
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి సునామీలా విరుచుకుపడిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మహాయుతి జయకేతనం ఎగురవేసిన తీరుపై ఉద్ధవ్ స్పందించారు.
‘ఈ ఫలితాలను అస్సలు ఊహించలేదు.అధికార మహాయుతి ఒక కెరటంలా కాకుండా సునామీలా విరుచుకుపడింది.లోక్‌సభ ఎన్నికలు జరిగిన నాలుగు నెలల్లోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఎలా మారాయో అర్థం కావడం లేదు.మహారాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం’అని థాక్రే అన్నారు.
ఇదీ చదవండి: ఉద్ధవ్‌కు ఆటోవాలా షాక్
Comments
Please login to add a commentAdd a comment