానికి భారీ తేడా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. ఒడిశా (12.48 శాతం) రెండో స్థానంలో నిలిచాయి.పోలింగ్ శాతం పెరుగుదలకు ప్రధాన కారణం ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం లేదా ఈవీఎంలు మార్చేయడం లేదా ఈవీఎంలు సక్రమంగా పనిచేయకపోవడం వంటి ఏదో ఒకటి అయి ఉండొచ్చని ఏడీఆర్ (అసోషియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారŠమ్స్), వీఎఫ్‌డీ (వోట్ ఫర్ డెమొక్రసీ) సంస్థల ప్రతినిధులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపించారు. పోలింగ్ శాతంలో భారీగా తేడా ఉండటం వల్ల పోలైన ఓట్లలో 49 లక్షల ఓట్లు పెరిగాయి. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ శాతంలో పెరుగుదల వల్ల ఒక్కో లోక్‌సభ స్థానంలో సగటున 1.96 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి. ఇది లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని వీఎఫ్‌డీ సంస్థ వెల్లడించింది.ఎన్నికల సంఘం పోలింగ్ శాతం తొలుత వెల్లడించిన దానికీ, ఆ తర్వాత ప్రకటించిన దానికీ తేడా ఉండకపోయి ఉంటే ఎన్డీఏకు 14, వైఎస్సార్సీపీకి 11 లోక్‌సభ స్థానాలు దక్కేవని స్పష్టం చేసింది. పోలింగ్ శాతంలో తేడా వల్ల ఒంగోలు, నరసరావుపేట, ఏలూరు, హిందూపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం లోక్‌సభ స్థానాల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపిందని పేర్కొంది. -
కాంగ్రెస్ అతి విశ్వాసమే కొంపముంచింది: మిత్రపక్షం శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ అతి విశ్వాసమే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఓటమికి కారణమని మిత్ర పక్షం శివసేన ఆరోపించింది. ఎంవీయేలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రదర్శించిన వైఖరి.. కూటమి విజయావకాశాలను దెబ్బతిశాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు శివసేన(యూబీటీ) సీనియర్ నేత, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ మహా వికాస్ అఘాడి ఎన్నికలకు వెళ్లాల్సిందని అన్నారు."లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌కు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో కాంగ్రెస్ వైఖరి మమ్మల్ని బాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్దవ్‌ను ప్రకటించాల్సి ఉండేది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. అలా చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి.’ దాన్వే పేర్కొన్నారు.కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించిన 48 స్థానాల్లో మహా వికాస్ అఘాడి అత్యధికంగా 30 చోట్ల గెలుపొందింది. మిత్ర పక్షాలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువగా 13 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే జోష్ మీదున్న కాంగ్రెస్.. రాష్ట్ర ఎన్నికలకు ముందు సీట్ల భాగస్వామ్య చర్చల సమయంలో గట్టిగా బేరసారాలు చేసింది. ఇది కూటమిలో ఘర్షణకు దారితీసింది. చివరకు 103 స్థానాల్లో పోటీ చేసినా కేవలం 16 మాత్రమే గెలుపొందింది. 89 స్థానాల్లో పోటీ చేసిన సేన (యూబీటీ) 20 స్థానాల్లో విజయం సాధించింది. మూడో మిత్రపక్షమైన శరద్ పవార్ ఎన్సీపీ 87 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో విజయం సాధించింది.మరోవైపు శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్‌పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది. -
ఎన్నికల పోరులోతగ్గేదెలా : ఓటమనేదేలేకుండా..విజయఢంకా!
రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ఆర్థిక రాజధాని ముంబై పరిధిలో కొందరు అభ్యర్ధులు మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగి విజయ దుందుభి మోగించారు. కొందరు హ్యాట్రిక్ సాధించి అందరిని ఆశ్చర్య పరిచారు. మరికొందరు ఓటమనేదే లేకుండా వరుసగా విజయం సాధిస్తూ రికార్డులు సృష్టించారు. వీరిలో కొందరు ఐదు, ఆరు సార్లు విజయం సాధించగా ఒకరైతే ఏకంగా తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సష్టించారు. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజల ఆదరణతో అనేక పర్యాయాలు గెలుస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలెవరు, ప్రజల్లో వారికున్న క్రేజ్, ఆదరణ ఎలాంటిదో ఓసారి పరిశీలిద్దాం. వడాలాలో కాలీదాస్ విజయఢంకా... బీజేపీ నేత కాలీదాస్ కోళంబ్కర్ వడాల అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వరుసగా తొమ్మిదిసార్లు గెలిచి రికార్డు సృష్టించారు. 72 ఏళ్ల కాలీదాస్ తనకు ఇవే చివరి ఎన్నికలని, ఈసారి గెలిస్తే తన పేరు గిన్నిస్‌బుక్‌లో నమోదవుతుందని విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆ నియోజక వర్గ ప్రజలు భారీగా ఓట్లువేసి ఆయన్ను గెలిపించారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)కు చెందిన స్నేహల్ జాధవ్, శివసేన(యూబీటీ) అభ్యర్థి శ్రద్ధా జాధవ్ గట్టిపోటీ ఇచ్చినప్పటికీ కాలీదాస్ 24 వేల ఓట్ల అధిక్యంతో గెలిచారు. ఈ సారి కాలీదాస్ను ఎలాగైనా ఓడించాలని ఇరువురు అభ్యర్ధులు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. కాలీదాస్ 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై పోటీచేసి గెలిచారు. 2009, 2014లో కాంగ్రెస్ టిక్కెటుపై ఇదే వడాలా నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయ ఢంకా మోగించారు. మలబార్హిల్లో ఏడోసారి మంగల్ ప్రభాత్ లోధా జయకేతనం మలబార్ హిల్ అసెంబ్లీ నియోజక వర్గంలో మంగళ్‌ప్రభాత్ లోధా ఏడో సారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బీజేపీ తరపున బరిలోకి దిగిన లోధా తన ప్రత్యర్థి, శివసేన(యూబీటీ)అభ్యర్ధి భేరులాల్ చౌధరీపై 6,8091 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. రాష్ట్రంలో అత్యంత ధనిక అసెంబ్లీ నియోజకవర్గంగా పేరుగాంచిన మలబార్ హిల్‌లో గెలవడం అంత సులువు కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి అధికార నివాసమైన వర్షా బంగ్లాతోపాటు అనేకమంది ఉన్నత వర్గాల నివాసాలు, ధనవంతుల బంగ్లాలుంటాయి. ఇక్కడ సామాన్యులతోపాటు గుజరాతి, జైన్, మార్వాడి వర్గాల ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. లోధా, చౌధరి ఇరువురు జైన్ సమాజానికి చెందినవారు. దీంతో గుజరాతీ, జైన్, మార్వాడి ఓట్లు తమకే దక్కుతాయన్న ఆలోచనతో ఇరువురు ఎన్నికల బరిలోకి దిగారు.లోధాను ఓడించాలని మహావికాస్ ఆఘాడీకి చెందిన బడా నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. ఎట్టకేలకు లోధా విజయకేతనం ఎగురవేశారు. వరుసగా ఐదుసార్లు ఫడ్నవీస్, ఛగన్ భుజబల్ విజయదుందుభి...‘నేను మళ్లీ వస్తాను’అంటూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దక్షిణ–పశ్చిమ నాగ్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఏకంగా ఆరు సార్లు విజయ కేతనం ఎగురవేశారు. తనకు ప్రత్యర్థిగా నిలిచిన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ప్రపుల్ గుడధేను 39,710 ఓట్ల ఆధిక్యంతో ఓడించారు. ఎన్సీపీ అజీత్ పవార్ వర్గానికి చెందిన ఛగన్ భుజబల్ యేవ్లా అసెంబ్లీ నియోజక వర్గంలో వరుసగా ఐదుసార్లు విజయదుందుభి మోగించారు. తన ప్రత్యర్ధి ఎన్సీపీ (ఎస్పీ) అభ్యర్థి మాణిక్‌రావ్ శిందేను 26,400 ఓట్ల అధిక్యంతో భుజబల్ ఓడించారు.నాలుగుసార్లుగా ఏక్నాథ్ శిందే, జితేంద్ర అవ్హాడ్ విజయం.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే 2009 నుంచి విజయ ఢంకా మోగిస్తూ వస్తున్నారు. థానేలోని కోప్రి–పాచ్పాఖాడీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధిస్తున్నారు. రెండున్నరేళ్ల కిందట ఉద్ధవ్ శివసేన నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. పార్టీలో చీలిక తర్వాత జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలెలా ఉండనున్నాయనే అంశం అందరిలోనూ ఉత్కంఠ రేపాయి. ఈ నేపథ్యంలో తన పంథాను కొనసాగిస్తూ శివసేన(శిందే) అభ్యర్ధి కేదార్ దిఘేపై ఘన విజయం సాధించారు. దీంతో వరుసగా నాలుగుసార్లు ఆయన ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించినట్లైంది. ముంబై ఉప నగరమైన ముంబ్రా–కల్వా అసెంబ్లీ నియోజక వర్గంలో గురుశిష్యులు నజీబ్ ముల్లా , జితేంద్ర అవ్హాడ్ మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. చివరకు ఎన్సీపీ (ఎస్పీ)అభ్యర్థి జితేంద్ర అవ్హాడ్‌ను నాలుగోసారి విజయం వరించింది. 2023లో ఎన్సీపీ రెండుగా చీలిపోవడంతో ఎస్పీ వర్గం నుంచి అవ్హాడ్‌కు అభ్యరి్ధత్వం లభించింది. దీంతో ఆగ్రహానికి గురైన నజీబ్ ఆయనకు ప్రత్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఒకేపార్టీకి చెందిన గురు, శిష్యుల మధ్య పోటీ ఎలా ఉండబోతుందని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా ఇక్కడ ముస్లీం ఓటర్ల సంఖ్య అధికం. దీంతో ముల్లా విజయం ఖాయమని భావించారు. కాని గత 15 ఏళ్ల నుంచి అవ్హాడ్ చేసిన అభివద్ధి పనులే ఆయనకు విజయం చేకూర్చాయి. విక్రోలీ, కలీనా, దిండోషీ, శివ్డీల్లో హ్యాట్రిక్ విక్రోలీ అసెంబ్లీ నియోజక వర్గంలో మహా వికాస్ ఆఘాడి కూటమి, శివసేన(యూబీటీ) అభ్యర్ధి సునీల్ రావుత్ మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు. తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు ఉద్ధవ్ ఠాక్రే , ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే . హోరాహోరీగా ప్రచారం చేసినప్పటికీ . చివరకు ఓటర్లు శివసేన(శిందే)అభ్యర్థి సువర్ణ కరంజేకు పట్టం కట్టారు. కలీనా అసెంబ్లీ నియోజక వర్గంలో మహా వికాస్ ఆఘాడి కూటమి యూబీటీ అభ్యర్ధి సంజయ్ పోతి్నస్ హ్యాట్రిక్ సాధించారు. తన ప్రత్యర్ధి అయిన బీజేపీ అభ్యర్ధి అమర్జీత్ సింగ్‌ను భారీ అధిక్యంతో ఓడించారు. ఒక్కడ ఎమ్మెన్నెస్, వంచిత్ ఆఘాడీ పార్టీ సహా మొత్తం 16 మంది అభ్యర్ధులు బరిలో ఉన్నప్పటికీ పోత్నీస్ జయకేతనం ఎగరేశారు.దిండోషీ అసెంబ్లీ నియోజక వర్గంలో శివసేన(యూబీటీ)అభ్యర్థి సునీల్ ప్రభు భారీ మెజారిటీతో హ్యాట్రిక్ సాధించారు. తన ప్రత్యర్థి శివసేన(శిందే) అభ్యర్థి సంజయ్ నిరుపమ్‌ను 6,058 ఓట్ల తేడాతో ఓడించారు. శివ్డీ అసెంబ్లీ నియోజక వర్గంలో యూబీటీ అభ్యర్ధి అజయ్ చౌధరి హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెన్నెస్ అభ్యర్థి బాలా నాంద్‌గావ్కర్, బీజేపీ రెబల్ అభ్యర్ధి నానా అంబోలే ఇరువురినీ ఓడించి 7,140 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. బాలా నాంద్గావ్కర్ను గెలిపించేందుకు స్వయంగా రాజ్ ఠాక్రే ప్రత్యేకంగా అక్కడ ఓ సభ నిర్వహించారు. అయినప్పటికీ ఓటర్లు ఆయన్ను తిరస్కరించారు.న్యూముంబైలోని బేలాపూర్‌లో బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే, ఎన్సీపీ (ఎస్పీ) వర్గం అభ్యర్ధి సందీప్ నాయిక్ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇద్దరినీ తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. చివరి రౌండ్ వరకు ఇద్దరూ దాదాపు సమానంగా ఉన్నారు. కానీ చివరి రౌండ్ ముగిసే సరికి కేవలం 377 ఓట్ల తేడాతో మందా మాత్రే విజయం సాధించారు. -
Maharashtra: తొలిసారిగా అసెంబ్లీకి 78 మంది..
సాక్షి ముంబై: రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 78 మంది తొలిసారిగా విజయం సాధించారు. దీంతో ఈ 78 మంది మొదటిసారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కనున్నారు . మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకుగాను ఒక విడ తలా నవంబరు 30వ తేదీ ఎన్నికలు జరగగా నవంబరు 23వ తేదీ ఫలితాలు వెలువడ్డ సంగతి. తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (ఏపీ)ల మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. బీజేపీకి 1152, శివసేన (షిండే)కు 57, ఎన్సీపీ (ఏపీ)కి 41 స్థానాలను దక్కించుకున్నాయి. కాగా ఈసారి గెలుపొందిన అభ్యర్థులలో 78 మంది మొదటిసారిగా విజయం సాధించి అసెంబ్లీకి వెమెట్లెక్కనున్నారు. వీరిలో బీజేపీ నుంచి 33 మంది, శివసేన (ఉంటే) నుంచి 14 మంది, ఎన్సీపీ (ఏపీ)కి చెందిన ఎనిమిది మంది. శివసేన (యూబీటి)కి చెందిన 10 మంది, కాంగ్రెస్ నుంచి ఆరు. ఎన్సీపి (ఎస్పీ)కి చెందిన నలుగురు అభ్యర్థులున్నారు. వీరితోపాటు చిన్న పార్టీలకు చెందిన మరో ఇద్దరు అభ్యర్థులతోపాటు ఒక ఇండిపెండెంటు కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్ అఘాడికి చెందిన నేతలు తమ వారసులను బరిలోకి బరిలోకి దింపినప్పటికీ ప్రజలు అందరికీ పట్టంకట్టలేదని స్పష్టమైంది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన వారసులలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూతుడు శ్రీ జయా చవాన్ నాందేడ్ జిల్లా బోకర్ అసెంబ్లీ సియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ లేని విజయం సాధించారు. మరోవైపు మాజీ మంత్రి బాబన్ రాన్ పాచ్‌పుతే సుమారుడు విక్రమ్ శ్రీగోంధా నుంచి మాజీ ఎంపీ హరిభావు జూవలే కుమారుడు అమోల్ జావలే రావేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీవేసి విజయం సాధించారుఇదిలా ఉండగా ఆర్వీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ వ్యక్తిగత సహాయకుడైన సుమిత్ వాంఖడ, అదుల బాబా భోస్లే కరాడ్ నుంచి విజయం సాధించారు. అదే విధంగా శిసేన(షిండే) పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనీల్ బాబర్ కుమారుడు సహాస్ బాబర్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందగా ఎంపీ సందీపన్ భూమరే కుమారుడు విలాస్ భూమరే పైఠన్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్చే చిమణరావ్ పాటిల్ కుమారుడు అమోల్ పాటిల్ ఎరండోల్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా విజయం సాధించారు.ఇక ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైఓలని అణుశక్తినగర్ నుంచి తొలిసారిగా పోటీ చేసి విజయం సాధించారు. వీరితోపాటు కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ మంత్రి వర్షా గైక్వాడ్ సోదరీ జ్యోతి గైక్వాడ్ కూడా ధారావీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారిగా గెలుపొందారు. వీరితోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి, దివంగత ఆర్ ఆర్ పాటిల్ కుమారుడు ఎన్సీపీ(ఎస్పీ) పార్టీ తరపున తాస్ గావ్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. మరోవైపు తూర్పు బాంద్రా అసెంబ్లీ నుంచి శివసేన(యూబీటీ) తరపున ఉద్దవ్ ఠాక్రే బంధువైన వరుణ్ దేశామ్ మొదటిసారిగా విజయం సాధించారు.ముంబై నుంచి తొమ్మిది మంది..ఈ ఎన్నికల్లో ముంబై నుంచి తొమ్మిది. అభ్యర్థులు తొలిసారిగా విజయం సాధించిన వీరిలో మాహిం అసెంబ్లీ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడి నుంచి మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధక్షుడు రాజ్ కాక్రే కుమారుడైన అమిత్ ఠాక్రే తొలిసారిగా బరిలోకి దిగగా శివసేన(షిండే) నుంచి సదా సర్వస్కర్, శివసేన(యూబీటీ) నుంచి మహేష్ సావంత్ పోటీ చేశారు. వీరిద్దరి మధ్య భారీగా ఓట్లు చీలి మహేష్ సావంత్ విజ సాధించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు, -
ఎమ్మెన్నెస్ ‘పట్టాలు తప్పింది’
అసెంబ్లీ రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) ఘోర పరాజయం పాలైంది. ఒక్క సీటు కూడా రాకపోవడంతో పార్టీ గుర్తింపునకే ముప్పు ఏర్పడింది. మహా వికాస్ ఆఘాడి, మహాయుతి కూటములకు చెందిన వెన్నుపోటుదార్లకు (గద్దార్లకు) ఓటు వేయవద్దని, ఒకసారి తమ పార్టీకి అవకాశమిచ్చి చూడాలని ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు బుధవారం జరగ్గా, శనివారం ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచి రాష్ట్ర రాజకీయరంగంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలన్న ఎమ్మెన్నెస్ చీఫ్ ఆశలు అడియాశలయ్యాయి. పార్టీ తరపున ఒక్క అభ్యర్థి కూడా గెలవకపోగా మొదటిసారిగా ఎన్నికల బరిలో దిగిన తన తనయుడు అమిత్ ఠాక్రేను కూడా గెలిపించుకోలేకపోయారు. దీంతో రాజ్ వైఖరి,ఆయన తనయుడు అమిత్ ఓటమిపై సోషల్ మీడియాలో వివిధ రకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. పార్టీ గుర్తు రద్దయ్యే అవకాశం... దాదాపు 18 ఏళ్ల కిందట హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి బయటకువచ్చిన రాజ్ ఠాక్రే 2006 మార్చి తొమ్మిదో తేదీన ఎమ్మెన్నెస్ పార్టీని స్ధాపించారు. ఆ తరువాత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి తమ పార్టీ తరఫున అభ్యర్ధులను బరిలోకి దింపారు. వీరిలో ఏకంగా 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయంలో ఎమ్మెన్నెస్‌కు 5.71 శాతం ఓట్లు పోలయ్యాయి. కానీ తరచూ పరాయిప్రాంతం వారిని ముఖ్యంగా ఉత్తరభారతీయులను లక్ష్యంగా చేసుకుని పదేపదే విమర్శించడంతో పార్టీ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కరంటే ఒక్కరే గెలవగా మొత్తంమీద 3.15 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తరువాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్ధితి పునరావృతమైంది. కేవలం 2.25 శాతం ఓట్లు పోలైనప్పటికీ కల్యాణ్ నియోజక వర్గం నుంచి రాజు పాటిల్ ఒక్కరే గెలవడంతో రాజ్ ఠాక్రే పరువు, పార్టీ ప్రతిష్ట నిలబడ్డాయి. కానీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజు పాటిల్ కూడా ఓటమిపాలయ్యారు.ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిగా పేరుగాంచిన బాలా నాంద్‌గావ్కర్ శివ్డీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నాంద్‌గావ్కర్ గెలుపు కోసం ప్రచారం ముగింపు చివరి రోజున అంటే గత సోమవారం శివ్డీలో ప్రత్యేకంగా ఓ సభ కూడా నిర్వహించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో రాజ్ ఠాక్రేతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర మనస్ధాపానికి గురయ్యారు. ఇప్పుడు ఎమ్మెన్నెస్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. అంతేగాకుండా ఈ ఎన్నికల్లో కనీసమాత్రం ఓట్లు కూడా రాకపోవడంతో పార్టీ మనుగడ ప్రమాదంలో పడే అవకాశముందని, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం పార్టీ గుర్తును రద్దుచేసే అవకాశం కూడా ఉందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మాటలకు ఓట్లు రాలవని... రాజ్ ఠాక్రే ముంబైసహా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సభ ఏర్పాటు చేసినా ఇసుకవేస్తే రాలనంతమంది ప్రజలు ఆ సభలకు హాజరవుతారు. ఆయన మాటతీరు, ప్రముఖ రాజకీయ నాయకుల మాటలను అనుకరించే (మిమిక్రీ) విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. దీంతో రాజ్ ప్రసంగం వినేందుకు ప్రజలు ఎంతగానో ఆసక్తి కనబరుస్తారు. అయితే మాటలకు ఓట్లు రాలవని ప్రతి ఎన్నికల్లో ఎమ్మెన్నెస్‌కు రుజువవుతూనే ఉంది. ఫలితంగా ఓటింగ్ శాతం నెమ్మదిగా దిగజారుతూ వచ్చింది. దీంతో ఈసారి ఎలాగైనా అధికసంఖ్యలో సీట్లను చేజిక్కించుకోవాలని భావించిన రాజ్‌ఠాక్రే గెలిచే అవకాశాలున్నాయని భావించిన 128 స్ధానాల్లో తమ అభ్యర్ధులను పోటీలో నిలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్ధులకు మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేశారు. తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.చదవండి: మహారాష్ట్రలో సకుటుంబ సపరివార రాజకీయంఅధికారంలో లేకపోయినప్పటికీ పార్టీ తరపున గతంలో చేపట్టిన అనేక ఆందోళనల గురించి ప్రతీ సభలో వివరించారు. వీటినే ప్రధాన ప్రచార ఆ్రస్తాలుగా మలచుకున్నారు. టోల్ మాఫీ, రైల్వే ఉద్యోగాల భర్తీలో భూమిపుత్రులకు జరిగిన అన్యాయం, మసీదుల వద్దనున్న లౌడ్స్పీకర్లలోంచి పెద్ద శబ్దంతో వినిపించే నమాజ్‌కు వ్యతిరేకంగా హనుమాన్ చాలీసా వినిపించాలన్న ఆందోళన.. ఇలా అనేక కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదని తన ప్రసంగాల్లో వివరించారు. తాము అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మసీదులపై అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్స్పీకర్లను తొలగిస్తామని, యువతకు ఉపాధి, ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఇలా అనేక హామీలిచ్చారు. కాని అవేమి ఓటర్లకు రుచించలేదని శనివారం వెలువడిన ఫలితాలను బట్టి స్పష్టమైంది. -
మామా అల్లుళ్ల సవాల్, నువ్వా..నేనా? అంటూ కూతురు, చివరికి!
మహారాష్ట్రలో ఇటీవల 288 అసెంబ్లీ నియోజక వర్గాలకు జరిగిన ఎన్నికల్లో అనేక చోట్ల వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా నాయకులు తమ కుటుంబ సభ్యులను బరిలోకి దింపారు. వార్డుల పునర్విభజన తరువాత తమకు ఓటు బ్యాంకు ఉన్న నియోజక వర్గాలు పక్కనున్న నియోజక వర్గాల్లోకి వెళ్లిపోవడం, కొన్ని నియోజక వర్గాలు వివిధ కులాలకు, మహిళలకు రిజర్వుడు కావడంతో రాజకీయ అనుభమున్న సీనియర్ నేతలకు పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేక అనేక మంది నేతలు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ భార్యలను లేదా కుటుంబ సభ్యులను బరిలోకి దింపాల్సి వచ్చింది. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్ధులు విజయ ఢంకా మోగించారు.అనేక చోట్ల భార్యలు, కూతుళ్లు, సొంత సోదరులు, సోదరీమణులు, మామా, అల్లుడు, కోడళ్లు ఇలా దగ్గరి బంధువులు వివిధ పార్టీల టికెట్లపై లేదా ఇండి పెండెంట్లుగా బరిలోకి దిగారు. కొన్ని చోట్ల ఓడిపోయినప్పటికీ అనేక చోట్ల గెలిచారు. ఓటమి బాధించినా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఎమ్మెల్యే కావడం వారిలో సంతోషాన్ని నింపింది. మహాయుతి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత జరిగే మంత్రివర్గ విస్తరణలో వీరిలో కొంతమందికి చోటు దక్కే అవకాశముండటంతో తమ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ప్రభుత్వంలో కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బారామతిలో మామా అల్లుళ్ల పోటీకాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన ఇద్దరు అన్నదమ్ముల్లో అమిత్ దేశ్‌ముఖ్ విజయం సాధించగా, లాతూర్ రూరల్ నియోజక వర్గంలో పోటీచేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ధీరజ్ దేశ్‌ముఖ్ ఓటమి పాలయ్యారు. అదేవిధంగా ముంబై రీజియన్ బీజేపీ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ పశ్చిమమ బాంద్రా నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు వినోద్ శేలార్ పశ్చిమ మలాడ్ నియోజక వర్గంలో ఓడిపోయారు. మాజీ మంత్రి అనీల్ దేశ్‌ముఖ్ తనయుడు సలిల్ దేశ్‌ముఖ్ కాటోల్ నియోజక వర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. కానీ ఆయన సోదరుడి కొడుకు ఆశీష్ దేశ్‌ముఖ్ సావనేర్ నియోజక వర్గంలో గెలిచారు. అనీల్ దేశ్‌ముఖ్ సొంత మేనల్లుడు, ఎంపీ అమర్ కాళే సతీమణి మయురా కాళే ఆర్వీ నియోజక వర్గంలో ఓటమిని చవిచూశారు. మంత్రి ఛగన్ భుజబల్ యేవలాలో గెలిచారు. కానీ ఆయన మేనల్లుడు సమీర్ భుజబల్ నాంద్గావ్లో పరాజయం పాలయ్యారు. బహుజన్ వికాస్ ఆఘాడి నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే హితేంద్ర ఠాకూర్ వసాయ్‌లో, ఆయన తనయుడు క్షితిజ్ ఠాకూర్ నాలాసోపారాలో ఓడిపోయారు. అదేవిధంగా అజిత్ పవార్ వర్గానికి చెందిన ఇంద్రనీల్ నాయిక్ పుసద్ నియోజక వర్గంలో గెలిచారు. కానీ ఆయన సోదరుడు యయాతీ (ఇండిపెండెంట్) కారంజాలో ఓడిపోయారు. ఇక బారామతిలో మేనమామ, మేనల్లుడు మధ్య పోరు జరిగింది. వీరిలో మామ అజిత్ పవార్ గెలుపొందగా, మేనల్లుడు యుగేంద్ర పరాజయం పాలయ్యారు. న్యూ ముంబైలోని ఏరోలీలో తండ్రి, కొడుకుల మధ్య పోరు జరిగింది. వీరిలో తండ్రి, మాజీ మంత్రి గణేశ్ నాయిక్ (బీజేపీ) గెలుపొందగా, తనయుడు సందీప్ నాయిక్ బేలాపూర్‌లో ఎస్పీ వర్గం టికెట్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఆయన్ని బీజేపీ అభ్యర్ధి మందా మాత్రే ఓడించారు. బోకర్‌లో తండ్రిపై కుమార్తె విజయంగడ్చిరోలీ జిల్లా అహేరీ నియోజక వర్గం ఎన్సీపీ(ఏపీ) అభ్యర్థి, మంత్రి ధర్మరావ్బాబా ఆత్రం తన సొంత కూతురు భాగ్యశ్రీ ఆత్రంను ఓడించారు. భాగ్యశ్రీ ఇండిపెండెంట్‌గా, తండ్రికి ప్రత్యర్ధిగా పోటీ చేశారు. భాగశ్రీతోపాటు ఆయన మేనల్లుడైన అంబరీష్ రాజే ఆత్రం కూడా ఇండిపెండెంట్‌గా పోటీచేసి ఓడిపోయారు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే కావడం విశేషం. మరోవైపు నాందేడ్ జిల్లా లోహా నియోజక వర్గం నుంచి ఎన్సీపీ(ఏపీ) తరపున పోటీచేసిన మాజీ ఎంపీ ప్రతాప్‌రావ్ పాటిల్ చిఖిలీకర్ స్వయాన తన సోదరి ఆశా శిందేను ఓడించారు. మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌ను ఆయన సొంత కూతురు శ్రీజయ బోకర్ నియోజక వర్గంలో ఓడించారు. ఆమె బీజేపీ టికెట్‌పై పోటీ చేశారు. బోకర్ నియోజక వర్గం అశోక్ చవాన్‌కు గట్టిపట్టున్న ప్రాంతంగా పేరు పొందింది. పారంపర్యంగా వస్తున్న గెలుపును మళ్లీ చేజిక్కించుకునేందుకు ఆయన ఎంతో ప్రయత్నం చేశారు. కానీ కూతురు చేతిలో చవాన్ ఓడిపోక తప్పలేదు. అయినప్పటికీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యే అయ్యారు. ఎన్సీపీ(ఏపీ) ప్రదేశ్ అధ్యక్షుడు, ఎంపీ సునీల్ తట్కరే కుమార్తై, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి అదితీ తట్కరే శ్రీవర్ధన్ నియోజక వర్గంలో ఆయన్ని ఓడించారు. చదవండి: ఈవీఎంలపై కట్టలు తెంచుకున్న జనాగ్రహం.. కరెక్టేనా?కాగా బోకర్, శ్రీవర్ధన్ రెండు చోట్ల కుమార్తైలు తండ్రులను ఓడించడం విశేషం. మరోవైపు ఆదివాసి సంక్షేమ శాఖ మంత్రి విజయ్‌కుమార్ గావిత్ నందుర్బార్ నియోజక వర్గంలో భారీ మెజారిటీతో గెలిచారు. కాని ఆయన ఇద్దరు సొంత సోదరులైన రాజేంద్రకుమార్ గావిత్ (కాంగ్రెస్) శహదా నియోజక వర్గంలో, శరద్ గావిత్ (ఇండిపెండెంట్) నవాపూర్ నియోజక వర్గంలో ఓడిపోయారు. అదేవిధంగా విజయ్‌కుమార్ గావిత్ కుమార్తై హినా గావిత్ అక్కల్కువా నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో గావిత్ కుటుంబంలో ఒక్కరికే ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కింది. ఇక మాజీ కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత రావ్‌సాహెబ్ దానవే తనయుడు సంతోష్ దానవే బోకర్ నియోజక వర్గంలో మరోసారి గెలిచారు. కన్నడ్ నియోజక వర్గం నుంచి శివసేన ఏక్నాథ్ శిందే వర్గం టికెట్‌పై పోటీచేసిన రావ్‌సాహెబ్ కుమార్తై సంజనా విజయకేతనం ఎగురవేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా రావ్‌సాహెబ్ ఓటమి పాలయ్యారు. కానీ పిల్లలిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో ఆయనకు డబుల్ గిఫ్ట్ లభించినట్లైంది. లాతూర్‌లో మాజీ ముఖ్యమంత్రి దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఇద్దరు తనయుల్లో ఒకరు ఓడిపోయారు.తండ్రి ఎంపీ.. కుమారులిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నిక మహారాష్ట్ర చరిత్రలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కొడుకులు, తండ్రి ఇలా ముగ్గురూ అధికారంలో కొనసాగడం చర్చనీయాంశమైంది. మాజీ కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇద్దరు కొడుకుల్లో ఒకరైన నితేష్ రాణే కంకావలి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి, రెండో కొడుకు నిలేష్ రాణే కుడాల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి భారీ మెజారీ్టతో గెలిచారు. దీంతో వారిద్దరూ శాసనసభలో అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే నారాయణ్ రాణే ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సామంత్ రత్నగిరి నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరుడు కిరణ్ సామంత్ రత్నగిరి జిల్లా రాజాపూర్ నియోజక వర్గం నుంచి గెలిచారు. ఇరువురూ ఏక్నాథ్ శిందే వర్గం తరపున పోటీ చేశారు. అలాగే తూర్పుబాంద్రా నియోజక వర్గంలో వరుణ్ సర్దేశాయ్ విజయఢంకా మోగించారు. వరుణ్ సర్దేశాయ్, ఉద్ధవ్ ఠాక్రే సతీమణీ రష్మీ ఠాక్రేకు స్వయానా చెల్లెలి కుమారుడు. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే వర్లీ నియోజక వర్గం నుంచి గెలిచారు. దీంతో వరుస సోదరులిద్దరూ అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. అదేవిధంగా రాష్ట్ర సహకార శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ఎన్సీపీ(ఏపీ) తరపున పుణేలోని అంబేగావ్ నియోజక వర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ఆయన సోదరి సాయితాయి డహాకే కరాంజ నియోజక వర్గంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన సోదరుడు, సోదరి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. -
మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారట! కాకుంటే మళ్లీ ఈమీఎంతోనేనట!!
-
విజయాన్ని మించిన పరాజయం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితం ప్రజలకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మెజారిటీ సర్వే సంస్థలు పాలకపక్ష కూటమి ‘మహాయుతి’కి అనుకూలంగానే చెప్పాయి. కానీ, ఇంతటి ఘనవిజయాన్ని అవి కూడా అంచనా వేయలేకపోయాయి. ఈ గెలుపును విశ్లేషిస్తే, ‘మహా వికాస్ ఆఘాడీ’పై మహాయుతి విజయంగా కన్నా... మహాయుతి చేతిలో ఎమ్వీయే ఘోర పరాజయంగా పరిగణించడమే సమంజసం. ఇది విపక్ష కూటమి చేజేతులా తెచ్చుకున్న ఓటమి. మితిమీరిన ఆత్మవిశ్వాసం, కొరవడిన ఎన్నికల వ్యూహం వారికీ గతి పట్టించాయి. అతి విశ్వాసంతో సరైన ‘ఎన్నికల నినాదమే’ లేకుండా కూటమి గుడ్డిపోరు సల్పింది. లోక్‌సభ ఎన్నికల్లో లభించిన స్పష్టమైన ఆధిక్యాన్ని నిలుపుకోలేక పోయింది.మెజారిటీ సర్వే సంస్థలు అంచనా వేసిన ట్టుగానే, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పాలకపక్ష కూటమి ‘మహాయుతి’ ఘన విజయాన్ని సాధించింది. గరిష్ఠంగా ‘పీపుల్స్ పల్స్’ చెప్పిన 195 సంఖ్యను కూడా మించి,ఏకంగా 234 స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ నేతృత్వపు కూటమి తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.మహారాష్ట్ర ఫలితం ‘ఇండియా కూటమి’కి ఎదురు దెబ్బే అయినా, పార్టీగా కాంగ్రెస్‌కు కోలుకోలేని పెద్ద దెబ్బ. హిమాచల్ ప్రదేశ్ గెలుపు కర్ణాటకలో విజయానికీ, కర్ణాటకలో గెలుపు తెలంగా ణలో విజయానికీ కొంత ప్రేరణ ఇచ్చిన క్రమంలో... 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ తన స్థానాలను రెట్టింపు చేసుకోగలిగింది. సెంచరీ మార్క్ సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగుదల మిత్ర పక్షాలకూ ప్రేరణ కలిగించి, దేశ రాజకీయాల్లో ‘ఇండియా కూటమి’ బలమైన ప్రత్యామ్నాయంగా నిలువగలిగింది. అయితే, చావు తప్పి కన్ను లొట్టబోయిందన్న తరహాలో ‘ఇండియా’ కూటమికి దక్కిన నిన్నటి జమ్ము–కశ్మీర్ గెలుపైనా, ఇవాళ్టి ‘జార్ఖండ్’ విజయమైనా మిత్రుల ఘనతే తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదు. కాంగ్రెస్ సంస్థాగత స్థితి, ఎన్నికల నిర్వహణా సామర్థ్యం దిగదుడుపుగానే ఉంటోంది. 1990లలో బీజేపీ–శివసేన కూటమి రాజకీయాలు మొదలయ్యే వరకు మహారాష్ట్రలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం. బీజేపీ–శివసేన శకం ఆధిపత్య క్రమంలో కూడా 2004–14 మధ్య శరద్ పవార్ నేతృత్వంలోని జాతీయవాద కాంగ్రెస్ (ఎన్సీపీ)తో పొత్తుల వల్ల కాంగ్రెస్ మళ్లీ పాలకపక్ష స్థాయికి వచ్చింది. 2014 తర్వాత, ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత రాజకీయ అనిశ్చితి, పార్టీ మార్పిళ్లు, రాజకీయ శక్తుల పునరేకీకరణల్లో కాంగ్రెస్ క్రమంగా పలుచబారుతోంది. కాంగ్రెస్‌ది మహావైఫల్యంఇటీవలి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకా శాలను దాదాపు అన్ని సర్వే సంస్థలూ అంచనా వేశాయి. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ, మొత్తం పది లోక్‌సభ స్థానాలూ ఓడి పోయిన హరియాణాలో కాంగ్రెస్ పార్టీ, 2024 ఎన్నికలకు వచ్చేసరికి 5 స్థానాలు గెలిచింది. ఓటు వాటాలోనూ బీజేపీ కన్నా 1 శాతం స్పష్టమైన ఆధిక్యత దక్కించుకుంది. తర్వాతి ఒకటి, రెండు మాసాల్లో కాంగ్రెస్ సానుకూలత మరింత పెరిగినట్టు వివిధ సర్వేల్లో సంకేతా లొచ్చాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడింది. తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొన్న బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, మూడోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. లోక్‌సభ ఎన్ని కలు, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరు ప్రాతిపదికలపై జరుగుతాయనీ, ప్రజాతీర్పు భిన్నంగా వచ్చే ఆస్కారం ఉంటుందనీ కాంగ్రెస్ పాఠం నేర్వనందునే మహారాష్ట్రలో ఎదురుదెబ్బ తప్పలేదు. హరియాణా పరిస్థితే మహారాష్ట్రలోనూ ఉండింది. లోక్‌సభ ఎన్నికల్లో 48కి 30 స్థానాలు నెగ్గి మహా వికాస్ అఘాడీ స్పష్టమైన ఆధిక్యత పొందింది. పాలక పక్షంగా ఉండిన మహాయుతికి 17 స్థానాలే లభించాయి. మరాఠ్వాడా వంటి కొన్ని ప్రాంతాల్లో మహా యుతికి ఒక్క స్థానం కూడా దక్కలేదు. ఆ పరిస్థితిని నిలబెట్టు కోవడమో, మెరుగుపరచుకోవడమో చేయకుండా... తమ గెలుపు ఖాయమైపోయినట్టు ఎమ్వీయే పక్షాలు ధీమా ప్రదర్శించాయి. కూటమి గెలుపు మీద కన్నా ‘ఎవరు ముఖ్యమంత్రి?’ అన్న దానిపైనే వివిధ పక్షాల నేతలు కన్నుపెట్టారు. సంస్థాగత నిర్వహణ, మిత్రులతో సయోధ్య, ప్రభావవంతమైన నినాదమివ్వడం, ప్రజలకో స్పష్టమైన వాదన (నెరేటివ్) వినిపించగలగడం... ఇలా అన్నింటా విఫల మయ్యారు. ఎన్నికల వేళ ఆ యా ప్రాంతాలకు పార్టీ ఇన్చార్జీల నియా మకం కూడా సహేతుకంగా జరుగలేదు. పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి, ఇప్పుడు వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్న నాయకుడిని ఒక నియోజకవర్గానికి నియమిస్తే, ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థియే పోటీలో లేరు. ప్రత్యర్థి పార్టీ ఓబీసీలతో 60 వేల ‘బృంద సమావేశాలు’ ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ నాయకులు స్టార్ హోటళ్లలో దిగి, రూ. 60 వేల బిల్లులు చేశారంతే!పాత చింతకాయ పచ్చడిచంకలో పుస్తకం పెట్టుకొని ‘రాజ్యాంగం ప్రమాదంలో ఉంది’ (సంవిధాన్ ఖత్రే మే హై) అన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నినాదం ఈసారి పనిచేయలేదు. ‘బీజేపీ అడుగుతున్నట్టు 400కు పైగా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు గల్లంతవుతాయి’ అని ప్రచారం చేస్తే లోక్‌సభ ఎన్నికల్లో అది కాంగ్రెస్‌కూ, వారి కూటమికీ లాభించింది. అసెంబ్లీ ఎన్నికలు గనుక... సోయ, పత్తి వంటి రైతాంగ సమస్యలు, కొన్ని ప్రాంతాల వెనుకబాటుతనం, మరాఠా యువత నిరుద్యోగిత వంటి స్థానికాంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. మహా వికాస్ ఆఘాడీలోని శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) కూడా, తమ పార్టీలను బీజేపీ నిలువునా చీల్చిందన్న పాత నినాదాన్నే ఈ ఎన్నికల్లోనూ ప్రచారాంశంగా ఎత్తుకున్నాయి. అదే అంశంపై లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. 2019 ఎన్నికల్లో బీజేపీ–శివసేన కలిసి ఎన్నికలకు వెళ్లి, సానుకూల ప్రజాతీర్పు పొందిన తర్వాత, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన... కాంగ్రెస్ –ఎన్సీపీ పంచన చేరడం వారి నైతిక స్థితిని కొంత బలహీనపరిచింది. అందుకే, చీలికల అంశంలో బీజేపీపై నిందలు తాజా ఎన్నికల్లో ఆధిక్యతను ఇవ్వలేకపోయాయి. వాస్తవిక బలాల ఆధారంగా లోక్‌సభ సీట్ల పంపకాలు చేసుకున్న ఎమ్వీయే కూటమి ఈసారి మాత్రం పొత్తుల్ని కడదాకా తేల్చలేదు. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేయడం వల్లనేమో... సీట్ల పంపకాల్లో సయోధ్యకు నీళ్లొదిలారు. కాంగ్రెస్ గెలిచిన 16 స్థానాల్లో 11 బీజేపీతో నేరుగా తలపడ్డ స్థానాలే. అయినా, ఆ పార్టీతో పోలిస్తే విజయశాతం అట్టడుగున ఉంది. శివసేన (ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు కూడా ప్రత్యర్థి కూటమి పక్షాలైన శివసేన (షిందే), ఎన్సీపీ (అజిత్ పవార్) పార్టీలతో పోలిస్తే చాలా వెనుకబడ్డాయి.దిద్దుబాటు చర్యలతో...లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పసిగట్టిన మహాయుతి కూటమి దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే, 18–59 మధ్య వయస్కులైన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చెల్లిస్తూ చేపట్టిన ‘మాజీ–లడ్కీ–బహెన్’ పథకం తిరుగు లేని ఆధిక్యతనిచ్చింది. మహిళా ఓటింగ్ 6 శాతం పెరగటం ఇందు కొక సంకేతమే! తాము తిరిగి గెలిస్తే దాన్ని రూ. 2,100లకు పెంచుతామన్న ‘మహాయుతి’ హామీ 2.4 కోట్ల కుటుంబాలకు ఆశ కల్పించింది. దానికి తోడు ‘ఓట్ జిహాద్’, ‘బటేంగే తో కటేంగే’ నినాదాలు, ఆ దిశలో చేసిన ప్రచారం హిందువుల ఓట్లను ఏకీకృతం చేయడంలో ప్రభావం చూపాయి.బీజేపీ యంత్రాంగానికి తోడు ఆర్ఎస్ఎస్ ఈ ఎన్నికల్ని ప్రతి ష్ఠాత్మకంగా తీసుకొని పనిచేసింది. లోక్‌సభ ఎన్నికల్లో మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాల్లో ప్రతికూలంగా వచ్చిన ప్రజాభిప్రాయాన్ని గమనించిన బీజేపీ, ఓబీసీల మద్దతు కూడగట్టడంపై పెట్టిన శ్రద్ధ కలిసొచ్చింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను అమలు చేయట్లేదంటూ చేసిన ‘ప్రతి ప్రచారం’తో, ఎమ్వీయే కూటమి హామీ లపై సందేహాల్ని రేకెత్తించడంలో మహాయుతి పైచేయి సాధించింది. అంతిమంగా మహారాష్ట్ర ఫలితం ‘మహాయుతి’ భారీ విజయాన్ని మించి, ‘మహా వికాస్ ఆఘాడీ’ ఘోర పరాజయంగా మిగిలింది.దిలీప్ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్ ఎనలిస్ట్,పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
సాక్షి కార్టూన్ 26-11-2024
-
పెళ్లికి వచ్చా.. రాజకీయాలకు కాదు: ఢిల్లీలో ఫడ్నవిస్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం సాధించిన దరిమిలా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం రేసులో ముందంజలో ఉంది. కాగా దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటనపై పలు చర్చలు జరుగుతున్నాయి.లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు మాత్రమే ఢిల్లీకి వచ్చానని, తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవిస్ ఢిల్లీలో బీజేపీ అగ్ర నాయకత్వాన్ని కలవవచ్చంటూ గతంలో వార్తలు వినిపించాయి. అయితే తనకు ప్రస్తుతం పార్టీ అగ్రనేతలను కలిసే ఆలోచన లేదని ఫడ్నవిస్ స్వయంగా తెలిపారు.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు గాను మహాయుతి 234 స్థానాల్లో విజయం సాధించింది. వీటిలో బీజేపీ 132 సీట్లు, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57 సీట్లు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలుచుకున్నాయి. మిగతా మిత్రపక్షాలు నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. కాగా మీడియా కథనాల ప్రకారం దేవేంద్ర ఫడ్నవిస్ పేరు సీఎం పదవికి ఆమోదం పొందిందని, అతనితోపాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలుస్తోంది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూడా దేవేంద్ర ఫడ్నవిస్‌ను సీఎం చేయడానికి అనుకూలంగా ఉందని సమాచారం. ఇది కూడా చదవండి: రాజకుటుంబంలో విభేదాలు.. ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఉద్రిక్తతలు.. -
Maharashtra: ప్రతిపక్ష నేత ఎవరు..?
ముంబై: ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా... మహాయుతి కూటమి 235 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 41 స్థానాలు దక్కించుకున్నాయి. ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా!ఊహించని విధంగా రికార్డు బద్దలు కొడుతూ భారీ మెజార్టీతో మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించగా ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షంలోని ఏ పార్టీ కూడా పది శాతం స్థానాలు రాబట్టుకోలేక పోయాయి. దీంతో ప్రతిపక్ష పదవిలో ఎవరు ఉండక పోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్ఓపీ) లేకపోవడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి. రాష్ట్ర శాసన మండలి నియమాల ప్రకారం మొత్తం స్థానాల్లో పది శాతం స్థానాలు దక్కించుకున్న పార్టీకే ప్రతిపక్ష పదవి లభిస్తుంది. కానీ శనివారం వెలువడిన ఫలితాల్లో మహా వికాస్ అఘాడీలోని యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) మిత్రపక్షాల్లోని ఏ ఒక్క పార్టీకి పది శాతం స్థానాలు రాలేకపోయాయి. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 49 చోట్ల గెలుపొందింది. ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద 16, యూబీటీ–శివసేన వద్ద 20, ఎన్సీపీ (ఎస్పీ) వద్ద 10 స్థానాలున్నాయి. దీంతో ఏ పార్టీ వద్ద తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష పీఠంపై ఉత్కంఠ నెలకొంది. సీఎం పీఠంపై వీడని ఉత్కంఠమరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తం ఆ పోస్టు కోసం పోటీలో ఉన్నారు.బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి. -
మహా పోరులో తెలుగోడి ఢంకా : బాబాయ్- అబ్బాయ్‌ల గెలుపోటములు తీరిదీ!
సోలాపూర్: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరి కలలు నెరవేరగా.. అనేకమంది వైఫల్యాలను చవిచూశారు. కోటే కుటుంబానికి చెందిన మహేశ్ కోటే, ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే వేర్వేరు పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఒకే కుటుంబం తరఫున ఇరువురు అందులో తెలుగువారు శాసనసభ్యులు అయ్యే కల నెరవేరుతోందని వారి అనుచరులు భావిస్తూ వచ్చారు. అయితే ఎమ్మెల్యే కావాలన్న మహేశ్ కోటే కల చెదిరిపోగా.. ఆయన తమ్ముడు కొడుకు దేవేంద్ర ఎమ్మెల్యేగా పోటీచేసిన తొలి ఎన్నికల్లోనే గెలుపొందారు. పట్టణంలో పేరు గాంచిన కోటే కుటుంబం కాంగ్రెస్‌కు, ముఖ్యంగా సీనియర్ నాయకుడు సుశీల్ కుమార్ శిందేకు విధేయులుగా గుర్తింపు పొందింది. సుశీల్ కుమార్ శిందే ఎన్నికల్లో విజయం సాధించడంలో, రాజకీయ ఆధిపత్యం అంతా దివంగత విష్ణు పంతు కోటే ఎన్నికల వ్యూహంలో ప్రధానపాత్ర పోషించేవారు. అయితే సుశీల్ కుమార్ శిందే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత ఇక్కడి ఎంపీ టికెట్ విష్ణు పంతు కోటేకు వస్తుందని అంతా భావించారు. అయితే విష్ణు పంతుకోటేకు మాత్రం అవకాశం రాలేదు. ఆ తర్వాత 2009లో సోలాపూర్ సిటీ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విష్ణు పంత్ కుమారుడైన మహేశ్ కోటేకు కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థత్వం లభించింది. అయితే అప్పటి మిత్రపక్షమైన ఎన్సీపీకి చెందిన వ్యక్తి రెబల్స్ ఈ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల మహేశ్ కోటే ఎన్నికల్లో పరాభవం చెందారు. తర్వాత కాంగ్రెస్‌లో ఉంటే తన ఎమ్మెల్యే కల నెరవేరదని తెలుసుకున్న మాజీ మేయర్ మహేశ్ కోటే శివసేనలో చేరారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి 2014లో శివసేన తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఆయనకు తీరా సమయంలో శివసేన పార్టీ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఆయన మూడో స్థానంలో నిలిచారు. గత మూడు ఎన్నికలలో పరాభవం చవిచూసిన మహేశ్ కోటే గత సంవత్సరం కిందట శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీలో చేరి ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలని గట్టిగా సన్నాహాలు చేసుకున్నారు. మహా వికాస్ అఘాడీకి చెందిన నేతలు అందరూ ఈ ఎన్నికల్లో మహేశ్‌కు వెన్నంటి ఉండి ప్రచారాలు నిర్వహించారు. అయినప్పటికీ ఆయనే సోలాపూర్ నార్త్ సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ స్థానంలో నిలిచి పరాభవం చెందారు. మరోవైపు ఆయన తమ్ముడి కుమారుడు దేవేంద్ర కోటే లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ర్యాలీలో దూకుడుగా ప్రసంగించడం ద్వారా కరుడుగట్టిన హిందుత్వ వాదిగా ఇమేజ్ను సృష్టించుకున్నారు. ఆ తర్వాత కాలంలో మరింత దూకుడుగా వ్యవహరించి పార్టీలో క్రియాశీలంగా కార్యక్రమాలు నిర్వహించి పార్టీ అధిష్టానం దృష్టిలో పడి అభ్యరి్థత్వాన్ని పొందారు. తద్వారా ఎన్నికల్లో పోటీ చేసి విజయ ఢంకా మోగించిన తెలుగువాడిగా రికార్డు సృష్టించారు. ఇదీ చదవండి: మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు! -
మహాయుతి గెలుపులో ‘లాడ్కీ బహీన్’: పట్టం కట్టిన మహిళా ఓటర్లు!
సోలాపూర్: జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో మహాకూటమి ఆధిక్యతను ప్రదర్శించింది. లాడ్కీ బహీన్ పథకం ప్రయోజనాలు మహా కూటమి అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశాయి. అందుకే రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి ప్రభుత్వానికి మహిళా ఓటర్లు భారీగా పట్టం కట్టారని స్పష్టం అవుతోంది. జిల్లాలోని ఆరు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇందులో ఐదు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. శరద్ పవార్ పార్టీకి చెందిన ఎన్సీపీ నాలుగు.. శివసేన యూబీటీకి చెందిన ఒకరు అలాగే షేకాపాకు చెందిన ఒకరు గెలుపొందారు. అక్కల్కోట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి సచిన్ కల్యాణ్ శెట్టి 49 వేల 572 ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సిద్ధరామ్ మెత్రే పరాభవం చెందారు. భార్షీ నియోజకవర్గం నందు శివసేన యూబీటీకి చెందిన దిలీప్ సోపల్ 6,472 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ ఏక్నాథ్ శిందేకు చెందిన అభ్యర్థి రాజేంద్ర రౌత్ పరాభవం చెందారు. కరమాల నియోజకవర్గం నందు శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున నారాయణ పాటిల్ 16 వేల 85 ఓట్ల ఆధిక్యంతో విజయ ఢంకా మోగించారు. ఆయన తన ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి సంజయ్ శిందేను ఓడించారు. మాడ నియోజకవర్గంలోని అభిజిత్ పాటిల్ కూడా శరద్ పవార్‌కు చెందిన ఎన్సీపీ తరఫున పోటీ చేసి 30 వేల 621 ఓట్ల అధిక్యంతో విజయం పొందారు. ఆయన స్వతంత్ర అభ్యర్థి రంజిత్ శిందేను ఓడించారు. మోహల్ స్థానం నుంచి శరద్ పవార్ ఎన్సీపీ తరఫున పోటీ చేసిన రాజు కర్రే 30 వేల రెండు వందల రెండు ఓట్లతో విజయం సాధించారు. ఇచ్చట సిట్టింగ్ ఎమ్మెల్యే యశ్వంత్ మానే ఓటమి పాలయ్యారు.ఇదీ చదవండి: ఐపీఎల్ 2025 వేలం : అదిరే డ్రెస్‌లో నీతా అంబానీ, ధర ఎంతో తెలుసా?పండరీపూర్ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన సమాధాన్ అవతాడే 8 వేల 65 ఓట్ల తేడాతో ఆయన ప్రత్యర్థి కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థి భగీరథ బాలికేను ఓడించారు. సోలాపూర్ సిటీ నార్త్ నియోజకవర్గం ద్వారా బీజేపీకి చెందిన విజయ్ దేశ్‌ముఖ్ 51 వేల 88 ఓట్ల మెజారీ్టతో వరుసగా ఐదవసారి గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి శరద్ పవార్ ఎన్సీపీ అభ్యర్థి మహేశ్ కోటేను ఓడించారు. సోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దేవేంద్ర కోటే 40 వేల 657 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రత్యర్థి ఎంఐఎం అభ్యర్థి ఫారూక్ షాబ్దిని ఓడించారు. సాంగోల నియోజకవర్గంలో షేత్కారి కామ్‌గార్ పారీ్టకి చెందిన బాబాసాహెబ్ దేశ్‌ముఖ్ 25 వేల 386 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈయన ప్రత్యర్థి ఏక్నాథ్ శిందే శివసేనకు చెందిన సిట్టింగ్ శాసనసభ్యుడు షాహాజీ బాపు పాటిల్‌ను ఓడించారు. మాల్ శిరస్ నియోజకవర్గం నుంచి శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఉత్తం ఝాన్కర్ 137 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన తన సమీప బీజేపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్సాత్ పూతేను ఓడించారు. ఆరు స్థానాల్లో బరిలోకి బీజేపీ అభ్యర్థులు.. ఐదు స్థానాల్లో గెలుపు -
ఘోర పరాజయం.. కాంగ్రెస్ అధ్యక్షుడి రాజీనామా
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 288 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్, శివసేన(ఉద్దవ్)చెందిన కూటమి కేవలం 49 స్థానాల్లోనే గెలుపొందింది. ప్రతిపక్ష కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తీవ్ర ఓటమితో ఇప్పటికే ఖంగుతున్న ఎంవీఏ కూటమిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే సోమవారం రాజీనామా చేశారు. మొత్తం 103 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే గెలిచి 12.42 శాతం ఓట్లు సాధించింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటినుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారిపోయింది. ఇక సకోలీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే 208 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఈ క్రమంలోనే పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నానా పటోలే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ అయిన పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బోల్తా కొట్టింది. మొత్తం మీద 49 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) 10 సీట్లు, కాంగ్రెస్ 16, శివసేన (ఉద్దవ్) 20 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. -
మహారాష్ట్రలో యోగి మ్యాజిక్.. 18 చోట్ల ప్రచారం.. 17 సీట్లలో విజయం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. దీంతో రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం అయ్యాయి. ఈ ఎన్నికల్లో 132 సీట్లను గెలుపొందడం ద్వారా బీజేపీ రాష్ట్రంలో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ మహారాష్ట్ర పగ్గాలు చేపట్టవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ విజయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా కీలక పాత్ర పోషించారు.నిపుణులు విశ్లేషించిన వివరాల ప్రకారం యోగి ఆదిత్యనాథ్ 18 మంది బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయగా, వారిలో 17 మంది విజయం సాధించారు. అకోలా వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి ఒక్క బీజేపీ అభ్యర్థి విజయ్ అగర్వాల్ మాత్రమే ఓటమి చవిచూశారు. విజయ్ అగర్వాల్ కేవలం వెయ్యి ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి సాజిద్ ఖాన్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ విధంగా చూస్తే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బీజేపీ అభ్యర్థుల విజయం కోసం చేసిన ప్రచారంలో 95% స్ట్రైక్ రేట్‌ను దక్కించుకున్నారు.ఇదేవిధంగా సీఎం యోగి.. మహాయుతి కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన ఐదుగురు అభ్యర్ధుల కోసం కూడా ప్రచారం చేశారు. ఆయన మొత్తంగా మహాయుతికి చెందిన 23 మంది అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. వీరిలో 20 మంది గెలిచారు. ఈ 20 మంది అభ్యర్థుల్లో 17 మంది బీజేపీ అభ్యర్థులు. ముగ్గురు విఫలమైన అభ్యర్థుల్లో శివసేన నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు. మహారాష్ట్రలో సీఎం యోగి స్ట్రైక్ రేట్‌పై పోస్టర్లు కూడా వెలిశాయి. ఇది కూడా చదవండి: బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు -
ఉద్ధవ్ రాక్షసుడు.. మహిళలను అవమానించారు: కంగన
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడి రాజకీయాలపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా నటి, ఎంపీ కంగనా రనౌత్ శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేపై పలు విమర్శలు గుప్పించారు. మహిళలను అవమానించిన కారణంగానే ‘రాక్షసుడు’ ఈ పరిస్థితిని అనుభవించాల్సి వచ్చిందని కంగనా వ్యాఖ్యానించారు. ఉద్ధవ్ ఠాక్రే ఓటమిని తాను ముందే ఊహించినట్లు ఆమె తెలిపారు. స్త్రీలను గౌరవిస్తున్నారా? వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారా? అనే దానిని అనుసరించే ఎవరు రాక్షసుడో.. ఎవరు మంచివారో గుర్తించగలమన్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి విజయం సాధించిన దరిమిలా కంగనా ఈ విధమైన వ్యాఖ్యానాలు చేశారు.వారు తన ఇంటిని పడగొట్టారని, నానా దుర్భాషలాడారని అటువంటి చర్యలకు పరిణామాలు ఉంటాయని నమ్మానని కంగనా పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే శిక్షకు అర్హుడని, ఈ ఓటమిని తాను ముందే ఊహించానన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని కొనియాడిన కంగనా ఆయనను అజేయునిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ దేశ రక్షణకు నియమితుడైన నేత అని పేర్కొన్నారు.దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసేవారికి ఈ ఎన్నికల ఫలితాలు గుణపాఠమని కంగనా పేర్కొన్నారు. అభివృద్ధి, సుస్థిరత కోసం మహారాష్ట్ర ప్రజలు ఓట్లు వేశారని కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా కంగనా ఇంటిని అక్రమ నిర్మాణంగా ఆరోపిస్తూ, 2020, సెప్టెంబర్‌లో బీఎంసీ ఆమె ఇంటిలో కొంత భాగాన్ని కూల్చివేసింది. తరువాత బాంబే హైకోర్టు బీఎంసీ ఆదేశాలను రద్దు చేసింది. కంగనా నష్టపరిహారానికి అర్హురాలిగా ప్రకటించింది.ఇది కూడా చదవండి: డబ్బు కోసం కాదు, మోక్షం కోసం : నృత్యం బాధ నుంచి పుడుతుంది!