Uddav Thackrey
-
డిప్యూటీ సీఎం షిండేపై అనుచిత వ్యాఖ్యలు.. శివసేన కార్యకర్తల దాడి
ముంబై: మహారాష్ట్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై కమెడియన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీంతో, ఆగ్రహానికి లోనైన శివసేన కార్యకర్తలు ఓ క్లబ్‌పై దాడి చేశారు. సదరు కమెడియన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని శివసేన కార్యకర్తలు డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు.వివరాల ప్రకారం.. మహారాష్ట్ర ఖార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ‘ది యూనికాంటినెంటల్ క్లబ్’ లో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా షో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమెడియన్ కునాల్ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం, శివసేన నాయకులు ఏక్నాథ్ షిండేను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఏక్నాథ్ షిండేను దేశద్రోహిగా అభివర్ణించారు. షోలో కునాల్.. ‘దిల్ తో పాగల్ హై’ అనే హిందీ పాటను మార్చి పాడారు. 2022లో ఉద్దవ్ థాక్రేకు వెన్నుపోటుకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. దీంతో, శివసేన కార్యకర్తలు ెద్ద సంఖ్యలో ‘ది యూనికాంటినెంటల్ క్లబ్’ వద్దకు చేరుకున్నారు. అనంతరం, క్లబ్‌పై దాడి చేశారు.అనంతరం, కమెడియన్ కునాల్ కమ్రాను అరెస్ట్ చేయాలని శివసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కునాల్‌పై ఫిర్యాదు చేయడానికి పార్టీ సభ్యులు ఖార్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా శివసేన నేతలు మాట్లాడుతూ.. ఉద్దవ్ థాక్రే నుంచి డబ్బులు తీసుకుని కునాల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.Kunal Kamra's stage where he performed has been vandalised by Eknath Shinde's men. His MP is threatening Kunal Kamra. FIRs will be filed on him soonReason : This Video. Please don't watch & make it viral, Eknath Shinde won't not like it. pic.twitter.com/r6oyuV770C— Roshan Rai (@RoshanKrRaii) March 23, 2025మరోవైపు.. ఈ ఘటనపై మాజీ మంత్రి, ఉద్దవ్‌థాక్రే కుమారుడు ఆధిత్య థాక్రే స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆధిత్య థాక్రే.. కునాల్ కమ్రాపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. ఏక్నాథ్ షిండేపై అతడు చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజం. అభద్రతాభావం ఉన్న వ్యక్తులే, పిరికివాళ్లు మాత్రమే ఇలాంటి దాడులు చేస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో తెలుసా?. ముఖ్యమంత్రి, హోంమంత్రిని అణగదొక్కడానికి ఏక్నాథ్ షిండే చేసిన మరో ప్రయత్నం ఇది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.Mindhe’s coward gang breaks the comedy show stage where comedian @kunalkamra88 put out a song on eknath mindhe which was 100% true.Only an insecure coward would react to a song by someone. Btw law and order in the state? Another attempt to undermine the CM and Home Minister…— Aaditya Thackeray (@AUThackeray) March 23, 2025 -
మహారాష్ట్ర: సంజయ్ రౌత్‌పై కార్యకర్తల దాడి?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం చోటుచేసుకుంది. శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్‌పై కార్యకర్తలు దాడి చేసినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసంలోనే ఆయనపై దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియా కథనాలు చర్చనీయాంశంగా మారాయి.ముంబైలోని బాంద్రాలో ఉన్న మాతోశ్రీలో ఉద్దవ్ థాక్రేతో సంజయ్ రౌత్ సమావేశమాయ్యారు. ఈ సమావేశం సందర్భంగా కొంత మంది పార్టీ కార్యకర్తలు సంజయ్‌తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రౌత్.. వైఖరి, ఆయన వ్యాఖ్యల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయినట్టు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి చెందినట్టు కార్యకర్తలు చెప్పారు. దీంతో, వాగ్వాదం తలెత్తింది. ఇందులో భాగంగానే సంజయ్ రౌత్‌పై థాక్రే మద్దతుదారులు దాడి చేసినట్టు సమాచారం. అంతేకాకుండా, సంజయ్ రౌత్‌ను కొన్ని గంటల పాటు ఓ గదిలో ఉంచి తాళం వేసినట్టు తెలుస్తోంది.ఇక, సంజయ్ రౌత్‌పై దాడికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దాడి ఘటన వార్తలపై ఉద్దవ్ థాక్రే కానీ, సంజయ్ రౌత్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. దీంతో, ఈ ఘటనపై మహారాష్ట్రలో మరింత చర్చ జరుగుతోంది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో జరగబోయే బీఎంసీ ఎన్నికలపై ఉద్దవ్ థాక్రే కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు పార్టీ నేత ఆనంద్ దూబే చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, శరద్ పవార్ ఎన్సీపీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.There are multiple reports that Shiv Sena (UBT) workers have beaten Sanjay Raut by locking him in a room in Matoshree.Do you support this action of Shiv Sena workers ? pic.twitter.com/deVAEWRuCj— Megh Updates 🚨™ (@MeghUpdates) January 1, 2025 -
మహారాష్ట్రలో బిగ్ ట్విస్ట్.. యూబీటీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ‘మహావికాస్ అఘాడీ’ కూటమి ఎమ్మెల్యేలు నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. దీంతో, వారి నిర్ణయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి ఎమ్మెల్యేలు కీలక నిర్ణయం తీసుకున్నారు. నేడు జరగాల్సిన ప్రమాణ స్వీకారోత్సవాన్ని ప్రతిపక్ష కూటమి ఎమ్మెల్యేలు బహిష్కరించనున్నారు. ఈ మేరకు విషయాన్ని యూబీటీ ఎమ్మెల్యే ఆధిత్య థాక్రే వెల్లడించారు. ఈ సందర్బంగా థాక్రే మాట్లాడుతూ.. నేడు మహారాష్ట్ర అసెంబ్లీలో యూబీటీ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయడం లేదు. ఎన్నికల సందర్బంగా ఈవీఎంల విషయంలో మాకు అనేక అనుమానాలు ఉన్నాయి.ఈ క్రమంలోనే అందుకు నిరసనగా నేడు ప్రమాణస్వీకారం చేయడం లేదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఫలితాలపై ప్రజలు సంతృప్తిగా లేరు. ఈవీఎంల విషయంలోను తప్పు జరిగింది. ప్రజలిచ్చిన తీర్పు అయితే వారంతా సంతోషంగా ఉండేవారు. అలా జరగలేదు కాబట్టే ఎక్కడా విజయోత్సవాలు కనిపించడం లేదని ఆరోపించారు.మరోవైపు.. ఆధిత్య థాక్రే వ్యాఖ్యలపై మహాయుతి కూటమి నేతలు కౌంటర్ అటాక్ ఇచ్చారు. ప్రతిపక్ష కూటమి నేత చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం. అవసరమైతే న్యాయస్థానాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలి అంటూ సూచనలు చేశారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీలో నేడు ఎమ్మెల్యేలుగా దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌తో సహా పలువురు ప్రమాణం చేశారు. -
‘మహాయుతి’ సునామీలా విరుచుకుపడింది: ఉద్ధవ్ థాక్రే
ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమి సునామీలా విరుచుకుపడిందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో మహాయుతి జయకేతనం ఎగురవేసిన తీరుపై ఉద్ధవ్ స్పందించారు.‘ఈ ఫలితాలను అస్సలు ఊహించలేదు.అధికార మహాయుతి ఒక కెరటంలా కాకుండా సునామీలా విరుచుకుపడింది.లోక్‌సభ ఎన్నికలు జరిగిన నాలుగు నెలల్లోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఎలా మారాయో అర్థం కావడం లేదు.మహారాష్ట్ర హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం’అని థాక్రే అన్నారు.ఇదీ చదవండి: ఉద్ధవ్‌కు ఆటోవాలా షాక్ -
మాజీ సీఎంకు షాకిచ్చిన ‘ఆటోవాలా’
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి విజయం దాదాపు ఖరారైంది. ఎన్డీయే కూటమిలో బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, 39 చోట్ల ఎన్సీపీ హవా కొనసాగుతోంది. మరోవైపు మహా వికాస్ అఘాడీ కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 56 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఉద్దవ్ వర్గం శివసేన 18 చోట్ల, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 12 స్థానాల్లో ఆధిక్యంతో సరిపెట్టుకోగా.. అటు కాంగ్రెస్ కూడా అంతంత మాత్రంగానే 23 చోట్ల తమ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.అయితే ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు మహారాష్ట్ర ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తే.. నిజమైన శివసేన ఏదనే విషయంలో మరాఠీ ప్రజలు స్పష్టం తీర్పును వెల్లడించారు. ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేననే అసలు పార్టీలుగా ప్రజలు తేల్చినట్లు తెలుస్తోంది. బాలాసాహెబ్ ఠాక్రే వారసుడు ఏక్నాథ్ షిండే అని మహా ఓటర్లు తేల్చి చెప్పారు.ఆటో డ్రైవర్ నుంచి సీఎం దాకాఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఏక్‌నాథ్‌షిండే.. ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే ఆపేశారు,.. ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్, బీర్లు తయారు చేసే సంస్థలోపనిచేశారు. శివసేన ఫైర్‌బ్రాండ్ నేత దివంగత ఆనంద్ దిఘే ఆశిస్సులతో 1997లో థానే కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసి నెగ్గడంతో శిండే రాజకీయ ప్రయాణం ఊపందుకుంది. 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఏక్నాథ్.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. శిండే శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌కు ప్రియశిష్యుడు కూడా.మహారాష్ట్రలో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. 2022 జూన్‌లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి భారతీయ జనతా పార్టీతో కలిసి మహాయుతి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. .ఉద్దవ్ వర్గం కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ ఆఘాడీ కూటమిలో కొనసాగుతున్నాయి. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. సీఎం ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని ఈసీ అధికారికంగా గుర్తించింది. ధనుస్సు, బాణం గుర్తును కూడా షిండే వర్గానికే కేటాయించింది.ఇక శనివారం వెలువడుతున్న మహారాష్ట్రలో ఫలితాల్లో ఎన్డీయే కూటమి కూటమి సంచలన విజయాన్ని సొంతం చేసుకునే దిశగా సాగుతోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 288 స్థానాలకు గానూ 221 చోట్ల ఆధిక్యంలో దూసుకుపోతుంది. బీజేపీ అత్యధికంగా 125, శివసేన 56, ఎన్సీపీ 39 చోట్ల ఆధిక్యాన్ని హవా కొనసాగుతోంది. మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవడంతో ఎన్డీయే శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బీజేపీ కేంద్ర పరిశీలకులు నేటి సాయంత్రం ముంబై వెళ్లనున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాలతో భేటీ కానున్నారు. ఇక నవంబర్ 26లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. -
‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎవరివైపు.. ఓటర్లు తీర్పు... -
Maharashtra: ‘వారికి కాంగ్రెస్ ఓటు బ్యాంకే దిక్కు’
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికీ ప్రచారంలో నేతలు పరస్పర విమర్శలు చేసుకున్నారు. తాజాగా సీఎం ఏక్నాథ్ షిండ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తమకు శివసేన కార్యకర్తల ఓట్లు ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గం మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌పై ఆధారపడుతున్నారని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆదివారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పాలక మహాయుతి కూటమిలో ఎలాంటి చీలికలు లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో నిర్ణయాత్మక విజయాన్ని సాధించడంపైనే మేము దృష్టి సారించాం. ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తాం. శివసేనకు చెందిన బేస్ ఓటు బ్యాంక్ మాకు మద్దతుగా ఉన్నారు. కానీ, యూబీటీ చీఫ్ ఉద్దవ్ థాక్రేకు మాత్రం కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌పైనే వాళ్లు ఆధారపడుతున్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) స్వల్ప విజయానికి సొంత బలం కంటే కాంగ్రెస్ మద్దతు వల్లే విజయం సాధించగలిగారు.బాలాసాహెబ్ థాక్రే మహారాష్ట్రకు సైద్ధాంతిక మూలస్తంభం. ఉద్ధవ్ తన కుమారుడే అయినప్పటికీ, అతను కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం ద్వారా బాలాసాహెబ్ సిద్ధాంతాలను విడిచిపెట్టాడు. బాలాసాహెబ్ పార్టీతో ఎప్పుడూ సహవాసం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. శివసేన-బీజేపీ కూటమికి ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఉద్ధవ్ రాజీ పడ్డారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దవ్ ప్రయత్నిస్తున్నారు. బాలాసాహెబ్ పేరును ఉపయోగించుకునే అర్హత కూడా అతనికి లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇక, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. -
బ్యాగుల తనిఖీ: ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ కౌంటర్
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బ్యాగులు తనిఖీ చేయటం మహారాష్ట్రలో రాజకీయంగా చర్చనీయాంశం అయింది. సోమవారం యావత్మాల్లో జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన శివసేన(యూబీటీ) ఉద్ధవ్ ఠాక్రే బ్యాగులను ఎన్నికల అధికారలు సోదా చేయటం వివాదం రేపింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల లగేజీని ఎన్నికల అధికారులు ఇలాగే తనిఖీ చేస్తారా? అని నిలదీశారు. అయితే దీనిపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది.మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ బ్యాగ్‌లను కూడా విమానాశ్రయ అధికారులు అదే విధంగా తనిఖీ చేసిన వీడియోను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. కొందరు నాయకులకు ప్రదర్శనలు ఇవ్వడం అలవాటని పేర్కొంది. ‘‘రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకువెళ్లడం మాత్రమే సరిపోదు. రాజ్యాంగ ప్రక్రియలను కూడా గౌరవించాలి. ప్రతి ఒక్కరూ గౌరవ భావాన్ని కలిగి ఉండాలని మేం కోరుతున్నాం’’ అని బీజేపీ తెలిపింది. ఇక.. నవంబర్ 5న కొల్హాపూర్ విమానాశ్రయంలో ఫడ్నవీస్ బ్యాగ్‌ని అధికారులు తనిఖీ చేశారు.जाऊ द्या, काही नेत्यांना तमाशा करण्याची सवयच असते! हा व्हीडिओ पहा, 7 नोव्हेंबरला यवतमाळ जिल्ह्यात आमचे नेते मा. देवेंद्रजी फडणवीस यांच्या बॅगची तपासणी झाली. पण, त्यांनी ना कोणता व्हीडिओ काढला, ना कोणती आगपाखड केली. तत्पूर्वी, 5 नोव्हेंबर रोजी कोल्हापूर विमानतळावर सुद्धा मा.… pic.twitter.com/ebkuigJE2E— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) November 13, 2024మరోవైపు.. ఉద్ధవ్ ఠాక్రే బ్యాగు తనికీ చేయటంపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఎన్నికలవేళ ప్రామాణిక నియమావళి(ఎస్ఓపీ) మేరకే వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లలో తనిఖీలు చేపడుతున్నట్లు ఈసీ వివరించింది. -
ఐదుగురు రెబెల్స్‌పై ఉద్ధవ్ శివసేన వేటు
ముంబయి:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (ఉద్ధవ్) పార్టీ ఐదుగురు రెబెల్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడం వల్లే వేటు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.పార్టీ టికెట్ దక్కని నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరందరినీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పార్టీ ఆదేశించింది. ఈ ఆదేశాలను వారు పెడచెవిన పెట్టడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ ఆదేశించింది. కాగా,మహారాష్ట్రలో నవంబరు 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. తులసేంద్రపురంలో పూజలు -
Thackeray Vs Milind Deora: ‘ఆదిత్య థాక్రే నాకు తమ్ముడితో సమానం’
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇప్పటికీ నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక, మరో స్థానాల్లో ఇప్పటికీ ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా.. ఆదిత్య థాక్రేపై సీనియర్ నేత మిలింద్ డియోరా బరిలో నిలిచారు. దీంతో, వీరి మధ్య పోరు రసవత్తరంగా మారింది. వీరిద్దరూ వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిచారు.వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మిలింద్ డియోరా మాట్లాడుతూ..‘ఆదిత్య థాక్రేతో వ్యక్తిగతంగా నాకు ఎలాంటి సమస్యలు లేవు. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవు. తన చిన్నతనం నుంచి ఆదిత్య నాకు తెలుసు. ఆదిత్య థాక్రేను నా తమ్ముడిలా భావిస్తాను. దురదృష్టవశాత్తు దేశంలో ట్రెండ్‌గా మారిన స్పీడ్ బ్రేకర్ రాజకీయాలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో ఆదిత్య ఠాక్రే రాజకీయాల్లో కొనసాగుతున్నాడు.ఇదే సమయంలో ఆధిత్య థాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. ఉద్ధవ్ థాక్రే కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్రలో కీలక ప్రాజెక్టులను ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆదిత్య థాక్రే చాలా వాగ్దానాలతో వచ్చారు. కానీ 11 సంవత్సరాల క్రితం మహాలక్ష్మి రేస్ కోర్స్ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకించారు. రాష్ట్ర ఖజానాకు రూ. 14,000 కోట్ల నష్టం కలిగించిన మెట్రో ప్రాజెక్టును ఆలస్యం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్ట్‌ను ఆలస్యం చేశాడని తెలిపారు. ఇదిలా ఉండగా.. మాజీ కేంద్రమంత్రి మిలింద్ డియోరా ఇటీవలే లోక్‌సభ ఎన్నికలకు ముందే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు. తాజాగా వర్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలో నిలిచారు. మరోవైపు.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు గడువు మంగళవారంతో ముగిసింది. కానీ దాదాపు 15 సీట్లను అధికార, ప్రతిపక్ష కూటమి పార్టీలు అధికారికంగా ప్రకటించని పరిస్థితి నెలకొంది. బీజేపీ, శివసేన( ఏక్నాథ్ షిండే వర్గం), ఎన్సీపీ (అజిత్ పవార్ వర్గం) అధికార కూటమి ఇంకా నాలుగు స్థానాలకు అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. అదేవిధంగా ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్ వర్గం), ఎన్‌న్సీపీ( ఎస్పీ వర్గం), కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా వెల్లడించకపోవడం గమనార్హం. #WATCH | Mumbai: Shiv Sena candidate from Worli Assembly seat, Milind Deora holds roadshow ahead of filing his nomination for #MaharashtraElection2024 pic.twitter.com/kt5BpLWhZA— ANI (@ANI) October 29, 2024 -
సీట్ల పంపకం.. కాంగ్రెస్, శివసేన(యూబీటీ)లో విభేదాలు!
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విదర్భలోని సీట్ల విషయంలో కాంగ్రెస్, మిత్రపక్షం శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. విదర్భలో శివసేన (యూబీటీ) 17 సీట్లను కోరుతోంది. అయితే అన్ని సీట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఆసక్తి చూపించటం లేదు. విదర్భలో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసోంది. ఇక.. ముంబై, నాసిక్‌లలో సీట్ల విషయంలో ఇప్పటికే ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే.విదర్భలో మొత్తం 62 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మొత్తం 288 మంది సభ్యుల అసెంబ్లీలో విదర్భ 22 శాతం స్థానాలకు ప్రాతినిధ్యం విశేషం. ఇక్కడ మెజారిటీని సాధించటం అన్ని పార్టీలకు చాలా కీలకం. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో విదర్భలోని 10 లోక్‌సభ స్థానాలకు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ఏడింటిలో విజయం సాధించింది. కాంగ్రెస్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, ఐదు స్థానాలను గెలుచుకుంది. ఇక.. అధికా కూటమిలోని బీజేపీ సైతం రెండు స్థానాలు గెలుచుకుంది.అయితే.. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 62 సీట్లలో కనీసం 8 సీట్లను కోరుతోంది. విదర్భలో కాంగ్రెస్‌కు బలమైన పునాది ఉందనటంలో ఎటువంటి సందేహం లేదని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ అన్నారు. అయితే తమకు కూడా 4-5 మంది ఎంపీలు కూడా ఉన్నారని గుర్తు చేశారు.మరోవైపు.. మహా వికాస్ అఘాడిలో కూటమి నుంచి సేన (యూబీటీ) చీలిక సృష్టిస్తోందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. గత వారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఉద్ధవ్ ఠాక్రే సీట్ల పంపకానికి సహకరించడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తెలిపారు. అయితే ఇరు పార్టీల మధ్య విభేదాల వార్తలను కాంగ్రెస్ ఖండించింది. బీజేపీనే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది.మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌కు చెందిన విజయ్ వాడెట్టివార్ మాట్లాడుతూ.. ‘‘ ఎంవీఏలో 17 సీట్లపై చర్చలు ఇంకా పెండింగ్‌లో ఉంది. కొన్ని సీట్లపై మాకు థాక్రే వర్గంతో వివాదం ఉంది. కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. సీట్ల పంపకం విషయంలో కూడా మూడు పార్టీలు సమయం తీసుకుంటాయి’ అని అన్నారు. ఇక.. అక్టోబర్ 22న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వస్తుందని తెలుస్తోంది. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.చదవండి: కుటుంబ నియంత్రణలో దక్షిణాది సక్సెస్ -
Maha Vikas Aghadi: 200 సీట్లపై ఏకాభిప్రాయం.. శరద్‌పవార్ వెల్లడి
పుణె: మహావికాస్ అఘాడిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా.. కాంగ్రెస్, ఎన్పీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. తమ తరఫున ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సీట్ల పంపకం చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనిచ్చిన సమాచారం మేరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనే విషయంలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) పార్టీలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. హరియాణా ఫలితం ప్రభావం (బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది) మహారాష్ట్ర ఎన్నికలపై ఉండదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎంవీఏ సీఎం అభ్యరి్థని ప్రకటించాలనే శివసేన (యూబీటీ) డిమాండ్‌ను ప్రస్తావించగా మూడు భాగస్వామ్యపక్షాల మధ్య ఈ అంశం పరిష్కారమైందని బదులిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చామని, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి నిర్ణయమవుతారని తెలిపారు. నాందేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ నాందేడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రవీంద్ర చవాన్‌ను ప్రకటించింది. దివంగత ఎంపీ వసంత్ రావు కుమారుడే రవీంద్ర. వసంత్ రావు మృతి చెందడంతో నాందేడ్ స్థానికి ఉపఎన్నిక వచి్చంది. వచ్చేనెల 20న పోలింగ్ జరగనుంది. -
కూలిన శివాజీ విగ్రహం: నిరసనకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలు
ముంబై: గతేడాది నేవీ డే సందర్భంగా డిసెంబర్ 4న సింధుదుర్గ్‌లో ఏర్పాటు చేసిన 35 అడుగుల ఎత్తైన శివాజీ విగ్రహా ఆగస్టు 26 కుప్పకూలింది. ఈ విగ్రహం కూలిపోవటంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్ష మహా వికాస్ అఘాడి తప్పుపడుతూ సీఎం ఏక్నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. శివాజీ విగ్రహం కూలిపోవటంపై సెప్టెంబర్ 1న నిరసన ర్యాలీని చేపడతామని బుధవారం మహావికాస్ అఘాడీ ప్రకటించింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి హుతాత్మా చౌక్ నుంచి ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా సమీపంలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. బుధవారం శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్, నానా పటోల్, సంజయ్ రౌత్‌లు సమావేశమైన అనంతరం నిరసన ర్యాలీని ప్రకటించారు.మరోవైపు.. సీఎం ఏక్నాథ్ షిండే ప్రభుత్వం శివాజీ విగ్రహ నిర్మాణం, ఏర్పాటు విషయంలో అవినీతికి పాల్పడినట్లు ఉద్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు.ఈ ఘటనకు ప్రభుత్వం, నేవి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక.. విగ్రహం కూలడంపై డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆవేదన వ్యక్తం చేశారు. లాతూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘శివాజీ మహారాజ్ మనందరి ఆరాధ్య దైవం. ఆయన విగ్రహం కూలినందుకు మహారాష్ట్రలోని 13కోట్ల మంది ప్రజలకు క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు. -
‘దేవుళ్లకు మించిన వాళ్లమని అనుకోవద్దు’
ముంబై: ఉక్రెయిన్‌లో యుద్దం ఆపగలిగే ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ఆపాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ఉక్రెయిన్‌లోని యుద్ధాన్ని ఆపగలిగే ప్రధాని మోదీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరగుతున్న దాడుల నుంచి కూడా హిందువులను ఖచ్చితంగా రక్షించాలి. బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న హిందువులకు ప్రధాని మోదీ న్యాయం చేయాలి’’ అని అన్నారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిస్థితులు భారత్‌లో కూడా జరుగుతాయా? అని అడిగిన విలేకర్ల ప్రశ్నకు.. ‘‘ఏ దేశంలోనైనా ప్రజలే సుప్రీం. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల సహనాన్ని పరీక్షించకూడదు. అలా చేస్తే ప్రజా కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో బంగ్లాదేశ్‌లో కనిపించింది. అన్నింటికంటే ప్రజాకోర్టే సర్వోన్నతమైంది. దేశ రాజధానిలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను ఉగ్రవాదులు అన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి అందరికీ ఒక హెచ్చరిక. తాము దేవుళ్లకు మించిన వాళ్లమని ఎవరూ అనుకోకూడదు. మమంతా మనుషులమే’’ అని మోదీపై విమర్శలు గుప్పించారు. -
బీజేపీది ‘పవర్ జిహాద్’ పాలిటిక్స్: ఉద్ధవ్ థాక్రే
పుణె:శివసేన(ఉద్ధవ్)పార్టీ అధినేత ఉద్ధవ్ థాక్రే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలను చీల్చి బీజేపీ పవర్జిహాద్కు పాల్పడుతోందని మండిపడ్డారు. పుణెలో శనివారం(ఆగస్టు3) జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఉద్ధవ్‌థాక్రే మాట్లాడారు. మరాఠాలను పానిపట్టు యుద్ధంలో ఓడించిన ఆఫ్ఘన్ రాజు అహ్మద్ షా అబ్దాలి వారసుడే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని విమర్శించారు. ‘బీజేపీ నేతలు మమ్మల్ని ఔరంగజేబ్ ఫ్యాన్ క్లబ్ అని అంటున్నారు. మరి మీరు చేస్తున్నదేంటి పవర్ జిహాద్ కాదా’అని ఉద్ధవ్ ప్రశ్నించారు. ఇటీవల పుణె వచ్చిన అమిత్‌షా మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీల కూటమి మహావికాస్ అఘాడీని ఔరంగజేబ్ ఫ్యాన్ క్లబ్ అని విమర్శించారు. దీనికి ప్రతిగా ఉద్ధవ్ థాక్రే బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చారు. -
అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే టార్గెట్.. సీట్ల పంపకాలపై చర్చలు షురూ
ముంబై: మరికొన్ని నెలల్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార బీజేపీ కూటమికి ఆశించిన స్థానాలు రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలపై గురిపెట్టింది. మరోవైపు ఈ సారి ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలనే ధీమాతో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి పావులు కదుపుతోంది.అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలు ఆగస్టు 7న సమావేశం కానున్నాయి. ముంబైలో జరిగే ఈ కీలక భేటీలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలపై చర్చ జరగనుంది. వీటితోపాటు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల ర్యాఆలీ ప్రణాళికతో సహా ఇతర అంశాలను సమావేశంలో చర్చిస్తామని కాంగ్రెస్ ఎల్పీ నేత బాలాసాహెబ్ థోరట్ పేర్కొన్నారు. గెలిచే అభ్యర్ధులను బరిలోకి దింపడం వల్ల సీట్ల మార్పిడి కూడా ఉండే అవకాశం ఉందని చెప్పారు.ఇక 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో కూటమిలో అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్..110 స్థానాల్లో పోటీచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 10 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్ర పవార్) మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్సీపీ దాదాపు 80 స్థానాల్లో పోటీపై కన్నేసినట్లు వినికిడి.. ఇక ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన 100 కంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు వర్గాలు తెలిపాయి.కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 48 లోక్‌సభ స్థానాలకు గాను 30 స్థానాలను ప్రతిపక్ష ఎంవీఏ గెలుచుకుంది. కాంగ్రెస్ రెబల్‌గా ఉన్న ఏకైక స్వతంత్ర ఎంపీ విశాల్ పాటిల్ ఆ పార్టీ అసోసియేట్ మెంబర్‌గా మారడంతో రాష్ట్రంలో ప్రతిపక్ష ఎంపీల సంఖ్య 31కి చేరుకుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేన కూటమి 17 స్థానాలకే పరిమితమైంది. -
‘మీరైనా ఉండాలి.. నేనైనా ఉండాలి’.. ఫడ్నవిస్‌కు ఉద్ధవ్ వార్నింగ్
ముంబై: ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ క్రమంలో శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆయన ఛాలెంజ్ విసిరారు. మీరైనా ఉండాలి.. లేదా నేనైనా ఉండాలని అన్నారు. ముంబైలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.‘‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పాం. మన పార్టీ చీలిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో పార్టీ నేతలు టార్గెట్ చేయబడ్డారు. మనపై అధికారం, డబ్బుతో అణగదొక్కాలని చూశారు. మనల్ని జైల్లో వేయాలని కూడా ప్రయత్నించారు. ఇవన్నీ ధైర్యంగా ఎదుర్కొని.. గెలిచి చూపించాం. నన్ను, ఆదిత్య ఠాక్రేను జైలుకు పంపాలని కుట్ర చేశారు. మీరు(దేవేంద్ర ఫడ్నవిస్) సూటిగా వ్యవహరిస్తే మేము సూటిగా ఉంటాం. కాదని మరోలా ప్రవర్తిస్తే.. మేం కూడా దీటుగా సమాధానం చెబుతాం. అయితే మీరైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి... నేను మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నిక కాలేదు. నేను డైరెక్టుగా ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యాను.సాధ్యమైనంతవరకు పనులు చేశా. ఇవే మీకు చివరి అసెంబ్లీ ఎన్నికల అవుతాయి. బీజేపీ మన పార్టీని చీల్చారు. కానీ శివసేన(యూబీటీ) తుప్పపట్టిన కత్తికాదు. పదునైన ఆయుధం. మేము మహారాష్ట్ర, ముంబైని రక్షించడానికి పోరాడుతాం. బీజేపీ తగిన సమాధానం ఇస్తాం’’ అని అన్నారు. ఇక.. ఉద్ధవ్ వ్యాఖ్యలపై బీజేపీ స్పందిస్తూ.. ఫడ్నవీస్ రాజకీయాలను ముగించే ముందు థాక్రే వంద జన్మలు ఎత్తాలని కౌంటర్ ఇచ్చింది. -
కేదార్‌నాథ్‌లో 228 కేజీల గోల్డ్ స్కామ్: శంకరాచార్య అవిముక్తేశ్వరానంద
ముంబై: కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందన్నారు జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి. సుమారు 228 కిలోల బంగారం మాయమైంది దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు.కాగా, అవిముక్తేశ్వరానంద ఈరోజు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. ఈ క్రమంలో థాక్రే కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్ధవ్ థాక్రేకు అతిపెద్ద ద్రోహం జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఉద్ధవ్ ఠాక్రే త్వరలో తిరిగి ముఖ్యమంత్రి పదవికి రావాలని ఆయన ఆకాంక్షించారు. ఉద్దవ్‌కు కొందరు నమ్మించి మోసం చేశారు. ప్రజలు అన్నీ గమనించాలి అంటూ కామెంట్స్ చేశారు. VIDEO | Swami Avimukteshwaranand Saraswati, Shankaracharya of Jyotirmath was at 'Matoshree' in Mumbai on request of Shiv Sena (UBT) Chief Uddhav Thackeray. Here's what he said interacting with the media. "We follow Hindu religion. We believe in 'Punya' and 'Paap'. 'Vishwasghat'… pic.twitter.com/AZCJaDfHhi— Press Trust of India (@PTI_News) July 15, 2024 ఇదే సమయంలో ప్రధాని మోదీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ తనకు ప్రణామాలు చేశారని, తమ దగ్గరికి వచ్చినవాళ్లను దీవించడం తమ విధానమని అవిముకేశ్వరానంద తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తమకు శత్రువు కాదన్నారు. ఒకవేళ ఆయన తప్పు చేస్తే, ఆ విషయాన్ని ఎత్తి చూపుతామని అన్నారు.మరోవైపు.. కేదార్‌నాథ్‌లో భారీ గోల్డ్ స్కాం జరిగిందని చెప్పుకొచ్చారు. కేదార్నాథ్ ఆలయం నుంచి సుమారు 228 కేజీల బంగారం మాయమైందని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో దర్యాప్తు జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. ఇన్ని రకాల స్కామ్‌లకు పాల్పడి ఇప్పుడు ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని కడుతామని అనడడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో కేదార్నాథ్ ఆలయాన్ని నిర్మించలేం. పన్నెండు జ్యోతిర్లింగాలు నిర్వచించబడ్డాయి. దాని స్థానం స్థిరంగా ఉంది. అది తప్పు అని కామెంట్స్ చేశారు. -
మహారాష్ట్రలో రసవత్తర రాజకీయం.. ఆ ఒక్క ఎమ్మెల్సీ ఎవరు?
ముంబై: మహారాష్ట్రలో పలు శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న వేళ అక్కడి రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీల పెద్దలు అలర్ట్ అయ్యారు. దీంతో, ‘మహా’ రాజకీయం రీసార్ట్‌లకు చేరింది.కాగా, మహారాష్ట్రలో రేపు(శుక్రవారం) 11 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక, 11 స్థానాలకు గాను 12 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక, రాష్ట్రంలో ఇద్దరు అభ్యర్థులు గెలుపునకు అవసరమయ్యే మెజార్టీ ఎంవీఏకు ఉన్నప్పటికీ మూడో అభ్యర్థిని నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపిన శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రే.. మిలింద్ నార్వేకర్‌తో నామినేషన్ వేయించారు. దీంతో మూడో స్థానంలోనూ గెలుపొందేందుకు అవసరమైన ఓట్ల కోసం ఎంవీఏ ప్రయత్నాలు మొదలుపెట్టింది.ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను ప్రత్యేక ప్రాంతాలకు తరలించాయి. క్రాస్ ఓటింగ్ భయం నేపథ్యంలో శివసేన (యూబీటీ), ఏక్నాథ్ శిందే వర్గాలు తమ ఎమ్మెల్యేలను రిసార్టులు, లగ్జరీ హోటళ్లకు తరలించినట్లు తెలిసింది. మరోవైపు.. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) మాత్రం తమ నేతల కోసం ఎలాంటి హోటళ్లను బుక్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. -
ఆ స్కీమ్‌లన్నీ ఓట్ల కోసమే: ఉద్ధవ్ థాక్రే
ముంబయి: మహారాష్ట్రలోని ఏక్‌నాథ్‌షిండే ప్రభుత్వం మహిళల కోసం ప్రకటిస్తున్న స్కీమ్‌లపై శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే మండిపడ్డారు. ఈ స్కీమ్‌లన్నీ త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మూలకు పడేసే స్కీమ్‌లని ఎద్దేవా చేశారు. ఆదివారం(జులై 7) ఛత్రపతి శంభాజీనగర్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో ఉద్ధవ్ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ‘అత్యవసరంగా చాలా స్కీమ్‌లను లాంచ్ చేస్తున్నారు. ఇది ఎన్నికల ముందు మహిళల ఓట్ల కోసం చేసే రాజకీయ స్టంట్ మాత్రమే. స్కీమ్‌లు రెండు మూడు నెలలు మాత్రమే ఉంటాయి. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చినా..రాకపోయినా ఈ స్కీమ్‌లను అమలు చేయరు’అని థాక్రే హెచ్చరించారు. -
ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయం అసక్తికరంగా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించాలని వస్తున్న సూచనను ఎన్సీపీ (శరద్ పవార్) చీఫ్ శరద్ పవార్ తిరస్కరించారు. కూటమి తరఫున శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీలో చర్చలు జరగుతున్న సమయంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.‘మన కూటమే మన ఉమ్మడి సీఎం అభ్యర్థి. ఒక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించటంపై మాకు నమ్మకం లేదు. ఉమ్మడి నాయకత్వమే మా ఫార్మూలా’ అని శరద్ పవార్ అన్నారు.అయితే సీఎం అభ్యర్థి ప్రకటనపై కూటమిలో గురువారం నుంచి అంతర్గతం వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఓవైపు శరద్ పవార్ తిరస్కరిస్తున్న సమయంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్.. ఎంవీకే కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను నిలపాలని అంటున్నారు. శరద్ పవార్ వ్యాఖ్యపై సంజయ్ రౌత్ స్పందించారు.‘శరద్ పవార్ చెబుతుంది నిజమే. ఎంవీకే కూటమి ముందు మెజార్టీ స్థానాలకు సాధించాలి. అయితే రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మరో 23 నుంచి 30 సీట్లను ఇండియా కూటమి గెలచుకొని ఉండేది. ఇది మా పార్టీ అభిప్రాయం. ఏ ప్రభుత్వం, పార్టీ అయినా సీఎం అభ్యర్థి ముఖం లేకుండా ఉండకూడదు. ప్రజలకు కూడా తెలియాలి కదా.. వారు ఎవరికి ఓటు వేస్తున్నారో. ..ప్రజలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరేంద్ర మోదీ ఇలా అభ్యర్థుల ముఖాలను చూసే ఓటు వేశారు. అదేవిధంగా ఎంవీఏ కూటమి తరఫున ఎవరిని సీఎం అభ్యర్థిగా పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఎంవీఏలో మూడు పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాయి. మళ్లీ అసెంబ్లీకి సైతం ఇలాగే ఉమ్మడిగా పోటీ చేయడానికి సిద్ధం’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘ఉద్ధవ్ ఠాక్రే గతంలో ఎంవీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన చేసిన మంచి పనులను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే పలు మిత్రపక్షాలను ముందుండి నడిపించారు’ అని అన్నారు. మహారాష్ట్రలో సెపప్టెంబర్/ అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. -
దేవేంద్ర ఫడ్నవీస్, ఉద్ధవ్ ఠాక్రే రహస్య మీట్.. వీడియో వైరల్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా తొలిరోజైన గురువారం చిరకాల ప్రత్యర్థులు డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అనుకోకుండా ప్రత్యేకంగా కలిశారు. మాజీ సీఎంలైన ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడ్నవీస్ లిఫ్ట్ కోసం ఎదురు చూస్తుండగా ఇద్దరూ ఏదో విషయంపై మాట్లాడుకున్నారు.ఏ విషయంపై మాట్లాడుతకున్నారో తెలియలేదు కానీ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఉద్ధవ్ ఠాక్రే మధ్య పొత్తు ఉండవచ్చన్న రాజకీయ ఊహాగానాలు జోరందుకున్నాయి.అనంతరం ఉద్ధవ్ ఠాక్రేను దీని గురించి మీడియా ప్రశ్నించింది. ఆయన, ఫడ్నవీస్ ఏం మాట్లాడుకున్నారని అని అడిగింది. ‘ఇక నుంచి రహస్య సమావేశాలన్నీ మేం లిఫ్ట్ లోనే చేస్తాం’ అని ఠక్రే సరదాగా అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, తాను లిఫ్ట్‌లో ఉన్నప్పుడు 1965లో విడుదలైన జబ్ జబ్ ఫూల్ ఖిలే సినిమాలోని ‘నువ్వు తిరస్కరించినా, నీ ప్రేమలో పడ్డా’ అన్న పాత పాట ప్రజలకు గుర్తుకు వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే అలాంటిదేమీ లేదని, అనుఉకోకకుండా తామిద్దరం కలిసినట్లు చెప్పారు.#maharashtraassembly : Uddhav Thackarey and Devendra Fadnavis in same lift. pic.twitter.com/YzgcZAcoJi— Sonu Kanojia (@NNsonukanojia) June 27, 2024 మరోవైపు బీజేపీ మంత్రి చంద్రకాంత్ పాటిల్, ఉద్ధవ్ ఠాక్రే మధ్య సరదాగా మరో సంభాషణ జరిగింది. ఠాక్రేకు చంద్రకాంత్ చాక్లెట్ బార్ ఇచ్చారు. దీనికి స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే ‘రేపు మీరు మహారాష్ట్ర ప్రజలకు చాక్లెట్ ఇస్తారు’ అని బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను ఆకర్షించడానికి బడ్జెట్లో తాయిలాలు ప్రకటించే విషయాన్ని ఇలా ప్రస్తావించారు.కాగా ఈ ప్రభుత్వంలో ఇవే చివరి అసెంబ్లీ సమావేశారు. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, శివసేన (ఏక్నాథ్ షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్)ల అధికార కూటమి తక్కువ స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. 48 లోక్‌సభ స్థానాల్లో ఎంవీఏ 30, ఎన్డీఏ కూటమి 17 స్థానాలు గెలుచుకుంది. -
ఎన్డీఏ పరిస్థితి ఇప్పుడు మూడు చక్రాలే: ఉద్ధవ్
ముంబై: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై శివసేన(ఉద్ధవ్) అధినేత ఉద్ధవ్ థాక్రే సెటైర్లు వేశారు. గతంలో మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వాన్ని మూడు చక్రాల రిక్షాగా దేవేంద్ర ఫడ్నవిస్ కామెంట్ చేయడాన్ని ఉద్ధవ్ గుర్తు చేశారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానిది రిక్షా పరిస్థితేనని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు కేంద్రంలో ఉన్నది మోదీ సర్కార్ కాదు.. ఎన్డీయే ప్రభుత్వం. ఇది ఎంతకాలం అధికారంలో కొనసాగుతుందో తెలియదు. నాడు పార్టీని విడిచి మళ్లీ ఇప్పుడు తిరిగి రావాలనుకుంటున్నవారికి మా పార్టీలో చోటు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని పార్టీలో చేర్చుకోం. అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా ఎంవీయే అధికారంలోకి వస్తుంది. అందుకు సమష్టి కృషి ఇప్పటికే ప్రారంభమైంది’అని ఉద్థవ్ తెలిపారు. -
ఉద్ధవ్ థాక్రే నష్టపోయారు: బీజేపీ నేత కీలక కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ వైఖరి మారుతోందా.. పాత మిత్రుడు ఉద్ధవ్ థాక్రేపై బీజేపీకి సాఫ్ట్ కార్నర్ పెరుగుతోందా.. ఉద్ధవ్‌తో కలిసి వెళితేనే త్వరలో రానున్నమరాఠా అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ కష్టం వల్లే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలకు మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ మంగళవారం(జూన్11) వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఉద్ధవ్ ఇండియా కూటమి కోసం కష్టపడ్డారని ప్రశంసించారు.గతంలో ఉద్ధవ్ బీజేపీతో ఉన్నప్పుడు 18 ఎంపీ సీట్లు గెలుచుకుని ఇప్పుడు కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారని గుర్తు చేశారు. కాగా, ప్రస్తతం కేంద్రంలోని మోదీ3.0 ప్రభుత్వంలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు ఉద్ధవ్ థాక్రేను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
Lok sabha elections 2024: మూడో దశలో మహా ఫైట్
మహారాష్ట్రలో మూడో దశ లోక్‌సభ ఎన్నికల సమరం మహాయుతి, మహా వికాస్ అగాడీ రెండు కూటముల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. పశి్చమ మహారాష్ట్రలో ఏడు స్థానాలు, కొంకణ్, మరాఠ్వాడా నుంచి రెండేసి చొప్పున మొత్తం 11 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్ జరగనుంది. బీజేపీ, ఎన్సీపీ, శివసేనతో కూడిన అధికార మహాయుతి కూటమి ఒకవైపు.. కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కూడిన ఎంవీఏ మరోవైపు మోహరించాయి. పలుచోట్ల రెబెల్ అభ్యర్థులూ వాటికి సవాలు విసురుతున్నారు. ఉద్ధవ్, శరద్ వర్గాలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి... ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలో ప్రముఖ పట్టణం. దీని పేరును సర్కారు ఇటీవలే దారాశివ్‌గా మార్చింది. సిట్టింగ్ ఎంపీ ఓం ప్రకాశ్ రాజే నింబాల్కర్ శివసేన (ఉద్ధవ్) తరఫున పోటీలో ఉన్నారు. తుల్జాపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాణా జగ్జీత్ సిన్హా భార్య అర్చనా పాటిల్‌ను మహాయుతి కూటమి బరిలో దింపింది. ఆమె ఇటీవలే ఎన్సీపీ (అజిత్) పారీ్టలో చేరి లోక్‌సభ టికెట్ సంపాదించారు. అర్చన మామ పదమ్సిన్హా పాటిల్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు. అజిత్ పవార్ భార్య సునేత్రకు సోదరుడు కూడా. నింబాల్కర్ కుటుంబంతోనూ వీరికి దగ్గరి బంధుత్వముంది. కానీ వీరి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నింబాల్కర్ తండ్రిని చంపించినట్టు పదమ్సిన్హాపై ఆరోపణలున్నాయి! 2019 లోక్‌సభ ఎన్నికల్లో నింబాల్కర్ ఈ స్థానంలో రాణా జగ్జీత్ సిన్హాను ఓడించడం విశేషం. ఈసారి మహిళల ఓట్లు తనను గెలిపిస్తాయని అర్చన నమ్మకం పెట్టుకున్నారు.సాంగ్లి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ కాక పాటిల్ మళ్లీ బరిలో ఉన్నారు. విపక్ష మహా వికాస్ అగాడీ తరఫున కాంగ్రెస్ నేత విశాల్ పాటిల్ టికెట్ ఆశించగా పొత్తులో భాగంగా ఈ స్థానం శివసేన (ఉద్ధవ్)కు వెళ్లింది. దాంతో ఆయన రెబెల్‌గా పోటీకి దిగారు. శివసేన (ఉద్ధవ్) నుంచి రెజ్లర్ చంద్రహర్ పాటిల్ బరిలో ఉన్నారు. దాంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. కాంగ్రెస్ ఓట్లను విశాల్ చీలుస్తారని, అది బీజేపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.సోలాపూర్ 2014, 2019ల్లో ఇక్కడ వరుసగా బీజేపీయే నెగ్గింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణతీ షిండే బరిలో ఉండటమే అందుకు కారణం. నిజానికి ఆమెను పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ చివరిదాకా ప్రయత్నించి విఫలమైంది. బీజేపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్ సాత్పుతే రంగంలోకి దిగారు. ప్రణతి కూడా సోలాపూర్ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యేనే కావడం విశేషం! ఆమె తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అభ్యరి్థని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా బీజేపీ కొనసాగించింది. 2014లో శరద్ బాన్సోడ్, 2019లో జైసిద్ధేశ్వర్ స్వామి బీజేపీ తరఫున గెలిచారు. ఆ రెండుసార్లూ ఓటమి చవిచూసింది సుశీల్‌కుమార్ షిండేనే! ఈసారి మజ్లిస్ ఇక్కడ అభ్యర్థిని ఉపసంహరించుకోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశం. సోలాపూర్, మాధా స్థానాల్లో విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని బీజేపీ నేతలే అంగీకరిస్తుండటం విశేషం!సతారా మహాయుతి కూటమి తరఫున ఎన్సీపీ (శరద్ పవార్) నేత, కారి్మక నాయకుడు, ఎమ్మెల్సీ శశికాంత్ షిండే బరిలో ఉన్నారు. దాంతో కొల్హాపూర్ మాదిరిగానే ఇక్కడ కూడా బీజేపీ వ్యూహాత్మకంగా ఛత్రపతి శివాజీ వంశీయుడు, రాజ్యసభ ఎంపీ ఉదయన్‌రాజే భొసాలేకు టికెటిచి్చంది. మహాయుతి కూటమి నుంచి ఈ స్థానంలో పోటీ చేయాలని తొలుత ఎన్సీపీ (అజిత్) భావించింది. ఉదయన్‌రాజే భోసాలే పోటీకి ఆసక్తి చూపడంతో ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది.రత్నగిరి–సింధుదుర్గ్ సిట్టింగ్ ఎంపీ, శివసేన (ఉద్ధవ్) నేత వినాయక్ రౌత్ మళ్లీ బరిలో ఉన్నారు. ఆయనపై కేంద్ర మంత్రి నారాయణ్ రాణేను బీజేపీ పోటీకి దింపింది. శివసేన రెండుగా చీలిన తర్వాత జరుగుతున్న ఎన్నిక కావడంతో రెండుసార్లుగా గెలుస్తూ వస్తున్న రౌత్‌కు ఈసారి విజయం తేలిక కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గానికి చెందిన స్థానిక నేతలు, శ్రేణుల ఐక్యతకు ఈ ఎన్నిక పరీక్షగా మారింది.రాయగఢ్ ఇక్కడ పోటీ ప్రధానంగా సిట్టింగ్ ఎంపీ, ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కారే, శివసేన (ఉద్ధవ్) అభ్యర్థి అనంత్ గీతే మధ్యే ఉంది. 2019 ఎన్నికల్లో అనంత్ గీతేపైనే తత్కారే 30 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతకుముందు రెండు పర్యాయాలు వరుసగా అనంత్ గీతేనే ఇక్కడ గెలిచారు.మాధా బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ సిన్హా నాయక్ నింబాల్కర్ మళ్లీ బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సంజయ్మామ విఠల్‌రావు షిండేపై 86 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ మళ్లీ నింబాల్కర్‌కు టికెటివ్వడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ జిల్లా కార్యదర్శి ధైర్యశీల్ మోహిత్ పాటిల్ ఇటీవలే శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి రంగంలోకి దిగి బీజేపీకి గట్టి సవాలు విసురుతున్నారు. మోహిత్‌కు స్థానికంగా బాగా పట్టుండటంతో ఇక్కడ బీజేపీ ఎదురీదుతోందని చెబుతున్నారు.అజిత్కూ ప్రతిష్టాత్మకమే ఎన్సీపీ చీఫ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు కూడా ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. బాబాయి శరద్ పవార్‌తో విభేదించి పార్టీని చీల్చి తన వర్గానికే అసలు ఎన్సీపీగా అధికారిక గుర్తింపు సాధించుకోవడం తెలిసిందే. రాయగఢ్, ఉస్మానాబాద్తో పాటు బారామతిలో విజయం ఆయనకు సవాలుగా మారింది. బారామతిలో అజిత్ భార్య సునేత్ర బరిలో ఉన్నారు. తన మరదలు, శరద్ పవార్ కూతురైన సిట్టింగ్ ఎంపీ సుప్రియా సులేతో ఆమె తలపడుతుండటం విశేషం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘శివసేన, ఎన్సీపీ పార్టీల చీలికకు కారణం వారిపై ప్రేమ’
ముంబై: లోక్‌సభ ఎన్నికల వేళ శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్) పార్టీల చీలికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు పార్టీలు తమ సొంత పార్టీల నుంచి చీలిపోవడానికి కోడుకు, కూతురి మీద చూపించిన ప్రేమే కారణమని అన్నారు. ఆదివారం భండారా జిల్లాలోని సకోలి పట్టణంలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొని మాట్లాడారు. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో శివసేన( ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్ పవార్), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపకంలో విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ పార్టీలను విభజిస్తుందన్న ఆరోపణలపై అమిత్ షా తీవ్రంగా మండిపడ్డారు. ‘శివసేన, ఎన్సీపీల్లో చీలికలు రావడానికి కారణం ఉద్ధవ్‌కు కొడుకు మీద, శరద్ పవార్‌కు కూతురు మీద ప్రేమే కారణం. కూటమిలోని మూడు పార్టీ మహారాష్ట్రకుఘ ఏం మంచి చేశారు’ అని అమిత్ షా ధ్వజమెత్తారు. మరోవైపు.. ఇటీవల ప్రధాని నరేంద్ర ఎన్నికల ప్రచారం పాల్గొని శివసేన(ఉద్ధవ్) పార్టీపై నకిలీ శివసేన అంటూ విమర్శలు గుప్పించారు. ఇటీవల అమిత్ షా.. మహా వికాస్ ఆఘాడీను సరిపోలని విడి భాగాలతో కూడిన ఆటో రిక్షాతో పోల్చుతూ విమర్శలు చేశారు. ఇక.. మహా వికాస్ ఆఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సాంగ్లీ, భీవండి, ముంబై సౌత్ సెంట్రల్ స్థానాలను కాంగ్రెస్ వదులుకున్న విషయం తెలిసిందే. సీట్ల పంపకంలో భాగంగా శివసేన(ఉద్ధవ్) 21 స్థానాలు,ఎన్సీపీ 10 స్థానాలు, కాంగ్రెస్ పది స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. -
శివసేన మోదీ డిగ్రీలా నకిలీ కాదు: ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన నకిలీ శివసేన ఆరోపణలపై శివసేన( ఉద్ధవ్) పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. మరాఠా భూమి పుత్రుల హక్కుల కోసం పోరాడటానికి బాలా సాహేబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని అన్నారు. ‘మరాఠా భూమి పుత్రుల హక్కుల పోరాటం కోసం దివంగత నేత బాల్ ఠాక్రే శివసేనను స్థాపించారు. శివసేన పార్టీనే నకిలీ అంటే.. నరేంద్ర మోదీకి ఉన్న డిగ్రీ కూడా నకిలీనే’ అని ఉద్ధవ్ మండిపడ్డారు. అదేవిధంగా లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఇండియా కూటమి 300 సీట్లను గెలుచుకుందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల మహారాష్ట్రలోని ఓ ర్యాలీలో పాల్గొని ఉద్ధవ్ (శివసేన)పై విమర్శలు చేశారు. ఉద్ధవ్ శివసేన.. నకిలీ శివసేన పార్టీ అని అన్నారు. ‘ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్య పార్టీ డీఎంకే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చింది. కాంగ్రెస్, నకిలీ శివసేన(ఉద్ధవ్) కూడా మహారాష్ట్రలో ర్యాలీల్లో ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు’ అని ప్రధాని మండిపడ్డారు. ఇక..2022లో శివసేన పార్టీ రెండుగా చీలిపోయిన విషయం తెలిసింది. ఏక్నాథ్ షిండే పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎం అయ్యారు. అతనోపాటు వచ్చిన కొందరికి మంత్రి పదవులు కూడా కేటాయించారు. అసలైన శివసేన పార్టీ ఎవరిదని ఉద్ధవ్, షిండే వర్గాలు పిటిషన్లు వేశాయి. దీంతో కోర్టు అనుమతిలో ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించారు. -
అందుకే ఉద్ధవ్‌కు రెబల్‌గా మారా: సీఎం ఏక్నాథ్ షిండే
నాగ్‌పూర్: బాలా సాహేబ్ ఠాక్రే స్థాపించిన శివసేనలో ఏక్నాథ్ షిండే రెబల్ నేతగా మారి.. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. తాను ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ నేతగా మారడానికి గల కారణాన్ని సీఎం ఏక్నాథ్ షిండే వివరించారు. ఆదివారం పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు. కానీ, శివసేన పార్టీలో బాలా సాహేబ్ ఠాక్రే సిద్ధాంతాలకు రాజీపడటం వల్లే ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్‌గా మారాను. బాల సాహేబ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ స్నేహితుల్లా భావించేవారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పార్టీ కార్యకర్తలను పని మనుషులుగా చూశారు’ అని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. బలమైన నేతగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేయాలన్నారు. ఇంట్లో కూర్చుంటే గొప్ప నేతగా ఎదగలేమని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. అదేవిధంగా ప్రతిపక్ష మహావికాస్ ఆఘాఢీకి అభివృద్ది చేయాలనే అజెండా లేదని అన్నారు. అధికార కూటమిలోని ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. అలాగే విదర్భలోని అన్ని సీట్లను అధికార కూటమి కైవసం చేసుకుంటుందని సీఎం షిండే తెలిపారు. ఇక.. 2022 జూన్‌లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బీజేపీకి షాక్.. శివసేనలోకి(ఉద్దవ్) సిట్టింగ్ ఎంపీ
ముంబై: లోక్‌సభ ఎన్నికల ముందు మహారాష్ట్రలో బీజేపీకి షాక్ తగిలింది. నార్త్ మహారాష్ట్రలోని జల్గావ్ ఎంపీ ఉన్మేష్ పాటిల్ ప్రతిపక్ష శివసేనలో(ఉద్ధవ్ వర్గం) చేరారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారిక నివాసం మాతోశ్రీ వద్ద తన సహచరులతో కలిసి పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే జల్గావ్ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన ఉన్మేష్కు ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. స్మితా వాఘ్‌ను సీటు కేటాయించడంతో బీజేపీకి ఆయన రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా శివసేన(ఉద్దవ్ వర్గం) ఇప్పటికే జల్గావ్ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థుల రెండో జాబితాలో భాగంగా కరణ్ పవార్‌ను జల్గావ్ నుంచి బరిలోకి దింపింది. అతని పేరుతో పాటు మరో మూడు నియోజకవర్గాల అభ్యర్థులను(కళ్యాణ్ నుంచి వైశాలి దారేకర్, హత్యనంగలే నుంచి సత్యజీత్ పాటిల్, పాలఘర్ నుంచి భారతి కమ్డి) ప్రకటించింది. దీంతో మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో భాగమైన ఈ పార్టీ ఇప్పటి వరకు 21 పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ మాట్లాడుతూ.. రాజకీయాల్లో మార్పు కోసమే తాను శివసేనలో చేరినట్లు వెల్లడించారు. ప్రతీకారం కోసం కాదని అన్నారు. బీజేపీ యూజ్ అండ్ త్రో విధానాన్ని పాటిస్తుందని మండిపడ్డారు. మహారాష్ట్రలో బీజేపీ ఎదుగుదలకు కృషి చేసింది శివసైనికులేనని అన్నారు. అయితే జల్గావ్ లోక్‌సభకు శివసేన పటీ చేయడం ఇదే తొలిసారి అని ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. 2019 వరకు అవిభక్త శివసేన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీఏ)లో భాగంగా ఉన్నప్పుడు బీజేపీ ఇక్కడి నుంచి పోటీ చేసిందని తెలిపారు. కాగా 48 లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి మే 20 వరకు అయిదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. -
అభ్యర్థుల ప్రకటన.. ఉద్ధవ్ వర్గంపై కాంగ్రెస్ నేత తీవ్ర విమర్శలు
ముంబై: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. శివసేన (ఉద్దవ్ వర్గం)పై కాంగ్రెస్ నేత, మాజీ రాజ్యసభ ఎంపీ సంజయ్ నిరుపమ్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. శివసేన వాయువ్య ముంబై అభ్యర్ధిని కిచిడీ ఛోర్ అంటూ మండిపడ్డారు. కాగా మహా వికాస్ అఘాడి కూటమిలో, ఎన్సీపీ(శరద్చంద్ర పవార్), కాంగ్రెస్, శివసేన(యూబీటీ) పార్టీలు ఉన్నాయి. ఈ క్రమంలో శివసేన బుధవారం 17 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అటు కాంగ్రెస్ కూడా పట్టుబడుతున్న ముంబై సౌత్ సెంట్రల్ స్థానాన్ని అనిల్ దేశాయ్‌కి కేటాయించింది. వాయువ్య ముంబై నుంచి ఎంపీ గంజనన్ కీర్తికర్ కుమారుడు అమోల్‌ను శివసేన పోటీలోకి దింపింది. ఈ విషయంపై నిరుపమ్ స్పందిస్తూ.. అమోల్‌కు టికెట్ ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ముంబై నార్త్-వెస్ట్ స్థానానికి అమోల్ కీర్తికర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం కూటమి ధర్మ ఉల్లంఘనగా పేర్కొన్నారు. శిసేన అభ్యర్థిని ‘కిచిడి చోర్‌గా అభివర్ణించారు. అలాంటి వారి కోసం తాము పనిచేయమని పేర్కొన్నారు. ‘ముంబైలోని ఆరు లోక్ సభ స్థానాల్లో అయిదు చోట్ల శివసేన పోటీ చేస్తుంది. కేవలం ఒక సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది. దీన్ని బట్టి ముంబైలో కాంగ్రెస్‌ను మట్టికరిపించేందుకు శివసేన ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేన ఇలాంటి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఉండకూడదు. దీని వల్ల కాంగ్రెస్‌కు భారీ నష్టం జరుగుతుంది. ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవాలి. లేకపోతే శివసేనతో పొత్తు విరమించుకునే ఆలోచన చేయాలి. ఒకవేళ శివసేన తాము ఒంటరిగా పోరాడగలమని భావిస్తే అది తమ అతిపెద్ద తప్పు. శివసేన ఇలా జాబితాను ప్రకటించడం కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం కోసం వారం రోజులు వేచిచూస్తా. ఆ తర్వాత తను చేయాల్సింది చేస్తా’ నని పేర్కొన్నారు. చదవండి: లిక్కర్ స్కాం కేసు: కేజ్రీవాల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వు.. కిచిడీ స్కామ్‌లో అమోల్‌కు సమన్లు అయితే శివసేన టికెట్ ఇచ్చిన అమోల్‌కు కిచిడీ కుంభకోణంలో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. కరోనా సమయంలో వలస కూలీలకు కిచిడీ పంపిణీ చేసేందుకు ఇచ్చిన కాంట్రాక్టుల విషయంలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఆ కుంభకోణం విచారణలో భాగంగా తాజాగా చర్యలు చేపట్టింది. ఇక మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలున్నాయి. వీటిలో 44 స్థానాలకు మహా వికాస్ అఘాడీ కూటమి పార్టీల మధ్య సర్దుబాటు జరిగింది. ఇందులో భాగంగా శివసేన (యూబీటీ) 19, కాంగ్రెస్ 16, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ పార్టీకి 9 సీట్లను కేటాయించారు. మిగతా నాలుగు స్థానాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈలోపే శివసేన బుధవారం 17 మంది లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించింది. అంతేగాక తమ పార్టీ 22 చోట్ల పోటీ చేయనున్నట్లు సంజయ్ రౌత్ ప్రకటించారు. -
శివసేన(యూబీటీ) తొలి జాబితా విడుదల.. 17 మందికి చోటు
ముంబై:లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ శివసేన (యూబీటీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే.. 17 మంది అభ్యర్థులను శివసేన(యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీనేత సంజయ్ రౌత్ జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కీలకమైన ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్‌కి కేటాయించింది. ఐదు సిట్టింగ్ అభ్యర్థులకు శివసేన(యూబీటీ) మళ్లీ అవకాశం కల్పించింది. ముంబై సౌత్- అరవింద్ సావంత్, ముంబై నార్తీస్ట్- సంజయ్ పాటిల్, ముంబై నార్ట్ వెస్- అమోల్ కిర్తికార్, థానే- రాజన్ విచారే, వినాయక్ రౌత్- రత్నగిరి సింధ్‌దుర్గ్, పర్బానీ-సంజయ్ జాదవ్, ఉస్మానాబాద్- ఓంరాజే నింబాల్కర్ పోటీలో ఉన్నారు. అదేవిధంగా శివసేన (యూబీటీ) ఔరంగాబాద్‌లో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరేను బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే( రాయ్‌గఢ్), అరవింద్ సావంత్(దక్షిణ ముంబై) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.మహావికాస్ ఆఘాడీ భాగస్వామి కాంగ్రెస్ పట్టుబట్టిన సాంగ్లీ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్‌ను పోటీకి దింపింది శివసేన(యూబీటీ). ముత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై.. ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది. हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे.. *मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे. इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF — Sanjay Raut (@rautsanjay61) March 27, 2024 -
బీజేపీ అవమానిస్తే.. మాతో చేరండి: నితిన్ గడ్కరీకి ఉద్ధవ్ సూచన
ముంబై: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరికి వచ్చే ఎన్నికల్లో లోక్‌సభ సీటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో కాషాయ పార్టీ ఆయన్ను పక్కకు పెట్టేసిందా అనే ఊహాగానాలు లేవనెత్తుతున్నాయి. కనీసం రెండో జాబితాలో చోటు దక్కనుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలో మహరాష్ట్ర ప్రతిపక్ష నేత, శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే నితిన్ గడ్కరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవమానం జరిగితే ఆ పార్టీలో నుంచి బయటకు రావాలని సూచించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో విపక్షాలు విజయం సాధించనున్నాయని ఆశాభవం వ్యక్తం చేశారు. యవత్మాల్ జిల్లాలోని పూసాద్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బీజేపీని లక్ష్యంగా చేసుకొని అవినీతి ఆరోపణలు చేసిన మాజీ కాంగ్రెస్ నాయకుడు(ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు) కృపాశంకర్ సింగ్ వంటి వ్యక్తులు, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కాషాయ పార్టీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో ఉన్నారని... అదే నితిన్ గడ్కరీ పేరు మాత్రం లేదని అన్నారు. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం గడ్కరీతో మాట్లాడినట్లు చెప్పారు. ‘మళ్లీ చెబుతున్నా.. మిమ్మల్ని అవమానిస్తే.. బీజేపీని వీడి మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)లో చేరండి.. మీకు విజయాన్ని మేము అందిస్తాం.. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మిమ్మల్ని మంత్రిని చేస్తాం. అధికారులు కలిగిన పదవి ఇస్తాం’ అని పేర్కొన్నారు. కాగా ప్రతిపక్ష ఎంవీఏలో శివసేన(యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. చదవండి: ‘అక్కడ రాముడుంటే.. ఇక్కడ మురుగన్’.. డీంఎంకే కొత్త ప్లాన్? -
ఉద్ధవ్ ఠాక్రేకు రాహుల్ గాంధీ ఫోన్.. సీట్ల పంపకంపై చర్చ!
ముంబై: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీట్ల పంపకం కసరత్తు విషయంలో వేగం పెంచుతోంది. ఈ క్రమంలో శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేసిన సుమారు గంటసేపు మాట్లడినట్లు తెలుస్తోంది. భారత్ జోడో న్యాయ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఉద్ధవ్ ఠాక్రేకు ఫోన్ మాట్లాడటంపై ఇరు పార్టీల్లో సీట్ల పంపంకంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ముంబైలోని ఆరు లోక్‌సభ స్థానాల్లో.. ముంబై సౌత్ సెంట్రల్, ముంబై నార్త్ సెంట్రల్, ముంబై నార్త్ వెస్త్ సగ్మెంట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు ఉద్ధవ్ ఠాక్రే ముంబై సౌత్, ముంబై నార్త్ వెస్ట్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ సెంట్రల్ సీట్లను కలుపుకొని మొత్తం 18 లోక్‌సభ స్థానాల్లో బరిలోకి దిగాలని భావిస్తున్నారు. ఈ సీట్ల సర్దుబాటు ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) మధ్య సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సీట్ల పంపకంపై మాట్లాడినట్లు సమాచారం. మహారాష్ట్రలోని 48 సీట్లలో 8 సీట్ల విషయంలో ఉన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వడానికి రాహుల్ గాంధీ ఉద్ధవ్‌కు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి శివసేన గత 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో 48 సీట్లకు గాను 22 స్థానాల్లో పోటీ చేసి 18 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక.. శివసేనలో చీలిక వచ్చి కొంత మంది ముఖ్యనేతలు ఏక్‌నాథ్‌షిండే వర్గంలో ఉండి బీజేపీలో చేరారు. అదే విధంగా మహాఘట్బంధన్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఎన్సీపీలో సైతం చీలికలు వచ్చి అజిత్ పవార్ వర్గం బీజేపీలో చేరింది. మరోవైపు ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శివసేనతో సీట్ల పంపకం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్‌తో సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ఠాక్రేకు రాహుల్ కాల్ చేయటం చర్చనీయాంశంగా మారింది. -
చవాన్‌కు బీజేపీ రాజ్యసభ సీటు! ఉద్ధవ్ కీలక వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌చవాన్ కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీలో చేరితే బీజేపీ ఆయనకు రాజ్యసభ సీటు కూడా ఆఫర్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ థాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చవాన్‌కు రాజ్యసభ సీటిస్తే బీజేపీ సైనికులను అవమానపరిచినట్లేనన్నారు. గతంలో ఆదర్శ్ హౌజింగ్ సొసైటీ కుంభకోణంలో చవాన్‌పై ఆరోపణలు వచ్చినపుడు ప్రధాని మోదీ, ప్రస్తుత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సైనికులను చవాన్ అవమానపరిచారని చేసిన విమర్శలను ఉద్ధవ్ థాక్రే గుర్తు చేశారు. భారతరత్న అవార్డులపైనా థాక్రే స్పందించారు. బీజేపీ భారతరత్న దుకాణం పెట్టిందని, ఓట్ల కోసం పలు వర్గాలకు చెందిన వారికి ఆ పురస్కారం ఇస్తోందని విమర్శించారు. స్వామినాథన్కకు భారతరత్న ఇస్తే సరిపోదని వ్యవసాయ రంగంలో ఆయన చేసిన సిఫారసులను అమలు చేయాలని కేంద్రానికి సూచించారు. ఇదీ చదవండి.. దీదీకి మద్దతుగా ప్రధానికి రాహుల్ లేఖ -
మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్.. థాక్రే వర్గానికి ఎదురుదెబ్బ?
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో 14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్‌పై ముంబై హైకోర్టు థాక్రే వర్గానికి, స్పీకర్‌కు నోటీసులు జారీ చేసింది. దీంతో, మహారాష్ట్ర రాజకీయం మరోసారి హీటెక్కింది. వివరాల ప్రకారం.. 2022లో చీలిక తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో, స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ ఉద్ధవ్ థాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, సీఎం ఏక్నాథ్ షిండే వర్గం కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రతివాదులందరూ తమ అఫిడవిట్లను దాఖలు చేయాలని గిరీష్ కులకర్ణి, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. 2022లో పార్టీ చీలిక తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టాల కింద ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్ వచ్చింది. షిండేతో సహా అధికార వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ థాక్రే బృందం పిటిషన్లో డిమాండ్ చేసింది. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని షిండే డిమాండ్ చేశారు. అయితే, షిండే వెంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతూ శాసన సభ్యులపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లన్నింటినీ స్పీకర్ తిరస్కరించారు. శివసేన మొత్తం ఎమ్మెల్యేలు 57 మంది కాగా వారిలో అత్యధికులు (37 మంది) షిండేతో పాటే ఉన్నారని స్పీకర్ నిర్ధారించారు. ఉద్ధవ్ థాక్రే సవాల్.. ఇదిలా ఉండగా.. ఏది అసలైన శివసేననో బహిరంగ చర్ చద్వారా తేల్చుకుందామని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, స్పీకర్ రాహుల్ నర్వేకర్‌లకు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌పై ఆయన మంగళవారం స్పందించారు. ‘నేను ఈ పోరాటాన్ని ప్రజా కోర్టులోకి తీసుకెళ్తా. ఈ పోరాటం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యం ఉందా.. లేదా అనేది తేలుతుంది’ థాక్రే స్పష్టం చేశారు. -
Shivsena Row: స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ థాక్రే
ముంబై: ఉద్ధవ్ థాక్రే శివసేన, షిండే శివసేన మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనే అసలైన శివసేన పార్టీ అని ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకార్ ఇటీవల రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌పై తాజాగా ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో పాటు పార్టీ వీడి షిండేతో పాటు వేరు కుంపట్టి పెట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కూడా ఉద్ధవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాగా, జూన్ 2022లో పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత రెండు శివసేన వర్గాలు ఒకరిపై ఒకరు స్పీకర్‌కు అనర్హత పిటిషన్లు ఇచ్చారు. షిండేతో పాటు వెళ్లిన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలపైనా ఉద్ధవ్ వర్గం అనర్హత పిటిషన్లు వేయగా ఉద్ధవ్ వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలపై షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచ్చింది. షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని గుర్తిస్తూ ధనుస్సు బాణం గుర్తును ఎన్నికల కమిషన్ గతేడాది వారికే కేటాయించడం గమనార్హం. ఇదీచదవండి.. విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి : సింధియా -
విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. " విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని కాంగ్రెస్‌కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
ప్రజాస్వామ్యమే గెలిచింది: ఏక్నాథ్ షిండే
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన రాజకీయ పార్టీ అని రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నర్వేకర్ తేల్చేశారు. ఈ తీర్పుపై స్పందించిన సీఎం ఏక్నాథ్ షిండే.. శివ సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్యం మరోసారి విజయం సాధించిందని అన్నారు. శివ సేన- బీజేపీ సంకీర్ణ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షల మంది ఓటర్లు గెలుపొందారని తెలిపారు. "రాష్ట్రంలోని శివసైనికులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేడు ప్రజాస్వామ్యం మరోసారి గెలిచింది. 2019లో శివసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన లక్షలాది మంది ఓటర్లు ఈరోజు విజయం సాధించారు. ఇది శివుడి విజయం. హిందూ హృదయ చక్రవర్తి బాలాసాహెబ్ థాక్రే భావాజాలంతో ఉన్న శివసైనికుల విక్టరీ ఇది." అని ఏక్నాథ్ షిండే ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. "బాలాసాహెబ్, ధర్మవీర్ ఆనంద్ దిఘేల హిందుత్వ భావాజాలానికి మేమే నిజమైన వారసులమని మరోసారి రుజువైంది. నేటి విజయం సత్యం విజయం. సత్యమేవ జయతే." అని అన్నారు. "నేటి ఫలితం ఏ పార్టీ విజయం కాదు. భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విజయం. ప్రజాస్వామ్యంలో మెజారిటీనే ముఖ్యం. శివ సేనాను ఎలక్షన్ కమిషన్ మనకు కేటాయించింది. ఇప్పుడు విల్లు, బాణాలు కూడా మన చేతికి వచ్చాయి. నేటి ఫలితాల నుంచి నియంతృత్వం, రాజవంశం అంతమైంది." "పార్టీని తన ఆస్తిగా భావించి ఎవరూ తన మనసుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోలేరు. ప్రస్తుత తీర్పు పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్తి కాదని పేర్కొంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను కూడా ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా ఉండకూడదు. ఈ తీర్పు అందుకు ఉదాహారణగా ఉంది.' అని షిండే ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: Maharashtra politics: షిండే వర్గమే అసలైన శివసేన -
Uddhav Thackeray: స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య హత్య
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేనపార్టీ అని స్పీకర్ రాహుల్ నర్వాకర్ స్పష్టం చేశారు. దీనిపై శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ ఠాక్రే స్పదిస్తూ.. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటమేనని అన్నారు. స్పీకర్ నిర్ణయం వెల్లడించిన అనంతరం ఉద్ధవ్ మీడియాతో మట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వాకర్ తమ వర్గం మెజర్టీని సరిగా అర్థం చేసుకోలేకపోయరని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇది చాలా సులువైన కేసు అని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా సరైన తీర్పు వెల్లడిస్తే.. స్పీకర్ మాత్రం తాను సుప్రీంకోర్టు కంటే ఉన్నతుడిగా భావించాడని తెలిపారు. తమకు వ్యతిరేకంగా స్పీకర్ తన నిర్ణయం వెల్లడించారని చెప్పారు. అయితే స్పీకర్ రాహుల్ నర్వాకర్ వెల్లడించిన నిర్ణయాన్ని తమ వర్గం(యూబీటీ) తీవ్రంగా తిరస్కరిస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై తాము మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తమకు వ్యతిరేకంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునే ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు.. కోర్టు ధిక్కార కేసు వేస్తుందా? లేదా? అనేది చూడాలని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేయటంతో సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఇక.. 2022 జూన్‌లో ఏక్నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం. చదవండి: Ram Mandir: ‘కాంగ్రెస్ రాముడి ఉనికినే తిరస్కరిస్తోంది’ -
Maharashtra: ఉద్దవ్ ఠాక్రేకు షాక్.. షిండేదే అసలైన శివసేన!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలక నిర్ణయం వెల్లడించారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. 2013 తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగలేదని అన్నారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఏ వర్గం నిజమైన పార్టీ అని తెలపడానికి నిర్ణయించే జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినట్లు శివసేన(యూబీటీ) వర్గం ఎటువంటి ఆధారం సమర్పించలేదని తెలిపారు. శివసేన పార్టీ చీఫ్‌గా ఉద్దవ్ ఠాక్రే కొనసాగాలని ఆ వర్గం నేతల ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ రాహుల్ నార్వేకర్ తిరస్కరించి.. శివసేన పార్టీకి చీఫ్‌గా సీఎం ఏక్నాథ్ షిండేను అడ్డుకోలేమని తెలిపారు. మహారాష్ట్రలో 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుప్రీకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నానని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ అన్నారు. పార్టీ నాయకత్వంపై శవసేనలోని ఇరు వర్గాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మేజార్టీ ఒక్కటే ప్రధామైన అంశమని అన్నారు. నాయకత్వ నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకోని సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల సంఘానికి షిండే, ఉద్దవ్ వర్గాలు సమర్పించిన ఫిర్యాదుల్లో ఏకాభిప్రాయం లేదని తెలిపారు. మహారాష్ట్రలోని శివసేనకు చెందిన 34 ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గడువు బుధవారం ముగిసింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత సీఎం ఎక్నాథ్ షిండే వర్గాల ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయంపై ఇరు వర్గాల్లో ఆసక్తి నెలకొనగా.. స్పీకర్ నిర్ణయంతో ఏక్నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 2022 జూన్‌లో ఏక్నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం. చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..! -
ఉద్ధవ్ థాక్రేపై అయోధ్య రామమందిర ప్రధాన పూజారి ఫైర్
లక్నో: అయోధ్యలో జనవరి 22న జరిగే ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు ఆహ్వానం అందలేదన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ మండిపడ్డారు. ఆలయ మహా సంప్రోక్షణకు శ్రీరాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందజేశామని తెలిపారు. రాముని పేరు చెప్పుకుని ప్రతిపక్షాలే రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రామున్ని నమ్మినవారే ప్రస్తుతం అధికారంలో ఉన్నారని అన్నారు. "రాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు అందుతాయి. రాముని పేరు మీద బీజేపీ రాజకీయం చేస్తున్నారని చెప్పడం పూర్తిగా తప్పు. మన ప్రధానిని ప్రతిచోటా గౌరవిస్తారు. ఆయన తన హయాంలో ఎనలేని కృషి చేశారు. రాజకీయాలు కాదు.. ఇది ఆయన భక్తి” అని ఆచార్య సత్యేంద్ర దాస్ అన్నారు. రామ మందిర ప్రారంభ వేడుకలను బీజేపీ రాజకీయం చేస్తుందని శివసేన(యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవల ఆరోపించారు. తమ పార్టీ ఎన్నికల్లో రాముడిని తమ అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఆచార్య సత్యేంద్ర దాస్.. సంజయ్ రౌత్, ఉద్ధవ్ థాక్రేపై విరుచుకుపడ్డారు. రాముని పేరు ఎవరు వాడుకుంటున్నారో? తెలుసుకోవాలని ప్రశ్నించారు. రామ మందిర ప్రతిష్ఠాపనకు తనకు ఆహ్వానం అందకపోవడంపై థాక్రే బీజేపీని విమర్శించారు. మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చవద్దని అన్నారు. ఒకే పార్టీ చుట్టూ తిరగకూడదని చెప్పారు. రామాలయం ప్రారంభోత్సవం పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. మందిర నిర్మాణం కోసం తన తండ్రి బాల్ థాక్రే చేసిన పోరాటాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఇటీవల రామాలయ వేడుక ఆహ్వానాన్ని సీపీఐ కార్యదర్శి సీతారాం ఏచూరి తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి.. కార్యకర్తలకు కేజ్రీవాల్ పిలుపు -
మిత్రపక్షం శివసేనకు కాంగ్రెస్ షాక్.. అందుకు నో!
ముంబై: మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనకు (ఉద్ధవ్‌వర్గం) కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో 23 సీట్లలో పోటీ చేస్తామంటూ శివసేన చేసిన డిమాండ్‌ను కాంగ్రెస్ తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల కోసం మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమిలో భాగస్వామమ్యులైన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య సీట్ల పంపకం గురించి చర్చించేందుకు నేతలు సమావేశమైన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. కాగా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ఎంవీఏ కూటమీ పేరులో మహారాష్ట్రలో 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే 2022లో శివసేన సీనియర్ నేత ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని రెండుగా చీల్చాడు. బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. దీంతో ఎంవీఏ కూటమి అధికారం కోల్పోవాల్సి వచ్చింది. రెండు వర్గాలుగా విడిపోయిన శివసేనలో ఏక్నాథ్ షిండే వైపే మెజార్గీ నేతలు వెళ్లిపోయారు. ఉద్దవ్ వర్గంలో తగినంత అభ్యర్థులు లేకపోయినప్పటికీ 23 స్థానాలు కోరడం సరికాదని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. సీట్లు గెలుచుకోవడంపై నేతలు విభేదాలు మానుకోవాలని అన్నారు. శివసేన 23 సీట్లు డిమాండు చేయొచ్చు, కానీ వాటిని ఏం చేస్తారని ప్రశ్నించారు. సంక్షోభం అనంతరం శివసేన నేతలు వెళ్లిపోయారని, వాళ్లకు అభ్యర్థుల కొరత సమస్య. ఉంది’ అని తెలిపారు. శివసేన, శరద్‌పవార్ ఎన్సీపీలో చీలికలు ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక్కటే స్థిరమైన ఓట్‌షేర్‌తో కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు సమావేశంలో తెలిపారు.పార్టీల మధ్య సర్దుబాటు అవసరమని మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ చవాన్ అన్నారు. ప్రతి పార్టీ సీట్లు ఎక్కువ వాటాను కోరుకుంటున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా శివసేన 23 సీట్ల డిమాండ్ చేయడం ఎక్కవ అని అభిప్రాయపడ్డారు. -
సోదరులిద్దరూ కలిసేనా? ఒకతాటిపైకి ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ ఠాక్రే!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (చీఫ్) రాజ్ ఠాక్రే, ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఒకతాటిపైకి వస్తుండవచ్చనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. దివంగత బాల్ ఠా క్రే స్మారకం విషయంపై చర్చించేందుకు తన సోదరుడైన రాజ్‌ఠాక్రేకి ఫోన్ చేయాల్సి ఉందని ఇటీ వల ఓ ఇంటర్వ్యూలో ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. అయితే అది ఎప్పుడనేది మాత్రం స్పష్టం చేయలేదు. కాగా.. రాజ్–ఉద్ధవ్‌లు ఒకటయితే బాగుంటుందని ఇరు పార్టీల కార్యకర్తలు కొంత కాలంగా కోరుకుంటున్నా రు. అంతేగాకుండా ఇటీవల అక్కడక్కడా ఫ్లె క్సీలు, బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇద్దరు ఠాక్రేలు ఒకటైతే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఎవరు.. ఏ పార్టీలో ఉన్నారో? రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల ఊహించని మార్పులు జరుగుతున్నాయి. నాయకులు ఓ పార్టీ నుంచి బయటపడి ప్రత్యర్థి పారీ్టలో చేరడం, లేదంటే కొత్త పార్టీ ఏర్పాటు వంటివి చేస్తున్నారు. కూటములు ఏర్పడుతున్నాయి దీంతో ఎవరు, ఏ పారీ్టలో ఉన్నారో తెలియని గందరగోళ పరిస్ధితి నెలకొంది. గత సంవత్సరం ఏక్నాథ్ శిందే.. శివసేనను చీల్చి బీజేపీలో చేరారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చకచకా జరిగిపోయాయి. ఈ విషయం నుంచి తేరుకోకముందే మహా వికాస్ ఆఘాడిలో మిత్రపక్షంగా ఉన్న నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ కూడా బయటపడ్డారు. పార్టీని చీల్చి తన మద్దతుదారులతో ఆయన బీజేపీ ప్రభుత్వంలో చేరారు. వారికి కొన్ని మంత్రిపదవులు సైతం లభించాయి. అందరూ స్వార్థ రాజకీయాలు చేస్తున్న వేళ.. వీరెందుకు (రాజ్–ఉద్ధవ్) ఒకటి కాకూడదనే అంశాన్ని ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు తెరమీదకు తెచ్చారు. బీజేపీ నుంచి ప్రతికూల సంకేతాలు.. బీజేపీతో సాన్నిహిత్యంగా మెలుగుతున్న తీరును బట్టి ఆ పారీ్టతో పొత్తు పెట్టుకుంటుండవచ్చని అప్పట్లో అందరు భావించారు. కానీ ఉత్తర భారతీయుల ఓట్లను దృష్టిలో ఉంచుకుని రాజ్‌ఠాక్రేకు కొంత దూరంగా ఉంచడమే ఉత్తమమని బీజేపీ వర్గాలు భావించాయి. ఆ తరువాత మసీదులపై లౌడ్స్పీకర్లు తొలగించాలని చేపట్టిన ఆందోళన రాజ్‌ను బీజేపీకి మరింత దగ్గర చేసింది. ఈ నేపథ్యంలోనే దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ శిందే, చంద్రకాంత్ పాటిల్సహా పలువురు బీజేపీ మంత్రులు, నేతలు రాజ్ ఠాక్రేతో భేటీ అయ్యేందుకు ఆయన నివాసమైన శివాజీపార్క్‌లోని రాజ్‌ఘడ్‌కు వెళ్లడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రాజ్ ఠాక్రే బీజేపీతో జత కట్టడం ఖాయమని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరందుకుంది. కానీ వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏక్నాథ్ శిందే, అజిత్ పవార్ లాంటి ఇద్దరు బలమైన నాయకులు లభించారు. ఫలితంగా బీజేపీతో పొత్తుపై ఎమ్మెన్నెస్ పెట్టుకున్న ఆశలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే.. బాల్ ఠాక్రే స్మారకం విషయంపై స్వయంగా రాజ్ ఠాక్రేకు ఫోన్ చేస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. దీంతో ఇరువురు ఠాక్రేలు స్మారకం అంశంతో పాటు తాజా రాజకీయలు, పొత్తు అంశంపై కూడా చర్చస్తుండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎలా స్పందిస్తారనే దానిపై ఇరు పారీ్టల పదాధికారులు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. ఉద్ధవ్‌తో మైత్రికి ప్రయత్నాలు.. అయితే అప్పటికే రాష్ట్ర రాజకీయాలపై రాజ్ ఠాక్రే నిప్పులు చెరుగుతున్నారు. మనం ఎవరికి ఓటు వేశాం..? మనం ఓటువేసిన ప్రతినిధి ఏ పార్టీలో కొనసాగుతున్నారో తెలుసుకోలేని పరిస్ధితుల్లో ఓటర్లు ఉన్నారని పలుమార్లు అన్నారు. తను భవిష్యత్తులో ఎవరితోను పొత్తుపెట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నట్లు అనేక సందర్బాల్లో వెల్లడించారు. అంతేగాకుండా సోదరులిద్దరూ ఒకటయ్యే విషయంపై ఇదివరకు ఉద్ధవ్‌కు రెండు సార్లు మైత్రి హస్తం చూపానని రాజ్ అన్నారు. కానీ ఏకైక ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెన్నెస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్ధవ్ భావించి ఉండవచ్చని అనేక సంవత్సరాలు వేచి చూశారు. ఉద్ధవ్ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో దూరంగా ఉండడమే ఉత్తమని రాజ్ భావించారు. -
మహారాష్ట్రలో మరో ట్విస్ట్.. పవార్, ఉద్దవ్‌కు బిగ్ షాక్!
ముంబై: మహారాష్ట్రలో మరోసారి పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే, పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సమంత్ సంచలన కామెంట్స్ చేశారు. ఉద్దవ్ వర్గం శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)కి చెందిన 33 మంది ఎమ్మెల్యే తమతో టచ్‌లో ఉన్నారని బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు పొలిటికల్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వివరాల ప్రకారం.. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్‌లో ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు షిండే గ్రూపుతో టచ్‌లో ఉన్నారని మంత్రి ఉదయ్ సమంత్ పేర్కొన్నారు. అలాగే, మహాబలేశ్వర్‌లోని సీఎం షిండేతో మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రహస్యంగా సమావేశమయ్యారని అన్నారు. కాగా, ఉదయ్ సమంత్ ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండేతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. సీఎంకు మద్దతు తెలిపేందుకు రెడీ ఉన్నారని స్పష్టం చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్దవ్ వర్గం అప్రమత్తమైనట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. ఖర్ఘర్ ఘటన తర్వాత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను ఆ పదవి నుంచి తప్పిస్తారనే చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, షిండే వ్యవహార శైలి వల్ల బీజేపీ మంత్రులు, నాయకుల్లో ఆగ్రహం పెరుగుతోందని, సీఎం పలు ఫైళ్లను క్లియర్ చేయడం లేదని సమాచారం. బీజేపీ రాష్ట్ర నేతలు హైకమాండ్‌కు సమాచారం అందించినప్పటికీ, కర్ణాటక ఎన్నికల వరకు వేచి ఉండాలని రాష్ట్ర నాయకత్వానికి చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్.. బీజేపీ నేతలతో టచ్‌లోకి వచ్చినట్టు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో, అజిత్ పవార్ మహారాష్ట్రకు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో అజిత్ పవార్ స్పందించారు. తన చివరి శ్వాస వరకు ఎన్సీపీలోనే ఉంటానని పవార్ స్పష్టం చేశారు. #BREAKING "13 remaining MLAs of the Shiv Sena (UBT), around 20 MLAs & senior Congress leaders too are in touch with CM #EknathShinde," Maharashtra minister #UdaySamant claims.@AruneelS shares more developments in Maharashtra's politics with @prathibhatweets. pic.twitter.com/gNIJUeFz2h — TIMES NOW (@TimesNow) April 28, 2023 ఇది కూడా చదవండి: సినీ ఫక్కీలో బీజేపీ నేత హత్య -
మహా వికాస్ అఘాడీకి కోర్టులో చుక్కెదురు
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో 227 వార్డులుండాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలాగే కొనసాగించాలని ముంబై హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో 236 వార్డులుండాలని దాఖలుచేసిన రెండు పిటిషన్లను తిరస్కరించింది. ఫలితంగా హైకోర్టులో మహా వికాస్ అఘాడీకి గట్టి దెబ్బ తగిలినట్లైంది. అంతేగాకుండా హైకోర్టు తీర్పును సవాలుచేస్తూ మహా వికాస్ అఘాడీ సుప్రీంకోర్టును ఆశ్రయించని పక్షంలో ఓటర్ల జాబితా, వార్డుల రిజర్వేషన్, వార్డుల పునరి్వభజన, ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభ్యంతరాలు తదితర ప్రక్రియ పూర్తిచేయాలి. దీన్ని బట్టి బీఎంసీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. అక్టోబరులో లేదా నవంబరులో అంటే దీపావళిలోపు బీఎంసీ ఎన్నికల నగారా మోగే అవకాశముంది. అఘాడీ ప్రభుత్వంలోనే నిర్ణయం రెండేళ్ల కిందట ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బీఎంసీ వార్డుల సంఖ్య 227 నుంచి 236కు పెంచాలని నిర్ణయం తీసుకుంది. అందుకు వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా పూర్తి చేసింది. ముంబై సిటీ, పశ్చిమ ఉపనగరం, తూర్పు ఉపనగరంలో మూడు చొప్పున ఇలా తొమ్మిది వార్డులు పెరిగాయి. కానీ వార్డుల హద్దులన్నీ తారుమారయ్యాయి. ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతాలన్నీ మరో వార్డులోకి వెళ్లిపోయాయి. దీంతో కచ్చితంగా గెలుస్తామని ధీమాతో ఉన్న సిట్టింగ్ కార్పొరేటర్ల అంచనాలు తారుమారయ్యాయి. కానీ ఏక్నాథ్ షిందే 50 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయడంవల్ల మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత షిందే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 2022 జూన్ ఒకటో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మహా వికాస్ అఘాడీ తీసుకున్న 236 వార్డుల పెంపు నిర్ణయాన్ని రద్దు చేసింది. 2017లో జరిగిన జనగణన ప్రకారం 227 వార్డులు ఉండాలని షిందే, ఫడ్నవీస్ మంత్రివర్గం తీర్మానించింది. కానీ 227 ఉంచాలని షిందే, ఫడ్నవీస్ మంత్రిమండలి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని సవాలుచేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్లు రాజు ఫడ్నేకర్, సమీర్ దేశాయ్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు ఎస్.బి.శక్రే, ఎం.డబ్ల్యూ చాంద్వాని బెంచి ఇరువురు సమర్పించిన పిటిషన్లను కొట్టివేసింది. మూడోసారి వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వార్డుల రిజర్వేషన్ లాటరీ జాబితాను ఇదివరకు రెండుసార్లు రద్దు చేయాల్సి వచి్చంది. ఇప్పుడు తాజాగా కోర్టు తీర్పుతో మూడోసారి వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మొదటిసారి రాష్ట్ర ఎన్నికల సంఘం 2021, మే 31న వార్డుల రిజర్వేషన్ లాటరీ వేసింది. ఆ తరువాత ప్రత్యేక వెనకబడిన తరగతులు (ఓబీసీ) రిజర్వేషన్ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో జూలై 29న మళ్లీ కొత్తగా వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి వచ్చింది. ఇప్పుడు 227 వార్డులు ఉంచాలని షిందే, ఫడ్నవీస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అలాగే కొనసాగించాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మూడోసారి వార్డుల రిజర్వేషన్, వార్డుల పునరి్వభజన చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. 2021 జనగణన జరగకుండా వార్డుల సంఖ్య పెంపు ఎలా? బీఎంసీలో కార్పొరేటర్ల సంఖ్య 2001లో జరిగిన జనగణన ప్రకారం 227 ఉండాలని నిర్ణయించారు. కానీ 2011లో చేపట్టిన జనగణనలో జనాభా పెరిగినప్పటికీ కార్పొరేటర్ల సంఖ్య పెంచలేదు. కాగా 2001 నుంచి 2011 మధ్య కాలంలో ముంబైలో జనాభా 3.87 శాతం పెరిగింది. దీంతో పెరిగిన జనాభా, పెరిగిన నగర విస్తరణను పరిగణంలోకి తీసుకుని కార్పొరేటర్ల సంఖ్య 227 నుంచి 236కు పెంచాలని అప్పటి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ముంబై సిటీ, పశి్చమ, తూర్పు ఉప నగరాల్లో మూడు చొప్పున మొత్తం 9 వార్డులు పెంచింది. కానీ వార్డుల సంఖ్య పెంచాలంటే తాజాగా అంటే 2021లో చేపట్టిన జనగణనను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 2021లో జనగణన జరగనే లేదు. ఇక 9 వార్డులు పెంచాల్సిన అవసరమేముందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ అనేక సార్లు ప్రశ్న లేవనెత్తింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం వార్డుల రిజర్వేషన్ లాటరీ ప్రక్రియ పూర్తిచేసి జాబితా కూడా విడుదల చేసింది. ఆ తరువాత ఓబీసీ రిజర్వేషన్ అమలు కావడంతో రెండోసారి లాటరీ ప్రక్రియ చేపట్టాల్సి వచి్చంది. చివరకు ఏక్నాథ్ షిందే తిరుగుబాటు చేసి శివసేన నుంచి బయటపడటం, ఆ తరువాత నాటకీయ పరిణాల మధ్య షిందే ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడం అన్ని చకచకా జరిగిపోయాయి. దీంతో మçహా వికాస్ అఘాడీ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి ఎప్పటి లాగే వార్డుల సంఖ్య 227 ఉంచాలని నిర్ణయం తీసుకుంది. వార్డుల సంఖ్య తగ్గింపు శివసేనపై ప్రభావం వార్డుల సంఖ్య 236 నుంచి 227కు తగ్గడంవల్ల దీని ప్రభావం శివసేనపై చూపనుంది. వార్డుల పునరి్వభజన, తొమ్మిది వార్డులు తగ్గిపోవడంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో వివిధ పారీ్టలతో పోలిస్తే శివసేనకు ఎక్కువ శాతం నష్టం వాటిళ్లే ప్రమాదముంది. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం తొమ్మిది వార్డులు పెంచాలని అప్పట్లో తీసుకున్న నిర్ణయంతో వార్డులను పునర్విభజన చేశారు. మొత్తం 236 వార్డుల్లో అధిక శాతం శివసేనకు అనుకూలంగా ఉన్నాయి. కానీ తాజాగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమరి్థంచడంతో పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. 2017 ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో శివసేన 84, బీజేపీ 82 స్థానాలను గెలుచుకున్నాయి. ప్రభుత్వాలు మారడంతో ఈ ఏడాది అక్టోబరు లేదా నవంబరులో జరిగే బీఎంసీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా వస్తాయనేది చర్చనీయాంశంగా మారింది. -
మహారాష్ట్రలో ఆనాడు జరిగిందిదే.. మాజీ గవర్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ముంబై: మహారాష్ట్రలో శివసేనకు చెందిన విల్లుబాణం గుర్తుపై రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే.. సీఎం ఏక్నాథ్ షిండేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. కాగా, దీనిపై తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ స్పందించారు. అయితే, కోష్యారీ ఇండియా టుడే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. తమకు మెజార్టీ ఉందని షిండే, ఫడ్నవీస్ చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాతే రాజ్ భవన్లో కార్యక్రమం జరిగింది. అంతే తప్ప గవర్నర్‌గా నా పాత్ర ఏమీ లేదన్నారు. అలాగే.. ఇదే సమయంలో ఉద్ధవ్ థాక్రే తనకు మెజార్టీ ఉందని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తన వద్దకు రాలేదన్నారు. ఏమీ మాట్లాడలేదు. దీంతో, మరో పార్టీ వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది.. చేసింది. రాజ్యాంగం ప్రకారమే అంతా జరిగిందన్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై ప్రఫుల్ పటేల్, శరద్ పవార్, ఛగన్ భుజ్ బల్ (ఎన్సీపీ నేతలు)ను అడిగాను. అయినా ఒక్కరు కూడా.. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ ఉందని లేఖ ఇవ్వలేదు. శివ సైనికుడిని సీఎం చేయాలని అనుకుంటున్నామని మాత్రం చెప్పుకుంటూ వచ్చారంతే అని కోష్యారీ వివరించారు. ఇక, కోష్యారీ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. శివసేన రెండుగా చీలిపోవడం ఆ తర్వాత బీజేపీతో కలిసి షిండే కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎన్నికల కమిషన్ కూడా శివసేన అధికారిక గుర్తు.. విల్లుబాణంను షిండే వర్గానికే కేటాయించింది. -
‘బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా.. హిందుత్వాన్ని వదులుకోలేదు’
ముంబై: బీజేపీతో తెగతెంపులు చేసుకున్నా.. శివసేన (యూబీటీ) ఎప్పుడూ హిందుత్వాన్ని వదులుకోలేదని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ముంబైలో నివసిస్తున్న మరాఠీ ప్రజలు, ఉత్తర భారత ప్రజల మధ్య తామెప్పుడూ వివక్ష చూపలేదు, చూపబోమన్నారు. గత అపార్థాలను మనసులోంచి తొలగించుకోవాలని ఉత్తర భారత సమాజానికి విజ్ఞప్తి చేశారు. ముంబైలో ఉత్తర భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ఉద్దవ్ ఠాక్రే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మోదీని కాపాడకపోయి ఉంటే.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండేవారు కాదన్నారు. హిందుత్వ అంటే ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజలను విభజించడం కాదని అన్నారు. ‘‘నేను బీజేపీతో విభేదించాను, కానీ నేను హిందుత్వాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. బీజేపీ అంటే హిందుత్వ కాదు. ఒకరినొకరు ద్వేషించుకోవడం హిందుత్వం కాదు’’ అన్నారు. బీజేపీ హిందువుల మధ్య చీలికను సృష్టిస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ 25-30 ఏళ్లు రాజకీయపరమైన స్నేహబంధాన్ని కాపాడిందని గుర్తు చేశారు. మతంతో సంబంధం లేకుండా భారత్‌ను ద్వేషించేవారికే బాలాసాహెబ్ వ్యతిరేకమని ప్రస్తావించారు. కానీ బీజేపీ మాత్రం తమని వద్దనుకున్నారని వ్యాఖ్యానించారు. శివసేన, అకాలీదళ్‌తో ఉన్న సుదీర్ఘ బంధానికి బీటలు వారడాన్ని ఉద్దేశించి ఈ విధంగా వ్యాఖ్యానించారు.. తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు బీజేపీతో పొత్తు నుంచి వైదొలిగినట్లు ఠాక్రే చెప్పారు. ‘‘లేకపోతే ఇప్పుడు నా మనుషుల్లో కొందరు మారినట్లే.. నేనూ నా మెడకు బెల్టు పెట్టుకుని బానిసగా పడి ఉండేవాడిని’ అని శివసేన (శిండే) వర్గాన్ని ఉద్దేశించి ఆయన అన్నారు. ఉత్తర భారతీయులను లేదా ముస్లింలను కలిసినప్పుడల్లా, హిందుత్వంపై ప్రశ్నించినప్పుడల్లా తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. చదవండి: ఆసియాలోనే అతిపెద్ద 'ఎయిర్ షో'.. ప్రారంభించిన మోదీ.. ‘మీతో నా భేటీపై విమర్శలు వచ్చాయి.. ముస్లింలను కలిస్తే హిందుత్వాన్ని వదులుకున్నాడని నాపై ఆరోపణలు చేస్తారు. రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ముంబై వచ్చినప్పుడు ఎవరి వంటింటిలోకి వెళ్లాడు? నేనే అలా చేసి ఉంటే ఈ పాటికి హిందూ వ్యతిరేకిని అయిపోయేవాడిని. కానీ ప్రధానమంత్రి అలా చేస్తే మాత్రం ఆయనది చాలా పెద్ద మనసని చెబుతారు. ఇదేం ద్వంద్వ వైఖరి? బోహ్రా వర్గానికి వ్యతిరేకంగా మేం ఎప్పుడూ లేం. వారు మాతోనే ఉన్నారు’ అని ఉద్ధవ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రకు మంచి రోజు ఇక భగత్‌సింగ్ కోశ్యారీ రాజీనామా ఆమోదంపై ఉద్ధవ్ స్పందిస్తూ... ఇది రాష్ట్రానికి మంచిరోజన్నారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ పట్టాభిషికాన్ని ఉత్తర భారతదేశానికి చెందిన పూజారి జరిపించారని, ఈ రోజు శివాజీ మహరాజ్‌ను అవమానించిన వ్యక్తిని వెనక్కి పంపారని ఆయన అన్నారు. -
శిందే వర్గంలో చేరే ప్రసక్తే లేదు.. ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోనే..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గంలో తాను చేరే ప్రసక్తే లేదని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన మహిళా నేత రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలమ్ గోర్హె స్పష్టం చేశారు. తానెప్పటికీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...తాను శిందే వర్గంలో చేరబోతున్నానంటూ మీడియా ఆధారాల్లేని వార్తల్ని రాసిందని, ఆ వార్తల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. శ్రద్ధావాకర్ హత్యకేసులో అఫ్తాబ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించేందుకు మాత్రమే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశానని, ఆ భేటీలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆమె వెల్లడించారు. అదేవిధంగా అదే కార్యక్రమంలో సీఎం శిందే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్‌లు కూడా పాల్గొని బిర్లాను కలిశారని తెలిపారు. చదవండి: నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్లో బీజేపీకి షాక్ తగులుతుందా? -
కూటమికి బీటలు..
-
‘షిందేజీ! ఉద్ధవ్ కోసమే సంజయ్ రౌత్ బెయిల్ సంపాదించినట్లు అనిపిస్తోంది’
‘‘సంజయ్ రౌత్ జైలు నుంచి బయటికి వచ్చాడట..’’ అన్నారు దీపక్ కేసర్కర్! ఆ మాటను ఆయన నాకు బాగా సమీపానికి వచ్చి, మెల్లిగా... నా రెండు చెవుల్లో ఒక చెవికి మాత్రమే వినిపించేలా చెప్పారు. అప్పుడా సమయంలో చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే నా పక్కన ఉన్నారు. ఒకప్పుడు బాల్ ఠాక్రేజీ పక్కన ముప్పై ఏళ్ల పాటు ఉన్నవాళ్లు.. ఇప్పుడు నెలన్నరగా నా పక్కన ఉంటున్నారు. ఠాక్రేజీ జీవించి ఉండగా ఆయనకు వచ్చే ఫోన్లను థాపా, రాజేలే లిఫ్ట్ చేసేవాళ్లు. ఠాక్రేజీ చెప్పదలచుకుంది కూడా వాళ్లే ఫోన్లో అవతలి వైపునకు బట్వాడా చేసేవాళ్లు. ‘‘షిందేజీ, అదేంటంటే.. ’’ అంటూ, వాళ్లిద్దరి వైపు చూస్తూ ఆగారు దీపక్. ‘‘పర్లేదు చెప్పండి దీపక్‌జీ. ఠాక్రేజీ దగ్గర నమ్మకంగా ఉన్న మనుషులు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వైపు వెళ్లకుండా మనవైపు ఉండేందుకు వచ్చారంటే.. సంజయ్ గురించే కాదు, ఉద్ధవ్ గురించి కూడా మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవచ్చు..’’ అన్నాను. ‘‘షిందేజీ! సంజయ్ రౌత్‌ని చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రే కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అతడు బెయిల్ సంపాదించినట్లుగా నాకు అనిపిస్తోంది..’’ అన్నారు దీపక్. ‘‘అతడేమీ దేశభక్తుడు కాదు కదా దీపక్‌జీ.. ఏం చేయడానికైనా సిద్ధమవడానికి..’’ అని నవ్వాను. ‘‘కానీ షిందేజీ, అతడి మౌనం చూస్తుంటే దేశభక్తుడే నయం అనిపించేలా ఉన్నాడు..’’ అన్నారు దీపక్! దీపక్ మునుపెన్నడూ అంత హెచ్చరికగా మాట్లాడ్డం నేను వినలేదు! నా మంత్రివర్గంలో సీనియర్ మినిస్టర్ ఆయన. నాలుగు మినిస్ట్రీలను నడిపిస్తున్నారు. నా కన్నా పదేళ్లు పెద్దవారు. ‘‘దేశభక్తుడిని సైతం జైలు జీవితం మామూలు మనిషిగా మార్చేస్తుందని విన్నాను దీపక్‌జీ! కానీ మీరేం చెబుతున్నారంటే.. జైలుకు వెళ్లిన సంజయ్ రౌత్ అనే ఒక మామూలు మనిషి దేశభక్తుడిగా మారి, జైలు బయటికి వచ్చేశాడని!! అదెలా సాధ్యం?’’ అని అడిగాను. ‘‘జైలు నుంచి బయటికి రాగానే సంజయ్ రౌత్ నేరుగా సెంట్రల్ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్‌కి వెళ్లాడు షిందేజీ! ఆ తర్వాత అతడు సౌత్ ముంబైలోని హనుమాన్ టెంపుల్‌కి వెళ్లాడు. తర్వాత శివాజీ పార్క్‌లోని బాల్ ఠాక్రే మెమోరియల్‌కి వెళ్లాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు! సాయంత్రం 6.50 కి ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతడు విడుదలైతే.. నాహుర్లోని తన ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10.20 అయింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలో అతడు మాట్లాడిన సమయం తక్కువ. మౌనంగా ఉన్న సమయం ఎక్కువ. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది షిందేజీ.. ’’ అన్నారు దీపక్. ‘‘ఆందోళన దేనికి దీపక్‌జీ?!’’ అన్నాను. ‘‘దేనికంటే.. అతడు మాట్లాడిన ఆ తక్కువ సమయంలోనే ఉద్ధవ్‌తో చాలా ఎక్కువ మాట్లాడాడు. మౌనంగా ఉన్న ఆ ఎక్కువ సమయంలోనే మన గురించి చాలా తక్కువగా మౌనం వహించాడు..’’ అన్నారు దీపక్. ‘‘అర్థం కాలేదు దీపక్‌జీ..’’ అన్నాను. ‘‘మూడు నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా ఉద్ధవ్‌దే రియల్ శివసేన అని అతడు అంటున్నాడు షిందేజీ! అంటే మనది రియల్ శివసేన కాదనీ, మీరూ రియల్ ముఖ్యమంత్రి కాదనే కదా అతడి ఉద్దేశం!’’ అన్నారు దీపక్! చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే మాకు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. నవంబర్ 17న ఠాక్రేజీ 10వ వర్ధంతి. ఆ సంస్మరణ సభలో వాళ్లిద్దరి చేత మాట్లాడిస్తే?!వాళ్లే చెబుతారు.. రియల్ శివసేన ఎవరిది కాదో, రియల్ సీఎం ఎవరు కారో?! దీపక్ నా వైపే చూస్తూ ఉన్నారు. ‘‘దీపక్‌జీ! అసలైన దాన్ని ఎవరూ మార్చలేరు. సంజయ్ రౌత్ అనే ఒక దేశభక్త ఎంపీ మార్చగలడా?’’ అన్నాను నవ్వుతూ. -
థాక్రే వర్గానిదే ‘అంధేరీ’.. కానీ, ఇక్కడో సర్ప్రైజ్ఉంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతూ ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసిన తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఉద్ధవ్ థాక్రే వర్గం. ముందునుంచి ఊహించినట్లు అంధేరీ నియోజకవర్గాన్ని థాక్రే నేతృత్వంలోని శివసేన కైవసం చేసుకుంది. ముంబైలోని అంధేరీ(ఈస్ట్) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే 66వేల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. రుతుజా లాట్కేకు మద్దతుగా పలు పార్టీల అభ్యర్థనతో ఈ పోటీ నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో లాట్కే విజయం లాంఛనప్రాయంగానే మారింది. ఊహించినట్లుగానే ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టారు ఓటర్లు. అయితే, ఇక్కడ ఓటర్లు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజా లాట్కేపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లకన్నా నోటా(NOTA)కే ఎక్కువ ఓట్లురావటమే సర్ప్రైజ్గా చెప్పాలి. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే ఈ ఏడాది మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. ముందుగా ఇక్కడ బీజేపీ పోటీ చేయాలని భావించింది. అయితే, ఎన్సీపీ సహా పలు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవాలని, రమేశ్ లాట్కే భార్యకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దీంతో బీజేపీ తప్పుకుంది. బీఎంసీలో క్లర్క్‌గా పని చేస్తున్న లాట్కే.. ఆమె రాజీనామాను ఆమెదించిన తర్వాతే నామినేషన్ వేసేందుకు కోర్టు అంగీకరించింది. ఇదీ చదవండి: క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు -
షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం?
ముంబై: ఎంతో నమ్మకంగా సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీలోనే తిరుగుబాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు ఏక్నాథ్ షిండే. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా ఏక్నాథ్ షిండే వర్గంలోనే చీలకలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ మేరకు వెల్లడించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోని 40 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు పేర్కొంది సామ్నా. ఏక్నాథ్ షిండేను బీజేపీ తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చోబెట్టిందని పేర్కొనటం గమనార్హం. ‘ఆయన ముఖ్యమంత్రి పదవి ఏ క్షణమైనా కోల్పోతారని ప్రతిఒక్కరికి అర్థమైంది. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావించింది. కానీ, అందుకు బీజేపీ నిరాకరించింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చెప్పటం పూర్తిగా తప్పు. 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారిలోని చాలా మంది బీజేపీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ’అని ఉద్ధవ్ థాక్రే వర్గం పేర్కొంది. ఏక్నాథ్ షిండే తనకు తాను, మహారాష్ట్రకు చాలా నష్టం చేశారని, రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టరని పేర్కొంది శివసేన. షిండేను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకోవటం కొనసాగిస్తుందని తెలిపింది. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలను ఉద్ఘాటించింది. ప్రభుత్వం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని, వారంతా సీఎంఓ నియంత్రణలో ఉన్నారని పేర్కొంది. నిర్ణయాలన్నింటిని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్నారని, ఆ నిర్ణయాలను షిండే ప్రకటిస్తున్నారని ఆరోపించింది. ఇదీ చదవండి: పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్.. వరుడికి ఫోన్ చేసి..! -
థాక్రేకు బిగ్ షాక్.. బీజేపీలోకి ఆ నలుగురు ఎమ్మెల్యేలు!
ముంబై: ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి ఇప్పట్లో తగ్గేలా కనిపించటం లేదు. శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వర్గానికి షాక్ మీద షాక్ తగులుతూనే ఉంది. ఇప్పటికే అధికారం కోల్పోయి.. శివసేన గుర్తును కాపాడుకునేందుకే ఇబ్బందులు పడుతున్న థాక్రే వర్గానికి మరో దెబ్బ తగలనుంది. నలుగురు ఎమ్మెల్యేలు అధికార పక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారటా! ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన నలుగురు శివసేన ఎమ్మెల్యేలు అధికార వర్గంలో చేరేందుకు తమతో టచ్‌లో ఉన్నారని కేంద్ర మంత్రి నారాయణ్ రాణే శనివారం వెల్లడించారు. అంధేరీ అసెంబ్లీ ఉప ఎన్నికల వేళ ఎమ్మెల్యేలు అధికారపక్షంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలపటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనేది బయటకు వెల్లడించలేదు రాణే. ‘మొత్తం 56 మంది ఎమ్మెల్యేల్లో కేవలం 6-7 ఎమ్మెల్యేలు ఉన్నారు.(ఉద్ధవ్ థాక్రే వర్గంలో) వారు కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు. కానీ, వారి పేర్లు నేను వెల్లడించను.’ అని తెలిపారు. పుణెలో నిర్వహించిన ‘రోజ్‌గార్ మేళా’ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. ఉద్ధవ్ థాక్రేపై విమర్శలు గుప్పించారు రాణే. ఆయన రాజకీయం కేవలం మాతోశ్రీ వరకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. అయితే, ఈ విషయంపై ఉద్ధవ్ థాక్రే వర్గం ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ చేయలేదు. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే ఇదీ చదవండి: ‘బ్రిటన్ ప్రధానిగా బోరిస్ సరైన వ్యక్తి’.. భారత సంతతి ఎంపీ మద్దతు -
పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఉపఎన్నిక నుంచి బీజేపీ ఔట్!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. వచ్చే నెలలో జరగనున్న అంధేరీ(తూర్పు) నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాక్రే, షిండే నేతృత్వంలోని బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే.. కీలక ఉప ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు.. ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావటం గమనార్హం. పోటీ నుంచి తప్పుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనా(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాక్రే కోరిన మరుసటి రోజునే ఈ మేరకు ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్కులే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం బీజేపీని తప్పుకోవాలని సూచించారు. అలాగే.. ఉద్ధవ్ థాక్రే వర్గం అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎన్ఎన్ఎస్ చీఫ్ కోరారు. నాగ్‌పూర్‌లో చంద్రశేఖర్ బవన్కులే అంధేరీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణించినప్పుడు ఆ స్థానంలో వారి బంధువులపై ఎవరూ పోటీ చేయకూడదనే రాష్ట్ర సంప్రదాయం ప్రకారం తమ అభ్యర్థి ముర్జి పటేల్ తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఉద్ధవ్ థాక్రే వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు మార్గం సుగమమైంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించటంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ఆయన భార్య రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Shiv Sena Symbol: గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు -
గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు
సాక్షి, ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండేకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు కొత్త వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఇరువర్గాల అభ్యర్థుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ గుర్తుపై సమతా పార్టీ, శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తుపై సిక్కులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటిని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో అంధేరీ ఉప ఎన్నిక వివాదాస్పదంగా మారే ప్రమాదం ఏర్పడింది. అభ్యర్థులకు కొత్త చిక్కులు... ఠాక్రే వర్గం తరఫున పోటీ చేస్తున్న రుతుజా లట్కే, బీజేపీ తరఫున పోటీచేస్తున్న మూర్జీ పటేల్ శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. శనివారం నుంచి ప్రచారం చేయడం ప్రారంభించారు. కాని గుర్తుల కేటాయింపుపై కొత్త వివాదం తెరమీదకు రావడంతో ఇరు పార్టీల అభ్యర్ధులు అయోమయ స్ధితిలో ఉన్నారు. నవంబర్ మూడో తేదీన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతకు ముందు నుంచే శివసేన తమదేనంటూ ఉద్ధవ్ వర్గం, కాదు అసలైన వారసులం మేమేనని, మాకే మెజార్టీ ఉందని ఇటు శిండే వర్గం మధ్య వాగ్వాదం మొదలైన సంగతి తెలిసింది. చివరకు ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాని సుప్రీం కోర్టు ఈ వివాదం పరిష్కరించే బాధ్యతలు ఎన్నికల సంఘానికే కట్టబెట్టింది. దీంతో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు గాని, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తుగాని ఎవరూ, ఎక్కడా వినియోగించరాదని ఎన్నికల సంఘం హెచ్చరించింది. అంతేగాకుండా మూడు గుర్తులు, మూడు పార్టీ పేర్లు మీరే సూచించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ మేరకు ఉద్ధవ్, శిండే వర్గాలు మూడు పార్టీ గుర్తులు, మూడు పార్టీ పేర్ల చొప్పున సూచించడంతో అందులోంచి ఠాక్రే వర్గానికి కాగడ, శిండే వర్గానికి కత్తులు–డాలు (తల్వార్–డాల్) కేటాయించిన విషయం తెలిసిందే. కాని మత సామరస్యాలకు సంబంధించిన గుర్తులు కేటాయించరాదని ఎన్నికల సంఘానికి నియమాలున్నాయి. ఆ ప్రకారం శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తు సిక్కు సమాజానికి ప్రతీకగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ (మషాల్) గుర్తు 1996 నుంచి తమ వద్దే ఉందని సమతా పార్టీ పేర్కొంది. దీంతో మా పార్టీ గుర్తును మరో పార్టీకి ఎలా కేటాయిస్తారంటూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. చదవండి: మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్ సీనియర్ నేత మరోపక్క అప్పట్లో శిండే సూచించిన త్రిశూలం గుర్తు మత సామరస్యానికి సంబంధించినదంటూ కేటాయించలేదు. సిక్కులకు ప్రతీకగా ఉన్న కత్తులు–డాలు గుర్తు కూడా అదే కోవకు చెందినదంటూ, దీంతో ఆ గర్తును రద్దు చేయాలని సచ్‌ఖండ్ గురుద్వార్‌కు చెందిన మాజీ సభ్యుడు రంజీత్ కామ్టేకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంతేగాకుండా కాగడ గుర్తు రద్దు చేయడమేగాకుండా దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వలంటూ సమతా పార్టీ ఢిల్లీలోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. దీనిపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే. మరోపక్క రంజీత్ కామ్టేకర్ రాసిన లేఖపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. -
శివసేనలో మరో ట్విస్ట్.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఊహించని ఎదురుదెబ్బ!
మహారాష్ట్రలో పొలిటికల్ ట్విస్టులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. శివసేనలో జంపింగ్‌ల పర్వం కారణంగా మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గానికి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఉద్దవ్ వెంట ఉన్న శివసేన కార్యకర్తలు ఒక్కొక్కరుగా సీఎం ఏక్నాథ్ షిండే వర్గంలోకి వెళ్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ముంబైలో ఉద్దవ్ థాక్రే, ఆదిత్యా థాక్రేకు ఊహించని షాక్ తగిలింది. ముంబైలోని వర్లీ ప్రాంతానికి చెందిన దాదాపు 3000 మంది శివసేన, ఉద్దవ్ థాక్రే మద్దతుదారులు ఆదివారం సీఎం షిండే వర్గంలో చేరారు. అయితే, ముంబైలో దసరా సందర్భంగా తన మద్దతుదారులతో ర్యాలీ చేసేందుకు థాక్రే.. ముంబై హైకోర్టు నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్దవ్ మద్దతుదారులు ఇలా హ్యాండిచ్చి.. షిండే వర్గంలో చేరడంతో ఊహించని విధంగా షాక్ తగిలినట్టు అయ్యింది. మరోవైపు.. ముంబైలోని వర్లీ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఆదిత్య థాక్రే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచే ఆదిత్య థాక్రే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కాగా, తాజా పరిణామం కారణంగా ఆదిత్య థాక్రేకు సైతం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక, ఇటీవలే శివసేన గుర్తు గురించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్ థాక్రే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. 3000 Shiv Sena members from Mumbai’s Worli join Eknath Shinde faction >> Watch Now https://t.co/7yfDzFmdS2 #3000 #Shiv #Sena #members #News #NewsUpdate #LatestNews #TodayNews #BreakingNews #Trending #TrendingNews #Headlines pic.twitter.com/kSJzDiPw0R — News7 India (@news7indialive) October 2, 2022 -
షిండే ప్రభుత్వం చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం: ఉద్ధవ్ థాక్రే
ముంబై: మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ) కూటమి భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు సమావేశమయ్యాయి. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతాలను బట్టి ఉమ్మడిగానా లేదా స్వతంత్రంగానా? అనేది నిర్ణయం తీసుకోనున్నారని ఆయా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ..‘మూడు పార్టీలు కలిసికట్టుగా కోవిడ్-19 మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. దాంతో పోలిస్తే ఈ ఆటంకం(షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం) చాలా చిన్నది. దానిని మేము అధిగమించి కలిసే ఉన్నామని దేశానికి సందేశం ఇస్తాం. గతంలో కంటే ఇప్పుడే ఎంవీఏ బలంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము కలిశాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనివ్వండి.’ అని పేర్కొన్నారు ఉద్ధవ్ థాక్రే. అందుకే అక్కడ భేటీ.. ఎంవీఏ భాగస్వామ్య పక్షాలు కలిసే ఉన్నాయని, ఈ సమావేశం ద్వారా ఆ సందేశాన్ని అందిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. ఈ సమావేశం రాష్ట్ర శాసనసభలోని శివసేన శాసనసభాపాక్ష పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మహా వికాస్ అఘాడీతోనే శివసేన ఉందనటమే కాదు.. థాక్రే వర్గమే అధికారిక శివసేన అనే సందేశాన్ని షిండే ప్రభుత్వానికి పంపించేందుకు ఇక్కడ భేటీ అయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. థాక్రేతో పాటు ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్, దిలిప్ వాల్సే పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహేబ్ థోరట్, పృథ్విరాజ్ చావన్, అశోక్ చావన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి రైస్ షేక్ వంటి సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇదీ చదవండి: శివసేన గుర్తు ఎవరికి? 8 ప్రశ్నలు రూపొందించిన సుప్రీంకోర్టు -
ఉద్ధవ్‌కు మరో షాక్.. షిండే వర్గంలోకి సొంత కుటుంబ సభ్యులు!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో నెలకొన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్ధవ్ థాక్రేకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. కీలక నేతలతో పాటు కుటుంబ సభ్యుల్లోనూ కొందరు షిండే వర్గానికి మద్దతు తెలుపుతుండటం ఉద్ధవ్‌కు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. తాజాగా మరో షాక్ తగిలింది. బాల్‌థాక్రే మనుమడు, ఉద్ధవ్ థాక్రే సోదరుడి కుమారుడు నిహార్ థాక్రే.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కలిశారు. వారికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. నిహార్ థాక్రేకు ఇప్పటి వరకు రాజకీయంగా అనుభవం లేకపోయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో షిండేను కలవటం హాట్‌టాపిక్‌గా మారింది. బాల్ థాక్రే పెద్ద కుమారుడు బిందుమాధవ్ థాక్రే కుమారుడే నిహార్ థాక్రే. బిందుమాధవ్.. 1996లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన సినీ నిర్మాతగా ఉండగా.. రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అయితే.. ఆయన కుమారుడు నిహార్.. తాజాగా షిండేను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు.. ఉద్ధవ్ మరో సోదరుడు జైదేవ్ థాక్రే మాజీ భార్యా స్మితా థాక్రే సైతం ఇటీవలే సీఎం షిండేను కలిశారు. నిహార్ థాక్రే ఒక న్యాయవాది. ఆయన బీజేపీ నేత హర్షవర్ధన్ పాటిల్ కుమార్తె అంకితా పాటిల్‌ను గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. హర్షవర్ధన్ పాటిల్ గతంలో కాంగ్రెస్‌లో ఉన్నారు. మంత్రిగానూ సేవలందించారు. వలసలు పెరిగిన క్రమంలో షిండేపై ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేశారు ఉద్ధవ్ థాక్రే. తాను అనారోగ్యానికి గురైనప్పుడు కుట్రలు పన్ని వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇదీ చదవండి: ‘మేమూ ‘యోగి’ స్టైల్లోనే వెళ్తాం’.. బీజేపీ నేత హత్యపై సీఎం హెచ్చరిక! -
పొలిటికల్ హీట్ పెంచిన షిండే ట్వీట్.. ఉద్ధవ్ థాక్రేతో దోస్తీ!
మహారాష్ట్రలో ట్విస్టు మీద ట్విస్టులు చోటుచేసుకుంటూ శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీతో పొత్తుపెట్టుకుని సర్కార్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం, రెబల్ శివసేన షిండే వర్గం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. అనంతరం.. ఉహించని ఘటన చోటుచేసుకుంది. నమ్మకద్రోహి అంటూ పరోక్షంగా షిండేపైనే ఉద్దవ్ థాక్రే విమర్శలు గుప్పించిన వేళ.. బుధవారం ఆసక్తికర పరిణామం జరిగింది. నేడు(బుధవారం) ఉద్ధవ్ థాక్రే పుట్టినరోజు సందర్భంగా ఏక్నాథ్ షిండే ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఏక్నాథ్ షిండే ట్విట్టర్ వేదికగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులైన శ్రీ ఉద్ధవ్ థాక్రే జీకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన చిరకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మ జగదాంబ పాదాలను ప్రార్థిస్తూ.. అంటూ ఓ పోస్టు పెట్టారు. దీంతో, ఏక్నాథ్ షిండే వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. అంతుకు ముందు ఉద్ధవ్ థాక్రే రెబల్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. థాక్రే మీడియాతో మాట్లాడుతూ.. రెబల్స్ నన్ను మోసం చేశారు. పార్టీని చీల్చారు. శివ సేన గౌరవ వ్యవస్థాపకులు బాల్‌థాక్రే ఫొటోను ఓట్ల రాజకీయం కోసం ఉపయోగించుకుంటున్నారు. దమ్ముంటే.. అలా అడుక్కోవడం ఆపండి. మీ మీ సొంత తండ్రుల ఫొటోలను వాడి ఓట్లు సంపాదించుకోండి అంటూ చురకలంటించారు. महाराष्ट्राचे माजी मुख्यमंत्री माननीय श्री.उद्धवजी ठाकरे यांना वाढदिवसाच्या हार्दिक शुभेच्छा. त्यांना निरोगी दीर्घायुष्य लाभो हीच आई जगदंबेच्या चरणी प्रार्थना.... — Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) July 27, 2022 ఇది కూడా చదవండి: నమ్మకద్రోహి.. దమ్ముంటే ఆ పని చెయ్యి: షిండేకు థాక్రే చురకలు -
ఈసీ ఆదేశాలతో ‘శివసేన’పై ఉత్కంఠ.. సుప్రీం కోర్టుకు పంచాయితీ!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీతో పొత్తుతో సీఎం పదవిని అధిరోహించారు. ఆ తర్వాత కొందరు ఎంపీలు సైతం ఆయనకు మద్దతిస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ క్రమంలో శివసేన తమదే నంటూ ఇటు షిండే వర్గాలు పేర్కొనగా.. థాక్రే వర్గాలు తమదేనని బలంగా వాదిస్తున్నాయి. ఇప్పుడు ఈ పంచాయితీ సుప్రీం కోర్టుకు చేరింది. శివసేన ఎవరిదనే విషయాన్ని తేల్చేందుకు సరైన ఆధారాలు సమర్పించాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించాలని కోరింది ఉద్ధవ్ థాక్రే వర్గం. ఎమ్మెల్యేల అనర్హత విషయం తేలే వరకు నిజమైన శివసేన ఎవరిదనే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోలేదని పిటిషన్లో పేర్కొంది థాక్రే వర్గం. ‘ఈనెల 22న ఇచ్చిన ఆదేశాల మేరకు ఈసీని అనుమతించినట్లయితే.. కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్న ఫిరాయింపుల సమస్యలను ఆక్షేపించటమే కాకా.. ఈసీ చర్యల వల్ల కోలుకోలేని దెబ్బపడుతుంది. శాసనసభ్యులుగా అనర్హులైన వారి పిటిషన్లు చెల్లవు. ప్రస్తుత సమయంలో ఈసీ తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి. ’ అని పేర్కొంది. షిండే వర్గం అక్రమంగా తమకు ఎక్కువ మద్దతు ఉందని చెబుతోందని, కృత్రిమ మెజారిటీని సృష్టిస్తోందని ఆరోపించింది ఉద్ధవ్ థాక్రే వర్గం. కోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు, ఇతర అంశాలు పెండింగ్‌లో ఉన్న క్రమంలో ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవటం సరికాదని పేర్కొంది. శివసేన ఎవరిదనే అంశంలో ముందుకు వెళ్లకుండా ఎన్నికల సంఘానికి ఆదేశాలివ్వాలని పిటిషన్లో పేర్కొంది థాక్రే వర్గం. ఇదీ చదవండి: ఇది కదా అసలు ట్విస్ట్.. మహారాష్ట్ర సీఎం షిండే, ఉద్ధవ్ థాక్రేకు బిగ్ షాక్ -
మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. ఆగస్టు 8న ఏం జరుగుతుంది!
Maharashtra Shiv sena.. మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికీ మహారాష్ట్రలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. చివరికి శివసేన ఎవరిది అనే స్థితికి మహా పాలి‘ట్రిక్స్’ చేరుకున్నాయి. అయితే, ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమ వర్గానిదేనని ఏక్నాథ్ వర్గం, ఉద్ధవ్ థాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన పంచాయితీ.. ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల నేతలు పార్టీ తమదేనని ఈసీకి లేఖ రాశాయి. 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మంది ఎమ్మెల్యేలు, 18 మంది లోక్‌సభ ఎంపీల్లో 12 మంది తమకు మద్దతుగా ఉన్నారని షిండే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా.. ఎలక్షన్ సింబల్స్ ఆదేశం 1968 ప్రకారం ఏక్నాథ్ షిండే వర్గం తమకే.. శివసనే పార్టీ గుర్తు విల్లు ధనుస్సు తమకే కేటాయించాలని కోరారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ.. రెండు వర్గాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈసీ.. రెండు వర్గాలకు ఊహించని విధంగా షాకిచ్చింది. శివసేన పార్టీకి ఎవరు సారథ్యం వహించాలో చెప్పే ఆధారాలు, రుజువులను డాక్యుమెంటరీ రూపంలో తమకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. శివసేన సభ్యులు ఎవరి వద్ద ఎక్కువగా ఉన్నారనే ఆధారాలనూ సమర్పించాలని ఆదేశించింది. కాగా, ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం వరకు డాక్యుమెంట్లు ఈసీకి సమర్పించాలని స్పష్టం చేసింది. మరోవైపు, ఏక్నాథ్ షిండే వర్గం ఎమ్మెల్యేలు, బీజేపీ మద్దతుతో అసెంబ్లీ స్పీకర్‌గా నర్వేకర్ ఎన్నికయ్యాక తీసుకున్న నిర్ణయాలపై శివసేన సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. The Election Commission of India asks both Uddhav Thackeray and Eknath Shinde to submit documentary evidence to prove that they have the majority members in the Shiv Sena. (File photos) pic.twitter.com/HT4geWExXP — ANI (@ANI) July 23, 2022 -
ఉద్ధవ్ ఠాక్రేకు దెబ్బమీద దెబ్బ.. శివసేనకు కదం ‘రాంరాం’
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. పార్టీలో కీలక, సీనియర్ నాయకులందరూ దశలవారీగా పార్టీ నుంచి బయటపడుతుండటంతో శివసేన రోజురోజుకూ బలహీనపడుతోంది. ఇప్పటికే గట్ నాయకులు, శాఖ ప్రముఖులు, విభాగ ప్రముఖులు, మాజీ, సిట్టింగ్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు ఇలా అనేకమంది ఉద్ధవ్‌ను వదిలేసి శిండే వర్గంలో చేరారు. తాజాగా శివసేన పార్టీలో సీనియర్ నేతగా, కట్టర్ శివసైనికుడిగా పేరుగాంచిన రాందాస్ కదం కూడా సోమవారం పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ పంపించారు. దీంతో ఉద్ధవ్‌కు చెందిన శివసేన పార్టీలో మరింత గందరగోళ పరిస్ధితి నెలకొంది. శిందే తిరుగుబాటు తరువాత ఉద్ధవ్‌ఠాక్రే వర్గం నుంచి బయటపడి ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గంలో చేరడానికి అనేకమంది నేతలు, పదాధికారులు, కార్యకర్తలు పోటీ పడుతున్నారు. అందులో భాగంగా శివసేన పార్టీలో సీనియర్ నేతగా, కట్టర్ శివసైనికుడిగా పేరుగాంచిన రాందాస్ కదం పార్టీ నేత పదవికి రాజీనామా చేసినట్లు ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. అయితే కదం ఏక్నాథ్ శిండే వర్గంలో చేరుతుండవచ్చనే ఊహగానాలు వస్తున్నాయి. తన గొంతులో ప్రాణమున్నంత వరకు తను శివసేనలోనే కొనసాగుతానని ఒకప్పుడు ప్రకటించిన కదం ఇప్పుడు ఆకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం ఉద్ధవ్‌కు గట్టి షాకు తగిలినట్లైంది. కాగా ఇప్పటి వరకు తదుపరి కార్యాచరణ ఏంటనే దానిపై కదం ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఉత్కంఠ రేపుతోంది. చదవండి: థాక్రేకు మరో షాక్.. షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు! బాల్ ఠాక్రేకు సన్నిహితునిగా... ఒకప్పుడు శివసేనలో తిరుగులేని నాయకుడిగా పేరు సంపాదించుకున్న సీనియర్ నేత రాందాస్ కదం దివంగత హిందు హృదయ్ సామ్రాట్ బాల్‌ఠాక్రేకు అతి సన్నిహితుడిగా మెలిగారు. ఆయన నేతృత్వంలో అనేక సంవత్సరాలు పార్టీలో కొనసాగారు. 2005–2009 వరకు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ముఖ్యంగా సీనియర్ నేతల్లో కదం ఒకరు కావడంతో ఆయనపై ఉద్ధవ్‌కు అపార నమ్మకం ఉంది. చివరకు ఆయన కూడా పార్టీ పదవికి రాజీనామా చేయడం ఉద్ధవ్ జీర్ణించుకోలేకపోతున్నారు. రాందాస్ కదం కొద్దిరోజులుగా పార్టీలో అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు విధాన పరిషత్‌లో ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన తరువాత మరోసారి అవకాశం లభిస్తుందని ఆయన భావించారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. అంతేగాకుండా శివసేన, బీజేపీ కూటమిలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హయాంలో కదం పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేశారు. కాని 2009లో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయనకు మంత్రి పదవి లభించలేదు. అప్పటి నుంచి కదంలో అసంతృప్తి మరింత పెరిగిపోయింది. శివసేన నుంచి బయట పడుతుండవచ్చని వదంతులు సైతం వచ్చాయి. కానీ తను కడవరకూ శివసేనలోనే కొనసాగుతానని ఆయన అప్పట్లో స్పష్టం చేశారు. అయితే సోమవారం ఆయన ఆకస్మాత్తుగా పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ ద్వారా తెలియజేయడం ఆందరికి ఆశ్చర్యానికి గురిచేసింది. ఉద్ధవ్‌పై రాందాస్ తీవ్ర వ్యాఖ్యలు.. మాజీ మంత్రి, శివసేన నేత రాందాస్ కదం పార్టీ పదవికి రాజీనామా చేసిన తరువాత పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కదం తన అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. గత మూడేళ్ల నుంచి నోరు మూసుకుని పార్టీలో కొనసాగుతున్నానని, బాల్ ఠాక్రే బతికి ఉంటే నేడు నాకు ఈ పరిస్ధితి వచ్చేది కాదని, అందుకే పార్టీ పదవికి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. బాల్ ఠాక్రేకు విశ్వాస పాత్రుడిని కావడంవల్లే ఆయన నాకు పార్టీలో వివిధ పదవులు కట్టబెట్టారు. ఆయన మరణించిన తరువాత నాకు విలువ లేకుండా పోయింది. ఇది నేను కొంత కాలంగా గమనిస్తున్నాను. నన్ను విశ్వాసంలోకి తీసుకోకుండానే పార్టీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా నన్ను విశ్వాసంలోకి తీసుకోలేదు. నా కుమారుడు, ఎమ్మెల్యే యోగేశ్ కదంను కూడా అనేకసార్లు అవమాన పరిచారు. 2019లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నన్ను మాతోశ్రీ బంగ్లాకు పిలిపించారు. నీపై ఎవరు ఎలాంటి ఆరోపణలు, వ్యాఖ్యలు చేసినా మీడియా ఎదుట నోరు విప్పవద్దని హెచ్చరించారు. అప్పుడు అలా ఎందుకు హెచ్చరించారో ఇప్పటికీ నాకు అర్ధం కాలేదన్నారు. బాల్ ఠాక్రే బతికున్నంత కాలం ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో పోరాడుతూ హిందుత్వాన్ని బతికించారు. కాంగ్రెస్, ఎన్సీపీలతో జతకట్టవద్దని, హిందుత్వానికి కట్టుబడి ఉండాలని లేదంటే బాల్ ఠాక్రేను అవమాన పర్చినట్లవుతుందని పలుమార్లు ఉద్ధవ్‌కు విజ్ఞప్తి చేశాను. కానీ ఆయన మాటలను లెక్కచేయలేదు. ఇది కూడా తనను కలచివేసిందని కదం స్పష్టం చేశారు. -
థాక్రేకు మరో షాక్.. షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ వర్గంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఉద్ధవ్ థాక్రేను కాదని పలువురు శివసేన ఎంపీలు సైతం రెబల్ వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పది మందికిపైగా శివసేన ఎంపీలు ఎక్నాథ్ షిండేతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారు లోక్‌సభలో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దిల్లీ పెద్దలతో ఎక్నాథ్ షిండే చర్చలు చేపట్టిన క్రమంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీకర్‌కు లేఖ.. ముంబయి సౌత్ సెంట్రల్ ఎంపీ రాహుల్ షేవాలే నేతృత్వంలో ప్రత్యేక శివసేన బృందం ఏర్పాటు చేయాలంటూ సోమవారం రాత్రి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు పలువురు ఎంపీలు. ఆ బృందం చీఫ్ విఫ్‌ను సైతం నియమించింది. ఆ బాధ్యతలను యావత్మాల్ ఎంపీ భవన గావ్లీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆమెను చీఫ్ విప్ పదవి నుంచి తొలగించారు ఉద్ధవ్ థాక్రే. అయితే.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు. ఏక్నాథ్ షిండేతో సోమవారం వర్చువల్ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో 12 మంది ఎంపీలకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తమని ప్రత్యేక బృందంగా స్పీకర్ గుర్తించిన తర్వాత.. శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం. గత వారం పార్టీ ఎంపీలతో సమావేశమైన ఉద్ధవ్ థాక్రే.. తమ భాగస్వామ్య పార్టీలతో సంబంధాలు తెంచుకుని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మూకు మద్దతు ప్రకటించారు. దీంతో థాక్రేపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. థాక్రే బంధీఅయ్యారని, ఆయనకు ఎంపీల డిమాండ్‌ను అంగీకరించటం తప్ప ఎలాంటి అవకాశం లేదని ఆరోపించాయి. మరోవైపు.. పలు కేసులపై సుప్రీం కోర్టు తీర్పు కోసం ఇరు వర్గాలు వేచి ఉన్నాయి. ఇదీ చదవండి: Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్.. ‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్ -
Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్
Shiv Sena leader Uddhav Thackeray.. మహారాష్ట్రలో పొలిటికల్ వాతావరణం ఇంకా చల్లబడలేదు. బీజేపీ మద్దతుగా శివసేన రెబల్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉద్ధవ్ థాక్రేకు మరోసారి ఊహించని దెబ్బ తగిలింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మద్దతు తెలపడం మహా వికాస్ అఘడి (ఎంవీఏ)లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఉద్ధవ్ థాక్రే నిర్ణయంపై కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత బాలాసాహెట్ థోరట్.. శివసేనసై సంచలన విమర్శలు చేశారు. కాగా, బాలాసాహెబ్ ట్విట్టర్ వేదికగా.. శివసేన ఎందుకు ద్రౌపది ముర్ముకు మద్దతు ఇస్తుందో తెలపాలని డిమాండ్ చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇచ్చే ముందు ఎందుకు ఎంవీఏ కూటమితో చర్చించలేదని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని బేఖాతరు చేస్తూ అప్రజాస్వామిక పద్ధతిలో మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్‌ను కూల్చి, శివసేన ఉనికినే సవాల్ చేసిన బీజేపీ కూటమికి రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. మరో అడుగు ముందుకేసి.. రాష్ట్రపతి ఎన్నిక భిన్న సిద్ధాంతాల మధ్య పోరుగా మారిందని, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాటం కోసం సాగుతోందని అన్నారు. అంతా వారి ఇష్టమేనా(శివసేన) అని పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. శివసేన వైఖరిపై అటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ద్రౌపది ముర్ముకు మద్దతిచ్చే విషయంలో ఎంవీఏకు శివసేన ముందస్తు సమాచారం ఇవ్వలేదని వెల్లడించింది. కాగా, మహారాష్ట్రలో శివసేన.. కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్యంతో(ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. राष्ट्रपती पदाची निवडणूक ही वैचारिक लढाई आहे. लोकशाही आणि संविधान रक्षणासाठी सुरू असलेला हा संघर्ष आहे. स्त्री, पुरुष किंवा आदिवासी, बिगर आदिवासी अशी ही लढाई नाही. जे संविधान आणि लोकशाहीच्या संरक्षणाच्या बाजूने आहेत ते सर्व यशवंत सिन्हा यांना पाठिंबा देत आहेत. pic.twitter.com/LSykyJ0b6L — Balasaheb Thorat (@bb_thorat) July 12, 2022 -
'విప్ ధికరణ'పై షిండే, థాక్రే వర్గాల ఢీ.. ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
ముంబై: మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయినా.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడి ఇంకా తగ్గటం లేదు. రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా.. విప్ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు శాసనసభ సెక్రెటరీ. అందులో షిండే వర్గం ఎమ్మెల్యేలు 39 మంది ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉద్ధవ్ వర్గంలోని ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. జులై 4న బలపరీక్ష రోజే షిండేతో చేతులు కలిపారు. తమకు షోకాజ్ నోటీసులు అందినట్లు ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ధ్రువీకరించారు. మహారాష్ట్ర శాసనసభ సభ్యుల (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత) నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు సెక్రెటరీ. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పీకర్ ఎన్నిక, విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించారని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నాయి. విప్ ధిక్కరించిన వారిని అనర్హులుగా వేటు వేయాలని డిమాండ్ చేశాయి. అయితే.. అనర్హత వేటు వేయాలన్న ఎమ్మెల్యేల జాబితాలో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే పేరును షిండే వర్గం మినహాయింటం గమనార్హం. 288 స్థానాలు కలిగిన అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. అందులోంచి షిండే వర్గం తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బలపరీక్షలో 164 మంది మద్దతు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. జులై నాలుగున జరిగిన విశ్వాస పరీక్ష అనంతరం.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు విప్ ధిక్కరించారంటూ నోటీసులు ఇచ్చింది షిండే వర్గం. ఇదీ చదవండి: ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ -
ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ
ముంబై: అనూహ్యంగా తగులుతున్న ఎదురుదెబ్బలతో విలవిలలాడుతున్న శివసేన పార్టీకి కళ్యాణ్ డోంబివిలిలో మరో బలమైన ఎదురుదెబ్బ తగిలింది. థాణే, నవీముంబై మున్సిపల్ కార్పొరేషన్ల అనంతరం తాజాగా కళ్యాణ్ డోంబివిలి మున్సిపల్ కార్పొరేషన్లో శివసేన పదాధికారులతో పాటు 40 మంది కార్పొరేటర్లు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నివాసస్థానమైన నందనవనానికి వెళ్ళి తమ మద్దతు ప్రకటించారు. ఈ అనూహ్య సంఘటనతో శివసేన పార్టీ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. త్వరలోనే కళ్యాణ్ డోంబివిలిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ అనూహ్య ఘటన శివసేన మనుగడపై పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: వచ్చే వారంలో మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ మరింతమంది వస్తారు: శ్రీకాంత్ శిందే కళ్యాణ్ డోంబివిలి కార్పోరేషన్లో శివసేనకు 53 మంది కార్పొరేటర్లు ఉన్నారు. శివసేన అధికారంలోకి రావడానికి 4 నలుగురు స్వతంత్య్ర కార్పొరేటర్లు సహకరించారు. ఇద్దరు నామినేటెడ్ సభ్యులను కలుపుకొని శివసేన కార్పొరేటర్ల సంఖ్య 59కి చేరింది. ఇందులో నుండి 40 మంది కార్పొరేటర్లు పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేను వదిలి ఏక్నాథ్ శిందే వర్గంలో చేరిపోవడంతో శివసేన పార్టీకి కోలుకోని దెబ్బ తగిలిందనే చెప్పుకోవాలి. తిరుగుబాటు చేసిన కార్పొరేటర్లలో రాజేశ్ మోరే, దీపేశ్ మాత్రే, రమేశ్ మాత్రే, విశాల్ పావ్‌శే, రవి పాటిల్, నితిన్ పాటిల్, రంజనా పాటిల్, చాయా వాఘ్మారే, నీలేశ్ శిందే, జనార్దన్ మాత్రే తదితరులున్నారు. ఈ 40 మంది కార్పోరేటర్లు శిందే వర్గానికి మారడం వెనక లోక్‌సభ సభ్యుడు, ముఖ్యమంత్రి కుమారుడు శ్రీకాంత్ శిందే హస్తం ఉందని చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ శిందే మాట్లాడుతూ, క్రమక్రమంగా శివసేనకు చెందిన నాయకులెందరో శిందే వర్గంలో చేరుతారని అన్నారు. అయితే, తొలుత ఈ 40 మంది తిరుగుబాటు సమాచారం బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే మాట్లాడుతూ, మహారాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామనీ, ఈ అభివద్ధి రథం ప్రగతిపథంలో నిరాటంకంగా పరుగెత్తాలంటే ప్రతి ఒక్కరు సహకరించాలనీ అన్నారు. -
అప్పుడు మీరంతా ఎక్కడున్నారు.. రెబల్స్‌కు థాక్రే సవాల్
మహారాష్ట్రలో ఊహించని ట్విస్టుల మధ్య శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. సీఎం పీఠాన్ని అధిరోహించారు. బీజేపీ మద్దతుతో షిండే కొత్త సర్కార్‌ను ఏర్పాటు చేశారు. కాగా, శివసేన పార్టీపై ఆధిపత్యం కోసం మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం, కొత్త సీఎం షిండే వర్గం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా మాజీ సీఎం ఉద్దవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మొదటిసారి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు జరిపాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో రెబల్ ఎమ్మెల్యేలకు దమ్ముంటే శివసేన గుర్తుతో కాకుండా వేరే గుర్తుతో పోటీ చేయాలని సవాల్ విసిరారు. శివసేన పార్టీ గుర్తు తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈరోజే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని తాను సవాల్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. నిజంగా మేము తప్పు చేసి ఉంటే ప్రజలు మమ్మల్ని ఇంటికి పంపిస్తారు. ప్రజలే మీకు తగిన బుద్దిచెబుతారని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు కేవలం శివసేన గుర్తును మాత్రమే చూడరు. ఆ గుర్తుతో పోటీ చేసే వ్యక్తిని కూడా చూస్తారని అన్నారు. శివసేనను ఎవరూ తమ నుంచి లాక్కెళ్లలేరని అన్నారు. పార్టీలు పోయినంత మాత్రానా ఎక్కడైనా పార్టీ పోతుందా? అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పని చేసే రిజిస్టర్డ్ పార్టీ ఒకటి.. లెజిస్లేచర్ పార్టీ మరొకటి ఉంటుందని, ఈ రెండు వేర్వేరు అని వివరించారు. ఇలా చేయాలని అనుకుంటే.. రెండుననరేళ్ల క్రితమే చేసి ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేంద్రంలో ఉన్న బీజేపీ.. గత రెండున్నర ఏళ్లుగా తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఆ సమయంలో రెబల్ ఎమ్మెల్యేలంతా ఎక్కుడున్నారని ఫైర్ అయ్యారు. అలాంటి బీజేపీతో కలిసి.. మీరు(రెబల్ ఎమ్మెల్యేలు) సొంత పార్టీకి ద్రోహం చేస్తారా అని ప్రశ్నించారు. బీజేపీ కొందరు శివసేన నేతలను బెదిరింపులకు గురిచేసినా కొంత ఎమ్మెల్యేలు నాకు మద్దతుగా నిలిచారు. వారిని చూసి నేను గర్విస్తున్నానని అన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల తాము ఆందోళనగా ఉన్నామని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదని అన్నారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఆత్రుతగా చూస్తున్నారని వివరించారు. సుప్రీంకోర్టు నిర్ణయం గురించి తాను ఆందోళన చెందడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఇక, ప్రస్తుతం దేశంలో సత్యమేవ జయతే కాదు.. అసత్యమేవ జయతే నడుస్తోందని విమర్శలు గుప్పించారు. ఇది కూడా చదవండి: ఆ విషయం తేలకుండానే ప్రభుత్వ ఏర్పాటా? షిండేపై మళ్లీ కోర్టుకెక్కిన థాక్రే వర్గం -
ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో భలే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నేడు(సోమవారం) ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. సీఎం షిండేకు మద్దతుగా.. 164 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. షిండే-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా.. బలపరీక్షలో శివసేన ఎమ్మెల్యేలు షిండే సర్కార్‌కు సపోర్టుగా నిలిచారు. మద్దతుగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ట్విటర్లో జూన్ 24న పోస్ట్ చేసిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. కాగా, శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం క్రితం సంతోష్ బంగర్.. తాను ఉద్ధవ థాక్రేకు మద్దుతు ఇస్తున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సంతోష్ బంగర్ ఓ సభలో మాట్లాడుతూ.. ఉద్ధవ్‌కి మద్దతుగా కన్నీరు కూడా పెట్టుకున్నారు. కానీ, ఉద్ధవ్ థాక్రేకు షాకిస్తూ.. సోమవారం జరిగిన బల పరీక్షలో సంతోష్ బంగర్.. సీఎం ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇచ్చారు. దీంతో ఉద్ధవ్ వర్గం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. అయితే, సంతోష్ బంగర్ ఆదివారం రాత్రే ముంబైలోని ఓ హోటల్లో సీఎం షిండేని కలిసినట్టు సమాచారం. आज मतदारसंघांमध्ये परत आल्यानंतर उपस्थित शिवसैनिकांना संबोधित करताना अश्रू अनावर झाले....शेवटच्या श्वासापर्यंत आदरणीय शिवसेना पक्षप्रमुख #उद्धव_ठाकरे साहेबा सोबत. @ShivSena @AUThackeray pic.twitter.com/loMHpUI4cL — आमदार संतोष बांगर (@santoshbangar_) June 24, 2022 ఇది కూడా చదవండి: శివసేన, ఎన్సీపీకి కాంగ్రెస్ షాక్! -
మహారాష్ట్ర స్పీకర్‌గా రాహుల్ నర్వేకర్.. థాక్రేకు షాక్
మహారాష్ట్రలో శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏక్నాథ్ శిండే సర్కార్ బలపరీక్షకు సిద్ధమైంది. అందుకోసం రెండు రోజులుపాటు అసెంబ్లీ సమావేశాలను జరిపేందుకు సిద్దమైంది. అందులో భాగంగానే ఆదివారం, సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిపింది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజైన ఆదివారం.. స్పీకర్ ఎన్నిక జరిగింది. స్పీకర్ పదవి కోసం బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్.. మహావికాస్ అఘాడీ తరపున రాజన్ సాల్వీ పోటీపడ్డారు. ఈ పోటీలో రాహుల్ నర్వేకర్ స్పీకర్ పదవికి ఎన్నికయ్యారు. దీంతో మాజీ సీఎం ఉద్ధవ్ వర్గానికి షాక్ తగిలింది. ఇదిలా ఉండగా, సోమవారం మహా అసెంబ్లీలో కొత్త సీఎం ఏక్నాథ్ శిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్రులు.. శనివారం గోవా నుంచి ముంబై చేరుకున్న విషయం తెలిసిందే. వీరంతా శిండేకు మద్దతుగా నిలుస్తారా.. లేక కొందరైనా ఉద్దవ్ థాక్రేవైపు వెళ్తారా అనేది ఓటింగ్‌లో తేలనుంది. BJP's Rahul Narwekar elected as Maha Assembly Speaker Read @ANI Story | https://t.co/piiMIgmNcU#RahulNarwekar #Maharashtra #MaharashtraAssemblySpeaker #EknathShinde pic.twitter.com/4EqTlJ1idE — ANI Digital (@ani_digital) July 3, 2022 -
Maharashtra political crisis:...ఇక ముంబై వంతు!
సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి రోజుకో మలుపుతో థ్రిల్లర్‌లా పది రోజుల దాకా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఓ కొసమెరుపుతో ముగిసింది. శివసేన రెబెల్ నేత ఏక్నాథ్ షిండేకు అనూహ్యంగా సీఎం కుర్చీ అప్పగించి బీజేపీ తన రాజకీయ చతురత చాటుకుంది. అటు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు, ఇటు సీఎం పదవి ఆశించిన సొంత నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు గమ్మత్తయిన జవాబు చెప్పింది. రాజకీయ పండితులు కూడా కలలోనైనా ఊహించని ట్విస్ట్ ఇది. షిండే తిరుగుబాటు సాయంతో ఉద్ధవ్‌ను కోలుకోలేని దెబ్బ తీసిన బీజేపీ అగ్ర నాయకత్వం, అదే షిండేను రాజును చేయడం ద్వారా రెండోసారి సీఎం పీఠమెక్కుదామనుకున్న ఫడ్నవీస్‌ను దూకుడు కాస్త తగ్గించాలని అన్యాపదేశంగా చెప్పింది. ఒక ఆట ఈ విధంగా ముగిసినా, అసలైన రసవత్త రాజకీయానికి త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు వేదిక కానున్నాయి. ఉద్ధవ్ శివసేనకు చావో రేవో కావడంతో పాటు ఆయన రాజకీయ భవితవ్యానికీ పెను పరీక్షగా నిలవనున్నాయి. ప్రతిష్టాత్మకమైన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అక్టోబర్–నవంబరులో జరగనున్నాయి. షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వీటిని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోదు. బీఎంసీపై పట్టు బిగించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, జిల్లా, నగర పరిషత్ ఎన్నికలూ ఉన్నా బీఎంసీయే కీలకంగా నిలవనుంది. ఉద్ధవ్ శివసేన, షిండే శివసేన రెండింటికీ ఇదే ప్రతిష్టాత్మకం. 1977 నుంచీ బీఎంసీ శివసేన అధీనంలోనే ఉంది. బీఎంసీ తర్వాత థానే, కల్యాణ్–డోంబీవలి మహానగర్ పాలిక రెండు, మూడో స్థానాల్లో నిలుస్తాయి. ఈ రెండింట్లోనూ షిండేకు పూర్తి పట్టుందని చెబుతారు. కనుక ఉద్ధవ్ తన దృష్టినంతా బీఎంసీపైనే కేంద్రీకృతం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఒకరకంగా షిండేపై ప్రతీకారానికి కూడా ఆయనకిది మంచి అవకాశం. అప్పట్లో రాజ్ దెబ్బ... ఉద్ధవ్ నేతృత్వంలో శివసేన తొలిసారిగా 2002లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల బరిలో దిగింది. టికెట్ల పంపిణీ అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. ఈ సమయంలోనే తన అనుయాయులకు టికెట్లివ్వడానికి నిరాకరించిన ఉద్ధవ్‌తో రాజ్ ఠాక్రే తెగదెంపులు చేసుకుని వేరుకుంపటి పెట్టుకున్నారు. అయినా ఉద్ధవ్ బీఎంసీని ఎలాగోలా చేజిక్కించుకున్నారు. రాజ్ నిష్క్రమణతో బలహీనపడ్డ శివసేన క్రమంగా గత వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. బీజేపీ కూడా బీఎంసీలో తన బలాన్ని పెంచుకుంటూ పోయింది. రాజ్ నేతృత్వంలోని ఎంఎన్ఎస్ దెబ్బకు 2012 బీఎంసీ ఎన్నికల్లో శివసేనకు దాదాపు ఓడినంత పనైంది. సాయం కోసం బీజేపీ వైపు చూడక తప్పలేదు. అలా శివసేన–బీజేపీ సంకీర్ణం బీఎంసీని హస్తగతం చేసుకుంది. బీజేపీతో కయ్యం... మరో ఐదేళ్లకు 2017లో విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రస్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో మాత్రం పరస్పరం పోటీ పడ్డాయి. బీజేపీ తన బలాన్ని 31 సీట్ల నుంచి ఏకంగా 82కు పెంచుకుంది. శివసేన గట్టిపోటీ నడుమ 84 సీట్లు గెలవగలిగింది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు షిండే సవాలును తట్టుకుని ఏ మేరకు రాణిస్తుందో చూడాల్సిందే. ఒకవైపు బీజేపీ, మరోవైపు షిండే దాడిని ఉద్ధవ్ ఏ మేరకు కాచుకుంటారన్నది ప్రశ్నార్థకమే. వాటికి తోడు రాజ్ ఠాక్రే ఎంఎన్ఎస్, శరద్ పవార్ ఎన్సీపీ నుంచి ఎటూ పోటీ ఉండనుంది. కాంగ్రెస్‌కు పెద్దగా సీన్ కనిపించడం లేదు. మరాఠా ఓటర్లంతా తమవైపేనన్నది ఉద్ధవ్ శివసేన ధీమా అయితే గుజరాతీలు, జైన్లు, ఉత్తరాది వారివంటి మరాఠేతర ఓటర్లు తమను విడిచిపెట్టరన్నది బీజేపీ ధీమా. నిజానికి శివసేనకు ముంబై పెట్టని కోటగా ఉండేది. కానీ దాదర్, మాహిం, కుర్లా, చాందివలి ఎమ్మెల్యేలు కూడా షిండే వర్గంలో చేరడంతో బీఎంసీ ఎన్నికల్లో వారి అనుయాయులు, కార్యకర్తల మద్దతు ఉద్ధవ్‌కు లేకుండా పోయినట్టే. ఇది ఆయనకు ఒకరకంగా గట్టి దెబ్బే. కనీసం 90 సీట్లన్నా రాకుంటే బీఎంసీ పీఠం ఉద్ధవ్ సేనకు దక్కడం కష్టమే. అయితే బీజేపీకి దూరమైంది గనుక ముంబై ముస్లింలు ఈసారి ఉద్ధవ్‌కు ఓటేసే అవకాశముంది. ఇది ఆయనకు కాస్త కలిసొచ్చే పరిణామమే. కాకపోతే, ఇది ఉద్ధవ్‌ను ఘోర పరాజయం గట్టెక్కించడానికి మాత్రమే పనికొస్తుందన్న అంచనాలున్నాయి. బీజేపీ ఆశీస్సులతో సీఎం పీఠం మాదిరిగానే బీఎంసీని కూడా ఉద్ధవ్ నుంచి షిండే లాక్కోవడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకూ బీఎంసీ ఎన్నికల నాటికి సిసలైన శివసేనగా గుర్తింపు, పార్టీ గుర్తు ఉద్ధవ్, షిండేల్లో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికర అంశం. వేచి చూద్దాం. -
మహా పాలి‘ట్రిక్స్’.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన శివసేన
మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్టుల మీద సస్పెన్స్‌లు కొనసాగిన విషయం తెలిసిందే. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో పొలిటికల్ డ్రామా నడిచింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే.. సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం, శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేశారు. బీజేపీ అధిష్టానం నిర్ణయంతో మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉండగా.. అనూహ్యంగా శివసేన శుక్రవారం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అనర్హత తేలే వరకు 16 మందిని సస్పెండ్ చేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. శుక్రవారం పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం విచారణను ఈనెల 11వ తేదీకి వాయిదా వేసింది. కాగా, అంతకుముందు శివసేన.. సీఎం ఏక్నాథ్ షిండేతోపాటు 15 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. Shiv Sena Chief Whip Sunil Prabhu moves Supreme Court seeking suspension from House, of Maharashtra CM Eknath Shinde & 15 other MLAs against whom disqualification petitions are filed, till a final decision is taken on their disqualification. pic.twitter.com/iTkLUyBK8k — ANI (@ANI) July 1, 2022 మరోవైపు.. మహారాష్ట్రలో ఈనెల 3, 4 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో 3వ తేదీన స్పీకర్ ఎన్నిక, 4వ తేదీన బలనిరూపణకు పరీక్ష ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: శరద్ పవర్‌కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు -
రాజకీయ మహా థ్రిల్లర్
పది రోజుల పైచిలుకు మహా రాజకీయ నాటకం క్లైమాక్స్‌లోనూ ఆశ్చర్యకరమైన మలుపులు తిరిగింది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాకరేపై ఏక్నాథ్ శిందే సారథ్యంలో ఎమ్మెల్యేల తిరుగుబాటు, సూరత్ మీదుగా గౌహతి దాకా క్యాంపు రాజకీయాలు, అసెంబ్లీలో బలపరీక్షకు గవర్నర్ ఆదేశాలు, సుప్రీమ్ కోర్టుకెక్కిన వివాదం – ఇలా ఇన్ని రోజుల పొలిటికల్ థ్రిల్లర్‌కు ఆఖరి ఘట్టం అక్షరాలా అనూహ్యమైనది. మెజార్టీ కోల్పోయినా ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ) కూటమి సర్కారుకు సారథ్యం వహిస్తున్న ఉద్ధవ్ ఠాకరే ఎట్టకేలకు ఓటమి అంగీకరించి, బుధవారం రాత్రి పొద్దుపోయాక జోరున వర్షంలో రాజ్‌భవన్‌కు వెళ్ళి రాజీనామా సమర్పించారు. ఇన్నాళ్ళుగా తెర వెనుక నుంచే కథ నడిపిన బీజేపీ రాజకీయ మహా వ్యూహంతో గురువారం సాయంత్రం ఆఖరి నిమిషంలో శిందేను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అంతటితో ఆగకుండా, శిందే సర్కారుకు బయట నుంచే మద్దతు నిస్తానని ప్రకటించిన సొంత బీజేపీ నేత – మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉప ముఖ్యమంత్రిగా పని చేయమంటూ రెండు గంటల తేడాలో ఆదేశించి, అవాక్కయ్యేలా చేసింది. గతంలో ఫడ్నవీస్ ప్రభుత్వంలో శిందే మంత్రిగా పనిచేస్తే, ఇప్పుడు శిందే కొత్త సర్కారులో ఆయన కింద ఫడ్నవీస్ బాధ్యతలు నిర్వహించనుండడం అనూహ్యమే. కొద్ది గంటల్లోనే బీజేపీ ఇన్ని మార్పులు చేయడానికి దారితీసిన కారణాలేమిటో రాగల రోజుల్లో బయటకు రావచ్చు. ఇప్పటికైతే, బీజేపీ తన గుగ్లీలతో ప్రత్యర్థులను క్లీన్‌బౌల్డ్ చేసింది. ఇటు చట్టపరంగానూ, అటు రాజకీయంగానూ లబ్ధి కలిగేలా శిందేను సీఎం చేసింది. చట్టపరంగా చూస్తే – నిన్నటి దాకా శివసేన శాసనసభా నేత అయిన శిందే అదే హోదాను నిలబెట్టుకొని, తన వర్గమే అసలైన శివసేనగా గుర్తింపు పొందే అవకాశం పెరిగింది. మిగతా రెబల్ ఎమ్మెల్యేలేమో పార్టీ ఫిరాయింపు లాంటి చట్టపరమైన వేటు నుంచి తప్పించుకుంటారు. రాజకీయంగా చూస్తే – ఉద్ధవ్నూ, అతని వెంట మిగిలిన కొద్దిమంది ఎమ్మెల్యేలనూ నిస్సహాయుల్ని చేయగల ఎత్తు ఇది. పార్టీ జెండా, అజెండా శిందే వశమయ్యే శివ సేనను బీజేపీ తన చంకలో పిల్లాణ్ణి చేసుకోగలుగుతుంది. సీఎం పీఠం బీజేపీ దయాధర్మం గనక శిందే కృతజ్ఞతాభారంతో బీజేపీకి శాశ్వత అనుచరుడవుతారు. అన్నిటికీ మించి భవిష్యత్తులో మహా రాష్ట్రలో హిందూత్వ రాజకీయ పునాదిపై తానొక్కటే బలంగా నిలిచేలా బీజేపీ ఈ చర్య చేపట్టింది. కొద్దినెలల్లో రానున్న ప్రతిష్ఠాత్మక ముంబయ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం తాజా చర్య బీజేపీకి కలిసి రావచ్చు. శిందేను సీఎంను చేయడం ద్వారా బాలాసాహెబ్ ఠాకరే భావజాలానికి నివాళి సమర్పించామంటున్న కమలం పార్టీ అలా మంచి పేరు కొట్టేస్తుంది. నిన్నటి దాకా భావోద్వేగ ప్రసంగాలతో శివసైనికుల సానుభూతి సంపాదించిన ఉద్ధవ్ పట్ల ఏ కొద్ది సానుకూలత మిగిలి ఉన్నా దాన్ని దూరం చేయగలుగుతుంది. హిందూత్వానికి నిలబడింది తామేనని చెప్పుకోగలుగుతుంది. ఈ మొత్తంలో ఇటు పదవీ, అటు దాదాపుగా పార్టీ కూడా చేజారి నష్టపోయింది – ఉద్ధవ్ ఠాకరే. మొదటి నుంచి మహారాష్ట్రలో కింగ్ మేకర్ గానే తప్ప సీఎం పీఠంపై కింగ్‌గా ఉండని సంప్రదాయం ఆయన తండ్రి బాలాసాహెబ్ ఠాకరేది. దానికి భిన్నంగా నడిచి, ఉద్ధవ్ పెద్ద తప్పే చేసినట్టున్నారు. సీఎం పదవికి రాజీనామాతో ఆయనిక కింగ్ కాదు. అంతకన్నా ముఖ్యంగా ఇకపై కింగ్ మేకరూ కాలేరు. ఏకంగా ఆయన రాజకీయ భవితవ్యమే ప్రశ్నార్థకమైంది. రెండున్నరేళ్ళ క్రితం బీజేపీతో ఎన్నికల ముందు ఒప్పందంతో పోటీ చేసుకొని, తీరా ఎన్నికల్లో గెలిచాక బీజేపీని కాదని కాంగ్రెస్, ఎన్సీపీలతో కలసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఉద్ధవ్. సహజ మిత్రపక్షమైన బీజేపీని కాదని, దానికి పూర్తి విరుద్ధమైన లౌకికవాద పార్టీలతో అసహజ మైత్రి చేసుకున్నారు. రాజకీయం మాటెలా ఉన్నా నైతికంగా అది ఆయన చేసిన తప్పు. ఆ లెక్కన ఇప్పుడు సొంతపార్టీలో తిరుగుబాటు తెచ్చిన శిందేదీ, శివసేనలోని అంతర్గత అసమ్మతిని ఆసరాగా చేసుకొని, ఎంవీఏ ప్రభుత్వ పతనానికి దోహదపడి పగ తీర్చుకున్న బీజేపీదీ అంతే తప్పు. రాజకీయ రణంలో చెల్లుకు చెల్లు అయిందనుకొంటే, ఇక నైతిక ప్రశ్నలు, ధర్మాధర్మ విచక్షణలకు తావు లేదు. డబ్బు, అధికారం, ఈడీ కేసుల భయం – ఏ కారణమైతేనేం కనీసం డజనుకు పైగా ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌ను వదిలి, బీజేపి ఆశీస్సులున్న శిందే వైపు వచ్చారని ఆరోపణ. శివసేన సుప్రీమ్‌కు ఒకప్పుడు కుడిభుజంలా మెలిగి, పార్టీ సమస్యల పరిష్కర్తగా వెలిగిన శిందే ఇవాళ అదే అధినేతకు సంక్షోభ కారకుడు కావడం రాజకీయ వైచిత్రి. కొత్త సర్కారుతో శిందే, ఫడ్నవీస్‌లను తెర ముందు నిలబెట్టి, రిమోట్ కంట్రోల్‌ను చేతిలో పెట్టుకున్న బీజేపీ ఒకే దెబ్బకు అనేక పిట్టలను కొట్టిందనుకోవాలి. మహారాష్ట్రలో ఠాకరేల ప్రాబల్యానికి తెర దించడానికి ఇది ఉపకరిస్తుంది. అలాగే, యూపీ తర్వాత అత్యధిక లోక్‌సభ స్థానాలున్న మహారాష్ట్రలో శివసేన ఓటర్లను కూడా తన వెంటే తిప్పుకోగలుగు తుంది. ఆ రాష్ట్రంలో శాశ్వతంగా జెండా పాతడానికి ఇది మంచి అవకాశం. మరి, కొద్దిమంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిన శిందే చివరకు బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోతారా? లేక శివసేనను నిలబెట్టి, తనకంటూ బలమైన కార్యకర్తలను నిర్మించుకుంటారా? 2014లో పూర్తికాలం పాటు, 2019లో కొద్దిరోజులే సీఎంగా పనిచేసి, ఇప్పుడు అధిష్ఠానం ఆదేశం మేరకు అనాసక్తంగానే డిప్యూటీ సీఎం అయిన ఫడ్నవీస్ మనస్ఫూర్తిగా జూనియర్ కింద పనిచేస్తారా? రాజకీయ చతురుడు శరద్ పవార్ ఏం చేయనున్నారు? మహా రాజకీయ థ్రిల్లర్ సిరీస్‌లో తరువాతి అధ్యాయం అదే! -
మహా రాజకీయం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం
ముంబై: సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం.. అంటే 2019 నవంబర్ 23న మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముఖ్యమంత్రిగా, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్‌తో ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఉదయం 8 గంటలకు రాజ్‌భవన్‌లో హడావుడిగా కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. కానీ, ఫడ్నవీస్ ప్రభుత్వం కేవలం దాదాపు 80 గంటలే మనుగడ సాగించింది. నవంబర్ 26న కుప్పకూలింది. రెండు రోజుల తర్వాత.. నవంబర్ 28న శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. నవంబర్ 22–23 అర్ధరాత్రి జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పాయి. శివసేన తన మిత్రపక్షం బీజేపీ నుంచి దూరమయ్యింది. మూడు దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకుంది. సైద్ధాంతికంగా శత్రువులుగా భావించే కాంగ్రెస్, ఎన్సీపీతో జట్టుకట్టింది. మూడు పార్టీలతో మహా వికాస్ అఘాడీ పేరిట కొత్త కూటమి ఏర్పాటయ్యింది. కొత్త ప్రభుత్వాన్ని నెలకొల్పింది. మహారాష్ట్రలో 2014 అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేశాయి. ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఐదేళ్లపాటు ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ఉమ్మడిగా ప్రయాణం సాగించాయి. 2019లో కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. ముఖ్యమంత్రి పదవి విషయంలో బీజేపీ–శివసేన మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సీఎం పోస్టు తమకే దక్కాలంటూ ఇరుపక్షాలు భీష్మించుకు కూర్చున్నాయి. శివసేన పట్టు వీడకపోవడంతో బీజేపీ పాచిక విసిరింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ బీజేపీ గూటికి చేరారు. దాంతో ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవి దక్కింది. దాదాపు మూడు రోజుల వ్యవధిలోనే బీజేపీకి రాంరాం అంటూ మళ్లీ శరద్ పవార్‌కు జై కొట్టారు. పవార్ మంత్రాంగంతో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి పురుడు పోసుకుంది. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నరేళ్ల పాటు సాఫీగా సాగిన ప్రయాణంలో హఠాత్తుగా సంక్షోభం తలెత్తింది. చివరకు ఉద్ధవ్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. -
ఉద్ధవ్ సెలవు.. బీజేపీ కొలువు
న్యూఢిల్లీ/ముంబై/గువాహటి: పది రోజులుగా రోజుకో మలుపు తిరిగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు బుధవారం ఓ కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించడం, దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టినా లాభం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి స్వయంగా కారు నడుపుకుంటూ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. దాంతో సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కలయికతో రెండున్నరేళ్ల కింద ఏర్పాటైన మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వం కథ కంచికి చేరింది. ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని సమాచారం. బీజేపీ మహారాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సీటీ రవి ఇప్పటికే రంగంలోకి దిగి మంత్రివర్గ కూర్పు తదితరాలపై షిండేతో చర్చలు జరుపుతున్నారు. షిండేకు ఉప ముఖ్యమంత్రితో పాటు ఆయన వర్గానికి 9 మంత్రి పదవులిస్తారని సమాచారం. ఎనిమిది రోజులుగా గువాహటిలో ఓ హోటల్లో మకాం చేసిన 39 మంది సేన రెబల్ ఎమ్మెల్యేలు, 10 మంది స్వతంత్రులు బుధవారం రాత్రి ప్రైవేట్ చార్టర్ విమానంలో గోవా చేరుకున్నారు. వారంతా గురువారం ఉదయం ముంబై రానున్నట్టు సమాచారం. ‘‘మేం రెబల్స్ కాదు. నిజమైన శివ సైనికులం మేమే’’అని ఈ సందర్భంగా షిండే అన్నారు. రోజుంతా పలు మలుపులు: సంకీర్ణ సారథి శివసేనపై మంత్రి ఏక్నాథ్ షిండే సారథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో జూన్ 21న మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. కనీసం 20 మంది ఎమ్మెల్యేలతో కలిసి జూన్ 20న అర్ధరాత్రి షిండే రాష్ట్రం వీడి సూరత్ చేరుకున్నారు. మర్నాడు గౌహతికి మకాం మార్చారు. 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో చూస్తుండగానే 39 మందికి పైగా షిండే శిబిరంలో చేరిపోయారు. దాంతో ఉద్ధవ్ సర్కారు మైనారిటీలో పడింది. ఉద్ధవ్ బెదిరింపులు, బుజ్జగింపులు, ఇరువర్గాల సవాళ్లూ ప్రతి సవాళ్లతో వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ వచ్చింది. మంగళవారం రాత్రి ఫడ్నవీస్ గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిసి బలపరీక్షకు ఉద్ధవ్‌ను ఆదేశించాలని కోరడంతో ముదురు పాకాన పడింది. ఆ వెంటనే సీఎంను గురువారం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించారు. అందుకు ఏర్పాట్లు చేయాలంటూ అసెంబ్లీ కార్యదర్శికి మంగళవారం రాత్రే లేఖ రాశారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా లేవు. 39 మంది సేన రెబల్ ఎమ్మెల్యేల కార్యాలయాలు తదితరాలపై దాడుల నేపథ్యంలో వారికి, వారి కుటుంబ సభ్యులకు ముప్పుంది. విపక్ష నేత ఫడ్నవీస్ కూడా నన్ను కలిసి బలపరీక్షకు ఆదేశించాలంటూ విజ్ఞాపన సమర్పించారు. అందుకే గురువారం సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సీఎంను ఆదేశిస్తున్నా’’అని పేర్కొన్నారు. దీన్ని సవాలు చేస్తూ శివసేన బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ ఆదేశంపై స్టే కోరింది. అందుకు కోర్టు నిరాకరించింది. బల నిరూపణే సమస్యకు పరిష్కారమని న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్డీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్ అభిప్రాయపడింది. సేన పిటిషన్‌ను ఈ ఉదంతంపై దాఖలైన ఇతర కేసులతో కలిపి జూలై 11న విచారిస్తామని ప్రకటించింది. బలపరీక్ష ఫలితం తమ తుది తీర్పుకు లోబడి ఉంటుందంటూ తీర్పు వెలువరించింది. అసెంబ్లీ కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసి, ఐదు రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కూలదోసి ఆనందిస్తున్నారు: ఉద్ధవ్ సుప్రీం తీర్పు వెలువడ్డ కొద్ది నిమిషాల్లోనే సీఎం పదవి నుంచి ఉద్ధవ్ తప్పుకున్నారు. రాజీనామా చేస్తున్నట్టు ఫేస్బుక్ లైవ్‌లో ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. ‘‘పదవిని వీడుతున్నందుకు నాకు ఏ బాధా లేదు. నంబర్‌గేమ్‌పైనా ఏ మాత్రం ఆసక్తి లేదు. పార్టీ ఎమ్మెల్యేల్లో నన్ను ఒక్కరు వ్యతిరేకించినా నాకది అవమానమే’’అన్నారు. ‘‘రెబల్స్‌ను ముంబై రానివ్వండి. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు దిగొద్దు’’అని శివసేన కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. శివసేన, బాల్ ఠాక్రే కారణంగా రాజకీయంగా ఎదిగిన రెబల్ ఎమ్మెల్యేలు చివరికి ఆయన కుమారున్నే సీఎం పదవి నుంచి దించేసి ఆనందిస్తున్నారని వాపోయారు. ఈ పరిణామాన్ని ఉద్ధవ్ బుధవారం ఉదయమే ఊహించారు. దాంతో మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీ ఒకరకంగా ఉద్ధవ్ వీడ్కోలు సమావేశంగా మారింది. తనకు రెండున్నరేళ్లుగా సహకరించినందుకు సంకీర్ణ భాగస్వాములైన ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల చీఫ్‌లు శరద్ పవార్, సోనియా గాంధీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘రెబల్స్ కోరితే సంకీర్ణం నుంచి తప్పుకుని బయటినుంచి మద్దతిచ్చేందుకు కూడా సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. నన్ను మోసగిస్తారనుకున్న వాళ్లు ఇలా మద్దతుగా నిలబడితే సొంతవాళ్లే మోసగించారు’’అంటూ ఆవేదన వెలిబుచ్చారు. రెబల్స్ తమ సమస్యలపై తన దగ్గరికి వచ్చి ఉండాల్సిందన్నారు. ‘‘శివసేన సామన్యుల పార్టీ. గతంలోనూ ఇలాంటి ఎన్నో సవాళ్లను విజయవంతంగా అధిగమించింది’’అన్నారు. పార్టీని పునర్నిర్మిస్తానని ప్రకటించారు. కర్మ సిద్ధాంతం పని చేసింది: బీజేపీ ఉద్ధవ్ రాజీనామా విషయంలో కర్మ సిద్ధాంతం పని చేసిందని బీజేపీ వ్యాఖ్యానించింది. ‘‘కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. చేసిన దాన్ని అనుభవించే తీరాలి. ఉద్ధవ్ విషయంలోనూ అదే జరిగింది’’అని కేటీ రవి అన్నారు. ‘‘శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే ఎన్నడూ అధికార పదవులు చేపట్టకపోయినా ప్రభుత్వాలను శాసించారు. ఆయన కుమారునిగా ఉద్ధవ్ మాత్రం అధికారంలో ఉండి కూడా సొంత పార్టీనే అదుపు చేయలేకపోయారు. ఎంతటి పతనం!’’అంటూ బీజేపీ నేత అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు మహారాష్ట్ర సంక్షోభంలో ఎప్పుడేం జరిగిందంటే... జూన్ 20: మహారాష్ట్రలో 10 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడ్డాక శివసేన సీనియర్ మంత్రి ఏక్నాథ్ షిండే అదృశ్యమయ్యారు. ఆయనతో మరో 11 మంది శివసేన ఎమ్మెల్యేలు ఆ అర్ధరాత్రే బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్ చేరారు. జూన్ 21: ఉద్ధవ్ ఠాక్రే సమావేశానికి శివసేన ఎమ్మెల్యేల్లో 12 మందే వచ్చారు. పార్టీ శాసనసభాపక్ష నేత పదవి నుంచి షిండేను తొలగించారు. తనకు 40 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని షిండే ప్రకటించారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్ధవ్‌ను డిమాండ్ చేశారు. జూన్ 22: షిండే వర్గం సూరత్ వీడి బీజేపీ పాలిత అస్సాంలోని గువాహటి చేరుకుంది. రెబల్స్ కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. సంకీర్ణాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. జూన్ 23: 37 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ శాసనసభా పక్ష నేతగా షిండేను ఎన్నుకుంటూ తీర్మానం చేశారు. జూన్ 24: షిండే వర్గంలోని 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డిప్యూటీ స్పీకర్‌కు సేన ఫిర్యాదు చేసింది. షిండే ప్రత్యేక విమానంలో గుజరాత్‌లోని వడోదర వెళ్లి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లతో సమావేశమైనట్టు వార్తలొచ్చాయి. బీజేపీలో శివసేన విలీనం, బయటి నుంచి మద్దతు, ఇరువురూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం వంటి పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. జూన్ 26: అనర్హత నోటీసులను షిండే వర్గం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. డిప్యూటీ స్పీకర్‌పై తమ అవిశ్వాస తీర్మానం పెండింగులో ఉండగా తమకు అనర్హత నోటీసులిచ్చే అధికారం ఆయనకు లేదని వాదించింది. జూన్ 27: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై జూలై 11 దాకా ఏ నిర్ణయమూ తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్ 28: అదను చూసి బీజేపీ రంగంలోకి దిగింది. ఉద్ధవ్‌ను తక్షణం అసెంబ్లీలో బలం నిరూపించుకోవాల్సందిగా ఆదేశించాలని గవర్నర్‌ను ఫడ్నవీస్ కోరారు. జూన్ 29: గురువారం ఉదయానికల్లా మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించడం, దానిపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా చేశారు. షిండే వర్గం ఎమ్మెల్యేలు గువాహటి నుంచి గోవా చేరుకున్నారు. -
మెజారిటీ నిరూపించుకోమనండి.. మహారాష్ట్ర సంక్షోభంలో కీలక మలుపు
ముంబై/న్యూఢిల్లీ/గువాహటి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మంగళవారం కీలక మలుపు తిరిగింది. వారానికి పైగా వేచిచూసే ధోరణి అవలంబించిన బీజేపీ నేరుగా రంగంలోకి దిగింది. విపక్ష నేత, బీజేపీకి చెందిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం రాత్రి గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘శివసేనపై 39 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే సారథ్యంలో తిరుగుబాటు చేసి మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో పాలక మహా వికాస్ అఘాడీ కూటమి మైనారిటీలో పడింది. అందుకే అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు లేఖ సమర్పించాం’’ అని వివరించారు. అంతకుముందు మంగళవారం రోజంతా బీజేపీ శిబిరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫడ్నవీస్ ఉదయమే ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ వ్యూహంపైనే వారు చర్చించినట్టు చెబుతున్నారు. రాత్రికి ముంబై తిరిగి రాగానే పదింటికి ఫడ్నవీస్ నేరుగా వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మరోవైపు షిండే శిబిరంలో చేరిన 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉద్ధవ్‌ను మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్‌ను ఈ మెయిల్ ద్వారా కోరినట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై రానున్నట్టు శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ప్రకటించారు. వస్తే అన్ని విషయాలూ చర్చించుకుందామంటూ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘‘రెబల్స్‌కు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తిరిగొచ్చి నాతో మాట్లాడితే సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది’’ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం క్రమంగా క్రైమాక్స్‌కు చేరుతున్నట్టు కన్పిస్తోంది. షిండే వర్గం ఎమ్మెల్యేలు గురువారం ముంబై తిరిగొచ్చి బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరతారన్న వార్తలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. దమ్ముంటే పేర్లు చెప్పండి: షిండే 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌తో టచ్‌లో ఉన్నారన్న శివసేన వ్యాఖ్యలను షిండే కొట్టిపారేశారు. దమ్ముంటే వారి పేర్లు చెప్పాలని సవాలు చేశారు. ఉద్ధవ్‌పై ఆయన తిరుగుబావుటా ఎగరేయడం, తన వర్గం ఎమ్మెల్యేలతో వారం రోజులుగా అసోంలోని గువాహటిలో ఓ స్టార్ హోటల్లో మకాం వేయడం తెలిసిందే. శిబిరంలో ఇప్పటికే 39 మంది సేన ఎమ్మెల్యేలు, మరో 10 మందికి పైగా స్వతంత్రులున్నారు. 19 మంది శివసేన లోక్‌సభ సభ్యుల్లో కూడా ఏకంగా 14 నుంచి 16 మంది షిండే వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. వారిలో కనీసం 12 మంది ఇప్పటికే శిబిరంలో చేరినట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హోటల్ బయట షిండే విలేకరులతో మాట్లాడారు. తన వర్గం ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై వస్తానని ప్రకటించారు. బాల్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారంతా స్వచ్ఛందంగా తనతో కలిసొచ్చారని పునరుద్ఘాటించారు. బీజేపీ దూకుడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలకు బీజేపీ పదును పెంచింది. అధికార సంకీర్ణంలో తలెత్తిన సంక్షోభంతో తమకు ఏ సంబంధమూ లేదని పార్టీ అంటున్నా, ఈ మొత్తం వ్యవహారంలో ఫడ్నవీస్‌దే కీలక పాత్ర అని భావిస్తున్నారు. మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లిన ఆయన ముందుగా అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ, సీనియర్ లాయర్ మహేశ్ జఠ్మలానీ కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది! సేన రెబల్స్, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న పలు అవకాశాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. అనంతరం ఫడ్నవీస్ నడ్డా నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇదీ నంబర్ గేమ్ సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు) మెజారిటీ మార్కు: 144 షిండే కూటమిలోని ఎమ్మెల్యేలు: 49 మంది పాలక కూటమి వాస్తవ బలం: 168 షిండే తిరుగుబాటు తర్వాత: 119 బీజేపీ కూటమి వాస్తవ బలం: 113 షిండే కూటమి మద్దతిస్తే: 162 -
మహా పాలిటిక్స్‌లో ట్విస్ట్.. రాజ్ థాక్రేతో టచ్‌లో ఏక్నాథ్ షిండే
మహారాష్ట్రలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. పొలిటికల్ ఇష్యూ చివరకు సుప్రీంకోర్టును తాకింది. సీఎం ఉద్ధవ్ థాక్రే వర్గం, శివసేన తిరుగుబాటు టీమ్ ఏక్నాథ్ షిండే మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. డిప్యూటీ స్పీకర్ అనర్హతను సవాల్ చేస్తూ షిండే వర్గం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. వారి పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర పాలిటిక్స్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ(ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రే తెర మీదకు వచ్చారు. సోమవారం ఉదయం రాజ్‌థాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో నెలకొన్ని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. శివసేన నేతలు ప్రవర్తిస్తున్న తీరు, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి షిండే.. రాజ్ ఠాక్రేను అడిగి తెలుసుకున్నారు. దీంతో వీరి మధ్య సంభాషణ ఆసక్తికరంగా మారింది. ఇది కూడా చదవండి: మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి.. రెబల్స్‌కు ఆధిత్య థాక్రే వార్నింగ్ -
మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్
మహారాష్ట్రలో పొలిటికల్ డ్రామా పలు మలుపులు తిరుగుతోంది. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం ఉద్దవ్ థాక్రే సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. దీంతో, సర్కార్ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. కాగా, పొలిటికల్ సంక్షోభం కొనసాగుతున్న వేళ మరో ట్విస్ట్ నెలకొంది. సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యే సతీమణీలను ఆమె కలుస్తున్నారు. ఈ క్రమంలో రెబల్ ఎమ్మెల్యే ఇళ్లకు వెళ్తూ.. తమ భర్తలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఒప్పించాలని వారిని కోరుతున్నారు. దీంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో కీలక పరిణామం నెలకొంది. కాగా, రష్మీ థాక్రే తలపెట్టిన వినూత్న కార్యక్రమంలో ఎంత మేరకు ఉద్ధవ్ థాక్రేకు మేలు చేస్తుందో వేచి చూడాలి. ఇదిలా ఉండగా.. ఏక్నాథ్ షిండే సహా 16 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు షాక్ తగిలింది. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి శనివారం సమన్లు పంపించారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన ఫిర్యాదులపై సోమవారంలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని గడువు విధించారు. कब तक छीपोगे गोहातीमे.. आना हि पडेगा.. चौपाटीमे.. pic.twitter.com/tu4HcBySSO — Sanjay Raut (@rautsanjay61) June 26, 2022 మరోవైపు.. మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో దాదాపు 40 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు గౌహతిలోని ఓ విలాసవంతమైన రిసార్ట్ లో క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిపై శివసేన ఎంపీ, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ ఫైరయ్యారు. గౌహతిలో ఎంతకాలం దాక్కుంటారని ప్రశ్నించారు. కాగా, తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల ఆఫీసులను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దేశద్రోహులుగా పేర్కొంటూ వారి కార్యాలయాలపై దాడులు చేస్తామని శివసేనకు చెందిన పూణె పట్టణ అధ్యక్షుడు సంజయ్ మోరే హెచ్చరించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రెబల్ ఎమ్మెల్యేల ఇళ్లకు భద్రత కల్పించి.. ముంబై, థానే జిల్లాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మరోవైపు.. కేంద్రం కూడా రెబల్ ఎమ్మెల్యేలకు భద్రతను పెంచింది. 15 మంది రెబల్ ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్’ సీఆర్పీఎఫ్ సెక్యూర్టీని కల్పిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. Wife Rashmi Thackeray with every step in the difficult path of husband, is calling the wives of rebel MLAs https://t.co/KNg3MKEGs2 — Newslead India (@NewsleadIndia) June 26, 2022 ఇది కూడా చదవండి: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు తృటిలో తప్పిన ప్రమాదం -
ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు ముఖ్యమా?: సీఎంపై ఫైర్
శివసేన రెబల్ ఎమ్మెల్యేల కారణంగా మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఏక్నాథ్ షిండే.. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్ థాక్రే సర్కార్‌కు సవాల్ విసిరారు. కాగా, రెబల్ ఎమ్మెల్యేలంతా అసోంలో క్యాంప్‌లో ఉన్నారు. కాగా, శివసేన రెబల్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. దీంతో ప్రతిపక్ష నేతలు బీజేపీ సర్కార్, శివసేన రెబల్ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాడిసన్ బ్లూ హోటల్ ఎదుట తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా నేతృత్వంలో కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, శివసేన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదల కారణంగా అతలాకుతలం అవుతున్న అసోంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే బీజేపీ ప్రభుత్వం, అసోం.. రాజకీయాలే ముఖ్యమా..? అంటూ మండిపడ్డారు. తృణముల్ కాంగ్రెస్ నేతల నిరసనలతో పోలీసులు, భద్రతా సిబ్బంది హోటల్ వద్ద అలర్ట్ అయ్యారు. వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Members and workers of Assam unit of TMC protest outside Radisson Blu Hotel in Guwahati where rebel Maharashtra MLAs, including Shiv Sena's Eknath Shinde, are staying. Party's state president Ripun Bora is leading the protest here. pic.twitter.com/rfoD0fQSKU — ANI (@ANI) June 23, 2022 ఇది కూడా చదవండి: ‘మహా’ సంకటం: అనర్హత వేటు గండం.. షిండే వర్గంలో తీవ్ర ఉత్కంఠ -
‘మహా’లో మరో ట్విస్ట్.. సీఎం ఉద్ధవ్ థాక్రే, గవర్నర్‌కు కరోనా పాజిటివ్
ముంబై: మహారాష్ట్రలో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సీఎం ఉద్ధవ్ థాక్రే కరోనా బారినపడ్డారు. బుధవారం ఆయన కరోనా టెస్టులు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. సీఎంకు కరోనా సోకడంతో వర్చువల్‌గా కేబినెట్ భేటీలో పాల్గొననున్నట్టు తెలిపారు. కాగా, కేబినెట్ భేటీ అనంతర ఉద్దవ్ థాక్రే సీఎం పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది. మరోవైపు.. రాజీకయ సంక్షోభం నెలకొన్న వేళ మహారాష్ట్రలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం.. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో గవర్నర్ కోశ్యారీ.. ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దీంతో గోవా గవర్నర్ శ్రీధరణ్ పిళ్లైకి కేంద్రం.. అదనంగా మహారాష్ట్ర బాధ్యతలను కూడా అప్పగించింది. #WATCH | Mumbai: "Maharashtra CM Uddhav Thackeray has tested positive for #COVID19," says Congress Observer for the state, Kamal Nath. pic.twitter.com/wl22yJkXXt — ANI (@ANI) June 22, 2022 ఇది కూడా చదవండి: ‘మహా’ సంకటం: కీలక పరిణామం అసెంబ్లీ రద్దు.? -
Maharashtra Political Crisis: అసోంకు మారిన ‘మహా’ రాజకీయం.. ఖుషీలో కమలం నేతలు!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) తిరుగుబావుటా ఎగురవేసిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రే వారందరినీ ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌కు తరలించారు. కాగా, బుధవారం ఉదయానికి వీరంతా బీజేపీ పాలిత అసోంకు చేరుకున్నారు. గుహవటిలో విమానాశ్రయంలో ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. తనతో శివసేనకు చెందిన 40 మంది(33 మంది శివసేన ఎమ్మెల్యే, 7 స్వతంత్రులు) ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. తామంతా బాలా సాహెబ్ హిందుత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తాము అని అన్నారు. ఈ సందర్భంగా వారిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన అసోం బీజేపీ ఎమ్మెల్యే సుశాంత బోర్గోవైన్ విమానాశ్రయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఎంత మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చారో తెలియదు. వారంతా కేవలం వ్యక్తిగత కారణాల వల్లే ఇక్కడికి వచ్చారని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. నేడు(బుధవారం) మహారాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్ సమావేశం జరుగనుంది. భవిష్యత్ కార్యాచరణపై కీలక జరిగే అవకాశం ఉంది. #WATCH | "A total of 40 Shiv Sena MLAs are present here. We will carry Balasaheb Thackeray's Hindutva," said Shiv Sena leader Eknath Shinde after arriving in Guwahati, Assam pic.twitter.com/YpSrGbJvdt — ANI (@ANI) June 22, 2022 ఇది కూడా చదవండి: మళ్లీ ఆపరేషన్ కమలం... ‘మహా’ సంక్షోభం -
పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం.. ‘మోదీ పట్టుకుంటారా ?’
ముంబైలో గ్యాంగ్‌స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనే దావూద్ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది. అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్ సంబంధిన అన్ని విభాగాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని దావూద్ సోదరి హాసీనా పార్కర్ కుమారుడు అలిశా పార్కర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అనంతరం పార్కర్‌ను విచారించే క్రమంలో దావూద్ పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడని అతడు తెలిపాడు. దీంతో దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో బయటకు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఇక, ఈడీ విచారణ సందర్భంగా పార్కర్.. ‘‘నేను పుట్టుక ముందే తన మామ(దావూద్ ఇబ్రహీం) ముంబై వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు భారత్‌ను వదిలి.. పాకిస్తాన్లో ఉంటున్నట్టు మా బంధువుల ద్వారా తెలిసింది. అయితే, ఇంతకు ముందు కొన్నిసార్లు ఈద్, ఇతర పండుగలకు దావూర్ భార్య మెహ్జబీన్.. తన భార్య ఆయేషా, తన సోదరితో మాట్లాడింది.’’ అని చెప్పినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దీంతో దావూద్.. పాకిస్తాన్లో ఉన్నాడని రుజువైంది. ఈడీ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత.. దావూద్ ఇబ్రహాంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే డిమాండ్ చేశారు. In a big revelation, Haseena Parkar's son Alishah has told the Enforcement Directorate that underworld don Dawood Ibrahim is living in Pakistan's Karachi. Read more: https://t.co/TJtKSCm0ow#DawoodIbrahim pic.twitter.com/9bs8EW4xmT — TIMES NOW (@TimesNow) May 24, 2022 అంతకుముందు.. మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుచగా.. కోర్టు ఈడీ కస్టడీ విధించింది. దీంతో నవాబ్ మాలిక్ వ్యవహారంలో బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకోవాలని ప్రధాని మోదీకి ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. Central Govt should take action on it. Till now the location was not known but now if the location is clear then the Central govt should take it seriously and take the action: Maharashtra Home Minister Dilip Walse Patil on Dawood Ibrahim pic.twitter.com/V56OvHK6pI — ANI (@ANI) May 24, 2022 ఇది కూడా చదవండి: బీజేపీకి దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్ -
పాలిటిక్స్‌లో మరో సంచలనం.. ముంబై వేదికగా సీఎంల మీటింగ్.!
సాక్షి, ముంబై: దేశంలో పాలిటిక్స్ మరోసారి వేడెక్కాయి. ప్రస్తుతం దేశం నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు త్వరలో ముంబై వేదిక కానుంది. బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారం తెలిపారు. ఈ సందర్బంగా సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతోపాటు ద్రవ్యోల్బణం, మత విద్వేషాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. కాగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ సమావేశానికి సంబంధించి బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాసినట్టు తెలిపారు. మమతా బెనర్జీ లేఖపై సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవారు చర్చించారని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. దేశంలో పలు చోట్ల జరుగుతున్న మత ఘర్షణలు, విద్వేష ప్రసంగాలపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడి మాట్లాడాలని 13 విపక్ష పార్టీల నేతలు శనివారం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీయేతర రాష్ట్రాల సీఎం సమావేశం జరుగనుండటం దేశంలో హాట్ టాపిక్‌గా మారింది. హిందూ ఒవైసీ.. మరోవైపు.. మహారాష్ట్రలో పరిస్థితులపై సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేపై సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఠాజ్ ఠాక్రే ‘హిందూ ఒవైసీ’ అని, ఎంఎన్ఎస్ ‘హిందుత్వ మజ్లిస్ పార్టీ’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే రాజ్ థాక్రే.. బీజేపీ అండతోనే ఇలాంటి కొన్ని విషయాలను వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. ఇది చదవండి: శ్రీరాముడి ఆలోచనకే అది వ్యతిరేకం.. -
దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో బీజేపీ, శివసేన మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి సోదరుడైన శ్రీధర్ పాటన్కర్‌కు వ్యతిరేకంగా ఈడీ చర్యలు చేపట్టింది. ఇందులో బాగంగా సుమారు రూ. 6.45 కోట్ల విలువలైన ఆస్తులను మంగళవారం జప్తు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ..‘‘ మీరు(బీజేపీ) అధికారంలోకి రావాలంటే రండి. అయితే అధికారంలోకి రావడానికి ఈ దుర్మార్గపు పనులన్నీ చేయకండి. అధికారం కోసం మరొకరి కుటుంబ సభ్యులను వేధించకండి. మేము మీ కుటుంబ సభ్యులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. మీ(బీజేపీ) కుటుంబ సభ్యులు తప్పు చేశారని, కాషాయ నేతలను ఇబ్బంది పెట్టగలమని తాము చెప్పడం లేదు. బీజేపీ అధికారంలోకి రావడం కోసం తమను(ఉద్ధవ్ ఠాక్రే, కుటుంబ సభ్యులు) జైలులో పెట్టాలనుకుంటే పెట్టండి’’ అని విమర్శించారు. అంతకు ముందు.. మనీలాండరింగ్ కేసులో అరెస్టైన మంత్రి నవాబ్ మాలిక్ రాజీనామాను బీజేపీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన తీవ్రంగా మండిపడ్డారు. నవాబ్ మాలిక్‌కు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, ఈ విషయం మాజీ సీఎం ఫడ్నవీస్‌కు కూడా తెలుసని ఆయన ఘాటుగా స్పందించారు. అసలు దావూద్ ఎక్కడుంటాడు? ఎవరికైనా తెలుసా? అంటూ ప్రశ్నించారు. బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకుని చంపేస్తారా? అని ప్రధాని మోదీకి ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే బీజేపీ గత ఎన్నికల్లో రామ మందిరం పేరు మీదుగా ఓట్లు అడిగిందని, ఇప్పుడు దావూద్ పేరు మీద ఓట్లు అడగానికి సిద్ధపడిందా? అంటూ విమర్శలు గుప్పించారు. మంత్రి నవాబ్ మాలిక్ నిజంగా దావూద్‌తో సంబంధాలుంటే కేంద్ర దర్యాప్తు బృందాలు ఇన్ని రోజులు ఎందుకు దాడులు చేయలేదని, ప్రశ్నించలేదని బీజేపీని నిలదీశారు. -
దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అవసరం : కేసీఆర్
-
ముంబైతో ముందుకు!
జాతీయ స్థాయిలో బీజేపీయేతర పార్టీలను కూడగట్టడంలో క్రియాశీల పాత్ర పోషిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. అందులో భాగంగా పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. ఆదివారం ఉదయం 10:40 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనున్నారు. గతంలో 2016లో గోదావరి నదీ జలాల ఒప్పందం కోసం, 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎంను ఆహ్వానించేందుకు కేసీఆర్ ముంబై వెళ్లారు. రెండు పర్యాయాలూ అప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ప్రస్తుతం జరిగే మూడో పర్యటన మాత్రం పూర్తిగా రాజకీయ కోణంలో కొనసాగనుంది. కేసీఆర్ పుట్టిన రోజు పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతూ వారణాసి, సూరత్ తదితర చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన తరహాలో.. సీఎం కేసీఆర్ పర్యటనను స్వాగతిస్తూ ముంబైలోని పలు ప్రాంతాల్లో ప్రవాస తెలంగాణవాసులతోపాటు శివసేన ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై గత కొన్నాళ్లుగా నిప్పులు చెరుగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. బీజేపీ, కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా జాతీయ స్థాయిలో విశాల రాజకీయ వేదిక ఏర్పాటులో క్రియాశీల పాత్ర పోషిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 20న ముంబైకి రావాల్సిందిగా ఉద్ధవ్ ఠాక్రే నుంచి ఆహ్వానం అందిన నేపథ్యంలో సీఎం మహారాష్ట్రకు వెళుతున్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కె.కేశవరావుతో పాటు ఒకరిద్దరు రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఆయన వెంట వెళ్లనున్నారు. ముంబైలో ఉద్ధవ్ ఠాక్రేతో కలిసి కేసీఆర్ మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఠాక్రేతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ మీడియా ప్రతినిధులతో మాట్లాడే అవకాశముంది. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కూడా కేసీఆర్ కలిసి జాతీయ రాజకీయాలపై చర్చించవచ్చని తెలుస్తోంది. ముంబయి పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. బీజేపీపై పోరాటానికి కార్యాచరణపై చర్చ... రాజ్యాంగం ముసుగులో సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తూ రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని మింగేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోందని కేసీఆర్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకు వేసి దేశానికి కొత్త రాజ్యాంగం అవసరమనే వ్యాఖ్యలు కూడా చేశారు. సాధారణ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే ఉండటంతో బీజేపీ వ్యతిరేక పార్టీల నడుమ ఐక్యత ఎజెండాగా కేసీఆర్, థాక్రేల భేటీ సాగుతుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. వివిధ రకాల భావజాలం, సైద్ధాంతిక పునాది కలిగిన రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఏకం కావడంలో ఎదురయ్యే అవరోధాలు, వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన మార్గంపై ఇరువురు సీఎంలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో కొనసాగించాల్సిన పోరు, అందుకు అవసరమైన కార్యాచరణ ఎలా ఉండాలనే కోణంలో ప్రధానంగా చర్చ జరుగుతుందని చెబుతున్నారు. గతంలో జాతీయ స్థాయిలో ఈ విధంగా జనతా, జనతాదళ్ పార్టీల రూపంలో సాగిన ప్రయత్నాలు, వాటి వైఫల్యానికి దారితీసిన కారణాలపై కేసీఆర్ ఇప్పటికే ఒక నోట్ సిద్ధం చేసినట్లు తెలిసింది. కేవలం బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేకత, ఆ రెండు పార్టీల వైఫల్యం అనే అంశంపైనే కాకుండా దేశ ప్రజల ముందు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి ఆవశ్యకత, దేశం సాధించాల్సిన అభివృద్ధి నమూనా ఏ తరహాలో ఉండాలనే విషయమూ ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. దేశ అభివృద్ధికి అవసరమైన భౌతిక, మానవ వనరులు అందుబాటులో ఉన్నా కేంద్రం వాటిని వినియోగించుకోలేక పోతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలు ఆదివారం జరిగే భేటీ ఎజెండాగా ఉంటాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. త్వరలో మమత, స్టాలిన్‌తోనూ భేటీ... తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్రతో పాటు బీజేపీయేతర ముఖ్యమంత్రులతో త్వరలో ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. కాగా ఆదివారం థాక్రేతో జరిగే భేటీలో ఢిల్లీ సమావేశం ఎజెండా గురించి కూడా కేసీఆర్ చర్చిస్తారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసిన తర్వాత మమతా బెనర్జీతో, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మరోసారి కేసీఆర్ భేటీ అయ్యే అవకాశముంది. ఇలావుండగా కేరళ సీఎం పినరయి విజయన్, ఆర్జేడీ నాయకులు తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరి, డి.రాజాతోనూ కేసీఆర్ ఇటీవల వేర్వేరు సందర్భాల్లో భేటీ అయ్యారు. కాగా జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంపై కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు జనతాదళ్ (సెక్యులర్) అధినేత దేవెగౌడ, మమత, స్టాలిన్ తదితరులు ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉద్ధవ్‌తో భేటీ అనంతరం జాతీయ రాజకీయాల్లో మరింత కీలకంగా పనిచేసేందుకు కేసీఆర్ ఇప్పటికే రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
బీజేపీ మంత్రికి శివసేన వార్నింగ్.. మేము మీకు ‘బాప్’ అంటూ..
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అధికార శివసేన, బీజేపీ నేతల మధ్య మాటల యుద్థం నడుస్తోంది. కేంద్ర మంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. అంతకు ముందకు రాణే శుక్రవారం మాట్లాడుతూ.. థాక్రే కుటుంబం, శివసేన జాతకం తన వద్ద ఉందని ఎవరినీ విడిచిపెట్టమంటూ వ్యాఖ్యలు చేశారు. సీఎం ఉద్దవ్ థాక్రే నివాసం ‘మాతోశ్రీ’లో నలుగురు వ్యక్తుల కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో శనివారం సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ఇలాంటి బెదిరింపులను తాము లెక్కచేయమని, రాణే జాతకం కూడా తన వద్ద ఉందంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే మీరు కేంద్ర మంత్రి కావచ్చు.. కానీ ఇది మహారాష్ట్ర.. మేము మీకు ‘బాప్’ ఇది మర్చిపోవద్దంటూ కామెంట్స్ చేశారు. బీజేపీ బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. తాము నిజంగా కుంభకోణాలకు పాల్పడితే వాటికి సంబంధించిన పత్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని బీజేపీ మాజీ ఎంపీ సోమయ్యకు సోమయ్యకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగానే తాము కూడా సోమయ్యకు సంబంధించిన కుంభకోణాలను బయటపెడతామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమయ్య పోవాయ్‌లోని పెరూ బాగ్‌లో మురికివాడల పునరావాస ప్రాజెక్ట్ ద్వారా సోమయ్య రూ. 300 కోట్లకు పైగా దోపిడీ చేశారని రౌత్ ఆరోపించారు. అలాగే, పాల్ఘార్లో రూ. 260 కోట్ల విలువైన ప్రాజెక్ట్ విషయంలో కుంభకోణాన్ని బయటపెడతామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న క్రిమినల్ సిండికేట్‌ను అంతం చేస్తామంటూ సంజయ్ రౌత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుంభకోణాలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
‘‘వై ఐ కిల్డ్ గాంధీ’’ సినిమా విడుదల ఆపండి
ముంబై: మహాత్మాగాంధీ వర్ధంతి రోజైన జనవరి 30న విడుదల కానున్న వై ఐ కిల్డ్ గాంధీ సినిమా విడుదల నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సినిమాతో జాత్యహంకార పోకడలు పెచ్చుమీరుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ ఒక లేఖ రాశారు. మహాత్ముని మార్గాలైన అహింస, శాంతిని స్మరించుకోవాల్సిన రోజు ఈ సినిమా విడుదల చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్సీపీ ఎంపీ, నటుడు అమోల్ కొల్హె ఈ సినిమాలో మహాత్ముడిని చంపిన నాథూరామ్ గాడ్సే పాత్రని పోషించారు. -
మహారాష్ట్ర సీఎం భార్యపై అభ్యంతరకర పోస్టు..
పుణె: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే భార్య రశ్మీ ఠాక్రేను బిహార్ మాజీ సీఎం రబ్రీదేవిగా పేర్కొంటూ ట్వీట్ చేసిన బీజేపీ సోషల్ మీడియా సెల్ ఇన్చార్జి జితేన్ గజారియాపై పుణె పోలీసులు కేసు నమోదు చేశారు. రశ్మీ ఠాక్రే ఫొటోపై మరాఠీ రబ్రీదేవిగా పేర్కొంటూ గజారియా పెట్టిన వివాదాస్పద పోస్టుపై శివసేన కార్యకర్త ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో, ముంబై పోలీసులు గురువారం గజారియాను సుమారు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించి, వాంగ్మూలాన్ని నమోదు చేశారు. -
ప్రముఖ చరిత్రకారుడు, రచయిత, బాబాసాహెబ్ పురందరే మృతి
-
మౌలిక సదుపాయాలు అధ్వానం
ముంబై: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ అన్నారు. అందరికీ న్యాయం అందాలంటే, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కానీ మన కోర్టుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ ఒక ప్రణాళిక లేకుండా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌కు చెందిన భవనాలను శనివారం సీజేఐ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు. న్యాయశాఖ మంత్రి ఎదుటే జస్టిస్ రమణ తన ఆవేదనంతా బయటపెట్టారు. దేశంలోని చాలా కోర్టుల్లో సరైన సదుపాయాలు లేవని, కొన్ని కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. మౌలిక సదుపాయాలు ఉంటేనే న్యాయవ్యవస్థ బాగుంటుందని, న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తే ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని జస్టిస్ రమణ అభిప్రాయపడ్డారు. 2018లో సరైన సమయంలో తీర్పులు రాకపోవడం వల్ల దేశం వార్షిక జీడీపీలో 9% మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైనట్టుగా ఈ సందర్భంగా జస్టిస్ రమణ చెప్పారు. ఇప్పుడు తాను ప్రారంభించిన ఔరంగాబాద్ కోర్టు భవన నిర్మాణం 2011లో మొదలైందని, అది పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందంటే ప్రణాళికలో ఎన్ని లోపాలున్నాయో తెలుస్తోందని అన్నారు. కేవలం క్రిమినల్స్, బాధితులు మాత్రమే కోర్టు గుమ్మం తొక్కుతారన్న అభిప్రాయం ఇప్పటికీ సామాన్యుల్లో నెలకొని ఉందని.. చాలా మంది తాము అసలు కోర్టు ముఖం కూడా చూడలేదని గర్వంగా చెప్పుకుంటారన్న జస్టిస్ రమణ అలాంటి ఆలోచనల్ని రూపుమాపి అందరూ తమ హక్కుల సాధనకు కోర్టుకు వచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రజలు కోర్టుకు రావడానికి సంకోచపడే రోజులు పోవాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉండడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని వ్యాఖ్యానించారు. దృఢమైన న్యాయవ్యవస్థతో ప్రజాస్వామ్యం విజయవంతం: రిజిజు జస్టిస్ ఎన్.వి. రమణ మౌలిక సదుపాయాల అంశం గురించి ఆందోళన వ్యక్తం చేయడానికి ముందే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే దృఢమైన న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ గత మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బడ్జెట్‌తో 4 వేల కోర్టు భవనాలు, న్యాయమూర్తులకు 4 వేల నివాసాలు కట్టించి ఇస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాయని రిజిజు చెప్పారు. కోర్టుల్లో పరిస్థితి ఇదీ..! కోర్టుల్లో మౌలికసదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో జస్టిస్ రమణ గణాంకాలతో సహా వివరించారు. ‘‘దేశవ్యాప్తంగా 20,143 కోర్టు భవనాలు ఉన్నాయి. 16% కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. 26% కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్ సదుపాయం లేదు. కేవలం 54% కోర్టుల్లోనే రక్షిత మంచినీరు లభిస్తోంది. 5% కోర్టుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. 32% కోర్టుల్లో రికార్డు రూములు విడిగా ఉన్నాయి. 51%కోర్టుల్లో మాత్రమే లైబ్రరీ సదుపాయం ఉంది. కేవలం 27% కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచా రణ చేయడానికి వీలుగా న్యాయమూర్తుల టేబుల్‌పై కంప్యూటర్లు ఉన్నాయి’’ అని తెలిపారు. -
‘దేవాలయాలు రీఓపెన్ చేయాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయొద్దు’
సాక్షి, ముంబై: కరోనా వైరస్ కేసుల సంఖ్య అదుపులోకి రాకముందే దేవాలయాలను పున: ప్రారంభించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేయొద్దని సీఎం ఉద్ధవ్ ఠాక్రే కోరారు. ఆయన ఆదివారం కరోనా నేపథ్యంలో డాక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఆలయాల పున: ప్రారంభంపై ప్రతిపక్షాలు నిరసన చేయొద్దన్నారు. గత ఏడాది పండగల అనంతరం కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. ఎక్కువ మంది ప్రజలు ఓకేచోట గుమిగూడవద్దని, తప్పనిసరిగా ముఖానికి మాస్క్ ధరించాలని సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు కూడా మాస్క్ ధరించాలని పేర్కొన్నారు. చదవండి: రైతుల ఆందోళన: ఎంపీ వరుణ్ గాంధీ మద్దతు రాష్ట్రంలో వైద్యానికి సంబంధించి మౌళిక సదుపాయాలను పెంచామని సీఎం చెప్పారు. ప్రజలు డెగ్యూ, మలేరియా వ్యాధుల బారినపడుతున్నారని, వారి వ్యాధి లక్షణాల్లో తేడాలు కనిపిస్తున్నాయని చెప్పారు. డెగ్యూ, మలేరియా బారినపడినవారు కూడా కోవిడ్ నిర్థారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా మూడో వేవ్ రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల్లో బీజేపీ, మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన పార్టీలను సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రస్తావించపోవడం గమనార్హం. చదవండి: తొలి బస్ డ్రైవర్: ఆమె ప్రత్యేకత ఇదే.. -
ప్రముఖ సామాజిక కార్యకర్త మృతి, సీఎం ఠాక్రే సంతాపం
సాక్షి,ముంబై: సామాజిక కార్యకర్త, పరిశోధకురాలు, రచయిత డాక్టర్ గెయిల్ ఓంవేద్(81)కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఆమె బుధవారం కన్నుమూశారని భర్త, కార్యకర్త భారత్ పటాంకర్ ప్రకటించారు. గెయిల్ అస్తమయంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతాపం తెలిపారు. వివిధ సామాజిక ఉద్యమాలు, జానపద సంప్రదాయాలు, మహిళల హక్కులపై ఆమె చేసిన కృషి మరువలేనివని ఠాక్రే నివాళులర్పించారు. అటు పలువురు దళిత, మహిళా ఉద్యమకారులు, ఇతర సాహితీవేత్తలు కూడా గెయిల్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. చరిత్రకారుడు రామచంద్ర గుహ, సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ కూడా ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రంలో వామపక్ష ఉద్యమానికి ఎంతో సహాయపడ్డారని సీపీఎం నేత అజిత్ అభ్యంకర్ అన్నారు. అమెరికాలో జన్మించిన గెయిల్ అంబేద్కర్-పూలే ఉద్యమంపై పీహెచ్డీ చేసేందుకు ఇండియాకు వచ్చారు. భారతీయ పౌరురాలిగా మారి సామాజిక కార్యకర్త భరత్ పటాంకర్‌ను పెళ్లి చేసుకున్నారు. దళిత రాజకీయాలు, మహిళా పోరాటాలు, కుల వ్యతిరేక ఉద్యమంపై అనే పుస్తకాలు రచించారు. ముఖ్యంగా శ్రామిక్ ముక్తీ దళ్ ఏర్పాటు, కుల వ్యతిరేక ఉద్యమంలో విశేష పాత్ర పోషించారు. అలాగే పర్యావరణ సమస్యలపైన కూడా రచనలు చేశారు. కాగా 1941, ఆగస్టు 2వ తేదీన అమెరికాలోని మిన్నసోటా రాష్ట్రంలోని మినియాపోలిస్‌లో గెయిల్ జన్మించారు. 1963-64 కాలంలో ఇండియాను సందర్శించిన ఆమె దళిత, కుల వ్యతిరేక ఉద్యమాల ఆమె ఆకర్షితురాలయ్యారు. అలా పీహెచ్డీ నిమిత్తం 1970-71లో ఇండియాకు వచ్చారు. 1976లో భరత్ పటాంకర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1983లో భారతీయ పౌరసత్వం సాధించారు. అప్పటినుంచి సతారా జిల్లాలోని కాసేగావ్‌లో నివాసముంటున్నారు. భర్తతో గెయిల్ (ఫైల్ ఫోటో) భర్తతో కలిసి శ్రామిక్ ముక్తి దళ్‌ను స్థాపించి అక్కడి మహిళల అభ్యున్నతికి కృషి చేశారు. మహారాష్ట్రలోని గ్రామీణ ప్రాంతాల ప్రజల అభివృద్ధి, కొంకణ్ ప్రాంతంలో నీటి హక్కుల కోసం సాగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అలాగే సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం, నార్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీల బోర్డ్‌లో సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవలి సంవత్సరాలలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌తో వివిధ సమస్యలపై సలహాదారుగా కూడా గెయిల్ పనిచేయడం విశేషం. -
రెచ్చిపోయిన శివసేన.. కేంద్ర మంత్రి ఆస్తులు ధ్వంసం
సాక్షి,ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యలతో రేగిన దుమారం మరింత తీవ్రమవుతోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై వ్యాఖ్యలకు నిరసనగా శివసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. కేంద్ర మంత్రికి సంబంధించిన ఆస్తులపై దాడిచేశారు. అలాగే నాసిక్‌లోని బీజేపీ కార్యాలయంపై కూడా రాళ్లు రువ్వారు. ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో బీజేపీ-శివసేన కార్యకర్తల వార్ మరింత ముదురుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై సూక్ష్మ, చిన్న, మధ్యతరహా శాఖా మంత్రి నారాయణ్ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై శివసేన కార్యకర్తలు దూకుడుమీద ఉన్నారు. ముంబైతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు , ప్రదర్శనలు చేపట్టారు. అనంతరం పూణేలోని ఆర్ డెక్కన్ మాల్‌పై రాళ్లు రువ్వారు. దీంతో తీవ్ర నష్టం సంభవించినట్టు తెలుస్తోంది. యువ నేత వరుణ్ దేశాయ్ నాయకత్వంలో, కొంతమంది శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముంబైలోని జుహులోని రాణే బంగ్లాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో, రాణే మద్దతుదారులు ప్రతిఘటించడంతో జుహు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ముంబై, నాసిక్, చిప్లూన్, సాంగ్లీ, ఔరంగాబాద్ లలో శివ సైనికులు రెచ్చిపోయారు. వీరి ఆందోళనలు, ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తత రాజేశాయి. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా దేశ స్వాతంత్య్ర దిన సంవత్సరాన్ని మరచిపోయారని, అదే తానైతే ఆయనను చెంపదెబ్బ కొట్టి ఉండేవాడినంటూ కేంద్రమంత్రి రాణే మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. దీంతో నాసిక్ పోలీసులు రాణేను అరెస్టు చేయడం, చివరకు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. -
ఠాక్రే, మోదీ భేటీ.. ‘రాజకీయాలు వేరుగా ఉంటాయి’
ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కు మంచి అనుబంధమే ఉందని, కానీ అది రాజకీయంగా కాదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. జూన్ 8న ఉద్ధవ్ ఠాక్రే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం అయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరూ త్వరలోనే రాజకీయంగా కూడా ఒకటవుతారనే వార్తలు వినిపించాయి. ఈ సమావేశంపై కొందరు విమర్శలు కూడా చేశారు. మహారాష్ట్ర పాలక శివసేన-నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) -కాంగ్రెస్ కూటమి ఇబ్బందుల్లో ఉందని, శివసేన బీజేపీతో జట్టు కట్టనుందని పుకార్లు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ ‘జూన్ 8న మోదీని ఉద్ధవ్ కలిశారు. సుమారు 40 నిమిషాల పాటు వారి మధ్య చర్చ కొనసాగింది. వెంటనే అనేక ఊహాగానాలు ప్రచారం అయ్యాయి. శివసేనతో బీజేపీ మరోసారి చెతులు కలుపుతుందనే వార్తలు గుప్పుమన్నాయి. మా మార్గాలు వేరు కావచ్చు కానీ మా మధ్య గట్టి అనుబంధమే ఉంది. ఠాక్రే కుటుంబానికి, నరేంద్ర మోదీకి మధ్య చాలా సంవత్సరాలు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలు వేరుగా ఉంటాయి’ అని సంజయ్ రౌత్ చెప్పుకొచ్చారు. ఇక శరద్ పవార్ గురించి స్పందిస్తూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ తాము ఎల్లప్పుడూ పవార్ కుటుంబంతో మంచి సంబంధాలు కలిగి ఉన్నాము. అందరితో మమేకమై జీవించడం మహారాష్ట్ర సంస్కృతి అని సంజయ్ రౌత్ అన్నారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు కొట్టివేసిన మరాఠా రిజర్వేషన్ల కోటా విషయమై కేంద్రం జోక్యం చేసుకోవాలని సీఎం కోరినట్టు ఆయన తెలిపారు. చదవండి: జాబ్ నిలవాలంటే టెన్త్ పాసవ్వాలన్నారు, ఎట్టకేలకు 57 ఏళ్ల వయసులో -
మహారాష్ట్రలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మరణం
ముంబై: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి తగ్గుతున్న సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.ఇటువంటి ఆందోళనల మధ్య మహారాష్ట్రలో తొలి డెల్టా ప్లస్ వేరియంట్ మరణం నమోదైంది. రత్నగిరి జిల్లాలోని సంగమేశ్వర్ ప్రాంతంలో డెల్టా ప్లస్ వేరియంట్ తో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా మహారాష్ట్రలో ఇంతవరకు 21 డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వాటిలో రత్నగిరిలో తొమ్మిది, జల్గావ్లో ఏడు, ముంబైలో రెండు, పాల్ఘర్, థానే, సింధుదుర్గ్ జిల్లాల్లో ఒక్కొక్కటిగా ఉన్నాయి. మహారాష్ట్రలో ఆక్పిజన్ కొరత తీవ్రంగా ఉంది. పొంచి ఉన్న థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని రోజుకు 3వేల టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంఓ) ఉత్పత్తిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే లక్ష్యంగా నిర్దేశించారు. ప్రస్తుతం రాష్ట్ర ఎల్ఎంఓ ఉత్పత్తి 1,300 టన్నులు మాత్రమే ఉంది. ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా ఆక్సిజన్ ఉత్పత్తిదారులను సీఎం కోరారు. థర్డ్ వేవ్ విజృంభిస్తుందోన్నఆందోళనల నేపథ్యంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్‌ను కనుగొన్నామని థాకరే చెప్పారు. చదవండి: ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం -
బీజేపీతో కలిసిపోదాం.. సీఎంకు శివసేన ఎమ్మెల్యే లేఖ
ముంబై/పుణే: బీజేపీతో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సయోధ్య చేసుకోవాలని శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ మహారాష్ట్ర సీఎం, పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రేను కోరారు. ఆలస్యం కాకముందే మేల్కొనాలని విజ్ఞప్తి చేశారు. ప్రతాప్ సర్నాయక్పై మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు జరుపుతోంది. తమతో పాటు పలువురు శివసేన నాయకులు కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇవి తొలిగిపోవాలంటే బీజేపీతో సయోధ్య కుదుర్చుకోవాలని ఈనెల 10వ తేదీన రాసిన లేఖలో ఉద్ధవ్‌ను సర్నాయక్ కోరారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన కాంగ్రెస్, ఎన్సీపీలు శివసేన శ్రేణుల్లో విబేధాలు సృష్టించి పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా... ఇరుపార్టీల నాయకుల మధ్య వ్యక్తిగత సృహుద్భావ సంబంధాలు ఉన్నాయని... ఆలస్యం కాకముందే మేల్కొని బీజేపీతో, ప్రధానితో చేతులు కలపాలని ఉద్ధవ్‌కు సూచించారు. సర్నాయక్ లేఖ మహా వికాస్ అఘాడి (శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీలు భాగస్వాములుగా 2019 నవంబరులో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటైన విషయం తెలిసిందే) ప్రభుత్వంలో కలకలానికి కారణమైంది. శివసేన అంతర్గత వ్యవహారంగా కాంగ్రెస్ దీన్ని అభివర్ణించింది. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ ఆదివారం స్పందిస్తూ... గత 18 నెలలుగా తామూ ఇదే చెబుతున్నామన్నారు. ‘ముస్లింలను దువ్వే కాంగ్రెస్, ఎన్సీపీ విధానాలను వ్యతిరేకించడం ద్వారానే శివసేన రాజకీయంగా ఎదిగింది. అధికారం కోసం ఇప్పుడవే పార్టీలతో జతకట్టింది. సర్నాయక్ లేఖపై ఉద్ధవ్ నిర్ణయం తీసుకోవాలి’ అని చంద్రకాంత్ పాటిల్ అన్నారు. ఐదేళ్లూ మా మద్దతు ఉంటుంది: కాంగ్రెస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని, సంకీర్ణ భాగస్వాములతో ఎన్నికల పొత్తులుండవని ఇటీవల ప్రకటించిన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కొత్త వివాదానికి తెరతీశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని శివసేవ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శనివారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకుండా... ఎన్నికల గురించి మాట్లాడితే జనం చెప్పులతో కొడతారని ఠాక్రే అన్నారు. దీంతో శివసేన, కాంగ్రెస్‌ల మధ్య సంబంధాలు క్షీణించాయనే దానికే ఇది సంకేతమని ఊహాగానాలు మొదలయ్యాయి. సంకీర్ణ ప్రభుత్వ మనుగడపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. దాంతో నానా పటోలే ఆదివారం స్పందించారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఐదేళ్లూ తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. శివసేన– కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి సమస్యలు లేవన్నారు. -
Maharashtra: అన్‌లాక్ ప్రకటనపై సర్కారు యూటర్న్!
మహారాష్ట్రలో కరోనా కట్టడికి కఠినంగా లాక్డౌన్ అమలు అవుతోంది. అయితే ప్రజలకు ఊరటనిచ్చేలా శుక్రవారం నుంచి అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు స్వయంగా మంత్రి ప్రకటించడం.. ఆ వెంటనే ప్రభుత్వం నుంచి విరుద్ధ ప్రకటన వెలువడడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీనిపై శుక్రవారం ఉదయం మరోసారి స్పష్టమైన ప్రకటన వెలువడింది. ముంబై: కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొంత మేర కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆంక్షలను సడలించడానికి 5 స్థాయిల్లో అన్‌లాక్ ప్రణాళికను విధించాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్ గురువారం ఉదయం ప్రకటించారు. అయితే ఆయన నుంచి ప్రకటన వెలువడగానే మీడియా కథనాలు వచ్చాయి. దీంతో జనాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సాయంత్రం పూట మహా సర్కార్ కీలక ప్రకటన చేసింది. తూచ్.. అటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇది ఒక ప్రతిపాదన మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ఉధృతి ఇంకా తగ్గలేదని, ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకోబోదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. అయితే ఈ ప్రకటనపై విజయ్ వాడేటివార్ మరోసారి స్పందించారు. ఆక్సిజన్ బెడ్స్ లభ్యత, పాజిటివిటీ రేట్ తగ్గుదల పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే దీనిపై అధికారికంగా ఒక స్పష్టత రాలేదని ఆయన చెప్పారు. ఇక భేటీలో అన్‌లాక్ ప్రక్రియపై నిర్ణయం తీసుకున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం సీఎం ఉద్దవ్ చేతుల్లోనే ఉంటుందని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో బుధవారం 15 వేలకు పైగా కొత్త కేసులు, 285 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ పరిస్థితి ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియను అమలు చేయాలని కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
లాక్డౌన్ ఎఫెక్ట్: ముంబైలో భారీగా తగ్గిన కొత్త కేసులు..
ముంబై: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మొదటిదశలో కంటే రెండో దశలో వైరస్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వైరస్ వ్యాప్తి మహరాష్ట్రలో తీవ్రంగా ఉండేది. ప్రతిరోజు వేలల్లో కొత్త కేసులు నమోదవుతుండటంతో ఎంతోమంది ఆసుపత్రుల్లో చేరారు. కానీ అక్కడి ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, వెంటిలేటర్, వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉండేది. దీంతో కరోనా కట్టడి కావాలంటే అది లాక్‌డౌన్‌తోనే సాధ్యమని ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే భావించారు. వెంటనే గత నెలలో లాక్డౌన్ కూడా ప్రకటించారు. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. అయిదు వారాల తర్వాత ఆర్థిక రాజధాని ముంబైలో కేసుల సంఖ్య తక్కువగా నమోదైనట్లు మహారాష్ట్ర ప్రభుత్వం నివేదికలో వెల్లడించింది. దీని ప్రకారం, గడచిన 24 గంటలలో కొత్తగా 2,624 కరోనా కేసులు నమోదవగా, 59,500 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 5 వారాలతో పోలిస్తే.. ఇవే అతితక్కువ కేసులు కావడం గమనార్హం. గతంలో మరణాల సంఖ్య 13,372 గా ఉండగా, ప్రస్తుతం అది 78కి తగ్గింది. గత ఆదివారం నాడు కరోనా పరీక్షల సంఖ్య 50,000 నుంచి 38 వేలకు తగ్గింది. ప్రస్తుతం, ముంబైలో 6,58,621 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ముంబైలో సెకండ్ వేవ్ మార్చి నుంచి తీవ్ర ప్రమాదకరంగా మారింది. అప్పటి నుంచి ప్రతిరోజు వేలసంఖ్యలో కొత్త కేసులు, మరణాలు సంభవించాయి. ఫలితంగా దేశంలోనే కోవిడ్‌తో అత్యంత నష్టపోయిన నగరాలలో ఒకటిగా ముంబై నిలిచింది. గడచిన, మార్చి,ఏప్రిల్‌లలో ఒక్క రోజులో 60వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు దానిసంఖ్య 48వేలకు తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా .. కరోనా నుంచి కొలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరిగింది. మహారాష్ట్రలో రికవరీ రేటు 84.7 శాతంకాగా, మరణాల రేటు 1.49 శాతంగా ఉంది. -
దేశ్‌ముఖ్ వ్యవహారం: సీఎం నోరు విప్పడం లేదేంటి?
ముంబై: మంత్రివర్గంలోని వ్యక్తి తప్పుచేస్తే సరిదిద్దా ల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదేనని కానీ, ఇంత జరి గినా ఉద్ధవ్ నోరు విప్పడం లేదని ప్రతిపక్ష నాయ కుడు దేవేంద్ర ఫడ్నవిస్ విమర్శించారు. భవిష్యత్తులో ఇది ప్రమాదానికి దారితీసే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక అనిల్ దేశ్‌ముఖ్‌కు రాజీనామా చేయడం మినహా మరో ప్రత్యామ్నాయ మార్గం లేదని ఫడ్నవిస్ అన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నైతిక బాధ్యతవహిస్తూ ఇదివరకే రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, ఆలస్యంగానైన రాజీనామా చేసి మంత్రి పదవి నుంచి తప్పుకున్నారని ఫడ్నవీస్ పేర్నొన్నారు. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎందుకు నోరు విప్పడం లేదని ప్రతిపక్షనేత ప్రశ్నించారు. ఆయన మౌనంగా ఉండటం మంచిదికాదన్నారు. నైతిక బాధ్యత కేవలం అనిల్ దేశ్‌ముఖ్‌కే ఉందా? ఒక ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రేకు లేదా అని బీజేపీ నాయకుడు, ఎమ్మెల్యే నితేశ్ రాణే ట్విట్టర్లో ప్రశ్నిం చారు. ‘‘అనిల్ దేశ్‌ముఖ్ తనకు రూ.100 కోట్ల టార్గెట్ విధించినట్లు పరంబీర్ సింగ్ ఆరోపించారు. అందుకు నైతిక బాధ్యత దేశ్‌ముఖ్‌కు ఉంది కాబట్టి రాజీనామా చేశారు. మరి ముఖ్యమంత్రి సంగతేంటి. మిఠీ నదిని వెతుక్కోవల్సి వస్తుందా ఏంటి’’ అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. నిజాలు బయటికి వస్తాయి.. బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పుణేలో విలేకరులతో మాట్లాడుతూ.. తప్పులు చేసేవారికి శిక్ష తప్పదని, లేకపోతే ప్రజాస్వామ్యం బలపడదని అన్నారు. 15 రోజుల సీబీఐ దర్యాప్తుతో నిజాలు బయటికి వస్తాయని, సీబీఐ రూ. 100 కోట్ల వసూలు కేసులో అన్ని విషయాలు బయటపెడుతుందని పాటిల్ జోస్యం చెప్పారు. అంతేకాకుండా దేశ్‌ముఖ్ వ్యవహారంలో శరద్‌పవార్ తీరు సంతృప్తిగానే ఉందన్నారు. రెండు రాజీనామాలు ఉంటాయని 15రోజుల కిందటే చెప్పానని పాటిల్ వ్యాఖ్యానించారు. ఇపుడు మరొకటి అనుసరిస్తుందని అన్నారు. మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం పడిపోతుందా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాజ్యాంగం ప్రకారం వారికి మెజార్టీ ఉందని అప్పటివరకు ఏం కాబోదని తెలిపారు. అయితే ప్రజలు ఇప్పటికే కోవిడ్‌తో కష్టాల్లో ఉన్నారని ఇలాంటివి జరిగితే రాజకీయాలపై వారికి విశ్వాసం పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. దిలీప్‌కు హోంశాఖ.. మహారాష్ట్ర నూతన హోంశాఖ మంత్రి పదవి దిలీప్ వల్సే పాటిల్ ఎంపికయ్యారు. ఎన్సీపీలో అత్యంత అనుభవమున్న నాయకులల్లో ఒకరైన దిలీప్ వల్సే పాటిల్ ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పుణే జిల్లాలో 1956లో జన్మించిన దిలీప్ వల్సే పాటిల్ 1990లో రాజకీయ ప్రవేశం చేశారు. ఎల్ఎల్బీ చదివిన దిలీప్ వల్సే పాటిల్ తండ్రి దత్తాత్రేయ వల్సే పాటిల్ మార్గదర్శనంలో రాజకీయాల్లోకి దిగిన ఆయన అంబేగావ్ తాలూకాలో యువ నేతగా ముద్ర వేసుకున్నారు. అనంతరం అంబేగావ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఇప్పటి వరకు వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. శరద్ పవార్‌కు స్వీయ సహాయకునిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మరోవైపు 2009 నుంచి 2014 వరకు విధానసభ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. వైద్య విద్య, ఉన్నత సాంకేతిక విద్య, విద్యుత్ శాఖ, ఎక్సైజ్ శాఖ, కార్మికశాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. చదవండి: సీడీ యువతి తల్లికి అనారోగ్యం -
మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్..
ముంబై: రాష్ట్రంలో కరోనా మహమ్మారి రెండో దశలో కరాళనృత్యం చేస్తుండటంతో, వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ(రాత్రి 8 నుంచి ఉదయం 7 వరకు)తోపాటు వీకెండ్ లాక్‌డౌన్‌ను(శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 వరకు) అమలు చేయాలని ఆదివారం సంచలన ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేయాలని, 50శాతం సిబ్బందితోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నడిపించాలని ఆదేశించింది. అయితే, హోటళ్లలో పార్శిల్ సేవలకు మాత్రం మహా సర్కారు అనుమతులు ఇచ్చింది. గత కొన్ని వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో మహా సర్కారు తాజా ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసుల కట్టడికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీకెండ్ లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో శనివారం కొత్తగా 49,447 కేసులు నమోదు కాగా, 277 మరణాలు సంభవించాయి. -
అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన ముఖ్యమంత్రి సతీమణి
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ బారిన పడిన ముఖ్యమంత్రి సతీమణి అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరారు. కరోనా బారిన పడిన అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉన్న ఆమె అకస్మాత్తుగా మంగళవారం అర్ధరాత్రి ప్రైవేటు ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె ఆరోగ్యం క్షీణించిందనే పుకార్లు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సతీమణి రష్మీ ఠాక్రేకు మార్చ్ 23వ తేదీన పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అయితే అప్పటి నుంచి హోం క్వారంటైన్లో ఉన్న ఆమె మంగళవారం అర్ధరాత్రి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రిలో చేరారు. అంతకుముందు అంటే మార్చి 11వ తేదీన రష్మీ భర్తతో కలిసి కోవిడ్ టీకా తీసుకున్నారు. అయినా కూడా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆమె తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని గుర్తించి వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో రష్మీ ఠాక్రే చేరారు. అంతకుముందు భర్త, సీఎం ఉద్దవ్‌కు, అతడి కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో కరోనా మళ్లీ కరోనా విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. -
10 మంది సజీవ దహనం: నన్ను క్షమించండి..
ముంబై: మహమ్మారి వైరస్ బాధితులు ఉన్న సన్‌రైజ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం సంభవించి పది మంది మృతిచెందారు. ఈ ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాండూప్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 10కి చేరింది. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘క్షమించండి’ అంటూ బాధిత కుటుంబసభ్యులను సీఎం థాకరే కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదంలో వెంటిలేటర్‌పై ఉన్న వారే మరణించారని చెప్పారు. ఆస్పత్రి భవనాన్ని శుక్రవారం సీఎం సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులు వెంటనే కోలుకోవాలని ప్రార్థించారు. సన్ రైజ్ ఆస్పత్రిలో మొత్తం 76 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. మూడో అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించడంతో వెంటిలేటర్‌పై ఉన్న వారు బయటకు వెళ్లలేని పరిస్థితి కావడంతో వారంతా అగ్నికీలల్లో చిక్కుకుపోయారు. దీంతో వారు సజీవ దహనం అయ్యి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని 23 ఫైరింజన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ఆస్పత్రిలో చిక్కుకున్నవారిని బయటకు తీసుకొచ్చారు. ప్రమాదంలో గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. గతంలో రక్షణ చర్యలు లేవని ఈ ఆస్పత్రికి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు అందించారు. అయినా కూడా ఆస్పత్రి నిర్వాహకులు, భవన యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం సంభవించింది. Deeply mourn the loss of lives in a fire accident at a hospital in Bhandup, Mumbai. My thoughts and prayers are with the families of the victims of this tragedy. I pray for speedy recovery of the injured. — President of India (@rashtrapatibhvn) March 26, 2021 -
సుడిగుండంలో ‘మహా’ సర్కారు
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపాన బాంబులతో దొరికిన కారు అనేకానేక మలుపులతో ఉత్కంఠ రేపుతోంది. మొదట్లో ఉగ్రవాదుల పనిగా అందరూ అనుమానించిన ఉదంతం కాస్తా ముంబై పోలీసుల మెడకు చుట్టుకోవటమే వింత అయితే...అది మళ్లీ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వైపు మళ్లి, శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ ప్రభుత్వాన్ని చుట్టుముట్టింది. తాజాగా అది సుప్రీంకోర్టు మెట్లు కూడా ఎక్కింది. ఈ ఎపిసోడ్లో నగర పోలీస్ కమిషనర్ పదవి కోల్పోయిన పరంవీర్ సింగ్ హోంమంత్రి అనిల్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాయటమేకాక, సుప్రీంకోర్టులో సైతం పిటిషన్ దాఖలు చేశారు. తన బదిలీ చెల్లదని ప్రకటించాలని కూడా కోరారు. పోలీసు వ్యవస్థను అధికారంలో వున్నవారు తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారన్న ఆరోపణలు చాలా పాతవి. ప్రత్యేకించి ముంబై పోలీసులకు ఆ విషయంలో మొదటినుంచీ అంత మంచి పేరు లేదు. ఒకప్పుడు ఆ మహానగరాన్ని మాఫియా డాన్లు తమ అడ్డాగా మార్చుకుని వ్యాపారులనూ, పారిశ్రామికవేత్తలనూ, సినీ నటుల్ని బెదిరించి డబ్బు దండుకోవటం, యధేచ్ఛగా కిడ్నాప్‌లకు పాల్పడటం, దాడులు చేయటం సాగిస్తున్నప్పుడు ముంబై పోలీసులు వాటిని సరిగా అరికట్టలేకపోయారు. వారిలో కొందరు మాఫియాలతో కుమ్మక్కు కావటమే అందుకు కారణమన్న ఆరోపణలుండేవి. ఆ వంకన బూటకపు ఎన్కౌంటర్లు జోరందుకున్నాయి. అమాయకుల్ని సైతం ఆ ముసుగులో హతమారుస్తున్నారన్న ఆరోపణలొచ్చాయి. 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదులు చేసిన దాడి, అంతక్రితం జరిగిన బాంబు పేలుళ్లు ముంబై పోలీసుల పనితీరును ప్రశ్నార్థకం చేశాయి. ఉగ్రవాదులు విరుచుకుపడినప్పుడు ప్రాణాలు కోల్పోయిన 173మందిలో పోలీసు ఉన్నతాధికారులు హేమంత్ కర్కరే, అశోక్ కామ్టే, ఇతర సిబ్బంది కూడా వున్నారు. కానీ పటిష్టమైన ముందస్తు నిఘా వుంచటంలో ముంబై పోలీసుల వైఫల్యం క్షమార్హం కాదు. ఇదంతా తెలిసి కూడా పోలీసు వ్యవస్థను సమర్థవంతంగా, వివాదరహితంగా తీర్చిదిద్దటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా వున్న అధికారి సచిన్ వాజేను హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా సర్వీసులోకి తీసుకోవటమేకాక, ఆయనకు కీలకమైన కేసుల దర్యాప్తు బాధ్యతను అప్పగించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా అపకీర్తి గడించిన వాజే, ఒక హత్య కేసులో జైలుకెళ్లి వచ్చాడు. మధ్యలో శివసేనలో చేరాడు. అలాంటి వ్యక్తికి హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా పదవి కట్టబెట్టటంలోని ఔచిత్యమేమిటి? ఇందుకు కారణం పరంవీర్ సింగేనని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అంటున్నారు. మరి రాజకీయ నాయకత్వం వుండి ఏం చేసినట్టు? అనిల్ దేశ్‌ముఖ్‌ఎందుకు అభ్యంతరం చెప్పలేకపోయారు? తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కేంద్రం ఈ తతంగాన్నంతా నడిపిస్తోందంటున్న పవార్ దీనికేం చెబుతారు? ప్రభుత్వాలు నిర్వర్తించే కర్తవ్యాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కీలకమైనది. సురక్షితంగా, భద్రంగా వున్నామన్న భావన పౌరులకు కలగాలంటే పటిష్టమైన, చురుకైన పోలీసు వ్యవస్థ వుండాలి. అదే సమయంలో అది కర్తవ్య నిష్టతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంటుంది. కానీ మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ప్రభుత్వానికి దానిపై అదుపాజ్ఞలు వున్న దాఖలా కనబడదు. పోలీస్ కమిషనర్ పదవినుంచి తనను తప్పించగానే పరంవీర్ సింగ్ తీవ్రమైన ఆరోపణలే చేశారు. నెలకు వంద కోట్లు వసూలు చేసి ఇవ్వాలని వాజేకు అనిల్ దేశ్‌ముఖ్ నిర్దేశించారని ఆయనంటున్నారు. మరి అలాంటి వ్యక్తికి కీలక కేసుల దర్యాప్తు బాధ్యతను పరంవీర్ ఎలా అప్పగించారు? కనీసం తన బదిలీకి ముందు ఈ ఆరోపణ చేసివుంటే ఆయన నిజాయితీ వెల్లడయ్యేది. పదవినుంచి తప్పించారన్న అక్కసుతోనే ఇలా అంటున్నారన్న అభిప్రాయం అందరిలో ఏర్పడే పరిస్థితి వుండేది కాదు. తాను చాన్నాళ్లక్రితమే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే దృష్టికి ఈ సంగతి తీసుకొచ్చానని పరంవీర్ అంటున్నారు. అదే జరిగుంటే పరంవీర్‌ను ఇన్నాళ్లు పదవిలో కొనసాగించేవారా అన్న సంశయం కలుగుతుంది. వాజే వ్యవహారంలో తన ప్రమేయాన్ని తుడిచేసుకోవటానికే పరంవీర్ ఇలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే విమర్శలు మొదలయ్యాయి. హోంమంత్రి, పోలీసు విభాగం ఇలా ఆరోపణల్లో చిక్కుకోవటం మహారాష్ట్రలో ఇది మొదటిసారేమీ కాదు. 2003లో అప్పటి హోంమంత్రి ఛగన్ భుజ్‌బల్‌పై అవినీతి ఆరోపణలు రావటంతో తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో కూడా ఇరుక్కున్నారు. ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా పేరుమోసి, అమాయకుల్ని హతమార్చారన్న ఆరోపణలున్నవారిని నెత్తినపెట్టుకోవటం వాజేతోనే మొదలుకాలేదు. నకిలీ ఎన్కౌంటర్ల కేసులో శిక్షపడిన 11మంది పోలీసులను 2015లో విడుదల చేసిన ఘనత అప్పటి బీజేపీ–శివసేన సర్కారుది. దీన్ని బొంబాయి హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టి అడ్డుకుంది. తాజా వ్యవహారంలో సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్న సంగతలా వుంచితే ఆరోపణలొచ్చిన విలాస్ దేశ్ముఖ్తో రాజీనామా చేయించటం, వాజే పునరాగమనంలో నిజంగా పరంవీర్ పాత్ర వుంటే నిగ్గు తేల్చి, తగిన చర్యలు తీసుకోవటం రాజకీయంగా మహారాష్ట్ర ప్రభుత్వానికే మంచిది. -
హోటళ్లు, రెస్టారెంట్లకు తీవ్ర హెచ్చరికలు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. రోజు రోజుకు వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే శనివారం తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. రాష్ట్రంలోని హోటళ్ళు, రెస్టారెంట్లు కోవిడ్-19 నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. కోవిడ్-19 ప్రోటోకాల్స్‌ను కఠినంగా పాటించండి, నిబంధనలు ఉల్లంఘించి కఠినమైన లాక్డౌన్ విధించే స్థితికి ప్రభుత్వాన్ని నెట్టొద్దంటూ సీఎం గట్టిగా హెచ్చరించారు. అవాంఛనీయమైన వైఖరి ఏర్పడటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇకనైనా అన్ని జాగ్రత్తలు, మార్గదర్శకాలను పాటిస్తూ కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా చూడాలని సీఎం సూచించారు. షాపింగ్ సెంటర్లు, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ల ప్రతినిధులు హాజరైన వర్చువల్ సమావేశంలో ముఖ్యమంత్రి తాజా హెచ్చరికలు జారీ చేశారు. అక్టోబర్ నుండి దశలవారీగా కార్యకలాపాలు తిరిగి ప్రారంభమైనప్పటి నుండి చాలా చోట్ల రద్దీ పెరిగిందని, రక్షణ నియమాలను పాటించడం లేదని, దీనివల్ల కేసులు బాగా పెరిగాయన్నారు. తమ ప్రభుత్వం లాక్డౌన్ అమలుకు అనుకూలంగా లేదని, కానీ ప్రస్తుత పరిస్తితుల నేపథ్యంలో అన్ని నియమాలను పాటించండి. స్వీయ క్రమశిక్షణ, ఆంక్షల మధ్య ఉన్న తేడాను ప్రతి ఒక్కరూ గ్రహించి ప్రవర్తించాలన్నరు.న నియమాలను పాటించని కారణంగానే కేసులు బాగా పెరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కఠినమైన నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు సహకరించాలని ప్రజలను కోరారు. కాగా మహారాష్ట్రలో శనివారం నాటికి 15,602 కేసులు, 88 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 22,97,793 కు, మరణాల సంఖ్య 52,811 కు చేరుకుంది. -
‘భారత్ మాతాకి జై’ అనే హక్కు మీకు లేదు
ముంబై: అహ్మదాబాద్‌లోని మోటేరా స్టేడియానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్టేడియం అని నామకరణం చేయడంపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తీవ్రమైన విమర్శలు చేశారు. బుధవారం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగంపై చర్చకు సమాధానం ఇస్తూ సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ మోటేరా స్టేడియానికి ఉన్న సర్దార్ పటేల్ పేరును చేరిపేసిందని మండిపడ్డారు. అదీ కాకుండా వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వకుండా తమకు హిందుత్వం నేర్పడానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టామన్నారు. కానీ, బీజేపీ వాళ్లు ఏకంగా సర్దార్ పటేల్ స్టేడియం పేరును మార్చారని మండిపడ్డారు. ‘భారత్ మాతాకి జై’ అని నినాదాలు చేసినంత మాత్రనా మిమ్మల్ని మీరు(బీజేపీ) దేశభక్తులు అనుకోడం సరికాదన్నారు. ‘భారత్ మాతాకి జై’ అని నినాదించే హక్కు బీజేపీకి లేదని ఉద్దవ్ విమర్శించారు. చదవండి: పూజా చవాన్ ఆత్మహత్య.. మంత్రి రాజీనామా -
కరోనా కల్లోలం.. మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్
ముంబై: మహమ్మారి వైరస్ విజృంభిస్తుండడంతో మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్ విధించారు. రోజుకు 5 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో పది రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరికొత్త నిబంధనలు విధిస్తూ బృహన్ ముంబై కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ముంబైతో పాటు విదర్భ ప్రాంతంలోని రెండు జిల్లాల్లో సరికొత్త నిబంధనలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విదర్భ ప్రాంతంలోని అమరావతి, యావత్మాల్ జిల్లాలో పది రోజుల పాటు లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అమరావతి జిల్లాలో వారాంతాల్లో లాక్డౌన్ పాక్షికంగా సడలించారు. ఇక ముంబైలో శుభకార్యాలు, సామూహిక కార్యక్రమాలను నిషేధిస్తూ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. మాస్క్‌లు లేకుండా తిరిగే వారిని గుర్తించడానికి 300 మంది మార్షల్స్‌ను బీఎంసీ ఏర్పాటుచేసింది. మాస్క్‌లను లేని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నారు. 28వ తేదీ వరకు విద్యాలయాలన్నీ మూసివేస్తూ యావత్మాల్ జిల్లా అధికారులు ప్రకటించారు. పెళ్లిళ్లకు కేవలం 50 మంత్రిని మాత్రమే అనుమతిస్తూ కలెక్టర్ డీఎం సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. హోటల్స్ ఉదయం 8 నుంచి రాత్రి 9.30 గంటల వరకు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు తెరచుకోవచ్చు. రెండు జిల్లాల్లో రాత్రిళ్లు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయించారు. రాత్రి కర్ఫ్యూ వాతావరణం అమల్లో ఉండనుంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య: 20,81,520. మృతుల సంఖ్య 51,669. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలోనే కేసులు, మృతుల సంఖ్య నమోదవుతున్న విషయం తెలిసిందే. అయితే అన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుతుండగా మహారాష్ట్రలో పెరుగుతుండడంతో తాజా లాక్డౌన్ విధించారు. తాజాగా గురువారం 5,427 కేసులు నమోదయ్యాయి. -
సీఎం హెచ్చరిక.. మరోసారి లాక్డౌన్ దిశగా..?
ముంబై: ‘మాస్క్ పెట్టుకోండి. భౌతికదూరం పాటించండి. పెళ్లిళ్లు వంటి వేడుకల్లో ప్రభుత్వం విధించిన అన్ని రకాల కోవిడ్ నిబంధనలు పాటించండి లేదంటే మరోసారి లాక్‌డౌన్‌కి సిద్ధం కండి’ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ముంబై వాసులకి చేసిన హెచ్చరిక ఇది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భారీగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ నెమ్మది నెమ్మదిగా సాధారణ జన జీవనం నెలకొంటూ ఉంటే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా కేసులు ఇంకా భయపెడుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉందని శివసేన పార్టీ పత్రిక సామ్నా తన ఎడిటోరియల్‌లో పేర్కొంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాల్లో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. జనవరి తర్వాత గత వారంలో మహారాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 3 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి మొదటి వారంతో పోల్చి చూస్తే రెండో వారంలో 14శాతం కేసులు అధికంగా నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో ముంబై, పుణే నుంచి అత్యధికంగా వస్తున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో నాగపూర్, థానె, అమరావతి పట్టణాలు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితికి ఇంకా రెడ్ సిగ్నల్ పడకపోయినా, ఎల్లో వార్నింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే ప్రమాద ఘంటికలు మోగడానికి ఎంతో సేపు పట్టదు అని రాష్ట్ర కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ శశాంక్ జోషి వ్యాఖ్యానించారు. మరోవైపు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ఠాక్రే లాక్డౌన్ నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌనే శరణ్యమని హెచ్చరించారు. కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటే.. ► కరోనా కట్టడికి మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజ్ చేసుకోవడం వంటివేవీ ప్రజలు చేయడం లేదు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న 15 లక్షల మందికి జరిమానాలు వేయడంతో రూ.30 కోట్ల ఆదాయం వచ్చిందని ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ వెల్లడించారు. ► ముంబైలో స్థానిక రైళ్లు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆంక్షల మధ్య తిరుగుతున్నాయి. మొదటి పదిహేను రోజుల్లోనే ఏకంగా 3 వేల మంది ప్రయాణికులు మాస్కులు లేకుండా తిరగడంతో జరిమానాలు విధించారు. గత వారంలో ముంబైలో రోజుకి సగటున వెయ్యి వరకు కేసులు పెరుగుతున్నాయి. ► ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికలు కూడా కరోనా కేసులు పెరగడానికి కారణమని భావిస్తున్నారు. విదర్భ, మరఠ్వాడా వంటి ప్రాంతాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అదే ప్రాంతంలోని అమరావతి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల రేటు 33శాతం పెరిగిందని రాష్ట్ర కోవిడ్ బృందం అధికారి డాక్టర్ ప్రదీప్ అవాతే చెప్పారు. కేవలం 199 మంది మాత్రమే ఉన్న ససుర్వె గ్రామంలో పంచాయతీ ఎన్నికల తర్వాత 62 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ► గత ఏడాదంతా కోవిడ్ కారణంగా వివాహాలు, ఇతర కుటుంబ వేడుకల్ని వాయిదా వేసిన ప్రజలు కొత్త ఏడాదిలో కరోనా కేసులు కాస్త తగ్గడంతో పెద్ద ఎత్తున ఫంక్షన్లు నిర్వహించడం, సమూహాల్లో తిరగడం కేసుల్ని పెంచి పోషించాయి. కరోనా ఆంక్షలివే ► పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు 50 మందికి మించి అతిథుల్ని ఆహ్వానించకూడదు ► నిరసన ప్రదర్శనలు, ర్యాలీలపై తాత్కాలిక నిషేధం ► ఒక భవనంలో ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదైతే రాకపోకలు పూర్తిగా నిషేధిస్తారు ► మాస్కులు పెట్టుకోకపోయినా, భౌతికదూరం పాటించకపోయినా భారీగా జరిమానాలు -
గవర్నర్ విమాన ప్రయాణానికి సీఎం అడ్డు
ముంబై: దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. పశ్చిమబెంగాల్, మహారాష్ట్రలో ఆ పరిస్థితి తీవ్రంగా ఉంది. తాజాగా గవర్నర్ విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవగా ఆయనకు ప్రభుత్వ అనుమతి లేదని తెలిసి ఆయన ప్రైవేటు విమానంలో డెహ్రూడన్ వెళ్లారు. ఈ ఘటన మహారాష్ట్రలో వివాదం రాజుకుంది. గవర్నర్ విమాన ప్రయాణానికి ముఖ్యమంత్రి అడ్డు తగిలారనే విమర్శలు వస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి మధ్య విభేదాలు పెరిగాయి. అవి తగ్గకపోగా ఇంకా పెరుగుతున్నాయి. గవర్నర్ విమాన ప్రయాణానికి మహా అఘాడీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉత్తరాఖండ్‌లో ఇటీవల సంభవించిన విషాద సంఘటన గురించి తెలుసుకునేందుకు విమానంలో డెహ్రడూన్ వెళ్లేందుకు కోశ్యారి సిద్ధమయ్యారు. ఈ మేరకు ముంబైలోని విమానాశ్రయానికి వెళ్లి రెండు గంటల పాటు వేచి ఉన్నారు. ప్రభుత్వ విమానంలో కూర్చున్న తర్వాత 15 నిమిషాల తర్వాత టేకాఫ్‌కు అనుమతి రాలేదని ఎయిర్‌క్రాఫ్ట్ కెప్టెన్ చెప్పారు. దీంతో కోశ్యారి చివరికి మరో విమానంలో టికెట్ బుక్ చేసుకొని వెళ్లాల్సి వచ్చింది. వారం కిందటే గవర్నర్ పర్యటన గురించి ప్రభుత్వానికి చెప్పినా.. అనుమతి రాకపోవడం చాలా అసహజంగా ఉన్నదని గవర్నర్ కార్యాలయ వర్గాలు చెప్పాయి. దీనిపై డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్ స్పందించారు. గవర్నర్‌కు విమానం ఇచ్చారో లేదో తనకు తెలియదని, కార్యాలయానికి వెళ్లి తెలుసుకుంటానని చెప్పారు. దీనిపై శివసేన ఎంపీ వినాయక్ రౌత్ కూడా స్పందించారు. ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు గవర్నర్‌కు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఆయన ప్రభుత్వ అనుమతి కోరారని అయితే ఆ విమానం ప్రయాణించగలదా లేదా అని తెలియలేదని పేర్కొన్నారు. ఈ కారణంగానే గవర్నర్‌కి అనుమతి లభించకపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే ప్రభుత్వ నిబంధనలు మాత్రం సీఎం, డిప్యూటీ సీఎం మాత్రమే ప్రభుత్వ విమానాన్ని వినియోగించుకునేందుకు హక్కు ఉంది. ఇతరులు వాడాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఈ కారణంగానే అనుమతి లభించలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే కక్షపూరితంగానే ప్రభుత్వం గవర్నర్‌కు విమానం అనుమతి ఇవ్వలేదని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి మధ్య గతంలోనే వివాదాలు ఉన్నాయి. లాక్డౌన్ అనంతరం రాష్ట్రంలో ఆలయాలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వకపోవడంపై గవర్నర్ ప్రశ్నించారు. దీనిపై సీఎం ఉద్దవ్ థాక్రే, గవర్నర్‌కు మధ్య లేఖల యుద్ధం జరిగింది. ఇప్పుడు తాజాగా విమాన అనుమతి విషయమై వివాదం రేగేలా ఉంది. -
వివాదాస్పద తీర్పు: రంగంలోకి ఠాక్రే
సాక్షి, ముంబై : వస్త్రాల మీద నుంచి బాలిక ఛాతిభాగంలో తాకడం నేరం కాదంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు తీవ్ర వివాదాస్పదమవుతోన్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ జస్టిస్ పుష్ప గనేడివాలా ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేయాలని శివసేన నేతృత్వంలోని మహావికాష్ అఘాడీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సీతారం కుంటే శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేదు గనుక పోక్సో చట్టం కింద దానిని లైంగికదాడిగా పరిగణించలేమంటూ జస్టిస్ పుష్ఫ ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేస్తున్నామన్నారు. దీనిపై ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. (వివాదాస్పద తీర్పు: కొలీజియం కీలక నిర్ణయం) బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందిగా హైకోర్టులో పలువురు సీనియర్ న్యాయవాదులు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పోక్సో ( లైంగిక పరమైన దాడుల నుంచి చిన్నారుల రక్షణ) చట్టాన్ని నీరుగార్చే విధంగా ఉందని, దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. న్యాయవాదుల లేఖపై స్పందించిన సీఎం ఉద్ధవ్ న్యాయనిపుణులతో చర్చించి స్పెషల్‌లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. (బాలిక ఛాతిపై తాకడం నేరంకాదు : హైకోర్టు) బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. నాగపూర్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గత బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. -
నాకు ప్రమాదాలులేని రాష్ట్రం కావాలి: ముఖ్యమంత్రి
సాక్షి ముంబై: మహారాష్ట్రలోని రోడ్లు మృత్యు కుహరాలుగా మారాయి. గత సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,456 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 11,542 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ద్వితీయ స్థానానికి చేరింది. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తనదైన పద్దతిలో ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రాణం ఎంతో విలువైందని, నిదానమే ప్రధానం, ప్రమాదకర మలుపు, స్పీడ్ బ్రేకరు ఉందని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఇలా అనేక రకాల హెచ్చరికల బోర్డులు ఉన్నప్పటికి డ్రైవర్లు వాటిని పెడచెవిన పెడుతున్నారు. ఫలితంగా ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. అనేక మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి బాధ్యులవుతున్నారు. అయినప్పటికీ డ్రైవర్లలో మార్పు రావడం లేదు. దీంతో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ నెల 18వ తేదీ నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. అందులో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల వివరాలు వెల్లడించడంతో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా గత సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,456 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 11,542 మంది మృతి చెందారు. ముఖ్యంగా దేశంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగిన మూడు రాష్ట్రాలలో మహారాష్ట్ర కూడా తన పేరును నమోదుచేసుకుంది. నాకు ప్రమాదాలులేని రాష్ట్రం కావాలి: ముఖ్యమంత్రి ఠాక్రే మహారాష్ట్రను ప్రమాదాలులేని రాష్ట్రంగా చూడాలని ఉందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించడం కాదని, రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర ఉండకూడదని ఠాక్రే పేర్కొన్నారు. ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఆయన రోడ్డు భద్రత వారోత్సవాలను సంవత్సరానికి, నెలకు ఒకసారి పరిమితం చేయకుండా ప్రతి రోజు రోడ్డు భద్రతా వారోత్సవాలుగా జరుపుకోవాలన్నారు. అదేవిధంగా వాహనాలు నడిపేసమయంలో అందరూ నియమాలను, సంయమనాన్ని పాటించాలన్నారు. లేదా ఈ రెండు వ్యాఖ్యాలలో (నియమ్, సంయమ్) యమ్ ఉందని మనం వీటిని పాటించనట్టయితే యమ్ (య ముడు) వచ్చి మన ప్రాణాలను తీసుకెళ్తాడంటూ అభివర్ణించారు. ప్రమాదాలు జరగనేవద్దు. కానీ, ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదాల్లో గాయపడినవారి ప్రాణాలను రక్షించేందుకు అత్యధిక ప్రయత్నం చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని వాటికి సమీపంలో ట్రామా కేర్ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నం: నితిన్ గడ్కరి దేశంలో రోడ్డు ప్రమాదాలు తీవ్ర సమస్యగా మారిందని దీంతో దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ప్రతి రోజు 415 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారన్నారు. ఇటీవలే స్వీడన్లో జరిగిన ఓ సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఇలాగే ఉంటే 2030 వరకు దేశంలో రోడ్డు ప్రమాదాలతో సుమారు 6.7 లక్షల మంది మృతి చెందే అవకాశాలున్నాయని అంచనా ఉంది. కాని, తాము అలా జరగకుండా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ముఖ్యంగా 2025 నాటికి దేశంలో 50 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
సీఎం సంతకం చేశాక ఫైల్లో మార్పులు
సాక్షి, ముంబై: ఓ కీలక ఫైల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంతకం చేసిన అనంతరం మా ర్పులు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మంత్రాలయ కార్యాలయంలో పనిచేస్తున్న కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది వర్గాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై స్థానిక మెరైన్‌డ్రైవ్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. ప్రజా పనుల విభాగానికి చెందిన ఓ సూపరింటెండెంట్ ఇంజినీర్ నానా పవార్‌పై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి అదేశించారు. అందుకు సంబంధించిన ఫైల్లో సీఎం సంతకం చేశారు. కానీ, సంతకం చేసిన తరువాత అందులో మార్పులు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి సంతకం చేసిన చోట పైన విచారణ నిలిపివేయాలని రెడ్ పెన్నుతో రిమార్క్ రాసి ఉంది. అయితే విచారణ నిమిత్తం ఈ ఫైల్‌ను పరిశీలించిన మంత్రి అశోక్ చవాన్‌కు అనుమానం వచ్చింది. సీఎం ఉద్ధవ్ సంతకం చేసిన చోట స్థలం లేదు. అయినప్పటికీ సంతకంపైన చిన్న అక్షరాలతో విచారణ నిలిపివేయాలని రాసి ఉంది. ఒకవేళ ఉద్ధవ్ విచారణ నిలిపివేయాలని రిమార్కు రాస్తే స్థలం ఉండేది. కానీ, అక్కడ ఇరుకైన చోట చిన్న అక్షరాలతో రిమార్కు రాయడంపై చవాన్‌కు అనుమానం వచ్చింది. వెంటనే ఈ ఫైల్‌ను ముఖ్యమంత్రి చాంబర్‌కు పంపించారు. ముఖ్యమంత్రి సంతకం చేసిన ప్రతీ ఫైలు స్కాన్ చేస్తారు. అక్కడ పరిశీలించగా స్కాన్ చేసిన పత్రాలపై రెడ్ పెన్నుతో రాసిన ఎలాంటి రిమార్కు లేదు. దీన్ని బట్టి సంతకం చేసిన తరువాతే ఈ మార్పులు జరిగినట్లు స్పష్టమైంది. దీంతో మంత్రాలయలో ఎవరో ఈ పనిచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై మెరైన్‌డ్రైవ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
ఇద్దరు సీఎంల మధ్య భూవివాదం
సాక్షి, హైదరాబాద్: సరిహద్దు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు విభిన్న ప్రకటనలు చేశారు. దీంతో రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆదివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ఓ ప్రకటన చేసింది. దానిపై సోమవారం కర్ణాటక బీఎస్ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పందించారు. ఒక్క అంగుళం భూమి కూడా వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని సీఎం స్పష్టం చేశారు. ‘‘కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలు దురదృష్టకరం. సమాఖ్య వ్యవస్థకు విరుద్ధం. కర్ణాటకలో కన్నడిగులు, మహారాష్ట్రీయులు సోదరులుగా ఐకమత్యంతో జీవిస్తున్నారు. ప్రజల్లో శాంతికి భంగం కలిగించేలా ఉన్న థాకరే వ్యాఖ్యలను ఖండిస్తున్నా. నిజమైన భారతీయుడిగా సమాఖ్య స్ఫూర్తికి థాకరే గౌరవం ఇవ్వాలి. వాటికి కట్టుబడి ఉండాలని’’ యడియూరప్ప సోమవారం ట్వీట్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే కార్యాలయం ఆదివారం ఓ ట్వీట్ రెండు రాష్ట్రాల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. ‘‘కర్ణాటకలో మరాఠీ మాట్లాడే కొన్ని ప్రాంతాలను మహారాష్ట్రలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నాం’ అని ట్వీట్ చేసింది. కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉండగా ఆ ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చుకుంటామని మహారాష్ట్ర సీఎం తెలిపారు. ఆ ప్రాంతాలు తమ రాష్ట్రానికి చెందినవేనని, వాటిని మహారాష్ట్రలో కలపాలని ఎన్నాళ్ల నుంచో మహారాష్ట్రలో డిమాండ్ ఉంది. ఇదే డిమాండ్‌పై మహారాష్ట్ర ఏకీకరణ సమితి సుదీర్ఘ కాలంగా పోరాడుతోంది. అయితే 1956 జనవరి 17వ తేదీన ఈ ఉద్యమంలో జరిగిన ఘర్షణల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ జనవరి 17వ తేదీని మరాఠా అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా చేస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ఆ ట్వీట్ చేసింది. కర్ణాటక అధీనంలోని మరాఠీ మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకు తాము అందించే ఘన నివాళి అని పేర్కొంది. -
శివసేనకు చెక్: పట్టు బిగిస్తున్న బీజేపీ
సాక్షి, ముంబై : దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు ప్రతిపక్ష బీజేపీ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. దేశ ఆర్థిక రాజధానితో పాటు అత్యధిక ఆధాయం కలిగిన నగరం కావడంతో ఈ ఎన్నిక ఎంతో ప్రధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని పార్టీలన్నీ కంకణం కట్టుకున్నాయి. అయితే ఈసారి ముంబైలో మరాఠా అంశం ఎక్కువగా వినిపిస్తోంది. బీఎంసీలో గెలవాలంటే మరాఠీలను ప్రసన్నం చేసుకోవాలని ఆయా పార్టీలు పావులు కదుపుతుండటం గమనార్హం. శివసేతో విభేదాల కారణంగా అధికార పీఠానికి దూరమైన బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు శివసేనకు బీఎంసీలో మంచి పట్టు ఉండటంతో ఈసారి పోటీ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. మిషన్ 120.. 120 స్థానాలు గెలవాలని భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు బీజేపీ ‘మిషన్–120’కి శ్రీకారం చుట్టింది. 2022లో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. సిట్టింగ్ కార్పొరేటర్లు తమ తమ వార్డు పరిధిలో పెండింగ్‌లో పడిపోయిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ అధిష్టానం ఆదేశించింది. బీఎంసీ ఎన్నికలకు సంబంధించిన కులాల రిజర్వేషన్ ఎన్నికల కమిషన్ నుంచి జాబితా విడుదల కాగానే బరిలో ఎలా ముందుకెళ్లాలి, ఎవరిని దింపాలనే దానిపై వ్యూహం రూపొందిస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ ముంబై కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చరణ్‌సింగ్ సప్రాను, ప్రచార సమితీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి నసీం ఖాన్, సమన్వయ సమితి అధ్యక్షుడిగా అమర్జీత్ మన్హాస్, మ్యానిఫెస్టో, పబ్లిషింగ్ సమితీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సురేశ్ శెట్టి తదితరులను నియమించి ముంబై ఎన్నికలకు సిద్ధం చేసింది. పట్టు బిగిస్తున్న కమలం.. వచ్చే బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలా..? లేక ఒంటరిగా పోటీ చేయాలా..? అనే దానిపై మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు తర్జన భర్జన పడుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేసిన శివసేన ఫలితాల తరువాత ముఖ్యమంత్రి పదవిపై నెలకొన్న వివాదం తారాస్థాయికి చేరుకుంది. చివరకు అది తెగదెంపులు చేసుకునే వరకు దారితీసింది. దీంతో ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఎన్సీపీతో జతకట్టి మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన ఈ పరిణామాలతో ఒంటరైన బీజేపీకి నష్టాన్నే చేకూర్చింది. దీంతో వచ్చే బీఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి శివసేనకు తగిన బుద్ది చెప్పాలని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దీంతో మిషన్–120 సంకల్పంతో ముందుకెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీఎంసీలో మొత్తం 227 స్థానాలున్నాయి. 2017లో జరిగిన కార్పొరేషన్ ఎన్నిల్లో శివసేన, బీజేపీ సొంత బలంపై పోటీ చేశాయి. ఆ సమయంలో శివసేన 97, బీజేపీ 83 స్థానాలు గెలుచుకున్నాయి. కాగా, ఇదివరకు బీజేపీ మొత్తం 227 స్థానాల్లో 100 సీట్లకే పోటీచేసి ఎక్కువ కార్పొరేటర్లను గెలిపించుకునేది. కాని 2017లో మొదటిసారి వేర్వేరుగా పోటీచేసి శివసేనకు బీజేపీ మింగుడు పడకుండా చేసింది. ములుండ్, పశ్చిమ అంధేరీ ప్రాంతాల్లో మొత్తం బీజేపీ కార్పొరేటర్లే విజయఢంకా మోగించారు. ఇలా నగరంతోపాటు ఉప నగరాల్లో అనేక చోట్ల బీజేపీకి మంచి పట్టు ఉంది. దీంతో ఈసారి మిషన్–120 çసంకల్పాన్ని సక్సెస్ చేయాలనే కమలం నాయకులు పట్టుదలతో ఉన్నారు. శివసేనకు చెక్.. బీఎంసీ ఎన్నికలు 2022 ఫిబ్రవరిలో జరిగే అవకాశాలున్నాయి. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు వార్డుల రిజర్వేషన్ జాబితా విడుదలవుతుంది. రిజర్వేషన్ జాబితా విడుదల కాగానే వెంటనే ఎన్నికల పనిలో నిమగ్నమవుతామని బీజేపీ సీనియర్ నాయకులు తెలిపారు. బీజేపీ ముంబై అధ్యక్షుడు మంగల్‌ప్రభాత్ లోఢా మార్గదర్శనంలో, అలాగే ఇతర నాయకులు నేతృత్వంలో బీఎంసీ ఎన్నికలకు వెళతామని బీజేపీ కార్పొరేటర్, ప్రతినిధి బాలచంద్ర శిర్షాట్ స్పష్టంచేశారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటులో నమ్మక ద్రోహం చేసిన శివసేనకు ఎలాగైన బుద్ది చెప్పాలని ఉద్ధేశంతో బీఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని కమలం నాయకులు తెలిపారు. -
శివసేన-ఎన్సీపీ మధ్య ముదురుతున్న వివాదం
సాక్షి ముంబై : ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్‌గా మార్చాలన్న అంశం దుమారం రేకెత్తిస్తుండగా మరోవైపు అహ్మద్‌నగర్ పేరును కూడా మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. అహ్మద్‌నగర్ పేరును మార్చాలని షిర్డీ లోక్‌సభ ఎంపీ, శివసేన నాయకుడు సదాశివ్ లోఖండ్ డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్లు ఇప్పటివి కావని పాతవేనని ఆదివారం ఆయన మీడియాకు చెప్పారు. ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్‌గా మార్చాలని ప్రజలే కోరుకుంటున్నారన్నారు. దీంతో శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకుంటారని ఎంపీ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే అహ్మద్‌నగర్ పేరును కూడా అంబికానగర్‌గా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. (కాంగ్రెస్-సేన: అగ్గిరాజేస్తున్న ఔరంగాబాద్) ఏళ్ల నుంచి డిమాండ్.. గత అనేక సంవత్సరాలుగా శివసేనతోపాటు హిందుత్వవాది సంఘటనలు అహ్మద్‌నగర్ పేరు అంబికానగర్‌గా మార్చాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కొందరు ఆనంద్‌నగర్ పేరును సూచిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అంశంపై అనేక ఆందోళనలు జరిగాయి. 70వ సాహిత్య సమ్మేళనం సందర్భంగా అహ్మద్‌నగర్‌లో ఈ అంశంపై దుమారం లేచింది. ప్రతిసారి ఔరంగాబాద్ పేరు మార్పు అంశం తెరపైకి వచ్చిన వెంటనే అహ్మద్‌నగర్ పేరును మార్చాలన్న డిమాండ్ కూడా వస్తోంది. షిర్డీ ఎంపీ సదాశివ్ లోఖండే పలుమార్లు డిమాండ్ చేశారు. అహ్మద్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్సీపీ మద్దతుతో బీజేపీ అధికారంలో ఉండగా శివసేన ప్రతిపక్షంలో ఉంది. అహ్మద్‌నగర్ ఎమ్మెల్యే ఎన్సీపీ పార్టీకి చెందిన వారుండగా ఎంపీ బీజేపీకి చెందినవారున్నారు. ఇలాంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అహ్మద్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలాంటి పాత్ర పోషించనుందనేది తేలాల్సి ఉంది. మరోవైపు ఔరంగాబాద్ పేరు మార్పు అంశం మహావికాస్ ఆఘాడీలో చిచ్చుపెట్టేలా చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ రెండు అంశాలపై రాష్ట్రంలోని రాజకీయాలు ఎలా ఉండనున్నాయనే విషయంపై అందరిలో ఉత్కంఠ కన్పిస్తోంది. పుణేనూ మర్చాల్సిందే.. సాక్షి ముంబై: రాష్ట్రంలో ఔరంగాబాద్ పేరు మార్పు రగడ కొనసాగుతుండగా రాష్ట్రంలోని ఇతర నగరాల పేర్లు కూడా మార్చాలన్న డిమాండ్లకు ఊతం వచ్చింది. ఔరంగాబాద్ అనంతరం అహ్మద్‌నగర్, ఆ తర్వాత పుణే నగరం పేరు కూడా మార్చాలన్న డిమాండ్ విన్పిస్తోంది. పుణే పేరును జిజావు పూర్‌గా మార్చాలని సంభాజీ బ్రిగేడ్ డిమాండ్ చేసింది. సంభాజీ బ్రిగేడ్ పదాధికారి సంతోష్ షిండే ఈ డిమాండ్ చేశారు. విధ్వంసమైన పుణేను జిజావు మళ్లీ నిర్మాణం చేశారని, దీంతో పుణే నగరం మా సాహెబ్ జీజావు, ఛత్రపతి శివాజీ మహరాజు శౌర్యం, పరాక్రమానికి ప్రతీక అంటూ అభివర్ణించారు. ఇలాంటి నేపథ్యంలో పుణే పేరును జీజావు పూర్‌గా మార్చాలని సంభాజీ బ్రిగేడ్ పదాధికారి సంతోష్ షిండే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విభేదాలు సృష్టించేందుకే: అజిత్‌పవార్ ఔరంగాబాద్ పేరును సంబాజీనగర్‌గా మార్చాలన్న అంశంపై కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని ఎన్సీపీ నేత ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. నాసిక్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా మహావికాస్ ఆఘాడీలో విబేధాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ విషయంపై మూడు పార్టీల అధినేతలు శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, సోనియా గాంధీలు చర్చలు జరిపి తుది నిర్ణయం ప్రకటిస్తారని స్పష్టంచేశారు. ‘‘మహారాష్ట్రలో 3 పార్టీలు కలిసి మహావికాస్ ఆఘాడీగా ఏర్పాటై ఈ ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర అభివృద్ది కోసం ఏర్పాటైన మహావికాస్ఆఘాడీ ప్రభుత్వం కామన్ మినిమం ప్రొగ్రామ్ ద్వారా అభివృద్ధి పనులు చేస్తోంది. అయితే కొన్ని సమయాల్లో ఇలాంటి అంశాలపై వివాదాలు తలెత్తినప్పుడు తమ అధినేత కలిసి సమస్యలకు పరిష్కారం కనుగొంటారు’’ అని అజిత్ తెలిపారు. పేరు మారుస్తున్నారా? లేదా? : మండలిలో ప్రతిపక్ష నాయకుడు దారేకర్ ముంబై: ఔరంగాబాద్ పేరు మారుస్తున్నారా? లేదా? అనేది ప్రజలకు స్పష్టతనివ్వాలని మండలిలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఎమ్మెల్సీ ప్రవీణ్ దారేకర్ డిమాండ్‌చేశారు. గత కొద్దిరోజులుగా ఔరంగాబాద్ పేరు మారుస్తామని శివసేన, మార్చేది ఇష్టంలేదని కాంగ్రెస్ పోట్లాడుకుంటున్నాయని మండిపడ్డారు. అసలు శివసేన స్టాండ్ ఏంటో స్పష్టంగా చెప్పాలని దారేకర్ డిమాండ్‌చేశారు. 1995 జూన్‌లో అప్పటి మున్సిపల్ కార్పొరేషన్లో ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్‌గా మార్చే విషయంలో ప్రతిపాదన జరిగిందని, అయినా ఇప్పటికీ అమలు కాలేదని ధ్వజమెత్తారు. దీనిపై కాంగ్రెస్ కార్పొరేటర్ కోర్టులో సవాల్ చేశారని గుర్తుచేశారు. అయితే కేవలం పేరు మార్చి నంత మాత్రానా ఓ నగరం అభివృద్ధి జరగదని ఆయన స్పష్టంచేశారు. -
బెస్ట్‌కు మరో 26 ఈ–బస్సులు
సాక్షి, ముంబై: ముంబైకర్ల కోసం కొత్తగా 26 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను శుక్రవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రారంభించారు. ఇటీవలే ఈ బస్సులను బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్) ఆధీనంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బెస్ట్‌లో వంద శాతం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య 72కి చేరింది. ముందు 46 ఈ–బస్సులు ఉండగా, తాజాగా 26 బస్సులు బెస్ట్‌లో చేరాయి. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించిన అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే బస్సులో ప్రయాణించారు. ఆయనతో పాటు ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రేలతో పాటు పలువురు ప్రముఖులున్నారు. ఇప్పటికే ముంబైకర్లకు ఉత్తమ సేవలు అందిస్తున్న బెస్ట్ సంస్థ భవిష్యత్‌లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు కాలుష్య రహిత సేవలను అందించాలనే ఉద్దేశంతోనే బెస్ట్ ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన 40, బెస్ట్‌కు చెందిన ఆరు ఇలా మొత్తం 46 ఈ–బస్సులు సేవలందిస్తున్నాయి. దీంతోపాటు తాజాగా టాటా మోటార్స్ కంపెనీ రూపొందించిన 26 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల చేరికతో ఆ సంఖ్య 72కి చేరింది. భవిష్యత్‌లో ఈ బస్సుల సంఖ్య 340కి పెంచుతామని ఈ సందర్భంగా మంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ–బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు దివ్యాంగులు ఈ బస్సులో ఎక్కేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. -
‘ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు’
ముంబై: మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వం ధృడమైనదని, తన సహచరుల ఫోన్లను ట్యాపింగ్ చేయవలసిన అవసరం లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. ఎంవీఏ ప్రభుత్వం నవంబర్ 28న ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. గురువారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఠాక్రే మాట్లాడుతూ..“నేను నా మంత్రులందరినీ విశ్వసిస్తున్నాను, నా సహోద్యోగుల ఫోన్లపై నిఘా పెట్టాల్సిన అవసరం లేదు. అందరూ మంచిగా పని చేస్తున్నారు. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంది. మేము మంచిగా పని చేస్తున్నందున వారు మమ్మల్ని గెలిపించారు. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ ప్రజల శ్రేయస్సు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు”అని ఠాక్రే అన్నారు. కేంద్ర ప్రభుత్వం విఫలమైంది: శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ రైతుల నిరసనకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. ‘‘రైతు బిల్లుల ఆమోదంతో మన రైతులు ఎదుర్కొనే పరిణామాలను కెనడాకు చెందిన ప్రముఖ నాయకులు అర్థం చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి అర్థం కాలేదు. బీజేపీ కేంద్రంలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి దేశంలో సమస్యలను పెంచారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది.’’ అని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ దుయ్యబట్టారు. (చదవండి: స్టీరింగ్ నా చేతిలోనే ఉంది..) రెండు, మూడు నెలల్లో అధికారంలోకి : బీజేపీ వచ్చే రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి రౌసాహెబ్ డాన్వే ఇటీవల విశ్వాసం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రావడానికి వెంపర్లాడటం లేదని, కానీ అసహజంగా ఏర్పడిన ప్రభుత్వాలు ఎక్కువ కాలం కొనసాగలేవు.’’ అని అన్నారు. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గరిష్టంగా 105 స్థానాలను గెలుచుకోగా, శివసేన 56, ఎన్‌సిపి 54, కాంగ్రెస్ 44 స్థానాలను గెలుచుకున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడు అజిత్ పవార్ సహకారంతో 2019 మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీ 80 గంటలపాటు అధికారంలో ఉంది. 2019 నవంబర్ 23 తెల్లవారుజామున ముంబైలోని రాజ్ భవన్లో బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, శివసేన నేతృత్వంలోని ఎంవీఏ నవంబర్ 28 న పదవీ బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమం చేసిన పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయడంతో బీజేపీ ప్రభుత్వం కేవలం 80 గంటలు మాత్రమే అధికారంలో కొనసాగిన సంగతి తెలిసిందే. -
‘మూడు రోజుల ప్రభుత్వానికి మొదటి వర్ధంతి’
ముంబై : మహారాష్ట్రలో ‘మూడు రోజుల బీజేపీ ప్రభుత్వం’ కుప్పకూలి నేటికి ఏడాది గడిచిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గుర్తుచేశారు. నేటితో మొదటి వర్ధంతి పూర్తిచేసుకుందని ఎద్దేవా చేశారు. గత ఏడాది నవంబర్ 23న మాజీ బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నాటకీయ పరిణామాల మధ్య ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఫడ్నవిస్‌కు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో మూడు రోజులకే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్ కేవలం 80 గంటల్లోనే రాజీనామా సమర్పించారు. చదవండి: ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్సీపీ సన్నద్దం? దీనిపై సోమవారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తికాలం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం మరో నాలుగు ఏళ్లు విజయవంతంగా పాలన పూర్తి చేస్తుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు విఫలమవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని వారికి బాగా తెలుస్తోంది’ అని ఆయన అన్నారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి రావ్ సాహెబ్ ఇటీవల మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రస్తావిస్తూ.. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోతుందని, వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది జోస్యం చెప్పారు. చదవండి: 'పాక్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో కలపాలి' కాగా గత ఏడాది అనేక ఉత్కంఠ పరిణామాల నడుమ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. తిరగి ఎన్సీపీలోకి రావటంతో నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ డీప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. 2019లో హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు, ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: పవార్ వాఖ్యలను ఖండించిన యడియూరప్ప -
అర్నబ్‌కు దక్కని ఊరట
ముంబై: రిపబ్లిక్ టీవీ ఎడిటర్–ఇన్–చీఫ్ అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం నుంచి ఊరట దక్కలేదు. 2018 నాటి కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అయితే, ఈ విచారణ అసంపూర్తిగా ముగియడంలో అర్నబ్‌కు బెయిల్ లభించలేదు. శనివారం విచారణ కొనసాగిస్తామని బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ తేల్చిచెప్పింది. ఆర్కిటెక్ట్ అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ను కించపర్చేలా టీవీలో చర్చ నిర్వహించారని, అందుకే సభా హక్కుల ఉల్లంఘన చర్యలు ప్రారంభిస్తామంటూ అర్నబ్‌కి మహారాష్ట్ర శాసనసభ గతంలో నోటీసిచ్చింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టుకెక్కారు. నోటీసుపై కోర్టుకు వెళ్లడం చెల్లదని, జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ అసెంబ్లీ సెక్రెటరీ గతంలో అర్నబ్‌కి లేఖ రాశారు. విచారణ సందర్భంగా కోర్టు.. ‘పిటిషనర్‌ను బెదిరించేలా లేఖ ఎందుకు రాశారు? రెండు వారాల్లోగా వివరణ ఇవ్వండి’ అని అసెంబ్లీ సెక్రెటరీకి షోకాజ్ నోటీసు ఇచ్చింది. -
ప్రభుత్వాన్ని నడుపుతున్నదెవరు..?
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వాన్ని విచ్ఛినం చేసేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. మూడు పార్టీల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యూహాలు రచిస్తోందని విమర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాజ్‌భవన్‌ను వేదికగా చేసుకుని రాజకీయాల చేస్తోందని మండిపడుతున్నారు. విద్యుత్ బిల్లుల వివాదం నేపథ్యంలో నవనిర్మాణ సేనపార్టీ (ఎమ్‌ఎన్‌ఎస్పీ) చీఫ్ రాజ్ రాక్రేను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు బదులుగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను కలవమని సలహా ఇవ్వడంపై శివసేన నేతలు భగ్గుమంటున్నారు. గవర్నర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ మధ్య విబేధాలు సృష్టించేందుకే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. పవర్ ఎవరి చేతిలో.. ఈ క్రమంలోనే విద్యుత్ బిల్లుల విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో కాకుండా శరద్ పవార్‌తో మాట్లాడమని గవర్నర్ కోశ్యారీ రాజ్ ఠాక్రేకి చెప్పడంతోనే రాష్ట్రంలో పవర్ ఎవరి చేతిలో ఉందో అర్థం అవుతోందని రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఎద్దేవా చేశారు. శరద్ పవార్ రాష్ట్రాన్ని నడుపుతున్నారని, సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవడం వల్ల ఉపయోగం లేదని ఆయన పేర్కొన్నారు. దీనిపై బీజేపీ నాయకులు సైతం స్వరం అందుకున్నారు. ముఖ్యమంత్రి ఠాక్రే అయినప్పటికీ అధికారమంతా పవార్ చేతిలోనే ఉందంటున్నారు. (ఊర్మిళ ఆశలు అడియాశలేనా..?) బీజేపీ నేతల విమర్శలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గట్టిగా స్పందించారు. ఆఘాడీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. మరో నెలరోజుల గడిస్తే తమ ప్రభుత్వం ఏర్పడి తొలి ఏడాది పూర్తి అవుతుందని, ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో 15 రోజుల్లోనే కుప్పకూలుతుందని బెట్టింగులు వేశారని గుర్తుచేశారు. బీజేపీ నేతలు ఇప్పటికే అదే పనిలో ఉన్నారని మండిపడ్డారు. రాజ్ ఠాక్రేను ముఖ్యమంత్రికి బదులుగా శరద్ పవార్‌ని కలవాలని గవర్నర్ సూచించి సీఎంను అవమానపరిచారని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్సీపీ ప్రభుత్వం భాగం మాత్రమేనని, సీఎం మాత్రం ఠాక్రేనే అని స్పష్టం చేశారు. బాల్‌ఠాక్రే నమ్మకాన్ని బేఖాతరు చేశారు దివంగత బాల్ ఠాక్రే నమ్మకం, సిద్ధాంతాలను బేఖాతరు చేసిన పార్టీ తమకు పాఠాలు నేర్పక్కర్లేదని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్) పార్టీ సీనియర్ నేత సందీప్ దేశ్‌పాండే శివసేనకు చురకలంటించారు. కరోనా కాలంలో పెరిగిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ ఇటీవల గవర్నర్‌భగత్‌సింగ్ కొశ్యారీతో ఎమ్మెన్నెస్ చీఫ్ రాజ్ ఠాక్రే భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సరైందని కాదని, ప్రజాప్రతినిధులు, సంబంధిత మంత్రులు, ముఖ్యమంత్రి ఉండగా నేరుగా గవర్నర్‌తో భేటీ కావడమంటే రాష్ట్రాన్ని అవమానపర్చినట్లేనని శనివారం శివసేన ఎంపీ, అధికార ప్రతినిధి సంజయ్ రావుత్ రాజ్ ఠాక్రేను విమర్శించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు ఎమ్మెన్నెస్ సమాధానమిచ్చింది. పరువు, ప్రతిష్ట, అవమానం అంటే ఏంటో రౌత్ నుంచి నేర్చుకోవల్సిన అవసరం తమకు లేదని దేశ్‌పాండే స్పష్టం చేశారు. ఒకప్పుడు ఉత్తర భారతీయులంటే గిట్టని శివసేన ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజల దినోత్సవం నిర్వహించింది. వారికిష్టమైన నానబెట్టిన శెనిగెల కార్యక్రమం నిర్వహించారు. ‘‘కొద్దిరోజుల కిందట రావుత్ కొశ్యారీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రౌత్ కొశ్యారీకి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ఫోటోను చూపించారు. మరి మీరెందుకు భేటీ అయినట్లు, నృత్యం చేయడానికా...?’’ అని దేశ్‌పాండే ఎద్దేవా చేశారు. ముందు ఈ ఫోటో గురించి మాట్లాడాలని, ఆ తరువాత ఇతరుల గురించి వ్యాఖ్యలు చేయాలని విమర్శించారు. శివసేన నాయకులు తమ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేశారు. రాజ్ ఠాక్రేను పీడిం చారు. అప్పట్లో ఎమ్మెన్నెస్‌కు చెందిన ఆరుగురు కార్పొరేటర్లను ప్రలోభపెట్టి శివసేనలోకిలాక్కున్న సంఘటనలను ఎలా మర్చిపోతామని ఈ సందర్భంగా దేశ్‌పాండే గుర్తుచేశారు. -
ఉద్ధవ్ ఠాక్రేకు ఫైర్ బ్రాండ్ కౌంటర్
సాక్షి,ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రధానంగా వారి సొంత రాష్ట్రంలో తిండికి గతిలేనవారు ముంబైకి డబ్బు సంపాదించుకుని, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారన్న ఉద్ధవ్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. హిమాలయాల అందం ప్రతి భారతీయుడికి ఎలా చెందుతాయో, ముంబై అందించే అవకాశాలు కూడా ప్రతి ఒక్కరికి చెందుతాయంటూ కౌంటరిచ్చారు. ఈ రెండు రాష్ట్రాలు తనకు తన సొంత ఇళ్లతో సమానమని కంగనా ప్రకటించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, దసరా రోజున ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి మొత్తం రాష్ట్రం పరువు తీశారంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. (మౌనం వీడిన ఉద్ధవ్ ఠాక్రే : కంగనాపై ధ్వజం) వారసత్వంతో అధికారంలోకి వచ్చారంటూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ పై సోమవారం కంగనా వరుస ట్వీట్లలో తీవ్ర విమర్శలు చేశారు. "ముఖ్యమంత్రీ, నీలాగా తండ్రి పవర్ ని అడ్డంపెట్టుకుని అధికారంలోకి రాలేదు.. నేను కూడా గొప్ప కుటుంబానికి చెందినదాన్నే.. వాళ్ల సంపదపై ఆధారపడి జీవించాలనుకుంటే.. అక్కడే (హిమాచల్ ప్రదేశ్) ఉండేదాన్ని'' అన్నారు. తాను నెపోటిజం బ్రాండ్ కాదనీ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉన్నాయన్నారు. తాను స్వయంశక్తితో ఎదిగిన మహిళనని చెప్పుకొచ్చారు. తమ ప్రజాస్వామ్య హక్కులను హరించే సాహసానికి పూనుకోవద్దని, తమను విభజించవద్దని సీఎంను హెచ్చరించారు. ఇకనైనా అసభ్యకర ప్రసంగాలు కట్టిపెట్టాలని కంగనా సీఎంపై మండిపడ్డారు. అలాగే గతంలో సంజయ్ రౌత్ హరాం ఖోర్ అన్నారు.. ఇపుడు ఉద్ధవ్ నమక్ హరాం అంటున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను మీ కొడుకు వయసుదాన్ని, నాపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలి'' అంటూ ట్వీట్ చేశారు. కాగా గతంలో ముంబై మున్సిపల్ అధికారులు తన ఇంటి కూల్చివేతపై సందర్బంగా నా ఇంటిలానే… త్వరలో ఉద్ధవ్ అహంకారం కూలి పోతుందంటూ మహా సీఎంపై కంగనా మండిపడిన సంగతి తెలిసిందే. Chief Minister I am not drunk on my father’s power and wealth like you, if I wanted to be a nepotism product I could have stayed back in Himachal, I hail from a renowned family, I didn’t want to live off on their wealth and favours, some people have self respect and self worth. — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2020 Just how beauty of Himalayas belongs to every Indian, opportunities that Mumbai offers too belongs to each one of us, both are my homes, Uddhav Thackeray don’t you dare to snatch our democratic rights and divide us, your filthy speeches are a vulgar display of your incompetence.. — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2020 Message for Maharashtra government... pic.twitter.com/WfxI9EII38 — Kangana Ranaut (@KanganaTeam) October 26, 2020 -
కొత్త రకం చేపను కనిపెట్టిన సీఎం తనయుడు!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ కనుమలు శాస్త్రవేత్తలు స్కిస్తురా జాతికి చెందిన కొత్తరకం చేపను కనుగొన్నారు. ఈ చేపలు చాలా అరుదుగా లభిస్తాయి. చాలా చిన్న అందంగా, బంగారపు రంగులో పైన కొద్దిగా వెంట్రుకలు కలిగి చాలా చూడముచ్చటగా కనిపిస్తాయి. ఇవి ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండే మంచి నీటి చెరువులతోనే ఎక్కువగా దర్శనమిస్తుంటాయి. దీనిని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే తనయుడు తేజస్ థాక్రే, ఐసీఏఆర్ ఇన్స్టిట్యూట్ పోర్టుబ్లెయర్కు చెందిన జయసింహన్ ప్రవీణ్‌రాజ్, అండన్ వాటర్ ఫోటోగ్రాఫర్ శంకర్ బాలసుబ్రహ్మణ్యన్ కలిసి పశ్చిమ కనుమలలో కనుగొన్నారు. దీనికి ‘స్కిస్తురా హిరణ్యాక్షి’ అని నామకరణం చేశారు. ఇది హిరణ్యాక్షి అనే నదిలో లభించడం వల్ల దీనికి ఈ పేరు పెట్టారు. దీనికి సంబంధించిన వివరాలను వారు ఆక్వా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇక్తాలజీలో ప్రచురించారు. హిరణ్యాక్షి అంటే బంగారపు రంగు జుట్టు కలది అనే అర్థం కూడా వస్తుండటంతో ఈ పేరు చేపను వర్ణించడానికి కూడా సరిపోతుంది. ఇక ఈ చేపను తేజస్‌థాక్రే 2012లోనే కనుగొన్నారని ప్రవీణ్ రాజ్ తెలిపారు. దాని తరువాత 2017 లో ఈ జాతికి సంబంధించిన మరిన్ని చేపలను కనుగొన్నట్లు ప్రవీణ్ చెప్పారు. దీంతో దీని మీద మరింత రీసెర్చ్ చేసి దీనికి సంబంధించిన వివరాలను జర్నల్‌లో పొందుపర్చారు. చదవండి: నేను మోదీ హనుమాన్‌ని! -
ముంబైలో పవర్ కట్
ముంబై: ముంబై సోమవారం విద్యుత్ అంతరాయంతో స్తంభించింది. ఉదయం 10 గంటలపుడు సంభవించిన ఈ పరిణామంతో లోకల్ రైళ్లు ఎక్కడివక్కడే ఆగాయి. భవనాల్లో లిఫ్టులు మధ్యలోనే ఆగిపోయాయి. కోవిడ్ కారణంగా ‘వర్క్ ఫ్రం హోం’ విధానంలో లక్షలాది మంది ఇళ్లలో ఉండి అందించాల్సిన సేవలకు అంతరాయం ఏర్పడింది. కోవిడ్, ఇతర అత్యవసర రోగులకు చికిత్స అందించే ఆస్పత్రుల కోసం డీజిల్ జనరేటర్లను యంత్రాంగం తరలించాల్సి వచ్చింది. యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగిన యంత్రాంగం మధ్యాహ్నం 12 గంటలకు సేవలను క్రమక్రమంగా పునరుద్ధరించగలిగింది. కాగా, ఈ ఘటనను మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యుత్, తదితర శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు, విద్యుత్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సమావేశమై, చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. విద్యుత్ అంతరాయం ఘటనపై తక్షణం పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ(ఎంఎస్ఈటీసీఎల్)కు చెందిన కల్వా– ఖర్ఘార్ సబ్స్టేషన్లలో మెయింటెనెన్స్ పనులు జరుగుతున్న సమయంలో ఉదయం 10 గంటల సమయంలో అంతరాయం ఏర్పడిందని విద్యుత్ మంత్రి నితిన్ తెలిపారు. లోడ్ భారమంతా మోస్తున్న రెండో సర్క్యూట్లో లోపం తలెత్తడమే ఇందుకు కారణమన్నారు. కల్వా సబ్‌స్టేషన్ వరకు విద్యుత్‌ను తీసుకువచ్చే బాధ్యత రాష్ట్ర విద్యుత్ సంస్థది కాగా, అక్కడి నుంచి టాటా, అదానీ సంస్థలు నగరానికి సరఫరా చేస్తుంటాయన్నారు. ముంబైతోపాటు సబర్బన్‌లోని థానే, పన్వెల్, డోంబివిలి, కల్యాణ్‌లో విద్యుత్ అంతరాయం తలెత్తింది. కంపెనీలు, సంస్థల్లో మాదిరిగా బ్యాక్–అప్ సౌకర్యం లేని ఇళ్లలోని లక్షలాది మంది ఉద్యోగుల ‘వర్క్ ఫ్రం హోం’ సేవలకు తీవ్ర అవరోధం కలిగింది. ముంబైలో కరోనా కేసులు పెరిగిపోతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయడంతో కోవిడ్ వైద్య కేంద్రాల్లోని వారి కోసం డీజిల్ జనరేటర్లను, సినిమా షూటింగ్‌ల కోసం వాడే మొబైల్ డీజిల్ జనరేటర్లను తెప్పించారు. అత్యవసర పరిస్థితుల్లో పని చేయించేందుకు ఏర్పాటు చేసిన రెండు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి పనిచేయడం ఆలస్యం కావడమే ఇందుకు కారణమని ఓ అధికారి వివరించారు. -
కొడుకు కోసమే కక్షసాధింపు
ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్, అధికార శివసేన పార్టీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈసారి మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకును విమర్శించారు. మూవీ మాఫియా, సుశాంత్ రాజ్‌పుత్ హంతకులు, వారికి చెందిన డ్రగ్ రాకెట్ ముఠాల గుట్టును తాను బయటపెట్టడం మహారాష్ట్ర సీఎంకు సమస్యగా మారిందని, ఎందుకంటే ఈ మూడింటితో ఆయన కుమారుడు ఆదిత్య చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారని కంగన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలను బయటపెట్టడమే తాను చేసిన అతిపెద్దనేరమని, అందుకే తనపై కక్షగట్టినట్లు శివసేన ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ చేసిన ట్వీట్‌కు సంబంధించి వచ్చిన పత్రికా కథనంపై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేశారు. వీరి గుట్టు బయటపెట్టినందుకే తనపై కత్తికట్టారని చెబుతూ ‘‘చూద్దాం! ఎవరి ఆట ఎవరు కట్టిస్తారో?’’ అని ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు. ఒక మహిళను అవమానించి, భయపెట్టి వారి ఇమేజీని వారే పాడుచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జూన్‌లో నటుడు సుశాంత్ ఆత్మహత్య తర్వాత నుంచి ఆమె బాలీవుడ్‌ను తీవ్రంగా విమర్శిస్తూవస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, బయట నుంచి వచ్చిన వాళ్ల ఎదుగుదల చూసి ఓర్వలేని సినీ పరిశ్రమ చేసిన ప్రణాళికాయుత హత్యని ఆమె ఆరోపించారు. (చదవండి: కంగనపై శివసేన ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు!) ముంబై వీడిన క్వీన్ సోమవారం కంగన ముంబైని వీడి స్వరాష్ట్రం హిమాచల్‌కు చేరుకున్నారు.‘నిరంతర దాడులు, తన ఆఫీస్ కూల్చివేత, చుట్టూ బాడీగార్డుల రక్షణ పెట్టుకోవాల్సిరావడం చూస్తే నేను ముంబైని పీఓకేతో పోల్చడం కరెక్టేననిపిస్తోంది’ అని ట్వీట్ చేశారు. కుక్కతోక వంకర! ముంబైని పీఓకేతో తాను పోల్చడం కరెక్టేనంటూ కంగన చేసిన తాజా వ్యాఖ్యలపై శివసేన ఎంఎల్ఏ ప్రతాప్ సర్నాయక్ మండిపడ్డారు. ఎంత యత్నించినా కుక్కతోక వంకరేనన్న మాటలకర్ధం తెలిసిందని పరోక్షంగా కంగనపై విమర్శలు చేశారు. ముంబై మరీ అంత చెడ్డనగరమనిపిస్తే, పీఓకేలాగా కనిపిస్తే కంగన నగరం వదిలి తనకు సరైన చోటుకు పోవచ్చని శివసేన మంత్రి అనీల్ సూచించారు. ముంబై గురించి చెడుగా మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. -
మౌనంగా ఉంటున్నాం అనుకోకు: ఠాక్రే
సాక్షి, ముంబై : మహారాష్ట్ర సర్కార్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ మధ్య రాజుకున్న రాజకీయ వేడి తారస్థాయికి చేరింది. గత వారం రోజులుగా సాగుతున్న వీరిద్దరి మధ్య వివాదం తాజాగా రాష్ట్ర గవర్నర్ వద్దకు చేరనుంది. ఆదివారం సాయంత్రం కంగనా రనౌత్ గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌తో పాటు తమను విమర్శిస్తున్న రాజకీయ పార్టీలతోనూ పోరాటం చేస్తున్నామని అన్నారు. తాము మౌనంగా ఉన్నామంటే దానికి అర్థం తమకు ఏమీ చేతకావట్లేదని అర్థం కాదని కంగనాను పరోక్షంగా హెచ్చరించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిననాటి నుంచి ఎన్నో అవాంతరాలను, ఆటుపోట్లను ఎదుర్కొన్నా అని తాజా వివాదాల నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని ఠాక్రే స్పష్టం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. (త్వరలో ఫలితం చూస్తావు : శివసేనే హెచ్చరిక) అంతేకాకుండా మొదటితో పోలిస్తే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు పెరిగిందన్నారు. వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలను చేపడుతోందని వివిరించారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా డోర్‌టూడోర్ వైద్య సేవలను విస్తరిస్తామన్నారు. కాగా ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా తయారైందని మహారాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై కంగనా రనౌత్ ఘాటు విమర్శలు చేసిస విషయం తెలిసిందే. అనంతరం కొన్ని గంటల్లోనే ముంబైలోని కంగనా ఆఫీస్ ఆక్రమ కట్టడమంటూ బీఎంసీ అధికారులు దాన్ని కూల్చి వేసేందుకు సిద్ధమయ్యారు. అయినా కంగనా రనౌత్ ఏమాత్రం భయపడకుండా శివసేన ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ వైఖరిని ఎండగట్టారు. (సామాన్యులకు లేని భద్రత.. సెలబ్రిటీకి ఎందుకు) ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించిన ఆమె కార్యాలయం కూల్చడంపై హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీను ప్రత్యేకంగా కంగనా కలవనున్నారు. బాంద్రాలోని కంగనా ఆఫీసును బీఎంసీ అధికారులు కూలగొట్టడంపై గవర్నర్ అంసతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా మహారాష్ట్ర చీఫ్ సెక్రటరీని వివరణ కూడా అడిగారు. ఈ నేపథ్యంలో కంగనా గవర్నర్‌ను కలవనుండటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. -
శివసేన కార్యకర్తల తెగింపు..
-
రిటైర్డ్ ఉద్యోగిపై శివసేన కార్యకర్తల దాడి..
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ ఓ కార్టూన్ ఫార్వార్డ్ చేసినందుకు రిటైర్డ్ నావికాదళ అధికారిపై శివసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. వివరాలు.. మదన్ శర్మ అనే 65 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ముంబైలోని కండివలి ఈస్ట్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో తనకు వాట్సప్‌లో వచ్చిన ఠాక్రేకు సంబంధించిన ఓ కార్టూన్‌ను మదన్ తమ రెసిడెన్షియల్ సొసైటీ గ్రూప్‌లో పంపించాడు. ఆ తర్వాత అతనికి కమలేష్ కదమ్ అనే వ్యక్తి కాల్ చేసి తన పేరు, ఇంటి చిరునామా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం మదన్‌ను ఇంటి బయటకు పిలిచి కొందరు వ్యక్తుల బృందం ఆయనపై దాడి చేసింది. (కంగనా డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు) దాడి చేస్తున్న వీడియోలు సమీప సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో ఇంటి నుంచి బయటకు వస్తున్న మదన్ దాదాపు ఎనిమిది మందితో కూడిన శివసేన కార్యకర్తల బృందం వెంబడించింది. భయంతో లోపలికి పరుగెత్తుతున్న మదన్‌ను చొక్కా పట్టుకొని లాగి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మదన్ ముఖం మీద గాయాలవ్వగా, కన్ను రక్తంతో తడిసిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బీజేపీ వర్గాలు శివసేన ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసి రెచ్చిపోయిన శివసేన ఇప్పుడు రిటైర్డ్ అధికారిపై దాడికి తెగబడిందని బీజేపీ ఆరోపిస్తోంది. (ఠాక్రే-పవార్ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!) ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా పలువురు బీజేపీ నాయకులు గాయపడిన మదన్ శర్మ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘చాలా విచారకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన. రిటైర్డ్ నావీ ఆఫీసర్ కేవలం వాట్సప్ ఫార్వార్డ్ చేసిన కారణంగా గూండాల దాడిలో గాయపడ్డారు. దయచేసి ఇలాంటివి ఆపండి ఉద్దవ్ ఠాక్రే జీ. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు కమలేష్ కదమ్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. (సోనియా గాంధీని టార్గెట్ చేసిన కంగనా..) -
కంగనా డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు
ముంబై/న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కంగనా రనౌత్– మహారాష్ట్ర సర్కారు వివాదం ముదురుతోంది. ముంబై మరో పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)గా మారిందన్న కంగనా ఆరోపణలపై.. శివసేన సర్కారు కంగనా ఆఫీసులోని కొన్ని నిర్మాణాలు నిబంధనలకు విరుద్ధమంటూ కూలగొట్టిన విషయం తెలిసిందే. దీంతో, కంగనా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కంగనా డ్రగ్స్ వాడేవారన్న ఆరోపణలపై శుక్రవారం ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించింది. మీకేమీ బాధ అనిపించడం లేదా? సోనియాగాంధీకి కంగనా ప్రశ్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం ఠాక్రేను తీవ్రంగా విమర్శించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఈసారి తన గురిని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ వైపు తిప్పారు. మహారాష్ట్రలోని శివసేన–కాంగ్రెస్ ప్రభుత్వం తనను వేధిస్తుంటే సాటి మహిళగా బాధ అనిపించడం లేదా అని ఆమెను ప్రశ్నించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని సోనియాను కోరారు. కంగనకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావలె మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోరారు. ఉద్ధవ్ సర్కార్‌పై ఫడ్నవిస్ మండిపాటు కరోనాపై పోరు ముగిసి, కంగనాపై పోరు ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం అనుకుంటోందని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర సర్కారు యంత్రాంగం యావత్తూ కంగనాపైనే పోరాడుతోందన్నారు. ప్రభుత్వం తమకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు కానీ, కోవిడ్–19పై పోరాటంపై శ్రద్ధ చూపాలని సూచించారు. చదవండి: కంగనను నడిపిస్తున్నది ఎవరు? -
భగత్‌సింగ్‌ను తలపించావ్
ఇటీవలే కంగనా రనౌత్ ఆఫీస్‌ను ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీయంసీ) ధ్వంసం చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను చాలెంజ్ చేస్తూ ఓ వీడియో పోస్ట్ చేశారు కంగనా. మీ గర్వం కూడా మా ఆఫీస్ ధ్వంసం అయినట్లే అవుతుందన్నది ఆ వీడియో సారాంశం. ఈ నేపథ్యంలో కంగనా ధైర్యాన్ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశారు విశాల్. ‘‘కంగనా... నీ గట్స్‌కి నా హ్యాట్సాఫ్. ఏది తప్పు ఏది ఒప్పు అనే విషయాలను వ్యక్తపరచడానికి నువ్వెప్పుడూ వెనకాడలేదు. నీకు సంబంధించిన విషయాలు కాకపోయినా వాటి గురించి నువ్వు మాట్లాడి, ప్రభుత్వం నుంచి కొంచెం ఇబ్బంది ఎదుర్కొన్నావు. అయినా ధైర్యంగా నిలబడ్డావు. నీ వైఖరి 1920లో భగత్‌సింగ్‌ను తలపించింది. తప్పు ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎదురుగా ఎవరైనా మాట్లాడొచ్చు అని ఓ ఉదాహరణ చూపించావు’’ అన్నారు విశాల్. -
ఎన్ని నోళ్లు మూయించగలరు?
ముంబై: ముంబైలోని తన కార్యాలయం లోని కొంత భాగాన్ని మున్సిపల్ అధికారులు కూల్చివేసిన తరువాత మరోసారి గురువారం బాలీవుడ్ నటి కంగన రనౌత్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గొంతును ఎవరూ నొక్కలేరని తేల్చిచెప్పారు. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని గూండారాజ్యంతో పోల్చారు. ‘ఏ సిద్ధాంతాలతో బాలాసాహెబ్ ఠాక్రే స్థాపించారో, ఆ సిద్ధాంతాలను అధికారం కోసం అమ్మేసుకున్నారు. శివసేన నుంచి సోనియా సేనగా మారిపోయారు. నేను లేని సమయంలో బీఎంసీ గూండాలు నా ఇంటిని కూల్చేశారు’ అని ట్వీట్ చేశారు. బీఎంసీ అధికారులు బుధవారం కంగనా ఆఫీస్‌లో కొంత భాగాన్ని కూల్చివేసిన తరువాత, బొంబాయి హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. యజమాని లేని సమయంలో కూల్చివేతలు చేపట్టడంపై వివరణ ఇవ్వాలని బీఎంసీని హైకోర్టు ఆదేశించింది. కంగనపై ఫిర్యాదు నమోదు ఉద్ధవ్‌పై అనుచిత భాష ఉపయోగించినందుకు గానూ కంగనపై విఖ్రోలి పోలీస్ స్టేషన్లో బుధవారం నితిన్ మానె అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న అనంతరం, కోర్టుకు వెళ్లాల్సిందిగా ఫిర్యాదుదారుడికి సూచించామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని డీసీపీ ప్రశాంత్ కదమ్ తెలిపారు. అది అక్రమ నిర్మాణమే కంగన ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయాలనుకున్నది దురుద్దేశంతో కాదని బీఎంసీ బొంబాయి హైకోర్టుకు తెలిపింది. ఆ నిర్మాణంలోని కొన్ని భాగాలు అక్రమంగా నిర్మించినవేనని స్పష్టం చేసింది. గవర్నర్ అసంతృప్తి కంగన రనౌత్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదని మహారాష్ట్ర గవర్నర్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. హడావుడిగా కంగన కార్యాలయ భవనాన్ని కూల్చేయడాన్ని ఆయన తప్పుబట్టారని గవర్నర్ సన్నిహితులు తెలిపారు. కంగనతో కేంద్రమంత్రి అథావలె భేటీ కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథావలె గురువారం ముంబైలో కంగనతో సమావేశమయ్యారు. బీజేపీ మిత్రపక్షమైన అథావలె పార్టీ ఆర్పీఐ(ఏ) కంగనకు మద్దతుగా నిల్చిన విషయం తెలిసిందే. అయితే, ముంబైను పీఓకేతో పోలుస్తూ కంగన చేసిన వ్యాఖ్యలను తన పార్టీ ఖండిస్తుందని గతంలో అథావలె ప్రకటించారు. శివసేన వ్యవహరించిన తీరుపై మిత్రపక్షం ఎన్సీపీ అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. -
ఠాక్రే-పవార్ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!
సాక్షి, ముంబై : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్‌కు మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ఎపిసోడ్ ఓ యుద్ధాన్నే తలపిస్తోంది. ఓ వైపు దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్నా మరోవైపు సరిహద్దుల్లో చైనా దురాక్రమణకు పాల్పడుతున్నా వాటిపై లేని చర్చ కంగనా, శివసేన వ్యవహారంపై విపరీతంగా నడుస్తోంది. సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ప్రారంభమైన ఈ ప్రకంపనలు ఏకంగా కంగనా ముంబైలో నిర్మించుకున్న కార్యాలయాన్ని కూల్చేవరకు తీసుకెళ్లాయి. బాలీవుడ్లో నెపోటిజం మూలంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడాడంటూ తొలుత కామెంట్ చేసిన కంగనా.. ఆ తరువాత దేశ ఆర్థిక రాజధానిని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చుతూ వివాదంలోకి దిగారు. ఆమె వ్యాఖ్యలతో మొదలైన మాటల యుద్ధం ఇరువర్గాల (కంగనా-శివసేన) మధ్య తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే శివసేన నేతలు చేసిన వ్యాఖ్యలను సవాలుగా తీసుకున్న నటి.. ఏకంగా కేంద్ర ప్రభుత్వం చేత వై కేటగిరి సెక్యూరిటీని సైతం ఏర్పాటు చేసుకుని ముంబైలో అడుగుపెట్టింది. (కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) ఆ సమావేశంలో ఏం జరిగింది..? అయితే తమనే అవమానిస్తావా అంటూ కంగనాపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహా ప్రభుత్వం కంగనా ముంబైలో అడుగుపెట్టే సమయానికి ఊహించని షాకే ఇచ్చింది. ఆమె నిర్మించుకున్న కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతగా సిద్ధమైంది. అయితే కంగనా కార్యాలయం కూల్చివేతపై ప్రభుత్వంలో ముందే పెద్ద ఎత్తునే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. బుధవారం రోజున అక్రమ కట్టడాన్ని కూల్చివేయగా.. అంతకంటే ముందే అంటే మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రైత్ మధ్య కీలక సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. కంగనా నిర్మాణాన్ని తొలగించి వివాదాన్ని మరింత పెద్దదిగా చేయవద్దని శరద్ పవార్.. సీఎం ఠాక్రేతో వారించినట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంగనా వ్యవహారాన్ని వదిలేయాలని, చట్ట పరంగా ఏమైనా చర్యలు ఉంటే అది స్వతంత్ర హోదా కలిగిన బీఎంసీ అధికారులే చూసుకుంటారని చెప్పిన్నట్లు తెలిసింది. (శివసేన సర్కారు దూకుడు) ప్రభుత్వ తీరుపై పవార్ తీవ్ర అసంతృప్తి..! అయితే పవార్ వాదనతో ఏకీభవించని ఠాక్రే కంగనాను వదిలే ప్రసక్తే లేదని, అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలని తేల్చి చెప్పినట్లు ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దీనిలో ప్రభుత్వం తప్పిందం ఏదైనా ఉంటే ప్రతిపక్ష బీజేపీకి మరింత అవకాశం దొరుకుతుందనీ కూడా పవార్ చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే కంగనా-శివసేన ఎపిసోడ్లో ప్రభుత్వ తీరుపై పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెచ్చుకుంటోదని పలువరు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఓ నటికి వై కేటగిరి భద్రత కల్పించడంపై నెటిజన్లు అనేక రకాలుగా స్పందిస్తున్నారు. కంగనా తొలి నుంచీ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని, దానిని దృష్టిలో ఉంచుకునే ఆమెకు భద్రత కల్పించారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘఢీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే బీజేపీ కంగనాకు మద్దతుగా నిలుస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆగుతుందా.. ముదురుతుందా ఇదిలావుండగా కంగనా కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈనెల 22 వరకు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని బీఏంసీ అధికారులను ఆశ్రయించింది. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలోని సెక్షన్ 354 / ఎ కింద, బీఎంసీ సభ్యులు కంగనా కార్యాలయం కూల్చివేత పనులను షురూ చేశారు. కూల్చివేత పనులను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే ఇచ్చింది. అనంతరం గురువారం మధ్యాహ్నాం తన కార్యాలయన్ని కంగనా పరిశీలించారు. అయితే ఈ వివాదం ఇప్పటితో ఆగుతుందా లేక మరింత ముదురుతుందా అనేది వేచిచూడాలి. -
మహరాష్ట్ర సీఎం ఠాక్రేను హెచ్చరించిన కంగనా
-
నా ఇంటిని కూల్చారు.. రేపు మీ అహంకారం కూలుతుంది
ముంబై: బాంద్రాలో తన కార్యాలయం కూల్చివేతపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మహరాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేపై విరుచుకుపడ్డారు. ఠాక్రేపై నిప్పులు చెరుగుతూ హెచ్చరించిన వీడియో సందేశాన్ని తాజాగా ట్విటర్లో విడుదల చేశారు. ‘ఉద్ధవ్ ఠాక్రే మీరు ఏమనుకుంటున్నారు. మూవీ మాఫీయాతో చేతులు కలిపి నా భవనాన్ని కూల్చివేయడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నానని అనుకుంటున్నారా? ఈ రోజు నా ఇల్లు కూలిపోయింది.. రేపు మీ అహంకారం కూలిపోతుంది’’ అంటూ ఈ వీడియోలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబైలోని తన కార్యాలయాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ మహరాష్ట్ర ప్రభుత్వం కూల్చివేసిన తీరును కంగనా కశ్మీర్ పండితుల దుస్థితితో పోల్చారు. (చదవండి: కంగనా సోకిన శివసేనకు కూడా వ్యాక్సిన్ లేదు..) మనం కాలచక్రంలో ఉన్నామన్న విషయాన్ని ఠాక్రే గుర్తుంచుకోవాలని, అది ఎప్పటికి ఒకేచోట ఉండదని కంగనా హెచ్చరించారు. ‘‘ఒక విధంగా మీరు నాకు సహాయం చేశారు. కశ్మీరీ పండితులు ఎందుకు బాధలు పడుతున్నారో అర్థమైంది, ఈ రోజు అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. ఈ సందర్భంగా నేను ఓ ప్రతిజ్ఞ చేస్తున్నాను.. ఒక అయోధ్య మీదనే కాదు కశ్మీరీలపై కూడా సినిమా తీస్తాను’’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే గత కొద్ది రోజులుగా కంగనా మహరాష్ట ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. శివసేన, కంగనాలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్న తరుణంలో బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) ఇవాళ ఉదయం కంగనా కార్యాలయాన్ని కూల్చివేసింది. ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కట్టిన నిర్మాణంగా బీఎంసీ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: ఇది కంగనాకు అనవసర ప్రచారం: పవార్) -
సుశాంత్ మరణం పొలిటికల్ టర్న్ తీసుకుందా?
పాట్నా : ఈ ఏడాది చివర్లో బిహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్రం నుంచి ఆయనకు పలు సూచనలు అందినట్లు సమాచారం. బిహార్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఫడ్నవీస్ కీలకంగా వ్యవహరించనున్నారు. బిహార్‌లో నిన్న (గురువారం) జరిగిన ఓ ముఖ్యమైన పార్టీ సమావేశానికి సైతం ఆయన హాజరైనట్లు తెలుస్తోంది. ఇకపై ఎన్నికలకు సంబంధించి ఆయనే కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ నాయకులకు పలు సూచనలు అందాయి. (ఫడ్నవిస్‌పై శివసేన ప్రశంసలు) బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై మహారాష్ర్ట, బిహార్ ప్రభుత్వాల మధ్య రాజకీయ చిచ్చు రగులుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ సొంత రాష్ర్టమైన బిహార్ అతని మరణాన్ని సైతం రాజకీయాలకు వాడుకుంటోందని మహారాష్ర్ట ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ఇప్పటికే ఉద్దవ్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసు విచారణకు అడ్డం పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా మహారాష్ర్ట సర్కార్‌పై పలు వర్గాలనుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సుశాంత్ మరణంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ ఎన్నికల్లో ఫడ్నవిస్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక బిహార్ బీజేపీ కోర్ కమిటీలో ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ, రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్, కేంద్ర హోంమంత్రి నిత్యానంద్ రాయ్, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి భూపేంద్ర యాదవ్ ఉన్నారు. భూపేంద్ర యాదవ్ గత ఏడాది మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపికి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. బిహార్‌లో ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం నవంబర్ 29 తో ముగియడంతో అక్టోబర్-నవంబర్‌లో ఎన్నికలు జరగునున్నట్లు సమాచారం. అయితే కరోనా కారణంగా ఎన్నికల తేదీలపై ఇంకా తేదీ వివరాలు వెల్లడికాలేదు. (ప్రజలకు సుశాంత్ సోదరి విజ్ఞప్తి) -
అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం..
సాక్షి, ముంబై : దశాబ్దాల న్యాయ పోరాటం అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ముందడుగు పడింది. ఆగస్ట్ 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామాలయ నిర్మాణం కార్యక్రమం ప్రారంభంకాబోతుంది. ఈ నేపథ్యంలో అయోధ్య రాముడి గుడి శంకుస్థాపన కార్యక్రమం దేశ వ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. దీని కోసం అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాభవుతోంది. మరోవైపు కరోనా వ్యాప్తి దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిధులను ఆహ్వానించాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయితే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దశాబ్దాల పాటు నిర్విరామంగా పోరాటం కొనసాగించిన శివసేనను శంకుస్థాపన కార్యక్రమానికి దూరంగా పెట్టడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ నెల 5న జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకోనే కీలక ఘట్టానికి తమను ఆహ్వానించలేదని సేనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (మోదీ శపథం: 28 ఏళ్ల తరువాత తొలిసారి) బీజేపీ మూల సిద్ధాంతమైన హిందుత్వ ఎజెండాను భుజనాకెత్తుకున్న శివసేన మొదటి నుంచీ రామాలయ నిర్మాణం కోసం పాడుపడిందని, దేశంలోని హిందువుల ఆకాంక్షను నెరవేర్చడం కోసం అహర్నిశలు కృషి చేసిందని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల పాటు బాల్‌ఠాక్రే, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో రామాలయ నిర్మాణం కొరకు న్యాయపోరాటంతో పాటు రాజకీయ పోరాటం చేశామంటారు. హిందుత్వ ఎజెండానే ధ్వేయంగా పురుడుపోసుకున్న శివసేనకు తొలుత నాయకత్వం వహించిన బాల్‌ఠాక్రే కరుడుగట్టిన హిందుత్వవాదిగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తాజాగా అయోధ్యలో శంకుస్థాపన సందర్భంగా శివసేన సీనియర్ నేతలు, బాల్‌ఠాక్రే సహచరులు చంద్రకాంత్ ఖైరే, సూర్యకాంత్ మహడీక్, విశ్వనాథ్, విజయ్ దరువాలే వంటి నేతలు ఓ జాతీయ మీడియాతో ముచ్చటించారు. (అయోధ్య రామాలయ భూమిపూజపై భిన్న స్వరాలు) ‘మహారాష్ట్ర రాజకీయాలను కను సైగలతో శాసించిన బాలా సాహేబ్.. బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, అటల్ బిహరీ వాజ్‌పేయీలతో కలిసి మందిర నిర్మాణం కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించారు. 1993లో బాబ్రీ మసీదు కూల్చివేతలో కరసేవలతో పాటు, శివసేన కార్యకర్తలు, నేతల పాత్ర ఎంతో ఉంది. ఆ కేసు విచారణలో భాగంగా సీబీఐ మొదటిసారి నమోదు చేసిన చార్జ్‌షీట్‌లో 48 మంది పేర్లు ఉంటే వారిలో బాల్‌ఠాక్రేతో పాటు మరో పదిమంది కూడా ఉన్నారు. రామాలయ నిర్మాణం కొరకు ఠాక్రే తన చివరిశ్వాస వరకూ పోరాటం చేశారు. ఆయన మరణం అనంతరం బాల్ ఠాక్రే బాటలోనే ఉద్ధవ్ నడిచారు. బీజేపీతో రాజకీయ పరమైన దోస్తీ కొనసాగిస్తూనే.. అయోధ్య కోసం కొట్టాడారు. కోర్టుల్లో కేసుల విచారణ సాగుతున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రామాలయం నిర్మాణం చేపట్టాలని ఠాక్రే అనేకసార్లు డిమాండ్ చేశారు. (భారీగా ఆలయ నిర్మాణం) వేయిమంది సేన కార్యకర్తలతో ఉద్ధవ్ అయోధ్యలో సైతం పర్యటించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల అనంతరం మారిన రాజకీయ పరిణాల నేపథ్యంలో శివసేనపై బీజేపీ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. బీజేపీ తమను తక్కువ అంచనా వేయడం కారణంగానే సిద్ధాంత పరమైన విభేదాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్-ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. కానీ శివసేన హిందుత్వ ఎజెండా మాత్రం ఎప్పటికీ మారదు. రామాలయ నిర్మాణ శంకుస్థాపక కార్యక్రమానికి ఠాక్రేను ఆహ్వానించకపోవడం నిజంగానే అవమానం. తాను చేసిన కృషి ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసు. అయోధ్య పోరాట చరిత్రలో మమ్మల్ని ఎప్పటికీ తొలగించలేరు’ అని పేర్కొన్నారు. -
సుశాంత్ సూసైడ్: సీఎం వ్యాఖ్యలు కలకలం
పట్నా : బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సుశాంత్ ఆత్మహత్యపై ఇటు మహారాష్ట్రలోను, అటు బిహార్‌లోనూ కేసులు నమోదుకావడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం బిహార్ పోలీసులు ముంబైకి రావడం, అక్కడ ముంబై పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కిపంపించడం వివాదానికి దారితీసింది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించడంతో రాజ్‌పుత్ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో బిహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశిల్ మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. (సుశాంత్ సూసైడ్ మిస్టరీలో మనీలాండరింగ్ కేసు) సుశాంత్ ఆత్మహత్య కేసులో నిజాలు బయటపడకుండా బాలీవుడ్ మాఫీయా అడ్డుపడుతోందని, చిత్రపరిశ్రమలోని కొందరి ఒత్తడికి ఉద్ధవ్ ఠాక్రే తలొంచారని ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజా కేసును విచారించే శక్తీ, సామర్థ్యాలు బిహార్ పోలీసులకు ఉన్నాయని, వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని, కానీ ముంబై పోలీసుల నుంచి సరైన సహకారం లేదని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ మీడియాతో మాట్లాడిన సుశిల్ మోదీ.. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుశాంత్ కేసును సీబీఐకి చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్) ఇదిలావుండగా.. బిహార్, బీజేపీ నేతల తీరుపై సీఎం ఠాక్రే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ముంబై పోలీసుల విశ్వసనీయత దెబ్బతీస్తున్న బీజేపీ నేతల తీరు సరైనది కాదని మండిపడ్డారు. కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఠాక్రే స్పష్టం చేశారు. ఈ కేసును మహారాష్ట్ర వర్సెస్ బిహార్ సమస్యగా చూడద్దొని అన్నారు. జూన్ 14న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
‘స్వార్థపూరిత పార్టీతో ఎందుకు ప్రయత్నిస్తున్నారు’
పూణే: మహారాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలతో శివసేన వైదొలిగితే తిరిగి శివసేనతో పొత్తు కుదుర్చుకునేందుకు సిద్ధమని ఇటీవల రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. కాగా బీజేపీ వ్యాఖ్యలకు శివసేన అధికార పత్రిక సామ్మాలో శివసేన నాయకులు గట్టిగా కౌంటరిచ్చారు. ఇటీవల 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ నాయకులు శివసేనను స్వార్థ, మోసపూరిత పార్టీ అంటూ దూషించారని శివసేన నాయకులు గుర్తు చేస్తున్నారు. మీరు తీవ్రంగా దూషించిన శివసేన పార్టీతో పొత్తుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారంటూ శివసేన నాయకులు బీజేపీపై మండిపడుతున్నారు. గతంలో శివసేన, బీజేపీ పరస్పర సహకారంతో 2014అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్తంగా అధికారాన్ని చేపట్టారు. కానీ , 2019ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి పదవి విషయంలో ఇరు పార్టీలకు విబేధాలు వచ్చాయి. తమ ప్రభుత్వ సుస్థిరతపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే స్పందిస్తూ.. తమ ప్రభుత్వం పూర్తి పదవి కాలాన్ని పూర్తి చేసుకుంటుందని అన్నారు. ఆయన ఓ ఉదాహరణ ఇచ్చారు. తమ ప్రభుత్వం మూడు చక్రాల్లాంటిదని, పేద ప్రజలకు వాహనాం లాగా పనిచేస్తుందని అన్నారు. కాగా అద్భుతంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు ఎందుకంత కడుపుమంటని మండిపడ్డారు. -
రామాలయ పూజకు రాజకీయ రంగు
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల చిరకాల ఆకాంక్ష అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓవైపు చకచకా ఏర్పాట్లు జరుగుతుంటే మరోవైపు భూమి పూజపై రాజకీయ విమర్శలు వేడెక్కుతున్నాయి. ఆగస్ట్ 5 జరగబోయే రామాలయ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది బీజేపీ సీనియర్ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, పూర్వ సంఘ్ నేతలను సైతం కీలక ఘట్టానికి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో అయోధ్య రామాలయ ప్రారంభ కార్యక్రమంపై భిన్న స్వరాలతో పాటు రాజకీయ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లౌకిక రాజ్యమైన భారతదేశంలో ఓ వర్గానికి చెందిన దేవాలయ పూజా కార్యక్రమానికి ప్రధానమంత్రి ఎలా హాజరవుతారంటూ హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలతో రాజకీయ వేడిని లేపారు. (భూమి పూజకు 40 కిలోల వెండి ఇటుక) మరోవైపు ఆలయ శంకుస్థాపక కార్యక్రమ ఆహ్వానితుల జాబితాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కరుడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడ్డ ఉద్ధవ్ ఠాక్రే పేరు లేదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశంలో కరోనా ఉధృతి దృష్ట్యా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఆల్‌లైన్ వేదికగా జరపాలన్న ఠాక్రే వ్యాఖ్యలపై మోహన్ భగవత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఈ నేపథ్యంలో ఠాక్రేకు ఆహ్వానం అందకపోవడం పట్ల శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ముంబై వర్గాల సమాచారం. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం శివసేన ఎంతో పాటుపడిందని, ఎన్నో కార్యక్రమాలకు ఠాక్రే పిలుపునిచ్చారని గుర్తుచేస్తున్నారు. ఇదిలావుండగా.. ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆలయ నిర్మాణం చేపట్టడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం పలు వ్యాఖ్యలు చేశారు. (ప్రధాని మోదీపై ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు) రామాలయ నిర్మాణంతో కరోనా అంతమయిపోతుందన్న భ్రమను కొంతమంది నేతలు కల్పిస్తున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. అంతేకాకుండా దేశంలో ప్రస్తుతం నెలకొన్న కరోనా సంక్షోభంలో లేనిపోని హడావిడిని ప్రదర్మిస్తున్నారని బీజేపీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాగా ఆగస్ట్ 5 జరగబోయే భూమిపూజ కార్యక్రమానికి రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇప్పటినే ఆహ్వానాలను పంపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతీ, కళ్యాస్ సింగ్, యోగి ఆదిత్యానాథ్, మోహన్ భగవత్‌లకు ఆహ్వానం పంపింది. అలాగే ప్రముఖ పారిశ్రామిక వేత్తలు ముకేష్ అంబానీ, గౌతమ్ అదానీలు సైతం హాజరవుతారని సమాచారం. -
టార్గెట్ మహారాష్ట్ర : ప్లాన్ అమలు చేయండి
సాక్షి, మహారాష్ట్ర : అధికారం కోల్పోయిన రాష్ట్రాల్లో తిరిగి కాషాయ జెండా ఎగరేసేందుకు బీజేపీ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. సీట్ల పంపకాల్లో విభేదాల కారణంగా ఎన్డీయే కూటమి నుంచి విడిపోయిన పార్టీలను తిరిగి వెనక్కి రప్పించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిలో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో కీలక ఆదేశాలు జారీచేశారు. గత ఏడాది అధికారం నుంచి దూరమైన మహారాష్ట్రలో తిరిగి అధికారంలోకి రావాలని, దీని కోసం పటిష్టమైన వ్యూహాలను సిద్ధం చేయాలని ఆ రాష్ట్ర బీజేపీ శాఖకు నడ్డా సూచనలు చేశారు. అంతేకాకుండా పూర్వ స్నేహితుడు శివసేనను సైతం ఎన్డీయేలోకి వచ్చే విధంగా మంతనాలు చేయాలని సలహాలు ఇచ్చారు. (నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శరద్ పవార్) ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ చంద్రకాంత్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. శివసేనకు ఒప్పుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.అంతేకాకుండా ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనను తిరిగి ఎన్డీయేలో చేర్చుకునేందుకు తామకు ఏమాత్రం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కాగా మహారాష్ట్రలో పాగా వేసేందుకు గతంలోనూ బీజేపీ ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఎన్డీయేలో ఆహ్వానిస్తూ కేంద్రమంత్రి రాంవిలాస్ పాశ్వాన్ బహిరంగ ప్రకటన చేశారు. మరోవైపు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం బలంగా ఉందని ఆయా పార్టీల నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
‘ప్రజలు మృతి చెందితే బాధ్యత వహిస్తారా’
ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో లాక్డౌన్ ఎత్తివేయటం, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు తెరవటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. శివసేన పత్రిక సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ఆంక్షలను ఎత్తివేయటంలో తొందర పడకూడదని తెలిపారు. నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఇటీవల వ్యాపార సంస్థలు, పరిశ్రమలను తెరవడానికి అనుమతించాలని కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుత సమయంలో కరోనా వైరస్‌ను అరికడుతు ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యాన్ని సమతుల్యం చెయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్డౌన్ గురించి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. (సీఎం శివరాజ్‌సింగ్‌కు కరోనా పాజిటివ్) వారు కోరినట్టు అన్నింటిని తెరుస్తామని కానీ, దురదృష్టవశాత్తు లాక్డౌన్ ఎత్తివేయటంతో ప్రజలు మరణిస్తే దానికి వారు బాధ్యత వహిస్తారా అని ఉద్ధవ్ ప్రశ్నించారు. లాక్డౌన్ ఒకేసారి ఎత్తివేయటం వీలుకాదన్నారు. కానీ, క్రమక్రమంగా దానికి సంబంధించిన ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు. అన్ని ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మళ్లీ విధించే పరిస్థితులు ఎదురు కావద్దన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే ఆలోచించటం సరికాదు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 3,57,117 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, 1,99,967 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,44,018 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక వైరస్ కారణంగా 13,132 మంది మృతి చెందారు. -
నేనేమీ రిమోట్ కంట్రోల్‌ని కాదు: శరద్ పవార్
ముంబై : మహారాష్ర్టలో లాక్డౌన్ సడలింపు అంశంపై ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, తనకు మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు తలెత్తలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. శివసేన మానస పుత్రిక సామ్నాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ర్టలో జూలై 31 వరకు విధిందిన లాక్డౌన్ నిబంధనల్ని సడలిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో శరద్ పవార్ కీలకంగా వ్యవహరించారని, అసలు లాక్డౌన్ నిబంధనల్ని సడలించడం సీఎం ఉద్దవ్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని పలు ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరికి అభిప్రాయ బేధాలు తలెత్తాయన్న వార్తల్ని పవార్ ఖండించారు. 'ముఖ్యమంత్రితో సన్నిహితంగానే ఉన్నాను. కార్మిక సంఘాలు, వివిధ వ్యాపార యజమానులతో చర్చలు జరిపి దాని ఆధారంగానే ఓ అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాను. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు.' దీన్ని అభిప్రాయ భేదం అని ఎలా అంటారని పవార్ ప్రశ్నించారు. (కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు) కరోనా అత్యధికంగా ప్రభావితం అయిన ఢిల్లీ, కర్ణాటక రాష్ర్టాల్లో సైతం ఆంక్షలను ఎత్తివేశారని గుర్తుచేసిన పవార్..తిరిగి ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించకపోతే దేశానికే నష్టం వాటిల్లుతుందని తెలిపారు. దీని ద్వారా కరోనా కంటే ఎక్కువ నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర వికాస్ అగాడి ప్రభుత్వానికి శరద్ పవార్ రిమోట్ కంట్రలోలా పనిచేస్తున్నారని, ముఖ్యమంత్రిగా ఉద్దవ్ బాధ్యతలు చేపట్టినా తెరవెనుక మాత్రం ప్రభుత్వాన్ని పవారే నడిపిస్తున్నారన్న ఆరోఫణల్ని పవార్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు రిమోట్ కంట్రోల్‌తో పనిచేయవంటూ వ్యాఖ్యానించారు. శివసేన మానసపుత్రిక సామ్నా వేరే పార్టీ నాయకుడిని ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా కరోనా వైరస్ నియంత్రణపై తీసుకుంటున్న చర్యలు, తదనంతరం రాజకీయ పరిణామాలు, భారతీయ జనతా పార్టీ, ఉద్దవ్ ఠాక్రేతో తనకున్న సత్సంబంధాలపై ఇంటర్వ్యూలో పవార్ స్పష్టతనిచ్చారు. (మహారాష్ట్ర వైఖరిని తప్పుబట్టిన సుప్రీంకోర్టు) -
కరోనా: మహారాష్ట్ర కీలక నిర్ణయం
ముంబై : కరోనా కారణంగా గత మూడు నెలల నుంచి మూసి ఉన్న సెలూన్లలకు అనుమతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా క్షౌరశాలలు తెరిచేందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురువారం జరిగిన సమీక్షలో కేబినెట్ దీనికి ఆమోదముద్ర వేసిందని మంత్రి విజయ్ తివార్ తెలిపారు. లాక్డౌన్ కారణంగా సెలూన్ ఆపరేటర్లు ఆర్థికంగా చితికిపోయారని, ఇప్పటికే 12 మంది బార్బర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇంకా దిగజారకముందే వాళ్లకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తాజా చర్యలు చేపట్టిందని విజయ్ పేర్కొన్నారు. (రెండు వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్) గత వారం రోజుల నుంచి దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే జిమ్ సెంటర్లకు కూడా అనుమతిస్తామని దీనికి సంబంధించి మార్గదర్శకాలను రూపొందిస్తామని తెలిపారు. అయితే తమ వ్యాపారాలను పునరుద్దరించడానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నభీక్ మహామండల్, రాష్ట్రస్థాయి బార్బర్ సంఘాలు గత కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. లాక్డౌన్ కారణంగా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వెంటనే దుకాణాలు తెరిచేందుకు అనుమతించాలని, లేని పక్షంలో ఆర్థిక ప్యాకేజీ అయినా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సెలూనల్లోమాస్క్, శానిటైజర్ల వాడకం లాంటి వ్యక్తిగత శుభ్రతా ప్రమాణాలు పాటించాలని మంత్రి విజయ్ ఆదేశించారు. ఒక కస్టమర్ కోసం ఉపయోగించిన తువాలు లేదా వస్త్రాన్ని ఇతరులకు ఉపయోగించరాదన్నారు. భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 142,900కి చేరగా 6,739 మంది కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. (భూటాన్-అస్సాం నీటి వివాదం అవాస్తం: భారత్) -
విమర్శలకు చెక్: సీఎంతో భేటీ
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు సోనూసుద్‌పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలోనే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ అండదండలతోనే సోనూసుద్ వలస కార్మికులకు సహాయం చేస్తున్నాడంటూ సామ్నా ఎడిటోయల్ వేదికగా రౌత్ ఆరోపించిన విషయం తెలిసిందే. కరోనా కాలంలో కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చాడని, త్వరలోనే ప్రధాని మోదీతో భేటీ సైతం అవుతారని విమర్శలు ఎక్కుపెట్టారు. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే సోనూసుద్‌పై ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. (సోనూకు రాజకీయ రంగు: మోదీతో భేటీ!) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, మంత్రి ఆదిత్యా ఠాక్రేతో ఆదివారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లాక్‌డౌక్ కారణంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను ఆదుకుంటున్నందుకు సీఎం ఠాక్రే అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం నివాసంలో వీరితో సమావేశం జరిగినట్లు ట్విటర్ వేదికగా సోసూసుద్ వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి ఠాక్రే, ఆదిత్యాతో సమావేశమైనందుకు సంతోషంగా ఉంది. వలస కార్మికులకు ఎప్పటికీ అండగా ఉంటాను. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఎవరికి ఆపద వచ్చినా ఆదుకుంటాను. భవిష్యత్‌లో కూడా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాను’ అని తెలిపాడు. తనపై వస్తున్న రాజకీయ విమర్శలకు చెక్ పెట్టేందుకే ఠాక్రేతో భేటీ అయినట్లు తెలుస్తోంది. కాగా ఆదివారం సామ్నాలో ప్రచురితమైన ఎడిటోరియల్‌పై సీఎంతో భేటీ సందర్భంగా సోనూసుద్ చర్చకు తీసుకొచ్చినట్లు సమాచారం. వలస కార్మికులకు అండగా నిలుస్తున్న తనకు రాజకీయ రంగు పులమడం సరైనది కాదని వారించినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి సహాయ, సహకారులు ఉంటే భవిష్యత్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తానని సీఎంతో చెప్పినట్లు సమాచారం అందింది. -
మూవీ షూటింగ్స్‌కు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, ముంబై : లాక్డౌన్ కారణంగా రెండు నెలల పాటు మూతపడ్డ సినిమా కెమెరాలు క్లిక్ మనిపించేందుకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్ సినిమాల చిత్రీకరణకు అనుమతినిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినీ ప్రముఖుల విజ్ఞప్తి మేరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సినిమాలు, సీరియల్స్, యాడ్ షూటింగ్స్‌కు అనుమతినిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చని తెలిపింది. ముద్దు సీన్లు, హగ్ సీన్లు వంటివి లేకుండా చిత్రీకరణ జరపుకోవాలని సూచించింది. అలాగే షూటింగ్స్ జరుపుకోవాలంటే ఆయా జిల్లాకు చెందిన కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని.. సినిమా సెట్స్, ఎడిటింగ్ స్టూడియోల్లో ఎక్కువ మంది ఉండకుండా భౌతిక దూరం పాటించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనేదానిపై తేదీని ప్రకటించాల్సి ఉంది. (నమస్తే ట్రంప్‌తోనే వైరస్ వ్యాప్తి..!) కాగా టాలీవుడ్లో సినిమా షూటింగ్స్‌కు అనుమతి కల్పించాలంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దలు ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. దానికి ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. దశలవారీగా షూటింగ్స్‌కు అనుమతినిస్తామని తెలిపింది. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కూడా సినిమా షూటింగ్స్‌కు అనుమతులు కోరుతూ చిత్ర పరిశ్రమ పెద్దలు ప్రభుత్వాలను కోరిన విషయం తెలిసిందే. (చిరు నివాసంలో సినీ పెద్దల సమావేశం) -
ముంబైకి తీవ్ర తుపాన్ ప్రభావం
సాక్షి, ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైపై అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడుతూ తుపాన్‌గా మారనుంది తెలిపింది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ మీదుగా అల్పపీడనం జూన్ 3న తీరం తాటుతుందని పేర్కొంది. కాగా, తుపాన్ మహారాష్ట్రను దాటే క్రమంలో ముంబై నగరంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్రా పేర్కొన్నారు. సోమవారం ఉదయం అల్పపీడనం ఉధృతంగా మారినట్లు తెలిపారు. (నీతి ఆయోగ్‌లో కోవిడ్-19 కలకలం) ఇక ముంబైకి 700 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన ఈ తుపాన్ గంటకు 105 నుంచి 110 కిలో మీటర్ల వేగంగా కదులుతోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్రలోని థానే, పాల్ఘర్ ప్రాంతాల్లో ఓ మోస్తర్ వర్షం కురిసింది. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. సముద్రంలోకి వెళ్లే మత్సకారులను మూడు, నాలుగు రోజులు వెళ్లవద్దని కోరారు. రానున్న రెండు రోజుల్లో త్రీవ తుపాన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
కరోనా: అత్యధికంగా అక్కడే..
ముంబై : భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. ఇప్పటివరకు భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 1,45,380కి పెరగగా, ఒక్క మంగళవారం రోజే 6,535 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 4,167 ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, గుజరాత్, ఢిల్లీలలో కేసుల పెరుగుదల అంతకంతకూ పెరుగుతుంది. (లాక్డౌన్ విఫలం: ప్లాన్ బి ఏంటి..! ) మహారాష్ట్రలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటివరకు ఆ రాష్ట్రలో 52,667 కేసులు కేసులు నమోదుకాగా ఒక్క ముంబైలోనే 31,972 కేసులు వెలుగుచూశాయి. అత్యధిక కేసులు రికార్డ్ అవుతుండటంతో బెడ్ల కొరత కూడా ఏర్పడినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికుల నుంచి కూడా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. (కరోనా : రాజకీయ సంక్షోభం తప్పదా..! ) -
కరోనా: రాజకీయ సంక్షోభం తప్పదా..!
సాక్షి, మహారాష్ట్ర : దేశ వ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ప్రజలు కరోనాతో అల్లాడుతున్నా ఇవేవీ పట్టని నేతలు రాజకీయ విమర్శలకు దిగుతూ అధికార పీఠం కోసం పావులు కదుపుతున్నారు. కరోనా వైరస్‌కు ప్రపంచంలోనే అతిపెద్ద హాట్‌స్పాట్ కేంద్రంగా మారుతున్న ముంబై మహానగరం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎసరుపెట్టేలా ఉంది. సిద్ధాంత వైరుధ్యం గల శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలు జట్టుకట్టడం ఏమాత్రం జీర్ణించుకులేకపోతున్న ప్రతిపక్ష బీజేపీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. (మహారాష్ట్రలో అనూహ్యం) రాష్ట్రపతి పాలనకు డిమాండ్.. మహారాష్ట్రలో మొత్తం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే 50వేలు దాటగా.. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోనే సగానికి పైగా కేసులు నమోదు కావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. వైరస్ కట్టడికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఎన్ని చర్యలు చేపట్టినా.. పాజిటివ్ కేసులు ఏమాత్రం అదుపులోకి రావడంలేదు. మరోవైపు పౌరులు ప్రాణాలు కోల్పోవడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ విమర్శలకు మరింత పదునుపెట్టింది. వైరస్ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా విఫలమయ్యారని విమర్శిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీతో భేటీ కావడం, రాష్ట్రంలో పరిస్థితి అదుపులోదని రాష్ట్రపతి పాలన విధించాలని కోరడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. బీజేపీ ఉద్ధేశ పూర్వకంగానే గవర్నర్‌తో మంతనాలు చేస్తోందని తెలుస్తోంది. (మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్) ఇక ఉద్ధవ్ నేతృత్వంలోని సంకీర్ణ సర్కార్‌లో మంత్రులు, నేతల మధ్య విభేదాలు ఉన్నాయని ప్రతిపక్షం ప్రచారం చేస్తోంది. వైరస్ వ్యాప్తి ఒకవైపు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరోవైపు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. లాక్డౌన్ ఎత్తివేతపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే భినాభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే లాక్‌డౌన్‌ను ఎత్తివేయక తప్పదని పవార్ సూచించగా.. వైరస్‌ను కట్టడి చేయాలంటే లాక్‌డౌన్‌ఒక్కటే మార్గమని ఠాక్రే స్పష్టం చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకే ఆంక్షల్లో సడలింపు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర.. మరోవైపు ప్రభుత్వంలో అసంతృప్తిని పసిగట్టిన బీజేపీ నేతలు సర్కార్‌కు పడేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో శరద్ పవార్ మంగళవారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైరస్ కట్టడి ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. భేటీ అనంతరం పవర్ మీడియా మాట్లాడుతూ.. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. అయినప్పటికీ తమ ప్రభుత్వం స్థిరంగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై కేంద్ర హోమంత్రి అమిత్ షా కూడా ఆరా తీసినట్లు సమాచారం. మొత్తానికి కరోనా కష్ట కాలంలోనూ మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. -
లాక్డౌన్ ఒకేసారి ఎత్తేయడం సరికాదు: ఉద్ధవ్
ముంబై: లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తేయడం సరి కాదనీ, దీని వల్ల రెండింతల నష్టం సంభవించవచ్చని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెప్పారు. రానున్న వర్షాకాలంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పెండింగ్ లోఉన్న జీఎస్టీ సొమ్ము రాష్ట్రప్రభుత్వానికి ఇంకా రాలేదని అన్నారు. వలస కార్మికుల తరలింపు కోసం పెట్టిన టికెట్ల ఖర్చులో కేంద్రం నుంచి రావాల్సిన వాటా కూడా రాలేదన్నారు. మందుల కొరత కూడా ఉందన్నారు. -
కరోనా విజృంభిస్తున్నా.. సడలింపులు
సాక్షి, ముంబై : మహారాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ఆ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లాక్డౌన్ 4:0 నిబంధనలకు అనుగుణంగా పలు రంగాల్లో సడలింపు ఇస్తూనే కంటైన్మెంట్ జోన్లలో కఠిన ఆంక్షలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్ణయించారు. మరోవైపు రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, మెట్రో సేవలను ఆంక్షలు కొనసాగుతాయని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించింది. రాష్ట్రంలో వైరస్ విజృంభిస్తున్నా ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు సడలింపులు తప్పవని భావించిన ప్రభుత్వం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టుకూ అనుమతినిచ్చింది. ఈ మేరకు నూతన మార్గదర్శకాలతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. (మహా నగరాలే కరోనా కేంద్రాలు) రాష్ట్ర వ్యాప్తంగా వీటిపై నిషేధం.. దేశీయ విమాన సర్వీసులు మెట్రో సేవలు పాఠశాలలు, కాలేజీలతో పాటు అన్ని విద్యాసంస్థలు హొటల్స్, రెస్టారెంట్స్, క్రీడా ప్రాంగణాలు సినిమా, మాల్స్, జిమ్ సెంటర్స్, ఆడిటోరియమ్స్, స్విమ్మింగ్ ఫూల్స్ అన్ని రకాల ర్యాలీలు, మత పరమైన సమావేశాలు, ప్రార్థనా మందిరాలు రెడ్‌జోన్‌లో మినహాయింపులు లిక్కర్ షాపులు (పరిమితులకు లోబడి) నిర్మాణ రంగ పనులు ప్రభుత్వ కార్యాలయాలు ఈ- కామర్స్ కార్యకలాపాలు టాక్సీలు, రిక్షాలుకు అనుమతి లేదు ఆరెంజ్, గ్రీన్ జోన్లో మినహాయింపులు పబ్లిక్, ప్రైవేటు ట్రాన్స్‌పోర్టుకు అనుమతి 50శాతం ప్రయాణికులతో బస్సులు అన్ని రకాల మార్కెట్లు, షాపులు కూడా తెరుచుకోబడతాయి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు ఓపెన్ కాగా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 35 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. -
ఎమ్మెల్సీగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం
ముంబై : మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సహా శాసనమండలికి ఎన్నికైన 8 మంది సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్ రామ్‌రాజే నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి వెంట ఆయన సతీమణి, కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా ఉన్నారు. మండలిలో ఖాళీగా ఉన్న 9 స్థానాలకు తొమ్మిది మంది సభ్యులే నామినేషన్ దాఖలు చేయడంతో వీరంతా మే 14న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉద్దవ్ ఠాక్రేతో పాటు శివసేన నుంచి నీలం గోర్హే, బీజేపీ నుంచి గోపీచంద్ పడల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజీత్‌సింహ్ మోహితే పాటిల్, రమేష్ కరాద్, కాంగ్రెస్‌కు చెందిన రాజేష్ రాథోడ్, ఎన్సీపీకి చెందిన శశికాంత్ షిండే, అమోల్ మిట్కారి ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. (లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం ) మహారాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే 2019 నవంబర్ 28న ప్రమణ స్వీకారం చేశారు. అయితే అప్పటికీ ఆయన ఏ చట్టసభల్లోనూ ( అసెంబ్లీ, మండలి ) సభ్యుడు కాదు. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం సీఎంగా భాద్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు ఏదేని ఉభయ సభకు ఎన్నిక కావాల్సి ఉండగా, కరోనా కారణంగా ఎన్నికలు రద్దయ్యాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం జోక్యంతో ఎన్నికల నిర్వహణకు గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్దవ్‌కు పదవీ గండం తప్పినట్లయ్యింది. ( సీఎం పదవి ఊడకుండా కాపాడండి: ఠాక్రే ) ఒకవేళ ఎమ్మెల్సీగా నామినేట్ కాకపోయి ఉంటే మే 28 లోపు స్వయంగా ఆయనే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చేది. ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఉద్దవ్ సీఎంగా కొనసాగనున్నారు. కాగా మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన..బీజేపీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత జరిగిన పరిణామాల నేపధ్యంలో బీజేపీతో ఎన్నో ఏళ్ల మైత్రి బంధానికి శివసేన దూరమైంది. కూటమి తరపున నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్దవ్ ఠాక్రే బాధ్యతలు చేపట్టారు. (ఎమ్మెల్సీగా ‘మహా’ సీఎం ఏకగ్రీవం.. ) -
లాక్డౌన్ : మహారాష్ట్ర కీలక నిర్ణయం
సాక్షి, ముంబై: ప్రాణాంతక కరోనా వైరస్‌కు అడ్డుకట్టపడకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఈ నెల (మే 31 ) చివరి వరకు లాక్డౌన్ పొడగిస్తున్నట్టు ప్రకటించింది. ముంబై, పూణే, మాలెగావ్, ఔరంగాబాద్, సోలాపూర్ వంటి హాట్‌స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశంపై చర్చించామని రాష్ట్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. రాష్ట్రంలోని మిగతా ప్రదేశాల్లో లాకడౌన్ 3.0 ముగిసేలోపు కేంద్రం ప్రకటించే మార్గదర్శకాలకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. (లాక్డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం ) కాగా బుధవారం రాత్రికి మహారాష్ట్రలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 25922 కు చేరగా, 975 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వైరస్ కారణంగా 596 మంది మరణించారు. మరోవైపు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం దేశంలో కరోనా వైరస కేసుల సంఖ్య 81970 కు చేరగా, మరణాల సంఖ్య 2649 చేరింది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న మూడవ దశ లాక్డౌన్ మే17వతేదీతో ముగియనుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో లాక్డౌన్ కొనసాగనుందని సూచించిన సంగతి తెలిసిందే. చదవండి : మూడ్ లేదు.. ఇక తెగతెంపులే వలస వెతలు: కంటతడి పెట్టించే వీడియోలు