ముంబై:లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ శివసేన (యూబీటీ) తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే.. 17 మంది అభ్యర్థులను శివసేన(యూబీటీ) బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు ఆ పార్టీనేత సంజయ్ రౌత్ జాబితాను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కీలకమైన ముంబై సౌత్ సెంట్రల్ పార్లమెంట్ స్థానాన్ని శివసేన (యూబీటీ) అనిల్ దేశాయ్‌కి కేటాయించింది.
ఐదు సిట్టింగ్ అభ్యర్థులకు శివసేన(యూబీటీ) మళ్లీ అవకాశం కల్పించింది. ముంబై సౌత్- అరవింద్ సావంత్, ముంబై నార్తీస్ట్- సంజయ్ పాటిల్, ముంబై నార్ట్ వెస్- అమోల్ కిర్తికార్, థానే- రాజన్ విచారే, వినాయక్ రౌత్- రత్నగిరి సింధ్‌దుర్గ్, పర్బానీ-సంజయ్ జాదవ్, ఉస్మానాబాద్- ఓంరాజే నింబాల్కర్ పోటీలో ఉన్నారు.
అదేవిధంగా శివసేన (యూబీటీ) ఔరంగాబాద్‌లో మాజీ ఎంపీ చంద్రకాంత్ ఖైరేను బరిలోకి దింపుతోంది. మాజీ కేంద్ర మంత్రులు అనంత్ గీతే( రాయ్‌గఢ్), అరవింద్ సావంత్(దక్షిణ ముంబై) నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు.మహావికాస్ ఆఘాడీ భాగస్వామి కాంగ్రెస్ పట్టుబట్టిన సాంగ్లీ స్థానం నుంచి ఇటీవల పార్టీలో చేరిన రెజ్లర్ చంద్రహర్ పాటిల్‌ను పోటీకి దింపింది శివసేన(యూబీటీ). ముత్తం 48 లోక్ సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమై.. ఐదు విడతల్లో పోలింగ్ జరగనుంది.
हिंदूहृदयसम्राट शिवसेनाप्रमुख बाळासाहेब ठाकरे यांच्या आशीर्वादाने आणि शिवसेना पक्ष प्रमुख श्री.उद्धवजी ठाकरे यांच्या आदेशाने शिवसेनेच्या 17 लोकसभा उमेदवारांची यादी जाहीर करण्यास येत आहे..
— Sanjay Raut (@rautsanjay61) March 27, 2024
*मुंबई दक्षिण मध्य:श्री अनिल देसाई यांच्या उमेदवारीची घोषणा करण्यात येत आहे.
इतर 16 उमेदवार… pic.twitter.com/nPg2RHimSF
Comments
Please login to add a commentAdd a comment