Live: ‘మహా’యుతిదే అధికారం.. 25న సీఎం ఎన్నిక?! | Maharashtra Election 2024 Counting Result News Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

Live: ‘మహా’యుతిదే అధికారం.. 25న సీఎం ఎన్నిక?!

మహారాష్ట్రలో మహాయుతిదే విజయం

మహారాష్ట్రలో మహాయుతి కూటమి తిరుగులేని  విజయం సాధించింది. 288 అసెంబ్లీ  సీట్లలో ఇప్పటివరకూ 229 స్థానాల్లో జయకేతనం ఎగురేసి, ఇంకా  రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక ఎంవీఏ కూటమి ఢీలా పడింది. 49 స్థానాల్లో  విజయం   సాధించగా,  నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది.

2024-11-23 18:28:23

మహారాష్ట్ర: శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్‌ రౌత్‌ సంచలన ఆరోపణలు

  • ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేశారు
  • ఇది ప్రజాతీర్పు కాదు
  • లోక్‌సభ ఎన్నికల్లో మాకు స్పష్టమైన ఆధిక్యం ఉంది
  • ఇప్పుడెలా ఫలితాలు మారతాయి
     
2024-11-23 16:06:48

మహారాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారు: కిషన్‌రెడ్డి

  • రాహుల్‌ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు
  • మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు రాలేదు
  • కాంగ్రెస్‌పై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో అర్ధమవుతోంది
  • మహారాష్ట్రలో విపక్షహోదా కూడా కాంగ్రెస్‌కు రాలేదు
     
2024-11-23 16:05:38

‘మహా’ ఫలితాలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ కీలక వ్యాఖ్యలు

  • ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
  • మహాయుతి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు
  • ముఖ్యంగా మహిళా ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు
  • మహారాష్ట్ర మొత్తం ప్రధాని మోదీ వెంటే నిలిచింది
  • సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఎలాంటి గొడవ లేదు
  • పరస్పర అంగీకారంతో సీఎంను ఎన్నుకుంటాం
     
2024-11-23 16:05:38

మహాయుతి తొలి విజయం నమోదు

మహాయుతి తొలి విజయం

  • మహారాష్ట్రలో మహాయుతి తొలి విజయం
  • వడాలలో 59,764 ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి కాళిదాస్‌ నీలకంఠ్‌ గెలుపు
  • 25న శాసనసభా పక్ష సమావేశం
  • 26న సీఎం ప్రమాణ స్వీకారం
  • బరిలో కీలక పార్టీల ముగ్గురు నేతలు
  • ముందంజలో ఫడ్నవిస్‌
  • సీఎం ఎవరనేది కూర్చొని చర్చిస్తామన్న షిండే
  • అజిత్‌ పవార్‌ ఆశయమే సీఎం కావడమని, అది నెరవేర్చాలని కోరుతున్న ఆయన వర్గం
2024-11-23 14:32:04

నిరాశలో ఇండియా కూటమి

  • మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమికి ఘోర పరాభవం
  • 50 స్థానాలకు పడిపోయిన  మహా వికాస్‌ అఘాడి
  • ప్రజల నుంచి ఉద్దవ్‌ శివసేన, పవార్‌ ఎన్సీపీలకు తిరస్కారం
  • ఎన్డీయే 50 శాతానికి పైగా ఓట్‌ షేర్‌
  • బీజేపీ 23%,  అజిత్‌ పవార్‌ పార్టీకి 14%, 13% షిండే శివసేన
  • కాంగ్రెస్‌ 9%, ఉద్దవ్‌ శివసేన 10%, శరద్‌ పవార్‌ 11%
2024-11-23 12:58:06

మహా సీఎం కుర్చీ.. సూపర్‌ ట్విస్ట్‌

  • మహారాష్ట్రలో షిండే ఫిట్టింగ్‌
  • తదుపరి సీఎం ఎవరనేది చర్చ
  • రేసులో అతిపెద్ద పార్టీ బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవిస్‌
  • అతిపెద్ద పార్టీకే సీఎం సీటు రూల్‌ లేదుకదా అంటున్న ఏక్‌నాథ్‌ షిండే
  • అందరం కూర్చుని చర్చిస్తామన్న షిండే
  • తమ నేతకే ఇవ్వాలని డిమాండ్‌ లేవనెత్తిన అజిత్‌ పవార్‌ ఎన్సీపీ వర్గం
  • ప్రభుత్వ ఏర్పాటునకు మరో 72 గంటలకే గడువు
  • ఈలోపు సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్‌ కొనసాగే అవకాశం
2024-11-23 12:58:06

తదుపరి సీఎం ఎవరు?

  • మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి హవా
  • మళ్లీ అధికారం చేపట్టబోతున్న ఎన్డీయే కూటమి
  • తదుపరి సీఎం ఎవరనేదానిపై మొదలైన చర్చ
  • షిండే వారసుడి ఎంపికపై రకరకాల విశ్లేషణలు
  • మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్‌కే ఎక్కువ ఛాన్స్‌!
  • మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించిన బీజేపీ నేత ప్రవీణ్‌ ధరేకర్‌
  • ఫడ్నవిస్‌ ఇంట సంబురాలు
  • కాసేపట్లో ఫడ్నవిస్‌తో భేటీ కానున్న మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రశేఖర్‌ బవాన్కులే
2024-11-23 12:03:28

ప్రభుత్వ ఏ‍ర్పాటుకు ఎన్డీయే కసరత్తు

మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే ప్రభుత్వం
 

  • ప్రభుత్వ ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ సాధించిన ఎన్డీయే కూటమి
  • సంబరాల్లో మునిగిపోయిన మహాయుతి కూటమి శ్రేణులు
  • ప్రభుత్వ ఏ‍ర్పాటుకు ఎన్డీయే కసరత్తు
  • ఇండియా కూటమికి ఘోర పరాభవం
  • 50 సీట్లకు పడిపోయిన మహా వికాస్‌ అఘాడీ కూటమి
  • శరద్‌, ఉద్దవ్‌ వర్గానికి గట్టి షాక్‌ ఇచ్చిన మరాఠీలు
  • సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ
2024-11-23 11:48:00

‘ఈవీఎంలను ఎన్డీయే ట్యాంపరింగ్‌ చేసింది’

  • మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ సంచలన ఆరోపణలు
  • ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన శివసేన(UBT) నేత సంజయ్‌ రౌత్‌ 
  • ఇది ప్రజాతీర్పు కాదు
  • ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశారు
  • లోక్‌సభ ఎన్నికల్లో మాకే స్పష్టమైన ఆధిక్యం వచ్చింది
  • మహారాష్ట్రలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది
2024-11-23 10:41:29

ఎంవీఏకు ఘోర పరాభవం

  • మహారాష్ట్రలో ఘోర పరాభవం దిశగా మహా వికాస్‌ అఘాడి
  • శివసేన, ఎన్‌సీపీలలో చీలిక
  • శివసేన నుంచి ఉద్దవ్‌ థాక్రే, ఏక్‌నాథ్‌ షిండే వర్గం
  • ఎన్‌సీపీ నుంచి శరద్‌ పవార్‌, అజిత్‌ పవార్‌ వర్గం
  • మహాయుతి(ఎన్డీయే)తో జత కట్టిన షిండే శివసేన, అజిత్‌ ఎన్‌సీపీ
  • మహా వికాస్‌ అఘాడితో కలిసి నడిచిన పవార్‌ ఎన్సీపీ, ఉద్దవ్‌ శివసేన
  • పవార్‌, ఉద్దవ్‌లను ఓడించిన మరాఠీలు
2024-11-23 10:36:43

డబుల్‌ సెంచరీ దాటిన మహాయుతి

  • మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే హవా
  • 210 స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతున్న మహాయుతి అభ్యర్థులు
  • ఆధిక్యం పెంచుకుంటూ పోతున్న కీలక నేతలు
  • 67 స్థానాల్లో ఆధిక్యంలో మహా వికాస్‌ అఘాడి అభ్యర్థులు
  • 11 స్థానాల్లో ఇతరుల ఆధిక్యం
2024-11-23 10:19:49

192 లీడ్‌లో మహాయుతి

  • మహారాష్ట్రంలో మళ్లీ ఆధిక్యంలోకి మహాయుతి(NDA) కూటమి
  • లీడ్‌లో కొనసాగుతున్న కూటమిలోని కీలక నేతలు
  • లీడ్‌లో.. మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్టీయే
  • 288 స్థానాల్లో.. 192 లీడ్‌లో ఎన్డీయే
  • 81 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతున్న మహా వికాస్‌ అఘాడి (INDIA)
  • ఐదు స్థానాలో ఇతరుల ఆధిక్యం
2024-11-23 09:56:18

మహారాష్ట్రలో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే కూటమి

  • మహారాష్ట్రలో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే కూటమి
  • 150కి పైగా స్థానాల్లో దూసుకుపోతున్న మహాయుతి కూటమి
  • 98 స్థానాల్లో ఎంవీఏ కూటమి ముందంజ
2024-11-23 09:35:09

మహారాష్ట్రలో క్షణక్షణం మారుతున్న ట్రెండ్స్‌

  • ఆధిక్యంలో సిద్ధిఖీ తనయుడు జిశాన్‌
  • బాంద్రా ఈస్ట్ ఎన్సీపీ(అజిత్‌) వర్గం నుంచి‌ జిశాన్ పోటీ
  • ఔరంగాబాద్‌లో మజ్లిస్‌ అభ్యర్థి ఇంతియాజ్‌ జలీల్‌ ముందజ
  • వర్లిలో అదిత్య థాక్రే ముందంజ
  • నాగ్‌పూర్‌ సౌత్‌ నుంచి ఫడ్నవీస్‌ ముందంజ
2024-11-23 09:20:48

మహా కౌంటింగ్‌.. హోరాహోరీ

  • మహా ఫలితాలపై క్షణక్షణం ఉత్కంఠ
  • కౌంటింగ్‌ సాగుతున్న క్రమంలో..  మారుతున్న పరిణామాలు
  • మహారాష్ట్రలో హోరాహోరీ  
  • ఎన్డీయే కూటమి 117  
  • ఇండియా కూటమి 87
2024-11-23 09:16:59

మహారాష్ట్రలో భారీ లీడ్‌లో కొనసాగుతున్న ఎన్డీయే కూటమి

షిండే, ఫడ్నవీస్‌, అజిత్‌ పవార్‌.. ఇలా కీలక నేతలంతా ఆధిక్యంలోనే.. 

 

2024-11-23 08:45:05

ఎంవీయూ ముందు జాగ్రత్త చర్యలు

  • డిజిటల్‌ సిగ్నేచర్లు సేకరిస్తున్న మహావికాస్‌ అఘాడీ
  • మహారాష్ట్రలో విజయంపై ఎంవీఏ కూటమి ధీమా
  • ముందస్తుగా గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల సంతకాల సేకరణ
  • డిజిటల్‌ సంతకాలు సేకరిస్తున్న కూటమి
  • మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంతకాల సేకరణకు జాప్యం కాకుండా ముందస్తు చర్యలు
  • గెలిచిన ఎమ్మెల్యేలను క్యాంపుల్లో ఉంచేందుకు.. అవసరమైతే ఛార్టెడ్‌ ఫ్లైట్‌లలో తరలించేందుకు సిద్ధం!
  • పరిస్థితులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక పరిశీలకులను కాంగ్రెస్‌  
  • పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీనియర్‌ నేతలు అశోక్‌ గహ్లోత్, భూపేశ్‌ బఘేల్, డాక్టర్‌ జి.పరమేశ్వరను మహారాష్ట్ర ఏఐసీసీ పరిశీలకులుగా నియామకం. 
2024-11-23 08:41:47

లీడ్‌లోకి వచ్చిన అజిత్‌ పవార్‌

  • బారామతిలో లీడింగ్‌లోకి వచ్చిన అజిత్‌ పవార్‌
  • నాగ్‌పూర్‌ సౌత్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్న డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ 
  • సకోలిలో కాంగ్రెస్‌ అభ్యర్థి నానా పటోలె ముందంజ
  • వర్లీలో ఆదిత్య ఠాక్రే లీడింగ్‌
  • కొప్పిలో ఆధిక్యంలో కొనసాగుతున్న షిండే
2024-11-23 08:41:47

ఢిల్లీ బీజేపీ సెంట్రల్‌ ఆఫీస్‌లో కోలాహలం

  • ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో జిలేబీలు సిద్ధం
  • మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న బీజేపీ నేతలు
  • ఈ నేపథ్యంలో సంబరాలు చేసుకునేందుకు మిఠాయిలు సిద్ధం చేయిస్తున్న వైనం
  • రెండు రాష్ట్రాల ఎగ్జిట్‌పోల్స్‌లో లీడ్‌ సర్వేలు ఎన్డీయే వైపే మొగ్గు
2024-11-23 08:41:47

మొదలైన క్యాంప్‌ రాజకీయాలు

  • మొదలైన క్యాంప్‌ రాజకీయాలు 
  • మహారాష్ట్రలో కౌంటింగ్‌ కంటే ముందే మొదలైన క్యాంప్‌ రాజకీయాలు 
  • ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే శిబిరానికి తరలించాలని మహా వికాస్‌ అఘాడీ నిర్ణయం 
  • తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త అని ప్రకటించిన సంజయ్‌ రౌత్‌
  • స్వతంత్రులు కూడా తమకే మద్దతంటున్న ఎంవీఏ కూటమి
2024-11-23 08:28:06

పోస్టల్‌ బ్యాలెట్‌లో..

  • కోప్రిలో సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఆధిక్యం
  • బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వెనుకంజ
2024-11-23 08:24:39

కౌంటింగ్‌పై ‘మహా’ ఉత్కంఠ

  • కాసేపటి కిందటే ప్రారంభమైన మహారాష్ట్ర  ఎన్నికల కౌంటింగ్‌
  • బారామతిలోని కౌంటింగ్‌ సెంటర్‌ వద్ద దృశ్యాలు
  • ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌
  • మహయుతి కూటమి నుంచి ఎన్సీపీ(అజిత్‌) తరఫున పోటీ
  • ఎన్సీపీ(పవార్‌) వర్గం నుంచి పోటీ చేస్తున్న యుగేంద్ర శ్రీనివాస్‌ పవార్‌
2024-11-23 08:16:58

కౌంటింగ్‌ ప్రాంభం

  • ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం
  • పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లతో కౌంటింగ్‌ మొదలుట్టిన కౌంటింగ్‌ సిబ్బంది
  • ఆ తర్వాతే ఈవీఎం ఓట్ల లెక్కింపు
  • కౌంటింగ్‌ సెంటర్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు
  • కింగ్‌ మేకర్‌ ఎవరు?
  • మరికొద్ది గంటల్లో వీడనున్న మహా ఉత్కంఠ
2024-11-23 08:02:18

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠ

  • మహా ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో  తెర
  • శనివారం  ఉదయం 8 గంటలకు మొదలుకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
  • ఓటింగ్‌కు సర్వం సిద్ధం చేసిన ఈసీ
  • పోస్టల్‌ బ్యాలెట్‌తో కౌంటింగ్‌ ప్రారంభించనున్న సిబ్బంది
2024-11-23 07:54:13

మహారాష్ట్ర ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

  • ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత
  • లెక్కింపు ప్రక్రియను పరిశీలించేందుకు వస్తున్న ఏజెంట్లను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్న పోలీసులు
2024-11-23 07:47:07

సర్వేలు ఫలించేనా?

  • రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ
  • మహారాష్ట్రలో ఒకే విడలతో నవంబర్‌ 20న జరిగిన పోలింగ్‌
  • ఆ సాయంత్రమే వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌
  • మహాయుతి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉందని సర్వేలు అంచనా
  • విజయం ధీమాలో మహా వికాస్‌ అఘాడి
  • సర్వే ఫలితాల ఆధారంగా జోరుగా బెట్టింగులు
2024-11-23 07:47:07

కూటముల మధ్యే..

  • మహా ఎన్నికల్లో మహాయుతి, మహావికాస్‌ అఘాడీల మధ్యే ప్రధాన పోరు
  • శివసేన, ఎన్‌సీపీ చీలికల నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ
  • మహాయుతి(ఎన్డీయే+): బీజేపీ 149, శివసేన(షిండే) 81, ఎన్‌సీపీ(అజిత్‌) 59 స్థానాల్లో పోటీ
  • మహా వికాస్‌ అఘాడి-MVA(ఇండియా+): కాంగ్రెస్‌ 101, శివసేన(యూబీటీ) 95, ఎన్సీపీ(పవార్‌) 86 స్థానాల్లో పోటీ
  • బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మిత్రపక్షాలకు, కాంగ్రెస్‌ సారథ్యంలోని ఇండియా కూటమి పార్టీలకు అగ్నిపరీక్షలా ఈ ఎన్నికలు

 

 

2024-11-23 07:07:39

72 గంటల్లో ప్రభుత్వ ఏర్పాటు

  • ఈ నెల 26వ తేదీతో ముగియనున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు
  • ఫలితాలు వెల్లడైన 72 గంటల్లో ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిన అవసరం
  • మహారాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య 288
  • ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 145
  • తాజా ఎన్నికల్లో 66.05 శాతం పోలింగ్‌ నమోదు
2024-11-23 07:07:39

ఇవాళే మహా ప్రజల తీర్పు

  • ఇవాళే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
  • ఉదయం 8గం. ప్రారంభం కానున్న కౌంటింగ్‌
  • భారీ బందోబస్తు ఏర్పాటు
  • రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌ కోసం 288 సెంటర్లు ఏర్పాటు చేసిన ఈసీ
2024-11-23 06:56:37
Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement