comments
-
ఇదేం బాదుడు బాబు...
-
కూటమి ప్రభుత్వంపై సజ్జల ఫైర్
-
‘‘గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు’’
సాక్షి,గుంటూరు:మాజీ ఎంపి నందిగాం సురేష్(Nandigam Suresh) అక్రమ కేసుల్లో అరెస్టై నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్‌పై కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishnareddy) అన్నారు. మంగళవారం(డిసెంబర్ 24) గుంటూరు జైలులో సురేష్‌ను పరామర్శించిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు.‘ఈ రోజు టీడీపీ వ్యవహరించినట్లు మేము వ్యవహరించి ఉంటే ఈ కేసులు అప్పుడే తీసేసుకునేవాళ్ళం. మా పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్ళింది. కోర్టుల్లో ఉన్న లొసుగులను ఉపయోగించి జైల్లో ఉంచుతున్నారు. జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదు. వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదు. నేరుగా సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్‌ను ఎలా ఉంచాలి?అనేది చెబుతున్నారు... ఇవన్నీ కూడా మౌనంగానే భరిస్తున్నాం. వైఎస్సార్సీపిని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్ట్ చేస్తున్నారు. గతంలో ముప్పై ఏళ్ళ క్రితం నక్సలైట్లను అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని అరెస్ట్ చేస్తున్నారు. వేధించడం అంటే ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలి.కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్తకొత్త పద్దతులు ఉపయోగిస్తున్నారు. గుంట నక్కల్లా వ్యవహరించడం వైఎస్సార్సీపీకి తెలియదు. మీ కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైఎస్సార్సీపీకి ఉంది. నాలుగేళ్ళలో మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పినా కూడా వినే పరిస్థితి ఉండదు’అని సజ్జల హెచ్చరించారు. -
ఆరు నెలల్లో మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు: అమర్నాథ్రెడ్డి
సాక్షి,అన్నమయ్యజిల్లా: అధికారంలోకి రాకముందు ఎన్నోహామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వ పెద్దలు తీరా అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం(డిసెంబర్24) రాజంపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో అమర్నాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు.‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక మునుపు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలో వచ్చిన ఆరు నెలల్లోనే మూడుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఎస్సీ కాలనీలలో విద్యుత్ కనెక్షన్లు తొలగించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అధినేత వైఎస్ జగన్ పిలుపుమేరకు 27న విద్యుత్ ఛార్జీల బాదుడే బాదుడుపై వైఎస్సార్సీపీ పోరాటం చేయనుంది.ప్రతి నియోజక వర్గంలో ర్యాలీలు నిర్వహించి విద్యుత్ స్టేషన్ల ఎదుట ధర్నా చేయనున్నాం. విద్యుత్ వినియోగదారుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. ఈ నిరసన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలి’అని అమర్నాథ్రెడ్డి పిలుపునిచ్చారు. -
కుర్చీ కోసమే మాధవీరెడ్డి పంతం: మేయర్ సురేష్‌బాబు
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా,నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం(డిసెంబర్23) కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన గలాటాపై సురేష్‌బాబు సాక్షి టీవీతో మాట్లాడారు.‘తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు.దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన కార్పొరేషన్లలో మీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారు..?మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే మా ఇంటిపైనే చెత్త వేయించింది.కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్పైకి దండెత్తారు. ఇదెక్కడి సభ్యత?ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..?ఎమ్మెల్యే,పిరాయింపు సభ్యులను సస్పెండ్ చేసినా బయటకు వెళ్ళలేదు.ఎజెండా పేపర్లను చింపి సభను అడ్డుకున్నారు.వాళ్ళని బయటకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారు.పార్టీలకు అతీతంగా మేము గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోలేదు.ప్రజాసమస్యలు చర్చించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా?ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ఎవరూ హర్షించడం లేదు.ఫిరాయింపు సభ్యులు మా పార్టీ సభ్యులపై దాడికి దిగారు.ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య అని ఎవరైనా అంటారా? మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆమె తన హక్కులు ఏంటో ముందు తెలుసుకోవాలి.ఆమె ప్రజాసమస్యల కంటే తన పంతం ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.15 అర్థికసంఘం పనులు ఆమోదించి పంపాలి..కానీ ఆమె సమావేశం జరగనివ్వడం లేదు.బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరిస్తే ఎలా’అని సురేష్‌బాబు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ సమావేశపు ఎజెండాను కడప కార్పొరేషన్ ఏకపక్షంగా ఆమోదించింది. ఎజెండా మొత్తాన్ని ముక్తకంఠంతో ఆమోదిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేతులెత్తారు. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సస్పెండ్ చేసినా అజెండా ఆమోదాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రయత్నించారు. అయితే, మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండాలోని అంశాలకు ఆమోదం దక్కింది. ఇదీ చదవండి: కుర్చీ కోసం ఎమ్మెల్యే దౌర్జన్యం -
చంద్రబాబు ప్రజలను మోసం చేశారు: వెంకట్రామిరెడ్డి
-
బాబును నమ్మినందుకు బాదుడు గిఫ్ట్
-
కూటమి ఆరు నెలల అరాచకాలు చూసిన ప్రజలు సరిదిద్దుకోలేని తప్పు చేశామంటున్నారు
-
ఫార్ములా ఈ-కేసు..డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:ఫార్ములా ఈ కార్ రేసుల కేసుపై బీజేపీ ఎంపీ డీకే అరుణ స్పందించారు. ఈ విషయమై డీకే అరుణ సోమవారం(డిసెంబర్23) సాక్షి టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుకు బీజేపీకి సంబంధం ఏంటి ?ఈ కార్ రేసుల కేసులో ఈడీ తన పని తాను చేస్తోంది. హీరో అల్లు అర్జున్ విషయాన్ని రాజకీయంగా కావాలని రచ్చ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడిని ఖండిస్తున్నా. ఈ విషయంలో ఎంఐఎం,కాంగ్రెస్ ఒక్కటై అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసీతో సీఎం రేవంత్‌రెడ్డి కావాలని ప్రశ్న అడిగించారు’అని డీకే అరుణ చెప్పారు. ఇదీ చదవండి: కేటీఆర్‌కు త్వరలో నోటీసులు..? -
KSR Live Show: పుష్ప.. వివాదం.. పొలిటికల్ వైల్డ్ ఫైర్ గా మారబోతోందా?
-
సీఎం రేవంత్ రెడ్డిపై దాసోజు శ్రావణ్ ఫైర్
-
ఆరు నెలలు కాలేదు జనం నడ్డి విరగ్గొట్టారు
-
కరెంట్ ఛార్జీల పెంపుపై నిరసన తెలపనున్న YSRCP
-
అల్లు అర్జున్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి
-
సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఫైర్
సాక్షి,హైదరాబాద్:సీఎం రేవంత్‌రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.శనివారం(డిసెంబర్21) అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై ఫైర్ అయ్యారు.‘రుణమాఫీ చేస్తానని చెప్పి రేవంత్ మాట తప్పారు. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదు. వానాకాలం రైతుబంధు ఎగ్గొట్టారు. సీఎం వంద శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. వారి ఎమ్మెల్యేలు మాత్రం 70,80 శాతం రుణమాఫీ అయ్యింది అంటున్నారు. రేవంత్ మాటల్లో చిత్త శుద్ధి లేదు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేయలేదు. రైతులను మోసం చేశారవు. రాష్ట్రంలో 25 శాతం మాత్రమే రుణమాఫీ అయ్యింది. ఓటు నోటుకు దొంగ రేవంత్‌రెడ్డి సభలో అన్ని అబద్ధాలు చెబుతున్నాడు.పత్తి, కంది సాగు చేసే రైతులకు రెండో పంటకు రైతు బంధు వేయరా. రాష్ట్రంలో సాగు చేయని భూముల వివరాలు ఇవ్వండని మేము అడిగితే ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదు.రైతు ఆత్మహత్యల మీద అబద్ధాలు చెప్పింది. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం రైతు బంధు ఇచ్చిన తరువాత రైతు ఆత్మహత్యలు తగ్గాయి. రేవంత్‌రెడ్డికి చరిత్ర తెలియదు. తెలంగాణ ఎప్పటికీ సర్ ప్లస్ స్టేట్.పదేండ్లలో లక్ష కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ,రైతు బంధు ద్వారా ఇచ్చాము.పాన్ కార్డులు, ఐటీ ఉద్యోగులు ,ప్రభుత్వ ఉద్యోగులకు రైతు బంధు ఇవ్వం అంటే ఎలా.ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు.రైతు భరోసా మీద వేసిన కమిటీలు అన్ని కాలయాపన కోసమే. ప్రజలు కోరుకున్నది పేరు మార్పిడి కాదు. గుణాత్మకమైన మార్పు కోరుకున్నారు. కేసీఆర్ చెప్పినట్టుగా జరుగుతోంది.కాంగ్రెస్ వస్తే రైతు బంధు కట్ అవుతుంది అన్నాడు. ఇప్పుడు రైతు బంధు కట్ అయ్యింది.స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రైతులు నిలదీయాలి.సంక్రాంతి తరువాత ఎన్నికలు అంటున్నారు ఏ సంక్రాంతి అనేది చెప్పడం లేదు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్‌రెడ్డిని ఎర్రగడ్డకు తీసుకువెళ్లి చూపించండి. 420 హామీలు,ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు నిన్ను వదలం.ప్రజల తరఫున అడుగుతూనే ఉంటాం.ఈడీకి,మోడీకి మేము భయపడం’అని కేటీఆర్ అన్నారు. -
అల్లు అర్జున్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్:సంధ్య థియేటర్ ఘటనపై విచారణ జరుగుతోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో శనివారం(డిసెంబర్ 21) రేవంత్‌రెడ్డి ఈ విషయమై మాట్లాడారు. హీరో అల్లుఅర్జున్ సంథ్య థియేటర్‌కు రావడానికి 2వ తేదీన దరఖాస్తు చేసుకుంటే 3వ తేదీ పోలీసులు తిరస్కరించారు. అయినా కూడా అల్లు అర్జున్ థియేటర్‌కు 4వ తేదీ వచ్చారు. థియేటర్‌కు ఒకటే మార్గం ఉంది భద్రత కల్పించలేమని పోలీసులు చెప్పారు. వేల సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి చేయిదాటింది. సినీహీరో కావడంతో ఒక్కసారిగా అభిమానులు తరలివచ్చారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయింది. ఈ విషయంలో అల్లు అర్జున్ బాధ్యతారహితంగా వ్యవహరించారు. వద్దని వారించినా అల్లుఅర్జున్ అక్కడికి వచ్చారు. బౌన్సర్లు, అభిమానులు పరస్పరం తోసుకోవడం వల్లే తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్‌కు కాలు పోయిందా.. కన్ను పోయిందా.. ఎందుకు పరామర్శలు.. ‘అల్లు అర్జున్‌కు కాలు పోయిందా కన్ను పోయిందా, కిడ్నీలు చెడిపోయాయా ఆయనను అందరూ ఎందుకు పరామర్శిస్తున్నారు. పోలీసులు సంధ్య థియేటర్‌తో పాటు అల్లు అర్జున్‌పై కేసు పెట్టారు. నెలకు 30 వేలు సంపాదించే ఒక అభిమాని టికెట్ రూ.12 వేలు పెట్టి కొన్నాడు. అలాంటి అభిమాని చనిపోతే హీరో కనీసం పట్టించుకోలేదు. పోలీసులు ప్రథమ చికిత్స చేసినప్పటికీ రేవతి బతకలేదు. శ్రీతేజ బ్రెయిన్ డెడ్ అయ్యాడు. తల్లి చనిపోయి, కొడుకు చావు బతుకుల్లో ఉంటే హీరో అల్లు అర్జున్ పట్టించుకోకుండా సినిమా చూసుకుంటూ అక్కడే ఉన్నాడు. చివరకు డీసీపీ వచ్చి అరెస్టు చేస్తామని చెబితే అప్పుడు అక్కడినుంచి హీరో వెళ్లాడు. థియేటర్ సిబ్బంది హీరో దగ్గరికి పోలీసులను వెళ్లనివ్వలేదు. 11 రోజుల తర్వాత హీరో దగ్గరికి పోలీసులు వెళితే దురుసుగా ప్రవర్తించారు. ఈవిషయంలో పదేళ్లు మంత్రిగా చేసిన వ్యక్తి నాపై అడ్డగోలుగా ట్వీట్ చేశాడు. చనిపోయిన వాళ్లను పట్టించుకోకుండా సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. బెనిఫిట్ షోకు అనుమతిచ్చింది ప్రభుత్వమే కదా’ అని సీఎం రేవంత్ అన్నారు. నేను సీఎంగా ఉన్నంత వరకు టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవుతల్లి చనిపోయి పిల్లాడు బ్రెయిన్ డెడ్ అయితే సినిమా వాళ్లు ఎవరైనా పరామర్శకు వెళ్లారా. సినిమా వాళ్లు ఇన్సెంటివ్స్ కావాలంటే తీసుకోండి.. ప్రివిలేజ్ కావాలంటే కుదరదు. ఇక నుంచి టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదు. నేను సీఎంగా ఉన్నంత వరకు అనుమతివ్వను. నేను ఈ కుర్చీలో ఉన్నంత వరకు మీ ఆటలు సాగనివ్వను. సినిమా వాళ్లంటే పోనీ.. రాజకీయ నాయకులు కూడా ఇష్టం వచ్చినట్లు నాపై విమర్శలు చేశారు’అని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏపీలో మళ్లీ ల్యాండ్ సర్వే.. తప్పుడు కూతలు కూసిన ఆ ముగ్గురినీ అరెస్ట్ చేయాలి..
-
అమిత్ షా క్షమాపణ చెప్పాలి..
-
చంద్రబాబు, పవన్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: రవిచంద్రారెడ్డి
-
‘ఫార్ములా-ఈ’ కార్ల రేసింగ్ వ్యవహారంపై చర్చకు సిద్ధంగా ఉన్నాం.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టీకరణ
-
కేటీఆర్ తొలి విజయం సాధించారు: హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసు వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి,బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం(డిసెంబర్ 20) హరీశ్‌రావు తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నాం.రేవంత్ అక్రమంగా బనాయించిన కేసులో అరెస్టు చేయవద్దని హైకోర్టు చెప్పింది. ఇది డొల్ల కేసు అని హైకోర్టు చెప్పింది. ఈ కార్ రేసుల వల్ల తెలంగాణకు లాభం జరిగింది.రూ.600 కోట్ల నష్టం కాదు..రూ.600 కోట్ల లాభం జరిగింది. అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.అవినీతి జరగలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పినప్పుడు ఇక ఏసీబీ కేసు ఎందుకు. హామీలపై ప్రజల దృష్టిని మరల్చి జిమ్మిక్కులు చేస్తున్నారు’అని హరీశ్‌రావు మండిపడ్డారు. కాగా, ఫార్ములా ఈ కార్ రేసుల కేసులో ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1 చేర్చి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీంతో కేటీఆర్ కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ కేసులో హైకోర్టు కేటీఆర్‌కు ఊరటనిచ్చింది. ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని ఏసీబీని ఆదేశించింది. -
ఫార్ములా ఈ కేసు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: ఫార్ములా ఈ రేసుల కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం(డిసెంబర్ 20)భూ భారతి బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ ఫార్ములా ఈ కేసుపై మాట్లాడారు.‘ఫార్ములా ఈ రేసులు నిర్వహించే ఎఫ్ఈవో ప్రతినిధులు నన్ను నా ఇంట్లోనే కలిశారు. రేసుల ఒప్పందంలో రూ.55 కోట్లు కాదు.. రూ.600 కోట్ల వ్యవహారం ఉంది.కేటీఆర్‌తో చీకటి ఒప్పందాలున్నట్లు కంపెనీ ప్రతినిధులే నాకు చెప్పారు.కేసు దర్యాప్తులో ఉండడంతో పాటు కోర్టులో వాదనలు కూడా జరుగుతున్నాయి.ఈ కారణంతోనే కేసు వివరాలు ఎక్కువగా చెప్పడం లేదు.బీఆర్ఎస్ ఫార్ములా ఈ కార్ల వ్యవహారంపై ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదు. ఏసీబీ కేసు పెట్టగానే అసెంబ్లీలో గొడవ చేస్తున్నారు.బీఏసీలో కూడా బీఆర్ఎస్ ఇచ్చిన 9 అంశాల్లో ఈ రేసుల అంశం లేదు’అని రేవంత్‌రెడ్డి అన్నారు. కాగా, ఫార్ములా ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా ఏసీబీ చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కేటీఆర్‌ను హైకోర్టును ఆశ్రయించగా ఆయనకు హైకోర్టులో ఊరట లభించింది. డిసెంబర్ 30 దాకా కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణను 27కు వాయిదా వేసింది. -
దళిత నేతను అవమానించారు.. కాంగ్రెస్ పై తలసాని కామెంట్స్
-
సభలో ఫార్ములా ఈ రేస్ రచ్చ
-
6 నెలలు కాకముందే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది